3 - ప్రతిసర్గ - ప్రపంచ విలయనమ్

సూత ఉవాచ :-

ప్రత్యాహారం ప్రవక్ష్యామీ పరస్యాంతే స్వయంభువః ।

బ్రహ్మణః స్థితికాలే తు క్షీణే తస్మింస్తదా ప్రభోః ॥

యథేదం కురుతే వ్యక్తం సుసూక్ష్మం విశ్వమీశ్వరః ।

అవ్యక్తం గ్రసతే వ్యక్తం ప్రత్యాహారే చ కృత్స్నశః ॥

పురాంతద్వ్యణుకాద్యానాం సంపూర్ణే కల్పసంక్షయే ।

ఉపస్థితే మహాహోరే హ్యప్రత్యక్షే తు కస్యచిత్ ॥

అంతే ద్రుమస్య సంప్రాప్తి పశ్చిమస్య మనోస్తదా ।

అంతే కలియుగే తస్మిన్ క్షీణే సంహార ఉచ్యతే ॥

సంప్రక్షాలే తదా వృత్తే ప్రత్యాహారే హ్యుపస్థితే ।

ప్రత్యాహారే తదా తస్మిన్ భూతతన్మాత్రసంక్షయే ॥

మహదాదేవికారస్య విశేషాంతస్య సంక్షయే ।

స్వభావకారితే తస్మిన్ ప్రవృత్తే ప్రతిసంచరే ॥

ఆపో గ్రసంతి వై పూర్వం భూమేర్గంధాత్మకం గుణమ్ ।

అత్తగంధా తతో భూమికి ప్రయత్వాయ కల్పతే ॥

ప్రణష్ట గంథతన్మాత్రే తోయావస్థా ధరా భవేత్ ।

ఆపస్తదా ప్రవిష్టాస్తు వేగవత్యో మహాస్వనాః ॥

సర్వమాపూరయిత్వేదం తిష్ఠంతి విచరంతి చ ।

అపామపి గణో యస్తు జ్యోతిః ష్వానీయతే రసః ॥

నశ్యంత్యాపస్తదా తత్ర రసతన్మాత్రసంక్షయాత్ ।

తీవ్రతేజోహృతరసా జ్యోతిష్యం ప్రాప్నువంత్యుత ॥

గ్రస్తే చ సలిలే తేజః సర్వతో ముఖమీక్షతే ।

అధాగ్నిః సర్వతో వ్యాప్త ఆదత్తే తజలం తదా ॥

సర్వమాపూర్యతేఽర్చిరిస్తదా జగదిదం శనైః ।

అర్చిర్భిః సంతతే తస్మింస్తిర్యగూఢమ ధస్తతః ॥

జ్యోతిషోఽపి గుణం రూపం వాయురత్తి ప్రకాశకమ్ ।

ప్రతీయతే తదా తస్మినీపార్చిరివ మారుతే ॥

ప్రణష్ట రూపతన్మాత్రే హృతరూపో విభావసుః ।

ఉపశామ్యతి తేజో హి వాయురాధూయతే మహాన్ ॥

నిరాలోకే తదాలోకే వాయు భూతే చ తేజసి ।

తతస్తు మూలమాసాద్య వాయుః సంబంధమాత్మనః ॥

ఊర్థ్వం చాగశ్చ తిర్యక్చ దోధవీతీ దిశో దశ ।

వాయోరపి గుణం స్పర్శమాకాశం గ్రసతే చ తత్ ॥

ప్రశామ్యతి తదా వాయుఃఖం తు తిష్ఠత్యనావృతమ్ ।

అరూపమరసస్పర్శమగంధం న చ మూర్తిమత్ ॥

సర్వమాపూరయచ్ఛబ్దైః సుమహత్తత్ ప్రకాశతే ।

తస్మింబ్లీనే తదా శిష్టమాకాశం శబ్దలక్షణమ్ ॥

సూతుఁడిట్లు చెప్పేను.

స్వయంభువుని యొక్క (బ్రహ్మ యొక్క) పరస్యాంతము - ఒక పగలు, ఒక రాత్రి యొక్క అంతమునందు బ్రహ్మ యొక్క యొక రోజు యొక్క అంత్యమున ప్రత్యాహారమును (ఏలయమును) చేప్పెదను. బ్రహ్మ యొక్క ఉనికి అంత్యమయినప్పటి విలయము చెప్పెదను.

ప్రత్యాహార సంపూర్ణ కాలమున అవ్యక్తము వ్యక్తమును గ్రహించును. విశ్వ మంతయు ఈశ్వరుఁడు వ్యక్తమును సృజించినట్లే సుసూక్ష్మముగా వ్యక్తమయియుండెను. ద్యణుకము (రెండు అణువులు కలది) ద్యణుకముతో మహాఘోరమయిన సర్వ వస్తు వినాశనము ప్రారంభమయి, ‘పర’తో సమాప్తము, కల్పము యొక్క తుదను ఉపస్థితము కాగా, అంతీయకాక యది యెవరీకి కనరాకయుండ, తుది మనువు యొక్క మన్వంతరము యొక్క తుదను, కలియుగాంతమున, సర్వము విలయమొందియుండ, దీనినీ సంహారమందురు. సంప్రక్షాలనము జరుగుట ఆరంభముకాగా, ప్రపంచము యొక్క ప్రత్యాహారము. తప్పనిసరియైన, ఆ విలయన సమయములో భూత తన్మాత్ర సంక్షయమున మహదాది వికారముల యొక్క విశేషాంతము యొక్క సంక్షయమున, ప్రతిసంచరము (పునః విలీనము) తన స్వభావమున (స్వ లక్షణమయిన గంధ గుణము తీసివేయబడిన) భూమి వినాశమునకు అనుకూలముగ (అర్షముగ నుండును. (గంధతస్మోత్రము ప్రణష్టమయిన భూమీ) భూమి యొక్క సూక్ష్మ లక్షణమయిన గంధము వినష్టముకాగా, భూమితోయావస్థమారును. తోయము అప్పుడు అన్నింటిని పరీవ్యాపించి ఇందు అందు సంచరించును. సర్వమును నింపి (యుండును) తోయ లక్షణమయిన రసము (రుచి) జ్యోతితో (అగ్నీ భూతముతో) ఆలీనమగును. కలిసి పోవును.-9. రసతన్మాత్ర సంక్షయము వలన అప్పుడు నీరు (తోయుము) నశించును. రసము తేజస్సుచే అపహృతముయినప్పుడు నీరు జ్యోతిష్యమును పొందును (అగ్ని భూతత్వమును పొందును)-10.

నీరు గ్రహింపబడ, తేజస్సు (అగ్ని భూతము) అన్ని పక్కలకు సర్వతో ముఖముగా తన చుట్టు చూచును. అంత అగ్ని సర్వత్ర వ్యాపించి నీటిని గ్రహించును (గ్రహించి) ఆవిరిగా పరిణమింపఁజేయును.

అంత నీ ప్రపంచము క్రమముగా మెల్లగా అగ్నిచే (జ్వాలలచే) నింపబడును, అంత జ్వాలలన్నికడలకు వ్యాపించును. పైకి, క్రిందికి, ప్రక్కలకు - అంత వాయు (భూతము) రూప లక్షణమును గ్రహించును. (ప్రకాశకమును వాయువు) శీనును. అంతనది దీపార్చివలె మారుతము ప్రతీయమానమగుసు-13. (వాయువు యొక్క దుమారముతో) అగ్ని యొక్క రూపతన్మాత్రము ప్రనష్టమయి అగ్ని హృతరూపుడగును. అగ్ని ఉపశామ్యుఁడగును. వాయువు గొప్పగా వీచును. వాయు భూతమయిన తేజస్సు నిరాలోకముకాగా తేజస్సు వాయువులో నిమజ్జనమయి వాయువుతో తాదాత్యము వహించును. వాయువు తన కారణముతో సంబంధమునొంది, ఊర్ధ్వము, క్రింద, పక్కదశ దిక్కులు నీపును. ఆకాశము వాయు లక్షణమయిన స్పర్శ గుణమును గ్రహించును-16. అప్పుడు వాయువు ప్రశామ్యమయి యుండును. ఆకారము వెనుక అనావృతమయి, ఎట్టి రూపము లేక రంగులేక రుచి లేక, స్పర్శ లేక వాసన లేక యుండును. సర్వమును శబ్దముచే నింపుచు ప్రకాశించును. అది విలీనముకాగా శబ్ద లక్షణమయిన ఆకాశము మిగిలి వెనుక నుండును-18.

శబ్దమాత్రం తదాఽకాశం సర్వమావృత్య తిష్ఠతి ।

తత్ర శబ్దం గుణం తస్య భూతాదిర్ధసతే పునః ॥

భూతేంద్రియేషు యుగపద్భుతాదౌ సంస్థితేషువై ।

అభిమానాత్మకో హ్యేష భూతాదిస్తామనః స్కృతః ॥

భూతాదీర్ఘసతే చాపి మహాన్వె బుద్ధిలక్షణః ।

మహానామ్నా తు విశ్లేయః సంకలో వ్యవసాయకః ॥

బుద్ధిర్మనళ్ళ లింగం చ మహానక్షర ఏవ చ ।

పర్యాయవాచకైః తథైస్తమాహుస్తత్వచింతకాః ॥

సంప్రలీనేషు భూతేషు గుణసామ్యే తతో మహాన్ ।

లీయంతే గుణ సామ్యం తు స్వాత్మన్యేవావతిష్ఠతే ॥

లీయంతే సర్వభూతానాం కారణాని ప్రసంగమే ।

ఇత్యేష సయమశ్చైవ తత్త్వానాం కారడైః సహ ॥

తత్త్వప్రసంయమో హ్యేష స్కృతో హ్యావర్తకో ద్విజాః ।

ధర్మాధర్మా తపో స్థానం శుభం సత్యానృతే తథా ॥

ఊర్థ్వభావో హ్యధోభావః సుఖదుఃఖే ప్రియాప్రియే ।

సర్వమేతత్రపంచస్థం గుణమాత్రాత్మకం స్మృతమ్ ॥

నిరింద్రియాణాం చ తదో జ్ఞానినాం యచ్ఛుభాశుభం ।

ప్రకృత్యం చైవ తత్సర్వం పుణ్యపాపం ప్రతిష్ఠతి ॥

యాత్యవస్థా తు సా చైవ దేహినాం తు నిరుచ్యతే ।

జంతూనాం పాపపుణ్యం తు ప్రకృతాయత్పతిష్ఠితమ్ ॥

అవస్థాస్థాని తాన్యేవ పుణ్యపాపాని ఇంతవః ।

యోజయంతి పునరేహాన్ పరత్వేన తథైవ చ ॥

ధర్మాధర్మాతు జంతూనాం గుణమాత్రాత్మకాపుభో ।

కారణైః స్వైః ప్రదీయేతే కాయత్వేనేహ జంతుభిః ।

సచేతనాః ప్రలీయంతే క్షేత్రజ్ఞాధిష్ఠితా గుణాః ।

సర్లే చ ప్రతిసర్గే చ సంసారే చైవ ఇంతవః ॥

సంయజ్యంతే వియ్యుంతే వారథైః సంచరంతి చ ।

రాజసీ తామసీ చైవ సాత్వి కీ చైవ వృత్తయః ॥

గుణమాత్రాః ప్రవర్తంతే పురుషాధిష్ఠితాస్త్రిథా ।

ఊర్ధ్వదేశాత్మకం సత్వమధోభాగాత్మకం తమః ॥

తయోః ప్రవర్తకం మధ్యే ఇహైవావర్తకం రజః ।

ఇత్యేవం పరివర్తంతే యశ్చేతోగుణాత్మికాః ॥

లోకేషు సర్వభూతానాం తన్న కార్యం విజ్ఞానతా ।

అవిద్యాసత్యయారంభా ఆరభ్యంతే హి మానవైః ॥

ఏతాస్తు గతయస్త్రిస్రః శుభాత్సాపాత్మికాః స్మృతాః ।

తమసోఖిభహజంతుర్యాథాతథ్యం న విందతి ॥

శబ్ద మాత్రమయిన ఆకాశము సర్వమును వ్యాపించియుండును. ఆకాశము యొక్క శబ్ద గుణము మరల భూతముల గ్రసించును-19. అన్ని భూతములు, ఇంద్రియములు ఒకే యొకసారి భూతాదులతో విలీనమగును. ఈ భూతాది అభిమాన లక్షణము గలది (అహంకారము). భూతాది తామస లక్షణమని గ్రహింపవలెను.-20. బుద్దీతో లక్షితమయిన మహత్తు బుద్దీని గ్రహించును. మహత్తు బుద్ధి లక్షణము కలదీ, సత్యమును గూర్చి ఆలోచించువారు, మహత్తును ఈ క్రింది సర్వ నామములతో వ్యవహరింతురు - అవీ - సంకల్పము, (ఆలోచన) వ్యవసాయము (నిశ్చయము) బుద్ధి (వివేకము) మనః (మనస్సు, లింగము. (హేతువు) మహాన్ (గొప్పది) మరియు అక్షరము (అవి నాశనము)-22.

భూతములు గుణ సామ్యములో కలియగా (గుణముల సమానత్వము) మహత్తు కూడ విలీన మగును. అప్పుడు గుణ సామ్యము , (మూడు గుణముల యొక్క సామ్యము) తనలో తానే (అవతీష్ఠతే) ఉండును-23. (ఆత్మలో నుండును). భూతముల యొక్క కారణములన్నియు, ప్రసంయమమునందు విలీనమగును. ఈ విధముగా తత్త్వముల యొక్క ప్రసంయమము (పునః విలీనత్వము) వాని కారణములతో సహా యుండును.-24. ఓ బ్రాహ్మణులారా! ఈ తత్త్వ ప్రసంయమము ఆవర్తకముగా తిరిగి తిరిగి వచ్చునట్టేదిగా) చెప్పబడుచున్నది. ధర్మము, అధర్మము, తపస్సు, జ్ఞానము, శుభము పవిత్రత్వము సత్యానృతములు (సత్యము - అబద్ధములు) ఊర్థ్వ అధోభావస్థితులు, సుఖ దుఃఖములు, ప్రియా ప్రియములు మొదలగునవి సర్వము, ప్రపంచస్థమైనవనియు గుణ లక్షణములనియు జ్ఞాపక ముంచుకొనవలయును 26. జ్ఞానవంతులయొక్క శుభము, అశుభము, జ్ఞానేంద్రియముల తోడి సంబంధములేక - వారి గుణములు పాపములు ప్రకృతిలో నిమజ్జనమగును (విలీనము చెందును)-27. ప్రకృతిలో విలీనమయిన, జంతువుల యొక్క జీవుల యొక్క పాప పుణ్యములు, శరీరము దాల్చిన జీవులకు పుట్టుకతో వచ్చునట్టివియని స్థిరీకరింపఁబడినవి. -28. ఆ మంచి చెడ్డలే (పుణ్య పాపములే) విభిన్న పరిస్థితులలో జీవులను తత్తత్ శరీరములను కలియును. వారు కారణములతో సహా జంతువులతో సహితము - ఫలితపు స్థితి పొందినవేమో అన్నట్లు ఉండును. చైతన్యవంతములయిన గుణములు (సత్త్వాదులు) క్షేత్ర ఖునిచే నధిష్ఠితమై, సర్గమునందు ప్రతి సర్గమునందు సంసారమునందు వానితో నవి సంబంధమును కలిగియో లేక ఒక దానితో నొకటి విడివడియో, వానీ వాని కారణము సంబంధముగా ఇందు నందు సంచరించును.

చైతన్య కారణమయిన వృత్తులు మూడుం వీధములు - అవి రాజసీ, తామసీ, సాత్వకీ వృత్తులు. అవి పురుషాధిష్ఠితమై వ్యవహరించును. అవి గుణమాత్రములు.

ఊర్ధ్వ దేహాత్మకము సత్వము, అధో భాగాత్మకము తమము. ఆ రెంటి యొక్క ప్రవర్తకము యొక్క మధ్య ఇచ్చటనే (ఇహలోకముననే)రజస్సు ఆవర్తకమై యుండును -33. ఈ విధముగానవి చేతో గుణాత్మకములై మూఁడు విధములుగ, సాగును-34.

లోకములందు సర్వ భూతములయందు, మానవులందరు, అవిద్యా ప్రత్యయారంభులయి కార్యము లాచరింపదొడగుదురు. జ్ఞానవంతులు దానిననుసరించరాదు.

ఈ మూడు గతులు పాపాత్మికములుగ అశుభములుగ జ్ఞాపకముంచుకొనవలెను. అంత తమస్సుచే అబీభవులయి ఆ జంతువులు యథార్థ స్థితిని చేరలేవు-36.

అతత్వదర్శనాత్సోఽథ ఏవిధం బధ్యతే తతః ।

కృతేన చ బంధేన తథ్యా వైకారికేణ చ ॥

దక్షిణాభిస్తృతీయేన బద్ధోఽత్యంతం వివర్తతేరే ।

ఇత్యేతేవై త్రయః ప్రోక్తా బంధా హ్యజ్ఞానహేతుకాః ॥

అనిత్యే నిత్యసంజ్ఞా చ దుఃఖే చ సుఖదర్శనమ్ ।

అస్వేస్వమితీ చ జ్ఞానమశుచౌ శుచీనీశ్చయః ॥

యేషామేతే మనోదోషా జ్ఞానదోషా విపర్యయాత్ ।

రాగద్వేషనివృత్తిశ్చ తక జ్ఞానం సముదాహృతమ్ ॥

అజ్ఞానం తమసో మూలం కర్మద్వయఫలం రజ ।

కర్మజస్తు పునర్దేవో మహాదుఃఖం ప్రవర్తతే ॥

శ్రోత్రజా నేత్రజా చైవ త్వగ్జిహ్వాఘణజా తథా ।

పునర్భవకరీ దుఃఖాత్ కర్మణా జాయతే తృషా ॥

సతృష్ణోఽభిమాతో బాలః స్వకృతైః కర్మణః ఫలైః ।

తెలపీడకవజీవస్తతైవ పరివర్తతే ॥

తస్మాన్మూలమనర్థానామజ్ఞానముపదేశ్యతే ।

తం శత్రుమవధార్యైకం జ్ఞానే యత్నం సమాచరేత్ ॥

జ్ఞానాథ్ త్యజతే సర్వం త్యాగాద్బుద్ధిర్వరజ్యతే ।

వైరాగ్యాచ్భుద్ధతే చాపి శుద్ధః సత్వేన ముచ్యతే ॥

అత ఊర్థ్వం ప్రవక్ష్యామి రాగం భూతాపహారిణమ్ ।

అభీష్యంగాయ యోగః స్యాద్విషయేష్వవశాత్మనః ॥

అనిష్టమిష్టమప్రీతిప్రీతీతాపవిషాదనమ్ ।

దుఃఖలాఖేన పాపశ్చ సుఖానుస్మరణం తథా ॥

ఇత్యేష వైషయో రాగః సంభూత్యా కారణం స్మృతః ।

బ్రహ్మాదో స్థావరాంతే వై సంసారే హ్యాదిభౌతికే ॥

అజ్ఞానపూర్వకం తస్మాదజ్ఞానం తు వివర్జయేత్ ।

యస్య చార్జ న ప్రమాణం శిష్టాచారం తథైవ చ ॥

వర్షాశ్రమవిరుదో యః శిష్టశాస్త్రవిరోధకః ।

ఏష మారో హి నిరయే తిర్యగ్యోనౌ చకారణమ ॥

తిర్యగ్యోనిగతం చైవ కారణం తత్రిరుచ్యతే ।

త్రివిధో యాతనాస్థానే తిర్యగ్యోనౌ చ షడ్విధే ॥

కారణే విషయే చైవ ప్రతిఘాతస్తు సర్వశః ।

అనైశ్వర్యం తు తత్సర్వం ప్రతిఘాతాత్మకం స్కృతమ్ ॥

ఇత్యేషా తామసీ వృత్తిర్భూతాదీనాం చతుర్విధా ।

సత్త్వస్థ మాత్రకం చిత్తం యథాసత్వం ప్రదర్శనాత్ ॥

తత్వానాం చ యథాతత్త్వం దృష్ట్వా వై తత్త్వదర్శనాత్ ।

సత్త్వక్షేత్రజ్ఞనానాత్వమేనన్నానార్ధదర్శనమ్ ॥

అతత్త్వ దర్శనము వలన ఆ వ్యక్తి వివిధ బంధములు పొందును అతఁడు ప్రాకృతమైన బంధముచే, వైకారిక బంధముచే తృతీయమైన దక్షిణా బంధము చేతను బద్ధుఁడయి వలయముగా తిరుగుచుండును.

అజ్ఞానముచే కలిగిన ఈ బంధత్రయము చెప్పబడినది. 38

అనిత్య విషయములందు నిత్యవిషయములను భావము దుఃఖ విషయమునందు సుఖదర్శన భావము తనది కానీ విషయమున తనదను భావము, శుచికాని దానియందు శుచిమంతమను నిశ్చయము-ఇవి మనోదోషములు, ఇయ్యవీ జ్ఞాన దోషవిపర్యయమున కలుగును.

రాగద్వేషముల నివృత్తి జ్ఞానమని ఉదాహరింపఁబడినది.

అజ్ఞానము తమోగుణము మూలముగా గలది. రజస్సు కర్మద్వయ కారణము. (శుభాశుభద్వయ కర్మలు). భౌతిక దేహమును మరల పొందుట, కర్మము యొక్క దోషఫలము. అందుమూలమున మహాదుఃఖము ప్రవర్తించును. 41

తృష(కోరిక) శ్రోత్రముల వలన నేత్రముల వలన, చర్మము వలన, జిహ్వవలన, నాసిక వలన పుట్టును. ఇదియే పునర్జన్మమునకు కారణము. ఇయ్యది చేయబడిన కర్మలు కారణముగా కలుగును.        

తృష్ణతో ఆహతుడైన వాడు (కోరిక కలవాఁడు) బాలుఁడుగా చెప్పబడును.

స్వకృతములయిన కార్యముల ఫలితముగా, జీవుఁడు నూనెగానుగు వలే అచ్చటనే గుండ్రముగా తిరుగుచుండును 43 అందుచే అజ్ఞానము అనర్థములకెల్ల మూల కారణము. ఆ యజ్ఞానము శత్రువని యెఱింగి, జ్ఞానము. కొంకు యత్నము నాచరింపవలెను జ్ఞానార్థి (జ్ఞానమును గ్రహించువాడు). సర్వమును త్యజించును. త్యాగము వలన బుద్దీ అభీషంగమునుండి విడివడును. వైరాగ్యము కలుగును వైరాగ్యమువలన పరిశుద్దుఁదగును. శుద్ధుఁడు సత్త్వమునుండి విడిపడును. 45 అందుచే, విశేషముగా చెప్పెదను రాగము(కోరిక) ప్రాణుల నపహరించును తన్ను నిగ్రహించుకొననివాని విషయములలో విషయముతోడి సంబంధము అధికమయిన సంబద్ధత (అభిష్వంగమును) కలిగించును.

అనిష్టము, ఇష్టము, ప్రీతి, ద్వేషము, తాపము, విషాదము, దుఃఖలాభమున తాపము, సుఖమును గూర్చి అనుస్మరించుట-ఈ మొదలగునవి విషయ సంబంధమయిన కోరికలు ఇవియే పునర్జన్మమునకు మర్త్యలోకమున కారణముగా జ్ఞాపకముంచు కొన వలెను. బ్రహ్మమొదలుకొని స్థావరముల తుదివరకు మర్త్యలోకమున సంసార (జననమునకు )మనకు కారణము-48. ఇయ్యదీ అజ్ఞాన పూర్వకముగా గలిగినది అందుచే (1) జ్ఞానమును విసర్జించవలయును.

ఋషులయొక్కపలుకులను ప్రమాణముగా (అనుసరణీయ సూత్రములుగా) నెవ్వడంగీకరింపఁడో, లేదా శిష్టుల ఆచార వ్యవహారములకు విలువనీయండో వర్ణాశ్రమాచారములకు వీరోధకముగా ప్రవర్తించునో అతనికీ నరక మార్గము తప్పదు ఇది తిర్యక్ యోని జననమునకు కారణము-50. పశుపక్ష్యాదులు తిర్యక్కులు. తిర్యక్ యోనీ యందు జననము యాతనా స్థానమనీ బుద్ధిమంతులు చెప్పుదురు. ఈ యాతనలు త్రివిధములు. తిర్యక్ యోని యందలి జననము షడ్విధము. సర్వశః జ్ఞాన కారణమునకు ప్రతిఘాతము (అడ్డంకి)గా ఉన్నది. అనైశ్వర్యము ప్రతీఘాతాత్మకముగా వెలుంగ వలయును (అనైశ్వర్యము భగవచ్చక్తి కాని, నిగ్రహణ శక్తి కాని లేకపోవుట) ఈ విధముగా భూతాదులయందు తామసీవృత్తి నాల్గువిధములు. మనస్సు సత్త్వ గుణము యొక్క బలముపై నాధారపడియుండును ఏలయన మనస్సు సత్వగుణములవలెనే వ్యక్తమగును తత్త్వముల యొక్క తత్త్వ దర్శనమును గ్రహించి (చూచిన తత్త్వము వ్యక్తమగును. తత్త్వముల యనేకత్వము, క్షేత్రజ్ఞుల యొక్కనానాత్వములో-నానార్థ దర్శనమని చెప్పఁబడినది-54.

నానాత్వదర్శనం జ్ఞానం జ్ఞానాద్వై యోగ ఉచ్యతే ।

తేసాబద్ధస్య వై బంథో మోక్షో ముక్తస్య తేన చ ॥

సంసారే వినివృత్తే తు ముక్తి లింగేన ముచ్యతే ।

నిఃసంబంధో హ్యచైతన్యః స్వాత్మన్యేవావతిష్ఠతే ॥

స్వాత్మన్యవస్థితశ్చాపి విరూపాఖ్యేన లిఖ్యతే ।

ఇత్యేతల్లక్షణం ప్రోక్తం సమాసాత్ జ్ఞానమోక్షయోః ॥

స చాపి త్రివిధః ప్రోక్తో మోక్షో వై తత్త్వదర్శిభిః ।

పూర్వం వియోనో జ్ఞానేన ద్వితీయే రాగసంక్షయాత్ ॥

తృష్ణాక్షయాతృతీయస్తు వ్యాఖ్యాతం మోక్షకారణమ్ ।

లింగాభావాత్తు కైవల్యం కైవల్యాత్తు నిరంజనమ్ ॥

నిరంజనత్వాచ్ఛుఛస్తు నేతా న్యో నైవ విద్యతే ।

అత ఊర్థ్వం ప్రవక్ష్యామి వైరాగ్యం దోషదర్శనాత్ ॥

దివ్యే చ మానుషే చైవ విషయే పంచలక్షణే ।

అప్రద్వేషోఽనభిష్వంగః కర్తవ్యో దోషదర్శనాత్ ॥

తాపప్రీతివిషాదానాం కార్యం తు పరివర్ణనమ్ ।

ఏవం వైరాగ్యమాస్థాయ శరీరీ నిర్మమో భవేత్ ॥

అనిత్యమశివం దుఃఖమితి ఐద్యానుచింత్య చ ।

విశుద్ధం కార్యకరణం సత్త్వస్యాతినిషేవయా ॥

పరిపక్వకషాయో ఏ కృత్స్నాన్ దోషాన్ ప్రపశ్యతి ।

తతః ప్రయాణకాలే హి దోషైర్నెమిత్తికిస్తథా ॥

ఊష్మా ప్రకుపితః కాయే తీవ్రవాయుసమీరితః ।

స శరీరముపాశ్రిత్య కృత్స్నాన్ దోషాన్ రుణధీ వై ॥

ప్రాణస్థానాని ఫౌందన్షి ఛిందన్నర్మాణ్యతీత్య చ ।

శైత్యాత్పకుపితో వాయురూర్ధ్వం తూత్రమతే తతః ॥

స చాయం సర్వభూతానాం ప్రాణస్థానేష్వవస్థితః ।

సమాసాత్సంవతే జ్ఞానే సంవృత్తేషు చ కర్మసు ॥

సజీవో నాభ్యధిషానః కర్మభిః స్వైః పురాకృతైః ।

అష్టాంగప్రాణవృత్తిం వైస విచ్యావయతే పునః ॥

శరీరం ప్రజహన్ సోంఽతే నిరుచ్ఛ్వాసన్తతో భవేత్ ।

ఏవం ప్రాజైః పరిత్యక్తి మృత ఇత్యభిధీయతే ॥

యథేహలోకే స్వప్నే తం నీయమానమితస్తతః ।

రంజనం తద్విధేయస్య తే తాన్యో న చ విద్యతే ॥

తృష్ణాక్షయస్తృతీయస్తు వ్యాఖ్యాతం మోక్షలక్షణమ్ ।

శబ్దాద్యే విషయే దోషదృష్టిర్వై పంచలక్షణే ॥

అ ప్రద్వేషోఽనభిష్వంగః ప్రీతితాపవివర్ధనమ్ ।

వైరాగ్యకారణం హ్యేతే ప్రకృతీనాం లయస్య చ ॥

నానార్థ దర్శనము జ్ఞానము. జ్ఞానము వలన యోగమనీ చెప్పబడినది. దానిచే బద్ధుఁడయిన వానికి బంధత్వము. దానినుండి విముక్తుఁడైస్తవానికి మోక్షము.

సంసారము (జనన మృత్యువలయము) నుండి విముక్తుఁడైనవానీకి, లింగమునుండి మోక్షము కలిగి, మోక్షము పొందును. సంబంధమునుండి సంబంధము లేకపోవుటచే అచైతన్యము కలిగియుండుటచే ఆ వ్యక్తి ఆత్మయందే (స్వాత్మయందే) యుండును-56.

స్వాత్మయందలి అవస్థితియందు కూడ, అనేకత్వముచే సత్వముచే విరూపాఖ్యత్వము చెందును (విషయదోషరహితుఁడగును)

ఈ విధముగా సూక్ష్మముగా జ్ఞానమోక్షముల లక్షణము వివరింపఁబడినది 57, తత్త్వ దరులచే మోక్షము త్రివిధముగా చెప్పం బడినది.

మొదటిది అజ్ఞానముచే వియోగము (విడుదల) రెండవదానిలో, మోక్షము రాగ సంక్షయము వలన వస్తువున ప్రేమాను బంధములేక పోవుట) మూడవది -తృష్ణ (ఆన-కోరిక) యొక్క క్షయము మోక్షకారణమని వ్యాఖ్యానింపబడినది. నూక్ష్మ శరీరము లేకపోవుట-లింగాభావము. లింగాభావము వలన కైవల్యము. కైవల్యము వలన నిరంజనము (శుద్ధమూదోషరహితమునైన స్థితి)-59. నీరంజనత్వము వలన శుద్ధత్వము. దానికంటే వేళాక నీయంత (నాయకుఁడు) లేడు. అందుచే, దోష దర్శనము వలన వైరాగ్యమును గూర్చి చెప్పేదను. (వస్తువుల యందలి దోషగుణమును చూచి యూహించి తెలిసికొని వైరాగ్యము వస్తువు నందు(గలుగును) 60.

దివ్యములు మానుషముల విషయములు (పదార్థములు} పంచలక్షణములు కలవి, అప్రద్వేషము (ద్వేషము లేకపోవుట), అనభిష్వంగము (ప్రేమానుషంగము-అనురాగము-లేకపోవుట)-ఈ రేండును దోషదర్శనము వలన చేయవలయును, తపము(దుఃఖము) ప్రీతి, (ఆనందము) విషాదము (విచారము) వీనిని పరిత్యజించవలెను. విసర్జనముచే వైరాగ్యమును పొంది, శరీరి (శరీరము కలవాడు) ఆత్మ నిర్మముడు (దేనియందునభిమానము లేనివాఁడు) అగును-62

వ్యక్తి యిట్లు విషయముల గూర్చి మనస్సులో నాలోచించవలయును-ఈ ప్రపంచమనిత్యము; శుభంకరమైనది కాదు; దుఃఖమయము. ఇట్లు తెలిసికొని, దానిని గూర్చి ఆలోచించీ సత్త్వ గుణమును సేవించుటచే విశుద్ధములైన కార్యముల నాచరించ వలెను. వ్యక్తి విషయాత్మకమైన సబంధ బద్ధత్వమును తన స్వాధీనములో నుంచుకొని, పరిపక్వ దోషగుణ జ్ఞానమున కలిగిన కషాయ గుణభావమును గలిగి సర్వవస్తు గతదోషములను చూచును.

అంత మరణకాలమున (ప్రయాణకాలమున) ఉషా (శరీరపు ఉష్ణము) ప్రకుపితము (అధికము) అయి శరీరమున తీవ్రమయిన వాయువుతో కూడి (ఆవ్యక్తి) శరీరమును ఉపాశ్రయించి సమస్తములైన దోషములను అడ్డగించును-65.

వాయువు ప్రాణస్థానములను ఉద్ఘాటించి మర్మస్థానములను ఛేదించి దాని (అతిక్రమించి) చల్లదనముచే మిక్కిలిగా కోపించి,అంతట పైకి లేచిపోవును-66.

(ఆ వాయువు) అయ్యది సర్వప్రాణులయొక్క ప్రాణస్థానముల యందుండును. అప్పుడా జ్ఞానము సంగ్రహముగా ఆకృతమై యుండ, కార్యములు (కర్మలు) సంవృత్తములు అగును. తననాభి అధిష్టానముగాగల జీవి ఇతః పూర్వమాచరించిన కర్మలచే ప్రేరేపించబడును. వాయువు, అష్టాంగముల నుండి ప్రాణవృత్తిని కలత పరచి కార్యములను ఛేదించును. తుదీనీ, శరీరమును పరిత్యజించి ఊపిరిని పీల్చుటకు అడ్డుపడును. అప్పుడు నిరుచ్ఛ్వాసము కలుగును ఈ విధముగా ప్రాణములచే పరిత్యక్తుడై మృతుండని పిలువఁబడును-69.

ఈ లోకమున స్వప్న సమయములో నిద్రపోవు వ్యక్తి ఇటు అటు తీసికొనిపోవునట్లు చూచుచున్నాము. దానికి (స్వప్నమునకు)లోబడిన వానికి రంజనముగానే ప్రీతికరముగా ఉండును. కాని అందు ఒకచోట నుండి వేక చోటునకు తీసికొని పోవు వ్యక్తి (నేత) లేండు-70. మూఁడవదియైన తృష్ణాక్షయము, మోక్షలక్షణమని వ్యాఖ్యానము చేయఁబడినది. శాబాదులయందు విషయములయందు దోషదృష్టిని గలిగియుండుట పంచలక్షణము, ద్వేషము లేకుండుట, అధికమయిన అనుషంగము లేకపోవుట, దుఃఖము ప్రీతీని పరిత్యజించుట,అనునది. ఈ విధములయిన ప్రకృతియొక్క లయము (వినాశనము-పరీత్యాగము) ప్రపంచముతో సబంధించినట్టే ప్రధాన విషయములివ్వీ-72.

అష్టా ప్రకృతయో జ్ఞేయాః పూర్వోక్తా వై యధాక్రమమ్ ।

అవ్యక్తాద్యాస్తు విజ్ఞేయా భూతాంతాః ప్రకృతేర్భవాః ॥

వర్ణాశ్రమాచారయుక్తః శిష్ట శాస్త్రావిరోధినః ।

వర్ణాశ్రమాణాం ధర్మోఽయం దేవస్థానేషు కారణమ్ ॥

బ్రహ్మాదీని పిశాచాంతాన్యష్టౌ స్థానాని దేవతా ।

ఐశ్వర్యమణిమాద్యం హి కారణం హ్యాష్టలక్షణమ్ ॥

నిమిత్తమప్రతీఘాతే దృష్టీ శబ్దాదిలక్షణే ।

అష్టావేతాని రూపాణి ప్రాకృతాని యథాక్రమమ్ ॥

క్షేత్రజేష్వనుసజంతే గుణమాత్రాత్మకాని తు ।

ప్రావృట్కాలే పృథజ్మేఘం పంశ్యంతీహ సచక్షుషః ॥

పశ్యంత్యేవంవిధాః సిద్ధాః జీవం దివ్యేన చక్షుషా ।

ఖాదతశ్చాన్నపానాని యోనీః ప్రవిశతస్తథా ॥

తిర్యగూర్ధ్యమధస్తాచ్చ ధావతోఽపి యథాక్రమమ్ ।

జీవః ప్రాణస్తథా భంగం కరణం చ చతుష్టయమ్ ॥

పర్యాయవాచకైః శభైరేకార్థాః సోభిలష్యతే ।

వ్యక్తావ్యక్తప్రమాణోఽయం స వై భుంక్తీ తు కృత్స్నశః ॥

అవ్యక్తానుగ్రహాంతర చ క్షేత్రజ్ఞాధిష్ఠితం చ యత్ ।

ఏవం జ్ఞాత్వా శుచిర్భూత్వా జ్ఞానాద్వై వీప్రముచ్యతే ॥

నష్టం చైవ యధా తత్త్వం తత్త్వానాం తత్త్వదర్శనే ।

యథేష్టం పరినిర్యాతి భిన్నే దేహే సునిరతే ॥

భిద్యతే కరణం చాపీ హ్యావ్యక్తజ్ఞానినస్తతః ।

ముక్తో గుణశరీరేణ ప్రాణాద్యేన తు సర్వశః ॥

నాన్యచ్ఛరీరమాదత్తే దగ్గే బీజే యధాంకురః ।

జ్ఞానీ చ సర్వసంసారావిజ్ఞశారీరమానసః ॥

జ్ఞానాచ్చతుర్దశాబుద్ధః ప్రకృతిష్ణో నివర్తతే ।

ప్రకృతిం సత్యమిత్యాహుర్వికారోఽసృతముచ్యతే ॥

అసద్భావోఽనృతం జేయం సద్భావః సత్యముచ్యతే ।

అనామరూపం క్షేత్రజ్ఞనామరూపం ప్రచక్షతే ॥

యస్మాత్ క్షేత్రం విజానాతి తస్మాతిక్షేత్రజ్ఞ ఉచ్యతే ।

క్షేత్రం ప్రత్యయతే యస్మాత్ క్షేత్రజ్ఞః శుభ ఉచ్యతే ॥

క్షేత్రజ్ఞః స్మర్యతే తస్మాత్ క్షేత్రం తజిజైర్విభాష్యతే ।

క్షేత్రం త్వత్పత్యయం దృష్టం క్షేత్రజ్ఞః ప్రత్యయః సదా ॥

క్షపణాత్కారణాచ్చైవ క్షతత్రాణాత్తథైవ చ ।

భోజ్యత్వవిషయత్వాచ్చ క్షేత్రం క్షేత్రవిదో విదుః ॥

పూర్వమందుచెప్పినట్లు అష్ట ప్రకృతులను తెలియవలయును. అవి అవ్యక్తముతో నారంభమయినవి. భూతములలో సమాప్తమొందినవి. ప్రకృతినుండి ఆవిర్భవించినవి.

శాస్త్ర నియములతో విరోధించని వాఁడు శిష్టుఁడు. అతఁడు వర్ణాచారయుక్తుడు, వర్ణాశ్రమము ధర్మానుష్టానము దేవతాస్థాన ప్రాప్తికి కారణము-74. బ్రహ్మతో నారంభించి పిశాచాదులతో నంతమొందునవి దేవతల యొక్క అష్టస్థానములు ఈ అష్టలక్షణములకు కారణము అణిమాది యెనీమీదీయైన శక్తులు కారణము-75.

అణిమాదులు దేవతా సంబంధమైన అష్టసిద్దులు, అయ్యవి శబ్దాది లక్షణమందు అప్రతిహతమయి నిమిత్తమునందు చూడబడును. (నిమిత్తము కారణము). ప్రకృతిజములయిన యీ అష్టరూపములు క్షేత్రజ్ఞునకు అను సంధింపబడినవి. గుణములలో నివి క్రమముగా నుండును.

వర్షాకాలమున కనులున్నవారు మేఘమును ప్రత్యేకముగా చూచేదరు. అట్లే, సిద్ధులు తమ దీవనేత్రములతో జీపులను వారు ఆహారము తినునప్పుడు త్రాగునప్పుడు భిన్న భిన్న యోనులను ప్రవేశించునప్పుడు ఒక క్రమ పద్ధతిలో పరుగేత్తుచున్నప్పుడు క్రిందకు, ప్రక్కలకు పరుగెత్తుచున్నప్పుడును చూడగలరు. జీవము, ప్రాణము, లింగము, కరణము అను నాలుగు పర్యాయ పదములతో ప్రత్యేకముగా ఏకార్థ పదములతో వ్యక్తము చేయబడును. ఇది వ్యక్తావ్యక్త ప్రమాణముల లక్షణము. జీవుండు అవ్యక్తముతో అనుగ్రహముతో సమాప్తమై సర్వమును సంపూర్ణముగా అనుభవించును అయ్యది క్షేత్రజ్ఞునిచే అధిష్ఠితము ఈ విధముగా తెలిసికొని శుచియై, జ్ఞానము వలన విముక్తుఁడగును-81.

సత్యము గ్రహింపఁబడిన నష్టమయిన తత్త్వము స్పష్టముగా తెలియును కాని, బ్రతికియుండని భిన్నమయిన శరీరములయందు, ప్రత్యేకజీవుఁడుకరణము అవ్యక్తము నుండి జ్ఞానులనుండి భేదించును. గుణముల రూపమునను, ప్రాణరూపమునను, ఉన్న శరీరమునుండి పూర్తిగా విముక్తిచెందినవాడు లోపల గింజ దగ్డమయి వీభ్రష్టమయిన దానినుండి మొలక రానియట్లు, ఎన్నడును వేరొక శరీరమును ధరింపడు-83. జ్ఞానయుక్తుఁడయిన జ్ఞాని, సర్వవిశ్వముతో సంబంధములేని మనస్సు శరీరము కలిగియుండును-84. ప్రకృతిని సత్యమని చెప్పుదురు. వికారము అనృతమని చెప్పుదురు. అసధ్భవమును అనృతము గాను సత్యమును తెలిసికొనవలెను అనామరూపుడయిన క్షేత్రజ్ఞునకు నామ రూపములు చెప్పుదురు-86.

అందుచే క్షేత్రమును తెలిసికొనును. తత్కారణమయిన క్షేత్రజ్ఞుండని చెప్పబడును. క్షేత్రజ్ఞుఁడు క్షేత్రమునకు పోవువాడగుట అయ్యది శుభము (మంగళకరమని) చెప్పుదురు - 87.

క్షేత్రజ్ఞుఁడు స్మరింపఁబడును అందుచే క్షేత్ర మెరిగిన వారు దానీనీ క్షేత్రమందురు క్షేత్రమును చూచెదరు. క్షేత్రము తత్పత్యయము చూడబడినది. క్షేత్రజ్ఞుడు ప్రత్యయములో నెల్లప్పుడుండును (ప్రత్యయము తెలివి, ఆత్మజ్ఞానము) .

క్షేత్రమును తెలిసినవారు దానిని క్షేత్రముగానెలుంగుదురు. కారణము దాని యొక్క అపవిత్రత్వము నాశనము క్షతత్రాణము వలన భోజ్యత్వము వలన, విషయత్వము వలన-89.

మహాద్యాద్యం విశేషాంతం సవైరూప్యం విచక్షణమ ।

వికారలక్షణం తద్వై సోఽక్షరః క్షరమేతి చ ॥

తమేవానువికారం తు యస్మాద్వై క్షరతే పునః ।

తస్మాచ్చ కారణాచ్చైవ క్షరమిత్యభిధీయతే ॥

సంసారే నరకేభ్యశ్చ త్రాయతే పురుషం చ యత్ ।

దుఃఖత్రాణాత్ పునశ్చాపి క్షేత్రమిత్యభిధీయతే ॥

సుఖదుఃఖమహంభావాదోజ్యమిత్యభిధీయతే ।

ఆచేతనత్వాద్వీషయస్తద్విధర్మా విభుః స్మృతః ॥

న క్షీయతే న క్షరతి వికారప్రసృతం తు తత్ ।

అక్షరం తేన వా ప్యక్రమక్షీణర్వాత థైవ చ ॥

యస్మాత్పుర్యనుశేతే చ తస్మాత్పురుష ఉచ్యతే ।

పురప్రత్యయికోయస్మాత్ పురుషేత్యభిధీయతే ॥

పురుషం కథయస్వాధ కథతో జెర్వీభాష్యతే ।

శుద్దో నిరంజనోభాసో జ్ఞాతా జ్ఞానవివర్జితః ॥

అస్తి నొస్తీతి సోఽన్యో వా బద్ధో ముక్తాః గతః స్థితః ।

నైరేతుకాత్వనిర్దేశ్యాదహస్తస్మిన్న విద్యతే ॥

శుద్ధత్వాన్న తు దృశ్యో వై ద్రష్టత్వాల్ సమదర్శనః ।

ఆత్మప్రత్యయకారిత్వాదన్యూనం వాప్యహేతుకమ్ ॥

భావగ్రాహ్యమనుమానాచ్చింతయన్న ప్రముహ్యతే ।

యదా పశ్యతి జ్ఞాతారం శాంతార్థం దర్శనాత్మకమ్ ॥

దృశ్యాదృశ్యేషు నిర్దేశ్యం తదా తద్దుర్ధరం వరమ్ ।

విజ్ఞాతా న చ దృశ్యత పృథక్ష్వేనేహా సర్వశః ॥

స్వేసాత్మనా తథాత్మానం కారణాత్మా నియచ్ఛతి ।

ప్రకృతే కారణే తత్ర స్వాత్మన్యేవోపతిష్ఠతి ॥

అస్తీనాస్తితి సోఽన్యో వా ఇహాముత్రేతి వా పునః ।

ఏకత్వం వా పృథక్వం వా క్షేత్రజ్ఞః పురుష్కోఽపీ వా ॥

ఆత్మావా స నిరాత్మా వా చేతనోఽచేత నోపి వా ।

కర్తావా సోఽప్యకర్తా వా భోక్తా వా భోజ్యమేవ చ ॥

యద్దత్వా న నివర్తంతే క్షేత్రజ్ఞం తు నిరంజనమ్ ।

అవాచ్యం తదనాఖ్యా నాదగ్రాహ్యం వాదహేతుభిః ॥

అప్రతర్క్య మచింత్యత్వాదవార్యత్వాచ్చ సర్వశః ।

సాలప్యం వచసా తత్త్వమప్రాప్యం మనసా సహ ॥

క్షేత్రజ్ఞే నిర్గుణీ శుద్ధీ శాంతే క్షీణే నిరంజనే ।

వ్యపేతసుఖదుఃఖే చ నిరుద్ధే శాంతిమాగ తే ॥

‘మహత్తు’తో ఆరంభించు సర్వ వస్తువులు, విశేషముతో అంతము నొందునట్టివి, విభిన్నమయిన రూపమును. వహించును. అవి వికార లక్షణముల గలిగినవి. అందుచేనని విలక్షణములు. అందుచే, అక్షరము (నాశనము చెందనిది) క్షరమును (నాశనము చెందుదానిని) సమీపించును-90. అదీ వికారముతో సహితము నశించును గాన, “క్షర”మని పిలువబడినది-91.

దీనిని క్షేత్రమందురు, కారణము అయ్యది పురుషుని ప్రపంచ స్థితి నుండి నరకము నుండి రక్షించుటచే అయ్యది దుఃఖము నుండి రక్షించునదగుట వలన కూడ క్షేత్రమని పిలువబడును-92. సుఖ దుఃఖములు అహంభావము వలన భోజ్యమువలన (విరుద్ద ధర్మములచే) అయ్యది ‘విభువ’ని స్మరింపబడుచున్నది.-93. అయ్యది అక్షరమని కూడ నీ దిగువ కారణములచే చెప్పఁబడును. నక్షరతే (వ్యర్థము క్షయము కాదు) నక్షరతి - అయ్యది నశింపదు. అయ్యది వికారము నుండి వ్యాపింపదు. అయ్యది తగ్గిపోదు (క్షీణత్వమొందదు)-94. పుర ప్రత్యయికము వలన ‘పురుష’ అని చెప్పుదురు. (పురుషుఁడన శరీరము నందున్న వాఁడు) శరీరము ఆత్మకు స్థానము-95. ఆతండు శుద్ధుఁడు. అనిరంజనుఁడై ప్రకాశించును. ఆతఁడు జ్ఞాత తెలిసినవాఁడు). అతఁడు అజ్ఞానము నుండి వివర్జితుఁడు. అస్తి (ఉన్నాఁడు) అన్న దాని కంటే నతడు వేరయిన వాఁడు. నాస్తి లేనివాఁడు, బద్ధుఁడు ముక్తుఁడు గతి కలిగినవాఁడు, స్థితః (ఉన్నవాఁడు). ఆతఁడు నిర్ణేతుకుడుగాన ఎట్టి హేతువు (కారణము) లేనివాడగుట నిర్దేశింపఁబడ శక్తుఁడుగాడు. ఆతనికి పాపము లేదు. -97.

శుద్ధత్వము వలన (పవిత్రత్వమువలన) నతఁడు దృశ్యుడు కాఁడు. అతడు ద్రష్ట స్థితిలో నుండుట వలన ద్రష్టు ఆతఁడు సమదర్శనుఁడు, ఆతని యొక్క బుద్ధి వలన (ఆత్మ జ్ఞానము వలన) ఆతఁడు. న్యూనుఁడుకాడు. అతఁడు ఎట్టి కారణములేని వాఁడు. ప్రమోహము చెందడు.

జ్ఞానిని దర్శనాత్మకముగా శాంతార్థము చూచినపుడు దృశ్యా దృశ్యముల నిర్దేశ్యము దుష్కరము. దానిని ధరించుట (వహించుట) కష్టము. అదీ అత్యుత్తమము. జ్ఞాత ప్రత్యేకముగా దర్శింపబడడు (అతడు సర్వత్ర నుండుట వలన)-100. కారణము యొక్క లక్షణము శక్తి యొక్క సామర్థ్యముతో నున్న ద్రష్ట తన ఆత్మ శక్తిచే నియమించుకొనును, ఆతఁడు. తన యాత్మయందే యుండును (కారణమునందు - ప్రకృతియందు)-101. ఆత్మ, ఉన్నదా, లేదా అది వేడొకటియా, బ్రతికి ఉన్నదా, లేదా, బ్రతికి లేదా, అయ్యది ఇచ్చట నున్నదా, వేడొక చోటనా, అది ఒక్కటియా, వేరయినదా, అది క్షేత్రజ్ఞుండా!

నిరాత్మకే పునస్తస్మిన్వాచ్యావాచ్యం న విద్యతే ఏతౌ సంహారవిస్తారా వ్యక్తావ్యక్తి

తతః పునః ॥

సృజ్యతే గ్రసతే చైవ వ్యక్తీ పర్యవతిష్ఠతే ।

క్షేత్రజ్ఞాధిష్ఠితం సర్వం పునః సర్గే ప్రవర్తతే ॥

అధిష్టానం ప్రపద్యేత తస్యాంతే బుద్ధి పూర్వకమ్ ॥

సాధర్యవైధర్మకృతః సంయోగే విదితస్తయోః ॥

అనాదిమాంశ్చ సంయోగో మహాపురుషజః స్మృతః ॥

యావచ్చ సర్గప్రతిసర్గకాలస్తావజ్జగత్తిష్ఠతి సంనిరుధ్య ।

పూర్వం హి తస్యైవ చ బుద్ధిపూర్వం ప్రవర్తతే తత్పురుషార్థమేవ ॥

ఏషా నిసర్గప్రతిసర్గపూర్వా ప్రాధానికీ చేశ్వరకాగితా వా ।

అనాద్యనంతా హ్యభిమానపూర్వకమ్ విత్రాసయంతీ జగదుభ్యుపైతి ॥

ఇత్యేష ప్రాకృతః సర్గస్తృతీయో హేతులక్షణః ।

ఉక్తో హ్యస్మింస్తదాత్యంతం కాలం జ్ఞాత్వా ప్రముచ్యతే ॥

ఇత్యేష ప్రతిసర్గో వస్తివిధః కీర్తితో మయా ।

విస్తరేణానుపూర్వ్యా చ భూయః కిం వర్తయామ్యహమ్ ॥

ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే ఉత్తరభాగే చతుర్థ ఉపసంహారపాదే ప్రతిసర్గో నామతృతీయోఽధ్యాయః ॥

లేక పురుషుఢా, అయ్యది ఆత్మయా లేక ఆత్మలేనిదా, అది జడమా లేక ప్రాణిమంతమా? అయ్యది కర్తయా చేయు నదియా లేక కార్యములు చేయనదియా, లేక అది అనుభవించు నట్టిదియా, లేక ఇతరులచే అనుభవింపబడునట్టిదియా, దానినీ పొందిన తరువాత (భోజ్యమా, భోక్తయా) దేనినిజేరి (యధత్వా) తిరిగిరారు, (నని వర్తంతే) క్షేత్రజ్ఞుండు - నిరంజనుఁడు - అయ్యది పదములచే వచింపబడ శక్యము కానిది (అవాచ్యము) వర్ణించుటకు శక్యము కానిది.

అయ్యది హేతు వాదులచే గ్రహింపబడరానిది. అప్రతర్యము (తర్కింపబడరానిది) అచింత్యము, అవార్యము, వచనములచే ఆలపింపబడరానిది సత్యము యథార్థము పదములచే వ్యక్తీకరింపబడరానిది అదీ మనస్సు గ్రహింపఁబడదగినదియు కాదు -105. క్షేత్రజ్ఞుండు మొ॥ పదములచే వ్యక్తము చేయబడగలపోడు కాఁడు, అదీ నీర్గుణము, శుద్దము, శాంతము, అనిరంజనము, మరియు అక్షయము. అయ్యది సుఖదుఃఖములు లేనిదీ. అదీ నియమితము. శాంతము. అయ్యది నిరాత్మకము వాచ్యావాచ్యములుండవు. అయ్యవి సంహారములు - విస్తారములు. వ్యక్తా వ్యక్తములు, తరువాత అవి సృజింపఁబడును. గ్రహీంపఁబడును. వ్యక్తమై యుండును.

క్షేత్రజ్ఞునిచే అధిష్టితమై సర్వము సర్గము నొందును -108. దాని యంత్యమున బుద్ధి పూర్వకముగా నదీ అధిష్టానమును చేరును సాధర్మ వైధర్మములచే పరస్పర సంయోగ కృతము పురుషుని యొక్క సంయోగము ఆరంభ శూన్యమనీ ఘోషింపఁబడినదీ-110.

ఎంత కాలము సర్గ ప్రతి సర్గలుండునో, అంతవరకు జగత్తు స్థితిమంతమై యుండును. మొట్టమొదట సంనిరుధ్య పురుషార్థము బుద్ధి పూర్వకముగా సర్వము జరుగును.

ఈ ప్రకృతి సృష్టికి నాశనమునకు కూడా కారణము. లేదా ఇది ఈశ్వరునిచే జరుగును. దీనికి మొదలుగాని, వినాశనము (అంత్యము) కాని లేదు ఇది ప్రపంచమును (జగత్తును) అభిమాన పూర్వకముగా భయపెట్టుచు (విత్రాసయంతీ) చేరును -111.

ఈ విధముగా ప్రకృతి యొక్క తృతీయ సర్గము (సృష్టి) కారణ లక్షణమై, వివరిపఁబడినది. అత్యంతమైన కాలమునెంగి వ్యక్తి విముక్తుఁడగును. ఈ విధముగా మూడు విధములైన ప్రతి సర్గము యొక్క విలీనము విస్తరముగా క్రమముగా చెప్పబడినది. ఇంక దేనినీ నేను చెప్పనారంభింపవలయును.

మూడవ సర్గ సమాప్తము.