37 - చాక్షుష మన్వంతరము -వైవస్వత మనువువంశము

సూత ఉవాచ :

ఆసీదిహ సముద్రాంతా వసుధేతి యథాశ్రుతమ్

వసు ధత్తే యతస్తస్మాద్వసుధా సేతి గీయతే

మధుకైటభయోః పూర్వం మేదసా సంపరి ప్లుతా

 తేనేయం మేదినీత్యుక్తా నిరుక్త్యా బ్రహ్మవాదీఖీః

తతోఽభ్యుపగమాద్రాజ్ఞః పృథోర్వైన్యస్య ధీమతః

దుహితృత్వమనుప్రాప్తా పృథివీ పఠ్యతే తతః

పృథునా ప్రవిభోగశ్చ ధరాయాః సాధితః పురా

తస్యాకరవతీ రాజ్ఞః పత్తనాకరమాలినీ

చాతుర్వర్ణ్యసమాకీర్ణా రక్షితా తేన ధీమతా

ఏవం ప్రభావో రాజాఽసీ ద్వైన్యః స ద్విజసత్తమాః

సమస్యశ్చైవ పూజ్యశ్చ భూతగ్రామేణ సర్వశః.

బ్రాహ్మణైశ్చ మహాభాగే ర్వేదవేదాంగపారగైః

పృథురేవ నమస్కార్యో బ్రహ్మయోనిః సనాతనః

పార్ధివైశ్చ మహాభాగైః ప్రార్థయదీర్మహద్యశ

ఆదిరాజో నమస్కార్యః పృథుర్వైన్యః ప్రతాపవాన్

యోథైరపి చ సంగ్రామే ప్రాప్తుకామైర్జయం యుధి

ఆదికర్తా రణానాం వై నమస్యః పృథురేవ హి

యే హి యోద్ధా రణం యాతి కీర్తయిత్వా పృథుం నృపమ్

స ఘోరరూపాత్సంగ్రామాత్ క్షేమీ తరతి కీర్తిమాన్

వైశ్యైరపి చ రాజర్షి ర్వైశ్యవృత్తిమీహా స్థితైః

పృథురేవ నమస్కార్యో వృత్తిదావాన్మహాయశాః

ఏతే వత్సవిశేషాశ్చ దోగ్ధారః క్షీరమేవ చ

సూతుఁడిట్లు చెప్పెను :

సంప్రదాయ కథనము ననుసరించి, వసుంధర సముద్రము అంతముగా వ్యాపించి యున్నది. వస్తువును (బంగారమును) కలిగి యుండుటచే వసుధయని కీర్తింపబడినది. (వసుధత్తేయతః తస్మాత్) పూర్వము మధుకైటభులను రాక్షసుల (మేదస్సు) కొవ్వుచే వసుంధర సంపరిప్లుతమై యుండెను. అందుచేతనే శబ్దవృత్తిని బట్టి బ్రహ్మవాదులు దీనిని 'మేదిని' యనిరి. తరువాత ధీమంతుఁడు వైన్యుఁడు నయిన పృథుమహారాజు యొక్క దుహితృత్వ ప్రాప్తి పొందిన వేనుక ‘పృథ్వి’ యని పిలువబడినది. పూర్వమందు భూమియొక్క విభజనము కూడ పృథువుచే సాధీంపం బడినది. పట్టణముల యొక్క పరంపరను, సహజమయిన ఖనుల సముదాయమును కలిగి యొప్పిన పృథ్వి, చాతుర్వర్య సమాకీర్ఘమైన పృథ్వి, ధీమంతుఁడయిన పృథువుచే రక్షింపఁబడెను. ఓ ద్విజసత్తములారా ! ఏవం విధమయిన ప్రభావము గలిగిన వాఁడు వేనుని కుమారుఁడైన పృథు మహారాజు. ఆతఁడు సర్వభూత సముదాయముచే నమస్కరింపఁదగినవాఁడు, పూజ్యుఁడు. మహాభాగులు, వేదవేదాంగ పారగులు, అయిన  బ్రాహ్మణులచే పృథు మహారాజు నమస్కారారుండు, ఆతఁడు బ్రహ్మయోని. సనాతనుఁడు, ఆది రాజయి ప్రతాపవంతుఁడైన పృథువు, వైన్యుఁడైన పృథువు మహభాగులైన పార్థివులచే, మహా యశస్కులచే నమస్కారారుఁడు. యుద్దము నందు విజయమును కాంక్షించు, యోధులచే, రణవిద్యకాధికర్తమయిన పృథువు నమస్కరింప నరుఁడు. పృథు మహారాజును కీర్తించి యెవఁడు యుద్ధమున కరుగునో, భయంకర యుద్ధము నుండి ఆతఁడు సురక్షితముగ వచ్చును. కీర్తి గడించును బహుయశస్వియైన పృథురాజర్షి, వైశ్యవృత్తియందున్న వైశ్యులచే నమస్కరింపబడ యోగ్యుడు ఏలయన ఆ పృథువు వారలకు వృత్తిని ప్రసాదించిన మహాయశస్వి. ఈ విధముగా విభిన్నమైనట్టి దూడలు, దోగ్ధలు, క్షీరము, విశేషముగా నాచే వర్ణింపబడిరి.

పాత్రాణి చ మయోక్తాని సర్వాణ్యేవ యథాక్రమమ్

బ్రహ్మణా ప్రథమందుగ్ధా పురా పృధ్వీ మహాత్మనా

వాయుం కృత్వా తథా వత్సం బీజాని వసుధాతలే

తతః స్వాయంభువే పూర్వం తదా మన్వంతరే పునః

వత్సం స్వాయంభువం కృత్వా సర్వసస్యాని చైవ హి

 తతః స్వారోచిషే వాపి ప్రాప్తే మన్వంతరేఽధునా

వత్సం స్వారోచిషం కృత్వా దుగ్ధా సస్యాని మేదినీ

ఉత్తమేన తు తేనాపి దుగ్ధా దేవానుజేన తు

మనుం కృత్వోత్తమం వత్సం సర్వసస్యాని ధీమతా

పునశ్చ పంచమే పృథ్వీ తామసస్యాంతరే మనోః

దుగ్ధేయం తామసం వత్సం కృత్వా వై బలబంధునా

చారిష్టవస్య వై షష్ఠే సంప్రాప్తే చాంతరే మనోః

దుగ్ధా మహీ పురాణేన వత్సం చారిష్టవం ప్రతి

చాక్షుషే చాపి సంప్రాప్తే తదా మన్వంతరే పునః

దుగ్ధా మహీ పురాణేన వత్సర కృత్వా తు చాక్షుషమ్

చాక్షుషస్యాంతరేఽతీతే ప్రాప్తే వైవస్వతే పునః

వైన్యేనేయం పురా దుగ్ధా యథా తే కథితం మయా

ఏతైర్దుగ్ధా పురా పృథ్వీ వ్యతీతేష్వంతరేషు వై

దేవాదిభిర్మనుష్యైశ్చ తతో భూతాదిభిశ్చ హ

ఏవం సర్వేషు విజ్ఞేయా అతీతానగతేష్వాహ

దేవా మన్వంతరే స్వస్థాః పృథోస్తు శ్రుణుత ప్రజాః

 పృథోశ్చ పుత్త్రౌ విక్రాంతా జజ్ఞాతేoఽతర్దీపావనౌ

శిఖండినీ హవీర్ధానమంతర్ధానాద్వ్యజాయత

హవిర్ధానాత్ షడాగ్నేయీ ధిషణా జనయత్సుతాన్

పాత్రలు సర్వము యథాక్రమము వర్ణింపబడినవి. ప్రథమముగా వసుంధర మహాత్ముఁడైన బ్రహ్మచే, వాయువును వత్సముగా చేసి, పీదుకంబడెను. వసుధాతలమున క్షీరోత్పత్తికి బీజములు నాటఁబడినవి. తరువాత స్వాయంభువ మన్వంతరమున స్వాయంభువ మనువును వత్సముగా చేసి వసుంధర పొలు పిదుకఁబడెను. మేదిని సస్యములు కురిసెను. వృక్ష బీజములు క్షీరములాయెను. ఉత్తమ మన్వంతరమున మేదినీ దేవానుజునిచే మనువును ఉత్తమవత్సముగా జేసి సర్వసస్యములు పిదుకఁబడెను. తామస మన్వంతరమయిన యేదవ మన్వంతరమున బలబంధువు తామసుని వత్సముగాఁజేసి వసుంధరను పీదికెను. చారిష్టవుని ఆరవ మన్వంతరము సంప్రాప్తముకాగా భూమీ పురాణునిచే చారిష్టవునీ వత్సముగాజేసి పాలుబిందుకంబడెను. చాక్షుష మన్వంతరము సంప్రాప్తముకాగా, చాక్షుషుని వత్సముగా చేసి పురాణుఁడు భూమిని పాలం బిదికెను. చాక్షుష మన్వంతరము గడచిపోగా వైవస్వత మన్వంతరము ప్రవేశింప భూమి వేనుని కుమారునిచే పాలఁబిదుకఁబడెను. ఎట్టులాతండా మేదినీని పొలఁబీదికెనో ఇంతకుం భూర్వము మీకు వివరించియుంటిని. ఈ విధముగా భూమీ మన్వంతరములు పిదుకంబడినది. దేవాదులు, భూతాదులు, మానవులు, కూడ పిరికిరి. ఇట్లే జరిగి పోయిన మన్వంతరముల యందు రానున్న మన్వంతరము యందు, జరిగినదని జరుగునని గ్రహింపవలయును. దేవతలు మన్వంతరమంతయు స్వర్గమున నీవసింతురు. ఇక పృథునీ సంతానమును గూర్చి వినుఁడు. ప్రతాపవంతులైన ఇరువురు పుత్రులు పృథువునకు కలిగిరి. వారీరువురు 1.అంతర్ధి 2. పావనుఁడు. శిఖండిని అంతర్జానునీ వలన హవిర్టానుని గనెను. అగ్నియొక్క కూతురయిన ధిషణ (ఆగ్నేయో) హవిర్జానునీ వలన ఆణుగురు పుత్రులం గనెను.

ప్రాచీనబర్హిషం శుక్లం గయం కృష్ణం ప్రజాజీనౌ

ప్రాచీనబర్షీర్భగవాన్ మహానాసీత్ర్పజాపతిః

బలశ్రుతతపోవీర్యైః పృథివ్యామేకరాడసౌ

ప్రాచీనాగ్రాః కుశాస్తస్య తస్మాత్ప్రాచీనబర్హ్యసౌ

సముద్రతనయాయాం తు కృతధారః స వై ప్రభుః

మహతస్తపసః పారే సవర్ణాయాం ప్రజాపతిః

సవర్ణాఃఽధత్త సాముద్రీ దశ ప్రాచీనబర్హిష

సర్వాన్ ప్రచేతసో నామ ధనుర్వేదస్య పారగాన్

అపృథగ్ధర్మచరణాస్తేఽతప్యంత మహత్తపః

 దశవర్షసహస్రాణి సముద్రసలిలేశయాః

తపశ్చ తేషు పృథివీం తష్యత్స్వథ మహీరుహాః

అరక్ష్యమాణామావబ్రుర్బభూవాథ ప్రజాక్షయః

ప్రత్యాహృతే తదా తస్మింశ్చాక్షుషస్యాంతరే మనోః

నాశకన్మారుతో వాతుం వృత్తం ఖమభవద్దృమైః

దశవర్షసహస్రాణి న శేకుః చేష్టితుం ప్రజాః

తదుపశ్రుత్య తపసా సర్వే యుక్తాః ప్రచేతసః

ముఖేభ్యో వాయుమగ్నిం చ ససృజుర్జాతమన్యవః

ఉన్మూలానథ వృక్షాంస్తాస్ కృత్వా వాయురశోషయత్

తానగ్నిరదహద్ఘోర ఏవమాసీత్ ద్రుమక్షయః

ద్రుమక్షయమథో బుద్ద్వా కించిచ్ఛిష్టేషు శాఖీషు

ఉపగమ్యాబ్రవీదేతాన్రాజా సోమః ప్రచేతసః

దృష్ట్యా ప్రయోజనం సత్యం లోక సంతానకారణాత్

కోపం త్యజత రాజానః సర్వే ప్రాచీనబర్హిషః

వృక్షాః క్షిత్యాం జనిష్యంతి శామ్యతామగ్నిమారుతౌ

ఆ యాలుగురు ప్రాచీనబరీ, శుక్లుఁడు, గయుఁడు, కృష్ణుఁడు, వ్రజ, అజీనుఁడు. ప్రాచీనబర్హి గొప్ప ప్రజాపతి. (ప్రజానాం భర్తా, పాలకః) బలముచే, పాండిత్యము, తపస్సుచే, వీర్యముచే ఆతఁడు పృథివీ యంతటికీ నేకైక చక్రవర్తి. ఆతని దర్భల యగ్రములు తూర్పున కభీముఖముగా నుండుటచే నాతండు ప్రాచీనబర్హి యయ్యెను. గొప్ప తపస్సు యొక్క అనంతరము, ఆ ప్రజాపతి సముద్ర తనయయైన “సవర్ణను వివాహమాడెను. సముద్ర తనయయైన సవర్ణ, ప్రాచీనబర్షికి పదిమంది పుత్రులంగనెను. వారందరు ధనుర్వేదము యొక్క పారమును చూచినవారు. పొరల నందరను ప్రాచేతసులందురు. వారందరు కలిసి యుండిరి. ధర్మకార్యముల వీడివడకయే ఆచరించిరి. సముద్ర జలములలో పరుండి వారు పది సంవత్సరములు తీవ్రమయిన తపమాచరించిరి. వారు తపస్సు చేయుచుండ, వృక్షములు (మహీ మహములు) అరక్ష్యమాణమయిన పృథివి నంతటినీ ఆవరించెను. అప్పుడు ప్రజాక్షయమయ్యెను. ఇది చాక్షుష మన్వంత రానంతరము జరిగినది. సర్వప్రపంచము వృక్షమయమయ్యెను. (ఆ వృక్ష సంతతి యొక్క సాంద్రతచే) అప్పుడు వాయువు వీచుటకశక్తుఁ డయ్యెను. ఆకాశము కూడ వృక్షమయమయ్యెను. అంత, పదివేల సంవత్సరములు ప్రజలు తమ కార్యములను నిర్వహింప నశక్తులైరి. దీనిని విని, తపో యుక్తులైన ప్రచేతసులు కోపమూనీరి. వారు తమ ముఖముల నుండి వాయువును అగ్నిని సృజించిరి. వాయువు వృక్షముల వ్రేళ్లతో పెరికి పారవైచెను. అగ్ని పోనిని దగ్గపటల మొనర్చెను. అగ్ని వృక్షముల దహించెను. అందుచే ఘోరమయిన వృక్ష క్షయమయ్యెను. వృక్షముల యొక్క నాశనమును తెలిసికొని, ఇంకను కొన్ని చెట్లు నశింపక యుండ, సోమ ప్రభువు (చంద్రుఁడు) ప్రచేతసులజేరి ఇట్లనెను. ఓ ప్రచేతసుని కుమారులారా, రాజులారా! ప్రయోజనము సాధింపఁబడుట చూచిన మీరు కోపమును త్యజింపుఁడు. వృక్షములు భూమి యందు పుట్టగలవు అగ్ని మారుతములు శాంతించుదురుగాక.

రత్నభృతా చ కన్యేయం వృక్షాణాం వరవర్ణినీ

భవిష్యజ్జానతా హ్యేషా ధృతా గర్భేణ వై మయా

మారిషా నామ నామ్నైషా వృక్షైరేవ వినిర్మితా

భార్యా భవతు వో హ్యేషా సోమగర్భా వివర్ధితా

యుష్మాకం తేజసాఽర్ధేన మమచార్ధేన తేజసా

అస్యాముత్పత్స్యతే విద్వాన్ దక్షో నామ ప్రజాపతిః

స ఇమం దగ్ధభూయిష్ఠం యుష్మత్తేజోమయేన వై

అగ్నినాఽగ్నిసమో భూయః ప్రజాః సంవర్థయిష్యతి

తతః సోమస్య వచనాజ్జగృహుస్తే ప్రచేతసః

సంహృత్య కోపం వృక్షేభ్యః పత్నీం ధర్మేణ మారిషామ్

మారిషాయాం తతస్తే వై మనసా గర్భమాదధుః

దశభ్యస్తు ప్రచేతోభ్యో మారిషాయాం ప్రజాపతిః

దక్షో జజ్ఞే మహాతేజాః సోమస్యాంశేన వీర్యవాన్

అసృజన్ మనసార్వాదౌ ప్రజా దక్షోఽథ మైథునాత్

అచరాంశ్చ చరాంశ్చైవ ద్విపదోఽథ చతుష్పదః

విసృజ్య మనసా దక్షః పశ్చాదసృజత స్త్రియః

దదౌ స దశ ధర్మాయ కశ్యపాయ త్రయోదశ

కాలస్య నయనే యుక్తాః సప్తవింశతిమిందవే

ఏభ్యో దత్త్వా తతోఽన్యా వై చతస్రోఽరిష్టనేమినే

ద్వే చైవ బహుపుత్రాయ ద్వే చైవాంగిరసే తథా

కన్యామేకాం కృశాశ్వాయ తేభ్యోఽపత్యం బభూవ హ

అంతరం చాక్షుసస్యాథ మనోః షష్ఠం తు గీయతే

మనోర్వైవస్వతస్యాపి సప్తమస్య ప్రజాపతేః

వసుదేవాః ఖగా గావో నాగా దితిజదానవాః

సుందరమైన ముఖము కలిగిన ఈమె వృక్షముల యొక్క కూతురు. ఈమె సర్వ స్త్రీ లోకమునకుఁ దలమానిక మయ్యెను. నేను భవిష్యత్ జ్ఞానము కలిగి యుండుటచే గర్భమున నీమెను భరించితిని. ఆమె నామము మారీష. ఈమె వృక్షముల చేతనే సృష్టింపబడినది. సోమునీ గర్భమున వివర్ణితమైన యీమె నీకు భార్య యగును. మీ తేజస్సు యొక్క సగభాగము చేతను, నా తేజస్సు యొక్క అర్థ భాగము చేతను, విద్వాంసుఁడయిన దక్షుండను ప్రజాపతి యామెకు కలుగును. ఈతడు అగ్నితో సమానుఁడు. మీ మీ తేజోమయుడైన యగ్నితో సుమారు దగ్గపటలమయిన ఈ ప్రజలను ఈ దక్షుఁడు పోషించి సంవర్ధనము చేయును, అంత సోముని యొక్క వాక్యప్రేరణమున ఆప్రచేతసులు తమ కోపమును నిగ్రహించుకొనిరి. ధర్మానుగుణముగ వృక్షముల నుండి మారిషను తమ భార్యగా పరిణయమాడిరి. అంత వారు మనసా మారిషను గర్భవతిగా నొనర్చిరి, ప్రజాపతియైన దక్షుఁడు పదిమంది ప్రచేతసులకును పుత్రుఁడుగా మారిష యందు జన్మించెను. దక్షుండు సోముని యంశమున జనన మొందుటచే వీర్యవంతుఁడు, మహాతేజస్వి, దక్షుండు ఆరంభమున మానసికముగా సృజించెను. తరువాత మైథునముచే సృజించెను. భార్యా సంగమముచే, మానసికముగా చరాచరములను, ద్విపదులను చతుష్పదులను: వృష్టించిన పిమ్మట, దక్షుఁడు స్త్రీలను సృష్టించెను ఆతఁడు. పదుగుండ్రను ధర్మునకొసంగెను కశ్యపునకు వధీమగులనణ, ఇరువది యేడుగురు కూతుండ్రను చంద్రువకు కాలగమనమున కనుకూల మగునట్లు ఒసంగెను. తరువాత మరీ నలుగురను దక్షుండు. అరిష్టనేమీ కొసంగేను, ఇషుపుత్రున కిర్వురను, అంగీరసునకు ఇరువుర కూతుల నొసంగెను. ఆతఁడు కృశాశ్వునకోక కూతునొసంగెను, వారికి బిడ్డలు పుట్టిది, తరువాత నీయ్యది ఆరవ. చాక్షుష మన్వంతరముగా కీర్తింపఁబడినది. సప్తమ ప్రజాపతియైన వైవస్వత మనువునకు వస్తువులు దేవతలు, పక్షులు, ఆవులు, సర్పములు (నాగులు) దైత్యలు, దానవులు.

గంధర్వాప్సరసశ్చైవ జజ్ఞిరేఽన్యాశ్చ జాతయః

తతః ప్రభృతి లోకేఽస్మిన్ ప్రజాః మైథునసంభవాః

సంకల్పాద్దర్శనాత్పర్మాత్పూర్వాసాం సృష్టిరుచ్యతే

ఋషి రువాచ :

దేవానాం దాసవానాం చ దేవర్షీణాం చ తే శుభః

సంభవః కథితః పూర్వం దక్షస్య చ మహాత్మనః

ప్రాణాత్ప్రజాపతేర్జన్మ దక్షస్య కథితం త్వయా

కథం ప్రాచేతసత్వం చ పునర్లేభే మహాతపాః

ఏతం నః సంశయం సూత వ్యాఖ్యాతుం త్వమిహార్హసి

దౌహిత్రశ్చైవ సోమస్య కథం శ్వశురతాం గతః

సూత ఉవాచ :

ఉత్పత్తిశ్చ నీరోధశ్చ నిత్యం భూతేషు సత్తమాః

దుషయోఽత్ర న ముహ్యంతి విద్యావంతశ్చ యే జనాః

యుగే యుగే భవంత్యేతే సర్వే దక్షాదయో ద్వీజః

పునశ్చైవ నీరుధ్యంతే విద్వాంస్తత్ర నముహ్యతి

జ్యేష్ఠ్యకానిష్ఠ్యమప్యేషాం పూర్వ మాసిద్ద్విజోత్తమాః

తప ఏవ గరీయోఽ భూత్ర్పభావశ్చైవ కారణమ్

 ఇమాం విసృష్టిం యో వేద చాక్షుషస్య చరాచరమ్

ప్రజావాన్ ఆయుషస్తీర్ణ: స్వర్గలోకే మహీయతే

ఏవం సర్గః సమాఖ్యాతశ్చాక్షుషస్య సమాసతః

ఇత్యేతే షట్ నిసర్గాశ్చ క్రాంతా మన్వంతరాత్మకాః

స్వాయం భువాద్యాః సంక్షేపాచ్చాక్షుషాంతా యథాక్రమమ్

ఏతే సర్గా యథా ప్రాజ్ఞైః ప్రోక్తా యే ద్విజసత్తమాః

గంధర్వులు, అప్సరలు, వారీతోపాటు ఇతర జాతులు పుట్టిరి. అది మొదలు లోకమున జలు మైథునసంభవులు. పూర్వము సృష్టి సంకల్పముచే, దర్శనముచే, స్పర్శచే జరిగినదనీ చెప్పుదురు. ఋషి అడిగేను. పూర్వము దేవతల యొక్క దానవుల యొక్క దేవరుల యొక్క మహాత్ముఁడయిన దక్షుని యొక్క సంభవ ప్రకారము నీవు చెప్పితివి. బ్రహ్మయొక్క ప్రాణము నుండి, దక్షుని యొక్క జన్మమును గూర్చి చెప్పితివి మహా తపస్వియైన దక్షుండు మరల ప్రచేతసునీ కుమారస్థితినీ ఎట్లు పొందెను? ఓ సూత ! నీవు సంశయనివారణ చేయుటకు అరుఁడవు. అతం డో సోముని యొక్క కూతురు కొడుకు. (దౌహిత్రుఁడు) గదా ! ఆతఁడెట్లు శ్వశురత్వమును పొందగలిగెను? సూతుఁడిట్లు పలికెను.ఓ పూజ్యులారా! ఉత్పత్తి ప్రలయములు నిత్యము (జీవకోటి యందు) భూతముల యందు జరుగుచుండును. ఋషీశ్వరులు విద్యావంతులయిన జనము లీ విషయమున తెలివి తక్కువగా కలవరపాటుపడరు. ఓ బ్రాహ్మణులారా ! ప్రతీ యుగము నందు దక్షుడు మొదలయిన వారు కలుగుచుందురు. మరల ప్రలయము నొందుచుందురు. విద్వాంసులీ విషయమున భ్రాంతి చెందరు. ఓ ద్విజోత్తములారా ! పొరలలో జ్యేష్ఠత్వము, కనిష్ఠికత్వము పూర్వముండెను. తప మొక్మటీయే గరీయము. దానికి వారి ప్రభావము కారణము. చరాచర సంబంధమైన చాక్షుష సృష్టిం డెలిసినవాఁడు, ప్రజావంతుఁడు, ఆయుః కాలము నతిక్రమించినవాఁడు అగును. మరణానంతరము స్వర్గమున గౌరవమును పొందును. సంక్షిప్తముగా నీ విధమున చాక్షుష సృష్టి వివరింపబడినది. ఈ విధముగా మన్వంతరాత్మకములు, స్వాయంభువ మనువుతో నారంభించీ చాక్షుష మన్వంతరము వరకు యథాక్రమము షట్ సర్గములు సంక్షిప్తముగా చెప్పబడినవి. ఈ సృష్టి క్రమములు ఉత్తమములు ప్రాజ్ఞులునయిన బ్రాహ్మణులచే చెప్పఁ బడిన విధానమున వివరింపఁబడినవి.

వైవస్వతనిసర్గేణ తేషాం జ్ఞేయస్తు విస్తరః

అస్యూనానతరిక్తాస్తే సర్వే సర్గాః వివస్వతః

ఆరోగ్యాయుఃప్రమాణేభ్యో ధర్మతః కామతోఽర్థతః

ఏతానేవ గుణానేతి యః పఠన్ననసూయకః

వైవస్వతస్య వక్ష్యామి సాంప్రతస్య మహాత్మనః

సమాసవ్యాసతః సర్గం బ్రువతో మే నిబోధత

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్షే పూర్వభాగే ద్వితీయేఽనుషంగపాడే

చాక్షుష సర్గ వర్ణనం నామ సపత్రింశత్తమోఽధ్యాయః

వైవస్వత మన్వంతరమున వారి సృష్టి క్రమము విస్తరముగా గ్రహింఫసగును. వివస్వంతుని యొక్క యీ సర్గములు (సృష్టులు) అన్నీయును తక్కువలు. ఎక్కువ {5:8). ఇవి ఆరోగ్యము, ఆయుః ప్రమాణము, ధర్మము, అర్థము మున్నగు వానిలో లేనివీ సమానములు. అపూయా రహితుఁ డై వీనినెవడు చదుపునో ఆతఁడు ఈ ఉత్తమ గుణములను పొందును. ఇక, మహాత్ముడు ప్రస్తుత మనువు, అయిన వైవస్వతుని గూర్చి సంక్షిప్తముగాను, వివరముగాను చేప్పెదను. నేను వివరించుచుండ మీరు గ్రహింపుఁడు.

ఇది మహాపురాణము, వాయుప్రోక్తమునయిన బ్రహ్మాండపురాణమున పూర్వభాగమున ద్వితీయానుషంగపాదమున చాక్షుష సర్గ వర్ణన మనంబడు ముప్పదియేడవ అధ్యాయము.