9 - అమృతమథనమను నవమాధ్యాయము

ఇంద్ర ఉవాచ :-

భగవన్ సర్వధర్మజ్ఞ త్రికాలజ్ఞానవిత్తమ

దుష్కృతం తత్రతీకారో భవతా సమ్యగీరితః

కేన కర్మవిపాకేన మహపదియమాగతా

ప్రాయశ్చిత్తం చ కిం తస్య గదస్వ వదతాం వర

ఇృహస్పతి రువాచ :-

కాశ్యపస్య తతో జజ్ఞే దీత్యాం దనురితి స్మృతః

కన్యా రూపవతీ నామ ధాత్రే తాం ప్రదదౌ పితా

తస్యాః పుత్రస్తతో జాతో విశ్వరూపో మహాద్యుతిః

నారాయణపరో నిత్యం వేదవేదాంగపారగః

తతో దైత్వేశ్వరో వవే భృగుపుత్రం పురోహితమ్

భవానధికృతో రాజ్యే దేవానామీవ వాసవః

తతః పూర్వే చ కాలే తు సుధర్మాయాం త్వయిస్థితే

త్వయా కశ్చిత్కృతః ప్రశ్న ఋషీణాం సన్నిధౌ తదా

సంసారస్తీర్థయాత్రా వా కోఽధికోఽస్తి తయోర్గుణః

వదంతు తద్వినిశ్చిత్య భవంతో మదనుగ్రహాత్

తత్వశ్నస్యోత్తరం వక్తుం తే సర్వ ఉపచక్రిరే

తత్పూర్వమేవ కథితం మయా విధిబలేన వై

తీర్థయాత్రా సమధికా సంసారాదితి చ ద్రుతమ్

తచ్ఛృత్వా తే ప్రకుపితాః శేపుర్మామృషయోః ఖిలాః

కర్మ భూమిం ప్రజేః శీఘం దారిద్ర్యేణ మితైః సుత్రః

ఏవం ప్రకుపితైః శక్తః భిన్న కొంచీం సమావిశమ్

పురీం పురోధసా హీనాం వీక్ష్య చింతాకులాత్మనా

భవతా సహ దేవైస్తు పౌరోహిత్యార్థమాదరాత్

ప్రార్థితో విశ్వరూపస్తు బభూవ తపతాం వరః

స్వసీయో దానవానాం తు దేవానాం చ పురోహితః

నాత్యర్థమకరోద్వైరం దైత్యేష్వపి మహాతపాః

బభూవతుస్తుల్యబలొ తదా దైత్యేంద్రవాసవో

తతస్త్వం కుపితో రాజన్ స్వసీయం దానవేశితుః

హంతుమిచ్ఛన్నగాశ్చాతు తపసః సాధనం వనమ్

తమసనస్థం మునిభిన్రీశృంగమివ పర్వతమ్

త్రయీముఖరదిగ్భాగం బ్రహ్మానందైకనిష్ఠితమ్

సర్వభూతహితం తం తు మత్వా చేశామకూలితః

శ్రీరాంసి యాగపద్యేన ఛిన్నాన్యాసంస్త్వయైవ తు

తేన పాపేన సంయుక్తః పీడితశ్చ మహుర్ముహుః

తతో మేరుగుహాం నీత్వా బహూనబ్దాన్ పో సంస్థితః

తతస్తస్య వచః శ్రుత్వా జ్ఞాత్వా తు మునివాక్యతః

పుత్రశోకేన సంతప్తస్త్వాం శశాప రుషాన్వితః

నిఃశ్రీకో భవతు క్షిప్తం మమ శాపేన వాసవః

అనాథకాస్తతో దేవా విషణ్ణ దైత్యపీడితాః

త్వయా మయా చ రహితాః సర్వే దేవాః పలాయితాః

గత్వా తు బ్రహ్మసదనం నత్వా తదత్తమూచిరే

తతస్తు చింతయామాస తదఘస్య ప్రతిక్రియామ్

తస్య ప్రతిక్రియాం వేత్తుం న శశాకాత్మభూస్తదా

తతో దేవైః పరివృతో నారాయణముపాగమత్

నత్వా స్తుత్వా చతుర్వక్షసద్వృత్తాంతం వ్యజిజ్ఞపత్

విచింత్య స్కోఽపి బహుధా కృపయా లోకనాయకః

తదఘం తు త్రిధా భిత్వా త్రిషస్థానేష్వథార్పయత్

సీషు భూమ్యాం చ వృక్షేషు తేషామపి వరం దదౌ

తదా భర్తృసమాయోగం పుత్రావాప్తిమృతుష్వపి

ఛేదేపునర్భవత్వం తు సర్వేషామపి శాఖినామ్

ఖాతపూర్తిం ధరణ్యాళ్ళ ప్రదదౌ మధుసూదనః

తేష్వఘం ప్రబభూవాశు రతోనిర్యాసమూషరమ్

నిర్గతో గహ్వరాత్తస్మాత్వమింద్రో దేవనాయకః

రాజ్యశ్రీయం చ సంప్రాప్తః ప్రసాదాత్పరమేష్ఠినః

తేనైవ సాంత్వతో ధాతా జగద చ జనార్దనమ్

మమ శాపో వృథా నస్యాదస్తు కాలాంతరే మునే

భగవాంస్తద్వచః శ్రుత్వా మునేరమితతేజసః

ప్రహృష్ణోభావికార్యజ్ఞస్తూషీమేవ తదా యయా

ఏతామంతమిమం కాలం త్రిలోకీం పాలయన్ భవాన్

ఐశ్వర్యమదమత్తత్వా తైలాసాద్రిమపీడయత్

సర్వజేన శివేనాథ ప్రేషితో భగవానునికి

దుర్వాసాస్త్వన్మదభ్రంశం కర్తుకామః శశాప హ

ఏకమేవ ఫలం ఊతముభయోః శాపయోరపి

అధునా పశ్య నిఃశకం త్రైలోక్యం సమజాయత

న యజ్ఞః సంప్రవర్తంతే న దానాని చ వాసవ

న యమా నాపి నియమాన తపాంసి చ కుత్రచిత్

విప్రాః సర్వేపి నీ:శ్రీకా లోభోపహతచేతసః

నీఃసత్వా ధైర్యహీనాశ్చ నాస్తికాః ప్రాయశో భవన్

నిరౌషధిరసా భూమిర్నిర్వీర్యా జాయతేతరామ్

భాస్కరో ధూసరాకారశ్చంద్రమాః కాంతివర్జితః

నిస్తేజస్కో హవిర్భోక్తా మరుధూలికృతాకృతిః

న ప్రసన్నా దీశాం భాగాః నభో నైవ చ నిర్మలమ్

దుర్బలా దేవతాః సర్వా విభానన్యాదృశా ఇవ

వీనష్టప్రాయమేవాస్తి త్రైలోక్యం సచరాచరమ్

ఇంద్రుడనెను : ఓ భగవన్! సర్వధర్మజ్ఞ, త్రికాల జ్ఞానులులో శ్రేష్ఠుడా! పాపమును దాని ప్రతీకారమును నీవు బాగుగా జెప్పితివి-1. ఏ కర్మ పరిపాకమున నాకీయాపద వచ్చినది? ఓ ప్రవక్తలో శ్రేష్ఠుడా! దానికి ప్రాయశ్ఛిత్తము కూడ నేమియో సెలవిమ్ము-2. బృహస్పతియను కాశ్యపునకు దీతీయందు బుట్టిన వాడు దనువబడెను. తరువాత రూపవతియను కన్యజనించెను. ఆమెను తండ్రి బ్రహ్మకిచ్చెను-3. ఆమెకు విశ్వరూపుడను మహాతేజస్వి జనించెను. ఆతడు నారాయణపరుడు. వేదవేదాంగపారగుడు-4. తరువాత దనువు భృగు పుత్రుడైన శుక్రుని తన పురోహితునిగా వరించెను. నీవు దేవతలకు ఇంద్రుడుగా అధిపతివైతివి-5. అంతకు పూర్వకాలమున నీవు సుధర్మయను దేవ సభలోనుండగా ఋషుల సన్నిధిలో నీవొక ప్రశ్నయడిగితివీ-6. “సంసార తీర్థయాత్రలలో నేగీయధిక గుణములు గలది? నాయను గ్రహమున మీరు నిశ్చయించి చెప్పుడు” అని-7. ఆ ప్రశ్నకు సమాధానము జెప్పుటకందరును మొదలిడిరి. దాని కంటేముందే విధి బలమున నాచే-8. “సంసారమున కంటే తీర్థయాత్ర యధీకము” అని తొందరగా జెప్పబడినది. అది విని ఋషులందు కోపించినవారై నన్ను -9. పరిమిత పుత్రులతో దొరిద్ర్యముతో కర్మభూమియైన భూలోకమును బొందుము అని శపించిరి. ఈ విధముగా శపింపబడి ఖిన్నుడనై కాంచీపురమును జేరితిని-10. అపుడు అమరావతి పురోహితుడు లేనీదయ్యేను అది చూచి నీవు చింతాకులుడవైతివి. అప్పుడు నీతోబాటు (ఇంద్రునితోబాటు) దేవతలు ఆదరముతో విశ్వరూపుని పురోహితునిగా నుండుమని ప్రార్థించిరి, దానవుల చెల్లెలి కుమారుడైన విశ్వరూపుడు దేవతలకు పురోహితుడయ్యెసు-12. మహాతపస్వియైన విశ్వరూపుడు దైత్యుల విషయమున మిక్కలివైరమును బూనలేదు. దాని వలన దైత్యేంద్ర వాసులిరువురు సమబిలులైరి-13. తరువాత ఓరాజా! ఇంద్రా! నీవు కోపించినవాడవై దానవరాజు చెల్లెలి కొడుకైన విశ్వరూపుని జంపగోరి తపఃసాధనమైన వనమునకు బోయితివి. అచట మునులతో మూడు శిఖరములు గళి పర్వతమువలె ఆసనముననున్నవాడును వేదధ్వనులతో మారుమ్రోగిన దీక్కులు గలవాడును కేవల బ్రహ్మానంద నిష్టితుడైన విశ్వరూపుని శిరముల ఖండించితివి-16. ఆ పాపమునంటి మాటిమాటికి పీడింపబడుచున్నవాడవై మేరు పర్వత గుహను జేరి బహువరములుంటివి-17. ఆ తరువాత మునుల మాటల ద్వారా కాశ్యపుడు పుత్రశోకముతో తపించినవాడై కోపముతో త్వరలోనే ఇంద్రుడు తన రాజ్యలక్ష్మిని గోల్పోవుగాక యని శపించెను. తరువాత దేవతలు అనాథలై దైత్యులచే పీడింపబడి దుఃఖితులైరీ-19. నీవు నేను (ఇంద్ర బృహస్పతులు) లేక దేవలోకము నుండి పలాయితులైరి బ్రహ్మ నివాసమునకు వెళ్లి తమ వృత్తాంతమును జెప్పిరి-20. బ్రహ్మ ఇంద్రునియా పాప ప్రతిక్రియను గూర్చి చింతింపసాగెను. కాని దానిని కనుగొనలేకపోయెను-21. తరువాత దేవతలను వెంటదీసికొని నారాయణుని కడకు వచ్చెను-22 అతనిని స్తుతించి నమస్కరించి బ్రహ్మ దేవతల వృత్తాంతమును విన్నవించెను. లోక నాయకుడైన నారాయణుడు గూడ అనేక విధములుగా నాలోచించి కృపదలచి-23. ఆ పాపమును మూడు భాగములుగా జేసి మూడు స్థానములందుంచేను. స్త్రీల యందు, భూమియందు, వృక్షములందు ఆ పాపమును విభజించెను. స్త్రీలకు ఋతు కాలములలో భర్శ సమాయోగమును, పుత్రావాప్తినీ, సర్వవృక్షములకును ఖండించినను మరల మొలచుటను, భూమికి ఖాతాపూర్తిని, చెరువులు మొ! నిండుట వరములుగానిచ్చెను. స్త్రీలకు రజోదోషము, వృక్షములకు నిర్యాస (బంక) దోషము, భూమికి చవుడు(నిస్సారత) దోషము, ఇవీ వెంటనే కలిగెను-26. దానివలన నీవు శాపగుహనుండి బయట పడి దేవనాయకుడవై యింద్రుడవైతివి. బ్రహ్మయొక్క యనుగ్రహమున రాజ్య లక్ష్మిని పొందితివి-27. దానిచేతనోదార్బబడిన వాడై కశ్యప బ్రహ్మ జనార్ధనునితో నేనింద్రునికిచ్చిన శాపము వృధగా కారాదు అని యనెను. అమిత తేజోస్కుడైన కశ్యపమునీ యొక్క యా మాట విని ఓ కశ్యపమునీ! కాలాంతరమున నీశాపము సార్థకమగుననెను. రాబోవునది దెలిసిన బ్రహ్మ సంతుష్టుడై యపుడు వెడలిపోయెను-29. ఇంతకాలము నీవు ముల్లోకములను పాలించుచు, ఐశ్వర్యమదమత్తుడవగుట వలన కైలాస పర్వతమును పీడించితివి-30. వెంటనే సర్వజ్ఞుడైన శివుడు. భగవంతుడైన దుర్వాసమహాముని పంపెను. అతడు నీమదము నశింపజేయగోరి శపించెను-31. రెండు శాపములకు (కశ్యప-దుర్వాసులశాపములకు)ఫలమొక్కటేమైనది. ఇపుడు చూడుము ముల్లోకములు గూడ నిః శ్రీకములైనవి-32. ఇంద్రా! యజ్ఞములు దానములు ప్రవర్తిల్లుటలేదు. ఎక్కడగూడ యమ-నీయము-తపస్సులు ఆచరింబడుటలేదు-33. బ్రాహ్మణులందరు లోభముగప్పిన మనస్సులుగలవారై శ్రీవిహీనులైరీ. సత్త్వము లేనివారు, ధైర్యము లేనివారు, తరచుగా నాస్తికులును ఐరి-34. భూమీ ఓషధి రసములేనిదై మీకలి నిర్వీర్యమైనది. సూర్యుడు ధూలికారమును జెందెను, చంద్రుడు కాంతి హీనుడయ్యెను-5 హవీర్భోక్తయైన యగ్ని తేజము లేనివాడై గాలిదుమ్మునిండినవాడయ్యెను. దిక్కుల భాగములు నిర్మలములుగా లేవు. ఆకాశము సైతము నిర్మలముగాలేదు -36. సకలదేవతలు దుర్బలులైరి. దేవతలవలెగాక వేరొక్కరుగా గనబడుచున్నారు. చరాచరములతో గూడిన ముల్లోకము ఇంచుమించు నశించినట్లుగనే యున్నది-37.

హయగ్రీవ ఉవాచ :-

ఇత్థం కథయతోరేవ బృహస్పతిమహేంద్రయోః

మలకాద్యామహాదైత్యా స్వర్గలోకం ఐబాధిరే

నందనోద్యానమఖిలం చీచ్ఛీదుర్బలగర్వతాః

ఉద్యానపాలకాన్ సర్వాయుధైః సమతాడయన్

ప్రాకారమవభిదైవ ప్రవిశ్య నగరాంతరమ్

మందిరస్థాన్ సురాన్ సర్వానత్యంతం పర్యపీడయన్

ఆజప్రారపురోరత్నాన్యశేషాణి విశేషతః

తతో దేవాః సమస్తాశ్చ చక్రురశమబాధితాః

తాదృశం హోషమాకర్ణ్య వాసవః ప్రోజితాసనః

సర్వైరనుగతో దేవైః పలాయనపరో భవత్

బ్రాహ్మధామ సమభ్యత్య విషణ్ణవదనో వృషా

యథావతథయామాస నిఖిలందైత్య చేష్టితమ్

విధాతాఽపి తదాకర్ణ్య సర్వదేవసమన్వితమ్

హతశ్రీకం హరిహయమాలోకేశోదమువాచ హ

ఇంద్ర త్వమఖితైర్దేవైర్ముకుందం శరణం వ్రజ

దైత్యారాతీర్ణగతార్రా స తే శ్రేయో విధాస్యతి

ఇత్యుక్త్వా తేన సహితః స్వయం బ్రహ్మాపితామహః

సమస్తదేవసపాతః క్షీరోదధిముషాయయా

అథ బ్రహ్మాదయో దేవా భగవంతం జనార్దనమ్

తుష్టువుద్వారిషాభిః సర్వలోకమహేశ్వరమ్

అథప్రసన్నో భగవాన్ వాసుదేవః సనాతనః

జగాద సకాలాన్ దీవాన్ ఆగద్రక్షణలంపటః

హయగ్రీవుడనెను : ఈ విధముగా బృహస్పతి మహేంద్రులు మాటాడుచుండగానే మలకాదులైన మహారాక్షసులు స్వర్గలోకమును దండెత్తి బాధించిరి-38. బలగర్వితులై నందనోద్యానమును ఛేదించిరి. ఉద్యానపాలకులనందరిని ఆయుధముల చేగొట్టిరి-39, కోటను చేధించి నగరములోపల ప్రవేశించి మందిరములలోనున్న సమస్త దేవతలను మిక్కిలి పీడించిరి-40. దేవనర్తకులైన యప్పరః శ్రేష్టలను . విశేషించి హారించిరి, తరువాత సమస్త దేవతలు మీక్కిలి బాధింపబడనీ పొరుగా జూచుకొనిరీ-41. ఆదాడి ఘోష విని యింద్రుడు. ఇంద్రాసనము వీడి అందరు దేవతల వెంట నీడుకొని పలాయన పరుడయ్యెను-42. అపుడా. యింద్రుడు బ్రహ్మనివాసముజేరి యున్నదియున్నట్లుగా రాక్షసులు జేసినది చెప్పెను-43. బ్రహ్మయు అది విని సర్వదేవతలతో గూడిన వాడును, సిరితొలగిన వాడును ఐన హరిహయుని (ఇంద్రుని) జాచి యిట్లనెను-44. ఓ యింద్రా! నీవు ఈ సమస్త దేవతలతో ముకుందుని (విష్ణువును శరణము వేడుము. దైత్యశత్రువు, జగత్కర్తయైన యాతడు నీకు శ్రేయమును జేయును-45. అని చెప్పి పితామహుడైన బ్రహ్మ సమస్తదేవతలతో ఇంద్రునితో వెడలి పాలసముద్రమును జేరెను-46. తరువాత బ్రహ్మాది దేవతలందరు సర్వలోక మహేశ్వరుడైన శ్రీమహావిష్ణువును శ్రేష్టమైన పదములతో స్తుతించిరి-47. తరువాత భగవంతుడు వాసుదేవుడు సనాతనుడునైన శ్రీ మహావిష్ణువు జగద్రక్షణలంపటుడైయా సమస్త దేవతలతో నిట్లనెను-48.

శ్రీ భగవానువాచ :-

భవతాం సువిధాస్యామి తేజ సైవోపబృహ్మణమ్

యదుచ్యతే మయేదానీం యుష్మాలిస్తద్విధీయతామ్

ఓషధిప్రవరాః సర్వాః క్షిపత క్షీరసాగరే

అసురైరపి సంధాయ సమమేవ చ త్రిరిహ

మంథానం మందరం కృత్వా కృత్వా యోక్తం చ వాసుకిమ్

మయి స్థితే సహాయే తు మధ్యతామమృతం సురాః

సమస్త దానవాశ్చాపి వక్తవ్య సాంత్వపూర్వకమ్

సామాన్యమేవ యుష్మాకమస్మాకం చ ఫలంత్వితి

మధ్యమానే తు దుగ్ధభౌ యా సముత్పద్యతే సుధా

తత్పనోద్బలినో యూయమమర్త్యాశ భవిష్యథ

యథాదైత్యాశ్చ పీయాషం నైతత్ర్పాప్పంతి కించన

కేవలం క్లేశమంతశ్చ కరిష్యామి తథా హ్యహమ్

భగవంతుడనేను : ఓ దేవతలారా! మీకు మీ తేజముతోనే యభివృద్ధిని గలుగజేయుదును. నేను చెప్పినదానీనాచరింపుడు-49. సమస్తమైన ఔషధిశ్రేష్ఠములను క్షీరసాగరమున బడవేయుడు. అసురులము గూడ సమముగా కలుపుకొని, మందరమును కవ్వముగా జేసి, వాసుకినీ కవ్వపుత్రాడుగా జేసి, నేను (అడుగున కూర్మరూపమున) సహాయముండగా అమృతమునకై యాక్షీరసాగరమును మధించుడు-51. సమస్త రాక్షసులతో సొంత్వన పూర్వకముగనే సముద్రమథన ఫలమిరువురికి సమానమని చెప్పుడు-52. సముద్ర మథనమున బుట్టిన సుధను ద్రాగుటచే మీరు (దేవతలు) బలవంతులును అమర్యులును (మరణము లేనివారును) ఆగుదురు-53. రాక్షసులు సుధనేమాత్రము త్రాగకుండగను కేవలము కష్టమును మాత్రమనుభవించునట్లు నేనే చేసెదను-54.

ఇతి శ్రీవాసుదేవేన కథితా నిఖిలాః సురాః

సంధానం త్వతులై ర్దైత్యైః కృతవంతస్తదాసురాః

నానావిధౌషధిగణం సమానీయ సురాసురాః

క్షీరాబ్దిపయసి క్షిప్త్వా చంద్రమోధిక నిర్మలమ్

మంధానం మందరం కృత్వా కృత్వాయోక్తం తు వాసుకిమ్

ప్రారేభిరే ప్రయత్నేన మథితుం యాదసాంపతిమ్

వాసుకేః పుచ్ఛభాగే తు సహితాః సర్వదేవతాః

శిరోభాగే తు దైతేయా నియుక్తాస్తత్ర శౌరిణా

బలవంతోఽపి తే దైత్యాస్తన్ముఖోచ్ఛ్వాసపావకైః

నిర్దగ్ధవపుషః సర్వే నిస్తేజస్మాస్తదాభవన్

పుచ్ఛదేశే తు కర్షంతో ముహురాప్యాయితాః సురాః

అనుకూలేన వాతేన విష్ణునా ప్రేరితేన తు

అదీకూర్మాకృతిః శ్రీమాన్మధ్యే క్షీరపయోనిధీః

భ్రమతో మందరాడ్రీస్తు తస్యాధిష్టానమగాత్

మధ్యే చ సర్వదేవానాం రూపేణాన్యేన మాధవః

చకర్ష వాసుకిం వేగాదైత్యమధ్యే పరేణ చ

బ్రహ్మరూపేణ తం శైలం విధాయక్రాంతవారిధిమే

అపరేణ చ దేవర్షిర్మహతా తేజసా ముహు

ఉపబృంహితవాన్ దేవాన్యేన తే బలశాలినః

తేజసా పునరన్యేన బలాత్కారసన సః

ఉపబృంహితవాన్నాగం సర్వశక్తిర్జనార్దనః

మధ్యమానే తతస్తస్మిన్ క్షీరాబ్ధౌ దేవదానవైః

ఆవిర్బభూవ పురతః సురభిః సురపూజితా

ముదం జగ్ముస్తదా దేవా దైతేయాశ్చ తపోధన

మధ్యమానే పునస్తస్మిన్ క్షీరా బ్ధౌ దేవదానవైః

కిమేతదితి సిద్ధానాం దివి చింతయతాం తదా

ఉష్ఠితా వారుణీ దేవీ మదాల్లోలవిలోచనా

అసురాణాం పురస్తాత్సా స్మయమానా వ్యతిష్ఠత

జగృహుర్నైవ తోం దైత్యా అసురాశ్భాభవంస్తతః

సురా న విద్యతే యేషాం తేవాసురశబ్దితాః

అథ సా సర్వదేవానామగ్రతః సమతిష్ఠత

జగృహుస్తాం ముదా దేవాః సూచిః పరమేష్ఠినా

సురాగ్రహణతోఽష్యేతే సురశల్దేన కీర్తితాః

మథ్యమానే తతో భూయః పారిజాతో మహాద్రుమః

ఆవిరాసీత్సుగంధీన పరితోవాసయజ్ఞగత్

అత్యర్ధసుందరాకారా ధీరాశ్చాప్సరసాంగణాః

ఆవిర్భూతాశ్చ దేవర్ణే సర్వలోకమనోహరాః

తతః శీతాంశురుదభూత్తం జగ్రాహ మహేశ్వరః

విషజాతం తదుత్పన్నం జగృహంర్నాగజాతయః

కౌస్తుభాఖ్యం తతో రత్న మాదదే తజనార్దనః

తతః స్వపత్రగంధేన మదయంతీ మహౌషధీః

విజయా నామ సంజజే భైరవస్తాముపాదదే

తతో దివ్యాంబరధరో దేవో ధన్వంతరిః స్వయమ్

ఉపస్థితః కరే బిభ్రదమృతాధ్యం కమండలుమ్

తతఃప్రహృష్టమనసో దేవా దైత్యాశ్చ సర్వతః

మునయశ్చిభవంస్తుష్టాస్తదానీం తపసాం నిధేః

తతో వికసితాంభోజవాసినీ వరదాయినీ

ఉష్ఠితా పద్మహస్తా శ్రీస్తస్మాత్క్షీరమహార్ణవాత్

అథతాం మునయః సర్వేశ్రీ సూక్తేన శ్రియం పరామ్

తుష్టుపుస్తుష్టహృదయా గంధర్వాశ్చ జరుః పరమ్

విశ్వాచీప్రముఖాః సర్వేన నృతుశ్చాపురోగణాః

గంగాద్యాః పుణ్యనద్యశ్చ స్నానార్థముపతస్థిరే

అష్టాదిగ్ధంతినశ్చైవ మేధ్యపాత్రస్థితం జలమ్

ఆదాయ స్నాపయాంచక్రుస్తాం శ్రియం పద్మనివాసినీమ్

తులసీం చ సముత్పన్నాం పరారామైక్యజాం హరేః

పద్మమాలాం దదౌ తస్యై మూర్తిమాన్ క్షీరసాగరః

భూషణాని చ దివ్యాని విశ్వకర్మా సమర్పయత్

దివ్యమాల్యాంబరధరా దివ్యభూషణభూషితా

యమౌ వక్షస్థలం విష్ణోః సర్వేషాం పశ్యతాం రమా

తులసీ తు ధృతా తేన విష్ణునా ప్రభవిష్ణునా

పశ్యతి స్మ చ సా దేవీ విష్ణువక్షస్థలాలయా

దేవాన్షయార్ధయా దృష్ట్యా సర్వలోకమహేశ్వరీ

ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాస్త్యసతాదే లలితోపాఖ్యానేఅమృతమంథనం నామ న మోఽధ్యాయః

ఈ విధముగా హరిచే దేవతలందరు చెప్పబడిరి. అపుడువారు రాక్షసులను సముద్రమథనమున సాధనముగా జేసికొనిరి. అపుడు దేవదానవులు నానా విధములైన యోషథి గణమును దెచ్చి క్షీరసముద్రజలమున వైచిరి. చంద్రుని కంటెను నిర్మలమైన మందరమును కవ్వమునుగా జేసి వాసుకినీ కవ్వపు త్రాడుగా జేసిరి. ప్రయత్నముతో సముద్రమును మథింప బ్రారంభించిరి-56 దేవతలందరు వాసుకి తోకభాగమును బట్టుకొనుటకును, రాక్షసులందరు వాసుకి తలభాగమును బట్టుకొనుటకును హరిచే నీయోగింపబడిరీ-57. బలవంతలైనను రాక్షసులు వాసుకి నోటి బుసల యగ్నిజ్వాలలతో శరీరములు మాడి యందరు నిస్తేజస్కులైరీ-58. తోకభాగమును లాగుచున్న దేవతలు విష్ణు ప్రేరితమైన యనుకూలవాతముచే సేద దీర్చుకొనుచుండిరి-59. ఆదికూర్మావతారమునొందిన భగవంతుడైన విష్ణువు పాలసముద్రమధ్యన తీరుగుచున్న మందర పర్వతమునకు అధిష్టానమయ్యెను-60. దేవతల మధ్యలో నొక రూపమునను దానవుల మధ్య మరొక రూపమున ఉండి వాసుకీని వేగముగాలాగేను-61. బ్రహ్మరూపమున నామందర శైలమును సముద్రమునా క్రమించునట్లుగా జేసెను, మరొక రూపమున దేవరియై మహాతేజముతో మాటిమాటికి దేవతలను బలవంతులుగా జేసెను. బలాత్కారమును సహించు మరొక తేజముతో సర్వశక్తియైన జనార్దనుడు వాసుకినాగమును గూడ బలముతో వర్ధిల్లజేసెను. తరువాత దేవదానవులచే పాలసముద్రమావీధముగా మథింపబడుచుండగా-64. ముందర దేవపూజితయైన సురభి (కామధేనువు) ఆవిర్భవించెను. ఓ తపోధనుడా! అపుడు దేవతలును దానవులును సంతసించిరి-65, దేవదానవులచే మరల పాలసముద్రము మథింపబడగా, ఇదేమిటా! యనియాకారమున సీదులు చింతించుచుండగా-66. మదముతో కదులు కన్నులు గలదై వారుణీదేవి (కల్లు) బయలువెడలెను. ఆ రాక్షసులముందు చిరునవ్వు నవ్వుచూ నిలుచుండెను-67. ఆమెను దైత్యులు (రాక్షసులు) స్వీకరింపలేదు. కావున వారు అసురులు (సుర-(కల్లు) లేనివారు) ఐరి. సురలేని వారు అసురులు అనబడిరి-68. తరువాత నదీ సర్వదేవతల యెదుట నిలుచుండెను. బ్రహ్మచే సూచింపబడిన వారై దేవతలు ఆవారుణిని-సురను) స్వీకరించిరి. సురను స్వీకరించుటచే దేవతలు సురులనబడిరి-69. మరల సముద్రము మథింపగా పరిమళముతో జగమంతయు సుగంధితముగా జేయుచు పారిజాతమను మహావృక్షము ఆవిర్భవించెను-70. ఓ దేవరీ మిక్కిలి సుందరాకారులైన యప్సరోగణములు లోకమనోహరములైయావిర్భవించెను-71. ఆ తరువాత చంద్రుడు బుట్టెను. ఆతనినీ మహేశ్వరుడు స్వీకరించెను. విష సమూహములు కొన్ని పుట్టినవి. వాటిని నాగజాతులు స్వీకరించినవి-72. తరువాత బుట్టిన కౌస్తుభమను రత్నమును జనార్ధనుడు (విష్ణువు) స్వీకరించెను. తరువాత తనయాకుల గంధముతో మహౌషధులను గూడ మదింపజేయుచు ‘విజయ’యనునది బుట్టెను, దానిని భైరవుడు స్వీకరించెను-73. తరువాత దివ్యవస్త్రములు ధరించి దేవుడైన ధన్వంతరి స్వయముగా తన చేతనమృతకమండలమును ధరించి యావిర్భవించెను-74. ఓ తపోనిధీ! దేవతలు దానవులును, మునులును అపుడు సంతుష్టులైరీ-75. ఆ తరువాత వికసించిన కమలమున నుండు నట్టిది, వరమునిచ్చునట్టిది, పద్మముల హస్తములందుగలదియునైన శ్రీదేవి (లక్ష్మీదేవి) పాలసముద్రమునుండి పుట్టినది-76. అంత మునులందరు ఆ పరాశక్తి రూపణియైన లక్ష్మిని శ్రీసూక్తముతో స్తుతించిరి. సంతుష్ట హృదయులైన గంధర్వులు ఆమెను గొప్పగా గానముజేసిరి-77. విశ్వాచి మొదలగు సప్సరసల గణములు నాట్యము జేసినవి. గంగ మొదలగు పుణ్యనదులు ఆమె స్నామునకై సమీపించినవి-78. అష్టదిగ్గజములు గూడ పవిత్రపాత్రముల జలములు దెచ్చి పద్మవాసిని యైన యాశ్రీదేవిని స్నానము చేయించినవి-79. సాక్షాత్తు క్షీరసముద్రమే రూము దాల్చివచ్చి హరికి పరార్ధ్యయై యైక్యజయై పుట్టిన తులసికి పద్మమాలను సమర్పించెను-80. విశ్వకర్మ దీవ్యభూషణములనామెకు సమర్పించెను. ఆ విధమవుగా దీవ్యమాల్యాంబరధరరై దీష్యభూషణ భూషితయైన లక్ష్మీ అందరుచూచు చుండగనే విష్ణువు యొక్క వక్షస్థలమును జేరెను-81. ప్రభవిష్ణువైన విష్ణువుచే తులసి ధరింపబడినది. విష్ణువక్షస్థలి నన్ను సర్వమహేశ్వరియైన యా లక్ష్మీదేవి దేవతలను దయార్థ దృష్టితో జూచుచుండెను-82.

ఇది బ్రహ్మాండ మహాపురాణమున నుత్తర భాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితో పాఖ్యానమున అమృతమథనమను నవమాధ్యాయము-9.