22 - దుర్మదకురండవధో

 అథ శ్రీలలితాసేనా నిఃసాణప్రతినిస్వనః।

 ఉచ్చచాలాసురేంద్రాణాం యోద్ధతో దుందుభిధ్వనిః॥

 తేన మర్దితదిక్కేనక్షుభ్యధ్గర్భపయోధినా।

 బధిరీకృతలోకేన చకంపే జగతాం త్రయీ॥

 మర్దయన్ కకుభాం వృందం భిందన్ భూధరకందరాః।

పుప్రోథే గగనాభోగే దైత్యనిఃసాణనిస్వనః॥

 మహానరహరిక్రుద్ధహుంకారోద్ధతిమద్ధ్వనిః।

 విరసం విరరాసోచ్చైర్విబుధద్వేషిఝల్లరీ॥

తతః కిలకిలారావముఖ దైత్యకోటయః।

 సమనహ్యంత సంక్రుద్ధాః ప్రతి తాం పరమేశ్వరీమ్॥

 కశ్చిద్రత్నవిచిత్రేణ వర్మణాచ్ఛన్నవిగ్రహః।

 చకాశే జంగమ ఇవ ప్రోత్తుంగో రోహణాచలః॥

కాలరాత్రీమివోదగ్రాం శస్త్రకారేణ గోపితామ్।

 అధునీత భటః కశ్చిదతిధౌతాం కృపాణికామ్॥

ఉల్లాసయన్ కరాగ్రేణ కుంతపల్లవమేకతః।

 ఆరూఢతురుగో వీథ్యాం చౌరీభేదం చకార హ॥

కేచిదారురుహుర్యోధా మాతంగాస్తుంగవర్మణః।

 ఉత్పాతవాతసంవాతప్రేరితానివ పర్వతాన్॥

పట్టిశైర్ముద్గరైశ్చైవ భీదురైరిండిపాలకైః।

 ద్రుహణైశ్చ భుశుండీభీః కుఠారైర్ముసలైరపి॥

గదాభిశ్చ శతఘ్నీలిస్త్రిశిఖైర్విశిఖైరపి।

 అర్ధచక్రైర్మహాచక్రైర్వక్రాంగైరురగాననై॥

 ఫణీశీర్షప్రభేదైశ్చ ధనుర్భిః శార్జధన్విభీః।

 దండైః క్షిపణికాశస్త్రైర్వజబాణైర్దృషద్వర్తిః॥

 యవమధైర్ముష్టిమధైర్వలలైః ఖండలైరపి।

 కటాదైః కోణమధ్యైశ్చ ఫణిదంతైః పరఃశతైః॥

 పాశాయుధైః పాశతుండైః కాకతుండైః సహస్రశః।

 ఏవమాదిభిరత్యుగైరాయుధైర్జీవహారిభిః॥

పరీకల్పితహస్తాగ్రా వర్మితా దైత్యకోటయః।

 అశ్వారోహా గజారోహా గర్దభారోహిణః పరే॥

 ఉష్ట్రారోహా వృకారోహా శునకారోహిణః పరే ।

కాకాదిరోహిణో గృధ్రారోహాః కందిరోహిణః॥

 వ్యాఘ్రాదిరోహిణశ్చాన్యే పరే సింహాదిరోహిణః।

శరభరోహిణశ్చాన్యే భేరుండారోహిణః పరే॥

 సూకరారోహిణీ వ్యాలారూడా ప్రేతాదిరోహిణః।

 ఏవం నానావిధైర్వాహవాహినో లలితాం ప్రతీ॥

 ప్రచేలుః ప్రబలక్రోధసంమూర్ఛితనిజాశయాః।

 కుటిలం సైన్యభర్తారం దుర్మదం నామ దానవమ్॥

దశాక్షాహిణీకాయుక్తం ప్రాహిణోల్లలితాం ప్రతి॥

 దీధక్షుభిరివాశేషం విశ్వం సహ బలోత్కటైః।

 భటైర్యుక్తః స సేనానీ లలితాభిముఖే యయౌ॥

 భింధన్ పటహసంరావైశ్చతుర్దశ జగంతీ స।

 అట్టహాసాన్వితన్వానో దుర్మదస్తన్ముఖో యయౌ॥

 అథ భండాసురాజ్ఞప్తః కుటిలాక్షో మహాబలః।

 శూన్యకస్య పురద్వారే ప్రాచీనే సమకల్పయత్॥

రక్షణార్థం దశాక్షౌహిణ్యుపేతం తాలజంఘకమ్॥

అవాచీనే పురద్వారే దశాక్షౌహిణీ కాయుతమ్।

 నామ్నా తాలభుజం దైత్యం రక్షణార్థమకల్పయత్॥

 ప్రతీచీనే పురద్వారే దశాక్షౌహిణికాయుతమ్।

తాలగ్రీవం నామ దైత్యం రక్షార్థం సమకల్పయత్॥

ఉత్తరే తు పురద్వారే తాలకేతుం మహాబలమ్।

 ఆదిదేశ స రక్షార్థం దశాక్షౌహిణికాయుతమ్॥

 పురస్య సాలవలయే కపిశీర్షకవేశ్మసు।

మండలాకారతో వస్తుం దశాక్షౌహిణిమాదిశత్॥

ఏవం పంచాశతా కృత్వాక్షౌహిణ్య పురరక్షణమ్।

శూన్యకస్య పురస్యైవ తద్వృత్తం స్వామినోఽవదత్॥

ఈ తరువాత శ్రీలలితా దేవి యొక్క సేనా పటహధ్వని పైకి మ్రోగినది. రాక్షసేంద్రుల యొక్క యోద్దల నుండి దుందు భిధ్వని మ్రోగినది-1. ఆధ్వని దీక్కులను మర్ధించినది. సముద్ర మధ్యమున క్షోభనుగలుగజేసినది. లోకము చెవిటి యైనది. ముల్లోకములు కంపించినవి-2. రాక్షసుల పటహధ్వని దీక్సమూహమును మర్ధించుచు పర్వత గుహలను పగులగొట్టుచు ఆకాశమంత వ్యాపించినది-3. మహానరసింహావతారక్రోధ హుం కారధ్వనివంటిదై రాక్షసుల పేద్దడోలు ధ్వని విరసముగా ధ్వనించెను-4. అంత, కిలకిలారావములుగల కోట్ల రాక్షసులు కోపించి శ్రీ లలితా పరమేశ్వరిని గూర్చి సన్నద్ధమైరీ-5. ఒకడు రత్నములతో విచిత్రమైన కవచము గప్పిన యాకారముగలవాడై నడచుచున్న రోహణాచలమువలె ప్రకాశించేను-6. ఒక భటుడు కాలరాత్రి వలె క్రూరమై శస్త్రకారుని దాచబడినదియునై మిక్కిలి తెల్లనైన ఖడ్గమును వీదిల్చెను-7. ఒకడు ఒకవైపు చిగురాకు వంటి బల్లెమును పైకెత్తి ప్రకాశింపజేయుచు గుఱ్ఱమెక్కి వీధిలో చారిభేదమును జేసెను-8. కొందరు యోధులు ఎత్తైన కవచములు గలయేనుగలనెక్కిరి. ఆ యేనుగులు ఉత్పాతవాతసంవాతములచే ప్రేరితములైన పర్వతములవలెనున్నవి-9. అచట యోధులు ధరించిన యాయుధములు - పట్టిశములు, ముద్దరములు, భీదురములు, భీండిషాలకములు, ద్రుహణములు, భుశుండులు, కుఠారములు, ముసలములు-10. గడలు, శతఘ్నులు, త్రిశూలములు, బల్లెములు, అర్ధచక్రములు, పహాచక్రములు, వజ్రాంగములై సర్ప ముఖములు గలవి-11. ఫణిశీర్ష ప్రభేదములు, ధనువులు, కొమ్ము ధనువులు, దండములు, క్షేపణికాశస్త్రములు, వజ్ర బాణములు, దృషద్వరములు-12. యవమధ్యములు, ముష్టి మధ్యములు, వలలములు, ఖండలమలు, కటారములు, కోణ మధ్యములు, నూటికిమించిన ఫఉదంతములు-13. పాశాయుధములు, పాశముండములు, వేల కాకతుండములు - ఇట్టి ప్రాణ హారులైన క్రూరములైన యాయుధములను చేత ధరించి రాక్షస కోటులు కవచములు ధరించిరి. అశ్వారోహులు, గజారోహులు, గాడిదల నెక్కువారు-15. ఒంటెలనెక్కువారు, తోడేళ్లనెక్కువారు, కుక్కల నెక్కువారు, కాకాదుల నెక్కువారు, గ్రద్దల నెక్కువారు, కంకాదుల (రాబందుల) నెక్కువారు-16. వ్యాఘాదుల నేక్కువారు, సింహాదుల నెక్కువారు, శరభముల నెక్కువారు, భేరుండముల నెక్కువారు-17. పందుల నెక్కుహరు, సర్పముల నెక్కువారు, శవముల నెక్కువారు - ఈ విధముగా నానా వీధవాహనముల నెక్కినవారు శ్రీలలితాదేవి కెదురుగా గదిలిరి-18. అపుడు మిక్కిలి ప్రబలమైన కోపముతో వారి హృదయములు నిండిపోయెను, కుటిలుడు సేనా నాయకుడైన దుర్మదుడను దానవుని పది యక్షౌహిణీ సేనలతో శ్రీలలితాదేవికెదురుగా బంపెను-19. సకల విశ్వమును దహించుటకా యన్నట్లు గొప్ప సేనలతో భటులతోగూడి యాసేనాని లలిత. కభిముఖముగా వెళ్లేను-20. పటహధ్వనులతో పదునాలుగు భువనముల బగులగొట్టుచు, నా దుర్మదుడు, అట్టహాసములజేయుచు లలితాభిముఖుడై వెల్లెను-21. తరువాత భండాసురుడాజ్ఞాపింపగా, కుటీ లాక్షుడు  మహా బలుడై శూన్యక పురము యొక్క తూర్పు ద్వారమున రక్ష కోరకై పది యక్షౌహిణులతో తాలజంఘకనీనుంచేను-22. దక్షిణదద్వారమున రక్షకైదశాక్షౌహిణులతో తొలభుజునుంచేను-23. పశ్చిమ ద్వారమున రక్షకై పది యక్షౌహిణులతో తాలగ్రీవు నుంచేను-24 ఉత్తర ద్వారమున రక్షకై పద్యక్షౌహిణులతో మహా బలుడైన తాలకేతువు నుంచెను-25. ఆ శూన్యకపురము యొక్క మద్ది చెట్లవలయమున, కోతి తలవంటి యిండ్లలోను మండలాకారముగా నుండుటకు పది యక్షౌహిణులనాదేశించెను-26. ఈ విధముగా ఏబదియక్షౌహిణులతో శూన్యకపుర రక్షణము నేర్పరచి కుటిలాక్షుడు ఆ వృత్తాంతమును స్వామి యైన భండాసురునికి నివేదించెను-27.

కుటిలాక్ష ఉవాచ:

దేవ త్వదాజ్ఞయాదత్తం సైన్యం నగరరక్షణే।

 దుర్మదః ప్రేషితః పూర్వం దుష్టాం తాం లలితాం ప్రతి॥

అస్మత్కింకరమాత్రేణ సునీరాశా హి సా బలా।

 తథాపి రాజ్ఞామాచారః కర్తవ్యం పురరక్షణమ్॥

ఇత్యుక్త్వా భండదైత్యేంద్రం కుటిలాఽక్షోఽతిగర్వితః ।

స్వసైన్యం సజ్జయామాస సేనాపతిభిరన్వితః ॥

దూతస్తు ప్రేషితః పూర్వం కుటిలాక్షేణ దాసవః।

 స ధ్వనన్ ధ్వజినీయుక్తో లలితాసైన్యమావృణోత్॥

 కృత్వా కీలకిలారావం భటాస్తత్ర సహస్రశః।

 దోధూయమానైరసభర్ని పేతుః శక్తి సైనికాః॥

తాశ్చ శక్తయ ఉద్ధండా స్ఫురితాట్టహాసస్వనాః।

 దేదీప్యమానశస్త్రాభాః సమయుధ్యంత దానవైః॥

శక్తీనాం దానవానాం చ సంశోభితజగత్రయః।

 సమవర్తక సంగ్రామో ధూలీగ్రామతతాందిరః॥

రథవంశేషు మూర్ఛంత్యః కరికంఠైః ప్రపంచితాః।

 అశ్వనిఃశ్వాసక్షి ధూలయః ఖం ప్రపేదిరే॥

 తమాపతంతమాలోక్య దశాక్షౌహిణికావృతమ్।

 సంపత్సరస్వతీ క్రోధాదభిదుద్రావ సంగరే॥

 సంపత్కరీ సమానాభిః శక్తిభిః సమధిష్ఠితాః।

 అశ్వాశ్చ దంతినో మత్తా వ్యమర్ధస్ దానం చమూమ్॥

అన్యోన్యతుములే యుద్ధే జాతే కిలికిలారవే ।

ధూలీషు ధూయమానాసు తాడ్యమానాసు భేరిష॥

ఇతస్తతః ప్రవవృధే రక్తసింధుర్మహీయసీ ।

శక్తిభిః పాత్యమానానాం దానవానాం సహస్రశః॥

ధ్వజాని లుఠతాన్యాసన్ విలూనాని శిలీముఖైః।

విగ్రస్తతత్తచ్చిహ్నాని సమం ఛత్రకదంబకైః॥

రక్తారుణాయాం యుద్ధోర్వ్యాంపతితైశ్చత్రమండలైః।

 ఆలంభి తులనా సంధ్యా రక్తాభ్రహిమరోచిషా॥

 జ్వాలాకపాలః కల్పాగ్నిరివచారుపయోనిధౌ।

 దైత్యసైన్యాని నివహాః శక్తీనాం పర్యవారయన్॥

 శక్తిచ్ఛందోజ్జ్వలచ్ఛస్త్రధారానిష్కృత్త కంధరాః।

 దానవానాం రణతలే నిపేతుర్ముండరాశయః॥

దష్టౌష్ఠైర్భృకుటీక్రూరైః క్రోధసంరక్తలోచనైః।

 ముందైరఖండమథవత్సంగ్రామధరణీతలమ్॥

 ఏవం ప్రవృత్తే సమయే జగచ్చక్రభయంకరే।

 శక్తయే భృశసంక్రుద్ధా దైత్యసేనామమర్డయన్॥

 ఇతస్తతశ్శక్తిశస్రైస్తాడితా మూర్ఛితా ఇతి।

 వినేశుర్థానవాస్తత్ర సంపద్ధేవీబలాహతాః॥

అథ భగ్నం సమాశ్వాస్య నిజం ఐలమరిందమః।

ఉష్ట్రమారుహ్య సహసా దుర్మదోఽభ్యద్రవచ్చమూమ్॥

 దీర్ఘగ్రీవః సమున్నద్ధః పృష్ఠే నిష్ఠురతోదనః।

 అధిష్ఠితో దుర్మదేన వాహానోష్ట్రశ్చచాల హ॥

తముష్ట్రవాహనం దుష్టమన్వీయుః క్రుద్ధచేతసః।

 దానావనశ్వసత్ససర్వాస్ భీతాఞ్ఛశక్తియుయుత్సయా॥

అవాకీరద్దిశో భలైరుల్లసత్ఫలశాలిభిః।

 సంపత్కరీచమూచక్రం వనం వార్భిరీవాంబుదః॥

 తేన దుఃసహసత్త్వేన వాడి బహుభిః శరైః ।

స్తంభితేవాభవత్సేనా సంపత్కర్యాః క్షణం రణే॥

 అథ క్రోధారుణం చక్షుర్దధానా సంపదంబికా।

 రణకోలాహలగజమారూఢాయుధ్యతామునా॥

ఆలోలకంకణక్వాణరమణీయతరః కరః।

తస్యాశ్చికృష్య కోదండహోర్వీహకర్ణమాహవే॥

లఘుహస్తతయా పశ్యన్నాకృష్టన్న చ మోక్షణమ్।

 దదృశే ధనుషశ్చక్రం కేవలం శరధారణే॥

 ఆశ్వర్కాబరసంపర్కస్ఫుటప్రతిఫలత్ఫలాః।

 శరాః సంపత్కరీచాపచ్యుతాః సమదహన్నరీస్॥

 దుర్మదస్యాథ తస్యాశ్చ సమభూద్యుద్ధమద్భుతమ్।

 అభూదన్యోన్యసంఘట్టాద్వీస్ఫులింగశిలీముఖైః॥

ప్రథమం ప్రసృతైర్భాణైః సంపద్దేవీసురద్విషోః।

 అంధకారం సమభవత్తిరసుర్వన్నహస్కరమ్॥

తదంతరే చ బాణానామతిసంఘట్టయోనయః।

 విస్ఫులింగా విదధిరే దధిరే భ్రమచాతురీమ్॥

 తయాధిరూఢః సంశ్రేణ్యా రణకోలాహలః కరీ।

 పరాక్రమం బహువిధం దర్శయామాస సంగరే॥

 కరేణ కతిచిద్ధైత్యాన్ పాదఘాతేన కాంశ్చన్న।

 ఉదగ్రదంతముసలఘాతైరన్యాంశ్చ దానవాన్॥

 వాలకాండహతైరన్యాన్ ఫేత్కారైరపరాన్ రీపూన్।

 గాత్రవ్యామర్ధనైరన్నాన్నఖాఘాతైస్తథాపరాన్॥

పృథుమానాభిఘాతేన కాంశ్చద్ధైత్యాన్ వ్యమర్ధయత్।

 చతురం చరితం చక్రే సంపద్దేవీమతంగజః॥

 సుదుర్మదః క్రుధారక్తో దృఢనైకేన పత్రిణా।

 సంపత్కరీముకుటగం మణిమేకమపాహరత్॥

 అథక్రోధారుణదృశా తయా ముకైః శిలీముఖైః ।

విక్షతో వక్షసి క్షిప్రం దుర్మదో జీవితం జహౌ॥

తతః కిలకిలారావం కృత్వా శక్తిచమూవరైః।

 తత్సైనికవరాస్త్వన్యే నిహతా దానవోత్తమాః॥

 హతావశిష్టాదైత్యాస్తు శక్తిబాణైః ఖలీకృతాః।

 పలాయితా రణక్షోణ్యాః శూన్యకం పురమాశ్రయన్॥

కుటిలాక్షుడనెను - ఓ దేవా ( భండాసురదేవా!) నీ యాజ్ఞచే నగర రక్షణమున సైన్యముంచితిని. ముందు దుర్మదుని దుష్ట లలితాదేవితో యుద్ధము జేయుట కంపీతిని-28. మన సేవకుని మాత్రముననే (సేవకునితోనే) ఆయబలనిరాశ జెందినది. అయినను పురరక్షణము జేయుట రాజాచారము-29. అని భండాసురునీతోననీ కుటిలాక్షుడతీ గర్వితుడై సేనా పతులతో గూడి తన సైన్యమును సిద్దపరిచేను-30 భండాసురుడు ముందు కుటిలాక్షుని ద్వారా దూతనుబంపేను. వాడు పెద్దగా ధ్వని జేయుచు సేనాయుతుడై లలితా సైన్యమునావరించెను-31. ఇక నచట రాక్షస భటులు వేల కొలదీ కిలకిలారావములుజేసి, కదిలించుచున్న ఖడ్గములతో శక్తి సైనికులతో తలపడిరి-32. ఆ శక్తులును ఉద్ధండలై అట్టహాస ధ్వనులు చేసి మిక్కిలి ప్రకాశించుచున్న శస్త్రకాంతులు గలవారై రాక్షసులతో తలపడిరి-33. శక్తి దానవుల సంగ్రామమున జగత్రయము శోభించినది. యుద్ధధూళిచే నాకాశమంతయు గప్పబడినది-34. ఆ ధూళులు మొదలు రథము యొక్క వంశములలో (వెన్ను) కాడులలో కొంత మూర్చిల్లినవి. (ఉన్నవి) యేనుగుల కంఠములచే వ్యాపించినవి. గుఱ్ఱముల నిః శ్వాసముల (నిట్టూర్పుల)చే చెల్లా చెదరైనవి. క్రమముగా తరువాత నాకాశమును బొందినవి-35. పద్యక్షౌహిణులతో తన మీదికి వచ్చుచున్న యాదుర్మదుని జూచి సంపత్సరస్వతి యుద్ధమున నేదురుదాడివెడలెను-36. సంపత్కరీసమానురాండ్రైన శక్తులధిరోహించిన గుఱ్ఱములు, మదపుటేనుగులు, రాక్షస సేనను విశేషముగా మర్ధించినవి.-37. అన్యోన్య యుద్ధములు జరుగుగా కిలకిలా రావములు వెలయుచున్నవి ధూళులు ఎగురుచు వ్యాపించుచున్నవి. భేరులు మ్రోగుచున్నవి-38. ఇటునటు రక్తనది గొప్పగా పెరిగిపారినది. శక్తులచే పడగొట్టబడుచున్న వేలకొలది-39. రాక్షసుల ధ్వజపతాకలు శక్తి బాణములతో దీనిగి తెగిక్రిందికి జారిపడినవి. ఆయా చిహ్నములు (సేనా రాజ చిహ్నములు) జారిపడినవి. గొడుగుల గుంపు విరిగిపడి దొరలినదీ, ఇదే రక్తా రుణమైన యుద్దభూమి ఆ గొడుగుల గుంపు సంధ్యా రక్త మేఘములలో చంద్రునితో బోల్చదగినట్లున్నది-41. సుందర సముద్రమున జ్వాలలే కపాలముగాగల, ప్రయాగ్నివలె శక్తి సమూహములు దైత్యసైన్యముల జుట్టుముట్టినవి-42. శక్తి సమూహముల యొక్క పైకీ మండుచున్న శస్త్ర పుటంచులతో దానవ కంఠములు తెగినవి. ఆ విధముగా యుద్ధ భూమిలో రాక్షసుల తలలు రాసులై పడినవి-43. ఆ విధముగా తెగిన రాక్షసుల తలలతో యుద్ద భూమియంతయు దట్టముగా నిండిపోయినది. ఆ తెగిన తలలు పెదవిని గొఱకుచున్నవి. క్రూరముగా కనబొమ్మలు ముడిచినవి. కన్నులు కోపముతో నెక్టనైనవి-44. జగచ్చక్రమునకే భయంకరమై యీ విధముగా యుద్ధము జరుగగా శక్తులు మిక్కిలికోపించి రాక్షస సేనను మర్దించిరి-45. ఇటునటు శక్తి శస్త్రములచే కొట్టబడి దానవులు మూర్ఛితులైరి. సంపద్దేవీసైన్యముచే హతులైయట దానవులు విశేషముగా నశించిరి-46. ఆ తరువాత. చెల్లాచెదరైన తన సైన్యమును ఓదార్చికూర్చి శత్రుదమనమును జేయువాడైన, దుర్మదుడు వెంటనే ఒంటే సెక్కి సంపత్కరీ సైన్యముపైకి పరువిడెను-47. పొడవైన కంఠముగలది, ఎత్తుగా సిద్దమైనదీ, వీపున కఠినముగా మునిగోలతో గొట్టబడినదియు, దుర్మదుడెక్కిన వాహనమైన యొంటెయు కదిలేను-48. కోపించిన చిత్తములుగల సైనికులు ఆ యుద్ధ వాహనుడైన దుర్మదుని వెంబడించిరి.. దుర్మదుడు శక్తితో యుద్దము చేయుతలంపుతో భీతులైన వారినందరిని ఆశ్వసింపజేసెను-49. మేఘము జలములతో వనమున జల్లినట్లు దుర్మదుడు వాడియై మేలుపుల, జిమ్ముములుకులుగల బాణములతో దిక్కులను, సంపత్కరీ సైన్య చక్రమును, గప్పివైచెను -50. సహింపరాని బలముగల దుర్మదుడు బహు బాణములతో గొట్టగా రణమున సంపత్కరీ సైన్యము క్షణ కాలము స్తంభిత మైనది వలె నయ్యెను-51. అంత సంపదంబిక కన్ను కోపముతో నెల్డనయ్యెను. రణ కోలాహలమనుగజము నెక్కి దుర్మదునితో యుద్ధము జేసెను-52. ఆ యుద్ధమున వింటినారిని ఆ కర్ణాంతము లాగెను. అప్పుడామె చేయి కంకణముల నాదములతో మనోహరముగ నుండెను-53. చురుకైన వేగముగల చేతులు వింటి చక్రముననుండుట మాత్రము గనబడినది. కాని బాణములు లాగుటగాని వదులుటగాని చూడబడుటలేదు. బాణ ప్రయోగమంత వేగముగా జరుగుచున్నది-54, సంపత్కరీ వదిలిన బాణములు. ఆకాశమునంటిన సూర్యుని కిరణములకు దీటైన  ములుకులుగలవై శత్రువులను దహించి వైచినవి-55. దుర్మదునకును సంపత్కరి కిని అద్భుతముగా యుద్ధము జరిగినది. ఇరువురి బాణములు ఒకటినొకటి ఒరసికొని నిప్పులు గ్రక్కినవి-56. సంపత్కరీ దుర్మదులు ప్రయోగించిన బాణములు మొదట . సూర్యుని గప్పివైచి యంధకారమును జేసినవి-57. దాని మధ్యలో బాణముల యొరపిళ్ల చేనిప్పులు చెలరేగినవి. దీని వలన వారు వదిలిన  బాణములు నిప్పుకణములని భ్రాంతి గలిగించినవి-58. సంపత్కరియధిష్టించిన రణకోలాహలమను ఏనుగుతన మొలతో (పిరుదులతో) రణమున బహువిధములైన పరాక్రమముల జూసీనది-59. తొండముతో కొంతమంది రాక్షసులను, పాదాఘాతములతో కొంతమందిని, వాడియై రోకళ్లవలెనున్న దంతముల దెబ్బలతో తక్కిన రాక్షసులను-60. తోకదెబ్బలతో మరికొందరిని, సేత్కారములతో నితర శత్రువులను, శరీరము యొక్క మర్ధనము (రాపిడి)తో ఇతరులను, గోళ్ల దెబ్బలతో కొందరిని-61. (ఫుధుమానాభిఘాతముతోడ విశాలమదప్రేరితములైన దెబ్బలచే) కొందరిని, విశేషముగా మర్దించి (పచ్చడిగా) వైచెను. ఈ విధముగా రణ కోలాహలగజము రణమున చతురమైన చరిత్రను సృష్టించెను-62. ఆ దుర్మదుడు కోపముతోనెజు పెక్కి దృఢమైన యొక బాణముచే సంపత్కరీదేవి మకుటము(కిరీటము)ననున్న యొకమణిని తొలగించి యపహరించెను-63. తరువాత కోపమున నెఱ్ఱనైన చూపుతో సంపత్కరీ దేవి వదిలిన బాణములచే ఎదపై గొట్టబడి యా దుర్మదుడు ప్రాణమును వదిలెను-64. తరువాత కిలకిలారావములు చేసిన శక్తి సేనానాయకురాండ్రచే తక్కిన దానవసైనికవరులు నిహతులైరి - 65. చావగా మిగిలిన రాక్షసులు శక్తి బాణములచే చెల్లాచెదరై రణ భూమినుండి పరిగెత్తి శూన్య పురమునాశ్రయించిరి-66.

తద్వృత్తాంత మథాకర్ణ్య సంక్రుద్ధో దానవేశ్వరః।

 ప్రచండేన ప్రభావేణ దీప్యమాన ఇవాత్మని॥

స పస్పుర్శ నియుద్దాయ బద్ధముగ్రవిలోచనః॥

 కుటిలాక్షం నికటగం భభాషే పృతనాపతిమ్॥

కథం సా దుష్టవనితా దుర్మదం బలశాలినమ్।

 నిపాతితవతీ యుద్ధే కష్ట ఏవ విధేః క్రమః॥

న సురేషున యక్షేషు నోరగేంద్రేషు యద్బలమ్।

 అభూత్రృతిహతం సోఽపి దుర్మదోఽబలయా హతః ॥

 తాం దుష్టవనీతాం జేతుమాక్రష్టుం చ కచం హఠాత్।

 సేనాపతిం కురండాఖ్యం ప్రెషయాహవదుర్మదమ్॥

 ఇతి సంప్రేషితస్తేన కుటిలాక్షో మహాబలమ్।

 కురండం చండదోర్దండమాజుహావ ప్రభోః పురః ॥

 స కురండః సమాగత్య ప్రణామ స్వామినేఽ దిశత్।

 ఉవాచ కుటిలాక్షస్తం గచ్ఛ సజ్జయ సైనికాస్॥

 మాయాయాం చతురోఽసి త్వం చిత్రయుద్ధవిశారద।

 కూటయుద్దే చ నిపుణస్తాం స్త్రియం పరిమర్డయ॥

ఇతి స్వామిపురస్తేన కుటిలాక్షేణ దేశిత।

 నిర్జగామ పురాత్తూర్ణం కురండశ్చండవిక్రమః॥

వింశత్యక్షౌహిణీభిశ్చ సమంతాత్పరివారితః।

 మర్దయన్ స మహీగోలం హస్తివాజీపదాతిభిః॥

 దుర్మదస్యాగజశ్చండః కురండః సమరం యయౌ॥

ధూలీభిస్తుములీకుర్వస్ దిగంతం ధీరమానసః।

శోకరోషగ్రహగ్రస్తో జవనాశ్వగతో యయౌ॥

 శార్జం ధనుః సమాదాయ హోరటంకారముత్స్వనమ్।

 వవర్ష శరధారాభిః సంపత్కర్యా మహాచమూమ్॥

పాపే మదనుజం హత్వా దుర్మదం యుద్ధదుర్మదమ్।

 వృథా వహసి విక్రాంతిలవలేశం మహామదమ్॥

ఇదానీం చైవ భవతీమేఖైర్నారాచమండలైః

అంతకస్య పురీమత్ర ప్రాపయిష్యామి పశ్య మామ్॥

అతిహృద్యమతిస్వాదు త్వద్వపర్బీలనిర్గతమ్।

 అపూర్వహంగరక్తం పిబంతు రణపూతనాః॥

 మమానుజవధోత్థస్య ప్రత్యవాయస్య తత్ఫలమి।

 అధునా భోక్ష్యసే దుస్తే పశ్యమే భూయోధ్యలమ్॥

 ఇతి సంతర్జయవ్ సంపత్కరీం కరివరస్థితామ్।

 సైన్యం ప్రోత్సాహయామాస శక్తిసేనావిమర్ధనే॥

అథ తాo పృతానాం చండీ కురండస్య మహౌజసః।

విమర్దయతుముద్యుక్తా స్వసైన్యం ప్రోదసీసపాత్॥

 అపూర్వాహవసంజాతకౌతుకాథ జగాద శామ్।

 అశ్వారూఢా సమాగత్య సస్నేహార్థ్రమిదం వచః॥

 సఖి సంపత్కరి ప్రీత్యా మమ వాణీ నిశమ్యతామ్।

 అస్య యుద్ధమిదం దేహి మమ కర్తుం గుణోత్తరమ్॥

 క్షణం సహస్వ సమరే మయెవేష నీయోత్స్యతే।

 యాచితాసి సఖత్వేన నాత్ర సంశయామాచర॥

 ఇతి తస్యా వచః శ్రుత్వా సంపద్దేవ్యా శుచస్మితా।

 నివర్తయామాస చమూం కురుండాభిముఖోత్థితామ్॥

 అథ బాలార్కవర్ణాభిః శక్తిభిః సమధిష్ఠితా॥

 తరంగా ఇవ సైన్యాబ్ధేస్తురంగా వాతరంహసః॥

 ఖరైః ఖురపుటైః క్షోణీముల్లిఖంతో ముహుర్ముహుః।

 పేతురేకప్రవాహేణ కురండస్య చమూముఖే॥

వల్గావిభాగకృత్యేషు సంవర్తనవివర్తనే।

 గతిభేదేషు చారేషు పంచధా ఖురపాతనే ॥

ప్రోత్సాహానే చ సంజ్ఞాభిః కరపాదాగ్రయోనిభిః।

 చతురాభిస్తురంగస్య హృదయజ్ఞాభిరాహవే॥

అశ్వారూఢాంబికాసైన్యశక్తిభిః సహ దానవాః ।

ప్రోత్సాహితాః కురండేన సమయుధ్యంత దుర్మదా॥

 ఏవం ప్రవృత్తే సమరే శక్తీనాం చ సురద్విషామ్।

 అపరాజితనామానం హయమారుహ్య వేగినమ్॥

 అభ్యద్రవద్దురాచారమశ్వారూఢా కురండకమ్॥

ప్రచలద్వేణిసుభగా శరచ్చంద్రకలోజ్జ్వలా।

 సంధ్యానురక్తశీతాంశుమండసుందరాననా॥

 స్మయమానేవ సమరే గృహీతమణిహిర్ముకా।

 అవాకిరచరాసారైః కురండం తురగాసనా॥

తురగారూఢయోత్తిష్ఠాః సమాక్రోమన్ దిగంతరాన్।

 దిశో దశ వ్యానశిరే రుక్మపుంభాః శిలీముఖాః॥

 దుర్మదస్యాగ్రజః క్రుద్ధః కురండశ్చందవిక్రమః।

 విశిఖైః శార్జనిష్యూతైరశ్వోరూధామవాకిరత్॥

చండైః ఖురపుటైః సైన్యం ఖండయన్నతివేగతః।

 అశ్వారూధాతురంగోపి మర్ధయామాస దానవాన్॥

తస్య హేషారవాద్దూరముత్పాతాంబుదనిఃస్వనః।

ఆమూర్ఛయన్ననేకాని తస్యానీతాని వైరిణ॥

 ఇతస్తతః ప్రచలితైర్థిత్యచక్రే హయాసనా।

 నిజం పాశాయుధం దివ్యం ముమోచ జ్వలితాకృతి॥

తస్మాత్పాశాత్కోటీశో న్యే పాశా భుజగభీషణాః।

 సమస్తమపితమైన్యం బద్ధాబద్ధా వ్యమూర్ఛయమ్॥

అధసైనికబంధన క్రుద్ధః స చ కురండకః।

 శరేణికేన చిచ్ఛేద తస్యా మణీధనుర్గుణమ్॥

ఛిన్నమౌర్వి ధనుస్త్యక్త్వా భృశం క్రుద్దా హయాసనా।

 అంకుశం పాతయామాస తస్య వక్షసి దుర్మతే॥

 తేనాంకుశేన జ్వలతా పీతజీవితశోణితః।

 కురండోన్యపతద్భూమౌ వజ్రరుగ్ణ ఇవ ద్రుమః॥

 తదంకుశవినిష్ట్యుతాః పూతనాః కశ్చిదుద్భటాః।

 తత్సైన్యం పాశవిష్యదం భక్షయిత్వా క్షయం గతాః॥

 ఇత్థం కురండే నిహతే వింశత్యక్షౌహిణీపతా।

 హతావశిష్టాస్తే దైత్యాః ప్రపలాయాంత పై ద్రుతమ్॥

కురండం సానుజం యుద్ధే శక్తిసైన్యైర్నిపాతితమ్।

 శ్రుత్వా శూన్యకనాధోఽపి నిశశ్వాస భుజంగవత్॥

ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే శ్రీలలితోపాఖ్యానే

దుర్మదకురండవధో నామ ద్వావింశోఽధ్యాయః॥

తరువాత నా వృత్తాంతమును వీని కోపించిన దానవేశ్వరుడు (భండాసురుడు)-67. ఉగ్రమైన కన్నులు గలవాడై ఆత్మలో ప్రచండప్రభావముతో ఉంచిన వానివలి. నిలయుద్ధనవజై (బాహుయుద్దమునకై) - భూమిమీదచేయు దగ్గరి యుద్ధమునకై ఖడ్గమును బట్టెను. సమీపమునసంన్న సంస కుటిలాక్షుని విల్లంను-68. ఆ దుష్టస్తీ యుద్ధమున బలశాలియైన దుర్మదుని సెట్లు పడగొట్టినది? విధాత క్రమము కస్టమరకలు -69. డేవతలకేగాక, యక్షులతోగానీ, సర్పరాజులలోగాని దుర్మదుని బలము కట్టుబడలేదు. కాని, యా మహాబలుడు గూడ ఒక్క రణలతో హతుడయ్యెను-70. ఆ దుష్టస్త్రీని జయించి హఠాత్తుగా కొప్పుబట్టి యోడ్చితెచ్చుటకు యుద్ధ దుర్మదుడై సేనాపతియైన కురండుడను. వాని సామెపైకి బంపుటకై కుటిలాక్షునితో విలువ నంపెను-71. కుటిలాక్షుడు చండదోర్దండుడైన కురండునిని ప్రభువైన భండాసురుని యెదుటకుబీలిచేను-72. ఆకురండకుడు వచ్చి స్వామికి నమస్కరించి నిలువ కుటిలాక్షుడాతనిని-వెళ్లుము. సైనికులను సిద్దపరుపుము-73. నీవు మాయలో చతురుడవు. చిత్రయుద్ధ విశారదుడవు-కూటయుద్ధమున నిపుణుడవు. ఆ స్త్రీని పరిమర్ధించుము-74. అని స్వామీ యెదుటనే కుటిలాక్రుడాదేశించగా చండవిక్రముడైన కురండుడు వెంటనే శూన్యకపురమునుండి బయలుదేరెను-75. వానిచుట్టు ఇరువది యక్షౌహిణుల సైన్యముండెను. అది తన అశ్వ-గజ-పదాతి సైన్యములచే భూగోళమును మర్ధించుచుండెను. ఈ విధముగా దుర్మదుని యన్న భయంకరుడైన కురండుడు యుద్ధమునకు వెళ్లాను-76. ధూళులతో దిగంతములను సంకులముగా జేయుచు ధీరమనస్కుడై శోక-రోషములనెడు గ్రహముతో ఆవహింపబడిన వాడై జవనాశ్వమునెక్కి వెడలేను-77. కొమ్ముతో జేసిన ధనువును, ఘోరమైన ఠంకార ధ్వని గలదానిని, దీసికొని సంపత్కరీసేనపై బాణధారల వరించెను-78. ఓ పాపులా! యుద్ధదుర్మదుడై నా తమ్ముడైన దుర్మదునీ జంపిన ఒక చిన్ని పరాక్రమమున మహామదమును వహించుచున్నావు-79. ఇప్పుడు నిన్ను ఈ నా బాణసమూహములచే ఇచటనే యమపురికి పంపుదును, నన్నుజుడుము-80. మిక్కలియిష్టమైన రుచిగల్లి నీ శరీర రంధ్రములనుండి వెలువడి, క్రొత్తనైన స్త్రీ రక్తమును రణపూతనలు త్రాగుగాక-81. ఇది నాతమ్ముని జంపిన పాపమునకు ప్రతిఫలము. ఇప్పుడనుభవింపబోవుచున్నావు. చూడుము నా భుజబలము-82. అని శ్రేష్ఠమైన యేనుగునెక్కియున్న సంపత్కరిని భయపెట్టుచు తన సైన్యమును శక్తిసేనా మర్ధనమునకై ప్రోత్సహించుచుండెను-83. అంత, మహా తేజస్వియైన కురండునియొక్క సైన్యమును మర్ధించుటకై యుద్యుక్తురాలై ‘చండి’ తన సైన్యమును ప్రోత్సహించేను-64, అపూర్వ యుద్దము జేయు కుతూహలముగలిగి యశ్వారూఢయై ‘వచ్చి’ చండి ప్రేమతో సంపత్కరీతో నిట్లనెను-85. చెలీ! సంపత్కరీ! ప్రేమతో సామాటవినుము. ఈతని యుద్ధమును సొమ్ము . నాకు శ్రేష్టగుణము  లభించును-86. క్షణకాలము సహింపుము యుద్ధమును నాచేతనే వీడు చంపబడును. హేహముననే నిన్నడుగుచున్నాను. కాని నీవు వీనిని జంపలేవని సంశయింపవలదు-87. అను నామెమాటనుదినీ సంపత్కరీ దేవి చిరునవ్వుగలదై కురండునికెదురుగా బయలుదేరిన తన సేనను మరల్చెను-88. వెంటనే బాలాసూర్య ప్రభలుగల శక్తులు వాయువేగముగల తురంగములనెక్కిరి. అవి సేనా సముద్రపు తరంగముల వలె ఎత్తైత్తుగా మున్ముందుకు అప్రతిహతముగ వేగముగ గదలుచున్నవీ-89. తీక్షములైన డెక్కల దొప్పలతో భూమినీ కమ్మి మాటి మాటికి వ్రాయుచున్నవి. (ముద్రలు వేయుచున్నవి). ఆ విధముగా అశ్వముల ప్రవాహముతో శక్తులు కురండుని సేనాముఖముపైబడిరి-90. వల్గావిభాగ కృత్యములలో ముందు కాళ్లు పైకెత్తి నడచు రకములు, సంవర్తన వివర్తనములలో (దగ్గరగా దూరముగా జుట్టివచ్చుటలు), గతి బేధములలో నడకలలోని రకములు, చారములలో (చరించుటలోని రకములు), పలువిధములుగా గిట్టలు కోట్టుటలో-91. కరములతో పాదములతో సంజ్ఞులు చేసి ప్రోత్సహించుటలో, చతురలైరణమున యశ్వములహృదయములదెలిసినవారు ఆశక్తులు. ఇటువంటి అశ్వారూడలైనయంబికా శక్తులతో సహ కురండ ప్రోత్సహితులైన దానవులు దుర్మదులై యుద్ధముజేసిరి-93. ఈ విధముగా శక్తులకును రాక్షసులకును యుద్ధము జరుగగా వేగవంతమై యపరాజితమనుపేరుగల యశ్వమునెక్కిన శక్తి దురాచారుడైన కురండకుని మీది కురికేను-94. ఆమె కదులుచున్న జడతో సుందరమైనది. శరత్కాల చంద్రకలవలె తెల్లగా ప్రకాశించునది. సంధ్యాకాలపు రక్తచంద్రమండలము వోలె సుందరమైన ముఖముగలిగి-95, చిరునవ్వు నవ్వుచున్నదా యనట్లున్నది. యుద్ధమున మణులతో పొదిగిన ధనువును చేతబూనినదీ, తానెక్కినది తురగమగుటచే తురగాసనయైన యాశక్తి బాణముల జడివానలను కురండునిపై గురిపించినది-96. తురగారూఢచేత పైకి వేయబడిన బంగారు పుంఖములు గల బాణములు దొంగతరముల నాక్రమించినవై దశదిక్కులను నశింపజేసినవి-97. దుర్మదాగ్రజుడైన కురండుడు క్రుద్దుడై చండవిక్రముడై శార్జధనువునుండి ఒక్కుమ్మడి వెడలిన బాణములతో సాహయాసనను గప్పివైచెను-98. హయాసన యొక్క గుఱ్ఱము గూడ తన తీవ్రములైన గిట్టలచే రాక్షసుల నతివేగముగా ఖండించుచు మర్ధించుచుండెను-99. ఆ గుఱ్ఱముయొక్క సకిలింపుధ్వని ఉత్పాతకాలములోని సముధ్వనియే ఆవైరియైన కురండుని యొక్క యనేక సైన్యములను దూరముగా మూర్టీల్లజేసినదీ-100. ఆపోయరూఢ రాక్షస చక్రమున (సైన్యసమూహమున) తననడకలచే మండుచున్న యాకారముగల తన దీప్యపాశాయుధమును వదిలేను-101. ఆ పాశమునుండి కోట్లకొలది సర్పములవోలె భయంకరములైన యితర పాశములు బయలువెడలి సమస్త రాక్షససైన్యమును  బంధించి, బంధించి మూర్చిల్లజేసినవి-102. అంత సైనికబంధముచ్వేకురండకుడు క్రుద్దుండయ్యెను. ఒక బాణముతో హయాసనయొక్క వింటినారిని తెగవేసెను-103. నారి తెగిన ధనువును వదిలి హాయాసన మిక్కిలి కోపించి యాదుర్మతియైన కురండుని యెదపై నంకుశమును విసిరేను-104. ఆ మంటలు విరజిమ్మునంకుశముచే కురండుని జీవితమను రక్తము ద్రాగబడినది. వజ్రపాతమున వృక్షము పడినట్లు కురండుడు అంకుశపాతమున గతజీవుడే భూమీపైబడెను-105. ఆయంకుశమునుండి యెక్కుమ్మడిగా బయలువెడలిన కొన్ని పూతనలు (శక్తులు) ఉద్భటములై పాశములు చంపి వదిలిన సైన్యమునంతయు భక్షించీ మాయమైనవి-106, ఈ విధముగా ఇరువదియక్షౌహిణులకు పతియైన కురండుడు చంపబడగా, మిగిలిన రాక్షసులు వేగముగా పలాయనముజెప్పిరి (పారిపోయిరి)-107, శక్తిసైన్యము తమ్మునితోబాటు కురుండుని జంపుటవిని శూన్యపురపతియైన బండాసురుడు నాగుబామువలె బుసలుగొట్టెను-108.

ఇది శ్రీ బ్రహ్మాండ మహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితోపాఖ్యానమున దుర్మదకురండకవధమను ఇరువదిరెండవయధ్యాయము.