బ్రహ్మాండ మహా పురాణము
21 - ఆదిత్య వ్యూహకీర్తనము
సూర్యాచంద్రమసావేతౌ భ్రమతో యావదేవ తు ।
ప్రకాశైస్తు ప్రభాభిస్తా మండలాభ్యాం సముచ్ఛ్రితౌ ॥
సప్తానాం తు సముద్రాణాం ద్వీపానాం స తు విస్తరః ।
విస్తరార్ధే పృథివ్యాస్తు భవేదన్యత్ర బాహ్యతః ॥
పర్యాసపరిమాణం తు చంద్రాదిత్యో ప్రకాశతః ।
పర్యాస్తాక్ పారిమాణ్యేన భూమేస్తుల్యం దేవం స్మృతమ్ ॥
అవతీ శ్రీనిమాన్ లోకాన్ యస్మాత్సూర్యః పరిభ్రమన్ ।
‘అవి’ధాతుః ప్రకాశాభ్యో హ్యవనాత్స రవిః స్మృతః ॥
అతః పరం ప్రవక్ష్యామి ప్రమాణం చంద్రసూర్యయోః ।
మహత్తత్వాస్ మహీళబోహ్యస్మిన్ వరే నిత్యతే ॥
అస్య భారతవర్షస్య విష్కంభాతుల్యవిస్తృతమ్ ।
మండలం భాస్కరస్యాథ యోజనానీ నిబోధత ॥
నవయోజనసాహసో విస్తారో భాస్కరస్య తు ।
విస్తారాత్రిగుణశ్చాస్య పరిణాహస్తు మండలే ॥
విష్కంభమండలాచైవ భాస్కరార్డ్విగుణః శశీ ।
అథ పృథివ్యా వక్ష్యామి ప్రమాణం యోజనైస్సహ ॥
సప్తద్వీపసముద్రయా విస్తారో మండలం చ యత్ ।
ఇత్యేతదిహ సంఖ్యాతం పురాణే పరిమాణతః ॥
తద్వక్ష్యామి సమాఖ్యాయ సాంప్రతైరభిమానిభిః ।
అభిమానినోవ్యతీతా యే తుల్యాస్తే సాంప్రతైస్త్వివ ॥
సూర్యసిద్ధాంతము (మండలం) ఆకాశ గ్రహ సంచారములు; కాల విభజనము
సూర్యచంద్రులు ఎంతకాలము భ్రమించు చుందురో, వారి ప్రకాశము చేత వారు వారీ మండలముల నుండి సముచితులు. (పైకి యెత్తబడి యుందురు.) (రవి - శబ్దము సాధారణముగా ‘రు’ అనుధాతువు నుండి పుట్టినది. (ఉణాది) కాని ఇచ్చటి ఆ శబ్దము ‘ఆప్’ రక్షణే నుండి పుట్టి దనుచున్నాఁడు (అప్ ధాతువు రక్షణార్థము) కాంతిమంతమయిన సూర్యచంద్రుల ప్రకాశముచే వ్యావృతమయిన స్థలము యొక్క విస్తీర్ణము, ఏడు సముద్రముల యొక్క సప్త ద్వీపముల యొక్క విస్తీర్ణముతో తుల్యము. భూమియొక్క అర్థభాగమున కాంతి ప్రసరించును. మిగిలిన సగభాగము కాంతి రహితముగ నుండును. సూర్యుడు, చంద్రుఁడు వారు వారికి (ఎదురుగా) అభిముఖముగా నున్న భాగమును ప్రకాశవంతము చేయుదురు. ఆకాశము యొక్క విస్తీర్ణము ప్రమాణము భూమి విస్తీర్ణముతో సమానమయినదనీ భావింపఁబడుచున్నది. (3) సూర్యుఁడు అంతటను పరిభ్రమించుచు మూడు లోకములను ప్రకాశింపఁజేయును. రక్షించును). (4) అందుచే, ప్రకాశ రక్షణ వ్యాపారములచే ఆతఁడు ‘రవి’గా స్మరింపఁబడుచున్నాఁడు. ఇక చంద్ర సూర్యుల యొక్క ప్రమాణమును చెప్పుచున్నారు. ఈ వర్షమునకు మహి (భూమి) అను శబ్దము నీపతీంపఁబడినది. దానికి కారణము దాని మహత్తత్వము. సూర్యునియొక్క మండలము భరతవర్షము యొక్క ‘వ్యాస’ తుల్యముగా స్మరింపఁబడుచున్నది. యోజనమనఁగా 12 కిలో మీటర్లు. అని గ్రహింపవలయును. (6) సూర్యమండలము యొక్క విస్తీర్ణము తొమ్మిదివేల యోజనములు దాని పరిధి యందు చంద్రుఁడు సూర్యుని కంటే రెట్టింపు. ఇక ఇప్పుడు యోజనములతో పృథివీ. ప్రమాణమును చెప్పెదను.(8) సప్తద్వీప సముద్రములు గలిగిన భూమి యొక్క విస్తీర్ణము, పరిధి, పురాణములలో నిజ పరిమాణములతో చెప్పబడినది. (9) ప్రస్తుతాభిమానులను పేర్కొనిన పిమ్మట దానిని గూర్చి చెప్పెదను. అభిమానులు - దేవతలు; ఆయా వర్షముల కధ్యక్షులు. లేదా ఆయా ప్రదేశముల కధిపతులు. గతించిన యభిమానులు ప్రస్తుతాభిమానులతో సరియైనవారు. (10)
దేవా యే వై వ్యతీతాస్తు రూపై ర్నామభిరేవ చ ।
తస్మాత్తు సాంప్రతైర్దేవైర్వక్ష్యామి వసుధాతలమ్ ॥
దీవస్తు సన్నివేశం వై సాంప్రవైరేవ కృత్స్నశః ।
శతార్ధక్టివిస్తారా పృథివీ కృత్స్నశః స్మృతా ॥
తస్యా ఊర్థ్వప్రమాణేన మేరోర్యావత్తు సంస్థితః ।
పృథివ్యా హ్యర్ధవిస్తారో యోజనాగ్రాతృకీర్తితః ॥
మేరోర్మధ్యాత్పతిదేశం కోటిరేకా తు సా స్మృతా ।
తథా శతసహస్రాణామేకోననవతిః పునః ॥
పంచాశత్తు సహస్రాణి పృథివ్యర్ధస్య మండలమ్ ।
గణితం యోజనాగ్రాత్తు కోట్యస్వేకాదశ స్మృతాః ॥
తథా శతసహస్రాణి సప్తత్రింశాధికాని తు ।
ఇత్యేతదిహ సంఖ్యాతం పృథివ్యంతస్య మండలమ్ ॥
తారకాసన్నివేశస్య దివి యావచ్చ మండలమ్ ।
పర్యాససన్నివేశశ్చ భూమేర్యావత్తు మండలమ్ ॥
పర్యాసపరిమాణేన భూమేస్తుభ్యం దివః స్మృతమ్ ।
సప్తానామపి ద్వీపానామేతత్థానం ప్రకీర్తితమ్ ॥
పర్యాయపరిమాణేన మండలానుగతేన చ ।
ఉపర్యుపరి లోకానాం ఛత్రవత్పరిమండలమ్ ॥
సంస్థితిర్విహిళా సర్వ యేషు తిష్ఠంతి జంతవః ।
ఏతదండకపాలస్య ప్రమాణం పరికీర్తితమ్ ॥
అండస్యాంతస్తీమే లోకాః సప్తద్వీపా చ మేదినీ ।
భూర్లోకళ్ళ భువర్లోక సృతీయః స్వరిత స్మృతః ॥
మహర్లోకో జనశ్చైవ తపః సత్యం చ సప్తమమ్ ।
ఏతే సప్తకృతా లోకాశ్ఛత్రాకారా వ్యవస్థీతాః ॥
గతించినవారు (వ్యతీతులు) అయిన దేవతలు రూపములచే నామములచే ప్రస్తుత దేవతలతో సమానులు. అందుచే వసుధాతలము నంతటినీ ప్రస్తుత దేవతల ద్వారా వివరించేదను, (11) దీనము యొక సన్నివేశ సర్వస్వమును గూర్చి ప్రస్తుత దేవతల ద్వారా చెప్పెదను. యావత్తు (మొత్తము) పృథివీ 50 (ఏబది) కోట్ల యోజనముల విస్తారము కలది. (12) పృథ్వి యొక్క ఊర్ద్వ ప్రమాణ సంస్థితి మెరుపు వరకు నున్నది. భూమి యొక్క విస్తీర్ణము నందలి యర్ధభాగము యోజనములో చెప్పబడినది. అన్ని దిక్కులకు వ్యాపించి భూమి యొక్క విస్తీర్ణము, మేరువు మధ్య భాగము నుండి, ఒకకోటి, ఎనుబది తొమ్మిది లక్షల ఏబది వేల యోజనములుగా స్మరింపఁబడినది. అందుచే వలయాకారముగ నున్న భూమి యొక్క విస్తృతి దాదాపు పదకొండు కోట్ల ముప్పుది ఏడు లక్షలు. ఆదియే భూతలము యొక్క విస్తీర్ణముగా గణింపఁబడినది. (16) (ఈభూమి యొక్క విస్తీర్ణ గణనము) పర్యాసః (భ్రమణము) రారా మండలమున నక్షత్ర కూటముల విస్తీర్ల మెంతవరకున్నదో అంతవరకు పర్యాస సన్నివేశము భూమియొక్క మండలము వరకు వ్యాపించియున్నది. పర్యాస గణనము వలన ఆకాశము భూమితో సమానముగా నున్నది. ఇయ్యదియే ఏడు ద్వీపముల సంస్థానముగా ప్రకీర్తితము. (17,18) ప్రపంచ గోళముల సంస్థితి ఒకదానిపై నొకటి (ఉపర్యుపరి) పూర్వగోళ పరిధిలో ఉత్తరగోళ పరిధి క్రమముగా సరిపడుచునున్నవి. (ఛత్రవల్ పరిమండలమ్). (19) యావత్తు సంస్థితియు నీ విధముగా విహితమై యున్నది. అన్ని జంతువులందు నివసించును. ఈ విశ్వాండము యొక్క ప్రమాణము చెప్పఁబడినది. (20) ఈ బ్రహ్మాండము నందే సప్త ద్వీపములతోడి భూమి యున్నది. ఆ లోకములు - భూర్లోకము, భువర్లోకము, సువర్లోకము, మహర్లోకము, జనకము, తపోలోకము మరియు సత్యలోకము. ఈ యేడు లోకములు సృజింపఁబడినవి. అయ్యవి యొక. ఛత్ర రూపమున రచింపఁబడినవీ. (22)
స్వకైరావరణైః సూక్ష్మణార్యమాణాః పృథక్ పృథక్ ।
దశభాగాధికాభిశ్చ తాభీః ప్రకృతిభిర్బహిః ॥
పూర్యమాణా విశేషైశ్చ సముత్పన్నైః పరస్పరాత్ ।
అస్యాండస్య సమంతాచ్చ సన్నివిష్ణో ఘనోదధిః ॥
పృథీహ్య మండలం కృత్నం ఘనతోయేన ధార్యతే ।
ఘనోదధిః పరేణాథ ధార్యతే ఘనతేజసా ॥
బాహ్యతో ఘనతేజశ్చ తీరగూర్ధం తు మండలమ్ ।
సంవతార్ధనపాతేన ధార్యమాణం ప్రతిష్ఠితమ్ ॥
ఘనవాతం తథాకాశమాణాశం చ మహాత్మమా ।
భూతాహావృతం సర్వం భూతాతీర్మహతా వృతః ॥
వృతో మహాననంతేన ప్రధానేనావ్యయాత్మనా ।
పురాణీ లోకపాలానాం ప్రవక్ష్యామీ యథాక్రమమ్ ॥
జ్యోతిర్గుణప్రచారస్య ప్రమాణపతిసిద్ధయే ।
మేరోః ప్రాచ్యాం దిశి తథా మానసస్యైవ మూర్ధని ॥
వస్వౌకసారా మాహేంద్రీ పురీ హేమపరిష్కృతా ।
దక్షిణేన పునర్మరోర్మానస స్యైవ మూర్ధని ॥
వైవస్వతో నివసతి యమః సంయమనే పురే ।
ప్రతీచ్యాం తు పునరేరోః నవేస్తస్యైవ మూర్ధని ॥
సుభా నామ పురీ రమ్యా వరుణస్యాపి ధీమతః ।
వరుణ్ యాదసాం నాథః సుఖాళ్యే వసతే పురే ॥
దీశ్యుత్తరస్యాం మేరోస్తు మానసస్యైవ మూర్ధని ।
తుల్యా మహేంద్రపుర్యాస్తు సోమస్యాపీ విభావరీ ॥
స్వకీయములయిన సూక్ష్మాచరణములచే నయ్యవి వేరువేరుగా ధరింపఁబడుచున్నవి. ఆరంభముయొక్క ఆధారములు, అన్నియు బాహిరములయిన ఆవరణములు. అయ్యవి తాము ఆవరించునట్టి వానికంటే పదిరెట్లు పెద్దవి. పరస్పర సముత్పన్నములై యవీ ప్రత్యేకమయిన విశిష్ట లక్షణములతో కూడియున్నవి. ఈ విశ్వాండము యొక్క యంతటను ఘనీభవించిన సముద్రము సన్నీవిష్టమయియున్నది. (24).పృథివీ. యొక్క యావన్మండలము ఘనీభూత జలముచే వహింపబడుచున్నది. ఆ ఘనీభూతమయిన యుదధి, ఘనీభూతమయిన తేజస్సుచే భరింపబడుచున్నది. (25) బాహ్యముగా అన్ని దిక్కులయందు ఘనీభూత తేజస్సు పరివృతమై యున్నది. ఊర్ద్వము నందు, పార్శ్వముల యందు నియ్యది, ఘనీభూత వాయుభూతముచే వహింపబడుచున్నదీ ఈ విధముగా ధరింపఁబడి యయ్యదీ కదలకుండ సుప్రతిష్ఠితముగా నున్నదీ, (26) ఘనవాతము (ఘనీభూతమయిన వాయువు) ఆకాశముచే పరివృతమై యున్నది. ఆకాశము భూతాదులచే ఆవృతము. (అహంకారి). భూతాదులు మహత్తుచే ఆవృతములు, (27) మహత్తు అవ్యయమయిన ప్రధానముచే ఆవృతము. (అది అవ్యయము, అమేయము), లోకపాలురయిన వారి నగరముల గూర్చి యథాక్రమము వివరించేదను. (29) జ్యోతిర్గణముల యొక్క ప్రచారమునకు ప్రమాణ పరిసిద్దికి మేరువు యొక్క తూర్పు దోశయందు, మానసము యొక్క శిఖరమున ఉన్న జ్యోతిర్గణముల వర్ణించెదను. మేరువు యొక్క ప్రాగ్జిశ యందు, మానస శిఖరము నందు, మహేంద్రీ పురమున్నది. అందు వసువులు నివసింతురు. అయ్యది సువర్ణముచే నలంకరింపఁబడినది. (వసువులలో ఇంద్రుఁడొకడు). మేరువునకు దక్షిణ దీశను మానసము యొక్క మూర్ధమున (30) యముఁడైన వైవస్వతుఁడు నివసించును. ఆతఁడుండునది సంయమన పురము. (31) మేరువునకు పడమటను, మానసము యొక్క మూర్ధమునను సుఖమను అందమయిన నగరము కలదు. అయ్యది ధీమంతుఁడయిన వరుణుని పట్టణము. యాదసాం (నీటికి) నాథుఁడయిన వరుణుడు ‘సుఖ’ మను పేరుగల నగరమున నివసించును. (32)
మానసోత్తర పృష్టే తు లోకాపాలాశ్చతుర్దీశమ్ ।
స్థితా ధర్మవ్యవస్థార్థం లోకసంరక్షణాయ చ ॥
లోకపాలోపరిష్ఠాత్తు సర్వతో దక్షిణాయనే ।
కాష్ఠాగతస్య సూర్యస్య గతిర్యా తాం నిబోధత ॥
దక్షిణోపక్రమే సూర్యః క్షిప్తేషుధివ సర్పతి ।
జ్యోతిషాం చక్రమాదాయ సతతం పరిగచ్ఛతి ॥
మధ్యగశ్చిమరావత్యాం యదా భవతి భాస్కరః ।
వైవస్వతే సంయమతే ఉదయస్తత్ర దృశ్యతే ॥
సుఖాయామర్ధరాత్రం స్యాత్ విభాయామస్తమేతి చ ।
వైవస్వతే సంయమనే మధ్యగః స్యాత్ రవిద్యదా ।
సుఖాయామథ వారుణ్యాముత్తిష్టన్స తు దృశ్యతే ॥
వీభాయామర్ధరాత్రం స్యాత్మహేంద్ర్యామస్తమేతి చ ।
యదా దక్షిణపూర్వేషామపరాహో విధీయతే ॥
దక్షిణాపరదేశ్యానాం పూర్వాష్ణః పరికీర్తితః ।
తేషామపరరాత్రశ్చ యే జనా ఉత్తరాః పరే ॥
దేశా ఉత్తరపూర్వా యే పూర్వరాత్రస్తు తాస్ప్రతీ ।
ఏవమేవోత్తరేష్వర్ భువనేషు విరాజతే ॥
సుఖాయామథ వారుణ్యాం మధ్యాహ్నే చార్యమా యదా ।
విభాయాం సోమపుర్యాం వా ఉత్తిష్ఠతు విభావసుః ॥
మేరువున కుత్తరమున మానసము యొక్క మూర్ఖమునందే సోమమను నగరమున్నది. దానికి విభావరీ యను నామము కలదు. అయ్యది మహేంద్రపుర తుల్యమయినదీ. (33) ధర్మ వ్యవస్థను ప్రలెష్టించుటకు..లోక సంరక్షణము కొఱకు, లోకపాలకులు నాలుగు దిక్కుల యందు మానసపు ఉత్తర పృష్ఠ భాగమున నున్నారు. (34) దక్షిణాయనము నందు సూర్యునీ గతిని గూర్చి తెలిసికొనుము. ఆతని గతీ సర్వలోకపాలుర యొక్క యుపరీతలమున నుండును. (35) దక్షిణాయన ప్రారంభమునందు, వింటి నుండి విడువబడిన బాణము వలె సూర్యుఁడు ముందునకు ” పోవును. ఆతఁడు జ్యోతిశ్చక్రమును తనతో గ్రహించి యెల్లప్పుడును సంచరించును. (36) ఇంద్రునీ నగరమయిన అమరావతీ నగర మధ్యమును సూర్యుఁడు చేరగా, ఆతని యుదయము వైవస్వతుని (యముని) నగరమయిన సంయమనగరమున చూడనగును. (37) సుఖానగరమున అదీ అర్ధరాత్రమగును. సూర్యుఁడు వీభానగరమున నస్తమీంచుచున్నట్లు తోచును. (కనిపించును). (విభా = విభావరి) సూర్యుడాకోశమున వైవస్వత నగరమయిన సంయమనమున మధ్యగుఁడై యుండగా వరుణ నగరమయిన సుఖాపురి యందు సూర్యుడు ఉదయించును. విభానగరమున నది యర్థరాత్రము సూర్యుఁడు మాహేంద్రీ నగరమున నస్తమించుచున్నట్లు కనిపించును. (38) దక్షిణ పూర్వ భాగమున (ఆగ్నేయ దోశను) నున్న ప్రజలకు అపరాష్ట్రమయినపుడు నైరృతి దిశలోనున్న వారికి పూర్వాష్ట్రముగా విధింపఁబడినది. (39) ఉత్తరమున నున్న వారికది అపరరాత్రి. ఈశాన్య దీశయందున్న వారికి పూర్వ రాత్రియదీ. ఈ విధముగా సూర్యుడు ఉత్తరభాగమున నున్న ప్రదేశము లందు ప్రకాశించును. (41) సూర్యుఁడాకాశ మధ్యమున ‘సుఖా’ నగరమున (వారుణనగరమున) సోముని నగరమయిన విభానగరమున నుదయించు చున్నట్లు కనిపించును.
రాత్ర్యర్ధం చామరావత్యామస్తమేతి యమస్య చ ।
సోమవుర్యాం విభాయాం తు మధ్యాహ్నే స్యాద్దివాకరః ॥
మహేంద్రస్యామరావత్యాం సూర్య ఉత్తిష్ఠతే తదా ।
అర్ధరాత్రం సంయమనే వారుణ్యామస్తమేతి చ ॥
స శీఘ్రమేవ పర్యేతి భాస్కరోఽలాత చక్రవత్ ।
భ్రమన్వై భ్రమమాణానీ ఋక్షాణి చరతే రవిః ॥
ఏవం చతురు పార్వేషు దక్షిణాంతేన సర్పతి ।
ఉదయాస్తమనే చాసావుత్తిష్ఠతి పునః పునః ॥
పూర్వాహ్లి చాపరాహే చ ద్వౌద్వౌ దేవాలయా తు సః ।
తపత్యర్కశ్చ మధ్యాహ్నే తెరేవ చ స్వరశ్మిభిః ॥
ఉదీతో వర్థమానాభిరామధ్యాహ్నం తపస్రవిః ।
అతః పరం సంతీభిర్లోభిరస్తం నిగచ్ఛతి ॥
ఉదయాస్తమయాభ్యాం చ స్మృతే పూర్వాపర్ దిశా ।
యావత్పురస్తాత్తపతి తావత్పృష్ఠఽథ పార్వయోః ॥
యత్రోద్యస్ దృశ్యతే సూర్యస్తేషాం స ఉదయః స్మృతః ।
ప్రణాళం గచ్ఛతే యత్ర తేషామస్తః స ఉచ్యతే ॥
సర్వేషా ముత్తరే మేరుర్లోకాలోకశ్చ దక్షిణే ।
విదూరభావాధర్మస్య భూమిలేఖావృతస్య చ ॥
లీయంతే రశ్మయో యస్మాత్తేన రాత్రౌ న దృశ్యతే ।
గ్రహనక్షత్రసోమానాం దర్శనం భాస్కర స్య చ ॥
అమరావతి యందు అర్ధరాత్రియైన యమనగరమున అస్తమించునట్లగుపించును. సోముని నగరమయిన ‘విభ’ యందు సూర్యుడాకాశ మధ్యమున నుండ నదీ మధ్యాహ్నము. అప్పుడు మహేంద్ర నగరమయిన అమరావతియందు సూర్యుండుదయించు చున్నట్లు కనిపించును. అయ్యది సంయమన నగరమున అర్ధరాత్రము. సూర్యుఁడు వరుణుని నగరముననస్తమించును. (44) సూర్యుడు శీఘ్రముగా “ఆలోత’ చక్రము వలె పరిభ్రమించును. భ్రమించుచునే సూర్యుఁడు సంచరించు (పరిభ్రమించు) నక్షత్రమండలముల చరించును. (45) ఈ విధముగా సూర్యుం డు నాల్లుదిశలలో దక్షిణమునకు పరిసర్పించును. పునః పునః సూర్యుఁడుదయించును అస్తమించును. (46) రెండు దేవాలయములను (దేవతా లోకములను) ఇంద్రాదుల లోకాలను పూర్వాహ్లామున, మిగిలిన రెంటిని అపరాష్ట్రమున స్వకిరణములచే వేడిగా చేయును. (తపతి), (47) ఉదయించిన తరువాత వృద్ధి పొందుచు మధ్యాహ్నము వఱకు స్వకిరణములచే వేడిని కలిగించును. తరువాత క్షీణించు కిరణములచే సూర్యుడు అస్తమించును. (వేడిమి తగ్గును). (48) సూర్యోదయాస్తమానములచే పూర్వాపర దోశలు (తూర్పు పడమరలు) స్మరింపఁబడును. సూర్యుడు ఎట్టఎదుట (తూర్పున ప్రకాశించుచుండునప్పుడు వెనుక భాగమున పార్శ్వభాగమున కూడ వేడమి కలుగును. (49) సూర్యుండుదయింపగా చూచు జనులకదీ ఉదయము. ఎచ్చట ప్రకాశము నాశము పొందునో అది అస్తమానము. (50) మేరువెల్లరకు ఉత్తరమున నున్నది. లోకా లోకములు దక్షిణమున నున్నవి. సూర్యుడు విదూర భాగమున నుండుటచేతను, భూరేఖచే (హరిజన్) ఆవతుఁడై యుండుటచేతను సూర్య కిరణములు విలీనమగును (అదృశ్యమగును) (కంటికి గనిపించవు). అందుచే రాత్రి యందు సూర్యుడు కానరాడు. గ్రహముల యొక్క నక్షత్రముల యొక్క చంద్రుని యొక్క సూర్యుని యొక్క అస్తమయము, ఉదయము, సూర్యునియొక్క ఔన్నత్యమును బట్టి విస్తృతిని బట్టి తెలిసికోనవలెను.
ఉచ్ఛ్రయస్య ప్రమాణేన జ్ఞేయమస్తమథోదయమ్ ।
శుక్షచ్ఛాయోఽగ్నీ రాపశ్చ కృష్ణచ్ఛాయా చ మేదినీ ॥
విదూరభావాదరస్య హ్యుద్యతోఽపి విరశ్మితా ।
రక్తభావో విరశ్మిత్వాద్రక్తత్వాచ్చాష్యనుష్టతా ॥
లేఖాయామాశ్రితః సూర్యో యత్రయత్ర చ దృశ్యతే ।
ఊర్ధ్వం శతసహస్రం తు యోజననాం స దృశ్యతే ॥
ప్రభా హి సౌరీ పాదేన హ్యస్తం గచ్ఛతి భాస్కరే ।
అగ్నిమావిశ రాశ్రా తస్మాద్దూరాత్ ప్రకాశతే ॥
ఉదితే హి పునః సూర్యే హ్యాష్ణమాగ్నేయమావిశేత్ ।
సంయుక్తో వహ్నినా సూర్యస్తపతే తు తతో దీవా ॥
ప్రకాశం చ తదౌష్ట్యం చ సౌరాగ్నేయే చ తేజసీ ।
పరస్పరానుప్రవేశాత్ దీప్యేతే తు దీవానీశమ్ ॥
ఉత్తరే చైవ భూష్యఛే తధా తస్మింశ్చ దక్షిణే ।
ఉత్తిష్ఠతి తథా సూర్యే రాత్రిరాశతే త్వపః ॥
తస్మాత్ శీతా భవంత్యాపో దివారాత్రిప్రవేశనాత్ ।
అస్తం యాతి పునః సూర్యే దినమావిశతే త్వపః ॥
తస్మాదుష్ణా భవంత్యాపో నక్తమహ్నః ప్రవేశనాత్ ।
ఏతేన క్రమయోగేన భూమ్యర్థ దక్షిణోత్తరే ॥
ఉదయాస్తమనే ర్మస్య అహోరాత్రం విశత్యపః ।
దినం సూర్యప్రకాశాఖ్యం తామసీ రాత్రిరుచ్యతే ॥
తస్మాత్ వ్యవస్థితా రాత్రిః సూర్యాపేక్షమహః స్మృతమ్ ।
ఏవం పుష్కరమధ్యేన యదా సర్పతి భాస్కరః ॥
అగ్ని నీరును తెల్లని కాంతిగలవి. భూమి నలుపు రంగు గలది. సూర్యుఁడు విదూరమున నున్నందున ఉదయించినను అతనికి ఉష్ణకిరణములుండవు. రశ్ములు లేనందున నయ్యది రక్తత్వభావమొందును. ఆ రక్తత్వము వలననే అనుష్టత్వమును కలుగును. (54) సూర్యుఁడు భూమ్యాశ సంయోగ స్థానమును (హారిజన్) పొందియుండ సూర్యుఁడెచ్చటెచ్చట కాననగునో నయ్యది ఊర్థ్వమున నూరుయోజనములకు పైగా కాననగును. (55) భాస్కరుండు తన కిరణములతో అస్తమించినప్పుడు అతని కాంతి (ప్రభ) రాత్రి వేళల అగ్నిని ప్రవేశించును. అందుచే నతం డు (సూర్యుఁడు) దూరము నుండి ప్రకాశించును. (56) సూర్యుఁడుదయించినప్పుడు అగ్ని యొక్క ఉష్ణము సూర్యుని యందు మరల ప్రవేశించును. సూర్యుఁడు అగ్నీతో సంయుక్తుఁడయి పగలు ప్రకాశించును. (57) ప్రకాశము ఉష్ణము - ఈ రెండును సూర్యుని యొక్క అగ్ని యొక్కయు తేజః ప్రకాశోషములు. అయ్యవి పరస్పరాను ప్రవేశము వలన దీవానిశలు ప్రకాశించును. (58) భూమియొక్క ఉత్తర దక్షిణపు అర్ధ భాగముల యందు సూర్యుండుదయింప రాత్రీ నీటియందు ప్రవేశీంచును. (59) అందుచే రాత్రి దీవాభాగమున నీటిలో ప్రవేశించుట వలన ఆ సమయమున (రాత్రులందు) నీరు శీతలముగా నుండును. (60) సూర్యుడస్తమించునప్పుడు పగలు నీటియందు ప్రవేశించును. (60) తత్కారణమున రాత్రులయందు నీరు ఉష్ణముగా నుండును. పగలు అగ్ని నీటిలో ప్రవేశించుట వలన భూమియొక్క ఉత్తరార్ధ దక్షిణార్ధములయందు సూర్యుం డస్తమించునప్పుడు ఉదయించునప్పుడు పగలు రాత్రియు ఈ క్రమములో నీటియందు ప్రవేశించును. సూర్యకాంతియున్న సమయము పగలు, రాత్రిని తామసియని పిలిచెదరు. దీని మూలముననే రాత్రి చక్కగా నిర్వచింపఁబడినది. సూర్యునిపై ఆధారపడియున్నందున దివా సమయములు పగలు అందురు.
అంశాంశకం తు మేదిన్యాం ముహూర్తేనైవ గచ్ఛతి ।
యోజనాగ్రాన్ముహూర్తస్య ఇహ సంఖ్యాం నిబోధత ॥
పూర్ణే శతసహస్రాణామేకత్రింశాధికం స్మృతమ్ ।
పంచాశత్తు తథాన్యాని సహస్రాణ్యధికాని చ ॥
మౌహూర్తికీ గతిర్యేషా సూర్యస్య తు విధీయతే ।
ఏతేన గతియోగేన యదా కాషాం తు దక్షిణామ్ ॥
పర్యాగచ్ఛేత్పతంగోఽసౌ మధ్యే కాషాం తమేవ హి ।
మధ్యన పుష్కరస్యాథ భ్రమతే దక్షిణాయనే ॥
మానసోత్తరశైలే తు అంతరే విషువం చ తత్ ।
సర్పతే దక్షిణాయాం తు కాషాయాం వై నిబోధత ॥
నవ కోట్యః ప్రసంఖ్యాతా యోజనైః పరిమండలమ్ ।
తథా శతసహస్రాణి చత్వారింశచ్చ పంచ చ ॥
అహోరాత్రాత్పతంగస్య గతియేషా విధీయతే ।
దక్షిణాద్వినివృత్తాసౌ విషువళే యదా రవిః ॥
క్షీరోదస్య సముద్రస్యోత్తరతశ్చాదితశ్చరన్ ।
మండలం విషువత్తస్య యోజనైస్తన్నిబోధత ॥
త్రిస్రః కోట్యస్తు సంఖ్యాతా విషువస్యాపి మండలమ్ ।
తథా శత సహస్రాణామశీత్యేకాధికా పునః ॥
సూర్యుఁడు ఆకాశము యొక్క మధ్యభాగమున సంచరించునప్పుడు అయ్యది భూభాగములను ఒక ముహూర్తములో దాటిపోవును. (ఒక ముహూర్తములో ప్రయాణించి పోవుననిన యోజన సముదాయమును గ్రహించవలయును). (64) అయ్యది ఒక వంద యెనుబది యొక్క వేల యోజనములు. ముహూర్తము నందు ఇదీ సూర్యుని వేగము. ఈ వేగముతో సూర్యుఁడు దక్షిణ భాగమునకు సాగిపోగా, అయ్యదీ ఆ భాగము యొక్క మధ్య భాగమును, అంత్య భాగమును దాటిపోవును. తరువాత దక్షిణాయనమున ఆకాశ మధ్యమున నయ్యది సుళ్లు తిరుగును, (67) కొన్నీ యేబది యోజనములు కొన్ని సహస్రములు, అంతకంటే నధికములు అదీ ఒక ముహూర్తమునకు సూర్యుని వేగముగా వీధింపఁబడినది. అయ్యది (సూర్యుఁడు) మానసోత్తర శైలమున దక్షిణ భాగమున సంచరించును, విషువత్తుదాని మధ్యన గలదు. (68) సూర్యుని పరిధి తొమ్మిది కోట్ల నలుబదియైదు వందల సహస్రముల యోజనములుగా పరిగణింపఁబడుచున్నది. (69) ఒక అహోరాత్ర కాల పరిమాణములో సూర్యుని చలన మీంతటిదని విధింపఁబడినది. సూర్యుఁడు దక్షిణ భాగము నుండి తిరిగి వచ్చును. విషువ సంధిలో ఆతఁడుండును. తరువాత క్షీర సముద్రము యొక్క ఉత్తర ప్రాంతముల ప్రయాణించును. దాని యొక్క పరిధిలో ఆతఁడుండును. తరువాత క్షీర సముద్రము యొక్క ఉత్తర ప్రాంతముల ప్రయాణించును. దాని యొక్క పరిధిని యోజనములలో గ్రహింపవలెను. విషువత్తులో నుండగా నది మూడుకోట్ల ఎనుబది యొక్క వందల పరిధిని యూహింపఁబడినది. (30008100). (72)
శ్రవణే చోత్తరాషాఢే చిత్రభానుర్యదా భవేత్ ।
శాకద్వీపస్య షష్ఠస్య ఉత్తరాతో దిశశ్చరన్ ॥
ఉత్తరాయాః ప్రమాణం చ కాష్ఠాయా మండలస్య చ ।
యోజనాగ్రాత్ర్పసంఖ్యాతా కోటిరేకా తు సా ద్వీజాః ॥
అశీతిన్నిహితానీహ యోజనానాం తథైవ చ ।
అష్ట పంచాశతం చైవ యోజనాస్యధికాని తు ॥
నాగవీథ్యుత్తరా వీథీ హ్యజవీథీ చ దక్షిణా ।
మూలం చైవ తథాషాఢ త్వజవీథ్యుడయాస్త్రయః ॥
అశ్వనీ కృత్తికా యామ్యం నాగవీధ్యుదయాస్త్రయః ।
కార్డయోరంతరం యచ్చ తద్వక్ష్యే యోజనైః పునః ॥
ఏతచ్ఛతసహస్రాణామషాభిశోత్తరం శతమ్ ।
త్రయః శతాధికాశ్చాన్యే త్రయస్త్రింశచ్చ యోజనైః ॥
కాష్ఠయోరంతరం హ్యేతద్యోజనాగ్రాత్ ప్రకీర్తితమ్ ।
కాష్ఠయోస్లేఖయోశ్చైవ హ్యంతరం దక్షిణోత్తరే ॥
తేన్వవక్ష్యే ప్రసంఖ్యాయ యోజనైస్తన్నిబోధత ।
ఏకైకమంతరం తస్య నియుతాన్యేకసప్తతిః ॥
సహస్రాణ్యతీరిక్తాశ్చ తతోన్యా పంచసప్తతిః ।
లేఖయోః కాష్ఠయోశ్చైవ బాహ్యాభ్యంతరయోః స్మృతమ్ ॥
అభ్యంతరం తు పర్యేతి మండలాన్యుత్తరాయణే ।
బాహ్యతో దక్షిణే చైవ సతతం తు యథాక్రమమ్ ॥
సూర్యుడు శ్రవణ నక్షత్రమున ఉత్తరాషాఢ యందు ఉండగా ఆరవ ద్వీపమయిన ‘శాక’ ద్వీపపు తూర్పుదిశా భాగముల సంచరించును. (73) ఓ బ్రాహ్మణులారా ! ఉత్తరదిక్కు యొక్క ప్రమాణము, మండలము యొక్క ప్రమాణము (సూర్యమండలము యొక్క ఒక కోటి యెనుబది లక్షల యేబది యెనిమిది యోజనములుగా పరిగణింపఁబడినది. (74) గ్రహమండలముల విభజన మీట్లుండును. నాగవీధి - ఉత్తరము నందున్నట్టిది. అజవీధి - దక్షిణమున నున్నదీ.
ఈ విభాగములొక్కక్కటి మూడు నక్షత్ర కూటములను గలిగియుండును. మూలా నక్షత్ర మండలము, పూర్వాషాఢ నక్షత్ర మండలము, ఉత్తరాషాఢ నక్షత్ర మండలము అజవీధిలో నుదయించు స్థానములు, ఇంక అశ్వనీ నక్షత్రమండలము, భరణి మండలము, కృత్తికా నక్షత్ర మండలము మూఁడును నాగవీథిలో నుదయించు మూఁడు స్థానములు. ఉత్తర దక్షిణ దిశల మధ్య విస్తీర్ణము నూరువేల నూటయెనిమిది (100108) తక్కినవి మూడు నూటముప్పది మూడు (183) ఎక్కువగలవీ (78) ఇధీ. దేశభమధ్యాంతరము, యోజనాగ్రమునుండి చెప్పబడివమి. దిక్కులయొక్కయు లేఖలయొక్కయు అంతరము దక్షిణోత్తరములే (79) వానీని (ఆదక్షిణోత్తరములను) యోజనములతో లెక్కించి చెప్పెద వినుడు, వాని యొక్క యంతరము డెబ్బదియొక (71) టి (నీ)యుతములు (80) తక్కినవి వేయి (యోజనములు). వేరోకటి డెబ్బది యైదు (75) యోజనములు, ఇది బాహ్యపర్యంతరములైన తేఖలకుదిశలకును సంబంధించినదనీ (స్మరింపబడుమ) తెలుపబడినది. ఉత్తరాయణమున సూర్యుడు (అభ్యంతరముననున్న) లోపలనున్న (అంతర్గతములయిన) మండలముల గుండా పోవును. దక్షిణాయనమున బాహ్యముననున్న మండలముల నుండి క్రమముగ పోవును. (82)
మండలానాం శతం పూర్ణం త్ర్యశీత్యధికముత్తరమ్ ।
చరతే దక్షిణే చాపి తావదేవ విభావసుః ॥
ప్రమాణం మండలస్యాథ యోజనాగ్రం నిబోధత ।
యోజనానాం సహస్రాణి సప్తాదశ సమాసతః ॥
శతే ద్వే పునరష్యన్యే యోజనానాం ప్రకీర్తితే ।
ఏకవింశతిళిశ్చైవ యోజనైరధికైరి తే ॥
ఏతత్రమాణమాఖ్యాతం యోజనైర్మండలస్య చ ।
విష్కంభో మండలస్యాథ తిర్యక్ స తు విధీయతే ॥
ప్రత్యహం చరతే తాని సూర్యో వై మండలక్రమాత్ ।
కులాలచక్రపర్యంతో యథా శీఘం నివర్తతే ॥
దక్షిణప్రక్రమే సూర్యస్తథా శీఘం ప్రవర్తతే ।
తస్మాత్ర్పకృష్ణాం భూమిం తు కాలేనాల్పేన గచ్ఛతి ॥
సూర్యో ద్వాదశభిః శైఘ్యాన్ముహూరైః దక్షిణాయనే ।
త్రయోదశార్ధమృక్షాణామప్న తు చరతే రవిః ॥
ముహూర్తేః తావద్భక్షాణి నక్తమష్టాదశైశ్చరన్ ।
కులాలచక్రమధ్యే తు యథా మందం ప్రపర్పతి ॥
తథోదగయనే సూర్యః సర్పతే మందవిక్రమః ।
తస్మాత్ దీర్ఘన కాలేన భూమిం స్వల్పాని గచ్ఛతి ॥
అష్టాదశ ముహూర్తం తు ఉత్తరాయణపశ్చిమమ్ ।
అహో భవతి తచ్చాపి చరతే మందవిక్రమః ।
త్రయోదశార్థం మాంద్యేన త్వృక్షాణాం చరతే రవిః ।
ముహూర్తైస్తావదృక్షాణి నక్తం ద్వాదశిభిశ్చరన్ ॥
ఉత్తరమున ఒక వంద ఎనుబదీ మూఁడు (183) మండలములు గలవు. దక్షిణమునఁగూడ సూర్యుడంతీయే ప్రయాణించును. (83) తరువాత మండలముల ప్రమాణమును యోజనములలో గ్రహించుము. అయ్యది పదీయేడు వేల రెండు వందల యిరువది యొక్క యోజనములు. (84,85) మండలము యొక్క ఏతత్రమాణము యోజనములలో చెప్పబడినది. దానియొక్క విష్కంభము (వ్యాసము). అడ్డముగా (తిర్యకుగా) విధింపఁ బడినది. (86) ప్రతిదినము సూర్యుఁడామండలములను క్రమముగా సంచరించును. కుమ్మరివాని చక్రము యొక్క పైయంచు తొందరగా తిరుగునట్లు, సూర్యుడు కూడ తన యొక్క దక్షిణాయనమున తొందరగా తిరిగి వచ్చును. అందుచే సూర్యుఁడు భూమీయొక్క అత్యధిక భాగమును అల్పకాలములో తిరిగి వచ్చును. (88) దక్షిణాయనమున తనయొక్క శీఘ్రయానముచే సూర్యుండు పదమూడున్నర నక్షత్ర మండలములను పగటి యందు 12 ముహూర్తముల కాలములో తిరిగి వచ్చును. సూర్యుడు తత్సంఖ్యా పరిమితములయిన 13 మండలములనే రాత్రి సమయమున 18 ముహూర్తములలో చుట్టి వచ్చును. (89,91) కులాలుని చక్రము యొక్క మధ్యభాగము తక్కువ వేగముతో (నెమ్మదిగా) తిరుగునట్లు, దక్షిణాయనమున సూర్యుఁడు తక్కువ వేగముతో తిరుగును. అందుచే ఉత్తరాయణమున సూర్యుడు తక్కువ రయముతో తీరుగును. అందుచే నతఁడు భూమి యొక్క తక్కువ భాగమును ఎక్కువ కాల ప్రయాణములో తిరుగును. ఉత్తరాయణ పర్యటనములో పగటిపూట 18 ముహూర్తముల కాలము పట్టును. తక్కువ రయముతో సూర్యుడు 132 మండలములను పగటిపూట తిరుగును. తత్సమానమయిన మండలములనే రాత్రిపూట పండ్రెండు ముహూర్తముల కాలములోనే తిరుగును. (92,93)
తతో మందతరం నాభ్యాం చక్రం భ్రమతి వై యథా ।
మృత్పిండ ఇవ మధ్యస్థో ధ్రువో భ్రమతి వై తథా ॥
త్రింశన్ముహూర్తానేవాహురహోరాత్రం ధ్రువో థమన్ ।
ఉభయోః కాష్ఠయోర్మధ్యే భ్రమంతే మండలాని తు ॥
కులాలచక్రనాభిశ్చ యథా తతైవ వర్తతే ।
ధ్రువస్తథాపి విజేయః తత్రోవ పరివర్తతే ॥
ఉభయోః కాష్ఠయోర్మధ్యే భ్రమంతే మండలానీ సః ।
దీవానక్తం చ సూర్యస్య మందా శీఘ్ర చ వై గతిః ॥
ఉత్తరప్రక్రమే చాపీ దివా మందా గతిస్తథా ।
తథైవ చ పునర్నక్తం శీఘ్ర సూర్యస్య పై గతిః ॥
దక్షిణప్రక్రమేవ దీవా శీఘం విధీయతే ।
గతిః సూర్యస్య నక్తం చ మందా చైవ గతిస్తథా ॥
ఏవం గతివిశేషేణ విభజన్ రాత్ర్యహానీ తు ।
తథాపి సంచరన్మార్గం సమేన విషమేణ చ ॥
లోకాలోకస్థితా హ్యేతే లోకపాలాశ్చతుర్దశమ్ ।
అగస్త్యశ్చరతే తేషాముపరిషాజ్ఞవేన తు ॥
భుంజన్నసావహోరాత్రమేవం గతివిశేషణమ్ ।
దక్షిణే నాగవీథ్యాస్తు లోకాలోకస్య చోత్తరే ॥
లోకసంతానకో హ్యేష వైశ్వానరపథాద్బహిః ।
పృష్ఠ యావత్ర్పభా సౌరీ పురస్తాత్ సంప్రకాశతే ॥
పార్శ్వతః పృష్ఠతశ్చైవ లోకాలోకస్య వర్తతే ।
యోజనానాం సహస్రాణి దశకం తూచ్ఛ్రితో గిరిః ॥
కుమ్మరి వాని చక్రము నాభియందు మిక్కిలి మందముగా తిరుగును. తద్వీధముగా మధ్యనుంచిన మట్టిముద్దవలె ధ్రువ నక్షత్రము భ్రమించును. (94) పగలు రాత్రి కలిసి ముప్పదీ ముహూర్తములందురు. ఆ రెండు కాష్ఠముల మధ్యను తీరుగుచు, ధ్రువము (నక్షత్రము) మండల వలయములలో భ్రమించును. (95) (కాష్ఠములు - భాగములు), కుమ్మరి చక్రము యొక్క నాభి భాగము అక్కడే వర్తిల్లినట్లు ధ్రువ (నక్షత్రము) తన స్థానము నుండి మారకయే యందే తిరుగును, (95,96) ధ్రువ నక్షత్రమీ రెండు కాష్ఠభాగముల మధ్యను భ్రమించు చుండును. సూర్యుని యొక్క గతి పగటిపూట మందము రాత్రిపూట శీఘ్రము. ఉత్తర ప్రక్రమము నందు పగటిపూట సూర్యునియొక్క గతీ మందముగా నుండును. రాత్రిపూట మిక్కిలి చురుకుగా నుండును. దక్షిణాయనమున (ప్రక్రమమున) సూర్యుని యొక్క గతి పగటిపూట శీఘ్రము, ఇంక రాత్రి ప్రొద్దు మందము. (98,59) ఈ విధముగా సమవిషమ గతి విశేషములచే తన వలయమున గమనము సల్పుచు, సూర్యుఁడు పగళ్ళను రాత్రులను విభజించును, (100) నాలుగు చీక్కుల యొక్క పాలకులు (రక్షకులు) ‘లోకాలోక’ పర్వతమున సంస్థితులై నలుదెసలకు లోకపాల కులుందురు. అగస్త్యుఁడు (నక్షత్రము) వారిపై భాగము నుండి అధిక వేగముతో పోవును. (101) నాగవీధీ యొక్క దక్షిణము నందు, లోకాలోక పర్వతముయొక్క ఉత్తరమునందు, రాత్రింబగళ్లు సూర్యుఁడీ విశేష గతులను (పొందును) అనుభవించును. (102) వైశ్వానర పథమునకు భాహ్యమున ఆతఁడు లోక సంతానకుఁడు (అనఁగా లోకములను పొడుగించువాఁడు). పృష్ఠ భాగమున సూర్య ప్రకాశము వెలుగొందుచుండునంత వరకు లోకాలోక పర్వతము యొక్క పురోభాగమున పార్వ భాగమున ప్రకాశముండును. ఆ పర్వతము 10వేల యోజనముల ఎత్తు. అదీ అంతట పరిమండలమై కొంతవరకు వెలుగొందును. కొంతవరకు ప్రకాశమొందదు.
ప్రకాశశ్చాప్రకాశాశ్చ సర్వతః పరిమండలః ।
నక్షత్రచంద్రసూర్యాశ్చ గ్రహైస్తారాగణైః సహ ॥
అభ్యంతరం ప్రకాశంతే లోకాలోకస్య వై గిరేః ।
ఏతావానేవ లోకస్తు నీరాలోకస్తతః పరమ్ ॥
లోకేనాలోకవానేష నిరాలోకస్త్వలోకతః ।
లోకాలోకం తు సంధత్తే యస్మాత్సూర్యపరిగ్రహమ్ ॥
తస్మాత్సంధ్యోతి తామహురుషాప్యుష్ణ్యోర్యదంతరమ్ ।
ఉషా రాత్రి స్మృతా విప్రెర్వ్యుష్టిశ్చాపి త్వహః స్మృతమ్ ॥
సూర్యాగ్నిగ్రసమాసానాం సంధ్యాకాలే హి రక్షసామ్ ।
ప్రజాపతినీయోగేన శాపస్వేషాం దురాత్మనామ్ ॥
అక్షయత్వం తు దేహస్య ప్రాపితామరణం తథా ।
త్రిస్రః కోట్యస్తు విఖ్యాతా మందేహా నామ రాక్షసాః ॥
ప్రార్థయంతి సహస్రాంశుముదయంతం దినే దినే ।
తాపయంతం దురాత్మనః సూర్యమిచ్ఛంతి భాదితుమ్ ॥
అథ సూర్యస్య తేషాం చ యుద్ధమాసిత్సుదారుణమ్ ।
తతో బ్రహ్మాచ దేవాశ్చ బ్రాహ్మణాన్చైవ సత్తమాః ॥
సంధ్యాం తు సముపాసీనాః ప్రక్షిపంతి జలం సదా ।
ఓంకారం బ్రహ్మసంయుక్తం గాయత్ర్యా చాభిమంత్రితమ్ ॥
స్ఫూర్ణజ్యోతిశ్చ చండాంశుస్తథా దీప్యత భాస్కరః ।
తతః పునర్మహాతేజా మహాబలపరాక్రమః ॥
యోజనానాం సహస్రాణి ఊర్ధ్వముత్తిష్ఠతే శతమ్ ।
ప్రయాతి భగవానాశు బ్రాహ్మణైరభిరక్షితః ।
వాలిభిల్యైశ్చ మునిభిః ధృతార్చిః సమరీచిభిః ॥
గ్రహములతో తారాగణములతో నక్షత్రములు చంద్రుఁడు, సూర్యుఁడు గూడి, లోకాలోక పర్వతము యొక్క అభ్యంతరమున ప్రకాశించును (102, 106) ఇంతవరకే లోకపర్వతము. దీని తరువాతిది నిరాలోకము (చీకటి). ఈలోకాలోకపర్వతము లోకముతో జనముతో ఆలోకవంతము (వెలుగుగలది). లోకము (జనము) లేనందున నిరాలోక (అలోక)మైనది. లోకాలోకము సూర్యపరిగ్రహమును సంధానించును (కలుపును) (107) కావున దానిని సంధ్యయందురు. అదీయే ఉషా వ్యుష్ణుల (రాత్రిపగలుల) సంధికాలము, విప్రులు (బ్రాహ్మణులు) ఉషనురాత్రి యందురు, వ్యుష్టిని పగలందురు. (108) సంధ్యాకాలమున రాక్షసులు సూర్యుని అగ్నిని గ్రహింప వలెనని యుందురు. ప్రజాపతి నియోగమున ఈ దురాత్ములకొక శోషము కలిగినది. (109) ఆ రాక్షసుల దేహమునకు మరణము లేని యక్షయత్వము కలదు. వీరు మూఁడు కోట్ల రాక్షసులు. వారు మందేహులుగా ప్రఖ్యాతులు. (110) ప్రతీదీనము వారు ఉదయించు సూర్యుని ప్రార్థింతురు. ప్రకాశించు (తపించునట్టి) సూర్యుని ఈ రాక్షసులు (దురాత్ములు) భక్షింపకోరెదరు. (111) అప్పుడు సూర్యునకు ఈ రాక్షసులకు మధ్య సుదారుణమయిన యుద్ధము జరిగెను. అంత దేవతలు, బ్రాహ్మణ సత్తములు బ్రహ్మయు సంధ్యను సముపాసించిరి. గాయత్రీ మంత్రాభిమంత్రితము ఓంకార బ్రహ్మ సంయుక్తము వైన జలమును ప్రక్షేపించిరి. (113) అప్పుడు స్పూన్షజ్యోతితో చండాంశుం డయిన భాస్కరుండు ప్రకాశించును, ఆతఁడు మహాతేజుఁడు మహాబల పరాక్రముఁడు నయ్యెను, బ్రాహ్మణులచేనభిరక్షితుఁడైన సూర్యుఁడు శత సహస్ర యోజనముల దూరము ఊర్థ్వమునకు పోవును. (లేచును). ఆ బ్రాహ్మణులు వాలఖిల్యమునులు. వారి తేజః కిరణములచే సూర్యుడు తనవెలుగుల నింపుకొనెను. (115)
కాష్ఠా నిమేషా దశ పంచ చైవ త్రింశచ్చ కాష్ఠా గణయేత్కలాం తు ।
త్రింశత్కలాశ్చాపి భవేస్ముహూర్త సైక్రింశతా రాత్ర్యహనీ సమేతే ॥
హ్రసవృథీ త్వహర్భాగెర్డీవసాం యథాక్రమాత్ ॥
సంధ్యా ముహూర్తమాత్రా తు ప్రసవృద్ధిస్తు సా స్మృతా ।
లేఖాప్రభృత్యధాదిత్యే త్రిముహూర్తగతే తు వై ॥
ప్రాతస్తతః స్మృతః కాలో భాగశ్చాహ్నః స పంచమః ।
తస్మాత్రాతస్తనాత్కాలాత్ త్రిముహూర్తస్తు సంగవః ॥
మధ్యాహ్న స్త్రీముహూర్తస్తు తస్మాత్ కాలస్య సంగవాత్ ।
తస్మాన్మధ్యందినాత్కాలాదపరాష్ట్ర ఇతి స్మృతః ॥
త్రయ ఏవ ముహూర్తాస్తు కాలభాగః స్మృతో బురైః ।
అపరాహ్లి వ్యతీతే తు కాలః సాయాహ్న ఉచ్యతే ॥
దశ పంచ ముహూర్తాహ్నా ముహూర్తాస్త్రయ ఏవ చ ।
దశ పంచముహూర్తం వై హ్యహర్వైషువతం స్మృతమ్ ॥
వర్గంతే చ హ్రసంతే చ హ్యయనే దక్షిణోత్తరే ।
అహస్తు గ్రసతే రాత్రీం రాత్రీశ్చ గ్రసతే త్వహః ॥
శరద్వసంతయోర్మధ్యం విషువత్పరిభావ్యతే ।
అహోరాత్రే కలాశ్చైవ సమం సోమః సమశ్నుతే ॥
తథా పంచదశాహాని పక్ష ఇత్యభిదీయతే ।
ద్వౌచ పక్షే భవే న్మాసో ద్వౌమాసావర్కాణావృతుః ॥
15నిమేషము లోక కాష్ఠము. ముప్పది కాష్ఠలు ఒక కళ. ముప్పది కళ లోక ముహూర్తము. అట్టి ముప్పది ముహూర్తములు దీవానిశలతో గూడిన యొక్క పూర్ణదీనము. పగటి భాగములతో దీనముల యొక్క హొస వృద్ధులు యథాక్రమముగా (116) జరుగును. సంధ్య మాత్రమొక ముహూర్త కాలముండును. అయ్యదియే దీనము యొక్క ప్రోసమునకు, వృద్ధికి పరిమితిగా గ్రహింపబడుచున్నది. భూమ్యాకాశములు కలియు వలయము నుండి సూర్యుఁడు మూఁడు ముహూర్తముల కాలము ప్రయాణింప నయ్యది ప్రాతఃకాలము అనబడినది, ఇయ్యది దీవసమున నైదవ భాగము. ప్రాతఃకాలము . తరువాత వచ్చు మూఁడు ముహూర్తముల కాలము ‘సంగవ’ మనీ పేరు. (119) (‘సంగవ’ము నుండి మూఁడు ముహూర్తముల కాలమునకు మధ్యాహ్నము అని పేరు. మధ్యాహ్నము నుండి మూడు ముహూర్తముల కాలమునకు అహరాద్దామని పేరు. మూఁడు ముహూర్తముల కాలమున ఒక కాలప్రమాణముగా బుధులు పరిగణింతురు. అపరాద్దాము తరువాత సాయాహ్నమందురు. (121) గడచిన 15 ముహూర్తముల కాలపరిమితి గల ఒక దినములో పూర్వాప్త అపరాష్ట్ర సాయాహ్నములు మూడింటినే పవిత్రములుగా దలంతురు. విషువద్దనమునకు (ఇక్వినోటికల్ డే) 15 ముహూర్తములు. (122) దక్షిణాయనమున రాత్రులు వృద్ధిచెందును. ఉత్తరాయణమున పగళ్లు వృద్ధినొందును. (123) పగలు రాత్రిని, రాత్రి పగలిని గ్రహించును. శరద్వసంతర్తువులమధ్య భాగము విషువత్తు అని భావింపఁబడును. చంద్రుఁ డు అహోరాత్రముల యందు సమానమయిన కళలను గలిగియుండును. పదియైదు దినములొక పక్షము అని చెప్పబడుచున్నది. రెండు పక్షములొక మాసము. రెండు సౌర మాసములొక ఋతువు. (125)
ఋతు శ్రీవయమయనే ద్వేషా వర్షం తు సౌరకమ్ ।
నిమేషా విద్యుతశ్చైవ కాష్ఠాస్తా దశ పంచ చ ॥
కలాస్తాస్త్రింశతః కాషా మాత్రాశీతిద్వయాత్మికా ।
సప్తైకా ద్వ్యధికా త్రింశన్మాత్రా షట్త్రింశదుత్తరా ॥
ద్విషష్టినా త్రయోవింశన్మాత్రాయాశ్చ కలా భవేత్ ।
చత్వారింశత్సహస్రాణి శతాన్యష్టా చ విద్యుతః ॥
సప్తతిశ్చైవ తత్రాపి నవతీం విద్ధి నిశ్చయే ।
చత్వార్యేవ శతాన్యాహుర్విద్యుతే ద్వే చ సంయుతే ॥
వరాంశో హ్యేష విషైయో నాడికా చాత్ర కారణమ్ ।
సంవత్సరాదయః పంచ చతుర్మానవికల్పితాః ॥
నిశ్చయః సర్వకాలస్య యుగమిత్యభిదీయతే ।
సంవత్సరత్తు ప్రథమో ద్వితీయః పరివత్సరః ॥
ఇదావత్సర సృతీయస్తు చతుర్ధశ్చానువత్సరః ।
పంచమో వత్సరత్తేషాం కాలస్తు యుగసంహితః ॥
త్రింశచ్ఛతం భవేత్పూర్ణం పర్వణాం తు తవేర్యుగే ।
శతాన్యష్టాదశత్రింశదుదయ్భా స్కరస్య చ ॥
ఋతవస్త్రింశతః సౌండయనానీ దశైవ ఈ ।
పంచ చ త్రిశతం చాపి షష్టివర్షంచ భాస్కరమ్ ॥
త్రింశదేవ త్వహోరాత్రాస్తేస్తు మాసస్తు భాస్కరః ।
ఏకషష్టి త్వహోరాత్రషృతురేకో విభివ్యతే ॥
అహ్నాం తు త్ర్యధికాశీతిః శతం చాప్యధికం భవేత్ ।
మానం తచ్చిత్రభానోస్తు విజ్ఞేయమయనస్య హ ॥
మూఁడు ఋతువులొక అయనము. రెండు అయసము లోక సౌర సంవత్సరతము. నీమేషములు విద్యుత్తులు. 15 విద్యుత్తులోక కాష్ఠ 30 కాష్ఠలోక కళ. (126) అది 161) మాత్రలు కలిగియుండును. రెంటిచేతను, ఏడింటిచేతను వృద్ధి పొందిన ముప్పది మాత్రలు ఉత్తర మాత్రల ముప్పది ఆరింటిలో నుండును. (X ?) అరువది రెండు, డెబ్బది మూఁడు మాత్రలతో ఓక ‘కల’ యగును. అది 40 వేల 800ల విద్యుతులు (ముప్పదకళలు ఒకకాష్ఠ అది మాత్రాశీతిద్వయాల్మీకము (80+80=160 మాత్రలు గలది). ద్వ్యధికమైన సమైకము (7+2=9 మాత్రము గలది), షడ్రింశదుత్తరమైన త్రింశన్మాత్రకము (3036 మాత్రము గలది). ద్విషష్టితో వృద్ధిచేసిన త్రింశన్మాత్రమైనది (62x23=1426 మాత్రలు కలది), కళయగును. చత్వారింశత్సహసములు అష్టశతములను సప్తలీయును అందును నీశ్చయముగా తొంబదీయు నైన విద్యుతులు గలదీ (4870 లేక 4890 మాత్రలు గలది) కళయగును. (127,128) ద్వీసంయుతములైన చత్వారిశతములైన విద్యుతులు గలది (402 మాత్రలు గలది కళయగును. (129)] (128) అని సప్తతి (70) (?) నిశ్చయముగా నవి తొంబదియని యెఱుంగుము. 402 విద్యుత్తులున్నవని చెప్పుదురు. (129) దీనిని వరాంశమని (ఉత్తమ భాగమని) తెలిసికొనవలెను. దానికి నాడీకా ఘటి కారణము (24 నిమేషములు), సంవత్సరముతో నారంభమైన యైదును, చతుర్విధమానముల బట్టి వివిధరీతుల కల్పితమయినవి. (?) (130) సర్వకాలమునకు సునిశ్చితమైన కాలపరిమితిని ‘యుగ’ మందురు. మొదటిది సంవత్సరము సంవత్సరము; రెండవది పరీవత్సరము; మూడవది ఇదావత్సరము; నాలుగవది అనువత్సరము; ఐదవదివత్సరము. కానీ కాల పరిమితికీ ‘యుగ’ మని పేరు. (132) సౌరయుగమున, మూఁడువేల ‘పర్వణములు’ (ముప్పుదివందలు) (పర్వణము సంధి). అందు 1830 సూర్యునీ యుదయములుండును. (133) అందు 30 ఋతువులు, 10 అయసములు, మరియు నందు 365 రోజులు, (ఒక సౌరవత్సరము నందుX134) ముప్పది రాత్రులు, పగళ్ళు ఒక సౌర మాసమునందుండును. అట్టి 61 రోజులొక ఋతువగును. (135) ఒక సౌర అయనము 183 దినములు. అని తెలీయవలెను. (136)
సౌరం సౌమ్యం తు విజ్ఞేయం నాక్షత్రం సావనం తథా ।
మానాన్యేతాని చత్వారి మైః పురాణే హి నిశ్చయః ॥
యః శ్వేతశ్చాత్తరశ్చైవ శృంగవన్నామ పర్వతః ।
త్రీణి తస్య తు శృంగాణి స్పృశంతీవ నభస్తలమ్ ॥
వైశ్చాపి శృంగైస్స నగః శృంగవానితి కథ్యతే ।
ఏకశ్చ మార్గవిషుంభవిస్తారశ్చాస్య కీర్తితః ॥
తస్య వై పూర్వత శృంగం మధ్యమం తద్ధరణయమ్ ।
దక్షిణం పొజితం చైవ శృంగం తు స్ఫటికప్రభమ్ ॥
సర్వరత్నమయం చైవ శృంగముత్తరముత్తమమ్ ।
ఏవం కూటైక్రీభిః శైలః శృంగవానితి విశ్రుతః ॥
యత్తద్వై పూర్వతః శృంగం తదర్క ప్రతిపద్యతే ।
శరద్వసంతయోర్మధ్యే మధ్యమాం గతిమాస్థితః ॥
అతస్తుల్యమహోరాత్రం కరోతి తిమిరాపహః ।
హరితాశ్చ హయా దివ్యాస్తస్య యుక్తా మహారథే ।
అనురపా ఇవాభాంతి పద్మరకైర్గభస్తిభిః ॥
మేషాంతే చ తులంతే చ భాస్కరోదయతః సుతాః ।
ముహూర్తి దశ పంచేవ అహో రాత్రిళ్ళ లావతీ ॥
కృత్తికాసాం యదా సూర్యః ప్రథమాంశగతో భవేత్ ।
వీశాఖోనాం తదా జ్ఞేయశ్చతుర్థాంశ నిశాకరః ॥
వీశాభాసాం యదో సూర్యశ్చరంశం తృతీయకమ్ ।
తదాచంద్రం విజనీయాత్ కృత్తికా శీరని స్థితమ్ ॥
విషువంతం విజానీయాదేవమాహుర్మహర్షయః ॥
క్రింద వివరింపఁబడునవి కాలగణనమునకు మానములు. సౌరము (సూర్య సరండీ) సౌమ్యము (చంద్ర సంబంధీ) సోక్షత్ర (నక్షత్ర సంబంధి); ఇంక సవన (సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వఱకు గణింపఁబడిన సవన గణకమానములు), ఈ మానములన్నియు పురాణములు నిశ్చయముగా చెప్పబడినవి. (187) శ్వేతమునకు ఉత్తరమున శృంగవంతమును పర్వతము కలదు. దానికి మూడు శిఖరిములు; అవి ఆకాశమును స్పృశించుచున్నట్లగుపించును, (18) ఆ శిఖరముల వలననే ఆ పర్వతము శృంగవంశీమనీ చెప్పబడుచున్నది. దానియొక్క పరిధి, విష్కంభము (వ్యాసము) విస్తారములనీ కీర్తింపబడినవి. (139) దాని పూర్వదిషీత శృంగము, మధ్యమ శృంగచన హీరణ్మయములు, దక్షిణ శిఖరము స్పటిక ప్రభతో నొప్పునది రజత శృంగము. (140) ఉత్తరము నందున్న ఉత్తమమైన శృంగము సర్వరత్నమయము. ఇట్లు, ఈ మూఁడు శృంగముల వలన శృంగవంతమనీ ఈ పర్వతము పేరొందినీదీ. (141) శరద్వసంతముల మధ్య సూర్యుఁడు మధ్యమ గతితో తూర్పు శృంగమునకు పోయిచేరును. (142) అందుచే తిమిరాపహరుఁడు (సూర్యుఁడు) రాత్రీని పగంటినీ సమానముగ చేయును. ఆతనీ మహారథమునకు పచ్చని గుజములు పూన్చబడును, ఆ రథహయములు పద్మముల యొక్క రక్తవర్ణ కిరణములచే పూయబడినవా యన్నట్లు ప్రకాశించును. మేష తులారాశుల యంతమందు, సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు కాల ప్రమాణము 15 ముహూర్తములు. సూర్యుడు కృత్తికా నక్షత్ర ప్రథమాంశమున కాలిడగనే, చంద్రుఁడు వీశాఖా నక్షత్రముయొక్క చతుర్థాంశమున కాలిడునని గ్రహింపవలేను. (145) వీశాఖా నక్షత్రమున నెన్నడు సూర్యుఁడు తృతీయపాదమున చరించునో అప్పుడు చంద్రుఁడు కృత్తికా నక్షత్ర శీర్షము నొందినట్లు తెలియ వలయును. (146)
సూర్యేణ విషుషం విద్యాత్కాలం సోమేన లక్షయేత్ ।
సమా రాత్రి రహశ్చైవ యదా తద్విషువం భవేత్ ॥
తదా దానాని దేయాని పితృభ్యో విషువేషు చ ।
బ్రాహ్మణేభ్యో విశేషేణ ముఖ మేతతు దైవతమ్ ॥
ఊనమాసాధిమాసౌ చ కలా కాషా ముహూర్తకాః ।
పౌర్ణమాసీ తథా శ్రేయా అమావాస్యా తథైవ చ ।
సినీవాలీ కుహూశ్చైవ రాకా చానుమతిస్తథా ॥
తపస్తపస్యౌ మధుమాధవో చ శుక్రః శుచిశ్చాయనముత్తరం స్యాత్ ।
నభోగభస్యావిషఊర్జసంజ్ఞా సహః సహస్యావితీ దక్షిణం స్యాత్ ॥
ఆర్తవాశ్చ తతో జేయా పంచాబా బ్రహ్మణః సుతాః ॥
తస్మాచ్చ ఋతవో జేయా ఋతుభ్యో హ్యార్తవాః సుతాః ।
తస్మాత్ ఋతుముఖీ శ్రేయా అమావాస్యాస్య పర్వణః ॥
తస్మాత్తు విషుషం ప్లేయం పితృదేవహితం సదా ।
పర్వ జ్ఞాత్వా నముహ్యేత పిత్రే దైవే చ మానవః ॥
తస్మాత్ స్మృతం ప్రజానాం వై విషువత్సర్వగం సదా ।
ఆలోకాత్తు స్మృతో లోకో లోకాలోకః స ఉచ్యతే ॥
లోకపాలాః స్థితాస్తత్ర లోకాలోకస్య మధ్యతః ।
చత్వారస్తే మహాత్మాన స్తిష్ఠంత్యాభూతసంప్లలవాత్ ॥
దానిని మహర్పులు ‘విషువ’ (ఇక్వినక్స్) అని తెలిసికొనవలయునని చెప్పుదురు. (147) సూర్యస్థానమును బట్టి విషువను తెలిసికొనవలెను. చంద్రుని స్థానమును బట్టి కాలమును గమనించవలయును. దివారాత్రుల కాల పరిమాణము సమానమయిన నదీ ‘విషువ’. మగును. (148) ఆ విషువ కాలమున పితృదేవతలకు దానములను చేయవలెను. బ్రాహ్మణులకు ప్రత్యేకముగా విశేష దానములు చేయవలయును. ఏలయన ఆ ‘విషువ’ కాలము దేవతలకు ముఖమగుట. (149) ఈ క్రింది విషయములను కాలమాన గణమునకు తెలిసికొనవలెను. ఊనమాసము (తక్కువ కాల పరిమాణము గల మాసము). అధిమాసము, కల, కాష్ఠ, ముహూర్తకము, పూర్ణమాసి (పూర్ణిమ) అమావాస్య, సినీవాలీ, కుహు (చంద్రరేఖ కనబడని యమావాస్య) అనుమతి (పున్నమిలలో భేదములు) చతుర్దశీ తిథితో కూడిన చంద్రరేఖ కనబడిన అమావాస్య సినీవాలి. పక్షమందలి మొదటి తిధితో సినీవాలీ కలియును. అది ‘కుహు’, అందు ధ్యానించుట సంపత్కరము, పుత్ర ప్రాప్తికరము. (అని అధర్వము). నిరుక్తము ననుసరించి చతుర్దశితో కలిసివచ్చిన పూర్ణిమ ‘అనుమవీ’ వచ్చు పక్షపు మొదటి తిథితో కలిసిన ‘రాకా’. పూర్ణచంద్రుడున్న దీనము రాక వేదకాలములో నైశ్వర్యము కొఱకు ఉత్తమ పుత్రోదయము కొఱకు వీనిని ఆరాధించెడివారు.
మాస నామములకు పూర్వకాలమున వేఱైన పేర్లు కలవు
ప్రాత నామము
తపః
తపస్య
మధు
మాధవ
శుక్ర
శుచీ
నభః
సభస్య
ఇష
ఊర్జః
కొత్త నామము
మాఘము
ఫాల్గుణము
చైత్రము
వైశాఖము
జ్యేష్టము
ఆషాఢము ఈ యారుమాసములుత్తరాయణము
శ్రావణము
భాద్రపదము
అశ్వయుజ
కార్తీకము
మాఘము, ఫాల్గుణము, చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము ఇవి ఉత్తరాయణము, శ్రావణము, భాద్రపదము, ఆశ్వయుజము, కార్తీకము, మార్గశిరము, పుష్యము - ఇవి దక్షిణాయనము. (151) ఆర్తవములు ఐదు సంవత్సరములు ఇవీ బ్రహ్మ యొక్క పుత్రులు అని అనబడినవి. (152) అందుచే ఋతువులను తెలిసికొనవలయును. ఋతువుల వలననే అర్తవములు. (ఋతు సంబంధమైనవి ఆర్తవములు కలుగును). అందుచే ఋతు సంబంధిపర్వమునకు అమావాస్య ఋతుముఖాయని తెలియవలయును.(153) అందుచే ‘విషువ’ పర్వము పితృదేవహితము. ఇది తెలిసి అందుచే ఎల్లప్పుడు పితృకార్యమునను, దేవకార్యమునను మోహము (పొరపాటు) చెందరాదు. (154) “విషువత్తు) సర్వగము, అంతటను వ్యాపించియున్నది ప్రజలు జ్ఞాపకముంచుకొనవలెను. కావున ఆలోకము వలన లోకము స్మరింపబడును. అది లోకాలోకమనబడును (155) లోకాలోక పర్వతము యొక్క మధ్యయందు లోకరక్షకులయిన లోకపాలురున్నారు. వారు నలువురు మహాత్ములు, సర్వభూత ప్రళయాంతము వారందుండుదురు. (156)
సుధామా చైవ వైరాజః కర్దమః శంఖపాస్తథా ।
హిరణ్యరోమా పర్జన్యః కేతుమాశ్రాజసశ్చ యః ॥
నిర్ద్వంద్వా నిరభీమానా నిస్సీమా నిష్పరిగ్రహాః ।
లోకపాలాః స్థితా హ్యేతే లోకాలోకే చతుర్ధశమ్ ॥
ఉత్తరం యదపస్తస్య హ్యజవీథ్యాశ్చ దక్షిణమ్ ।
పితృయానః స వై పంథా వైశ్వానరపథాద్బహిః ॥
తత్రోస్తే ప్రజావంతో మునయో యేగ్నిహోత్రిణః ।
లోకస్య సంతానకరాః పితృయానపథే స్థితాః ॥
భూతారంభకృతం కర్మ ఆశిషో ఋత్విగుద్యతాః ।
ప్రారంభంతే లోకకామాస్తేషాం పంథాః స దక్షిణః ॥
చలితం తే పునర్ధర్మం స్థాపయంతీ యుగే యుగే ।
సంతపాస్తపసా చైవ మర్యాదాభిః శ్రుతేన చ ॥
జాయమానాస్తు పూర్వే వై పశ్చిమానాం గృహేష్వివ ।
పశ్చిమాశ్చైవ పూర్వేషాం ఊయంతే నిధనేష్వపి ॥
ఏవమావర్తమానాస్తే తిష్టంత్యాభూతసంప్లవాత్ ।
అష్టాశీతీసహస్రాణి ఋషీణాం గృహమేధినామ్ ॥
సవితుః దక్షిణం మార్గం శ్రీతా హ్యాచంద్రతారకమ్ ।
క్రియావతం ప్రసంఖ్యైషా యే శ్మశానాని భేజిరే ॥
లోకసంవ్యవహారాశ్చ భూతారంభకృతేన చ ।
ఇచ్ఛాద్వేషప్రవృత్త్యా చ మైథునోపగమేన వై ॥
తథా కామకృతేనేహ సేవనాద్విషయస్య చ ।
ఏతైస్తైః కారణెస్సిద్ధా యే శ్మశానానీ భేజిరే ॥
ప్రజైషిణస్తే మునయో ద్వాపరేష్వివ జజ్ఞిరే ।
నాగవీథ్యుత్తరే యశ్చ సప్తర్షిగణదక్షిణః ॥
వారు సుధామ, వైరాజు కర్దముడు శంఖపుడు, హిరణ్యరోముఁడు పర్జన్యుడు కేతుమంతుఁడు, రాజసుఁడు. (157) వారు సాటిలేని వారు (నిర్ద్వంద్వులు), నిరభిమానులు. వారు నిరవధులు; పరిగ్రహ దూరులు. (ఇతరుల వలన కానుకల గ్రహించువారు కారు). అవివాహితులు వీరునాలుగు దిక్కులయందు లోకపాలురు (దిక్కులను రక్షించువారు). లోకాలోక పర్వతస్థితులు. (158) (యదపస్తస్య - తప్పుకానోపు అగస్త్యయని యుండనోపు) అగస్త్య నక్షత్రమునకు ఉత్తరమున, అజవీధికి దక్షిణమున, పితృయానమను నొక పథము కలదు. ఇదీ వైశ్వానర పథమునకు బాహ్యమున కలదు. అందు ప్రజావంతులు అగ్నిహోత్రులు నయిన మునులు వసింతురు. పితృయాన పథ స్థితులైనవారు లోక సంతానకరులు. (ప్రపంచ జనసంతానమును కొనసాగించువారు). (160) దక్షిణ భాగము ఋత్విక్కులది. భూసారంభృతకర్ములు (జనసృష్టి కారకులు). వారు . లోకకాములు. సంతానోత్పత్తి సారంభంతురు. ప్రతి యుగము నందు నడచిన (చలితమయిన) ధర్మమును మరల స్థాపింతురు. వారు తపసా సంతప్తులు. మర్యాదకంటి పెట్టుకొందురు. శ్రుతిని విద్యాభినివేశమును కొనసాగింతురు. (162) పూర్వులు తరువాతివారి గృహములలో బుట్టుచున్న విధముగానే తరువాతివారు గూడ వారి మరణము తరువాత గూడ పూర్వుల గృహములలో బుట్టుచుందురు. (163) ఈ విధముగా పునః పునః పుట్టి చచ్చుచు ఆవర్తమానులై వారు సర్వ భూతముల సంక్షయము (ప్రళయము) వరకు నుందురు. గృహమేధులయిన యీ ఋషీశ్వరుల సంఖ్య 88000 (ఎనుబది యెనిమిది సహస్రములు) (164) వారు చంద్రుఁడు నక్షత్రములున్నంత కాలము సూర్యుని యొక్క దక్షిణాయన మార్గము నాశ్రయించి యుందురు. (88000) ఇయ్యది పవిత్ర క్రియల ఆచరించుచు శ్మశానమును చెందిన వారి సంఖ్య. (165) ప్రపంచమున వారి నిత్యకర్మ కలాపములు, భూతముల సృజించుటచే, ఇచ్ఛాద్వేష ప్రవృత్తులచే, మైథునమునకు బూనుటచే, కామకృతములచే భోగ విషయ ప్రవృత్తులచే నడచుచుండును. ఇట్టి కారణములచే వారు శ్మశాన స్థలములను చెందిన సిద్దులు, సంతానాపేక్ష కోరు ఋషులు ద్వాపరయుగములందు బోలె మరల జన్మించెదరు. (168)
ఉత్తరః సవితుః పంథా దేవయానశ్చ స స్మృతః ।
యత్ర తే వాసినః సిద్ధాః విమలా బ్రహ్మచారిణః ॥
సంతతిం తే జుగుప్సంతే తస్మానృత్యుస్తు చైర్జితః ।
అష్టాచీతీసహస్రాణి ఋషీణామూర్ధ్వరేతసామ్ ॥
ఉదకంథానమత్యర్థం శ్రీతాహ్యాహ్యాశ్రితసంప్లవాత్ ।
తే సంప్రయోగాల్లోకస్య మైథునస్య చ వర్ణనాత్ ॥
ఇచ్ఛాద్వేషనివృత్యా చ భూతారంభవీవర్ణనాత్ ।
పునశ్చాతి కామ సంయోగాచ్ఛబ్దాదేర్దోషదర్శనాత్ ॥
ఇత్యేతైః కారణైః సిద్ధాస్తేఽఅమృతత్వం హి భేజిరే ।
ఆభూతసంప్లవస్థానామమృతత్వం విభావ్యతే ॥
త్రైలోక్యస్థితికాలాయ పునర్దారాలిగామినామ్ ।
భ్రూణహత్యాశ్వమేధాభ్యాం పుణ్యపాపకృతోఽపరే ॥
ఆభూతసంప్లవాంతే తు క్షీయంతే హర్యార్థ్వరేతసః ।
ఊర్వోత్తరమృషిభ్యసు ధ్రువో యత్ర స వై స్మృతః ॥
ఏతత్ విష్ణుపదం దివ్యం తృతీయం వ్యోమ్ని భాస్వరమ్ ।
యత్ర గత్వా చ శోచంతి తద్విష్ణోః పరమం పదమ్ ।
ధర్మధ్రువాద్యాస్తిష్ఠంతి యత్ర తే లోకసాధకాః ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయేనుఽషంగపాదే ఆదిత్యవ్యూహకీర్తనం నామైకవింశతితమోఽధ్యాయః ॥
నాగవీథ్యుత్తరముననున్న పథము, సప్తర్షి గణములకు దక్షిణమున నున్నది. సూర్యుని యొక్క ఉత్తరయానము (పథము). దీనిని దేవయానమందురు. అందుండునట్టి వారు సిద్దులు. వారు విమల బ్రహ్మచారులు. (169) వారు సంతతీయసహించుకోందురు. అందుచే వారిచే మరణము జయింపఁబడినది. ఊర్థ్వ రేతస్కులయిన యీ ఋషీశ్వరుల సంఖ్య 88000. వీరందరు సర్వభూత సంప్లవ పర్యంతము (వినాశనము. వరకు) ఉత్తరపథ యానమునే ఆశ్రయించుకొనియుందురు. లోక సంబంధము వలన, మైథునక్రియా పరిత్యాగము వలన (171) కామ సంయోగము నుండి విముఖత్వము వలన, ద్వేషరాహిత్యము వలన, భూతారంభ వివర్జనము వలన, విషయవాంఛా విముఖత్వము వలన, శబ్దాదివిషయముల దోషముజూచుట వలన (172) వారు సిద్దులైనారు. అమృతత్వము నొందినారు. ఎవరు సర్వభూత సంప్లవత్వము వజంకునుందురో వారికి అమృతత్వముండును. (173) త్రిలోక సంస్థితీ కోటకు వారు (ఆ ఋషులు / సిద్దులు) మరల వారి భార్యల గలిగియుందురు. ఇతరులు - భ్రూణహత్వాశ్వమేధముల వలన పాపపుణ్యములు చేయువారు ఊర్ధ్వ రేతస్కులు సంప్లవాంతమున క్షయము నొందుదురు. ఋషుల కంటే పైననుత్తరమున ధ్రువుడున్నచోటు (175) అది దివ్యమయిన విష్ణుపదము. ఆకాశమున ప్రకాశవంతమయిన మూఁడవది, దానిని చేరిన నెవ్వరికిని విచార దుఃఖములుండవు. అది విష్ణువు యొక్క ఉత్కృష్ట పదము. అందు లోకసాధకులయిన ధర్మము ధ్రువుడు మొదలగువారు ఉందురు. (176)
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండ పురాణమునందు పూర్వభాగమున ద్వీతీయానుషంగపాదమున ఆదిత్య వ్యూహకీర్తన మనెడి ఇరువది యొక్కటవ అధ్యాయము.
Summary of chapter 21 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter majestically directs the seeker's gaze to the heavens, describing the divine choreography of the solar system and the rhythmic movements of celestial luminaries. It explains how these radiant bodies lovingly dictate the divisions of time, weaving days, months, and years into a sacred cosmic dance. The devout mind is inspired to see the sun, moon, and stars not as mere objects, but as luminous deities performing their eternal duties in service to the supreme creator.