బ్రహ్మాండ మహా పురాణము
27 - దారువన ప్రవేశము - భస్మస్నావిధి
ఋషయః ఊచుః :-
భూయః సూత మహాబుద్దే కథయస్య మహాత్మనః ।
మహాదేవస్య మాహాత్యం శ్రోతుం కౌతూహలం చ నః ॥
కథం దారువనే దేవఋషి సంఘనిషేవితే ।
చకార వేషం వీకృతం యేన బుద్ధా మహర్షయః ॥
జ్ఞాత్వా చ తే మహాదేవం తతో భ్రాంతా హ్యచేతసః ।
ఆరాధయన్ ప్రసాదార్థం నైషాం తుష్టః పునర్భవః ॥
ఏతత్సర్వం యథావృత్తం దేవదేవేన చేష్టితమ్ ।
తత్సర్వం కథయస్వేహ త్వం నో బుద్ధిమతాం వరః ॥
సూత ఉవాచ :-
శ్రూయతామభిధాస్యామి ధర్మమేతమతంద్రితాః ।
నిర్మితం దేవదేవేన భక్తానామనుకంపయా ॥
పురాకృతయుగే విప్రాః శృంగే హిమవతః శుభే ।
దేవదారువనం రమ్యం నానాద్రుమలతాకులమ్ ॥
బహవో మునయస్తత్ర తపస్యంతో మునివ్రతాః ।
శైవాలభోజనాః కేచిత్కేచిదంతర్జలేశయాః ॥
కేచిదభ్రావకాశాస్తు పాదాంగుష్ఠాగ్రధిష్ఠితాః ।
దంతోలూఖలినశ్చాన్యే త్వశ్మకుట్టాస్తథా పరే ॥
ఋషులిట్లు చెప్పిరి.
ఓ సూత ! మహాబుద్దీశాలీ ! మహాత్ముఁడయిన మహాదేవుని యొక్క మాహాత్యమును మరల వివరింపుము. వినవలయునని మాకెంతయే కుతూహలముగా నున్నది. దేవతాసంఘములు నివసించి యుండు గోరువనమునందు, మహాదేవుఁడెట్లు వికృత వేషమును చేసెను? దానివలన ప్రబుదులు,మహారులు (2) ఆతనిని మహాదేవు నెటింగీ ఆ ఋషులెట్లు భ్రాంతులై? అచేతునులయిరీ? ఆతని ననుగ్రహించుటకు వారతనినెట్టులారాధించిరి? వారి యెడపునర్భువుడెట్లు సంతుష్టుఁడు కాలేదు? (3) ఆదేవదేవుని యీ చేష్టితమమంతటిని జరిగినది జరిగినట్లుగా నంతయును మాకు చెప్పుము. నీవు బుద్ధిమంతులలో శ్రేష్ఠుఁడవు. (4) అన వీనీ, సూతుఁడిట్లు చెప్పిను : అవధానముతో నీధర్మమును (దేవదేవుని చేష్టితమును) చెప్పెదను వినుఁడు. భక్తుల యందలి దయచే దేవదేవునిచే నిదీయంతయు ఘటింపఁబడినది. ఓ బ్రాహ్మణులారా ! పూర్వమందు, కృతయుగమున, పవిత్రమయిన హిమవచ్చంగమున రమ్యమైన యొక దేవదారువనము. దానియందు నానా వృక్షలతాదులు అలముకొనియున్నవి. పెక్కురు మునులు మునివ్రతము నాశ్రయించి అచ్చట తపస్సాచరించిరి. ఆ మునులలో కొందరు శైవాలము (నాచు) భోజనముగా గలవారు; కొందరు నీటియందు కొందరు ఆకాశమున పడుకొన్నవారు వసించిరి; కొందరు కాలిబొటన వ్రేలిపై నాధారపడి నిలువఁబడియుండిరి. కొందరు దంతములనే రోహిళ్లుగా ధ్యానపు పొల్లును దంచి తినెడివారు ఇతరులు కొందరు ధాన్యమును దినుటకు బూర్వము రాళ్లపై ధాన్యములను దంచుకొని పొట్టుతీసికొని భుజించేడివారు.
స్థానవీరాసనాశ్చాన్యే మృగచర్యారతాస్తథా ।
కాలం నయంతి తపసా తీవ్రేణ చ మహాధియః ॥
తతస్తేషాం ప్రసాదార్థం దేవస్తద్వనమాగతః ।
భస్మపాండురదిగ్ధాంగో నగ్నోవికృతలక్షణః ॥
వికృతస్రస్తకేశశ్చ కరాళదశనస్తథా ।
ఉల్ముకవ్యగ్రహస్తశ్చ రక్తపింగళలోచనః ॥
శిశ్నం సవృషణం తస్య రక్షగైరికసన్నిభమ్ ।
ముఖమంగారవర్ణేన శుక్లేన చ విభూషితమ్ ॥
క్వచిచ్చ హసతే రౌద్రం క్వచిద్గాయతి విస్మితః ।
క్వచీన్నృత్యతి శృంగారీ క్వచిద్రౌతి ముహుర్ముహుః ॥
నృత్యంత రురుధుస్తూర్ణం పత్న్యస్తేషాం విమోహితాః ।
ఆశ్రమేఽభ్యాగతోఽభీక్ష్ణం యాచతే చ పునః పునః ॥
భార్యా కృతా తథారూపా తృణాభరణభూషితా ।
వృషనాదం ప్రగర్జన్వై ఖరనాదం ననాద చ ॥
తథా వంచితుమారబ్ధో హాసయన్ సర్వదేహినః ।
తతస్తే మునయః క్రుద్ధాః క్రోధేన కలుషీకృతాః ॥
మోహితా మాయయా సర్వే శపితుం సముపస్థితాః ।
ఖరవద్గాయసే యస్మాత్ఖరస్తస్మాద్భవిష్యసి ॥
రాక్షసో వా పిశాచోఽపో దానవో వాథవా తథా ।
యథావైచ్ఛంస్తథా సర్వే క్రుద్ధాస్తే మునయః సమమ్ ॥
శేపుః శాపైస్తు వివిధైస్తం దేవం భువనేశ్వరమ్ ।
తపాంని తేషాం సర్వేషాం ప్రత్యాహస్యంత శంకరే ॥
యథాదిత్యప్రకాశేన తారకా నభసి స్థితాః ।
న ద్యోతంతే ప్రకాశేన తద్వత్తేజాంసి శంకరే ॥
కొందరు వీరాసనమున నుండిపోయిరీ, ఇతరులు లేళ్లయొక్క ప్రవర్తనములందు రతులయిరి. మహాబుద్దిమంతులయిన యా మునీశ్వరులు తీవ్రమయిన తపస్సుతో కాలమును నడుపుచుండిరి. (9) అంత దేవుదేవుఁడు వారల ననుగ్రహించుట కావనమున కరుదెంచెను. ఆతని శరీరమంతయు భస్మముచే పూయబడి పాండుర వర్ణము వహించెను; ఆతఁడు నగ్న శరీరుఁడు; ఆతని యందు వికృత లక్షణములుండెను. (10)ఆతని జుత్తు వికృతముగా జారివిరిసి యుండెను. ఆతని దంతములు భయంకరముగా నుండెను. ఆతఁడు చేతులతో నిప్పు కొఱవులను దాల్చి కదలించు చుండెను. ఆతని నేత్రములు ఎఱ్ఱని, ఎఱుపు తెలుపు కలిసిన వర్ణములు కలిగియుండెను. (11) అతని శిశ్నము వృషణములు ఎఱ్ఱనిగైరికధాతువును పోలియుండెను. ముఖమంగార వర్ణముచే శుక్లవర్ణములచే నలంకృతము. (12) కొన్నిచోట్ల ఆ దేవదేవుఁడు భయంకరముగా నవ్వును. కొన్నిచోట్ల చిరునవ్వుతో నవ్వి అద్భుతముగా పాడును; కొన్నిచోట్ల శృంగారీగా నృత్యము చేయును. కొన్నిచోట్ల మాటిమాటికీ రోదించును. కేకలు వేయును. (13) ఆ మునుల భార్యలు విమోహితురాండ్ర వెంటనే ఆతనిని అడ్డు పెట్టిరి. అభ్యాగతునివలే ఆశ్రమముననాతఁడు మాటిమాటికీ బీచ్చమును యాచించును. (14} భార్యకూడ నారూపముగను తృణాభరణ (గడ్డిరూపముననున్న సొమ్ములతో) భూషితగా జేయబడెను. ఆతఁడు ఎదువలె అంకె వేసెను; గాడిద స్వరముతో ఓండ్రించెను. (15) ఆ విధముగా సర్వ వ్యక్తులను నవ్వించుచు వంచింపనారంభించెను. అంత ఆ మునులందరు క్రుదులై క్రోధమున కలతజేందరి. (16) మాయచే వారందరు మోహితులైరి; ఆతనిని శపించుటకు తత్సమీపమునకు వచ్చిరి. ఏ కారణముచే నీవు గాడిదవలె గానముచేయుచుంటివో ఆ కారణమున నీవు గాడిద పయ్యెదవు. (17) లేక రాక్షసుడవో, పిశాచమవో అథవా దానవుడవో యయ్యెదవు. క్రుద్ధులయిన యీ ఋషులు వారిచ్చవచ్చినట్లుగా వివిధములయిన శాపములచే భువనేశ్వరుఁడు దేవుడునయిన యతనీని శపించిరి. కానీ వారి శాపములన్ని యా శంకరుని యందు ఆకాశమున సూర్యునీ ప్రకాశమున నక్షత్రములు ప్రకాశింపనట్లు ప్రవర్తింపలేదు. అపుడా మునులందరి తపములు శంకరునేడ ప్రతిహతములయ్యెను (నశించెను). కావున ఆ ఋషుల తేజస్సు శంకరుని యందు నిప్రభావ మయ్యెను. (20)
శ్రూయతే ఋషీశాపేన బ్రహ్మణః సుమహాత్మనః ।
సమృద్ధః శ్రేయసాం యోనిర్యజ్ఞో వై నాశమాప్తవాన్ ॥
భృగోరపిచ శాపేన విష్ణుః పరమవీర్యవాన్ ।
ప్రాదుర్భావాన్దశ ప్రాప్తో దుఃఖితస్య సదా కృతః ॥
ఇంద్రస్యాపి హి ధర్మజ్ఞాః! శిశ్నం సవృషణం పురా ।
ఋషిణా గౌతమేనోర్వ్యాం కృద్దేన వినిపాతితమ్ ॥
గర్భవాసో వసూనాంచ శాపేన విహితస్తథా ।
ఋషీణాం చైవ శాపేన సహుషః సర్పతాంగతః ॥
క్షీరోదశ్చ సముద్రశ్చ హ్యపేయో బ్రాహ్మణైః కృతః ।
ధర్మశ్చాత్ర ప్రశప్తో వై మాండవ్యేన మహాత్మనా ॥
ఏతే చాన్యే చ బహవో యాతనాం చ సమాగతిః ।
వర్జయిత్వా విరూపాక్షం దేవదేవం మహేశ్వరమ్ ॥
ఏవం హి మోహితాస్తేన న చాబుద్ద్యంత శంకరమ్ ।
తతస్తే ఋషయస్సర్వే పరస్పర మథాబ్రువన్ ॥
నచాయం విధిరస్మాకం గృహస్థానాం విధీయతే ।
బ్రహ్మచర్యరతానాం చ వనే వా వనవాసినామ్ ॥
యతీనాం వా తథా ధర్మో నాయం దృష్టః కథంచన ।
అనయస్తు మహామేష యేనాయం మోహితో ద్విజః ॥
లింగం ప్రపాతయస్వైతన్నోయం ధర్మస్తపస్వినామ్ ।
వదస్వ వాచా మథురం వస్త్రమేకం సమాశ్రయ ॥
త్యాజితే చ త్వయా లింగే తతః పూజామవాప్యుసి ।
ఋషీణాం తద్వచః శ్రుత్వా భగవాన్ భగనేత్రహా ॥
ఉవాచ శ్రక్షయా వాచా ప్రహసన్నివ శంకరః ।
న శక్యమిదమస్మాకం లింగం పాతయితుం బలాత్ ॥
బ్రహ్మాదిదేవతైః సర్వైః కిముతాన్యైస్తపోధనైః ।
పాతయేయ మహం చైతల్లింగం భో ద్వీజసత్తమాః ॥
మహాత్ముఁడైన బ్రహ్మ యొక్క పరిపూర్ణమైన శ్రేయస్సునకు కారణభూతమయిన యజ్ఞము ఋషి శాపముచే నాశనమొందేనని వినంబడినది. భృగు మహర్షి శాపముచే, పరమవీర్య వంతుఁడయిన విష్ణువు పదిజన్మల నెత్తవలసి వచ్చెను. అంతియేకాక యాతఁడు సదా దుఃఖితుండుగాం జేయఁబడెను. పూర్వమందు కోపగించిన ఋషియైన గౌతమునిచే, ఇంద్రుని యొక్క శిశ్నము వృషణములతో సహా నేలమీఁదఁబడునట్లు చేయబడెను. (23) శాపముచే వస్తువులు గర్భవాసము నందుండి పోవునట్లు చేయబడిరి. ఋషుల యొక్క శాపముచేతనే నహుషుఁడు సర్పత్వమును పొందెను. (24) బ్రాహ్మణులచేతనే క్షీరసముద్రము త్రాగుటకు యోగ్యము కాకుండ చేయబడినది. యమధర్మరాజు, మహాత్ముడయిన మాండవ్యునిచే శపింపం బడెను. (25) పైని చెప్పఁబడినవారు మరియు అన్యులెందరో దేవదేవుఁడు, మహేశ్వరుఁడు నయిన వీరూపాక్షుఁడు కాక, యాతనల పొందిరి. ఈ విధముగా శంకరునిచే మోహితులయి ఆ ఋషులు శంకరునీ తెలిసికొనలేక పోయిరి. అందుచే ఆ ఋషులందరు ఒకరితో నొకరు పరస్పరమిట్లు మాట్లాడుకొనిరి. (27) “గృహస్థ ధర్ములమయిన మనకు వీధింపఁబడిన ధర్మమిదీకాదు సరికదా బ్రహ్మచర్య ప్రతులైన వారికి, వానప్రస్థులయిన వారికి కూడనిది ధర్మముకాదు. (28) యతులకిది ధర్మముగా నెందుకు గోచరించదు. అందుచే నీ బ్రాహ్మణుడు (శివుడు) మోహింపబడుట గొప్పయన్యాయము. కావున ‘లింగమును ప్రపతింప చేయుము’ (పడవేయుము). ఇది తపస్వులకు, ధర్మము కాదు మధురముగా మాటాడుము. ఏదైన నొక వస్త్రమును ధరించుము. (30) నీవు లింగమును త్యజించితివా పూజింపఁబడెదవు. అనీన ఋషులయొక్క వాక్యములను విని భగుని యొక్క నేత్రములను హరించిన ఈశ్వరుఁడు, నవ్వుచున్న వానివలె, మృదువైన వాక్యములాడెను.
ఆశ్రమే తిష్ఠ వా గచ్ఛ వాక్యమిత్యేవ తేఽబ్రువన్ ।
ఏవముక్తో మహాదేవః ప్రహృష్టేంద్రీయచేష్టితః ॥
సర్వేషాం పశ్యతామేవ తత్రైవాంతర్ధధే ప్రభుః ।
అంతర్హితే భగవతి తథా లింగే కృతే భవే ॥
త్రైలోక్యే సర్వభూతానాం ప్రాదుర్భావో న జాయతే ।
వ్యాకులం చ తదా సర్వం న ప్రకాశేత కించన ॥
తపతే చైవ నాదిత్యో నిష్ర్పభః పావకస్తథా ।
నక్షత్రాణి గ్రహాఽశ్చైవ వీపరీతా విజజ్ఞిరే ॥
సంతానార్థం ప్రవృత్తానామృషీణాం విభవాత్మనామ్ ।
క్రతవో న వ్యవర్తంత క్రతుకాలాభిరామినామ్ ॥
తే చరంతి పునర్ధర్మనిర్మమా నిరహంకృతాః ।
నష్టప్రభావవీర్యాశ్చ నష్టతేజస ఏవ చ ॥
ధర్మే చైవ మతిస్తేషాం తదా న వ్యవతిష్ఠతే ।
తేషు సర్వే సమాగమ్య బ్రహ్మలోకముపొగతాః ॥
బ్రహ్మణో భవనం గత్వా దృష్ట్వా పుష్పకసంభవమ్ ।
పాదయోః పతితాః సర్వే శివ వృత్తాంతమూచిదే ॥
వీకటస్తబ్దకేశశ్చ కరాళదశనస్తథా ।
ఉలూకవ్యగ్రహస్తశ్చ రక్తపింగళలోచనః ॥
శిశ్నం సవృషణం తస్య రక్తం గౌరీకమండితమ్ ।
స్నుషాణాం చ దుహితృణాం పుత్రీణాం చ విశేషతః ॥
బలాత్కారముగా నా లింగమును పడునట్లు చేయుటకు బ్రహ్మాది సర్వదేవతలకే శక్యము కాదు. ఇక ఇతర తపోధనులేట్లు చేయగలుగుదురు? ఓ బ్రాహ్మణోత్తములారా ! ఈ లింగమును నేను పడునట్లు చేసెదను.” (53) “ఆశ్రమమునందుండుము లేదా వేడలిపొమ్ము” అని వారనిది. ఈ విధముగా పలుకబడి "మహాదేవుఁడు ఇంద్రియ చేష్టితములచే సంతుష్టుఁడై అందరు చూచుచుండఁగనే యతఁడు (ప్రభువు) అంతర్షితుం డయ్యెను. మహాదేవుండంతర్షితుఁడై భవుఁడు (ఈశ్వరుఁడు) లింగరూపము నొందగా(35) మూఁడు లోకములందును ఏ భూతము ప్రాదుర్భావ మొందలేదు. సర్వము సంక్షుణ్ణమయ్యెను. ఏదియు ప్రకాశింపలేదు. (36) సూర్యుఁడు తపించుటలేదు; అగ్నిహోత్రుఁడు నీఘ్ర్పభావుఁడయ్యెను. నక్షత్రములు గ్రహములు స్వస్థితికి మారి విపరీతములయ్యెను. (37) ఋతుకాలములయందే సంతానార్ణము భార్యలను చేరెడు విభవవంతులయిన ఋషుల ప్రవృత్తులు క్రతువులు ప్రవర్తింపమానినవి. (38) పోరు మమతా రహితులయి, నిరహంకృతులయి మరల క్రతువులను నాచరింప ప్రారంభించిరి. వారు నష్ట ప్రభావులు; గతవీర్యులు, నష్టతేజులు నరీ. (39) ఆ సమయమున వారి మనస్సులు ధర్మమునందు వర్తింపలేదు. వారందరు కలిసికొనిరి. బ్రహ్మలోకమున కరిగిరీ, బ్రహ్మ యొక్క భవనమున కరిగి, పద్మసంభవుఁడయిన బ్రహ్మను చూచిరి. ఆతని పాదముల యందు పడిరి, శివుని వృత్తాంతమును గూర్చి చెప్పిరి. (41) ఆ శివుఁడు వికృతాకారుఁడై వికటుఁడై భయంకరముగ నుండెను. ఆతని శిరోజములు నిగిడి బరుసుగా నుండెను. ఆతని దశనములు భయంకరము; ఆతని హస్తములు ఉలూకవ్యగ్ర హస్తములు. ప్రతి వస్తువును పట్టుకొనం జూచును. ఆతని నేత్రము రక్తములు; పింగళ వర్ణములు. ఆతని శిశ్నము వృషణములతో సహా ఎఱ్ఱగా నుండెను గైరికధాతు మండితము. ఆతం డెప్పుడును మాకోడండ్రు మాకూతుండ్రునున్న ప్రక్కనే యుండుటకాక, ప్రత్యేకముగా యా పిల్లలుగల వారీ ప్రక్కనుండెను. (43)
వర్తమానస్తతః పార్శ్వే విపరీతాభిలాషతః ।
ఉన్మత్త ఇవ విజ్ఞాయ సోఽస్మాభిరవమానితః ॥
ఆకృష్టస్తాడితశ్చాపి లింగం చాప్యస్య చోద్ధతమ్ ।
తస్య క్రోధప్రసాదార్థం వయం తే శరణం గతాః ॥
ఏతత్కార్యం న జానీమస్తన్నో బ్రూహి పితామహ ।
ఋషీణాం తద్వచః శ్రుత్వా ధ్యానాద్విజ్ఞాయ చేశ్వరమ్ ॥
ప్రత్యువాచ తతో బ్రహ్మా వాక్యం చ సుసమాహితః ।
ఏష దేవో మహాదేవో విజ్ఞేయస్తు మహేశ్వరః ॥
న తస్య పరమం కించిత్పదం సమధిగమ్యతే ।
దేవానాం చ ఋషీణాం చ పితృణాం చైవ స ప్రభుః ॥
సహస్రయుగపర్యంతే ప్రలయే సర్వదేహిసామ్ ।
సంహరత్యేష భగవాన్ కాలో భూత్వా మహేశ్వరః ॥
ఏష చైవ ప్రజాః సర్వాః సృజత్యేకః స్వతేజసా ।
ఏష చక్రీ చ వక్షోజశ్రీవత్సకృతలక్షణః ॥
యోగీ కృతయుగే చైవ త్రేతాయాం క్రతురుచ్యతే ।
ద్వాపరే చైవ కాలాగ్నిర్ధర్మకేతుః కలౌ స్మృతః ॥
రుద్రస్య మూర్తయస్తిస్రో విజ్ఞేయాశ్చాపి పండితైః ।
తమో హ్యగ్ని రజో బ్రహ్మా సత్వం విష్ణుః ప్రకాశకః ॥
మూర్తిరేకా స్మృతా యస్య దీగ్వాసాశ్చ శివాహ్వయా ।
యత్ర తిష్ఠంతి తద్ర్బహ్మ యోగేన తు సమన్వితమ్ ॥
తస్మాద్దేవం దేవదేవమీశానం ప్రభుమవ్యయమ్ ।
ఆరాధయతి విప్రేంధ్రా జితక్రోధా జితేంద్రియాః ॥
దృష్టం వై యాదృశం తస్య లింగమాసీన్మహాత్మనః ।
తాదృక్ప్రతికృతిం కృత్వా శూలపాణిం ప్రపద్యత ॥
తతో ద్రక్ష్యథ దేవేశం దుర్దర్శమకృతాత్మభిః ।
యం దృష్ట్వా సర్వ మజ్ఞానమధర్మశ్చ ప్రణశ్యతి ॥
వారీ పార్వమున నతఁడు విపరీతమైన యభిలాషతో మెలగుచుండెను. ఆతఁడు ఉన్మత్తుఁడు. పిచ్చివాఁడని తెలిసికొని మాచే నతఁడవ మానింపఁబడెను. (44) . ఈవలకు లాగబడెను. కొట్టబడెను. అప్పుడు కూడ ఆతని లింగము ఉద్దతమయి యుండెను. ఆతని కోపమును శాంతింప చేయుటకై మేమతని శరణము నొందితిమీ. (45) ఇది యేమియో యెట్టి కార్యమో మాకు పూర్తిగా దెలియదు. ఓ పితామహ మాకు తెలియఁజెప్పుము. అనిన ఋషుల వాక్యములను విని ధ్యోనము నొంది, పరమేశ్వరుని గూర్చి యెటింగ్ సమాహితమనస్కుడై ద్రహ్మ వారలకు ప్రత్యుత్తరమిచ్చెను. “ఆతడే మహాదేవుడు. ఆతడే మహాదేవుండుగా మీరేంగవలయును. ఆతని స్థానము పదమును సులభముగా పొందుటకు వీలులేదు. ఆతఁడే దేవతలకు, ఋషీశ్వరులకు, పితరులకు ప్రభువు. అధిపతి, సహస్ర యుగముల యనంతరము సర్వదేహలను ప్రళయము కాగా ఆ మహేశ్వరుండే కాలుఁడయి సంహరించును. ఆతఁడొక్కడే స్వతేజముచే ప్రజలనందరను సృజించును ఆతఁడే చక్రహస్తుఁడయిన విష్ణువు; వక్షస్థలము నందును శ్రీవత్సముచే కృతలాంఛనుఁడు. (50) కృతయుగమునందతనిని యోగీయందురు. త్రేతాయుగమున క్రతుపోతం డే ద్వాపరముననతఁడు కాలాగ్ని కలియుగమున నతఁడు ధర్మకేతువు. పండితులు రుద్రుని యొక్క మూఁడు మూర్తులను నెరంగవలయును. తమోభాగము రూపము) ఆగి, రజోరూపము బ్రహ్మ సత్త్వ భాగము విష్ణువు. ఈ మూడింటికి ప్రకాశకుఁడాతఁడే. ఆతని మూర్తియొకటి దీగ్వసనము. దానికే శివుండని పేరు. ఆతని యందే యోగస్థుఁడయి బ్రహ్మయుండును. (53) ఓ బ్రాహ్మణులారా! అందుచేతనే జీతేంద్రీయులయి, జయించిన కోపము గలిగి ఆయీశాననుని ఆరాధించుఁడు. ఆతఁడే దేవదేవుఁడు. అవ్యయుఁడు. ఆ మహాత్ముని లింగమెట్టి దానినిగా మీరు చూచితిరో, తత్రతికృతినిగో శూలపొడి నొనర్చి ఆతనికి ప్రపన్నులు కండు, అప్పుడు అకృత పుణ్యులు అకృతాత్ములు దర్శించుటకు వీలుకాని వానిని చూడుడు, మీయజ్ఞానము అధర్మము నశించును. (56)
తతః ప్రదక్షిణం కృత్వా బ్రహ్మాణ మమీతౌజసమ్ ।
ఆస్థితా వీతశోకాస్తే దేవదారువనే తతః ॥
ఆరాధయితుమారబ్ధా బ్రహ్మణా కథితం యథా ।
స్థండిలేషు విచిత్రేషు పర్వతేషు గుహాసు చ ॥
నదీనాం చ విచిత్రేషు పులినేషు శుభేషు చ ।
తదేవ రూపమాస్థాయ దేవస్తద్వన మాగతః ॥
ఏవం సంవత్సరపూర్ణే వసంతే సముపస్థితే ।
కుసుమీత బహుపాదఫాలతాకం భ్రమరగణైరుషగీయమానఖండమ్ ।
పరభృతపరిపూర్ణచారుశబ్దం ప్రవిశతి తద్వనమాశ్రమం మహేశః ॥
తతస్తం మునయ స్సర్వే తుష్టువుః సుసమాహితాః ॥
అద్భిర్వివిధమాలైశ్చ ధూపగంధైస్తథైవ చ ।
సపత్నీక మహాభాగాః సపుత్రాసుపరిచుదాః ॥
మృదుభిస్తే తదా వాగ్భిర్గిరీశమిదమబ్రువన్ ।
అజ్ఞానోద్దేవదేవస్య యదస్మాభిరనుష్ఠితమ్ ॥
కర్మణా మనసా వాచా తత్ సర్వం క్షంతుమర్హసి ।
చరితాని విచిత్రాణి గుహ్వానీ గహనాని చ ॥
బ్రహ్మాదీనాం చ దేవానాం దుర్విజ్ఞేయాని శంకర ! ।
స్వాగతం తే న జానీమో గతిం నైవ చ నైవ చ ॥
విశ్వేశ్వర మహాదేవ యోఽసి సోఽసి నమోఽస్తుతే ।
స్తువంతి త్వాం మహాత్మానో దేవదేవం మహేశ్వరమ్ ॥
నమో భయ భవ్యాయ భావనామోద్భవాయ చ ।
అనంతబలవీర్యాయ భూతానాం పతయే నమః ॥
సంహర్త్రే కపిశాంగాయ ఆపేయాయ వ్యయాయ చ ।
గంగాసలీలధారాయ చాధారాయ గుణాత్మనే ॥
తరువాత ఆమిత తేజస్కుఁడయిన బ్రహ్మకు వారు ప్రదక్షిణము చరించిరి. దేవదారు వనమునందు వీతశోకులై వీరుండిరి. బ్రహ్మ చెప్పిన విధముగా నీశ్వరు నారాధించుటకు వారు మొదలిడిధి. వారు అలికి ముగ్గులు పెట్టిన ప్రత్యేకమైన నేలయందు, పర్వతములయందు, గుహలయందు, నదులయందు, విచిత్రములు శుభంకరములయిన పులినములయందు, బ్రహ్మ చెప్పిన చొప్పున ఒక సంవత్సరము ఈశానుని ఆరాధించిరి. ఒక సంవత్సర కాలము పూర్తియైనది. వసంతమాసన్నమైనది. అదే రూపము నొంది దేవుఁడయిన ఈశ్వరుఁడు తద్వనమున కేతెంచెను. పుష్పించిన బహుపాదపములతో లతలతో నొప్పినది, తుమ్మెదల గణముచే జుష్మనీ గానము చేయబడుచున్నది, కోకిలల యొక్క మనోహర శబ్దముతో సుందర శబ్ద ధ్వానమున నొప్పునట్టిదియునగు నో దేవదారువనాశ్రమమును మహేశ్వరుఁడు. ప్రవేశించేను. మునీశ్వరు లందరు సుసమాహితమనస్కుల ఆ దేవుని స్తోత్రము చేసిరి. అప్పుడు ఉదకములచే, వివిధములయిన మాల్యములచే, ధూపములచే, గంధములచే, సపరివారములతో, భార్యలతో పుత్రులతో ఆ మహాభాగులు, మృదువులయిన పలుకులతో ఆగిరీశుని గూర్చి చెట్లనిరి. దేవదేవుని తెలియగమిచే గలిగిన యజ్ఞానముచే కర్మలచే, మనస్సుచే హక్కులచే, ఓ దేవ నీ కేమేమి మేము చేసి యుంటిమో నదీయంతయును క్షమించవరుండవు. ఓ శంకర! నీ చరీతములు. విచిత్రములు, రహస్యములు, దుర్విజ్ఞేయములు, మాకే కాదు బ్రహ్మాది దేవతలకుకూడ ఓ ప్రభూ ! వీకు స్వాగతము. గతియు, అగతియును గూడ తెలియకయుంటిమీ, ఓ విశ్వేశ్వర, ఓ మహాదేవ, నీవెవ్వఁడవో? వానివే అట్టి, నీకు నమస్కారము. మహాత్ముఁడవు మహేశ్వరుఁడవయిన నిన్ను స్తోత్రము చేయుచున్నాము, భపునకు, భపునకు, పుట్టిన వానికి, ఉద్భవించిన వానికి, అనంత బలవీర్యునకు, భూతముల ప్రభువునకు, సంహారునకు, కపిశాంగరూపునకు అచ్యయుసకు, వ్యయాంగునడు, గంగానలీలధార వహించు వానికి, సర్వాధారునకు, గుణాతునకు.
త్ర్యంబకాయ త్రినేత్రాయ త్రిశూలవరధారిణే ।
కందరాయ నమస్తుభ్యం నమోఽస్తు పరమాత్మనే ॥
శంకరాయ వృషాంకాయ గణానాం పతయే నమః ।
దండహస్తాయ కాలాయ పాశహస్తాయ వై నమః ॥
వేదమంత్రప్రధానాయ శతజిహ్వాయ తే నమః ।
భూతం భవ్యం భవిష్యచ్చ స్థావరం జంగమం చ యత్ ॥
తవ దేహాత్సముత్పన్నం దేవ సర్వమిదం జగత్ ।
శంభో ! పాహి చ భద్రం తే ప్రసీద భగవంస్తతః ॥
అజ్ఞానాద్యది వాజ్ఞానాద్యత్కించిత్కురుతే నరః ।
తత్సర్వం భగవానేవ కురుతే యోగమాయయా ॥
ఏవం స్తుత్వా తు మునయః ప్రహృష్టేనాంతరాత్మనా ।
యాచంతే తపసా యుక్తాః పశ్యామస్త్వాం యథా పురా ॥
ప్రకృతిస్థం చలే లింగం తథైవాస్తు యథా పురా ।
నమో దిగ్వాససే నిత్యం కింకిణీజాలమాలినే ॥
వికటాయ కరాలాయ కరాలవదనాయ చ ।
అరూపాయ సురూపాయ విశ్వరూపాయ తే నమః ॥
కటంకటాయ రుద్రాయ స్వాహాకారాయ వై నమః ।
సర్వప్రాణాత్మనే తుభ్యం గుణదేహాయ వై నమః ॥
దుర్గంధాయ సుగంధాయ శూలహస్తాయ వై నమః ।
స్వయం నీలఖండాయ శిఖండాయ నమో నమః ॥
నీలకంఠాయ దేవాయ చితాభస్మాంగధారిణే ।
గుణత్రయాత్మనే తుభ్యం నమో విశ్వాయ వేధసే ।
శ్మశానవాసినే నిత్యం ప్రేతరూపాయ వై నమః ॥
త్వం బ్రహ్మ సర్వదేవానాం రుద్రాణాం నీలలోహితః ।
ఆత్మా చ సర్వభూతానాం సాంఖ్యైః పురుష ఉచ్యతే ॥
పర్వతానాం మహామేరుర్నక్షత్రాణాం చ చంద్రమాః ।
ఋషీణాం చ వశిష్ఠస్త్వం, దేవానాం, వాసవస్తథా ॥
త్ర్యంబకునకు, త్రినేత్రునకు, త్రిశూలధారికి, కందర్పునకు (సుందర విగ్రహునకు) పరమాత్ముఁడవయిన శంకరునకు, వృషాంకునకు, ప్రమథగణపతికి, దండహస్తునకు, పాశహస్తునకు కౌలునకు నీకు నమస్కారము. వేదమంత్రములలో ప్రధానుడైనవానికి సహస్ర జిహ్వుఁడవైన నీకు నమస్కారము. గతించినట్టి భూతము, జరుగుచున్న వర్తమానము, జరుగబోవు భవిష్యత్తు స్థావరములు, జంగమము గల ఓ దేవ ! ఈ సర్వజగత్తు నీ దేహము నుండి సముత్పన్నమైనదీ, ఓ శంభో ! రక్షించు; నీకు భద్రమగుగాక! ఓ భగవాన్! ప్రసన్నుఁడవు కమ్ము, అజ్ఞానము వలనఁగాని లేక జ్ఞానముచే గానీ, మానవుఁడే కొంచెము మాత్రము చేసినను, దానినంతటినీ భగవానుఁడయిన ఈశ్వరుఁడే యోగమాయచే నొనరించును. (73) ప్రహృష్ట మనస్సులతో నీ విధముగా మునులు సోత్రముచేసి, భగవానునిట్లు ప్రార్జింతురు. తపఃప్రభావయుక్తులమయి మేము పూర్వమువలె నీన్నుఁదీలకించెదము గౌక. పూర్వమువలె నీ లింగము స్వస్థానమున ప్రకృతస్థమై యుండును గాక. చిరుమువ్వల కింకణీ జాలములు గలిగి దగంబరుడవయిన నీకు నమస్కారము. వికటునకు (అసహ్యరూపునకు) క్రూరరూపునకు, స్వాహాకారునకు, సర్వప్రాణాత్మునకు, రూపరహితునకు, సురూపునకు, విశ్వరూపునకు, గుణరూపునకు నీకు నమస్కారము. కటంకటునకు (బంగారు రూపునకు) నమస్కారము. (77) దుర్గంధునకు, సుగంధునకు, శూలహస్తునకు, నల్లని శీఖ కలిగిన శిఖండునకు, నీలకంఠునకు, శ్మశాన భస్మమే యంగరాగముగా గల వానికి, దేవునకు, గుణత్రయాత్మునకు, సర్వవిశ్వ స్వరూపుఁడైన వానికి, బ్రహ్మకు. నిత్యము శ్మశాన వాసికి, ప్రేతరూపునకు, నీకు నమస్కారము. నీవు దేవతలలో బ్రహ్మవు; నీవు రుద్రులలో నీల లోహితుఁడవు. సర్వ భూతములకు ఆత్మవు. నిన్ను సాంఖ్యులు పురుషుఁడందురు. నీవు పర్వతములలో మహామేరువవు. నక్షత్రములలో చంద్రముఁడవు. ఋషులలో నీవు వశిష్ఠుఁడవు. దేవతలలో వాసవుండవు.
ఓంకారః సర్వవేదానాం జ్యేష్ఠసామ చ సామసు ।
ఆరణ్యానాం చ సర్వేషాం సింహస్త్వం పరమేశ్వర ! ॥
గ్రామ్యాణామృషభశ్చాపి భగవాన్ లోకపూజితః ।
సర్వథా వర్తమానోఽపి యోయో భావో భవిష్యతి ॥
త్వామేవ తత్ర పశ్యామో బ్రహ్మణా కథితం యథా ।
కామః క్రోధశ్చ లోభశ్చ విషాదో మద ఏవ చ ॥
ఏతదిచ్ఛామ వై రోద్ధుం ప్రసీద పరమేశ్వర ! ।
మహాసంహరణే ప్రాప్తే త్వయా దేవకృతాత్మనా ॥
కరం లలాటే సంపీడ్య వహ్నిరుత్పాదిత స్త్వయా ।
తేనాగ్నినా తదా లోకా అర్చిర్భిః సర్వతో వృతాః ॥
తస్మాదగ్నిసమా హ్యేతే బహవో వికృతగ్నయః ।
యాని చాన్యాని భూతాని స్థావరాణి చరాణి చ ॥
దహ్యంతే ప్రాణినస్తే తు త్వత్సముత్తేన వహ్నినా ।
అస్మాకం దహ్యమానానాం త్రాతా భవ సురేశ్వర ॥
త్వం చ లోకహితార్థాయ భూతాని పరిషించసి ।
మహేశ్వర మహాభాగ ప్రభో శుభనిరీక్షక ॥
ఆజ్ఞాపయ వయం నాథ కర్తారో వచనం తవ ।
రూపకోటిసహస్రేషు రూపకోటిశతేషు చ ॥
అంతం గంతుం న శక్తాః స్మ తవ దేవ నమోఽస్తు తే ।
తతస్తు భగవానీశ ఇదం వచన మబ్రవీత్ ॥
యే హి మే భస్మనిరతా భస్మనా దగ్ధకిల్బిషాః ।
యథోక్తకారిణే దాంతో విప్రాః ధ్యానపరాయణాః ॥
న తాన్ పరివదేద్విద్వాన్ న చ తానతలంఘయేత్ ।
న చేమానప్రియం బ్రూయాదముత్రేహ హితార్థవాన్ ॥
యస్తాన్నిందతి మూఢత్మా మహాదేవం స నిందతి ।
యస్త్వేతాన్ పూజయేన్నిత్యం సపపూజయతి శంకరమ్ ॥
ఏవం చరథ భద్రం వో మత్తః సిద్ధిమవాప్స్యథ ॥
సర్వవేదములకు ఓంకారమవు. సామములందు జ్యేష్ఠ సామమవవు. ఆరణ్య వస్తువుల యందు నీవు అన్నింటికి సింహమవు. (82) ఓ పరమేశ్వర! గ్రామ్య జంతువులలో వృషభమవు. సర్వలోక పూజితుఁడవయిన భగవంతుడవీవు, నీవు సర్వథా అన్ని విధములుగ, విధానములుగ నున్నను బ్రహ్మ చెప్పిన విధముగా మాకు గలిగిన భావనలనన్నింటిలో (83) నిన్నే గాంచేదము. కామము, క్రోధము, లోభము, విషాదము, మదము వీనినన్నింటిని నిగ్రహింపనెంచెదము. ఓ పరమేశ్వర ! ప్రసన్నుఁడవై అనుగ్రహించుము. మహా సంవరణము (సర్వ ప్రళయము) ప్రాప్తించగా ఓ నాథ, నీవు నీచేతినీ ఫాలమున రాయగా సర్వకృతాత్ముఁడవయిన నీచే వహ్ని ఉత్పాదితమయినది. . ఆయగ్ని యొక్క జ్వాలలచే అప్పుడాలోకములన్నియు వహ్ని పరివృతములయినవి. (86) ఆ కారణమున నవియన్నియును అన్నీ సమానములే సమములే. వికృతమయిన యగ్నులనేకములు, తక్కిన చరాచరములయిన భూతములన్నియు, (ప్రాణులు సకలము) సముళ్లితమయిన యావహ్నిచే, దహింపఁబడుచున్నవి. ఓ సురేశ్వర ! దహింపఁబడుచున్న మాకు త్రాతవు రక్షకుడవు కమ్ము. (88) నీవే, లోకహితము కొఱకు సర్వభూతములపై అమృతమును చల్లుదువు. ఓ మహేశ్వర ! ఓ మహాభాగ! ఓ ప్రభూ ! ఓ శుభ నిరీక్షక ! ఓ నాథ ! మమ్ము ఆజ్ఞాపింపుము. నీ ఆజ్ఞావచనము నొనరించు కర్తలము మేము. నీయొక్క రూపకోటి సహస్రములకు, రూపకోటి శతములకు అంతమును గననశక్తులము. ఓదేవ! నీకు నమస్కారము. అంత భగవానుం డీ వాక్యమును పలికేను. (91) విద్వాంసుఁడెవ్వఁడును నా భస్మనిరతులయిన వారిని, భస్మముచే దగ్గపటలములయిన పాపములు కలవారిని, శాస్త్ర విధి ననుసరించి వర్తించువారిని, ఇంద్రియ నిగ్రహము కలవారిని విప్రులను, ధ్యాన పరాయణులను, అవమానకరముగా, పరిహసింపరాదు. ఎగులాడరాదు. పొరీ నతీక్రమింపరాదు. ఐహికా ముష్మికలోకముల హితము కోరునట్టివాఁడు మద్భక్తులం గూర్చి యప్రియములాడరాదు. (93) ఎవ్వఁడు వారిని నిందించునో అట్టి మూఢాత్ముఁడు మహాదేవునే నిందించును. ఎవ్వఁడు నిత్యము పొరలను పూజించునో, అతఁడు శంకరునే పూజించును. ఇట్లు మీరు ఆచరింపుఁడు. మీకు భద్రమగును, నావలన సిద్ధిని పొందుదురు.
అతులమిహ మహోతమఃప్రణాశం శివకథితం పరమం విధిం విదిత్వా ।
అపగతభయలోహమోహచింతాః సహపతీతాసహసా శిరోభిరూహుః ॥
తతస్తే ముదితా విప్రాః ప్రకృతిస్థే మహేశ్వరే ।
గంధోదకైః సుశుద్ధైశ్చ కుశపుష్పవిమిశ్రితైః ॥
స్నాపయంతి మహాకుంభైరద్భిర్దేవం మహేశ్వరం ।
గాయంతీ వివిధై ర్గుహ్యైః హుంకారేశ్చాపి సుస్వరైః ॥
నమో దీగ్వాసనే దేవ కింకిణీధ్రాయ వై నమః ।
అర్ధనారీశరీరాయ సాంఖ్యయోగప్రవర్తినే ॥
ఘనవాహనకృష్ణాయ గజచర్మనివాసినే ।
కృష్ణాజినోత్తరీయాయ వ్యాలయజ్ఞోపవీతినే ॥
సురచితచిత్రవిచిత్రకుండలాయ సురచితమాల్యవిభూషణాయ తుభ్యమ్ ।
మృగపతివరచర్మవాససే తే పృథుపరతో చ నమోఽస్తు శంకరాయ ॥
భూయశ్చ స్థాపితే లింగే లోకానాం హితకామ్యయా ।
వర్ణధర్మపరాశ్చైవ చేరుస్తే మునిసత్తమాః ॥
తతస్తాన్ స మునీన్ ప్రీతః ప్రత్యువాచ మహేశ్వరః ।
ప్రీతోఽస్మి యుష్మత్తపసా వరం వృణుత సుతాః ॥
తతస్తే మునయస్సర్వే ప్రణిపత్య మహేశ్వరం ।
భృగ్వంగిరా వశిష్ఠశ్చ విశ్వామిత్రస్తథైవ చ ॥
గౌతమోఽత్రిః సుకేశశ్చ పులస్త్యః పులహః క్రతుః ।
మరీచిః కశ్యపశ్చాపి సంవర్తశ్చ మహాతపాః ॥
తే ప్రణమ్య మహాదేవమిదం వచనమబ్రువన్ ।
భస్మస్నానం చ నగ్నత్వం వామత్వం ప్రతిలోమతా ।
సేవ్యా సేవ్యత్వం తు విభో ఏతదిచ్ఛామ వేదితుమ్ ॥
మహాజ్ఞాన తిమిరమును ప్రణాశనము చేయునది, అద్వీతీయమయినది ఉత్కృష్టమయినది, శివునిచే కథితమయినదియునగు విధిని తెలిసికొని వారందరు భయమోహలోహచింతాదులవీడిరి. ఆతని పాదములపై ప్రణామ పురస్పరముగా పడిరి. వెంటనే ఆ పాదముల తమ ! శీర్షములపై మోసిరి. వెంటనే ఆ ప్రభువును తమ శీర్షములపై దాల్చిరి. అంత మహేశ్వరుడు ప్రకృతిస్థుడుకాగా, ఆ బ్రాహ్మణులందరు సంతోషించిరి. మహేశ్వరుని, ప్రశుద్దములయిన గంధములచే, ఉదకములచే దర్భలు పుష్పములతో కూడిన ఉదక మహా కుంభములతో స్నానము చేయించిరి. అభిషేక మొనర్చిరి. వివిధములయినవి, రహస్యములైనవియునగు హుంకారములతో సుస్వరయుతముగా గనము చేసిరి. ఓదేవ! ఓదిగంబరా! చిరుమువ్వల గముల ధరించినవాడా అర్ధనారీశరీర, సాంఖ్య యోగ ప్రవర్తక ! నీకు నమస్కారము. మేఘములు పొహనముగాగలిగి నల్లని వర్ణము కలవానికి, గజచర్మవాసికి, కృష్ణాజినము (లేడిచర్మము) ఉత్తరీయముగా గలవానీకి, పాములు యజ్ఞోపవీతములుగా గలవానికి, చక్కగా నిర్మింపఁబడిన చిత్రవిచిత్ర కుండలములు కలవానీకి, మనోహరముగా సమకూర్చఁబడిన దండలు (మాలలు) విభూషణములుగా గలవానికీ, శ్రేష్ఠమయిన సింహచర్మము వస్త్రముగా గలవానీకి, పెద్ద గండ్ర గొడ్డలి కలవానికి శంకరుఁడవయిన నీకు నమస్కారము. (100) లోకముల యొక్క హితము కొఱకు మరల లింగము స్థాపింపఁబడగా, వర్ణధర్మ పరాయణులయిన యాముని సత్తములు తత్తద్ధర్మములను నిర్వహించి సేవించిరి. అంత ఆ మునులయందు సంప్రీతుడై మహేశ్వరుఁడిట్లు ప్రత్యుత్తర మొసంగేను. “మీ తపస్సుచే సంతుష్టుఁడనయితిని. ఓ సుప్రతులారా! వరమును కోరుకొనుడు, అంత ఆ మునులందరు మహేశ్వరునకు నమస్కరించిరి. ఆ మునులలో గౌతమి, ఆ, అంగీరసుఁడు, భృగువు, వశిష్ఠుఁడు, విశ్వామిత్రుఁడు, సుకేశుఁదు, పులస్త్యుఁడు, పులహుఁడు, క్రతువు, మరీచి, కశ్యపుడు, సంవర్తుఁడు మొదలయిన మహా తపస్వులు కలరు. వారు మహేశ్వరునకు ప్రణామములు చేసి యిట్లనిరి. “భస్మస్నానము, నగ్నత్వము, వామత్వము (ఎడమ చేతితో కార్యము లాచరించుట) ప్రతిలోమత్వము (వ్యతిరేకముగా చేయుట) సేవ్యాఽసేవ్యత్వము (సేవింపదగిన స్థితి, సేవింపఁదగని స్థితి) వీనిని గూర్చి తెలిసికోనఁగోరుచున్నాము.
భగవానువాచ :-
ఏతద్వః సంప్రవక్ష్యామి కథాసర్వస్వమద్య వై ।
అగ్నిర్వహం సోమయుతః సోమశ్చాగ్నీముశ్రీతః ॥
కృతాకృతం వదంత్యగ్నిం భూయో లోకాః సమాశ్రితాః ।
అసకృచ్ఛాగ్నినా దగ్ధం జగత్స్థావరజంగమమ్ ॥
భస్మసాధ్యం హి తత్సర్వం పవిత్రమిదముత్తమమ్ ।
భస్మనా వీర్యమాస్థాయ భూతాని పరిషించతి ॥
అగ్నికార్యం చ యత్కృత్వా కరిష్యతి చ త్ర్యాయుషమ్ ।
భస్మనా మమ వీర్యేణ ముచ్యతే సర్వకిల్బిషైః ॥
భాసయత్యేవ యద్భస్థ శుభం వాసయతే చ యత్ ।
తత్క్షణాత్సర్వపాపానాం భస్మేతి పరికీర్త్యతే ॥
ఊష్మపాః పితరో జ్ఞేయా దేవో వైసోమసంభవాః ।
అగ్నీషోమాత్మకం సర్వం జగత్స్థావరజంగమమ్ ॥
అహమగ్నిర్మహాతేజాః సోమశ్చైషా మమాంబికా ।
అహమగ్నిశ్చ సోమశ్చ ప్రకృత్యా పురుషః స్వయమ్ ॥
తస్మాత్ భస్మ మహాభాగా మద్వీర్యమీతి చోచ్యతే ।
స్వవీర్యం వపుషా చైవ ధారయామీతి వై స్థితిః ॥
తదా ప్రభృతి లోకేషు రక్షార్థమశుభేషు చ ।
భస్మనా క్రీయతే రక్షా సూతికానాం గృహేషు చ ॥
భస్మస్నానవిశుద్ధాత్మ జితక్రోధో జితేంద్రియః ।
మత్సమీపముపాగమ్య న భూయో వినివర్తతే ॥
వ్రతం పాశుపతం యోగం ఆపాలం యోగనిర్మితమ్ ।
పూర్వం పాశుపతం హ్యేతన్నిర్మితమ్ తదనుత్తమమ్ ॥
శేషాశ్చాశ్రమీణః సర్వే పశ్చాత్సృష్టాః స్వయంభువా ।
సృష్టియేషా మయా సృష్టా లజ్జామోహభయాశ్మికా ॥
భగవానుఁడిట్లనెను:
మీకది చెప్పెదను. ఇప్పుడా కథా సర్వస్వము వివరములతో చెప్పెదను. సోమునీతో గూడియున్న అగ్నిని నేను. సోముఁడగ్ని నుపొశ్రయించు కొని యున్నాడు. (106) మరల లోకములన్నియు కృతాకృతమైన అగ్నిని ఆశ్రయించి యున్నవని చెప్పుదురు. స్థావర జంగమాత్మకమయిన జగత్తు అనేక పర్యాయములు అగ్నిచే దగ్డమయినది. (107) భస్మముచే తత్సర్వమును సాధ్యము. ఇది పవిత్రమైనది. ఉత్తమమైనదీ భస్మముచే వీర్యమునందీ సర్వప్రాణులను ఆ భస్మముచే పరిషేచనము చేయును. భూతములపై చల్లును. (ఎవఁడు - భక్తుఁడు) పవిత్రమయిన యగ్నికార్యముల నాచరించి, వానిలో “త్ర్యాయుష” మను కర్మ సొచరీఁచును, త్ర్యాయుషమన జీవితకాలమును (ఆయువును) కల్పింపజేయుట. నా వీర్యమయిన భస్మముచే వ్యక్తి సర్వకిల్బిషముల నుండి పరిచ్యుతుఁడగును, (109) శుభమును భాసింపఁజేసి దానినీ వసింపచేయునది యగుట అదీ భస్మమయినది, అయ్యది వెంటనే సర్వపాపములను భస్మీకరించునదగుట భస్మమని కీర్తింపబడుచున్నది. (110) పితృదేవతలను ఊష్మపులుగా నెఱుంగవలయును. దేవతలందరు సోమసంభవులు : (సోమరసము లేక చంద్రుఁడు) స్థావర జంగమాత్మకమయిన జగత్సర్వము అగ్నీషోములచే నిర్మింపబడినది. (111) మహాతేజుడయిన అగ్నీని నేనే. ఈ నాయంబిక సోమము. నేను అగ్నిని, సోముఁడను, నేను ప్రకృతిచే స్వయముగా పురుషుడను. ఓ మహాభాగులోరా ! అందుచేతనే భస్మము నా వీర్యమని చెప్పఁబడుచున్నది. నా వీర్యమును శరీరముతోగూడ ధరింతును. ఇది స్థితి. అదీ మొదలుకొని, అశుభముల యందు, రక్షణార్థము, సూతికా గృహములందు భస్మముచే రక్షాక్రియ చేయఁబడును. భస్మస్నానమున విశుద్దాత్ముఁడు జిత క్రోధుఁడు జితేంద్రియుఁడునయినవాఁడు నా సమీపమును చేరి మరల తిరిగిపోఁడు. (115) పాశుపతమొక యోగము. కాపాలవ్రతము యోగముచే నిర్మితము. ఈ పాశుపతవ్రతము. పూర్వము నిర్మితము. ఆయ్యది అత్యుత్తమమైనది. వివిధములయిన ఆశ్రమములకు సంబంధించిన వారు తరువాత బ్రహ్మచే సృజింపఁబడిరి. లజ్జ మోహ భయాల్మీకమయిన యీ సృష్టి.నాచే కల్పింపఁబిడినది. (117)
నగ్నా ఏవ హి జాయంతే దేవతా మునయస్తథా ।
యే చాన్యే మానహా లోకే సర్వే జాయంత్యవాససః ॥
ఇంద్రియైరజితైర్నగ్నా దుకూలేనాపి సంవృతాః ।
తైరేవ సంవృతో గుప్తో న వస్త్రం కారణం స్మృతమ్ ॥
క్షమా ధృతిరహింసా చ వైరాగ్యం చైవ సర్వశః ।
తుల్యౌ మానాపమానౌ చ తత్ప్రావరణముత్తమమ్ ॥
భస్మపాండురదిగ్ధాంగో ధ్యాయతే మనసా భవమ్ ।
యద్యకార్యసహస్రాణి కృత్వా స్నాయతి భస్మనా ॥
తత్సర్వం దహతే భస్మ యథాగ్నిస్తేజసా వనమ్ ।
తస్మాద్యత్నపరో భూత్వా త్రికాలమపి యః సదా ॥
భస్మనా కురుతే స్నానం గొణపత్యం స గచ్ఛతి ।
సంహృత్య చ క్రతూన్ సర్వాన్ గృహీత్వాఽమృతముత్తమమ్ ॥
ధ్యాయంతి యే మహాదేవం లీసాస్తద్భావభావితాః ।
ఉత్తరేణాథ పంథానం తేఽమృతత్వమవాప్నుయుః ॥
దక్షిణేనాథ పంథానం యే శ్మశానాని భేజిరే ।
అణిమా మహిమా చైవ లఘిమా ప్రాప్తిరేవ చ ॥
గరిమా పంచమీ చైవ షష్ఠం ప్రాకామ్య మేవ చ ।
ఈశత్వం చ వశిత్వం చ హ్యమరత్వం చ తే గతాః ॥
ఇంద్రాదయస్తథా దేవాః కామికం వ్రతమాస్థితాః ।
ఐశ్వర్యం పరమం ప్రాప్య సర్వే ప్రథితతేజసః ॥
వ్యపగతమదమోహముక్తరాగా స్తమరజదోషవివర్జితస్వభావాః ।
పరీభవమిదముత్తమం విదిత్వా పశుపతిదయితమిదం వ్రతం చరధ్వమ్ ॥
యః పఠేద్వై శుచిర్భూత్వా శ్రద్దధానో జితేంద్రియః ।
సర్వపాపవిశుద్ధాత్మా రుద్రలోకం స గచ్ఛతి ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోకే పూర్వభాగే ద్వితీయేఽనుషంగపాదే దారువనప్రవేశ భస్మస్నాన విధిర్నామ సప్తవింశతితమోఽధ్యాయః ॥
దేవతలు మునులు నగ్నులుగానే (వివస్తులు) పుట్టెదరు. ఇతరులు, లోకమునందలి మానవులందరు వస్త్రములు లేకుండగనే పుట్టుచున్నోరు. (118) ఇంద్రియముల జయింపనీచో సవస్తులైనను వివస్తులేయగుదురు. వస్త్ర ముండియు మానగోపనము జరుగదు. కామముద్రిక్త మగును, ఇక ఇంద్రియముల జయించినచో కామముద్రిక్తము గాదు. కావున మానగోపనమునకు వస్తావరణ మవసరము లేదు. (119) క్షము (ఓర్పు), ధృతి (ధైర్యము), అహింస, సర్వ వస్తువులయందు వైరాగ్యము, మానావమానములయందు తుల్యప్రవృత్తి ఇయ్యవియే ఉత్తమమయిన ఆవరణములు. (120) భస్మముచే పూయఁబడిన అంగము కలవాఁడు పరమేశ్వరుని మనసా ధ్యానము చేయును. చేయకూడని కార్యములోక సహస్ర మాచరించియును భస్మ స్నాన మాచరించినవాడు, అగ్ని తన తేజస్సుచే వనమును దగపటలము చేయునట్లు, ఆ పాపముల నన్నింటినీ భస్మముగా దహించును. అందుచే యత్నపరుఁడయి, త్రికాలములందుఁగూడ నెవ్వఁడు భస్మముచే స్నాన మాచరించునో ఆతఁడు గాణపత్య మును (శివుని ప్రమథ గణములకాధిపత్యమును) పొందును, అన్ని క్రతువులను సోచరించిన పిమ్మట, ఉత్తమమయిన అమృతమును సేవించిన పిమ్మట (128) మహాదేవుని యందు నిమగ్నమయిన మనస్సుతో తద్బావ భావితులయి ఎవరు ధ్యానము చేయుదురో, ఉత్తర మార్గమున వారు అమృతత్వమును (మోక్షమును) పొందెదరు. (124) ఎవ్వరు దక్షిణాయనమున (దక్షిణ మార్గమున) శ్మశానమును చేరుదురో వారు అమా, మహిమా, లఘిమా, ప్రాప్తి, గరీమా యైదవ లక్షణము) ప్రాకామ్యము (ఆరవది) ఈశత్వం, వశిత్వము, అమరత్వము అను అమానుష శక్తులను పొందెదరు. (126) ఇంద్రాదులు, ఇతరదేవతలు, కామికములయిన వ్రతముల నోచరించి, ఉత్కృష్టమైన యైశ్వర్యము నంది ప్రధిత తేజస్వులయిరి. మీరందరు పోయిన మదమోహాంగులరై, తమోగుణ రజోగుణ దోష వర్జిత స్వభావులునయి, ఈ యుత్తమమయిన విధి నెటీంగీ, పశుపతికి ప్రియతమ మయిన యీ వ్రతము సాచరించి సంచరింపుఁడు. ఎవ్వఁడు, పరిశుద్ధుఁడై, శ్రద్ధావంతుఁడై, స్వాధీనేంద్రియుఁడయి, దీనిని పఠించునో అతఁడు సర్వపాపముల నుండి విముక్తాత్ముఁడయి రుద్రలోకమును చేరును.
ఇది శ్రీ బ్రహ్మాండపురాణమందలి, పాయుప్రోక్తమయిన పూర్వభాగమందలి, ద్వీతీయానుషంగపాదమున దేవదారువన ప్రవేశము, భస్మస్నానవీధి, యనేడు ఇరువది యేడవ అధ్యాయము.
Summary of chapter 27 of the Brahmānda Mahā Purana is as follows:
In a tale of divine play and ultimate realization, the text describes how lord Śiva wandered the Dāruvana forest, testing the ascetic sages who, in their ignorance, cast a curse upon him. It beautifully resolves with the sages realizing his supreme divinity, leading to the holy installation of the Śiva Liṅga and the sacred injunctions for purifying oneself with holy ash. The devout are thereby taught the virtues of humility, the destructive nature of spiritual pride, and the purifying power of absolute surrender to the divine.