బ్రహ్మాండ మహా పురాణము
38 - మన్వంతరవర్ణసము - వైవస్వత మన్వంతరము - మారీచసర్గము
సూత ఉవాచ :
సప్తమేత్వథ పర్యాయే మనోర్వైవస్వతస్య హ।
మారీచాత్కశ్యపాద్దేవా జజ్ఞిరే పరమర్షయః ॥
ఆదిత్యా వసవో రుద్రాః సాధ్యా విశ్వ మరుద్గణాః ।
భగవోంఽగిరసన్చైవ తేఽష్టౌ దేవగణాః స్మృతాః ॥
ఆదిత్యా మరుతో రుద్రా విజ్ఞేయాః కశ్యపాత్మజాః ।
సాధ్యాశ్చ వసవో విశ్వే ధర్మపుత్రాస్త్రయో గణాః ॥
భ్చగోస్తు భగవో దేవాః హ్యంగిరసోఽoగిరః సుతాః ।
వైవస్వతేఽoతరే హ్యస్మిన్నిత్యేతే చందజా మతాః ॥
ఏతేఽపి చ గమిష్యంతి మహాంతం కాలపర్యయాత్ ।
ఏపం సర్గస్తు మారీచో విజ్ఞేయః సాంప్రతః శుభః ॥
తేజస్వీ సాంప్రతస్తేషామింద్రో నామ్నా మహాబలః ।
అతీతానాగతా యే చ వర్తంతే సాంప్రతం చ యే ॥
సర్వే మన్వంతరేంద్రాస్తే విజ్ఞేయాః తుల్యలక్షణాః ।
భూతభవ్యభవన్నాథాః సహస్రాక్షా పురందరాః ॥
మఘవంతశ్చ తే నర్వే శృంగిణో వజ్రపాణయః ।
సర్వై: క్రతుశతేనేష్టం పృదక్చతగుణేన తు ॥
త్రైలోక్యే యాని సత్త్వాని గతిమంతి ధ్రువాని చ ।
అభిభూయానతిష్ఠంతి ధర్మాద్యైః కారణైరపి ॥
తేజసా తపసా బుద్ధ్యా ఐలశ్రుతపరాక్రమైః ।
భూతభవ్యభవన్నాథా యథా తే ప్రభవిష్ణవః ॥
సూతుఁడిట్లు చెప్పేను :
వైవస్వత మనువు యొక్క సప్తమ మన్వంతరమున దేవతలు, పరమరులు మరీచి కుమారుఁడయిన కశ్యపుని వలనఁగలిగిరి. ఆదిత్యులు, వస్తువులు, రుద్రులు, సాధ్యులు, విశ్వేదేవతలు, మరుత్తులు, భృగువులు, అంగిరసులు. ఈ యెనమండ్రు దేవతలలో అష్టగణములుగా స్మరింపం బడుదురు. ఆదిత్యులు, మరుత్తులు, రుద్రులు వీరు కశ్యపుని పుత్రులుగా వెలుంగవలయును. సాధ్యులు, వస్తువులు, విశ్వేదేవతలు వీరు. కశ్యపుని పుత్రులుగా నెఱుంగవలయును. సాధ్యులు, వస్తువులు, విశ్వేదేవతలు వీరు ధర్మునీ పుత్రులు. భృగువులు భృగు కుమారులు. దేవతలు అంగీరసుని పుత్రులు. ఈ వైవస్వతాంతరమున వీరు ఛందజగణములు (చందము వలనఁబుట్టినవారు) భీరును కాల ఫర్యయమున కాలాంత గమున మరణించెదరు. ఈ విధముగా ఈ అద్భుతము శుభమునయిన సృష్టిని మరీచి కుమారునిదిగా గ్రహింపవలెను. ఇప్పుడు (సాంప్రతం) తేజస్వియయిన ఇంద్రుడు నామమున మహాబలుడు. గడచిన, రానున్న వర్తమానము నందలి మన్వంతరముల ఇంద్రులు తుల్య లక్షణులుగా దెలియనగును. వారందరు భూతభవ్య భవన్నాథులు, కాలత్రయమునను ప్రభువులు) వారందరు సహస్రాక్షులు, పురందరులు, మఘవంతులు, హస్తముల వజ్రముములు గలవారు. అందరు శృంగములు కలవారు. శ్రేష్ఠులు. వారందరు ప్రత్యేకప్రత్యేకముగా నూరు యజ్ఞములను చేసినవారు. ఇంద్రులు మూఁడు లోకముల యందున్న చరాచరాది ప్రాణములను, తేజస్సుచే, తపస్సు, బుద్ధిబలముచే, బలముచే, పాండిత్యముచే, పరాక్రమముచే, ఇతర కారణములచే జయించినట్టివారు. వారందరే కారణమున భూతభవ్య భవన్నాథులో వివరించెదను.
ఏతత్సర్వం ప్రవక్ష్యామి బ్రువతో మే నిబోధత ।
భూతభవ్యభవద్ద్యేతత్సృతం లోకత్రయం ద్విజైః॥
భూర్లోకోఽయం స్మృతో భూతమంతరిక్షం భవ త్స్మృతమ్ ।
భవ్యం స్మృతం దివం హ్యేతత్తేషాం వక్ష్యామి సాధనమ్ ॥
ధ్యాయతా లోకనామాని బ్రహ్మణాఽగ్రేవీభాషితమ్ ।
భూరితి వ్యాహృతం పూర్వం భూర్లోకోయమభూత్తదా ॥
భూసత్తాయాం స్కృతో ధాతు స్తథాసౌ లోకదర్శనే ।
భూత్వ ద్దర్శనాచ్చైవ భూర్లోకోఽయమభూత్తతః ॥
అతోఽయం ప్రథమో లోకో భూతత్వాద్భూర్ద్విజైః స్మృతః ।
భూతేఽస్మిన్భవదిత్యుక్తం ద్వితీయం బ్రహ్మణా పునః ॥
భవదిత్యుత్పద్యమానకాలే శబ్ధోఽయముచ్యతే ।
భవనాత్తు భువర్లోకో నిరుక్త్యా హి నిరుచ్యతే ॥
అంతరిక్షం భవత్తస్మాద్ద్వితీయో లోక ఉచ్యతే ।
ఉత్పన్నే తు తథా లోకే ద్వితీయ బ్రహ్మణా పునః ॥
భవ్యేతి వ్యాహృతం పశ్చాద్భవ్యో లోకస్తతోఽభవత్ ।
అనాగతే భవ్య ఇతి శబ్ద ఏష విభావ్యతే ॥
తస్మాద్భవ్యో హ్యసౌ లోకో నామతస్త్రీదివం స్మృతమ్ ।
భూరితీయం స్కృతా భూమిరంతరిక్షం భువః స్మృతమ్ ॥
దివం స్మృతం తథా భవ్యం త్రిలోకస్యైష నిర్ణయః ।
త్రైలోక్యయుక్తైర్వ్యాహారైస్తీస్రో వ్యాహృతయోఽభవన్ ॥
తత్సర్వము వివరించేదను, గ్రహింపుఁడు, భూతభవ్యభవత్ స్థితికములు త్రిలోకములని బ్రాహ్మణులు ఎఱుఁగుదురు. భూర్లోకము (భూమి) భూతముగా స్మృతము. అంతరిక్షము భవత్. దీవము భష్యము. ఆ నియమములెట్లుత్పన్నములయినవో చెప్పెదను. ప్రపంచమున నామములనేవి పెట్టవలయునో అని ఆలోచించునప్పుడు ‘భూ’ అను నామము మొదట బ్రహ్మచే నుచ్చరింపఁబడినది. ‘భూ’ అను పదము మొదట సుచ్చరింపం బడియుండుటచే ఇది భూలోకమయినది. ‘భూ’ ధాతువును సత్తాయాం “ఉనికియందు” అని యొక యర్థము. దానికి లోక దర్శనమందు అర్థము కలిగినది. “భూతత్త్వాత్ దర్శనాత్ చైవ భూగ్లోకోయమభూత్తతతః”. ఈ మొదటి లోకము భూలోకము ఏలయన దాని యర్థము స్థితిని పొందుట” అగుట. ఇది భూతత్త్వము. తరువాత దర్శన మొందుటచే లోకమయినది. ఇట్లు విజ్ఞులు స్మరించిరి. ఇది స్థితిని పొందిన తరువాత భవత్ అను రెండవ పదమును బ్రహ్మ ఉచ్చరించెను. ‘భవత్’ అను పదము ఏదయిన నోకటి ఉత్పద్యమానమగుచుండ నుపయోగీంపఁబడును. ఈ పదముచే భువర్లోకము చెప్పబడినది. దీనికి కారణము ఇది భవనము (ఉత్పత్తి) పొందుచున్నదగుట. తరువాత అంతరిక్షము ఉత్పన్నమయినది. ద్వితీయలోకము భువర్లోకమనఁబడినది. రెండవ (ద్వితీయ) లోకముత్పన్నముకాగా బ్రహ్మ భవ్య అనుపదము నుచ్చురించెను. అందుచే ఆ లోకము భవ్య లోకమయినది. ఇంతకు పూర్వముత్పన్నము కానీ విషయమున భవ్య నామము కలుగును. అందుచే భష్యలోకము త్రిదీవముగా స్మృతము. భూమి ‘భూ’ పదముచే స్మరింపఁబడినది. అంతరిక్షము ‘భువః’గా స్మరింపఁబడినది. స్వర్గము భవ్యము. లోకముల నామములఁగూర్చి యిది నిర్ణయము. మూఁడు లోకముల గూర్చి మూఁడు వ్యాహృతులు కలిగినవి. (వ్యాహృతులు = భూః, భువః, సువః - అనునవి).
నాథ ఇత్యేష ధాతుర్వై ధాతుజ్ఞైః పాలనే స్మృతః ।
యస్మాద్భూతస్య లోకస్య భవ్యస్య భవతస్తథా ॥
లోకత్రయస్య నాథాస్తే తస్మాదింద్రా ద్విజైః స్మృతాః ।
ప్రధానభూతా దేవేంద్రా గుణభూతాస్తథైవ చ ॥
మన్వంతరేషు యే దేవా యజ్ఞభాజో భవంతి హి ।
యక్షగంధర్వరక్షాంసి పిశాచోరగమానుషాః ॥
మహిమానః స్మృతా హ్యేతే దేవేంద్రాణాం తు సర్వశః ।
దేవేంద్ర గురవో నాథా రాజానః పితరో హి తే ॥
రక్షంతీమాః ప్రజా హ్యేతే ధర్మేణేహ సురోత్తమాః ।
ఇత్యేతల్లక్షణం ప్రోక్తం దేవేంద్రాణాం సమాసతః ॥
సప్తర్షీన్సంప్రవక్ష్యామీ సాంప్రతం యే దివం శ్రీతాః ।
గాధీజః కౌశికో ధీమాన్విశ్వామిత్రో మహాతపాః ॥
భార్గవో జమదగ్నిశ్చ హ్యౌర్వపుత్రః ప్రతాపవాన్ ।
బృహస్పతిసుతశ్చాపి భరద్వాజో మహాయశాః ॥
ఔతథ్యో గౌతమో విద్వాన్ శరద్వాన్నామ ధార్మికః ।
స్వాయంభువోఽత్రిర్భగవాన్ బ్రహ్మకోశః సపంచమః ॥
షష్థో వసిష్ఠపుత్రస్తు వసుమాన్ లోకవిశ్రుతః ।
వత్సరః కాశ్యపశ్చైవ సప్తైతే సాధుసమ్మతాః ॥
ఏతే సప్తర్షయశ్చోక్తా వర్తంతే సాంప్రతేఽoతరే ।
ఇక్ష్వాకుశ్చ నృగశ్చైవ ధృష్టః శర్యాతిరేవ చ ॥
‘నాథ్’ అను ధాతువున్నది. దాని యర్థమును ధాతుజులు 'పాలనే' పరిపాలించుట యని చెప్పుదురు. వారందరు మూఁడు లోకముల ‘నాథులు’ రక్షకులగుట (భూత భవ్య భవల్లోకత్రయము) వారిని బ్రాహ్మణులు ఇంద్రులనిస్తారు. దేవేంద్రులు ప్రధాన భూతులు. అట్లే అప్రధానులు. మన్వంతరములందు ఏ దేవతలు యజ్ఞభోక్తలో (యజ్ఞహరీర్బుక్కులో) వారిని బ్రాహ్మణులు త్రిలోకములకు నాథులనిరి. యక్షులు, గంధర్వులు, రాక్షసులు, పింశాచములు నాగులు, మనుష్యులు వీరందరని దేవేంద్రుల యొక్క మహిమగలవారుగా (తేజోమూర్తులనుగా) స్మరించిరి. దేవేంద్రులు పెద్దలు (గురువులు). రక్షకులు, రాజులు, పితృదేవతలు. ఈ సురోత్తములు ప్రజలను ధర్మముతో రక్షింతురు. ఈ విధముగా దేవేంద్రుల యొక్క లక్షణములు సంక్షిప్తముగా వివరింపఁబడినవి. ఆకాశము నాశ్రయించుకొని యున్న సప్తర్షులంగూర్చి చెప్పెదను. వారు 1. మహాతపశ్శాలి విశ్వామిత్రుఁడు. ఇతఁడు గాధికుమారుఁడు. ఇతఁడు కుశీకగోత్ర సంభవుఁడు. 2.జమదగ్ని. ఈతడు ఔర్వుని ప్రతాప వంతుఁడయిన కుమారుం డు. భార్గవవంశ సంభవుండు. 3. మహాయశస్వి భరద్వాజుఁడు. ఇతఁడు బృహస్పతి కుమారుఁడు. 4. శరద్వంతుండు. ఇతఁడు విద్వాంసుఁడు, ధార్మికుఁడు, ఔతథ్యుని కుమారుడు. గౌతమవంశ సంభవుండు. 5. స్వాయంభువుఁడు భగవానుండైన అత్రి కుమారుడు. (ఐదవవాఁడు) ఇతనికి “బ్రహ్మకోశుఁడనీ” నామాంతరము. 6.వసుమంతుఁడు. ఇతఁడు వసిష్ణునీ పుత్రుఁడు. ఇతఁడు లోక విశ్రుతుఁడు, 7.వత్సరుఁడు, కాశ్యప వంశ సముత్పన్నుఁడు. ఈ ఏడుగురు సాధువులచే గౌరవింపఁబడిరి. ఈ ప్రస్తుతాంతరమున నీ ఏడుగురు ఋషులు కలరు. ఇక్ష్వాకుడు, నృగుఁడు ధృష్టుడైన శర్యాతి.
నరిష్యంతశ్చ విఖ్యాతో నాభాగో దిష్ట ఏవ చ ।
కరూషశ్చ పృషధ్రశ్చ పాంశుశ్చ నవమః స్మృతః ॥
మనోర్వైవవస్వస్యైతే నవ పుత్రాః సుధార్మికోః ।
కీర్తితా వై తథా హ్యేతే సప్తమం చైదంతరమ్ ॥
ఇత్యేష హ మయా పాదో ద్వితీయః కథితో ద్విజాః ।
విస్తేరేణానుపూర్వ్యా చ భూయః కిం కథయామ్యహమ్ ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోకే ద్వితీయేఽనుషంగపాదే మన్వంతర వర్ణనం నామ అష్టత్రింశత్తమోఽధ్యాయః ॥
సమాప్తోఽయం బ్రహ్మాండపురాణపూర్వభాగః.
నరీష్యంతుఁడు, విఖ్యాతుఁడైన నాభాగుడు, దిష్ణుఁడు, కురూషుఁడు, పృషధ్రుఁడు, పాంశువు ఈ తొమ్మండు వైవస్వత మనువు యొక్క కుమారులు. సుధార్మికులుగా, వారు కీర్తింపఁబడిరి. ఈ మన్వంతరము ఏడవది. ఓ ద్వీజులారా ఈ ద్వితీయ పాదము నాచే విస్తరేణ ఆను పూర్వముగ చెప్పబడినది. ఇంక ఏమి నేను చెప్పుదును.
ఇది వాయుప్రోక్తము, మహాపురాణమునయిన బ్రహ్మాండపురాణమున ద్వితీయానుషంగపాదమున మన్వంతర వర్ణనమను ముప్పది యెనిమిదవ అధ్యాయము బ్రహ్మాండపురాణ పూర్వభాగము సమాప్తము.
Summary of chapter 38 of the Brahmānda Mahā Purana is as follows:
Bringing the first profound segment of the Purāṇa to a majestic close, this chapter details the wondrous creation initiated by the sage Mārīca within the ongoing Vaivasvata Manvantara. It lovingly describes the flourishing of diverse life forms, celestial beings, and righteous lineages that populate the present world under the benevolent cosmic order. The devout heart is left overflowing with peaceful joy, firmly anchored in the knowledge that they are actively participating in the supreme lord's beautifully orchestrated, eternal divine play.