64 - నీమివంశానుకీర్తనము

సూత ఉవాచ :-

అనుజస్య వికుక్షేస్తు నిమేర్వంశం నీబోధత

యోఽసౌ నివేశయామాస పురం దేవపురోపమమ్

జయంతమితీ విఖ్యాతం గౌతమస్యాశ్రమాంతీకమ్

యస్యాన్వయే జజ్ఞే వై జనకో నృపసత్తమః

నిమిర్నామ సుధర్మాత్మా సర్వసత్త్వనమస్కృతః

ఆసేత్పుత్రో మహారాజ చోక్ష్వాకోర్భూరితేజసః

స శాషేన వసిష్ఠస్య విదేహః సమపద్యత

తస్య పుత్రో మిథిర్నామ జనీతః పర్వభిస్తిభిః

అరణ్యాం మధ్యమానాయాం ప్రాదుర్భూతో మహాయశాః

నామ్నా మిథిరీతి ఖ్యాతో జననాజనకోఽభవత్

మిథిర్నామ మహావీర్యో యేనాసౌ మిథిలాభవత్

రాజాఽసౌ నామ జనకో జనకాచ్చాప్యుదావసుః

ఉదావసోస్తు ధర్మాత్మా జాతోఽసౌ నందివర్ధనః

నందివర్ధనతః శూరః సుకేతుర్నామ ధార్మికః

సుకేతోరపి ధర్మాత్మా దేవరాతో మహాబలః

దేవరాతస్య ధర్మాత్మా బృహదుక్త ఇతి శ్రుతః

బృహదుక్టస్య తనయో మహావీర్యః ప్రతాపవాన్

మహావీర్యస్య ధృతిమాన్ సుధృతీస్తస్య చాత్మజః

సుధృతే రపి ధర్మాత్మా ధృష్టకేతుః పరంతపః

ధృష్టకేతుసుతశ్చాపి హర్యశ్వో నామ విశ్రుతః

హర్యశ్వస్య మరుః పుత్రో మరోః పుత్రః ప్రతింబకః

ప్రతింబకస్య ధర్మాత్మా రాజాకీర్తిరథ స్మృతః

పుత్రః కీర్తిరథస్యాపి దేవమీధ ఇతి శ్రుతః

దేవ మీధస్య విబుధో విబుధస్య మహాధృతిః

మహాధృతీసుతో రాజా కీర్తిరాతః ప్రతాపవాన్

కీర్తిరాతాత్మజో విద్వాన్ మహారోమేతి విశ్రుతః

సూతుఁడిట్లు చెప్పెను.

నీమివంశము నెఱుంగుము. నీమీ వికుక్షి యొక్క అనుజుఁడు, వికుక్షి జయంతమును దేవతానగరోపమమయిన విఖ్యాతనగరమును గౌతముని యొక్క ఆశ్రమ సమీపమున నిర్మించెను. ఈతని యనవాయము నందే నృపసత్తముఁడయిన జనకుఁడు జన్మించెను. మహాతేజస్వియయిన ఇక్ష్వాకునకు నిమి కుమారుఁడు ఆతఁడో ధర్మాత్ముఁడు, సర్వసత్త్వములచే నమస్కరింపఁబడువాఁడు. ఆతఁడు మహారాజయ్యెను. వసిష్టుని యొక్క శాపముచే నతఁడు వీదేహుఁడయ్యెను. (దేహములేనివాఁడు). ఆతనికి మీథియను కుమారుఁడు మూఁడు పర్వణముల కాలములో, కలిగెను. యజ్ఞము కొఱకు అగ్ని మధ్యమానమగుచుండ ‘అరణి’ యందు ఆ మహారాజుదయించెను. (అరణి - అగ్నిమధనముచేయుట కుపయోగించు కట్ట) మథనము చేయునప్పుడు పుట్టుటచే మీథియను నామ మొందెను. ఈ విధమున పుట్టుటచే నతఁడు జనకుఁడయ్యెను. (5) (జననముచే) మీధి చాల పరాక్రమవంతుండైన రాజు ఆతని పేరు ననుసరించియే ఆతని రాజధాని మీథిల యయ్యెను, ఆతనీనామాంతరము జనకుఁడు జనకుని వారసుఁడు ఉదావసువు ధర్మాత్ముఁడైన నందివర్థనుఁడు ఉదావసుకుమారుడు. సందీ వర్ధనుని కుమారుడు సుకేతువు. సుకేతువు శూరుఁడు ధార్మికుండును. సుకేతుని కుమారుఁడు దేవరాతుఁడు. ఆతఁడు ధర్మాత్ముఁడు. మహాబలుఁడు దేవరాతుని కుమారుఁడు బృహదుక్తుఁడు బృహదడ్డుని తనయుఁడు మహావీరుఁడు మిక్కిలిప్రతాపవంతుఁడు మహావీరునికుమారుఁడు ధృతిమంతుఁడు, ఈతనికుమారుఁడు సుధృతి. సుధృతికి కుమారుఁడు ధృష్టకేతువు, ఇతఁడు ధర్మాత్ముడు పరంతపుఁడును దృష్టకేతువు పుత్రుఁడు హర్యశ్వుఁడు, చాలవిఖ్యాతుఁడు. హర్యశ్వునకు మరుఁడు, మరువునకు ప్రతిబింబకుఁడు, ప్రతిబింబకునకు కీర్తి రథుఁడు కుమారులు. కీర్తిరధుఁడు దేవమీఢుడుగా ప్రఖ్యాతుఁడు. దేవమీఢునకు విబుధుఁడు, విబుధునకు మహాధృతి, మహాధృతికి కీర్తిరాతుఁడు. కుమారులు కీర్తిమంతునికుమారుఁడు మహారోముఁడు, ఆతఁడు విద్వాంసుం డుగా పేరుగన్నవాఁడు.

మహారోష్ణస్తు విఖ్యాతః స్వర్ణరోమాఽవ్యజాయత

స్వర్ణరోమాత్మజశ్చాపి హ్రస్వరోమాఽ భవన్నృప

హ్రస్వరోమాత్మజో విద్వాన్ సరిద్ధ్వజ ఇతి శ్రుతం

ఉద్ఖిన్నా కర్షతా యేన సీతా రాజ్ఞా యశస్వినీ

రామస్య మహిషీ సాధ్వీ సువ్రతా నియతవ్రతా

వైశంపాయన ఉవాచ :-

కథం సీతా సముత్పన్నా కృష్యమాణా యశస్వినీ

కిమర్ధం వాఽకృషద్రాజా క్షేత్రం యస్మిన్ బభూవ హ

సూత ఉవాచ :-

అగ్నిక్షేత్రే కృష్యమాణే అశ్వమేధే మహాత్మనః

విధినా సుప్రయత్నేన తస్మాత్సా తు సముత్థితా

సీరధ్వజానుజాతస్తు భానుమాన్నామ మైథిలః

భ్రాతా కుశధ్వజస్తస్య సకాశ్యధిపతిర్నృపః

తస్య భానుమతః పుత్రః ప్రద్యుమ్నశ్చ ప్రతాపవాన్

మునిస్తస్య సుతశ్చాపి తస్మాదూర్జవహః స్మృతః

ఊర్ణవహాత్సనద్వాజః శకునిస్తస్య చాత్మజః

స్వాగతః శకునేః పుత్రః సువర్చాస్తత్సుతః స్మృతః

సుతో యస్తస్య దాయాదః, సుశ్రుతస్తస్య చాత్మజః

సుశ్రుతస్య జయః పుత్రో జయస్య విజయః సుతః

విజయస్య క్రతుః పుత్రః క్రతోశ్చ సునయః స్మృతః

సునయాద్వీతహవ్యస్తు వీతహవ్యాత్మజో ధృతిః

ధృతేస్తు బహుళాశ్వోఽభూద్బహుళాశ్వసుతః కృతిః

తస్మిన్ సంతిష్ఠతే వంశో జనకానాం మహాత్మనామ్

ఇత్యేతే మైథిలాః ప్రోక్తాః సోమస్యాపి నిబోధత

ఇతి శ్రీబ్రహ్మాండమహాపురాణే వాయుక్త మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే నిమివంశానుకీర్తనం నామ చతుఃషష్టితమోఽధ్యాయః

మహారోమునకు స్వర్ణరోముఁడు సువిఖ్యాతకుమారుడు. స్వర్ణ రోముని కుమారుఁడు హ్రస్వరోముఁడు. ప్రస్వ రోముని కుమారుఁడు సీరధ్వజుఁడు. ఇతఁడు విద్వాంసుఁడు. రాజు భూమిని దున్నుచుండ సీత .ఐయల్వెడలేను.. ఆమె యశస్విని. ఆమె రాముని మహిషి సాధ్వి, సువ్రత. నియతవ్రత.. వైశంపాయనుడిట్లడిగెను. యశస్వినియైన సీత భూమి దున్నబడుచుండ నెట్లు పుట్టెను? రాజు ఆ క్షేత్రమునెందులకు దున్నెను? సూతుఁడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. అశ్వమేధ యజ్ఞమునకై యజ్ఞారమైన యగ్ని (మంటపము) కొకైన స్థలము యజ్ఞవీధిననుసరించి రాజుచే దున్నబడగా సీతఅందుండి బహిర్గమీంచెను. సీరధ్వజుని సోదరుఁడు (తమ్ముఁడు) భానుమంతుఁడను మైథిలేయుఁడు. ఆతఁడే కుశ ధ్వజుఁడు ఆతఁడు కాశీనరగమున కధిపతి ఆ కాశీరాజయిన భానుమంతునకు ప్రతాపవంతుఁడయిన ప్రద్యుమ్నుఁడు పుత్రుఁడు. ఆతని పుత్రుఁ ... డు ముని. ఆతనికి ఊర్జవహుండు జన్మించెను. ఊర్జవహునకు సనధ్వజుఁడు. ఆ సనధ్వజునీ కుమారుఁడు శకునీ . శకుని పుత్రుఁడు స్వాగతుఁ డు. స్వాగతుని పుత్రుఁడు సువర్చసుఁడు, అతని కుమారుఁడు-సుతోయుఁడు, సుతోయునకు సుశ్రుతుఁడు, సుశ్రుతునకు. జయుఁడు, జయునకు వీజయుఁడు వీజయునకు క్రతువు, క్రతువునకు సునయుఁడు, సునయునకు వీతరావ్యుఁడు, వీతరావ్యునకు ధృతి, ధృతికీ బహుళాశ్వుఁడు, బహుళాశ్వునకు కృతి కుమారులు. మహాత్ములయిన జనకుల సంతతి కృతితో సమాప్తి పొందెను. ఈ విధముగా మిథిలావంశము చెప్పఁబడినది. ఇక చంద్రవంశము నెఱుంగుఁడు.

ఇది నీమీవంశానుకీర్తనను అరువది నాలుగవ అధ్యాయము.