4 - లోకకల్పనము

సూత ఉవాచ :-

ఆత్మస్యవస్థితే వ్యక్తే వికారే ప్రతిసంహతే

 సాధర్యేణావశిష్టేతే ప్రధానపురుషా తదా

తమఃసత్త్వగుణావేతా సమత్వేన వ్యవస్థితౌ

అనుద్రిక్తావనుచరో తేన ప్రోక్తా పరస్పరమ్

గుణసామ్యే లయో జ్ఞేయ ఆధిక్యే సృష్టిరుచ్యతే

సత్త్వవృదౌ స్థితీరభూద్ ధ్రువం పద్మ శిఖాస్థితమ్

యదా తమసి సత్త్వే చ రజోప్యనుగతం స్థితమ్

రజః ప్రవర్తకం తచ్చ బీజేప్వీవ యథాజలమ్

సూతుఁడిట్లు పలికెను :

అవ్యక్తమయిన వస్తువు తనలో వెల్లుచుండగా ఫలితము (ప్రపంచము) ఉపసంహరింపబడగా, సమాన ధర్ములై నిర్మలులై ప్రధాన పురుషు లొప్పుదురు. (1) ప్రధాన పురుషులిరువురు క్రగముగా తమస్సత్త్వగుణోపేతులు. వారు సమభావమున నుందురు. వారుదైక రహితులు; ఒండొరుల ననుసరించి యుండువారు; అని చెప్పబడిరి. (2) గుణములయందు సామ్యముప్పతీల్ల నది లయమనీ యెలుంగ వలయును. గుణద్వయము నందు సామ్యము పోయి ఒకదానికంటే వేతాక దానికాధిక్యము గల్గినచో దానిని సృష్టియందురు. సత్త్వము వృద్ధియందు స్థితి బ్రహ్మయందు ధ్రువముగా గలుగును. (3) తమో గుణమునందు సత్త్వగుణమునందు రజోగుణమును గతమై యుండినది బీజముల యందలి నీటివలె, రజః ప్రవర్తనకమగును. (4)

గుణా వైషమ్యమాసాద్య ప్రసంగేన ప్రతిష్ఠితాః

గుణేభ్యః క్షోభ్యమణేభ్యర్థయో జ్ఞేయా హి సాదరే

శాశ్వతాః పరమా గుహ్యాః సర్వాత్మానః శరీరణః

సత్త్వం విష్ణూ రజో బ్రహ్మా తమో రుద్రః ప్రజాపతిః

రజః ప్రకాశకో విష్ణుర్బహ్మస్సపుత్వమాప్నుయాత్

తాయతే చ యశశ్చిత్రా లోకసృష్టిర్మహాసః

తపః ప్రకాశకో విష్ణుః కాలత్వేన వ్యవస్థితః

సత్త్వప్రకాశకోవిష్ణువుః స్థితిత్వేన వ్యవస్థితః

ఏత ఏవ త్రయో లోకా ఏత ఏవ త్రయో గుణాః

ఏత ఏవ త్రయే వేదా ఏత ఏవ త్రయాగ్నయః

పరస్పరాన్వయా హ్యేతే పరస్పరమునువ్రతాః

పరస్పరేణ వర్తనే పేరయన్తి పరస్పరమ్

అన్యోన్యం మిథునం హ్యేతే అన్యోన్యముపజీవినః

క్షణం వీయోగే న హ్యేషాం న త్యజస్తి పరస్పరమ్

ప్రధానగుణవైషమ్యాత్సర్గకాలే ప్రవర్తతే

అదృష్టాధిష్ఠితాత్పూర్వే తస్మాత్ సదసదాత్మకాత్

బ్రహ్మా బుద్ధిత్వమిథునం యుగపత్ సంబభూవ హ

తస్మాత్రమోవ్యక్తమయం క్షేత్రజ్జా, బ్రహ్మసంజ్ఞకః

సంసిద్ధకార్యకరణో బ్రహ్మాగ్రే సమవర్తత

తేజసా ప్రతిమోధీమానవ్యక్తః సంప్రకాశకః

గుణములు వైషమ్యము నొంద, అందధిక గుణ సంబంధియగు సృష్టియగును. క్షోభ్యమాణములగు గుణములచే మూడుగుణములు కలుగునని యెఱుంగవలెను. (5) ఆ గుణంబులు సర్వశరీరములందుండీ శాశ్వతములు. పరమములు గుహ్యములునై సర్వాత్మనా ప్రతిష్ఠతములై యుండును. సత్త్వనామక గుణాత్ముడు, విష్ణువుగా, ఆత్మభవుఁడయిన బ్రహ్మ రజోగుణనామకుఁడుగా, రుద్రుఁడు తమోగుణాత్మకుడుగా నుందురు. (6) రజః ప్రకాశకుఁడు విష్ణువు బ్రహ్మ స్రష్టయగును; ఆ మహౌజసుఁడయిన బ్రహ్మ నుండీ చిత్రాతి చిత్రమయిన లోకసృష్టి యగును. (?) తమః . ప్రకాశకుఁడగు విష్ణువు కాల గుణము ననుసరించి వ్యవస్థితుఁడు కాగా, సత్త్వ ప్రకాశకుడయిన విష్ణువు స్థితిత్వ లక్షణ వ్యవస్థితుడగును. (8) వీరలే (విషుబ్రహ్మరుద్రులె) త్రిలోకములు, వీరే గుణత్రయము; వీరే వేదత్రయము; వీరే అగ్నీత్రయము. (9) వీరు మువ్వురు పరస్పరము సమన్వయులు, పరస్పరము ననుసరించి చేయు వ్రతారంభులు, పరస్పరాను వర్తనులు, పరస్పరము వీరే ప్రేరేపించుకు ఎదరు, (10) వీరు విడివడక కలిసియుందురు. పరస్పర మొకరొకరిపై నాధారపడి జీవించువారు, వీరికి నొక్క క్షణకాలమయిన వీయోగము లేదు. ఒండొరులను వీరు వీడిచి యుండరు. (11) సృష్టికాలమున ప్రధానముగా నీ త్రిగుణములు పరస్పర వైషమ్యాలు గలిగినట్టులుండును, మొదట నదృష్టుండగు విరాట్పురుషుని యందు అధిష్ఠితములగుట నీ త్రిగుణరూపులగు త్రిమూర్తులు సదసదాత్మకులయిరి. (12) బ్రహ్మ బుద్దీ తత్త్వమను నీ జంట యేక కాలంబున సుద్భూతము లయ్యెను. అందుచే నీవ్యక్తము తమోమయంబనియు, క్షేత్రజుఁడు బ్రహ్మ సంజ్ఞుండనియు చెప్పబడును. (13) సంసిద్ధ కార్యకరణంబున బ్రహ్మ ప్రధానుడగును. తేజస్సుచే నప్రతిముఁడు ధీమంతుఁడగు వ్యక్తుఁడయ్యెను.

సవై శరీరప్రథమో ధారణత్వవ్యవస్థితః

జ్ఞానేనాప్రతిమేనేహ వైరాగ్యేణ చ సత్పతిః

అవ్యక్తత్వాయ తేనాస్య మనసా యద్యదిచ్ఛతి

వశీకృతత్వాత్రిగుణ్యాతాపేక్షత్వాచ్చ భావతః

చతుర్ముఖస్తు బ్రహ్మల్వే కాలవ్వే చాంతకృద్భవః

సహస్రమూర్ధా పురుషస్తిస్కోవస్థాః స్వయంభువః

సర్వం రజశ్చ బ్రహ్మత్వే కాలవ్వే చ రజస్తమః సాత్వికః

పురుషత్వే చ గుణవృత్తం స్వయంభువః

బ్రహ్మత్వ సృజతే లోకాన్ కాలల్వే సంక్షయత్యపి

పురుషత్వ ఉదాసీనన్తస్రావస్థాః స్వయంభువః

బ్రహ్మా కమలపత్రాక్షః కాలో జాత్యంజనప్రభః

పురుషః పుండరీకాక్షో రూపేణ పరమాత్మనః

ఏకదా సద్విధా చైవ త్రిధా చ బహుధా పునః

యోగీశ్వరః శరీరాణి కరోతి వికరోతి చ

నానాకృతిక్రియారూపమాశ్రయన్తో స్వలీలయా

త్రిధా యద్వర్తతే లోకే తస్మాత్తిగుణ ఉచ్యతే

చతుర్థా ప్రవిభక్తత్వాచ్చతుర్వ్యూహః ప్రకీర్తితః

యదా శేతే తరార్ధిస్తే యద్భుంకే విషయాన్ ప్రభుః

యత్స్వస్థాః సతతం భావస్తస్మాదాత్మా నిరుచ్యతే

ఋషిః సర్వగతశ్చాత్ర శరీరే సో భ్యయాత్ ప్రభుః

ఆతఁడే ప్రథమతః శరీరము కలవాఁడు - ధారణత్వ వ్యవస్థితుఁడగుట వలన; ఆతఁడప్రతీమానమైన జ్ఞానము చేతను, వైరాగ్యము చేతను సత్ర్పభువు. (15) త్రిగుణములు స్వవశీకృతములై యుండుటవలన, అవి యన్యోన్య సాపేక్షము లగుట వలన, అవ్యక్తిత్వ కలితుఁడయిన యీతఁడు భావమందేమేమి మనసా యభిలషించునో వానీ నేల్ల చేయును. (16) అతఁడే. బ్రహ్మత్వమున చతుర్ముఖాఖ్యుండు, కొలత్వమున (కాలవశముచే) విలయ కరుఁడగు రుద్రుఁడు, మరియు సహస్ర శీర్పుఁడయిన పురుషుఁడుగా జైలంగును. ఇయ్యవి స్వయంభువునకు కలిగిన యవస్థాత్రయము. (17) బ్రహ్మాత్వమున రజోగుణమున, రుద్రత్వమున రజస్తమో గుణముల, విష్ణుత్వమున సత్త్వగుణమున, స్వయంభువుఁడు గుణవృత్త కలితుఁడగును, (18) బ్రహ్మత్వమున నితఁడు లోకమును సృజించును; రుద్రత్వమున లోకములను సంక్షయము చేయును; పురుషత్వమునఁ విష్ణుత్వమున) ఉదాసీనుఁడై యుండును. ఈ మూఁడు స్వయంభువుని యొక్క అవస్థాత్రయము. (19) బ్రహ్మ కమలపత్రభవుఁ డు, కాలుఁడు కాలాంజన సమాన కాంతి నోప్పు పురుషుఁడు; పుండరీకాక్షుఁడు రూపమున పరమాత్మ స్వరూపుడు. (20) వీరలతో నాతఁడేక రూపుడగును; ద్వీవిధ రూపుడై యొప్పును; త్రివిధరూపుడుసునగు; యోగీశ్వరుడయిన పురుషుఁడు వివిధ వికారములు గలిగిన శరీరములను చేయును. (21) ఆతఁడు స్వలీలచే సానో కృతిక్రియా రూపముల నాశ్రయించును, అతఁడు మువ్విధములుగా లోకమున ప్రవర్తించుటచే త్రిగుణుఁడని చెప్పబడును. (22) అతఁడు నాల్లు విధముల విభక్తుఁడై యుండినందున చతుర్వ్యూహుఁడని కీర్తింపబడెను. (వాసుదేవ, ప్రద్యుమ్న, అనిరుద్ద, సంకర్షణములను నవి చతుర్వ్యూహములు). అతఁడు నిద్రించుచు, అదృశ్యుండగును; విషయంబుల భుజించు వారందరు తనయందుండు కారణములచే నాతడాత్మ మనంబడును. ఋషియనియు, సర్వగతుండనియు, ప్రభుఁడనియు నాతఁడే చెప్పబడును. (24)

స్వామీ సద్వస్య యత్సర్వం విష్ణుః సర్వప్రవేశనాత్

 భగవానగ్రసద్భావాన్నాగో నాగస్య సంశ్రయాత్

పరమః సంప్రహృష్టత్వాద్దేవదోమితి స్మృతీః

సర్వజ్ఞః సర్వవిజ్ఞానాత్సర్వః సర్వం యతస్తతః

నరాణాం స్వాపనం బ్రహ్మా తస్మాత్ నారాయణః స్మృతః

త్రిధా విభజ్య ఛాత్మానం సకలః సంప్రవర్తతే

సృజతే గ్రసతే చైవ పాల్యతే చ త్రిభిః స్వయమ్

సో గ్రే హిరణ్యగర్భః సన్ ప్రాదుర్భూతః స్వయంప్రభుః

ఆద్యో హి స్వదశశ్చైవ అజాతశ్వాదజః స్మృతః

తస్మాధిరణ్యగర్భశ్చ పురాణేషు నీరుచ్యతే

స్వయంభువో నివృత్తస్య కాలో దర్జాగ్రతస్తు యః

న శక్యః పరిసంఖ్యాతుం మనువర్షశతైరపి

కల్పసంఖ్యానివృత్తస్తు పరార్దో బ్రహ్మణః స్మృతః

తాపతే సోఖస్య కాలో న్యస్తస్యాంతే ప్రతీబుద్ద్యతే

కోటివరసహస్రాణి గృహభూతాని యానీ చ

సమతీరానీ కల్పానాం తావఛ్ఛేషాత్పరే తు యే

యత్స్వయం వర్తతే కల్పో వారాహస్తన్నిబోధత

ప్రథమం సాంప్రతస్తేషాం కల్పో వై వర్తతే చ యః

పూర్ణే యుగసహస్ర తు పరిపాల్యం నరేశ్వరైః

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ప్రథమే ప్రక్రియాపాదే లోకకల్పనం నామ చతుర్దోధ్యాయః

ఎల్లయెడల ప్రభువగుటచే స్వామి; సర్వమందు ప్రవేశించి యుండుటచే విష్ణువు; షాఢుణ్యయుతుడగుట భగవానుఁడు; అచలుడగుట నాగుడు; నాగాశ్రయుఁడగుట నాగుడు; (25) సంప్రహృష్ణుఁడై యుండుట వలన పరముఁడు; దేవతలకాద్యుఁడగుట ఓం; సర్వము నెంగి యుండుటచే సర్వజ్ఞుడు, సర్వమును వ్యాపించి యుండుటచే సర్వుఁడు. (26) నరములు నీరములు, నీరములయందు శయనించుటచే ఆ పరమాత్మ నారాయణుఁడు; తన్ను త్రిధా విభజించి సకలమందు ప్రవర్తించును. (27) ఆ త్రీమూర్తిత్వమున సర్వమును సృజించును, లయింప జేయును, స్వయముగా పాలించును; అట్టిడు మొట్టమొదట హిరణ్యగర్భుడుగా స్వయముగా నా పరుఁడయిన ప్రభువు ఆవిర్భవించెను. (28) స్వవశుఁడై యున్నందున నాద్యుఁడగుట ఆద్యుఁడు; పుట్టని వాడగుట అజుడని యందురు. అందుచేతనే హిరణ్యగర్భుడని పురాణములు చెప్పు చున్నవి. (29) సృష్టి విముఖుఁడగు పరబ్రహ్మము మరల సృష్ట్యున్ముఖుడగును. తన్మధ్యకాల మింతయని చెప్పనలవికాదు. మను వర్షశతంబులయినను చాలవు. (30) కల్ప సంఖ్యానివృత్తిపర్యంతమగు కాలము పరార్ధమని చెప్పబడును. అట్టి పరార్ధంబులు రెండు చతుర్ముఖుని ఆయుష్కాలమున గతించును. (31) కోటి వర్ష సహస్రములు, గృహ భూతాదులు కల్పములు గతించునవి. చతుర్ముఖునియందు (ఒక పరార్థము గడిచి) ద్వితీయ పరార్దము వర్తమానమైయుండె. (32) అతఁడు స్వయముగా నుండు కల్పమునకు వారాహ సంజ్ఞకమని యెఱుంగునది. (33) యుగ సహస్రములు పూర్ణము కాగా భూమి నరేశ్వరపరిపాల్యంబై యుండును.

ఇది వాయుప్రోక్త బ్రహ్మాండపురాణమున పూర్వభాగమున ప్రథమ ప్రక్రియా పదమున లోకకల్పనమను చతుర్థాధ్యాయము సమాప్తము.