31 - చతుర్యుగాఖ్యానము - వర్ణములు  - జీవిత విధానము

31 - చతుర్యుగాఖ్యానము - వర్ణములు  - జీవిత విధానము

సూత ఉవాచ :-

అత ఊర్థ్వం ప్రవక్ష్యామీ ద్వాపరస్య విధిం పునః

తత్ర త్రేతాయుగే క్షీణే ద్వాపరం ప్రతిపద్యతే

ద్వాపరాదౌ ప్రజానాం తు సిద్ధిస్త్రేతాయుగే తు యా

పరివృత్తేయుగే తస్మింస్తతస్తాభిః ప్రణశ్యతి

తతః ప్రవర్తతే తాసాం ప్రజాసాం ద్వాపరే పునః

సంభోదశ్చైవ వర్ణానాం కార్యాణాం చ విపర్యయః

యజ్ఞావధారణం దండో మదో దంభః క్షమా బలమ్

ఏషా రజస్తమోయుక్తా ప్రవృత్తిర్ద్వాపరే స్మృతా

ఆద్యే కృతే యో ధర్మోఽ స్తి స త్రేతాయాం ప్రవర్తతే

ద్వాపరే వ్యాకులీభూత్వా ప్రణశ్యతి కలౌయుగే

వర్ణానాం విపరిధ్వంసః సంకీయత తథాశ్రమాః

ద్వైవిధ్యం ప్రతిపద్యేతే యుగే తస్మిఞ్తిస్మృతీ

ద్వైధాత్తథా శ్రుతిస్మృత్యోర్నీశ్చయో నాధీగమ్యతే

అనీశ్చయాధిగమనార్ధర్మతత్వం న విద్యతే

ధర్మాసత్త్వేన మిత్రాణాం మతిభేదో భవేన్నృణాం

పరస్పరవిభిన్నైస్స్తైర్దృష్టీనాం విభ్రమేణ చ

అయం ధర్మోహ్యయం నేత నిశ్చయో సాధీగమ్యతే

కారణానాం చ వైకల్ప్యాత్కార్యాణాం చాప్యనీశ్చయాత్

మతిభేదేన తేషాం వై దృష్టిసాం విభ్రమో భవేత్

తతో దృష్టివిభిన్నైస్తు కృతం శాస్త్రకులం త్విదమ్

సూతుఁడిట్లు చెప్పెను.

ఇంక ముందు మరల ద్వాపరము యొక్క వీధినీ (స్థితిని) చెప్పెదను. త్రేతాయుగము గతింపగా ద్వాపరయుగ మారంభమగును.(1) త్రేతాయుగమున ఎట్టి సిద్దీని ప్రజలు పొందిరో, అయ్యది ప్రజలతో సహా నష్టమగును. ద్వాపరాదీలో (యుగము మారగా) (2) ద్వాపరము నందు మరల ఆ ప్రజలలో వర్ణముల కలకలుపు, సంకరము కలుగును. సర్వ కార్య కలాపములు విపరీతత్వము నొందును. (3) ద్వాపర యుగమున ప్రవృత్తి (కార్యకలాపములు) రజస్తమోగుణయుక్తము అందుచే యజ్ఞ ప్రాధాన్యము, న్యాయ పాలనము, మదము, దంభము, క్షమ, బలములు ఇదీ రజస్తమములతో గూడిన ద్వాపరము నందలి ప్రవృత్తిగా జెప్పబడినది. [4). మొదట కృతయుగమున సంస్థితమై యున్న ధర్మము, త్రేతాయుగమున కూడ ప్రవర్తించును. ద్వాపర యుగమున ధర్మము అధికముగా వ్యాకులీ భూతమయి, పరిణమించి, కలియుగమున పూర్ణముగా నశించును. (5) ఆ యుగమున వర్ణములకు పూర్ణ విధ్వంసము కలుగును. అట్లే ఆశ్రమ చతుష్టయము ఒకదానితో నొకటి కలిసి సంకీర్ణత్వము చెందును. ఆ యుగమున శ్రుతి స్కృతులకు మధ్య విరోధము ద్వైవిధ్యము కలుగును. (6) శ్రుతి స్మృతుల ద్వైవిధ్యముచే నిశ్చయ మొందుటకు వీలులేదయ్యెను. అనిశ్చయత్వము యొక్క ప్రాబల్యముచే ధర్మతత్వమున ఇదమిత్థమను నిశ్చయత్వము లేదయ్యెను. (7) ధర్మము యొక్క స్థితి చేడినందున (ధర్మము లేనందున) మానవులలో మిత్రులలో కూడ అభిప్రాయ భేదము కలుగును. పరస్పరము విభిన్న మనస్కత వలన, దృక్పథముల విభిన్నత్వము వలన, ఇది ధర్మము, ఇదికాదు అను నిశ్చయము పొందబడదు. కోణముల యొక్క వికల్పత్వముచే, అస్పష్టతచే తత్పరిణామములయిన కార్యములయందు (ఫలితము లందు) ప్రజలలో విభిన్నమైన యభిప్రాయము లుదయించును. కార్యములు కూడ నిశ్చయ రూపము నొందవు. మతి భేదము చేతను, భ్రాంతి విదృక్పథముల చేతను, దృష్టి భేదము చేతను శాస్త్రముల సముదాయమందు విభిన్నత్వము కల్పింపఁబడినది. (10)

ఏకో వేదశ్చతుష్పాద్ధి త్రేతాస్విహ విధీయతే

సంక్షయాదాయుషశ్చైవ వ్యస్యతే ద్వాపరేషు చ

ఋషిమంత్రాత్పునర్భేదాద్భిద్యతే దృష్టివిభ్రమైః

మంత్రబ్రాహ్మణవిన్యాసైః స్వరవర్ణవిపర్యయైః

సంహితా ఋగ్యజుఃసామ్నాం సంపర్యంతే మహర్షిభిః

సామాన్యా వైకృతాశ్చైవ దృష్టిభిన్నే క్వచిత్ క్వచిత్

బ్రాహ్మణం కల్ప సూత్రాణి మంత్రప్రవచనాని చ

అన్యేఽపి ప్రస్థితాస్తాన్వై కేచిత్తాన్ప్రత్యవవస్థితాః

ద్వాపరేషు ప్రవర్తంతే నివర్తంతే కలౌయుగే

ఏకమాధ్వర్యవం త్వాసిత్పునర్వైధమజాయత

సామాన్యవిపరీతార్థైః కృతశాస్రాకులం త్విదమ్

ఆధ్వర్యవస్య ప్రస్థా నైర్బహుధా వ్యాకులీకృతైః

తథైవాధర్వఋక్ సామ్నాం వీకల్పైశ్చాపి సంజ్ఞయా

వ్యాకులే ద్వాపరే నిత్యం క్రియతే భిన్నదర్శనైః

తేషాం భేదాః ప్రతీభేదా వీకల్పాశ్చాపి సంఖ్యయా

ద్వాపరే సంప్రవర్తంతే వినశ్యంతీ తతః కలౌ

తేషాం విపర్యయోత్పన్నా భవంతీ ద్వాపరే పునః

అవృష్టిర్మరణం చైవ తథైవ వ్యాధ్యుపద్రవాః

వాజ్మనఃకర్మ జైర్దుఃఖైర్నిర్వేదో జాయతే పునః

నిర్వేదాజ్జాయతే తేషాం దుఃఖమోక్షవిచారణా

త్రేతాయుగము ఒకే యొక వేదము. దానికి నాలుగు పాదములు. అని వీధింపఁబడినది. ఆయుః ప్రమాణము సంక్షయమగుటచే ద్వాపరయుగమున వేదము విభజింపఁబడును. (11) ఋక్ యజుస్సామ వేదముల సంహితా భాగములు మహరులచే విభిన్నముగా మంత్రముల కూర్పుల భేదముతో, బ్రాహ్మణముల భేదములతో మంత్ర భేదములతో, స్వర వర్ణముల మార్పులతో దృక్పథ విభిన్నత్వములతో మార్పులు కల్పింపఁబడినవి. కొన్ని కొన్ని స్థలముల నయ్యవి సమానములు. కొన్నిచోట్ల పూర్తిగా మారినవి, ఇవియు దృష్టి భేదముననే గలిగినవి. ఇట్టి పరిస్థితీయే బ్రాహ్మణములకు, కల్ప సూత్రములకు, మంత్ర ప్రవచనములకు, కలిగినది. ఇతరులు కొందరు వీని ననుసరించిరి. మరి కొందరు వీనిని (ఈ మార్పులను చేర్పులను) ప్రతిఘటించిరి. అంగీకరింపక వేలుగా కోందరుండిపోయిరి. (14) ద్వాపరము నందు అవి ప్రవర్తింప నారంభించెను. మరి కలియుగమున నవి నీవర్తనము చెందును. యజుర్వేదమున ఒకే ఆధ్వర్యవముండును. కానీ యజుర్వేదము కాలాంతరము రెండుగా నయినది. (15) సామాన్యవిపరీతార్థపద్దతులచే శాస్త్రజాతము తికమకలయినది. ఆధ్వర్యవుల ప్రస్థాన బాహుళ్యముచే (యజుర్వేదము) బహుధా వ్యాకులీకృత మయినది. (16) ఈ వ్యాకులత్వము అధర్వ ఋక్ సామవేదములందలి వీకల్ప పాఠములచే కలిగి ద్వాపరయుగమున భీన్నదర్శనములచే వ్యాకులీకృతమయినది. (17) ఆ వేదాదులు పెక్కు భేదభాగములు, విభిన్న భాగములు, వికల్ప పాఠములు కలిగినవి. ఇట్లు ద్వాపరమున విపరిణమింప నారంభమై ప్రవర్తించి తరువాత కలియుగమున వినాశనము చెందును. (18) ఈ విపరీతముల ఫలితములు ద్వాపరమున మరల కలుగును. తత్ఫలితములు వర్షము యొక్క అభావము, మరణము, రోగము, ఇతర బాధలు. పాక్కర్మ జములయిన దుః ఖముల వలన నిర్వేదము మరల కలుగును, నిర్వేదము వలన పొరలకు దుఃఖమోక్షవిచారణము కలుగును. (20)

విచారణాచ్చ వైరాగ్యం వైరాగ్యాద్దోషదర్శనమ్

దోషదర్శనతశ్చైవ ద్వాపరేఽజ్ఞానసంభవః

తేషామజ్ఞానినాం పూర్వమాద్యే స్వాయంభువేంఽతరే

ఉత్పద్యంతే హి శాస్త్రాణాం ద్వాపరే పరిపంథినః

ఆయుర్వేదవికల్పశ్చ హ్యగానాం జ్యోతిషస్య చ

అర్థశాస్త్రవికల్పాశ్చ హేతుశాస్త్రవికల్పనమ్

ప్రక్రియాకల్పసూత్రాణాం భాష్యవిద్యావీకల్పనమ్

స్మృతిశాస్త్రప్రభేదశ్చ ప్రస్థానాని పృథక్ పృథక్

ద్వాపరేష్వభివర్తంతే మతిభేదాశ్రయాన్నృణాం

మనసా కర్మణా వాచా కృచ్చ్రాద్వార్త ప్రసిద్ధ్యతి

ద్వాపరే సర్వభూతాసాం కాయక్లేశ పురస్కృత

లోభో వృత్తిర్వణిక్పూర్వా తత్త్వానామవినిశ్చయః

వేదశాస్త్రప్రణయనం ధర్మాణాం సంకరస్తథా

వర్ణాశ్రమపరిధ్వంసః కామక్రోథౌ తథైవ చ

ద్వాపరేషు ప్రవర్తంతే రాగో లోభో వధస్తథా

వేదం వ్యాసశ్చతుర్ధా తు వ్యస్యతే ద్వాపరాదీషు

నిశ్శేషే ద్వాపరే తస్మింస్తస్య సంధ్యా తు యాదృశీ

ప్రతిష్ఠతే గుణైర్హీనో ధర్మోఽసౌ ద్వాపరస్య తు

తథైవ సంధ్యాపాదేన హ్యంగః సంధ్యా ఇతీష్యతే

ద్వాపరస్యావశేషేణ తిష్యస్య తు నీబోధత

విచారణము వలన వైరాగ్యము కలుగును, వైరాగ్యము వలన దోషదర్శనము. దోష దర్శనమున ద్వాపరయుగమున జ్ఞానము కలుగును. (21) మొదటి స్వాయంభువ మన్వంతరమున, ఆయజ్ఞానులకు, ద్వాపర యుగమున శాస్త్ర గ్రంథములకును శత్రువులు బయలు దేరుదురు. (22) ఆయుర్వేద శాస్త్రమున, తత్సంబధి అంగశాస్త్రముల యందు, జ్యోతిష శాస్త్రమునందు, అర్థశాస్త్రమునందు, హేతుశాస్త్రములందు (తర్కమున) ఎన్నియో వికల్పములు, సంశయములు, అనిశ్చిత విషయములు కలవు. (23) ఆ విధముగనే, శాస్త్ర భాష్యములయందు ప్రక్రియా సూత్ర విద్యల యందు, కల్ప సూత్రములయందు, వికల్పము లెన్నియో ఘటిల్లినవి. వేరువేరు స్మృతి (ధర్మ) శాస్త్రములు ప్రస్థానములు (భిన్న భిన్న మతములు - అభిప్రాయములు) కలవు. ఇవీ ద్వాపరయుగమున సంభవించును. ఏలయన మనుష్యులయందు విభిన్న దృక్పథములుండుట వలన (24, 25, 26) మనస్సుచే, వాక్కుచే, కర్మచే, (వార్త, వ్యవసాయము) ద్వాపరమున కష్టముపై, శరీర శ్రమచే, వ్యవసాయము, ఇతర వృత్తులు వృద్ధి చెందును. వృత్తుల యందలీ చైతన్యము వ్యాపారాశ్రయమై యున్నది. సిద్దాంతముల వినిశ్చయత్వము మాత్రము లేదు. (27) వేదశాస్త్రముల ననుసరించి రచనలు బయలు దేరినవి. కాని అందు అనేకముల యొక్క సంకరము కలిగినది. వర్ణాశ్రమ విధ్వంసము కామ క్రోధములు ద్వాపరమున వృద్ధి చెందును. రాగము, లోభము, వధ ప్రవర్తిల్లును. ఈ ద్వాపరమునందే వ్యాసుడు వేదమును నాలుగు భాగములుగ విభజించెను. (28) ద్వాపర యుగము అంతమైన వెనుక సంధ్యాయుగములో (యుగమునకు యుగమునకు మధ్య కాలములో) ద్వాపరయుగ కలియుగముల మధ్య కాలములో కూడ నీట్లే జరుగును, ద్వాపరయుగ లక్షణముల ధర్మ గుణహీనములై ప్రతిష్ఠ చెందును. ఏవం విధముగనే సంధ్యాంశ కూడ సాగును. (తిష్య - కవి) ద్వాపరయుగము యొక్క మిగిలిన దానిని బట్టి కలియుగ వివరణములఁ దెలిసికొనుము. (30)

ద్వాపరస్యాంశశేషేణ ప్రతిపత్తిః కవే రపి

హింసాసూయానృతం మాయా వధస్యైవ తపస్వినామ్

ఏతే స్వభావిస్తిష్యస్య సాధయంతి చ వై ప్రజాః

ఏష ధర్మః కృతః కృత్స్నో ధర్మశ్చ పరిహీయతే

మనసా కర్మణా స్తుత్యా వార్తా సిద్ధ్యతి వా నవా

కలౌ ప్రమారకో రోగః సతతం క్షుద్భయాని చ

అనావృష్టిభయం ఘోరం దేశానాం చ విపర్యయః

న ప్రమాణం స్మృతేరస్తి తిష్యే లోకేషు వై యుగే

గర్భస్థో మ్రియతే కశ్చిద్యౌవనస్థః తథాపరః

స్థవిరాః కేఽపి కౌమారే మ్రియంతే వై కలౌ ప్రజాః

దురిష్టైర్ధురధీతైశ్చ దుష్కృతైశ్చ దురాగమైః

విప్రాణాం కర్మదో షైస్తైః ప్రజానాం జాయతే భయమ్

హింసా మాయా తథేర్త్యా చ క్రోధోసూయా క్షమా నృషు

తిష్యే భవంతి జంతూనాంరాగో లోభశ్చ సర్వశః

సంక్షోభో జాయతేఽత్యర్థం కేలిమాసాద్య వై యుగమ్

పూర్ణీవర్షసహస్రే వై పరమాయుస్తదా నృణామ్

నాధీయతే తదా వేదాన్న యజం ద్వీజాతయః

ఉత్సీదంతి నరాశ్చైవ క్షత్రియాశ్చ విశః క్రమాత్

శూద్రాణమంతయోనేస్తు సంబంధ బ్రాహ్మణై స్సహ

భవంతీహ కలౌ తస్మిఞ్యనాసనభోజనైః

శేషించిన ద్వాపరయుగ లక్షణములచే కలి యొక్క ప్రతిపత్తి, లక్షణాదికములాధారపడియుండును. హింస, అసూయ, అనృతము, మాయ తపస్వుల వధించుట ఇవీ కలియొక్క లక్షణములు. అయినను ప్రజలు కొంత సాధింతురు. అది ధర్మము యొక్క కృత్స్నత్వము. ధర్మము పరిక్షయము నొందును. (32) మనస్సుచే వాక్కుచే కర్మచే శ్రమపడి క్లేశముతో సాధించినను వార్త (వ్యవసాయము) వృద్ధి చెందునో చెందదో సంశయము, కలియుగమున మరణాంతకములు (ప్రమాదకరములు) అయిన రోగములు ప్రబలును. ఆకలిచే భయముచే నీత్యము ప్రజలు బాధల నొందెదరు. (33) వర్షము లేకపోవుట వలన నధికమయిన భయము కలియుగమున కలుగును. దేశములన్నింటియందును ఏఫర్యయములు విపరీత కష్ట నష్టములు కలుగును. కలియుగమున ధర్మశాస్త్రములయిన స్మృతులయందు ప్రామాణ్యబుద్దీ లేదు. (34} కలియుగమున ప్రజలు వివిధ వయస్సులలో మృతి చెందుదురు. కొందరు తల్లి గర్భమునందే మరణించెదరు. కొందరు యౌవనమునందు మృతి చెందుదురు. కొందరు వార్ధక్యమున కొందరు కౌమారమున మరణింతురు (బాల్యవయస్సున). దుష్టముగా యజ్ఞములు చేయుటవలన, వేదములను చక్కగా నధ్యయనము చేయకపోవుటవలన, దుష్కృతముల వలన, ధర్మశాస్త్రాదులకు విపరీతార్థములు చెప్పుటవలన, బ్రాహ్మణులు చేయు కర్మల యందలి దోషముల వలన ప్రజలకు ప్రమాదము, భయము కలుగును. (36) హింస, మాయ, అసూయ, క్రోధము, ఈర్షా, అసహనము మొదలగునవి కలియుగ మందలి ప్రజలకు కలుగును. ప్రతి జీవియందు రాగము లోభము కలుగును. (37) కలియుగము రాగా అత్యంత సంక్షోభము కలుగును. నరులకు పరమాయుర్దాయము వేయి సంవత్సరములు, (38) ద్విజవంశమున పుట్టినవారు వేదముల నధ్యయనము చేయరు. యజ్ఞముల నాచరింపరు. క్రమముగా క్షత్రియులు, వైశ్యులు నరులు నాశనము నొందుదురు. ఆధమ యోనుల పుట్టిన శూద్రులకు బ్రాహ్మణులతో సంబంధము కలుగును. వారితో బ్రాహ్మణులకు శయనాసన భోజనములు కలుగును.

రాజానః శూద్రభూయిష్టాః పాఖండానాం ప్రవర్తకాః

గుణహీనాః ప్రజాశ్చైవ తదా వై సంప్రవర్తతే

ఆయుర్మేధా బలం రూపం కులం చైవ ప్రణశ్యతి

శూద్రాశ్చ బ్రాహ్మణాచారాః శూద్రాచారాశ్చ బ్రాహ్మణాః

రాజవృత్తాః స్థితాశ్చోరాశ్చోరాచారాశ్చ పార్థివాః

భృత్యా ఏతే హ్యసుభృతో యుగాంతే సమవస్థితే

అశీలీన్యోఽనృతాశ్చైవ క్రియో మద్యామిషప్రియాః

మాయావినో భవిష్యంతి యుగాంతే మునిసత్తమ

ఏకపత్న్యో న శిష్యంతి యుగాంతే మునిసత్తమ

శ్వాపదప్రబలత్వం చ గవాం చైవహ్యుపక్షయః

సాధూనాం వీనివృత్తిం చ విద్యా స్తస్మిన్యుగక్షయే

తదా ధర్మో మహోదర్కో దుర్లభో దానమూలవాన్

చాతురాశ్రామశైధిల్యో ధర్మః ప్రవిచరీష్యతి

తదాహ్యల్పఫలా భూమిః క్వచిచ్చాపి మహాఫలో

న రక్షిస్తారో భోక్తారో భలిభాగస్య పార్థివాః

యుగాంతే చ భవిష్యంతీ స్వరక్షణపరాయణాః

అరక్షితారో రాజానో విప్రాః శూద్రోపజీవినః

శూద్రాభివాదినస్సర్వే యుగాంతే ద్విజసత్తమాః

అట్టశూలా జనపదాః శివశూలా ద్విశాస్తథా

ప్రమదాః కేశ శూలాళ్ళ యుగాంతే సముపస్థితే

ఆ కాలమున శూద్రులు రాజులు దేశమున పాషండ మత ప్రవర్తకులు. ప్రజలు గుణహీనులు. ఆగుదురు. ఆయుః ప్రమాణము, బుద్దీ బలము, శరీరబలము, రూపము కులము నశించును. శూద్రులు బ్రాహ్మణాచారపరులు మరి బ్రాహ్మణులు శూద్రాచార పరులగుదురు. దొంగలు రాజవృత్తి నవలంబింతురు. రాజులు చోరుల ఆచారముల నవలంబించి చోరులవలె జీవింతురు. యుగాంతమాసన్నమగుచుండ భృత్యులు అసుభృతులుగా (చక్కగా భరింపబడనిపొరిగా) జీవింతురు. (43) ఓ మునిసత్తమ ! యుగాంతము నందు స్త్రీలు శీలరహితలు అనృతపరులు నగుదురు. వారు సురాపాన పరురాండ్రు, మాంస ప్రియురాండ్రు మాయావినులు నగుదురు. (44) ఓ మునిసత్తమ ! యుగాంతకాలమున ఏకభర్తృకలుండరు. క్రూర జంతువులు వృద్ధి చెందును. గోవులు మున్నగు పశువులు క్షీణించును. (45) యుగాంతము నందు సాధువులు మరలిపోవుదురు. (ధర్మపుర స్మృతులు కారు) వేటుగా నుందురు. వారి యందు విద్యా ప్రవృత్తి (ధర్మరతి) క్షీణించును. ఆ సమయమున ఉత్తమ దానమూలమయిన ధర్మము సకృత్తుగా గోచరించును. (46) నాలుగు ఆశ్రమముల విధింపఁబడిన ధర్మము శిధిలమైపోవును. ధర్మము పరిణమించును. పతనమగును. ఆ సమయమున భూమి అల్పఫలమొసంగును. కాని ఒక్కొక్కచో అధిక ఫలితములు కూడ నొసంగును. (47) రాజులు తమకు వచ్చు పన్నులు మొదలయిన వాని ననుభవించెదరే కాని ప్రజా రక్షకులు కారు. యుగాంతమునందు వారు స్వరక్షణపరులగుదురు. (48) రాజులు రక్షకులు కారు. బ్రాహ్మణులు శూద్రోప జీవులు అగుదురు. ద్విజసత్తములందరు యుగాంతమున శూద్రులకు పాదాభివందనము చేయుదురు. సామాన్య జనులు అన్న విక్రేతలగుదురు. బ్రాహ్మణులు వేదములను విక్రయించెదరు. యుగాంత కొలమాసన్నము కాగా ప్రమదలు (యౌవన స్త్రీలు) తమ శరీరముల నమ్ముకొందురు. (జారిణీ స్థితికి దిగజారెదరు).

తపోయజ్ఞఫలానాం చ విక్రేతారో ద్విజోత్తమాః

యతయశ్చ భవిష్యంతి బహవోఽస్మిన్నలౌ యుగే

చిత్రవర్షి యదా దేవస్తదా ప్రాహుర్యుగక్షయమ్

సర్వే వాణిజకాశ్చాపి భవిష్యంత్యధమే యుగే

భూయిష్ఠం కూటమానైశ్చ పణ్యం విక్రీణతే జనాః

కుశీలచర్యాపాఖండైః వ్యాధరూపైః సమావృతమ్

పురుషాల్పం బహుస్త్రీకం యుగాంతే సముపస్థితే

బాహు యాచనకో లోకో భవిష్యతి పరస్పరమ్

అవ్యాకర్తా క్రూరవాక్యా నార్జవో నానసూయకః

న కృతే ప్రతికర్తా చ యుగే క్షీణే భవిష్యతి

అశంకా చైవ పతితే యుగాంతే తస్య లక్షణమ్

తతః శూన్యా వసుమతీ భవిష్యతి వసుంధరా

గోపారశ్చాష్యగోప్తారః ప్రభవిష్యంతి శాసకాః

హర్తారః పరరత్నానాం పరదారవిమర్శకాః

కామాత్మానో దురాత్మానో హ్యధమాః సాహసప్రియాః

ప్రనష్టచేష్టనా ధూర్తా ముక్తకేశాస్త్వశూలినః

ఊనషోడశవర్షాశ్చ ప్రజాయతే యుగక్షయే

శుక్లదంతా జీతక్షశ్చ ముందా: కాషాయవాససః

శూద్రా ధర్మం చరిష్యంతి యుగాంతే సముపస్థితే

సస్యచోరా భవిష్యంతీ తథా చైలాపహారిణః

కలియుగమున ఉత్తమ బ్రాహ్మణులు కూడ తమ తపస్సును, యజ్ఞ ఫలములను నమ్ముకొందురు. కలియుగమున పెక్కురు యతులుగా నగుదురు. (ఇంద్రుఁడు) వరదేవుఁడు విచిత్ర వర్షములు కురియింప నయ్యది యుగక్షయసూచనమని చెప్పుదురు. ఈ యథము (యుగమున నెల్లరును వర్తకులే యగుదురు. (52) జనులందరు అసత్యపు (దొంగ) తూకములతో, మానములతో వర్తకమాచరించి వస్తువులమ్ముదురు. సంఘమంతయును వ్యాధ (కిరాతులు) రూప జనులతోను, పొషండులతోను సమావృతమై యుండును. (53) యుగాంతము సముపస్థితముకాగా - పురుష సంఖ్య అల్పము, స్త్రీల సంఖ్య యధికమునగును. ప్రజలందరు యాచకులగుదురు. పరస్పరము బిచ్చమెత్తుకొందురు. (54) యుగము క్షీణించుచుండగా పొందిన యుపకారమునకు ప్రత్యుపకృతి చేయు వ్యాకర్త ఉండడు; ఇతరులను గాసిల చేసి బాధ కల్పింపని వాడుండడు; పరుష వాక్కులు లేని వారుండరు; అర్జవ వంతుఁడైన. వాఁడు, అసూయా రహితుఁడెవ్వఁడును ఉండడు. యుగము యొక్క అంత్యలక్షణము, భయ ప్రమాదములను శంకించుట, అంత వసుంధర యంతయును ఐశ్వర్య (ధన వసు) శూన్యమగును. (56) పాలకులు నిజముగా రక్షకులే యైనను రక్షకులుకారు. వారు పరుల రత్నములను నగలను దొంగిలింతురు. అంతీయే కాక పరుల భార్యలను పీడించెదరు (విమర్శించెదరు - చెరిచెదరు) ప్రజలందరు కామాత్ములు. అంతీయేకాక దుష్టమైన భావములు కలవారు, వారు అధములు; సాహస ప్రియులు, ఘాతుక కార్య మాచరించెదరు. ఉత్తమ క్రియాప్రనష్టులు ధూర్తులు శఠులు. వారు జుత్తు వీరబోసికొందురు ముడివేయరు. వారు దయాశూన్యులు. (58) ఈ కలియుగాంతమున పురుషులు పదియారేండ్లు నిండక పూర్వమే పిల్లలను కందురు. పదీయారేండ్లకు లోపు స్త్రీలే బిడ్డలు కందురు. యుగాంతమున శూద్రులు తెల్లని దంతములతో (శుక్లదంతైః) కాషాయ వస్త్రములతో తలలు గొరించుకొని, ఇంద్రియజేతలగుదురు. (59)

చోరాచ్చోరాశ్చ హర్తారో హర్తుర్ఘర్రా తథాపరః

ఇజ్ఞానకర్మణ్యుపర లోకే నిష్క్రియతాం గ

కీటమూషక సర్పాళ్ళ ధరయిష్యంతి మానవాన్

అభీక్ష్ణం క్షేమమారోగ్యం సామర్థ్యం దుర్లభం తథా

కౌశికాన్ప్రతివత్వంతి దేశాః క్షుద్భయపీడితాః

దుఃఖేనాభిప్లుతానాం చ పరమాయుఃశతం తదా

దృశ్యంతే చ నదృశ్యంతే వేదాః కలియుగేఽఖిలాః

తత్సీదంతే తథా యజ్ఞాః కేవలాధర్మపీడితాః

కాషాయిణోఽథ నీర్గ్రంథా తథా కాపాలికాశ్చ హ

వేదవిక్రయిణశ్చాన్యే తీర్థవిక్రయిణోఽపదే

వర్ణాశ్రమాణాం యే చాఽన్యే పాఖండా పరిషంథినః

ఉత్పద్యంతే తదా తే వై సంప్రాప్తే తు కలౌయుగే

అధీయతే తదా వేదాఞ్ఛూద్రా ధర్మార్థకోవిదాః

యజంతే చాశ్వమేధేన రాజానః శూద్రయోనయః

స్త్రీబాలగోవధం కృత్వా హత్వాన్యే చ పరస్పరమ్

అపహత్య తథాఽన్యోన్యం సాధయంతి తదా ప్రజాః

దుఃఖప్రవచనాల్పాయుర్దేహాల్పాయుశ్చ రోగతః

అధర్మాభినివేశిత్వాత్తమో వృత్తం కలౌ స్మృతమ్

ప్రజాసు భ్రూణహత్యా చ తదా వైరాత్ప్రవర్తతే

తస్మాదాయుర్బలం రూపం కలీం ప్రాప్య ప్రహీయతే

శూద్రులు యుగాంతమున సస్యచోరులు. అట్లే వస్త్రములు దుస్తులు దొంగిలింతురు. (60) కొందరు దొంగలు ఇతరులయిన దొంగల నుండియే దొంగిలింతురు. ఒక తస్కరుని వద్ద నుండి విలువైన వస్తువులను దొంగిలించు వేటిక తస్కరుఁడుండును. జ్ఞానకర్మలు అదృశ్యముకాగా, లోకము సర్వము నిష్క్రియత్వము నొందును, కీటకములు, ఎలుకలు, సర్పములు మాటిమాటికి మానవుల నెదుర్కొని భయపెట్టును పీడించును. అప్పుడు క్షేమము, ఆరోగ్యము, సామర్థ్యము శాశ్వతముగా పొందుట దుర్లభము. (62) దేశములు క్షుద్భయ పీడితములై కౌశీకుల కొఱకు నిరీక్షించును (కౌశికులు దాచపెట్టఁబడిన ధనముకై వెదకువారు). దుఃఖాభిఫుతులయిన వారలకు పరమాయుః ప్రమాణము వంద సంవత్సరములు, (63) కలియుగమున వేదములన్నియు కనంబడి కనబడవు. వేదములను ప్రజలు చదువరు. అవగాహన చేసికొనరు. యజ్ఞములు కేవలము ధర్మపీడితములై నశించును. (64) కలియుగము వచ్చిన తరువాత పలువిధ పాఖండులు నాస్తికులు బయలు దేరుదురు. కాషాయ వస్త్రముల దొల్చునట్టి బౌద్ధులు, జైనులు, కాపాలికులు తదితరులు చెలరేగుదురు. వేదములవిక్రయింతురు మరికొందరు పవిత్రతీర్ధ స్థలములనే అమ్మొదరు. (65) పాషండులు నాస్తికులు వర్ణాశ్రమ ధర్మాచారములకు శత్రువులు. కలియుగము ఆరంభముగా ఇట్టివారు పుట్టుదురు. (66) ధర్మార్థకోవిదులు శూద్రులు వేదముల సధ్యయనము చేసెదరు. శూద్ర జాతులయిన రాజులు అశ్వమేధ యాగములఁ జేసెదరు. స్త్రీలను, బాలురను, గోవులను ఇతరులను పరస్పరము వధించి ప్రజలు ఒండొరులు స్వకార్యముల సాధించుకొందురు. ప్రజలత్యంతమ ధర్మాభినిలేశులగుట, కలియుగమున, ప్రజ ప్రవృత్తి తామసిక మగును. స్వకీయములైన దుఃఖములను వెళ్లబోసికోనుటచే ప్రజలు అల్పాయుష్కు లగుదురు. వారీ దేహములు అల్పాయుషములు. దీనికి కారణము వారు రోగములచే బాధనొందుదురు. పరస్పర వైర భావమున ప్రజలలో భ్రూణహత్య నాచరించుట (గర్భస్థ శ్రీశువులను చంపుట) ప్రవర్తించును. అందుచే కలియుగ మారంభము కాగా, ఆయుస్సు, బలము, రూపము క్షీణించును. (70)

తదా చాల్పేన కాలేన సిద్ధిం గచ్ఛంతి మానవాః

ధన్యా ధర్మం చరిష్యంతి యుగాంతే ద్వీజసత్తమాః

శ్రుతిస్మృత్యుదీతం ధర్మం యే చరంత్యనసూయకాః

త్రేతాయామాబ్దికో ధర్మో ద్వాపరే మాసికః స్మృతః

యథాశక్తి చరన్ప్రాజ్ఞస్తదహ్నా ప్రాప్నుయాత్కలౌ

ఏషా కలియుగావస్థా సంధ్యాంశం తు నిబోధత

యుగే యుగే తు హీయంతే త్రిత్రిపాదాస్తు సిద్ధయః

యుగస్వభావాత్సంధ్యాసు తిష్ఠంతీహ తు యాదృశః

సంధ్యాస్వభావాః స్వాంశేషు పాదశేషాః ప్రతిష్ఠితాః

ఏవం సంధ్యాంశకే కాలే సంప్రాప్తే తు యుగాంతికే

తేషాం శాస్తా హ్యసాధూనాం భృగూణాం నిధనోత్థితః

గోత్రేణ వై చంద్రమసో నామ్నా ప్రమతిరుచ్యతే

మాధవస్య తు సోంఽశేన పూర్వం స్వాయంభువేఽoతరే

సమాః స విశంతిః పూర్ణాః పర్యటన్వై వసుంధరామ్

అనుకర్షన్స వై సేనాం సవాజీరథకుంజరామ్

ప్రగృహీతాయుధైర్విసైః శతశోఽథ సహస్రశః

స తదా తైః పరివృతో మ్లేచ్ఛాన్ హంతిస్మ సర్వశః

సహ వా సర్వశశ్చైవ రాజ్ఞస్తాన్ శూద్రయోనిజాన్

పాఖండాంస్తు తతః సర్వాన్ నిశ్శేషం కృతవాన్విభుః

నాత్యర్థం ధార్మికా యే చ తాన్ సర్వాన్హంతి సర్వతః

ఆ సమయమున ప్రజలు అల్పకాలములో సిద్దీని పొందెదరు. కలియుగాంతమున ద్విజసత్తములు, ధన్యులు (పవిత్రులు) ధర్మమాచరింతురు. (71) ఈ ద్విజసత్తములు శ్రుతి స్మృత్యుదితములైన ధర్మములను అనసూయులై యాచరింతురు. త్రేతాయుగమున ఆచరించిన ధర్మము ఒక సంవత్సర కాలము ఫలిత మొసంగును. ద్వాపర యుగము నందొకే మాసమున ఫలిత మొసంగును. (72) ప్రాజ్ఞుఁడైనవాఁడు ధర్మము నోచరించినచో, యథాశక్తి తాను కోరిన ఫలితము నొందును. ఇది కలియుగావస్థ, సంధ్యాంశమందలి స్థితిగతుల నెఱుంగుము. (73) ఆ దీనముననే యుగయుగము సిద్దులు మూడు మూడు పాదములు తగ్గును. ఈ కలియుగముగ స్వభావమును బట్టి సంధ్యలలోనవి యట్లే యుండును. (74) సంధ్యా స్వభావము సంధ్యాంశములు పాదశేషములై ప్రతిష్ఠితములగును. (75) యుగముల యంత్యమున సంధ్యాంశ కొలములో ఒక ధర్మ నియంత శాస్త్ర) యవతరించును. అసాధులయిన భృగులను చంపుటకై ఆతఁడావిర్భవించును. ఆతనిని ప్రమతి’ యందురు. ఆతఁడు చంద్రవంశీయుఁడు. (76) పూర్వము స్వాయంభువ మన్వంతరమున ఆతఁడే మాధవాంశతో (విష్ణు) పుట్టెను. ఒక యిరువది సంవత్సరములు భూమి నంతటిని గుఱ్ఱములు, రథములు, ఏనుగులు, గలిగిన సైన్యముతో పర్యటించేను. గృహీతాయుధులయిన వందల కొలది, వేలకొలదీ బ్రాహ్మణులతో పరివృతుఁడై మ్లేచ్ఛులను సర్వత్ర చంపెను. శూద్ర యోనిజులయిన పాషండులను, రాజులను ఎల్లరను నతండు చంపెను. అత్యంత ధార్మికులు కానీ వారలెల్లరను దేశము నందంతటను చంపును. (80)

వర్ణవ్యత్యాసజాతాశ్చ యే చ తాననుజీవినః

ఉదీచ్యాన్మధ్యదేశ్యాంశ్చ పర్వతీయాంస్తథైవ చ

ప్రాచ్యాన్ ప్రతీచ్యాంశ్చ తథా వింధ్యపృష్ఠచరానపి

తథైవ దాక్షిణాత్యాంశ్చ ద్రవిడాన్ సింహలైః సహ

గాంధాన్పారదాంశ్చైవ పహ్లవాన్యవనాన్ శకాన్

తుషారాన్ బర్బరాంచ్చీనాఇచ్చాలీకాన్ దరదాన్ ఖశాన్

లంపాకారాన్సకతకాన్కిరాతానాం చ  జూతయః

ప్రవృత్తచక్రో బలవాన్ల్మేచ్ఛానామంతకృత్ర్పభుః

అదృష్టః సర్వభూతానాం చచారాథ వసుంధరామ్

మాధవస్య తు సోంతేన దేవస్యేహ విజిజ్జీవాన్

పూర్వజన్మని విఖ్యాతః ప్రమతిర్నామ వీర్యవాన్

గోత్రతో వై చంద్రమసః పూర్వే కలియుగే ప్రభుః

ద్వాత్రింశఽభ్యుదితే వర్షే ప్రక్రాంతో వింశతిః సమాః

వినిఘ్నన్ సర్వభూతాని మానవానేవ సర్వశః

కృత్వా బీజావశేషం తు పృథోక్ష్యం క్రూరేణ కర్మణా

పరస్పర నిమిత్తేన కోపేనాకస్మికేన తు

సుసాధయిత్వా వృషలాన్పాయశస్తానధార్మికాన్

గంగాయమునయోర్మధ్యే నిషాం ప్రాప్తః సహానుగః

తతో వ్యవీతే కల్పే తు సామాన్యే సహసైనికః

ఉత్సాద్య పార్థివాన్ సర్వాస్ మేచ్ఛాంశ్చైవ సహస్రశః

తత్ర సంధ్యాంశకే కాలే సంప్రాప్తే తు యుగాంతకే

స్థితాస్వల్పవశిష్టాసు ప్రజాస్విహ క్వచిత్ క్వచిత్

శక్తిమంతుఁడు మంత్రకృత్తు మ్లేచ్ఛులను చంపినపోఁడు వర్ణ వ్యత్యాసమున పుట్టిన వారిని వారి అనుజీవులను చంపిన ప్రభువు ఉదీచ్యులను (ఉత్తర దేశము వారలను) మధ్య దేశీయులను (మధ్యదేశమున నివసించు ప్రజలను) పర్వతముల నివసించు వారలను, ప్రాచ్యదేశ ప్రజలను, పడమటి దేశ వాసులను, వింధ్య పర్వత చరియల యందు నడచుచు జీవించు వారలను, దాక్షిణాత్యులను, ద్రావిడ దేశీయులను, సింహాలేయులను, గాంధార దేశీయులను, పారద దేశీయులను, పహ్లవులను, యవనులను, శకులను, తుషార దేశీయులను, బర్బర దేశీయులను, చీనా దేశీయులను, శూలీకులను, దరదులను, ఖశులను, లంపాకారులను, కతకులను, బహువిధ కిరాత జాతులను చంపును. బలవంతుఁడయిన ప్రభువు చక్రమును ప్రయోగించి కిరాత జాతుల నందరను వధించును. (84) సర్వభూతములకు అగోచరుఁడై ఆ ప్రభువు మాధవునీ, అంశచే పుట్టెను. పూర్వ జన్మమున ఆతఁడు మహావీర్యవంతుఁడు, ‘ప్రమతి’ అను పేరుతో ప్రఖ్యాతుఁడు. పూర్వము కలియుగమున నతఁడు చంద్రుని గోత్రమున నుద్భవించెను. (86) ఆతనికి ముప్పది రెండేండ్లప్పుడు విజయయాత్ర సోరంభించెను. ఇరువది సంవత్సరముల పాటు అతఁడు సర్వత్ర సర్వభూతములను మానవులనునెల్ల చంప మొదలిడెను. (87) మహాక్రూరకర్మచే సర్వమును ధ్వంసముచేసి, పృథివియందాతఁడు భీజములను మిగిల్చెను. అధార్మికులు పాపాచరణులు నయిన వృషలులను, వారిని పరస్పరము కోపగింపచేసి, ఆకస్మికముగ మోరలను క్రోధోద్దీపులనుచేసి, ఆతఁడు స్వాధీనము చేసికొనెను. (88) ఆ తరువాత గంగాయమునా నదుల మధ్య ప్రదేశమున నతఁడు తన యనుచరులతో సహితము శాంతియుత నిష్టతో ఆవాస మొనర్చెను. తరువాత అతఁడు కల్పము గతింపగా వేలాది మేచ్చరాజులను తన సైనికులతో వీణాశన మొనరింపం జేసి తనవారితో తన శాశ్వత వాసమున కరిగెను. యుగాంతమున సంధ్యాంశకాలము సంప్రాప్తింపగా అక్కడక్కడనే కొలది మంది జనులు మిగులుదురు.

అపగ్రహాస్తవస్తా వై లోభావిష్టాస్తు వృందశః

ఉపహింసంతి చాన్యోన్యం పోథయంతః పరస్పరమ్

అరాజకే యుగవశాత్సంక్షయే సముపస్థితే

ప్రజాస్తా వై తతః సర్వాః పరస్పరభయార్దితాః

వ్యాకులాశ్చ పరిభ్రాంతాస్త్యక్త్వా ధారాన్ గృహాణీ చ

స్వాన్ప్రాణానన పేక్షంతో నిష్కారణసుదుఃఖితాః

నష్టే శ్రౌతే స్మృతౌ ధర్మే పరస్పరహతాస్తదా

నిర్మర్యాదా నీరాక్రందా నిఃస్నేహా నిరపత్రపాః

నష్ట ధర్మే ప్రతిహతా హ్రస్వకాః పంచవింశతిమ్

హిత్వా పుత్రాంశ్చ దారాంశ్చ విషాద వ్యాకులేంద్రియాః

అనావృష్టి హతాశ్చైవ పార్తిముత్సృజ్య దుఃఖితాః

ప్రత్యంతాంస్తా నిషేవంతే హిత్వా జనపదాన్ స్వకాన్

సరితః సాగరానూపాన్సేవంతే పర్వతాంస్తథా

మాంసైర్మూలఫలైశ్చైవ వర్తయంతః సుదుఃఖితాః

చీరపత్రాజినధరా నీష్క్రియా నిష్పరిగ్రహాః

వర్ణాశ్రమపరిభ్రష్టాః సంకరం ఘోరమాస్థితాః

ఏతాం కాష్ఠా మనుప్రాప్తా అల్పశేషాః ప్రజాస్తతః

జరావ్యాధిక్షుధావిష్ఠా దుఃఖాన్నీర్వేదమాగమన్

విచారణా తు నిర్వేదాత్స్యా వస్థా విచారణాత్

సామ్యావస్థాత్మకో బోధః సంబోధాద్ధర్మశీలతా

తాసూపశమయుక్తాసు కలిశిష్టాసు వై స్వయమ్

వారందరు విపరీత గ్రహ యోగముచే దురదృష్టవంతులు. వారిలో చాలా మంది లోభావోష్టులు. గుంపులు గుంపులుగా ఒండొరులు కొట్టుకొని పరస్పరము. గాయపరచుకొనిరి. (92) అరాజకము ప్రబలినది. యుగవశమున నంక్షయము సంప్రాప్తముకాగా, ప్రజలు పరస్పర భయముచే బాధితులయిరి. (93) వారు వ్యాకులత్వము చెందిరీ, భ్రష్టమనస్కులై పరీభ్రాంతులైరి. వారు గృహములను భార్యలను విడిచిపెట్టిరి. స్వప్రాణములపై ఆశ వదలుకొనిరి. బ్రతికి బట్టకట్టగలమను ఆశ వారికి పోయినది. నిష్కారణముగా వారందరు విశేషముగా దుఃఖితులయిరి. (94) శ్రుతుల మీఁద స్మృతులమీద ఆధారపడిన ధర్మము నశించినది. ప్రజలొండొరులను చంపుకొనిరి. వారు మర్యాదా రహితులు (మంచి చెడ్డ అవధులు లేనట్టివారు). స్నేహ రహితులు, సిగ్గువదలినవారు, తమవారు లేనివారు. నీరాక్రందులు ఏడ్పులు విడిచినవారు. (95) ధర్మము ప్రతి హతము కాగా (ఇంతకుం బూర్వము 52 అంగుళముల ప్రమాణములో నుండువారు) 25 అంగుళములకు ప్రస్వ శరీరులు ప్రజలయిరి. విషాదముచే సంక్షుభితేంద్రియులయి బుడ్డీ పోగొట్టుకొనిరి. వారు పిల్లలను భార్యలను విడిచి పారిపోయిరి. ప్రజలు అనావృష్టిచే కొట్టబడిరి. దుః భీతులయిరి. వ్యవసాయక కార్యములు విడిచిరి, తమ దేశ ప్రాంతములను విడిచిరి. ఇతర ప్రదేశములకు వెడలిరి. ఇంక వారు సముద్ర ప్రాంత ప్రదేశములను, నదీ ప్రాంతములను, పర్వత ప్రదేశములను ఆశ్రయించిరి. సుదుఃఖితులై మాంసముతో ఫలములతో దుంపలతో జీవించిరి. వారు ఆకులను, తోళ్లను, వస్త్రములుగా ధరించిరి. ధర్మక్రియాదులను వారు విడచిరి. వారి కుటుంబములను విడిచి పెట్టిరి. సమాజధర్మము లన వర్ణాశ్రమ విధులనుండి పరిభ్రష్టులయిరి. భయోద్రిక్తమయిన సాంకర్య జీవితమునందిరి. అట్టి పరమ నీచస్థితిని వారు పొందిరి. ఏ కొందరో అల్ప సంఖ్యాకులు ప్రజలు మిగిలిరి. వార్ధక్యముచే, వ్యాధులచే, ఆకలిచే, బాధితులయిరి. దుఃఖముచే నిర్వేదము నొందిరి. నిర్వేదముచే విచారణ స్థితికి చేరిరి. విచారణము వలన సామ్యావస్థకు చేరిరి. సామ్యావస్థ వలన బోధ (జ్ఞాన) స్థితికి చేరిరి. ఆ సంబోధ స్థితి నుండి ధర్మ శీలత్వము కలుగును. ఈ విధముగా కలియుగమున మిగిలిన వారు ఉపశమనము నొందిరి. మనో నిగ్రహమును బడసిరి. (101)

అహోరాత్రం తదా తాసాం యుగాంతే పరివర్తిని

చిత్తసంమోహనం కృత్వా తాసాం వై సుప్తమత్తవత్

భావినోఽర్థస్య చ బలాత్తతః కృతమవర్తత

ప్రవృత్తే తు తతస్తస్మిన్ పూతే కృతయుగే తు వై

ఉత్పన్నాః కలిశిష్టాసు ప్రజాః కార్తయుగాస్తదా

తిష్ఠంతి చేహ యే సిద్దా అదృష్టా విచరంతీ చ

సహ సప్తర్షిభిశ్చైవ తత్ర తే చ వ్యవస్థితాః

బ్రహ్మక్షత్రవిశః శూద్రా బీజార్థం యే స్మృతా ఇహ

కలిజైః సహ తే సంతి నిర్విశేషాః తదాభవన్

తేషాం సప్తర్షయో ధర్మం కథయంతీతదేషు చ

వర్ణాశ్రమాచారయుక్తః శ్రౌతః స్మార్తో ద్విధా తు సః

తతస్తేషు క్రియావత్సు వర్తంతే వై ప్రజాకృతే

శ్రౌతస్మాత్తే కృతానాం చ ధర్మే సప్తర్షదర్శితే

కేచిద్ధర్మవ్యవస్థార్థం తిష్ఠంతీహాయుగక్షయాత్

మన్వంతరాధికాధేషు తిష్ఠంతి మునయస్తు వై

యథా దాపప్రదగ్ధేషు తృణేష్విన తపేన తు

వనానాం ప్రథమం వృష్ట్యా తేషాం మూలేషు సంభవః

తథా కార్తయుగానాం తు కలిజేష్విహ సంభవః

యుగాంతము పరిణామమును పొందుచుండగా, ప్రజలు నిద్రపోయినట్లు, ఉన్మత్తులయినట్లు సంమోహితులై విశ్రాంత మనస్కులై యహోరాత్రములుందురు. భవిష్యత్తు అనివార్యము 'బలీయమగుటవలన, కృతయుగము వచ్చినది. పవిత్రమయిన కృతయుగము ప్రవర్తింప ఆరంభమయినప్పుడు, కృతయుగపు ప్రజలు కలియుగము నుండి మిగిలిన {కలిశిష్టాః) వారి వలన జన్మించినవారు అప్పటికున్న సిద్దులు అదృశ్యులై సంచరింప మొదలిడిరి. సప్తరులు కూడ అచ్చట వ్యవస్థితులై యున్నారు. బ్రాహ్మణులు క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు బీజ స్థానీయులుగా స్మరింపఁబడుచున్నారు. (105) (వారే రాబోవు సంతతులకు మూల బీజముగా స్మరింపఁబడుచున్నారు). ఆ సమయమున వారు (కలితైః) కలియుగము వలన పుట్టిన వారితో నిర్విశేషులుగా (సమానులుగా)నైరి. వారిలో నెట్టి భేదమును లేదు. సప్తర్వులు వారికి తదితరులకు ధర్మమును వివరింతురు. (106) ధర్మము వర్ణాశ్రమాచార ప్రవర్తనముతో కూడికొని యున్నది. అది ద్వీవిధము భౌతముడ వేదముల యందు విధింపబడినది. స్మార్తము స్మృతుల యందు వీధింపఁబడినది. ప్రజల కొఱకు, కృతయుగమున ధర్మము ధర్మకార్యానువర్తనులయందు ప్రతిష్ఠితమై యున్నది. భౌత స్మార్త ధర్మములు కృతయుగమున సప్తర్వులు నిరూపింప వానిలో కొన్ని ధర్మములాయుగముయొక్క అంతము వరకు ధర్మముయొక్క వ్యవస్థార్గము నిలిచియుండును. ఇచ్చట యుగక్షయము వలన నిది జరుగును. (108) మునులు మన్వంతర కాలము వరకు అధికారమున నుందురు. ఇది యెట్టిదన అరణ్యము నందలి తృణాదీకములు దావాగ్నిచే దగ్ధములగును. కాని ఆ తృణముల మూలములు వేరులు దగ్ధములు కాను. చెడిపోవు. ఈ తృణ సంబంధమయిన వేరుల నుండి గడ్డి మొలక లుదయించినట్లు కృతయుగమందలి ప్రజలు కలియుగ ప్రజల నుండి వృద్ధి పొందుదురు. ఈ విధముగ యుగముల వరుసకు అవిచ్చిన్నత్వముండును. ఒకయుగముతో సంబంధము చెడక వేడొక యుగముతో మన్వంతరము సమాప్తమగు వరకు నుండును. (111)

ఏవం యుగో యుగస్యేహ సంతాసస్తు పరస్పరమ్

వర్తతే హ్యావ్యవచ్ఛేదాద్యావన్మన్వంతరక్షయః

సుఖమాయుర్బలం రూపం ధర్మోఽర్థః కామ ఏవ చ

యుగే ష్యేతానీ హీయంతే త్రిత్రిపాదాః క్రమేణ చ

స సంధ్యాంశేషు హీయంతే యుగానాం ధర్మసిద్ధయః

ఇత్యేష ప్రతిసంధ్యః కీర్తితస్తు మయా ద్విజాః

చతుర్యుగానాం సర్వేషామేతేనైవ ప్రసాధసమ్

ఏషా చతుర్యుగా వృత్తిరాసహస్రాద్గుణీకృతే

బ్రహ్మణస్తదహః ప్రోక్తం రాత్రిశ్చైతావతీ స్మృతా

అత్రార్జవం జడీభావో భూతానామాయుగక్షయాత్

ఏతదేవ తు సర్వేషాం యుగానాo లక్షణం స్మృతమ్

ఏషా చతుర్యుగానాం చ గుణితా హ్యేకసప్తతిః

క్రమేణ పరివృత్తా తు మనోరంతరముచ్యతే

చతుర్యుగే యథైకస్మిన్భవతీహా యథా తు యత్

తథా చాన్యేషు భవతి పునస్తద్వద్యధాక్రమమ్

సర్గే సర్గే తథా భేదా ఉత్పద్యంతే తథైవ తు

పంచత్రింశత్పరిమితా న న్యూనా నాధికాః స్మృతాః

తథా కల్పా యుగైః సార్ధం భవంతి సహ లక్షణైః

మన్వంతరాణాం సర్వేషామేతదేవ తు లక్షణమ్

యథా యుగానాం పరివర్తనాని చరప్రవృత్తాని యుగస్వభావార్

తథా న సంతిష్ఠతి జీవలోకః క్షయోదయాభ్యాం పరీవర్తమానః

సుఖము, ఆయుర్దాయము, బలము, రూపము, గుణము (ధర్మము) ఐశ్వర్యము, ప్రేమ ఇవీ వచ్చు అనుగామి యుగములందు మూడు వంతులకు క్రమముగా దీగజారును. (112) యుగ సంబంధమయిన ధర్మ సిద్ధులు పవిత్రత్వము సంధ్యాంశయందు క్షీణించును. ప్రతిసంధి రెండు యుగముల మధ్య సంక్రమము. బ్రాహ్మణులారా ! ప్రతిసంధి ఈ విధముగా నాచే కీర్తింపఁబడినది. (113) సమస్తమైన చతుర్యుగములకు ఈ విధమైన గణనోవిధానమే జరుగును. ఈ చతుర్యుగ సంక్రమము వేయిరెట్లు గుణింపగానీది (ఆకాల పరిమాణము) బ్రహ్మగారికొక పగలుగా చెప్పఁబడినది. ఇందు ఆర్జవత్వము జడీభావము (జడస్వభావము) భూతములన్నింటికిని యుగక్షయ లక్షణము. (115) ఇయ్యదియే సర్వ యుగములకు లక్షణముగా స్మరింపవలయును. ఈ చతుర్యుగముల సంఖ్య డెబ్బదీ యొక్కటిచే గుణింపగా, అది క్రమముగా సంక్రాంతి చెందగా (క్రమ పరీవృత్తి, చెందగా) ఆకాల ప్రమాణమునకు “మనోరంతర” మందురు. (71 చతుర్యుగములు ఒక మన్వంతరమగును) ఈ నాలు యుగములలో నేయది ఏ క్రమములో జరుగునో, తద్విధముగా తత్ర్కమములో ఇతర యుగములందును జరుగును. ఈ విధముగా భేదములు కూడ ప్రతి సృష్టియందును నుత్పన్నములగు చుండును. (ధాతా యధా పూర్వ మకల్పయత్ అన్నది వివరింప బడినది) అట్టేవి ముప్పదీయైదు దాని పరిమితులకు తక్కువ గానీ యెక్కువగాని యుండవు. ఆ విధముగా యుగములతో సహా కల్పములు స్వలక్షణములతో కలుగుచుండును. ఇదియే యని యుగముల యొక్క లక్షణము. యుగ స్వభావము వలన యుగముల యొక్క పరీవర్ణనముల చిరకాలము నుండి జరుగుచున్నవో ఆ విధముగనే భూత సంస్థితి (జీవలోకము) క్షయోదయములలో కలిగి యొక విధముగా శాశ్వతముగా నుండదు.

ఇత్యేతల్లక్షణం ప్రోక్తం యుగానాం వై సమాసతః

అతీతానాగతానాం హి సర్వమన్వంతరేష్యిహ

మన్వంతరేణ చైకేన సర్వాణ్యేవాంతరాణి వై

ఖ్యాతానీహా వీజానీధ్వం కల్పం కల్పేన చైవ హి

అనాగతేషు తద్వచ్చ తర్క కార్యో విజానతా

మన్వంతరేషు సర్వేషు అతీతానాగతేష్విహ

తుల్యాభిమానినః సర్వే నామరూపైర్భవంత్యుత

దేవా హ్యష్టవిధా యే వా ఇహ మన్వంతరేశ్వరాః

ఋషయో మనవశ్చైవ సర్వే తుల్యః ప్రయోజనైః

ఏవం వర్ణాశ్రమాణాం తు ప్రవిభాగం పురా యుగే

యుగస్వభావాంశ్చ తథా వీధత్తే వై సదా ప్రభుః

వర్ణాశ్రమవిభాగశ్చ యుగానీ యుగసిద్ధయః

అనుషంగాత్సమాఖ్యాతాః సృష్టిసర్గం నిబోధత

విస్తేరేనానుపూర్వ్యా చ క్షితిం వక్ష్యే యుగేష్వీహా

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయేఽనుషంగపాదే చతుర్యుగాఖ్యానం నామైకత్రింశత్తమోఽధ్యాయః

ఈ విధముగా జరిగిపోయిన ముందు జరుగవలసిన సర్వయుగముల యొక్క లక్షణములు, అన్ని మన్వంతరములలో క్రమముగా సూక్ష్మముగా వివరింపఁబడినవి. ఒక మన్వంతరము వర్ణింపఁబడినచో సర్వ మన్వంతరములు వర్ణింపఁబడినట్లుగానే గ్రహింపుము. అట్లే ఒక కల్పము వర్జింపఁబడినచో ఇతర కల్పము వర్ణింపఁబడినట్లే తెలిసికొనుము. ఆ విధముగనే భవిష్యన్నన్వంతర కల్పము లందలి పరిస్థితులు గూడ పండితులచే అనుమాన లక్షణమును బట్టి తెలిసికొనవలయును. భూత భవిష్యన్మన్వంతరములలో సర్వజీవులు తుల్యాభిమానులు, తుల్య నామ రూపములతో నుందురు. (121,124) ఈ మన్వంతరములో అధికారులయిన అష్టవిధులైన దేవతలు, ఋషులు, మనువులు, వారందరు వారీ ప్రయోజనము దృష్ట్యా సమానులే. పూర్వ యుగము నందు ప్రభువు (భగపోసుఁడు) వర్ణాశ్రమముల యొక్క విభోగమును కల్పించును. ఆ విధముగనే యుగ స్వభావములను గూడ ఆ ప్రభువు విధించును.  వర్ణముల యొక్క ఆశ్రమముల యొక్క విభాగములు, యుగములు, యుగ సంబంధమైన సిద్దుల అనుషంగమునుండి (కావలసిన ఫలితములుగా) వర్ణింపబడినవి. ఇక సృష్టి యొక్క సర్గమును గ్రహించుడు. ఇక యుగముల యొక్క స్థితిని (పరిస్థితిని) క్రమముగా విస్తరించి వర్ణించెదను.

ఇది వాయు ప్రోక్తమయిన బ్రహ్మాండ మహాపురాణమందలి పూర్వభాగమందలి ద్వీతీయానుషంగపాదమున చతుర్యుగాఖ్యానమనెడి ముప్పది యొక్కటవ అధ్యాయము.