బ్రహ్మాండ మహా పురాణము
24 - పరశురాముని తపస్సు, అస్త్రప్రాప్తి
వసిష్ఠ ఉవాచ :-
ఇత్యుక్తస్తేన భూపాల రామో మతిమతాం వరః।
నిరూప్య మనసా భూయస్తమువాచాభివిస్మితమ్ ॥
రామ ఉవాచ:-
కస్త్వం బ్రూహి మహాభాగ న వై ప్రాకృతపూరుషః।
ఇంద్రస్యేవానుభావేన వపురాలక్ష్యతే తవ ॥
విచిత్రార్థపదౌదార్యగుణగాంభీర్యజాతిభిః ।
సర్వజ్ఞస్యైవ తే వాణీ శ్రూయతేఽతిమనోహరా ॥
ఇంద్రో వహ్నిర్యమో ధాతా వరుణో వ ధనాధిపః ।
ఈశానస్తపనో బ్రహ్మా వాయుః సోమో గురుర్గుహః ॥
ఏషామన్యతమః ప్రాయో భవాన్భవితుమర్హతి ।
అనుభావేన జాతిస్తే హృది శంకా తనోతి మే ॥
మాయావీ భగవాన్ విష్ణుః శ్రూయతే పురుషోత్తమః ।
కోవా త్వం వపుషానేన బ్రూహి మాం సముపాగతః ॥
అథవా జగతాం నాథః సర్వజ్ఞః పరమేశ్వరః ।
పరమాత్మాత్మసంభూతీ రాత్మారామః సనాతనః ॥
స్వచ్ఛందచారీ భగవాన్ శివః సర్వజగన్మయః ।
వపుషానేన సంయుక్తో భవాన్ భవితుమర్హతి ॥
నాన్య స్యేదృగ్భవేల్లోకే ప్రభావానుగతం వపుః ।
జాత్యర్థసౌష్టవోపేతా వాణీ చౌదర్యశాలినీ ॥
మన్యేఽహం భక్తవత్సల్యాద్వానేన వపుషా హరః ।
ప్రత్యక్షతాముపగతో సందేహోఽస్మత్పరీక్షయా ॥
న కేవలం భవాన్ వ్యాధస్తేషాం నేదృగ్విధాకృతిః ।
తస్మాత్తుభ్యం నమస్తస్మై సురూపం సంప్రదర్శయ ॥
ఆవిష్కుర్వ న్ప్రసీదాత్మమహిమానుగుణం వపుః ।
మమానేకవిధా శంకా ముచ్యతే యేన మానసీ ॥
ప్రసీద సర్వభావేన బుద్ధిమోహౌ మమాధునా ।
ప్రణాశయ స్వరూపస్య గ్రహణాదేవ కేవలమ్ ॥
ప్రార్థయే త్వాం మహాభాగ ప్రణమ్య శిరసా సకృత్ ।
కస్త్వం మే దర్శయాత్మానం బద్దోఽయం తే మయాంజలిః ॥
వసిష్ఠుఁడు చెప్పెను.
ఓ భూపాల ! ఈ విధముగా వ్యాధునిచే చెప్పఁబడి, మతిమంతులలో శ్రేష్ఠుఁడయిన రాముఁడు, మనస్సుచే నాలోచించి, విమర్శించి, ఆశ్చర్య భరితుఁడై మరల నాతనితో పలికెను.
రాముఁడు పలికెను :
'ఓ మహాభాగ! నీవెవ్వరవో చెప్పఁగోరెదను, నీవు నీజముగా ప్రాకృత పురుషుఁడవు కావు. నీ శరీరమో ఇంద్రుని యొక్క సౌందర్యాను భావముచే సులక్షితమగుచున్నది. నీ సంభాషణము, విచిత్రార్థ పదోధార్య గాంభీర్యాది గుణములచే సర్వజ్ఞుని మనోహర వాణివలె శ్రుతమగుచున్నది. ఆ నీ వాణి విచిత్రార్థయుతపదములతో, ఔదార్యముతో సుస్పష్టతతో, గాంభీర్యముతో మనోజ్ఞము. నీవు ఇంద్రుడవో, అగ్నిహోత్రుఁడవో, యముఁ డవో, బ్రహ్మవో, వరుణుఁడవో, కుబేరుడవో, ఈశానుఁడవో, సూర్యుఁడవో, దాతవో, వాయువవో, చంద్రుడవో, గురుఁడవో, కుమార స్వామివో కాక వేడొకఁడవో అయి యుండుటకు అరుండవు. కాని నీజాతి నాకు హృదయమున శంక గల్లించుచున్నది. నీ అనుభవమో మహోన్నతము. పురుషోత్తముఁడయిన విష్ణువు భగవంతుఁడు మాయావిగా విదితుఁడు. నీవెవ్వఁడవు? ఈ శరీరముతో నన్ను చేరితివి. చెప్పుము. (6) అటుకాక - నీవు జగన్నాథుఁడవు, సర్వజ్ఞుఁడవు, పరమేశ్వరుఁడవు, పరమాత్ముఁడవు, ఆత్మ సంభూతుఁడవు, శాశ్వతుఁడవునయిన ఆత్మా రాముఁడవు, సనాతనుఁడవు. యథేచ్చగా సంచరించువాఁడవు, భగవాన్ శ్రీవుఁడవు, సర్వజగన్మయుఁడవు, అయి ఈ శరీరముతో సంయుక్తుఁడవై యుండుటకు అర్జుఁడవు, (8) అట్టి వానికి కాక, వేతోకని కెవ్వనీకి ఈ ప్రపంచములో ప్రభావాను గతమయిన ఈ దృగ్విధమయిన జన్మ కలుగదు. నీవాణీ సంపద జాత్యర్థ సౌష్టవోదార్యశాలిని. భక్తవాత్సల్యము వలననే హరుఁడిట్టి వపువుతో దోచెనని నేను భావింతును. నీవు ప్రత్యక్షముగా నన్ను పరీక్ష చేయుటకు వచ్చియుంటివి. సందేహము లేదు. నీవు కేవలము కిరాతుఁడవుగావు వ్యాధుఁడవు కావు. ఆ కిరాతులకిట్టీ విధమైన ఆకృతి యెక్కడిది? అందుచే నీకు నమస్కరించుచున్నాను. భవత్సురూపమును ప్రదర్శించుము. (॥) మహిమానుగుణమైన నీరూపము నావిష్కరీంచుము. ప్రసన్నుం డవు కమ్ము. తన్మూలమున మనస్సంబంధమయన యనేక శంకలు నిర్ముక్తములగును. ప్రసన్నుఁడవు కమ్ము, ఇప్పుడే నా బుద్దీమోహమును సర్వమును, నీ స్వరూప గ్రహణము చేతనే కేవలము సర్వనాశనము చేయుము. ఓ మహాభాగ ! అనేక మారులు శిరస్సువంచి ప్రణామ మాచరించి, నిన్ను ప్రార్ధించుచున్నాను. నీవ్వెఁడవు? నీన్ను వ్యక్తము చేయుము. ఇదిగో చేతులు జోడించి వినయముతో నిలబడితిని.
ఇత్యుక్త్వా తం మహాభాగ జ్ఞాతుమిచ్ఛన్ భృగూద్వహః ।
ఉపవేశ్య తతో భూమౌ ధ్యానమస్తే సమాహితః ॥
బద్ధపద్మాసనో మౌనీ యతవాక్కాయమానసః ।
నిరుద్ధప్రాణసంచారో దధ్యౌ చిరముదారధీః ॥
సంన్నియమ్యేంద్రియగ్రామం మనో హృది నిరుధ్య చ ।
చింతయామాస దేవేశం ధ్యానదృష్ట్యా జగద్గురుమ్ ॥
అపశ్యచ్చ జగన్నాథమాత్మసంధానచక్షుషా ।
స్వభక్తానుగ్రహకరం మృగవ్యాధస్వరూపిణమ్ ॥
తత ఉన్మీల్య నయనే శీఘ్రముత్థాయ భార్గవః ।
దదర్శ దేవం తేనైవ వపుషా పురతః స్థితమ్ ॥
ఆత్మనోఽనుగ్రహార్థాయ శరణ్యం భక్తవత్సలమ్ ।
ఆవిర్భూతం మహారాజ దృష్ట్వారామః ససంభ్రమమ్ ॥
రోమాంచోద్భిన్నసర్వాంగో హర్షాశ్రుప్లుతలోచనః ।
పపాత పాదయోర్భూమౌ భక్త్యా తస్య మహామతిః ॥
స గద్గదమువాచైనం సంభ్రమాకులయా గిరా ।
శరణం భవ శర్వేతి శంకరేత్యసకృన్నృప ॥
తతః స్వరూపధృక్ శంభుస్తద్భక్తిపరితోషితః ।
రామముత్థాపయామాస ప్రణామావనతం భువి ॥
ఉత్థాపితో జగద్ధాత్రా స్వహస్తాభ్యాం భృగూద్వహః ।
తుష్టావ దేవదేవేశం పురః స్థిత్వా కృతాంజలిః ॥
రామ ఉవాచ:-
నమస్తే దేవదేవాయ శంకరాయాదిమూర్తయే।
నమః శర్వాయ శాంతాయ శాశ్వతాయ నమోనమః ॥
నమస్తే నీలకంఠాయ నీలలోహితమూర్తయే ।
నమస్తే భూతనాథాయ భూతావాసాయ తే నమః ।
వ్యక్తావ్యక్తస్వరూపాయ మహాదేవాయ మీఢుషే ॥
శివాయ బహురూపాయ త్రినేత్రాయ నమోనమః ।
శరణం భవ మే శర్వ త్వద్భక్తస్య జగత్పతే ।
భూయోఽనన్యాశ్రయాణాం తు త్వమేవ హి పరాయణమ్ ॥
అని పలికి, భృగు వంశోద్వహుఁడయి రాముఁడు ఆతని గూర్చి తెలిసికొనఁగోరి అచ్చటనే నేలపై కూర్చుండి, సమాహిత మనస్కుడై ధ్యాన నిమగ్నుఁడాయెను. పద్మాసనము ప్రచుకొనీ, మునియై, వాక్కాయమానసములను నియమించుకోనీ, వాయు సంచారమును నిరోధించి (ప్రాణాయామము వహించి) అత్యధికమయిన మనఃకేంద్రీకరణముతో ధ్యానమున నిమగ్నుఁడయ్యెను. ఇంద్రియ సమూహమును ఆతఁడు నీయమీంచెను. మనస్సును హృదయమున నిరోధించెను. ధ్యాన దృష్టి వహించి, జగద్గురుఁడయిన దేవదేవేశుని ధ్యానము చేసెను. ఆ ధ్యానసమాధిలో రాముఁడు, ఆత్మయందు సంధించిన చక్షువుతో (అంతర్మక్కయి) తన భక్తుల యందు ననుగ్రహము చూపువానిని, మృగవ్యాధ రూపమున నున్న జగన్నాథుని చూచెను. అంత కన్నులు తెరచెను. భార్గవ రాముడు వెంటనే లేచెను. ఆ రూపము శరీరముతో నున్న దేవుని తన ముందున్నవానిని రాముఁడు చూచెను. తనను గ్రడహించుట కొఱకు భక్తవత్సలుడు, శరణ్యుఁడు, ఆవిర్భవించియున్న వానినీ సంభ్రమముతో రాముడు చూచెను. రోమాంచోదిన్న సర్వాంగుఁడయ్యెను. సంతోషాశ్రువులచే నిండిన నేత్రుఁడయ్యెను. అంత వెంటనే ఆ మహామతి రాముఁడు, భక్తితో, ఆ వ్యాధుని పాదముల యందు భూమి పైపడి నమస్కరించెను. డగుత్తికలో సంభ్రమాకులమయిన పల్ములతో, ఓ భవ శరణు, శర్వ! శరణు, శంకర! శరణు అని అనేకమార రాముఁడు స్తోత్రము చేసెను. అంత స్వరూపమును ధరించిన శంభువు, ఆతని భక్తికి సంతోషించినవాఁడై, భూమీపై. ప్రణామావనతుఁడైన రాముని లేవనెత్తాను. తన చేతులతో జగద్భర్తచే లేవనెత్తబడి భృగూద్వహుఁడు కృతాంజలియై అతని ముందు నిలంబడి దేవదేవుని స్తోత్రము చేసెను. దేవదేవుఁడయిన శంకరునకు నమస్కారము. ఆదిమూర్తివైన నీకు నమస్కారము. శర్వునకు, శాంతునకు, శాశ్వతుఁ డునయిన దేవునకు నమస్కారము. భూతనాథునకు, నీలకంఠునకు, నీలలోహితమూర్తికి శివునకు, బహురూపునకు త్రినేత్రునకు నీకు నమస్కారము. ఓ జగత్పతీ, ఓశర్వ ! నీ భక్తుఁడనయిన నాకు శరణుఁడవు కమ్మ. ఇతరుని యాశ్రయములేని వారలకు భూయోభూయః నీవే శరణ్యుఁడవు. నీవే పరాయణుఁడవు.
యన్మయపకృతం దేవ దురుక్తం వాపీ శంకర ।
ఇజానూ త్వాం భగవన్మమ తత్క్షంతుమర్హసి ॥
అనన్యవేద్యరూపస్య సద్భావమిహ కః పుమాన్ ।
త్వామృతే తవ సర్వేత సమ్యక్ శక్నోతి వేదితుమ్ ॥
తస్మాత్త్వం సర్వభావేన ప్రసీద మమ శంకర ।
నాన్యాస్తి మే గతిస్తుభ్యం నమో భూయో నమో నమః ॥
వసిష్ఠ ఉవాచ :-
ఇతి సంస్తూయమానస్తు కృతాంజలిపుటం పురః ।
తిష్ఠంతమాహ భగవాన్ ప్రసన్నాత్మా జగన్మయః ॥
భగవానువాచ :-
ప్రీతోఽస్మి భవతే తాత తపసాఽనేన సాంప్రతమ్ ।
భక్త్యా చైవానపాయిన్యా హ్యపి భార్గవసత్తమ ॥
దాస్యే చాభిమతం సర్వం భవతేఽహం త్వయా వృతమ్ ।
భక్తో హి మే త్వమత్యర్థం నాత్ర కార్యా విచారణా ॥
మయైవావగతం సర్వం హృది యత్తేఽద్య వర్తతే ।
తస్మాద్భ్రవీమి యత్త్వాహం తత్కురుష్వావిశంకితమ్ ॥
నాస్త్రాణాం ధారణే పత్ప విద్యతే శక్తిరద్య తే ।
రౌద్రాణాం న భూయోఽపి తపో ఘోరం సమాచర ॥
పరీత్య పృథివీం సర్వాం సర్వతీర్ధేషు చ క్రమాత్ ।
స్నాత్వా పవిత్రదేహస్త్వం సర్వాణ్యస్త్రాణ్యవాప్స్యసి ॥
ఇత్యుక్త్వాంతర్ధధే దేవస్తేనైవ వపుషా విభుః ।
రామస్య పశ్యతో రాజన్ క్షణేన భవభాగకృత్ ॥
అంర్హితే జగన్నాథే రామో గత్వాతు శంకరమ్ ।
పరీత్య వసుధాం సర్వాం తీర్థస్నానేఽకరోన్మనః ॥
తతః స పృథివీం సర్వాం పరిక్రమ్య యథాక్రమమ్ ।
చకార సర్వతీర్ధేషు స్నానం వీధివదాత్మవాన్ ॥
తీర్దేషు క్షేత్రముఖ్యేషు తథా దేవాలయేషు చ ।
పితృన్ దేవాంశ్చ వీధివదతర్పయదతంద్రితః ॥
ఓ భగవన్, తెలీయమీ నీన్ను గూర్చి (శంకరుని గూర్చి) ఏయే దురుక్తిని పలికి యపరాధముచేసితినో, తదోషమును క్షమింపనరుఁడవు. ఓ సర్వేశ ! ఇతరునిచే తెలియబడని రూపము గల నీయొక్క సద్భావము నీవు తక్క సమ్యక్కుగా తెలియజెప్పుటకు, ఇంకొక పురుషుఁడెవ్వఁడు శక్తిమంతుడు? అందుచే సర్వభావముచే ఓ శంకర ! నా యందు ప్రసన్నుఁడవగుము. నీకంటే వేడొక గతి నాకు లేదు. నీకు మాటిమాటికి నమస్కరించుచున్నాను.
వసిష్ఠుఁడిట్లనెను.
ఎదుట నిలంబడి కృతాంజలిపుటుఁడై సంస్తుతి నాచరించుచు, నిలంబడియున్న రామునితో ప్రసన్నాత్ముఁడయిన జగన్మయుఁడు ఇట్లు పలికెను.
భగవానుడిట్లు పలికెను.
ఓ వత్స ! ఈ నీ తపస్సుచే నిప్పుడు నేను ప్రీతుఁడనయితిని. అనపాయిని యయిన నీ భక్తిచే భార్గవ సత్తమ ! సంప్రీతుఁడను. నీవు కోరినది సర్వము నీకిచ్చుట నాకభిమతము. నీవు అత్యర్థము నా భక్తుఁడవు. ఈ విషయమున విచారింపదగినది లేదు. నీ హృదయమునందున్నది యెల్లనాకు అవగతము. అందుచే నేపలికినదెల్ల నిస్సంశయముగా నీవాచరింపుము. ఓవత్స ! ఇప్పుడు రుద్ర సంబంధమయిన అస్త్రధారణమున నీకు శక్తిలేదు. అందుచే, నీవు మరల ఫోరమయిన తపస్సాచరింపుము. (36) భూమినంతటినీ చుట్టిముట్టి సర్వతీర్థముల యందు చంక్రమణము చేసి, వాని యందు స్నానమాచరించి, పవిత్ర దేహుఁడవయిన నీవు సర్వాస్త్రములను పొందుదువు. అని పలికి, ఆ ప్రభువు, ప్రపంచ సృష్టికర్తయైన శివుఁడు ఆ శరీరముతోడనే రాముఁడు చూచుచుండగనే, ఓ రాజా ! అంతర్థానము చెందెను. జగన్నాథుఁడు అంతర్షితుఁడు కాగా, రాముఁడు శంకరునకు నమస్కరించి, సర్వవసుధాతలమును చుట్టిముట్టి తీర్థ స్నానము నాచరింప నిశ్చయుఁడయ్యెను. అంత పృథివీ సంతటిని యథాక్రమము పరిక్రమించి ఆత్మవంతుఁడయిన రాముఁడు విధివంతముగా సర్వతీర్థముల యందు స్నానమాచరించెను.ర్థముల యందు, క్షేత్రములయందు, అట్లే ముఖ్యములయిన దేవాలయములయందు, శ్రద్ధావంతుఁడై రాముఁడు పితరులకు దేవతలకు విధి విహితముగా తర్పణము లాచరించెను.
ఉపవాసతపోహోమజపస్నానాదీసుక్రియాః ।
తీర్ధేషు వీధివత్కుర్వన్ పరీచక్రామ మేదినీమ్ ॥
ఏవం క్రమేణ తీర్ధేషు స్నాత్వా చైవ వసుంధరామ్ ।
ప్రదక్షిణీకృత్య శనైః శుద్ధదేహోఽభన్నృప ॥
పరీత్యైవం వసుమతీం భార్గవః శంభుశాసనాత్ ।
జగామ భూయస్తం దేశం యత్రపూర్వమువాస సః ॥
గత్వా రాజన్స తత్రైవ స్థిత్వా దేవముమాపతిం ।
భక్త్యా సంపూజయామాస తపోభిర్నియమైరపి ॥
ఏతస్మిన్నేవ కాలే తు దేవానామసురైస్పహ ।
బభూవ సుచిరం రాజస్ సంగ్రామో రోమహర్షణః ॥
తతో దేవాన్ పరాజిత్య యుద్ధేఽతీ బలీనోఽసురాః ।
అవాపురమరైశ్వర్యం అశేషమకుతోభయాః ॥
యుద్ధే పరాజితా దేవాః సకలా వాసవాదయః ।
శంకరం శరణం జగ్ముర్హతైశ్వర్యాహకారాతిభిః ॥
తోషయత్వా జగన్నాధం ప్రణామయసంస్తవైః ।
ప్రార్థయామాసురసురాన్హంతుం దేవాః పినాకివమ్ ॥
తతస్తేషాం ప్రతిశ్రుత్య దానవానాం వధం నృప ।
దేవానాం వరదః శంభుర్మహోదర మువాచ హ॥
హిమాద్రౌ దక్షిణే భాగే రామో నామ మహాతపాః ।
మునిపుత్త్రోఽతి తేజస్వీ మాముద్దిశ్య తపస్యతి ॥
తత్ర గత్వా తమద్వైవ నివేద్య మమ శాసనమ్ ।
మహోదర తపస్యంతం తమిహానయ మాచిరమ్ ॥
ఇత్యాజ్ఞప్తస్తథేత్యుక్త్వా ప్రణమ్యేకం మహోదరః ।
జగామ వాయువేగేన యత్ర రామో వ్యవస్థితః ॥
సమాసాద్య స తం దేశం దృష్ట్వా రామం మహామునిమ్ ।
తపస్యంతమిదం వాక్యమువాత వినయాన్వితః ॥
ద్రష్టుమిచ్ఛతి శంభుస్త్వాం భృగువర్యం తదాజ్ఞయా ।
అగతోఽహం తదాగచ్ఛ తత్పాదాంబుజసన్నిధిమ్ ॥
తీర్థముల యందు ఉపవాసము, తపస్సు, హోమము, జపము, స్నానము మున్నగు పవిత్ర క్రియలను యథావిధి నాచరించుచు, యావదూ మండలమును రాముఁడు సంచరించెను. ఈ విధముగా తీర్థముల యందు స్నానము లాచరించి వసుంధర యంతయు ప్రదక్షిణము చేసి రాముఁ డు పవిత్రీకృత శుద్ధ దేహుఁడయ్యెను, భార్గవరాముఁడు శంభు శాసనమున సర్వ వసుమతిని తిరిగి, తిరిగి పూర్వము తానివసించిన ఆశ్రమదేశమును చేరెను. అక్కడకు చేరి, ఓ రాజా! అందుండి, తపస్సులచే, వియమాదులచే ఉమాపతినీ ఆతఁడారాధించెను. (45) ఆ సమయముననే దేవతలకు రాక్షసుల మధ్య చిరకాలము భయోత్పాదకమయిన యుద్దమయ్యెను. అంత మిక్కిలి బలవంతులయిన అసురులు దేవతలను యుద్దమున పరాజయించి, నిర్భయులై అమరుల యైశ్వర్యము నంతటినీ పొందిరి. వాసవాదులయిన దేవతలందరు యుద్ధమునందు పరాజితులై శత్రువులచే హల్లేశ్వర్యులై శంకరుని శరణుజొచ్చిరి. సాష్టాంగ నమస్కారములచే, స్తోత్రములచే, జయగీతులచే జగన్నాథుఁడయిన శంకరునీ సంతోషపరచి, దేవతలు, అసురులను వధింపవలసినదిగా నీశ్వరుని ప్రార్థించిరి. దానవుల యొక్క వధను పారలకు వాగ్దానము చేసి, దేవతలకు వరదుఁడయిన శంభుఁడు మహోదరునితో నిట్లు పలికెను. (50) “హిమ పర్వతము యొక్క దక్షిణ భాగమున ముని పుత్రుఁడు తేజస్వి, మహాతపస్వి యగు రామనామకుఁడు, నన్నుగూర్చి తపస్సాచరించు చున్నాఁడు. ఇప్పుడే మీరక్కడకు పాండు, నాయొక్క శాసనమును ఆతనికి నివేదింపుఁడు. ఓ మహోదర ! తపస్సాచరించు నాతనిని వెంటనే యిచ్చటకు తీసికొని రమ్ము. ఈ విధముగా నాజ్ఞాపింపఁబడి, ఆట్లే చేయుదునని మహోదరుఁడు శివునకు ప్రణామమాచరించి, ఎందు రాముఁడుండెనో యచ్చటకు వాయువేగమున నరిగెను. ఆ ప్రదేశమును మహోదరుఁడు చేరెను. తపస్సాచరించుచున్న మహామునివరుండైన రాముని చూచెను. వినయాన్వితుఁడై రామునితో " “భృగువర్యుఁడవయిన నిన్ను శంభుండు చూడగోరుచున్నాఁడు. ఆతని యాజ్ఞ ననుసరించి నేను వచ్చితిని. అందుచే తత్పాదాంబుజ సన్నిధికి నీవు రమ్ము. (55) అని చెప్పెను.
తచ్చ్రుత్వా వచనం తస్య శీఘ్రముత్థాయ భార్గవః ।
తదాజ్ఞాం శిరసానంద్య తథేతి ప్రత్యభాషత ॥
తతో రామం త్వరోపేతః శంభుపార్శ్వం మహోదరః ।
ప్రాపయామాస సహసా కైలాసే నాగసత్తమే ॥
సహితం సకలైర్భూతైరింద్రాద్యైశ్చ సహామరైః ।
దదర్శ భార్గవశ్రేష్ఠః శంకరం భక్తవత్సలమ్ ॥
సంస్తూయమానం మునిభిర్నారదాద్యైస్తపోధనైః ।
గంధర్వైరుపగాయద్భి ర్నృత్యదిశ్చాపురోగణైః ॥
ఉపాస్యమానం దేవేశం గజచర్మ ధృతాంబరమ్ ।
భస్మోద్ధూళితసర్వాంగం త్రినేత్రం చంద్రశేఖరమ్ ॥
ధృతపింగజటాభారం నాగాభరణభూషితం ।
ప్రలంబోష్ఠభుజం సౌమ్యం ప్రసన్నముఖపంకజమ్ ॥
ఆస్థితం కాంచనే పట్టే గీర్వాణసమితౌ నృప ।
ఉపాసర్పత్తు దేవేశం భృగువర్యః కృతాంజలిః ॥
శ్రీకంఠదర్శనోద్వృత్తరోమాంచాంచితవిగ్రహః ।
బాష్పాత్తు సిక్తకాయేన స తు గత్వా హరాంతికమ్ ॥
భక్త్యా ససంభ్రమం వాచా హర్షగద్గదయాసకృత్ ।
నమస్తే దేవదేవేతి వ్యాలపన్నాకులాక్షరమ్ ॥
పపాత సంస్పృశన్ మూర్ద్నా చరణౌ పురవిద్విషః ।
పశ్యతాం దేవబృందానాం మధ్యే భృగుకులోద్వహమ్ ॥
తముత్థాష్య శివః ప్రీతః ప్రసన్నముఖపంకజమ్ ।
రామం మధురయా వాచా ప్రహసన్నాహ సాదరమ్ ॥
ఇమే దైత్యగణైః క్రాంతాః స్వాధిష్టానాత్పరిచ్యుతాః ।
అశక్నువంతస్తాన్హంతుం గీర్వాణా మాముపాగతాః ॥
తస్మాన్మ మాజ్ఞయా రామ దేవానాం చ ప్రియేప్సయా ।
జహి దైత్యగణాన్ సర్వాన్ సమర్ధస్త్వం హి మే మతః ॥
తతో రామోఽబ్రవీచ్ఛుర్వం ప్రణిపత్య కృతాంజలిః ।
శృణ్వతాం సర్వదేవానాం సప్రశ్రయమిదం వచః ॥
స్వామిన్ న విదితం కిం తే సర్వజ్ఞస్యాఖి లాత్మనః ।
తథాపి విజ్ఞాపయతో వచనం మేఽవధారయ ॥
రాముఁడా వాక్యమును విని వెంటనే లేచెను. శివునాజ్ఞను శిరసావహించీ, నమస్కరించి, “అట్లే ! ఇదిగో వచ్చు చుంటిని” అని ప్రత్యుత్తర మొసంగెను. అంత, మహోదరుఁడు, సత్వరయుతుఁడై, పర్వత రాజమయిన కైలాసము నందు పరమేశ్వరు సన్నిధికి రామునీ తీసికొని వెళ్లెను, అందు భార్గవ శ్రేష్ఠుఁడయిన రాముఁడు, సమస్త భూతములతో, ఇంద్రాదులతో, అమరులతో నున్న భక్తవత్సలుడనీ శంకరుని చూచెను. (58) శంకరుఁడు తపోధనులయిన నారదాది మునులచే సంస్తూయమానుఁడగుచుండెను. గంధర్వులచే గానము లాలపింపఁబడుచుండెను. అప్సరోగణములచే నృత్యము లాడబడుచుండెను. వారందరిచే ఉపాసింపబడుచున్న దేవేశ్వరుని, గజచర్మమును ధరించిన వానిని, భస్మముచేం బూయంబడిన సర్వాంగుని, త్రినేత్రుని, చంద్రశేఖరుని, వ్రేలాడు క్రింద పెదవి భుజములు గలవానినీ, ప్రసన్నమయిన ముఖపంకజము గలవానిని, ధరింపఁబడిన పింగళ వర్ణముగల జటాభారము కలవానిని, నాగాభరణభూషితుని, దేవతాసమితి యందు, బంగారు పట్టమున ఆసీనుఁడయిన వానీనీ, కృతాంజలియై, భృగు సత్తముఁడు దేవేశుని సమీపించెను. శ్రీకంఠుని దర్శనముచే రాముఁడు రోమాంచకంచుకీతవిగ్రహుఁడయ్యెను. ఆనంద బాష్పధారలచే తడిసిన కాయముతో పరమేశ్వరుని సమీపమున కరిగెను. వెళ్లి, భక్తీచే, ససంభ్రమమయిన వాక్కుచే, హరముచేతను గద్దదికము చెందీనమాటలతో వ్యాకులితాక్షరముగ, 'దేవదేవ నమస్కారము' అని పలుకుచు, త్రిపుర శత్రుఁడైన ఈశ్వరుని చరణద్వయము మూర్ధముచే స్పృశించుచు దేవతా బృందము లందరు రెప్పవేయక చూచుచుండ, సాష్టాంగముగా ప్రణామమాచరించేను. శివుఁడు ప్రీతుం డయ్యెను. ఆతనినీ లేవనెత్తాను. ప్రసన్నముఖ పంకజుఁడయిన రాముని మధురము లయిన పలుకులతో, సాదరముగా, నవ్వుచు నిట్లనెను. ఈ దేవతలు దైత్య గణములచే సమాక్రాంతులు. తమతమ అధిష్టానముల నుండి పరిభ్రష్టులు. ఆ రాక్షసులను చంప శక్తిహీనులై దేవతలు నన్ను చేరిరి. ఓ రామ ! అందుచే నా యాజ్ఞచే, దేవతలకు ప్రియమాచరించు కోరికతో, దైత్యగణముల నెల్లను జయించుము. నా దృష్టిలో నీవు సమర్థుఁ డవు. అంత రాముఁడు కృతాంజలియై, ప్రణామము నాచరించి వినయముతో దేవతలందరు వినుచుండ, ఈశ్వరునితో నీట్లనెను. “స్వామిన్ ! సర్వజ్ఞుఁడవయిన నీకు తెలియనిదేమున్నది? అయినను, నేను విన్నవించుకొను నా పలుకులను వినఁగోరెదను.
యదీ శక్రాదిభిర్దేవైరఖిలైరమరారయః ।
న శక్యా హంతుమేకస్య శక్యాః స్యుస్తే కథం మమ ॥
అనస్త్ర జ్ఞోఽస్మి దేవేశ యుద్ధానామప్యకోవిదః ।
కథం హనిష్యే సకలాన్సురశత్రూననాయుధః ॥
ఇత్యుక్తస్తేన దేవేశః స్థితం కాలాగ్నిసప్రభమ్ ।
శైవమస్త్రమయం తేజో దదౌ తస్మై మహాత్మనే ॥
ఆత్మీయం పరశుం దత్వా సర్వశస్త్రాభిభావకమ్ ।
రామమాహ ప్రసన్నాత్మా గీర్వాణానాం తు శ్రుణ్వతామ్ ॥
మత్ప్రసాదేన సకలాన్సురశత్రూన్వినీఘ్నతః ।
శక్తిర్భవతు తే సౌమ్య సమస్తారిదురాసదా ॥
అనేనైవాయుధేన త్వం గచ్ఛ యుద్ధ్యస్వ శత్రుభిః ।
స్వయమేవ చ వేత్సి త్వం యథావద్యుద్ధకౌశలమ్ ॥
వసిష్ఠ ఉవాచ:-
ఏవముక్తస్త తో రామః శంభునా తం ప్రణమ్య చ ।
జగ్రాహ పరశుం శైవం విబుధారివధోద్యతః ॥
తతః స శుశుభే రామో విష్ణుతేజోఽoశ సంభవః ।
రుద్రభక్త్యా సమాయుక్తో ద్యుత్యేవ సవితుర్మహః ॥
సోఽనుజ్ఞాతస్త్రినేత్రేణ దేవైస్సర్వైస్సమన్వితః ।
జగామ హంతుమసురాన్యుద్ధాయ కృత నిశ్చయః ॥
తతోఽభవత్పునర్యుద్ధం దేవానామసురైస్సహ ।
త్రైలోక్య విజయోద్యుక్తై రాజన్నతిభయంకరమ్ ॥
అథ రామో మహాబాహుస్తస్మిన్యుద్ధే సుదారుణం ।
క్రుద్ధః పరశునా తేన నిజఘాన మహాసురాన్ ॥
ప్రహారైరశనిప్రభ్యైర్నిప్నన్ దైత్యాన్ సహస్రశః ।
చచార సమరే రామః క్రుద్దః కాల ఇవాపరః ॥
హత్వా తు సకలాన్దైత్యాన్డేవాత్సర్వానహర్షయత్ ।
క్షణేన నాశయామాస రామః ప్రహరతాం వరః ॥
రామేణ హన్యమానాతు సమస్తా దైత్యదానవాః ।
దదృశుః సర్వతో రామం హతశేషా భయాన్వితాః ॥
ఇంద్రుడు మొదలగు సకల దేవతలచే దేవతా శత్రువులు చంపఁబడుటకశక్తులయినచో, ఆదైత్యులందరు నా యొక్కనిచే నేట్లు చంపబడుదురు? ఓ దేవేశ ! నేనో అస్త్రజ్ఞుఁడనుకాను. యుద్దముల యందు కోవిదుఁడనుకాను, అనాయుధుఁడను, సురశత్రువులనందరనెనేనెట్లు చంప గలుగుదును. (72) ఇట్లు రాముఁడు పలుకగా, దేవేశుఁడు 'కాలాగ్నితో సమానమయిన కాంతి గలిగినది, శైవతేజోమయమయిన అస్త్రమును నిలువఁబడియున్న మహాత్ముడయిన రామున కొసంగేను. (73) అంతీయకాక స్వకీయమయినట్టిది, సర్వశస్తాభీభావకమయినదియునగు పరశువును, రామున కొసంగి, ప్రసన్నాత్ముడై యీశ్వరుండు దేవతలందరు ఆలకించుచుండ రామునితో “ఓ శత్రు దురాసదా ! ఓ సౌమ్యుఁడా, మత్రసాదవశమున సమస్త శత్రువులను నాశనము చేయు శక్తి నీకగును. ఇదిగో ! ఈ ఆయుధముతోడనే యుద్ధమునకు నీపరుగుము. శత్రువులతో యుద్ధము చేయుము. యుద్ధకౌశలము నెఱుగనంటీవికదా ! అప్పుడు నీవే స్వయముగా యుద్ధ నైపుణ్య మెఱుంగగలవు. అని అనెను.
వసిష్ఠుఁడిట్లు పలికెను.
ఈశ్వరునిచే నీ విధముగా చెప్పఁబడి, రాముడాతనికి నమస్కరించి, శైవమయిన పరశువును గ్రహించి, దేవతా శత్రువధమున కుద్యతుం డయ్యెను, (77) అంత విష్ణు తోజోంఽశ సంభవుఁడు, రుద్రుని యందలి భక్తితో సమాయుక్తుఁడు, సూర్యమహద్యుతీతో కూడినవాడునై రాముఁడు మిక్కిలిగా శోభించెను. (77) త్రినేత్రునిచే అనుజ్ఞాతుఁడై, సర్వదేవతలతో కూడికొని యుద్ధమాచరింప కృతనిశ్చయుఁడై, అసురులను చంపుటకు బయలుదేరెను. అంత, మరల దేవతలకు త్రిలోక విజయోద్యుక్తులైన రాక్షసులకు మధ్య యుద్దమయ్యెను. యుద్దమతి భయంకరముగా జరిగెను. అంత మహాబాహుఁడైన రాముఁడు సుదారుణమయిన యా యుద్దమున, క్రోధోదగ్రుండై, మహాసురల నందరను పరశువుచే హతమార్చెను. పిడుగులతో తుల్యములయిన దేబ్బలచే, సహస్ర సంఖ్యాకముగా అసురలను చంపి, ఆ యుద్ధమునందు సంక్రుద్ధుఁడయిన వేడొక యమునివలే (కాలునివలె) సంచరించెను. దైత్యులనందరంజంపీ దేవతలనందరను సంతోషపెట్టెను. క్షణకాలములో, ప్రహర్తలలో శ్రేష్ఠుఁడయిన రాముఁడు రాక్షసుల హతమార్చిను. దైత్యదానవులందరు రామునిచే చంపఁబడిరి. హతశేషులయినవారు రాముని సర్వత్ర దర్శించిరి. భయ సంత్రస్తులైరి. (84)
హతేష్వసురసంఘషు విద్రుతేషు చ కృత్స్నశః ।
రామమామంత్ర్య విబుధాః ప్రయయుః త్రిదివం పునః ॥
రామోఽపి హత్వా దితిజానభ్యనుజ్ఞాప్య చాతురాన్ ।
స్వమాశ్రమం సమాపేదే తపస్యాసక్తమానసః ॥
మృగవ్యాధప్రతికృతిం కృత్వా శంభోర్మహామతీః ।
భక్త్యా సంపూజయామాస స తస్మిన్నాశ్రమే వశీ ॥
గంధైః పుష్పైస్తథా హృద్యైరైవేద్యై రభినందనైః ।
స్తోత్రైశ్చ విధివద్భక్త్యా పరాం ప్రీతిముపానయత్ ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతృదేఽర్జునోపాఖ్యానే చతుర్వింశతి తమోఽధ్యాయః॥
అసుర సంఘములు చంపబడగా, సర్వత్ర చెల్లాచెదరుచేయబడగా, రాముని ఆహ్వానించి, దేవతలందరు స్వర్గమునకు మరలిపోయిరి. (85) రాముఁడు దైత్యులను చంపి, దేవతలనందరినీ పోవుట కనుజ్ఞ నొసంగి, తిరిగి తపస్సు నందాసక్తమయిన మనస్సుతో స్వకీయాశ్రమమునకు పోయెను. (86) మహామతియైన రాముఁడు మృగవ్యాధ ప్రతికృతినీ (రూపమును నిర్మాణించి) వశియై ఆయాశ్రమమున నతనిని భక్తితో పూజించెను. గంధములతో, పుష్పములతో, మనోహరములయిన నైవేద్యములతో, నమస్కారాఖీనందనములతో, స్తోత్రములతో, విధివత్తుగా భక్తితో శంకరుని రాముఁడు పూజించి, ప్రీతినొందెను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమునందలి మధ్యభాగము నందలీ, తృతీయోపోదాతపాదమునందు అర్జునోపాఖ్యానమందు ఇరువదినాలుగవ అధ్యాయము.
Summary of chapter 62 of the Brahmānda Mahā Purana is as follows:
In a breathtaking devotional narrative, this chapter celebrates the extraordinary penance of king Bhagīratha, who brought the holy river Gaṅgā down from heaven to purify his ancestors' ashes. It describes lord Shiva graciously catching the surging heavenly stream in his matted locks to save the earth from destruction. The devoted heart overflows with ecstasy and tears of gratitude, worshipping the compassionate lord and the holy mother Gaṅgā who washes away all sins.