బ్రహ్మాండ మహా పురాణము
14 - శ్రాద్ధకల్పే ఆశౌచ విధిః
బృహస్పతి రువాచ :-
అతః పరం ప్రవక్ష్యామి సర్వదానఫలాని చ ।
శ్రాద్ధకర్మణి మేధ్యాని వర్ణనీయాని యాని చ ॥
హిమప్రపతనే కుర్యాదాహరేదా హిమం తతః ।
అగ్నిహోత్ర ముపాయుష్యం పవిత్రం పరమం హితమ్ ॥
నక్తం తు వర్జయేచ్చ్రాద్ధం రాహూరన్యత్ర దర్శనాత్ ।
సర్వస్వేనాపి కర్తవ్యం క్షిప్రం వై రాహుదర్శనే ॥
ఉపరాగే న కుర్యాద్యః పంకే గౌరివ సీదతి ।
కుర్వాణస్తత్తరేత్పాపం సతీ నౌరివ సాగరే ॥
వైశ్వదేవం చ సౌమ్యం చ ఖడ్గమాంసం పరం హవిః ।
విషాణవర్జం ఖడ్గస్య మాత్సర్యాన్నాశయామహే ॥
త్వష్ట్రా వై యజమానేన దేవేశేన మహాత్మనా ।
పిబఞ్చ్చీపతిః సోమం పృథివ్యాం మధ్యగః పురా ॥
శ్యామాకాస్తత్ర ఉత్పన్నాః పిత్రర్థమపరాజితా: ।
విప్రుషస్తస్య నాసాభ్యామాసక్తాభ్యాం తథేక్షవః ॥
శ్లేష్మలాః శీతలాః స్నిగ్ధా మధురాశ్చ తథేక్షవః ।
శ్యామాకైరిక్షుభిశ్చైవ పితృణాం సర్వకామికమ్ ॥
కుర్యాదాగ్రయణం యస్తు శీఘ్రం సిద్ధిమవాప్నుయాత్ ।
శ్యామాకాస్తు ద్వినామానో విహితా యజనే స్మృతే ॥
యస్మాత్తే దేవసృష్టాస్తు తస్మాత్తే చాక్షయాః స్మృతాః ।
ప్రసాతికాః ప్రియంగుశ్చ ముద్గాశ్చ హరీతాస్తథా ॥
ఏతాన్యపి సమానానీ శ్యామాకానాం గుణైస్తు తైః ।
కృష్ణమాషాస్తిలాశ్చైవ శ్రేష్ఠాస్తు యవశాలయః ॥
బృహస్పతి చెప్పేను.
ఇంక సర్వ దినముల వలన ఫలితములను గూర్చి చెప్పెదను. శ్రాద్ధకర్మ యందేవి పవిత్రములో ఏవి అపవిత్రములయినవో వానిని గూర్చి చెప్పేదను. (1) అగ్నిహోత్రమును, హిమ ప్రతవనమున ఏటవాలుగా నుండి శిఖరమున మంచు గలిగిన శిలాశిఖరమునగాని లేదా అచ్చట నుండి మంచును తెచ్చియైన, చేయవలయును. అయ్యది (ఆ యగ్ని) పవిత్రమయినది, మిక్కిలి హీతమయినది, అధికమయిన శుభమునకు దీర్గాయువునకు కారణమయినది. (2) రాత్రుల యందు శ్రాద్ధమును చేయరాదు. ఏలయన, రాహువు అన్యత్ర కానవచ్చుటచే? రాహు కనపడిన వెంటనే శ్రాద్ధమును సర్వశక్తి యుక్తుఁడై కర్త చేయవలెను. (3) గ్రహణ కాలమున శ్రాద్ధము చేయనట్టివాఁడు పంకములో దీగఁబడియున్న ఆవువలె నశించును. గ్రహణకాలమున శ్రాద్ధము నాచరించువాఁడు, ఉత్తమమయిన నావ సముద్రమును తరించునట్లు పాపములనుతరించును. (4) (ఈ శ్లోకములో ఏదియో లోపమున్నది. అర్థము సక్రముగా లేదు. శ్లోక పాఠము దోషయుతమై యుండవలయును.) వైశ్వదేవ క్రతువు నందు మరికొన్నీ సౌమ్య క్రతువులందు, ఖడ్గమృగము యొక్క మాంసము పరమమయిన హవిస్సు (అగ్నిలో వ్రేల్చదగినది) ఖడ్గమృగ మాంసమును విషాణమును (కొమ్మును) విడిచి సమర్పింతుము. (5) ఇట్లు చేయుట మాత్సర్యముచే కాదు. పూర్వ మొకప్పుడు త్వష్ట యజమానీ (హోమకర్త) అప్పుడు మహాత్ముఁడయిన దేవతా ప్రభువు అధ్యక్షుఁడు శచీపతీ యయిన ఇంద్రుఁడు సోమరసమును త్రాగుచుండెను. ఆ సోమగసబిందువులు భూమీయందు మధ్యనుపడెను. ఆ ప్రదేశమున శ్యామాకములను ధాన్యము ఫలించెను. వానీని పిత్రర్గముపయోగించిరి. ఇంద్రుని ముక్కున కంటుకొని, నాసిక నుండి యీవలకు వచ్చిన సోమరసము (ఇక్షు) చేజకు అయ్యెను. అందుచే చెఱకు శ్లేషలము, శీతలము, స్నిగ్ధము, మధురమును సర్వకామ ఫలమునకు పితృకర్మలను శ్యామాకముతోను చెఱకుతోను చేయవలయును. ‘అగ్రయణ ఇస్టీ' చేయునతఁడు (అగ్నిష్టోమమున మొదట ఆచరించిన హోమతర్పణము అగ్రయణము తన కోర్కెల యొక్క పరిపూర్తినీ ఫలమును) వెంటనే పొందును. (శ్యామాకములతో, ఇక్షువుతో చేసినచో) యజ్ఞముల కోలుకు స్కృతుల యందు శ్యామాకము రెండు నామములతో చెప్పబడినది. అవి దేవతలచే సృజింపం బడినవగుట, అక్షయములని స్మరింపఁబడుచున్నవి. ప్రసాతికములు (ఒక విధమయిన ధాన్యము) ప్రియంగువులు, మాషములు, హరితములు, గుణ విషయములో శ్యామాకములతో సమానముగా స్తోత్రము చేయఁబడినవి. నల్లని మినుమలు, తిలలు, బార్లీ, ధాన్యము, బియ్యము శ్రేష్ఠములు.
మహాయవాశ్చ నిష్పావా తథైవ చ మధూలికాః ।
కృష్ణాశ్చైవాన్నలోహాశ్చ గర్హ్యాః స్యుః శ్రాద్ధకర్మణి ॥
రాజమాషాస్తథాఽన్యే వై వర్జనీయాః ప్రయత్నతః ।
మసూరాశ్చైవ పుణ్యాశ్చ కుసుంభం శ్రీనికేతనమ్ ॥
వర్షాస్వతీయవా నిత్యం తథా వృషకవాసకౌ ।
బిల్వామలకమృద్వీహిపనసామ్రాతదాడిమాః ॥
తవశోలంయతాక్షౌద్రఖర్జూరామ్రఫలానీ చ ।
కశేరుకోవిదార్యశ్చ తాలకందం తథా బిసమ్ ॥
తమాలం శతకందం చ మద్వసూచాంతకాందికీ ॥
కాలేయం కాలతాకం చ భూరిపూర్ణా సువర్చలా ।
మాంసాక్షo దువిశాకం చ బుబుచేతాంకురస్తథా ॥
కపాలకంకణా ద్రాక్షాలకుచం చోచమేవ చ ।
ఆలాబుం గ్రీవకం వీరంకర్కంధూమరుసాహ్వయమ్ ।
వైకంకతం నాలికేరశృంగాజపకరూషకమ్ ॥
పిప్పలీ మారీచం చైవ పటోలం బృహతీఫలమ్ ।
సుగంధమాంసపీవంతి కషాయాః సర్వ ఏవ చ ॥
ఏవమాదీని చాన్యాని వరాణి మధురాణి చ ।
నాగరం చాత్ర వై దేయం దీర్ఘ మూలక మేవ చ ॥
వంశః కరీర: సురస: సర్జకం భూస్తృణానీ చ ।
వర్జనీయాని వక్ష్యామీ శ్రాద్ధకర్మణి నిత్యతః ॥
లశునం గృంజనం చైవ పండుం పిండమూలకమ్ ।
కరంభాద్యానీ చాన్యాని హీనాని రసగంధతః ॥
శ్రాద్ధకర్మణి వర్జ్యానీ కారణం చాత్ర వక్ష్యతే ।
పురా దేవాసురే యుద్ధే నిర్జితస్య బలే: సురైః ॥
శరైస్తు విక్షతాదంగా త్పతిరా రక్తబిందవః ।
తత ఏతాని జాతాని లశునాదీని సర్వతః ॥
తథైవ రక్తనిర్యాసా లవణాన్యౌషరాణి చ
శ్రాద్ధకర్మణి వర్జ్యాని యాశ్చ నార్యో రజస్వలాః ॥
మహాయవలు, నిష్పావలు, మధూలికలు, కృష్ణయవలు, కృష్ణ పర్లలోహములు శ్రాద్ధకర్మయందు గర్వములు (ఉపయోగింపదిడ నిషిద్ధములు). రోజు మాషధాన్యములు (గజమాష) ఇతరములు, ప్రయత్న పూర్వకముగా-పరిత్యజించవలెను. మసూరములు (చిన్తనగ ధాన్యములు) పుణ్యదములు. కుసుంభము (కుసుమ ధాన్యము) లక్ష్మీనికేతనము (13) ఈ క్రింద పేర్కొనంబడిన వస్తువులు మధురములైనవి. ఇట్టివి మరికొన్ని శ్రాద్ధకర్మకు శ్రేష్ఠములు. అత్యవలు (వర్షకాలమున లభించును). వృషకము (ఒక మొక్కపేరు) వాసకము, బిల్వము, ఆమలకము, మాధ్వీకము (ద్రాక్ష) పనస, ఆమ్రాతము, దాడిమము' (దానిమ్మ) తవశోలంయత (?) క్షౌద్రము, ఖర్జూరము, ఆమఫలము (మామిడి), కశేరువు, కోవిదార్యము, తోలకందము, విసము, (తామరపువ్వు), తమాలము, శతకందము, మద్వసూద్ధాంతము, కాందిని, కాలేయము, కాలశాకము, భూరి పూర్ణము, సువర్చల, మాంసాక్షము, దువిశాకము, బుబుచేతాంకురము, కషాలకము, కణ, ద్రాక్ష, లకుచము, చౌచము, ఆలాబు, (గుమ్మడి), గ్రీవాకము, వీరము, కర్కంధువు, మధుసాహ్వయము, వైకంకటకము, నాలికేరము (కొబ్బరి) శృంగాజపకము, రూషకము, (చారుచాకము), పిప్పలి, మారీచం (మిరియాలు), పటోలము, బృహతి. సుగంధయుతమయిన బలిష్ఠ జంతువుల మాంసము (?) సర్వకషాయములు, ఇతరములయిన 'నాగరముల వంటివి, దీర్ఘమూలకము వంశ కరీరము (వేదురువేరు), సురసము, సర్జకము, సాలవృక్షము) భూస్తృణములు - వీనిని శ్రాద్ధములో వాడవచ్చును." శ్రాద్ధకర్మ యందు నిత్యము విసర్జింపఁదగినవి చెప్పెదను. లశునము (వెల్లుల్లి) గృంజనము (కారబ్ది) పలాండు (ఉల్లిపాయ) పిండమూలకము, కరంభము (పెరుగులో కలిపిన పిండి) ఇవికాక, రసగంధ హీనములయినవి యగు అన్యపదార్ధములు శ్రాద్ధకర్మ యందు వర్ణ్యములు. కారణము చెప్పబడుచున్నది. పూర్వము దేవాసుర యుద్ధము నందు సురల శరములచే బలి నిర్జింపఁబడ, గాయపడిన ఆతని శరీరము నుండి రక్తబిందువులు కారినవి. ఆ రక్త బిందువుల వల్ల లశునాదికములు సర్వత్ర పుట్టినవి. అట్లే రక్తనిర్యాసలు (రక్తపు ధారలు) లవణములు ఊషర క్షేత్రముల గలిగినవి. అందుచే శ్రాద్ధ కర్మల యందు వానినీ విసర్జింపవలయును. రజస్వలలయిన స్త్రీలు వర్ణింపఁదగినవారు శ్రాద్ధకర్మల కుపయోగింపబడరాదు.
దుర్గంధం ఫేనీలం చైవ తథా వై పల్వలోదకమ్ ।
లభేద్యత్ర న గౌస్తృప్తిం నక్తం యచ్చైవ గృహ్యతే ॥
ఆవికం మార్గమౌష్ట్రం చ సర్వమేకశఫం చయత్ ।
మాహిషం చామరం చైవ పయోవర్జ్యం వీజానతా ॥
అతః పరం ప్రవక్ష్యామి వర్జ్యాన్ దేశాన్ ప్రయత్నతః ।
న ద్రష్టవ్యం చ యైః శ్రాద్ధం శౌచాశౌచం చ కృత్స్నశః ॥
వన్యమూలపలైర్భక్షైః శ్రాద్ధం కుర్యాత్తు శ్రద్ధయా ।
రాజనీష్ఠామవాప్నోతి స్వర్గమక్షయమేవ చ ॥
అనిష్ట శబ్దాం సంకీర్ణాం జంతువ్యాప్తా మథావిలామ్ ।
ఫూతిగంధాం తథా భూమీం వర్జయేచ్చ్రాద్ధకర్మణి॥।
సద్యః సాగరపర్యంతా ద్వారం దక్షిణపూర్వతః ।
త్రిశంకోర్వర్జయేద్దేశం సర్వం ద్వాదశయోజనమ్ ॥
ఉత్తరేణ మహానద్యా దక్షిణేన చ వైకటమ్ ।
దేశాస్త్రిశంకవో నామ వర్జ్యా వై శ్రాద్ధకర్మణి ॥
కారస్కరాః కళింగాశ్చ సింధోరుత్తర మేవ చ ।
ప్రనష్టాశ్రమధర్మాశ్చ వర్జ్యా దేశాః ప్రయత్నతః ॥
నగ్నదయో న పశ్యేయుః శ్రాద్ధకర్మ వ్యవస్థితమ్ ।
గచ్ఛంత్యేతైస్తు దృష్టాని న పితరాంశ్చ పితామహాన్ ॥
శంయురువాచ:-
నగ్నాదీన్ భగవన్ సమ్యగాచక్ష్వ పరిపృచ్ఛతః ।
బృహస్పతి రువాచ:-
సర్వేషామేవ భూతానాం త్రయీసంవరణం స్మృతమ్ ॥
తాం వై త్యజంతి సంమోహత్తే వై నగ్నాదయో జనాః ।
ప్రతీయతే వృషో యస్మిన్నరాలంబశ్చ యో వృషే ॥
వృషం యస్తు పరిత్యజ్య మోక్షమన్యత్ర మార్గశి వృషో ।
వేదాశ్రమస్తస్మిన్యో వై సమ్యజ్న పశ్యతి ॥
దుర్గంధయుతము, నురుగుతో గూడినది, గుంటలలోనిది (పల్వలములు) ఆవు నీటిని త్రాగి తృప్తి పడనిదియు నగు నీటినుపయోగింప రాదు. రాత్రీ తోడికాని తేచ్చికానీ సిలువ యుంచినదియు నయిన నీటి నుపయోగింపరాదు. (26) గొత్తపాలు, లేడిపాలు, ఒంటెలు, చీలి యుండక యొక్కటే గిట్టలున్న జంతువుల పాలు, మాహిషమయినపాలు (గేదెపాలు) చామర మృగము యొక్క పోలు, బుద్ధిమంతుఁడైనవాఁడు శ్రాద్ధమున కుపయోగింపరాదు, (27) ఇంక, శ్రాద్ద మాచరించుటకు ఏయే దేశముల తప్పక విడువవలయునో, ఎవ్వరు శ్రాద్దాచరణమును చూడరాదో, సంపూర్ణముగ శౌచాశౌచమును గూర్చి వచించేదను. (28) వనములందు లభించు, మూలములతో, ఫలములతో, భక్ష్యములతో శ్రాద్ధమాచరింపవలయును. తన్మూలమున శ్రాద్ధకర్త రాజస్థానమును, అక్షయ స్వర్గమును పొందును, (29) అనిష్టములయిన శబ్దములతో నిండిన ప్రదేశమును, ఇరుకుగా నున్న స్థలమును, అపవిత్రమయినది, జంతువులతో సంకీర్ణమయినదియు, దుర్గంధ సంకులమైనదియునగు భూమీనీ శ్రాద్దాచరణమునకు విడువవలెను. (30) సాగర పర్యంతములయిన నదులను సముద్ర తీరము నంటుకొని ప్రవహించునది) వానియాగ్నేయద్వారమును, మఱియు త్రిశంకునీ రాజ్య భాగమంతయును మొత్తము ద్వాదశ యోజన పర్యంతము భూ ప్రదేశమును శ్రాద్ధ క్రియ లాచరించుటకు విడిచి పెట్టవలయును. (31) త్రిశంకు భూములు ఉత్తరము మహానది - దక్షిణమున 'వైకట' పర్వతము వీని మధ్యనున్నట్టివి (32) కారస్కరుల దేశములు, కళింగ దేశములు, సింధునది కుత్తర ప్రదేశములు - ప్రనష్టాశ్రమ ధర్మ దేశములగుట, ప్రయత్న పూర్వకముగా ఆదేశములను శ్రాద్దాచరణమునకు పరివర్జించవలయును. (33) వస్త్ర వివర్జనము చేసిన నగ్నాదులు శ్రాద్ధకర్మ విధివత్తుగా జరుగుచుండుట చూడరాదు. ఒకవేళ నగ్నాదులు శ్రాద్ధక్రియలను చూచినచో ఆ శ్రాద్ధాదులు పీతరులకు గానీ పీతామహులకు కాని చేరవు. శంయువు ఇట్లు ప్రశ్నించేను. ఓ పూజ్య పురుషా! నగ్నాదులను గూర్చి అడుగుచుంటిని. సంపూర్ణముగా చెప్పఁగోరెదను. బృహస్పతి యిట్లు ప్రత్యుత్తరమిచ్చెను. సర్వ భూతములకు వేదత్రయి సంరక్షణ రూపమయిన ఆచ్చాదనము. నగ్నాదులు ఆ వేదములను మోహమున (మౌఢ్యముచే) పరిత్యాగము చేయుదురు. ఈ క్రింది పరిస్థితులలో బ్రాహ్మణుఁడుకాని క్షత్రియుఁడుకాని, వైశ్యుఁడు కాని నిస్సంశయముగా వృషలుఁడు (శూద్రుఁడు) 1. ఎవని యందు వేద విహీత చతురాశ్రమ ధర్మములు విలీనములగునో ఎవఁడు వేదాశ్రమ ధర్మముల పరిత్యజించునో 2.ఎవనికి వైదిక ధర్మాశ్రమ పాలనమున ఆలంబనము లేదో 3, ఎవడు వైదిక ధర్మాశ్రమ లక్షణముల విడిచి, మోక్షము కొఱకు అన్య ధర్మముల వహించునో 4, ఎవనికి వేద విహిత కర్మలయందు స్పష్ట పరిజ్ఞానము లేదో యితఁడు,
బ్రాహ్మణః క్షత్రియో వైశ్యో వృషలః స న సంశయః ।
పురా దేవాసురే యుద్ధే నిర్జితైరసురైస్తథా ॥
పాఖండా వైకృతాస్తాత తేషాం సృష్టిః ప్రజాయతే ।
వృద్ధశ్రావకినీర్గ్రంథాః శాక్యా జీవకకార్పటాః ॥
యే ధర్మం నానువర్తంతే తే వై నాగ్నాదయో జనా: ।
వృథా జటీ వృధా ముండీ వృథా నగ్నశ్చ యో ద్వీజః ॥
వృథా వ్రతీ వృథా జాపీ తే వై నగ్నాదయో జనాః ।
కులధర్మాతిగాః శశ్వద్ వృథా వృత్తికలత్రకాః ॥
కృతకర్మ దీశస్త్వేతే కుపథాః పరికీర్తితాః ।
ఏతైర్హి దత్తం దృష్టం వై శ్రాద్ధం గచ్ఛతి దానవాన్ ॥
బ్రహ్మఘ్నశ్చ కృతఘ్నశ్చ నాస్తికో గురుతల్పగః ।
దస్యుశ్చైవ నృశంసశ్చ దర్శనే తాన్వీసర్జయేత్ ॥
పతితాః క్రూరకర్మాణాః సర్వాంస్తాన్పపరివర్జయేత్ ।
దేవతానాం ఋషీణాం చ వివాదే ప్రవదంతీ యే ॥
దేవాంశ్చ బ్రాహ్మణాంశ్చైవ అమ్నాయం యస్తు నిందతి ।
అసురాన్యాతుధానాంశ్చ దృష్టమేభిర్ర్వజత్యుత ॥
బ్రాహ్మం కృతయుగం ప్రోక్తం త్రేతా తు క్షత్త్రియం యుగమ్ ।
వైశ్యం ద్వోపరమిత్యాహుః శూద్రం కలియుగం స్మృతమ్ ॥
కృతేఽపూజ్యంత పితరస్త్రేతాయాం తు సురాస్తథా ।
యుద్దాని ద్వాపరే నిత్యం పాఖండాశ్చ కలౌ యుగే ॥
అపమానాపవిద్ధశ్చ కుక్కుటో గ్రామసూకరః ।
శ్వా చైవ హంతి శ్రాద్దాని దర్శనాదేవ సర్వశః ॥
శ్వసూ కరోపసంసృష్టం దీర్ఘరోగిభిరేవ చ ।
పతితైర్మలినైశ్చైవ న ద్రష్టవ్యం కథం చన ॥
అన్నం పశ్యేయురేతే యత్రన్నార్హం హవ్యకవ్యయోః ।
ఉత్స్రష్టవ్యాః ప్రధానార్థైః సంస్కారస్త్వాపదో భవేత్ ॥
పూర్వము దేవాసుర యుద్దమున అసురులు. నిర్జింపఁబడిరి. వారు వృద్ద శ్రావకులు, నీర్ధంధులు (నగ్నులు), శాక్యులు (బౌద్దులు) జీవకులు, కార్పటులు, పాఖండులు, వైకృతులు - మొదలగు వారిగా సృష్టింపఁబడిరి. (39) ధర్మముల అనువర్తింపని వారు (ద్వీజులు)నాగ్నాదులు. నీయమము పాటింపకయే వ్యర్ధముగా ప్రతులయినవారు, వృధాజటులు, వృధాముండులు (తలముండనము చేయించుకొనువారు) వ్యర్థముగా నగ్నులు నయిన ద్వీజులు. వారు శాశ్వతముగా కులధర్మ ప్రవృత్తుల నుల్లంఘించినవారు. వృధా వృత్తిమంతులు. ప్రయోజన రహితముగా భార్యలను పొందెడివారు. వారు వారు చేయు కర్మలను వాకొందురు. వారందరు కుపథ వృత్తులుగా పరికీర్తింపఁబడిరి. వారికిడిన శ్రాద్దము కాని వారు చూచిన శ్రాద్ధము కానీ దానవులకే చెందును. (42) బ్రహ్మఘ్నులు, కృతఘ్నులు, నాస్తికులు, గురుతల్పగులు, దస్యులు, నృశంసులు - వీరియొక్క దర్శనమునే (వీరు చూచినచో) పరిత్యజించవలెను. (43) పతితులను (క్షుద్రులను) క్రూర కర్ములను, ఎల్లరను పరిత్యజించవలయును. దేవతల యొక్కయు ఋషుల యొక్కయు వివాదమున ఎవ్వరు వాదించెదరో వారు, ఎవ్వరు దేవతల యొక్క బ్రాహ్మణుల యొక్క వేదముల నిందించెదరో వారు చూచిన శ్రాద్దము అసురులకు యాతు ధానులకు చెందును. (45) కృతయుగమును బ్రాహ్మయుగముగాను త్రేతాయుగమును క్షత్రియయుగముగాను, ద్వాపర యుగమును వైశ్యయుగముగాను, కలియుగము శూద్రయుగము గాను చెప్పఁబడినవి. (41) కృతయుగమున, పితరులు పూజింపఁబడిరి. త్రేతాయుగమున సురలు పూజింపఁబడిరి. ద్వాపరయుగమున యుద్దములు. కలియుగమున నీత్యము పాండులు పూజింపబడిరి. (47) గౌరవము లేనివాఁడు, బహిష్కృతుఁడు, గ్రామ సూకరము, గ్రామ కుక్కుటము - కుక్క - చూచినంత మాత్రమున శ్రాద్ధము పూర్తిగా చెడిపోవును. (48) కుక్కలుగాని పందులు గాని స్పృశించిన శ్రాద్ధము పనికి రాదు. దీర్ఘ రోగులుగానీ, పతీతులుగాని, మలీసులు గాని ఎన్నడును శ్రాద్దమును చూడరాదు. (49) పైని చెప్పఁబడిన వారిచే చూడఁబడిన అన్నాదులు హవ్యములుగా గానీ క్రవ్యములుగా గాని యుపయోగింపఁబడరాదు. వానిని పరిత్యజించవలయును. ప్రమాద పరిస్థితి వచ్చిన ఆపద్పరిస్థితులలో ముఖ్యములయిన పదార్ధములచే వానిని పరిష్కరించి పవిత్రీకరించవలయును. (50)
హవిషాం సంహతానాం చ పూర్వమేవ వివర్జయేత్ ।
మృష్టం యుక్తాభిరద్భిశ్చ ప్రేక్షణం చ విధీయతే ॥
సిద్ధార్థకైః కృష్ణతిలైః కార్యం వాప్యపవారణమ్ ।
గురుసూర్యాగ్నివాస్రాణాం దర్శనం వాపి యత్నతః ॥
ఆసనారూడమన్నాధ్యం పాదోపహతమేవ చ ।
అమే ద్యైర్జంగమైర్దృష్టం శుష్కం పర్యుషితం చ యత్ ॥
అస్విన్నం పరిగద్ధం చ తథైవాగ్నావలేహితమ్ ।
శర్కరాకీటపాషాణైః కేశైర్యచ్చాప్యుపాహృతమ్ ॥
పిణ్యాకం మథితం చైవ తథా తిలయవాదిషు ।
సిద్ధీకృతాశ్చ యే భక్ష్యాః ప్రత్యక్షలవణీకృతాః ॥
దృష్ట్వా చైవ తథా దోషోపాత్తశ్వోపహతం తథా ।
వాససా చావధూతానీ వర్జ్యాని శ్రాద్ధకర్మణి ॥
సంతి వేదవిరోధేన కేచి ద్విజ్ఞాభిమానినః ।
అయజ్ఞయతయో నామ తే ధ్వంసంతి యథా రజః ॥
దధీశాకం తథా భక్ష్యం తథా చౌషధివర్జితమ్ ।
వార్తాకం వర్జయేచ్చ్రాద్దే సర్వానభిషవాసపి ॥
సైంధవ లవణం చైవ తథా మానససంభవమ్ ।
పవిత్రే పరమే హ్యేతే ప్రత్యక్షమపి వర్తతే ॥
అగ్నౌ ప్రక్షిప్య గృహ్ణీయాద్ధస్తే ప్రక్షిప్య యత్నతః ।
గమయేన్మస్తకం చైవ బ్రహ్మతీర్థం హి మత్స్మృతమ్ ।
ద్రవ్యాణాం ప్రేక్షణం కార్యం తథైవావపనం పునః ॥
నిధాయ చాద్భిః సించేత్తత్తథా చాసు నివేశనమ్ ।
అశ్మమూలపలేక్షూణాం రజ్జూనాం చర్మణామపి ॥
వైదలానాం చ సర్వేషాం పూర్వవచ్చౌచ మిష్యతే ।
తథా దంతాస్థిదారూణాం శృంగాణాం చావలేఖనమ్ ॥
(పైని పేర్కొనఁబడిన దుష్టులు యజ్ఞమును చూచినచో) హోమ ద్రవ్యములయిన, హవిస్సులను ముందుగనే పరిత్యజించవలెను పవిత్రోదకములచే వానిని శుభ్రము చేయవచ్చును. వీరు చల్లి పవిత్రీకరించుట కూడ విధింపఁ బడినది. (51) లేదా హవిస్పు మొదలగు వానీని తెల్ల ఆవాల నీళ్లతోగాని, 'నల్ల నువ్వుల నీళ్లతో గాని చల్లిన పవిత్రీకరింపఁబడును లేదా ప్రయత్నపూర్వకముగా గురు, సూర్యాగ్ని దర్శనముచే నయినను పవిత్రీకరింపఁ బడును. (పోస్రాణాం - వాసరాణాం - వాసర - రోజు - వారము) (52) ఈ క్రింది వానిని శ్రాద్ధ కర్మలో పరిత్యజించవలయును. వండిన యన్నము, కానీ ఇతరములయిన భక్ష్యములు కానీ ఆననములపై పడినను, లేక వాని పై నెవరయిన ఆసీనులయినను లేదా కాలితో సవీదన్న బడినను, అమేధ్యములయిన జంగమ పదార్థములచే చూడబడినను, శుష్కమయినను (ఎండిపోయినను) పర్యుషితములయినను (వాడబడినను), బాగుగా మాడిపోయినవయినను, అట్లే అగ్నిచే ముట్టబడినను (నిప్పులో పడినవైనను). ఇసుకరేణువులచే, కీటములచే, పాషాణములచే, శిరోజములచే (వెంట్రుకలచే) చెడిపోయిన వానిని, పిణ్యాకము (తెలగపిండి) పొడుమును, తిల, యవల, నూకలను ముందుగా వండి సిద్ధము చేయబడి ఉప్పు ఎక్కువగా వేయబడిన వంటకములు (55) కుక్కలచే చూడబడినవి, అంటబడినవి, దుస్తులచే గ్రహింపఁబడినవి, వస్త్రములచే. అవధూతములయినవి (వస్త్రములు తగిలి ఇటు అటు చెదరిపడిపొడయినవి) మున్నగు వానిని శ్రాద్ధ కర్మలో పరిత్యజించవలెను. (56) తాము వేద విజ్ఞానులమను దురభిమానులు కొందరుందురు. కొందరు అజ్ఞయతులు - సన్యాసులు. వారును, ఇసుకపొడివలే తప్పక శ్రాద్ధములను ధ్వంసము చేయుదురు. పెరుగుతో గూడిన ఆకు కూరలను, ఔషధ ప్రయోజనములు లేని భక్ష్యములను, వార్తాకమును (వంకాయను) బట్టీ పట్టి తయారు చేసిన ద్రావకములను, శ్రాద్ధకర్తలు విసర్జించవలయును. (58) సముద్రజల సంభవమయిన లవణము, మానస సరోవర సంభవమయిన లవణము. ఈ రెండును పవిత్రములు వానిని అగ్నిలో పెట్టి చేతులతో గ్రహింపవలెను. ఆ (లవణములు) మస్తకమున నుంచుకొనవలెను. దానిని "బ్రహ్మతీర్ధ'మని యందురు. శ్రాద్దములో నుపయోగించు పదార్థములను ప్రోక్షణచేయవలెను. శిలలను, మూలములను (దుంపలు,వ్రేళ్లు) ఫలములను, చెరుకును, రజ్జువులను, తోళ్ళను (చర్మవస్తువులను) - నీళ్లలో ముంచి వానిని వీదలించి పవిత్రీకరింపవలయును. తీగెలతో అల్లబడిన వస్తువులను, బుట్టలను, జంగెడులను కూడ నీటిలో ముంచి జాడించి, విదలించి పవిత్రీకరింపవలెను. ఏనుగు దంతముతో, చేసిన వానిని ఎముకలతో నిర్మించిన వానీని, కఱ్ఱతో చేయఁబడిన వానిని కొమ్ముతో చేయబడిన వానీని తోమి, గోకీ పవిత్రీకరింపవలెను. (62) (51) ఈ శ్లోకము అర్థవంతముగా లేదు.
సర్వేషాం మృణ్మయాహాం చ పువర్దాహో విధీయతే ।
మణిముక్తిప్రవాళాహాం జలజానాం చ సర్వశః ॥
సిద్ధార్థకానాం కల్మేన తిలకల్కేన వా పునః ।
స్యాచ్చౌచం సర్వబాలానామావికానాం చ సర్వశః ॥
ద్వీపదాం చైవ సర్వేషామద్భిరద్భిర్విధీయతే ।
ఆద్యంతయోస్తు శౌచానామద్భి: ప్రక్షాళనం వీధిః ॥
తథా కార్పాసికానాం చ భస్మనా సముదాహృతమ్ ।
ఫలపుష్పపలాశానాం ప్లావనం చార్భిరిష్యతే ॥
ప్రోక్షణంహ్యుపలేపశ్చ భూమేశ్చైవాపలేఖనమ్ ।
నిషేకో గోక్రమో దాహః ఖననం శుద్ధిరీష్యతే ॥
నిష్క్రమోఽధ్వగతో గ్రామాద్వాయుపూతా వసుంధరా ।
పుంసాం చతుష్పదాం చైవ మృద్భిః శౌచం విధీయతే ॥
ఏవమేవ సముద్దిష్టః శౌచానాం విధిరుత్తమః ।
అనిర్దిష్టమతో యద్యత్తన్మే నిగదతః శృణు ॥
ప్రాతర్గృహార్దక్షిణపశ్చిమేవ గత్వా చేషుక్షేపమాత్రం పదం వై ।
కుర్యాత్పురీషం హి శిరోఽవగుంఠ్య న వై స్పృశేజ్జ్యాతు శిరః కరేణ ॥
శుక్లై స్త్రుణైర్వా కాష్టైర్వా ఫణైర్వేణుదలేన చ ।
సుసంవృత్తే ప్రదేశే చ అంతర్ధాయ వసుంధరామ్ ॥
ఉద్ధృత్యోదకమాదాయ మృత్తికాం చైవ వాగ్యతః ।
దివా ఉదఙ్ముఖః కుర్యాద్రాత్రౌ వై దక్షిణాముఖః ॥
మృణ్మయ పాత్రలన్నింటిని మణియొకసారి దహింపఁజేయుట వాని పవిత్రీకరణ పద్దతి. మణుల యొక్క ముత్యముల యొక్క ప్రవాళముల యొక్క నీటిలో పుట్టిన వాని యొక్క పవిత్రీకరణ విధానము అగ్నిలో దహించుటయే. (63) రోమ నిర్మితములయిన వానిని ఊలుతో నేసిన వానిని ఆవాల పిండితోను, నువ్వుల పిండితోను, పవిత్రీకరింపవలెను. (64) ద్వీపాద జంతువులన్నియును మట్టితో నీటితో పవిత్రీకరింపఁబడును. పాదముల పవిత్రీకరణము ఆద్యంతముల యందు నీటితో ప్రక్షాళనము చేయుట(?) (65) అట్లే నూలు వస్త్రములను భస్మముచే పవిత్రీకరింపవలెను. ఫల పుష్ప పలాశములకు నీటిలో ముంచి తేల్చి జాడించుట చెప్పఁబడినది. (66) భూమిని వివిధములయిన పద్దతులచే పవిత్రీకరింపవలెను. నీరు చల్లుటచే, ఆవు పేడతో అలుకుట వలన, త్రవ్వుటచే, గోకుటచే, (గ్రీకుటచే), ఎక్కువగా నీరుపోసి తడుపుటచే, అంతీయేకాక ఆ భూమిపై గోవును తొక్కించుట వలన లేదా ఆ భూ ప్రదేశమున నొక భాగమును మంట పెట్టుట వలన కానీ త్రవ్వుట వలనఁగానీ (67) గ్రామములందు భూమీ వీచు గాలి, గోవుల యొక్క సంచారముచే పవిత్రీకరింపఁబడును, చతుష్పాత్తులయిన జంతువులు, మనుష్యులు, మట్టిచే శోచవంతులగుట వీధింపబడినది. ఈ విధముగా వస్తువుల పవిత్రీకరణ విధానము ఉత్తమ శౌచవిధానముగా విధింపఁబడినది. ఇక అనిర్ధిష్టములయిన విషయ పవిత్రీకరణముల గూర్చి చెప్పెదను వినుము. (69) ఉదయమున లేచి దక్షిణ పశ్చిమముగా (నైర్ఘత్యము) ఒక ఇషు క్షేపమాత్రదూరము (బాణము నుండి విడువబడిన శర మెంతదూరమేగునో అంతదూరము గృహము నుండి వెళ్లవలయును. తన శీర్షమును, వస్త్రముతో కప్పుకోని మలవిసర్జవము చేయవలయును. చేతితో శిరమును స్పృశింపగరాదు. (70}
దక్షిణేన తు హస్తేన గృహీత్వాఽథ కమండలుమ్ ।
శౌచం వామేన హస్తేన గుదే తిస్రస్తు మృత్తికాః ॥ -
దశ చాపి శనైర్దద్యాద్వాహస్తే క్రమేణ తు ।
ఉభాభ్యాం వా పునర్ధద్యాద్ద్వాభ్యాం సప్త తు మృత్తికాః ॥
మృదా ప్రక్షాల్య పాదే తు ఆచమ్య చ యథావిధి ।
ఆపస్త్వాద్యాస్త్రయశ్చైవ సూర్యాగ్న్యనీలదేవతాః ॥
కుర్యాత్సంహితో నిత్యమచ్ఛిద్రే ద్వే కమండలూ ।
అంసవార్యవనైరేవ యథావత్పాదధావనమ్ ॥
ఆచమనం ద్వీతీయం చ దేవకార్యే తతోఽపరమ్ ।
ఉపవాసస్త్రిరాత్రం తు దుష్టముక్తే హ్యుదాహృతః ॥
విప్రకృష్టేషు, కృఛ్ఛంచ, ప్రాయశ్చిత్తముదాహృతమ్ ।
స్పృష్ట్వా శ్వానం శ్వపాకం చ తప్తకుచ్చ్రం సమాశ్రయేత్॥
(ఆవ్యక్తి) మల విసర్జనమును వివిక్త ప్రదేశమునందు, నేలను తెల్లగడ్డితోగాని, ఆకులతోగాని, కాష్టములతోగాని వేణుదళముతోగాని, (వెదురు) కప్పి తరువాత దానిపై చేయవలెను. పగటిపూట ఆతఁడు ఉత్తరాభిముఖుఁడై, రాత్రి సమయమున దక్షిణాభిముఖుఁడై మలవిసర్జన మాచరించవలేను. తన్మల విసర్జన క్రియానంతరము, చేతితో కొంచెము మృత్తును, జలపాత్రను, ఏమియు మాటాడకుండుగ, తీసికొనవలెను. (72) కుడిచేతితో జలపాత్రను (కమండలమును) తీసికొనీ, వామ హస్తముతో గుద ప్రదేశమును ప్రక్షాళనము చేసికొనవలెను, తత్రాక్షాళన సమయములో గుద ప్రవేశమునుమూడుసార్లు మట్టితో గడుగవలెను. (73) ఎడమచేతిలో పదిమార్లు మృత్తికను తీసికోని క్రమముగా నెమ్మదిగా కడుగుకొనవలెను. తరువాత రెండు చేతులను మట్టితో కడుగుకొనవలెను. (చేసిన చేయవచ్చును 'వా' పక్షము) తరువాత రెండు చేతులకు ఏడుమార్లు మట్టిని రాసి కడుగవలెను. (74) ఆతఁడు పాదద్వయమును మట్టితో గడుగవలెను. యథావిధి ఆచమనము చేయవలెను, మొదటి మూడు జల బిందువులు సూర్యాగ్యులములను దేవతలు గలిగినవి. (75) ఆ వ్యక్తి నిత్యము అచ్చిద్రములయిన రెండు కమండలములను (జలపాత్రములను) సన్నిహితముగా నుంచుకొనవలెను. అందు మిగిలిన నీటితో నతఁడు తన పాదములను ప్రక్షాళనము చేసికొనవలెను. (76) దేవతో కార్యమందు రెండవ వీధమయిన ఆచమనము కలదు. దుష్టుని వలన వీముక్తుఁడయి యతఁడు మూడు రాత్రులుపవాసము చేయవలయునని ఉదాహరింపం బడినది. (అర్థము పూర్వాపర వాక్యములకు పొసఁగలేదు) (77) విప్రకృష్టము లందు (దూర ప్రదేశములందు ప్రాయశ్చిత్త కృచ్ఛము చెప్పం బడినది. కుక్కనుగాని, కుక్క మాంసమును దినుశ్వపాకుని గానీ స్పృశించినచో తప్త 'కృచ్ఛము' ప్రాయశ్చిత్తముగా ఆశ్రయించవలెను.
మానుషాస్థీనీ సంస్పృశ్య ఉపోష్యం శుచికోరణాత్ ।
త్రిరాత్రముక్తం సస్నేహాన్యేకళాత్రమతోఽన్యథా ॥
కారస్కరాః కళింగాశ్చ తథాంధ్రశబరాదయః ।
పీత్వా చాపోభూతలపాగశ్వా చాపి యుగంధరమ్ ॥
సింధోరుత్తరపర్యంతం తథోదీచ్యంతరం సరః ।
పాపదేశాచ్చ యే కేచితా పైరధ్యుషితా జనైః ॥
శిష్టైస్తు వర్జితా యే వై బ్రాహ్మణేర్వేదపారగైః ।
గచ్ఛతాం రాగసమ్మోహాతేషాం పాపం న గచ్ఛతి ॥
గత్వా దేశానపుణ్యాంసు కృత్న్యం పాపం సమశ్నుతే ।
ఆరుహ్య భృగుతుంగం తు గత్వా పుణ్యాం సరస్వతీమ్ ॥
ఆపగాం చ నదీం రమ్యాం గంగాం దేవీం మహానదీం ।
హిమవత్ర్పభవా నద్యో యాశ్చాన్యా ఋషిపూజితాః ॥
మానవాస్థినీ స్పృశించినచో ఆ వ్యక్తి తీరిగి శుచిమంతుడగుటకు మూఁడు రాత్రులు పోష్యమాచరించవలేను. ఆ యెముకలు నూనెపూత కలిగియున్న మూడు రాత్రులు లేనిచో నొక్క రాత్రి యుపవసించిన చాలును. (79) కారస్కరులు, కాళింగులు, ఆంధ్రులు, శబరులు, మొదలగువారు, సింధునది యొక్క ఉత్తర తీరవాసులు, అక్కడకు ఇంకను నుత్తరముగా నున్నవారు- (ఈ దేశములలో నివసించువారు) పాపులు. వారు పాపులచే ఆక్రమింపఁబడిరి. వారు సజ్జనుల చేతను, మణియు వేదపారగులయిన బ్రాహ్మణులచేతను పరివర్జితులు. ఎవ్వడయిన అనురాగబుద్దిచేగాని, మోహబుద్దిచేగానీ యా దేశములకు (అచ్చటకు) వెళ్లినచో, తన్మూలమున ప్రాప్తమయిన ఆతని పాపము పవిత్రోదక పానముచేఁగాని, తిలోదకమును నధికముగా త్రాగుటచేగాని, విముక్తము కాదు. ఆతఁడు కురుక్షేత్ర సమీపముననున్న యుగంధరమునకు తీర్థయాత్రచేసినను తత్పాపోపశమనము కాదు. (తిలోదక పానముచేతనంగా పితరులకు బహువారము తీలతర్పణము లాచరించినను - ఆ పాపము పోదని గ్రహింపనగును). (82) అపుణ్య వంతములయిన దేశములకరుగుట వలన మానవుండు అన్ని పాపములను పొందును. ఆతఁడా పాపములు తొలగుటకు - భృగు పర్వత శిఖరమునారోహించవలెను; పవిత్ర సరస్వతీ నదికి పోవలయును; రమ్యమయిన గంగానదికీ చన వలయును లేదా దైవతుల్యమయిన మహానదికి పోవలయును; లేదా హిమవత్పర్వతమున జన్మించు నదులకు వెళ్లవలయును లేదా మహర్షులు పవిత్రములని పేర్కొన్న నదులకు పోవలయును. (84)
సరస్తీర్థానీ సర్వాణి నదీప్రస్రవణాని చ ।
గత్వైతాన్ ముచ్యతే పాపైః స్వర్గే చాళ్యంతమశ్నుతే ॥
దశరాత్రమశౌచం తు ప్రోక్తం మృతకసూతకే ।
బ్రాహ్మణస్య ద్వాదశాహం క్షత్రియస్య విధీయతే ॥
అర్ధమాసం తు వైశ్యస్య మాసం శూద్రస్య చైవ హ.।
ఉదక్యా సర్వవర్ణానాం చతూరాత్రేణ శుద్ధ్యతే ॥
ఉదక్యాం సూతికాం చైవ శ్వానమంతావసాయినమ్ ।
నగ్నాదీన్ మృతహారాంశ్చ స్పృష్ట్వా శౌచం విధీయతే ॥
స్నాత్వా స చైలోమృద్భిస్తు శుద్ధో ద్వాదశభిర్ద్విజః ।
ఏతదేవ భవేచ్ఛేషం మైథునే వమనే తథా ॥
మృదా ప్రక్షాల్య హస్తౌ తు కుర్యాచ్ఛౌచం చ మానవః ।
ప్రక్షాల్యచాద్భిః స్నాత్వా తు హస్తౌ చైవ పునర్ముదా ॥
త్రిః కృత్వా ద్వాదశాంతాని యథా లేపస్తథా భవేత్ ।
ఏవం శౌచవిధిర్దృష్టః సర్వకృత్యేషు నిత్యదా ॥
పరీదద్యాన్మృదస్తిస్రస్తిసఃపాదావసేచనే ।
అరణ్యే శౌచమేతత్తు గ్రామ్యే వక్ష్యామ్యతఃపరమ్ ॥
మృదః పంచదశామేధ్యా హస్తాదీనాం విశేషతః ।
అతిరిక్తమృదం దద్యాన్మృదం తే త్వద్భిరేవ చ ॥
అద్భిరవ్యక్తకే శౌచమేతచ్చెతేషు కత్స్నశః ।
కంఠం శిరో వా ఆవృత్య రథ్యాపణగతోఽపివా ॥
అకృత్వా పాదయోశ్శౌచం ఆచాంతోఽప్య శుచిర్భవేత్ ।
ప్రక్షాళ్య పాత్రం నిక్షిప్య ఆచమ్యాభ్యుక్షణం తతః ॥
పవిత్రములయిన నదులకు, సరస్సులకు, జలధారలకు పోయి ఆయశుచియైన వ్యక్తి పాపముల నుండి విముక్తుఁడు కావచ్చును. ఆతడు స్వర్గమున నత్యంత పుణ్యమును పొందును. (85) బ్రాహ్మణునకు మరణము చే గాని ప్రసూతిచే గాని కలిగిన యశోచము పదిరాత్రు లుండును. క్షత్రియులకు అశౌచము పండ్రెండు దీనములు. (86) వైశ్యునకైనచో జనన మరణాచము అర్థమాసము రోజులు; ఇంక శూద్రునకు పూర్తిగా ఒక నెలదినములు. (87) బహిష్ఠిలో స్త్రీకి అశుచిత 4 రోజులు (రాత్రులు) ఇది వర్ణ విబేధము లేక యన్ని వర్ణముల స్త్రీలకు నన్వయించును. అంతీయేకాక, రజస్వలయైన స్త్రీని ముట్టుకొనిన, ప్రసవించిన స్త్రీని ముట్టుకొనిన, కుక్కను, చండాలుని, దీగంబరుని, నగ్నుని ముట్టుకోనీన, శాచము విధింపబడినది. (88) పై వాని విషయములో అశౌచవిధి యిట్లుండును - ఆతఁడు బ్రాహ్మణుఁడయినచో సచేల స్నానమాచరింపవలయును. పండ్రెండు మార్లు మృత్తికాప్రక్షాళణమాచరించిన శుద్దీయగును. మైధున క్రియలో తగుల్కొనినను, వమనమాచరించినను ఇదియే శౌచ విధానము. మట్టితో నీటితో ప్రక్షాళనము చేసికొనిన తరువాత శాచ శుద్ధీ విధాన మాచరించవలయును. నీటితో ప్రక్షాళనము చేసికొనిన వెనుక, స్నానము చేసి యాతఁడు మరల మట్టితో ప్రక్షాళనము సలుపవలయును. మొత్తము పండ్రెండుసార్లు అగునట్లు మూడు దఫాల ప్రక్షాళన క్రియ గోచరించవలెను. అంటు కానీ జిడ్డుకానీ యుండరాదు. ఈ విధముగా సర్వ కార్యములయందు శౌచవిధి కనబడుచున్నది {91) పాద ప్రక్షాళనమున మూడు పర్యాయములు మృత్తును పాదములకు సమర్పించవలెను. ఇది అరణ్యముల నాచరింపవలసిన శౌచవీధి. ఇంక ముందు గ్రామములలో నాచరించవలసిన విధిని చెప్పెదను. (92) చేతులను పదియైదుమారులు మృత్తుతో క్షాళణ చేయవలయును. విధిలో నిర్ణయింపఁబడిన దాని కంటి నొక మారధికముగా శౌచవిధి సలుపవలయును. మట్టితో పులిమీన తరువాత నీటితో కడుగవలేను. (98) మట్టి పైకీ కానరాకపోయినచో నీటితో నట్టి విషయములలో శాచమాచరించవలెను.తలనుగాని కంఠమునుగాని కప్పుకోని రాజవీధిలోగాని బజారులోగానిపోయి తన పాదములను కడుగుకొనక పోయినచో, ఆచమనము చేసినను నతఁడు అశుచిమంతుఁడుగానే యుండును. ఆతఁడు పాద ప్రక్షాళణము గావించుకొని జలపాత్రను నేలపై నుంచి, స్నానానంతరము నీరు చల్లి దానిని గ్రహించవలెను. అట్లే ఇతర వస్తువులకును అభ్యుక్షణ క్రీయ నాచరించవలెను.
పుష్పాదీనాం తృణానాం చ ప్రోక్షణం హవిషాం తథా ॥
పరాహృతానాం ద్రవ్యాణాం నిధాయాభ్యుక్షణం తథా ।
నాప్రోక్షితం స్పృశత్కించిచ్చ్రాద్ధే దేవైఽథవా పునః ॥
ఉత్తరేణాహరేద్ద్రవ్యం దక్షిణేన విసర్జయేత్ ।
సంవృతే యజమానస్తు సర్వశ్రాద్దే సమాహరేత్ ॥
ఉచ్ఛిష్టే స్యాద్విపర్యాసో దైవే పిత్ర్యే తథైవ చ ।
దక్షిణేన తు హస్తేన దక్షిణాం వేదిమాలభేత్ ॥
కరాభ్యామేవ దేహానాం పితృణాం వికరం తథా ।
క్షరణం స్వప్నయోశ్చైవ తథా మూత్రపురీషయోః ॥
నిష్ఠివితే తథాఽభ్యంగే భుక్త్వా విపరీధాయ చ ।
ఉచ్ఛిష్టానాం చ సంస్పర్శే తథా పాదావసేచనే ॥
ఉచ్ఛిష్టస్య చ సంభాషాదశిత్వా ప్రయతస్య వా ।
సందేహేషు చ సర్వేషు శిఖాం ముక్త్వా తథైవ చ ॥
వినా యజ్ఞోపవీతేన మోఘం తత్సముపస్పృశేత్ ।
ఉష్ట్రస్యావేశ్చ సంస్పర్శే దర్శనేఽవాచ్యవాచీనామ్ ॥
జిహ్వయా చైవ సంస్పృశ్య దంతాసక్తం తథైవ చ ।
సశబ్దమంగుళీభిర్వా పతితం వా విలోకయన్ ॥
స్థితో యశ్చేచమేన్మోహాదాచాంతోఽప్యశుచిర్భవేత్ ।
ఉపవిశ్య శుచౌ దేశే ప్రయతః ప్రాగుదజ్ముఖః॥
పాదౌ ప్రక్షాళ్య హస్తౌ చ అంతర్జాను త్వపః స్పృశేత్ ।
ప్రసన్నస్త్రీః పిబేద్వారి ప్రయతః సుసమాహితః ॥
జల సంప్రోక్షణము పుష్పముల విషయములో, తృణముల విషయములో హవిస్సమర్పణములలో గూడ జరుగవలెను. (96) ఇతరులు తీసికొనివచ్చిన వస్తువులను, నేలమీద నుంచి, వానీపై, అభ్యుక్షణము చేసి, దానిని పవిత్రీకరించవలెను. మంత్రపూతమయిన అభ్యుక్షణము లేక యెవ్వరును స్పృశింపరాదు. ఆ కర్మ శ్రాద్ధమయినను లేక దేవారాధనమయినను నీరు చల్లి పవిత్రీకరించి ఆ వస్తువులను స్పృశింపవలెను.(97) ఏ వస్తువునయినను ఉత్తర దిశనుండి గ్రహింపవలెను, మరల దక్షిణ దిశగా దానిని విసర్జించవలయును. యజమాని ఏకాంత (విజన) ప్రదేశముననే ప్రతి శ్రాద్ధకర్మ నాచరించవలయును. (98) దైవ కార్యములందుఁగాని పితృకార్యములందుఁగానీ ఉచ్ఛిష్టమయిన యాహారము వలన (అన్నము వలన) విపరీత పరిస్థితులు కలుగు నవకాశమున్నది.' (ఉచ్చిష్టము - ప్రధానపాత్ర నుండి కొంత పదార్థమును వినియోగింపఁగా మిగిలి యున్నట్టిది). దక్షిణ దిశగా నున్న వేదినీ యజమాని కుడిచేతితో స్పృశింపవలెను. దేవతలకు, పితృదేవతలకు, యథాశాస్త్రము ఋజురేఖలో చల్లఁబడిన విక్రములను (అన్నపు మెతుకులను) ఉభయ హస్తములతో వేదిని స్పృశించవలయును. ఈ క్రింది సమయములలో ఆచమనము శోచక్రియ చెమ్మటపట్టి స్వేదము కార్చునప్పుడు, నిద్ర నుండి మేల్కొనిన సమయమున, అధికాచమన అల్పాచమనములు జరిపినప్పుడు (మూత్ర విసర్జనమున తరువాత, మల విసర్జనము సలిపిన తరువాత) ఆచమనము పరిశుద్ధ క్రియ. (మరియు) నిఫ్టీవనము (ఉమ్ము) సలిపినప్పుడు, అభ్యంగ స్నానమాచరించినప్పుడు, భోజనానంతరము, వస్త్రమును ధరించినప్పుడు, ఉచ్ఛిష్ట పదార్దముల సంస్పర్శనము చేసినప్పుడు, పాద ప్రక్షాళనము చేసికొనిన తరువాత, ఉచ్ఛిష్ట పదార్థ స్వీకరణమున అపవిత్రుఁడయిన వ్యక్తితో సంభాషించిన తరువాత, భోజనానంతరము, పవిత్ర క్రియాచరణమునకు ప్రయత్నించు నప్పుడు (ఆచమనమాచరించవలెను), సర్వ సందేహ బద్ద విషయములందు. జుత్తు ముడిని విప్పి, (శీఖను విప్పి) యజ్ఞోపవీతము లేకుండ, ఎవ్వడయినను అభిప్రాయ రహీతముగా (ఎట్టి ప్రయోజనము నెంచకయే) పెంటను ముట్టుకొనిన లేదా గొల్లెను తాకిన అవాచ్యములయిన పలుకులు పలుకు వ్యక్తులను చూచిన అన్నపు మెతుకులు దంతముల కంటుకొనిన, జిహ్వయందు సంసక్తమైనను, నాలుకతో పెద్ద శబ్దము చేసినను లేదా ప్రేకులతో శబ్దము చేసినను లేదా పతితుని (పడిపోయిన వానిని) చూచినను ఆచమనము చేసిన పవిత్రుడగును. (104) లేదా నిలుచుండి యజ్ఞానముచే (మోహముచే) ఆచమనము చేసినను, ఆతఁడపవిత్రుఁడుగానే యుండును. పరిశుద్ద ప్రదేశమున, ప్రయత్న పూర్వకముగా, ఉత్తర ముఖముగా గాని ,
ద్వీరేవ మార్జనం కుర్యాత్ సకృదభ్యుక్షణం తతః ।
ఖాని మూర్ధాన మాత్మానం హస్తౌ పాదౌ తథైవ చ ॥
అభ్యుక్షయేత్తతస్తస్య యద్యన్మీమాంసితం భవేత్ ।
ఏవమాచమతస్తస్య వేదా యజ్ఞాస్తపాంసి చ ॥
దానాని వ్రతచర్యాశ్చ భంతి సఫలాని వై ।
క్రియాం యః కురుతే మోహాదనాచమ్యేహ నాస్తికః ॥
భవంతి హి వృథా తస్య క్రియా హ్యేతి న సంశయః ।
వాక్కాయబుద్ధి పూతాని అస్పృష్టం వాప్యనిందితమ్ ॥
జ్ఞేయాన్యేతానీ మేధ్యాని దుష్టయ్యేవిపర్యయే ।
మనోవాక్కాయమగ్నిశ్చ కాలశ్చైవోపలేఖనమ్ ॥
విఖ్యాపనం చ శాచానాం నిత్య మజ్ఞానమేవ వా ।
అతోఽన్యధా తు యః కుర్యాత్ మోహాచ్చౌచస్య సంకరమ్ ॥
పిశాచాన్యాతుధానాంశ్చ ఫలం గచ్చత్యసంశయమ్ ।
శౌచే చాశ్రద్దధానోహి మ్మ్లేచ్ఛజాతీషు జాయతే ॥
అయజ్వా చైవ పాపశ్చ తిర్యగ్యోనీగతోఽపి చ ।
శౌచేన మోక్షం కుర్వాణః స్వర్గవాసీ భవేన్నరః ॥
శుచికామా హి దేవా వై దేవైశ్చైతదుదాహృతమ్ ।
భీభత్సానశుచీంశ్చైవ వర్జయంతీ సురాః సదా ॥
త్రీణి శౌచానీ కుర్వంతీ న్యాయతః శుభకర్మిణః ।
బ్రహ్మణ్యాయాతిథేయాయ శౌచయుక్తాయ ధీమతే ॥
పితృభక్తాయ దాంతాయ సానుక్రోశాయ చ ద్వీజాః ।
తస్మై దేవాః ప్రయచ్ఛంతి పితరః శ్రీవివర్ధనాః ॥
మనసా కాంక్షిణాన్కామాంస్త్రైలోక్యప్రవరానపి ।
ఇతి శ్రీ బ్రహ్మాండమహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే
శ్రాద్ధేకల్పేఽశాచవిధిర్నామ చతుర్దశోఽధ్యాయః ॥
తూర్పుగా గాని కూర్చుండవలయును. ఆతఁడు మనస్సునను శరీరమునను పవిత్రుఁడుగా నుండవలెను. అంతకు ముందుగనే తన పాద ప్రక్షాళనమును చేసికొని యుండవలెను. తొడపై చేతులుంచుకొని అతఁడు నీటిని స్పృశించవలెను. అవధాన పూర్వకమగు మనస్సుతోడను, అత్యధికమయిన పవిత్రత్వముతోడను, ప్రసన్నుఁడై ప్రయత్న పూర్వకముగా మూఁడు పర్యాయములు సంతోషముగా ఆచమనము చేయవలయును. (106) ఆతఁడు మార్జన క్రియను రెండుమార్లు చేయవలయును. అభ్యుక్షణ మొక్కమారు. నీటి నాతండు జ్ఞానేంద్రియములపై తలపై, తనపై (తొమ్ముపై) హస్త పాదములపై చల్లుకొనవలెను. (107) ఆచమనము నాచరించిన వానికీ తానే యది కోరిన నది సఫలమగును. వేదములు, యజ్ఞములు, తపములు, దానములు, వ్రతములు అన్నియును సఫలములగును. అజ్ఞానముచే (మోహముచే) ఆచమనము చేయకయే పవిత్ర క్రియలాచరించిన నాతఁడు నాస్తికుఁడు. నిస్సంశయముగా నాతఁడొనర్చిన క్రియలన్నియును వ్యర్థములు. వాజ్మ మనోబుద్ధులచే పవిత్రములయినవి, అస్పృష్టములయినవియును అనిందితములు. (110) అందుచే నీ క్రింద చెప్పఁబడు వానిని మేధ్యములుగా (పవిత్రములుగా) తెలిసికొనవలయును. కానిచో అవి దుష్ట మేధ్యములు, అపవిత్రములు. మనస్సు, వాక్కు శరీరము, అగ్ని, కాలము, ఉపలిఖితములయిన శౌచ క్రీయా కలాపములు, అన్నియును నిత్యము అజ్ఞానములే యగును. అందుచే అజ్ఞానముచే నెవఁడు అన్యధా, వేడొక విధముగా సంకరము చేయునో, తత్ఫలితము నిస్సంశయముగా పిశాచములకు రాక్షసులకును చెందును. శేచ క్రియయందు శ్రద్దారహితుఁడయినచో నతఁడు మ్లేచ్చజాతుల యందు పుట్టును. (113) యజ్ఞము చేయునట్టివాఁడు పాపియైనవాఁడు లేదా నీచ తిర్యగ్యోనీ యందు పుట్టినవాఁడు, శౌచ క్రియాకలాపమాచరించి మోక్షము నొందును. ఆ నరుఁడు స్వర్గవాసి యగును. (114) యదార్థముగా దేవతలు శుచీకాములు. ఆ దేవతలచే నిది చెప్పఁబడినది. దేవతలు బీభత్సులను భయోత్పాదకులయిన ఫరవ్యక్తులను) అశుద్ధులను (మలినులను) ఎల్లప్పుడును విసర్జింతురు. (115) శుభకర్ములు మూడు మార్లు శౌచకర్మలను స్యోయముగా నాచరింతురు. అశీథులను ఆదరించు వానికి, శౌచ యుక్తునకు, ధీమంతునకు, పితృభక్తునకు, ఇంద్రియ నీగ్రహము గలవానికీ దయాస్వభావునకు దేవతలు - వారి యెడందలో ఎంతటి అత్యధికము పవిత్రమునయిన కోరికను దేవతలు, ఆ బ్రాహ్మణ సంప్రదాయముల ననుసరించు వారికి ప్రసాదింతురు. పితరులాతని శ్రీవివర్ధనులు.
ఇదీ వాయుప్రోక్తము మహాపురాణమునయిన బ్రహ్మాండ పురాణమునందు, మధ్యభాగమున, తృతీయోపోద్ఘాతపాదమున శ్రాద్ధకల్పమున శౌచవిధి అనేడు పదునాలుగవ అధ్యాయము.
Summary of chapter 52 of the Brahmānda Mahā Purana is as follows:
In this instructional chapter, the sacred text meticulously enumerates the pure, sattvic foods pleasing to ancestors, as well as substances that must be avoided. It highlights how the subtle spiritual energy of offerings directly impacts ancestral contentment and family peace. The devoted soul learns the art of spiritual discernment, ensuring that every detail of worship is conducted with absolute purity and reverence for divine laws.