బ్రహ్మాండ మహా పురాణము
15 - వైవాహికోత్సవోనామ పంచదశోఽధ్యాయః
తచ్ఛృత్వా వచనం దేవీ మందస్మితముఖాంబుజా।
ఉవాచ స(సా) తతో వాక్యం బ్రహ్మవిష్ణుముఖాన్ సురాన్॥
స్వతంత్రాహం సదా దేవాః స్వేచ్ఛాచారవిహారిణీ।
మమానురూపదరితో భవితా తు మమ ప్రియః ॥
తథేతి తత్పతీశ్రుత్య సర్వైర్జేవైః పితామహః।
ఉవాచ చ మహాదేవీం ధర్మార్థసపాతం వచః॥
కాలక్రీతా క్రయత్రీతా పితృదత్తా స్వయంయుతా।
నారీపురుషయోరేవముద్వాహస్తు చతుర్విధః ॥
కాలక్రీతా తు వేశ్యా స్యాత్రయక్రీతా తు దాసికా।
గంధర్వోద్వాహితా యుక్తా భార్యాస్యాత్పితృదత్తకా॥
సమానధర్మిణీ యుక్తా భార్యా పితృవశంవదో।
యదద్వైతం పరం బ్రహ్మ సదసద్భావవర్జితమ్॥
చిదానందాత్మకం తస్మాత్ర్పకృతీః సమజాయత ।
త్వమేవాచ్చ తద్రహ్మ ప్రకృతిః సమజాయత॥
త్వమేవాసీచ్చ తద్రహ్మ ప్రకృతిః సా త్వమేవ హీ।
త్వమేవానాదిరఖిలా కార్యకారణరూపిణీ।
త్వామేవ హి విచిన్వంతి యోగినః సనకాదయః॥
సదసత్కర్మరూపాం చ వ్యక్తావ్యక్తోదయాత్మికామ్।
త్వామేవ హి ప్రశంసంతి పంచబ్రహ్మస్వరూపిణీమ్॥
త్వమేవ హి సృజస్యాదౌ త్వమేవ హ్యవసి క్షణాత్।
భజస్వ పురుషం కంచిల్లోకానుగ్రహకామ్యయా॥
ఇతి విజ్ఞాపితా దేవీ బ్రహ్మణా సకలైః సురైః।
స్రజముద్యమ్య హస్తేన చిక్షేప గగనాంతరే॥
తయోత్సృష్టా హి సా మాలా శోభయంతీ నభస్థలమ్।
పపాత కంఠదేశే హి తదా కామేశ్వరస్య తు॥
తతో ముముదిరే దేవా బ్రహ్మవిష్ణుపురోగమాః।
వవృషుః పుష్పవర్షాణి మందవాతేరితా ఘనాః॥
ఆమాటవినీ మహాదేవి చిరునవ్వు ముఖముతో బ్రహ్మవిష్ణువు మొదలగు దేవతలతో నిట్లనెను-1. ఓ దేవతలారా! నేనెప్పుడు స్వతంత్రను స్వేచ్చాచారమున విహరించుదానిని. నాకు దగిన చరిత్ర గలవాడు నాకు ప్రియుడుగాగలడు-2. అయని యామెమాట నంగీకరించి, సమస్త దేవతలతోబాటు బ్రహ్మ మహాదేవితో ధర్మార్థ సహితముగా నిట్లనెను -3. ఒక సమయమునకు మాత్రమే కొనబడినది, డబ్బుతో కొనబడినది, స్వయముగా చేరినది తండ్రిచేనీయబడినది, ఈ విధముగా స్త్రీ పురుషుల వివాహము నాలుగు విధములు-4. నిర్ణీత కాలమునకు కొనబడినది వేశ్యయగును. వెలగట్టికొన్నది దాసియగును, గాంధర్వవిధితో వివాహముజేసికొన్నది ‘యుక్త’ యగును. తండ్రిచే యథావిధిగ నీయబడినదీ భార్యయగును-5. (యుక్త) సమాన ధర్మముగలదియగును. భార్య పితరులకు వశంవద చెప్పినట్లు వినునది యగును. మొదట సదసద్భావములు లేక అద్వైతమై (రెండులేనిదై) పరబ్రహ్మయుండెను-6. దానినుండి చిదానందాత్మకముగా ప్రకృతి జనించెను. నీవేయా బ్రహ్మపు, నీవేగా ప్రకృతివి-7. నీవేయనాదీవి (మొదలులేని దానివి) అఖిల స్వరూపిణివి. కార్యకారణ స్వరూపిణివి. సనకాదియోగులు నిన్నే వెదకుదురు-8. సదసత్కర్మరూపిణీవి, వ్యక్త (బయల్పడినది) అవ్యక్త (బయల్పడనిది)యైనయుదయము గలదానివి. అట్టి నిన్నే పంచబ్రహ్మ స్వరూపీడిగా ప్రశసింతురు-9. మొదటనీవే సృష్టింతువు. నీవేదానిని రక్షింతువు. లోకానుగ్రహమునుగోరి. ఒకపురుషుని బొందుము-10. ఈ విధముగా దేవతల చేతను. బ్రహ్మచేతను విన్నవింపబడి యమహా దేవి చేతితో నొకహారము నెత్తి యాకాశమధ్యమునకు విసిరేను-11. ఆమె విసిరిన మాల ఆకాశమును బ్రాకాశింపజేయుచు అపుడు కామేశ్వరుని కంఠమునబడెను-12. అంత బ్రహ్మ విష్ణువు మొదలుగా గల దేవతలు సంతసించిరి. పిల్లవాయువులతో కదల్పబడిన మేఘములు పుషముల వర్షించినవి-13.
అథోవాచ విధాతా తు భగవంతం జనార్ధనమ్।
కర్తవ్యో విధినోద్వాహస్త్వనయోః శివయోర్హరే॥
ముహూర్తో దేవసంప్రాప్తో జగన్మంగలకారకః।
త్వద్రూపాహి మహాదేవి సహజశ్చ భవానపి॥
దాతుమర్హసి కల్యాణీమస్మైకామశివాయ తు।
తచ్ఛృత్వా వచనం తస్య దేవదేవస్త్రివిక్రమః॥
దదౌ తస్యై విధానేన ప్రీత్యా తాం శంకరాయ తు।
దేవర్షిపితృముఖ్యానాం సర్వేషాం దేవయోగినామ్ ॥
కల్యాణం కారయామాస శివయోరాదికేశవః।
ఉపాయనాని ప్రదదుః సర్వే బ్రాహ్మాదయః సురాః॥
దదౌ బ్రహ్మేక్షుచాపం తు వజ్రసారమనశ్వరమ్।
తయోఃపుష్పాయుధం ప్రాదోదమ్మ్లానం హరిరవ్యయమ్॥
నాగపాశం దదౌ తాభ్యాం వరుణ్ యాదసాం పతిః।
అంకుశం చ దదౌ తాభ్యాం విశ్వకర్మా విశాం పతిః॥
కిరీటమగ్నిః ప్రాయచ్ఛత్తాటంకౌ చంద్రబాస్కరౌ।
నవరత్నమయీం భూషాం ప్రాదాద్రత్నాకరః స్వయమ్॥
దదౌ సురాణామధిపో మధుపాత్రమథాక్షయమ్।
చింతామణిమయీం మాలాం కుబేరః ప్రదదౌ తదా॥
సామ్రాజ్యసూచకం ఛత్రం దదౌ లక్ష్మీపతిః స్వయమ్॥
గంగా చ యమునా తాభ్యోం చామరే చంద్రభాస్వరే॥
అష్టా చ వసవో రుద్రా ఆదిత్యాశాశ్వినౌ తథా।
దిక్పాలా మరుతః సాధ్యా గంధర్వాః ప్రమథేశ్వరాః॥
స్వానిస్వాన్యాయుధాన్యస్యై ప్రదదుః పరపోషితాః॥
రథాంశ్చ తురగాన్నాగాన్మహావేగాన్మహాబలాన్।
ఉష్ట్రానరోగానశ్వాంస్తాన్ క్షుత్తృష్ణాపరివర్జితాన్॥
దదుర్వజ్రోపమాకారాన్సాయుధాన్సపరీచ్ఛదాన్॥
అథాఽభిషేకమాతేనుః సామ్రాజ్యే శివయోః శివమ్।
అధాకరోద్విమానం చ నామ్నా తు కుసుమాకరమ్॥
విధాతామ్లానమాలం వై నిత్యం చాభేద్యమాయుధైః।
దీవిభువ్యంతరిక్షే చ కామగం సుసమృద్ధిమత్॥
యధ్గంధఘ్రాణమాత్రేణ భ్రాంతీరోగక్షుధార్తయః।
తత్ క్షణాదేవ నశ్యంతి మనోహ్లాదకరం శుభమ్ ॥
తద్విమానమథారోష్య తావుభౌ దివ్యదంపతీ।
చామరవ్యజనచ్ఛత్ర ధ్వజ యష్టిమనోహరమ్॥
వీణావేణు మృదంగాని వివిధైస్తౌర్యవాదనైః।
సేవ్యమాన సురగణైర్నిర్గత్య నృపమందిరాత్॥
యయౌవీధీం విహారేశా శోభయంతీ నిశాజసా।
ప్రతిహర్మ్యాగ్రసంస్థాభిరస్సరోభిః సహస్రశః ॥
సలాజాక్షతహస్తాభిః పురంధీభిశ్చ వర్షితా।
గాథాభిర్మంగలార్థాభిర్వీణవేణ్వాదినిస్వనైః॥
తుష్యంతో వీధివీధీషు మందమందమథాయయౌ॥
ప్రతిగృహ్యాప్సరోభిస్తు కృతం నీరాజనా విధిమ్।
అవరుహ్య విమానాగ్రాత్ప్రవివేశ. మహాసభామ్॥
సింహాసనమధిష్టాయ సహదేవేన శంభునా।
యద్యద్వాంఛతి తత్రస్థా మనసైవ మహాజనాః॥
సర్వజ్ఞా సాక్షిపాతేన తత్తత్కామానపూరయత్॥
తర్దృష్ట్వా చరితం దేవ్యా బ్రహ్మలోక పితామహః।
కామాక్షీతి తదాభిభ్యాం దదౌ కామేశ్వరీతి చ॥
వవర్షాశ్చర్యమేఘోఽపి పురే తస్మిస్తదాజ్ఞయా।
మహార్హాణి చ వస్తూని దీవ్యాన్యాభరణానీ చ॥
చింతామణిః కల్పవృక్షః కమలా కామధేనవః।
ప్రతివేశ్మ తతస్తస్థుః పురో దేవ్యా జయాయ తే॥
తాం సేవైకరసాకారాం విముక్తావ్యక్రియాగుణాః।
సర్వకామార్థసంయుక్త హృష్యంతః సార్వకాలికమ్ ॥
పితామహో హరిశ్చైవ మహాదేవశ్చ వాసవః।
అన్యే దిశామధీశాస్తు సకలా దేవతా గణాః॥
దేవర్షయో నారదాద్యాః సనకాద్యాశ్చ యోగినః।
మహర్షయశ్చ మన్వాద్యా వశిష్టాద్యాస్తపోధనాః॥
గంథర్వాప్సరసో యక్షా యాశ్చాన్యా దేవజాతయః।
దివి భూమ్యంతరిక్షేషు ససంబాధం వసంతి యే॥
తే సర్వే చాప్యసంబాధం నివసంతి స్మ తత్పురే॥
ఏవం తద్వత్సలా దేవీ నాన్యత్రైత్యఖిలాజ్జనాత్ ।
తోషయామాస సతతమనురాగేణ భూయసా॥
రాజ్ఞో మహతి భూర్లోకే విదుషః సకలేప్సితామ్।
రాజ్ఞీ దుదోహాభీష్టాని సర్వభూతలవాసినమ్॥
త్రిలోకైకమహీపాలే సాంబికే కామశంకరే।
దశవర్షసహస్రాణి యయుః క్షణ ఇవాపరః॥
తతః కదాచిదగత్య నారదో భగవానృషిః।
ప్రణమ్య పరమాం శక్తిం ప్రోపోచ వినయాన్వితః॥
పరం బ్రహ్మ పరంధామ పవిత్రం పరమేశ్వరి।
సదసద్భావసంకల్పవికల్పకలనాత్మకా॥
జగదభ్యుదయార్థాయ వ్యక్తభావముపాగతా।
అసజ్జనవినాశార్తా సజ్జనాభ్యుదయార్థనీ॥
ప్రవృత్తిస్తవ కల్యాణి సాధూనాం రక్షణాయ హి॥
అయం భండాసురో దేవి బాధతే జగతాం త్రయమ్।
త్వయైకయేవ జేతవ్యో న శక్యస్వపరైః సురైః ॥
త్వత్సేవైకపరా దేవాశ్చరకాలమిహోషితాః త్వదాజ్ఞయా గమిష్యంతి స్వాని స్వాని పురాణి తు॥
అమంగలాని శూన్యాని సమృద్ధార్థాని సంత్వతః।
ఏవం విజ్ఞాపితా దేవీ నారదేనాఖిలేశ్వరీ॥
స్వస్వవాసనివాసాయ ప్రేషయామాస చామరాన్॥
బ్రహ్మాణం చ హరిం శంభుం వాసవాదీన్ దిశాం పతీన్।
యథార్హం పూజయిత్వా తు ప్రేషయామాస చాంబికా॥
అపరాధం తతస్త్యక్తుమపి సంప్రేషితాః సురాః।
స్వస్వాంశైః శివయోః సేవామాదిపిత్రోరకుర్వతః॥
ఏతదాఖ్యానమాయుష్యం సర్వమంగలకారణమ్।
ఆవిర్భావం మహాదేవ్యాస్తస్యా రాజ్యాభిషేచనమ్॥
యః ప్రాతరుత్తితో విద్వాన్ భక్తిశ్రద్ధాసమన్వితః।
జపేద్ధనసమృద్ధః స్యాత్సుధాసంమితవాగ్భవేత్॥
నాశుభం విద్యతే తస్య పర శ్రేహ చ ధీమతః।
యశః ప్రాప్నోతి విపులం సమానోత్తమమపి॥
అచలా శ్రీర్భవేత్తస్యశ్రేయశ్చైవ పదేపదే।
కదాచిన్న భయం తస్య తేజస్వీ వీర్యవాన్ భవేత్॥
తాపత్రయవిహీనశ్చ పురుషార్థైశ్చ పూర్యతే।
త్రిసంధ్యం యో జపేన్నిత్యం ధ్యాత్వా సింహాసనేశ్వరీమ్ ॥
షణ్మాసాన్మహతీం లక్ష్మీం ప్రోప్నుయాజ్ఞాపకోత్తమః ॥
ఇతి శ్రీబ్రహ్మాండే పురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే
వైవాహికోత్సవో నామ పంచదశోధ్యాయః ॥
ఆ తరువాత బ్రహ్మ భగవంతుడైన విష్ణువుతో నిట్లనెను. ఓ హరీ! ఈశివులకు మహాదేవీమహేశ్వరులకు వివాహము జేయవలెను-14 . జగన్మంగల కారకమైన ముహూర్తము దేవతలచేత సంప్రాప్తమైనది (వచ్చినది) మహాదేవి నీ రూపము గలిగియున్నది. నీవు గూడ నామెకుతోబుట్టువు-15. కావున ఈ కల్యాణిని కామశివునకీయదగుదువు. బ్రహ్మయొక్క యీ మాటను వినీ దేవదేవుడైన త్రివిక్రముడు (మూడు పాదములలో ముల్లోకము సాక్రమించిన విష్ణువు)-16. ప్రేమతో నా మహాదేవిని వీధిపూర్వకముగా శంకరునకిచ్చెను. దేవతలకు ఋషులకు పితృదేవతలు మొదలగు సమస్త దేవతలకును యోగులకును కల్యాణమైన మహేశ్వరీ మహేశ్వరుల కల్యాణమును ఆదిశ్రీహరి చేయించెను. బ్రహ్మాదులైన దేవతలు కానుకలు సమర్పించిరి-18. బ్రహ్మ వజ్రసారమై యనశ్వరమైన చెరకువిల్లును, శ్రీ విష్ణువు పాడని పుష్పాయుధమును-19. వరుణుడు నాగపాశమును, రాజైన విశ్వకర్మ అంకుశమును-20. అగ్ని కిరీటమును, చంద్రసూర్యులు చెవికమ్మలను, రత్నాకరుడు నవరత్నమయములైన సొమ్ములను-21. దేవేంద్రుడు అక్షయమైన మధుపొత్రమును, కుబేరుడు చింతామణి మయమైన మాలను-22. లక్ష్మీపతి స్వయముగా సామ్రాజ్య సూచకమైన ఛత్రమును (గొడుగును), గంగాయమునలు చంద్రునివలె తెల్లని వింజామరలను-23. ఇంకను అష్ట వసువులు ఏకాదశ రుద్రులు, ద్వాదశ ఆదిత్యులు, అశ్వినీదేవతలు, ఇంద్రాది దీక్పాలురు, మరుత్తులు, సొధ్యులు, గంధర్వులు, ప్రమథ గణపతులును, పరితోషితులై వారీ వారీ యాయుధములను ఈమెకిచ్చీరి-24. రథములను, మహావేగములైన గుఱ్ఱములను, మహాబలములైన ఏనుగలను, రోగములేని ఒంటెలను, అశ్వములను ఆకలిదప్పులు లేనివానిని ఇచ్చేరి, సపరీచ్చదములై (కవచములుగల) వజ్రముతో సమానమైన యాకారముగల యాయుధములనిచ్చీరి-25. ఆ తరువాత మహేశ్వరీ - మహేశ్వరులను సామ్రాజ్యమునందు మంగళకరముగా నభిషేకించిరి. తరువాత బ్రహ్మ కుసుమాకరమను విమానమును నిర్మించియిచ్చెను-26. అది వాడిపోని మాలలుగలది. ఆయుధములచే నెప్పుడును భేదింపనలవికానిది. దేవలోకమునను, భూలోకమునను, అంతరిక్షమునను (ఆకాశమునను) సుసమృద్ధిమంతమై కామ గమనము గలది. (ఇచ్చవచ్చినట్లు పోవునది)-27. దాని గంధమును వాసనజూచిన మాత్రమున భ్రాంతీ-రోగము-ఆకలి-పీడలు-ఇవి క్షణకాలముననే నశించును. అది మనమున కానందమును గూర్చునది. శుభమైనదీ-28. చామరములు, విసనకర్రలు, గొడుగులు జెండాకట్టెలు-వీనితో మనోహరమైన యా విమానమునా యిద్దరు దివ్యదంపతులు అధిరోహించరీ-29. వీణ వేణువు మృదంగము-మొదలగు వివిధములైన మద్దెల మొదలగు వాద్యములు మ్రోయగా దేవగణములతో రాజమందిరము నుండి వెడలి-30. ఆ యీశ్వరీ తేజముతో బ్రకాశింపజేయుచు వీధిలో విహారము గావెడలెను. ఎదుట (ప్రక్క) నున్న మేడల చివరనున్న వేలకొలదీ-51. యస్పరసలు ముత్తైదువలును తమ చేతులతో లాజక్షతలను వర్షించిరి. మంగళార్ధములైన గాధలు బాడిరి. వీణావేణ్వాది ధ్వనులు చెలగినవి. వీనితో సంతసించుచు ఈ విధముగా వీధివీథులలో మెల్లమెల్లగా తిరిగివచ్చెను-52. అప్సరలచే చేయబడిన నీరాజనమునుగైకొని మీమానాగ్రమునుండి దిగీ మహాసభలో ప్రవేశించేను-33. శివునితో సహా సింహాసన మధిరోహించెను. అచట మహాజనులు మనమునగోరిన దానినెల్ల సర్వజ్ఞయైన యామహాదేవి కరుణా కటాక్షపాతముచేతనే పూరించెను-34. దానిని జూచి లోకపితామహుడైన బ్రహ్మ ‘కామాక్షి యనియు కామేశ్వరీ’ యనియు పేరిడేసు-35. ఆ పురమున ఆమె యాజ్ఞచే ఆశ్చర్యకరమైన మేఘము గూడ గొప్ప విలువైన వస్తువులను దివ్యములైన యాభరణములను వర్షించినది-36. దేవియొక్కయెదుట ప్రత్యింటను చింతామణీ, కల్పవృక్షము, కమల (లక్ష్మి), కామధేనువులును నెలకొన్నవి-37. వదలిపెట్టిన యితర క్రియా-గుణములుగల వారై సర్వకామార్థసంయుక్తులై నిత్యము సంతసించుచు సేవానందము మూర్తీభవించిన యా మహాదేవిని సేవించిరి-38. బ్రహ్మ, విష్ణువు, మహాదేవుడు, ఇంద్రుడు, దిక్పాలకులు, సమస్త దేవతా గణములు-39. దేవర్పులు నారదాదులు, సనకాదులైన యోగులు, మహర్షులు, మన్వాదులు, వశిష్టాదులైన తపోధనులు-40. గంధర్వులు, అప్పరసలు, యక్షులు, ఇతర దేవజాతులు, దివిలోభువీలో ఆకాశములో ససంబాధముగా నున్నవారు-41. వీరందరును ఆమె పురమున నేబాధయులేక యుండిరి-42. ఈ విధముగా వత్సలమైన (భక్తులందదయగల) యాదేవి ఈ యఖిల జనములను వదలి వేరొక చోటికి వెళ్ళదు. మీక్కలి యనురాగముతో పారిసెల్లప్పుడు సంతసింపజేసేను-43. అందరి కోరికలను దెలిసి ఈ మహాభూలోకమునకు రాజైన వాని యొక్కయు, ఈ సమస్త భూతలముననుండు వారియొక్కయు అభీష్టములనన్నింటిని ఈ రాణీ పీతికెను-44, అంబికతో గూడిన కామశంకరుడు త్రిలోకమునకేకరాజు పదివేలయేండ్లు ఒక క్షణమువలే గడచెను-45. అంత, ఒకసాడు భగవంతుడు ఋషియైన నారదుడు వినయముతో పరాశక్తికి నమస్కరించి యిట్లనెను-48. ఓ పరమేశ్వరి! నీవు పరబ్రహ్మవు. నీవే పరమమే పవిత్రమైన ధామమవు (స్థానము) సదసద్భావముల సంకల్పించుదానివి వికల్పించు దానివీ-47. జగముయొక్క యభ్యుదయము కొఱకే వ్యక్తభావమును బొందినదానివి. అసజ్జన వీసాశమే ప్రయోజనముగా గలదానివి. సజ్జనులయభ్యుదయమును గోరిన దానివి. నీ ప్రవృత్తియంతయు ఓ కల్యాణీ! సాధుసంరక్షణ కొరికే గదా-48. ఓదేవి! ఈ భండాసురుడు మూడు జగముల బోధించుచున్నాడు. నీ వొక్కరితమే వానిని జయింపగలవు. ఇతరులైన దేవతలకు సాధ్యముగాదు-49. నీ సేవయందే తత్పరులైన దేవతలు చిరకాలమిచటనేయుండిరి. నీయాజ్ఞచే పొరీ వారియిండ్లకు పురములకు బోగలరు-50. అమంగలములు శూన్యములైనవి. సత్త్వవంతములై సమృద్ధమైన ప్రయోజనములు గలవియైనవి- ఇట్లు నారదుడు విన్నవింపగా నాయఖిలేశ్వరి దేవతలను తమ తమ నివాసములకు వెళ్ళియుండుటకై పంపెను-51. అంబిక బ్రహ్మను, హరిని, శంభువును, ఇంద్రాది దీక్పాలకులను, వారివారికి తగినట్లు పూజించిపంపివేసేను-52. అట్లు పంపబడిన దేవతలు ఆమెను వదలిపెట్టుట ఆపరాధమని తలించిరి, కాని ఎవరికి వారు తమ యాత్మాంశలలో ఆదిపితరులైన మహేశ్వరీ మహేశ్వరుల సేవించునేయుండిరి-53. ఈ లలితోపాఖ్యానము ఆయుష్యమునిచ్చునది. సర్వమంగళములకు కారణము. విద్వాంసుడు భక్తి శ్రద్దలతో గూడినవాడై ప్రొద్దున లేచి మహాదేవియావిర్భావమును, ఆమె రాజ్యాభిషేచనమును జపించినచో ధన సమృద్ధి గలవాడై అమృతము వలె తీయగా మాటలాడు వాడగును-55. ఆతనికీ లోకమునగాని పరలోకమునగాని అశుభముండదు. విశాలమైన యశమును (కీర్తిని)బొందును. సమానులలో నుత్తమశ్లోకుడగును-56. అతనికి స్థిరమై చంచలముగొనీ లక్ష్మి లభించును. అడుగడుగున శ్రేయము చేకూరును. ఎప్పుడును భయము గలుగదు. తేజస్వియు వీర్యవంతుడును అగును-57. ఆధ్యాత్మిక, ఆధిభౌతిక ఆధిదైవిక తాపములంటవు. ధర్మార్థకామమోక్షములను నాలుగు పురుషార్థములతో నిండియుండును. సింహాసనేశ్వరుని మూడు సంధ్యలలో ధ్యానించి జపించిన వాడు జాపకోత్తముడు ఆరుమాసములలో మహాలక్ష్మిని బొందును-59.
ఇది బ్రహ్మాండమహాపురాణమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున వైవాహికోత్సవమను పదియేనవయధ్యాయము.
Summary of chapter 127 of the Brahmānda Mahā Purana is as follows:
In vivid narrative style, this chapter depicts the arrogant march of Bhandāsura's colossal army, led by formidable demon generals, toward the divine fortress of goddess Lalitā. It describes their terrifying weapons, dark incantations, and boundless pride as they attempt to challenge the divine army of Saktis. The faithful listener remains unshaken, knowing that no shadow of evil can ever withstand the blazing light of the supreme mother's grace.