బ్రహ్మాండ మహా పురాణము
47 - వసిష్టాగమనము
వసిష్ఠ ఉవాచ :-
తతో మూర్థాభిషిక్తానాం రాజ్ఞామమితతేజసామ్ ।
షట్సహస్రద్వయం రామో జీవగ్రాహం గృహీతవాన్ ॥
తతో రాజసహస్రాణి గృహీత్వా మునిభిః సహ ।
స జగామ మహాతేజాః కురుక్షేత్రం తపోమయమ్ ॥
సరసాం పంచకం తత్ర ఖానయిత్వా భృగూద్వహః ।
సుఖావగాహతీర్థాని తాని చక్రే సమంతతః ॥
జఘాన తత్ర వై రాజ్ఞః శరీరప్రభవాసృజా ।
సరాంసి తానీ వై పంచ పూరయామాస భార్గవః ॥
స్నాత్వా తేషు యధాన్యాయం జామదగ్న్యః ప్రతాపవాన్ ।
పితృన్ సంతర్పయామాస యథాశాస్త్రమతండ్రితః ॥
పితుః ప్రేతస్య రాజేంద్ర శ్రాద్ధాదీకమశేషతః ॥
బ్రాహ్మణైః సహ మాతుళ్ళ తత్ర చక్రే యథోదితమ్ ॥
ఏవం తీర్ణప్రతీకః స కురుక్షేత్రే తపోమయే ।
ఉవాసాతంద్రీతః సమ్యకి పితృపూజాపరాయణః ॥
తతః ప్రభృత్యభూద్రాజంషీర్థానముత్తమోత్తమమ్ ।
విహితం జామదగ్వేన కురుక్షేత్రే తపోవనే ॥
సస్యమంతపంచకమిత స్థానం త్రైలోక్యవిశ్రుతమ్ ।
యత్ర చక్రే భృగుశ్రేష్ఠః పితృణాంతృప్తిమక్షయామ్ ॥
స్నానదానతపోహోమద్విజభోజనతర్పణైః ।
భృశమాప్యాయతాస్తేన యత్ర తే పితరో ఖిలాః ॥
అవాపురక్షయాం తృప్తిం పితృలోకం చ శాశ్వతమ్ ।
సమంతపంచకం నామ తీర్థం లోకే పరిశ్రుతమ్ ॥
సర్వపాపక్షయకరం మహాపుణ్యోపబృంహితమ్ ।
మర్యానాం యత్ర యాతానామేనాం నిఖిలాని తు ॥
దూరాదేవాపయాస్యంతి ప్రవాతే శుష్కపర్ణవత్ ।
తత్క్షేత్రచర్యాగమనం మర్యానామసతామిహ ॥
న లభ్యతే మహారాజ జాతు జన్మశతైరపి ।
సమంతపంచకం తీర్థం కురుక్షేత్రతీపావనమ్ ॥
యత్ర స్నాతః సర్వతీర్ధైః స్నాతో భవతి మానవః ।
కృతకృత్యస్తతో రామః సమ్యక్ పూర్ణ మనోరథః ॥
వసిష్ఠుఁడు చెప్పెను.
అంత అమిత తేజస్వులు, మూర్థాభిషిక్తులునయిన పండ్రెండువేల సంఖ్యగల రాజులను సజీవులయిన వారిని రాముఁడు పట్టుకొనెను. తరువాత ఈ పండ్రెండు వేల సంఖ్యగల రాజులను మునులతో సహా పట్టుకొని మహా తేజస్వీయయిన రాముఁడు తపోమయమయిన కురుక్షేత్రమున కరిగెను. అందు రాముఁడు పంచ సరస్సులను త్రవ్వించి వాని చుట్టును సుఖముగా స్నానమాడుటకు వీలయిన తీర్థములను నిర్మింపఁజేసెను. భార్గవుఁడు రాజుల నందు చంపెను. వారీ శరీరముల నుండి స్రవించు రక్తముతో ఆ పంచ సరస్సుల నింపెను. ప్రతాపమంతుఁడు పరశు రాముఁడు ఆ సరస్సుల యందు స్నానమాచరించెను. పితృతర్పణములచే పితరులకు యథాశాస్త్రముగ శ్రద్దగా తర్పణములు విడిచెను. రాముఁడు ప్రేతలయిన పితరులకు తల్లికి బ్రాహ్మణులతో శాస్త్ర విహితముగా శ్రాద్ధాదికముల నొనర్చెను. (6) తపోమయమయిన కురుక్షేత్రమున నీ వీధముగా తీర్ణప్రతిజ్ఞుండై పితృపూజాపరాయణుఁడై నివసించెను. అది మొదలుకొని, జామదగ్న్యునిచే కురుక్షేత్ర తపోవనము తీర్థముల యందుత్తమోత్తమయినది. ఎందు. పితృదేవతలకు పరశురాముఁడు అక్షయమయిన తృప్తి కలిగించెనో యయ్యది స్యమంతపంచకమని త్రైలోక్య విశ్రుతమయిన పుణ్యస్థానమయినది. అదే స్నానములచే, దానములచే, తపోమహిమచే, ద్విజ భోజన తర్పణములచే పితరులకు ప్రీతిమంతమయినదిగా రామునిచే చేయఁబడినది. ఆతనీ పితరులు అక్షయమయిన తృప్తినీ, శాశ్వత పితృలోకమును చెందిరి. ఆ సమంత పంచక మనుపేర తీర్ధము లోకమున విదితమయ్యెను అయ్యది సర్వ పాపక్షయకరము అనంత పుణ్య సంపాదనతో కూడినది అచ్చటి కరిగిన మర్యులకు వారి యఖిల పాపములు, పెద్దగాలికి ఎండుటాకులు దూరముగా తొలఁగునట్లు, దూరముగా తొలగిపోవును. పాపులయిన మర్త్యులకు తత్క్షేత్ర గమనము బహుజన్మ శతములకయినను లభింపదు. కురుక్షేత్రము నందు సమంత పంచక తీర్థము అతి పావనమయినది, అందు మానవుఁడు స్నానము చేయ సర్వతీర్థముల స్నానమాడినవాడగును. రాముఁడు పూర్ణ మనోరథుఁడయి కృతకృత్యుఁడయ్యెను. (15)
ఉవాస తత్ర నియతః కంచిత్కాలం మహామతిః ।
తతః సంవత్సరస్యాంతే బ్రాహ్మణైః సహితోవశీ ॥
పితృపిండప్రదానాయ జామదగ్యోగమత్ గయామ్ ।
తతో గత్వా తతః శ్రాద్ధే యథాశాస్త్రమరిందమః ॥
బ్రాహ్మణాన్ తర్పయామాస పితృనుద్దిశ్య సతృతాన్ ।
శైవం తత్ర పరం స్థానం చంద్రపాదమితి స్మృతమ్ ॥
పితృతృప్తికరం క్షేత్రం తాదృగ్లోకే న విద్యతే ।
యత్రార్చితాః స్వకులజై యథాశక్తి మనాగపి ॥
పితరః పిండదానాద్యైః ప్రాప్స్యంతి గతిమక్షయామ్ ।
పిత్యనుద్దేశ్య తత్రాసౌ తర్పితేషు ద్విజాతీషు ॥
దదౌ చ విధివల్పిండం పితృభక్తిసమన్వితః ।
తతస్తల్పితరః సర్వే పితృలోకాదుపాగతాః ॥
జగృహుస్తతృతాం పూజాం జమదగ్నిపురోగమాః ।
అథ సంప్రీతమనసః సమేత్య భృగునందనమ్ ॥
ఊచుస్తల్పితరః సర్వేతి దృశ్యా భూత్వాంతరీక్షగాః ।
పితరః ఊచుః :-
మహత్కర్మ కృతం వీర భవతాన్యైః సుదుష్కరమ్ ॥
అస్మానపి యధాన్యాయం సమ్యక్ తర్పితవానసి ।
అస్మాకమక్షయం ప్రీతిం తథాపి త్వం న యచ్ఛసి ॥
క్షత్రహత్యాం హి కృత్వా తు కృతకర్మాభవద్యతః ।
క్షేత్ర స్యాస్య ప్రభావేణ భక్త్యా చ తవ దర్శనమ్ ॥
ప్రాప్తిస్మ పూజితాః కిం తు నాక్షయ్యఫలభాగినః ।
తస్మాత్వం వీరహత్యాదిపాపప్రశమనాయ హి ॥
ప్రాయశ్చిత్తం యధాన్యాయం కురు ధర్మం చ శాశ్వతమ్ ।
వధాచ్ఛ వినివర్తస్వ క్షత్రియాణామతః పరమ్ ॥
పితుర్న తే పరాధ్యంతే న స్వతంత్రం యతో జగత్ ।
తన్నిమిత్తం తు మరణం పితుస్తే విహితం పురా ॥
హంతుం కం కః సమర్థః స్యాల్లోకే రక్షితుమేవ వా ।
నిమిత్తమాత్రమేవేహ సర్వః సర్వస్య చైతయోః ॥
ధ్రువం కర్మానురూపం తే చేష్టంతే సర్వ ఏవ హి ।
కాలానువృత్తం బలవాస్నృలోకో నాత్ర సంశయః ॥
మహామతి రాముఁడు నియమవంతుఁడై కొంతకాలము అందునివసించెను. సంవత్సరాంతమున వశియైన రాముఁడు బ్రాహ్మణులతో గూడి పిండ ప్రదానమునకు గయకు వెడలెను. గయాక్షేత్రములో శత్రు నాశనుఁడు రాముఁడు; శాస్త్రము ననుసరించి సత్కృతులయిన పితరుల నుద్దేశించి, బ్రాహ్మణులను సంతృప్తుల నొనర్చెను. అందు శివ సంబంధమైన స్థానమొక్కటున్నది. దానినీ ‘చంద్ర’ పాద మందురు. పితరులకు అంతటి తృప్తి గలిగించునట్టి క్షేత్రము వేఱొకటీ లేదు. అందు స్వకులజులు యథాశక్తి యొక్క మారైనను పితరులను పిండ దానాదులచే నర్చీంచిన పితరులక్షయమయిన గతిని పొందుదురు. అతఁడు పితరుల నుద్దేశించి, ద్వీజాదులను సంతృప్తి పరుచగా, పితృభక్తి తత్పరుఁడై విధి ననుసరించి పిండముల నొసంగెను. అంత ఆతని పితరులు అందరు జమదగ్ని పురోగతులయి పితృలోకము నుండి వచ్చిరి. ఆతనిచే సమర్పింపం బడిన పూజను వారందరు గ్రహించిరి. వారందరు సంప్రీత మనస్కులయి తత్పితరులు భృగునందనునితో అంతరిక్షము నుండి అదృశ్యులయి యుండి పలికిరి.
పితరులిట్లనిరి.
ఓ వీరుఁడా ! ఇతరులచే దుష్కరమయిన మహత్కర్మ నీచే ఆచరింపఁబడినది. మమ్ములనందరను యధాన్యాయము శాస్త్ర సమ్మతముగా తృప్తి మంతులను జేసితివి. అయినను మాకు అక్షయమయిన ప్రీతిని నీ వొసంగలేదు. ఏలయన, క్షత్రియుల నందరను వధించి నీవు నీ లక్ష్యమును సాధించితివి కనుక (24) ఈ క్షేత్రము యొక్క ప్రభావముచేతను, నీ భక్తి చేతను, మమ్ము కలిసికొంటివి పూజించితివి. కాని మేము మాత్రము శాశ్వతమయిన ఫలములను అనుభవింపలేదు. అందుచే నీవు వీర హత్య మొదలగు క్రియలవలని పాష ప్రశనము కొఱకు యథా న్యాయము ప్రాయశ్చిత్తము నాచరింపుము. శాశ్వత ధర్మమాచరింపుము. ఇఁక క్షత్రియవధనుండి విరమించుము. (27) ఈ జగత్తుఅస్వతంత్ర మయినదగుటచే ఆ రాజులు నీ పితరుల కాచరించిన అపరాధమునకు బాధ్యులుగారు. వారు నిమిత్తముగా నీ పితరుల మరణము పూర్వము విహితమయినది. (28) ఎవ్వనిని చంపుటకు ఎవ్వడు సమర్థుఁడు? ఈ ప్రపంచమున నెవ్వఁడు ఎవ్వనిని రక్షించుటకు సమర్ధుఁడు? ఈ రెండు క్రియలలో ప్రతివ్యక్తియు నిమిత్త కారణముగా ఇతరుని గూర్చి యుండును. ప్రతి వ్యక్తియు పూర్వ కృతకర్మ ననుసరించి వర్తించును. ఈ విషయములో సందేహము లేదు. కాలానుగుణముగ ప్రజలు లోకమున బలవంతులగుదురు. (30)
బాధితుం భువి భూతాని భూతానాం న విధిం వినా ।
శక్యతే వత్స సర్వోపి యతః శక్త్యా స్వకర్మకృత్ ॥
క్షత్త్రం ప్రతి తతో రోషం విముచ్యాస్మత్ ప్రియేప్సయా ।
శమమాప్నుహి భద్రం తే స హ్యస్మాకం పరం బలమ్ ॥
వసిష్ఠ ఉవాచ :-
ఇత్యుక్త్వాంతర్దధుః సర్వే పితరో భృగునందనమ్ ।
స చాపి తద్వచః సర్వం ప్రతిజగ్రాహ సాదరమ్ ॥
అకృతవ్రణసంయుక్తో ముదా పరమయా యుతః ।
ప్రయయా చ తదా రామస్తస్మాత్సిద్ధవనాశ్రమమ్ ॥
తస్మింస్థిత్వా భృగుశ్రేష్ణో బ్రాహ్మయైః సహితో నృప ! ।
తపసే ధృతసంకల్పో బభూవ సమహామనాః ॥
సరథం సహసాహం చ ధనుః సంహననాని చ ।
పునరాగమసంకేతం కృత్వా ప్రాస్థాపయత్తదా ॥
తతః స సర్వతీర్ధేషు చక్రే స్నానమతంద్రితః ।
పరీత్య పృథివీం సర్వాం పితృదేవాదిపూజకః ॥
ఏవం క్రమేణ పృథివీం త్రివారం భృగునందనః ।
పరిచక్రామ రాజేంద్ర లోకవృత్తమనువ్రతః ॥
తతః స పర్వతశ్రేష్ఠం మహేంద్రం పునరష్యథ ।
జగామ తపసే రాజవ్రాహ్మడైరభిసంవృతః ॥
స తస్మింశ్చరరాత్రాయ మునిసిద్ధనిషేవితే ।
నివాసమాత్మనో రాజన్ కల్పయామాస ధర్మవిత్ ॥
మునయస్తం తపస్యంతం సర్వక్షేత్రనివాసినః ।
ద్రష్టుకామా సమాజగుర్నియతా బ్రహ్మవాదిన ॥
దదృశుస్తే మునిగణాస్తపస్యాసక్తమానసమ్ ।
క్షాత్రం కక్షమశేషేణ దగ్ధ్వ శాంతమిదానాలమ్ ॥
అథలానాగన్ దృష్ట్వా మునీశివ్యాంసపోయమాన్ ।
అర్యాది సముదాచారైః పూజయామాస భార్గవః ॥
కృతకౌశలసంప్రశ్నపూర్వకాః సుమహోదయాః ।
తేషాం తస్య చ సంవృత్తాః కథాః పుణ్యా మనోహరాః ॥
తతస్తేషామనుమతే మునీనాం భావితాత్మనామ్ ।
హయమేధం మహాయజ్ఞమాహర్తుముపచక్రమే ॥
విధి జోక్యము లేక, ప్రపంచమున నేజీవద్భూతము వేఱొక భూతమును హింసించుటకు శక్తిమంతము కాదు. వత్స ! ఏలయన ప్రతి వ్యక్తియు తచ్ఛక్తి ననుసరించియే స్వకర్మ నాచరించును. అందుచే క్షత్రియ జాతిని గూర్చిన కోపమును మాయెడ ప్రీతి దృష్ట్యా పరిత్యజించుము. శమము మంగళము నొందుము. అదియే నిజముగా మా బలము. (32).
వసిష్ఠుఁడిట్లనియెను.
భృగునందనుఁడయిన రామునితో నిట్లు చెప్పి పితరులందరును అంతర్ధానము నొందిరి. ఆతఁడును వారి వాక్కుల నెల్లను సాదరముగా ప్రతిగ్రహించెను. అకృత ప్రణునితో కూడి, అత్యంత ముదముతో గూడికొనీ, అచ్చటి నుండి రాముఁడు సిద్దవనాశ్రమమునకు వెడలెను. ఆయా శ్రమమున నుండి, బ్రాహ్మణులతో సహితుఁడై (ఓ రాజా !) మహా మనస్వియయిన రాముఁడు తపస్సాచరింప సంకల్పించెను. సహసాహునితోను తన రధముతో ధనువుతో, ఇతర సంహననాయుధములతో, రాముఁడు పునరాగమ సంకేతము నొనర్చి బయలుదేరెను. అంతనోతఁడు శ్రద్ధతో సర్వ తీర్థముల స్నాన మాచరించెను. అతఁడు సర్వ పృథివీ పర్యటన మాచరించెను. పితృ దేవాది పూజలాచరించెను. లోక సంప్రదాయము ననుసరించి భృగు. నందనుఁడు క్రమముగా నీ విధమున మూఁడు పర్యాయములు పృథీవికీ పరిక్రమణము చేసెను. తరువాత పర్వతశ్రేష్ఠమయిన మహేంద్రగిరికి బ్రాహ్మణులతో అభిసంవృతుఁడై తపస్సుకొఱకరిగెను. మునులచే సిద్ధులచే సేవితమయిన ఆ ప్రదేశమును ధర్మ విదుఁడయిన రాముఁడు తనకు స్థిరవాసము చేసికొనెను. (40) ఆత్వడందు తపమాచరింప, సర్వక్షేత్రముల నివసించు మునులు, బ్రహ్మవాదులు, నియమపూర్ణులు తపస్సాచరించు నాతనిని దర్శింప కోరికతో వచ్చిరీ, తపస్సు నందాసక్తుఁడయిన యాతనికి మునులందరు దర్శించిరి. ఎండిన వృక్షములతో క్షత్రియ రూపమున నున్న ఆరణ్యమును దగ్ధము చేసి శాంతమయిన అగ్నివలె నున్న రాముని ఆ మునులు చూచిరి. ఆగతులయిన దివ్య మునీంద్రులను, తపోయమాది పూర్ణులను చూచి అరాదికములతో ఉత్తమాచారానుగుణముగ భార్గవుఁడు పూజించెను. కుశల ప్రశ్నాదీకములయిన తరువాత, ఆ మునీశ్వర మహోదయులను ఆచార బద్ధమయిన అరాది ఉపచారములతో భార్గవుఁడు ఆహ్వానించెను. (43) కుశల ప్రశ్నాదికములయిన వెనుక మనోహరములయిన కథలతో ఇతివృత్తములతో వారు కాలము గడిపిరి. ఆ కథలు పుణ్యప్రదములు. అంత పవిత్ర హృదయులయిన మునుల అంగీకారముతో యజ్ఞములలో శ్రేష్ఠతమమయిన అశ్వమేధ మాచరించుటకు రాముడు ప్రారంభించెను. (45)
సంభృత్య సర్వసంభారానౌర్వాద్యైః సహితో నృప ।
విశ్వామిత్రభరద్వాజమార్కండేయాదిభిస్తథా ॥
తేషామనుమతే కృత్వా కాశ్యపం గురుమాత్మనః ।
వాజమేధం తతో రాజన్నాజహార మహాక్రతుమ్ ॥
తస్యాభూత్కాశ్యపో ధ్వర్యురుద్దాతా గౌతమో మునిః ।
విశ్వామిత్రో భవదోతా రామస్య విదితాత్మనః ॥
బ్రహ్మత్వమకరోత్తస్య మార్కండేయో మహామునిః ।
భరద్వాజాగ్నీవేశ్యాద్యా వేదవేదాంగపారగాః ॥
మునయశ్చక్రురన్యాని కర్మాణ్యన్యే యథాక్రమమ్ ।
పుత్రైః శిష్యైః ప్రశీష్యైశ్చ సహితో భగవాన్ భృగుః ॥
సాదస్యమకరోద్ఘాజన్నన్యైశ్చ మునిభిః సహ ।
స తైః సహాఖీలం కర్మ సమాప్య భృగుపుంగవః ॥
బ్రహ్మాణం పూజయామాస యథావద్దురుణా సహ ।
అలంకృత్య యథాన్యాయం కన్యాం రూపవతీం మహీమ్ ॥
పురస్రమశతో పేతాం సముద్రాంబరమాలినీం ।
ఆహూయ భృగుశార్దూలః సశైలవనకాననామ్ ॥
కాశ్యపాయ దదౌ సర్వామృతే తం శైలముత్తమమ్ ।
ఆత్మనః సన్నివాసార్థం తం రామం పర్యకల్పయత్ ॥
తతః ప్రభృతి రాజేంద్రః పూజయామాస శాస్త్రతః ।
హిరణ్యరత్నవస్త్రాశ్వగోగజాన్నొదిభీస్తథా ॥
పురా సమాప్య యజ్ఞాంతే తథా చావభృథాప్లుతః ।
చక్రే ద్రవ్యపరీత్యాగం తేషామనుమతే తదా ॥
దత్వా చ సర్వభూతానామభయం భృగునందనః ।
తత్రాపి పర్వతవరే తపశ్చర్తుం సమారభేత్ ॥
తతస్తం సమునుజ్జయ సదస్యా ఋత్విజస్తథా ।
యయుర్యథాగతం సర్వే మునయః శంసితవ్రతాః ॥
గతేషు తేషు భగవానకృతవ్రణసంయుతః ।
తపోమహత్సమాస్థాయ తత్రైవ వ్యవసత్సుఖీ ॥
కాశ్యపీతి తతోభూమిర్జననాథా హ్యనేకశః ।
సర్వదుఃఖప్రశాంత్యర్థం మారీచానుమతేన తు ॥
అతఁడు సర్వ సంభోరములను సమకూర్చెను. ఆతఁడు ఔర్వుఁడు విశ్వామిత్రుఁడు భరద్వాజుఁడు, మార్కండేయుఁడు మున్నగు వారితో కలిసి, వారి యనుమతితో కాశ్యపుని తన గురువుగా నిర్ణయించుకొని మహాక్రతువయిన వాజమేధమును రాముఁడొనర్చెను. (47) అందుచే అతనికి కాశ్యపుఁడధ్వర్యుఁడు, ఉద్గాత గౌతముఁడు, హోత విశ్వామిత్రుఁడును, నయిరి. మార్కండేయ మహాముని బ్రహ్మత్వము వహించెను. భరద్వాజుఁడు అగ్నివేశ్యుండు మున్నగు వేద వేదాంగ పొరగులు ఇతర కర్మలను యథాక్రమముగా నాచరించిరి. పుత్రులతో, శిష్యులతో, ప్రశిష్యులతో కూడి భగవానుఁడగు భృగుమహర్షి ఇతర మునులతో కలిసి “సాదస్య” మాచరించెను. (సాదస్యము - సదసత్పతిత్వము, క్రతువు నకాధ్యక్ష్యము). భృగు పుంగవుఁడు రాముఁడు వారలతో అఖిలమయిన యజ్ఞకర్మను సమాప్త మొనర్చెను. తరువాత గురునితో సహితము యజ్ఞ బ్రహ్మను పూజించెను. ఆచారము ననుసరించి, రూపవతియైన ఒక కన్యగా పృథ్వీని పురగ్రామ శతములతో, సముద్రాంబరమాలినీగా నలంకరించెను. భృగుశార్దూలుం డగు రాముఁడు సశైలకాననమయిన దానినీ తానుండుటకు నుత్తమ శైలమయిన మహేంద్ర పర్వతమును మాత్రము విడిచి, సర్వమును, కాశ్యపునకొసంగెను. రాముఁడు మహేంద్ర పర్వతమును ఆత్మ సన్నివాసము కొఱకు సంకల్పించుకొనెను. (54) తరువాత కాశ్యపుని శాస్త్ర విధి ననుసరించి రాముఁడు పూజించెను. హిరణ్యము, రత్నములు, వస్త్రములు అశ్వములు, గోవులు, గజములు మున్నగు వానిని సమర్పించి యజ్ఞాంతము నందు అవభృథ స్నానమాచరించెను. అంత ఆ మహామునుల అంగీకారముతో ద్రవ్య పరిత్యాగ మాచరించెను. భృగు నందనుఁడు సర్వభూతములకు అభయ ప్రదాన మొసంగెను. అచ్చట ఆ పర్వతశ్రేష్ఠము నందు తపస్సాచరింప ప్రారంభించేను. తరువాత సదస్యులు, ఋత్విజులు, శంసిత ప్రతులయిన మునీశ్వరులెల్లరు వచ్చిన విధముగా వెడలిపోయిరి. వారందరు వెడలగా భగవానుఁడయిన రాముఁడు అకృత ప్రణ సంయుతుడై మహా తపసితి పూని అందే సుఖముగా నుండెను. (59) అంత కాశ్యపియైన భూమి, తరువాత అనేక జననాథులతో కూడికొని సర్వదుఃఖ ప్రశాంత్యర్థము మారీచానుమతితో (కాశ్యపుని అంగీకృతితో)
తత్ర దీపప్రతిష్టాఖ్యవ్రతం విష్ణుముభోదితమ్ ।
చచార ధరణీ సమ్యక్ దుఃఖైర్ముక్తాభవచ్చ సా ॥
ఇత్యేష జామదగ్న్యస్య ప్రాదుర్భావ ఉదాహృతః ।
యస్మిృతే నరః సర్వపాతకైర్విప్రముచ్యతే ॥
ప్రభావః కార్తవీర్యస్య లోకే ప్రథితతేజసః ।
ప్రసంగాత్ కఠితః సమ్యఙ్నాతిసంక్షేపవిస్తరః ॥
ఏవం ప్రభావః స నృపః కార్తవీర్యో భవదువీ ।
న తాదృశః పుమాన్క ళ్చిద్భావీ భూలోధవా శ్రుతః ॥
దత్తాత్రేయద్వరం వక్రే మృతిముత్తమపూరుషాతి ।
యత్పురా సోగమన్ముక్తిం రణే రామేణ ఘాతితః ॥
తస్యాసేత్ పంచమః పుత్రః ప్రఖ్యాతో యో జయధ్వజః ।
పుత్రస్తస్య మహాబాహుస్తాలజంఘోభవన్వృప ॥
అభూతస్యాపి పుత్రాణాం శతముత్తమధన్వినామ్ ।
తాలజంఘాభిధా యేషాం వీతిహోత్రా గ్రజోతి భవత్ ॥
పుత్రాః స వీతిహోత్రాద్యైర్డెహయాద్యైశ్చ రాజధీః ।
కాలం మహాంతమవసద్ధిమాద్రివనగహ్వరే ॥
యః పూర్వం రామబాణీన ద్రవస్పృష్ఠీ భితాడితః ।
తాలజంఘాపతత్ భూమౌ మూర్చితో గాఢవేదనః ॥
దదర్శ వీతిహోత్రస్తం ద్రవన్ దైవవశాదివ ।
రథమార్ష్య వేగేన పలాయనపరో భవత్ ॥
తే తత్ర వ్యవసన్సర్వే హిమాద్రౌ భయపీడితాః ।
కృచ్ఛం మహాంతమాసాద్య శోకమూలఫలాశనః ॥
తతః శాంతిం గతే రామే తపస్యాసక్తమానసే ।
జాలజంఘః స్వకం రాజ్యం సపుత్రః ప్రత్యసద్యత ॥
సన్నివేశ్య పురీం భూయః పూర్వవనృపసత్తమః ।
వసంస్తదా నిజం రాజ్యమపాలయదరిందమః ॥
సపుత్రః సానుగబలః పూర్వవైరమనుస్మరన్ ।
అభ్యాయమౌ మహారాజ తాలజంఘః పురం తవ ॥
చతురంగబలోపేతః కంపయిన్నీవ మేదినీం ।
దురోదాభ్యేత్య నగరీమయోధ్యాం స మహీపతిః ॥
విష్ణుముఖోదీతము దీప ప్రతిష్ఠాఖ్య వ్రతము నాచరించెను. భూమి సర్వదుఃఖవిముక్తమయ్యెను. ఈ విధముగా జమదగ్ని కుమారుఁడయిన రాముని చరిత్ర చెప్పఁబడినది. దీనిని విన్నవారు సర్వపాపముల నుండి విముక్తులగుదురు. (62) కథా ప్రసంగవశమున లోకమున ప్రథిత తేజస్వియిన కార్తవీర్యునీ ప్రభావము, అంత సంక్షేపము విస్తరము కాకుండ వివరింపఁబడినది. ‘తత్సదృశ పురుషుడు పూర్వమందు లేడు అట్టివాఁడు భవిష్యత్కాలమున నుండదన్నంత కీర్తిని కార్యవీర్యుఁడు సంపాదించెను. పూర్వమాతఁడు ఉత్తమ పురుషుని చేతులలో మృతిని దత్తాత్రేయుని వలన వరముగా పొందియుండుటచే, రాముని వలన మరణము పొంది ముక్తిని గనెను. (65) ఆతనికి ఐదవ పుత్రుఁడు ప్రఖ్యాతుఁడు కలడు. అతఁడు జయధ్వజుఁడు. ఆ జయధ్వజునీ పుత్రుఁడు బాహువీర్యుఁడు తాలజంఘుఁడు. ఆతనికీ నూర్గురు కుమారులు. వారందరుత్తమధన్వులు. వారందరు తాలజంఘులను పేరింటి వారు. వారందరిలో అగ్రజుఁడు వీతిహోత్రుఁడు. ఆతఁడు వీతిహోత్రాదులతో చిరకాలము హిమాద్రి వనగహ్వరమున, హైహయాదులతో కూడీ వసించెను. పూర్వము రామునితో యుద్ధమాచరించి పలాయితుఁడగుచుండ పృష్టభాగమున రాముని బాణముచే గొట్టబడియతడధికమయిన వేదనతో భూమిపై మూర్ఛితుఁడై పడెను. దైవవశాత్ తాను గూడ పలాయితుం డగుచు అతనిని వీతిహోత్రుఁడు చూచెను. వెంటనే ఆతనిని రథముపై నెక్కించుకొని పలాయన పరుఁడయ్యెను. (70) వారందరు భయపీడితులై హిమాద్రి యందు వసించిరి. వారికెన్నియో ఆపదలు. వారికి శాకమూల ఫలములే యశనములయ్యెను. తరువాత రాముఁడు శాంతి నొంది, తపస్సు నందాసక్త మానసుఁడుకాగా, జాలజంఘుఁడు. సపుత్రయుతముగా స్వకీయమయిన రాజ్యమును పొందెను. (72) పూర్వమువలే తన నగరమును ప్రవేశించి ఆ నృపసత్తముఁడు అటనివసించి యరీందముఁడై తన రాజ్యమును పాలించేను. ఆతఁడు పుత్రయుతుఁడై అనుచరులతో సైన్యముతో పూర్వవైరమును స్మరించుచు, నీ పట్టణముపై దాడివెడలెను. చతురంగ బలోపేతుఁడై భూమిని వణికించుచున్నట్లు అయోధ్యకు దండెత్తి గట్టిగా నాదమొనర్చెను. (75)
తతో నిష్ర్కమ్య నగరాత్ఫల్గుతంత్రోపి తే పితా ।
యుయుధే తైర్నృపైః సర్వైర్వృదోపి తరుణో యథా ॥
నిహతానేకమాతంగతురంగరథసైనికః ।
శత్రుభిర్నిర్జితో వృద్ధః పలాయనపరో భవత్ ॥
త్యక్త్వా స నగరం రాజ్యం సకోశబలవాహనమ్ ।
అంతర్వత్యాచ తే మాత్రా సహితో వనమావిశత్ ॥
అత్ర చౌర్వాశ్రమో పాండే నివసన్ననీరాదివ ।
శోకామరసమావిష్ణో వృద్ధభావేన చ స్వయమ్ ॥
విలోక్యమానో మాత్రా తే బాష్పగధదకంఠయా ।
అనాథ ఇవ రాజేంద్ర స్వర్గలోకమీతోగతః ॥
తతస్తే జననీ రాజన్ దుఃఖశోకసమన్వితా ।
చితామారోపయద్భర్తూరుదతీ సా కలేవరమ్ ॥
అనశనాదీదుఃఖేన భర్తవ్యసనకర్శి ।
చకారాగ్నిప్రవేశాయ సుదృఢం మతిమాత్మనః ॥
ఔర్వస్తదఖిలం శ్రుత్వా స్వయమేవ మహామునిః ।
నీర్గత్య చాశ్రమార్తాం చ వారయన్నిదమబ్రవీత్ ॥
న మర్తవ్యం త్వయా రాజి సాంప్రతం జఠరే తవ ।
పుత్రస్తిద్ధతి సర్వేషాం ప్రవరశ్చక్రవర్తినామ్ ॥
ఇతి తద్వచనం శ్రుత్వా మాతా తవ మనస్వినీ ।
వీరరామ మృతేస్తాం తు మునిః స్వాశ్రమమానయత్ ।
తతః సా సర్వదుఃఖాని నియమ్య త్వన్ముఖాంబుజమ్ ॥
దిదృక్షురాశ్రమోపాంతే తస్యైవ నివసత్ సుఖమ్ ।
సుషావ చ తతః కాలే సా త్వామౌర్వాశ్రమేతదా ॥
జాతకర్మాదికం సర్వం భవతః సో కరోన్మునిః ।
ఔర్వాశ్రమే వివృద్ధశ్చ భవాన్ తేనానుకంపితః ॥
త్వయైవ విదితం సర్వమతఃపరమరిందమ ।
ఏవంప్రభావో నృపతీక కార్తవీర్యో భవదువి ॥
ప్రతస్యాస్య ప్రభావేన సర్వలోకేషు విశ్రుతః ।
యద్వంశజైర్జితో యుద్ధే పితా తే వనమాదిశత్ ॥
తద్వృత్తాంతమశేషేణ మయా తే సముదీరితమ్ ।
ఏతచ్చ సర్వమాఖ్యాతం వ్రతానాముత్తమం తవ ॥
నీ తండ్రి అల్పాధిక్యము గలియున్నను వెంటనే పురి బాహ్యమునకు వచ్చెను. ఆతఁడు వృద్ధుఁడయ్యును. ఆ రాజులందరీతో యువకుని వలె పోరాడెను. ఆతఁడు పెక్కు ఏనుగులను, గుఱ్ఱములను రథ సైనికులను చంపినను వృద్ధుఁడగుట శత్రువులచే కొట్టబడి పలాయితుం డయ్యెను. ఆతఁడు నగరమును రాజ్యమును సకశోక బలవాహనముగా త్యజించి, గర్భవతియైన నీ తల్లితో వనము ప్రవేశీంచెను. అచ్చట ఔర్వ మహర్షి ఆశ్రమ ప్రాంతమున నివసించెను. అచిరకాలములో శోకామర్ష సంయుతుఁడై స్వయముగా వృద్దుండగుటచే, కన్నీటిచే గద్దదిత కంఠయైన నీ తల్లిచే ఆదరింపఁబడుచు, అనాథునివలె రాజేంద్ర ! మరణించి స్వర్గతుఁడయ్యెను. (80) అంత నీతల్లి ‘ఓరాజా’ దుఃఖశోక సమన్వితయై విలపించుచు తన భర్తృకలేబరమును చితియందారోపించెను. భోజనము లేమిచే భర్త వ్యసనము వలని దుఃఖముచే నీరసించి, తాను చితిలో ప్రవేశించి మరణింప దృఢచిత్తురాలయ్యెను. ఔర్వమహర్షి ఆ వృత్తాంతము నంతటినివిని స్వయముగా తానే యాశ్రమము నుండి బయటికి వచ్చి ఆమెను తన్మరణ ప్రయత్నమునుండి వారించుచు, “ఓ రాణీ ! నీవు ఇప్పుడు మరణింపరాదు. నీ యుదరమున సర్వులకు చక్రవర్తియగు శ్రేషుఁ డు పుత్రుఁడున్నాఁడు”. అనెను. ఆ మహర్షి పలుకులు విని మనస్వినీయైన నీ జనని, మృతి నుండి విరమించెను. ఆ ముని యామెను తన యాశ్రమమునకు తీసికొని వెళ్లాను. అందు సర్వ దుఃఖములను అణచుకొని, నీ ముఖాంబుజమును చూచు కోరికతో ఆశ్రమోపాంతమున సుఖముగ నుండెను. అంత కొంత కాలమునకు ఔర్వాశ్రమమున ఆమే నీన్ను కనెను. నీకు జాతకర్మాదికములను ఆ ముని యాచరించెను. నీ ఈ వ్రత నౌర్వాశ్రమమున పెరిగితివి. నీ యందా మహర్షి అనుకంపాన్వితుఁడు. ఓ శత్రుందమా! మిగిలిన దంతయు నీవెజబుంగుదువు. ఈ విధముగా కార్తవీర్యుఁడు ప్రభావవంతుఁడు భూమియందాయెను. ప్రభావమున నతఁడు సర్వలోకముల యందు విశ్రుఁడయ్యెను. నీ తండ్రి ఆతని వారసులచే నోడింపఁబడెను, వనమునకు పలాయనము చేసెను. ఆ వృత్తాంతమంతయు సంపూర్ణముగ నీకు చెప్పితిని. ఇయ్యది సర్వము చెప్పబడినది. ఇది ఉత్తమమయిన వ్రతకథనము. (90)
సమంత్రతంత్రం లోకేషు సర్వలోకఫలప్రదమ్ ।
నహ్యస్య కర్తుర్నృపతేః పురుషార్థచతుష్టయే ॥
భవత్యభీప్సితం కించిద్దుర్లభం భువనత్రయే ।
సంక్షేపేణ మయాభ్యాతం వ్రతం హైహయభూభుజః ॥
జామదగ్న్యస్య చ మునేః కిమన్యత్కథయామి తే ।
జైమిని రువాచ :-
తతః స సగరో రాజా కృతాంజలిపుటో మునిమ్ ॥
ఉవాచ భగవన్నేతత్కర్తుమిచ్ఛామ్యహం వ్రతమ్ ।
సమ్యక్ త్వముపదేశేన తత్రానుజ్ఞాం ప్రయచ్ఛ మే ॥
కర్మణానేన విప్రరే కృతార్థోస్మి న సంశయః ।
ఇత్యుక్తస్తేన రాజ్ఞా తు తథోత్యుక్త్వా మహామునిః ॥
దీక్షయామాస రాజానం శాస్తోకేనైవ వర్మనా ।
స దీక్షితో వసిష్ఠన సగరో రాజసత్తమః ॥
ద్రవ్యాన్యానీయ విధివత్ర్పచచార శుభవ్రతమ్ ।
పూజయిత్వా జగన్నాథం విధినా తేన పార్థివః ॥
సమాప్య చ యథాయోగ్యమనుజ్ఞాయ గురుం తతః ।
ప్రతిజ్జామకరోద్రజా వ్రతమేతదనుత్తమమ్ ॥
ఆజీవాంతం ధరిష్యామి యత్నేనేతి మహామతిః ।
అధానుజ్ఞాప్య రాజానం పసిష్టో భగవాన్ ఋషిః ॥
సన్నివర్త్యానుగచ్ఛంతం ప్రజగామ నిజాశ్రమమ్ ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే సగరోపాఖ్యానే వసిష్టాగమనం నామ సప్తచత్వారింశత్తమోధ్యాయః ॥
మంత్ర తంత్రములతో నీ పవిత్ర కథ చెప్పఁబడినది. ఇది సర్వలోక ఫలప్రదము. ఎవ్వడీ పవిత్రక్రియ ఆచరించునో చతుర్విధ పురుషార్థముల యందు కోరిక యుండదు, అయ్యది పురుషార్థ సాధనము కష్టతరమయినను సులభముగా సంపన్నమగును. ఓ హైహయభూభుజ! ఈ వ్రతము సంక్షేపముగా చెప్పితిని. జామదగ్ని చరితము చెప్పితిని. ఇంకేమి చెప్పవలయును?
జైమిని ఇట్లనెను.
అంత, సగరుఁడు చేతులు జోడించి మునివర్యునితో “భగవన్ ఏతద్ర్వతమును నేను చేయగోరుచున్నాను. నాకు ఉపదేశింపుఁడు, అనుజ్ఞను ప్రసాదింపుఁడు. ఈ పవిత్ర కర్మచే ఓ విప్రర్షి! నేను నిస్సంశయమున కృతార్థుఁడనయితిని” అనెను. ఇట్లు రాజు చెప్పగా! అట్లే యని మహాముని, శాస్తోక్తమయిన వీధీ విధానమున రాజును దీక్షితుని చేసెను. రాజ సత్తముఁడయిన సగరుండు వసిష్ణునిచే దీక్షితుఁడయి ద్రవ్యములను తీసికొనివచ్చి ఆ శుభవ్రతమును వీధివత్ ఆచరించెను. విధవంతముగా. జగన్నాథుని పూజించి రాజు గురువర్యునీ ఆజ్ఞను స్వీకరించి యథాయోగ్యముగా వ్రతమును సమాప్తము చేసెను. “నా జీవితాంతమీ మహావ్రతము ఆచరించేదను.” అనీ మహామతియైన రాజు ప్రతీన పూనెను. వసిష్ఠ మహర్షి ఆశ్రమమునుండి రాజును తిరిగి యరుగ నాజ్ఞాపించి నిజాశ్రమమునకు వెడలెను.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహాపురాణమున మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున సగరోపాఖ్యానమున వసిష్టాగమనమను నలుబది యేడవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 85 of the Brahmānda Mahā Purana is as follows:
Returning to the royal chronicles of the Lunar Dynasty, this chapter details the expanding lineages of Yayāti's other noble sons: Turvasu, Druhyu, Anu, and Puru. It traces their migrations, the kingdoms they established, and how their descendants spread sacred culture across various regions of the world. The devout reader observes the vast, unfolding plan of providence, weaving diverse nations into the grand tapestry of human history.