బ్రహ్మాండ మహా పురాణము
26 - లింగోత్పత్తి కథసమ్
ఋషయః ఊచుః :-
మహాదేవస్య మాహాత్మ్యం ప్రభుత్వం చ మహాత్మనః ।
శ్రోతుమిచ్ఛామహే సమ్యగైశ్వర్యగుణవిస్తరమ్ ॥
సూత ఉవాచ :-
పూర్వం త్రైలోక్య విజయే విష్ణునా సముదాహృతమ్ ।
బలిం బద్ద్వా మహావీర్యం త్రైలోక్యాధిపతిం పురా ॥
ప్రసష్టేషు చ దైత్యేషు ప్రహృష్టే తు శచీపతౌ ।
అథాజగ్ముః ప్రభుం ద్రష్ట్రుం సర్వే దేవాః సనాతనమ్ ॥
యత్రాస్తే విశ్వరూపాత్మా క్షీరోదస్య సమీపతః ।
సిద్దా బ్రహ్మర్షయో యక్షా గంధర్వాప్సరసాం గణాః ॥
నాగా దేవర్షయశ్చైవ నద్యః సర్వే చ పర్వతాః ।
అభిగమ్య మహాత్మానం స్తువంతీ పురుషం హరిమ్ ॥
త్వం ధాతా త్వం చ కర్తాసీ త్వం లోకాన్ సృజసి ప్రభో ।
త్వత్ప్రసాదాచ్చ కళ్యాణం ప్రాప్తం త్రైలోక్యమవ్యయమ్ ॥
అసురాశ్చ జీతాః సర్వే బలిర్భద్ధశ్చ వై త్వయా ।
ఏవముక్తః సురైర్విష్ణుః సిద్ధైశ్చ పరమర్షిభిః ॥
ప్రత్యువాచ తదా దేవాన్ సర్వాంస్తాన్ పురుషోత్తమః ।
శ్రూయతామభిధాస్యామి కారణం సురసత్తమాః ॥
యః స్రష్టా సర్వభూతానాం కాలః కాలకరః ప్రభుః ।
యేనాఽహం బ్రహ్మణా సార్ధం సృష్టి లోకాశ్చ మాయయా ॥
తస్యైవ చ ప్రసాదేన ఆదౌ సిద్దత్వ మాగతః ।
పురా తమసి చావ్యక్తే త్రైలోక్యే గ్రసితే మయా ॥
ఉదర స్థేషు భూతేషు త్వేకోఽహం శయితస్తదా ।
సహస్రశీర్షా భూత్వా చ సహస్రాక్షః సహస్రపాత్ ॥
ఋషులిట్లనిరి :
మహాదేవుని యొక్క మాహాత్మ్యమును, మహాత్ముఁడైన యతని ప్రభుత్వమును, ఆతని యైశ్వర్య గుణముల యొక్క విస్తరమును మేము వినఁగోరుచున్నాము.
సూతుఁడిట్లనెను :
పూర్వము త్రిలోకాధిపతియు మహాశౌర్యవంతుఁడునగు బలిని బంధించి, త్రైలోక్య విజయ సమయమున విష్ణునిచేనిది చెప్పఁబడినది. దైత్యులు నాశము చేందిరి; ఇంద్రుఁడు ప్రహృష్ణుఁడయ్యెను. అంత దేవతలందరు సనాతనుఁడయిన ప్రభువును దర్శించుటకు వెళ్లిరి. విశ్వ రూపాత్ముఁడయిన ప్రభువు క్షీరోదధిసమీపమున నుండ దేవతలందరచ్చటీకరిగిరి. సిద్దులు, బ్రహ్మరులు, యక్షులు, గంధర్వులు, అప్సర సమూహములు, వాగులు, దేవర్పులు, నదులు, సర్వపర్వతములు; మహాత్ముఁడు పురుషుడైన హరిని చేరి స్తోత్రము చేసిరి. (5) “నీవే ధాతవు. (సర్వమున కాధారుఁడవు); నీవేకర్తవు; ఓ ప్రభూ ! నీవే లోకమును సృజింతువు. నీ ప్రసాదము వలన మూఁడు లోకములు అవ్యయమైన కళ్యాణమును పొందినవి. (6) నీచే రాక్షసులందరు జయింపఁబడిరి. బలి బంధితుఁడయ్యెను.’ అనీ సురలచే, సిద్దులచే, పరమరులచే విష్ణువు స్తుతింపఁబడి; ఆ దేవతలందరి గూర్చి పురుషోత్తముఁడు ప్రత్యుత్తరమిచ్చెను. “ఓ సుర సత్తములారా ! కారణమును చెప్పెదను వినుఁడు, (8) ఎవఁడు సర్వభూతములకు స్రష్టయో, ఎవ్వఁడు కాలుడో, ఎవ్వడు కాలకరుడైన ప్రభువో, ఎవనిచేత నీ ప్రపంచములు బ్రహ్మతో సహా నేనును మాయచే సృజింపఁబడితిమో ఆతని ప్రసాదము వలన నేను సిద్ధత్వమును పొందితిని. (10) పూర్వము, అవ్యక్తమయిన తమస్సునందు, మూం డు లోకములు నాచే ఆవరింపఁబడినవో (గ్రసింపఁబడినవో), అప్పుడు నేను ఉదరము నందున్న భూతములలో శయనించి యుంటిని. అప్పుడు నాకు సహస్ర శీర్షములు, సహస్ర నేత్రములు, సహస్ర పాదములు.
శంఖచక్రగదాపాణిః శయితే విమలేంఽభసి ।
ఏతస్మిన్నంతరే దూరాత్పశ్యామి హ్యమితప్రభమ్ ॥
శతసూర్యప్రతీకాశం జ్వలంతం స్వేన తేజసా ।
చతుర్వక్త్రం మహాయోగం పురుషం కాంచనప్రభమ్ ॥
కృష్ణాజినధరం దేవం కమండలువిభూషితమ్ ।
నిమేషాంతరమాత్రేణ ప్రాప్తో ఽసౌ పురుషోత్తమః ॥
తతో మామబ్రవీద్భ్రహ్మా సర్వలోకనమస్కృతః ।
కస్త్వం కుతో వా కించేహ తిష్ఠసే వద మే విభో ॥
అహం కర్తాస్మి లోకానాం స్వయం భూర్విశ్వతోముఖః ।
ఏవముక్తస్తదా తేన బ్రహ్మణాఽహమువాచ తమ్ ॥
అహం కర్తా చ లోకానాం సంహర్తా చ పునః పునః ।
ఏవం సంభాషమాణౌతు పరస్పరజయైషిణౌ ॥
ఉత్తరాం దిశమాస్థాయ జ్వాలాముద్రాక్ష్య విష్ఠితామ్ ।
జ్వాలాం తతస్తామాలోక్య విస్మితౌ చ తదానఘాః ॥
తేజసా చ బలేనాథ శార్వం జ్యోతిః కృతాంజలీ ।
వర్ధమానాం తదా జ్వాలామత్యంతపరమాద్భుతామ్ ॥
అభిదుద్రావ తాం జ్వాలాం బ్రహ్మా చాహం చ సత్వరౌ ।
దివం భూమిం చ నిర్భిద్య తిష్ఠంతం జ్వాలమండలమ్ ॥
తస్య జ్వాలస్య మధ్యే తు పశ్యావో విపులప్రభమ్ ।
ప్రాదేశమాత్రమవ్యక్తం లింగం పరమదీప్తిమత్ ॥
న చ తత్కాంచనం మధ్యే న శైలం న చ రాజతమ్ ।
అనిర్దేశ్యమచింత్యం చ లక్ష్యా లక్ష్యం పునః పునః ॥
జ్వాలామాలాసహస్రాడ్యం విస్మయం పరమాద్భుతం ।
మహతా తేజసా యుక్తం వర్ధమానం భృశం తథా ॥
చేతుల యందు శంఖ చక్ర గదలున్నవి. నేనా స్వచ్ఛమయిన అంభస్సున పండుకొనియుంటిని. అంతలో దూరమున అనంతప్రభ కలిగిన ప్రభువును చూచితిని. ఆ ప్రభువు వంద సూర్యుల కాంతితో సదృశుఁడై యుండెను. స్వకీయమైన తేజస్సుచే జ్వలించుచుండెను; ఆతనికి నాలుగు ముఖములు. మహా యోగ ప్రభాకలితుఁడు; మహా పురుషుఁడు. కాంచన ప్రభా ప్రకాశితుఁడు. కృష్ణాజినమును ధరించెను; కమండలుపు కలిగియుండెను; అట్టి దివ్య ప్రభువును పురుషోత్తముని నిమేషాంతర మాత్రమున చేరితిని. సర్వలోక నమస్కృతుఁడయిన బ్రహ్మ నాతో నిట్లనెను “నీ వెవ్వఁడవు? ఎక్కడ నుండి వచ్చితివి? ఇందెందులకుంటివి. నాకు చెప్పుము” నేను లోకమునకు కర్తను, స్వయం భువుఁడును; నేను సర్వతోముఖుఁడును. బ్రహ్మచే నీట్లు చెప్పఁబడి నేనీట్లు సమాధాన మిచ్చితిని. నేనీ లోకములకు కర్తను. అంతియేకాదు ప్రతి ప్రళయమున మాటి మాటికీ నేను సంహర్తను కూడ. ఒండొరులను జయించవలయునను నభిలాషతో ఇట్లు మేమిర్వురము సంభాషించుకొనుచుండ ఉత్తర దిశనంటి జాజ్వల్యమానమైన యొక జ్వాలను చూచితిమి. ఆ జ్వాలను చూచి ఓ అనఘులారా ! మేమిర్వురమాశ్చర్య పడితిమీ. శర్వ సంబంధమైన జ్యోతికి తేజస్సుచే బలముచే అంజలి బద్దులమయితిమి. పరమాద్భుతముగా వృద్ధి పొందుచున్నయా జ్యోతిని మేము చూచితిమి. (19) అదీ అత్యంత విచిత్రముగా నున్నది వెంటనే నేను బ్రహ్మయును ఆ జ్వాలాభిముఖముగా తొందరగా నరిగితీమి. ఆ మండలాకారముగ నున్న జ్వాలావలయము, భూమిని స్వర్గమును నిర్భేదించికొని నిలిచియుండెను. (20) ఆ జ్వాల యొక్క మధ్యమునందు అత్యంత ప్రభావంతనుయినది, ప్రాదేశ మాత్రమున్నట్టిది, పరమదీప్తిమంతము, అవ్యక్తమునైటీ లింగమును మేమిర్వురము చూచితిమి. ఆ లింగము యొక్క మధ్యభాగమున కాంచనము. లేదు, వెండిలేదు శైల సంబంధములేదు. అది అనిర్దేశ్యముగా నున్నది. ఊహించుటకు వీలుకానట్టిది. అది పునః పునః కనబడుచు కనబడకయున్నది. అది జ్వాలామాలల సహస్రముతో గూడియున్నది. విస్మయముగా అద్భుతముగా నున్నది. గొప్ప తేజస్సుచేయుక్తమయి అత్యంతము వృద్ధి పొందుచున్నది. (23)
జ్వాలామాలాతతం న్యస్తం సర్వభూతభయంకరం ।
హోరరూపిణమత్యర్థం భిందంతమీవ రోదసీ ॥
తతో మామబ్రవీత్ బ్రహ్మా అధో గచ్ఛత్వమాశు వై ।
అంతమస్య విజానీవో లింగస్య తు మహాత్మః ॥
అహమూర్థ్వం గమిష్యామి యావదంతోఽస్య దృశ్యతే ।
తదా తు సమయం కృత్వా గతమూర్ధ్వమధశ్చ హి ॥
తతో వర్షసహస్రం తు హ్యహం పునరధో గతః ।
న పశ్యామి చ తస్యాంతం భీతశ్చాహం తతోఽభవమ్ ॥
తథైవ బ్రహ్మా హ్యూర్ధ్వం చ న చాంతం తస్య లబ్దవాన్ ।
సమాగతో మయా సార్ధం తత్రైవ చ మహాంభసి ॥
తతో విస్మయపన్నౌ భీతా తస్య మహాత్మనః ।
మాయయా మోహితౌ తేన నష్టసంజ్ఞౌ వ్యవస్థితా ॥
తతో ధ్యానరతౌ తత్ర చేశ్వరం సర్వతోముఖమ్ ।
ప్రభవం నీధనం చైవ లోకానాం ప్రభుమవ్యయమ్ ॥
ప్రహ్పాంజలీపుటౌ భూత్వా తస్మై శర్వాయ శూలినే ।
మహాభైరవనాదాయ భీమరూపాయ దంష్ట్రిణే ।
అవ్యక్తాయాథ మహతే నమస్కారం ప్రకుర్వహే ॥
నమోఽస్తుతే లోకసురేశ దేవ నమోఽస్తు తే భూతపతే మహాత్మన్ ।
నమోఽస్తు తే శాశ్వత సిద్ధయోగినే ।
నమోఽస్తుతే సర్వజగత్ప్రతిష్ఠిత ॥
పరమేష్ఠి పరం బ్రహ్మ త్వక్షరం పరమం పదమ్ ।
జ్యేష్ఠ స్త్వం వామదేవశ్చ రుద్రః స్కందః శివః ప్రభుః ॥
త్వం యజ్ఞస్త్వం వషట్కారస్త్వమోంకారః పరంతపః ।
స్వాహాకారో నమస్కారః సంస్కారః సర్వకర్మణామ్ ॥
జ్వాలామాలలు సర్వత్ర వ్యాప్తమైయున్నవి, సర్వ జీవలోకమునకు భయోత్పాదకముగ నున్నది. భయంకరమైన ఘోరరూపముతో అత్యంతము భూమ్యాకాశముల మధ్య భాగమును పగులగొట్టుచున్నట్టున్నది. (24) అంత బ్రహ్మ నాతోనిట్లనెను. “నీవు వెంటనే పాతాళ లోకమునకు (అధో లోకమునకు) అరుగుము. మహాత్ముఁడైన లింగము యొక్క అంతమును తెలిసికొందము. నేనో ఆతని యంత్యము కనబడువరకు ఊర్థ్వలోకమున కరిగెదను.” అట్లు నియమము చేసికొనిరి. ఆతఁడూర్వమున కరిగెను నేనో అధోలోకమున కరిగితినీ. తరువాత ఒక వేయి సంవత్సరము లధోలోకమున కరిగితిని ఆతని యొక్క అంతమును చూడలేదు. అంతనేను భీతుఁడనయితినీ ఆ విధముగనే బ్రహ్మ ఊర్థ్వమున కరిగెను. ఆతనీ యొక్క అంతమును పొందలేకపోయెను. అంత ఆతఁడును నాతో కూడ మహా సముద్రోదకమున సమాగతుఁడయ్యెను. ఆ మహాత్ముని గూర్చి మేమీరువురము విస్మయమును పొందితిమి. భయపడితిమి. ఆ మహాత్ముని వలన మోహితులమయితీమి. చైతన్యమును పోగొట్టుకొంటిమి. నష్ట సంజ్ఞుల మయితిమి. అంత సర్వతోముఖుఁడు లోకముల యొక్క పుట్టుకకు నాశనమునకును ప్రభువు, అవ్యయుఁడునయిన ఈశ్వరుని గూర్చి ధ్యానరతులమయితీమి. భక్తితో అంజలినిబట్టి శర్వునకు, శూలికీ, మహాభైరవ నాదునకు, భీమరూపునకు, దంష్టలు కలిగినవానికి, అవ్యక్తునకు, మహాత్మునకు నమస్కార మొనర్చితిమీ. ఓ లోకేశ, సురేశ, ఓ దేవ నీకు నమస్కారము, ఓ మహాత్మా, ఓ భూతపతీ నీకు నమస్కారము. ఓ శాశ్వతుఁడా ఓ సిద్దయోగీ నీకు నమస్కారము. సర్వప్రపంచ ప్రతిష్ఠితుఁడవయిన నీకు నమస్కారము. నీవు పరమేష్ఠివి, పరబ్రహ్మవు; నీవు అక్షరుఁడవు; నీవే పరమపదుఁడవు; నీవే జ్యేష్ఠుఁడవు; నీవే రుద్రుఁడవు. స్కందుడవు, శివుఁడవు; నీవే యజ్ఞము; నీవే వషట్కారము; ఓంకారము నీవు; పరంతపుఁడవు నీవు; నీవు స్వాహాకారుఁడవు, సర్వసంస్కారములు నీవు;
స్వధాకారశ్చ యజ్ఞశ్చ ప్రతాని నీయమాస్తథా ।
వేదా లోకాశ్చ దేహశ్చ భగవానేవ సర్వశః ॥
ఆకాశస్య చ శబ్దస్త్వం భూతానాం ప్రభవిష్యయః ।
భూమౌ గంధో రసశ్చాప్సు తేజోరూపం మహేశ్వరః ॥
వాయోః స్పర్శశ్చ దేవేశ వపుశ్చంద్రమసస్తథా ॥
బుద్ధా జ్ఞానం చ దేవేశ ప్రకృతేర్భీజమేవ చ ॥
సంహర్తా సర్వలోకానాం కాలో మృత్యుమయాంతకః ।
త్వం ధారయసి లోహంస్త్రీంస్త్వమేవ సృజిసి ప్రభో ॥
పూర్వేణ వదనేన త్వమిద్రత్వం ప్రకరోషి వై ।
దక్షిణేన చ వక్త్రేణ లోకాన్ సంక్షిపతే పునః ॥
పశ్చిమేన తు వక్త్రేణ వరుణస్తో న సంశయః ।
ఉత్తరేణ తు వక్త్రేణ సోమస్త్వం దేవసత్తమః ॥
ఏకధా బహుధా దేవ లోకానాం ప్రభవిష్యయః ।
ఆదిత్యా వసవో రుద్రా మరుతశ్చ సహాశ్వినః ॥
సాధ్యా విద్యాధరా నాగాశ్చారణాశ్చ తపోధనాః ।
వాలఖిల్య మహాత్మానస్తపఃసిద్ధాశ్చ సువ్రతాః ॥
త్వత్తః ప్రసూతి దేవేశ యేచాన్యే నీయతవ్రతాః ।
ఉమా సీతా సినీవాలీ కుహూర్గాయత్ర్య ఏవ చ ॥
లక్ష్మీః కీర్తిర్ధృతిర్మేధా లజ్జా కాంతిర్వపుః స్వధా ।
తుష్టిః పుష్టిః క్రియా చైవ హిచాం దేవీ సరస్వతీ ।
త్వత్తః ప్రసూతా దేవేశ సంధ్యా రాత్రిస్తథైవ చ ॥
సూర్యాయుతానామయుతప్రభావ నమోఽస్తుతే చంద్రసహస్రగౌర ।
నమోఽస్తుతే వజ్రపినాకధారిణే నమోఽస్తుతే సాయకచాపపాణయే ॥
స్వధాకారుఁడవు నీవు, ప్రతములు, నియమములు, నీవు, వేదములు, లోకములు, దేవతలు నీవే భగవానుఁడవు. నీవే సర్వస్వము. నీవు ఆకాశము యొక్క శబ్దమవు; నీవే భూతములకు ప్రభవస్థానము, సాశన స్థానము. భూమి యందలి గంధ లక్షణము నీవు, జలముల యందు రస లక్షణము నీవు, తేజోరూపము నీవు; మహేశ్వరుఁడవు. వాయువునందలి స్పర్శగుణము నీవు; దేవతల కధిపతివి; నీవే చంద్రుని శరీరమవు; నీవే మనస్సునందలి బుద్ధివి (జ్ఞానమవు). ప్రకృతికి బీజమునీవు; సర్వలోక సంహర్తవు నీవు, మృత్యు సదృశుఁడవయిన కాలుఁడవు నీవు; మృత్యువు నీనామాంతరము. నీవే మూఁడు లోకములను భరింతువు (ధరింతువు). ఓ ప్రభూ! నీవే యీ లోకముల సృష్టింతువు; నీవు నీ పూర్వదీశాముఖముతో నింద్రుని రూపము వహింతువు; దక్షిణ ముఖముతో ప్రపంచముల నన్నింటిని సంక్షేపము చేసెదవు. నాశనము చేయుదువు. (40) నీవు పశ్చిమ వక్రముతో వరుణుఁడవు (వరుణుని కలవాఁడవు) సంశయము లేదు. ఓ దేవతా సత్తమ ! ఉత్తర వక్రముచే సోముఁడవు నీవు. ఓ దేవ ! నీవు ఒక్కమారు, బహుమారుల, లోకములకు సష్టవు. అంతియేకాదు అంతకుఁడవు కూడ. ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, మరుత్తులు అశ్వినులు, సాధ్యులు, విద్యాధరులు, నాగులు, చారణులు, తపస్యులు, వాలఖిల్యులు మరియు తపస్సాచరించిన సుప్రతులైన మహాత్ములు, సిద్ధులు వీరందరు, ఓ దేవేశ ! నీవలన జన్మించిరి; వీరేకాక నియత ప్రతులెందరో ప్రసూతులయిరి. ఉమ, సీత, సినీవాలి, కుహు గాయత్రి, లక్ష్మి, కీర్తి, ధృతి, మేధ, లజ్జ, కాంతి, వసువు, స్వధ, తుష్టి, పుష్టి, క్రీయా, పోచాందేవియైన సరస్వతి, సంధ్య, రాత్రి ఓ దేవేశ నీ నుండీయే ప్రసూతులు. అయుత సంఖ్యలో (పదివేల) సూర్యుల యొక్క అయుత సంఖ్యా మూర్తుల యొక్క ప్రభావము కలవాఁడా ! వేయి చంద్రుల యొక్క గౌరవర్ణము కలహం డా! నీకు నమస్కారము. వజ్రమును పినాకమును ధరించినవాఁడా ! నీకు నమస్కారము.
నమోఽస్తు తే భస్మవిభూషితాంగ ! నామోఽస్తు తే కామశరీరనాశన ! ।
నమోఽస్తు తే దేవ ! హిరణ్యగర్భ ! నమోఽస్తు తే దేవ హిరణ్యవాససే ! ॥
నమోఽస్తు తే దేవహిరణ్యయేనే నమోఽస్తు తే దేవహిరణ్యనాభ ! ।
నమోఽస్తు తే దేవహిరణ్య రేతసే ! నమోఽస్తు తే నేత్రసహస్రచిత్ర ! ॥
నమోఽస్తు తే దేవహిరణ్యవర్ణ ! నమోఽస్తు తే దేవహిరణ్యకేశ ! ।
నమోఽస్తు తే దేవహిరణ్యవీర ! నమోఽస్తు తే దేవహిరణ్యదాయినే ! ॥
నమోఽస్తు తే దేవహిరణ్యనాథ ! నమోఽస్తు తే దేవ హిరణ్యనాద ! ।
నమోఽస్తు తే దేవ పినాకపాణే ! నమోఽస్తు తే శంకర నీలకంఠ ! ॥
ఏవం సంస్తూయమానస్తు వ్యక్తో భూత్వా మహామతిః ।
దేవదేవో జగద్యోనిః సూర్యకోటిసమప్రభః ॥
ఆబభాషే కృపావిష్టో మహాదేవో మహాద్యుతిః ।
వక్త్రకోటి సహస్రేణ గ్రసమాన ఇవాంబరమ్ ॥
కంబుగ్రీవః సుజఠరో నాసాభూషణభూషితః ।
సానారత్నవిచిత్రాంగో నానామాల్యానులేపనః ॥
పినాకపాణిర్భగవాన్ సురపూజ్యస్త్రీశూలధృక్ ।
వ్యాల యజ్ఞోపవీతీ చ సురాణామభయంకరః ॥
దుందుభిస్వరనిర్ఘోషః పర్జన్యనినదోపమః ।
ముక్తో హాసస్తదా తేన సర్వమాపూరయన్ జగత్ ॥
బాణములను వింటినీ చేతియందు ధరించినవాఁడా నీకు నమస్కారము. భస్మముచే వీభూషితాంగ ! నీకు నమస్కారము. మన్మథ శరీరమును నాశనము చేసినవాఁడా ! నీకు నమస్కారము. ఓ. హిరణ్యగర్బ ! నీకు నమస్కారము. ఓ హిరణ్యవస్త్ర ! నీకు నమస్కారము. ఓదేవ! హిరణ్యయోనీ ! నీకు నమస్కారము. బంగారు నాభి కలిగిన ఓ దేవ! నీకు నమస్కారము. హిరణ్య రేతస్సు గలిగిన ఓ దేవ ! నీకు నమస్కారము. సహస్ర నేత్రములతోడి అద్భుత పురుషా ! నీకు నమస్కారము. (48) ఓ హిరణ్యవర్ణా ! నీకు నమస్కారము. బంగారు కేశములు కలవాడా! నీకు నమస్కారము. ఓ హిరణ్యవీర (ఉత్తమ శౌర్యము కలవాఁడా) నీకు నమస్కారము. బంగారు ప్రదానము చేయు ఓ దేవా ! నీకు నమస్కారము. (49) ఓ హిరణ్యనాథ ! నీకు నమస్కారము. హిరణ్య నాదము (ధ్వని) కలిగినవాడా ! నీకు నమస్కారము. ఓ పినాకము పాణియందు కలవాఁడా! ఓ దేవ ! నీకు నమస్కారము. ఓ శంకర ! ఓ నీలకంఠ ! నీకు నమస్కారము. (50) ఈ విధముగా స్తోత్రము చేయబడుచున్నవాఁడై, మహామతి, దేవదేవుఁడు, జగద్యోని, సూర్యకోటిసమప్రభావంతుఁడునయిన ఈశ్వరుఁడు వ్యక్తుఁడయ్యెను. ప్రత్యక్తీకరించేను. మహాదేవుఁడు, మహాద్యుతి మంతుఁడు, దయాయుక్తుఁడై వక్షకోటి సహస్రముచే ఆకాశమును మ్రింగుచున్న వానీవోలె పలికెను. (52) శంఖము వంటి కంఠము కలవాఁడు, సుజఠరుఁడు, సోనాభూషణభూషితుఁడు, విచిత్రమైన అవయవములు కలవాఁడు, నానా విధములయిన మాలలను శరీరగంధ లేపనములను ధరించినవాఁడు, పినాకపాణి, త్రిశూలధారి, దేవతాపూజ్యుఁడునయిన భగవంతుఁడు, సర్పయజ్ఞోపవీతములు కలవాఁడు, దేవతల కభయంకరుఁడుననైన శంకరుఁడు, దందుభిధ్వానముతో సమానమయిన హోషముతో, మేఘగర్జన తుల్యమైన యొక హాసము చేసెను. ఆ మహా సనాదముతో సర్వజగత్తు నీండిపోయెను.
తేన శబ్ధేన మహతో చావాం భీతౌ మహాత్మనః ।
అథోవాచ మహాదేవః ప్రీతోఽహం సురసత్తమౌ ॥
పశ్యతాం చ మహాయోగం భయం సర్వం ప్రముచ్యతామ్ ।
యువాం ప్రసూతౌ గాత్రేభ్యో మమ పూర్వం సనాతనౌ ॥
అయం మే దక్షిణో బాహుః బ్రహ్మా లోకపితామహః ।
వామో బాహుశ్చమే విష్ణుర్నీత్యం యుద్ధేషనిర్జితః ॥
ప్రీతోఽహం యువయోః సమ్యగ్వరం దద్యాం యథేప్సితమ్ ।
తతః ప్రహృష్టమనసౌ ప్రణతౌ పాదయోః ప్రభోః ॥
అబ్రూతాం చ మహాదేవం ప్రసాదాభిముఖం స్థితమ్ ।
యది ప్రీతిః సముత్పన్నా యది దేవో వరశ్చ తే ।
భక్తిర్భవతు నౌ నిత్యం త్వయి దేవ సురేశ్వర ! ॥
దేవదేవ ఉవాచ :-
ఏవమస్తు మహాభాగ సృజతాం వీపులాః ప్రజాః ।
ఏవముక్త్వా స భగవాంస్తత్రైపాంతరధాద్వీభుః ॥
ఏష ఏవ మయోక్తో వః ప్రభావస్తస్య ధీమతః ।
ఏతద్దీ పరమం జ్ఞానమవ్యక్తం శివసంజ్ఞితమ్ ॥
ఏతత్సూక్ష్మమచింత్యం చ పశ్యంతి జ్ఞానచక్షుషః ।
తస్మై దేవాదిదేవాయ నమస్కారం ప్రకుర్మహే ।
మహాదేవ నమస్తేఽస్తు మహేశ్వర నమోఽస్తుతే ॥
సూత ఉవాచ :-
ఏతచ్ఛృత్వా గతాస్సర్వే సుధాః స్వంస్వం నివేశనమ్ ।
నమస్కారం ప్రకుర్వాణాః శంకరాయ మహాత్మనే ॥
ఇమం స్తవం పఠేద్యస్తు చేశ్వరస్య మహాత్మనః ।
కామాంశ్చ లభతే సర్వాన్ పాపేభ్యశ్చ ప్రముచ్యతే ॥
ఏతత్సర్వం తదా తేన విష్ణునా ప్రభవిష్ణునా ।
మహాదేవప్రసాదేన హ్యుక్తం బ్రహ్మ సనాతనమ్ ।
ఏతద్వః సర్వమాఖ్యాతం మయా మహేశ్వరం బలమ్ ॥
ఇతి శ్రీ బ్రహ్మండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే, ద్వితీయేఽనుషంగపాదే లీంగోత్పత్తికథనం నామ షడ్వింశతి తమోఽధ్యాయః ॥
ఆ మహాత్ముని శబ్దముచే మేమిర్వురము భయపడితిమి. అంత మహాదేవుడిట్లనెను. “దేవతాశ్రేష్ఠులారా ! ప్రీతుఁడనయితిని. మహా యోగశక్తిని మీరిరువురును చూడుఁడు; మీరు భయమును విడువుఁడు, మీరిరువురు సనాతనులు; సో యవయవముల నుండి పూర్వము మీరు జన్మించితిరి. లోకపితామహుఁడయిన బ్రహ్మ, సో దక్షిణ బాహువు. యుద్దము నందెన్నడును పరాజయము చెందని యీ విష్ణువు నా వామ బాహువు. మీయిర్వురీ వలన మిక్కిలి ప్రీతుఁడనయితిని. మీకు యథేస్సితమయిన వరమును నేనొసంగెదను. అంత హృదయముల యందు ప్రహృష్ణులమైతిమి. మహాదేవుని పాదములకు నమస్కరించితిమి. ప్రసన్నముగా నభిముఖుఁడైయున్న మహాదేవునితో మేమిరువరమిట్లంటిమీ. “ఓసురేశ్వర! నీవు మా యందు ప్రీతిమంతుఁడవై మాకు వరమీయఁదలంచినచో మేము నీయందేల్లప్పుఁడు భక్తితో ముందుము గాక దేవదేవుఁడిట్లనెను. తథాస్తు. ఓ మహాభోగులారా ! ప్రజలను విపులముగా సృజిపుడు”. ఇట్లు పలీకి భగవానుఁడచ్చటనే యంతర్గానుఁడయ్యెను. (61) ధీమంతుఁడయిన దేవదేవుని ప్రభావమిది. మీకు నేను చెప్పితిని. ఇది ఉత్కృష్టమైన జ్ఞానము; అవ్యక్తము; శివనామకము. అయ్యదే సూక్ష్మము; అచింత్యము. దానినీ జ్ఞానచక్షువులు గల వారు దర్శింతురు. దేవాది దేవుఁడయిన యాతనికి నమస్కారము చేయుచున్నాము, మహాదేవ ! నీకు నమస్కారము, మహేశ్వర నీకు నమస్కారము. సూతుఁడిట్లు పలికెను. దీనినీ వినీ దేవతలందరు మహాత్ముఁడయిన శంకరునకు నమస్కరించుచు వారి వారి నిహాసముల కరిగిరి. మహాత్ముఁడయిన యీశ్వరుని యొక్క స్తవము నెవ్వఁడు పఠించునో అతఁడు సర్వకామములను పొందును, పాపముల నుండి విముక్తుఁడగును. (66) ఇదంతయు ప్రభువిష్టుడైన విష్ణువుచే వారికీ మహాప్రభావంతుఁడయిన సనాతనమైన బ్రహ్మను గూర్చి, మహాదేవుని యనుగ్రహమునఁ జెప్పఁబడెను. ఇట్లు మహేశ్వరుని యొక్క బలమును గూర్చి సాచే వర్ణింపఁబడినది.
ఇది వాయుప్రోక్తము, మహాపురాణము అయిన బ్రహ్మాండపురాణమందలి పూర్వభాగములోని, ద్వితీయానుషంగ పాదమునలింగోత్పత్తి కథనమును ఇరువది యారవ అధ్యాయము.
Summary of chapter 26 of the Brahmānda Mahā Purana is as follows:
This highly sacred chapter unveils the mystical origin of the Śiva Liṅga, the supreme symbol of the unmanifest and infinite nature of the divine. It narrates the awe-inspiring moment when a blazing pillar of light appeared to dispel cosmic arrogance, establishing the Liṅga as the eternal focal point of devout worship. Through this narrative, the faithful are drawn into the deepest realms of meditation, realizing that the supreme lord is beyond form, yet compassionately accessible through this holy emblem.