బ్రహ్మాండ మహా పురాణము
36 - శేషమన్వంతరాఖ్యానము - పృథివీదోహనము
శాంశపాయన ఉవాచ :-
మన్వంతరాణి శేషాణి శ్రోతుమిచ్ఛామ్యనుక్రమాత్ ।
మన్వంతరాధిపాంశ్చైవ శక్రదేవపురోగమాన్ ॥
సూత ఉవాచ :-
మన్వంతరాణి యాని స్యురతీతా నాగతానీ హ ।
సమాసాద్విస్తరాచ్చైవ బ్రువతో మే నిబోధత ॥
స్వాయంభువో మనుః పూర్వం మనుః స్వారోచిషస్తథా ।
ఉత్తమస్తామసశ్చైవ రైవతశ్చాక్షుషస్తథా ॥
షడేతే మనవోఽతీతా వక్ష్యామ్యష్టావనాగతాన్ ।
సావర్ణిశ్చైవ రౌచ్యశ్చ భౌత్యో వైవస్వతస్తథా ॥
వక్ష్యామ్యేతాన్పురస్తాత్తు మనోర్వైవస్వతస్య చ ।
మనవః పంచ యేఽతీతా మానసాంస్తాన్ నిబోధత ॥
మన్వంతరం మయా వోఽద్య క్రాంతం స్వాయంభువస్య హ ।
అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి మనోః స్వారోచిషస్య హ ॥
ప్రజాసర్గం సమాసేన ద్వితీయస్య మహాత్మనః ।
ఆసన్వై తుషితా దేవా మనోః స్వారోచిషేంతరే ॥
పారావతాశ్చ విద్వాంసో ద్వావేవ తు గణౌ స్మృతా ।
తుషితాయాం సముత్పన్నాః క్రతోః పుత్రాః స్వరోచిషః ॥
పారావతాశ్చ వాశిష్టా ద్వాదశ ద్వౌ గణౌ స్మృతౌ ।
ఛందజాశ్చ చతుర్వింశద్దేవాస్తే వై తదా స్మృతాః ॥
దివస్పర్శోఽథ జామిత్రో గోపదో భాసురస్తథా ।
అజశ్చ భగవాంశ్చైవ ద్రవిణశ్చ మహాబలః ॥
శాంశపాయనుఁడు చెప్పెను :-
యథాక్రమము మిగిలిన మన్వంతరములగూర్చి, మన్వంతరాధిపుల గూర్చి, ఇంద్రుఁడు దేవతలు నాయకులనుగా గల వారిని గూర్చి వినఁగోరుచున్నాను.
సూతుఁడిట్లు చెప్పెను :
జరిగిపోయినట్టివియు, జరుగనట్టివి (జరుగునట్టివి)యునగు మన్వంతముల గూర్చి సంక్షేపముగను వివరముగను చెప్పుదును. తెలిసికొనుము. (2) ముందు చెప్పంబడబోవు మనువులారుగురు పూర్వముండెడివారు. పూర్వము (ముందుగా) స్వాయంభువ మనువు; తరువాత స్వారోచిష మనువు; తరువాత ఉత్తముఁడు, తామసుఁడు, రైవతకుఁడు, చాక్షువు మనువును. ఇంక భవిష్యత్మనువులు ఎనమండ్రను గూర్చి చెప్పెదను. వారీలో నల్వురు - సావర్ణి, రౌచ్యుఁడు, భౌత్యుఁడు, వైవస్వతుఁడును. (4) తరువాత వారిని జెప్పెద వైవస్వత మనువును ముందు వర్ణింతును. అతీతులయిన యైదుగురు మనువులను మనసులనుగా నెఱుంగుము (మనోజాతులు). (5) స్వాయంభువమనువు యొక్క మన్వంతరము పూర్వము వివరించితిని. ఇంక క్రమముగా, ద్వితీయుడయిన మనువు, మహాత్ముఁడునైన స్వారోచిష మనువు యొక్క ప్రజాసృష్టిని చేప్పెదను. స్వారోచిష మన్వంతరమున తుషితులు దేవతలు. (7} అట్టివారే విద్వాంసులయిన రావతులు. ఈ విధముగా ఇరువర్గములే (గణములే) సంస్కృతులు. క్రతువు పుత్రులు స్వారోచిషులు తుషిత యందు వారుద్భవించిరి. (8) పార్వతులు వాసిషులు. వారి వర్గములు రెండు. ఒక్కొక్కటి యందు పండ్రెండుగురు. ఛందజులు ఇరువదినలుగురు (24) దేవతలు. దివస్పర్ముఁడు, జామిత్రుఁడు, గోపదుఁడు, భాసురుఁడు, అజుఁడు, భగవానుడు, మహాబలుడయిన ద్రవిణుఁడు.(10)
ఆయశ్చాపి మహాబాహుర్మహోజాశ్చాపి వీర్యవాన్ ।
చికిత్వాన్విశ్రుతోయస్తు చాంశోయశ్చైవ పఠ్యతే ॥
ఋతశ్చ ద్వాదశస్తేషాం తుషితాః పరికీర్తితాః ।
ఇత్యేతే క్రతుపుత్రాస్తు తదాఽసన్సోమపాయినః ॥
ప్రాచేతాశ్చైవ యో దేవో విశ్వదేవస్తథైవ చ ।
సమంజో విశ్రుతో యస్తు హ్యజిహ్మశ్చారీమర్దనః ॥
ఆయుర్దానో మహామానో దివ్యమానస్తథైవ చ ।
అజేయశ్చ మహాభాగో యవీయాంశ్చ మహాబలః ॥
హోతా యజ్వా తథా హ్యేతే పరిక్రాంతః పరావతాః ।
ఇత్యేతా దేవతా హ్యాసన్మనోః స్వారోచిషాంతరే ॥
సోమపాస్తు తదా హ్యేతాశ్చతుర్వింశతి దేవతాః ।
తేషామింద్రస్తదా హ్యాసీద్విపశ్చిల్లోకవిశ్రుతః ॥
ఊర్జా వసిష్ట పుత్త్రశ్చ స్తంభః కాశ్యప ఏవ చ ।
భార్గవశ్చ తథా ప్రాణ ఋషభోంఽగీరసస్తథా ॥
పౌలస్యశ్చైవ దత్తోఽత్రిరాత్రేయో నిశ్చలస్తథా ।
పౌలహోఽథార్వరీవాంశ్చ ఏతే సప్తర్షయస్తథా ॥
చైత్రః కింపురుషశ్చైవ కృతాంతో విభృతో రవిః ।
బృహదుక్ధో నవః సేతుః శ్రుతశ్చేతి నవ స్మృతాః ॥
మనోః స్వారోచిషస్యైతే పుత్రా వంశకరాః ప్రభో ।
పురాణే పరిసంఖ్యాతా ద్వితీయం వైతదంతరమ్ ॥
మహాబాహుఁడైన ఆయుఁడు, వీర్యవంతుఁడయిన మహౌజసుఁడు, సువిదితుఁడైన చికిత్వానుఁడు, అంశుఁడు, పండ్రెండవ వాఁడయిన ఋతుఁడు. వీరందరు తుషితులుగా ప్రశంసింపబడిరి. వీరు క్రతు పుత్రులు. వీరందరు సోమపాయినులు. (సోమరసమును ద్రాగువారు). (12) ప్రకాశవంతుఁడయిన ప్రాచేతసుఁడు, విశ్వదేవుఁడు, సమంజుండు, ప్రఖ్యాతుఁడయిన అజిహ్వుఁడు, అరమర్ధనుఁడు, ఆయుర్దానుఁడు, మహామాను డు, దివ్యమానుఁడు, మహాభాగుఁడయిన అజేయుఁడు మహాబలుఁడైన యవీయానుఁడు (చిన్నవాఁడు) హోతా, యజ్వా వీరందరు పారావతులు. ఈ విధముగా పారావతులు పేర్కొనంబడిరి. వీరందరు స్వారోచిష మన్వంతరమున దేవతలు. (15) ఇరువది నలుగురు దేవతలు సోమపులు, లోకమున సర్వత్ర విశ్రుతుఁడయిన విపశ్చితుఁడు వారి ఇంద్రుఁడు. ((6) వసిష్ఠుని కుమారుఁడయిన ఊర్జుఁడు, కాశ్యప కుమారుఁడయిన స్తంభుఁడు, భృగు కుమారుఁడయిన ప్రాణుఁడు, అంగీరసుని కుమారుఁడగు దత్తుఁడు; అత్రి కుమారుఁడైన నిశ్చల ఆత్రేయుఁడు, పులహుని కుమారుఁడయిన అర్వరీవంతుఁడు వీరందరు సప్తర్షులు. (18) చైత్రుఁడు, కింపురుషుఁడు, కృతాంతుఁడు, విభృతుఁడు, రవి, బృహదుక్తుఁడు, నవుండు, సేతుఁడు, శ్రుతుఁడు. ఈ తొమ్మండుగురు స్వారోచిష మనువు యొక్క కుమారులు, వీరు మనువు యొక్క వంశోద్దారకులు; వారు పురాణములో చెప్పఁబడిరి. ఇది రెండవ మన్వంతరము.
సప్తర్షయో మనుర్దేవాః పితరశ్చ చతుష్టయమ్ । మూలం మన్వంతరస్యైతే తేషాం చైవాన్వయాః ప్రజాః ॥
ఋషీణాం దేవతాః పుత్త్రాః పితరో దేవసూనవః ।
ఋషయో దేవపుత్రాశ్చ ఇతి శాస్త్రే వినిశ్చయః ॥
మనోః క్షత్రం వీశశ్చైవ సప్తర్షిభ్యో ద్విజోత్తమః ।
ఏతన్మన్వంతరం ప్రోక్తం సమాసాచ్చ న విస్తరాత్ ॥
స్వాయంభువేన విస్తారో జ్ఞేయః స్వారోచిషస్య చ ।
న శక్యో విస్తరస్తస్య వక్తుం వర్షశతైరపి ॥
పునరుక్తబహుత్వాత్తు ప్రజానాం వై కులేకులే ।
తృతీయే త్వథ పర్యాయే ఉత్తమస్యాంతరే మనోః ॥
పంచ దేవగణాః ప్రోక్తాస్తాన్వక్ష్యామి నీబోధత ।
సుధామానశ్చ యే దేవాః యే చాన్యే వశవర్తినః ॥
ప్రతర్దనాః శివాః సత్యా గణా ద్వాదశకాః స్మృతాః ।
సత్యో ధృతిర్ధమో దాంతః క్షమః క్షామో ధ్వనిః శుచిః ॥
ఇషోర్జశ్చ తథా శ్రేష్ఠః సుపర్ణో ద్వాదశస్తథా ।
ఇత్యేతే ద్వాదశ ప్రోక్తాః సుధామానిస్తు నామభిః ॥
సహస్రధారో విశ్వాయుః సమితారో బృహద్వనుః ।
విశ్వధా విశ్వకర్మా చ మానసస్తు విరాజసః ॥
జ్యోతిశ్చైవ విభాసశ్చ కీర్తితా వంశ వర్తినః ।
అవధ్యోఽవరతిర్దేవో వసుర్ధిష్ణ్యోవిభావసుః ॥
విత్తః క్రతుః సుధర్మాచ, ధృతధర్మా యశస్విజః ।
రథోర్మిః కేతుమాంశ్చైవ కీర్తితాస్తు ప్రతర్దనాః ॥
సప్తర్పులు, మనువు, దేవతలు, పితరులు. ఈ చతుష్టయము మన్వంతరమునకు మూలము. వారి సంతానము ప్రజలు. (21) ఈ క్రింద చెప్పినది శాస్త్ర నిశ్చయము. దేవతలు ఋషుల పుత్రులు. పితరులు దేవతల సంతానము. ఇంక ఋషీశ్వరులు దేవతల పుత్రులు. మనువువలన క్షత్రియులు వైశ్యులు; సప్తరుల వలన బ్రాహ్మణులు కలిగిరి. ఈ విధముగా మన్వంతరము సూక్ష్మముగ చెప్పబడినది. అంతీయే కానీ సవిస్తరముగ కాదు, (23) స్వారోచిష మన్వంతరము యొక్క వివరములు, స్వాయంభువ మన్వంతరము వలనఁదెలిసికొనవలయును. అంతియే కానీ ఒక శతపరములలో నయినను దానిని విస్తరముగా వివరించుటకు శక్యము కాదు. దీనికి కారణము ప్రతి వంశము నుండియు, అనేకులయిన ప్రజలు పునః పునః ఉద్భవించి యుండుటయే. ఇంక ఉత్తమమైన తృతీయ మన్వంతరమున దేవతల యందు పంచగణములు మాత్రమే చెప్పం బడినవి. వానిని నేనిప్పుడు చెప్పెదను గ్రహింపుఁడు. వారు సుధామానులు, వశవర్తనులు, ప్రతర్దనులు, శివులు మరియు సత్యులు. వీరిలో ప్రతగణము పండ్రెండుగురు దేవతలను గలిగి యుండును. సత్యుఁడు, ధృతి, దముఁడు, దొంతుఁడు, క్షముఁడు, క్షాముఁడు, ధ్వని; శుచుఁడు, ఇషుఁడు, ఊర్జుఁడు, శ్రేషుఁడు, సుపర్ణుఁడు ఈ పండ్రెండుగురు సుధామానులుగా చెప్పబడిరి. (28) వంశవర్తినులు (వంశావర్తులు) వారు సహస్రధారులు, విశ్వాయువు, సమితారులు బృహత్తు వసువు, విశ్వధ, విశ్వకర్ముఁడు, మానసుఁడు, వీరాజసుఁడు, జ్యోతి, విభాసుఁడు వీరు వంశ వర్తినులుగా కీర్తింపఁ బడిరి. (30) ప్రతర్దనులు కీర్తింపఁబడిరి. వారు, అవధ్యుఁడు, అవరతి, ప్రభువయిన వసువు, ధిష్యుఁడు, విభావసు, విత్తుఁడు, క్రతువు, సుధర్ముండు, ధృతధర్ముఁడు, యశస్విజుఁడు, రథోర్మి కేతుమంతుఁడు (31)
హంసస్వారౌ వదాన్యౌ చ ప్రతర్దనయశస్కరౌ ।
సుదానో వసుదానశ్చ సుమంజసవిషానుభౌ ॥
యమో వహ్నిర్యతిశ్చైవ సుచిత్రః సుతపాస్తథా ।
శివా ఏతే తు విజ్ఞేయా యజ్ఞయా ద్వాదశాపరాః ॥
సత్యానామపి నామాని నిబోధత యథాతథమ్ ।
దిక్పతిర్వాకృతిశ్చైవ విశ్వః శంభుస్తథైవ చ ॥
స్వమృడీకో దీవిశ్చైవ వర్చోధామా బృహద్వపుః ।
అశ్వశ్చైవ సదశ్వశ్చ క్షేమానందౌ తథైవ చ ॥
సత్యా హ్యేతే పరిక్రాంతా యజ్ఞయా ద్వాదశాపరాః ।
ఇత్యేతా దేవతా హ్యాసన్నౌత్తమస్యాంతరే మనోః ॥
తేషామింద్రస్తు దేవానాం సుశాంతిర్నామ విశ్రుతః ।
పుత్రాస్త్వాంగీరసస్తే వై ఉత్తమస్య ప్రజాపతేః ॥
వసిష్ఠపుత్రాః సప్తాసన్వాసిష్ఠా ఇతివిశ్రుతాః ।
సప్తర్షయస్తు తే సర్వ ఉత్తమస్యాంతరే మనోః ॥
అజశ్చ పరశుశ్చైవ దివ్యో దివ్యౌషధిర్నయః ।
దేవాంబుజశ్చాప్రతిమౌ మహోత్సాహో గజస్తథా ॥
వినీతశ్చ సుకేతుశ్చ సుమిత్రః సుమతిః శ్రుతిః ।
ఉత్తమస్య మనోః పుత్త్రాస్త్రయోదశ మహాత్మనః ॥
ఏతే క్షత్రప్రణేతారస్తృతీయం చైతదంతరమ్ ।
ఔత్తమః పరిసంఖ్యాతః స్వర్గః స్వారోచిషేణ తు ॥
విస్తరేణానుపూర్వ్యా చ శామసశ్చ నిబోధత ।
చతుర్ధేశ్వథ పర్యాయే తామసస్యాంతరే మనోః ॥
సత్యాః సూరూపాః సుధియో హరయశ్చ గణాః స్మృతాః ।
పులస్త్యపుత్రాస్తే దేవాస్తామసస్యాంతరే మనోః ॥
యజ్ఞము నందు తమ భాగములను గ్రహించుటకు అర్హులైన వారు మరి పండ్రెండుగురు దేవతలు కలరు. వారు ప్రతర్గనులలో వదాన్యులయిన హంసస్వరులు, యశస్కరులు, సుదానుఁడు, వసుదోనుఁడు, సుమంజసుఁడు, వీశ్వుడు, యముఁడు, వహ్ని, యతి, సుచిత్రుఁడు, సుతపుడు. వీరందరు శివులుగా తెలిసికొనవలసినవారు. (33) సత్యవర్గమునకుఁ జెందిన ,దేవతలను, వారి పేరును దెలిసికొనుము.. పోరు దీకృతి, వాక్పతీ, వీశుఁడు, శంభువు, స్వమృడీకుడు, దీవి, వరోధాముఁడు, ఇృహద్వపుఁడు, అశ్వుఁడు, సదశ్వుండు, క్షేముఁడు, ఆనందుఁడు, యజ్ఞము నందు పాల్గొనుటకరులయిన పండ్రెండుగురు దేవతలు సత్యులుగా పరిగణీంపఁబడుచున్నారు. ఈ విధముగా వీరు ‘ఉత్తమ’ మన్వంతరమున భగవంతులు (దేవతలు). వీరందరు ఆంగీరసుఁడయిన ఉత్తమ ప్రజాపతి పుత్రులు. వారలలో (ఆ దేవతలలో) ‘సుశాంతి’ యను పేర ప్రసిద్దుం డయిన వాడు ఇంద్రుఁడు. (37) వసిష్ఠునకు ఏడుగురు పుత్రులు. వారు వాసిష్ఠులుగా ప్రఖ్యాతులు. ఉత్తమ మన్వంతరము వారందరును సప్తర్షులు. మహాత్ముఁడయిన ఉత్తమునకు పదీముగ్గురు మానసీక పుత్రులు. వారు అజుఁడు, పరశుఁడు, దివ్యుఁడు, దీన్యౌషధి, నయుఁడు, దేవాంబుజుండు, అప్రతిముఁడగు మహోత్సాహుఁడు, గజుఁడు, వినీతుఁడు, సుకేతుఁడు, సుమతి, శ్రుతి; వీరు క్షత్తమన్వంతరము. ఈ విధముగా స్వారోచిష మనువుతో సహా ఉత్తముని యొక్క సృష్టి వివరింపబడినది. (41) ఇంక విస్తరముగా ఆనుపూర్వీకముగా తామసుని (మనువుయొక్క సృష్టి నెఱుంగుఁడు. మనువయిన తామసుని నాలుగవ మన్వంతరమున చెప్పఁబడిన దేవతల వర్గములు - సత్యులు, సురూపులు, సుధీయులు, హరులు. ఈ దేవతలు తామస మన్వంతరమున పులస్త్యుని సంతానము. (43)
గణస్తు తేషాం దేవానామేకైకః పంచవింశకః ।
ఇంద్రియాణాం ప్రతీయేత ఋషయః ప్రతిజానతే ॥
సప్రమాణాస్తు శీర్షణ్యం మనశ్చైవాష్టమం తథా ।
ఇంద్రియాణి తథా దేవా మనోస్తస్యాంతరే స్మృతాః ॥
తేషాం బభూవ దేవానాం శిబిరింద్రః ప్రతాపవాన్ ।
సప్తర్షయోంఽతరే యే చ తాన్నిబోధత సత్తమాః ॥
కావ్య ఆంగీరసశ్చైవ కాశ్యపః పృథురేవ చ ।
ఆత్రేయస్త్వగ్నిరిత్యేవ జ్యోతిర్ధామా చ భార్గవః ॥
పౌలహశ్చరకశ్చాత్ర వసిష్ఠః పీవరస్తథా ।
చైత్రస్తథైవ పౌలస్త్య ఋషయస్తామసేంఽతరే ॥
జానుసంఘస్తథా శాంతీర్నరః ఖ్యాతిః శుభస్తథా ।
ప్రియభృత్యో పరీక్షిచ్చ ప్రస్థలోఽథ దృడేషుధిః ॥
కృశాశ్వః కృతబంధుశ్చ తామసస్య మనో:సుతాః ।
పంచమేత్వథ పర్యాయే మనోః స్వారోచిషేంఽతరే ॥
గణాస్తు యే సమాఖ్యాతా దేవానాం తాన్నిబోధత ।
అమితాభా భూతరయో వైకుంఠాః ససుమేధసః ॥
వరిషాశ్చ శుభాః పుత్త్రాః వాసిష్ఠస్య ప్రజాపతేః ।
చతుర్దశ తు చత్వారో గణాస్తేషాం సుభాస్వరాః ॥
ఉగ్రః ప్రజ్ఞోఽగ్నిభావశ్చ ప్రజ్యోతిశ్చామృతస్తథా ।
సుమతీర్వా విరావశ్చ ధామా నాదః శ్రవాస్తథా ॥
వృత్తిరాశీ చ వాదశ్చ శబరశ్చ చతుర్ధశ ।
అమితాభాః స్మృతాహ్యేతే దేవాః స్వారోషితాంఽతరే ॥
వీరిలో ఒక్కొక్క గణములో ఇరువది యైదుగురు దేవతలు. తామస మన్వంతరమున ఇంద్రియములు దేవతలుగా స్మరింపఁబడుచున్నారు. జ్ఞానేంద్రియముల మూలముననే జనులు విషయముల (వస్తువుల) గ్రహించెదరు. ఈ విషయమును ఋషులు నిశ్చయము చేయుదురు. వారి యొక్క ప్రమాణములున్నవి. ఎనిమీదవయది యైనదీ మనస్సుగా స్మరింతురు. (45) ప్రతాపవంతుఁడయిన శిబి ఈ దేవతల కధిపతి. ఆతఁడే ఇంద్రుఁడు. ఓ సత్తములారా ! ఆ మన్వంతరమందున్న ఏడుగురు ఋషులను దెలిసికొనుఁడు. వారు ఆంగీరస పుత్రుఁడయిన కావ్యుఁడు, కశ్యపుని పుత్రుఁడయిన పృథువు, అత్రి కుమారుఁడయిన అగ్ని, భృగు పుత్రుడయిన జ్యోతిర్గాముఁడు, పులహుని కుమారుఁడు చరకుఁడు, వసిష్ఠ సూనుడయిన పీవరుండు, పులస్త్యుని కుమారుఁడయిన చైత్రుఁడు. ముందు చెప్పఁబోవు వారు తామస మనువు యొక్క సంతానము. వారు జాను జంఘుఁడు, శాంతి, నరుఁడు, ఖ్యాతి, శుభుఁడు, ప్రియభృత్యుఁడు, పరీక్షిత్తు, ప్రస్థలుఁడు, దృఢీషుధి, కృశాశ్వుఁడు మరియు కృతబంధువు. వీరు తామసుని మానససుతులు. స్వారోచిషుని యొక్క యైదవ మన్వంతరమున చెప్పఁబడిన దేవతా వర్గముల నెఱుంగుము. (50) పోరు అమితాభులు, భూతదయులు, వైకుంఠులు, సుమేధసులు. వసిష్ఠుని యొక్క పవిత్రులయిన పుత్రులు. (వారు వాసిష్ట ప్రజాపతి బిడ్డలు?) ఈ నాల్లు గణముల యందు నొక్కొక్క దానిలో పదునాలుగురు సుభాస్వరులు కలరు. (52) ఉగ్రుఁడు, ప్రజుఁడు, అగ్నిభావుఁడు, ప్రజ్యోతి, అమృతుఁడు, సుమతి, విరావుఁడు ధాముఁడు, నాదుఁడు, శ్రవసుఁడు, వృత్తి, రాశి, వాదుఁడు, శబరుఁడు. ఈ పదునలుగురు అమితాభులయిన దేవతలుగా సంస్మృతులు. (54)
మతిశ్చ సుమతిశ్చైవ ఋతసత్యౌ తథైధనః ।
అధృతి ర్విధృతిశ్చైవ దమో నియమ ఏవ చ ॥
వ్రతో విష్ణుః సహశ్చైవ ద్యుతీమాన్సుశ్రవాస్తథా ।
ఇత్యేతానీహ నామాని ఆభూతరయసాం విదుః ॥
వృషో భేత్తా జయో భీమః శుచిర్ధాంతో యశో దమః ।
నాథో విద్వానజేయశ్చ కృశో గౌరో ధ్రువస్తథా ॥
కీర్తితాస్తు వికుంఠా వై సుమేధాస్తు నిబోధత ।
మేధా మేధాతిథిశ్చైవ సత్యమేధాస్తథైవ చ ॥
పృశ్నిమేధాల్పమేధాశ్చ భూయోమేధాశ్చ యః ప్రభుః ।
దీప్తిమేధా యశోమేధా స్థిరమేధాస్త థైవ చ ॥
సర్వమేధా సుమేధాశ్చ ప్రతిమేధాశ్చ యః స్మృతః ।
మేధజా మేధహంతా చ కీర్తితాస్తే సుమేధసః ॥
విభురింద్రస్తథా తేషామాషీద్విక్రాంతపౌరుషః ।
పౌలస్త్యో దేవబాహుశ్చ సుధామా నామ కాశ్యపః ॥
హిరణ్యరోమాంగీరసో వేదశ్రీశ్చైవ భార్గవః ।
ఊర్ధ్వ బాహుశ్చ వాసిష్టః పర్జన్యః పౌలహస్తథా ॥
సత్యనేత్రస్తధాత్త్రేయఋషయో రైవతేంఽతరే ।
మహావీర్యః సుసంభావ్యః సత్యకో హరహా శుచిః ॥
బలబంధుర్నిరామిత్రః కంబుః శృంగో ధృతవ్రతః । రైవతస్య చ పుత్రాస్తే పంచమం వై వదంతరమ్ ॥
స్వారోచిషశోత్తమోఽఽపి తామసో రైవతస్తథా ।
ప్రియవ్రతాన్వయా హ్యేతే చత్వారో మనవః స్మృతాః ॥
షష్ఠే ఖల్వపి పర్యాయే దేపా యే చాక్షుషేంఽతరే ।
ఆద్యాః ప్రసూతా భావ్యాశ్చ పృథుకాశ్చ దివౌకసః ॥
మహానుభావా లేఖాశ్చ పంచ దేవగణాః స్మృతాః ।
దివౌకసః సర్వ ఏవ ప్రోచ్యంతే మాతృనామభిః ॥
అభూతయసుల గణము వారి యొక్క నామములు ఇటీవని వారెరుంగుదురు. మతి, సుమతీ, ఋతుఁడు, సత్త్యుఁడు, ఏధనుఁడు, అధృతి, విధృతి, దముఁడు, నీయముఁడు, ప్రతుఁడు, విష్ణువు, సహుఁడు, ద్యుతిమంతుఁడు సుశ్రవసుఁడు. (56) వృషుఁడు, భేత్త, జయుఁడు, భీముఁడు, శుచి, దాంతుఁడు, యశుఁడు, దముఁడు, నాథుఁడు, అజేయుఁడు, విద్వాన్, కృశుఁడు, సౌరుఁడు, ధ్రువుఁడు, వీరందరు వైకుంఠులుగా కీర్తింపఁబడిరి. ఇంక సుమేధసులను వినుడు. మేధాతిథి, సత్యమేధుఁడు, పృశ్నిమేధుఁడు, అల్పమేధుఁడు, మేధుడు (ప్రభువు) దీప్తిమేధుఁడు, యశోమేధుఁడు, స్థిరమేధుఁడు, సర్వమేధుఁడు, సుమేధుఁడు, ప్రతిమేధుఁడు, మేధజుఁడు, మేధాహంతుఁడు వీరందరు సుమేధుసులుగా కీర్తింపః బడిరి. (60) వారికీ విక్రాంత పౌరుషుఁడు విభువు ఇంద్రుఁడు, రైవత మన్వంతరమున, పులస్త్యుని కుమారుఁడయిన దేవభాహుఁడు, కశ్యపుని సంతానమయిన సుధాముఁడు అంగీరసుని వంశీయుఁ డయిన హిరణ్యరోముఁడు, భృగు సంతానమయిన వేదశ్రీ, వసిష్ఠుని బిడ్డడయిన ఊర్ధ్వబాహు డు, పులహుని వంశీయుఁడయిన పర్జన్యుఁడు, అత్రీవంశీయుఁడయిన సత్యనేత్రుఁడు వీరు సప్తర్షులు, రైవతుని పుత్రులు. మహావీర్యుఁడు, సుసంభావ్యఁడు, సత్యకుఁడు, హరుడు, శుచి, బలబంధువు, నిరామిత్రుఁడు, కంబుఁడు, శృంగుఁడు, ధృతవ్రతుఁడును. ఇది యెదవ మన్వంతరము. (64) స్వారోచిషుఁడు, ఉత్తముఁడు, తామసుఁడు, రైవతుఁడు. ఈ నల్వురు మనువులు ప్రియవ్రతుని అన్వయులని భావింపం బడుచున్నారు. (65) ఆరవ మన్వంతరమున అనఁగా చాక్షుష మన్వంతరమున, పంచగణ దేవతలు భావింపఁబడుచున్నారు. వారు ఆద్యుఁడు, సూతుఁడు, భావ్యుఁడు, పృథుకుఁడు, మహాతేజోవంతుఁడయిన లేఖుఁడు, వీరందరు దివొకసులు; వీరందరు మాతృనామములచే చెప్పబడు చున్నారు. (67)
అత్రేః పుత్త్రస్య నప్తారో హ్యారణ్యస్య ప్రజాపతేః । గణస్తు తేషాం దేవానామేకైకో హ్యాష్టకః స్మృతః ॥
అంతరిక్షో వసుర్హవ్యో హ్యతిధిశ్చ ప్రియవ్రతః ।
శ్రోతా మంతానుమంతా చ త్వాద్యా హ్యేతే ప్రకీర్తితాః ॥
శ్యేనభద్రస్తథా చైవ శ్వేతచక్షుర్మహాయశాః ।
సుమనశ్చ ప్రచేతాశ్చ వనేనఃసుప్రచేతసౌ ॥
మునీశ్చైవ మహాసత్త్వ ప్రసూతాః పరికీర్తితాః ।
వీజయః సుజయశ్చైవ మనస్యోదౌ తథైవ చ ॥
మతిః పరిమితిశ్చైవ విచేతాః ప్రియనిశ్చయః ।
భవ్యా హ్యేతే స్మృతా దేవాః పృథుకాంశ్చ నిబోధత ॥
ఓజిష్ఠః శకునో దేవో వానహృష్టస్తథైవ చ ।
సత్కృతః సత్యదృష్టిశ్చ జిగీషుర్విజయస్తథా ॥
అజీతశ్చ మహాభాగః పృథుకాస్తే దివౌకసః ।
లేఖాంస్తథా ప్రవక్ష్యామి నామతస్తాన్నిబోధత ॥
మనోజవః ప్రఘాసశ్చ ప్రచేతాశ్చ మహాయశాః ।
ధ్రువో ధ్రువక్షితిశ్చైవ అచ్యుతశ్చైవ వీర్యవాన్ ॥
యువనా బృహస్పతిశ్చైవ లేఖాః సంపరికీర్తితాః ।
మనోజవో మహావీర్యాస్తేషామింద్రస్తదోభవత్ ॥
ఉత్తమో భార్గవశ్చైవ హవిష్మానంగిరః సుతః ।
సుధామా కాశ్యపశ్చైవ వశిష్ఠో విరజాస్తథా ॥
అతినామా చ పౌలస్త్యః సహిష్ణుః పౌలహస్తథా ।
మధురాత్రేయ ఇత్యేతే సప్త వై చాక్షుషేఽoతరే ॥
వారు ఆరణ్యప్రజాపతీ మనుమలు. ఆరణ్యుఁడు ప్రజాపతి, అతఁడు అత్రి కుమారుడు. వీరి గణములోక్కొక్కటి ఎనమండ్రు దేవతలు కలిగినవిగా భావింపఁబడుచున్నవి. (68) అంతరిక్షుఁడు, వసువు, హవ్యుఁడు, అతిథి, ప్రియవ్రతుఁడు, శ్రోత, మంత, అనుమంతయు. వీరు ఆద్యులుగా ప్రకీర్తితులు. (69) శ్యేనభద్రుఁడు, శ్వేతచక్షువు, మహాయశుఁడు, సుమనసుఁడు, ప్రచేతసుఁడు, నేనుఁడు, సుప్రచేతసుఁడు మహాసత్తుఁడయిన ముని వీరందరు ప్రసూతులుగా ప్రకీర్తితులు. (70) విజయుడు, సుజయుఁడు, మనుఁడు, స్యోదుఁడు (ఉదానుఁడు) మతి, పరిమతి, విచేతుఁడు, ప్రియనిశ్చయుఁడు ఈ దేవతలు భవ్యులుగా సంస్కృతులు. ఇఁక పృథుకులను నెఱుంగుము. (72) ఓజీషుఁడు, శకునుం డు, దేవుఁడు, వానహృష్ణుఁడు, సత్యదృష్టి, జిగీషుఁడు, విజయుఁడు, మహాభాగుఁడయిన (కీర్తిమంతుఁడయిన) అజితుఁడు - వీరు పృథుకులు. దివాకసులు (స్వర్గధాములు) లేఖులను దేవగణమును పేర్లతో చెప్పెదను, ఎలుంగుము. (74) మనోజవుఁడు, ప్రఘాసుఁడు, ప్రచేతసుఁడు, మహాయశుఁడు, ధ్రువుఁడు, ధ్రువక్షితి, వీర్యవంతుఁడయిన అచ్యుతుఁడు (75) యువనుఁడు, బృహస్పతి వీరు లేఖులుగా ప్రకీర్తితులు. మహావీర్యుం డయిన మనోజవుఁడు వీరలకు ఇంద్రుఁడయ్యెను. (76) భృగు కుమారుడు, ఉత్తముఁడు, అంగీరసుని సుతుఁడు హవిష్యుఁడు, కశ్యపసుతుఁడయిన సుధాముఁడు, వసిష్ఠకుమారుఁడయిన విరజసుఁడు, పులస్త్యసుతుఁడు అతినాముండు, పులహుని కుమారుఁడు సహీషుఁడు, అత్రికుమారు డయిన మధురాత్రేయుఁడు వీరేడుగురు చాక్షుషమన్వంతరమున ఋషులు. (78)
ఊరుః పురుః శతద్యుమ్న స్తపస్వీ సత్యవాక్కృతిః । అగ్నీష్టుదతీరాత్రశ్చ సుద్యుమ్నశ్చేతి తే నవ ॥
అభిమన్యుశ్చ దశమో నాడ్వలేయా మనోః సుతాః ।
చాక్షుషస్య సుతా హ్యేతే షష్ఠం చైష తదంతరమ్ ॥
వైవస్వతేన సంఖ్యాతస్తత్సర్గః సాంప్రతేన తు ।
విస్తరేణానుపూర్వ్యా చ చాక్షుషస్యాంతరే మనోః ॥
ఋషయః ఊచుః :-
చాక్షుషః కస్యదాయాదః సంభూతః కస్య వాఽన్వయే । తస్యాన్వవాయే యేఽప్యన్యే తాన్నో బ్రూహి యథాతథమ్ ॥
సూత ఉవాచ :-
చాక్షుషస్య విసర్గం తు సమాసాచ్ఛ్రుణుత ద్విజాః ।
యస్యాన్వవాయే సంభూతః పృథుర్వైన్యః ప్రతాపవాన్ ॥
ప్రజానాం పతయశ్చాన్యే దక్షః ప్రాచేతసస్తథా ।
ఉత్తానపాదం జగ్రాహ పుత్రమత్త్రిప్రజాపతిః ॥
దత్తకః స తు పుత్రోఽస్య రాజా హ్యాసీత్ప్రజాపతిః ।
స్వాయంభువేన మనునో దత్తోఽత్రే: కారణం ప్రతీ ॥
మన్వంతరమథాసాద్య భవిష్యచ్చాక్షుషస్య హ ।
షష్ఠం తదను వక్ష్యామి ఉపోద్ఘాతేన వై ద్విజాః ॥
ఉత్తానపాదాచ్చతురః సూనృతాఽసూత భామినీ ।
ధర్మస్య కన్యా సుశ్రోణీ సూనృతా నామ విశ్రుతా ॥
ఉత్పన్నాచాపి ధర్మేణ ధ్రువస్య జననీ శుభా ।
ధర్మస్య పత్న్యాం లక్ష్యాం వై ఉత్త్పన్నా సా శుచిస్మితా ॥
ధృవం చ కీర్తిమంతం చ త్వయుష్మంతం వసుం తథా ।
ఉత్తానపాదోఽజనయత్మన్యే ద్వే చ శుచిస్మితే ॥
స్వరా మనస్వినీ చైవ తయోః పుత్రాః ప్రకీర్తితాః ।
ధ్రువో వర్షసహస్రాణి దశ దివ్యాని వీర్యవాన్ ॥
ఊరు, పురు, శతద్యుమ్నుఁడు, తపస్పీ, సత్యవాక్కు కృతి అగ్నిష్టుతుఁడు, అతిరాత్రుండు, సుద్యుమ్నుఁడు, అభిమన్యుఁడు ఈ పదుగురు నడ్వలకు జనించిన చాక్షుష మనువు కుమారులు. ఇదీ ఆరవ మన్వంతరము. (80) జరుగుచున్న (సాంప్రతమైన) వైవస్వత మనువు ఆధారముగా ఆతని సృష్టి వర్ణింపఁబడినది. ఈ విధముగా చాక్షుష మన్వంతరము విస్తరముగా, ఆనుపూర్వికముగ వర్ణింపఁబడినది.
ఋషీశ్వరులిట్లు పలికిరి :
చాక్షుషుఁడెవని దాయాది? ఆతఁడెవ్వని అన్వయమున జన్మించెను? ఆయన్వయమున జన్మించిన యితరుల నెల్లరను మాకు యథాతథముగా చెప్పుము.
సూతుఁడిట్లు చెప్పెను :
ఓ ద్వీజులారా ! చాక్షుష మను సృష్టిని సంక్షేపముగా వినుఁడు. ఆ చాక్షుషుని వంశము నందే ప్రతాపవంతుఁడు వైన్యుఁడైన పృథువు పుట్టెను. (83) ప్రచేతసునీ కుమారుఁడయిన దక్షుఁడు, ఇతరులును, ప్రజాపతులు. ప్రజాపతియైన అత్రి ఉత్తానపాదుని పుత్రునిగా గ్రహించెను. ప్రజాపతి రాజగుట, ఆతడు (ఉత్తానపాదుఁడు) రాజయ్యెను. ఏదియో కారణమున స్వాయంభువమనువు అత్రీకి ఉత్తానపాదుని దత్తునిగా నొసంగెను. ఓ బ్రాహ్మణులారా ! ఇదీ ఉపోద్ఘాతముగా చాక్షుష మన్వంతరమును గూర్చి చెప్పెదను. (86) ధర్మునీ కూతురు, అందమయినది (చక్కని పీఱుందులు గల్గినది) సూనృతయని ప్రసిద్ధ నామ ధేయురాలు. ఆమె ఉత్తానపాదునికీ నల్గురు పుత్రులను కనెను. (87) పవిత్రురాలైన సూనృత ధ్రువుని యొక్క జనని. శుచిస్మితయైన సూనృత ధర్ముని పత్నియైన లక్ష్మికి జన్మించెను. ఉత్తానపాదుఁడు ధ్రువుని, కీర్తిమంతుని, ఆయుష్మంతుని, వస్తువును కుమారులుగాను, శుచిస్మిత అయిన స్వర, మనస్వినులను కుమార్తెలను గాను కనెను. వీరి పుత్రులింతకు పూర్వమే చెప్పఁబడిరి.
తపస్తేపే నిరాహారః ప్రార్థయన్ విపులం యశః ।
త్రేతాయుగే తు ప్రథమే పౌత్రః స్వాయంభువస్య తు ॥
ఆత్మానం ధారయన్యోగాన్ప్రార్థయస్ సుమహద్యశః ।
తస్మై బ్రహ్మా దదౌ ప్రీతో జ్యోతిషాం స్థానముత్తమమ్ ॥
ఆభూతసంప్లవాద్దివ్యమస్తోదయవివర్జితమ్ ।
తస్యాతమాత్రామృద్ధిం చ మహిమానం నిరీక్ష్య తు ॥
దైత్యాసురాణామాచార్య శ్లోకముప్యుశనా జగౌ ।
అహోఽస్య తపసో వీర్యమహోత్రుత హోవ్రతమ్ ॥
కృత్వా యదేనముపరి ధ్రువం సప్తర్షయః స్థితాః ।
ధ్రువే త్రిదివమాసక్తమీశ్వరః స దీవస్పతిః ॥
ధ్రువాత్సృష్టిం చ భవ్యం చ భూమిశ్రా సుషువే నృపౌ ।
స్వాం ఛాయామాహ వై సృష్టిర్భవ నారీతి తాం ప్రభుః ॥
సత్యాభివ్యాహృతేస్తస్య సద్యః స్త్రీ సాఽభవత్తదా ।
దీష్యసంహననా ఛాయా దివ్యాభరణభూషితా ॥
ఛాయాయాం సృష్టిరాదత్త పంచ పుత్త్రానుకల్మషాన్ ।
ప్రాచీనగర్భం వృషభం వృకం చ వృకలం ధృతిమ్ ॥
పత్నీం ప్రాచీనగర్భస్య సువర్చా సుషవే నృపమ్ ।
నామ్నోధారధియం పుత్రమింద్రో యః పూర్వజన్మనీ ॥
సంవత్సరసహస్రాంతే సకృదాహారమాహరన్ ।
ఏవం మన్వంతరం యుక్త ఇంద్రత్వం ప్రాప్తవాన్ ప్రభుః ॥
ఉదారధేః సుతం భద్రాఽజనయత్సా దివంజయమ్ ।
రిపుం రీపుంజయాజ్జజ్ఞే వరాంగీ తు దివంజయాత్ ॥
ప్రథమ త్రేతాయుగమున, స్వాయంభువ మనువు యొక్క పౌత్రుఁడు, మహావీర్యవంతుఁడునునైన ధ్రువుఁడు, పది సంవత్సరములు, భగవన్నిర్దేశమున, నిరాహారుండై తపమాచరించెను. ఆతఁడు మహాయశస్సు పొందవలయునని కోరెను. మహాయశస్సును ప్రార్థించీ ఆతఁడు యోగక్రియల నన్నింటి నాచరించెను. బ్రహ్మ ఆగనీ తపస్సు వలన ప్రీతుఁడయ్యెను. ఆతనికి జ్యోతిర్గణములలో నత్యుత్తమమయిన స్థానము నొసంగెను. అది దివ్యము. ఉదయాస్తమానవర్జితము, అయ్యది సర్వభూత ప్రలయము కలిగినను శాశ్వతము. ఆతని అతిమాత్ర వృద్ధిని మహిమను నిరీక్షించి, దైత్యులకు అసురులకు పురోహితుఁడయిన ‘ఉశనుఁడు’ ఈ శ్లోకమును గానము చేసేను. “అహోస్య తపసో వీర్య మహోత్రుతమహోవ్రతమ్” ఈతని తపః ప్రభావము ఎంత ఆశ్చర్యకరమైనదీ? ఈతని పాండిత్యమెంతటిది ! ఆతని పవిత్రతపశ్చరణమెంత యమోఘము! ఈ ధ్రువుని కుపరి భాగమున నుండి సప్తర్వులు చుట్టు నిలంబడి యుందురు. ధ్రువునకు స్వర్గము ఆసక్తమయి (సంబంధించి) యున్నది. ఈతఁడే దీవమున కీశ్వరుఁడు. ఈతఁడే దివస్పతి. (95) ధ్రువుని రాజ్జయైన ‘భూమి’ ‘సృష్టిభవుఁడు’ అను నిద్దర రోజులంగనియెను. (వీరు ధ్రువుని పుత్రులు), ప్రభువైనసృష్టి తన ఛాయతో “నారీభవ” స్త్రీని కమ్మనెను. ఆతఁడు సత్యవాక్కు అగుట, వెంటనే ఆ ఛాయ, దివ్య దేహ సౌందర్యముతో స్త్రీ యయ్యెను. దీప్యాభరణ భూషితయ్యేను. (97) సృష్టి తన భార్యయైన ఛాయయందు, పంచ పుత్రులను గనెను. వారకల్మషులు, వారు ప్రాచీనగర్బుఁడు 2. వృషభుఁడు. 3.వృకుడు, 4వృకలుఁడు, 5. ధృతీ (98) ప్రాచీన గరుని పత్నియైన సువర్చ ఉదారధీయను (పుత్రుని) రాజును కనెను. ఆతఁడు పూర్వజన్మ యందు ఇంద్రుఁడు. (99) మన్వంతరము వఱకు, సహస్ర వరానంతరమే ఆహారము గ్రహించుచు, యోగాచరణ మాచరించి యితఁడు ఇంద్రత్వమును పొందెను. (100) ఉదారథ్యొక్క సుతుఁడు దీనంజయుండు. ఆతఁడు భద్రకు జనించెను. (వెఱొకభార్య) వరాంగి రిపుని కనెను. ఇతఁడు దివంజయుని పుత్రుఁడు. ఆతఁడు తన శత్రువుల నెల్లర జయించెను. (101)
రిపోరాదత్త బృహాతీ చక్షుషం సర్వతేజసమ్ ।
తస్య పుత్త్రో మనుర్విద్వాన్ బ్రహ్మక్షత్రప్రవర్తకః ।
వ్యజీజనత్పుష్కరిణీ వారుణీ చాక్షుషం మనుమ్ ॥
ఋషయః ఊచుః :-
ప్రజాపతేః సుతా కస్మాద్వారుణీ ప్రోచ్యతేఽనఘ ।
ఏతదాచక్ష్వ తత్వైన కుశలో హ్యసి విస్తరే ॥
సూత ఉవాచ :-
అరణ్యస్యోదకః పుత్త్రో వరుణత్వముపాగతః ।
తేన సా వారుణీ జ్ఞేయా భ్రాత్రా ఖ్యాతిముపాగతా ॥
మనోరజాయంత దశ నడ్వలాయాం సుతాః శుభాః ।
కన్యాయాం సుమహావీర్యా విరజస్య ప్రజాపతేః ॥
ఊరుః పురుః శతద్యుమ్నస్తపస్వీ సత్యవాక్కృతిః ।
అగ్నిష్టుదతిరాత్రశ్చ సుద్యుమ్నశ్చేతి వై నవ ॥
అభిమన్యుశ్చ దశమో నడ్వలాయాం మనోః సుతాః ।
ఊరోరజనయత్పుత్రాన్ షడాగ్నేయీ మహాప్రభాన్ ॥
అంగం సుమనసం ఖ్యాతిం గయం శుక్రం ప్రజాజీనౌ । అంగాత్సునీథాపత్యం వై వేనమేకం వ్యజాయత ॥
తస్యాపరాధాద్వేనస్య ప్రకోపస్తు మహానభూత్ ।
ప్రజార్థమృషయో యస్య మమంథుః దక్షిణం కరమ్ ॥
జనితస్తస్య పాణౌ తు మథితే రూపవానృథుః ।
జనయిత్వా సుతం తస్య పృథుం ప్రథితపౌరుషమ్ ॥
అబ్రువంస్త్వేష వో రాజా ఋషయో ముదితాః ప్రజాః ।
స ధన్వీ కవచీ జజ్ఞే తేజసా నిర్దహన్నీవ ॥
వృత్తీనామేష వో దాతో భవిష్యతి నరాధిపః ।
పృథుర్వైన్యస్తథా లోకాన్ రరక్ష క్షత్రపూర్వజః ॥
‘రిపు’ని భార్య బృహతి. ఆమె చక్షుషుని కనెను. ఆ చక్షుషుఁడు సర్వతేజస్వీ ఆ చక్షుషుని కుమారుఁడు మనువు. ఆ మనువు మహా విద్వాంసుఁడు, ఆతఁడు బ్రాహ్మణ క్షత్రియ ప్రవర్తకుఁడు. వారుణీ, యను నామాంతరముగల పుష్కరిణి చాక్షుష మనువును కనెను. (102)
ఋషీశ్వరులిట్లు చెప్పిరి :
ఓ పాప రహితుఁడా ! వారుణి యనంబడునట్టి కూతురు ప్రజాపతికెక్కడిది? వివరించుట యందు నీవు కుశలుండవు. యథార్థముగా నీ విషయమును చెప్పుము.
సూతుఁడిట్లనియెను:
అరణ్యునీయొక్క కుమారుఁడయిన ఉదకుండు వరుణత్వమును పొందెను. అందుచే ఆమె వారుణి యైనది, తన సోదరునీ వలన ఆమె ఖ్యాతిని పొందినది. (104) ప్రజాపతియైన విరజుని కూతురు నడ్వల, ఆమె వలన మనువునకు పదిమంది కుమారులు కలిగిరి. వారు ఊరుం డు, పురుఁడు, శతద్యుమ్నుఁడు, తపస్వి, సత్యవాక్కు కృతి, అగ్నిష్ణుతుఁడు, అతిరాత్రుఁడు, సుద్యుమ్నుండు, పదవవాఁడు, అభిమన్యుఁడు, వీరు మనునకు నడ్వలకు కలిగినవారు. ఆగ్నేయి ఊరుని యందు మహాప్రభావులయిన ఆరుగురు పుత్రులంగనియెను. వారు అంగుఁడు. విఖ్యాత్మంతుం డగు సుమనుఁడు 3.గయుఁడు, 4. శుక్రుడు, 5. ప్రజుఁడు; 6. అజినుఁడు. అంగరాజు భార్య సునీథ. వారి కుమారుడు వేనుఁడు, (108) వేనుని అపరాధము వలన నధీకమయిన ప్రకోపము కలిగెను. (అలజడీ - విప్లవము). మహరులు పుత్రులకోలకు ఆవేనుని దక్షిణకరమును మథించిరి. ఆతని కరము మధింపఁబడఁగా సురూపవంతుఁడయిన పృథువు జనించెను. ప్రథత పౌరుషుఁడయిన పృథుని పుట్టింపజేసిన తరువాత ఋషులిట్లనిరి. ఓ ప్రజలారా ! సమ్ముదీతులు కండు. ఈతఁడు మీకు రాజు. ఆతఁడో ధనువుతో, కవచములో పుట్టెను. ఆతఁడు తన తేజస్సుచే లోకములను దహించునట్లుండెను. మీకందరకు ఈ రాజు వృత్తి (జీవనాధారము) నొసంగును. వేనుని కుమారుఁడయిన పృథువు, క్షత్రియులకాది. ఆతఁడు ప్రపంచమునంతటిని రక్షించెను. (112)
రాజసూయాభిషిక్తానామాద్యస్స వసుధాధిపః ।
తస్య స్తవార్థముత్పన్నౌ నిపుణౌ సూతమాగధౌ ॥
తేనేయం గౌర్మహారాజ్ఞా దుగ్ధా సస్యాని ధీమతా ।
ప్రజానాం వృత్తికామాసాం దేవైశ్చ ర్షీగణైః సహ ॥
పితృభిర్దానవైశ్చైవ గంధర్వైశ్చాపురోగణైః ।
సర్పైః పుణ్యజనైశ్చైవ పర్వతైర్వృక్షవీరుధైః ॥
తేషు తేషు తు పాత్రేషు దుహ్యమానా వసుంధరా ।
ప్రాదాద్యథేప్సితం క్షీరం తేన ప్రాణానధారయన్ ॥
శాంశపాయన ఉవాచ :-
విస్తరేణ పృథోర్జన్మ కీర్తయస్వ మహావ్రత! ।
యథా మహాత్మనా తేన పూర్వం దుగ్ధా వసుంధరా ॥
యథా దేవైశ్చ నాగైశ్చ యథా బ్రహ్మర్షిభిః సహా ।
యక్షై రాక్షసగంధర్వైరపురోభిర్యథా పురా ॥
యథా యథా చ వై సూత విధినా యేన యేన చ।
తేషాం పాత్రవిశేషాంశ్చ దోగ్ధారం క్షీరమేవ చ ॥
తథా వత్సవిశేషాంశ్చ త్వం నః ప్రబ్రూహి పృచ్ఛతాం ।
యథా క్షీరవిశేషాంశ్చ సర్వానేవానుపూర్వశః ॥
యస్మింశ్చ కారణే పాణిర్వనస్య మథితః పురా ।
క్రుద్దైర్మహర్షిభిః పూర్వైః కారణం బ్రూహి తద్ధి నః ॥
సూత ఉవాచ :-
కథయిష్యామి వో విప్రాః పృథోర్వైన్యస్య సంభవమ్ ।
ఏకాగ్రాః ప్రయతాశ్చైవ శుశ్రూషధ్వం ద్విజోత్తమాః ॥
నాశుద్ధాయ న పాపాయ నాశిష్యాయాహితాయ చ ।
వర్తనీయమిదం బ్రహ్మనావ్రతాయ కథంచన ॥
ధన్యం యశస్యమాయుష్యం పుణ్యం వేదైశ్చ సంమితమ్ ।
రహస్యమృషిభిః ప్రోక్తం శ్రుణుయాద్యోఽనసూయకః ॥
ఆ ప్రభువు రాజసూయ మాచరించి, అభిషిక్తులయిన వారిలో ప్రథముఁడు, ఆతని స్తోత్రము చేయుటకే నిపుణులయిన వంది మాగధు లుత్సన్నులైరీ. ధీమంతుఁడయిన యతనిచే ఈ గోవు నుండి (భూమి) జీవిత వృత్తిని కోరునట్టి ప్రజలకు, సస్యములు (వృక్షలతాదులు) పిదుకంబడినవి. దేవతలచే, మునిగణములచే, పితరులచే, దానవులచే, అప్సరలచే, సర్పములచే (నాగులచే), పుణ్యజనులచే (రాక్షసులు - పిశాచముల) పర్వతములచే, వృక్షములచే, లతలచే ఆయా వివిధ పాత్రముల యందు వసుంధర పితుకబడి వారు కోరినట్లుగా క్షీరము నొసంగెను.. తన్మూలమున ప్రజలు వారి ప్రాణావధారణము చేసికొనిరి. ఓ మహావ్రత ! ఓ మహాముని ! వివరముగా పృథువు యొక్క జనమును, పూర్వ మా మహాత్ముడైన పృథునిచే వసుంధర నుండి ఎట్లు క్షీరము పిదుకబడినది; ఆతఁడెట్లు దేవతలచే, నాగులచే, బ్రహ్మరులచే, యక్షులచే, రాక్షసులచే, గంధర్వులచే, అప్సరోగణముచే అనుగమింపఁబడెను? పూర్వము ఎట్లు ఏ సాధనమున క్షీరమును బీదికెనో విస్తరించి చెప్పుము. వారి పాత్ర విశేషము లెవ్వి ! పాలు పిదుకు వాడెవ్వఁడు? పాలెట్టివి? వారుపయోగించిన లేదూడలు (వత్సము) లెట్టివి. వీనిని గూర్చి యడుగునట్టి మాకు తెల్పుము. ఆ వసుంధర యొసంగిన క్షీర విశేషములఁ చెప్పుము. పూర్వము పూర్వులు క్రుద్దులునయిన మహరులచే వేనుని హస్తమేకారణమున మధితమైనది? తత్కారణములెవ్వి మా కొఱకు చెప్పుము (12) సూతుఁడిట్లు చెప్పెను. ఓ విప్రులారా ! పృథుని కుమారుఁడైన వేనునీ జననమును. మీకు చెప్పెదను. ఓ బ్రాహ్మణులారా ! ఏకాగ్రము, పరిశుద్ధము నయిన మనస్సులతో వినుఁడు, ఈ బ్రాహ్మణమును (వేదము నందలి గాధ) పవిత్రుఁడు కాని హానికీ, పోపునకు, వినయ భావమున శిష్యుడు కాని పానికి ఎవఁడు వ్యతిరేకుఁడో వానికి, ఏ పరిస్థితుల యందు ప్రతనిష్ఠ పూర్తి ఆచరింపని వానికి చెప్పరాదు. (123) ధన్యమయినది, యశస్కరము, ఆయుఃకరము, పుణ్యమయినది వేదసమ్మితము ఋషి ప్రోక్తమయిన యీ రహస్యమును అసూయారహితులరై వినుఁడు.
యశ్చైవం శ్రావయేన్మర్త్యః పృథోర్వైన్యస్య సంభవమ్ ।
బ్రాహ్మణేభ్యో నమస్కృత్య న స శోచేత్కృతాకృతమ్ ॥
గోప్తా ధర్మస్య రాజాసౌ బభూవాత్రిసమః ప్రభుః ।
అత్రివంశసముత్పన్నోహ్యంగో కామ ప్రజాపతిః ॥
తస్య పుత్త్రోఽభవద్వేనో సాత్యర్థం ధార్మికస్తథా ।
జాతో మృత్యుసుతాయాం వై సునీథాయాం ప్రజాపతిః ॥
స మాతామహదోషేణ వేనః కాలాత్మజాత్మజః ।
స ధర్మం పృష్ఠతః కృత్వా కామాల్లోకేష్వవర్తత ॥
స్థాపసాం స్థాపయామాస ధర్మాయైతాం స పార్థివః ।
వేదశాస్త్రాణ్యతిక్రమ్య సోఽధర్మే నిరతోఽభవత్ ॥
నిఃస్వాధ్యాయవషట్కారే తస్మిన్ రాజ్యం ప్రశాసతి । న పిబంతి తదా సోమం మహాయజ్ఞేషు దేవతాః ॥
న యష్టవ్యం న దాతవ్యమితి తస్య ప్రజాపతేః । ఆసీత్ప్రతిజ్ఞా క్రూరేయం వినాశే ప్రత్యుపస్థితే ॥
అహమీజ్యశ్చ పూజ్యశ్చ యజ్ఞే దేవద్విజాదిభిః ।
మయి యజ్ఞా విధాతవ్యా మయి హోతవ్యమిత్యపి ॥
తమతిక్రాంతమర్యాదమవదానుసంవృతమ్ ।
ఊచుర్మహర్షయః సర్వే మరీచిప్రముఖాస్తదా ॥
వయం దీక్షాం ప్రవేక్ష్యామః సంవత్సరశతం నృప ।
త్వం మాకార్షీరధర్మం వై నైష ధర్మః సనాతనః ॥
నిధనే సంప్రసూతస్త్వం ప్రజాపతీరసంశయః ।
పాలయిష్యే ప్రజాశ్చేతి పూర్వం తే సమయః కృతః ॥
తాంస్తథావాదీనః సర్వాన్భ్రహ్మర్షీనబ్రవీత్తదా ।
వేనః ప్రహస్య దుర్బుద్ధిర్విదితేన చ కోవిదః ॥
అది (ఆగాథ) వేదతుల్యము. ఇది యొక రహస్యము. ఋషులు చెప్పిరి. అసూయా రహితుఁడైన వ్యక్తి బ్రాహ్మణులకు నమస్కరించి యితరులకు వివరించిన, ఆతఁడు కృతాకృతకార్యముల గూర్చి పశ్చాత్తాప మొందవలసిన పనిలేదు. ‘అంగుఁడు’ అను మహారాజు కలఁడు. ఆ ప్రభువు అత్రి తుల్యుఁడు. అంతియేకాక అత్రి వంశసముద్భవుఁడు. అతఁడు ప్రజాపతి ధర్మగోష్ణ. ఆతనీ పుత్రుఁడు వేనుఁడు, ఆతఁడు ధార్మికాభిమానీకాఁడు. ఈతఁడు సునీథ కుదయించెను. సునీథ మృత్యువు యొక్క కూతురు. వేనుఁడు కాలుని (మృత్యువు) యొక్క కూతురయిన సునీథకు కలిగిన ప్రజాపతి. (127) వేనుఁడు తన మాతా మహుఁడయిన కాలుని దోషముచే కోలుని పుత్రికకు పుట్టెను. ఆ వేనుఁడు ధర్మమునకు తన పృష్ఠమును జూపి (ధర్మమును నుల్లంఘించి) కామ పరుఁడై తన యిష్టము వచ్చినట్లే లోకమున ప్రవర్తించెను. (128) ఆ ప్రభువు (వేనుఁడు) ధర్మ క్రియాకలాపములను వేద విధులను స్తంభింపజేసెను. వేదానుశాసనము నతిక్రమించి అధర్మ కార్య నిరతుం డయ్యెను. (129) ఆతఁడు వేదాధ్యయన క్రియను పరిత్యజించెను, వేదాధ్యయనమునకు విరుద్ధ శాసన మొనర్చెను. యజ్ఞ సంబంధవషట్కారములు లేవు. ఆతఁడు రాజ్యము పరిపాలింప మహాయజ్ఞముల యందు దేవతలు సోమమును గ్రహింపలేదు. “యజ్ఞము లాచరింపరాదు. (నయష్టవ్యం) దానము లీయరాదు (నదాతవ్యం) అను క్రూరమయిన ప్రతిజ్ఞ, స్వవినాశనమునకు ఆసన్నమయ్యెను. అప్పుడు ఆ ప్రజాపతి “నేనే పూజింపం బడవలయును. నేను యజ్ఞముల దేవరులచే బ్రాహ్మాణాదులచే గౌరవింపఁబడవలయును. యజ్ఞములు నా యందే చేయవలయును (నాకే యొనర్పవలెను). నన్నే ధ్యేయముగా హోమములు ఆచరింపఁ బడవలయును. (182) ఆతఁడు మర్యాదావధులను నతిక్రమించి గర్వపూరితుం డయ్యెను. ఇట్టి వీరకృత్యము లెన్నింటికో ఆతడధిపతి. మహరు లందరు మరీచి నాయకత్వమున ఆతనితో నిట్లనిరి. “ఓ రాజా ! వత్సరశత యుతమైన యొక దీక్షను మేము పూనుచున్నాము. ఇట్టి అధర్మ కృత్య మాచరింపకుము. ఇది సనాతన ధర్మము కాదు (నీవాచరించు అధర్మక్రియలు), నీవో యముని వంశమున పుట్టితివీ, అసంశయముగా నీవే ప్రజాపతివి. ఇంతకుఁబూర్వము “ప్రజలను సవ్యముగా పాలించెదనని సమయమొండు (ప్రతిజ్ఞ) చేసియుంటివి. ఈ విధముగా బ్రహ్మవాదులు పలుకగా దుర్బుద్ధియైన వేనుఁడు వికటాట్టహసము చేసి ‘నాకు తెలిసిన విషయములు నెఱింగిన కోవిదుఁడెవఁడు. (156)
స్రష్టా ధర్మస్య కశ్చాన్యః శ్రోతవ్యం కస్య వా మయా ।
వీర్యేణ తపసా సత్యైర్మయా వా కః సమో భువి ॥
మందాత్మానో న నూనం మాం యూయం జానీత తత్త్వతః ।
ప్రభవం సర్వలోకానాం ధర్మాణాం చ విశేషతః ॥
ఇచ్ఛన్ దహేయం పృథివీం ప్లావయేయం జవేన పో ।
సృజేయం వా గ్రసేయం వా సాత్ర కార్యా విచారణా ॥
యదా న శక్యతే స్తంభాదనార్యభృశసంహితః ।
అనునేతుం తదా వేనస్తతః క్రుద్ధా మహర్షయః ॥
నిగృహ్యం తం చ బాహుభ్యాం విస్ఫురంతం మహాబలం ।
తతోఽస్య వామహస్తం తే మమంథుః భృశకోపితాః ॥
తస్మాత్ప్ర మథ్యమానాద్వై జజ్ఞే పూర్వమితి ప్రతీః ।
హ్రస్వోఽతి మాత్రం పురుషః కృష్ణశ్చాపి బభూవ హ ॥
స భీతః ప్రాజంలిశ్చైవ తస్థివానాకులేంద్రియః ।
తమార్తం విహ్వలం దృష్ట్వా నిషేదేత్యబ్రువన్ కిల ॥
నిషాదవంశకర్తాసౌ బభూవానంతవిక్రమః ।
ధీవరానసృజచ్చాపి వేనకల్మషసంభవాన్ ॥
యే చాన్యే వింధ్యనిలయాస్తంబురాస్తుంబురాః ఖశాః ।
అధర్మరుచయశ్చాపీ విద్ధితాన్వేనకల్మషాన్ ॥
ధర్మసష్ట వేడొకఁడు నా కంటే నెవఁడు? ఎవరి పలుకులు (శ్రోతవ్యం) నేను విని ఆచరించవలెను. వీర్యము నందు గానీ, తపస్సుచేగానీ, సత్యము నందు గాని ఈ ప్రపంచమున నెవ్వడు నాకు సమానుఁడు? మీరందరు మందబుద్దులరు. మీరు యథార్థముగా నన్నెఱుంగరు నేను సమస్తమయిన లోకమునకు అందును విశ్లేషించి ధర్మములకును ఆధారభూతుఁడనయిన ప్రభవస్థానమును. నేనే కోరినచో యావదూమిని దహింపఁగలను లేదా జలములచే ప్రపంచమును ముంచెత్తగలను. నేను సృజింతును లేదా గ్రసింతును. ఈ విషయమున నెట్టి సంశయము (విచారణ) అవసరము లేదు.” (139) అత్యధికముగా వేనుఁడు గర్వోద్రేకమున ప్రతిఘటించేను. ఆతని దౌష్ట్య ప్రవృత్తి నుండి నివారింప నశక్యము కాగా మహరులంరదు సంక్రుద్దులయిరి. ఆతఁడు అధికముగా పెనుగులాడు కొనుచుండ, సంక్రుద్ధులయిన మహర్పులు ఆతనిని రెండు చేతులు గట్టిగా పట్టిరి. ఆతఁడో ప్రకాశవంతుఁడు, మహాబలుడు. వారాతని వామహస్తమును విరిచి పట్టిరి. ఆ మహారాజు వామ హస్తమును మిక్కిలిగా కుపితులయిన ఋషులు మథించిరి. (141) ఇట్లు మధింపంగా మొట్టమొదట హ్రస్వాకృతి గల యొక పురుషుండుదయించెననీ విందుము. ఆ వ్యక్తి (పుట్టినవాఁడు) నల్లగ నుండెను. (142) ఆతఁడు అత్యధికముగా భీతుఁడయ్యెను.దోసిలి యొగ్గి ఆ కులేంద్రియుఁడై యందు నీలంబడెను విహ్వలుఁడు, విచారథిన్నుఁడునయిన యతనిని (ఆహస్వపురుష వ్యక్తిని) చూచి " నీమీద కూర్చుండుము)” అనీ ఆ ఋషీశ్వరులనిరి (143) ఆతఁడు అనంత విక్రముండై ‘నీషాద’ వంశమునకు కర్తయయ్యెను. అంతియేకాక ఆతఁడే వేనుని పాపముల నుండి ధీవరులను ()జలరులను) సృజించెను.(144) వింధ్య పర్వతము నివాసముగా గల ఇతర - ఆరణ్య జాతులయిన తంబురులు, తుంబురులు, ఖశులు మొదలగువారు అధర్మ క్రియాభిరుచులు, వేనునీ కల్మషము నుండి సంభవించిన వారినిగా దెలిసికొనుము.
పునర్మహర్షయస్తస్య పాణిం వేనస్య దక్షిణం ।
అరణీమిప సంరబ్ధా మమంథుర్జాతమన్యవః ॥
పృధుస్తస్మాత్సముత్పన్నః కరాజ్ఞలజసన్నిభాత్ ।
పృధోః కరతలాద్వాపి యస్మా జ్జాతః పృథుస్తతః ॥
దీప్యమానాచ్చ వపుషా సాక్షాదగ్నీరీవ జ్వలన్ ।
ఆద్యమాజగపం నామ ధనుర్గృహ్య మహారవమ్ ॥
శరాంశ్చ బిభ్రద్రక్షార్థం కవచం చ మహాప్రభమ్ ।
తస్మిజ్ఞా తేఽథ భూతానీ సంప్రహృష్టాని సర్వశః ॥
సమాపేతుర్మహారాజం వేనశ్చ త్రీదివం గతః ।
సముత్పన్నేన రాజర్షి సత్ప్రుత్రేణ మహాత్మనా ॥
త్రాతః స పురుషవ్యాఘ్రః పున్నామ్నో నరకాత్తదా ।
తం నద్యశ్చ సముద్రాశ్చ రత్నాన్యాదాయ సర్వశః ॥
అభిషేకాయ తోయం చ సర్వ ఏవోపతస్థిరే ।
పితామహశ్చ భగవాన్ అంగిరోభిః సహామలైః ॥
స్థావరాణి చ భూతాని జంగమాని చ సర్వశః ।
సమాగమ్య తదా వైన్యమభ్యషించన్నరాధిపమ్ ॥
మహతా రాజరాజేన ప్రజాపాలం మహాద్యుతిమ్ ।
సోఽభిషిక్తో మహారాజో దేవైరంగిరసః సుతైః ॥
ఆదిరాజో మహాభాగః పృథుర్వైన్యః ప్రతాపవాన్ ।
పిత్రాపరంజీతాస్తస్య ప్రజాస్తేనానురంజితాః ॥
తతో రాజేతీ నామాస్య హ్యనురాగాదజాయత ।
ఆపస్తస్తంభిరే తస్య సముద్రమభియాస్యతః ॥
పర్వతాశ్చావదీర్యంత ధ్వజభంగశ్చ నాభవత్ ।
అకృష్టపచ్యా పృథివీ సిద్ద్యంత్యన్నాని చింతయా ॥
సర్వకామదుఘా గావః పుటకే పుటకే మధు ।
ఏతస్మిన్నేవ కాలే తు యజతస్తస్య వై మభే ॥
మరల క్రుద్ధులయిన మహర్షులు వేనుని యొక్క దక్షిణ హస్తమును అరణిని వలె (యజ్ఞ యాగాదుల యందు రెండు కఱ్ఱలను ఒకదానిపై నొకదాని నుంచీ, పైదానీ నొక్కిపట్టి మథనము చేయగా అగ్నీ పుట్టును. ఆ అగ్ని జనకములయిన కర్రలకు అరణులనీపేరు) అధికముగా కోపోద్రిక్తులై మథించిరి. పద్మమువలె నున్న ఆ వేనుని కరము నుండి పృథువు పుట్టెను. పెద్దదియయిన కరతలము నుండి పుట్టుటచే ఆతఁడు పృథువయ్యెను. సాక్షాదగ్నివలె ప్రజ్జ్వలించు ప్రకాశవంతమయిన శరీరముతో, నతఁడొప్పెను. ఆద్యమయిన ఆజగవ మనునదియు మహారవము చేయునట్టిదియు నగు ధనువు నాతఁడు వహించును. ప్రజా రక్షణము కొఱకు భద్రము కొఱకు శరములను మహాకాంతి మంతమయిన కవచమును దాల్చెను. ఆతఁడుద్భవింపఁగా అంతటను సర్వ భూతకోటియు అత్యంతానందమొందెను. వారందరు మహారాజయిన పృథువును సమీపించిరి. వేనుడు స్వర్గస్థుడయ్యెను. రాజర్షియైన యాతడు తన పుత్రుడైన పృథునిచే పున్నామ నరకము నుండి రక్షింపఁబడెను. నదులు, సముద్రములు అన్నింటి నుండి రత్నములను తీసికొనివచ్చి అభిషేకార్థము జలములతో ఉపస్థితములై యుండెను. పితామహుఁడగు బ్రహ్మ ఆంగీరసునితోడను, దేవతల తోడను వచ్చేను. స్థావరములు జంగమములయిన భూతములు అన్ని దిక్కుల నుండి వైన్యుఁడైన పృథువును వచ్చి చేరుకోనెను. పృథువు నరాధిపతి. మహాద్యుతిమంతుఁడు. ఆతనిని పవిత్రోదకములచే వారభిషేకించిరి. మహారాజయిన పృథువు, అంగీరస కుమారులయిన దేవతలచే నభిషేకింపఁబడెను. ప్రతాపవంతుఁడు, వేనుని కుమారుఁడునయిన పృథువు మొట్టమొదటిరాజు ఆదీరాజు మహానుభావుం డు. ఆతని ప్రజలు తండ్రియయిన వేనునిచే పీడింపఁబడిరి. కాని తరువాత ఆ పృథువుచే ననురంజితులయిరి. (155) అప్పటి నుండి ప్రజల యనురాగముచే ఆతఁడు “రాజు” నామము చెందెను. పృథువు సముద్రము పై దండెత్త జలములు స్తంభించినవి. పర్వతములు పొడియై నేలకొరిగినవి. అంతీయేకాని పృథు పతాక భంగము కాలేదు. దున్నబడకుండగనే భూమి భూరి సస్యమును పండచేను అందరి కోరికల ననుసరించి ఆవులు పాలొసంగినవి కోర్కెలఁదీర్చినవి.
సోమే సుతే సముత్పన్నః సూతః సౌత్యే తదాహని । తస్మిన్నేవం సముత్పన్నే పునర్జజ్ఞేఽథ మాగధః ॥
సామగేషు చ గాయత్సు శుభాండే వైశ్వదేవికే ।
సమాగతే సముత్పన్నస్తస్మాన్మాగధ ఉచ్యతే ॥
ఇంద్రేణ హవిషా చాపి హవిః పృక్తం బృహస్పతేః ।
జుహావేంద్రాయ దైవేన తతః సూతో వ్యజాయత ॥
ప్రమాదస్తత్ర సంజజ్ఞే ప్రాయశ్చిత్తం చ కర్మసు ।
శిష్యహవ్యేన యత్పృక్తమభిభూతం గురోర్హవిః ॥
అధరోత్తరచారేణ జజ్ఞే తద్వర్ణవైకృతమ్ ।
యచ్చ క్షత్రాత్సమభవ ద్భ్రాహ్మణ్యం హీనయోనితః ॥
సూతః పూర్వేణ సాధర్మ్యాత్ తుల్యధర్మః ప్రకీర్తితః ।
మధ్యమో హ్యేష సూతస్య ధర్మః క్షత్రోపజీవనమ్ ॥
రథనాగాశ్వచరితం జఘన్యం చ చికిత్సతమ్ ।
పృథుస్తవార్థం తౌ తత్ర సమాహూతౌ మహర్షభిః ॥
తావూచుర్మునయః సర్వే స్తూయతామేష పార్ధివః ।
కర్మైతదనురూపం చ పాత్రం చాయం నరాధిపః ॥
తావూచతుస్తతః సర్వాంస్తానృషీన్ సూతమాగధౌ ।
అపాం దేవానృషీంశ్చైవ ప్రీణయావః స్వకర్మతః ॥
న చాస్య విద్వో వై కర్మ న తథా లక్షణం యశః ।
స్తోత్రం యేసాస్య కుర్యావ ప్రోచుస్తేజస్వినో ద్విజాః ॥
ఏష కర్మరతో నిత్యం సత్యవాక్సంయతేంద్రీయః ।
జ్ఞానశీలో వదాన్యశ్చ సంగ్రామేష్వపరాజితః ॥
ఋషిభిస్తౌ నియుక్తౌ తు భవిష్యైః స్తూయామితి ।
యాని కర్మాణి కృతవాన్ పృథుః పశ్చాన్మహాబలః ॥
ప్రతి పుష్పమును మధుసంపన్నమయ్యెను. ఆ సమయముననే పృథువు యజ్ఞ మాచరించుచుండ, సోమము పిండబడుచుండగా దీనమున సూతుఁడు సౌత్యమున నుద్భవించెను. సూతుని ఆవిర్భావమీవిధముగా జరుగగా స్తోత్ర పాఠకుండయిన మాగధుఁడు పుట్టెను, (వంది మాగధులలో నితఁడు రెండవవాఁడు) (159) సామవేద వేత్తలు గానము చేయుచుండిరి. విశ్వేదేవతల భాండము నుండి మాగధుడు పుట్టెను. అందుచేతనే ఆతఁడు మాగధుఁడని పిలువఁబడెను. (160) బృహస్పతి కొసంగిన హవిస్సులు ఇంద్రునకొసంగిన హవిస్సులతోఁ గలిసి పోయేను. అది దైవికముగా నింద్రునకు హోమము చేయబడెను. అప్పుడు సూతుఁడు పుట్టెను. (161) అందుచే నచ్చటోక ప్రమాదము సంభవించెను. యజ్ఞకర్మల యందు ప్రాయశ్చిత్తము కలిగినది. శిష్యునీ యొక్క హవ్యముతో గురువున కర్పించిన హవిస్సు కల్సిపోయినదీ. (162) అధమ ఉత్తమముల సంసర్గముచే వర్ణవైకృతము కలిగినది. అది యెట్లన - క్షత్రియహీనయోనినుండీ బ్రాహ్మణ్యము జనించినది. సూతుఁడు తనకు ముందు పుట్టిన వానీతో సాధర్మ్యమును పొందెను. ఆతఁడాతనితో తుల్యధర్ముండని కీర్తింపబడెను. క్షత్రియ ధర్మములు సూతునకు మధ్య ధర్మములు. ఆ సూతుని ధర్మములు, రథములను భద్రముగా నుంచుట, రథములు, గజములు, అశ్వములు, వీని నిర్వహాణము. ఈ వృత్తి అధమమయినవిధి. పృథువును స్తోత్రము చేయుటకు సూతుఁడు, మాగధుడును అచ్చటకు మహరులచే పిలువబడిరి. ఋషీశ్వరు లందరా సూతమాగధులతో మీరీ రాజును స్తుతిగావింపుఁడు. ఈ కార్యము మీ కరమయినదీ, ప్రజాపతియైన యీ రాజు స్తోత్రము చేయబడుటకు అరుండు.” అనీరి. అంత సూతమాగధులు ఋషులతో నిట్లనిరి”, మా కార్య కలాపములచే మేము దేవతలను ఋషీశ్వరులను సంతోషపెట్టెదము. అంతియేకాని యీ మహారాజు యొక్క మహత్కార్యములుగానీ, లక్షణములుగాని, కీర్తి విశేషముగానీ, స్వభావముగాని మేమెఱుంగము. అందుచే ఎట్లు మేము స్తోత్రము చేయుదుము ! అప్పుడు తేజస్వులయిన బ్రాహ్మణులిట్లు చెప్పిరి. (168)
తాని గీతనిబద్ధాని హ్యస్తుతాం సూతమాగధౌ ।
తతస్తవాంతే సుప్రీతః పృథుః ప్రాదాత్ప్రజేశ్వరః ॥
అనూపదేశం సూతాయ మగధం మాగధాయ చ ।
తదాది పృథివీపాలాః స్తూయంతే సూతమాగధైః ॥
ఆశీర్వాదైః ప్రబోధ్యంతే సూతమాగధవందీబిః ।
తం దృష్ట్వా పరమప్రీతాః ప్రజా ఊచుర్మహర్షయః ॥
ఏష వృత్తిప్రదో వైన్యో భవిష్యతి నరాధిపః ।
తతో వైన్యం మహాభాగం ప్రజాః సమభిదుద్రువుః ॥
తం నో వృత్తిం విధత్స్వేతి మహర్షివచనాత్తదా ।
సోఽభిద్రుతః ప్రజాభిస్తు ప్రజాహితచికీర్షయా ॥
ధనుర్గృహీత్వా బాణాంశ్చ వసుధామాద్రవత్భలీ ।
తతో వైన్యభయాత్రస్తా గౌర్భూత్వా ప్రాధ్రవన్మహీ ॥
తాం పృథుర్ధనురాదాయ ద్రవంతీమన్వధావత ।
సా లోకాన్భ్రహ్మలోకాధీనత్వా వైన్యభయాత్తదా !॥
సందదర్శాగ్రతో వైన్యం కార్ముకోద్యతపాణికం ।
జ్వలద్భిర్నిశి తైర్భాణైః దీప్తతేజసమచ్యుతమ్ ॥
మహాయోగం మహాత్మానం దుర్ధర్షమమరైరపి ।
అలభంతీ తు సా త్రాణం వైన్యమేవాన్వపద్యత ॥
ఈ రాజు నిత్యము స్వకర్మతుఁడు. సత్యవచస్వి. జితేంద్రియుఁడు, జ్ఞానశీలుఁడు, వదాన్యుఁడు. సంగ్రామముల యందపరాజితుఁడు. సూతమాగధులిర్వురు ఋషులచే వానిని కీర్తింప నియోగీంపఁబడిరి. ఆతనిని ఆతని భవిష్యత్కార్య కలాపాలను స్తోత్రము గావింపుఁడు అనిరి. సూతుఁడు మాగధుఁడును పరాక్రమ వంతుఁడయిన పృథు మహారాజును పూర్వ విజయ కర్మాదులచే స్తోత్ర మాచరించిరి. (170) స్తవాంతము నందు పృథు మహారాజు మీక్కిలి సంప్రీతుఁడయ్యెను. ఆ ప్రజాపతి సూతునకు ‘అనూప’ దేశమును {మాల్వాకు దక్షిణమున నున్నట్టిది), మాగధునకు మగధ దేశము నొసంగెను. అది మొదలుగా సూత మాగధులు పృథివీ పాలురను స్తోత్రము చేయుచున్నారు. రాజులు సూత మాగధుల వందుల యొక్క ఆశీర్వాదములతో నిద్ర మేల్కొందురు. ఆతనిని చూచి ప్రజలు పరమ ప్రీతులైరి. మహర్షులు - “నరాధిపుండైన, వైన్యుఁడు, మీకు ఇట్టి జీవితాధారపు వృత్తినిచ్చెను.” అనిరి. అంత ప్రజలు మహాభాగుఁడైన వైన్యుని కడకేగిరి. “మహర్షి వచనానుగుణముగ మాకు ఆధార భూతమగు వృత్తినిమ్ము ఈ విధముగా ప్రజలు తన్ను చేరి అర్జింపఁగా ప్రజాపాలకుడయిన వైన్యుఁడు, ప్రజలకు హితమాచరించు కోరికతో ధనుర్బాణములను గ్రహించి, ‘వసుధ’ వైపు తొందరగా వెళ్లాను. అంత వైన్య భయముచే భూమి గోరూపమును దాల్చి పరువెత్తెను. (176) పృథువు ధనువును దాల్చి, ఆ గోరూప పృథ్వి పరువెట్టుచునుండ దాని ననుసరించెను. వేనుని కుమారుని యందలి భయముతో నది బ్రహ్మలోకమునకు ఇతర లోకముల కరిగెను. తుదకు తన ముందు ఉద్యత కార్ముకుఁడయి ప్రకాశించు వాడియైన బాణములతో కూడి దీప్తతేజుం డు అచ్యుతసముఁడు మహాయోగీ మహాత్ముఁడు దేవతలచేఁగూడ జయింపబడరానివాఁడు అయిన వైన్యుని చూచెను. రక్షణ మీతరత్ర లభింపమిచే అయ్యది వైన్యునే పొందెను.
కృతాంజలిపుటా దేవీ పూజ్యా లోకైస్త్రిభిః సదా ।
ఉవాచ వైనం నాధర్మః స్త్రీవధే పరిపశ్యతి ॥
కథం ధారయితా చాసి ప్రజా యా వర్థితా మయా ।
మయి లోకాః స్థితా రాజన్ మయేదం ధార్యతే జగత్ ॥
మత్కృతేన వినశ్యేయుః ప్రజాః పార్థివ వర్థితాః ।
స మాం నార్హసి వై హంతుం శ్రేయస్త్వం చ చికీర్షసి ॥
ప్రజానాం పృథివీపాల శ్రుణు చేదం వచో మమ ।
ఉపాయతః సమారబ్ధా సర్వే సిద్ద్యంత్యుపక్రమాః ॥
హత్వాపి మాం న శక్తస్త్వం ప్రజాసాం పాలనే నృప ।
అంతర్భూతా భవిష్యామి జహి కోపం మహాద్యుతే ॥
అవధ్యాశ్చ స్త్రీయః ప్రాహుస్తిర్యగ్యోనిగతేష్వపి ।
సత్త్వేషు పృథివీసాల ! ధర్మం న త్యక్తుమర్హసి ॥
ఏవం బహు విధం వాక్యం శ్రుత్వా తస్యాః మహామనాః ।
క్రోధం నిగృహ్య ధర్మాత్మా వసుధామీద మబ్రవీత్ ॥
ఏకస్యార్థాయ యోహన్యాదాత్మనో వా పరస్య చ ।
ఏకం ప్రాణీ బహూన్వాపి కర్మ తస్యాస్తి పాతకమ్ ॥
యస్మింస్తు నిహతే భద్రే జీవంతి బహవః సుఖమ్ ।
తస్మిన్ హతే నాస్తి శుభే పాతకం చోపపాతకమ్ ॥
సోఽహం ప్రజానిమిత్తం త్వాం హనిష్యామి వసుంధరే ।
యది మే వచనం నాద్య కరిష్యసి జగద్ధితమ్ ॥
త్వాం నిహత్యాశు బాణేన మచ్చాసనపరాజ్ముఖీం ।
ఆత్మానం ప్రథయిత్వేహ ప్రజా ధారయితా స్వయమ్ ॥
త్రిలోక పూజ్యురాలయిన భూమి కృతాంజలి పుటయై వైన్యునితో నిట్లనెను. స్త్రీ వధయందెట్టియధర్మమును నీవు గణింపకయుంటివి. అట్టిఁడవు నీవు నాచే సంవర్షితులయిన ప్రజలనేట్లు భరింపగలవు? ఓ రాజా! నా యందే లోకములన్నియు నున్నవి. ఈ ప్రపంచము నాచే భరింపఁబడుచున్నది. ఓ రోజు! నాచే సంవర్ణితులయిన ప్రజలు నీ కొఱకు నశింపరాదు. నన్ను వధించుట నీకు తగదు. నీవో! ప్రజలకు శ్రేయస్సు కల్పింప నభిలషించుచుంటివి. (182) ఓ పృథ్వీపాల ! ప్రజారక్షకుండా! నో యీ పలుకులు వినుము. ఉపాయముతో ఆచరించిన సర్వ సమారంభములును సిద్ధించును. నన్ను చంపి కూడ ప్రజలను ఓ రాజో పాలింప శక్తుఁడవు కావు. నేనో అంతర్భూతనైయుండెదను. అందుచే ఓ మహాద్యుతిమంతుఁడో! కోపము నిగ్రహింపుము. తిర్యగ్యోనుల యందుఁగూడ స్త్రీలు వధింపబడ కూడదని చెప్పుదురు. సర్వ సత్త్వముల యందు ఓ పృధ్వీపాల! ధర్మమును విడిచి వర్తింపఁదగవు. ఆ వసుధ యొక్క బహు విధములయిన వాక్యములను మహామతి వైన్యుఁడు వినెను. ఆ ధర్మాత్ముఁడు క్రోధమును విడిచి వసుధతో నిట్లనియెను. ఒకప్రాణి తనయొక్కని కొఱకుగాని, పరునొక్కరీ కొణకు గాని బహుప్రాణుల జంపుట పాపము. ఓ పూజ్యురాలా! ఎవ్వడు వధింపఁబడ పలువురు సుఖముగా జీవింతురో ఓ మంగళకరురాలా! ఆతని వధయందు పాతకము కానీ ఉపపాతకము కాని లేవు అందుచే ఓ వసుంధరా ! ప్రజల కోలుకు నిన్ను వధించెదను. నీవు జగద్ధితకరమయిన నా ఆజ్ఞను అనుసరించనీచో నిన్ను వధించెదను. నీవు నా శాసనమును త్రోసి రాజన్న (కాదుపోమ్మనీ తృణీకరించీన) నీన్ను ఒకే యొక శరముతో వెంటనే వధించెదను. నన్ను నేనే విశాలముగా జేసికొని నేనే యీ ప్రజను స్వయముగా భరించెదను.
సా త్వం వచనమాస్థాయ మమ ధర్మభృతాం వరే ।
సంజీవయ ప్రజా నిత్యం శక్తా హ్యసి న సంశయః ॥
దుహితృత్వం చ మే గచ్ఛ చైవమేతమహం శరమ్ ।
నియచ్ఛేయం త్వద్వధార్థముద్యంతం హోరదర్శనమ్ ॥
ప్రత్యువాచ తతో వైన్యమేవముక్తా సతీ మహీ ।
సర్వమేతదహం రాజన్విధాస్యామి న సంశయః ॥
వత్సం తు మమ తం పశ్య క్షరేయం యేన వత్సలా ।
సమాం చ కురు సర్వత్ర మాం త్వం ధర్మభృతాం వర ॥
యథా విస్పందమానం మే క్షీరం సర్వత్ర భావయేత్ ।
సూత ఉవాచ :
తత ఉత్సారయామాస శిలా జాలాని సర్వశః ।
ధనుష్కోట్యా తథా వైన్యస్తేన శైలా వివర్థితాః ॥
మన్వంతరేష్వతీతేషు విషమాసీద్వసుంధరా ।
స్వభావేనాభవత్తస్యాః సమాని విషమాని చ ॥
నహా పూర్వ నిసర్గో వై విషమే పృథివీతలే ।
ప్రవిభాగః పురాణాం వా గ్రామాణాం వాపి విద్యతే ॥
న సస్యానీ న గోరక్షం న కృషిర్న వణిక్పథః ।
చాక్షుషస్యాంతరే పూర్వమాసీదేతత్పురా కిల ॥
వైవస్వతేంతరే తస్మిన్సర్వస్యైతస్య సంభవః ।
సమత్వం యత్ర యత్రాసీద్భూమేః కస్మింశ్చిదేవ హి ॥
తత్ర తత్ర ప్రజాస్తా వై నీవసంతి చ సర్వశః ।
ఆహారః ఫలమూలే తు ప్రజానామభవత్కిల ॥
కృచ్చ్రేణైవ తదా తాసామిత్యేవ మనుశుశ్రుమ ।
వైన్యాత్ర్పభృతి లోకేఽస్మిన్ సర్వసైతస్య సంభవః ॥
సకల్పయిత్వా వత్సం తు చాక్షుషo మనుమీశ్వరః ।
పృథుర్దుదోహ సస్యాని స్వే తలే పృథివీం తతః ॥
నా వచనముల కంగీకారముగా ధర్మము రక్షించు వారిలో శ్రేష్ఠురాలా ! ప్రజలను ఎప్పుడు సంజీవింపజేయుము. నీవు సమర్ధురాలవు. ఇందు సందేహము లేదు. నీవు నాకు కూతురవు కమ్ము, అట్లయినచో నిన్ను చంపుటకై యేత్రంబడిన భయంకర దర్శనము కలిగిన ఈ ధనువును నేనుపసంహరించెదను.” అనెను. ఈ విధముగా చెప్పఁబడి భూసతి వైన్యునితో నీట్లనీయేను. నిస్సంశయముగా ఓ రాజా, నీ వచనముల నెల్ల నేను నిర్వహించెదను. నేను వాత్సల్యముతో పొలను స్రవింపఁజేయుటకు నీవోక వత్సమును తీసికొని రమ్ము, ధర్మ రక్షకులలో నుత్తముండా! నన్ను నీవు ఎత్తు పల్లములు లేకుండ సమతలముగా చేయుము ఎందులకన నేను స్రవించు పాలు సర్వత్ర సమానముగా వ్యాపించును.
సూతుఁడిట్లనియెను :
అంత సర్వత్ర వ్యాపించియున్న శిలాజాలములను ధనుష్కోటిలో ఉత్తోరణము (తీపి) చేసెను. గతించిన మన్వంతరముల యందు భూమి విషమముగా ఎత్తు పల్లములతో నుండెను. ఇప్పుడో విషమముగా నున్న వసుంధరా భాగములు సహజముగా సమతలములయ్యెను. (196) గతించిన సృష్టియందు భూమి విషమతలముగా నుండెను. అప్పుడు పట్టణములకు గ్రామములకు భేదము లేకుండెను. అప్పుడు మొక్కలు లేదా పంటలు లేవు, అప్పుడు వ్యవసాయముకానీ గోరక్షణముకాని లేవు. వణిక్పథములు (బజారులు) లేవు. చాక్షుష మన్వంతరము నందలి స్థితీయది. వైవస్వత మన్వంతరమున ఇవన్నియును సంభవములయ్యెను. ఎందెందు సమతల ముండెనో యందందు సర్వత్ర ప్రజలు నివసించిరి. పూర్వము ప్రజలకాహారము ఫలములేమై యుండెను, (200) అప్పుడు ప్రజల జీవిత వృత్తి కష్టముగా సాగుచుండెడిదనీ విందుము. వేనునీ సంతతి కాలము నుండి సర్వము సుసంపన్నమైనది. పృథువు చాక్షుష మనువును వత్సముగా జేసి సస్యములను, వృక్షములను, తన భూమి యందే పిదికేను.
తేనాన్నేన తతస్తా వై వర్తయంతి శుభాః ప్రజాః ।
ఋషిభిః శ్రూయతే చాపి పునర్దుగ్ధా వసుంధరా ॥
వత్సః సోమస్త్వభూత్తేషాం దోగ్ధా చాపి బృహస్పతిః ।
ఛందాంసి పాత్రమాసీత్తు గాయత్ర్యాదీని సర్వశః ॥
క్షీరమాసీత్తదా తేషాం తపో బ్రహ్మ చ శాశ్వతమ్ ।
పునస్తతో దేవగణైః పురందరపురోగమైః ॥
సౌవర్ణం పాత్రమాదాయ దుగ్ధా సంశ్రూయతే మహీ ।
వత్సస్తు మఘవానాసీద్ధోగ్ధా చ సవితా విభుః ॥
క్షీరమూర్జం చ మధుచ వర్తంతే తేన దేవతాః ।
పితృభిః శ్రూయతే చాపి పునర్దుగ్ధా వసుంధరా ॥
రాజతం పాత్రమాదాయ స్వధామాశు వితృషయే ।
వైవస్వతో యమస్వాసీతేషాం వత్సః ప్రతాపవాస్ ॥
అంతకశ్చాభవద్దోగ్ధా పితృణాం బలపాన్ ప్రభుః ।
అసురైః శ్రూయతే పాపి పునర్దుగ్ధా వసుంధరా ॥
ఆయసంపాత్రమాదాయ కిల మాయాశ్చ సర్వశః ।
విరోచనస్తు ప్రాహ్లాదిర్వత్సస్తేషాం మహాయశాః ॥
తత్విగ్ద్వీమూర్ధా దైత్యానాం దోగ్ధాఽభూద్దీతీనందనః ।
పాయసా తేచ మాయాభిః సర్వే మాయావినోఽసురాః ॥
వర్తయంతి మహావీర్యాస్తదేషాం పరమం బలమ్ ।
నాగైస్తు శ్రూయతే దుగ్ధా వత్సం కృత్వా తు తక్షకమ్ ॥
అలాబూషాత్ర మాదాయ విషం క్షీరం తదా మహీ ।
తేషాం వై వాసుకీర్దోగ్ధా కాద్రవేయః ప్రతాపవాన్ ॥
నాగానాం వై ద్విజశ్రేష్ఠ సర్పాణాం చైవ సర్వశః ।
తేనైవ వర్తయంత్యుగ్రా మహాకాయా విషోల్బణాః ॥
తదాహారా స్తదాచారా స్తద్వీర్యాస్తదుపాశ్రయాః ।
ఆమపాత్రే పునర్దుగ్ధా త్వంతర్ధానప్రియం మహీ ॥
ఆమపాత్ర (పక్వము కానిది; బాగుగా కాలనీదీ)
అప్పటి నుండి శుభవంతులయిన ప్రజలు, ఆహారముచే తమ్ము నిలుపుకొనిరి. ఋషీశ్వరులచే మరల నింకొక మారు పృథివీ సీదుకంబడినదని విందుము. ఆ ఋషీశ్వరుల సమయములో సోముఁడు (చంద్రుఁడు) వత్సము. బృహాస్పతి దోగ్ధ (పాలు పితుకువాఁడు). గాయత్రి మొదలగు వేద ఛందో విధానములు పాత్ర స్థానమును వహించేను. ఆ క్షీరము తపస్సు, వేదములు. అయ్యెను. తరువాత దేవతలు ఇంద్రుఁడు తమ నాయకుఁ డుగా సౌవర్ణ పాత్రము గ్రహించి పాలను ఓదీకిరని విందుము. వత్సము ఇంద్రుఁడు (మఘవాన్) సూర్యుఁడు పితుకువాఁడు. ఊర్ణము తేనే అప్పుడు క్షీరము. వానిచే దేవతలు వర్తించిరి. (జీవనోపాధిగా బ్రతికిరి). పితరులచే మరల వసుంధర పాలంబిదుకబడినదని విందుము. వారు రజత సంబంధమైన పాత్రను తీసికొని వచ్చిరి. క్షీరము స్వధ, అయ్యదీ వారి సంతృప్తికి సహకరించెను. వివస్వంతుని కుమారుఁడు బలవంతుఁ డునైన యముఁడు - వారికి వత్సము. శక్తి మంతుఁడయిన అంతకుఁడు పితరులకు పాలుఁబీదుకువాఁడు. అసురలచే భూమీ మరల పాలంబీదుకబడినదనీ విందుము. ఆ యసురులు ఆయస పాత్రను దెచ్చిరి. వారు పొందినవి మాయలు (క్షీరము). ప్రహ్లాదుని కుమారుఁడు యశస్వియన విరో చనుఁడు వత్సము. ప్రతిర్లిమూర్ఖుఁడు (?) దైత్యులకు దోర్ట. వారు మాయ యను క్షీరము నొంది మాయావులయిరి. మహావీరులయిన వారు పరమబలకరమయిన మాయచే వర్తింతురు. తక్షకుని వత్సముగా చేసి నాగులు భూమిని పీవీకిరని విందుము. వారు ఆలాబు' పాత్రమును దెచ్చిరి. వారు విషమును క్షీరముగా భూమి నుండి పీవీకిరి. వారికి వాసుకి దేగ్గ. ఆతఁడు కాద్రవేయుఁడు ప్రతాపవంతుఁ డు. ఓ ద్విజశ్రేష్ట! ఆ వ్యక్తులు ఆ ఉగ్ర విషముతో జీవింతురు. వారు మహాకాయులు. అత్యధికముగా విషము గలవారు. ఆ విషమే వారికి అన్నము. దాని వలననే వారు వీర్యవంతులు. ఆమ పాత్రలో యక్షులచే పుణ్యజనులచే భూమి మరల పిదుకంబడెను.
వత్సం వైశ్రవణం కృత్వా యక్షైః పుణ్యజనైస్తథా ।
దోగ్ధా రజతనాభస్తు పితా మణిధరస్య యః ॥
యక్షాత్మజో మహాతేజా వశీ చ సుమహాయశాః ।
తేన తే వర్తయంతీతి పరమార్థతయా చ హ ॥
రాక్షసైశ్చ పిశాచైశ్చ పునర్దుగ్ధా వసుంధరా ।
బ్రహ్మా బ్రాహ్యాస్తు వై దోగ్ధా తేషామాషీత్కుబేరకః ॥
వత్సః సుమాలీ బలవాన్ క్షీరం రుధిరమేవ చ ।
కపాలపాత్రే నిర్దుగ్ధా ప్యంతర్ధానం చ రాక్షసైః ॥
తేన క్షీరేణ రక్షాంసి వర్తయంతీహ సర్వశః ।
పద్మపాత్రే పునర్దుగ్ధా గంధర్వైశ్చాపురోగణైః ॥
వత్సం చిత్రరథం కృత్వా శుచీన్గంధామహీ తదా ।
తేషాం వసురుచిస్త్వాశీద్దోగ్ధ పుత్త్రో మునేః శుభః ॥
గంధర్వరాజోఽతిబలో మహాత్మా సూర్యసన్నిభః ।
శైలైశ్చ క్రూయతే దుగ్ధా పునర్దేవీ వసుంధరా ॥
తదౌషధీర్మూర్తిమతీ రత్నాని వివిధాని చ ।
వత్సస్తు హిమవానాసీద్దోగ్ధ మేరుమహాగిరిః ॥
పాత్రం తు శైలవాసీత్తేన శైలాః ప్రతిష్ఠితాః ।
శ్రూయతే వృక్షవీరుద్భిః పునర్దుగ్ధా వసుంధరా ॥
పాలాశం పాత్రమాదాయ ఛిన్నదగ్ధప్రరోహణమ్ ।
కామధుక్ పుష్పితః శాలః ప్లక్షోవత్సో యశస్వినామ్ ॥
సర్వకామదుఘా దోగ్ద్రీ పృథివీ భూతభావినీ ।
సైవ ధాత్రీ విధాత్రీ చ ధారణీ చ వసుంధరా ॥
దుగ్ధా హితార్థం లోకానాం పృథునేతి హి నః శ్రుతమ్ ।
చరాచరస్య లోకస్య ప్రతిష్ఠా యోనిరేవచ ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయేఽఖనుషంగఫాదే, శేషమన్వంతరాఖ్యానం పృధివీదోహదం చ నామం షడ్రింశత్తమోఽధ్యాయః॥
వైశ్రవణుని వత్సముగా జేసిరి. ఆ వైశ్రవణుఁడు అంతర్జానప్రియుఁడు. దోద్ద రజతనాభుఁడు. ఈతని కుమారుఁడు మణిధరుఁడు యక్షాత్మజుండు మహాతేజుండు, వశీ మరియు మహాయశస్వి ఇది పరమార్థతయా సత్యము. ఏలయన పోరు దానితోడనే బ్రతుకుదురు (కనఁబడకుండ అంతర్థానము నొందుచుందురు). రాక్షసులు, పిశాచములు మరల భూమిని పీదికిరి. వారికి దోద్ద కుబేరుడు. బ్రాహ్మి యొక్క బ్రహ్మయు బలవంతుఁడయిన సుమాలి .వత్సము. ఇంక క్షీరమో రక్తము. కపాల పాత్రలో పీపుకబడినది. అంతర్గాన (శక్తి) ని రాక్షసులు పీదికిరి. అన్నీ విధముల రాక్షసులు ఆ క్షీరముతోడనే వర్తింతురు. (జీవింతురు) గంధర్వులు, ఉరగులు, భూమిని మరల పద్మపాత్రలో పాలు .షీదీకిరి. వారు చిత్రరథుని వత్సముగా చేసిరీ. పాలు శుచిముంతములయిన పరిమళ గంధములు. వారికి దోగ్గ వసురుచి. ఈ వసురుచి యొక మునీ కుమారుఁడు ఈ వసురుచి గంధర్వరాజు అతిబలుఁడు. మహాత్ముఁడు, సూర్య సదృశ్యుడు. మరల శైలములు వసుంధరను మరల పాలంబిదికెనని విందుము. దోగ్ధ మేరుమహాగిరి. వత్సము హిమవంతుఁడు. పాత్రము శైలమే యయ్యెను. అందుచేతనే శైలములు సుప్రతిష్ఠితములు. వృక్షములు, లతలు, భూమిని పాలంబిదికినవనీ మరల విందుము. పాలేశమును పాత్రగా బూనిరి. ఆ పొలాశము నరుకబడినను .దగ్గమయినను మరల మొలకెత్తును. ఇక వత్సము. సృష్టించిన శాలము.పక్షము వారు కోరినట్లుగా భూమి కామధుక్ పాలొసంగెను.ఈ విధముగా సర్వకామదుఘ యైన దోగ్రీ, భూమి, భూతభావిని. అయ్యదీయే ధాత్రి, విధాత్రి, ధారణీ వసుంధరా లోకహితము కొఱకు పృథు మహారాజుచే భూమి పిదుకబడినదని విందుము. అయ్యది చరాచర లోకమునకు ప్రతిష్టాకరమైన (యోని) జన్మ స్థానము.
ఇది పోయుప్రోక్తమయిన బ్రహ్మాండ మహా పురాణమున పూర్వభాగమున ద్వీతీయానుషంగపాదమున శేషమన్వంతరాఖ్యానము, పృథివీ దోహనమను ముప్పదియారవ అధ్యాయము.
Summary of chapter 36 of the Brahmānda Mahā Purana is as follows:
In a highly evocative and sacred narrative, this chapter details the glorious lineage of the Manus who serve as the divine stewards of the world during their respective epochs. It beautifully recounts the legendary milking of the earth, a profound allegory where the earth goddess graciously yields her boundless wealth and nourishment for the welfare of all beings. The devout soul learns to approach nature with profound respect and gratitude, recognizing it as the loving, providing manifestation of the divine mother.