బ్రహ్మాండ మహా పురాణము
12 - లలితాప్రాదుర్భవమను పండ్రెండవ యధ్యాయము.
రుద్రకోపానలోజ్ఞాతో యతో భండో మహాబలః ।
తస్మాద్రౌద్రస్వభావో పా దానవశ్చాభవత్తతః ॥
అథాగచ్ఛన్మహాతేజాః శుక్ర దైత్యపురోహితః ।
సమాయాశ్చ శతశో దైతేయాః సుమహాబలాః ॥
అథాహూయ మయం భండో దైత్యవంశ్యాదిశిల్పినమ్ ।
నియుక్తో భృగుపుత్రేణ నిజసౌదార్థవద్వచః ॥
యత్ర స్థిత్వా తు దైత్యేంద్రిసైలోక్యం శాసితం పురా ।
తగ్గత్వా శోణితపురం కురుష్వ త్వం యథాపురమ్ ॥
తచుత్వా వచనం శిల్పీ స గత్వాథ పురం మహతీ ।
చక్రే మరపురప్రఖ్యం మనసైవేక్షణేన తు ॥
అథాభిషిక్తః శుక్రేణ దైతేటైశ్చ మహాబలైః ।
శశుభే పరయా లక్ష్యా తేజసా చ సమన్వితః ॥
హిరణ్యాయ తు యద్దత్తం కిరీటం బ్రహ్మణా పురా ।
సజీవమవినాశ్యం చ దైత్యేందైరపి భూషితమ్ ॥
దదౌ భృగుసుతోత్సృష్టం భండో బాలార్కసన్నిభమ్ ॥
చామరే చంద్రసంకాశ సజీవే బ్రహ్మనిర్మితే ।
న రోగో న చ దుఃఖాని సందదౌ యన్నిషేవణాత్ ॥
తస్యాతపత్రం ప్రదదౌ బ్రహ్మజ్ఞవ పురా కృతమ్ ।
యస్య చ్ఛాయానిషజ్ఞాస్తు బాధ్యంతే నాస్త్రకోటిభిః ॥
ధనుశ్చ విజయం నామ శంఖం చ రిపుఘాతినమ్ ।
అన్యాన్యపి మహారాణి భూషణాని ప్రదత్తవాసి ॥
తస్య సింహాసనం ప్రాదాదక్షయ్యం సూర్యసన్నిభమ్ ।
తతః సింహాసనాసీనః సర్వాభరణభూషితః ॥
బభూవాతీతతేజస్వీ రత్నముత్తేజితం యథా ॥
బభూవురథ దైతేయాస్తయా(స్యా)ష్టౌ తు మహాబలాః ।
ఇంద్రశత్రురమిత్రఘ్నా విద్యున్మాలీ విభీషణః ॥
సుమోహినీ కుముదినీ చిత్రాంగీ సుందరీ తథా ।
చతసో వనీతాస్తస్య బభూవుః ప్రియదర్శనాః ॥
తమసేవంత కాలజ్ఞా దేవాః సర్వే సహసవా ।
స్యందనాస్తురగా నాగాః పాదాతాశ్చ సహస్రశః ॥
సంబభూవర్మహాకాయా మహాంతో జితకాశినః ।
బభూవర్గానవాః సర్వే భృగుపుత్రమతానుగాః ॥
అర్చయంతో మహాదేవమాస్థితాః శివశాసనే ।
బభూవుర్గానవాస్తత్ర పుత్రపౌత్రధనాన్వితాః
గృహే గృహే చ యజ్ఞాశ్చ సంబభూవుః సమంతతః ॥
బుచో యజూంషి సామాని మీమాంసా న్యాయకాదయః ।
ప్రవర్తంతే స్మ దైత్యానాం భూయః ప్రతిగృహం తదా ॥
యథాశ్రమేషు ముఖ్యేషు మునీనాం చ ద్విజన్మనామ్ ।
తథా యజ్ఞేషు దైత్యానాం బుభుజుర్హష్యభోజినః ॥
ఏవం కృతవతోఽప్యస్య భందస్య జితకాశినః ।
షష్టివర్షసహస్రాణి వ్యతీని క్షణార్ధవ ॥
వర్ధమానమథో దైత్యం తపసా చ జలేన చ ।
హీయమానబలం చేంద్రం సంప్రేక్ష్య కమలాపతిః ॥
ససర్జ సహసా కాంచీన్మాయాం లోకవిమోహినీమ్ ।
తాముహచ తతో మాయాం దేవదేవో జనార్దనః ॥
త్వం హి సర్వాణి భూతానీ మోహయంతీ నీజాజసా ।
విచరస్వ యథాకామం త్వాం న జ్ఞాస్యలి కశ్చన ॥
త్వం తు శీఘమీతో గత్వా భండం దైతేయనాయకమ్ ।
మోహయిత్వోచ్రేడైవ విషయానుపభోక్ష్యసే ॥
ఏవం లబ్ద్వా వరం మాయా తం ప్రణమ్య జనార్దనమ్ ।
యయాచేఽప్సరసోముఖ్యాక సహాయార్ధం తు కాశ్చన ॥
తయా సంప్రార్థితో భూయః ప్రెషయామాస కాశ్చన్న ।
తాభిర్విశ్వాచీముఖ్యాః సవితా సా మృగేక్షణా ॥
ప్రయణా మానసస్యాగ్ర్యం తటముజ్జ్వలభూరుహమ్ ॥
యత్ర క్రీడతి దైత్యేంద్రో నీజనారీభిరన్వితః ।
తత్ర సా మృగశావాక్షీ మూలే చంపకశాఖినః ॥
నివాసమకరోద్రవ్యం గాయంతీ మధురస్వరమ్ ॥
అథాగతస్తు దైత్యేంద్రో ఐలిభిర్మంత్రిభిర్వృతః ।
శ్రుత్వా తు వీణానీనదం దదర్శ చ వరాంగనామ్ ॥
తాం దృష్ట్వా చారుసర్వాంగీం విద్యుల్లేఖామివాపరామ్ మాయామయే మహాగర్తె పతితో మదనాభిధీ ॥
అథాస్య మంత్రిగోఽభూవన్ హృదయే స్మరతాపితాః ॥
తేన దైత్యనాథేన చిరం సంప్రార్థితా సతీ ।
త్రైశ్చ సంప్రార్థిరాస్తాశ్చ ప్రతిశుశ్రువురంజసా ॥
యాస్వలభ్య మహాయజ్ఞరశ్వమేధాదికైరపి ।
తా లబ్ధ్వా మోహినీముఖ్యై నిర్భతిం పరమాం యయుః
విసస్మరుస్తదా వేదాంస్తథా దేవముమాపతిమ్ ।
విజహుస్తే తథా యజ్ఞక్రియాశ్చాస్యాః శుభావహా ॥
అవమానహతశ్చాసీతేషామపి పురోహితః ।
ముహూర్తమివ తేషాం తు యయావజ్జాయుతం తదా ॥
మోహితేష్వథ దైత్యేషు సర్వే దేవాః సవాసవాః ।
విముక్తోపద్రవా బ్రహ్మన్నామోదం పరమం యయుః ॥
కదాచిదథ దేవేంద్రం వీక్ష్య సింహాసనే స్థితమ్ ।
సర్వదేవైః పరివృతం నారదో మునిరాయయౌ ॥
ప్రణమ్య మునిశార్దూలం జ్వలంతమివ పావకమ్ ।
కృతాంజలిపుటే భూత్వా దేవేశో వాక్యమబ్రవీత్ ॥
భగవన్ సర్వధర్మజ్ఞ పరాపరవిదాం వర।
తత్రైవ గమనం తే స్యాద్యం ధన్యం కర్తుమిచ్ఛసి॥
భవిష్యచ్ఛోభనాకారం తవాగమనకారణమ్।
త్వద్వాక్యామృతమాకర్ణ్య శ్రవణానందనిర్భరమ్॥
అశేషదుఃఖాన్యుత్తీర్య కృతార్థః స్యాం మునీశ్వర॥
రుద్రుని కోపాగ్నివల్ల బుట్టినందున భండుడు మహా బలుడు రౌద్ర స్వభావుడునైన దానవుడయ్యెను. తరువాత మహా తేజస్వియై దైత్య పురోహితుడైన శుక్రుడు వచ్చెను. మహా బలులైన నూర్ల కొలది దైతేయులును నచటికి వచ్చి చేరిరి.-2. తరువాత శుక్రునిచే నీయోగింపబడి భండుడు దైత్య వంశ్యుడై యాది శిల్పియైన మయుని బీలిచి విలువైన మాటను జెప్పెను-3. ఓమయ శీల్పి! పూర్వము దైత్యేంద్రులుండి ముల్లోకములు శాసించిన శోణిత పురమును అమరపురముగా జేయుమనెను-4. అది విని మయ శిల్పియు నా గొప్ప శోణీత పురమునకు వెళ్లి మానస వీక్షణముతో క్షణ కాలములో దానిని అమరపురముతో సమానమైన దానిగా జేసెను-5. తరువాత, శుక్రునిచేతను మహాబలులైన దైతేయులచేతను ఇంద్రుడుగా నభిషేకింపబడి ఉత్తమ లక్ష్మితోను లేజస్సుతోను గూడినవాడై ప్రకాశించెను.-6. పూర్వము బ్రహ్మచే హిరణ్యునకు (హిరణ్యకశిపునకు) ఈయబడినదియు, దైత్యేంద్రులచే నలంకరింపబడినదియు, సజీవమై యవినాశ్యమై బాల సూర్యునివలె ప్రకాశించు కిరీటమును శుక్రాచార్యుడీయగా బండాసురుడు ధరించెను-7. బ్రహ్మ నిర్మితములై చంద్ర ప్రకాశముగల చామరములను ధరించెను. వాటిని సేవించినచో రోగములు దుఃఖములును గలుగవు-8. పూర్వము బ్రహ్మచేతనే నిర్మింపబడిన గొడుగును గూడ శుక్రుడిచ్చెను. దానీ నీడలో గూర్చున్నవాడు అస్త్రకోటులతో గూడ బాధింపబడడు-9. విజయమను ధనువును, శత్రు సంహారియైన శంఖమును ఇంకను ఆయా మహారములైన భూషణములను ఇచ్చేను-10. ఆతనికి సూర్యునితో సమానమై యక్షయమైన సింహాసనమునిచ్చెను. తరువాత రత్న మూర్ఖ తేజస్సును వెదజల్లినట్లు ఆ సింహాసనమున గూర్చున్న వాడై భండాసురుడు సర్వాభరణములతో భూషితుడై మిక్కిలి తేజస్వీయయ్యెను-11. ఆ తరువాత భండాసురునకు - ఇంద్ర శత్రువు అమిత్రఘ్నుడు, విద్యున్మాలి, విభీషణుడు, ఉగ్ర కర్ముడు ఉగ్ర ధన్వుడు, వీజయుడు, శ్రుతిపారగుడు - అను ఎనమండ్రు పుత్రులు ఉండిరి.-12. సుమోహినీ, కుముదినీ, చిత్రాంగీ, సుందరీ అను నలుగురు వనితలుండిరి. వారు చూచుటకు ప్రియమైన వారు-13. కాలజ్ఞులైన సమస్త దేవతలు, ఇంద్రుడును - ఆ భండాసురుని సేవించిరి. అట్లే వేలకొలదీ రథములు, గుఱ్ఱములును, ఏనుగులును, కాల్బలమున్ను అతని సేవించిరి-14. శుక్రాచార్యమతముననుసరించి నడచుకొనువారై సమస్త దానవులు మహాకాయులు, గొప్పవారు జయముతో దీపించువారునై కలిసియుండిరి-15. మహాదేవుడైన శివుని బూజీంచుచు శీన శాసనములో నుండిరి. అచట దానవులు పుత్ర పౌత్ర ధనములతో గూడినవారైరి. ఇంటింట నంతటను యజ్ఞములు జరిగెను.-16. ఋక్కులు, యజుస్సులు, సామములు, మీమాంసాన్యాయాదులు దైత్యుల ప్రతిగృహముననపుడు ప్రవర్తిల్లుచుండెను.-17. మునుల యొక్కయు ద్వీజులయొక్కయు యజ్ఞములందు హవ్యభోజులు భుజించినట్లే దైత్యుల యజ్ఞములలోను హవిర్బోక్తలు హవిస్సులను. భుజించిరీ-18. ఈ విధముగా జేయుచు మత్తుడై ప్రకాశించు భండాసురునకు అణువదివేల యేండ్లు అర క్షణమువలె గడచిపోయేను-19. తపస్సు చేతను బలముచేతను బండాసురుని బలము వృద్ధి చెందుచుండెను. ఇంద్రుని బలము అంతకంతకు క్షీణించు చుండెను. అది చూచి కమలాపతి (విష్ణువు)-20. వెంటనే ఒక లోకవీమోహినియైన మాయను సృజించెను. ఆమెతో దేవ దేవుడైన జనార్ధనుడిట్లనెను.-21. నీవు నీ తేజముతో సర్వ ప్రాణులను మోహింపజేయుచు స్వేచ్చగా దీరుగుము. నిన్నెవ్వడును గుర్తించడు (తెలియడు)-22. నీవిట నుండి తొందరగా రాక్షస నాయకుడైన భండాసురుని కడకుబొమ్ము తొందరలోనే యాతనిని మోహింపజేసి విషయ సుఖములనను భవింపుము-23. ఈ విధముగా విష్ణువు నుండి మాయ వరమును బొంది యాతనికి నమస్కరించి తన సహాయముగా ముఖ్యమైన యప్సరసలనడిగెను-24. అట్లామెతో కోరబడిన హరి కొంత మంది యప్సరసలను బంపెను. ‘విశ్వాచి’ మొదలగునప్సరసలతో గూడినదై యా “మాయాదేవి మానస సరోవరము యొక్క శ్రేష్టమై యుజ్వల వృక్షములుగల తీరమును జేరెను-25. అచటనే భండాసురుడును తన స్త్రీలతో గూడి విహరించుచుండెను. ఇచట, లేడిపిల్ల కన్నులవంటి కన్నులుగల మాయాదేవి చంపక వృక్షము యొక్క మూలమున మధురస్వరముతో గానము చేయుచు రమ్యమైన నివాసమేర్పరచుకొనెను-26. అంత భండాసురుడు తన బలిషులైన మంత్రులావరీంచిరాగా నచటకి వచ్చెను. ఆమె వీణా గానమునువిని, శ్రేష్టమై మనోహరమైనయామెను జూచెను-27. సుందరమైన సర్వాంగములుగలది. రెండవ మెరుపు తీగవలె మెరయుచున్నది. ఆమెను జూచి మన్మథమను మాయామయ మహాగర్తమున బడిపోయేసు-28. ఆతని మంత్రులు గూడ ఎదలో మదన పీడితులైరి-29. ఆ రాక్షస రాజుచేత చాలాకాలము ప్రార్థింపబడిన మాయాదేవియు, మంత్రులచే ప్రార్థింపబడిన విశ్వాచీ మొదలగు అప్సరసలును వెంటనే యంగీకరించిరి-30. వారు అశ్వమేధాది మహాయజ్ఞములచేత గూడ బొందనలవిగానివారు. అట్టి మోహినీ మొదలగు వారిని బొంది పరమానందమునందిరి. వేదములను మరచిరి. అట్లే యుమాపతియైన శివుని గూడ మరచిరి-32. ఇతరములైన శుభావహములైన యజ్ఞములను గూడవదిలిరీ, వారి పురోహితుడైన శుక్రాచార్యుడును అవమాన హతుడాయెను. వారికి పదివేల సంవత్సరములు ఒక ముహూర్త (క్షణ) కాలమయ్యెను.-33. రాక్షసులు మోహితులుగాగానే ఓ బ్రాహ్మాత్మా నారదా ఇంద్రునితో బాటు దేవతలందరు పీడల నుండి విముక్తులై పరమానందమునందిరి-34. ఆ తరువాత నొకప్పుడు సమస్తదేవతలతో పరివృతుడై సింహాసనముననున్న ఇంద్రుని దగ్గరకు నారదమహాముని వచ్చెను-35. మండుచున్న యగ్నివలె ప్రకాశించుచున్న మునిశ్రేషునికి సమస్కరించి చేతులు జోడించి యింద్రుడిట్లనెను-36. భగవన్ సర్వధర్మముల దెలిసినవాడా! పరాపరవేత్తలతో శ్రేష్ఠుడా! నారదా! నీవు, ధన్యుని జేయదలచినవాని కడకే వెళ్ళేదవు-37. ఓ మునీశ్వరా! నీవు మాకు భవిష్యత్తులో శుభములగూర్చుటకే వచ్చితివీ.. నీయమృతము వంటి మాటల వీని శ్రవణానందముచే నిండి, సమస్త దుఃఖముల గడచి కృతార్థుడ నయితిని-38.
నారద ఉవాచ:-
అథ సంమోహితో భంఢో దైత్యేంద్రో విష్ణుమాయయా।
తయా విముక్తో లోకాంస్త్రీన్ దహేతాగ్నిరివాపరః॥
అధికస్తవ తేజోభిరస్రైరాయాబలేన చ।
తస్య తేజోషహారస్తు కర్తవ్యోతిబలస్య తు॥
వినారాధనతో దేవ్యాః పరాశక్తేస్తు వాసన।
అశక్యోన్యేన తపసా కల్పకోటిశతైరపి॥
పరైవోదయతః శ్రతోరారాథయత బాలిశాః।
ఆరాధితా భగవతీ సా వః శ్రేయో విధాస్యతి॥
ఏవం సంబోధితస్తేన శక్రో దేవగణేశ్వరః।
తం మునిం పూజయామాస సర్వదేవైః సమన్వితః
తపసే కృతసన్నాహాయయా హైమవతం తటమ్॥
తత్ర భాగీరధీతేరే సర్వర్తుకుసుమోజులే।
పరాశక్తేర్మహాపూజాం చక్రేలిఖిలసురైః సమమ్॥
ఇంద్రప్రస్థమభూన్నామ్నా తదాద్యభిలసిద్ధిదమ్॥
బ్రహ్మాత్మజోపదిష్టన కుర్వతాం విధినా పరామ్।
దేవ్యాస్తు మహతీం పూజాం జపధ్యానరతాత్మనామ్॥
ఉగ్రే తపసి సంస్థానామనస్యార్పితచేతసామ్।
దశవర్షసహస్రాణి దశాహాని చ సంయయుః॥
మోహితానథ తాన్ దృష్ట్వా భృగుపుత్రో మహామతిః।
భండాసురం సమభ్యేత్య నిజగాద పురోహితః॥
త్వామేవాశ్రీత్య రాజేంద్ర సదో దానవసత్తమాః।
నిర్భయాఫ్రిషు లోకేషు చరంతీచ్ఛావిహారిణః॥
జాతిమాత్రం హి భవతో హంతి సర్వాన్ సదా హరిః।
తేనైవ నిర్మితా మాయా యయా సంమోహితో భవాన్॥
భవంతం మోహితం దృష్ట్వా రంధ్రాన్వేషణతత్పరః ।
భవతాం విజయార్ధాయ కరోతీంద్రో మహత్తపః॥
యది తుషా జగద్ధాత్రీ తస్యైవ విజయో భవేత్ ।
ఇమాం మాయామయీం త్యక్త్వా మంత్రిభిః సహితో భవాన్।
గత్వా హైమవతః శైలం పరేషాం విఘ్నమాచర॥
ఏవముక్తస్తు గురుణా హిత్వా పర్యంకముత్తమమ్।
మంత్రివృద్ధానుపాహూయ యథావృత్తాంతమాహా స॥
తచ్ఛృత్వా నృపతిం ప్రాహ శ్రుతవర్మా విమృశ్య చ ।
షష్టివర్ష సహస్రాణాం రాజ్యం తవ శివార్పితమ్ ॥
తస్మాదప్యధికం వీర గతమాసీదనేకశః।
అశక్యప్రతికార్యాల్షియం యః కాలః శివచోదితః॥
అశక్యప్రతికార్యోయం తదభ్యర్చనతో విసో।
కాలే తు భోగః కర్తవ్యో దుఃఖస్య చ సుఖస్య వా॥
అథాహ భీమకర్మాభ్యో నో పేక్ష్యోరిర్యథాబలమ్ ।
క్రియావిఘ్నే కృతేఇస్మాభిర్విజయస్తే భవిష్యతి ॥
తవ యుద్ధే మహారాజు పరార్థం జలహారిణీ।
దత్తా విద్యా శివేనైవ తస్మాత్తే విజయః సదా॥
అనుమేనే చ తద్వాక్యం భండో దానవనాయకః।
నిర్గశ్య సహసేనాభీర్యమౌ హైమతం తటమ్ ॥
తపోవిఘ్నకరాన్ దృష్ట్వా దానవాఞ్జగదంబికా।
అలంఘ్యమకరోదగ్రే మహాప్రాకారముజ్జ్వలమ్ ॥
తం దృష్ట్వా దానవేంద్రోపి కిమేతదితి విస్మితః। సంక్రుదో దానవాగ్రేణ బంజాతీబలేన తు॥
పునరేవ తదగ్రేఖ భూదలంఘ్యః సర్వదానవైః।
వాయవ్యాస్తేణ తం ధీరో బభంజ చ ననాద చ ॥
పౌనఃపున్యేన తద్భస్మ ప్రాభూతునరుపస్థితమ్।
ఏతద్దృష్ట్వా తు దైత్యేంద్రో విషజ్ఞః స్వపురం యయౌ॥
తాం చ దృష్ట్వా జగద్ధాత్రీం దృష్ట్వా ప్రాకారముజ్వలమ్ ।
భయాద్వివ్యధిరే దేవా విముక్తసకలక్రీయాః॥
తానువాచ తతః శక్రో దైత్యేంద్రో యమహాగతః।
అశక్యం సమరే యోద్దుమస్మాభిరభిలైరషి॥
పలాయితానామపి నో గతిరన్యా న కుత్రచిత్।
కుండం యోజనవిస్తారం సమ్యకృత్వా తు శోభనమ్ ॥
మహాయాగవిధానేన ప్రణిధాయ హుతాశనమ్।
యజామః పరమాం శక్తిం మహామా సైర్వయం సురాః॥
బ్రహ్మభూతా భవిష్యామో భోక్ష్యామో వా త్రివిష్టపమ్ ।
ఏవముక్తాస్తు తే సర్వే దేవాః సేంద్రపురోగమాః
విధివజ్జుహువుర్మాంసాన్యుత్కృత్యోత్కృత్య మంత్రతః।
హుతేషు సర్వమంగేషు పాదేషు చ కరేషు చ॥
హోతుమిచ్ఛత్సు దేవేషు కలేవరమశేషతః।
ప్రాదుర్బభూవ పరమం తేజఃపుంజో హ్యనుత్తమః ॥
తన్మధ్యతః సముదభూచ్చక్రారమనుత్తమమ్।
తన్మధ్యే తు మహాదేవీముదయారసమప్రభమ్ ॥
జగదుజ్జీవనకరీం బ్రహ్మవిష్ణుశివాత్మికామ్।
సౌందర్యసారసీమాం తామానందరససాగరామ్॥
జపాకుసుమసంకాశం దాడిమీకుసుమాంబరామ్।
సర్వాభరణసంయుక్తాం శృంగారైకరసాలయామ్॥ కృషాతరంగితాపాంగనయనాలోకకౌముదీమ్ ।
పాశాంకుశేక్షుకోదండపంచబాణలసత్కరామ్ ॥
తాం విలోక్య మహాదేవీం దేవాః సర్వే సహసవాః।
ప్రణేముర్ముదితాత్మానో భూయోభూయోభిలాత్మికామ్ ॥
తయా విలోకితాః సద్యస్తే సర్వే విగతజ్వరాః।
సంపూర్ణాంగా దృఢతరా వజ్రదేహా మహాబలాః॥
తుష్టువుశ్చమహాదేవీమంబీకామభిలార్థదామ్॥
ఇతి శ్రీబ్రహ్మాండమహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాస్త్యసంవాదే లలితోపాఖ్యానే లలితాప్రాదుర్ఖావో నామ ద్వాదశోధ్యాయః॥
నారదుడనెను : ఆ తరువాత విష్ణుమాయచేత భండాసురుడు సంమోహితుడయ్యెను. విష్ణుమాయావిముక్తుడైనచో మరొకయగ్నివలె లోకములనన్నింటిని దహించెడివాడు-39. నీ యొక్క తేజస్సులచేతను, అస్తములచేతను, మాయాబలముచేతను అతి బలుడైన భండారుని తేజోపహారమును మీక్కిలి చేయవలె-40. ఓ ఇంద్రా దేవియైన పరాశక్తి యారాధన దప్ప ఇతరమైన కల్పకోటి శతముల తపస్సుతో గూడ సాధ్యముగాదు -41. ఓ బాలిశులారా (పిల్లల వలెనజ్ఞానులైన దేవతలారా! శత్రువు యొక్క యుదయమునకంటే (అభివృద్ధికంటే) ముందే ఆ పరాశక్తి నారాధింపుడు. మీచే నారాధింపబడిన యా భగవతి మీకు శ్రేయమును గూర్చును-42. ఈ విధముగా నారదుడు బోధింపగా దేవగణేశ్వరుడైన యింద్రుడు సర్వదేవసమన్వితుడై యామునిని పూజించెను. తపస్సునకై సన్నాహము జేసికొని హిమవత్పర్వతతటమునకు వెళ్లాను-43. అట, సమస్తఋతువులబూయు పూవులతో గొప్పగా ప్రకాశించు భాగీరథీ తీరమున నఖీలదేవతలతో గూడి పరాశక్తి పూజనాచరించెను. అదియిప్పుడఖిల సీద్దుల నిచ్చునదై యింద్ర ప్రస్థమను పేరబరగిను-44. బ్రహ్మమానస పుత్రుడైన నారదుడు చెప్పిన విధముగా దేవియొక్క మహాపూజను జేసిరి అట్లు దేవీమహాపూజ జేయునట్టియు, జపధ్యానరతాత్ములైనట్టియు, ఉగ్రమైన తపముననుండి, దేవితో ననన్యముగా (అభేదము) చిత్తము నర్పించినట్టి దేవతలకు పదివేలయేండ్లు పది దినములు గడచినవి-46. ఇక మాయామోహినీమోహితులైన రాక్షసులను జూచి, మహామతియై రాక్షస పురోహిత గురువైన శుక్రుడు భండాసురుని కడకు వచ్చి యిట్లనెను-47. ఓ భండాసుర రాజేంద్ర! యీ దానవ విద్వఛ్ఛేష్ణులందరును నిన్నాశ్రయించియే నిర్భయులై ముల్లోకములదు స్వేచ్ఛావిహారులై తిరుగుచ్నూరు-48. హరి యెల్లప్పుడు మీ జాతినీ మీయందరిని జంపును. అతని చేతనే యీ మాయ నిర్మింబడినది, దానితో నీవు మోహితుడవు గూడనైతివి-49. నీవు మోహితుడవైనట్లు చూచి నీలోని లోపములనే వెదుకుటయందు మిక్కిలియాసక్తి గల యింద్రుడు మిమ్ముల జయించుటకై మహాతపము జేయుచున్నాడు-50. కావున ఈ మాయామయిని వీడి మంత్రులతోబాటు హిమవత్పర్వతమునకు బోయి నీ శత్రువులకు (ఇంద్రాదులతపములకు) విఘ్నము చేయుము-51. ఈ విధముగా గురువైన శుక్రుడు జెప్పగా, భండాసురుడు మాయాశయ్యను వీడి మంత్రివృద్ధులను పిలిచి శుక్రుడు చెప్పినదంతయు తెలిపెను-52. అది విని శ్రుతవర్మ పరిస్థితిని విమర్శించి భండునితో - రా నీకు శివుడిచ్చినది అరువది వేల యేండ్ల రాజ్యము-23. ఓ వీరుడా! అంతకంటే నెక్కువనే గడచినది. శివుడు చెప్పిన కాలమునకు వ్యతిరేకముగా జేయుట అశక్యము-54. శివుని నర్చింపక యాతడు నియమించిన కాలముదాటుట అశక్యము. కాలముననుసరించి సుఖమునుగాని దుఃఖమునుగాని యనుభవింపవలెను అనేను-55. ఆ తరువాత భీమకర్ముడనువాడు బలముననుసరించి, శత్రువుపేక్షింపదగినవాడుగాడు. శత్రుతపఃక్రియాదులకు విఘ్నము జేసినచో ఓ భండాసురేంద్రా! నీకే విజయము కలుగును-56. నీ యుద్ధమున శత్రుబలమును హరించు విద్య శివునిచే నీకీయబడినది. కావున నెల్లప్పుడును నీకేవిజయము గలుగును-57.: అని అనెను, దానవపతి భండాసురుడును ఆతని మాటకు సమ్మతించెను, సేనలతో సహ వెళ్ళి హిమవత్పర్వతతట మునకు వెళ్లెను-58. తపోవిఘ్నము. జేయు రాక్షసులను జూచి జగదంబిక యెదుట దాటనలవిగానీ ఉజ్వలమైన గొప్పప్రాకారమును సృష్టించెను-59. దానిని జూచి భండాసురుడు గూడ ఇది యేమీ అని యాశ్చర్యముజేందీ మిక్కిలి కోపించి బలముతో దానవాగ్రముతో ఆ ప్రాకారమును భగ్నముజేసెను-60. మరలనాప్రాకారమట్లే రాక్షసులదుట దాటనలవిగానిదిగా నిలిచెను. ఆధీరుడు. భండాసురుడు వాయువ్యాస్తముతో భగ్నముజేసి గర్జించెను.-61 మాటిమాటికి ఆ ప్రాకారము భగ్నమగుచునే యథాప్రకారముగా నిలుచుచుండెను. ఇది చూచి భండాసురుడు దుఃఖితుడై స్వపురమునకు వెళ్ళెను-62. జగమును ధరించు నామెను, ఉజ్జల ప్రాకారమును జూచి దేవతలు భయముతో అన్ని క్రియలు మాని బాధజేందిరి-63. అంత, ఇంద్రుడు దేవతలతో ఇదిగో భండాసరుడిక్కడికి వచ్చెను. ఆతనితో యుద్దము జేయుట మనందరికిని సాధ్యముగాదు”-అనెను-64. పరుగెత్తిపోయినను మనకు ఎక్కడను గతిలేదు. యోజన విస్తారముగల శోభనమైన కుండము చక్కగా నిర్మించి యజ్ఞముజేసి పరాశక్తిని బూజించెదము-65. మహాయాగ విధానముతో అగ్నిహోత్రుని స్థాపించి ఓ దేవతలారా! మనము మహామాంసముతో (మన వ్యక్తి మాంసముతో) హోమముజేసి పరాశక్తిని బూజింతము దాన బ్రహ్మత్వమును బొందిన వారమైనను అగుదుము. లేదా స్వర్గముననుభవింతుము. : ఇట్లనగనే ఇంద్రుని ముందడుకొనీ దేవతలందరు-67. విధిప్రకారముగా శరీరములను వారి మాంసములను లాగిలాగి మంత్రపూర్వకముగా హోమము జేయసాగిరి. ఆ విధముగా సర్వమాంసములును, పాదములును చేతులును పరాశక్తికై హోమముజేసిరి-68. ఇక దేవతలు తమ మొత్తము శరీరములను హోమము చేయదలంచినంతనే ఒక యనుత్తమమైన (అంతకన్న యుత్తమము జగమున లేనట్టి) పరమతేజఃపుంజము ప్రాదుర్భవించెను. (ఆవిర్భవించెను)-69. దాని మధ్యన నొక చక్రాకారము ఆవిర్భవించాను. దాని మధ్యమున మహాదేవిని జూచిరి. ఆమె ఉదయ సూర్యకాంతి వంటి కాంతి గలిగినది-70, జగదుజ్జీవనకరీ, బ్రహ్మ విష్ణు శివాత్మిక, సౌందర్యసార సీమాంత, ఆనందరస సాగర-71 జపాకుసుమ (పారిజాతపుష్ప) వర్ణముగలది. దానిమ్మ పూవురంగుగల వస్త్రము (చీర) ధరించినదీ, సర్వాభరణములతో గూడినది, శృంగారరసమునకు ఒకే ఒక నీలయమైనదీ-72. ఆమె క్రీగన్నులు కృపాతరంగితములు. ఆమె చూపులతో వెన్నెలలు విరియును. పాశము-అంకుశము-చెఱకువిల్లు-పంచబాణములు-ఇవియొప్పిన నాలుగు చేతులుగలది-73, అభిలాత్మికయైన ఆ మహాదేవినీ జూచి ఇంద్రునితో బాటు దేవతలందరును సంతుష్టాంతరంగులై నమస్కరించిరి-74. ఆమె వారిని చూచేను వెంటనే ఆ దేవతలందరు విగతజ్వరులైరి. సంపూర్ణాంగులైరి. మిక్కిలిదృఢులైరి. వజ్రదేహులైరి. మహాబలులైరి. ఆ దేవతలు అఖిలార్థముల నిచ్చునంబికయైన యామహాదేవిని స్తుతించిరి.
ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున లలితోపాఖ్యానమున లలితాప్రాదుర్భావమను పండ్రెండవయధ్యాము.
Summary of chapter 124 of the Brahmānda Mahā Purana is as follows:
This deeply esoteric chapter unveils the innermost sanctuary of Śrīnagara, culminating in the transcendent Chintāmaṇi palace crafted from wish-fulfilling gems. It portrays the radiant throne room where goddess Lalitā sits upon the lap of lord Kāmeshvara, surrounded by loving attendant deities and eternal nectar oceans. The pious reader is drawn into deep meditation, experiencing the supreme peace and unutterable bliss that permeates this divine sanctuary.