బ్రహ్మాండ మహా పురాణము
16 - ససేనావిజయయాత్రా నామ షోడశోఽధ్యాయః
అథ సా జగతాం మాతా లలితా పరమేశ్వరీ।
త్రైలోక్య కంటకం భండం దైత్యం జేతుం వినిర్యయౌ ॥
చకార మర్ధలాకారానంభరాశీంస్తు సప్త తే।
ప్రభూతమర్ధలధ్వానైః పూరయామాసురంబరమ్॥
మృదంగముదజాశ్చైవ పటహోఽతులీంగణాః।
సేలుకాఝల్లరీరాంఘాహుడుకాహుండుకాఘటాః॥
ఆనకాః ప్రణవాశ్చైవ గోముఖాశ్చార్థచంద్రికాః।
యవమధ్యా ముష్టిమధ్యా మర్దలా డిండిమా అపి॥
ఘర్ఘరాశ్చ బరీతాశ్చ ఇంగ్యాలింగ్య ప్రభేదజాః।
ఉద్ధకాశ్చైతుహుండాశ్చ నిఃసాణాః బర్బరాః పరే॥
హుంకారాః కాకతుండాశ్చ వాద్యభేదాస్తథాపరే ।
దధ్వనుః శక్తిసేనాభిరాహతాః సమరోద్యమే ॥
లలితాపరమేశాన్యా అంకుశాస్త్రాన్ సముద్గతా।
సంపత్కరీ నామ దేవీ చచాల సహ శక్తిభిః॥
అనేకకోటిమాతంగతురంగరథపంక్తిభిః।
సేవితా తరుణాదీత్యపాటలా సంపదీశ్వరీ॥
మత్తముద్దండసంగ్రామరసికం శైలసన్నిభమ్।
రణకోలాహలం సోమ పౌరురోహ మతంగజమ్॥
తామన్వగా యయౌ సేనా మహతీ హోరరావిణీ।
లోలాభిః కేతుమాలాభిరుల్లిఖంతీ ఘనాఘనాత్ ॥
తస్యాశ్చ సంపన్నాథాయాః పీనస్తనసుసంకటః।
కంటకో ఘనసన్నాహో రురుచే వక్షసి స్థితః॥
కంపమానా ఖడ్గలతా వ్యరుచత్తత్కరే ధృతా।
కుటిలా కాలనాథస్య భృకుటీవ భయంకరా॥
ఉత్పతవాతసంపాతాచ్చలితా ఇవ పర్వతాః।
తామన్వగా యయుః కోటిసంఖ్యాకాః కుంజరోత్తమాః॥
అథ శ్రీలలితాదేవ్యా శ్రీపాశాయుధసంభవా।
అతిత్వరితవిక్రాంతిశ్వారూఢాచలత్పురః ॥
తయా సహ హయప్రాయం సైన్యం హేషాతరంగితమ్।
వ్యచరత్ఖురకుద్దాలవిదారితమహీతలమ్॥
వనాయుజాశ్చ కాంబోజాః పారదోః సింధుదేశజాః।
టంకణాః పర్వతీయాశ్చ పారసీకాస్తథాపరే॥
అజానేయా ఘట్టధరా దరదాః కాలమందిజాః।
వాల్మీకయావనోద్భూతా గాంధర్వాశ్చాథ యే హయాః॥
ప్రాగ్దేశజాతాః కైరోతాః ప్రాంతదేశోద్భవాస్తథా।
వినీతాః సాధు వోడారో వేగినః స్థిరచేతసః॥
స్వామీచిత్తవిశేషజ్ఞః మహాయుద్ధసహిష్ణవః।
లక్షణైర్బహుభిర్యుక్తా జితక్రోధా జితశ్రమాః॥
పంచధారాసు శిక్షాడ్యా వినీతాశ్చ ప్లవాన్వితాః॥
ఫలశుక్తి శ్రియా యుక్తాః శ్వేతశుక్తిసమన్వితాః।
దేవపద్మం దేవమణిం దేవస్వస్తికమేవ చ॥
అథ స్వస్తికశుక్తిశ్చ గడురం పుష్పగండికామ్।
ఏతాని శుభలక్ష్మాణి జయరాజ్యప్రదాని చ॥
వహంతో వాతజవహా వాజినస్తాం సమన్వయుః॥
అపరాజితనామానమతితేజస్వినం చలమ్।
అత్యంతోత్తుంగవర్ష్మాణం కవికావిలసన్ముఖమ్॥
పార్శ్వద్వయేఽపి పతితస్ఫురత్మేసరమండలమ్।
స్థూలవాలవిక్షేపక్షిప్యమాణపయోధరమ్॥ జంఘాకాండసమున్నద్ధమణికింకిణిభాసురమ్।
వాదయంతమివొచ్చండైః ఖురనిషురకుట్టనైః ॥
భూమండలమహావాద్యం విజయస్య సమృద్ధయే।
ఘోషమాణం ప్రతి ముహుః సందర్శితగతిక్రమమ్॥
ఆలోలచామరవ్యాజాద్వహంతం పక్షతీ ఇవ।
భాండైర్మనోహరైర్యుక్తం ఘరరీజాలమండితమ్॥
ఏషాల ఘోషస్య కపటాదుంకుర్వంతీమవాసురాస్।
అశ్వారూఢ మహాదేవీ సమారుధా హయం యయౌ॥
చతుర్బిర్బాహుభిః పాశమంకుశం క్షేత్రమేవ చ। హయవల్గాం చ దధతీ ఇహువిక్రమశోభినీ॥
తరుణాదిత్యసంకాశా జ్వలత్కాంచీతరంగిణీ।
సంచచాల హాయారూఢా నర్తయంతీవ వాజినమ్॥
అథ శ్రీదండనాథాయ నిర్యాణపటహధ్వనిః।
ఉద్దండసింధునిస్వానశ్చకార బధిరం జగత్॥
వజ్రబాణైః కఠోరైశ్చ భిందంత్యః కకుభో దశ।
అత్యుద్ధతభుజాశ్మానః శక్తయః కాశ్చిదుచ్ఛ్రితాః॥
కాశ్చిచ్ఛ్రిదండనాథాయాః సేనానాసీరసంగతాః।
ఖడ్గం ఫలకపదాయ పుప్లునశ్చండశక్తయః॥
అత్యంతసైన్యసంబాధం వేత్రసంతాడనైః శతైః।
నివారయంత్యో వేత్రిణ్యో వ్యుచ్చలుంతి స్మ శక్తయః॥
అథ తుంగధ్వజశ్రేణిర్మహిషాంకా మృగాంకికామ్।
సింహాంకాశ్చైవ బిభ్రాణాః శక్తయోవ్యచలన్ పురా॥
తతః శ్రీదండనాథాయాః శ్వేతచ్ఛత్రం సహస్రశః।
స్ఫురత్కరాః ప్రచలితాః శక్తయః కాశ్చిదాదదుః॥
ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే ససేనావిజయయాత్రా నామ షోడశోఽధ్యాయః॥
ఆ తరువాత జగన్మాతయైన లలితా పరమేశ్వరి ముల్లోకములకు కంటకుడైన భండాసురుని జయించుటకు బయలుదేరెను-1. ఆయుద్ద ప్రయత్నమున శక్తిసేనచే మ్రోయించబడిన బహువిధ వాద్యములతో దిక్కులు పిక్కటిల్ల మ్రోగినవి. ఆ వాద్యములు సప్త సముద్రములను సైతము మద్దెల యాకారములనుగా జేసినవి. అత్యున్నతములైన మద్దెల ధ్వనులు ఆకాశమెల్లనింపుచున్నవి-2. మృదంగములు, మురజములు, పటహములు, అతుకులీంగణములు, సేలుకములు, ఝల్లరులు, రాంఘలు, హండుకములు, హుండుకములు, ఘటములు-3. ఆనకములు, ప్రణవములు, గోముఖములు, అర్థచంద్రికలు, యవమధ్యములు, ముష్టిమధ్యములు, మర్దలములు, డిండిమములును-4. ఘర్ఘరములు, బరీతములు, ఇంగ్యాలింగ్య ప్రభేదజములు, ఉద్ధకములు, ఏతుహుండములు, నిఃసాణములు, బర్బరములు-5. హుంకారములు, కాకతుండములు, ఇంకను తక్కిన వాద్యభేదములును లలితాదేవియొక్క సమరోద్యమమున శక్తిసేనతో మ్రోయింపబడినవి-6. లలితా పరమేశాని యొక్క అంకుశాస్త్రమునుండి బయలువెడలిన సంపత్కరీ యనుదేవి తనశక్తులతో కదలేను-7. అనేక కోటియేనుగులు, గుఱ్ఱములయు, రథములయు పంక్తులచే సేవింపబడుచు లేత సూర్యునివలె నెఱనైన సంపదీశ్వరి మదించినదియు, ఉన్నతమైనదియు, యుద్ధనైపుణ్యము గలదియు, ఒక పర్వతముతో సమానముగానున్న ‘రణకోలాహల’ మను ఏనుగనధిరోహించెను-9. మహాసేనయంతయు ఘోరమైన ధ్వనిజేయుచు సామెననుసరించినది. శత్రుసేనలహింసించగలయేనుగరాజునుండి కదులుచున్న జెండాల వరుసలచే యాకాశమును వ్రాయుచున్నట్లున్నది-10. సంపదీశ్వరి యొక్క వక్షస్సుననున్నదియు ఆమె పైన స్తనములకు కొద్ది సంకటముగలిగించునదై ముళ్ళుదేలిన కంటక కవచసన్నాహముప్రకాశించెను-11. కోపించిన యముని బొమ్మముడివలె నామె చేత ధరించిన తీవ వంటి ఖడ్గము భయంకరమై ప్రకాశించుచున్నదీ-12. ఉత్పాతపాతమున చలించిన పర్వతముల వలే కోట్ల సంఖ్యలోనున్న. గోప్పగొప్పయేనుగులు ఆమెననుసరించివెళ్లినవీ-13. ఆ తరువాత లలితాదేవియొక్క పొశాయుధమునుండి బుట్టినశ్రీ అతిత్వరితమైన విక్రాంతి (నడక పరాక్రమము)గలదై అశ్వమునధిరోహించి ముందు కదిలెను-14. ఆమెతోబాటు. అశ్వసైన్యముకదలినది. గుజముల సకిలింతలతో తరంగితమైనట్లున్నది. నడకలో గిట్టలనెడిగుద్ధళ్లతో భూమీ పగుళ్లువారినదీ-15. వనాయుజములు, కాంబోజములు; పాదములు, సింధుదేశజములు, టంకణములు, పర్వతీయములు, పారసీకములు-16. అజానేయములు, ఘట్టధరములు, దరదములు, కాలవందిజములు, వల్మీకములు, యావనోద్భూతములు, గంధర్వములు (ఇవి భిన్నభిన్న దేశముల బుట్టినయశ్వజాతులు). తూర్పుదేశమున బుట్టినవి, కైరాతకములు, ప్రాంతదేశజములు-ఈ గుఱ్ఱములు చక్కని శిక్షణతో వినీతములై వేగవంతములై స్థిరచిత్తములై చక్కగా మనుష్యులను మోయునవి-18. స్వామిచిత్తమును విశేషముగా దెలిసినవి. మహాయుద్ధమునకు సహించునవి. అనేక శుభలక్షణములు గలవి. క్రోధమును జయించినవి (శాంత స్వభావము గలవి). శ్రమను జయించినవి, పంచధారలలోని శిక్షణతో నొప్పినవి. (అస్కందితము, రీతకము, రేచితము, వళితము, ప్లుతము ఇవియైదు అశ్వగతులు, పంచధారలు)-20. ఫలశుక్తి క్రియలతో గూడినవి, శ్వేతశుక్తులతో గూడినవి (శుక్తి=సుడి). దేవపద్మమును, దేవమణినీ, దేవస్వస్తికమును, గలిగియున్నవి-21. స్వస్తికము, శుక్తికము, గడురము, పుష్పగండిక-ఇవీ గుఱ్ఱముల శుభలక్షణములు జయమును రాజ్యమును ఇచ్చునవి. ఈ శుభచిహ్నములు గలిగి వాయువేగము గలవై యామెను (శ్రీని) అనుసరించినవి-22. అపరాజితమనుపేరుగలది, మిక్కిలి తేజోవంతమైనది, చురుకైనది, మిక్కిలియెత్తైన యాకారముగలదీ, కళ్లెముతో ప్రకాశించినముఖము గలది-23. రెండు ప్రక్కలను పాలి ప్రకాశించుచున్న వెంట్రుకలసమూహముగలది, లావైన తోక వెంట్రుకల కదలికలచే తాకబడుచున్న స్తనములుగలది-24. పాదములకు పైగా గట్టబడిన మణులు పొదగిన చీరుగజ్జెలతో ప్రకాశించునది. గిట్టల గట్టితికీడులచే భూమండల మహా వాద్యమును విజయ సమృద్దికొఱకు వ్రాయించినట్లున్నది. ఏదేని సూచనగా ధ్వనిజేయుచున్నవానికై చూపించినగతి క్రమము(నడక) గలది-26. చంచలములైన చామరముల మీషతో పైకెగిరీపరుగెత్తుటకై రెండు రెక్కలు ధరించినదాయన్నట్లున్నది. చిరుగంటల సమూహముతో గూడిన మనోహరములైన గుఱ్ఱపు తొడవులతో గూడినదీ-27. వీనియొక్క ధ్వనుల మిషమున రాక్షసులను హుంకరించున్నదాయన్నట్లు మహాదేవియశ్వారూఢయై వెళ్లాను-28. నాలుగు చేతులతో పాశము, అంకుశము, పేముబెత్తెము, కళ్ళెములగు పగ్గములను ధరించి, బహువిక్రమశోభినియై-29. లేత సూర్యునివలెనెఱఱ్ఱనిదై, తరంగములవలే ప్రకాశించుమొల నూలుగలదై, గుఱ్ఱమును నాట్యము జేయించుచున్నదాయన్నట్లు గుఱ్ఱమునెక్కి (యామహాదేవి) వెళ్లాను-30. ఆ తరువాత శ్రీదండనాథయొక్క సైన్యము బయలుదేరు భేరీధ్వని జగమంతయు చెవిటీగా జేసినదీ-31, కోరములైన వజ్రబాణములతో దశ దిక్కులు పిక్కటిల్లజేయుచు రాతివలె మిక్కిలి యుద్ధతములైన భుజములు గల కొందరు శక్తులు (స్త్రీ శక్తులు) విజృంభించినవి-32. కొందఱు చండీ శక్తులు (స్త్రీ శక్తులు) సేనా ముఖమునన్నువై, కత్తిని ఊలును దీసికొని, రణమునకు దూకీనవి-33, నూర్లకొలదీ బత్తెపు దెబ్బలతో అత్యంత సైన్యసంబాధమును, (సైన్యముగుమిగూడుటచే పరస్సరము గలుగు బోధను) నివారించుచున్నవై విశేషముగా నెగిరి తిరుగుచున్నవి-84. ఆ తరువాత మహిషాంకమును (దున్న పోతుగుర్తుగా గలవి) మృగాంకమును, సింహాంకమును ధరించుచున్న పతాకలపంక్తులు గల శక్తులు (సేనలతో) ముందే కదలినవి-35. తరువాత శ్రీ దండనాథయొక్క శ్వేతచ్చత్రమును వేయి విధములుగా కరములజాచి పట్టుకొని కొందఱు శక్తులు (స్త్రీలు) తెచ్చిరి-36.
ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున
ససేనావిజయయాత్రయను పదునాఱవ యధ్యాయము.
Summary of chapter 128 of the Brahmānda Mahā Purana is as follows:
This dramatic chapter describes the opening clashes of the monumental cosmic battle between goddess Lalitā's Sakti commanders and Bhandāsura's demonic legions. It details the incredible valor, weapon play, and spiritual power displayed by divine mothers like Sampatkarī and Ashvārūḍhā as they crush the demon ranks. The devoted soul takes inspiration from this celestial warfare, recognizing it as the inner struggle where divine virtues conquer worldly vices.