69 - కార్తవీర్య సంభవము

సూత ఉవాచ :-

యదోర్వంశం ప్రవక్ష్యామి జ్యేష్ఠస్యోత్తమతేజసః ।

విస్తరేణానుపూర్వ్యా చ గదతో మే నిబోధత ॥

యదోః పుత్రా బభూవుర్హి పంచ దేవసుతోపమాః ।

సహస్రజిదథ శ్రేష్ఠః క్రోష్టుర్నీలోంజికో లఘుః ॥

సహస్రజిత్సుతః శ్రీమాన్ శతజిన్నామ పార్థివః ।

శతజిత్తనయాః ఖ్యాతాస్త్రయః పరమధార్మికాః ॥

హైహయశ్చ హయశ్చైవ రాజా వేణుహయస్తథా ।

హైహయస్య తు దాయాదో ధర్మనేత్ర ఇతి శ్రుతః ॥

ధర్మనేత్రస్య కుంతిస్తు సంజ్ఞేయస్తస్య చాత్మజః ।

సంజ్ఞేయస్య తు దాయాదో మహిష్మాస్నామ పార్ధివః ॥

ఆసీన్మహిష్మతః పుత్రో భద్రసేనః ప్రతాపవాన్ ।

వారాణస్యధిపో రాజా కఠితః పూర్వ ఏవ హి ॥

భద్రసేనస్య దాయాదో దుర్మదో నామ పార్థివః ।

దుర్మదస్య సుతో ధీమాన్ కనకో నామ విశ్రుతః ॥

కనకస్య తు దాయాదాశ్చత్వారో లోక విశ్రుతిః ।

కృతవీర్యః కృతాగ్నిశ్చ కృతవర్మా తథైవ చ ॥

కృతౌజాశ్చ చతుర్దోఽభూత్కృతవీర్యాత్మజోఽర్జునః ।

జజ్ఞే బాహుసహస్రేణ సప్తద్వీపేశ్వరో నృపః ॥

స హి వర్షాయుతం తప్త్వా తపః పరమదుశ్చరమ్ ।

దత్తమారాధయామాస కార్తవీర్యోఽత్రిసంభవమ్ ॥

తస్మై దత్తో వరాన్ప్రాదాచ్చతురో భూరితేజసః ।

పూర్వం బాహుసహస్రం తు స వన్రే ప్రథమం వరమ్ ॥

అధర్మం ధ్యాయమానస్య సహసాస్మాన్నివారణమ్ ।

ధర్మేణ పృథివీం జిత్వా ధర్మేణైవానుపాలనమ్ ॥

సూతుఁడిట్లనెను. యయాతికి జ్యేషుఁడు యదువు. ఆతఁడుత్తమ తేజస్వి. ఆనుపూర్వికముగా నతని గూర్చి చెప్పెదను. గ్రహింపుఁడు. యదువునకు దేవసుతోపములయిన యైదుగురు పుత్రులు. వారు సహస్రజిత్తు ఇతఁడు జ్యేష్ణుఁడు శ్రేష్టుండు. కోష్ణువు, నీలుఁడు, అంజీకుఁడు, లఘువును. (2) సహస్రజిత్సుతుఁడు శతజిన్నాముఁడు రాజు. శతజిత్తనయులు మువ్వురు. వారు పరమధార్మికులు. ప్రఖ్యాతులు వారు హైహయుం డు, హయుఁడు, వేణుహయుఁడు. హైహయునియొక్కదాయాది ధర్మనేత్రుఁడు అని విఖ్యాతుఁడు. ధర్మనేత్రునకు కుంతి, కుంతికి సంజేయుడు, సంజేయునకు మహిష్మాన్ పార్థివుఁడు పుత్రులు మహిష్మంతునకు భద్రసేనుఁడు పుత్రుఁడు. అతఁడు ప్రతాపవంతుఁడు. ఆతఁడు కాశీరాజు. ఇంతకుంబూర్వము చెప్పబడినాఁడు. (6) భద్రసేనుని దాయాది దుర్మదుఁడు, దుర్మదుని కుమారుఁడు కనకుఁడు. ఇతఁడుధీమంతుఁడుగా ప్రసిద్ధుఁడు. కసకునకుపుత్రులు నల్వురు. లోకవీశ్రుతులు. వారుకృతవీర్యుఁడు, కృతాగ్ని, కృతవర్మ, కృష్ణాజులు కృతవీర్యునికుమారుఁడు అర్జునుఁ డు. ఆతఁడు బాహుసహస్రముచే సప్తద్వీపేశ్వరుఁడయిన రాజు. కార్తవీర్యుఁడు పదివేల సంవత్సరములు తపస్సు చేసెను. ఆ తపస్సు చాలదుశ్చరమయినది. తత్తపస్సుచే ఆతఁడు అత్రిసంభవుఁడయిన దత్తుని ఆరాధించెను. దత్తుఁడు భూరితేజస్వంతములయిన నాలుగు వరముల నతని కొసఁగెను. ముందుగా మొదటి వరముగా వేయిబాహువులను కోరెను రెండవవరము అధర్మమాచరింపగోరువానిని వెంటనే దాని నుండీ, నివారించుట. భూమీని ధర్మముగా జయించి, ధర్మముగా దానిని పాలించుట మూడవ వరము. (10)

సంగ్రామాoస్తు బహూన్ జీత్వా హత్వా చారీన్ సహస్రశః ।

సంగ్రామే యుధ్యమానస్య వధః స్యాత్ప్రధనే మమ ॥

తేనేయం పృథివీ కృత్స్నా సప్తద్వీపా సపత్తనా ।

సప్తోదధిపరిక్షిప్రా క్షాత్రేణ విధినా జితా ॥

తస్య బాహుసహస్రం తు యుధ్యతః కిల యోగతః ।

యోగో యోగేశ్వరస్యేవ ప్రాదుర్భవతి మాయయా ॥

తేన సప్తసు ద్వీపేషు సప్తయజ్ఞశతాని వై ।

కృతాని వీధినా రాజ్ఞా శ్రూయతే మునిసత్తమాః ॥

సర్వే యజ్ఞా మహాబాహోస్తస్యాసన్భూరితేజసః ।

సర్వే కాంచనవేదీకాః సర్వే యూపైశ్చ కాంచనైః ॥

సర్వైర్దేవైర్మహాభాగైర్వమానస్థైరలంకృతాః ।

గంధర్వైరప్సరోభిశ్చ నిత్యమేవోపశోభితాః ॥

తస్య రాజ్ఞో జగౌ గాథాం గంధర్వో నారదస్తదా ।

చరితం తస్య రాజర్షేర్మహిమానం నిరీక్ష్య చ ॥

న నూనం కార్తవీర్యస్య గతిం యాస్యంతీ మానవాః ।

యజ్ఞైర్దానైస్తపోభిశ్చ విక్రమేణ శ్రుతేన చ ॥

ద్వీపేషు సప్తసు స వై ధన్వీ ఖడ్గీ శరాసనీ ।

రథీ రాజా సానుచరో యోగాచ్చైవానుదృశ్యతే ॥

అనష్టద్రవ్యతా చాసీన్న క్లేశో న చ విభ్రమః ।

ప్రభావేణ మహారాజ్ఞః ప్రజా ధర్మేణ రక్షితాః ॥

పంచాశీతిసహస్రాణి వర్షాణాం స నరాధిపః ।

ససర్వరత్నభాక్సమ్రాట్ చక్రవర్తీ బభూవ హ ॥

స ఏష పశుపాలోఽభూత్క్షత్రపాలస్తథైవ చ ।

స ఏవ వృష్ట్యా పర్జన్యో యోగిత్వాదర్జునోఽభవత్ ॥

ఇక నాల్గవవరము. “నేను బహు యుద్ధములు జయించవలెను. వేలాది శత్రువులను చంపవలయును. నేను యుద్ధము చేయుచుండగ నేను వధింపఁబడవలేను”. ఆ వరముతో సప్తద్వీపము సపత్తనము, సపోదధీ పరీక్షిప్తము, అయిన భూమినీ విధివత్తుగా క్షాత్రము వలననే యతం డు జయించెను. (14) ఆతఁడు యుద్ధము చేయుచు యోగబలమున బాహుసహస్రము పొందెను. యోగేశ్వరునకు యోగమువలన సహస్రబాహువులు కల్గినట్లే మాయచే నతనికి వేయి చేతులు కలుగును. ఆతఁడు సప్తద్వీపముల యందు సప్త యజ్ఞ శతముల నొనరించెనని విందుము. ఆతని యజ్ఞములన్నియును మహా వైభవోపేతములు. ఆ యజ్ఞములలో నన్నియు కాంచనవేదికలు, సర్వ యజ్ఞ యూపములు కాంచనయుతములు, ఆ యజ్ఞయూషములు కాంచనయుతములు, ఆ యజ్ఞములు విమానములలో నాసీనులైన మహానుభావులయిన దేవతలచే నలంకృతములు. గంధర్వులతో అప్సరలతో యజ్ఞములు నిత్యముపశోభితములు. ఆ రాజర్షియొక్క చరితమును మహిమమును చూచి నారదుఁడను గంధర్వుఁడు ఆ రాజుయొక్క కీర్తిని గాథగా పాడెను. “యజ్ఞములచేగాని, దానములచేగానీ, తపస్సులచేగానీ, వీక్రమముచేగానీ, పాండిత్యముచేగానీ మానవులెవ్వరు కార్తవీర్యుని గతిని పొందజాలరు. సప్తద్వీపములయందు సానుచరుఁడై యోగముచే రాజు కనుపించును. ఆతఁడు ధన్వి, ఖడ్డి, శరాసనుఁడు, రథికుఁడు. ఆ రాజు యొక్క ప్రభావముచే ప్రజలు ధర్మయుతముగా రక్షింపఁబడిరి. ప్రజలకు ద్రవ్యనష్టము లేదు. క్లేశములేదు. విభ్రమములేదు. అతఁడు ఎనుబదియైదు వేలసంవత్సరములు సర్వరత్నభాజనుఁడై చక్రవర్తిగా నుండెను. ఆతఁడే పశు పాలుఁడు క్షేత్రపాలుఁడు తనయోగశక్తిచే ఆతఁడే వర్షపురాజు పర్జన్యుఁడు.

స వై బాహుసహస్రేణ జ్యాఘాతకఠినేన చ ।

భాతి రశ్మిసహస్రేణ శారదేనైవ భాస్కరః ॥

స హి నాగసహస్రేణ మాహిష్మత్యాం నరాధిపః ।

కర్కోటకసభాం జిత్వా పురీం తత్ర న్యవేశయత్ ॥

స వై వేగం సముద్రస్య ప్రావృట్కాలేంబుజేక్షణః ।

క్రీడన్నేవ సుఖోద్విగ్నః ప్రావృట్కాలం చకార హ ॥

లులితా క్రీడతా తేన హేమస్రగ్దామమాలినీ ।

ఊర్మిముక్తార్తసన్నాదా శంకితాభ్యేతి నర్మదా ॥

పురా భుజసహస్రేణ స జగాహే మహార్ణవమ్ ।

చకారోద్వృత్తవేలం తమకాలే మారుతోద్ధతమ్ ॥

తస్య బాహుసహస్రేణ క్షోభ్యమాణే మహోదధో ।

భవంతి లీనా నిశ్చేష్టాః పాతాలస్థా మహాసురాః ॥

చూర్ణీకృతమహావీచిలీనమీనమహావిషమ్ ।

పతితావిద్ధఫేనౌఘమావర్తక్షిప్తదుస్సహమ్ ॥

చకార క్షోభయన్రాజ దోఃసహస్రేణ సాగరమ్ ।

దేవాసురపరిక్షిప్తం క్షీరోదమివ సాగరమ్ ॥

మందరక్షోభణభ్రాంతమమృతోత్పత్తి హేతవే ।

సహసా విద్రుతా భీతా భీమం దృష్ట్వా నృపోత్తమమ్ ॥

నిశ్చితం నతమూర్ధానో బభూవుశ్చ మహోరగాః ।

సాయాహ్నే కదలీఖండా నివాతే స్తిమితా ఇవ ॥

జ్యామారోప్య దృఢే చాపే సాయకైః పంచభిః శతైః ।

లంకేశం మోహయిత్వా తు సబలం రావణం బలాత్ ॥

నిర్జిత్య వశమానీయ మాహిష్మత్యాం బంధ తమ్ ।

తతో గత్వా పులస్త్యస్తమర్జునం చ ప్రసాధయత్ ॥

జ్యాఘాతకఠినములైన తనబాహుసహస్రముతో రాజు శరత్కాలమందలి భాస్కరునీవలె కిరణ(రశ్మి సహస్రముతో ప్రకాశించెను. వేయి ఏనుఁగులతో రాజు, మాహిష్మతియందు కర్కోట సభను జయించి, తనపట్టణమునచ్చట నిర్మించెను. ప్రావృట్కాలమందలి అంబుజముల వంటి నేత్రములు కలిగిన రాజు, వర్షాకాలమున సముద్ర తరంగములను నిరోధించి సుఖోద్విగ్నుఁడై క్రీడించిన వానివలెనే కృత్రిమ ప్రావృట్కాలమును చేసెను. (27) ఆతనిచే ఇటునటు కంపింపఁబడి తరంగములచే ముక్తమై ఆర్తసన్నాదయై శంకింపఁబడి నర్మద ఆ మహారాజును చేరెను. పూర్వమొకప్పుడు రాజు, భుజసహస్రముతో సముద్రములో ప్రవేశించి, అకాలమున లేచిన మహాకల్లోల తరంగమువలె సముద్రవేలను చేసెను. సముద్రమాతని సహస్రబావులచే సంక్షోభింపఁబడగా పాతాళమందలి రాక్షసులు అందే నిశ్చేష్టులయి లీన మయియుండిరి. సహస్రబాహువులతో, క్షీరసముద్రమును రాక్షసులు దేవతలు మధించినట్లు క్షోభింపచేసెను. మహావీచుల యందు లీనమయిన మహామీనములను ఆరాజుచూర్ణీకృత మొనర్చెను. ఫేనము(నురగలు) పైకి క్రిందికి కొట్లాడెను. ఎన్నియో సుడిగుండములు ఏర్పడి సముద్రము కెరటములతో దుస్సహమయ్యెను. కార్తవీర్యునిచే సముద్ర సంక్షోభము పూర్వము క్షీరసముద్రము అమృతముకొలకు మందరపర్వతముతో చిలికినట్లుండెను. భయంకరమైన కార్తవీర్యునిచూచి మహోరగములు భీతావహములయ్యెను. ఆషాములు తమతలలడించుకొని వెంటనే పారిపోయెను. మహోరగములు తలలు వంచుకొని యున్నప్పుడు సాయాహ్నమున, గాలిలేనప్పుడున్న కదలీఖండములవలెనుండెను. దృఢమయిన చాపమునందు నారీని అనుసంధించి, ఐదువందలబాణములను పూంచెను. తన శౌర్యముచే లంకేశుఁడయిన రావణుని మూర్చ పొందజేసెను. ఆతనిని యుద్ధమున జయించి వశపరచుకొనెను. “ఆతనిని మాహిష్మతీ నగరమునకు తీసికొనివచ్చి బంధించెను. తరువాత పులస్త్యుఁడు కార్తవీర్యునిచేరీ, శాంతపరచి ప్రసన్నుని చేసెను. (34)

ముమోచ రాజా పౌలస్త్యం పులస్త్యేనానుయాచితః ।

తస్య బాహుసహస్రస్య బభూవ జ్యాతలస్వనః ॥

యుగాంతేంబుదవృందస్య స్ఫుటితస్యాశనేరివ ।

అహో మృధే మహావీర్యో భార్గవస్తస్య యోఽచ్ఛినత్ ॥

ముదే సహస్రం బాహూనాం హేమతాలవనం యథా ।

తృషితేన కదాచిత్స భిక్షితశ్చిత్రభానునా ॥

సప్తదీపాంశ్చిత్రభానోః ప్రాదాద్భిక్షాం విశాం పతిః ।

పురాణి ఘోషాన్గ్రామాంశ్చ పత్తనాని చ సర్వశః ॥

జజ్వాల తస్య బాణేషు చిత్రభానుర్ధిధక్షయా ।

స తస్య పురుషేంద్రస్య ప్రతాపేన మహాయశాః ॥

దదాహ కర్తవీర్యస్య శైలాంశ్చాపి వనాని చ ।

స శూన్యమాశ్రమం సర్వం వరుణస్యాత్మస్య వై ॥

దదాహ సవనాటోపం చిత్రభానుః స హైహయః ।

యం లేభే వరుణః పుత్రం పురా భాస్వంతముత్తమమ్ ॥

వసిష్ఠనామాస మునిః ఖ్యాత ఆపవ ఇత్యుత ।

తత్రాపవస్తదా క్రోధాదర్జునం శస్తవాన్విభుః ॥

యస్మాన్న వర్జితమిదం వనం తే మమ హైహయ ।

తస్మాత్తే దుష్కరం కర్మ కృతమన్యో హనీష్యతి ॥

అర్జునో నామ కౌంతేయః స చ రాజా భవిష్యతి ।

అర్జునం చ మహావీర్యో రామః ప్రహరతాం వరః ॥

ఛిత్వా బాహుసహస్రం వై ప్రమథ్య తరసా దిలీ ।

తపస్వీ బ్రాహ్మణశ్చైవ వధిష్యతి మహాబలః ॥

తస్య రామస్తదా హ్యాపీన్మృత్యుః శాపేన ధీమతః ।

రాజ్ఞా తేన వరశ్చైవ స్వయమేవ వృతః పురా ॥

పులస్త్యునిచే యాచింపఁబడి రాజు పౌలస్త్యుని (రావణుని) విముక్తుని చేసెను. ఆతనిబాహుసహస్రముచే కలిగిన వంటి శబ్దము యుగాంతమున పిడుగులతో దద్దరిల్లఁజేసిన మేఘధ్వనివలే నుండెను. అహో ! భార్గవుండు మహావీరుఁడు. ఏలయన యుద్దభూమీలో ఆతని సహస్రబాహువులను, బంగారు తాళవనమేమోయన్నట్లు నరికి వైచెను. ఒకప్పుడు దాహపీడుతుఁడు, క్షుధార్తుఁడునైన అగ్నిహోత్రునిచే బిక్ష యాచింపఁబడెను. అగ్నిహోత్రునకు రాజు సప్తద్వీపములను బిక్షమొసంగెను, పట్టణముల ఘోషములు, గ్రామములు పట్టణములు వీని. నన్నింటిని, చిత్రభానువు తన బాణములచే జ్వలింపఁజేసెను. మహాయశస్వి పురుషేంద్రుఁడయిన అగ్ని, కార్తవీర్యుని ప్రతాపముచే పర్వతములను వనములను దహించి వైచెను. హైహయునీతో కూడి చిత్రభానువు (వరుణుని కుమారుని) యొక్క శూన్యమైన యాశ్రమమును సర్వము దగ్గ పటల మొనర్చెను. అతని పేరు వసిష్ఠుఁడు. ఆతని వరుణుఁడు పొందెను. ఆ వసిష్ఠసాముఁడయిన ముని తరువాత ‘ఆపవ’ అనునామమును చెందెను. ఆ యాపవ మునీ క్రోధముతో అర్జునుని శపించెను. (44) “ఓహైహయ! సావనమును నీవు విడువని కారణమున, వేళకరాజు అర్జునుఁడనువాఁడు. కుంతీసుతుఁడు, రాజగును. ఆప్పుడు నీవు చేసిన దుష్కరమైనకర్మలను అతిశయించును. ప్రహరించువారిలో శ్రేష్ఠుఁడగు పరశురాముఁడు, నీసహస్రబాహువులను ఖండించును. ఒకముని రాముఁడు గొప్ప పరాక్రమము శౌర్యముగల బ్రాహ్మణుఁడు, అర్జునునివధించును. ధీమంతుఁ డయిన ఆ ఋషియొక్క శాపముచే రాముఁడు ఆ మృత్యువునకు కారణుఁడయ్యెను. పూర్వము రాజేయిట్టీ వరమును స్వయముగా కోరుకొనేను.

తస్య పుత్రశతం త్వాసీత్పంచ తత్ర మహారథాః ।

కృతాస్త్రాః బలినః శూరా ధర్మాత్మానో యశస్వినః ॥

శూరశ్చ శూరసేనశ్చ వృషాస్యో వృష ఏవ చ ।

జయధ్వజో వంశకర్తా అవంతిషు విశాంపతిః ॥

జయధ్వజస్య పుత్రస్తు తాలజంఘః ప్రతీపవాన్ ।

తస్య పుత్రశతం త్వేవం తాలజంఘ ఇతి శ్రుతమ్ ॥

తేషాం పంచ గణా ఖ్యాతా హైహయానాం మహాత్మనామ్ ।

వీతిహోత్రాశ్చ సంజాతా భోజాశ్చావంతయస్తథా ॥

తుండికేరాశ్చ విక్రాంతాస్తాలజంఘాస్తథైవ చ ।

వీతిహోత్రసుతశ్చాపి అనంతో నామ పార్థివః ॥

దుర్జయస్తస్య పుత్రస్తు బభూవామిత్రకర్శనః ।

అనష్టద్రవ్యతా చైవ తస్య రాజ్ఞో బభూవ హా ॥

ప్రభాపేణ మహారాజః ప్రజాస్తాః పర్యపాలయత్ ।

న తస్య విత్తనాశః స్యాన్నష్టం ప్రతిలభేచ్చ సః ॥

కార్తవీర్యస్య యో జన్మ కథయేదిహ ధీమతః ।

వర్థంతే విభశ్శశ్వద్ధర్మశ్చాస్య వివర్థతే ॥

యథా యష్టా యథే దాతా తథా స్వర్గే మహీపతే ॥

ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే వాయుప్రొక్తే మధ్యవభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే భార్గవచరితే కార్తవీర్యసంభవో నామ ఏకోనసప్తతీతమోఽధ్యాయః ॥

ఆతనికి నూర్గురు పుత్రులు. వారిలో ఐదుగురు సుహారథులు. వారు అస్త్ర విద్యయందారితేరినవారు. బలవంతులు, శూరులు, ధర్మాత్ములు, యశస్వంతులు. వారు శూరుఁడు, శూరసేనుఁడు, వృషాస్యుఁడు, వృషుఁడు, జయధ్వజుఁడును. వారి వంశకర్త జయధ్వజుఁడు: ఆతఁడు అవంతికీ రాజు, (50) జయధ్వజుని పుత్రుఁడు తాలధ్వజుఁడు. ఇతఁడు ప్రతాపవంతుఁడు. ఆతనికీ నూరుగురు పుత్రులు, వారు తాలజంఘులనుపేర ప్రఖ్యాతులు. ఈ విధముగా హైహయులలో పంచవర్గములవారు మహాత్ములు వారు వీతిహోత్రులు, భోజులు, ఆవంతులు, వీక్రాంతులయిన తుండికేరులు మఱియు తాలధ్వజులు. వీతిహోత్రునీ సుతుఁడు అనంతుఁడను పార్థివుండు. అనంతుని పుత్రుఁడు. దుర్జయుఁడు. ఆతఁడు శత్రుకర్శనుండు. “అనష్టద్రవ్యత” (ధనము పోకుండనుండుట) అనువరమును రాజు పొందెను. ఆత్మీయమైన గొప్ప ప్రభావముతో మహారాజు తన ప్రజలను పాలించెను. ఆతఁడు విత్తమునెన్నడును పోగొట్టుకోనలేదు. పోయినదెల్ల నాతఁడు మరల పొందెను. ధీమంతుఁడైన కార్తవీర్యుని యొక్క జన్మ చరిత్రనెవ్వఁడు చెప్పుతో ఆతని వీభవ మధికమగును అతని ధర్మము శాశ్వతముగా వృద్ధిపొందును. ఆతఁడు స్వర్గమున యజ్ఞముల చేసినయతఁడు, దానము లాచరించిన యతఁడు గౌరవింపబడునట్లు గౌరవింపఁబడును.

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యమభాగమున తృతీయోపోద్ఘాతపాదమున భార్గవచరితమున కార్తవీర్యసంభవమను అరువదితొమ్మిదవ అధ్యాయము.