బ్రహ్మాండ మహా పురాణము
57 - వరుణుఁడు భార్గవుని దర్శించుట
జైమినిరువాచ :-
తతః శుషుసుమిత్రాద్యాః మునయః శంసితవ్రతాః ।
యయుర్దదృక్షవో రామం మహేంద్రమచలం ప్రతి ॥
అతీత్య సుబహూన్ దేశాన్ వనాని సరితస్తథా ।
ఆసేదురచలశ్రేష్ఠం క్రమేణ మునిపుంగవాః ॥
తమారుహ్య శనైస్తస్య ఖ్యాతమాశ్రమమండలమ్ ।
ప్రశాంతక్రూరసత్వాధ్యం శుభం మధ్యే తపోవనమ్ ॥
సర్వర్తుఫలపుష్పాధ్యతరుఖండమనోహరమ్ ।
స్నిగ్రచ్ఛాయమనౌపమ్యం స్వామోదిసుఖమారుతమ్ ॥
తం తదాశ్రమమాసాద్య బ్రహ్మహోషేణ నాదితమ్ ।
వివితుర్ఘృష్టమనసో యథావృద్ధపురస్పరమ్ ॥
బ్రహ్మాసనే సుఖాసీనం మృదుకృష్ణాజినోత్తరే ।
శిషైః పరివృతం శాంతం దదృశుస్తే తపోధనాః ॥
కాలాగ్నిమివ లోకాంగ్రీన్ ధగ్ధ్వ పూర్వం నిజేచ్ఛయా ।
తద్దోషశాంత్యై తపసి ప్రవృత్తమివ దేహినమ్ ॥
తే సమేత్య భృగు శ్రేష్ఠం వినయాచారశాలినః ।
వవందిరే మహామౌనం భక్తిప్రణత కంథరాః ॥
తతస్తానాగతాన్ దృష్ట్వా మునీన్ భృగుకులోద్వహః ।
అరపాద్యాదిభిః సమ్యక్పూజయామాస సాదరమ్ ॥
తానాసీనాన్ కృతాతిథ్యానషీన్ దేశాంతరాగతాన్ ।
ఉవాచ భృగుశార్దూలః స్మితపూర్వమిదం వచః ॥
స్వాగతం వో మహాభాగా యూయం సర్వే సమాగతాః ।
కరణీయం కిమస్మాభిర్వదధ్వమవిచారితమ్ ॥
తతస్తే మునయో రామం ప్రణమ్యేదమథాబ్రువన్ ।
అవేహ్యస్మాన్ మునిశ్రేష్ఠ గోకర్ణనిలయాన్ మునీన్ ॥
జైమిని ఇట్లనెను :
అంత, ప్రశంసార్హమయిన ప్రతులు శుష్కుడు సుమిత్రుఁడు మొదలయిన మహర్షులు, భార్గవరాముని దర్శింపగోరి మహేంద్రాచలమున కరిగిరి, బహుదేశములను, వనములను, నదులను దాటి ఆ మునిపుంగవులు క్రమముగా ఆ పర్వత శ్రేష్ఠమును చేరుకొనిరి. మెల్లగా నా పర్వతము నధిరోహించిరి; అయ్యది ప్రశాంత స్వభావము నొందిన క్రూర మృగములతో కూడినది, శుంభకరమైనది, మధ్య తపోవనము కలది, సర్వ ఋతువుల యందు లభించు ఫల పుష్పములు ఎల్లప్పుడు లభించునట్టిదీ, తరు సమూహములచే మీక్కిలి మనోహరమయినది, చల్లని నీడలతో నొప్పినది, ఆనందమును గలిగించు సుఖకరమయిన వాయువులతో నొప్పినదియు ప్రఖ్యాతాశ్రమ మండలమయిన దానిని ఆ ఋషులు చేరిరి. అందు వేద ఘోష వినిపించు చుండెను. పెద్దలు మహరులు ముందు నడువగా, హృష్ట మనస్కులయిన ఆ తపోవనమును ప్రవేశించిరి. ప్రవేశించి, మెత్తదైన కృష్ణచర్మము పరచిన, బ్రహ్మాసనము నందు, శిష్యులచే పరివృతుడు శాంతుడు, తపోధనుఁడు నయిన వానీని తపోధనులు చూచిరి. అతఁడు పూర్వము కాలాగ్నివలె నిజేచ్చచే మూడు లోకములను దగులబెట్టిన పాపముయొక్క విమోచనము కొఱకు తపస్సాచరించుచున్న వానీవలె నుండెను. వారందరు వినయాచారశాలురు భక్తిచే భుజములువంచి వారు మహామౌనియై భృగుకులశ్రేష్ఠుఁడయిన రామునికి నమస్కరించిరి. అంత ఆగతులయిన వారిని భృగుకులోద్భవుఁడు. చూచెను. వారిని అర్ఘ్యపాద్యాదులచే సాదరముగా పూజించెను. కృతాతిథ్యులు, దేశాంతరము నుండి వచ్చినవారు, ఆసీనులయినవారు అయిన ఋషులను భృగుశార్దూలుఁడు, నవ్వు మొగముతో ఇట్లు పలికెను. “ఓ మహానుభావులారా ! మీరందరు దయచేసినారు. మీకెల్లరకు స్వాగతము. మేమేమి చేయవలయునో సంశయ రహితముగా వచింపుఁడు. అంత, ఆ మునులు రామునకు నమస్కరించి ఇట్లు పలికిరి. ఓమునిశ్రేష్టా ! మమ్ములనందరను గోకర్ణ వాసులమయిన ఋషులనుగా నెఱుంగుఁడు.
ఖనద్భిః సాగరైర్భూమీం కస్మింశ్చిత్కారణాంతరే ।
సతీర్థం తన్మహాక్షేత్రం పలితం సాగరాంభసి ॥
ఉత్సారితార్ణవజలం క్షేత్రం తత్సర్వపావనమ్ ।
ఉపలబ్ధమఖీప్పామో భవతస్తు న సంశయః ॥
విష్ణోరంశేన సంజాతో భవాన్ భృగుకుభే కిల ।
తస్మాత్కరుమశక్యం తే త్రైలోక్యేపి న కించన ॥
వాంఛితార్థప్రదో లోకే త్వమేవేశ్యనుశుశ్రుమ ।
వయం త్వామాగతాః సర్వే రామైతదభియాచితుమ్ ॥
సత్వమాత్మప్రభావేణ క్షేత్రప్రవరమద్య తత్ ।
దాతుమర్హసి విప్రేంద్ర సముత్పార్యార్థవోదకమ్ ॥
రామ ఉవాచ :-
ఏతత్సర్వమశేషేణ విదితం మే తపోధనాః ।
కరణీయం చ వః కృత్యం మయా నాత్ర విచారణా ॥
కింతు యుష్మదభిప్రేతం కర్మ లోకే సుదారుణమ్ ।
శస్త్రసంగ్రహణాచ్ఛక్యం మయాహి న తదన్యథా ॥
దత్తసర్వాభయోహం వై న్యస్తశస్తః శమాన్వితః ।
తపః సమాశ్రితశ్చర్తుం ప్రాగేవ పితృశాసనాత్ ॥
న జాతు శస్త్రగ్రహణం కరిష్యామీత్యహం పురా ।
ప్రతిశ్రుశ్య సతాం మధ్యే తపః కర్తుమిహానఘః ॥
శస్త్రగ్రహణసాధ్యత్వాద్యుషదీప్పితవస్తునః ।
కిం కర్తవ్యం మయాత్రేతి మమ డోలాయతే మనః ॥
శుష్క ఉవాచ :-
సతాం సరక్షణార్థాయ శస్త్రసంగ్రహణం తు యత్ ।
తన్న చ్యావతే సత్యాద్యథోక్తం బ్రహ్మణా పురా ॥
తస్మాదసుద్ధితార్థాయ భవతా గ్రాహ్యమాయుధమ్ ।
ధర్మఏవ మహాంస్తేన చరితస్తే భవిష్యతి ॥
ఏదియో యొక కారణమున భూమిని త్రవ్వు సాగరులచే ఆ తీర్థము తన్మహాక్షేత్రము సాగరజలములలో మునిగిపోయినది. సర్వపావనమయిన ఆ క్షేత్రమును మీ వలన తిరిగి అసంశయముగా పొందకోరుచున్నాము. మీరో భృగు కులమున ఈ భూతలమున విష్ణునంశమున జన్మించితిరి. అందుచే మీ కశక్యమైనది మూఁడు లోకముల నేదియును లేదు. మీరే యీ లోకమున వాంఛితార్థ ప్రదులరనీ వినియుంటిమి. అందుచే మేమందరము రాముఁడవయిన మిమ్మభియాచించుటకు వచ్చితిమి ఆ యీ క్షేత్ర రాజమును సత్త్వగుణప్రభావమాత్రముచే, సముద్రోదకములను వెనుకకు తోడి మాకు ప్రసాదించుట కరులరు. రాముఁడిట్లనెను. ఓ తపోధనులారా ! ఆ వృత్తాంతమంతయు సంపూర్ణముగా అలకించియుంటిని. మీ కార్యము నాచే కరణీయము. అందు సంశయము లేదు. కాని, మీరు తలపోసిన అభిలషించిన కర్మ లోకమున సుదారుణమయినది, ఇయ్యది శస్త్రముల దాల్చియే సాధింపఁ దగినది, అంతియేకాని ఇతరత్ర సాధ్యము కాదు. నేను సర్వాభయపూర్వక వరమిచ్చితినీ. శమాన్వితుండనై శస్త్రముల వీడిచితినీ. పూర్వమే పితృ శాసనమున తపస్సమాధిస్థితుఁడనై యుంటిని. ఇంక నెన్నడు శస్త్రమును ముట్టను అనీ పూర్వము సజ్జనుల వద్ద శపథ మాచరించి, ఓ పూజ్యులారా ! శస్త్ర గ్రహణము చేతనే సాధ్యమగు యుష్మదీప్సిత వస్తువునకై, ఇప్పుడేమి నేను చేయవలయునని, డోలాయిత మానసుఁడనయితిని అన శుషుఁడను ఋషి ఇట్లనెను - పూర్వము బ్రహ్మచెప్పినట్లు, సజ్జనుల సంరక్షణము కొలకు శస్త్ర గ్రహణము సత్యవచనదూరము కాఁజాలదు. అందుచే మా యందరి హితము కొఱకు శస్త్రగ్రహణము ధర్మమే యగును. తన్మూలమున ఒక మహాకార్యము నీపోచరించి నట్లగును”.
జైమినీరువాచ :
ఏవం సంప్రార్థ్యమానస్తు మునిభిర్భృగుపుంగవః ।
తమనుద్రుత్య మేధావీ ధర్మముద్దిశ్య కేవలమ్ ॥
సతైః సహా మునిశ్రేష్ఠో దేశం దక్షిణపశ్చిమామ్ ।
సముద్దిశ్య యయౌ రాజన్ ద్రష్టుకామః సరిత్పతిమ్ ॥
స సహ్యమచలశ్రేష్టమవతీర్యభృగూద్వహః ।
తత్పరం సరితాం పత్యుస్తీరం ప్రాప మహామనాః ॥
స దదర్శ మహాభాగః పరితో మారుతాకులమ్ ।
ఆకారం సర్వరస్నానాం పూర్యమాణమనారతమ్ ॥
అపరిజేయగాంభీర్యం మహాతామివ మానసమ్ ।
దుష్పారపారం సర్వస్య వివిధగ్రాహసంహతిమ్ ॥
అప్రధృష్యతమం లోకే ధాతారమివ కేవలమ్ ।
ఆత్మానమివ చాత్మల్వే స్యకృతాఖిలముద్ధతమ్ ॥
ఆశ్రయం సర్వసత్వానామాపగానాం చ పార్థివః ।
అత్యర్థచపలోత్తుంగతరంగశతమాలీనమ్ ॥
ఉపాంతోపలసంఘాతకుహరాంతరసంశ్రయాత్ ।
విశీర్యమాణలహరీశతఫేనౌఘశోభితమ్ ॥
గంభీరమౌషం జలధిం పశ్యన్ మునిగజైస్సహా ।
సంసేవ్యమానస్తరలైర్లహరీకణశీతలైః ॥
ముహూర్తమివ రాజేంద్ర! తీరే నదనదీపతేః ।
విశశ్రమే మహాబాహుః ద్రష్టుకామః ప్రచేతసమ్ ॥
తతో రామః సముత్థాయ దక్షిణాభిముఖస్థితః ।
మేఘగంభీరయా వాచా వరుణం వాక్యమబ్రవీత్ ॥
అహాం మునిగణైస్సార్థమాగతస్త్వద్ధిదృక్షయా ।
తస్మాత్ స్వరూపధృజహ్యం ప్రచేతో దేహి దర్శనమ్ ॥
జైమిని ఇట్లనెను. మేధావి, భృగుపుంగవుఁడీ విధముగా మునులచే నభ్యర్థింపఁబడి, కేవలము ధర్మమునుద్దేశించి, వారి కార్యమంగీకరించి, పారితోఁగలనీ, దక్షిణ పశ్చిమాభిముఖముగా సరిత్పతియైన సముద్రుని చూడనరిగెను. భృగూద్వహుఁడు అచలశ్రేష్ఠమయిన సహ్య పర్వతము నుండి దిగి, తరువాత మహామనస్వి సముద్రతీరమును చేరెను. తన చుట్టును వాయువుచే ఆకులమై యున్న సముద్రమును మహర్షి చూచాను. అయ్యది సర్వరత్నములకును ఆకారము స్థానము. అనారతము నీటిచే నింపఁబడుచున్నది. తెలిసికొనుటకు శక్యముకాని అపరిశ్లేయ గాంభీర్యవంతము; అనవగాహ్యమైన మహాత్ముల మనస్సు వంటిది. జనులచే దాటుటకు వీలుకానీ దుష్పారమయినది; వీవీధములయిన మొసళ్లచే సంకులము; లోకమున బ్రహ్మనువలె అప్రధృష్యమైనది; సర్వవ్యాపకమయిన ఆత్మవంటిది; ఉద్ధతులనెల్లర ధిక్కరించినది; సర్వస్వములకు ఆశ్రయము, సర్వనదీనదములకు రాజు. అత్యంతమచపలములయిన యుత్తుంగ తరంగశతమాలికలు కలది. తారమందలి శీలసంఘాతములయిన గుహల యొక్క సంశ్రయము వలనను, విరిగి చీలి విశీర్ణములయిన ప్రవాహముల వలన గలిగిన నురగల సమూహముతో సంశోభితము. గంభీరమయిన ఘోష గలిగినదియు నైన సముద్రమును మునీగణ సహితుడై రాముఁడు చూచేను. అయ్యది తరలములైన లహరీ కణశీతలముచే సంసేవ్యమానుఁడు. నదనదీపతియైన ఆ సముద్రతీరమున, ప్రచేతసుని (వరుణుని) చూడఁగోరి మహాబాహువయిన రాముఁడు క్షణకాలము విశ్రాంతి వహించెను. అంత రాముఁడు లేచెను. దక్షిణాభిముఖస్థితుడయ్యెను. గంభీరమయిన వాక్కులతో వరుణుని గూర్చి ఇట్లు పలికెను. నిన్ను చూడదలఁచి మునులతో సహితము వచ్చితిని. అందుచే ఓ వరుణ ! నీవు రూపమును ధరించి నాకు దర్శన మొసంగుము.
ఇతి శ్రుత్వాపి తద్వాక్యం వరుణో యాదసాం పతిః ।
న చచాల నీఅస్థానానృప ధీరతరస్త్వయమ్ ॥
పునః పునశ్చ రామేణ సమాహూతోపి తోయరాట్ ।
న దదౌ దర్శనం తస్మై ప్రతివాచ్యం చ నాభ్యధాత్ ॥
అలంఘనీయం తద్వాక్యం వరుణేనావధీరితమ్ ।
అత్యంతమితి కార్యార్జీ విదుషా సముపేక్షితమ్ ॥
తతః ప్రచేతసా వాక్యం మన్యమానో వధీరితమ్ ।
చుకోప తమభిప్రేక్ష్య రామః శస్త్రభృతాం వరః ॥
సంక్షుణ్ణసాగరాకారః స తదా స్వబలాశ్రయాత్ ।
నిస్తోయమర్థవం కర్తుమియేష రుషితో భృశమ్ ॥
తతోః జలముపస్పృశ్య సమీపే విజయం ధనుః ।
తతః ప్రణమ్య మనసా శర్వం రామో మహద్ధనుః ॥
గృహీత్వారోపయామాస క్రోథసంరక్తలోచనః ।
అభిమృశ్య ధనుః శ్రేష్ఠం సగుణం భృగుసత్తమః ॥
పశ్యతాంసర్వభూతానాం జ్యాఘోషమకరోత్తదా ।
జ్యాఘోషః శుశ్రువే తస్యదివిస్పృగతినిష్టురః ॥
చచాల నిఖిలా యేన సప్తద్వీపార్జపా మహీ ।
తతః సరభసం రామశ్చాపే కాలానలోపమమ్ ॥
సువర్ణపుంఖం విశిఖం సందధే శరసత్తమమ్ ।
తస్మిన్నస్త్రం మహాహారం భార్గవం వహ్నిదైవతమ్ ॥
యుజ భృగుశార్దూలః సమంత్రాభ్యాసమోక్షణమ్ ।
తతశ్చచాల వసుధా సతైలవసకాననా ॥
ప్రక్షోభం పరమం ఆగ్ముద్దేవాసురమహోరగాః ।
సంధితాస్త్రం భృగుశ్రేష్ఠం క్రోధసంరక్తలోచనమ్ ॥
దృష్ట్వా సంభాంతమనసో బభూవుః సచరాచరాః ।
సదిగ్ధాహాభ్రపటలైరభవనంవృతాదిశః ॥
అను రాముని వాక్యములను వినియు యాదసాంపతియయిన వరుణుఁడు తన స్థానము నుండి కదలనైన లేదు. ఆతఁడో స్వయముగా ధీరతరుఁడయ్యెను. మరల మరల రామునిచే సమాహూతుఁడైనను సాగరుఁడు (జలాధిపతి) దర్శనమీయలేదు. సరి. ప్రతివాక్యము కూడ నొసంగలేదు. అలంఘనీయమయిన రాముని వాక్యమును సముద్రుఁడు తిరస్కరించేను, అవధ్గీత మొనర్చెను. ఆతఁడత్యంత కార్యార్ధియై యాచకుఁడై వచ్చెననీ సముద్రుడెఱుంగును. అంత తన వాక్యములు ప్రచేతసునీచే అవమానింపఁబడినవని తలంచి, శస్త్రధారులలో శ్రేష్ఠుఁ డయిన రాముఁడు ఆ సముద్రమును, అభివీక్షించి అధికముగా క్రుద్ధుఁడయ్యెను. రాముఁడు సంక్షుణ్ణ సాగరాకారుఁడై, స్వదిలాశ్రయమున కోపముతో సముద్రమును నిస్తోయముగా (నీరులేనట్టిదీగా)జేయ గోరెను. రాముఁడు జలమును సంస్పృశించెను. (అచమన మొనరించెను). 'విజయ' ధనువును సమీపించెను. రాముఁడు మనసా శర్వునకు ప్రణామమాచరించెను. ఆవిజయ మహద్దనువును గ్రహించెను. క్రోధముచే నెట్టబడ్డ నేత్రములతో, ధనుశ్రేష్టమును చేపట్టి భృగు సత్తముడు సర్వభూతములు చూచుచుండ, దానికి గుణము నారోపించెను. జ్యోఘోష మొనరించెను. ఆ జ్యాఘోషమతనిష్ఠురమై ఆకాశము నంటి వినిపించెను. సప్త ద్వీపార్ణవ సహితయైన భూమి చలించెను. అంత వెంటనే రాముడు కాలానలోపమము సువర్ణపుంఖవిశిఖమును చాపమున సందధాన మొనర్చెను. ఆ యస్త్రము మహాఘోరము, భార్గవము, వహీదైవతమునయినది. సంమత్రాభ్యాస మోక్షణమయిన దానిని జ్యాయుత మొనర్చెను. అంత సశైల వనకాననయైన భూమి కంపించిపోయేను. దేవతలు, అసురులు, మహోరగులు అత్యంత సంక్షోభము నొందిరి. క్రోధ సంరక్తలోచనుఁడు భృగుశ్రేష్ఠుఁడు అస్త్రమును సంధింప చూచి సచరాచరప్రపంచము సంభ్రమ మొందెను. దిక్కులు దహించున భ్రపటలములచే ఆవరింపఁబడెను.
వవుశ్చ పరుషా వాతా రజోవ్యాప్తా మహారవాః ।
మందరళ్మీరశీతాంశురభూత్సంరక్తమండలః ॥
సోల్కాపాతాశనిర్వృష్టిర్బభూవ రుధిరోదకా ।
కిమేతదితి సంభ్రంతా ధూమోద్గారాతిభీషణమ్ ॥
అధిరోపితదివ్యాస్త్రం ప్రచకర్ష మహాతరమ్ ।
ధనుర్వికర్షమాణం తం స్ఫురజ్వాలాగ్రసాయకమ్ ॥
దదృశుర్మునయో రామం కల్పాంతానలసన్నిభమ్ ।
ఆకర్షాకృష్ణకోదండమండలాభ్యంతరస్థితమ్ ॥
తస్య ప్రతీభయాకారం దుమ్ర్పాపమభవద్వపుః ।
వికృష్టధనుషస్తస్య రూపముగ్రం రవేరివ ॥
కల్పాంతేభ్యుదితస్యేవ మండలం పరివేషితమ్ ।
కల్పాంతాగీసమజ్వాలాభీషణం స్ఫురతో వపుః ॥
తస్యాలక్ష్యత చక్రస్య హరేరివ చ మండలమ్ ।
స్ఫురత్క్రోధానజ్వాలాపరీత్యతిరౌద్రతామ్ ॥
అవాప విష్ణోః స తదా నారసింహాకృతేరివ ! ।
వపురికృష్ణచాపస్య భృకుటీకుటిలాననమ్ ॥
రామస్యాభూద్భవ స్యేవ దిధక్షోస్తీపురం పురా ।
జాజ్వల్యమానవపుషం తం దృష్ట్వా సహసా భయాత్ ॥
ప్రసీద జయ రామేతి తుష్టువుర్మునయోఃఖిలాః ।
తతో స్రగ్నిస్ఫురదూమపటలైః శకలీకృతమ్ ॥
బభూవచ్ఛన్నమంబోధేరంతఃపురమశేషతః ।
జ్వలదన్రినలజ్వాలాపరితాపపరాహతః ॥
అత్యరిచ్యత సంభాంతసలీలోఘ ఉదన్వతః ।
తిమింగితిమిగ్రాహనక్రమత్స్యాహికచ్ఛపాః ॥
ప్రజగ్ముః పరమామార్తిం ప్రాణినః సలిలేశయాః ।
ఉత్పతన్నిపతత్తామన్నానాసత్త్వోద్ధతోర్మిభిః ॥
రజోవ్యాప్తములై గొప్ప ధ్వని కలిగి తీవ్ర జంఝా మారుతములు వీచెను సూర్యుఁడు మందరశ్మి మంతుఁడయ్యెను. సూర్యమండలము రక్తవర్ణమయ్యెను. ఉల్కలతో గూడి, రక్తోదకములతో పిడుగుల వాన పడెను. “ఇదియేమి విపత్తని’ అందరు సంభ్రాంతులయిరి. వర్షము వడగళ్లతో నిండి, ధూమవంతమయి భయంకరముగ నుండెను. రాముఁడు దివ్యాస్త్రమును సంధించి ప్రకర్షించెను. సాయకము స్ఫురజ్జ్వలాగ్ర మయ్యెను. అట్లు శరము నధిరోహించి ఆకర్షించిన రాముని కల్పాంతాగ్ని తుల్యునివలె మహర్షులు చూచిరి. రాముఁడు ఆకర్ణాంతము అస్త్రము నాకర్షింప, ప్రతిభయాకారమయిన యాతని శరీరము దుప్తాపమయ్యెను. ఆతని రూపము రవి తేజమువలె నుగ్రమయ్యెను. ఆకృష్టధనుర్మండమలము కల్పాంతమందు ఏర్పడు పరివేషితమండలము వలె కల్పాంతాన్ని సముజ్జ్వలాభీషణ స్ఫూర్తికి ఆతని శరీరము ఆకరమయ్యేను. రాముఁడు క్రోధానల, జ్వాలా పరీతమయిన యతి రౌద్రత్వమున కంపింప, కల్పాంత కాలమందలి అగ్ని యొక్క జ్వాలలవలె భయంకరమై ఆతని శరీరము విష్ణుని యొక్క చక్రము యొక్క మండలము వలె ఉదోచెను. క్రోధానల జ్వాలాపరీతుఁడయిన రాముఁడు రుద్రత్వముతో విష్ణుని నారసింహాకృతి యొక్క భీకరత్వము వహించెను. ఆతఁడు చాపము నాకర్షింప నాతని భృకుటీ కుటిలాలకముతోడి ముఖము పూర్వము త్రిపురముల దహింపగోరినట్టి . శివుని ఆకృతి యయ్యెను. జాజ్వల్యమానమయిన యాతని శరీరమును చూచి, వెంటనే భయముతో మునులందరు “ప్రసీద, జయ” జయ అని - స్తోత్రపాఠ మొనర్చిరి. అంత అస్రాగ్ని నుండి రేగిన ప్రకాశవంతమయిన ధూమపటలములచే సముద్ర గర్భాంతరాళమంతయు, శకలీకృతమై అవచ్ఛిన్నమయ్యెను. ఆవరింపబడెను. జ్వలించు అస్త్రాగ్ని జ్వాలాపరీతమై సముద్రాపఃపరాహతమై సముద్రుఁడు సంభాంతసలిలౌఘముచే పరీవృతుఁడయ్యెను. సముద్రమందుండెడి తిమింగిలములు, నక్రములు, మత్స్యములు కచ్ఛపములు మిక్కిలి ఆర్తినొందెను. కెరటములు విజృంభించి రేగ జలజీవములన్నియును గెంతి క్రిందపడి సొమ్మసిల్లెను. సముద్రుఁడు వెంటనే అధికముగా క్షోభిల్లెను.
ప్రక్షోభం భృశమంబోధిః సహసా సముపాగమత్ ।
త్రాసరాసం చ విపుల మంభసాప్లవతా సహ ॥
ఉద్వేలతామితస్తప్తః సలీలాంతరచారిణః ।
తతస్తస్మాచ్ఛరాజ్జ్వాలాః పూతృతాశేషభీషణాః ॥
నిరూపితమివ వ్యక్తం నిశ్చేరుః సర్వతోదిశమ్ ।
తతః ప్రచండపవనైః సర్వతః పరివర్తితమ్ ॥
అగ్నిజ్వాలామయం రక్తవితానాభమలక్ష్యత ।
ప్రలయాళేరివాత్యర్థమస్రగ్నివ్యాకులాంభసః ॥
సముద్రిక్తతయా తస్య తరంగాస్త్రమభ్యయుః ।
అస్రాగ్నివిధాకులితజలఘోషేణ భూయసా ॥
కకుభో బథిరీకుర్వన్నలక్ష్యత పయోనిధిః ।
పరితోన్రనలజ్వాలాపరివీతజలావిలః ॥
జగామ పరమావర్తిం సహ్యః సద్యస్తదాశ్రయః ।
ఆకర్ణాకృష్ట కోదండం దృష్ట్వా రామం పయోనిధిః ॥
విషాదమగమత్తీవ్రం యమం దృష్వైవ పాతకీ ।
భయకంపితసర్వాంగస్తతో నదనదీపతిః ॥
విహాయ సహజం ధైర్యం భీరుత్వం సముపాగమత్ ।
తతః స్వరూపమాస్థాయ సర్వాభరణభూషితః ॥
ఉత్తీర్యమాణః స్వజలం వరుణః ప్రత్యదృశ్యత ।
కృతాంజలి సార్వహస్తః ప్రచేతా భార్గవాంతికమ్ ॥
త్వరలోభ్యాయమౌ శీఘ్రసాయకాడీతభీతవత్ ।
అభ్యేత్యాకృష్టధనుషః స తస్య చరణాబ్దయోః ॥
అబ్రవీచ్చ భృశం భీతః సంభ్రమాకులితాక్షరమ్ ।
రక్ష మాం భృగుశార్దూల కృపయా శరణాగతమ్ ॥
అపరాధమిమం రామ మయా కృతమజానతా ।
స్థితోస్మి తన నిర్దేశే శాధి కిం కరవాణి వై ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే మధ్యమభాగే తృతీయే ఉపోద్ఘాతపాదే
భార్గవం ప్రతి వరుణాగమనం నామ సప్తపంచాశత్రమోధ్యాయః ॥
వెంటనే సముద్ర మధిక సంక్షోభమును పొందెను. నీటియందలి భూత జాలము కల్లోలమయిన సముద్ర శరీరముతో భయమొంది యాక్రోశించేను. శరము నుండి బహిర్గమించిన జ్వాలలు తమ ఫూత్కారరవమున అశేషభీషణములయ్యెను. సలిలాంతశ్చారిణులయిన భూతములు తప్త సలిలముతో ఉద్వేలత్వము వహించెను. ఆ ఫూత్కారములన్నిదెసల క్రమ్మెను, అంత ప్రచండ పవనములు సర్వత్ర పరివర్తించెను. అస్రాగ్నిచే వ్యాకులమైన నీరు ప్రళయకాలాబినీరమువలె అగ్నిజ్వాలామయమై, రక్త వీతానము వలె ఆకాశమగుపించెను. ఆ యస్త్ర సంబంధమయిన ఉద్రిక్తతచే తరంగములు ఒడ్డునకు తాకెను. వానితోపాటు అస్త్ర సంబంధాగ్నిచే విధమయి ఆకులమయిన అత్యంత జలహోషము వ్యాపించేను. దిక్కులు బధిరీభూతములయ్యెను. సముద్రమగుపించుట మానెను. సర్వత్ర అస్త్రానల జ్వాలలచే పరివృతమైన జలముల సంబంధముచే ఆవిలమై సహ్యపర్వతము తదాశ్రయులతో సహా ఫరవర్తినీ వహించెను. చెవి వఱకు ఆకర్షించి యుంచిన రాముని యొక్క కోదండమును సముద్రుఁడు చూచి, యముని చూచిన పాతకి పొందు విషాదము వలె నధిక విషాదమును పొందెను. అంత నదనదీపతియైన సముద్రుడు భయకంపితసర్వాంగుఁడయ్యెను. తన సహజ గాంభీర్యమును వదలి, భీరుత్వము నందెను. అంత కొంత సేపటికి స్వస్థతతోడి స్వరూపమును పొంది, సర్వాభరణ భూషితుఁడై, తన జలము నుండి ఉత్తరించుచు వరుణుఁడు కనీపించెను. సార్వహస్తకృతాంజలియై ప్రచేతసుఁడయిన వరుణుఁడు భార్గవ సమీపమునకు, తీవ్రమయిన రాముని ఆస్త్రము వలన మీకీలీ భీతుఁడై త్వరగా బయలుదేరెను. రామ సమీపమునకు వచ్చి, ఆకృష్టమయిన ధనువుతో గూడిన రాముని చరణాబ్జములయందు, పడి, సంభ్రమముచే ఆకులితాక్షరములతో మిక్కిలి భీతుఁడై “ఓ భృగుశార్దూల! నిన్ను శరణుపొందీతి నన్ను రక్షించు”మని ఆర్తుఁడై పలికెను. “ఓ రామ ! ఈ అపరాధము తెలియకచేసితిని. - ఇదిగో నీదగ్గర పాదములంటియుంటిని. నీ నిర్దేశమును నీవు ఆజ్ఞాపింపుము. ఏమి చేయవలెనో సెలవీయుము”. అనెను.
ఇది మహాపురాణమయిన బ్రహ్మాండపురాణమున మధ్యమభాగమునందు తృతీయ ఉపోద్పోతపాదమున భార్గవుని కడకు వరుణాగమమను, ఏబది ఏడవ అధ్యాయము.
Summary of chapter 95 of the Brahmānda Mahā Purana is as follows:
In profound philosophical prose, this section provides an in-depth analysis of the four Yugas, detailing the spiritual capacity, lifespans, and dominant virtues of humanity in each age. It highlights how Satya Yuga thrives on truth, Treta on sacrifice, Dvāpara on worship, and Kali Yuga on the simple, potent chanting of divine names. The devout heart fills with gratitude, realizing that divine grace has made liberation easily accessible in Kali Yuga through holy name recitation.