బ్రహ్మాండ మహా పురాణము
66 - అమావసువంశవర్ణనము
సూత ఉవాచ :-
ఋషయః ఊచుః :-
సోమస్య తు బుధః పుత్రో బుధస్య తు పురూరవాః ।
తేజస్వీ దానశీలశ్చ యత్వా విపులదక్షిణః ॥
బ్రహ్మవాదీ పరాక్రాంత శత్రుభిర్యుధీ దుర్జయః ।
అహర్తాగ్నిహోత్రస్య యజ్ఞానాం చ మహీపతిః ॥
సత్యవాన్ ధర్మబుద్దిశ్చ కాంతః సంపృత్తమైథునః ।
అతీవ త్రిషు లోకేషు రూపేణిఽప్రతిమోఽభవత్ ॥
తం బ్రహ్మవాదినం సొంతం ధర్మజ్ఞం సత్యవాదిసమ్ ।
ఊర్వశీ వరయామాస హిత్వా మానం యశస్వినీ ॥
తయా సహావసద్రాజా దశ వర్షాణి చాష్ట్ర చ ।
సప్తషట్ సప్త చాష్టౌ చ దశ చాష్టౌ చ వీర్యవాన్ ॥
వనే చైత్రరథే రమ్యే తథా మందాకినీతటే ।
అలకాయాం విశాలాయాం సందనే చ వనోత్తమే ॥
ఏతేషు వనముఖ్యేషు నుదైరాచరితేషు చ ।
ఉర్వశ్యా సహితో రాజా రేమే పరమయా ముదా ॥
ఋషయఊచుః :-
గౌంధర్వీ చోర్వశీ దేవీ రాజానం మానుషం కథమ్ ।
ఉత్సృజ్య తం సంప్రాప్తి తన్నో భ్రూహి చ దుష్కృతమ్ ॥
సూత ఉవాచ :-
బ్రహ్మశాపభిభూతా సా మానుషం సముపస్థితా ।
ఆత్మనః శాపమోక్షార్థం నియమం సా చకార తు
అనగ్నదర్శనం చైవ అకామాత్సహ మైథునమ్ ।
ద్వౌ మేషౌ శయనాభ్యాశే సాతావధ్ధ్యావతిష్ఠతే ॥
ఘృతమాత్రం తథాఽ హారః కాలమేకం తు పార్థివ ।
యద్యేష సమయో రాజన్యావత్కాలశ్చ తే దృఢః ॥
సూతుఁడిట్లు చెప్పెను.
చంద్రుని పుత్రుఁడు బుధుఁడు. బుధుని కుమారుఁడు పురూరవుఁడు ఆతఁడు తేజస్వి దానశీలుఁడు. యజ్వ. విపుల దక్షిణల నొసంగినవాం డు. ఆతఁడు బ్రహ్మవాది. పరాక్రమ లక్షణుఁడు. శత్రువులకు యుద్ధమున అజేయుఁడు అగ్నిహోత్రము లాచరించినవాఁడు. అనేక యజ్ఞముల చేసినవాఁడు, సత్యవాక్కు ధర్మబుద్ది. మనోహరస్వభావుండు, రహస్య మైథునుఁడు. మూఁడు లోకముల యందు సౌందర్యమున అప్రతిమానం డు, యశస్వినియైన ఊర్శశి స్వాభిమానగర్వమును పరిత్యజించి బ్రహ్మవాది, దాంతుఁడు, ధర్మజ్ఞుఁడు, సత్యవాదీయుడు అయిన పురూరవుని వరించెను. ఆ మహారాజాఉర్వశితో పది సంవత్సరములు చైత్ర రథ వనమున, ఎనిమిది సంవత్సరములు రమ్యమందాకినీ నదీతీరమున, ఏడు సంవత్సరములు అలకానగరమున, ఆరువత్సరము విశాలపురమందు, మరల ఏడేండ్లు వనోత్తమమునైన నందనమున, ఎనిమిదేండ్లు గంధమాదనో ద్యానమున, పదియేండ్లు మేరు గిరీ శృంగమున, 8 సంవత్సరములు ఉత్తరకురుదేశమందలి కలాపి నగరమున గడిపెను. ఆ ముఖ్యములైన దేవతలు సంచరించు వనములందు ఊర్వశితో అత్యంత ముదముగా రాజు క్రీడించేను, (8) ఋషులిట్లడిగిరీ గాంధర్వ స్త్రీ ఊర్వశీ మానవుఁ డయిన రాజును విడిచి యెట్లు స్వర్గమును చేరెనో మాకు చెప్పుము. సూతుఁడిట్లు సమాధాన మొసంగెను. బ్రహ్మవలన శాపము ననుభవించి యామె మనుష్యునీ చేరేను. తన యొక్క శాప విమోచనము కొఱకు ఆమె యొక నీయమము చేసెను. “నగ్నము కాకుండ..దర్శనము, కామము లేకుండ మైథునము” రెండు మేషములను (మేకలను) శయనము కడనుంచుట ఇవీ జరుగునంతవరకూ నేను (ఊర్వశి)పురూరవుని కడనుందును. అంతీయకాక, “నా ప్రధానాహారము నేయి, అది యైనను రోజున కోక్కమారే ఈ నియమములను ఓరాజా నీవంగీకరించి, ఎంతకాలము నీవీ నియమముల నియమముగా పాటింతువో అంతకాలము నేను నీతో నుండగలను.
తావత్కాలం తు వత్స్యామి ఏష నః సమయః కృతః ।
తస్యాస్తం సమయం సర్వం స రాజా పర్యపాలయత్ ॥
ఏవం సా చావసత్తేన సహైతేనాభిగామినీ ।
వర్షాణ్యథ చతుష్టష్టిం తద్భక్త్యా శాపమోహితా ॥
ఉర్వశీ మానుషం ప్రాప్తా గంధర్వాశ్చింతయాన్వితాః ।
గంధర్వా ఊచుః :-
చింతయధ్వం మహాభాగా యథా సా తు వరాంగనా ॥
ఆగచ్ఛేత్తు పునర్దేవానుర్వశీ స్వర్గభూషణమ్ ।
తతో విశ్వావసుర్నామ గంధర్వః సుమహామతిః ॥
జహరోరణకౌ తస్యాస్తత్వశ్చాతా దీవం గరా ।
తస్యాస్తు విరహేణాసౌ భ్రమమాణస్త్వథోర్వశీమ్ ॥
దదర్శ చ కురుక్షేత్రే తయా సంభాషితోఽప్యయమ్ ।
గంధర్వానుపధావేతి స తచ్చక్రే ఽథ తే దదుః ॥
అగ్నిస్థాలీం తయా రాజా గతః స్వర్గం మహారథః ।
ఏకోఽగ్నిః పూర్వమాసీద్వై ఐలస్తం త్రీనకల్పయత్ ॥
ఏవం ప్రభావో రాజాసీదైలస్తు ద్విజసత్తమాః ।
దేశే పుణ్యతమే చైవ మహర్షిభిరలంకృతే ॥
రాజ్యం స కారయామాస ప్రయాగే పృథివీపతిః ।
ఉత్తరే యామునే తీరే ప్రతిష్ఠానే మహాయశాః ॥
తస్య పుత్రా బభూవుర్హి షడింద్రోపమతేజసః ।
గంధర్వలోకే విదితా ఆయుర్దీమానమావసుః ॥
విశ్వావసుః శ్రుతాయుశ్చ ఘృతాయుశ్చోర్వసీసుతాః ।
అమావసోస్తు వై జాతో భీమో రాజాఽథ విశ్వజిత్ ॥
శ్రీమాన్ భీమస్య దాయాదో రాజాఽ సీత్కాంచనప్రభః ।
విద్వాంస్తు కాంచనస్యాపి సుహోత్రోఽ భూన్మహాబలః ॥
సుహోత్రస్యాభవజ్జ హ్నుః కేశినీగర్భసంభవః ।
ప్రతిగత్య తతో గంగా వితతే యజ్ఞకర్మణి ॥
ఇది మన పరస్పర నియమము. రాజు ఆమె యొక్క నియమములను పాటించేను. ఈ విధముగా నామె శాపమోహితయై ‘ఐలు’నీతో అభీగామినియై యనురాగముతో, అరువది నాలుగు సంవత్సరములుండెను. (14) ఊర్వశి మనుష్యత్వమొందెను. తత్కారణమున గంధర్వులు విచారాన్వితులైరి. గంధర్వులిట్లు పలికిరి. ఓ మహాభాగులారా స్వర్ణాలంకారమయినది ఊర్వశి. మరల స్వరమునకెట్లా వరాంగన వచ్చునో ఆలోచించుం డు. అంత మహామతియైన విశ్వావసుఁడను గంధర్వుఁడు, ఆమె యొద్ద నుండి ఆమెకు సంబంధించిన మేకల రెంటిని దొంగిలించుకొనిపోయెను. తరువాత ఆమే స్వర్గమున కరిగెను. ఆమే తోడి విరహముతో రాజు ఇందు నందు సర్వార్డీనీ సంచరించెను. ఆమెను నతఁడు కురుక్షేత్రమున కనుగొనెను. ఆమెతో నతఁడు సంభాషించెను. ఆమే రాజుతో “గంధర్వుల కడకు వెడలుము” అనేను. ఆతఁడల్లొనర్చెను. గంధర్వులాతనికోక అగ్నిస్థాలిని (అగ్నితోడిగిన్నెను) ఇచ్చిరి. మహా రథుఁడయిన రాజు దానితో స్వర్గమున కరిగెను. పూర్వము ఒక్కడే అగ్ని. కానీ ఇలుడు (ఇల యొక్క కోమరుఁడు) దానిని మూఁడగ్నులు చేసెను. (19) ఓ బ్రాహ్మణులారా ! ఐలుఁడు తద్విధమయిన ప్రభావము గల రాజాయెను. ఆ మహారాజు, యమునా నదియొక్క ఉత్తర తీరమున ప్రతిష్టానమున ప్రయాగయందు పుణ్యతమదేశమున మహరులచే నలంకృతమైనచోట రాజ్యమును స్థాపించేను. ఆతనికీ ఆరుగురు పుత్రులుదయించిరి. వారందరు ఇంద్ర సమతేజస్వులు, వారందరు గంధర్వలోకమున సువిదితులు పోరు-ఆయువు, ధీమంతుఁడు, 'ఆమావసువు' విశ్వావసువు, శ్రుతాయువు మరియు ఘృతాయుపు. వీరందరు ఉర్వశీసుతులు. భీముడు, రాజు (పరాక్రమవంతుఁ డు), విశ్వజిత్తు అమావసువు యొక్క తనయుఁడు. కాంచన ప్రభాదీప్తుఁడయిన రాజు భీమునకు దాయాది. విద్వాంసుఁడయిన కాంచన ప్రభువునకు మహాబలుఁడయిన సుహోత్రుఁడు పుత్రుఁడు సుహోత్రునకు కేశినీ గర్భమున జహ్నువుదయించెను. ఆతని యొక్క వితతయిము జరుగుచుండగా, గంగ ప్రవాహగతి మార్చి అనివార్యమయిన భావ్యర్థదర్శనమున, తద్దేశమునంతటినది వరదతో ముంచెత్తేను.
సాదయామాస తం దేశం భావినో ఽ ర్థస్య దర్శనాత్ ।
గంగయా ప్లావితం దృష్ట్వా యజ్ఞవాటం సమంతతః ॥
సౌహోత్రిరపీ సంక్రుద్ధో గంగాం రాజా (పీతః ) ద్విజోత్తమాః ।
తదా రాజర్షిణా పీతాం గంగాం దృష్ట్వా సురర్షయః ॥
ఉపనిన్యుర్మహాభాగా దుహితృత్వేన జాహ్నవీమ్ ।
యౌవనాశ్వస్య పౌత్రీం తు కావేరీం జహ్నురావహత్ ॥
యువనాశ్వస్య శాపేన గంగార్ధేన వినిర్మమే ।
కావేరీం సరితాం శ్రేష్ఠ జుహ్నభార్యామనిందితామ్ ॥
జుహ్నస్తు దయితం పుత్రం సునహం నామ ధార్మికమ్ ।
కావేర్యాం జనయామాస ఆజకస్తస్య చాత్మజః ॥
అజకస్య తు దాయాదో బలాకాశో మహాయశాః ।
బభూవ మృగయాశీలః కుశస్తస్యాత్మజః స్మృతః ॥
కుశపుత్రా బభూవుశ్చ చత్వారో దేవవర్చసః ।
కుశాంబః కుశనాభశ్చ అమూర్తరయసో వసుః ॥
కుశికస్తు తపస్తేపే పుత్రార్ధీ రాజసత్తమః ।
పూర్ణే వర్షసహస్రే వై శతక్రతురపశ్యత ॥
తదుభ్రతపసం దృష్ట్వా సహస్రాక్షః పురందరః ।
సమర్థః పుత్రజననే స్వయమేవాస్య శాశ్వతః ॥
పుత్రత్వం కల్పయామాస స్వయమేవ పురందరః ।
గాధిర్నామాఽభవత్పుత్రః కౌశికః పాకశాసనః ॥
పౌరుకుత్స్యభవద్భార్యా గాధేస్తస్యామజాయత ।
పూర్వం కన్యా మహాభాగా నామ్నా సత్యవతీ శుభా ॥
తాం గాధిః పుత్రకామాయ ఋచీకాయ దదౌ ప్రభుః ।
తస్యాః ప్రీతస్తు వై భర్తా భార్గవో భృగునందనః ॥
పుత్త్రార్ధే సాధయామాస చరుం గాధే స్తథైవ చ ।
అథావొచత్ప్రియాం తత్ర ఋచీకో భార్గవస్తదా ॥
యజ్ఞవాటిక గంగలో మునిగిపోయినది. దానిని చూచి సంక్రుద్ధుఁడయిన సుహోత్రుని పుత్రుఁడు గంగను త్రాగి వైచేను. రాజరీ గంగను త్రాగివైచుట చూచిన సురరులు గంగానదిని జిహ్నపు దుహితగా జాహ్నవిగా తీసికొని వచ్చిరి. (సృష్టించి ప్రవహింపఁజేసిరి). యౌవనాశ్వుని పౌత్రియయిన కావేరిని జహ్నువు పెండ్లాడెను. (28) యౌవనాశ్వుని శాపముచే గంగ తన యొక్క సగభాగము నుండి కావేరి నుత్పాదించేను, (కావేరికి ఉదయ మొసంగెను). కావేరి అనిందితురాలు. జహ్నుని యొక్క భార్య. సరిత్తులలో శ్రేష్టమైనది. జహ్నువు భార్యయన కావేరి వలన సునహుఁడను ధర్మాత్ముని కనెను. ఆసునహునీ కుమారుఁడు అజకుఁడు. (30) అజకుని యొక్క దాయాది అలాకాశ్వుఁడు. మహాయశుఁడు. ఆతఁడు మృగయాశీలుఁడయ్యెను. ఆతని కుమారుఁడు కుశుఁడు, కుశుకునకు పుత్రులు దేవవర్చస్సులు నలుగురు. వారు కుశాంబుఁడు, కుశనాభుఁడు, అమూర్తరయరసుఁడు మరియు వసుపు, కుశికుఁడు. (కుశాంబుఁడు) రాజసత్తముఁడు పుత్రార్థియై తపస్సాచరించేను. వర్ష సహస్రము గడచెను. ఇంద్రుఁడాతనీ యుగ్ర తపస్సు గమనించెను. శాశ్వతుఁడయిన ఇంద్రుఁడు తానే యాతనికి పుత్రు నొసంగసమర్థుఁడైనను, ఆతనికి తానే పుత్రుడయ్యెను. పాకశాసనుఁడు కుశికునకు గాఢయను పేర పుత్రుఁడయ్యెను. (35) పౌరకుట్సీ (పురుకుత్సుని కూతురు) గాథ్ యొక్క భార్య యయ్యెను. ఆమెకు మొదట మహాదృష్టవంతురాలు మొదట ‘సత్యవతి’ యను కన్యక యుదయించెను. రాజయిన గాధీ సత్యవతిని పుత్రకాముఁడయిన “ఋచీకునకిచ్చి వివాహము చేసెను. భర్తయైన ఋచీకుఁడు ఆమె యందు ప్రీతుఁడు. ఆతఁడు భార్గవుఁడు. భృగునందనుఁ డు, ఋచీకుఁడు స్వపుత్రార్థమును గాధికి పుత్రుని కోటకును చరువును సిద్ధముచేసి తన భార్యతో ఇట్లనెను.
ఉపభోజ్యశ్చరురయం త్వయా మాత్రా చ తే శుభ ।
తస్యా జనీష్యతే పుత్రో దీప్తిమాన్ క్షత్రియర్హథః ॥
అజేయః క్షత్త్రియైర్యుద్ధే క్షత్రియర్షభసూదనః ।
తవాపి పుత్త్రం కళ్యాణి ధృతిమంతం తపోధనమ్ ॥
శమాత్మకం ద్విజశ్రేష్ఠం చరురేష విధాస్యతి ।
ఏవముక్త్వా తు తాం భార్యామృచీకో భృగునందనః ॥
తపస్యభిరతో నిత్యమరణ్యం ప్రవివేశ హ ।
గాధీః సదారస్తు తదా ఋచీకాశ్రమమభ్యగాత్ ॥
తీర్థయాత్రాప్రసంగేన సుతాం ద్రష్టుం నరేశ్వరః ।
చరుద్వయం గృహీత్వా తు ఋషేః సత్యవతీ తదా ॥
భర్తుర్వచనమవ్యగ్రా హృష్టా మాత్రే న్యవేదయత్ ।
మాతా తు తస్యై దైవేన దుహిత్రే స్వచరుం దదౌ ॥
తస్యాశ్చరుమధాజ్ఞానాదాత్మనః సా చకార హ ।
అథ సత్యవతీ గర్భం క్షత్రియాంతకరం శుభమ్ ॥
ధారయామాస దీపేన వపుషా ఘొదర్శనా ।
తామృచీకస్తతో దృష్ట్వా యోగేనాష్యవమృశ్య చ ॥
తదాబ్రవీథ్వీజశ్రేష్ఠః స్వాం భార్యాం వరవర్ణినీమ్ ।
మాత్రాసి వంచితా భద్రే చరుప్యత్యాసహేతునా ॥
జనిష్యతి హి పుత్రస్తే క్రూరకర్మాతిదారుణః ।
మాతా జనిష్యతే చాపీ తథా భూతం తపోధనమ్ ॥
వీశ్వం హి బ్రహ్మ తపసా మయా తత్ర సమర్పితమ్ ।
ఏవముక్తా మహాభాగా భర్త్ర సత్యవతీ తదా ॥
ప్రసాదయామాస పతిం సుతో మే నేదృశో భవేత్ ।
బ్రాహ్మణాపసదస్త్వత్ర ఇత్యుక్త మునిమబ్రవీత్ ॥
నైవ సంకల్పితః కామో మయా భద్రే తథా త్వయా ।
ఉగ్రకర్మా భవేత్పుత్రః పితుర్మాతుశ్చ కారణాత్ ॥
ఈ చరువు నీవు పుచ్చుకోనవలయును. ఇది నీ తల్లికిమ్ము, ఆమెకు దీప్తిమంతుఁడు, క్షత్రియర్షభుఁడు నగు పుత్రుండుదయించును. యుద్ధమున ఆతఁడు క్షత్రియులకజేయుఁడు. మహామహా బలవంతులయిన క్షత్రియులను చంపును. ఇక, నీవో కళ్యాణి ! ధృతిమంతుని, తపోధనుని, శమాత్మకుని, ద్విజశ్రేష్ఠుని కందువు ఈ రెండవ చరువీ విధముగా ప్రాప్తింపఁజేయును” అనీ ఈ విధముగా భార్యతో చెప్పి భృగు నందనుఁడయిన ఋచీకుడు తపస్సాచరింప నభిరతుఁడై యరణ్యమున కేగెను. అంత, గాధి భార్యతో కలిసి, తీర్థయాత్రా ప్రసంగమున తన కూతురయిన సత్యవతిని చూడగోరి ఋచీకాశ్రమమునకు వచ్చెను. సత్యవతీ అవ్యగ్రమనస్సుతో, అచరుద్వయమును గ్రహించి, సంతోషముతో తల్లికి నివేదించెను. సత్యవతి అవ్యగ్రమనస్క స్పషార్ధముగా నాచరుద్వయమొసంగేను. తల్లి, దైవవశముచే, కుమార్తెకు తనకు నిర్దేశింపఁబడిన - చరువు అజ్ఞానముచే నొసంగెను. (40) (చరువులు వ్యత్యస్తములయినవి) తల్లిచరువుస్తామే చరువును స్వీకరించెను. సత్యవతి గర్భము దాల్చెను. క్షత్రీయంతకరునీ గర్భమున ధరించెను. ఆమె దీప్తమయిన తనువుతో ఘోర దర్శనురాలుగా దోచెను. ఋచీకుడు ఆమెను చూచి, యోగశక్తిచే విమర్శించి, భార్యతో “ఓ వరవర్ణినీ ! నీవు నీ తల్లిచే వంచింపఁబడితివి. చరువులు తారుమారుగటచే నీవు క్రూరకర్మాతిదారుణుఁడయిన పుత్రుని కందువు నీ తల్లికి ఇంతకు పూర్వము చెప్పినట్టి లక్షణయుతుఁడయిన తపోధనుడుదయించును. నేను నా సర్వస్వమైన బ్రహ్మతపస్సు ఈ చరువున సమర్పించితినీ”. అని చెప్పెను. పూజ్యురాలయిన సత్యవతి భర్తను ప్రసన్నుని చేయుచు 'నా కుమారుఁడట్టివాఁడు కారాదు. నీవలన కుబ్రాహ్మణుఁడు నాకు పుట్టరాదు”. అని పలికెను. అంతముని యిట్లనెను. “ఓ పూజ్యురాలా ! ఇది నీవు గాని నేను గాని సంకల్పించినది కాదు. తల్లియొక్క తండ్రియొక్క కారణమున పుత్రుఁడుగ కర్ముఁడగును. అని.
పునః సత్యవతీ వాక్యమేవముక్త్వా బ్రవీదిదమ్ ।
ఇచ్ఛంల్లోకానపి మునే సృజేథాః కిం పునస్సుతమ్ ॥
తమాత్మకమృజం భర్తః పుత్రం మే దాతు మర్హసి ।
కామమేవంవిధః పౌత్రో మమ స్యాత్తవ సువ్రత ॥
యద్యన్యథా న శక్యం వై కర్తుమేవం ద్విజోత్తమః ।
తతః ప్రసాదమకరోత్స తస్యాస్తపనో బలాత్ ॥
పుత్రే నాస్తి విశేషో మే పౌత్రే వా వరవర్జిని ।
త్వయా యథోక్తం వచనం తథా భద్రే భవిష్యతి ॥
తస్మాత్సత్యవతీ పుత్రం జనయామాస భార్గవమ్ ।
తపస్యభిరతం దాంతం జమదగ్నిం శమాత్మకమ్ ॥
భృగోశ్చరునిపర్యాసే రౌద్రవైష్ణవయోః పురా ।
జమునాద్వైష్ణవస్యాగ్నేర్థమదగ్నిరజాయత ॥
విశ్వామిత్రం తు దాయాదం గాధిః కుశికనందనః ।
ప్రాష్యబ్రహ్మర్షిసమతాం జగామ బ్రహ్మణావృతః ॥
సా హి సత్యవతీ పుణ్యా సత్యవ్రతపరాయణా ।
కౌశికీ తు సమాఖ్యాతా ప్రవృత్తేయం మహానదీ ॥
పరిస్రుతా మహాభాగా కౌశికీ సరితాం వరా ।
ఇక్ష్వాకువంశప్రభవో రేణుకో నామ పార్థివః ॥
తస్య కన్యా మహాభోగా కమలీ నామ రేణుకా ।
రేణుకాయాం కమల్యాం తు తపోధృతిసమాధినా ॥
అర్చీకో జనయామాస జమదగ్నిః సుదారుణమ్ ।
సర్వవిద్యాంతరం శ్రేష్ఠం ధనుర్వేదస్య పారగమ్ ॥
రామం క్షత్రియహంతారం ప్రదీప్తమివ పావకమ్ ।
ఔర్వస్యైవమృచీకస్య సత్యవత్యాం మహామనాః ॥
ఇట్లు ఋషి పలుక, మరల సత్యవతి ఇట్లు పలికెను. “ఓ మహర్షీ ! నీవు కోరినచో లోకాలను సృజింపఁగలవే ! కోరి కుమారుల నేల సృజింపలేవు? శమాత్మకుఁడయినవాఁడు, ఋజు స్వభావుఁడైనవాడునునైన కుమారు నొసంగ అరుఁడవు. ఇట్లు చేయుటకు అశక్యమైన ఓ ద్విజోత్తమ ! మన పౌత్రుడిట్టివాఁడగుత” తన తపము యొక్క ప్రభావముచే, అతడామెను ప్రసన్నురాలనుజేసి “అతఁడు నా పుత్రుఁడగుగాక లేక పౌత్రుఁడగుగాక ఓ వరవర్ణినీ ! నాకెట్టి విశేషము (భేదము) లేదు. ఇయ్యది నీవు చెప్పినట్లే కాగలదు” అనెను. (55) అ కారణముచే సత్యవతి తపస్సు నందాసక్తిగలవాఁడు ఇంద్రియ నిగ్రహవంతుడు శమాత్మకుడు, అయిన జమదగ్నిని కనెను. రుద్ర విష్ణువులకు సంబంధించిన భృగుని యొక్క చరువు యొక్క విపర్యయము పూర్వము జరిగెను. అతని తల్లి తినిన చదువున వైష్ణవమైనయన్నీ యొక్క జమనము వలన జమదగ్ని అయ్యోను. (57) విశ్వామిత్రుని తన దాయాదిగా పొందిన తరువాత కుశిక నందనుఁడయిన గాధి బ్రహ్మర్షి సమమైన స్థితిని పొందెను. ఆతఁడు బ్రహ్మచే కోరబడెను, (58) అట్టి సత్యవతి పుణ్యురాలు. సత్యవ్రత పరాయణురాలు కౌశికి యనెడు మహానదిగా నయ్యెను. అయ్యది నదులలో శ్రేష్ఠమయినదియై ప్రవహించెను. ఇక్ష్వాకు వంశ ప్రభువై రేణుకుఁడు అను రాజు కలఁడు. ఆతని కూతురు మహాభాగ్య వంతురాలు, ఆమె రేణుక, ఆమెకు 'కమలినీ' యనునామాంతరము. కమలినీయైన రేణుక యందు అర్చీకుఁడయిన జమదగ్ని, తపస్సుచే ధృతిచే, సమాధిచే, సర్వవిద్యాపరిపూర్ణుని ధనుర్వేదపారగుని క్షత్రియారణ్యమునకు ప్రజ్వలించు పావకుని వంటి సుదారుణుఁడైన వానిని రాముని కనెను.
జమదగ్నిస్తపోవీర్యాజ్జజ్ఞే బ్రహ్మవిదాం వరః ।
మధ్యమశ్చ శునఃశేఫః శునఃపుచ్ఛః కనిష్ఠకః ॥
విశ్వామిత్రస్తు ధర్మాత్మా నామ్నా విశ్వరథః స్మృతః ।
జజ్ఞే భృగుప్రసాదేన కౌశికాన్వయవర్ధనః ॥
విశ్వామిత్రస్య పుత్రస్తు శునఃశేఫోఽభవన్మునిః ।
హరిశ్చంద్రస్య యజ్ఞే తు పశుత్వే నియతః స వై ॥
దేవైర్దత్తః శునఃశేఫో విశ్వామిత్రాయ వై పునః ।
దేవైర్దత్తః స వై యస్మాద్దేవరాతస్తతోఽభవత్ ॥
విశ్వామిత్రస్య పుత్రాణాం శునఃశేఫోఽగ్రజః స్మృతః ।
మధుచ్ఛందాదయశ్చైవ కృతదేవా ధ్రువాష్టకౌ ॥
కచ్ఛపః పూరణశ్చైవ విశ్వామిత్రసూతాస్తు వై ।
తేషాం గోత్రాణి బహుధా కౌశికానాం మహాత్మనామ్ ॥
పార్టీవా దేవరాతాశ్చ యాజ్ఞవల్క్యః సమర్పణాః ।
ఉదుంబరాశ్చ వాతడ్యాస్తలకాయనచాంద్రవాః ॥
లోహిణ్యో రేణవశ్చైవ తథా కారీషవః స్మృతాః ।
బభ్రవః పడినశ్చైవ ధ్యానజప్యాస్తథైవ చ ॥
శ్యామాయనాః హిరణ్యాక్షా సాంకృతా గాలవాః స్మృతాః ।
దేవలా యామదూతాశ్చ శాలంకాయనబాష్కలాః ॥
లాలాట్యా బాదరాశ్చాన్యే విశ్వామిత్రస్య ధీమతః ।
ఋష్యంతరవివాహ్యాస్తే బహవః కౌశీకాః స్మృతాః ॥
కౌశికాః సౌశ్రుతాశ్చైవ తథాన్యే సైంధవాయనాః ।
యోగేశ్వరస్య పుణ్యస్య బ్రహ్మర్షే కౌశికస్య వై ।
విశ్వామిత్రస్య పుత్రాణాం శునఃశేఫోగ్రతః స్మృతః ॥
దృషద్వతీసుతశ్చాపి విశ్వామిత్రాత్తథాష్టకః ।
అష్టకస్య సుతో లౌహిః ప్రోక్తో జహ్నుగణో మయా ॥
బ్రహ్మవిదులలో శ్రేష్ఠుఁడయిన జమదగ్ని, తపోవీర్యముచే, ఔర్వునకు కుమారుఁడయిన ఋచీకునకు సత్యవతి వలనఁగలిగెను.. శునః శేపుఁడు మధ్యముడు, శునః పుచ్చుఁడు కనీష్ణుఁడు. ధర్మాత్ముఁడయిన విశ్వామిత్రుఁడు విశ్వరథుఁడుగా ప్రఖ్యాతుఁడు. ఆతఁడు భృగు ప్రసాదమున కుశీకాన్వయ వర్థనుడుగా జన్మించెను. (65) మునియైన శునఃశేపుండు విశ్వామిత్రుని పుత్రుఁడయ్యెను. ఆతఁడు (శునఃశేపుండు) హరిశ్చంద్రుని యజ్ఞమున యజ్ఞపశువుగా నియమితుఁడయ్యెను. మరల విశ్వామిత్రునకు శునఃశేపుని దేవతలొసంగిరి. దేవతలచే నీయబడుటచే నతఁడు తరువాత ‘దేవరాతు’డయ్యెను, విశ్వామిత్రుని పుత్రులలో శునఃశేపుఁడు అగ్రజుండుగా ఖ్యాతుఁడు. మధుచ్ఛందుడు, కృతదేవుడు, ధ్రువుడు, అష్టకుఁడు, కచ్చపుడు, పురాణుఁడు అను వారు కూడ విశ్వామిత్రుని కుమారులే. మహాత్ములయిన కౌశికులయొక్క గోత్రములనేకములు. (69) ఆ గోత్రములు పార్టీవులు, దేవరాతులు, యాజ్ఞవల్క్యులు, సమర్పణులు, ఉదుంబరులు, వాతడ్యులు, తలకాయనులు, చాంద్రవులు, లోహిణ్యులు, రేణువులు, కారీషవులు, ఫణినులు, బభ్రువులు, ధ్యానులు, ఉప్యులు, శ్యామాయనులు, హిరణ్యాక్షులు, సాలంకృతులు, గాలవులు. దేవలులు, యామదూతులు, శాలంకాయనులు. భాష్కలులు, లాలాట్యులు, బాదరులు, మరియు ఇతరులును ధీమంతుఁడైన విశ్వామిత్రుని గోత్ర సంబంధీకులు. కుశిక వంశీయులు చాలమంది యున్నారు. వీరు ఇతర ఋషుల గోత్రములతో వివాహ సంబంధముకలవారు. (73) కౌశీకులే, సౌశ్రుతులు మరియు సైంధవోయనులు, ఇతరులును వీరందరు యోగేశ్వరుఁడు, పుణ్యుఁడు, బ్రహ్మరి, కౌశికుఁడునైన విశ్వామిత్రుని పుత్రులలో శునఃశేపుఁడు అగ్రజుం డు. విశ్వామిత్రునకాదృషద్వతికినీ బుట్టినవాడు అష్టకుడు. లౌహితుండు అష్టకునిసుతుఁడు. ఈ విధముగా జహ్నుగణము నాచే చెప్పబడినది.
ఋషయః ఊచుః :-
కింలక్షణేన ధర్మేణ తపసేహ శ్రుతేన వా ॥
బ్రాహ్మణ్యం సమనుప్రాప్తం విశ్వామిత్రాదిభిరపైకి ।
యేన యేనాభిధానేన బ్రాహ్మణ్యం క్షత్రియా గతాః ॥
విశేషం జ్ఞాతుమిచ్ఛామి తపసో దానవస్తథా ।
ఏవముక్తః తతో వాక్యమబ్రవీదిదమర్థవత్ ॥
అన్యాయోపగతైర్థ్రవ్యైరాహూయ ద్విజసత్తమాన్।
ధర్మాభికాంక్షీ యజతే న ధర్మ ఫలమశ్నుతే ॥
జపం కృత్వా తథా తీవ్రం ధనలోభాన్నిరంకుశః ।
రాగమోహాన్వీతో హ్యంతే పాపనార్థం దదాతి యః ॥
తేన దత్తానీ దానాని హ్యఫలాని భవంత్యుత ।
తస్య ధర్మప్రవృత్తస్య హింసకస్య దురాత్మనః ॥
న్యాయాగతానాం ద్రవ్యాణాం తీర్థం సంప్రతిపాదనమ్ ।
కామాననభిసంధానం యజేత చ దదాతి చ ॥
స దానఫలమాప్నోతి తచ్చ దానం సుఖోదయమ్ ।
దానేన భోగానాప్నోతి స్వర్గం సత్యేన గచ్ఛతి ॥
తపసా తు సుతప్తేన లోకాన్విష్టభ్య తిష్ఠతి ।
సత్యం తు తపసః శ్రేయస్తస్మాజజ్ఞానం గురు స్కృతమ్ ॥
శ్రూయతే హీ తపస్సిద్ధాః క్షత్రోపేతా ద్విజాతయః ।
విశ్వామిత్రో నరపతిః మాంధాతా సంకృతిః కపిః ॥
కాశ్యశ్చ పురుకుత్సశ్చ శలో గృత్సమదః ప్రభుః ।
ఆర్ష్టి షేణోఽజమీఢ్చశ్చ భార్గవ్యోమస్తథైవ చ ॥
కక్షివాంశ్చైవౌశిజశ్చ నృపశ్చ శిశిరస్తథా ।
రథాంతరః శౌనకశ్చ విష్ణువృద్ధాదయో నృపాః ॥
క్షత్రోపేతాః స్మృతాః హ్యేతే తపసా ఋషితాం గతాః ।
ఏతే రాజర్షయః సర్వే సిద్ధిం తు మహతీం గతాః ॥
అత ఊర్థ్వం ప్రవక్ష్యామి అయోర్వంశం మహాత్మనః ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోకే మధ్యమఖాగే తృతీయ ఉపోద్ఘాతపాదే భార్గవచరితే అమావసువంశానుకీర్తనం నామ షటిషష్టితమోఽధ్యాయః ॥
ఋషులిట్లు ప్రశ్నించిరి. విశ్వామిత్రుఁడు మొదలయిన నృపులచే బ్రాహ్మణ్యముసమధిగతమయినది, దానినివారు ఏ విధమైన లక్షణముచే, ధర్మముచే, పాండిత్యముచే, తపస్సుచే పొందిరి? ఏ ఏ నామములతో బ్రాహ్మణ్యమును క్షత్రియులు. పొందిరి? తపస్సు చేతనా, దానము చేతనా, విశేషముగా తెలియగోరు చున్నాము. ఇట్లు అడుగబడి అర్ధవద్వాక్యముల సాతఁడిట్లనెను. ధనవంతుఁడు అన్యాయముగా సంపాదింపఁబడిన ధనాది ద్రవ్యములచే ద్వీజసత్తములను ఆహ్వానించి, ధర్మాభికాంక్షియై యజ్ఞమాచరింప ధర్మఫలము సాతఁడు పొందఁడు, (79) ఒక వ్యక్తి ధనలో. భాదిగుణములచే నీరంకుశుఁడయి, రాగమోహాన్వితుఁడై ప్రవర్తించి, తుదిని తన్ను. పవిత్రీకరించుకొనుటకు తీవ్రముగా జపతపములాచరించి, అధికముగా దానము లొసంగీన, ఆతని దానములు ఫలరహితములగును. హింసకుఁడు దురాత్మకుఁడు ధర్మప్రవృత్తిచే ఉత్తమకార్యములు చేయగోరును ధనము నన్యాయముగా సంపాదించీ ఆతఁడు దానములు చేయవచ్చును, యజ్ఞముల నాచరింపవచ్చును. ఇది వట్టి మోహము. ఆ ... దురాత్ముని కలంకీతమైన దానము సత్పలితము నీయదు. ఒక వ్యక్తి ధర్మార్జితములైన విత్తములను , అరులయిన వారి కొసంగిన, ఒక వ్యక్తి.. మనస్సులో కోరికల కాంక్షింపక దానము లొసంగిన, పూజ లొనర్చిన ఆతఁడు దాన ఫలమును పొందును. ఆ ధానము సుఖము నొసంగును దానముచే భోగము నొందును. పత్యముచే స్వర్గము నొందును. సుతప్త తపస్సుచే ఉత్తమ లోకములు చేరి యందుండును. తపస్సు కంటే సత్యము. శ్రేయోదాయకము. సత్యము కంటే జ్ఞానము శ్రేష్ఠము. ద్విజాతులయిన క్షత్రియులు బ్రాహ్మణత్వమును తపస్సుచే పొందిరి. నరపతియైన విశ్వామిత్రుఁ డు, మాంధాత, సంకృతి, కపి, కాశ్యుఁడు, పురుకుత్సుడు, శల్యుడు, ప్రభుండైన గృత్సమదుఁడు, ఆర్ట్స్ షేణుఁడు, అజామీథుఁడు, భార్గవ్యోముఁ డు, కక్షివంతుఁడు, ఔసీజుఁడు, శిశిరుఁడు, రథాంతరుఁడు, శౌనకుఁడు, విష్ణువృద్ధుఁడు, ఇతర నృపులు క్షత్రోపేతులు. వీరందరు ఋషిత్వమును తపస్సుచే పొందిరి. ఆ రాజర్షులందరు గొప్ప సిద్ధిని పొందిరి. ఇక ముందు మహాత్ములయిన ఆయువువంతాదుల గూర్చి చెప్పేదను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యమభాగమున, తృతీయోపోదాతపాదమునందు, భార్గవచరితమున అమావసు వంశానుకీర్తనమను అరువదిఆరవ అధ్యాయము.
Summary of chapter 104 of the Brahmānda Mahā Purana is as follows:
In celebrating tone, this section sings the praises of the future Manus and the prosperous, virtuous worlds that will flourish under their compassionate rule. It describes how future earth will be filled with abundance, peace, and spiritual devotion under their benevolent stewardship. The narrative inspires a joyful, optimistic vision of the future, reaffirming that divine goodness forever triumphs across all temporal cycles.