10 - మోహినీప్రాదుర్భావ - మలకాసురవధోనామ

హయగ్రీవ ఉవాచ :-

అథ దేవో మహేంద్రాద్యా విష్ణునా ప్రభవిష్ణునా

అంగీకృతా మహాధీరాః ప్రమోదం పరమం యయుః

మలకాద్యాస్తు తే సర్వే దైత్యా విష్ణుపరాజ్ముఖాః

సంత్యక్తాశ్చ శ్రీయా దేవ్యా భృశముద్వేగమాగతాః

తతో జగృహిరే దైత్యో ధన్వంతరికరే స్థితమ్

పరమామృతసారాధ్యం కలశం కనకోద్భవమ్

అథోసురాణాం దేవానామన్యోన్యం కలహోఽభవత్

ఏతస్మిన్నంతరే విష్ణుః సర్వలోకైకరక్షకః

సమ్యగారాధయామాస లలితాం స్వైక్యరూపిణీమ్

సురాజోమసురాణాం చ రణం వీక్ష్య సుదారుణమ్

బ్రహ్మా నిజపదం ప్రాప శంభుః కైలాసమాశ్రితః

హయగ్రీవుడనెను: తరువాత భ్రవిష్ణువైన విష్ణువుచే నంగీకృతులై మహాధీరులై పరమ సంతోషము నందిరి-1. విష్ణువునకు ముఖము దీప్పిన మలకాదులగు సమస్తరాక్షసులు శ్రీదేవిచే వదిలిపెట్టబడిన పొరై మిక్కిలి యుద్వేగమును జెందిరి-2 అంత, రాక్షసులు ధన్వంతరి చేతిలోనున్నదియు పరమామృతసారముతో నొప్పీనదియు నైన బంగారు అమృత కలశమును దీసి కొనిరి. తరువాత, దేవరాక్షసులకు పరస్పరము కలహము జరిగెను-3. ఇంతలో సర్వలోకములకు రక్షకుడైన విష్ణువు తనతోనేకరూపిణియైన లలితాదేవిని, చక్కగా నారాధించేను-4. సురాసురుల యొక్క యాభయంకరమైన యుద్ధమును జూచి బ్రహ్మ తన స్థానమునకు బ్రహ్మలోకమునకు బోయెను. శివుడు కైలాసమును జేరెను-5.

మలకం యోధయామస దైత్యానామధిపం వృషా

అసురైశ్చ సురాః సర్వే సాంపరాయమకుర్వత

భగవానపి యోగీంద్రః సమారాధ్య మహేశ్వరీమ్

తదేకధ్యానయోగేన తదూపః సమజాయత

సర్వసంమోహినీ సా తు సాక్షాచుజ్ఞార నాయికా

సర్వశృంగారవేషాధ్యా సర్వాభరణభూషితా

సురాణామసురాణాం చ నివార్య రణముల్వణమ్

మందస్మితేన దైతేయాన్ మోహయంతీ జగాద హ

అలం యుద్ధేన కిం శస్రార్మర్మస్థానవిభేభిః

నిష్ఠురైః కిం వృధాలాపైః కంఠశోషణహేతుభిః

అహమేవాత్ర మధ్యస్థా యుష్మాకం చ దివొకసామ్

యూయం తథాషా నితరామత్ర పా క్లేశభాగినః

సర్వేషాం సమమేవాద్య దాస్యామ్యమృత మద్భుతమ్

మమ హస్తే ప్రదాతవ్యం సుధాపాత్రమనుత్తమమ్

ఇంద్రుడు దైత్యరాజైన మలకునితో యుద్ధము జేసెను. రాక్షసులతో దేవతలందరును యుద్ధము చేసిరీ-6. భగవంతుడై యోగీంద్రుడైన విష్ణువు కూడా మహేశ్వరిని తదేకధ్యానయోగముతో ధ్యానించి తద్రూపు (మహేశ్వరీ రూపు) డయ్యెను-7. ఆమె సర్వాభరణ భూషితమై, సర్వ శృంగార వేషముతో నొప్పినదై, కన్నుల యెదుట శృంగార నాయికయై సర్వ సంమోహినియై యుండెను-8. సురాసురల యాతీక్ష మైన రణమును నివారించి, చిరునవ్వుతో రాక్షసులను మోహింపచేయుచు పలికెను-9. “యుద్దమును జాలీంచుడు, మర్మస్థానములను భేదించు శస్తములతోనేమి ప్రయోజనము. గొంతు నేండగొట్టునట్టి వ్యర్ధమైన కఠిన సంభాషణములతో నేమి ప్రయోజనము-10. మీకును దేవతలకును నేనేయిట మధ్యస్థురాలిని. మీరును వారును ఇచట. కష్టమును బంచుకొంటిరి-11. అందరికిని నీట సమముగానే అద్భుతమైన అమృతమును ఇచ్చెదను. ఆ యుత్తమమైన సుధాకలశమును నాచేత నుంచుడు-12.

ఇతి తస్యా వచః శృత్వా దైత్యోస్తద్వాక్యమోహితాః

పీయూష కలశం తస్యై దదుస్తే ముగ్ధచేతసః

సా తత్పాతం సమాదాయ జగన్మోహనరూపిణీ

సురాణామసురాణాం చ పృథక్ఫంక్షిం చకార హ

ద్వయోః పంక్త్యేశ్చ మధ్యస్థా తానువాచ సురాసురాన్

తూ ష్ణీం భవంతు సర్వేఽపి క్రమశో దీయతే మయా

తద్వాక్యమురరీచక్రుస్తే సర్వే సమవాయినః

సా తు సంమోహితాశేషలోకా దాతుం ప్రచక్రమే

క్వణత్కనకదర్వీకా క్వణన్మంగలకంకణా

కమనీయవిభూషాఢ్యా కలా సా పరమా బభౌ

వామే వామే కరాంభోజే సుధాకలశముజ్వలమ్

సుధాం తాం దేవతాపంక్తో పూర్వం దర్వ్యా తదిశత్

దిశంతీ క్రమశస్తత్ర చంద్రభాస్కర సూచితమ్

దర్వీకరేణ చిచ్ఛేద సైంహికేయం తు మధ్యగమ్

పీతామృతశిరోమాత్రం తస్య వ్యోమ జగామ చ

తం దృష్ట్వాఽష్యసురాస్తత్ర తూషీమాసన్ విమోహితాః

ఏవం క్రమేణ తత్సర్వం విబుధేభ్యో వితీర్య సా

అసురాణాం పురః పాత్రం సా నినాయ తిరోదధే

రీక్తపాత్రం తు తం దృష్ట్వా సర్వే దైతేయదానవాః

ఉద్వేలం కేవలం క్రోధం ప్రాప్తి యుద్దచికీర్షయా

ఇంద్రాదయః సురాః సర్వే సుధాపానాద్బలోత్తరాః

దుర్బలైరసురైః సార్థం సమయుధ్యంత సాయుధాః

తే విధ్యమానాః శతశో దానవేంద్రాః సురోత్తమైః

దిగంతానతిచిజ్జగ్ముః పాతాలం కలిచిద్యయుః

దైత్యం మలకనామానం విజిత్య విబుధేశ్వరః

ఆత్మీయాం శ్రియమాణహే శ్రీకటాక్షసమీక్షితః

పునః సింహాసనం ప్రాప్య మహేంద్రః సురసేవితః

త్రైలోక్యం పాలయామాస పూర్వవత్పూర్వదేవజిత్

నిర్భయా నిఖిలా దేవాస్రాలోకే సచరాచరే

యథాకామం చరంతి స్మ సర్వదా హృష్టచేతసః

తదా తదఖిలం దృష్ట్వా మోహినీచరితం మునిః

విస్మితః కామచారీ తు కైలాసం నారదో గతః

అని యను మోహినీ వాక్యమును విని దైత్యులు ఆమె మాటలకు మోహితులై మూఢ చిత్తులైయామెకు అమృతకలశము నిచ్చిరి-13, ఆ మోహిని యామృతకలశమును దీసికొని జగన్మోహనరూపిణియై దేవతలకును దానవులకును వేరు వేరు పంక్తులను జేసెను-14. రెండు, పంక్తుల మధ్య నుండి “వరుసగా అమృతము నిత్తును. ఊరక (అల్లరిచేయక) యుండుడు” అనెను-15. అక్కడ గుమికూడిన దేవదానవులందరు దానికంగీకరించిరి. ఆమోహినియైతే సంమోహితములైన యశేష లోకములుగలదై యమృతమునిచ్చుట కారంభించెను.-16. ధ్వనించుచున్న బంగారు గరిట గలదై, ధ్వనించుచున్న మంగళ కంకణములు గలదై, మనోహరములైన భూషణములతో నొప్పినదై యాదేవి పరమ కళగా ప్రకాశించేను.-17. పద్మమువలే సుందరమైన యెడమ చేతిలో ఉజ్జ్వలమైన సుధాకలశమును ధరించుచు మొదట దేవతా పంక్తికి వరుసగా గరిటతో నమృతమును బంచసాగెను-18. ఆక్రమములో చంద్ర సూర్యులు సూచించినట్టియు, దేవతల మధ్యనున్నట్టిరాహువును ఆ గరిటతోనే ఖండించేను. త్రాగినయమృతముగల రాహువు శిరము మాత్రము ఆకాశమునకు వెళ్లాను.-19. దానిని చూచి రాక్షసులు విమోహితులై యూరకయుండిరి. ఈ విధముగా నమృతమునంతయు దేవతలకిచ్చియామోహిని రాక్షసుల యెదుట నా కలశమునుంచి యదృశ్యమయ్యెను-20. అమృతశూన్యమైన యా కలశమును జూచి దైతేయులును దానవులును (రాక్షసులు) యుద్దమును జేయదలచి యుప్పొంగిన కోపముగల వారైరీ-21. ఇంద్రాదులైన దేవతలందరు అమృతపానముతో మిక్కిలి బలవంతులై సాయుధులై దుర్బలులైన రాక్షసులతో యుద్ధముజేసిరీ-22. దేవతా శ్రేష్ఠులచే సూరుల కొలదీ యస్త్రములతో గుచ్చబడుచున్న వారై రాక్షసరాజులు కొంతమంది దిగంతములకు బోయిరీ, కొంతమంది పాతాలమునకు బోయిరీ-23. దేవేంద్రుడు మలకుడను రాక్షసరాజును జయించి లక్ష్మీ కటాక్షమున కటాక్షింపబడినవాడై తన దేవరాజ్య లక్ష్మిని మరల పరిగ్రహించెను -24. మరలదేవరాజ్యసింహాసనమును బొంది యింద్రుడు దేవతలతో సేవింపబడి రాక్షసజేతయై పూర్వమువలె ముల్లోకములను పరిపాలింపసాగెను-25. చరాచర భూయిష్టమైన ముల్లోకమున సమస్త దేవతలు నిర్భయులై సంతుష్ట చేతస్కులై స్వేచ్ఛగా సంచరించుచుండిరి-26. అపుడు ఆ సమస్త మోహినీ చరితమును జూచి నారదమునీ యాశ్చర్యము జెంది కామచారియై కైలాసమునకు వెళ్లేను-27.

నందనా చ కృతానుజ్ఞః ప్రణమ్య పరమేశ్వరమ్

తేన సంభావ్యమానోసౌ తుష్టో విష్టరమాస్త సః

ఆసనస్థం మహాదేవో మునీం స్వేచ్ఛావిహారిణమ్

పప్రచ్ఛ పార్వతీజానిః స్వచ్ఛస్ఫటికసన్నిభః

భగవాన్ సర్వవృత్తజ్ఞ పవిత్రీకృతవిష్టర

కలహప్రియ దేవరే కింవృత్తం తత్ర నాకీనామ్

సురాణామసురాణాం వా విజయః సమజాయత

కిం వాప్యమృతవృత్తాంతః విష్ణునా వాపీ కిం కృతమే

ఇతి పృష్ణో మహేశేన నారదో మునిసత్తమః

ఉవాచ విస్మయావిష్టః ప్రసన్నవదనేక్షణ

సర్వం కొనాసి భగవన్ సర్వజోసి యతస్తతః

తథాపి పరిపృషైన మయా తద్వక్ష్యతేఽధునా

తాదృశే సమరే హోరే సతి దైత్యదీవొకసామ్

ఆదినారాయణః శ్రీమాన్మోహినీరూపమాదదే

తాముదారవిభూషాధ్యాం మూర్తిం శృంగారదేవతామ్

సురాసురాః సమాలోక్య ప్రతాః సమరోద్యమాత్

తన్మాయామోహితా దైత్యాః సుధాపాత్రం చ యాచితాః

కృత్వా తామేవ మధ్యస్థామర్పయామాసురంజసా

తదా దేవీ తదాదాయ మందస్మితమనోహరా

దేవేభ్య ఏవ పీయూషమశేషం వితతార సా

తిరోహిళామదృష్ట్వా తాం దృష్ట్వా శూన్యం చ పాత్రకమ్

జ్వలన్మన్యుముఖా దైత్యా యుద్ధాయ పునరుర్థితాః

అమరైరమృతాస్వాదావత్యుల్వణపరాక్రమైః

పరాజితా మహాదైత్యా నష్టాః పాతాలమధ్యయుః

ఇమం వృత్తాంతమౌకర్య భవానీపతిరవ్యయః

నారదం ప్రేషయిత్వాతు తదుక్తం సతతం స్మరన్

అజ్ఞాతః ప్రమథైః సర్వైః స్కందనందివినాయకైః

పార్వతీ సహితో విష్ణుమాజగామ సవిస్మయః

క్షీరోదతీరగం దృష్ట్యా సస్త్రీకం వృషవాహనమ్

భోగిభోగాసనాద్విష్ణుః సముత్థాయ సమాగతః

వాహనాదవరుహ్యేశః పార్వత్యా సహితః స్థితమ్

తం దృష్ట్వా శీఘమాగత్య సంప్యూర్యాదితో ముదా

సస్నేహం గాసమాలింగ్య భవానీపతిమచ్యుతః

తదాగమనకార్యం చ పృష్టవాన్విష్టరశ్రవాః

తమువాచ మహాదేవీ భగవన్ పురుషోత్తమ

మహాయోగేశ్వర శ్రీమన్ సర్వ సౌభాగ్యసుందరమ్ సర్వసమ్మోహజనకమవాజ్మానసగోచరమ్

యద్రూపం భవతోపాత్తం తన్మహ్యం సంప్రదర్శయ

ద్రష్టుమిచ్ఛామి తే రూపం శృణ్ణరస్యాధిదైవతమ్

అవశ్యం దర్శనీయం మే త్వం హి ప్రార్థితకామధుకి

ఇతి సంప్రార్థితః శశ్వన్మహాదేవేన తేన సః

యద్యానవైభవాల్లజ్జు రూపమద్వైతమద్భుతమ్

తదేవానన్యమనసా ధ్యాత్వా కించిద్విహస్య సః

తథాస్త్వితి తిరోఃఽధత్త మహాయోగేశ్వరో హరిః

శర్వోఽపి సర్వతశ్భక్షుర్ముహుర్వ్యాపారయన్ క్వచిత్

అదృష్టపూర్వమారామమభిరామం ష్యలోకయత్

వికసత్కుసుమశ్రేణీవినోదిమధుపాలికమ్

చంపకస్తబకామోదసురభీకృతదిక్తమ్

మాకందవృందమాధ్వీకమాద్యదుల్లోలకోకిలమ్

అశోక మండలీకాండ సతాండవశిఖండికమ్

భృంగాలినవఝుంకారజితవల్లకినిస్వనమ్

పాటలోదార సౌరభ్యపాటలీకుసుమోజ్వలమ్

తమాలశాలహింతాలకృతమాలావిలాసితమ్

పర్యంతదీర్షికాదీరపఙ్కజశ్రీపరిష్కృతమ్

వాతపాతచలచ్చారుపల్లవోత్ఫుల్లపుష్పకమ్

సంతానప్రసవామోదసంతానాధికవోసితమ్

తత్ర సర్వత్ర పుష్పాధ్యే సర్వలోకమనోహ రౌ

పారిజాతతరోర్మూలే కాంతా కాచిదదృశ్యత

బాలార్కపాటలాకొరా నవయౌవనదర్పీతా

ఆకృష్టపద్మరాగాభా చరణాబ్జనఖచ్ఛదా

యావకశ్రీవినిక్షేపపాదలౌహిత్యవాహినీ

కలనిస్వనమంజీరపదపద్మమనోహరా

అనంగవీరతూణీరదర్ఫోన్మదనజంఘికా

కరిశుండాకదలికాకాంతితుల్యోరుశోభినీ

అరుణేన దుకూలేన సుస్పర్శేన తనీయసో

అలంకృతనితంబాడ్యా జఘనాభోగభాసురా

నవమాణిక్యసన్నద్ధహేమకాంచీవిరాజితా

నతనాభిమహావర్తత్రివల్యూర్మిప్రభాయిరా

స్తనకుట్మలహిందోలముక్తాహ్మశతావృతా

అతిపీవరవక్షోజరభంగురమధ్యభూః

శిరీషకోమలభుజా కంకణాంగదశాలినీ

సోర్మికాంగులిమన్మృష్టశంఖసుందరకంధరా

ముఖదర్పణవృత్తాభచుబుకా పాటలాధరా

శుచిభిః పంక్తిభిః శుధ్ధార్విద్యారూపైర్విభాస్వరైః

కుందకుట్మలసచ్ఛాయైర్ధంతైర్దర్శితచంద్రికా

స్థూలమౌక్తికసన్నద్ధనాసాభరణభాసురా

కేశకాంతర్గలద్రోణి దీర్ఘదీర్ఘవిలోచనా

అర్ధందుతులితా ఫాలే సమ్యక్ క్లుపాలకచ్ఛటా పాలీవతంసమాణిక్యకుండలామండితశ్రుతిః

నవకర్పూరకస్తూరీరసామోదితవీటికా

శరచ్చారునిశానాథమండలీమధురాననా

స్ఫురత్కస్తూరితిలకా నీలకుంతలసంపతిః

సీమంతరేఖావిన్యస్తసిందూరశ్రేణిభాసురా

స్ఫురచ్చంద్రకలోత్తంసమదలోలవిలోచనా

సర్వశృంగారవేషాధ్యా సర్వాభరణమండితా

తామిమాం కందుకక్రీడాలోలామాలోలభూషణామ్

దృష్ట్వా క్షిప్రముమాం త్యక్త్వా స్కోఽన్వధావదథేశ్వరః

ఉమాపి తం సమావేక్ష్య ధావంతం చాత్మనః ప్రియమ్

స్వాత్మానం స్వాత్మసౌందర్యం నిందంతీ చాతివిస్మితా

తస్థానవాళ్ముఖీ తూషీం లజ్ఞాసూయాసమన్వితా

గృహీత్వా కథమప్యేనామాలిలింగ ముహుర్ముహుః

ఉదూయోద్దూయ సౌష్యేవం ధావతిస్మ సుదూరతః

పునర్గృహీత్వా తొమిశః కామం కామవశీకృతః

ఆక్లిష్టం చాతివేగేన తద్వీర్యం ప్రచ్యుతం తదా

తతః సముత్తితో దేవో మహాశాస్తో మహాబలః

అనేకకోటిదైత్యేంద్రగర్వనిర్వాపణక్షమః

తద్వీర్యబిందుసంస్పర్శాతా భూమిస్తత్ర తత్రచ

రజతస్వర్ణవర్ణాభూలక్షణాద్వింధ్యమర్దన

తథైవాంతర్దధే షాపి దేవతా విశ్వమోహినీ

నివృత్తః స గిరీశోఽపి గిరిం గౌరీసఖో యయౌ

నందిచే ననుమతింపబడి, పరమేశ్వరుని నమస్కరించి, యాతనిచే గౌరవింపబడుచూ సంతుష్టుడై నారదుడాసనమున గూర్చుండెను -28. ఆసనమున గూర్చుండి నట్టియు, స్వేచ్ఛా విహారియైనట్టియు, మునియైన నారదుని స్వచ్ఛమైన స్ఫటికము వలెనున్న (నిర్మలుడైన) పార్వతీపతి యిట్లడిగెను-25. కలహప్రియా! దేవర్షీ! అచట అమృత మథనమున దేవతలకేమి జరిగినది? దేవరాక్షసులలో నెవరికి విజయము లభించినది? అమృతము యొక్క వృత్తాంతమేమి? (అదియేమైనది?) విష్ణువేమి చేసెను?-31. అని మహేశుడడిగెను. దానికి నారదమునిసత్తముడిట్లనెను. అపుడాతని ముఖము ఆశ్చర్యముతో గూడినది, కానీ ముఖము చూపులు ప్రశాంతముగా నున్నవీ-32. ఓ భగవంతుడా! నీవు సర్వజ్ఞుడవు. అయినను నీవడిగినందున నిపుడు. చెప్పెదను-33. దేవరాక్షసులకాఫనోరయుద్ధము జరుగగా శ్రీమంతుడైన యాది నారాయణుడు మోహినీ రూపమును ధరించెను -34. ఆఉదార (నిండైన) విభూషణములతో నొప్పినది, శృంగార దేవత యాకారము దాల్చి వచ్చినదాయన్నట్లున్నది. అట్టి యామేను జూచి దేవరాక్షసులు యుద్ధ ప్రయత్నమును విరమించిరి-35. రాక్షసులామె మాయచే మోహీతులైరి ఆమె వారి నమృత కలశమునడిగెను. వారు ఆమెను మధ్యస్థురాలిగా జేసి చక్కగానమృత కలశమును వారీ కర్పించిరి-36. అపుడామోహినీ దేవి దానిని తీసికొనెను. మనోహరముగా చిరునవ్వులొలకబోసెను. దేవతలకే మొత్తమమృతము నిచ్చెను. -37. అంతర్థానమయ్యెను. రాక్షసులు ఆమెయదృశ్యమగుటజూచిరి. వెంటనే యమృతకలశమును శూన్యమైన దానినిగొజూచిరి. అపుడు వారి ముఖములు మండిపోయినవి, మరల దేవతలతో యుద్దమునకు లేచిరీ-38. కాని, దేవతలు మాత్రము అమృతము ద్రోవుటచే మిక్కిలి తీక్షమైన పరాక్రముగలవారైరి. కావున రాక్షసులు వారితో వోడిపోయి నశించిరి, పాతాలమునకు బోయిరీ-39. అవ్యయుడైన భవానీపతి శివుడు ఈ వృత్తాంతమును విని, నారదుని బంపి వైచి, అతను జెప్పినదానినే ఎల్లప్పుడు స్మరించుచు-40. తన సమస్త ప్రమథ గణములకును, కుమారస్వామి వినాయకులకును తెలియకుండగా పార్వతితో గూడ నాశ్చర్యముతో విష్ణువు కడకు వచ్చెను -41. అపుడు విష్ణువు క్షీరసముద్రపుటోడ్డున నుండేను. తన స్త్రీతో (పార్వతితో) గూడి, వృషవాహనుడైన శివుని జూచెను. అప్పుడు విష్ణువు తన ఆదిశేషశయనమునుండి లేచి శివుని కడకు వచ్చెను-42. శివుడు తన వాహనమునుండి దిగి పార్వతితో సహ నిలిచెను. అతనిని జూచి హరి శీఘ్రముగా సమీపించి అర్ఘ్యాదులతో పూజించెను. సంతోషముతో-43. స్నేహముతో పార్వతీ పతిని శ్రీమహావిష్ణువు గాఢముగా గౌగిలించుకోనెను. అటకు వచ్చుటకు కారణము గూడ నడిగెను-44. అపుడు మహాదేవుడు(శివుడు) భగవంతుడైన ఓ పురుషోత్తమా! మహాయోగేశ్వరా! శ్రీమన్ (లక్ష్మిని గలిగినవాడా) సర్వసౌభాగ్యముతో సుందరము-45. సర్వసమ్మోహజనకము, వాజ్మనములకందనిదియునై నీవు పొందిన యారూపమును నాకు జూపుము-46. శృంగారమునకధిదైవతముగా నున్న నీ రూపమును జూడగోరితిని అది నేను తప్పక చూడవలయును. నీవడిగిన వాని నిచ్చుటలో కామధేనువవు-47. అని యడిగెను. ఈ విధముగ మాటిమాటికి మహాదేవుడు ప్రార్థింపగా యోగేశ్వరుడైన విష్ణువు, తాను పరాశక్తి ధ్యానవైభవముబొందినట్టిదియు తనకద్వైతమైనట్టిదియు, నద్బుతమైన యా మోహినీ రూపమును తదేకమైన మనస్సుతో ధ్యానించి, కొద్దిగా చిరునవ్వుతో నవ్వి-అట్లే యగుగాకయని యంతార్థనమందెను. (అదృశ్యమయ్యెను) (ఇచట పరాశక్తియే మోహినియనియు తదఖిన్నుడే హరీయనీ వ్యక్తమగును. హరిపరాశక్తులకద్వైతము చెప్పబడినది)-49. ఈశ్వరుడు (శివుడు) కూడ అంతట తేరిపార జూచుచు నొకచోనంతకుముందెన్నడు చూడని సుందరమైన యుద్యానవనమును చూచెను-50. అందులో వికసించుచున్న పూల వరుసలలో మధుపములగుంపులు వినోదించుచున్నవి. చంపకపు పూగుత్తుల సుగంధముతో దిక్కులన్నియు పరిమలవంతములైనవీ-51. తీయమామిడి గుంపులతోను విప్పపూలతోను మదించి కోకిలలు గొంతెత్తి పాడుచున్నవి. అశోక వృక్షముల గుంపులలో నెమళ్ళు నాట్యమాడుచున్నవి-52. తుమ్మెద గుంపుల ఝంకారములు వల్లకీ నాదమును జయించుచున్నవి. తెలుపు మించినయెల్లని కలిగోట్టుచెట్ల పూవులు వనమంతయు మించి ప్రకాశించుచున్నవి-53. తమాలములు (చీకటి మ్రానులు) తాలములు (తాడిచెట్లు) పొంతాలములు (గిలక తాడిచెట్లు) వీని వరుసలు ప్రకాశించుచున్నవి పర్యంతములోని దీర్ఘకలలో (నడబావులలో) సుదీర్ఘములైన కమల సంపదలు వీరాజిల్లుచున్నవీ.-54. పిల్లవాయువులచే ఉద్యానలతా వృక్షములచిగురాకులు పూలును కదలి నాట్యమాడుచున్నవి. సంతాన వృక్షముల (కల్పవృక్షముల)పూల వాసనలు గుంపులు గుంపులుగా నంతట వ్యాపించిచు సుగంథము నిచ్చుచున్నవి-55. అటనంతటను చిత్ర విచిత్ర పుష్పములు ఒప్పుచున్నవి. అది సర్వమనోహరముగా నున్నది. అందులో పారిజాత తరువు మూలమున నొకకాంత శివునకు గనబడినది-56. ఆమె బాల సూర్యుని మెరుపులోనున్నది. నవయౌవనముతో మదీంచినదీ. ఆమె చరణాజ్ఞములు నఖములును పద్మముల కాంతినాకర్షించినవి. లాక్షారాగము బూయుట చే పాదముల యొలుపు ప్రవహించుచున్నట్లున్నది. మధురధ్వనినిచ్చు కాలియందేలతో నామె పాదకమలములు - మనోహరముగానున్నవి-58. ఆమెపిక్కలు నిండుగానుండి మన్మథుని వీరతూణీరముల (పూవుటమ్ముల పొదుల) దర్పమును ఉన్మదీంప (పిచ్చెత్తింపజేయుచున్నవి. ఆమె తొడలు ఏనుగు తొండములవలెను అరటిస్తంభములవలెను స్థూలసువృత్త శీతలములై ప్రకాశించుచున్నవి-59. ఆమె కట్టిన చీర యెఱ్ఱనిది పట్టుది, మెత్తనిది, చిన్నదీ పిరుదులను బాగుగా నలంకరించియున్నది. దానివలన నామె పిరుదుల వైశాల్యము చక్కగా ప్రకాశించుచున్నది-60. ఆమె జఘనములు కొంగొత్త మాణిక్యములు పొదిగిన బంగారుమొలనూళ్ళతో ప్రకాశించుచున్నవి. పెద్ద సుడివలె నామె నాభి కొద్దిగా వంగి త్రివళులుఅను అలలకాంతుల ప్రవాహముల నీండి వీరాజిల్లుచున్నదీ-61. కమలపు మొగ్గలవంటి స్తనములు తమపై నూగాడు నూరు ముత్యముల హారములతో జుట్టబడినవి. మిక్కలి లావైన స్తనముల భారముచే నడుము భాగము అల్లలాడుచున్నది-62. ఆమె భుజములు శరీర పుష్పములవలె కోమలములు. బాహువులందు కంకణము భుజకీర్తులు నొప్పుచున్నవి, ప్రేళ్ళలో ఉంగరములు ప్రకాశించుచున్నవి. ఆమె కంఠము శంఖమువలె సుందరముగానున్నదీ-63. ఆమె మోముటద్దమున (అద్దము వంటిముఖమున) ఒక చిన్న వృత్తము వలె గదువ ప్రకాశించుచున్నది. ఆమె పేదవీ పాటలవర్ణమైనది. ఆమె దంతములు శుద్ధమైన పంక్తులుగలవి, పవిత్రమైనవీ, విద్యారూపములు, విశేషముగా ప్రకాశించునవీ-64. మల్లెమొగ్గల వలె సుందరములు, అవి మొత్తముపైన వన్నెలనే ప్రకాశింపజేయుచున్నవి. (షోడశీకలా చంద్రికను ప్రకాశింపజేయుచున్నవి కావుననే విద్యాస్వరూపములు) లావైనముత్తెమును బొదిగిన నాసాభరణము (మలాకీ)తో బ్రకాశించినది-65. ఆమె కన్నులు కేతకాంతర్దల ద్రోణుల వలె (మొగిరేకులలోపలి దొప్పవంటి యాకువలె) దీర్ఘదీర్ఘములైనవి. అర్ధచంద్రునితో, తులదూగు నామె ఫాలభాగమున నందముగానమరిన, ముంగురుల సరములు ప్రకాశించుచున్నవి-66. పాలీవతంస(గొలుసుతో.. నలంకరించిన) మణికుండలములతో నామె చెవులు ప్రకాశించుచున్నవి. ముఖము నందలి తమలపాకు విడెము కొంగొత్త కర్పూర కస్తూరీ రసముల సుగంధమును వెదజల్లుచున్నవి-67. ఆమె ముఖము శరత్కాల చంద్రబింబమువలె మధురముగానున్నది నౌదుట కస్తూరీ తిలకమెప్పుచున్నది. తల వెంట్రుకలు గుంపై సంపూర్ణముగా నీలమైనవి-68. సిందూరరేఖనుంచుటచే సామె పొపెట భాసిల్లుచున్నది. ఆమె కన్నులు మదలోలములు షోడశీచంద్రికలనే శిరమున నలంకరించుకొన్నది. వేయేల సర్వశృంగార వేషముతో నొప్పినదీ. సర్వాభరణములనలంకరించికొన్నది-70. ఆమె ప్రస్తుతము కందుక క్రీడలో నాసక్తయైయున్నది. ఆయాటచే నాభరణములన్నియు కదలుచున్నవి. అట్టిమోహినిని జూచిన వెంటనే యీశ్వరుడు ఉమను వదలి యామె వెంట పరువెత్తెను-71. ఉమాదేవి కూడా మోహిని వెంట పరుగిడుచున్న తన ప్రియుని బాగుగా జూచీ, మిక్కిలి యాశ్చర్యము చెంది, తనను తన సౌందర్యమును నిందించుకొనెను. లక్ష్యాసూయలతో తలవంచికొన్నదై నిలుచుండెను-72. చిట్ట చివరకు శివుడు ఆ మోహినిని మాటిమాటికి కౌగిలించుకొనేను, మోహిని కూడా విదిలించుకొని విదిలించుకొని సదూరముగా పరువెత్తుచుండెను-73. కామవశీకృతుడైన శివుడు ఆమెను మరలబట్టుకొని యతివేగముగా సామెను గాఢముగా గౌగిలించుకొనెను. అప్పుడు శివుని వీర్యము స్థలితమయ్యెను-74. ఓయగస్త్య మహర్షి దాని నుండి మహాబలుడు దేవుడైన “మహాశాస్త్ర యావిర్భవించేను. అతడు అనేక కోటి దైత్యేంద్రుల గర్వమును నశింపజేయ సమర్థుడు-75. శివుని వీర్యబిందు సంస్పర్శవలన నచట భూమీ గుర్తునకు రజీతవర్ణముగను స్వర్ణవర్ణమగనయ్యెను. అట్లే ఆవిశ్వ మోహినియైన దేవతయు అంతర్థానమందెను. అటనుండి మరలిన గౌరీశుడైన శివుడు ఉమతోబాటు కైలాసగిరికి వెళ్లాను-77.

అథాద్భుతమిదం వీక్ష్య లోపాముద్రాపతే! శృణు

యన్న కస్యచిదాఖ్యాతం మమైవ హృదయే స్థితమ్

పురా భండాసురో నామ సర్వదైత్యశిఖామణిః

పూర్వం దేవాన్ బహువిధాన్ యః శాస్తా స్వేచ్ఛయా పటు

వీశుక్రం నామ దైతేయం వర్ణసంరక్షణక్షమమ్

శు(శ)క్రతుల్యం విచారజ్ఞం దక్షాంపేన ససర్ఘ సః

వామాంసేన విషాంగం చ సృష్టవాన్ దుష్టశేఖరమ్

ధూమినీనామధేయాంచ భగినీం భండదానవః

భ్రాతృభ్యామువీర్యాభ్యాం సహితో నిహతాహితః

బ్రహ్మాండం అందయామాస శౌర్యవీర్యసముచ్ఛైతః

బ్రహ్మవిష్ణుమహేశాశ్చ తం దృష్ట్వా దీప్తతేజసమ్

పలాయనపరాః సద్యః స్వే స్వేధామి సదా వసన్

తదానీమేవతద్బాహుసంమర్దనవిమూర్ఛితాః

శ్వసితుం చాపి పటవో నా భవన్నాకీనాం గణాః

కేచిత్పాతాలగరేషు చదంబుధీవారిషు

కేబిద్దిగంతకోణేషు కేచిత్యుంజేషు భూభృతామ్

విలీనా భృశవిత్రస్తాసక్తదారసుతస్త్రియః

భ్రష్టాధికారా ఋభవో విచేరుళ్ళన్నవేషకాః

యక్షాన్మహోరగాన్ సిద్ధాన్ సాధ్యాన్ సమరదుర్మదాన్

బ్రహ్మాణం పద్మనాభం చ రుద్రం వజ్రాణమేవ చ

మత్వా తృణాయితాన్ సర్వాంల్లోకాన్భందః శశాస హ

ఇక, ఓలోపాముద్రాపతీ! అగస్త్యా! ఆశ్చర్యకరమైన యీ విషయమును జెప్పెద వినుము. అదియింతవరకెవ్వరికిని జెప్పబడలేదు. నా హృదయము లోనే గూఢముగా నున్నది-78. పూర్వము భండాసురుడను సర్వరాక్షస శిఖామణియొకడు గలడు. అతడు పూర్వము బహువిధ దేవతలను సమర్థుడై స్వేచ్ఛతో శాసించెను-79. ఆతడు భండుడు కుడి భుజముతో విశుక్రుడను దైతేయరాక్షసుని సృష్టించెను. ఆవిశుక్రుడు శ్రక్రునితో సమానుడు. విచారజ్ఞుడు. అట్లే భందుడు యెడమ భుజముతో విషా(షంగుని సృష్టించెను. అతడు దుష్టశేఖరుడు. అట్లే వీరియక్కను ధూమీనియను నామెను సృష్టించెను-81. ఉగ్రవీర్యులైన యా సోదురలతో గూడి సర్వశత్రువులను హతమార్చేను. శౌర్యవీర్యములతో విజృంభించి బ్రహ్మాండమునే బ్రద్దలు గొట్టుచుండెను. ప్రదీప్త తేజస్కుడైన యాతనిని చూచి బ్రహ్మ విష్ణు మహేశ్వరులే పలాయన పరులై (పారిపోయి వెంటనే వారివారి యిండ్ల నెల్లప్పుడు వసింపసాగిరి-83. అప్పుడే భండుని బాహువుల మర్ధింపబడి మూర్చిత దేవగణములు ఊపిరిదీసికొనుటకు గూడ శక్తిలేనివైనవి-84. కొందరు పాతాల గర్భములందును, కొందరు సముద్రజలములలోను, కొందరు దిగంతములకోణములందును కొందరు పర్వతముల గుహలందును మిక్కలి భీతులై భార్యాపుత్ర స్త్రీలను వదలి భ్రష్టాధికారులై దేవతలు మారువేషములలో చరించిరి-86. యుద్ధదుర్మదులైన యక్షులు మహోరగులు-సిద్ధులు సాధ్యులు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, ఇంద్రుడు వీరందరిని భండుడు ఒక గడ్డిపోచక్రింద తలంచి సర్వలోకములను శాసించెను-87.

అథ బండాసురం పంతుం త్రైలోక్యం చాపీ రక్షితుమ్

తృతీయముదభూద్రూపం మహాయాగానలాను

యద్రూపశాలినీమాహుర్లనీతాం పరదేవతామ్

పాశాంకుశధనుర్బాణపరిష్కృతచతుర్భుజామ్

సా దేవీ పరమా శక్తః పరబ్రహ్మస్వరూపిణీ

జఘాన భండదైత్యేంద్రం యుద్ధే యుద్ధవిశారదా

ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే మోహినీప్రాదుర్భావ-మలకాసుర వధో నామ దశమోఽధ్యాయః 10

సమాప్తశ్చోపోద్ఘాతఖండః

 ఆ తరువాత భండాసురుని జంపుటకును ముల్లోకములను రక్షించుటకును ఓ యగస్త్యమునీ! మహాయాగాగ్ని నుండి మూడవ రూపమావిర్భవించెను-88. ఆరూపముతో నొప్పినదానిని పరదేవతయైన లలిత యందురు. ఆమె పాశము-అంకుశము-ధనువు-బాణముఇవి ధరించిన నాలుగు భుజములు గలది-89. ఆదేవి యే పరమదైనశక్తి (పరాశక్తి) పరబ్రహ్మ స్వరూపిణి. యుద్ధవిశారదయైన యాలలితాదేవి యుద్ధమున భండదైత్యుని జంపెను-90.

ఇదిబ్రహ్మాండమహాపురాణమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున మోహినీప్రాదుర్దావ-మలకాసురవధము అను దశమాధ్యాయము. 10

ఉపోద్ఘాత ఖండము సమాప్తము