55 - అంశుమంతునికి రాజ్యప్రాప్తి

జైమినిరువాచ :-

తతః పౌత్రం పరిష్వజ్య సగరః ప్రేమవిహ్వలః ।

 అభినంద్యాశిషత్యర్థం లాలయన్ ప్రశశంస హ ॥

 అథ ఋత్విక్సదస్యైశ్చ సహితో రాజసత్తమః ।

 ఉపొక్షమత తం యజ్ఞం విధివద్వేదపారగైః ॥

 తతః ప్రవవృతే యజ్ఞః సర్వసంపద్గుణాన్వితః ।

సమ్యగౌర్వవసిష్టాద్యైర్మునిభిః సంప్రవర్తితః ॥

 హిరణ్మయమయీ వేదిః పాత్రాణ్యుచ్చావచానీ చ ।

సుసమృద్ధం యథాశాస్త్రం యజ్ఞే సర్వం బభూవ హ ॥

 ఏవం ప్రవర్తితం యజ్ఞమృత్విజః సర్వ ఏవ తే ।

 క్రమాత్సమాపయామాసుర్యజమానపురస్సరాః ॥

 సమాపయిత్వా తం యజ్ఞం రాజా విధివిధాం వరః ।

 యథావద్దక్షిణాం చైవ ఋత్విజం ప్రదదే తదా ॥

 అథ త్విక్సదస్యానాం బ్రాహ్మణానాం తథార్థినామ్ ।

తత్కాంక్షితాదభ్యధికం ప్రదదే వసు సర్వశః ॥

 ఏవం సంతర్పణ విప్రాదీన్హక్షిణాభిర్యథాక్రమమ్ ।

క్షమాపయామాస గురూన్ సదస్యాస్ ప్రణిపత్య చ ॥

 బ్రాహ్మణాద్యైస్తతో వర్ణిః ఋల్విగ్శిశ్చ సమన్వితః ।

 వారకీయాకదంబైశ్చ సూతమాగధవందిభిః ॥

 అస్వీయమానః సస్త్రీకః శ్వేతచ్ఛత్రవిరాజితః ।

దోధూయమానచమరో వాలవ్యజనరాజితః ॥

 నానావాదిత్రనిర్దోషెర్బధిరీకృత దిబ్ముఖః ।

 స గత్వా సరయూతీరం యథాశాస్త్రం యథావిధి ॥

 చకారావబృథస్నానం ముదితః సహ బంధుభిః ।

ఏవం స్నాత్వా సపత్నీకః సుహృద్భిః బ్రాహ్మజ్ఞః సహ ॥

వీణావేణుమృదంగాదీనానావాదిత్రనిఃస్వనైః ।

 మంగళ్యైర్వేరఘోషైశ్చ సహ విప్రజనేరితైః ॥

 సంస్తూయమానః పరితః సూతమాగధవందిభిః ।

 ప్రవివేశ పురీం రమ్యాం హృష్టపుష్టజనాయురామ్ ॥

 శ్వేతవ్యజనసచ్ఛత్రపతాకాధ్వజమాలినీమ్ ।

 సిక్తసమృష్టభూభాగాపణశోభాసమన్వితామ్ ॥

 జైమిని ఇట్లనెను :-

ప్రేమ విహ్వలుఁడయిన సగరుఁడు, తన మనుమనీ కౌగలించుకొనెను అభినందించెను. ఆశీర్వదించెను. ప్రశంసించెను. లాలించేను. ఋత్విక్కులతో, సదస్సులతో గూడి రాజసత్తముఁడు, వేదపారగులచే వీధివంతముగా ఆ యజ్ఞము సర్వసంసద్గుణాన్వితము ఆరంభీంపఁబడెను. ఔర్వ మహర్షి వసిష్ణుఁడు మున్నగు మునులచే నది సంప్రవర్తితము. యజ్ఞవేది సువర్ణమయము. యజ్ఞపాత్రలు పెద్దవి చిన్నవి సకలము సుసమృద్ధము. యజ్ఞము నందంతయు యథాశాస్త్రముగా జరిగెను. ఇట్లు ఆరంభింపఁబడిన యజ్ఞమును ఋత్విక్కులు యజమాన పురస్సరులై క్రమముగా సమాప్తము చేసిరి. విధి వంతులలో శ్రేష్ఠుఁడయిన రాజు యజ్ఞమును సమాప్త మొనరించి, ఋత్విక్కులకు, సదస్సులకు, బ్రాహ్మణులకు, ఆగతులయిన అర్ధులకు, పోరు కాంక్షించిన దానికంటే నభ్యధికముగా నెల్లరకు సువర్ణమును ధనమును రాజొసంగెను.  యథాక్రమము విప్రులను దక్షిణలతో సంతృప్తిచేసి, గురువులకు, సదస్సులకు సాష్టాంగ ప్రణామమాచరించి వారియందరిని యజ్ఞమునందు జరిగిన తప్పొప్పులకు క్షమింపుఁడని అభ్యర్థించెను. అంత బ్రాహ్మణాదులతో, సర్వ వర్ణముల వారితో, ఋత్విక్కులతో అంతః పురజనముతో, సూతులతో మాగధులతో, మందులతో అనుసరింపఁబడి, స్త్రీలతో, శ్వేతచ్చత్ర విరాజితుఁడై చమరములు వీవబడుచుండ, వాలవ్యజనములతో ప్రకాశితుఁడై, నానా విధములయిన మంగళ వాయిద్యముల ఘోషలతో, దిక్కులు బధిరీకృతములు కాగా, రాజు, సరయూ తీరమునకు యథాశాస్త్రము, యథావీధి అరిగి, సంతుష్టాంతరంగుఁడై బంధువులతో, స్నేహితులతో, బ్రాహ్మణులతో సపత్నీకముగా అవబ్బధస్నానము (యజ్ఞాంతస్నానమును), ఆచరించి వీణాపేణు మృదంగములు మొదలయిన వాని ధ్వనులతో విప్రజనులాచరించిన మంగళకరములయిన వేద ఘోషములతో, సంస్తుతింపఁబడుచు, సూతమాగధవందులచే పరిషృతుఁడయి, తిరిగి సంతుష్టులై పరిపుష్టులయిన జనులతో గూడినది రమ్యమైనది, తెల్లని వ్యజనములు, సచ్ఛత్రములు పతాకములు, ధ్వజముల మాలికలతో కలకల లాడునది, చక్కగా నీటిచే తడుపబడి, సర్వ వస్తు సమృద్ధమైన అంగడుల ప్రకాశముతో కూడినట్టిదియు,

కైలాసాద్రిప్రకాశాభిరుజ్జ్వలాం సౌధపంక్తిభిః ।

 సతత్రాగరుధూపోష్ఠగంధామోదితదిబ్ముఖమ్ ॥

 వికీర్యమాణః పరితః పౌరనారీజనైర్ముహుః ।

 లాజవర్షెణ సానందం వీక్షమాణశ్చ నాగరైః ॥

 ఉపదాభిరనేకాభి స్తత్ర తత్ర వణీర్జనైః ।

సంభావ్యమానః శనకైర్జగామ స్వపురం ప్రతీ ॥

  స ప్రవీశ్య గృహం రమ్యం సర్వమండలమండితమ్ ।

 సమ్యక్సంభావయామాస సుహృదో బ్రాహ్మణానది ॥

 సంసేవ్యమానశ్చ తదా నానాదేశేశ్వరైరపైకి ।

 సభాయాం రాజశార్దూలో రేమే శక్ర ఇవాపరః ॥

ఏవం సుహృద్భిః సహితః పూరయిత్వా మనోరథమ్ ।

 సగరః సహ భార్యాభ్యం రేమే నృపవరోత్తమః ॥

 అంశుమంతం తతః పౌత్రం ముదా వినయశాలినమ్ ।

 వసిషానుమతే రాజా యావరాజ్యేలభ్యషేచయత్ ॥

 పౌరజానపదానాం తు ఐంధూనాం సుహృదామపి ।

స ప్రియో భవదత్యర్థముదారైశ్చ గుణెరపః ॥

 ప్రజాస్తమన్వరజ్యంత బాలమష్యమీతాసమ్ ।

నవం చ శుక్లపక్షాదౌ శీతాంశుమచిరోదితమ్ ॥

 స తేన సహితః శ్రీమాన్ సుహృద్భిశ్చ నృపోత్తమః ।

 భార్యాభ్యామసురూపాభ్యాం రమమాటోలివసచ్చిరమ్ ॥

 యువైవ రాజశార్దూలః సాక్షాఢర్మ ఇవాపరః ।

 పాలయామాస వసుధాం సశైలవనకాననామ్ ॥

ఏవం మహానహిమదీధితివంశమౌళిర్నయమానవపురుత్తరకోసలేశః ।

 పూర్ణేందువత్సకలలోకమనోభిరామః సార్ధం ప్రజాభిరలీలాభీరలం జహర్ష ॥

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే

సాగరోపాఖ్యానేంశుమతే రాజ్యప్రాప్తిర్నామ పంచపంచాశత్తమోధ్యాయః॥

            కైలాస పర్వత ప్రకాశముచే మెఱుంగులీను సౌధ పంక్తితో గూడినదియు, అగరు ధూప వాసనలతో దిక్కులను గుబాళించునదియు, పౌర సారీ జనములచే మాటిమాటికి చల్లఁబడు లాజు వర్షమున కలిగిన ఆనందమున మునిగినట్టి నగరవాసులు కలిగినదియు, అందందు వణిగ్టనములచే అనేకమయిన కానుక లొసంగబడుచుండ, ఎల్లరు గౌరవించుచుండ మెల్లగ రాజు స్వపురమునకగను. రాజు. సర్వమండల మండితము (రత్నమణిశోభితము) అయిన గృహమును ప్రవేశించెను. స్నేహితులను, బ్రాహ్మణులను గౌరవించెను, సర్వదేశముల నుండి వచ్చిన దేశాధిపతు లయిన రాజులచే రాజు సంసేవింపఁబడెను. సభాసీనుఁడై రాజశార్దూలుఁడు రెండవ ఇంద్రునివలె ప్రకాశించెను. ఈ విధముగా తన స్నేహితులతో సహితముగా తన మనోభీష్టమును పరిపూర్ణము గావించుకొనీ, నృపవరోత్తముఁడయిన సగరుఁడు తన భార్యలతో సర్వభోగము లందెను. అంత సంతోషముతో, వినయశాలియు మనుమడునయిన అంశుముతునీ, వసిష్ఠుల వారి యనుమతితో యౌవరాజ్యమున నభిషేకించెను,(22) మహారాజు స్వకీయమైన ఉదారగుణములచే, పౌరజానపదులకు, బంధువులకు, స్నేహితులకు, అత్యంత ప్రియుతముఁడయ్యెను. శుక్లపక్షమున నవముగా ఉదయించిన చంద్రునీవలె, బాలుఁడయినను అమీతశక్తిమంతుఁడయిన అంశుమతుని ప్రజలాతని రంజింపఁ జేసిరి. నృపోత్తముఁడయిన సగరుండు, స్నేహితులతో గూడికొని, అనురూపవతులయిన భార్యలతో చిరకాలము సంప్రీతుడై వసించేను, రాజ శార్దూలుఁడయిన సగరుడు యువకునివలె సాక్షార్దర్మమునకు ప్రతిరూపునివలె, సశైల వన కాననమయిన భూమిని పాలించేను. ఈ విధముగా సూర్యవంశ మౌళి రత్నము ఉత్తర కోసలాధిపతియునైన రాజు, పూర్ణచంద్రునివలె సకల లోకమనోభిరాముఁడయ్యెను. తన ప్రజలతో కలిసి రాజు ఆనంద మొందెను.

ఇది వాయు ప్రోక్తమయిన బ్రహ్మాండపురాణమున మధ్యభాగమున తృతీయ ఉపోద్ఘాతపాదమున సాగరోపాఖ్యానమున అంశుమతుని రాజ్యప్రాప్తియను ఏబదియైదవ అధ్యాయము.