70 - డెబ్బదియవఅధ్యాయము

ఋషయ ఊచుః :-

క్రీమర్థం తు వనం దగ్ధమాపవస్య మహాత్మనః

కార్తవీర్యేణ విక్రమ్య తన్నః ప్రబ్రూహి పృచ్ఛతామ్

 రక్షితా స తు రాజర్షిక ప్రజానామితి నః శ్రుతమ్

కథం స రక్షితా భూత్వా నాశయేత తపోవనమ్

సూత ఉవాచ :-

ఆదిత్యో విప్రరూపేణ కార్తవీర్యముపస్థితః

 తృప్తికామః ప్రయచ్ఛాన్నమాదిత్యోఽహం న సంశయః

 రాజోవాచ :-

భగవన్ కేన తే తృప్తిర్భవేత్! బ్రూహి దివాకర

 కీదృశం భోజనం దద్మి శ్రుత్వా చ విదధామ్యహమ్

 సూర్య ఉవాచ :-

స్థావరం దేహి మే సర్వమాహారం దదతాం వర!

 తేన తృప్తో భవేయం వై న తృప్యేఽన్యేన పార్థివ

 రాజోవాచ :-

 న శక్యః స్థావరః సర్వస్తేజసా మానుషేణ తు

 నిర్దగ్ధుం తపసాం శ్రేష్ఠ త్వామేవ ప్రణమామ్యహమ్

ఆదిత్య ఉవాచ :-

 తుష్టస్తేఽహం శరాన్దద్మి అక్షయాన్ సర్వతోముఖాన్

తే క్షిప్తాః ప్రజ్వలిష్యంతి మమ తేజ:సమన్వితాః

 ఆవిద్ధం తేజసా మేఽద్య స్థావరం శోషమేష్యతి

 శుష్కం భస్మ కరిష్యామి క్షణేనైవ నరాధిపః

 తతః శరానథాదిత్యస్త్వర్ణునాయాదదాత్ర్పభుః

తతః సంప్రాప్య స శరాన్ స్థావరం సర్వమేవ హి

 ఆశ్రమానథ గ్రామాంశ్చ ఘోషాంశ్చ నగరాణి చ

తపోవనాని రమ్యాణి వనాన్యుపవనాని చ

ఋషులిట్లడిగిరి. మహాత్ముడైన ‘ఆపవు’ని వనమును కార్తవీర్యుఁడెందులకు దగ్ధమొనర్చెను? తెలిసికొనవలయుననీ యడుగుచుంటిమి. మాకు చెప్పుము. రాజర్షియైన యారాజు ప్రజారక్షకుడని వినియుంటిమి. ప్రజారక్షకుఁడయి ఎట్లు తపోవనమును నాశనమొనర్చెను. సూతుం ఓట్లు ప్రతివచనమిచ్చేను. సూర్యదేవుఁడయిన ఆదిత్యుఁడు విప్రరూపములో కార్తవీర్యునీ సమీపించెను. నేను ఆదిత్యుఁడను. నేను తృప్తినొందు వలకు అన్నము నాకీయుము. నేను నిశ్చయముగా సూర్యదేవతను. రాజిట్లు పలికెను. ఓ భగవంతుఁడో? ఎట్లు? ఏ పదార్థములతో నీకు తృప్తి . యగును? ఓ దివాకర చెప్పుము. ఎట్టి భోజనము నీకొసంగుదును? నీవలన విని నేనట్లు చేసెదను. సూర్యుఁడు. ఓ. దానపరులలో శ్రేష్ఠుఁడా! సర్వస్థావర పదార్థములను నాకాహారముగా నిమ్ము. వానితో నేను తృప్తి నొందెదను. ఓ రాజా ! ఇతర పదార్థములతో తృప్తి చెందను. రాజు: సర్వస్థావర పదార్థములు, తేజస్వంతుఁడైన మనుష్యునిచే నిర్దగ్ధమగుటకు శక్యముకాదు. ఓతపస్విజనశ్రేష్ఠ ! నీకు నమస్కరించుచున్నాను. ఆదిత్యుఁడు : నీవలన సంతుష్టుఁడనైతిని. నేను అక్షయములు సర్వతోముఖములు నయినశరములనిచ్చెదను. వానిని ప్రయోగింపగా నాతేజముతో. కూడికొనియవి ప్రజ్వలించును. నాతేజస్సుచే సర్వస్థావరపదార్థములు మండిపోవును.శుష్కించిపోవును. ఓరాజా! శుషమై భస్మమైనవానినిగా ఒక్కక్షణములోచేసెదను. తరువాత ఆదిత్యుఁడు శరములను ప్రభువునకొసంగెను. ఆశరముల రాజుపొంది, ఆశ్రమములను, గ్రామములను, ఘోషలను, నగరములను రమ్యములయిన తపోవనములను, వనములను, ఉపవనములను, సర్వస్థావరపదార్దములను, ఆరాజు విడిచిన బాణ సమూహములు దహించెను.

తచ్చాపక్షిప్తబాణౌఘా అదహన్స్దావరాన్ నృప !

  నీర్వృక్షా నిస్తృణా భూమీర్దగ్ధా సౌరేణ తేజసా

 ఏతస్మిన్నేవ కాలే తు ఆపవోఽనలమాశ్రితః

దశవర్షసహస్రాణి జలవాసాన్మహానృషిః

  పూర్ణే వ్రతే మహాతేజా ఉదతిష్ఠత్తపోధనః

 సోఽపశ్యదాశ్రమం దగ్ధమర్జునేన మహానృషిః

 క్రోధాచ్ఛశాప రాజర్షం కీర్తితం వో యథా మయా

 క్రోష్టోః శ్రుణుత రాజర్షేర్వంశముత్తమపూరుషమ్

యస్యాన్వవాయే సంభూతో వృష్ణిర్వృష్ణికులోద్వహః

 క్రోష్టోఽరేవో భవత్పుత్రో వృజినీవాన్ మహాయశాః

వార్జినీవతమీచ్ఛంతి స్వాహిం స్వాహావతాం వరమ్

 స్వాహేః పుత్రోఽభవద్రాజా రుశేకుర్దదతాం వరః

 సుతప్రసూతిమిచ్ఛంస్తు రుశేకు: ప్రయతాత్మవాన్

 మహాక్రతుభిరీజే స వివిధైరాప్తదక్షిణైః

 జజ్ఞే చిత్రరథస్తస్య పుత్రః కర్మభిరన్వితః

జజ్ఞే చైత్రరథిర్వీరో యజ్వా విపులదక్షిణః

 శశబిందుః పరం వృత్తం రాజర్షిణామనుష్ఠితః

 చక్రవర్తీ మహాసత్త్వో మహావీర్యో బహుప్రజః

 తత్రానువంశశ్లోకోఽయం యస్మన్గీతః పురాతనైః

 శశబిందోస్తు పుత్రాణాం శతానామభవచ్ఛతమ్

 శ్రీమతామనురూపాణాం భూరిద్రవిణతేజసామ్

తేషాం షట్ వై ప్రధానాస్తు పృథుస్వాహా మహాబలాః

 పృథుశ్రవాః పృథుయశాః పృథుకర్మా పృథుంజయః

 పృథుకీర్తి: ప్రథుర్దాంతో రాజినః శశబిందవః

 సూర్యతేజస్సుచే నిర్వృక్షము నిస్తృణము భూమియయ్యెను. తత్కాలములో ఆపవుఁడు అనలమాశ్రయించి సహస్రవర్షములు జలవాస మను వ్రతమును నిర్వర్తించి, వ్రతమును పరిపూర్తిచేసి జలమునుండి మహర్షి పైకీ వచ్చెను. ఆ మహర్షి, అర్జునుఁడు దగ్గమొనర్చిన స్వకీయాశ్రమమును చూచేను. క్రోధముతో రాజర్షిని, పూర్వము చెప్పిన విధముగా శపించెను. రాజర్షియైన క్రోష్టుయొక్క ఉత్తమ పూరుషమయిన వంశమును వినుము. ఆ క్రోష్టుయొక్క అన్వయమునందే వృష్టి సంభూతుఁడయ్యెను. క్రోష్ఠునకొక్కడే సుతుఁడు. ఆతనిపేరు వృజినీవాన్. మహాయశస్వి స్వాహి, (యజ్ఞమునందు) 'స్వాహా' యను మంత్రములుచ్చరింపబడునట్టి స్వాహావంతులలో శ్రేష్ఠుఁడు. ఇతఁడు వృజినవంతుని కొడుకు స్వాహి పుత్రులలో రుకేశుఁడు దాతలలో శ్రేష్ఠుఁడు పుట్టేను. పుత్రోత్పత్తిని కోరుకొనుచు ప్రయతాత్ముఁడయిన రుకేశుఁడు ఏవిధములయిన యజ్ఞములను వివిధములయిన ఆప్తదక్షిణలతో చేసెను. ఆతనికి చిత్రరధుఁడను పుత్రుఁడుపుట్టెను. ఆతఁడు మహారాజర్షులయొక్క ఉదాత్తక్రియలనాచరించెను. ఆతనికి గొప్ప శీలము పరాక్రమము కలదు. ఆతనిపుత్రుఁడు శశబిందువు. ఆతఁడు చక్రవర్తి. ఆతనికి పెక్కురు పుత్రులు. ఆతని వంశమును గూర్చి పురాతనులు కీర్తించు కము కలదు. “శశబిందువునకు పదివేలమంది పుత్రులు. (వందలమందికీ వందమంది పిల్లలు) వారు తేజస్వంతులు. అనంతధనము కలవారు. వారందరు పితరునకనురూప సంతానము, వారిలో ఆర్గురు మిక్కిలి ప్రధానులు. వీరందరు మహాబలులు. శక్తిమంతులు. వారు పెళ్లి యజ్ఞములనాచరించిరి. వారందరు పృథుశ్రవులు. పృథుయశులు. పృధుకర్ముడు, పృథుంజయుడు పృథుకీర్తి పృథురాంతుఁడు వీరందరు శశబిందుని కుమారులు.

శంసంతి చ పురాణజ్ఞాః పార్థశ్రవసమంతరమ్

 అక్షరస్య సుయజ్ఞస్తు ఉశనాస్త్రత్సుతోఽ భవత్

 ఉశనాః స తు ధర్మాత్మా అవాప్య పృథివీమిమామ్

 అజహారాశ్వమేధానాం శతముత్తమదక్షిణమ్

 మరుత్తస్య తనయో రాజర్షిణామనుప్రతః

 వీరకంబలబర్హిస్తు మరుత్తతనయః స్మృతః

 పుత్రస్తు రుక్మకవచో విద్వాన్ కంబలబర్హిషః

నిహత్య రుక్మకవచః పురా కవచినో రణే

 ధన్వినో నిశితైర్బాణైరవాపశ్రీయముత్తమామ్

 బ్రాహ్మణేభ్యో దదౌ విత్తమశ్వమేధే మహాయశాః

 రాజ్ఞస్తు రుక్మకవచాత్పరావిత్పరవీరహా

 జజ్ఞిరే పంచ పుత్రాస్తు మహాసత్త్వా మహాబలాః

 రుక్మేషుః పృథురుక్మశ్చ జ్యామఘః పరిఘో హరిః

 పరిఘం చ హరించైవ విదేహేఽ స్థాపయత్పితా

రుక్మేషురభవద్రాజా పృథురుక్మస్తదాశ్రయః

 తేభ్యః పరాజితో రాజా జ్యామఘోఽవసదాశ్రమే

 ప్రశాంతస్తు వనే ఘోరే బ్రాహ్మణేన విరోధితః

జగామ ధనురాదాయ దేశమన్యం రథీ ధ్వజీ

 నర్మదాం నృప ఏకాకీమేకలాన్మిరికావనమ్

 ఋక్షవంతం గిరిం గత్వా ముక్తిమంతమథావిశత్

 జ్యామఘస్యాభవద్భార్యా శైబ్యా బలవతీ భృశమ్

 అపుత్రోఽపి స వై రాజా భార్యామన్యాం న విందతి

 తస్యాసిద్విజయో యుద్ధే తతః కన్యామపాప సః

భార్యామువాచ భీతః సన్న్సుషేతీ తు నరేశ్వరః

ఏవముక్తాఽ బ్రవీదేవం కస్యేయం తే స్నుషేతి సా

 యస్తే జనిష్యతే పుత్రః తస్య భార్యా భవిష్యతి                          

 పురాణజ్ఞులు, అక్షరుని పృథుశ్రవుని కుమారునిగా ప్రశంసింతురు. అక్షరుని కుమారుఁడు సుయజ్ఞుండు. ఆతని కుమారుఁడు ఉశనసుం డు. ఉశనుఁడు ధర్మాత్ముఁడు. ఈ భూమినంతటిని పొందెను. ఆతఁడు ఒకవంద - అశ్వమేధములను ఉత్తమదక్షిణలతో నొనర్చెను. ఆతని తనయుఁడు మరుత్తుండు. ఆతఁడు రాజర్షుల యొక్క మార్గము ననుసరించెను. వీరకంబలబర్షి మరుత్తుని కుమారుఁడు. రుక్మకవచుఁడు కంబలబర్షియొక్క కుమారుఁడు. విద్వాంసుఁడు. రుక్మకవచుఁడు పూర్వము యుద్ధమున నీశీతములయినబాణములతో కవచముల ధరించిన వారిని, ధ్వనులను చంపెను.తన్మూలమున ఉత్తమమయినవైభవమును పొందెను. అశ్వమేధమునందు ఆ యశస్వి బ్రాహ్మణులకు అధికముగా విత్తమొసంగేను. రుక్మకవచునకు పరవీరహులు,పరాక్రమవంతులును నైన యైదుగురుపుత్రులు, వారు మహాసత్త్వులు. వారు శత్రువీరులను చంపిరి. వారు రుక్మేషువు పృథురుక్ముఁడు జ్యామఘుఁడు., పరీఘుఁడు మరియు హరి. వీరితండ్రి పరిఘుని హరినీ విదేహ యందుస్థాపించేను, (తండ్రికివారుసుఁడుగా) రుక్మేషువు రాజయ్యెను. పృథుకర్మ ఆతనికి ఆశ్రీతుఁడయ్యెను. ఆతఁడు వారలచే పరాజితుఁడయ్యెను. అందుచే జ్యామఘుఁ డు రాజయినను ఆశ్రమములో నివ-సించెను. ఆతఁడు ప్రశాంతుఁడు. కాని ఘోరమైన వనమున ఒక బ్రాహ్మణునికి విరోధియయ్యెను. అంత తన ధనువును గ్రహించి, రథమునారోహించి ధ్వజము. ప్రకాశించుచుండ, వేకదేశమునను బయలుదేరెను. ఆతఁడు ఒక్కడే, నర్మదకు, తరువాత మేఖలకు, మిరికావనమునకు, ఋక్షవంతగిరికీ, తుదకతఁడు ముక్తిమంతముచేరెను. జ్యామఘుని భార్యశైబ్య. ఆమె చాల బలవతి. పుత్రులు లేకపోయినను రాజు వేడొకతెను పెండ్లియాడలేదు. ఆతఁడు యుద్ధమునందు విజయుఁడయ్యెను. ఆతఁడొక కన్యను (యుద్ధపు కానుకగా) పొందెను. తనభార్యకు భయపడి, ఆమెతో రాజు “ఈమె నీ కోడలు” అని చెప్పెను. ఇట్లు చెప్పగా ఆమె. ఆమె నాకు కోడలగానగుటకు ఏ కుమారునకు సంబంధించినది. అనీ యడిగెను. అంతరాజు ఈమె నీకుఁబుట్టబోవు కుమారునకు భార్యయగును' అనేను.

 తస్యాః సా తపసోద్రేణ శైబ్యా చైవ హ్యసూయత

పుత్రం విదర్భం సుభగా శైబ్య పరిణతా సతీ

 రాజపుత్రస్తు విద్వాంసౌ సుషాయాం క్రథకైశికౌ

 పుత్రౌ విదర్భోఽజనయచ్ఛూరౌ రణవిశారచౌ

  లోమపాదం తృతీయం తు పశ్చాజ్ఞజ్ఞే సుధార్మికమ్

 లోమపాదసుతో బభ్రురాకృతిస్తస్య చాత్మజః

 కౌశికస్య చిదిః పుత్రస్తస్మాచ్చైద్యా నృపాః స్మృతాః

క్రథో విదర్భపుత్రస్తు కుంతీస్తస్యాత్మజోఽభవత్

 కుంతేర్దృష్టః సుతో జజ్ఞే రణే ధృష్టః ప్రతాపవాస్

 ధృష్టస్య పుత్రో ధర్మాత్మా  నిర్వృతిః పరవీరహా

 తస్య పుత్రో దశార్హస్తు మహాబలపరాక్రమః

దశార్హస్య సుతో వ్యోమస్తతో జీమూత ఉచ్యతే

 జీమూతపుత్రో: వీకృతీస్తస్య భీమరథః సుతః

 అథ భీమరథస్యాసీత్పుత్రో రథవరః కిల

 దానధర్మరతో నిత్యం శీలశ్రుతపరాయణః

 తస్య పుత్రో నవరథస్తతో దశరథః స్మృతః

 తస్య చైకాదశరథః శకునిస్తస్య చాత్మజః

 తస్మాత్కరంభకో ధన్వీ దేవరాతోఽభవత్తతః

 దేవక్షత్రో ఽభవద్రాజా దైవరాతిర్మహాయశాః

దేవక్షత్రసుతో జజ్ఞే దేవనః క్షత్రనందనః

 దేవనాత్స మథుర్జజ్ఞే యస్య మేధార్థసంభవః

నందనశ్చ మహాతేజా మధోః పురువసుస్తథా

 ఆసీత్పురువసోః పుత్రః పురుద్వాన్ పురుషోత్తమః

జజ్ఞే పురుద్వతః పుత్రో భద్రవత్యాం పురూద్వహః

ఇక్ష్వాకీ త్వభవద్భార్యా సత్త్వస్తస్యామజాయత

తస్మాత్సత్వగుణోపేతః సాత్వతః కీర్తివర్ధనః

 ఇమాం విసృష్టిం విజ్ఞాయ జ్యామఘస్య మహాత్మనః

 ప్రజావానేతి సాయుజ్యం రాజ్ఞః సోమస్య ధీమతః

ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే

 సప్తతిమోఽధ్యాయః

 శైబ్య ఉగ్రమయిన తపస్సొచరించెను. ఆమె వార్ధక్యమున పుత్రునీ బడసెను. ఆతఁడు విదర్భుఁడు. రాజపుత్రుఁడైన విదర్భుఁడు ఆమె వలన (ఆస్నుషవలన) ఇద్దరు పుత్రులబడసెను. వారు కథకైశికులు వారు విద్వాంసులు. ఆయిరువురు రణవిశారదులు. తరువాత మూడవ కుమారుఁడు కలిగెను ఆతఁడు రోమపాదుఁడు ఆతఁడు సుధార్మికుఁడు; లోమపాదునీ కుమారుఁడు బభ్రువు. బభ్రువుకొమరుఁడు ఆకృతి. కైశికుని కుమారుడు చిది. ఆతనిపుత్రులు, వారసులు రాజులు వారలుచైద్యులు. క్రథుని కొడుకు కుంతి. (క్రథుఁడు ఇంతకుఁబూర్వము చెప్పం బడెను). విదర్భుని కుమారుడు. ధృష్ణుఁడు కుంతికొడుకు, ఆతఁడు యుద్ధములయందు. ధైర్యవంతుడు, ప్రతాపవంతుఁడు. ధృష్ణుని సుతుండు నిర్వతి. అతఁడు ధర్మాత్ముఁడు పరవీరహంత. ఆతనిపుత్రుఁడు దశార్జుఁడు, ఆతఁడుమహాబలపరాక్రముఁడు దశారునిపుత్రుఁడు వ్యోముఁడు. ఆతనితరువాతజీమూతుఁడు జీమూతునికుమారుఁడు ఏకృతి ఆతనికుమారుఁడు భీమరథుఁడు భీమరథునీ కుమారుఁడు రథావరుఁడు రథా వరుఁడు నిత్యము దానధర్మరతుఁడు విద్యాపరాయణుఁడు. శీలవంతుఁడు ఆతనిపుత్రుఁడు నవరథుఁడు ఆతనితరువాతదోయారీ దశరథుఁడు. ఆరనీకుమారుఁడు. ఏకాదశరథుఁడు. ఆతనికుమారుడు శకుని. ఆతనికీకరంభకుఁడు సుతుఁడు. ఆతఁడు చక్కటీధన్వి. ఆతనితరువాత దేవరాతుం డు రాజయ్యను. దేవక్షత్రుఁడు దేవరాతునికుమారుఁడు. ఆతఁడు రాజయ్యెను. దేవక్షత్రునికుమారుఁడు దేవనుఁడు ఆతఁడు క్షత్రియానందనుఁడు  దేవనునకు మధువు పుట్టెను. ఆ మధువు కుమారుఁడు మేధార్థసంభవుఁడయిన పురురవసు. పురురవసు కుమారుఁడు పురుద్వాన్. ఆతం డు పురుషోత్తముడు. భద్రవతీ పురుద్వంతుల పుత్రుఁడు పురూద్వహుడు. ఆతని భార్య ఇక్ష్వాకీ. ఆమెవలన నతని కుమారుఁడు సత్తుండు. (సత్త్వునీకోడుకు) సాత్తుఁడు కీర్తి వర్ధనుఁడు. సత్త్వగుణోపేతుఁడు. మహాత్ముఁడయిన జ్యామఘునీ యీ వీసృష్టినీ తెలిసికొనినవాఁడు పుత్రవంతుఁ డగును ధీమంతుఁడయిన రాజైనసోమునితో సాయుజ్యమును బొందును. .

ఇది వాయుప్రోక్తము మహాపురాణము అయిన బ్రహ్మాండపురాణమున మధ్యమభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున డెబ్బదవ అధ్యాయము.