బ్రహ్మాండ మహా పురాణము
74 - వంశానువర్ణనము
సూత ఉవాచ:-
తుర్వసోస్తు సుతో వహ్నిర్వహ్నేర్గోభానురాత్మజః ।
గోభానోస్తు సుతో వీరస్త్రీసానురపరాజితః ॥
కరంధమస్తు త్రైసానోర్మరుత్తస్తస్య చాత్మజః ।
అన్యస్త్వావిక్షితో రాజా మరుత్తః కఠితః పురా ॥
అనపత్యో మరుత్తస్తు స రాజాఽసీదతి శ్రుతమ్ ।
దుష్కంతం పౌరవం చాపి స వైపుత్రమకల్పయత్ ॥
ఏవం యయాతిశాపేన జరాసంక్రమణే పురా ।
తుర్వసో: పౌరవం వంశం ప్రవివేశ పురా కిల ॥
దుష్మంతస్య తు దాయాదః సరూప్యో నామ పార్థివః ।
నరూప్యాత్తు తథాండీరశ్చత్వారస్తస్య చాత్మజాః ॥
పాండ్యశ్చ కేరలశ్చైవ చోలః కుల్యస్తథైవ చ ।
తేషాం జనపదాః కుల్యాః పాండ్యాశ్చోలాః సకేరలాః ॥
ద్రుహ్యోశ్చ తనయౌ వీరౌ బభ్రుః సేతుశ్చ విశ్రుతో ।
అరుద్ధః సేతుపుత్రస్తు బాభ్రవో రిపురుచ్యతే ॥
యౌవనాశ్వేన సమితౌ కృచ్చ్రేణ నిహతో బలీ ।
యుద్ధం సుమహదాసీత్తు మాసాన్ పరిచతుర్దశ ॥
అరుద్ధస్య తు దాయాదో గాంధారో నామ పార్థివః ।
ఖ్యాయతే యస్య నామ్నా తు గాంధారవిషయో మహాన్ ॥
గాంధారదేశణాశ్చాపి తురగా వాజినాం వరాః ।
గాంధారపుత్రో ధర్మస్తు ధృతస్తస్య సుతోఽభవత్ ॥
ధృతస్య దుర్గమో జజ్ఞే ప్రచేతాస్తస్య చాత్మజః ।
ప్రచేతసః పుత్రశతం రాజానః సర్వ ఏవ తే ॥
మ్లేచ్ఛరాష్ట్రాధిపాః సర్వే హ్యుదీచీం దిశమాస్థితాః ।
అనోశ్చైవ సుతా వీరాస్త్రయః పరమధార్మికాః ॥
సూతుఁడిట్లనెను. వహ్ని తుర్వసుని సుతుఁడు, గోభానుఁడువహ్నికొడుకు. అపరాజితవీరుఁడయినత్రిసానుఁడు గోభానుని పుత్రుఁడు. త్రిసానుకుమారుఁడు కరంధముఁడు. కరంధమునికొడుకు మరుత్తుండు. ఆవిక్షిత్తుయొక్క కుమారుఁడు మరుత్తుండు. ఇతఁడు వేరోకరాజు, ఇంతకుం బూర్వము చెప్పఁబడెను. రాజయిన మరుత్తుఁడు అపుత్తకుండని వినికిడి. ఆతఁడు పూరుని కుమారుఁడయిన దుష్యంతునీ(దుష్యంతుని)దత్తునిగా జేసికోనేను. జరాసంక్రమణవిషయమున పూర్వము యయాతి శాపముచే, పూరువంశమున తుర్వసుఁడు కలిసిపోయెను. దుష్కంతకుని దుష్యంతుని యొక్క దాయాది సరూప్యుఁడను. రాజు. సరూపునకు ఆండీరుఁడు కలిగెను. ఆండీరునకు నల్లురుపుత్రులు. వారు పాంద్యుం డు, కేరలుఁడు, చోలుఁడు, కుల్యుఁడును, వారిరాజ్యములు జనపదములు-పాండ్యులు, కేరళురు, చోళురు, కుల్యులును. ద్రహ్యుని యొక్క కుమారులిర్వురు. వారు బభ్రువు, సేతువులుగా విశ్రుతులు. వారు వీరులు. అరుదుఁడు సేతువుపుత్రుఁడు. బభ్రునికుమారుఁడు రీపువు. ఈ వీరుడైనరాజు యౌవనాశ్వునితో పదునాలుగుమాసములు గొప్ప యుద్ధము చేసెను. అమితమయిన శ్రమ చేయువనాశ్వునిచే యుద్ధముననిహతుఁ డయ్యెను. అరుద్దుని యొక్క దాయాది గాంధరుఁడనురాజు, గాంధారునియొక్క నామముతో తద్వంశము ఖ్యాతము. గాంధారదేశమున పుట్టిన గుఱ్ఱములు శ్రేష్ఠములు. గాంధారునీకొడుకు ధర్ముఁడు. ఆతనికుమారుఁడు. ధృతుఁడు, ధృతుని యొక్క కుమారుఁడు దుర్ధముఁడు. ప్రచేతసుఁడు దుర్దమునికుమారుఁడు, ప్రచేతసునకు నూర్గురు కొడుకులు పుట్టిరి. వారందరు రాజులు. ఉత్తర భాగమున వారందరు మేచ్ఛరాష్ట్రాధిపతులు. 'అను' వునకుముగ్గురు కొడుకులు. వారు వీరులు,పరమధార్మికులు.
సభానరః కాలచక్షుః పరాక్షశ్చేతి విశ్రుతాః ।
సభానరస్య పుత్రస్తు విద్వాన్ కాలానలో నృపః ॥
కాలానలస్య ధర్మాత్మా సృంజయో నామ విశ్రుతః ।
సృంజయస్యాభవత్పు త్రో వీరో నామ్నా పురంజయః ॥
ఆసీదింద్రసమో రాజా ప్రతిష్ఠితయశా దివి ।
మహామనాః సుతస్తస్య మహాశాలస్య ధార్మికః ॥
సప్తద్వీపేశ్వ రో రాజా చక్రవర్తీ మహాయశాః ।
మహామనాస్తు ద్వౌ పుత్రౌ జనయామాస విశ్రుతౌ ॥
ఉశీనరం చ ధర్మజ్ఞం తితిక్షుం చైవ ధార్మికమ్ ।
ఉశీనరస్య పుత్రస్తు పంచ రాజర్షివంశజాః ॥
నృగా కృమీ నవా దర్వా పంచమీ చ దృషద్వతీ ।
ఉశీనరస్య పుత్ర్యస్తు పంచ తాను కులోద్వహాః ॥
తపస్యతః సుమహతో జాతా వృద్ధస్య ధార్మికః ।
నృగాయాస్తు నృగః పుత్రో నవాయా నవ ఏవ తు ॥
కృమ్యాః కృమిస్తు దర్వాయా సువ్రతో నామ ధార్మికః ।
దృషద్వతీసుతశ్చాపి శిబిరాశీనరో ద్విజః ॥
శిబేః శివపురం ఖ్యాతం యౌధేయం ను సృగస్య చ ।
నవస్య నవ రాష్ట్రం తు కృమేస్తు కృమిలా పురీ II
సుప్రతస్య తథాంబష్టా శిబిపుత్రాన్నిబోధత ।
శిభేస్తు శిభయః పుత్రాశ్చర్వారో లోకసమ్మతాః ॥
వృషదర్భః సువీరస్తు కేకయో మద్రకస్తథా ।
తేషాం జనపదాః స్పీతాః కేకయా మద్రకాస్తథా ।
వృషదర్భాః సువీరాశ్చ తితీక్షోః శృణుత ప్రజాః।
తితిక్షురభవద్రాజా పూర్వసాం దిశి విశ్రుతః ॥
వారుసభానరుఁడు,కాలచక్షువు,పరాక్షుఁడనునామములతోప్రఖ్యాతులు. సభానరునిపుత్రుఁడు. విద్వాంసుఁడు. కాతానలుఁడనురాజు. కాలా నలుని కొమరుఁడు సృంజయుఁడు.. అతడుధర్మాత్ముఁడు విశ్రుతుఁడును. సృంజయునకు పురంజయుఁడు. ఆతఁడువీరుఁడు. ఈరాజుఇంద్ర సముఁడు. ఈతనీయశస్సుస్వర్గమునకూడప్రతిష్ఠితము, మహాశాలునకుమహామనుఁడుకుమారుఁడు, ఆతఁడుధార్మికుఁడు. మహామనుఁడుసప్త ద్వీపేశ్వరుఁడు,చక్రవర్తి,మహాయశస్వి. ఆతనికిద్దరు కొమరులు.వారుప్రఖ్యాతులు. ఉశీ నరుఁడొకఁడు. అతఁడుధర్మజుండు. రెండవవాడు తితిక్షువు ఇతఁడుధార్మికుఁడు. ఉశీనరునకు ఉత్తమరాజర్షి వంశజాతలయిన యెదుగురుభార్యలు. వారు నృగ,కృమి,నవ,దర్చ,ఇఁకపంచమపత్నిదృషద్వతి. వారి వలనఉశీనరునకు ఐదుగురు పుత్రికలు, వారుకులోద్వహలు. కులమునకుప్రఖ్యాతిసంపాదించినవారు. గొప్పతపస్సుచేసిన ఉశీనరునకువార్ధక్యమున ధార్మికులు ఉత్తములయిన కుమారులుపుట్టిరి. నృగకుమారుఁడు నృగుండు. నవకునవుడుకుమారుఁడు.కృమికి క్రుమి, దర్వకు సువ్రతుఁడు. ఈతడు ధార్మికుఁడు.దృషద్వతికుమారుఁడుశిబి. అతసీనరుఁడను ప్రఖ్యాతిపొందెను. శిబియొక్కపురముశివపురమనుఖ్యాతిపొందినది. నంగునియొక్క పట్టణముయౌధేయము, నపునీనగరమునవరాష్ట్రము. కృమియొక్కనగరము కృమిలాపురి. సువ్రతునియొక్క నగరముఅంబష్టము. ఇంకశిబీపుత్రులగూర్చి యెఱుంగుఁడుశిబికి నలుగురుపుత్రులు. వారులోకసమ్మతులు. వారువృషదర్బుఁడు, సువీరుఁడు, కేకయుఁడు, మద్రకుడుసు. వారిరాష్ట్రములు(జన పదములు సీతములు. వృద్ధిసంపన్నములు. కేకయులు,మద్రకులు,వృషదరులు,సువీరులు. వారుఇఁకతితిక్షుబిడ్డలగూర్చి వీనుఁడు. పూర్వదశయందు తితిక్షువువిశ్రుతప్రభువయ్యెను.
ఉశద్రథో మహాబాహుస్తస్య హేమః సుతోఽ భవత్ ।
హేమస్య సుతపా జజ్ఞే సుతః సుతపసో బలిః ॥
జాతో మనుష్యయాన్యాం వై క్షీణే వంశ ప్రజేప్సయా ।
మహాయోగీ స తు బలీర్బర్దో యః స మహామనాః ॥
పుత్రానుత్పాదయామాస చాతుర్వర్ణ్యకరాన్ భువి ।
అంగం స జనయామాస వంగం సుహ్మం తథైవ చ ॥
యుద్ధం కలిగం చ తథా వాలేయం క్షత్రముచ్యతే ।
వాలేయాః బ్రాహ్మణాశ్చైవ తస్య వంశకరాః ప్రభోః ॥
బలేస్తు బ్రహ్మణా దత్తా వరాః ప్రీతేన ధీమతః ।
మహాయోగిత్వమాయుశ్చ కల్పస్య పరిమాణకమ్ ॥
సంగ్రామే వాప్యజేయత్వం ధర్మే చైవ ప్రభావతః ।
త్రైలోక్యదర్శనం చైవ ప్రాధాన్యం ప్రసవే తథా ॥
బలేశ్చాప్రతిమత్వం వై ధర్మతత్త్వార్థదర్శనమ్ ।
చతురో నియతాన్వర్ణాంస్త్వం వై స్థాపయితేతి వై ॥
ఇత్యుక్తో విభునా రోజా బలిః శాంతీం పరాంయమౌ ।
కాలేన మహతా వీదాన్వ్యం చ స్థానముపాగతః ॥
తేషాం జనపదాః స్ఫీతాః అంగవంగాశ్చ సుహ్మకాః ।
పుండ్రాః కలింగాశ్చ తథా తేషాం వంశం నిబోధత ॥
తస్య తే తనయాస్సర్వే క్షేత్రజాః మునిసంభవాః ।
సంభూతా దీర్ఘతమసః సుదేష్ణాయాం మహౌజసః ॥
ఋషయః ఊచుః :-
కథం బలే: సుతాః పంచ జనీతాః క్షేత్రజాః ప్రభో ।
ఋషిణా దీర్ఘతమసా హ్యేతత్ప్రబ్రూహి పృచ్ఛతామ్ ॥
సూత ఉవాచ :-
ఉశిజో నామ విఖ్యాత ఆసీద్ధీమానృషిః పురా ।
భార్యా వై మమతా నామ విభూవాస్య మహాత్మనః II
మహాబాహుఁడగుఉశద్రథుఁడు తితిక్షుని కుమారుడు ఉశద్రథుని యొక్కసుతుండు హేముడు. హేమునకుసుతపసుఁడుపుట్టెను. సుతపసునకు బలికుమారుడు. వామనునిచే బద్ధుఁడయినబలి మహాయోగి. సంతానాభిలాషియైయామహామనీషిబలి మానవగర్భమున జన్మము నొందెను. వంశము పిల్లలులేక నష్టమగుచున్న కారణమున ఆతఁడు చాతుర్వర్ణ్యకరులయిన పుత్రులనుకనెను. వారు-అంగ, వంగ,సుహ్మయుద్ద,కళింగులు. ఈ వర్గమునుబాలేయులు,క్షత్రులందురు. (బలియొక్కక్షత్రియవంశ్యులు) బ్రాహ్మణులు కూడబాలేయులు; ఆబలివంశమునునిల్పినవారు. ధీమంతుఁడయిన బలీకీబ్రహ్మ ప్రీతితోబహువరములొసంగేను. ఆవరములుమహాయోగిత్వము,ఒకకల్పతుల్యఆయువు. యుద్దములయందుఅజేయత్వము,మూఁడు లోకములను చూడగలశక్తి, ధర్మమునందు ప్రభావముచేపుత్రసంతతియందుప్రాముఖ్యము,అప్రతీమానత్వస్థితి, ధర్మతత్త్వార్థదర్శనము, “నీవునాలు వర్గములనుస్థాపించెదవు"అని కూడ చెప్పఁబడెను. ఈ విధముగా బ్రహ్మచేచెప్పఁబడి, రాజయినబలి ఉత్కృష్టమైనశాంతిని పొందెను, పెద్దకాలమునకు విద్వాంసుఁడైనరాజు స్థానమును పొందెను. వారియొక్కరాష్ట్రములు-అంగ, వంగ, సుహ్మకము, పుండ్రకము, కళింగము, వృద్ధిమంతములయ్యెను. వారివంశమును గ్రహింపుడు. ఆతనీ కుమారులెల్లరు క్షేత్రజులు(తనభార్యయందుఇతరులకుపుట్టినవారు) వారుమునిసంభవులు.మహాతేజస్వు లయినవారు (ఆబిడ్డలు) దీర్ఘతమసునకు సుధేష్ణ వలన కలిగినవారు. ఋషుల్లిడిగిరి. ఓప్రభో!బలియొక్కయైదుగురుసుతులుఎట్లుక్షేత్రజులు, ఋషివలన దీర్ఘతమసువలనకలిగిరి. దయచేసిమాకుచెప్పుము. సూతుఁడిట్లనెను. పూర్వమునఉశీజుఁడనునొకప్రసిద్దఋషికలఁడు. ఆమహాత్మునకు మమతభార్య.
ఉశిజస్య కనీయాంస్తు పురోధో యో దివౌకసామ్ ।
బృహస్పతి ర్భృహత్తేజా మమతాం సోభ్య పద్యత ॥
ఉవాచ మమతా తం తు బృహస్పతిమనిచ్ఛతీ అంతర్వత్న్యస్మి ।
తే భ్రాతుర్జ్యేష్ఠస్యాస్య చ భామినీ ॥
అయం హి మే మహాన్గర్భో రోరవీతి బృహస్పతే ।
అజస్రం బ్రహ్మ చాభ్యస్య షడంగం వేదముద్గిరన్॥
అమోఘరేతాస్త్వం చాపి న మాం భజితుమర్హసి ।
అస్మిన్నేవ యథాకాలే యథో వా మన్యసే విభో ॥
ఏవముక్తస్తయా సమ్యగ్ బృహత్తేజా బృహస్పతిః ।
కామాత్మానం మహాత్మాఽ పి నాత్మానం సోఽక్యధారయత్ ॥
సంబభూవైవ ధర్మాత్మా తయా సార్టం బృహస్పతిః ।
ఉత్సృజంతం తదా రేతో గర్భస్థః స్కోఽస్య భాషతు ॥
శుక్రం త్యాక్షశ్చ మా జీవ ద్వయోర్నేహాస్తి సంభవ: ।
అమోఘరేతాస్త్వం వాపి పూర్వం చాహమిహాగతః ॥
శశాప తం తదా క్రుద్ధ ఏవముక్తో బృహస్పతిః।
ఉశిజస్స సుతం భ్రాతుర్గర్భస్థం భగవానృషిః ॥
యస్మాత్వమీదృశే కాలే సర్వభూతేప్సితే సతి ।
మామేవముక్తవాన్మోహాత్తమో దీర్ఘం ప్రవేక్ష్యసి ॥
తతో దీర్ఘతమా నామ శాపాదృషి రజాయతు ।
అధేశిజో బృహత్కీర్రిర్భృహస్పతి రివాజసా ॥
ఊర్ధ్వ రేతాస్తతశ్చాపి వ్యవసద్భాతురాశ్రమే ।
గోధర్మం సౌర భేయాత్తు వృషభాచ్చృతవాన్ ప్రభో: ॥
తస్య భ్రాతా పితృవ్యస్తు చకార భవనం తదా ।
తస్మిన్ హి తత్ర వసతి యదృచ్ఛాభ్యాగతో వృష ॥
దర్మార్థమాస్తృతాన్తర్భాణకార సురభీసుతః ।
జగ్రాహ తం దీర్ఘతమా విస్ఫురంతం తు శృంగయోః ॥
స తేన నిగృహీతస్తు న చచాల పదాత్పదమ్ ।
తతోఽబ్రవీద్ వృషస్తం వై ముంచ మాం బలినాం వర!
న మయా సాదితహ్రత బలవాంస్తద్విధః క్వచిత్! ।
త్ర్యంబకం వహతా దేవం యతో జతోఽస్మి భూతలే ॥
ముంచ మాం బలిసాం శ్రేష్ఠ ప్రతిస్నేహం వరం వృణు ।
ఏవముక్తోఽబ్రవీదేనం జీవంస్త్వం మే క్వ యాస్యసి ॥
ఉరీజునీ కనిష్ఠ సోదరుఁడు స్వర్గ నీవాసులకు పురోహితుఁడు, అతని పేరు బృహస్పతి. అతఁడు మహా తేజస్పి, అతడు 'మమత'ను కలిసికొనెను, మమతకు బృహస్పతి యనిన ఇష్టములేదు. అతనితో ఆమె ఇట్లనెను. “నేను నీ జ్యేష్ట భాత యొక్క భార్యను. అదియునుగాక నేనిపుడు గర్భిణిని. “ఓ బృహస్పతీ! నా గర్భములో నున్న బిడ్డ, అజసము వేదాంగములతోడి వేదమును అభ్యాసము చేయుచున్నాడు. నీవు కూడా అమోఘమైన రేతస్సుకలవాడవు. అందుచే, నీవను కొనినట్లు నన్ను భజించుట కరుఁడవుకాదు. ఇంత స్పష్టముగా నామెచే చెప్పబడినను, మహాతేజుడయిన బృహస్పతి, మహాత్ముఁడయినను, కామాత్ముఁడగుట తన్నుతాను నిగ్రహించు కొన లేక పోయెను. ధర్మాత్ముఁడయినను బృహస్పతి ఆమెతో సంగమించేను." బృహస్పతి రేతస్సును వీడుచుచుండగ గర్భస్థుఁడయిన ఆ బిడ్డ అతనితో నిట్లనెను. - “ఓ బృహస్పతీ! శుక్రమును వీడువకుము. ఈ గర్భమున ఇద్దరకు (జీవ దయమునకు) చోటులేదు. నీవో యమోఘరేతస్కుఁడవు నీ శుక్రము వ్యర్థము కారాదు. కానీ ఇచ్చటకు ముందే నేను వచ్చియుంటిని, ఈ విధముగా చెప్పఁబడి, బృహస్పతి క్రుద్దుడయి, ఆతని సోదర కుమారుని గర్భస్థుఁడైన ఉశీజుని, శపించెను. సర్వభూతములకు నీ సీతమైన కాలమున నాతో మోహమున నిట్లంటివికాన, నీవు తీవ్రమైన సుదీర్ఘమైన చీకటిలో ప్రవేశింతువు"అని. అంత, ఆతని శాపమువలన, ఉజుని కుమారుం డు దీర్ఘతముఁడను పేరుగల ఋషియయ్యెను. ఔశిజుఁడు (ఉశీజునికుమారుడయిన దీర్ఘతముఁడు) బృహస్పతితో సమానుఁడు స్వతేజస్సుచే, బృహత్కీర్తిచే నయ్యెను. ఇతఁడు ఊర్ద్వ రేతస్క్యుడు. అతఁడు తన తండ్రి సోదరుని ఆశ్రమమున వసీంచెను. అతఁడు గోధర్మమును (గోవుల యొక్క ధర్మమును) సురభి యొక్క కొమరుడైన వృషభమువలన వినెను. అతని తండ్రి సోదరుఁడాతనికి (దీర్ఘతమునకు) ఒక భవనమును నిర్మించెను అతఁడచ్చట వసించుచుండ, ఆ వృషభమచ్చటకు యదృచ్ఛముగా వచ్చెను. సురభికుమారుడైన వృషభము, ఆశ్రమములో దర్శ పూర్ణమాసమున (అమావాస్య పున్నమిని చేయు కర్మ) అందున్న గరికను మేసెను. కొమ్ములతో నిటు నటు కొట్టుకొని విజృంభించుచున్నను దీర్ఘతముఁడు దానిని కొమ్ములతో పట్టుకొనెను. అతనిచే నిగృహీతమయి యా గోవు ఒక్క పదమయినను కదలేకపోయినది. అంత, ఆ వృషభము, “బలవంతులలో శ్రేష్ఠుండా! నన్ను విడువుము. తత్పతిఫలముగా నా స్నేహమును సంపాదింపుము. వరమును కోరుకొనుము". అని పలుకగా, ఆ దీర్ఘతముఁడు వృషభముతో ఇట్లనెను. “జీవించి నన్ను విడిచి నీ వెక్కడికి పోయెదవు?”
తేన త్వాహం న మోక్ష్యామి పరస్వాదం చతుష్పదం ।
తతస్తం: దీర్ఘతమసం స వృషః ప్రత్యువాచ హ ॥
నాస్మాకం విద్యతే తాత పొతకం స్త్యమేవ చ ।
భక్ష్యాభక్ష్యం నాజానీమః పేయపేయం చ సర్వశః ॥
కార్యాకార్యం చ వై విప్ర గమ్యాగమ్యం తథైవ చ ।
న పాప్మానో వయం విప్ర ధర్మో హ్యేష గవాం శ్రుతః ॥
గవాం నామ స వై శ్రుత్వా సంభ్రాంతస్తమముంచత ।
భక్త్యా చానుశ్రవికయా గోస్తుతం వై ప్రసాదయన్ ॥
ప్రసాదతో వృషేంద్రస్య గోధర్మం జగృహేఽథ సః ।
మనసైవ తదా ద ధ్రే తద్విదస్తత్పరాయణః ॥
తతో యవీయసః పత్నీమౌతధ్యస్యాభ్యమన్యత ।
విచేష్టమానాః రుదతీం దైవాత్సమ్మూఢచేతన ॥
అవలోపం తు తం మత్వా సురద్వాంస్తస్య నాక్షమత్ ।
గోధర్మం వై బలం కృత్వా స్నుషాం స హ్యాభ్యమన్యత ॥
విపర్యయం తు తం దృష్ట్వా శరద్వాన్ప్ర వించింత్య చ ।
భవిష్యమర్థం జ్ఞాత్వా చ మహాత్మా త్వవమత్య తమ్ ॥
ప్రోవాచ దీర్ఘతమసం క్రోధాత్సంరక్తలోచనః ।
గమ్యాగమ్యం న జానీషే గోధర్మాత్ప్రార్థయన్ స్నుషామ్ ॥
దుర్వృత్తం త్వాం త్యజామ్యేష గచ్ఛ త్వం స్వేన కర్మణా ।
యస్మాత్వమంథో వృద్ధశ్చ భర్తవ్యో దురనుష్ఠితః ॥
తేనాసీత్వం పరిత్యక్తా దురాచారోఽసి మే మతః ।
సూత ఉవాచ:-
కర్మణ్యస్మింస్తతః క్రూరే తస్య బుద్ధిరజాయత ॥
నిర్భ ర్త్వ్య చైవ బహుశో బాహుభ్యాం పరిగృహ్య చ ।
కోష్టే సముద్రే ప్రక్షిప్య గంగాంభసి సముత్సృజత్ ॥
ఉహ్యమానః సముద్రస్తు సప్తాహం స్రోతసా తదా ।
తం సస్తీకో బలిర్నామ రాజా ధర్మార్థతత్త్వవిత్ ॥
అపశ్యన్ మజ్జమానం తు స్రోతసోభ్యాసమాగతమ్ ।
తం గృహీత్వా స ధర్మాత్వా బలిర్వైరోచనస్తదా ॥
అంతఃపురే జుగో పైనం భక్యైర్భోజ్యైశ్చ తర్పయన్ ।
ప్రీతః స వై వరేణాథ చ్ఛందయామాస వై బలీమ్ ॥
అందుచే నిన్ను నేను వదలి పెట్టను. నీవు చతుష్పాదజంతువ వైనను, నీవు (పరస్వాదము) ఇతరుని ఆస్తినీ తింటివి. "అంత - ఆవృషభము ఋషికి ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను”. ఓ ప్రియతమా! మేమెన్నడును స్తేయము (దొంగతనము) వలన పాపమును పొందము. " భక్ష్యా భక్ష్య వివేకము మేమెరుగము. అట్లే త్రాగదగినది త్రాగదగనిది మేమెఱుగము. ఓ. ఏప్రుఁడా కార్యాకార్యమెఱుగము, అట్లే గమ్యాగమ్యము(పొందదగినది, పొందదగనీది) యెఱుంగము. ఓ విప్ర మేము పాపులముకాము. ఇది గోవుల యొక్క ధర్మము. సర్వవిదితము ". గోవుల యొక్క పేరు వినీ, ఋషి, సంక్రాంత మనస్కుండయ్యెను. ఆ గోరాజమును విడిచెను. అతఁడు భక్తితో, ఆ వృషభము యొక్క పలుకులను వినవలయునను కోరికతో ఆ గోసుతుని ప్రసన్నునిగా చేసెను. వృషేంద్రుని యొక్క ప్రసాదమువలన, ఆ (ఋషి) గోధర్మమును గ్రహించెను. దానిని మనస్సులో జ్ఞాపకముంచుకొనెను. తత్పరాయణుఁడయి అతఁడు వృషభము వంటి వ్యా, డాయెను. అంత దురదృష్టవశమున, అతఁడు మనస్సులో సమ్మూడుఁడయ్యెను. తత్కారణమున తన తమ్ముఁడైన ఉతథ్యుని పత్నిని కామపరవశుడై విచేష్ట మానమై గింజుకొన్నను, ఏడ్చుచున్నను, ఆమెను కోరెను. అతడు అవమానమును (అవలేపమును) తలపోయక, . గోధర్మ పరాయణుఁడై తన కోడలినీ అభిలషించెను. శరద్వంతుడు దానిని భరింపలేదు. అతఁడు దానిని అవమానముగా దలంచెను. ఈ - విపరీత క్రియాకలాపమును చూచి శరద్వంతుడు దానిని గూర్చి లోతుగా సోలోచించెను. అతఁడు రానున్న ఫలాఫలితముల నెంగెను. క్రోధముచే సంరక్తలోచనుఁడై ఆతనిని అవమతీంచీ దీర్ఘతమునితో నిట్లనెను, ఏది పొందదగినదో, ఏది పొందదగనిదే యెఱుంగక "గోధర్మమూని న్నుషను అర్థించితివి. నీవు దుర్వృత్తుఁడవగుట నిన్ను త్యజించుచున్నాను. నీ దుష్టమైన కర్మతో నీవు పొమ్ము. నీవు గ్రుడ్డివి, వృద్ధుఁడవగుట, నీవు భర్తవ్యుఁడవు. పోషింపఁదగిన వాఁడవు. కానీ దుష్టముగా ప్రవర్తించితివి. అందుచే నీవు పరిత్యక్తుఁడవు నీవు దురాచారుడవని సో భావము.
సూతుఁడిట్లనెను.
అందుచే శరద్వంతుఁడు ఈ విపరీత కర్మయందు క్రూరముగా దలపోసెను. ఆతని బహు విధముల నీందించెను. రెండు చేతులతో నతనిని పట్టుకొని, అతనిని ఒక కోష్టమునందు మూఁత బిగించిన పేట్టిలో పెట్టి గంగోదములయందు విడిచిపెట్టేను.-64. ఆ.. కోష్టము (ఆమూత బిగించిన పెట్టి) ప్రవవాహముచే కొట్టుకొనుచు ఏడు దినములు పోయెను. “ఐటియను పేరుగల ఒక రోజు ఆ కోష్టమును చూచెను. అతఁడు ధర్మాత్ముఁడు, తత్వ వీదుఁడు ఆతనితో ఆతని భార్య కూడనుండెను. మునుగుచు తేలుచుకోట్టుకొని వచ్చు పెట్టి నాతండు చూచెను. ఆ పెట్టె ప్రవాహముచే గట్టుకు చేరగా, ధర్మాత్ముఁడు, వైరోచనుఁడయిన బలి దానిని తీసికొనెను. అంతః, పురమునకు తీసికొనిపోయి, వివిధ భక్ష్య భోజ్యములచే దీర్ఘతముని తృప్తిపరచెను. సంతుష్ఠుఁడయి బలిని ఆ దీర్ఘతముఁడు వరము కోరుకొనుమనెను. కోరుకొనుమనెను.
స చ తస్మాద్వరం వవ్రే పుత్రార్థీ దానవర్షభః ॥
బిలిరువాచ:-
సంతానార్థం మహాభాగ భార్యాయాం మమ మానద ॥
పుత్రాన్ ధర్మార్థసంయుక్తానుత్పాదయితుమర్హసి ।
ఏవముక్తస్తు తేనర్షిస్తథాస్త్విత్యుక్తవాన్ హి తమ్ ॥
సుధేష్ణాం నామ భార్యాం స్వాం రాజాస్మై ప్రాహిణోత్తదా ।
అంధం వృద్ధం చ తం దృష్ట్యా న సా దేవీ జగామ హ ॥
స్వాం చ ధాత్రేయికాం తస్మై భూషయిత్వా వ్యసర్జయత్ ।
కక్షీవచ్చక్షుషౌ తస్యాం శూద్రయోన్యామృషిర్వశీ ॥
జనయామాస ధర్మాత్మా పుత్రావేతౌ మహౌజసౌ ।
కక్షీవచ్చక్షుపౌ తౌ తు దృష్ట్వా రాజా బలిస్తదా ॥
అధీతౌ విధివత్సమ్యగీశ్వరౌ బ్రహ్మవాదినౌ ।
సిద్ధౌ ప్రత్యక్షధర్మాణౌ వృద్ధౌ శ్రేష్ఠతమావపి ॥
మమైతావితీ హోవాచ బలిర్వైరోచనస్త్వృషిమ్ ।
నేత్యువాచ తతస్తం తు మమైతివితి చాబ్రవీత్ ॥
ఉత్పన్నే, శూద్రయోనౌతు భవతః క్ష్మాసురోత్తమౌ ।
అంధం వృద్దం చ మాం మత్వా సుధేష్ణా మహిషీ తవ ॥
ప్రాహిణోదవమానీయ శూద్రీం ధాత్రేయికాం మమ ।
తతః ప్రసాదయామాస పునసమృషిసత్తమమ్ ॥
బలీర్భార్యాం సుధేష్ణాం చ భర్త్సయామాస వై ప్రభుః ।
పునశ్చైనామలంకృత్య ఋషయే ప్రత్యపాదయత్ ॥
తాం స దీర్ఘతమా దేవీమబ్రవీద్యదీ మాం శుభే ।
దధ్నా లవణమిశ్రేణ స్వభ్యక్తం నగ్నకం తథా ॥
లేహిష్యస్యజుగుప్సంతీ హ్యాపాదతలమస్తకం తతస్త్వం ।
ప్రాప్స్యసే దేవి పుత్రాంశ్చ మనసేప్సితాన్ ॥
తస్య సా తద్వచో దేవీ సర్వం కృతవతీ తథా ।
అపానం చ సమాసాద్య జుగుప్సంతీ వ్యవర్జయేత్ ॥
తమువాచ తతః సర్షిర్యస్తే పరిహృతం శుభే ।
వినాఽపానం కుమారం త్వం జనయిష్యసి పూర్వజమ్ ॥
తతస్తం దీర్ఘతమసం సా దేవీ ప్రత్యువాచ హ ।
నార్హసి త్వం మహాభాగ వుత్తం దాతుం మమేదృశమ్ ॥
పుత్రార్థి, దానవర్షభుఁడైన, బలి, ఆతనినీ వరము కోరెను. బలి ఇట్లు వరము కోరెను.
మానవంతులలో శ్రేష్ఠుఁడవైన ఓ మునీ! ఓ మహాభాగ, నేను సంతానార్థిని. నా భార్యయందు, ధర్మార్ధసంయుక్తులయిన పుత్రులుకలుగునట్లు (పుట్టునట్లు) చేయ నీవు అరుండవు. ఇట్లు అడుగబడి ఆ ఋషి “తథాస్తు” అనీ హితమును పలికెను. అంత సుధేష్ణయను పేరుగల తన భార్యను బలి ఆతని కడకు పంపెను. అంధుఁడు, వృద్ధుఁడునయిన యతనిని చూచి ఆ దేవి యతని కడకు పోలేదు. ఆమె తన పరిచారికను భూషణములచే నలంకరించి ఆముని కడకంపెను. అత్యంతేంద్రియవశియు ధర్మాత్ముండునయిన ఋషి, కక్షివంతుడు, చక్షువు అను మహా తేజస్వులయిన కుమారులను ఆ దాసీ యొక్క శూద్ర యోనియందు పుట్టించెను, ఆ కుమారు లిరువురు మహా తేజస్వంతులు. విధి పూర్వకముగా వేదాధ్యయనము చేసినవారు, ఈశ్వరతుల్యులు, బ్రాహ్మణోత్తములు. నీ దాసి యొక్క శూద్ర యోనియందుత్పన్నులు”, సుధేష్ణ నీ పట్ట మహిషి నను అంధునిగా, వృద్దునిగా తలపోసి తన దాసిని నాకడకు పంపి తన్మూలమున నన్నవమానించెను. అంత బలీ ఆ ముని సత్తముని ప్రసాదవంతుని చేసెను. భార్యయైన సుధేష్ణను దూషించెను. కసరుకొనెను. మరల ఆమెను (తన భార్యను) అలంకరించి, బలి ఋషి కడకు పంపెను. ఆ దీర్ఘతముఁడు దేవితో నిట్లనెను. 'ఓ శుభురాలా! నేను ఉప్పు కలిపిన పెరుగతో నా శరీరము నంతటిని పూసికొని నగ్నముగా నుండును. ఎట్టి అసహ్యము జుగుప్స లేక, ఆపాదమస్తకము నా శరీరమును నీవు నాకవలయును. అప్పుడు నీవు కోరిన పుత్రులను దేవి! పొందగలవు. దేవి అతని నియమ వాక్యమును సర్వము యథాతథముగా నాచరించెను. కానీ, అతని అపాన స్థానమును చేరి, అసహ్యపడుచు దానిని నాకుట విడిచిపెట్టెను, 80, అంత ఋషి ఆమెతో నిట్లనెను. “ఓ శుభుల! నీవు అపానము పరిహరించితివి. అందుచే అపానములేని పెద్ద కుమారుని నీవు కందువు. అంత ఆది దీర్ఘతమునితో నిట్లు ప్రత్యుత్తరమిచ్చెను' ఓ మహాభాగః ఈ దృశమైన కుమారుని నాకు ప్రసాదించుట నీకు తగదు.
ఋషి రువాచ:-
తవాపరాధో దేవ్యేష నాన్యథా భవితా తు వై ।
దేవీదృశంచ తే పౌత్రమహం దాస్యామి సుప్రతే ॥
తస్యాపానం వినా చైవ యోగ్యభావో భవిష్యతి ।
తాం స దీర్ఘతమాశ్చైవ కుక్షౌ స్పృష్ట్వే దమబ్రవీత్ ॥
ప్రాశితం దధి యత్తేఽద్య మమాంగాద్వై శుచిస్మితే ।
తేన తే పూరితో గర్భః పౌర్ణమాస్యామివోదధి ॥
భవిష్యంతీ కుమారాస్తే పంచ దేవసుతోపమా ।
తేజస్వినః పరాక్రాంతా యజ్వనో ధార్మికాస్తథా ॥
తతోంఽగస్తు సుధేష్ణాయా జ్యేష్ఠ పుత్రో వ్యజాయత ।
వంగస్తస్మాత్కలింగస్తు పుండ్రః సుహ్మస్తథైవ చ ॥
వంశభాజప్తు పంచైతే బలేః క్షేత్రేఽభవంస్తదా ।
ఇత్యేతే దీర్ఘతమసా బలేః దత్తాః సుతా: పురా ॥
ప్రజా హ్యుపహతాస్తస్య బ్రహ్మణా కారణం ప్రతి ।
అపత్యమస్య దారేషు స్వేషు మాభూన్మహాత్మనః ॥
తతో మనుష్యయోన్యాం వై జనయామాస స ప్రజాః ।
సురభిర్ధీర్ఘతమసమథ ప్రేతో వచో బ్రవీత్ ॥
విచార్య యస్మాధ్గోధర్మం త్వమేవం కృతవానసి ।
భక్త్యా చానన్యయాఽస్మాసు మునే ప్రీతాఽస్మి తేన తే ॥
తస్మాత్తవ తమో దీర్ఘం నిస్తుదామ్యద్య పశ్యమై ।
బార్హస్పత్యం చ యత్తేఽన్యతాపం సంతీష్ఠతే తనౌ ॥
జరామృత్యుభయం చైవ హ్యాఘాయ ప్రణుదామి తే ।
ఆ ఘ్రాతమాత్రోఽసా పశ్యత్సద్యస్తమసి నాశితే ॥
ఆయుష్మాంశ్చ యువా చైవ చక్షుష్మాంశ్చ తతోఽ భవత్ ।
గవాహృతతమాః సోఽథ గౌతమః సమపద్యత ॥
కక్షివాంస్తు తతో గత్వా సహ పిత్రా గిరివ్రజమ్ ।
యథోర్టిష్టం హి పిత్రాఽథ చచార విపులం తప ॥
తతః కాలేన మహతా తపసా భావితః స వై ।
విధూయ సానుజో దోషాన్బ్రహ్మణ్యం ప్రాప్తవాన్ ప్రభుః ॥
తతోఽ బ్రవీత్పితా త్వేనం పుత్రవానస్మ్యహం ప్రభో ॥
ఋషి యిట్లు ప్రత్యుత్తరమిచ్చెను.
ఓ దేవి! ఇది నీయపరాధము. వేరు విధముగా జరుగదు. ఓ సువ్రతురాలా! నీ కిట్టీ మనుమని నేనొసంగెదను. అపానము లేకపోయినను, ఆతఁడు యోగ్య భావుండు కొంగలఁడు.
అంత దీర్ఘతముఁడామే కడుపున (కుక్షిని) స్పృశించి యిట్లనెను-84. ఓ శుచిస్మితురాలా! నీవు నా శరీరము నుండి దధిని . నాకితివీకాన ఆ కోరణమున పున్నమినాఁడు సముద్రము వలె నీ గర్భము పరిపూరితమైనది. నీకు దేవసుతోషములయిన యైదుగురు కుమారులు కలిగెదరు. వారు తేజస్వులు, పరాక్రమ వంతులు, యజ్ఞముల నాచరించుయజ్వలు, అంతియేకాక ధర్మాత్ములు.
అంత, అంగుఁడు సుధేష్ణకు జ్యేష్ఠ కుమారునిగా పుట్టెను తరువాత వంగుఁడు, కళింగుఁడు, పుండ్రకుఁడు, సుహుఁడును పుట్టిరి. ఈ యైదుగురు బలికి క్షేత్రమున పుట్టిరి. వారు వంశవర్ధనులు ఈ విధముగా పూర్వము దీర్ఘతముని వలన ఐలి కుమారులను - పొందెను.
కొన్ని కారణముల చేత బలికి తన భార్యయందు సంతానమును బ్రహ్మ అడ్డగించెను. ఉపహత మొనర్చెను.. బ్రహ్మ యిట్లు చెప్పెను. ఈ మహారాజునకు స్వభార్యలవలన సంతానము కలుగ కుండుగాక అందువలననే యతఁడు (బలి) మనుష్యయోనియందు పిల్లలను పొందెను. సంతోషించిన సురభి ఈ వాక్యములు దీర్ఘతమునితో పలికెను.
ఓ ఋషీ! నీవు గో ధర్మమును గూర్చి ఆలోచించితివి. ఇట్లు ఆచరించితివి. అనన్యమయినయందలి నీ భక్తికి నేను సంప్రీతురాలినైతిని. అందుచే, ఇంక, నేను పురాణమైన నీ చీకటిని పోగొట్టెదను. నీవు చూడగలవు. (చూడుము). నీ శరీరము నందింకను బృహస్పతి యొక్క శాపము వలని పాపమున్నది. నిన్ను ఆఘ్రాణముచేసి, ఆ పాపమును తొలగించెదను. నీ "జరామృత్యుభయమును గూడ తొలగించెదను” ఆతఁడు ఆఘ్రాణించిన మాత్రమున, చీకటి (తమస్సు) అస్తమించుటవలన అతఁడు (ఆ ఋషి) చూడగలిగెను. ఆ ఋషి యువకుఁడయ్యెను. చక్షుష్మంతుడయ్యెను, ఆయుష్మంతుడయ్యెను. ఆతని తమస్సు గోవుచే హృతమయిన దగుటవలన అతఁడు గౌతముఁడయ్యెను.
కక్షివంతుఁడు తండ్రితో సహా గిరివ్రజమేగెను. యథోద్దిష్టముగ పితరునితో విపుల మయిన తపస్సు చేసెను. చాలా కాలము గతించిన పిమ్మట తపస్సుచే నతఁడపవిత్రుఁడయ్యెను. తరువాత సానుజుఁడై దోషములను నిర్దూతముచేసి యతఁడు బ్రాహ్మణ్యమును పొందెను. అంత నీతని తండ్రి యతనితో నిట్లనెను.
సుపుత్రేణ త్వయా తాత కృతార్థశ్చయశస్వినా ॥
యుక్తాత్మానం తతః సోఽథ ప్రాప్తవాన్ బ్రహ్మణః క్షయమ్ ।
బ్రాహ్మణ్యం ప్రాప్య కక్షీవాత్సహస్రమసృజత్సుతాస్ ॥
కూష్మాండా గౌతమాస్తే వై స్మృతాః కక్షీవతః సుతాః ।
ఇత్యేష దీర్ఘతమసో బలేర్వైరోచనస్య వై ॥
సమాగమః సమాఖ్యాతః సంతానశ్చోభయోస్తథా ।
బలిస్తానభీషిచ్యేహ పంచ పుత్రానకల్మషాన్ ॥
కృతార్థః స్కోపి యోగాత్మా యోగమాశ్రిత్య చ ప్రభు ।
అదృశ్యః సర్వభూతానాం కాలాకాంక్షీ చరత్యుత ॥
తత్రాంగస్య తు రాజర్షే రాజాసీద్దధివాహనః ।
సోఽపరాధాత్సుధేష్ణాయా అనపానోఽ భవన్నృప ॥
అనపానస్య పుత్తస్తు రాజా దీవిరథః స్మృతః ।
పుత్రో దివిరధస్యాసిద్విద్వాస్ ధర్మరధో నృపః ॥
ఏతే ఇక్ష్వావకమః ప్రోక్తా భవితారః కోలౌ యుగే ।
బృహద్బలాన్వయే జాతా మహావీర్యపరాక్రమా ॥
శూరాశ్చ కృతవిద్యాశ్చ సత్యసంధా జితేంద్రియాః ।
అత్రానువంశశ్లోకోఽయం భవిష్యత్తైరుదాహృతః ॥
ఇక్ష్వాకుణామయం వంశః సుమీత్రాలతో భవిష్యతి ।
సుమిత్రం ప్రాప్య రాజానం సంస్థాం ప్రాప్స్యతి వై కలె ॥
ఇత్యేతన్మానవం క్షత్రమైలం చ సముదాహృతమ్ ।
అత ఊర్థ్వం ప్రవక్ష్యామి మగధో యో బృహద్రథః ॥
జరాసంధస్య యే వంశే సహదేవాన్వయే నృపాః ।
అతీతా వర్తమానాశ్చ భవిష్యాశ్చ తథోపునః ॥
ప్రాధాన్యతః ప్రవక్ష్యామి గదతో మే నిబోధత ।
సంగ్రామే భారతే తస్మిన్సహదేవో నిపాతితః ॥
సోమాపీస్తస్య తనయో రాజర్షః స గిరివ్రజే ।
పంచాశతం తథాఽష్టౌ చ సమా రాజ్యమకారయత్ ॥
శ్రుతశ్రవాః సప్తషష్టిః సమాస్తస్య సుతోఽభవత్ ।
అయుతాయుస్తు షడ్వింశద్రాజ్యం వర్షాణ్యకారయత్ ॥
సమాః శతం నిరామిత్రో మహీం భుక్త్వా దివం గతః ।
పంచాశతం సమాః షట్ చ సుక్షత్తః ప్రాప్తవాన్ మహీమ్ ॥
కుమారా! యశస్వి యై కుమారుఁడవైన నీ చే నేకృతార్థుఁడ నయితిని. అంత. నతఁడు యోగస్థితుఁడై బ్రహ్మ స్థానమునందెను. బ్రాహ్మణ్యమును పొంది కక్షివంతుఁడు ఒక వెయ్యి మంది సుతులను కనెను. వారందరు కూష్మాండులుగా, గౌతములుగా ప్రసిద్ధులు.
ఈ విధముగా దీర్ఘతముని యొక్క వైరోచనుఁడయిన బలియొక్క సమాగమము, వారిరువురి యొక్క సంతానము చెప్పఁబడినది. పాప రహితులయిన తన యొదుగురు కుమారులను పట్టాభిషిక్తుల చేసి బలి కృతార్థుఁడయ్యెను. ఆతఁడు యోగాత్ముఁడు. యోగము నాశ్రయించి సర్వభూతములకు నదృశ్యుఁడై కాలకాంక్షియై (మరుణ కాలముకోరి) బలి సంచరించును.
దధి వాహనుఁడు రాజర్షియైన అంగుని కుమారుఁడు. సుధేష్ణయొక్క అపరాధమున ఆ ప్రభువు 'అనపాను'డని పిలువబడెను. అనపానునీ పుత్రుఁడు దీవిరథుఁడు. ధర్మరథుఁడు దీవిరథుని పుత్రుఁడు. అతడు విద్వాంసుడు.
వీరందరు ఇక్ష్వాకుల సంతానము. ఇక్ష్వాకులు వారందరు కలియుగమున బృహద్బలునీ, వంశమున పుట్టెదరు. వారు మహావీర్య పరాక్రములు శూరులు సమస్త విద్యలు నేర్చినవారు. సత్య సంధులు జితేంద్రియులు.
ఈ విషయమున ఈ వంశము భవిష్యజ్ఞులచే ఉదహరింపఁబడినది.
“ఇక్ష్వాకుల యొక్క ఈ వంశము 'సుమిత్ర' వరకు వ్యాపించును. ఈ వంశము సుమిత్ర వరకు వ్యాపించి కలియుగమున తరువాత ఆంతరించును.
ఇంతవరకు, మనువునకు సంబంధించిన, ఐలునకు సంబంధించిన క్షత్ర వంశముదాహృతమైనది.
ఇక మగధ దేశ ప్రభువైన బృహద్రథుని వంశము వర్ణించెదను. వారి వారి ప్రాధాన్యమును బట్టి జరా సంధుని వంశమున పుట్టిన సహదేవాన్వయ నృపాలుని గూర్చి చెప్పెదను. చెప్పినది గ్రహించుడు, భారత సంగ్రామమున సహదేవుడు మరణించెను. రాజర్షి తుల్యుం డైన సోమాపీ సహదేవుని కుమారుడు. ఆతఁడు గిరివ్రజమును 58 సంవత్సరములు రాజ్యము ఏలెను. సోమాపీ కుమారుఁడు శ్రుతశ్రవుండు ఆతఁడు 77 సంవత్సరము లేలేను. ఆతని కుమారుడు 'అయుతాయువు'. ఇతఁడు 26 సంవత్సరములు రాజ్యము చేసెను. 'నిరామిత్రుండు భూమిని నూరేండ్లనుభవించి దీవంగతుఁడయ్యెను. సుక్షత్రుఁడు భూమిని 56 సంవత్సరము లేలెను.
త్రయోవింశద్భృహత్కర్మా రాజ్యం వర్షాణ్యకారయత్ ।
సేనజిత్సాంప్రతం చాపి ఏతా వై భోక్ష్యతే సమా ॥
శ్రుతంజయస్తు వర్షాణి చత్వారింశద్భవిష్యతి ।
రిపుంజయో మహాబాహుర్మహాబుద్ధిపరాక్రమః ॥
పంచత్రింశత్తు వర్షాణి మహీం పాలయితా నృపః ।
అష్టపంచాశతం చాబ్దాన్ రాజ్యే స్థాష్యతి వై శుచిః ॥
అష్టావింశత్సమాః పూర్ణాః క్షేమో రాజా భవిష్యతీ ।
సువ్రతస్తు చతుఃషష్టిం రాజ్యం ప్రాప్స్యతి వీర్యవాన్ ॥
పంచ వర్షాణి పూర్ణాని ధర్మ నేత్రో భవిష్యతి ।
భోక్ష్యతే నృపతిశ్చేమా అష్ట్రపంచాశతం సమాః ॥
అష్టత్రింశత్సమా రాష్ట్రం సుశ్రమస్య భవిష్యతి ।
చత్వారింశద్దశాష్ట్రా చ దృఢసేనో భవిష్యతి ॥
త్రయస్త్రింశత్రు వర్షాణి సుమతిః ప్రాప్స్యతే తతః ।
చత్వారింశత్సమా రాజా సునేత్రో భోక్ష్యతే తతః ॥
సత్యజిత్పృథివీ రాష్ట్రం త్ర్యతీతిం భోక్ష్యతే సమా ।
ప్రాప్యేమం విశ్వజిచ్చాపీ పంచవింశద్భవిష్యతి ॥
అరింజయస్తు వర్షాణాం పంచాశత్ర్పాప్యతే మహీమ్ ।
ద్వావింశచ్చ నృపా హ్యేతే భవితారో బృహద్రథాః ॥
పూర్ణం వర్షసహస్రం వై తేషాం రాజ్యం భవిష్యతి ।
బృహద్రథేష్వతీతేషు వీరహంతృష్వవర్తిషు ॥
శునకః స్వామినం హత్వా పత్రం సమభిషేక్ష్యతి ।
మిషతాం క్షత్రియాణాం హి ప్రద్యోతిం నృపతిం బలాత్ ॥
స వై ప్రణతసామంతో భవిష్యేణ ప్రవర్తితః ।
త్రయోవింశతమా రాజా భవితా చ నరోత్తమ ॥
చతుర్వింశత్సమా రాజా పాలకో భవిత తతః ।
విశాఖయూపో భవితా నృపః పంచాశతం సమాః ॥
ఏకవింశతమా రాజ్యమజకస్య భవిష్యతి ।
భవిష్యతి సమా వింశత్తత్సుతో నందివర్థనః ॥
అష్టత్రింశచ్ఛతం భావ్యాః ప్రద్యోతాః పంచ తే నృపాః ।
హత్వా తేషాం యశః కృత్స్నం శిశునాగో భవిష్యతిః ॥
వారాణస్యాం సుతస్తస్య సంయాస్యతి గిరివ్రజమ్ ।
శిశు నాగశ్చ వర్షాణి చత్వారింశద్భవిష్యతి ॥
బృహ త్కర్మ 23 సంవత్సరములు రాజ్యము చేసెను. ఇప్పుడు సేనాజిత్తు రాజ్యము చేయుచుండెను.
శ్రుతంజయుడు 40 సంవత్సరములు రాజ్యము చేయును. మహాబలుడు, మహాబుద్దీ పరాక్రముఁడునయిన శత్రుంజయుఁడు భూమిని 35 సంవత్సరములు పాలించును. 46 సంవత్సరములు శుచి రాజ్యము చేయును. క్షేముఁడు 24 సంవత్సరములు పూర్తిగా రాజు కాగలడు. వీర్యవంతుఁడయిన సువ్రతుఁడు 64 సంవత్సరములు రాజ్యము చేయును. ధర్మ నేత్రుఁడు రాజయినప్పుడు ఐదేండ్ల వాఁడయి యుండును. ఆతఁడు 58 సంవత్సరములు రాజ్యముననుభవించెను. సుశ్రముండు 38 సంవత్సరములు రాజ్యము చేయును. దృఢసేనుఁడు 58 సంవత్సరములు రాజ్యము చేయును. తరువాత సుమతి రాజ్యము పొందీ 33 సంవత్సరములు . పాలించును. తరువాత సునేత్రుఁడు 40 సంవత్సరములు ఏలును. సత్యజిత్తు 83 సంవత్సరములేలును. రాజ్యమును పొందిన తరువాత వీశ్వజిత్తు 24 సంవత్సరములేలును. అరింజయుడు50 సంవత్సరములు రాజ్యము పాలించును.
ఈ విధముగా 22 రు రాజు లగుదురు. వారు బృహద్రథులు, బృహద్రథులు ఒక వెయ్యి సంవత్సరములు పాలింతురు. 121 బృహద్రథులు గతించిన తరువాత, దేశమున వీరహంతలు లేకపోవుటచే శునకుఁడు తన ప్రభువును చంపి తనకుమారుని పట్టాభిషిక్తుని చేయును. క్షత్రియులందరు కండ్లప్ప గించి చూచుచుండగ, ఆతఁడు తన ప్రభువును బలాత్కారముగ. చంపీ బలముతో ప్రద్యోతనుని రాజుచేయును. భవిష్యత్తులో నాతడిట్లుం అనివార్యముగ జేయును. సామంతులందరాతనికి నమస్కరింతురు. ఆ. నరోత్తముడు 23 సంవత్సరములు రాజుగా పాలించును. తరువాత పాలకుఁడు 24 సంవత్సరములు రాజుగా పాలించును. తరువాత విశాఖ యూపుఁడు 50 సంవత్సరములు రాజగును అజకుఁడు రాజ్యమును 21 సంవత్సరములు చేయును. అతని కుమారుఁడు నంది వర్ధనుఁడు 20 సంవత్సరము పాలించును. ప్రద్యోతులు (ప్రద్యోతి సంతతులు 5 గురు. వారు 138 సంవత్సరములు పాలింతురు. వారి యశస్సు నంతటినీ నాశముచేసి పోరణాసియందు శిశునాగుఁడు రాజగును. అతని కుమారుఁడు గిరి. ప్రజమునకరుగును. శిశు నాగుండు 40 సంవత్సరములు రాజగును.
కాకవర్ణః సుతస్తస్య షట్ త్రింశచ్చ భవిష్యతి ।
తతస్తు వింశతిం రాజా క్షేమధర్మా భవిష్యతి ॥
చత్వారింశత్సమా రాష్ట్రం క్షత్రౌజాః ప్రాప్సతే తతః ।
అష్టత్రింశతమా రాజా విధిస్తారో భవిష్యతి ॥
అజాతశత్రుర్భవితా పంచ వింశత్సమా నృపః ।
పంచత్రింశతమా రాజా దర్భకస్తు భవిష్యతి ॥
ఉదయీ భవితా తస్మాత్రయస్త్రింశత్సమా నృపః ।
స వై పురవరం రాజా వృథివ్యాం కుసుమాహ్వయమ్ ॥
గంగాయాః దక్షిణే కూలే చతుర్దేఽహ్ని కరిష్యతి ।
చత్వారింశత్సమా భావ్యో రాజా వై నందివర్ధనః ॥
చత్వారింశత్రయశ్చవ సహానందిర్బవిష్యతి ।
భవిష్యంతి చ వరాణి షష్ట్యుత్తరశతత్రయమ్॥
శిశునాగా దశైవైతే రాజానః క్షత్రబంధవః ఏతైః ।
సార్ధం భవిష్యంతి తావత్కాలం నృపాః పరే ॥
ఇక్ష్వాకవశ్చతుర్వింశత్పంచాలా పంచవింశతి: ।
కాలకాస్తు చతుర్వింశచ్చతుర్వింశత్తు హైహయా: ॥
ద్వాత్రింశదేకలింగాస్తు పంచవింశత్తథా శకాః ।
కురవశ్చాపి షట్త్రింశదష్టావింశతి మైథిలోకి ॥
శూరసేనాస్త్రయోవింశద్వీతిహోత్రాశ్చ వింశతిః ।
తుల్యకాలం భవిష్యంతి సర్వ ఏవ మహీక్షితః॥
మహానందిసుతతశ్చాపి శూద్రాయాః కాలసంవృతం ।
ఉత్పత్స్యతే మహాపద్మ: సర్వక్షత్రాంతకృనృపః ॥
తతః ప్రభృతి రాజానో భవిష్యాః శూద్రయోనయః ।
ఏకరాట్ స మహాపద్మ ఏకచ్ఛత్రో భవిష్యతి ॥
అష్టాశీతి తు పర్వాణి పృథివీం పాలయిష్యతి ।
సర్వక్షత్రం సముద్ధృత్య భావినోఽర్థస్య వై బలాత్॥
తత్పశ్చాత్తత్సుతా హ్యష్ణో సమా ద్వాదశ తే నృపాః ।
మహాపద్మస్య పర్యాయే భవిష్యంతి నృపాః క్రమాత్ ॥
ఉద్ధరిష్యతి బౌన్సర్వాన్ కౌటిల్యో వై ద్విజర్షభః ।
భుక్త్వా మహీం వర్షశతం నరేంద్రః స భవిష్యతి ॥
చంద్రగుప్తం నృపం రాజ్యే కౌటిల్యః స్థాపయిష్యతీ ।
చతుర్వింశతీ సమా రాజా చంద్రగుప్తో భవిష్యతి ॥
అతని కుమారుఁడు కాకవర్లుఁడు వీ6 సంవత్సరములు రాజగును. తరుపోత క్షేమధర్మఁడు ఇరువది సంవత్సరములు రాజగును. తరువాత క్షతౌజుడు, రాజ్యమును పొంది 40 సంవత్సరములు రాజ్యము చేయును. విధిస్తారుఁడు 38 సంవత్సరములు రాజగును. తరువాత అజాత శత్రుడు 25 సంవత్సరములు రాజగును. 35 సంవత్సరములు దర్భకుఁడు రాజగును. తరువోత ఉదయి 33 సంవత్సరములు రాజగును. రాజ్యమును స్వీకరించిన నాలుగవ దినమున ఆ రాజు గంగా నదీ దక్షిణ కూలముల కుసుమ మను పేరుగల పురవరమును నిర్మించును. నంది వర్ధనుడు 40 ఏండ్లు రాజుగా పాలించును. మహానంది 43 సంవత్సరములు రాజగును. శిశునాగ వంశరాజులు పదిమంది మాత్రమే. వారందరు క్షత్రియులు. మరల తత్సమాన కాలము ఇతర రాజులు రాజ్యము చేయుదురు.
ఇక్ష్వాకు వంశమున 24 గురు రాజులు. పాంచాలురు 25 గురు 24 గురు కాలకులు, హైహయ వంశమున 24 గురు రాజులు, ఏక లింగ వంశమున 32, శక వంశీయులు 25, కురువంశమున 32 రాజులు మిథిల వంశమువారు 28 గురు రాజులు. శూరసేన రాజులు 23, వీతిహోత్ర వంశ రాజులు 20, వీరందరు రాజులు సమకాలికులు అగుదరు. శూద్ర స్త్రీ వలన గలిగిన మహానంది సుతుం డు కాల ప్రభావమున రాజగును. సర్వక్షత్రియులకు అంతమును గలిగించు మహా పద్ముడు జన్మింపగలఁడు. తరువాత రాజులందరును శూద్ర సంభవులు మహా పద్ముండు ఏకైకరోజు ఏకచ్ఛత్రాధిపతియగును. అతఁడు 88 సంవత్సరములు పాలించును.
తరువాత మహా పద్ముని యొక్క ఎనమండ్రు కుమారులు క్రమముగా 12 సంవత్సరములు తద్వంశమున రోజులు. బ్రాహ్మణ శ్రేషుఁడయిన కౌటిల్యుఁడు, వారందరినీ ఉద్దరించును. ఆతఁడు వంద సంవత్సరములు భూమీననుభవించును. చంద్రగుప్తనిరాజ్యము నందు కౌటిల్యుఁడు స్థాపింపఁగలడు. చంద్రగుప్తుఁడు 24 సంవత్సరములు రాజుగా పాలించును.
భవితా భద్రసారస్తు పంచవింశత్సమా నృపః ।
షట్త్రింశత్తు సమా రాజా అశోకానాం చ తృప్తిదః ॥
తస్య పుత్రః కులాలస్తు వర్షాణ్యఽష్టౌ భవిష్యతి ।
కుశా(లా)లసూనురష్టా చ భోక్తా పై బంధుపాలితః ॥
బంధుపాలితదాయాదో భవితా చేంద్రపాలితః ।
భవితా సప్త వర్షాణి దేవవర్మా నరాధిపః ॥
రాజా శతధనుశ్చాపి తస్య పుత్రో భవిష్యతి ।
బృహద్రథశ్చ వర్షాణి సప్త వై భవితా నృపః ॥
ఇత్యేతే నవ మౌర్యా వై భోక్ష్యంతి చ వసుంధరామ్ ।
సప్తత్రింశచ్ఛతం పూర్ణం తేభ్యః శుంగో గమిష్యతి॥
పుష్పమిత్రస్తు సేనానీరుర్దృత్య తు బృహద్రథమ్ ।
కారయిష్యతి వై రాజ్యం సమాః షష్టిం స చైవ తు ॥
అగ్నిమిత్రో నృపశ్చాస్టౌ భవిష్యతీ సమా నృపః ।
భవితా చాఽపి సుజ్యేష్ఠః సప్త వర్షాణి వై తతః ॥
వసుమిత్రస్తతో భావ్యో దశవర్షాణి పార్ధివః ।
తతో భద్రః సమే ద్వే తు భవిష్యతి నృపశ్చ వై ॥
భవిష్యతి సమాస్తస్మాత్తిస్ర ఏవ పులిందక: ।
రాజా ఘోషస్తతశ్చాపి వర్షాణి భవితా త్రయః॥
సప్త వై వజ్రమిత్రు సమా రాజా తతః పునః ।
ద్వాత్రింశద్భవితో వాఽపి సమా భాగవతో నృపః ॥
భవిష్యతి సుతస్తస్య దేవభూమిః సమా దశ ।
దశైతే శుంగరాజానో భోక్ష్యంతీమాం వసుంధరామ్ ॥
శతం పూర్ణం దశ ద్వే చ తేభ్యః కణ్వం గమిష్య ।
తి అమాతో వసుదేవస్తు బాల్యాద్వ్యసనినం నృపమ్ ॥
దేవభూమిం తతో హత్వా శుంగేషు భవితో నృపః ।
భవిష్యతి సమా రాజా పంచ కణ్వాయనస్తు సః ॥
భూమిమిత్రః సుతస్తస్య చతుర్వింశద్భవిష్యతి ।
భవితా ద్వాదశ సమాసస్మాన్నారాయణో నృపః ॥
సుశర్మా తత్సుతశ్చాపి భవిష్యతి చతుస్సమాః ।
కణ్వాయానాస్తు చత్వారశ్చత్వారింశచ్చ పంచ చ ॥
సమా భోక్ష్యంతి పృథివీం పునరంథ్రాన్గ మిష్యతీ ।
కణ్వాయనమథోద్ధృత్య సుశర్మాణం ప్రసహ్య తమ్ ॥
భద్ర సారుఁడు 25 సంవత్సరములు రాజు కాగలడు. ఆతఁడు అశోకుని 36 సంవత్సరములు రాజుగా తృప్తి పరచును. అతని కుమారుఁడు కులాలుడు (కుశాలకూనాల?) 8 సంవత్సరములు రాజగును. కుశాలునీ కుమారుడయిన బంధు పాలితుడు 8 సంవత్సరములు - రాజ్యముననుభవించును.
బంధుపాలితుని వారసుఁడు, దాయాది ఇంద్ర పాలితుఁడు. నరాధిపుఁడయిన దేవవర్మ 7 సంవత్సరములు రాజగును. ఆతని కుమారుఁడు శతధనుఁడు రాజగును. బృహద్రథుఁడు 7 సంవత్సరములు రాజగును. ఈ విధముగా మౌర్య రాజులు తొమ్మండుగురు. భూమిని 137 సంవత్సరములు పాలింతురు, తరువాత వారి ఎండి ర్యాము “శుంగులను సంక్రమించును. సేనానియయిన పుష్పమిత్రుఁడు బృహద్రథుని తొలగించి రాజ్యమును 60 ఏండ్లు పాలించును. అన్నీ మిత్రుఁడు ఎనిమిదేండ్లు రాజుగా నుండును. తరువాత సుజ్యేషుఁడు 7 సంవత్సరములు రాజగును. తరువాత వసు మిత్రుఁడు రాజై పది యేండ్లు పాలించును. తరువాత భద్రుఁడు రెండేండ్ల రాజు. తరువాత పులిందకుఁడు 3 సంవత్సరములు రాజగును. తరువాత ఘోషుఁడు మూడేండ్ల పాటు రాజు, తరువాత వజ్ర మిత్రుఁడు 7 సంవత్సరములు రోజు. భాగవత రాజు తరువాత 2 సంవత్సరములు రాజు. తరువాత వాని కుమారుఁడు దేవభూమి 10 సంవత్సరములు పాలించును. ఈ విధముగా 'శుంగ వంశపు రాజులు పది మంది భూమినంతటిని 112 సంవత్సరములు పాలింతురు. వారి నుండి రాజ్యము కణ్వ వంశీయులకు సంక్రమించును అమాత్యుడయిన వసుదేవుడు బాల్యాత్పభృతి వ్యసనియయిన దేవ భూమిని చంపి, శుంగ వంశమునందు నృపుఁడగును. ఆతఁడు కణ్వాయనుఁడు (తద్వంశీయుడై 5 సంవత్సరములు పాలించును. ఆతని కుమారుం డు భూమీ పుత్రుఁడు. అతఁడు 24 సంవత్సరములు రాజగును. ఆతనీ తరువాత నారాయణుడు 12 సంవత్సరములు ఆతని కుమారుం డు సుశర్మ 4 సంవత్సరములు రాజ్యము చేయును. కణ్వాయన రాజులు నలుగురు. వారు 25 సంవత్సరములు రాజ్యముననుభవింతురు. తరువాత రాజ్యము ఆంధ్రులకు సంక్రమించును. కణ్వాయను డయిన సుశర్మను నూడబెరికి !
సింధుకో హ్యంధ్రజాతీయః ప్రాప్స్యతీమాం వసుంధరామ్ ।
త్రయోవింశత్సమా రాజా సింధుకో భవితా త్వధ ॥
కృష్ణో భ్రాతాఽస్య వర్షాణి సోఽస్మాద్దశ భవిష్యతి ।
శ్రీశాంతకర్ణిర్భవితా తస్య పుత్రస్తు వై మహాన్ ॥
పంచాశత్తు సమాః షట్ చ శాంతకర్ణిర్భవిష్యతి ।
ఆపోలవో ద్వాదశ వై తస్య పుత్రో భవిష్యతి ॥
చతుర్వింశత్తు వర్షాణి పటుమాంశ్చ భవిష్యతి ।
భవితానిష్టకర్మా తు వర్షాణాం పంచవింశతిమ్ ॥
తతః సంవత్సరం పూర్ణం హాలో రాజా భవిష్యతి ।
పంచపత్తల్లకో నామ భవిష్యతి మహాబలః ॥
భావ్యః పురీషభీరుస్తు సమాః సోఽప్యేకవింశతిమ్ ।
శాతకర్ణిర్వర్షమేకం భవిష్యతి నరాధిపః ॥
అష్టవింశతి వర్షాణి శివస్వాతిర్భవిష్యతి ।
రాజా చ గౌతమీపుత్ర ఏకవింశత్సమా నృపః ॥
ఏకోనవింశతిం రాజా యజ్ఞశ్రీ శాతకర్ణ్యథా ।
షడేవ భవితా తస్మాద్విజయస్తు సమా నృపః ॥
దండశ్రీ శాతకర్ణిచ తస్య పుత్రాః సమాస్త్రయః ।
పులోమారిః సమాః సప్త తతశ్చేషాం భవిష్యతీ ॥
ఇత్యేతే వై నృపాస్త్రింశదంధ్రా భోక్ష్యతి వై మహిమ్ ।
సమాః శతాని చత్వారి పంచాశత్ షట్ తథైవ చ ॥
అంధ్రాణాం సంస్థితాః పంచ తేషాం వంశాశ్చ యే ।
పునః సప్తవ తు భవిష్యంతి దశాభీర్శాతో నృపాః ॥
సప్త గర్దభినశ్చాపి తతోఽథ దశ వై శకాః ।
యవనాష్టౌ భవిష్యంతి తుషారాస్తు చతుర్దశ
త్రయోదశ గురుండాశ్చ మౌనా హ్యేకాదశైవతు ఆంధ్రా భోక్ష్యంతి వసుధాం శతే ద్వే చ శతం చ వై ॥
సప్తషష్టిం చ వర్షాణి దశాభిరాస్తతో నృపాః ।
సప్త గర్దభినశ్చైవ భోక్ష్యంతీమాం ద్విసప్తతిమ్ ॥
శతాని త్రీణ్యాశీతిం చ భోక్ష్యంతి వసుధాం శకాః ।
ఆశీతీ ద్వే చ వర్షాణి భోక్తారో యవనా మహీమ్ ॥
పంచవర్షశతానీహ తుషారాణాం మహీ స్మృతా ।
శతాన్యర్ధచతుర్థాని భవితారస్త్రయోదశ ॥
ఆంధ్ర జాతీయుడయిన సింధుకుఁడు వసుంధరును పొందును. సింధుకుఁడు 23 సంవత్సరములు రాజు. అతని సోదరుఁడు కృష్ణుఁడు, ఆతని తరువాత 10 సంవత్సరములు రాజగును. అతని కుమారుఁడు శ్రీ శాంతకర్ణి (శాతకర్ణి) మహారాజు అగును. శాంతకర్ణి 56 సంవత్సరములు రోజుకాగలఁడు. ఆతని కుమారుడు ఆపోలవుఁడు 12 సంవత్సరములు రాజగును. 'పటుమంతుం డు' 24 సంవత్సరములు రాజగును. అనిష్టకర్మ 25 సంవత్సరములు రాజు. ఒక సంపూర్ణ సంవత్సర కాలము 'హాలుఁడు' రాజు కాగలడు. తరువాత మహా బలుడయిన పత్తల్లక నాముఁడయిన రాజు 5 సంవత్సరములు రాజగును, పురీష భీరువు 21 సంవత్సరములు రాజు. శాతకర్ణి ఒక సంవత్సరము రాజగును. శివస్వాతి 28 సంవత్సరములు రాజుకాగలఁడు. గౌతమీ పుత్రుఁడు 21 సంవత్సరములు. రాజు కాగలఁడు. తరువాత యజ్ఞశ్రీ శాతకర్ణి రాజుగా 19 సంవత్సరములు పాలించును, ఆతని తరువాత విజయుఁడు ఆరు సంవత్సరములే రాజగును. అతని కుమారుఁడు దండశ్రీ శాతకర్ణి మూఁడేండ్ల రాజగును. పులోమారి 7 సంవత్సరములు రాజగును, ఈ విధముగా నీ 30 ఆంధ్ర రాజులు భూమిని 450 సంవత్సరములు భూపాలనమ నుభవింతురు. ఆంధ్ర వంశములు ఐదు గతించినవి, వారి వంశమునకు చెందిన వారు భవిష్యత్తులో 7 గురు. తరువాత ఆంధ్ర రాజులు పదిమందియుందురు.
గర్దభిరాజులు 7 గురు. తరువాత శకులు 10 మంది. యవన వంశములు 8. తరువాత తుషారులు పదునలుగురు. గురుండులు పది ముగ్గురు, యవన వంశీయలు 11 గురు. ఈ భూమీనీ ఆంధ్రులు మూడు వందల సంవత్సరములనుభవింతురు పది మంది అభీరులు 67 సంవత్సరములు రాజులగుదురు. గర్దభుజలయిన ఏడుగురు భూమిని 72 సంవత్సరములనుభవింతురు. శకులు భూమిని 380 సంవత్సరములనుభవింతురు, యవనులు ఈ భూమిని 160 సంవత్సరములనుభవింతురు. తుషారులు తమ రాజ్యమును 500 సంవత్సరములు నిలుపుకొని పాలింతురు. మ్లేచ్చులకు సంబంధించిన పదముగ్గురు గురుండులు భూమిని 300 సంవత్సరము వృషలులతో కలిసి యేలుదురు. .
గురుండా వృషలై: సార్థం భోక్ష్యంతే మ్లేచ్ఛజాతయః ।
శతాని త్రీణి భోక్ష్యంతే మౌనా ఏకాదశైవ తు ॥
తేషుచ్చిన్నేషు కాలేన తతః కిలకిలో నృపః ।
తతః కిలకిలేభ్యశ్చ వింధ్యశక్తిర్భవిష్యతి ॥
సమాః షణ్ణవతీం చైవ పృథివీం తు సమేష్యతి ।
నృపాన్వైదిశకాంశాథ భవిష్యాంస్తు నిబోధత ॥
శేషస్య నాగరాజస్య పుత్రః సురపురంజయః ।
భోగీ భవిష్యతే రాజా నృపో నాగకులోద్వహః ॥
సదాచంద్రస్తు చంద్రశుర్ద్వితీయో నఖవాంస్తథా ।
ధనధర్మా తతశ్చాపి చతుర్థో వంశజః స్మృతః ॥
భూతినందస్తతశ్చాపి వైదికే తు భవిష్యతి ।
తస్య భ్రాతా యవీయాంస్తు నామ్నా నందియశాః కిల॥
తస్యాన్వయే భవిష్యంతి రాజానస్తే త్రయస్తు వై ।
దౌహిత్రః శిశుకోనామ పూరికాయాం నృపోఽ భవత్॥
వింధ్యశక్తి సుతశ్చాపి ప్రవీరో నామ వీర్యవాన్ ।
భోక్ష్యతే చ సమాః షష్టిం పురీం కాంచనకాం చ వై ॥
యక్ష్యతే వాజపేయైశ్చ సమాప్తవరదక్షిణైః ।
తస్య పుత్రాస్తు చత్వారో భవిష్యంతి నరాధిపా ॥
వింధ్యకానాం కులానాం తే నృపాః వైవాహికా స్త్రయః ।
సుప్రతీకో గభీరశ్చ సమా భోక్ష్యతి వింశతిమ్॥
శంకమానోఽ భవద్రాజా మహిషీణాం మహీపతిః ।
పుష్పమిత్రా భవిష్యంతి షట్ స్త్రిమిత్రాస్త్రయోదశ ॥
మేఖలాయాం నృపాః సప్త భవిష్యంతి చ సప్తతిః ।
కోమలాయాం తు రాజానో భవిష్యంతి మహాబలాః ॥
మేఘా ఇతి సమాఖ్యాతా బుద్ధిమంతో నవేవ తు ।
నైషథాః పార్థివాః సర్వే భవిష్యంత్యామనుక్షయాత్ ॥
నలవంశప్రసూతాస్తే వీర్యపంతో మహాబలాః ।
మగధానాం మహావీర్యో విశ్వస్పాణిర్భవిష్యతి ॥
ఉత్సాద్య పార్థివాన్ సర్వాన్ సోఽన్యాన్వర్ణాన్ కరిష్యతి ।
కైవల్తాన్నద్రకాంశ్చైవ పులిందాన్ బ్రాహ్మణాంస్తథా ॥
స్థాపయిష్యంతీ రాజానో నానాదేశేషు తే జనాన్ ।
విశ్వస్ఫాణిర్మహా సత్యో యుద్ధే విష్ణుసమప్రభ ॥
పదకొండ్రు మౌనులు 300 సంవత్సరములేలుదరు, కాలబలముచే వారు నిర్మూలింపబడగా ‘కిలకిల’వంశము పాలించును. ‘కిలకిల'ల. తరువాత వింధ్యశక్తి రాజగును. ఆతఁడు 96 సంవత్సరములు పృథ్విని పాలించును. అందుచే భవిష్యద్రాజులు విదిశకు చెందిన వారని యెఱుంగుఁడు. సర్పరాజయిన సదాచంద్రుఁడు సర్పరాజయిన శేషుని కుమారుఁడు ఆతఁడు సురపురంజయుఁ డు ఆతఁడు భోగి (సరము) అతఁడు రాజగును. సాగకులమునుద్ధరించును. ఇక రెండవ రాజు చంద్రశువు. తరువాత ‘నవంతుడు’ రాజగును. ఈ వంశములో పుట్టిన సోల్గవ వాఁడు ధనధర్ముఁడు. తరువాత భూతినందుఁడు వీదీశారాజుగా వంశపారంపర్యమునవచ్చును ఆతని తమ్ముడు నందీయశుండు, ఆ వంశములో మువ్వురే రాజులుందురు దౌహిత్రుఁడు (కూతుని కొడుకు) శ్రీశీకుడు షూరికయందు రాజు అయ్యెను. ప్రవీరుఁడు, వీర్యవంతుడు నయిన వింధ్యశక్తి కుమారుడు ప్రవీరుడనువాడు కాంచనక పట్టణమును 60 యేండ్లు అనుభవించును: అతఁడు పరిసమాప్తిని వరదక్షిణలతో వాజపేయ యజ్ఞములను ఆచరింపగలఁడు అతని కుమారులు నలుగురు నరాధిపతులగుదురు. వారిలో ముగ్గురు వింధ్యకుల కులములతో వివాహ సంబంధము కలిగియుందురు వివాహ సంబంధము వలన రాజులగుదురు. సుప్రతీకుఁడు గభీరుడు రాజ్యమును ఇరువది వత్సరములనుభవింతురు. శంకమానుఁడు మహిషీ రాజ్యమునకు పాలకుడగును. వారిలో పుష్యమిత్రులారుగురు స్త్రీ మిత్రులు పదిముగ్గురు మేఖలయందు సృపులు 7 గురగుపరు. వారు 70 సంవత్సరములు పాలింతురు, కోమలయందలి రాజులు మహా బలవంతులగుదురు. మీరు 'మేఘులనీ' సమాఖ్యాతులు వారందరు బుద్ధిమంతులు ఆ వంశములో ఆ మంది ఉందురు. నైషధులందరు గొప్ప రాజులు. వారి వంశము మన్వంతరము వఱకు సాగును. వారందరు నల వంశములో పుట్టుదురు. వారందరు వీర్యవంతులు మహాబలులు. మగధులకు విశ్వస్పాణి మహా వీర్యుడగును. ఆతఁడు రాజులనందరను పదచ్యుతులను చేసి ఇతర వర్ణములను సృశించును వారు క్రైవర్తులు, మద్రకులు, పులిందులు, మరియు బ్రాహ్మణులు. ఆ రాజు వారందరిని సోనా దేశములలో స్థాపించెను. విశ్వస్ఫాణి మహా సత్వుఁడు.యుద్ధము నందు విష్ణునితో సమఁడు
విశ్వస్ఫాణిర్నరపతిః క్లీ బాకృతి రివోచ్యతే ।
ఉత్సాదయిత్పాక్షత్రం తు క్షత్రమన్యత్కరిష్యతి ॥
నవ నాగాస్తు భోక్ష్యంతి పురీం చంపావతీం నృపాః ।
మధురాం చ పురీం రమ్యాం నాగా భోక్ష్యంతి సప్త వై ॥
అనుగంగాప్రయాగం చ సాకేతం మగధాంస్తథా ।
ఏతాన్జనపదాన్సర్వాన్ భోక్ష్యంతే సప్తవంశజాః ॥
నైషధాన్యదుకాంశ్చైవ శైశీతాన్ కాలతోయకాన్ ।
ఏతాన్ జనపదాస్సర్వాన్ భోక్ష్యంతే మణిధాన్యజన్॥
కోశలోంశ్చాంధ్రపౌండ్రోంశ్చ తామలిప్తాన్ ససాగరాన్ ।
చంపాం చైవ పురీం రమ్యాం భోక్ష్యంతే దేవరక్షితాః॥
కలింగా మహిషాశ్చైవ మహేంద్రనిలయాశ్చ యే ।
ఏతాన్ జనపదాన్ సర్వాన్ పాలయిష్యతి వై గుహః ॥
స్త్రీరాష్టభోజకాంశ్చైవ భోక్ష్యతే కనకాహ్వయః।
తుల్యకాలం భవిష్యంతి సర్వే హ్యేతే మహీక్షిత: ॥
అల్పప్రసాదా హ్యనృతా మహాక్రోధా హ్యధార్మికాః ।
భవిష్యంతీహయవసా ధర్మతః కామతోఽర్థతః ॥
నైవ మూర్థాభిషిక్తాస్తే భవిష్యంతి నరాధిపా ।
యుగదోషదురాచారా భవిష్యంతి నృపాస్తు తే ॥
భవిష్యంతీహ పర్యాయే కాలేన పృథివీక్షితః।
విహీనాస్తు భవిష్యతీ ధర్మతః కామతోఽర్థతఃII
తైర్విమిశ్రా జనపదా మ్లేచ్ఛాచారాశ్చ సర్వశః ।
విపర్యయేణ వర్తంతే నాశయిష్యంతి వై ప్రజాః॥
లుబ్ధా అనృతవాచశ్చ భవితారస్తదా నృపా ।
తేషాం వర్తతి పర్యాయే బహస్త్రీకే యుగే తదా ॥
లవాల్లవం భ్రశ్యమానా ఆయూరూప బలశ్రుతైః ।
తథాగతాసు వై కాష్ఠం ప్రతిశాసు జగతీశ్వరాః॥
రాజానః సంప్రణశ్యంతి కాలేనోపహతాస్తదా ।
కల్కినా వ్యాహతాః సర్వే మేచ్ఛా యాస్యంతి సంక్షయమ్ ॥
విశ్వస్ఫాణిని నరపతిగా చెప్పుదురు. క్షత్రియులనున్మూలించి ఇతర క్షత్రియుల నతఁడు. సృజించును. నవ నాగరాజులు, చంపావతీ నగరమును పరిపాలింతురు. సప్త సంఖ్యగల నాగులు, రమ్యమైన మధురా నగరముననుభవింతురు, తద్వంశీయులు గంగకు పరిసరములందున్న ప్రదేశములను, ప్రయాగను, మధురను తత్సప్తవంశీయులు తర్రాష్ట్రములను ననుభవింతురు. మణి ధాన్య జములయిన నైషధ, యదుక శైశీత దేశములను కాలతోయక దేశములను కోసలములను ఆంధ్ర రాష్ట్రములను పౌండ్రకములను తాత్రలిప్తలను సాగరములను, అంతియేకాక రమ్యమయిన నగరమయిన చంపను దేవ రక్షితులు పాలింతురు. గుహ వంశీయులు, కలింగమును, మహిషమును, మహేంద్ర నిలయములయిన జనపదముల నన్నింటిని పాలించెదరు. కనకాహ్వయుఁడు (కనాభిరామం డా) స్త్రీ రాష్ట్రములను, భోజక రాష్ట్రములను, పాలించును. ఈ రాజులందరు సమకాలికులగుదురు.
యవన రాజులు, సంతోష పెట్టబడుటకు వీలుకానివారు, అనృతవాదులు, మహాక్రోధులు అధార్మికులు, ధర్మతః అర్ధతః కామతః, . ఆ నరాధి పతులు మూర్థాభిషిక్తులు (పట్టాభిక్తులు) కారు. వారందరు యుగదోషదురాచారులగుదురు. వారు పర్యాయమున (క్రమమున) - కాలమును బట్టి పృథివీక్షితులగుదురు. ఆ రాజులందరు ధర్మతః అర్థతః కామతః విహీనులగుదురు. వారి మూలమున రాష్ట్రములన్నియు - నన్యోన్య మిశ్రములై, మ్లేచ్ఛా చారముల ననుసరింతురు. వారందరు సుప్రతిష్ఠితాచారములకు విపర్యయముగా నాచరించి ప్రజలను నాశనము చేయుదురు. ఆ రోజులందరు పర్యాయమున సంక్రమించిన బహుస్తీ కమయిన యుగమున లుబ్ధులు, అనృతవాదులు, సంక్రమించిన వారు అగుదురు, ఆయువు, రూపము, బలము, వేదము మొదలగు వానిచే లవ లవము ప్రరిభ్రశ్య మానులై రాజులందరు కాలముచేనుపహతులై ప్రజలు అధోస్థితిని చెందగా నా జగతీపతులు నశింతురు. వారు కల్కిచే ఆహతులగుదురు. అందరూ మ్లేచ్ఛులతో సంక్షయమును పొందుదురు.
అధార్మికాశ్చ యేఽత్యర్థం ప్తాఖండాశ్చైవ నర్వశః ।
ప్రనష్టే నృపశబ్ధే చ సంధ్యాశిష్టే కలౌ యుగే ॥
కించిచ్ఛిష్టాః ప్రజాస్తా వై ధర్మే నష్ట పరిగ్రహా ।
అసాధనా హతస్వాశ్చ వ్యాధిశోకనిపీడితాః ॥
అనావృష్టిహతాశ్చైవ పరస్పరవధేన చ ॥
అనాధారాః పరిత్రస్తా వార్తాముత్సృజ్య దుఃఖితాః ।
త్యక్త్వాపురాణి గ్రామాంశ్చ భవిష్యంతి వనౌకసః ॥
ఏవంరూపేషు నష్టేషు ప్రజాసక్త్వా గృహాణి తు ।
నష్టే స్నేహే దురాపన్నా భ్రష్ఠస్నేహాః సుహృజ్జనాః ॥
వర్ణాశ్రమపరిభ్రష్టాః సంకరం ఘోరమాస్థితాః ।
సరిత్పర్వతసేవిన్యో భవిష్యంతి ప్రజాస్తదా ॥
సరితః సాగరానూపాన్సేవంతే పర్వతానథ ।
అంగాన్ కలింగాన్ వంగాంశ్చ కాశ్మీరాన్ కాశికోసలాన్ ॥
ఋషికాంతాగీరిద్రోణీః సంశ్రయిష్యంతి మానవాః ।
కృత్నం హిమవతః పృష్టం కూలం చ లవణాంభసః ॥
అరణ్యమభిపత్స్యంతే ఆర్యా మ్లేచ్ఛజనైః సహ ।
మృగైర్మీ నైర్వహంగైశ్చ శ్వాపదైశ్చక్షుభిస్తథా ॥
మధుశా కఫలైర్మూలై ర్వర్తయిష్యంతి మానవాః ।
చీరం పర్ణం చ త్రివిధం వల్కలాన్యజీనాని చ ॥
స్వయం కృత్వా పిధాస్యంతి యథా మునిజనస్తథా ।
బీజాన్నాని తథా నిమేష్వీహంతః కాష్ఠశంకుభి: ॥
అజైడకం ఖరోష్ట్రం చ పాలయిష్యంతి యత్నతః ।
నదీర్వత్స్యంతి తోయా ర్థే నూనమాశ్రిత్య మానవాః ॥
పార్టీవా వ్యవహారేణ విధంతే పరస్పరమ్ ।
బహుమన్యాః ప్రజాహీనాః శౌచాచారవివర్జితా: ॥
ఏవం భవిష్యంతి నరాస్తదా ధర్మవ్యవస్థితాః ।
దీనాన్దీనాంస్తథా ధర్మాన్ ప్రజా సమనువర్వతి ॥
ఆయుస్తదా త్రయోవింశన్న కశ్చిదతివర్తతే ।
దుర్బలా విషయగ్లానా జరయా సంపరిప్లుతాః ॥
పత్రమూల ఫలాహారాశీ రకృష్ణాజినాంబరా: ।
వృత్యర్థమభిలిప్యంత శ్చరిష్యంతి వసుంధరామ్ ॥
తద్విధముగా అత్యంతము అధర్ములు ఫాఖండులు వినాశమునొందుదురు. రాజ' శబ్దము కూడ ప్రనష్టమొందును. రెండు యుగముల మధ్య కాలమయిన కలియుగ సంధి మిగిలియుండును. తత్కాలము వరకు మిగిలియున్న కొద్దిమంది ప్రజలు ధర్మము నశింపగా ఆస్తులు అవలంబములు లేక వారనాథలగుదురు. వారికి సాధనములు లేనందువలన ఆహతులు. స్వకీయ వ్యాధి శోక పీడితులు. వర్షా భావము చేతను, పరస్పర వధ చేతను. వారు అనాధారులు. భయకంపితులై స్వవృత్తులను, కార్యస్థావరములను విడిచి పోవుదురు అత్యంత దుః ఖితులై పురములను గ్రామములను విడిచి వారందరు అరణ్యవాసులగుదురు. ఇట్టి వివిధములయిన నష్టములందు ప్రజలు తమ తమ గృహముల పరిత్యజించుదురు. స్నేహభావము నశించగా, భ్రష్ట స్నేహులై నుహృజ్ఞనములతో దుఃఖాపన్నులగుదురు. వర్ణాశ్రమములు పరిభ్రష్టములు పరస్పర సంకరాచారములు ఘోరముగ సంప్రాప్తములు, ప్రజలు నదులను పర్వత భూములను సేవించుదురు. నదులను, సొగరానూప ప్రాంతములను పర్వతముల నాశ్రయింతురు. అంగ కలింగ వంగ కాశ్మీర కాళీ ప్రదేశములను, ఋషికాంతాగీరిద్రోణులను (సన్నిహిత ప్రాంతముల) సరస్సుల మానవులాశ్రయింతురు. హిమవత్పర్వత పృష్ట భాగములకు లవణ సముద్రముల కూలములకు అరణ్యములకు మ్లేచ్చులతో సహా వెళ్లెదరు. మానవులు మృగముల మీనముల విహంగముల శ్వాపదముల (హోర మృగముల) శ్వాపదముల యొక్క మాంసములచే తనువులు నిలుపుకొందరు. కొందరు మానవులు తేనె, శాకములు ఫలములు, మూలములు, మొదలగువానిచే నివసింతురు. పూర్వపు ఋషుల వలె చెట్టు బెరడులు, పర్ణములు, వల్కలములు, మృగ చర్మలతో స్వయముగా చేసి, తమ శరీరములను కప్పుకొందురు. వారు శంకులతో, కళలతో బీజముల నాటుటకు ప్రయత్నింతురు. అధిక శ్రమతో వారు మేకలను, గొఱ్ఱులను, గాడిదలను, ఒంటెలను రక్షించు కొందురు. మానవులు నీటి కొరకు బ్రతుకు కొరకు నదుల నాశ్రయింతురు. దుష్ట వ్యవహారములచే పార్థివులు పరస్పరము బాధించుకొందురు. ప్రజలు తమ్ము గూర్చి గొప్పగా తలంచుకొందరు వారు సంతాన హీనులగుదురు. వారందరు దేశా చారాదులను విసర్జించుదురు. ఈ విధంగా ప్రజలు అధర్మ వ్యవస్థితులై యుందురు. సామాన్యులందరు, హీనానందులను, నీచులను, అధర్మ పరుల ననుసరించుదురు. ఆయుఎవరీకి 23 సంవత్సరముల ప్రాయము మీంచి యుండదు. దుర్బలులు, విషయ గ్లానులు, వారక్యముచే నిండిన వారు పత్రమూల ఫలముల ఆహారముగా గలవారు తోళ్ల చర్మములను ధరించెడివారు వృత్తికొఱకు జీవికం కొఱకు సర్వత్ర భూమిని సంచరింతురు.
ఏతత్కాలమనుప్రాప్తాః ప్రజాః కలియుగాంతకే ।
క్షీణే కలియుగే తస్మిన్దివ్యే వర్షసహస్రకే ॥
నిఃశేషాస్తు భవిష్యంతి సార్ధం కలియుగేన తు ।
సంధ్యాంశే తు నిఃశేషే కృతం వై ప్రతిపత్స్యతే॥
యదా చంద్రశ్చ సూర్యశ్చ తథా తిష్య బృహస్పతీ ।
ఏకరాశౌ భవిష్యంతి తదా కృతయుగం భవేత్ ॥
ఏష వంశక్రమః కృత్యః కీర్తితో వో యథాక్రమమ్ ।
అతీతా వర్తమానాశ్చ తథైవానాగతాశ్చ యే॥
మహానందాభిషేకాంతం జన్మ యావత్పరీక్షితః ।
ఏతద్ వర్ష సహస్రం తు జ్ఞేయం పంచాశదుత్తరమ్॥
ప్రమాణం వై తథా వక్తుం మహాపద్మోత్తరం చ యత్ ।
అంతరం చ శతాన్యష్తౌ షట్త్రింశచ్చ సమాః స్మృతాః ॥
ఏతత్కాలాంతరం భావ్యమంధ్రాంతాద్యాః ప్రకీర్తితాః ।
భవిష్యైస్తత్ర సంఖ్యాతాః పురాణజ్ఞై శ్రుతర్షిభి: ॥
సప్తర్షయస్తదా ప్రాప్తః పిత్ర్యే పారీక్షితే శతమ్।
సప్తవింశైః శతైర్భావ్యా ఆంధ్రాణాం తేఽస్వయాః పునః ॥
సప్తవింశతిపర్యంతే కృత్న్యే నక్షత్రమండలే ।
సప్తర్షయస్తు తిష్టంతో పర్యాయణ శతంశతమ్॥
సప్త ర్షిణాం యుగం త్వేతద్దివ్యయా సంఖ్యయా స్మృతమ్।
మాసా ధీవ్యాః స్మృతాః షట్చ దివ్యాజ్ఞాశ్చైవ సప్త హి॥
తేభ్యః ప్రవర్తతే కాలో దివ్యః సప్తర్షిభిస్తు తైః ।
సప్త ర్షీణాం తు యా పూర్వో దృశ్యతే ఉత్తరాదేశి ॥
తయోర్మధ్యే చ నక్షత్రం దృశ్యతే యత్సమం దివి ।
తేన సప్తర్షయో యుక్తా జ్ఞేయా వ్యోమ్ని శతం సమాః ॥
నక్షత్రాణామృషీణాం చ భోగస్యైతన్నిదర్శనతమ్ ।
సప్తర్షయో యథాహ్యుక్తాః కాలే పారీక్షితే శతమ్॥
అంధ్రాంతే సచతుర్వింశే భవిష్యంతీ శతం సమాః ।
ఇమాస్తదా తు ప్రకృతీర్వ్యపత్స్యంతే ప్రజా భృశమ్॥
అనృతోపహతాః సర్వా ధర్మతః కామతోఽర్థత: ।
శ్రౌత స్మార్తె ప్రశిథిలే ధర్మే వర్ణాశ్రమే తదా॥
సంకరం దుర్బలాత్మానః ప్రతియాస్యతి మోహితాః।
సంసక్తాశ్చ భవిష్యంతి శూద్రాః సార్థం ద్విజాతిభిః ॥
ప్రజలీపరిస్థితులకు వచ్చు సరికి కలియుగము సమాప్తమునకు వచ్చును. దైవమానముననుసరించి ఒక సహస్ర దివ్య వర్షములకు కలియుగము క్షీణింపగా, ఆ యుగముతో సహితముగా మానవులు మృతి నొందుదురు. కలియుగమున ప్రజలు నిశ్శేషులగుదురు. సంధి కాలముతో. కలియుగము సమాప్తము కాగా, కృతయుగము ఆరంభమగును. చంద్రుఁడు, సూర్యఁడు, తిష్య (పుష్యమీ) నక్షత్రము- బృహస్పతి - వీరందరేకరాశిలో నుండ. అప్పుడు కృతయుగ మారంభమగును. ఈ వంశ క్రమము సర్వస్వము యథాక్రమముగా మీకు "వివరించితిని. పరీక్షిత్తు యొక్క జననముతో నారంభమయి మహానందుని యొక్క పట్టాభి షేకముతో ముగియు వరకు భూత-భవిష్యత్-వర్తమాన కాలములలోని రాజుల వంశక్రమము చెప్పబడినది. ఇది మొత్తము ఒక వెయ్యి ఏబది సంవత్సరములగును, (గ్రంథము సరిగాలేదు) దానికి నిదర్శనము చెప్పుటకు వీలున్నది. మహాపద్ముని తరువాత ను, అంధ్రరాజుల రాజ్య సమాప్త - కాలముతో సహా 836 సంవత్సరములు. ఇది యింతకుఁబూర్వము చెప్పబడినది. ఈ కాల ప్రమాణము పురాణముల చక్కగా, నెరింగిన .. ఋషులచే గణింపబడినదీ-229, అభ్రవీధి 27 నక్షత్రములు కలిగియున్నది. సప్తర్వులు (ఏడుగురు ఋషులు) పరీక్షిత్తు కాలములో సప్తర్షులు (పిత్య) నక్షత్రముననుండిరి. (మఘ-నక్షత్రస్థితి). అందువారు ఒక వంద సంవత్సరములుండిరి. పొరు ప్రతి నక్షత్ర కూటములలో మరలనొక వంద సంవత్సరములుందురు. అందుచే ఆంధ్రుల వంశములు 2700 (రెండువేల ఏడు వందలు) సప్తర్వులయుగము దివ్య సంఖ్యచే (దేవతా గణనముచే) గణింపఁబడినదని యెఱుంగవలెను. దివ్య గణమున లెక్కించిన మాసముల సంఖ్య ఆరు, సంవత్సరములు. దానిని బట్టి ఆ దివ్య కాల గుణనము పనిచేయ ప్రారంభించును. (360x71/2=2700) సప్తర్షి మండలములోని రెండు నక్షత్రములు, . ఆకాశమున ఉత్తరముననగుపించును. ఆ రెండింటి మధ్యను ఒక నక్షత్ర కూటము కనిపించును. సప్తరులు ఈ నక్షత్రముతో కలిగియుండిరని తెలిసికొనవలెను. ఈ నక్షత్రముల సమావేశము . 100 సంవత్సరములుండును. ఇదీ ఋషులకు నక్షత్రముల సంబంధమునకు మూలము (ఆధార విషయము) 'మఘా' నక్షత్ర మండలముతో సమావేశముగల సప్తర్సులు పరీక్షిత్తు కాలములో వారందు 100 సంవత్సరములుండిరి. ఆంధ్ర. రాజు పంక్తిలోని24వ రాజుతో 100 సంవత్సరములుండును. ప్రజలు ప్రకృతులను తీవ్రముగా నెదురుకొందురు, -236. భౌత స్మార్త క్రియలు ప్రశిధిలముకాగా, ధర్మతః అర్ధతః కామతః ఎల్లరు అనృతోపహతులు కాగా, వర్ణాశ్రమాచారములు ప్రశిధిలముకాగా, దుర్బలాత్ములు మోహితులై సంకరత్వమునొందుదురు. బ్రాహ్మణులతో శూద్రులు సంసక్తులగుదురు.
బ్రాహ్మ ణాః శూద్రయష్టారః శూద్రా వై మంత్రయోనయః ।
ఉపస్థాస్యంతి శాన్విఫ్రాంస్తదా దౌర్వత్రలిప్సవః ॥
లవాల్లవం భ్రశ్యమానాః ప్రజాః సర్వాః క్రమేణ తు ।
క్షయమే గమిష్యంతి క్షీణశే షా యుగక్షయే॥
యస్మిన్ కృష్ణో దివం యాతస్తస్మిన్నేవ తదా దీనే ।
ప్రతిపన్నః కలియుగస్తస్య సంఖ్యాం నిబోధత ॥
సహస్రాణాం శతానీహ త్రీణి మానుషసంఖ్యయా ।
షష్టిం చైవ సహస్రాణి వర్షాణాం తూచ్యతే కలి ॥
దివ్యం వర్షసహస్రం తు తత్సంధ్యాంశే హి కీర్తితే ।
నిః శేషే చ తదా తస్మిన్ కృతం వై ప్రతిపత్స్యతే॥
ఐలశ్చక్ష్వాకువంశశ్చ సహ భేదైః ప్రకీర్తితౌ ।
ఇక్ష్వాకోస్తు స్మృతం క్షత్రం సుమిత్రాంతం వివస్వతః ॥
ఐలం క్షత్రం క్షేమకాంతం సోమవంశవిదో విదుః ॥
ఏతే వివస్వతః పుత్రాః కీర్తితాః కీర్తివర్ధనా: ॥
అతీతా వర్తమానాశ్చ తథైవానాగతాశ్చ యే ।
బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా శూద్రాశ్చైవాత్ర యే స్మృతాః ॥
యుగేయుగే మహాత్మానః సమతీతోః సహస్రశః ।
బహుత్వాన్నామధేయానాం పరిసంఖ్యాకులే కులే ॥
పునరుక్తి బహత్వాచ్చ న మయా పరికీర్తితా వైవస్వతేంతరే హ్యస్మిన్ నిషివంశః సమాప్యతే । ఏతస్యాం తు యుగాఖ్యాయాం యతః క్షత్రం ప్రపత్స్యతే।
తథా హి కథయిష్యామి గదతో మే ని బోధత ॥
దేవాపిః పౌరవో రాజా ఇక్ష్వాకుశ్చైవ యో మరుః ।
మహాయోగబలోపే తౌ కలాపగ్రామమాస్థి తౌ॥
ఏతౌ క్షత్రప్రణీతారో చతుర్వింశ చతుర్యుగే ।
సువర్చానామ, పుత్రస్తు ఇక్ష్వాకోస్తు భవిష్యతి ॥
నవవింశే యుగే సోఽథ వంశస్యాదీర్భవిష్యతి ।
దేవాపేశ్చ సపౌలస్తు ఐలాదీర్భవితా నృపః ॥
క్షత్ర ప్రవర్త కౌ హ్యే తౌ భవిష్యతే చతుర్యుగేః ।
ఏవం సర్వత్ర విజ్ఞేయం సంతానార్థే తు లక్షణమ్ ॥
క్షీణే కలియుగే తస్మిన్ భవిష్యే తుకృతే యుగే ।
సప్తర్షిభిస్తు తైః సార్ధమాద్యే త్రేతాయుగే పునః ॥
బ్రాహ్మణులు శూద్రులకు యజ్ఞములు చేయువారగుదురు. శూద్రులు మంత్రయోనులగుదురు. విప్రులు శూద్రులను చేరి, వారిని, ఏదియో జీవనాధారము కొఱకు, వృత్తిని అభిలషించి, చేరుదురు. ప్రజలు ధర్మము నుండి కొద్ది కొద్దిగా క్రమేణ భ్రష్టులగుదురు. యుగాంతమున ప్రజలు పూర్తిగా క్షయమునొందుదురు. ఏ రోజున కృష్ణుడు స్వర్గమునకరిగెనో ఆ దినముననే కలియుగము ఆరంభమయ్యెను. ఆ "కాలమెట్లు గణింపబడినదో యెఱుంగుఁడు. కలియుగము, మానవ గణనమును బట్టి 3,60,000 సంవత్సరముల ప్రమాణముకలది. ఈ కాలము దేవమానములోనొక సహస్ర వర్షములు. కలి యొక్క సంధి కాలములు రెండును ఇంతకు పూర్వమే చెప్పబడినవి. కలియుగమంతయును సమాప్తము అయిన వెంటనే కృతయుగము ఆరంభించును, ఐల వంశము ఇక్ష్వాకు వంశము వాని వాని భేదములు కీర్తింపఁబడినవి సూర్యవశమయిన ఇక్ష్వాకు వంశము సుమిత్రా ద్వీపముతో అంతమగుచున్న దని యెఱుంగవలెను. చంద్ర వంశమును గూర్చి తెలిసినవారు, ఐల సంబంధమయిన క్షత్రియ వంశము క్షేమకుని తో అంతమగుననీ యెతుంగుదురు. ఈ వివస్వద్వంశ పుత్రులు భూత భవిష్యద్వర్తమాన కాలములో కీర్తింపఁబడిరి. వారు కీర్తి వర్థనులు. వారు, ". బ్రాహ్మణులుగా క్షత్రియులుగా వైశ్యులుగా, శూద్రులుగా, పుట్టియుండిరని యనుకొందురు . యుగ యుగము నందు మహాత్ములైనవారు " వేలకొలది మరణించిరి.వారి సంఖ్య సంఖ్యామానమున అనంతము. పునరుక్తి బహుత్వమువలన నేను కీర్తింపలేదు. ఈ వైవస్వత మన్వంతరమున నిమివంశము సమాప్తము నొందును. ఎవరి నుండి క్షత్ర జాతి ఈ యుగమున ఆరంభమగునో వారిని గూర్చి చెప్పెదను. నేను వివరించుచుండగా దానిని గ్రహింపుఁడు. పౌరవుల రాజయిన దేవాపి, ఇక్ష్వాకు వంశమునకు చెందిన 'మరుఁడు, వీరిరువురును మహాయోగబలములు కలవారు వారు 'కలాప' గ్రామ మందుండిరి. ఇరువది నాలుగవ చతుర్యుగము నందు వీరే క్షత్రీయ జాతి వర్ధిల్లుటకు కారణపురుషులు సువర్చసుడు అను పుత్రుఁడు ఇక్ష్వాకునకు పుట్టును. ఇది 29వ యుగము నందు. ఆతఁడే యీ వంశమున కారంభకుఁ డు, సంస్థాపకుఁడు కాగలడు. దేవాషికి సపౌలుడై ఐలాదియైనవాడు రాజగును. చతుర్యుగము 24వ నందును వారిరువురును క్షత్రియ ప్రవర్తకులగుదురు. ఈ విధముగా సంతానార్థము లక్షణము వంశము నీలుపుటయే సిద్ధాంతము సర్వత్ర తెలిసికొనవలయును. కలియుగము క్షీణమయి కృతయుగము రాబోవును. వారు (కృతయుగమున పుట్టుదురు) ఆద్యమైన త్రేతాయుగమునందు సప్తర్షులతో సహా, వారే.
గోత్రాణాం క్షత్రియాణాం చ భవిష్యేతే ప్రవర్త కౌ ।
ద్వాపరాంశేన తిష్ఠంతి క్షత్రియా ఋషిభిః సహ ॥
భవిష్యే తు తతః సర్గే కాలే కృతయుగే పునః ।
బీజార్థం తే భవిష్యంతి బ్రహ్మక్షతస్య వై పునః ॥
ఏవమేవ తు సర్వేషు తిష్ఠంతీహాసురేషు వై ।
సప్తర్షయో నృపైః సార్ధం సంతొసార్థం యుగేయుగే ॥
క్షత్తస్యైవ సముచ్ఛేదసంబంధో వై ద్విజైః స్మృతః ।
మన్వంతరాణాం సప్తానాం సంతానశ్చ శ్రుతశ్చ తే ॥
పరస్పరాద్యుగానాం చ బ్రహ్మక్షత్రస్య చోద్భవః ।
యథా ప్రవృత్తిస్తేషాం వై ప్రవృత్తానాం తథా క్షయ: ॥
సప్తర్షయో విదుస్తేషాం దీర్దాయుష్ట్వాద్భవాభవౌ ।
ఏతేన క్రమయోగేన ఐలేక్ష్వాక్వన్వయా ద్వీజావి ॥
ఉత్పద్యమానా స్త్రేతాయాం క్షీయమాణాః కలౌ పున: ।
అనుయాంతీ యుగాభ్యాం తు యావన్మన్వంతరక్షయః ॥
జామదగ్నేన రామేణ క్షత్రే నిరవశేషితే ।
కృతేయం సంకులా సర్వా క్షత్రియైర్వసుధాధిపైః ॥
ద్వీవంశ కారణం చైవ కీర్తయిష్యే నీబోధత ।
జల స్యే క్ష్వాకువందస్య ప్రకృతిః పరివర్తతే ॥
రాజానః శ్రేణిబద్ధాస్తు తథాన్యే క్షత్రి యా నృపాః । ఐలవంశస్య యే ఖ్యాతాస్తథైవేక్ష్వాకవో నృపాః ॥
తేషామేకశతం పూర్ణం కులానామభిషేకితమ్ ।
తావదేవ తు భోజానాం విస్తరో ద్విగుణః స్మృతః ॥
భజతే త్ర్యంశకం క్షత్రం చతుర్ధాత్తద్యదా దిశమ్।
తేష్వ తీతాః సమానా యే బ్రువతస్తాన్నిబోధత ॥
శతం వై ప్రతివింధ్యానాం శతం నాగాః సహైహయా ।
ధృతరాష్ట్ర శ్చైకశతమశీతిర్జనమేజయా: ॥
శతం చ బ్రహ్మదత్తానాం శారీణాం వీరిణాం శతమ్ ।
తతః శతం తు పౌలానాం శ్వేతకాశ్యకుణోదయః॥
తతోఽపరే సహస్రం వై యేఽ తీతాః శశబిందవః ।
ఈజిరే చాశ్వమేథైస్తే సర్వే నియుతదక్షిణైః ॥
ఏవం రాజర్షయో ఽతీతాః శతఽశోథ సహస్రశః మనోః ।
రైవస్వతస్యాస్మిన్ వర్తమానేంఽతరే తు యే ॥
క్షత్రియుల యొక్క బ్రాహ్మణుల యొక్క గోత్ర ప్రవర్తకులు కాగలరు. ద్వాపరాంశములో క్షత్రియులు ఋషులతో కూడ నుందురు. ఇది భవిష్యద్యుగమున కృతయుగమునందు బ్రాహ్మణ క్షత్రియ బీజార్ధము కొఱకు. ఈ విధముగనే ప్రతీయుగమునందు సప్తర్పులు అసురుల యొక్క రాజులతో వారి వంశమును నిల్పుటకు నుందురు. బ్రాహ్మణులతోడి క్షత్రీయుల సంబంధము సముచ్చేద సంబంధముగా సంస్కృతము. ఏడు మన్వంతరముల యొక్క సప్తసంతానముల గూర్చి మీరు వినీయుంటిరీ సాధారణముగా యుగముల యొక్క బ్రాహ్మణులయొక్క ఉద్బవములు (ఆరంభములు) పరస్పరాశ్రయములు. యుగముల ఆరంభము, అట్లే బ్రాహ్మణ క్షత్రీ యోద్భవములు, వాని వినాశనము, ఇది యెట్లు ప్రవర్తించునో ప్రవర్తింప నారంభించిన తరువాత ఎటుల వినాశనము చెందునో (క్షయము, ప్రవృత్తి),సప్తర్వులు దీర్ఘాయుష్మంతులగుటి వారెరుగుదురు, (ఓ బ్రాహ్మణులారా) ఈ విధముగా (ఈక్రమయోగమున) ఐల ఇక్ష్వాకు వంశములు, త్రేతాయుగమున ఉద్భవమయిన కలియుగము నందు సౌశనములయినవి. మన్వంతరము యొక్క సమాప్తము వరకు వారాయుగమును అనుసరింతురు. జమదగ్ని కుమారుడైన జమదగ్ని క్షత్రియులను నిశ్శేషము చేయగా, యావద్భూమీరు వసుధాధిపులయిన క్షత్రియనిశ్శేషము చేయ యావదూమియు వసుధాధిపులయిన క్షత్రియులచే సంకులము సంక్షుఱ్ఱము చేయబడినది. ఈరెండు వంశముల యొక్క కారణమును చెప్పెదను తెలిసికొనుఁడు. ఇక్ష్వాకుల ఐలుల సంతతి భిన్నము. (సూర్యుడు - చంద్రుడు) ఇతరక్షత్రియులు (రాజులు) వీరి శ్రేణులలోనికి వత్తురు. ఐలవంశ మునందేవ్వరు ప్రఖ్యాతులోవారికి అట్లే ఇక్ష్వాకులలోని ప్రఖ్యాతులకు ఒక వంద కులములకు అభిషేకములు జరిగినవి. భోజ వంశీయుల యొక్క విస్తారము దానికి రెండంతలు అని చెప్పుదురు. గ్రంథస్టాలిత్యములున్నట్టున్నవి?) మూడు వంతులు, క్షత్రియులు సంస్థాపితులు, ఒక వంతు . ఇందు. అందు. చెదరీ వసించిరి. (వీరును వీరి పూర్వులతో సమానులని యెంగుడు) , వారలలో ప్రతి వింధ్యుని యొక్క వారసులు సూరుమంది, నాగులు హిమాలయాల వారితో కలిసి వారసులు 100, 101 మంది ధృత రాష్టులు,జనమే జయవంశీయులు 80. బ్రహ్మదత్తులు 100, శారిణులు వీరిణులు నూర్గురు. పౌలులు 100, శ్వేతులు, కాశ్యులు, కుశాదయులు, మరి ఇతరులు, వెళ్లినవారు, శత బిందువులు అందరు ఒక వెయ్యి. లక్షలాది నాణెములను నియమ దక్షిణాలుగా పంచబెట్టి వారశ్వ .మేధములను చేసిరి. ఈ విధముగా వందలకొలది, వేల కొలది, రాజర్షులు. గతించిరి. ఇప్పటి వైవస్థతమన్వంతరముననున్న పోరి సంతతుల వినుడు.
తేషాం నిబోధతోత్పన్నా లోకే సంతతయః స్మృతాః ।
న శక్యో విస్తరిస్తాసాం సంతతీనాం పరస్పరమ్ ॥
తత్పూర్వాపరయోగేన వక్తుం వర్షశతైరపి ।
అష్టావింశద్యుగాఖ్యాస్తు గతా వైవస్వతేఽoతరే ॥
ఏతే రాజర్షిభిః సార్ధం శిష్టాయాస్తా నిబోధత ।
చత్వారింశత్రయశ్చైవ భవిష్యాః సహా రాజభిః ॥
యుగాఖ్యానావశిష్టాస్తు తతో వైవస్వతక్షయః ।
ఏతద్వః కథితం సర్వం సమాసవ్యాసయోగతః ॥
పునరుక్తిబహుత్వాచ్చ న శక్యం తు యుగైః సహ ।
ఏతే యయాతీపుత్రాణాం పంచవంశా విశాం హితాః ॥
కీర్తితాశ్చ వ్యతీతా యే మే లోకాన్ ధారయం త్యుత ।
లభతేచ వరాన్ పంచ దుర్లభానియా లౌకికాన్ ॥
ఆయుః కీర్తిం ధనం పుత్రాన్ స్వర్గం చానంత్యమశ్నుతే ।
ధారణాచ్చ్రవణాచ్చైవ పంచ వంశస్య ధీమత: ॥
ఇత్యేష వో మయా పాదస్తృతీయః కథితో ద్విజా ।
విస్తరేణానుపూర్వ్యా చ కీం భూయో వర్ణయామ్యహమ్॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తీ మధ్యమ భాగే తృతీయే ఉపోద్ఘాతపాదే వంశాను వర్ణనం నామ చతుఃసప్తతితమోఽధ్యాయః సమాప్తశ్చాయం తృతీయః పాదః॥
అయినను, వారి సంతతులను, పరస్పరము పేర్కొనుట విస్తరించుట అశక్యము. పూర్వాపరయోగముతో వారిని గూర్చి చెప్పవలయునన్న నూరేండైన పట్టును, ఈ రాజర్షులతో, 2,8 యుగముల యొక్క వర్గములు (నాలుయుగములొక వర్గము) వైవస్వత మన్వంతరమున జరిగినవి, ఇంకను మిగిలిన వారిని తెలిసికొనుము. నాలుగు యుగములలోకి 43 (రాజుల) సముచ్చయములు, ఇంకను భవిష్యద్రాజులతో రావలయును. దాని తరువాత వైవస్వయన్వంతరము సమాప్తమగును.
అందుచే సంక్షిప్తముగా వివరముగా మీ కంతయును వివరించితిని. ఆనేకమయిన పునరుక్తులుండుటవలన, యుగములతో కూడ : సర్వము పరిపూర్ణముగా చెప్పుటకు సాధ్యముకాదు. యయాతి కుమారులైదుగురి యొక్క సంతతులు ప్రజలకు మంచివి. వానిని కీర్తించితిని. వారు గతించిరి. వారీలోకములను ధరించుచున్నారు. (ఉద్దరించుచున్నారు). ఆ యైదు సంతతులను జ్ఞప్తిలోనుంచుకొని, వానిని గూర్చి వినినందువలన - ఆయువు, (2) కీర్తి (3) ధనము (4) పుత్రులు, (5) స్వర్గమును పొందుదురు.
ఈ విధముగా తృతీయపాదము విస్తరముగాను ఆనుపూర్వీకముగాను చెప్పబడినది. ఇంక నేనేమి వర్ణింతును
ఇది శ్రీ వాయుప్రోక్త బ్రహ్మాండ మహాపురాణమున మధ్యమ భాగమున, తృతీయ ఉపోద్ఘాత పాదమునందు “వంశాను వర్ణనమను” 74వ అధ్యాయము.
Summary of chapter 112 of the Brahmānda Mahā Purana is as follows:
Bringing the grand second part, the Madhyama Bhāga, to a triumphant and blissful close, this chapter summarizes the profound teachings covered across its seventy-four chapters. It offers final benedictions of peace, devotion, and liberation to all faithful readers who have journeyed through these sacred chronicles. The devoted soul bows in deep gratitude before the supreme creator, firmly anchored in unshakeable devotion and ready to absorb the final cosmic truths.