బ్రహ్మాండ మహా పురాణము
37 - భార్గవ చరితము
వసిష్ఠ ఉవాచ :-
దృష్ట్వా పరశురామస్తు తదాశ్చర్యం మహాద్భుతమ్ ।
జగాద సర్వవృత్తాంతం మృగయోస్తు యధాశ్రుతమ్ ॥
తచ్చ్రుత్వా భగవాన్ సాక్షాదగస్త్యః కుంభసంభవః ।
మోదమాన ఉవాచేదం భార్గవం పురతస్థితమ్ ॥
అగస్త్య ఉవాచ :-
శృణు రామ మహాభాగ కార్యాకార్యవిశారద ।
హితం వదామి యత్తేఽద్య తత్కురుష్వ సమాహితః ॥
ఇతో విదూరే సుమహత్థ్సానం విష్ణోః సుదర్లభమ్ ।
పాదాని యత్ర దృశ్యంతే న్యస్తాని సుమహాత్మనా ॥
యత్ర గంగా సముద్భూతా వామనస్య మహాత్మనః ।
పదాగ్రాత్క్రమతో లోకాంస్తద్బలేస్తు వినిగ్రహే ॥
తత్ర గత్వా స్వయం చేదం మాసమేకమనన్యధీః ।
పఠస్వ నియమేనైవ నీయతో నియాతాశనః ॥
యత్తయా కవచం పూర్వమధ్యస్తం సిద్ధిమిచ్ఛతా ।
శత్రూణాం నిగ్రహార్థాయ తచ్చ తే సిద్ధిదం భవేత్ ॥
వసిష్ట ఉవాచ :-
ఏవముక్తో హ్యగస్త్యేన రామః శత్రుని బర్హణః ।
నమస్కృత్య మునిం శాంతం నిర్ణగామాశ్రమాద్బహిః ॥
పునస్తేనైవ మార్గేణ సంప్రాప్తస్తత్ర సత్వరమ్ ।
యత్రోత్తరాత్పదన్యాసాన్నిర్గతా స్వర్నదీ నృప ॥
తత్ర వాసం ప్రకల్ప్యాసావకృతవ్రణసంయుతః ।
సమభ్యస్యత్సవం దివ్యం కృష్ణ ప్రేమామృతాభిదమ్ ॥
నిత్యం ప్రజపతేస్తస్య స్తోత్రం తుష్టోఽభవద్ధరిః ।
జగామ దర్శనం తస్య జామదగ్న్యస్య భూపతే ॥
చతుర్వ్యూహాధిపః సాక్షాత్కృష్ణః కమలలోచనః ।
కిరీటేనార్కవర్ణేన కుండలాభ్యాం చ రాజితః ॥
కౌస్తుభోద్భాసితోరస్కః పీతవాసా ఘనప్రభః ।
మురలీవాదనపరః సాక్షాన్మోహనరూపధృక్ ॥
తం దృష్ట్వా సహసోత్థాయ జామదగ్న్యో ముదాన్వితః ।
ప్రణమ్య దండవడ్భూమౌ తుష్టావ ప్రయతో విభుమ్ ॥
వసిష్ఠుఁడిట్లనెను.
ఆశ్చర్యజనకమయిన తదద్భుతమును చూచీ పరశురాముఁడు మగద్వయమును గూర్చి తాను విన్నదంతయు చెప్పెను. కుంభ సంభ వుఁడు, సాక్షాత్ భగవంతుఁడునయిన అగస్త్యర్షి దానిని వినెను. సంతోషచకితుఁడయ్యెను. తనముందు ఆసీనుడయిన పరశురామునితో నిట్లనెను. అగస్త్యుడిట్లనెను.
కార్యాకార్య విచక్షణుడవయిన రామా! మహాభాగ! మినుము. నీకు హితమును చెప్పెదను, సమాహిత మనస్కుఁడవై దాని నాచరింపుము, ఇచ్చట నుండి బహుదూరములో సుదుర్లభమయిన శిషుని యొక్క సుమహత్స్థానమున్నది. అచ్చటనే సుమహాత్ముడయిన విష్ణునిచే న్యస్తములయిన పాదములు కనిపించును. బలిచక్రవర్తిని నిగ్రహించునప్పుడు మహాత్ముఁడయిన వామనుడు తన పాదములచే సర్వలోకముల. నాక్రమించెను. ఆతని పదాగ్రము నుండి 'గంగ' యచ్చటనే సముద్భూతమయ్యెను. అచ్చటికి వెడలుము. ఇతర చింతయేదియు మనస్సున లేకుండ మన స్సమాధియుతుఁడవై నీయమ పూర్వకముగా, నియమితాహారివై ఒకమాసమీమంత్రమును పఠింపుము. శత్రువుల నీగ్రహణము కోటకు, సిద్ది కోరి, పూర్వము నీచే నే కవచమభ్యస్తమో యయ్యది నీకు సిద్ధిదమగును.
వసిష్ఠుఁడిట్లనెను.
అగస్త్యుఁడిట్లు చెప్పగా శత్రునిబర్హణుఁడయిన రాముఁడు పరమ శాంతుఁడయిన మునికి నమస్కరించి, ఆశ్రమము నుండి బయటి కరిగెను. మఱల పూర్వము వచ్చిన మార్గము నంటియే పోయి రాముఁడు, విష్ణునీ తుదీపదము నుండి, స్వర్నదియైన గంగ యెందు బయలు వెడలెనో ఆ ప్రదేశమును వెంటనే చేరుకొనెను. అచ్చట వాసమును అకృతవ్రణునితో సహితము నిర్మించుకొనెను. దీష్యము “కృష్ణ ప్రేమామృత" మను పేరు గలిగిన స్తవమును రాముఁడు అభ్యసింప మొదలీడెను. నిత్యము ప్రజపతియయిన కృష్ణుని స్తోత్రమాచరించెను. హరి సంతుష్టు డయ్యెను. వెంటనే విష్ణువు జమదగ్ని కుమారుఁడయిన రామునికి దర్శన మొసంగెను. చతుర్వ్యూహాధీపతీ, కమలలోచనుఁడు, అర్కవర్ణపు కిరీటము కలిగి, కుండలములు, కౌస్తుభముచే ప్రకాశించు వక్ష స్థలము, కలిగి పీతాంబరుడు, ఘనప్రభాకలితుఁడు మరళీవాదపరుఁడునయిన సాక్షాత్ కృష్ణుఁడు మోహనరూపము దాల్చి ప్రత్యక్షమయ్యెను. ఆతనిని రాముఁడు చూచెను. ముదాన్వితుఁడయ్యెను. వెంటనే పరశు రాముఁడు సమాధి నుండి లేచెను. దండ పత్రమాణమును భూమి యందు సాగిలపడీ చేసెను. ప్రయత్న పూర్వకముగా వీధునీ స్తోత్ర మాచరించెను.
పరశురామ ఉవాచ :-
నమో నమః కారణ విగ్రహాయ ప్రపన్నపాలాయ సురార్తిహారిణే ।
బ్రహ్మేశ విష్ణ్వింద్రముఖస్తుతాయ నతోఽసి నిత్యం పరమేశ్వరాయ ॥
యం వేదవాదైర్వీవీధప్రకారైర్నిర్ణీతుమీశానముభా న శక్నుయుః ।
తం త్వామనిర్దేశ్యమజం పురాణమనంతమీడే భవ మే దయాపరః ॥
యస్త్వేక ఈశో నీజపాంఛితప్రదో ధత్తే తనుర్లోకవిహారరక్షణే ।
నానావిధా దేవమనుష్యతిర్యగ్యాదఃసుభూమేర్భరవారణాయ ॥
తం త్వామహం భక్తజనానురక్తం వీరకమత్యంతమహీంద్రాదిషు ।
స్వయం సమక్షం వ్యభిచారదుష్టచిత్తస్వపి ప్రేమ నిబద్ధమానసమ్ ॥
యం వై ప్రసన్నా అసురాః సురా నరాః సకిన్నరాస్తిర్యగయోనఃపీ హి ।
గతా స్వరూపం నీఖిలం విహాయ తే దేహస్యపత్యార్థమమత్వమీశ్వర ।
తం దేవదేవం భజతామభీప్సితప్రదం నిరీహం గుణవర్జితం చ ।
అచింత్యమవ్యక్తమమౌఘనాశనం ప్రాప్తోరణం ప్రేమనిధానమాదరాత్
తపంతి తాపైర్వివివిధైః స్వదేహమన్యే తు యజెర్వివిధైర్యజంతి ।
స్వప్నేపితే రూపములౌకికం విభో పశ్యంతి నైవార్డనిబద్దవాసనాః ॥
యే వై త్వదీయం చరణం భవశ్రమాన్నిర్విష్ణచిత్తా విధివత్సర్మంతి ।
నమంతి భక్త్యాథ సమర్చయంతి వై పరస్పరం సంసదీ వర్జయంతి ॥
తేనైకజన్మోద్భవపంకబేదనప్రసక్తచిత్తా భవతోంఘిపద్మే ।
తరంతీ చాన్యానపి తారయంతి హి భవేషధం నామ సుధా తవేశ ॥
అహం ప్రభో కామనిబద్దచిత్తో భవంతమార్యం వివిధప్రయత్నైః ।
ఆరాధయం నాథ భవానభిజ్ఞః కిం తే హ విజ్ఞాష్యమిహాస్తీ లోకే ॥
పరశురాముఁడిట్లు స్తోత్రమాచరించెను. ప్రపంచ సృష్టికి కారణ విగ్రహుఁడవు నీకు నమస్కారము. తన్ను చేరిన వారిని రక్షించు పాలకునకు, సర్వార్తి హరునకు, బ్రహ్మ ఇంద్రుఁడు ఈశుండు విష్ణువు మున్నగు వారిచే స్తోత్రము చేయబడువానికి, నిత్య పరమేశ్వరుడయిన వానికి నమస్కారము. ఈశానుఁడు మున్నగు దేవతలు, వివిధ ప్రకారముల వేద వాదములచే నిన్ను నిర్ణయించుటకశక్తులు. నీవజుఁడవు. అనిర్దేశ్యుఁడవు. పురాణం డవు. అనంతుఁడవు. నిన్ను స్తోత్రము చేయుదును, దయాపరుండవు కమ్ము. నిజవాంఛిత ప్రదుఁడవు ఈశుఁడవు నీవొక్కడవే. నానా విధ దేవమనుష్య తిర్యక్సులు, నీటి యందు గల జీవజాలముల వివిధ రూపములును గల భూమి యొక్క భారమును తొలగించుటకు నీవే సమర్థుడవు. భక్త జనాను రక్తుఁడవయిన నిన్ను, లక్ష్యాదుల యందు అత్యంతము విరక్తుడైన వానిని, వ్యభిచార దుష్ట చిత్తులయిన వారి యందు గూడ ప్రేమ నిబద్దమనసుని నిన్ను పూజింతును. ఓ ప్రభూ ! సంతుష్టులయిన అసురులు, సురలు, నరులు, కిన్నరులు, తిర్యక్కులు (పశుపక్ష్యాదులు) అయోని సంభవులు, మొదలగువారు నేను, నాది, నా దేహము అను భావమును సర్వమును పరిత్యజించి యేదేవదేవుని అభీప్సితప్రదునారాధింతురో యట్టి నీకు నమస్కారము. ఇంఛారహితుని, గుణవర్జితుని, అచింత్యుని, అవ్యక్తుని, పాప సమూహముల నాశనము చేయువానిని, ప్రేమనిధనుని, నీన్ను పొందితిని. కోందలు, వివిధములయిన క్లేశపూర్వక నియమములకు స్వదేహమును పాల్పరచెదరు. కొందతో వివిధములయిన యజ్ఞములచే పూజింతురు. కాని, ఓ ప్రభూ ! లౌకిక విషయ నిబద్దవాసనులయిన వారు స్వప్నమున నైనను నిన్ను చూడలేరు. జనన మరణ. సంసార శ్రమ నుండి యెవరు నిర్విజ్ఞచిత్తులై నీయంఫ్రీ పద్మముల సేవింతురో, వారు తరింతురు. ఇతరులను తరింపజేయుదురు. జన్మతరణమునకు అమృత సుధవు నీవే. ఓప్రభూ ! కాపు నిబద్దచిత్తుఁడనైన నేను ఆర్యుఁడవయిన నిన్ను వివిధ ప్రయత్నములతో ఆరాధించుచున్నాను. నీవదీ యెఱుంగుదువు. నీకు ప్రపంచములో ప్రత్యేకముగా నివేదించుకొనవలసినదేమి కలదు?
వసిష్ఠ ఉవాచ:-
ఇత్యేవం జామదగ్న్యం తు స్తువంతం ప్రణతం పురః ।
ఉవాచాగాధయా వాచా మోహయన్నివ మాయయా ॥
కృష్ణ ఉవాచ :-
హంత రామ మహాభాగ సిద్ధం తే కార్యముత్తమమ్ ।
కవచస్య స్తవస్యాపి ప్రభావాదవధారయ ॥
హత్వా త్వం కార్తవీర్యం హి రాజానం దృప్తమానసమ్ ।
సాధయిత్వా పితుర్వైరం కురు నిఃక్షత్రియాం మహీమ్ ॥
మమ చక్రావతారో మీ కార్తవీర్యో ధరాతలే ।
కృతకార్యో ద్విజశ్రేష్ఠ తం సమాపయ మానద ॥
అద్య ప్రభృతి లోకే స్మిన్నంశావేశేన మే భవాన్ ।
చరిష్యతి యథాకాలం కర్తా హర్తా స్వయం ప్రభుః ॥
చతుర్వింశే యుగే వత్స శ్రేతాయాం రఘువంశజః ।
రామో నామ భవిష్యామి చతుర్వ్యూహః సనాతనః ॥
కౌసల్యానందజనకో రాజ్ఞో దశరథాదహం ।
తదా కౌశికయజ్ఞం తు సాధయిత్వా స లక్ష్మణః ॥
గమిష్యామి మహాభాగ జనకస్య పురం మహత్ ।
తత్రేశచాపం నిర్భజ్య పరిణీయ విదేహణాం ॥
తదా యాస్యన్నయోధ్యాం తే హరిష్యే తేజ ఉన్మదమ్ ।
వసిష్ఠ ఉవాచ :-
కృష్ణ ఏవం సమాదిశ్య జామదగ్న్యం తపోనిధిమ్ ।
పశ్యతోంతర్దధే తత్ర రామస్య సుమహాత్మనః ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే
భార్గవచరితే సప్తత్రింశత్తమోధ్యాయః ॥
వసిష్ఠుఁడిట్లనెను.
ఈ విధముగా తన ముందు సాగిలపడి స్తోత్రము చేయుపరశురాముని గూర్చి, మిక్కిలి గభీరమయిన వాక్కులతో ప్రపంచమును తన మాయచే మోహ పెట్టువానివలె కృష్ణుడిట్లనియెను,
ఓ మహాభాగ ! రామ ఉత్తమమయిన నీ కార్యము సిద్ధి పొందుచున్నది. ఆ సిద్ధి కవచము యొక్కయు స్తోత్రము యొక్కయు ప్రభావము వలననీ యెఱుంగుము. గర్వియైన కార్తవీర్యుని నీవు చంపి, నీ తండ్రిదైన వైరమును సాధించుము, ఈ భూమిని నీఃక్షత్రీయముగా జేయుము. నా చక్రము యొక్క యవతారము భూలోకమున కార్తవీర్యుఁడు. ఓ అభిమానవంతుఁడా ! ఓ ద్వీజశ్రేష్ఠ ! నీ కార్యమును ఆతనిని చంపి, నిర్వర్తించినవాఁడవగుము. ఇప్పుడు మొదలుకొని ఈ లోకమున నీవు నీ యంశతో సంచరించెదవు. నీవు యధాకాలము నందు స్వయంకర్తవు, స్వయం హర్తవు. నీవు ప్రభుఁడవు. చతుర్వింశద్యుగమున త్రేతలో చతుర్వ్యూహుఁడను, సనాతనుఁడను నగు నేను రఘువంశమున, దశరథునకు కౌసల్య యందుదయించెదను. అప్పుడు సలక్ష్మణుఁడనై కౌశికుని యజ్ఞమును సంరక్షించి, నేను జనకుని పట్టణమున కరిగెదను. అందు ఆ జనక నగరమున ఈశ్వరుని ధనువును భంజించి విదేహజయయిన సీతను వివాహమాడి, అయోధ్యకరుగుచు ఉన్మదమయిన నీ తేజమును హరించెదను.
వసిష్ఠ ఉవాచ-
తపోనిధియైన జామదగ్ని నీ విధముగా ఆదేశించి, రాముని యొక్క సమక్షముననే కృష్ణుడంతర్థానము నొందెను.
ఇదీ మహాపురాణము, వాయుప్రోక్తమునయిన బ్రహ్మాండపురాణమున, మధ్యభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున భార్గవచరిత్రము నందు ముప్పది యేడవ అధ్యాయము.
Summary of chapter 75 of the Brahmānda Mahā Purana is as follows:
Introducing the divine incarnation Parashurāma, this sublime chapter describes his intense spiritual penance and unwavering devotion toward lord Shiva in the holy Himalayas. It details his rigorous austerities, pure meditation, and ultimate conquest over all physical and mental limitations. The devoted reader is filled with intense awe, observing how divine avatars perform severe penance on earth to teach humanity the path of unyielding dedication.