బ్రహ్మాండ మహా పురాణము
16 - దాన ప్రశంస
బృహస్పతి రువాచ :-
అతః పరం ప్రవక్ష్యామి దానాని చ ఫలాని చ ।
తారణం సర్వభూతానాం స్వర్గమార్గసుఖావహమ్ ॥
లోకే శ్రేష్ఠతమం సర్వమాత్మనశ్చైవ యత్ప్రియమ్ ।
సర్వం పితృణాం దాతవ్యం తేషామేవాజ్ఞయార్థినా ॥
జాంబూనదమయం దివ్యం విమానం సూర్యసన్నిభమ్ ।
దివ్యప్సరోభిః సంపూర్ణమన్నదో లభతేఽక్షయమ్ ॥
సవ్యంజనం తు యోదద్యాదహతం శ్రాద్ధకర్మణి ।
ఆయుః ప్రకాశమైశ్వర్యం రూపం చ లభతే శుభమ్ ॥
యజ్ఞోపవీతం యోదద్యాచ్చ్రాద్ధకాలే తు యజ్ఞవిత్ ।
పావనం సర్వవిప్రాణాం బ్రహ్మదానస్య తత్ఫలమ్ ॥
ప్లుతం విప్రేషు యోదద్యాచ్చ్రాద్ధకాలే కమండలుమ్ ।
మధుక్షీరాజ్యదధిభిర్దాతారముపశిష్ఠతే ॥
చక్రావిద్ధం చ యోదదాచ్చ్రాద్ధ కాలే కమండలుమ్ ।
ధేనుం సలభతే దివ్యాం పయోదాం సుఖదోహినీమ్ ॥
తూలపూర్ణే చ యోదద్యాత్పాదుకే శ్రాద్ధకర్మణి ।
శోభనం లభతే యానం పాదయోః సుఖమేధతే ॥
వ్యజనం తాలవృంతం చ దత్వా విప్రాయ సత్కృతమ్ ।
ప్రాప్నుయాత్సర్వపుష్పాణి సుగంధీని మృదూని చ ॥
శ్రాద్ధే హ్యుపానహౌ దత్వా బ్రాహ్మణేభ్యః సదా బుధః ।
దివ్యం చ లభతే మనం వాజీయుక్తం నవం తథా ॥
శ్రాద్ధే ఛత్రం చ యో దద్యా త్పుష్పమాలాన్వితం తథా ।
ప్రాసాదో హ్యుత్తమో భూత్వా గచ్ఛంతమనుగచ్ఛతి ॥
శరణం రత్నసంపూర్ణం సశయ్యాభోజనం బుధః ।
శ్రాద్ధే దత్వా యతిభ్యస్తు నాకపృష్ఠే మహీయతే ॥
ముక్తావైదూర్యవాసాంసీ రత్నాని వివిధాని చ ।
వాహనాని చ దివ్యానీ ప్రయుతాన్యర్భుదాని చ ॥
సుమహద్వ్యోమగం పుణ్యం సర్వకామసమన్వితమ్ ।
చంద్రసూర్యనిభం దివ్యం విమానం లభతేఽక్షయమ్ ॥
అప్సరోభిః పరివృతం కామగం సుమనోజవమ్ ।
వసేత్స తు విమానాగ్రే స్తూయమానః సమంతతః ॥
దివ్యైః పుష్పైశ్చతశ్చాహుర్ధానానాం పరమం బుధాః ।
సుశ్లక్ష్ణాని సువర్ణాని శ్రాద్ధే పాత్రాణి దాపయేత్ ॥
బృహస్పతి యిట్లు చెప్పెను.
ఇంక దానములను తత్సలములను గూర్చి చెప్పెదను, అయ్యవి సర్వభూతములకు తారణోపాయములు. స్వర్గమార్గమునకు సుఖావహములు. (1) లోకముననేది శ్రేష్ఠతమమయినదో, తనకు నత్యంత ప్రియమో తత్సర్వము పితరుల కొఱకు నీయబడవలయును. పితృ దేవతల యొక్క ఆజ్ఞలనపేక్షించు వ్యక్తి. (2) పిత్రాజ్ఞా పాలనాభిలాషియైన వ్యక్తి. అన్నమును దానము చేయుదాత, బంగారు వికారమయినది, దీప్యమైనది, సూర్య సన్నిభ ప్రకాశము గలదీ, దివ్యలయిన అప్సరోవనితలతో సంపూర్ణమయినదియు అక్షయమయినదియునగు విమానమును పొందును. (3) శ్రాద్ధకర్మ యందు నెవ్వఁడు వ్యంజనములతో గూడిన అన్నమును నిరభ్యంతరముగ నొసంగునో ఆతఁడు ఆయుర్వృద్ధిని, లేజస్సును, ఐశ్వర్యమును, రూపమును శుభమును పొందును. (4) యజ్ఞముల విధానముల నెతీంగిన వ్యక్తి, శ్రాద్ధ కాలమున సర్వ విప్రులకు పావనమయిన యజ్ఞోపవీతమొసంగిన బ్రహ్మదాన ఫలితము నొందును. బ్రహ్మము వేదము, వేదదానము చేసిన గలుగు ఫలితమును పొందును. (5) శ్రాద్ధ కాలమందెవ్వఁడు విప్రులకు ఫుతము (నీటితో నిండిన) కమండలము నొసంగునో, యతనికి, తేనె, పాలు, నెయ్యి, పెరుగుతో గూడిన కమండలువు వచ్చి చేరును. (6) శ్రాద్ధ కాలమున చక్రావిద్ధము (చక్రములతో గూడిన?) కమండలువు నొసంగిన దాతకు దివ్యమైనదీ సుఖముగా పుష్కలముగా పాలొసంగునట్టిదియునగు ధేనువు లభించును. (7} శ్రాద్ధకర్మ యందు మెత్తని కుషన్సు'తో గూడిన పాదుకద్వయము నొసంగీన, దాత మంగళకర పొహనమును పొందును. పాదములకు సుఖమధికమగును. (8) విప్రుని సత్కరించీ, తాటీయాకుల విసనకర్ర (తాళపత్రము) నొసంగిన దాత సుగంధయుతములు, మృదువులు, నయిన సర్వ పుష్పముల పొందును. (9) శ్రాద్దమున విప్రులకు పాదరక్షా ద్వయ మొసంగిన ఆ దాత, దివ్యము, సవ్యము, గుఱములతో పూంచబడినదగు శకటమును పొందును. (10) ఎవ్వఁడు శ్రాద్ధము నందు, పుష్పమాలాలంకృతునిచేసి, బ్రాహ్మణునకు ఛత్రమును (గొడుగును) నొసంగునో, అయ్యదొక యుత్తమ ప్రాసాదమై యాతని ననుసరించును. రత్న సంపూర్ణమయిన శరణమును (భోజనమును, పాత్రను) శయ్యా భోజన సహితముగా యతికి నొసంగినచో పండితుఁడయిన యాబుధుఁడు స్వర్గమున గౌరవము నొందును. (12) అంతియేకాక యా వ్యక్తీ యీ క్రింద చెప్పఁబడిన వస్తువులను పొందును. ముత్యములు, వైడూర్యములు, వస్త్రములు, వివిధ రత్నములు, దీవ్య వాహనములు, అసంఖ్యాకములుగా పొందును. గొప్పదియైనది, యాకాశమున ప్రయాణించునది, పుణ్యప్రదమైనది, సర్వకామ సమన్వితము, చంద్ర సూర్య కాంతులతో తుల్యమయినదియు, అక్షయమయినదియునగు విమానమును పొందును. అయ్యది అప్సరః కాంతలచే పరివృతమై యుండును. కామగమనము (కోరికను బట్టి ప్రయాణీంచునట్టిది) గలిగినది, మనోవేగము గలిగినది. ఆ విమానాగ్రమున, అంతటను జనులచే పొగడ్తల నందుచు నాతండు వసించును, (15) ఆతఁడు దివ్యమయిన పుష్పములతో నిండియుండును. ఇయ్యది దానములలోని కెల్ల శ్రేష్ఠతమమయిన దానమని బుధులు చెప్పెదరు. శ్రాద్ధము నందు చక్కనివిలువయిన సువర్ణ పాత్రలను యజమాని బ్రాహ్మణుల కొసంగవలేను. (16)
రసాస్తముపతిష్ఠంతి భక్ష్యం సౌభాగ్యమేవ చ ।
తిలానీక్షూంస్తథా శ్రాద్దే ద్విజేభ్యః సంప్రయచ్ఛతి ॥
మిత్రాణీ లభతే లోకే స్త్రీషు సౌభాగ్యమేవ చ ।
యః పాత్రం తైజసం దద్యాన్మనోజ్ఞం శ్రాద్ధభోజనైః ॥
పాత్రం భవతి కామాసాం రూపస్య చ ధనస్య చ ।
రాజతం కాంచనం వాపి యో దద్యాచ్చ్రాద్ధకర్మణి ॥
దానాత్తు లభతే కామాన్ప్రాకాశ్యం ధనమేవ చ ।
ధేనుం శ్రాద్ధేషు యో దద్యాధ్గృష్టం కుంభోపదోహినీమ్ ॥
గావస్తముపతిష్ఠంతి నరం పుష్టిస్తథైవ చ ।
దద్యాద్యః శిశిరే చాగ్నిం బహుకాష్ఠం ప్రయత్నతః ॥
కాయాగ్నిదీప్తం ప్రాకాశ్యం సౌభాగ్యం లభతే నరః ।
ఇంధనాని తు యో దద్యాద్ద్విజేభ్యః శిశిరాగమే ॥
నిత్యం జయతి సంగ్రామే శ్రియా జుష్టస్తు జాయతే ।
సురభీణి చ మాల్యానీ గంధవంతి తథైవ చ ॥
పూజయిత్వా తు పాత్రేభ్యః శ్రాద్ధే సత్కృత్య దాపయేత్ ।
గంధమాల్యం మహాత్మానం సుఖాని వివిదానీ చ ॥
దాతారముపతిష్ఠంతి యువశ్యశ్చ పతివ్రతాః ।
శయనాసనయానాని భూమయో వాహనాని చ ॥
శ్రాద్ధేష్వేతాని యో దద్యాదశ్వమేధఫలం లభేత్ ।
శ్రాద్ధకాలే గుణవతి విప్రే వై సముపస్థితే ॥
ఇష్టద్రవ్యం చ యోదద్యాత్స్కృతిం మేధాం చ విందతి ।
సర్పిఃపూర్ణానీ పాత్రాణి శ్రాద్ధే సత్కృత్య దాపయేత్ ॥
కుంభోపదోహాగృష్టీనాం బహ్వీనాం ఫలమశ్నుతే ।
శ్రాద్దే యథేప్సితం దత్వా పుండరీకఫలం లభేత్ ॥
వనం పుష్పఫలో పేతం దత్వా గోసవమశ్నుతే ।
కూపారామతడాగాని క్షేత్రగోష్ఠగృహాణి చ ॥
దత్వా మోదంతి తే స్వర్గే నిత్యమాచంద్రతారకమ్ ।
స్వాస్తీర్ణం శయనం దత్వా శ్రాద్ధే రత్నవిభూషితమ్ ॥
పితరస్తస్య తుష్యంతీ స్వర్గలోకం సమశ్నుతే ।
అస్మిoల్లోకే చ సంపన్నం స్యందనం చ సువాహనైః ॥
అష్టాభిః పూజ్యతే పాత్రధనధాన్యైశ్చ వర్థతే ।
పర్ణకౌశేయపట్టోర్ణే తధా ప్రావారకంబలౌ ॥
అజినం కాంచనం పట్టం ప్రవేణీం మృగలోమకమ్ ।
దద్యాదేవానీ విప్రాణాం భోజయిత్వా యథావిధి ॥
రసములను ఫలద్రవములను భక్ష్యముల నొసంగవలయును, తత్పలితముగా సౌభాగ్యవంతుఁడగును. శ్రాద్దములో బ్రాహ్మణులకు, తిలలను, చెణకు ముక్కలను ఇచ్చు యజమాని లోకమున స్నేహితులను పొందును. స్త్రీల యందు సౌభాగ్యము నందును. శ్రాద్ధ భోజనములతో సుందరములు ప్రకాశవంతములునయిన లోహ పాత్రల నొసంగిన దాత ప్రేమాస్పదుఁడగును, రూపవంతుఁడు ధనవంతుఁడు నగును, శ్రాద్ధకర్మ యందు వెండినీగాని బంగారమునుగాని యిచ్చిన యతఁడు, కామములను తత్ఫలితముగా పొందును. ప్రకాశమును ధనమును కూడబడయును. శ్రాద్ధకర్మ యందు బ్రాహ్మణులకు తొలిచూలి ఆవును (ఘృష్టి కుంభముల కొలఁదీ పాలిచ్చు దాని నోసంగిన, ఆ దాతకు గోవులు కలుగును. ఆతఁడు సుపుష్టి మంతుఁడగును. శిశిర కాలమున బహుకాష్ఠయుతముగా నగ్నిని బ్రాహ్మణులకు నొసంగిన అతఁడు అగ్నితుల్య శరీర దీప్తిని పొందును, సౌభాగ్యము నందును. శిశిర కాలము యొక్క ఆగమమున (శీతకాలమున) బ్రాహ్మణులకు సమిధల నొసంగు నతఁడు నిత్యము సంగ్రామమున విజయవంతుఁడగును సిరిసంపదలతో నిండి ఆతఁడు మరల జన్మించును. (22) శ్రాద్దము నందు బ్రాహ్మణులకు సత్కరించి, పాత్రులయిన వారికీ, మహాత్ములకు గంధమాల్యముల సమర్పింపవలెను. తత్ఫలితముగా దాతను పతివ్రత అయిన యువతులు చేరుదురు. శ్రాద్ధ కర్మల యందు, శయనములను, ఆసనములను, యానములను, విశేష వాహనములను, బ్రాహ్మణులకు నొసంగిన ఆ కర్తకు అశ్వమేధ యాగమాచరించిన ఫలము లభించును. (25) శ్రాద్ధ కాలమున గుణవంతుఁడగు విప్రవర్యుఁడు సముపస్థితుఁడు కాగా ఆతనికిష్ట ద్రవ్యము నొసంగినచో కర్త మంచి జ్ఞాపక శక్తినీ బుద్దీ బలమును పొందును. బ్రాహ్మణుని సత్కరించి, శ్రాద్ధ కర్మయందు భృతపూర్ణ పాత్రము నొసంగవలయును. తత్ఫలితముగా దాత, కుంభముల కొలదీపాలనొసగు ఆవులననేక మొసంగిన ఫలితము నొందును. బ్రాహ్మణునకు కోరిన దాని నొసంగిన దాత పౌండరీక చయనము చేసిన వచ్చు ఫలితము నందును. (28) పుష్ప ఫలో పేతమయిన వనము నొసంగిన దాత గోసవ తుల్య ఫలమందును. కూపములను, తోటను, తటాకములను, క్షేత్రములను, గోశాలలను, గృహములను ఇచ్చిన దాతలు ఆచంద్ర తారకము నిత్యమును సంతోషించెదరు. శ్రాద్ద సమయమున (వస్త్రముతో} ఆవృతమయినదియు, రత్న విభూషితమునయిన శయనమును (పరుపును) ఇచ్చినచో ఆ దాతయొక్క పితరులు సంతోషించెదరు. దాత స్వర్గ లోకమును పొందును. ఈ లోకమున దాత వాహనములతో గూడినది సుసంపన్నమైనదియు నగు స్యందనమును పొందును. (31) ఆతఁడు ఎనిమిది వాహనములతో పూజింపఁబడును. ధనధాన్యముల సంవృద్ధి నందును. యధావిధి బ్రాహ్మణులను చర్చించిన, పిమ్మట వారికీ క్రింది వస్తువుల నొసంగవలెను. పర్లవస్త్రములు, సిల్కు వస్త్రములు, ఊలు వస్త్రములు, కంబళులు, పరుపులపై పరుచు ప్రావారములు, అజినములు, సువర్ణపట్టము, ప్రవేణీని (రంగులతో నుండి ఊలు గుడ్డ) మృగలోమకము (లేడి రోమములతోఁ జేసిన కంబళి). (33)
ప్రాప్నోతి శ్రద్ధధానస్తు వాజపేయఫలం నరః ।
ఐహుభార్యాః సురూపాశ్చ పుత్రాః భృత్యాశ్చ కింకరాః ॥
వశే తిష్టంతీ భూతాని లోకే చాస్మిన్నిరామయమ్ ।
కౌశేయం క్షౌమకార్పాసం దుకూలం గహనం తథా ॥
శ్రాద్దే చైతా యో దద్యాత్కామానాప్నోత్యనుత్తమాస్ ।
అలక్ష్మీం నాశయంత్యేతే తమః సూర్యోదయో యథా ॥
భ్రాజతే చ విమానాగ్రే నక్షత్రేష్వివ చంద్రమాః ।
వాసో హి సర్వదైవత్యే సర్వదేవైరభిస్తుతమ్ ॥
వస్త్రాభావే క్రియా నాస్తి యజ్ఞదానతపాంసి చ ।
తస్మాద్వస్త్రాణి దేయాని శ్రాద్ధకాలే తు నిత్యశః ॥
తానీ సర్వాణ్యవాప్నోతి శ్రాద్ధే దత్వా తు మానవః ।
నీత్యశ్రాద్దే తు యోదద్యాత్ప్రయతస్తత్పరాయణాః ॥
సర్వకామాసవాప్నోతి రాజ్యం స్వర్గం తథైవ చ ।
సర్వకామసమృద్ధస్య యజ్ఞస్య ఫలమశ్నుతే ॥
భక్ష్యజాతం తు సుకృతం స్వస్తికాద్యం సశర్కరమ్ ।
కృసరం మధుసర్పిశ్చ పయః పాయసమేవ చ ॥
స్నిగ్ధప్రాయశ్చ యోదద్యాదగ్నిష్టోమఫలం లభేత్ ।
దధీగవ్యమసంసృష్టం భక్ష్యాన్నానావిధాంస్తథా ॥
దత్వా న శోచతే శ్రాద్దే పర్షాసు చ మఘాసు చ ।
ఘృతేన భోజయేద్విప్రాన్ ఘృతం భూమౌ సముత్సృజేత్ ॥
ఛాయాయాం హస్తినశ్చైవ దత్వా శ్రాద్ధో న శోచతే ।
ఓదనం పాయసం సర్పర్మధుమూలఫలానీ చ ॥
భక్ష్యాంశ్చ వివిధాన్దత్వా పరత్రేహ చ మోదతే ।
శర్కరాక్షీరసంయుక్తాః పృథుకా నిత్యమక్షయాః ॥
స్యాత్తు సంవత్సరం ప్రీతిః శాకైర్మాంసరసేన చ ।
సక్తులాజాస్తాథాఽపూపాః కుల్మాషా వ్యంజనైః సహ ॥
సర్షి:స్నిగ్ధాని సర్వాణి దధ్నా సంస్కృత్య భోజయేత్ ।
శ్రాద్ధేష్వేతానీ యో దద్యాత్పద్మం స లభతే నిధిమ్ ॥
నవసస్యాని యో దద్యాచ్చ్రాద్దే సత్కృత్య యత్నతః ।
సర్వభోగానవాప్నోతి పూజ్యతే చ దివం గతః ॥
భక్ష్యభోజ్యాని పేయాని చోష్యలేహ్యవరాణి చ ।
భోజనాగ్రాసనం దత్వా అతిధిభ్యః కృతాంజలిః ॥
సర్వయజ్ఞ క్రతూనాం హి ఫలం ప్రాప్నోత్యనుత్తమమ్ ।
క్షిప్రమత్యుష్ణమక్లిష్టం దద్యాదన్యం బుభుక్షితే ॥
అత్యధికమయిన శ్రద్ధా విశ్వాసములు కలవాఁడు 'వాజపేయ' యజ్ఞ ఫలితము నొందును. సురూపురాండ్రయిన యనేక భార్యలు, పుత్రులు, సేవకులు, ఓంకరులు, అతని వశవర్తులై యుందురు. ప్రపంచమున భూతములన్నియు అతని వశమందుండును. ఆతఁడో నిరామయుం డగును. రోగరహితుఁడగును. శ్రాద్ధమునందు, సిల్కు వస్త్రమును, మెత్తని నూలు వస్త్రమును ఎవ్వడు బ్రాహ్మణుల కొసంగునో, ఆతఁడు ఉత్తమమయిన కామముల నన్నింటినీ పొందును. సూర్యుఁడు చీకటినీ నాశనము చేయునట్లు ఆ పదార్ధములు అలక్ష్మిని నిర్మూలించును. (14,36) నక్షత్రముల యందు చంద్రుని వలె, విమానాగ్రమున స్వర్గమున నతఁడు ప్రకాశీంచును. దేవతాపూజలయందు సర్వదేవతలు వస్త్రమును స్తోత్రము చేసిరి. (37) వస్త్రము లేకపోయినచో, ఏ క్రియయు లేదు. యజ్ఞము లేదు. దానము లేదు. తపస్సులు లేవు. అందుచే శ్రాద్ధ కాలమున ఎల్లప్పుడును వస్త్రము లొసంగబడవలెను. శ్రాద్దము నందు వస్త్రముల నొసంగి మానవుడు సమస్తమును పొందును. నీత్య శ్రాద్దమునందు ప్రయత్నపూర్వకముగా తత్పరాయణుఁడై యెవ్వడు వస్త్రము నొసంగునో యతడు సర్వకామ్య సమృద్ధినీ, రాజ్యమును, స్వర్గమును, పొందును. అంతీయేకాక, సర్వకామ సమృద్దమయిన యజ్ఞముయొక్క ఫలితమును పొందును. (40) ఈ క్రింది వస్తువుల బ్రాహ్మణులకు శ్రాద్ధకర్మ యందొసంగు నతఁడు అగ్నిష్టోమ యజ్ఞ ఫలితము నొందును. వర్షాకాలమునగాని మఖ నక్షత్రము నందుగాని బాగుగా నుడికిన (సుకృత) భక్ష్యజాతము, శర్కరతో స్వస్తిక (ఒక పిండివంట) కృసరము (బియ్యముతో నువ్వులతో కలిపి చేయు తినుబండారము) తేనె, నెయ్యి, పాలు, పాయసము, నేతిలో గాని నూనెతోగాని వేయించిన పిండివంటలు, పెరుగును. ఒండొంటితో కలిసినవి కానట్టి గవ్యలనులు, నానావిధ భక్ష్యములను, శ్రాద్దమున నొసంగినవాడు దుః ఖమునందడు. బ్రాహ్మణులకు నేతితో భోజనము పెట్టి, నేతిబొట్లు కొన్ని నేలపయి విడువవలెను. శ్రాద్ధమును ఏనుఁగు నీడలో గజచ్ఛాయలో) పెట్టి విచారింపనివాడు, అన్నము, పొయసము, నేయి, తేనె, మూలములు, ఫలములు వివిధములయిన భక్ష్యములను పెట్టి, ఇహ లోకమున పరలోకమున ఆనందించును, పోలతో పంచదారతో కలిపిన అటుకులు ఒసంగీన ఆదీ అక్షయ లాభము కూర్చును. (45) శాకములతో ఫల రసములతో పెట్టిన సంతృప్తి యొక సంవత్సరము వరకు నుండును, వరిపిండి (సకు) పేలాలు, అపూపములు, కుల్మాషములు (తియ్యని బియ్యముతోడి పప్పులు) వ్యంజనములు మొదలగు వానిని ఎవ్వఁడు పెరుగుతో సంస్కరించి శ్రాద్దమున బ్రాహ్మణుల కొసంగునో అతఁడు కుబేర సదృశ మయిన పద్మ నిధిని పొందును. నవ సస్యముల నెవ్వఁడు సంస్కరించి బ్రాహ్మణులను యత్నపూర్వముగా సత్కరించి శ్రాద్దమున నొసంగునో నయతఁడు సర్వభోగములను పొందును. స్వర్గమున కరిగి పూజింపఁబడును. శ్రాద్ధమున భక్ష్య, భోజ్య, పేయ, చోష్య, లేహ్యాదులయిన పంచ పదార్థముల పెట్టవలయును. కృతాంజలియై అతిథులకు అగ్రాసనమీయవలెను. అట్లు చేసిన సర్వ యజ్ఞములను క్రతువుల నాచరించిన ఫలితము దాత పొందును. ఆకలిగొన్న వానికి వెంటనే భోజన మీడవలెను. అత్యుష్ణము, అక్లిష్టముగా నున్న అన్నము నీడవలెను. (50)
సవ్యంజనం తథా స్నిగ్ధం భక్త్యా సత్కృత్య యత్నతః ।
తరుణాదిత్యసంకాశం విమానం హంసవాహనమ్ ॥
అన్నదో లభతే నిత్యం కన్యాకోటీస్తథైవ చ ।
అన్నదానాత్పరం దాసం సన్యత్కించిత్తు విద్యతే ॥
అన్నాద్భూతాని జాయంతే జీవంతి ప్రభవంతి చ ।
జీవదానాత్పరం దానం నాన్యత్కించన విద్యతే ॥
అన్నాల్లోకాః ప్రతిష్ఠంతి లోకదానస్య తత్ఫలమ్ ।
అన్నం ప్రజాపతిః సాక్షాత్తేన సర్వమిదం తతమ్ ॥
తస్మాదన్నసమం దానం న భూతం న భవిష్యతి ।
యానీ రత్నానీ మేదిన్యాం వాహనాని స్త్రీయస్తథా ॥
క్షిప్రం ప్రాప్నోతి తత్సర్వం పితృభక్తస్తు యో నరః ।
ప్రతిశ్రయం చ యోదద్యాదతిథిభ్యః కృతాంజలిః ॥
దేవాస్తం సంప్రతీక్షంతి దివ్యాతిథ్యైస్సహస్రశః ।
సర్వాణ్యేతాని యో దద్యాద్పృథివ్యామేకరాట్ భవేత్ ॥
త్రిభిర్ద్వాభ్యామథైకేన దానేన తు సుఖీ భవేత్ ।
దానాని పరమో ధర్మః సద్భిః సత్కృత్య పూజితః ॥
త్రైలోక్యస్యాధిపత్యం హి దానేనైవ ధ్రువం స్థితమ్ ।
అరాజా లభతే రాజ్యమధనశ్చోత్తమం ధనమ్ ॥
క్షీణాయుర్లభతే చాయుః పితృభక్తః సదా నరః ।
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తీ మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే
శ్రాద్దకల్పే దానప్రశంసా నామ షోడశోఽధ్యాయః॥
వ్యంజనములతో కూడినది, సిగ్గమయినదియునగు భోజనమును అతిధిని సత్కరించి భక్తితో శ్రద్ధాయుతముగ నొసంగినచోదాత తరుణాదీత్య సంకాశము, హంస వాహనము నయిన విమానమును పొందును. అన్నదాత కోటీశః కన్యకల నందును. అన్నదానము కంటే ఉత్కృష్టమైన దానము వేటిక్కటి యేదియును లేదు. (52) అన్నము వలన భూతములు పుట్టును. బ్రతుకు శక్తిమంతము నగును. ప్రాణదానము కంటే ఉత్కృష్టమయిన దానము వేతాకటి లేదు. (53) అన్నము వలన లోకములు ప్రతిష్ట నొందుచున్నవి. తత్ఫలితము లోకదాన తుల్యమయినదీ. అన్నము సాక్షాత్తుగా ప్రజాప్రతీ. ఈ దృశ్యమాన ప్రపంచమంతయు అన్నముతో వ్యాప్తమై యున్నది. (54) అందుచే అన్నదానముతో సమమయిన దానము ఇంతవరకు లేదు. ఇక భవిష్యత్తులో నుండదు. ప్రపంచమున ఏరత్నములు, వాహనములు స్త్రీలు ఉన్నవో ఉన్నారో వాని నన్నింటిని పితృభక్తుఁడైన నరుఁడు వెంటనే పొందును. దిద్దాంజులియై భక్తితో నెవ్వఁడు అతిథులకు ప్రతిశ్రయము (నివాసము లేదా ఆశ్రయము) ఒసంగునో దేవతలు ఆతని కొరకు దివ్యమైన ఆతిథ్య సత్కార సహస్రములతో ప్రతీక్షించుచుందురు, ఎవ్వడీ వస్తువుల సన్నింటి నొసంగునో ఆతఁడు యావత్రపంచమునకు ఏకచ్ఛత్రాధీపతియగును. (57) మూఁడుగాని, రెండుగాని అధమము ఒక్కటి కాని దానము నొసంగిన దాత సుఖీ అగును. దానములు పరమ ధర్మములు. అయ్యప్ సత్పురుషులచే గౌరవింపఁబడునవి. పూజింపబడునవి. (58} త్రైలోక్యము యొక్క ఆధిపత్యము దానము చేతనే ధ్రువమగును. సుస్థిరమగును. దానములచే రాజుకాని పాఁడు రాజ్యమును పొందును. ధనహీనుఁడయినపోడుత్తమ ధనమును పొందును. పితృభక్తుడు ఆయుర్దాయము లేనివాఁడు (అల్పాయుష్కుడు) ఆయుష్మంతుఁడగును.
ఇది వాయుప్రోక్తము మహాపురాణమునయిన బ్రహ్మాండపురాణమున మధ్యభాగమున తృతీయోపోద్ఘాతపాదమున శ్రాద్ధకల్పమున 'దానప్రశంస' యను పదునారవ యధ్యాయము.
Summary of chapter 54 of the Brahmānda Mahā Purana is as follows:
This sublime chapter presents the Pitṛgīta, a celestial song sung by the departed ancestors expressing their deep longing for righteous descendants who perform holy rites. The narrative vividly describes the joy of ancestral spirits when a virtuous descendant offers pure water and love in their memory. Hearing these sweet celestial verses, the faithful soul is inspired to lead a life of flawless righteousness to bring honor and peace to their spiritual lineage.