48 - సగరుని చరిత్ర - సగరప్రతిజ్ఞాపాలనము

 జైమినిరువాచ :-

గతే తస్మిన్ మునివరే సగరో రాజసత్తమః

అయోధ్యాయామధివసన్ పాలయామాస మేదినీమ్

సర్వసంపర్గణోపేతః సర్వధర్మార్థతత్వవీతీ

వయసైవ స బాలో భూత్కర్మణా వృద్ధసంమతః

 తథాపి న దీవా భుంక్తే శేతే వా నీశీ సంస్మరన్

సుదీర్ఘం నీశ్వసిత్యుష్ణముద్విగ్నహృదయోనీశమ్

శ్రుత్వా రాజా స్వరాజ్యం నిజగురుమవజిత్యారిభిః సంగృహీతం

 మాత్రా సార్ధం ప్రయాంతం వనమతీగహనం స్వర్గతం తం చ తస్మిన్

 శోకావిష్టః సరోషం సకలరీపుకులోచ్ఛిత్తయే సత్పతిజ్ఞ

శ్చక్రేసద్యః ప్రతిజ్ఞాం పరిభవమనలం సోడుమిక్ష్వాకువంశ్యః

స కదాచిన్మహీపాలః కృతకౌతుకమంగలః

రిపుం జేతుం మనశ్చక్రే దిశశ్చ సకలాః క్రమాత్

అనేకరథసాహసైరజాశ్వరథసైనికైః

 సర్వతః సంవృతో రాజా నిశ్చక్రామ పురోత్తమాత్

శత్రూన్ హంతుం ప్రతస్థే నిజబలనివహేనోత్పతద్మిస్తురంగైర్నాసత్వోర్మిజాలాకులజలనిధినిథేనాథ షాడంగికేన

 మత్తైర్మాతంగయూధైః సకులగిరికులేనైవ భూమండలేన శ్వేతచ్ఛత్రధ్వజొఫైరపి శశిసుకరాభాతఖేనైవ సార్ధమ్

తస్యాగ్రేసరసైన్యయూఢచరణప్రక్షుర్ణాశైలోచ్చయక్షాదాపూరితనిమ్నభాగమవనీపాలస్య సంయాస్యతః

ప్రత్యేకం చతురంగ, సైన్యనికరప్రక్షోదసంభూతభూరేణుప్రావృతిరుత్స్థలీ సమభవద్భూవిస్తు తత్రానిశమ్

 నీఘ్నన్జప్తాననేకాన్ ద్విపతురగరథవ్యూహస్తంభిన్నవీరాన్సద్యః శోభాం దధానో సురనికరచమూర్నీఘ్నతశ్చంద్రమౌళిః

 దూరాదేవాభిశంసన్నరినగరనిరోధేషు కర్మాభిషంగే తేషాం శీఘ్రాపయానక్షణమభిదిశతి ప్రాణిధైర్యం విధత్తే

విజిగీషుర్దిశో రాజా రాజ్ఞో యస్యాభియాస్యతి

విషయం సనృపస్తస్య సద్యః ప్రణతిమేష్యతి విజిత్యనృపతీన్ సర్వాన్ కృత్వా చ స్వపదానుగాన్

జైమిని ఇట్లు పలికెను.

మునివరుఁడు వసిష్ఠుఁడు తన యాశ్రమమునకు వెడలెను. రాజసత్తముఁడు సగరుఁడయోధ్య యందు వసించెను. భూమిని పరిపాలించెను. అతఁడు సర్వ సంపద్ధడో పేతుఁడు. సర్వధర్మార్థముల నేజింగినవాఁడు. ఆతఁడు వయస్సుచే బాలుఁడు, కానీ అతని కార్యకలాపముల యందు పెద్దల అంగీకారమును బడసెను. అయినను నతఁడు హృదయముననుద్విగ్నుఁడు. ఆతఁడు పగలు భోజనమారింపఁడు. రాత్రులయందు నిద్రింపఁడు. ఏదియో స్మరించుచు సుదీర్ఘముగా విశ్వసించుచుండును. ‘తన తండ్రిని జయించి శత్రువులు రాజ్యమును గ్రహించిరి. తండ్రి తల్లితో కూడికొని అతీగహనమయిన అరణ్యమునకు పోయెను. ఆయరణ్యమున తండ్రి మరణించెను’, అని విని, సగరుఁడు శోకావిష్ణుం డయ్యెను. అత్యంత రోషముచే సకల శత్రుకుల వినాశనము చేయుటకు ప్రతిజ్ఞ చేసెను. ఇప్పుడో ఇక్ష్వాకువంశ్యుఁడయిన రాజు అనల తుల్యమయిన పరిభవమును భరింప లేకుండెను. ఒకప్పుడు రాజు కౌతుక మంగళక్రియ నాచరించి, శత్రువును జయించుటకు సకల దిక్కులను సక్రమముగా జయించుటకు మనస్సులో నిశ్చయించుకొనెను. ఇంక రాజు అనేక సహస్ర సంఖ్య గల రథములతో, రథాశ్వ గజ సైనికులతో సర్వతః సంవృతుఁ డై పురోత్తమము నుండి బయలువెడలెను. - (6) శత్రువులను చంపుటకు నీజ ల నివహమయిన షడంగసైన్యముతో రాజు బయలు దేరెను, రథగజతురగ పదాతులు చతురంగబలములు సహజమే. వానితోడనేకాక ఆహార పదార్థముల బాధ్యతలు వహించువారు, వినోద కార్యరంగాదులయిన నృత్యగీతముల నిర్వహించువారు మొత్తము షడంగబలములు. ఆ షడ్విధ బలగములతో గూడిన సైన్యము మహా సముద్రమువలె కన్పించేను, సేనా సముద్రము వివిధ సైనికులనుజలజంతువులచే సంక్షోభించి యుండెను. అంతియేకాక కెరటముల బోలు అశ్వదళములునుండెను; తోడనేతెంచు మత్త మాతంగ యూధములతో రాజు తనతో ప్రయాణించు కుల పర్వతములతో కదలివచ్చు చున్నట్లుండెను. తోడవచ్చు శ్వేతచ్ఛత్ర ధ్వజాదుల ధవళాతిదవళళాకాంతులతో రాజు ఆకాశము తనతో శశికిరణ జలధావళ్యముతో సంచరించు చున్నట్లుండెను. (7) రాజు ప్రయాణీంచుచుండ, ముందుగా ప్రయాణించు చతురంగ సైనీక నీకరముచే సంక్షణ భూమీ నుండి రేగిన భూరేణువులు పల్లపు స్థలములో నిండి వానిని సమభూములుగ చేయుచుండెను. అట్లు నిండి పెరిగిన నేల చుట్టు పెట్టిన కంచెవలే నయ్యెను. (సైన్యపదక్షుణ్ణమయిన రేగిన భూరేణువులచే) (8) రాజు మదించిన అనేక ద్వీపములను తురగములను చంపెను. రథ వ్యూహములు సంభిన్నములు వీరులు మడిసిరి. ఆ సమయమున. అసురసమూహమును హతమార్చిన చంద్రమౌళి శోభనాతఁడు వహించెను. శత్రువుల నగరములను చుట్టుముట్టినప్పుడు రాజు దూరము నుండియే శత్రు సైనికులు ఓడీనచో చేయవలసిన విధులను ప్రకటించెను. శత్రు సైనికులు తొలగిపోవుటకు అవకాశమిచ్చి వారి ప్రాణ రక్షణకు నభయ మొసంగెను. (9)

సంకేతగామినః కాంశ్చితృత్వా రాజ్యే న్యవర్తత

 ఏవం స విసరన్ దిక్షు దక్షిణాభిముఖో నృపః

స్మరన్ పూర్వకృతం వైరం హైహయానభ్యవర్తత

తతస్తస్య నృపైః సార్ధం సమగ్రరథకుంజరైః

బభూవ హైహయిర్వీరైః సంగ్రామో రోమహర్షణః

రాజ్ఞాం యత్ర సహస్రాణి స ఐలాని మహాహవే

నిజఘాన మహాబాహుః సంక్రుద్దః కోసలేశ్వరః

 జిత్వా హైహయభూపాలాన్ భంజ్ఞా దగ్ద్వ చ తత్పురీమ్

నీఃశేషశూన్యామకరోద్వైధాంతకరణీ నృపః

 సమగ్రబలసంమర్టప్రమృష్టాశేషభూతలః

హైహయానామశేషం తు చక్రే రాజ్యం రజఃసమమ్

 రాజ్యం పురీం చోపహాయ భ్రషైశ్వర్యా హతత్వషః

రాజానో హతభూయిషా వ్యద్రవంత సమంతః

అభిద్రుత్య నృపాంస్తాంస్తు ద్రవమానాన్మహీపతిః

జఘాన సానుగాస్మత్తః ప్రజాః క్రుద్ధ ఇవాంతకః

తతస్తాన్పతి సక్రోధః సగరః సమరే రిహా

ముమోచాస్త్రం మహారౌద్రం భార్గవం రిపులీషణమ్

 తేనోత్సృషాతిరౌద్రత్రిభువనభయదప్రస్ఫురద్భార్గవాస్త్ర

 జ్వాలాదందహ్య మానావశతనుతతయస్తే నృపాః సద్యఏవ

 వ్యాయస్రావృత్తధూమోద్దమపటలతమోముష్టదృష్టిప్రసారా

భ్రేముర్భూషృష్ణలోఠద్బహులతమరజోగూఢమాత్రా ముహూర్తమ్

ఆగ్నేయాస్త్రప్రతాపప్రతిహతగతయోఃదృష్టమార్గాః సమంతాద్భూపాలా నష్టసంఘాః పరవశతనవో వ్యాకులీభూతచిత్తాః

 భీతాః సంత్యక్తవస్త్రాయుధకవచవిభూషాధికా ముక్తకేశావిస్పషోన్మత్త భావాన్ భృశతరమనుకుర్వంత్యగ్రతః శాత్రవానామ్

విజిత్య హైహయాన్ సర్వాన్ సమరే సగరో బలీ

సంక్షుబ్దసాగరాకారః కాంభోజానభ్యవర్తత

రాజు నాలుగు దిక్కులను జయింప నభిలషించెను. ఆతడేదేశపు రాజునుముట్టడించెనో యతఁడు ఆతనికి వెంటనే వంగి నమస్కరించెను. ఆ రాజులను జయించి వారలను తన యనుచరులననుసరించి రా నాజ్ఞాపించెను. కొందరను సంకేతగాములనుగాజేసి వారలను వారి రాజ్యములకు మరలించెను. అతఁడీ విధముగా సర్వదిక్కులకు ప్రసరించెను. ఇంక దక్షిణాభిముఖుఁడైన వెంటనే, పూర్వకృతమును స్మరించి, వైరము పూని హైహయులపై దండెత్తెను. దక్షిణ దిక్కున హైహయ రాజులతో వారి రధకుంజరములతో సైన్యములతో వీరులతో యుద్ధము జరిగెను, అయ్యవి రోమహరణముదయింపఁజేసెను. అందు మహాయుద్దమున, సహస్ర సంఖ్య రాజుల యొక్క బలములను కోసలేశ్వరుఁడు సంక్రుద్దుఁడై మహాబలుం డు జయించెను. హైహయరాజులను విభజించి చెదరగొట్టెను. వారి నగరములను దగ్గపటల మొనర్చెను. వైరము నీర్మూలముచేయ రాజు శత్రు నిశ్శేషముగా శూన్య మొనర్చెను. సర్వసైన్యమును తుడిచిపెట్టి హైహయ రాజ్యమును నేలమట్ట మొనర్చెను. (16) హైహయుల యశేష రాజ్యము నంతటిని భూరజస్యమమొనర్చెను. మిగిలిన రాజులు రాజ్యమును పట్టణములను విడిచిపెట్టి భ్రష్టశ్వర్యులు పోయిన లేజస్సంపన్నులునై నలుమూలలకు పలాయితులయిరి. పారిపోవు చున్నా ఆ రాజులను వెంటాడితరిమి, క్రోధ సముజ్జ్వలితుఁడగు యమునివలె ఆరాజు వారలను వారియనుచరులతోకూడ చంపెను. అరి నాశకుఁడయిన సగరుఁడు క్రోధభయంకరుఁడయి వారిపై రీపుభీషణము భార్గవమునై మహారౌద్రమునయిన అస్త్రమును ప్రయోగించెను. సగరునిచే విడువబడిన భార్ణవాస్త్రముచే దహింపఁబడిన శరీరులయి శత్రువులు నిస్సహాయులుగా చేయబడిరీ, మిక్కిలి భయంకరము అతిరౌద్రము, త్రిభువన భయదము, నయిన అస్త్రము మిక్కిలి ప్రకాశించెను. వాయు సంబంధాస్త్రము వలస వలన వలయములుగా వ్యాపించిన గాఢమయిన చీకటిచే వెంటనే ఆశత్రువులు దృష్టిప్రసారమునష్టమై అంధీభూతులయిరీ, వారందరు కనబడక యిందు నందు గోరాడిరి. నేలపై పడి దొర్లిరి. దొర్లిదొర్లి రేగిన అనంతమయిన భూరజస్సుచే కప్పబడి నశించిరి. (20) ఆగ్నేయాస్త్ర ప్రతాపము వలన శత్రు రాజులు సంరుద్ధమార్ధులయిరి. దారితెన్నులు కానరాలేదు. సర్వత్ర రాజులు నశించిన అనుచర సంఘులయిరి. పరవశ తనులయిరి. వికలము నొందిన మనస్సులుకలిగి, భీతులయి, వస్త్రములను, ఆయుధములను, కవచములను, భూషాదికములను విడిచిరి, విడివడిన కేశపాశులయిరి. విగతచేష్టలతో స్పష్టముగా పిచ్చివాండ్రవలే తమ శత్రువుల ముందు ప్రవర్తించిరి. బలవంతుఁడయిన సగరుఁడు, హైహయుల నందరను యుద్దమున జయించి,  సంక్షుణ్ణమయిన సాగరాకారుడై కాంభోజ దేశరాజులను వెంటాడెను. (22)

నానావాదిత్రహోషాపాతపటహరవాకర్ణనధ్వస్తధైర్యాః సద్యః సంత్యక్రరాజ్యస్వబలపురపురంధ్రీసమూహా విమూఢాః

 కాంభోజాస్తాలజంఘాః శకయవనకిరాతాదయః సాకమేతే భ్రేషుర్భూర్యస్తభీత్యా దిశి దిశి రిపనో యస్య పూర్వాపరాధాః

భీతాస్తస్య నరేశ్వరస్య రిపవః కేచిత్రతాపానలజ్వాలాముష్టదృశో విసృజ్య వసతిం రాజ్యం చ పుత్రాదిభిః

ద్విటెన్యైః సమభద్రుతా వనభువం సంప్రాప్య తత్రాపి తేసైమిత్యం సముపాగతా గీరిగుహాసుషోత్తితేన ద్విషః

తాలజంఘాన్నిహత్యాజే రాజా స బలవాహనాన్

క్రమేణ నాశయామాస తద్రాజ్యమరీకర్షణః

తతో యవనకాంభోజకిరాతాదీననేకశః

 నిజఘాన రుషావిష్టః పలవాన్పారదానమ్

హస్యమాసోస్తు తే సర్వే రాజానస్తేన సంయుగే

దుదువుః సంఘశో భీతా హతశిష్టాః సమంతతః

యుష్మాభిర్యస్య రాజ్యం బహుభిరపహృతం తస్య పుత్రోధునాహం హంతుం వః సప్రతిజ్ఞం ప్రసభముపగతో వైరనిర్యాతనైషీ

 ఇత్యుచ్చైః శ్రావయాణా యుధి నీచరితం వైరిభిరాగవీర్యః క్షతైర్విధ్వంసితేజాః సగరనరపతిః స్మారయామాస భూపః

తం దృష్ట్వా రాజవర్యం సకలరిపుకులప్రక్షయోపాత్తదీక్షం భీతాః స్త్రీబాలపూర్వం శరణమభియయుః స్వాసు సంరక్షణాయ

 ఇక్ష్వాకూణాం వసిష్ఠం కులగురుమభితః సప్తరాజ్ఞాం కలేషు ప్రఖ్యాతాః సంప్రసూతా నృపవరరిపవః పారదాః పళవాద్యాః

 వసిష్ఠమాశ్రమోపాంతే వసంతమృషిభిర్వృతం

 ఉపగమ్యాబ్రువన్ సర్వే కృతాంజలిపుటా నృపాః

శరణం భవ నో బ్రహ్మన్నార్తానామభయైషిణామ్

సగరాస్త్రాగ్నినిర్ధగ్ధ శరీరాణాం ముమూర్షతామ్

ఇంతకు పూర్వము సగరునకపరాధము చేసి శత్రువులై యుండిన కాంభోజులు, తాలజంఘులు, శకులు, యవనులు, కిరాతులు మున్నగువారు, అందరు, నానా విధములయిన యుద్ధ సంబంధమయిన హోషములను ఆలకించుటచే ధైర్యత్యక్తులైరి. వెంటనే, రాజ్యమును, స్వసైన్యములను, పట్టణమును, తమ భార్యా సమూహములను, విమూఢులై విడిచిరి భయంకరమయిన అస్త్రము వలన భీతిచే దిక్కులకు పలాయితులయిరి. (23) సగరునీశత్రువులు భయపడిరి. కొందరు ప్రతాపానలజ్వాలలచే దృష్టి కోల్పోయిరి. వారు వసతులను పుత్రాదులను రాజ్యమును విసర్జించిరి. వారిని శత్రు సైన్యములు వెంటాడెను. వారరణ్యములకు పరుగిడిపోయిరి. వారీ రాక వలన గలిగిన శబ్దములచే, గీరగహ్వరముల నిద్రించుచున్న సింహములు లేచుటచే వేణాకయుపద్రవమును వారే తెచ్చి పెట్టుకొనిరి. (24) అరికర్షణుఁడయిన సగరుఁడు తాలజంఘులను బలవాహనములతో యుద్దమునందు క్రమముగా నాశన మొనర్చెను. తరువాత, కోపావిష్ణుఁడయిన సగరుఁడు, యవనులను, కాంభోజులను, కీరాతులను, పల్లవులను, పారదుల ననేకముగా హతమార్చెను. ఆ యుద్ధమున రాజులందరు చంపఁబడిరి. చావగా మిగిలినవారు గుంపులుగుంపులుగా నలుమూలలకుఁ బరువిడిరి. (27) “మీ యందరిచే సేవ్వని రాజ్యము పూర్వము అపహరింపఁబడెనో, ఆతని పుత్రుఁడను నేను. ఇప్పుడు మీ మీఁద కసితీర్చుకొనఁ దలచితిని. మిమ్ముల నెల్లరను చంపుటకై ప్రతిజ్ఞ పూనితిని. శత్రు నిర్మూలము చేయగోరెదను” అని, గజబలయుతుఁడు, మహావీర్యుఁడు నయిన సగరుఁడు తన చరిత్రము నంతటినీ శత్రువులకు ప్రకటించేను. తన క్షత్ర తేజము యొక్క వీర్యమును శత్రువులచే స్మరింపఁజేసెను. (28) సకల శత్రుకుల వినాశనము కొఱకు దీక్ష వహించిన రాజయిన సగరుని ప్రతిజ్ఞను ప్రఖ్యాత రాజవంశమున సంభూతులయిన పలవ పారద మున్నగు సప్తరాజ వంశీయులు వినిరి. భీతులయిరి. ప్రాణ రక్షణార్థము ఇక్ష్వాకుల గురువయిన వసిష్ఠుని తమ స్త్రీ బాలురతో కూడి చేరి శరణాగతులయిరి. వసిష్టాశ్రమోపాంతమున వసించు ఋషులతో గూడికొని, ఆ రాజులందరు కృతాంజలులై వసిష్టుని సమీపించి, “ఓ భగవాన్ మాకు శరణుఁడవు కమ్ము. ఆర్తులము. అభయమును మీ వలన కోరియుంటిమి. సగరుని అస్త్రముల వలని అగ్నిచే నీర్దగ్ధ శరీరులము మూర్ఛితులము”.

స హంత్యస్మానశేషేణ వైరాంతకరజోన్ముఖః

తస్మాద్భయాద్ధి నిష్క్రాంతా వయం జీవితకాంక్షిణః

విభిన్నరాజ్యభోగ౦ స్వదారాపత్యబాంధవాః

 కేవలం ప్రాణరక్షార్థం త్వాం త్వయం శరణం గతః

న హ్యన్యోస్తి పుమాన్ లోకే సౌహృదేన బలేన వా

యస్తం నివర్తయిత్వాసానాలయేన్మహతో భయాత్

త్వం కిలార్కాన్వయభువాం రాజ్ఞాం కులగురుర్యతః

తద్వంశపూర్వజైర్భూపైస్వత్సభావశ్చ తాదృశః

తేనాయం సగరోతిష్యద్య గురుగౌరవయంత్రితః

 భవన్నిదేశం నాతేతి వేలామివ మహోదధిః

త్వం నః సుహృత్ పితా మాతా లోకానాం చ గురుర్విభో

 తస్మాదస్మాన్మహాభాగ పరిత్రాతుం త్వమర్హసి

జైమిని రువాచ :- 

ఇతి తేషాం వచః శ్రుత్వా వసిష్టో భగవాన్ ఋషిః

శనైర్విలోకయామాస శరణం సముపాగతాన్

వృద్ధస్త్రీబాలభూయిష్టాన్ హతశేషాన్ నృపాన్వయాన్

దృష్ట్వా త్వతప్యద్భగవాన్ సర్వభూతానుకంపకః

 చిరం నీరూప్య మనసాతాన్విలోక్య చ సాదరమ్

 ఉజ్జీవయఇనైర్వాచా మాభైషేతి మహామతిః

అథావోచన్మహాభాగః కృపయా పరయాన్వితః

 సమయ స్థాపయామాస రాజ్ఞస్తాక్షీవితార్థినః

భూపహ్యాకోపదగ్ధం నృపకులవిహితాశేషధర్మాదపేతం కృత్వా తేషాం వసిష్ఠః సమయమవనిపాలప్రతిజ్ఞానివృత్యై

 గత్వా తం రాజవర్యం స్వయమథ తనకైః సాంత్వయిత్వా యథావత్స ప్రాణానామరీణామపగమనవిధావళ్యనుజ్ఞాం యయాచే

 సక్రోధోపి మహీపతిర్గురువచః సంభావయంస్తానరీశర్మస్య స్వకులోతస్య చ తథా వేషస్య సంత్యాగతః

శ్రౌతస్మార్తవిభిన్నకర్మనిరతానిప్రైశ్చ దూరోజ్ఘితాన్సాసూన్ కేవలముత్యజనృతసమానేకైకశః పార్థివాన్

వైరుల నంత మొందింప పూనిన రాజు మమ్ముల నందరను, నిర్విశేషముగా చంపును. అందుచే జీవితాభిలాషులమై భయము వలన మేము బయలుదేరి వచ్చితిమి. మా రాజ్యములు విభిన్నములయినవి. మా భోగములు ఐశ్వర్యములు హతమయినవి. మా భార్యలు, పిల్లలు, బంధువులు మా నుండి వేరుపడిరి. కేవలము ప్రాణ రక్షార్థమే మేము మీ శరణము పొందితిమి. ఈ మహా భయోపద్రవము నుండి సుహృత్వముచేగానీ, బిలముచేగాని, ఆ రాజును నీవారించి మమ్ము రక్షించుటకు నీకంటే వేటిక్క పురుషుడెవ్వఁడు లేడు. నీవు సూర్య వంశ రాజులకు కులగురువుగా తద్వంశమున పుట్టిన రాజులచే వరింపఁబడితివీ, నీ ప్రభావమట్టిది. (35) ఈ సగరుఁడు కూడ ఇప్పుడును గురు గౌరవ యంత్రితుండు, గురుని యందలి గౌరవము తిరస్కరించువాఁడు కాఁడు. సముద్రము చెలియలిగట్టు నెట్లు అతిక్రమించదో అట్లే భవన్నిదేశమును రాజు అతిక్రమింపం డు. (36) నీవు మాకు స్నేహితుఁడవు, తండ్రివి, తల్లివి లోకమున కంతటికిని గురువవు ఓ మహాభాగ అందుచే నీ యుపద్రవము నుండి పరిరక్షించుటకు నీవర్హుఁడవు.” అని మొఱ పెట్టుకొనిరి.

జైమిని ఇట్లనెను.

భగవంతుఁడైన వసిష్ఠుఁడు వారి ప్రార్థనను వినెను. శరణాగతులయి వచ్చిన వారిని ఆ మహర్షి నెమ్మదిగా విలోకించెను. వృద్ధ స్త్రీలను, బాలలను, చావగా మిగిలిన నృపాన్వయులను చూచి, సర్వభూతములయందు అనుకంప దయతో) నొప్పు ఋషి, చాల సేపు మనస్సులో తద్విషయ సమాలోచనము చేసి, వచ్చిన వారలను ఆదరముగా పర్యాలోకించి, “భయపడవలదు” అని మృదువచస్సుచే వార్తలను ఉజ్జీవింపం జేసెను. (40) అంత అత్యంత కృపతో గూడీకొని మహాభాగుఁడయిన వసిష్ఠుడిట్లనెను. జీవితార్థులయిన వారితో ‘యుద్దమున రాజశస్త్రవహ్ని హతులయిన వారికి రాజవంశ సంబంధ క్రియా విశేషములు చేయకుండునట్లు ఒక నిర్ణయము. (సమయము) చేసికొనెను. అంత వసిష్టుడు రాజు దగ్గరకు వెళ్లాను. అర్ఘమయిన రీతిలో రాజును అనునయించేను. మిగిలిన రాజవంశీయులనెల్ల గృహములకు యధేచ్చగా తిరోగమింప రాజును అభ్యర్థించెను. ఆ శత్రువులు వంశ సంబంధమయిన పవిత్ర క్రియాకలాపాదులను విసర్జించుటకు స్వకులోచిత వేషములను విడుచుటకు, శ్రాతస్మార్త విభిన్నకర్ములుగా నుండుటకు, విప్రులచే దూరముగా వీడువబడి యుండునట్లును నియమించెను. వారలను ప్రాణములతో విడిచెను. అపుడారాజులు మృతసములుగా జీవించియుండిరి.

అర్థముండాఞ్చకాంశ్చక్రే పల్హవాన్ శ్మశ్రుధారిణః

యవనాన్ విగశ్మశ్రునాంబోజుంశ్చుబుకాన్వితాన్

ఏవం విరూపానన్యాంశ్చ స చకార నృపాన్వయాన్

వేదోక్తకర్మనిర్ముక్తాన్ని ప్రైశ్చ పరివర్జితాన్

కృత్వా సంస్థాష్య సమయే జీవతస్తాన్వ్యసర్జయత్

 తతస్తే రిపవస్తస్య వ్యక్తస్వాచారలక్షణాః

వ్రాశ్యతాం సమనుప్రాప్తాః సర్వవర్ణవివింగీతాః ధీకృతాః సతతం సర్వే నృశంసా

నీరపత్రపాః

 క్రూరాశ్చ సంఘశో లోకే బభూవుగేచ్ఛజాతయః

ముక్తాస్తేనాథ రాజ్ఞా శకయవనకిరాతాదయః సద్య ఏవ త్యక్తస్వాచారవేషా గిరిగహనగుహాద్యాశ్రయాః సంబభూవుః

ఏతా అద్యాపి సద్భిః సతతమవమతా జాతయోః సత్ప్రవృత్యా వర్తంతే దుష్టచేష్టా జగతి నరపతేః పాలయంతః ప్రతిజ్ఞామ్

  ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమాభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే సగరోపాఖ్యానే సగరప్రతిజ్ఞాపాలనం నామాష్టాచత్వారింశత్తమోధ్యాయః

ఆతఁడు శకులను, తమ శిరోజములను సగము గొరిగించుకొనునట్లును, పల్హవులను మిసములు పెంచుకొనువారిగను, యవనులను మీసములు లేనట్టివారిగను, కాంబోజులను గడ్డము లేని చుబుకముగల (గడ్డమును గొరిగించుకొను) వారిగను శాసించెను. అట్లే ఇతరులను  విరూపులను చేసెను. వారందరు వేదోక్తకర్మములను విడిచినవారు, విప్రులచే విసర్జింపఁబడినవారీగను నియమమును ఆదేశించి, ప్రాణములతో వారలను విడీచిపెట్టెను. అంత సగరునిశత్రురాజులు, పరిత్యక్ష స్వాచార లక్షణులు, సర్వవర్ణ వీనిందీతులు, సతతము ధీకృతులు, దయాశూన్యులు, సిగ్గులేనట్టివారు నయిన వ్రాత్యసమయబద్దులయిరి. వారు సంఘయుతముగా క్రూరులయిన మ్లేచ్చజాతులయిరి. శక యవన కిరాతాదులు రాజుచే విడువబడి వెంటనే, స్వకీయములైన ఆచారములను, వేషమును విడిచి, కొండలయందు, గుహలయందు ఆశ్రయములు గలిగిన వారియిరి. ఇప్పటికీని, సజ్జనులచే అవమానీంపబడు జాతులయి, అసత్సవృత్తిచే దుష్టచేష్టలచే వారు వర్తించుదురు. వారు నరపతియైన సగరుని ప్రతిజ్ఞను సమయమును అనుసరించుచు జీవింతురు.

ఇది వాయుప్రోక్తమయి, మహాపురాణమయిన బ్రహ్మాండపురాణమునందు మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున సగరోపాఖ్యానము, సగర ప్రతిజ్ఞాపాలనమను నలుబది యెన్మిదవ అధ్యాయము.