బ్రహ్మాండ మహా పురాణము
35 - వేదవ్యసనాఖ్యము
సూత ఉవాచ :-
దేవమిత్రశ్చ శాకల్యో మహాత్మా ద్విజపుంగవః ।
చకార సంహితాః పంచ బుద్ధిమాన్ వేదవిత్తమః ॥
పంచ తస్యా భవచ్ఛిష్యా ముద్గలో గోఖలస్తథా ।
ఖలీయాన్ సుతపా వత్సః శైశిరేయశ్చ పంచమః ॥
ప్రోవాచ సంహితా స్త్రీస్రః శాకో వైణో రథోతరః ।
నిరుక్తం చ పునశ్చక్రే చతుర్థం ద్విజసత్తమః ॥
తస్య శిష్యాస్తు చత్వారః పైలశ్చేక్షలకస్తథా ।
ధీమాఞ్తబలాకశ్చ గజశ్చైవ ద్వీజోత్తమాః ॥
భాష్కలిస్తు భరద్వాజస్తిస్రః ప్రోవాచ సంహితాః ।
త్రయస్తస్యాభవఞ్చ్ఛిష్యా మహాత్మానో గుణాన్వీతాః ॥
ధీమాంశ్చ త్వాషనాపశ్చ పన్నగారిశ్చ బుద్ధిమాన్ ।
తృతీయశ్చార్జవస్తే చ తపసా శంసితవ్రతాః ॥
వీతరాగా మహాతేజాః సంహితాజ్ఞానపారగాః ।
ఇత్యేతే బప్వృచాః ప్రోక్తాః సంహితా యైః ప్రవర్తితాః ॥
వైశంపాయనశిష్యోఽసౌ యజుర్వేదమకల్పయత్ ।
షడశీతిస్తు తేనోక్తాః సంహితా యజుషాం శుభాః ॥
శిష్యేభ్యః ప్రదదౌ తాశ్చ జగృహుస్తే విధానతః ।
ఏకస్తత్ర పరిత్యక్తో యాజ్ఞవల్క్యో మహాతపాః ॥
షడశీతిస్తథా శిష్యాః సంహితానాం వికల్పకాః ।
సర్వేషామేవ తేషాం వై త్రిథా భేదాః ప్రకీర్తితాః ॥
సూతుఁడు చెప్పెను.
శాకల్యుఁడు మహాత్ముఁడు, ద్వీజపుంగవుఁడు. ఈతనికి దేవమిత్రుఁడను నామాంతరము, ఆతఁడు బుద్ధిమంతుఁడు; వేద విత్తముఁడు. ఆతఁడు ఐదు సంహితల రచించెను. (1) ఆతనికీ ముద్దలుఁడు, గోఖలుఁడు, ఖలీయుఁడు, సుతపుఁడు, ఐదవవాఁడు శైశిరేయుఁడు. శిష్యులు. శోకము, వ్రణము, రధీతరమను మూఁడు బ్రాహ్మణములను చేప్పెను. ఆతఁడు రచించిన నాలుగవ గ్రంథము నిరుక్తము (3) ఓ బ్రాహ్మణులారా! ఆతనికి నల్గురు శిష్యులు వారు పైలుఁడు, ఈక్షలకుఁడు, ధీమంతుఁడగు శతబలాకుఁడు, గజుఁడు. (4) బాష్కల కుమారుఁడు భరద్వాజుఁడు మూడు సంహితలను రచించెను. ఆతనికి మహాత్ములు, గుణాన్వితులు నగు ముగ్గురు శిష్యులు వారిలో అపనాపుఁడు ధీమంతుఁడు; బుద్ధిమంతుఁడు పన్నగారి; ఇంక మూఁడవ వాఁడు ఆర్జవుఁడు; (6)
క్రిందటి అధ్యాయములో బృహదారణ్యకోషనిషత్తులో యాజ్ఞవల్క్యుఁడు శాకల్యుని “ఔషనిషద పురుషుని” గూర్చి ప్రశ్నించెను. అంతియేకానీ ఈ బ్రహ్మాండ పురాణములో చెప్పినట్లు సాంఖ్యమార్గము యొక్క ఆధిక్యమును గూర్చి కాదు.
పైలుని శిష్య రంపర శాకల్యుడు మొదలు ఇట్లున్నది.
సుమంతుఁడు
కబంధుఁడు (కృష్ణాధర్వణమును గ్రహించెను)
పడ్యుఁడు దేవదర్యుఁడు .
జాజల కుముదాది శౌనకుడు
మోదుఁడు బ్రహ్మబాల పిప్పలాదుడు శౌలాయనీ
బభృ సైంధవాయన (లేక) ముంజకేజ్య
వీరందరు వీతరాగులు, మహాతేజులు, సంహిత జ్ఞానము యొక్క పారమును ముట్టినవారు. వారందరు తపముతో శంసిత ప్రతులు. వీరందరు బహ్వృచులు. వీరి వలననే సంహితలు ప్రవర్తిల్లెను. (7) వైశంపాయనుని శిష్యుఁడు యజుర్వేదమును రచించెను ఆతని వలన 86 సంహీతలు వచింపఁబడెను. ఇవి శుభంకరములు. (8) ఆతఁడు వానినీ తన శిష్యుల కొసంగెను. వీరో వానిని విధి విధాన పూర్వకముగా గ్రహించిరి. తన శిష్యులలో నొకఁడయిన యాజ్ఞవల్క్యుని గురువు విడిచెను. ఆ యాజ్ఞవల్క్యుఁడో మహాతపస్వి (9) ఆ శిష్యులు 86 గురు. వారే వేరువేరు సంహితలను కల్పించిరి. ఈ 86 సంహితలలో ఒక్కొక్కటి మూఁడు విధములు. ఆ భేదములు చెప్పబడినవి. (10)
త్రిధా భేదాస్తు తే వేదభేదేఽస్మిన్నవమే శుభే ।
ఉదీచ్యా మధ్యదేశాశ్చ ప్రాచ్చోశ్చైవ పృథగ్విధాః ॥
శ్యామాయనిరుదీచ్యానాం ప్రథాన: సంబభూవ హి ।
మధ్యదేశాశ్చ ప్రతిష్టాతా చాసురిః ప్రథమః స్మృతః ॥
ఆలంబిరాదిః ప్రాచ్యానాం త్రయో దేశ్యాదయస్తు తే ।
ఇత్యేతే చరకాః ప్రోక్తాః సంపాతాపాదినో ద్విజాః ॥
ఋషయ ఊచుః :-
చరకాధ్వర్యవః కేన కారణం బ్రూహి తత్త్వతః ।
కిం చీర్ణం కస్య వా హేతోశ్చరకత్వం హి భేజిరే ॥
సూత ఉవాచ :-
కార్యమాసీదృషీణాం చ కించిత్ బ్రాహ్మణసత్తమాః ।
మేరుపృష్ఠం సమాసాద్య తైస్తదా త్వితి మంత్రితమ్ ॥
శుభంకరమయిన యీ వేదభేదములు మూఁడు విధములు 1. ఉత్తరదిక్కునకు 2. మధ్య దేశమునకు 3. తూర్పుదిక్కునకు సంబంధించినవి, ఇవి వేరు వేరు విధములు. (11). ఉదీచ్యులకు శ్యామాయని ప్రధానుడయ్యెను. (నాయకుఁడయ్యెను) మధ్యదేశపు వేద విభాగ ప్రథమ ప్రతిష్టాత ఆసురీగా సంస్కృతుఁడు. (12) ప్రాచ్యులలో ఆలంబీ అగ్రేసరుఁడు. ఈ విధముగా వీరు మువ్వురు మూఁడు దేశభేదములకు ప్రప్రథములు. (12) ఈ విధముగా సంహితవాదులయిన బ్రాహ్మణులు చరకులని చెప్పఁబడిరి. ఋషులు ఇట్లనిరి. ఏ కారణమున చరవాధ్వర్యువులు అయిదోతత్త్వతః చెప్పుము. ఏదీ విభజింపబడినదీ? ఏ కారణమున వారు చరకత్వమును బొందిరి? (14) సూతుఁడిట్లనెను. ఓ బ్రాహ్మణోత్తములార! వారు చేయవలసిన కార్యము ఒక కొంచెమున్నది. వారు మేరు శిఖరమును చేరిన తరువాత వారీ విధముగ ఆలోచించిరి.
యో వాత్ర సప్తరాత్రేణ నాగచ్ఛేద్ద్విజసత్తమః ।
స కుర్యాద్బ్రహ్మహత్యాం వై సమయో నః ప్రకీర్తితః ।
తతస్తే సగణాస్సర్వే వైశంపాయనవర్జితాః ।
ప్రయయుః సప్తరాత్రేణ యత్ర సంధః కృతోఽభవత్ ॥
బ్రాహ్మణానాం తు వచనాద్భ్రహ్మహత్యాం చకార సః ।
శిష్యానథ సమానీయ స వైశంపాయనోఽబ్రవీత్ ॥
బ్రహ్మహత్యాం చరధ్వం వై మత్కృతే ద్విజసత్తమాః ।
సర్వే యూయం సమాగమ్య బ్రూత కామం హితం వచః ॥
యాజ్ఞవల్క్య ఉవాచ :-
అహమేకశ్చరిష్యామి తిష్టంతు మునయస్త్విమే ।
బలేనోత్థాపయిష్యామి తపసా స్వేన భావితః ॥
ఏవముక్తస్తతః క్రుద్ధో యాజ్ఞవల్క్యమదౌత్యజత్ ।
ఉవాచ యత్త్వయాఽధీతం సర్వం ప్రత్యర్పయస్వ మే ॥
ఏవముక్తః స రూపాణి యజుంషి గురవే దదౌ ।
రుధిరేణ తథాక్తానీ చర్దిత్వా బ్రహ్మవిత్తమాః ॥
తతః స ధ్యానమాస్థాయ సూర్యమారాధయద్ద్విజః ।
సూర్యే బ్రహ్మ యదుత్పన్నం తం గత్వా ప్రతితిష్ఠతి ॥
తతో యాని గతాన్యూర్ధ్వం యజూంష్యాదిత్యమండలమ్ ।
తాని తస్మై దదౌ తుష్టః సూర్యో వై బ్రహ్మరాతయే ॥
అశ్వరూపాయ మార్తండో యాజ్ఞవల్క్యాయ ధీమతే ।
యజుంష్యధీయతే తాని బ్రాహ్మణా యేన కేనచిత్ ॥
ద్విజసత్తముఁడెవ్వఁడైన ఏడు రోజులో నిచ్చటకు రాని పక్షమున ఆతఁడు బ్రహ్మహత్యా దోష పరిహారమును సలుపవలేను. అనీ యిది సమయముగా ప్రకటింపఁబడినది. (16) అంత, వైశంపాయనుఁడు తక్క తక్కిన ఋషిగణములు మేరు పర్వతమున (సప్త రాత్రి సంధి చేయబడిన ప్రదేశమునను) (బోయిరి. (17) బ్రాహ్మణుల వచనమును బట్టి ఆతఁడు బ్రహ్మహత్యను చేసెను. తరువాత తన శిష్యుల నెల్లరను పిలిచి వైశంపాయనుఁడిట్లనియెను. నా కొఱకై ద్వీజసత్తములారా ! బ్రహ్మహత్యను చేయుఁడు. మీరందరు నొక్కచో కలిసి, మిక్కిలి హితమయిన వాక్కులను వచింపుఁడు. (19) యాజ్ఞవల్క్యుండిట్లనియెను. నేనొక్కడనే చేసెదను. మీరందరు మునులు అట్లే నీలువఁబడియుండుడు. సా తపస్సు యొక్క బలముచే ఆతనిని నుత్తాపనము చేయుదును. యాజ్ఞవల్క్యుఁడిట్లు పలుకగా వైశంపాయనుఁడు మిక్కిలి క్రుద్ధుఁడయ్యెను. యాజ్ఞవల్క్యుని బహిష్కరించెను. ఆతనితో “ఓ యాజ్ఞవల్య్కా, నా నుండి నే నేర్చినదీ సర్వస్వమును సాకు ప్రత్యర్పణము చేయుము! (21) ఇట్లు చెప్పఁబడి, బ్రహ్మ విత్తములలో శ్రేష్ఠుఁడయిన యాజ్ఞవల్క్యుడు గుర్తించుటకు వీలయిన రూపములు గలిగినవి రక్తసిక్తములయినవియునగు యజుర్వేద మంత్రములను వమనము చేసి గురువున కోసంగేను. (22) అంత ధ్యాన నిమగ్నుఁడయి. యాజ్ఞవల్క్యుడు సూర్యుని సారాధించెను. సూర్యునందు బుట్టిన బ్రహ్మ (వేదము) అంతయు సూర్యునిజేరి నిలుచును. (23) అంత ఆదిత్య మండలమును పొందిన యజుర్వేద మంత్రములను బ్రహ్మరాతుఁడయిన యాజ్ఞవల్క్యునకు (వేదనిధియైన యతనికి) సంతుష్ఠుఁడయిన సూర్యుఁడొసంగెను. (24) ధీమంతుఁడు అశ్వరూపమునొందిన యాజ్ఞవల్క్యునకు మార్తాండుడు యజుర్మంత్రముల నొసంగెను. ఏదో యొక విధముగా బ్రాహ్మణులు ఆ యజుర్మంత్రములను అధ్యయనము చేయుదురు. (25)
అశ్వరూపాయ దత్తానీ తతస్తే వాజినోఽభవన్ ।
బ్రహ్మహత్యామయైశ్చీర్ణా చరణాచ్చరకాః స్మృతాః ॥
వైశంపాయనశిష్యాస్తే చరకాః సముదాహృతాః ।
ఇత్యేతే చరకాః ప్రోక్తా వాజినస్తు నిబోధత ॥
యాజ్ఞవల్క్యస్య శిష్యాస్తే కణ్వో బౌధేయ ఏవ చ ।
మధ్యందినస్తు సాపత్యో వైధేయాశ్చాద్ధబౌద్ధకౌ ॥
తాపనీయాశ్చ వత్పాశ్చ తథా జాబాలకేవలో ।
అవటీ చ తథా పుండ్రో వైణ్యః స పరాశరః ॥
ఇత్యేతే వాజినః ప్రోక్తా దశ పంచ చ సత్తమాః ।
శతమేకాధికం జేయం యజుషాం యే వికల్పకౌః ॥
పుత్త్రమధ్యాపయామాస సుమంతుమథ జైమినిః ।
సుమంతుశ్చాపి సుత్వానం పుత్రమధ్యాపయత్పునః ॥
సుకర్మాణం తతః సువ్వానుత్త్రమధ్యాపయత్బునః ।
స సహస్రమధీత్యాశ్రు సుకర్మాష్యథ సంహితాః ॥
ప్రోవాచాథ సహస్రస్య సుకర్మా సూర్యవర్చసః ।
అనధ్యాయేష్వధీయానాంస్తాన్ జఘాన శతక్రతుః ॥
ప్రాయోపవేశమకరోత్తతోఽసౌ శిష్యకారణాత్ ।
క్రుద్దం దృష్ట్వా తతః శక్రో వరం సోఽథ పునర్ధదౌ ॥
భవిష్యతో మహావీర్యౌ శిష్యౌ తేఽతులవర్చసౌ ।
అధీయతాం మహాప్రాజ్ఞౌ సహస్రం సంహితా ఉభౌ ॥
(భారతాదుల యందు నూతన వేదమొసంగునపుడు సూర్యుఁడు అశ్వరూపము నొందినట్లున్నది. అంతియేకానీ యాజ్ఞవల్క్యుడు కాదు).
మంత్రములు అశ్వరూపము నొందిన యాజ్ఞవల్క్యున కొసంగబడినవి. అందుచే వారందరు “వాజిను” లయిరి. బ్రహ్మహత్యా రోగములచే చీలినవారు చరణమువలన చరకులుగా సంస్కృతులు. వైశంపాయనుని శిష్యులైన వారు చరకులుగా చెప్పఁబడుదురు (ఇది యొక సంప్రదాయము) ఈ విధముగా చరకులు వివరింపఁబడిరి. వాజినులను గూర్చి యింక మీఁద తెలిసికొనుఁడు.(27) వాజినులుగా పదీయైదుగురు కలరు. వారు సత్తములు యాజ్ఞవల్క్యుని శిష్యులు వారు కణ్వుఁడు, బౌధ్య మధ్యందినుఁడు, సాపత్యుడు, వైధేయుడు, అధుడు, బౌద్దకుడు, తాపమునీయుం డు, వత్సుడు, జాబాలుఁడు, కేవలుఁడు, ఆవటి, పౌండ్రుఁడు, వైజేయుఁడు, పారాశరుఁడును యజుర్మంత్ర విభాగములు ఏకాధికశతము నూట యొక్కటియని యెఱుంగవలయును. (30) జైమినీ తన కుమారుఁడయిన సుమంతున కధ్యాపనము చేసేను. సుమంతుఁడు తన కుమారుఁ డగు ‘సుత్వాను’ నకు చెప్పెను. (31) సుత్వానుడు తన పుత్రుడైన సుకర్మునకు జెప్పెను. సుకర్ముఁడు వెంటనే ఒక సహస్రసంఖ్య సంహితలను గఱచి, (32) ఒక వేయిమందికి వానీని చెప్పెను వారందరు సూర్య వర్చస్వులు. వారు అనధ్యాయ దినములలో చదువుటచే ఇంద్రుఁడు వారిని చంపెను. (33) తత్కారణమున శిష్యుల కొఱకై యతఁడు ప్రాయోపవేశము చేసెను. ఇంద్రుఁడు క్రోధోదగ్రుఁడయిన యాతనిని చూచి, వరమొసంగెను. “నీకు మహావీర్యులు అతులవర్చస్వులు నయిన ఇరువురు శిష్యులు కలిగెదరు. అత్యంత ప్రాజ్ఞులయిన యీ యిర్వురు సహస్ర సంహీతలను అభ్యసింతురు”.
ఏతే సురా మహాభాగాః సంక్రుద్ధా ద్వీజసత్తమ ।
ఇత్యుక్త్వా వాసవః శ్రీమాన్సుకర్మాణం యశస్వినమ్ ॥
శాంతక్రోధం ద్విజం దృష్ట్వా క్షిప్రమంతరధాత్ర్పభుః ।
తస్య శిష్యోఽ భవద్ధీమాన్ పౌష్యంజిర్ద్వి జసత్తమాః ॥
హిరణ్యనాభః కౌశల్యో ద్వితీయోఽభూన్నరాధిపః ।
అధ్యాపయత పౌష్యంజిః సహస్రార్ధం తు సంహితాః ॥
తే నామ్నోదీచ్యమానః శిష్యాః పౌష్యంజినః శుభాః ।
సత్వాని పంచ కౌశీల్యః సంహితానామధీతవాన్ ॥
శిష్యా హిరణ్యనాభస్య స్మృతాస్తు ప్రాచ్యసామగాః ।
లౌగాక్షి: కుశుమిశ్చైవ కుశీదిర్లాంగలీస్తథా ।
పౌష్యంజిశిష్యాశ్చత్వారస్తేషాం భేదాన్నిబోధ ॥
నాడాయనీయః సహతండిపుత్రస్తస్మాదనోవైతనామా సువిద్వాన్ ।
సకోతిపుత్త్రః సుసహాః సునామా చైతాన్భేదాన్విత్త లౌగాక్షిణస్తు ॥
త్రయస్తు కుశుమేః శిష్యా ఔరసః స పరాశరః ॥
నాభిర్వితస్తు తేజస్వీ త్రివిధా కౌశుమాః స్మృతాః ।
శౌరిషుః శృంగిపుత్రశ్చ ద్వావేతే తు చిరవ్రతౌ ॥
రాణాయనీయిః సౌమిత్రిః సామవేదవిశారదౌ ।
ప్రోవాచ సoహితాస్తిసః శృంగిపుత్రౌ మహాతపాః ॥
వైనః ప్రాచీనయోగశ్చ సురాలశ్చ ద్వీజోత్తమః ।
ప్రోవాచ సంహితాః షట్ తు పారాశర్యస్తు కౌథుమః ॥
“ఓ ద్విజసత్తమ ! ఈ సురలు (దేవతలు) మహాభాగులు. అదృష్టవంతులు. వారు సంక్రుదులు”, అని యశస్వియిన సుకర్మునకు చెప్పి, శ్రీమంతుఁడయిన వాసవుఁడు, శాంతక్రోధుఁడయిన ద్విజునీ చూచీ వెంటనే అంతర్జానము నొందెను. ఆతని శిష్యులు ధీమంతుఁడు, ద్విజ సత్తుముఁడయిన పౌష్యంజి (2) హిరణ్యనాభుఁడు ఇతడు కౌశల్యుఁడను నామాంతరము కలవాఁడు. నరాధిపుఁడు. పౌష్యంజి ఆర్ధసహస్రము (500) సంహితలను బోధించేను. (38) శుభంకరులయిన పౌష్యంజీ శిష్యులు ‘ఉదీచ్య సాముల’ లను నామముతో ప్రసిద్ధులు. కౌశిల్యుఁడు ఐదు సంహితలను అధ్యయనము చేసెను. (39) హిరణ్య నాభుని యొక్క శిష్యులు ప్రాచ్యసామగులుగా ప్రసిద్ధులు, పౌష్యంజీ యొక్క నల్గురు శిష్యులు (1) లౌగాక్షి (2) కుశుమి (3) కుశీది (4) లాంగలి అనువారు. వీరి యొక్క భేదముల నెఱుంగుము (40), లౌగాక్షి యొక్క వివిధ (విద్యా) శాఖలు నాడాయనీయము, తాండీపుత్రము ఆ తండిపుత్రునినుండి అనోవైనుడను సువిద్వాంసుఁడు, సకోతి పుత్రుఁడు సుసహుఁడు, సునాముఁడు. వీరందరిని లౌగాక్షి శాఖలోని వివిధ సభ్యులనుగా నెఱుంగుము. (41) కుశుమీకి ముగ్గురు శిష్యులు. ఔరసుఁడైన, పరాశరుడు తేజస్వీ యయిన నాభి విత్తుఁడు, ఈ విధముగా కౌశుములు త్రివిధములుగా స్మృతులు, శారిషుఁడు, శృంగిపుత్రుఁడు (శృంగి కుమారుఁడు) వీరిద్దరు చీరవ్రతులు,(43) రాణాయనీయుఁడు, సౌమిత్రి వీరిర్వురు సామవేదవిశారదులు. వీరు సామవేద నిపుణులు. మహా తపస్వీయైన శృంగి పుత్రుఁడు మూఁడు సంహితలను రచించిరి. వైనుఁడు, ప్రాచీన యోగుఁడు, సురాలుడు ఉత్తమ బ్రాహ్మణులు. కౌథుమ పారాశర్యుఁడు ఆరు సంహితలను జెప్పెను. (45)
ఆసురాయణ వైశాఖ్యౌ వేదవృద్ధపరాయణౌ ।
ప్రాచీనయోగపుత్త్రశ్చ బుద్ధిమాంశ్చ పతంజలిః ॥
కౌధుమస్య తు భేదాశ్చ పారాశర్యస్య షట్ స్మృతా ।
లాంగలః శాలిహోత్రశ్చ షడువాచాధ సంహితాః ॥
హాలినిర్జ్యా మహానిశ్చ జైమిని ర్లోమగాయనిః ।
కండుశ్చ కోహలశ్చైవ షడేతే లాంగలాః స్మృతాః ॥
ఏతే లాంగలినః శిష్యాః సంహితా యైః ప్రవర్తితాః ।
ఏకో హిరణ్యనాభస్య కృతః శిష్యో నృపాత్మజః ॥
సోఽకరోత్తు చతుర్వింశసంహితా ద్వీపదాం వరః ।
ప్రోవాచ చైవ శిష్యేభ్యో యేభ్యస్తాంశ్చ నిబోధత ॥
రాడీశ్చ రాడవీయశ్చ పంచమౌ వాహనస్తథా ।
తలకో మాండుకశ్చైవ కావికో రాజికస్తథా ॥
గౌతమశ్చాజబస్తశ్చ సోమరాజాయనస్తతః ।
పుష్టిశ్చ పరికృష్టశ్చ ఉలూఖలక ఏవ చ ॥
యవీయసస్తు వైశాలీరంగులీయశ్చ కౌశికః ।
శాలిమంజరిపాకశ్చ శధీయః కానినిశ్చ యః ॥
పారాశర్యస్తు ధర్మాత్మా ఇతి క్రాంతాస్తు సామగ్రాః ।
సామగానాం తు సర్వేషాం శ్రేష్ఠౌ ద్వౌ పరికీర్తితా ॥
పౌష్యంజీశ్చ కృతశ్చైవ సంహితానాం వికల్పకౌ ।
అథర్వాణం ద్వీధా కృత్వా సుమంతురదదాద్విజాః ॥
అసురాయణుఁడు వైశాఖ్యుండు ఇరువురు వేదవృద్ద పరయాణులు. (వారికి పూర్వమందున్న వేదములందు వృద్ధులయిన వారి యందు భక్తులు) బుద్ధిమంతుఁడయిన పతంజలి ప్రాచీనయోగపుత్రుఁడు. (46) పరాశర కుమారుఁడయిన కోడుమునీ యొక్క వేద విద్యా శాఖలు ఆరు. శాలిహోత్ర నామమున వ్యవహరింపఁబడు లాంగలుఁడు 6 సంహితలను రచించెను. (47) హాలిని, జ్యామహానీ, జైమిని, లోమగాయని, కండు, కోహలుఁడును ఈ ఆరుగురును లాంగలుని అనుయాయులుగా సంస్మరింపబడుచున్నారు. (48) వీరారుగురు లాంగలి యొక్క శిష్యులు. సంహితలు వారిచే వ్యాఖ్యానింపఁబడినవి. ప్రచురింపఁబడినవి. (49) ఒకే యొక్కఁడు నృపాత్మజుండు హిరణ్యనాభునిచే శిష్యుండుగా చేసికొనఁబడెను, ఆతఁడు 24 సంహితలను రచించెను. ద్విపదులలో శ్రేష్ఠుఁడయిన యాతఁడు తన శిష్యులను వివరించెను. వారి నామముల నెంగుఁడు. (50) రాడి, రోడవీయుఁడు, పంచముఁడు, వాహనుఁడు, తలకుఁడు, మాండూకుఁడు, కాలికుఁడు, రాజికుఁడు, గౌతముఁడు, అజబస్తుఁడు, సోమరాజాయనుఁడు, పుష్టి, పరీకృష్ణుఁడు, ఉలూఖలుఁడు. యవీయులు (చిన్నవారు) కనీయులు శాలి, అంగులీయుఁడు, కౌశికుఁడు శాలిమంజరీపాకుఁడు, శధీయుఁడు, కానినీ, మజీయు ధర్మాత్ముఁడయిన పారాశర్యుఁడు. ఈ విధముగా సామగులు పేర్కొనంబడిరి. సామగులలో పౌష్యంజలి, కృతుఁడును ఇరువురును శ్రేష్ఠతములుగా పరికీర్తితురు. (55) వారు సంహితలను వివరించిరి. ఓ ద్వీజులారా ! సుమంతుఁడు అధర్వ (వేదమును) రెండుగా విభజించి తన శిష్యుల కొసంగెను. (55) (55 - 62) అధర్వవేదశాఖలు ఉపాధ్యాయులు వివరించును. వారిని నిర్ణయించుట కష్టము, పురాణ క్రమమిట్లున్నది.
శాకల్యుఁడు
ముద్దలుఁడు గోఖలుఁడు ఖలీయవంతుండు సుతపడు శైశిరేయుడు
(ఇతఁడు మూఁడు సంహితలను,
నిరుకమును రచించెను)
పైలుడు ఇక్షలకుఁడు రతబలాకుఁడు గజుఁడు
బాస్కులుఁడు
త్వాపనాపుఁడు పన్నగారి ఆర్జవుఁడు
కబంధాయ పునః కృష్ణం స చ విద్వాన్ యథా శ్రుతమ్ ।
కబంధస్తు ద్విధా కృత్వా పథ్యాయైకం పునర్దదౌ ॥
ద్వితీయం దేవదర్శాయ స చతుర్ధాకరోత్ర్పభుః ।
మోదో బ్రహ్మబలశ్చైవ పిప్పలాదస్తథైవ చ ॥
శౌల్కాయనిశ్చ ధర్మజ్ఞశ్చతుర్ధస్తపసి స్థితః ।
దేవదర్శస్య చత్వారః శిష్యాహ్యేతే దృఢవ్రతాః ॥
పునశ్చ త్రివిధం విద్ధ పథ్యానాం భేదముత్తమమ్ ।
జాజలిః కుసుమాదిశ్చ తృతీయః శౌనకః స్మృతః ॥
శౌనకస్తు ద్విధా కృత్వా దదావేకాం తు బభ్రవే ।
ద్వితీయాం సంహితాం ధీమాన్సైంధవాయనసంజ్ఞతే ॥
సైంధవో ముంజకేశ్యశ్చ భిన్నామాధాద్ద్విధా పునః ।
నక్షత్రకల్పో వైతానస్తృతీయః సంహితావిధిః ॥
చతుర్దోంఽగిరసః కల్పః శాంతికల్పశ్చ పంచమః ।
శ్రేష్ఠాస్త్వధర్వణామేతే సంహితానాం వికల్పకాః ॥
ఖడ్గః కృత్వా మయా యుక్తం పురాణమృషిసత్తమాః ।
ఆత్రేయః సుమతిర్థీమాన్ కాశ్యపో హ్యకృతవ్రణః ॥
భారద్వాజోఽగ్నివర్చాశ్చ వాశిష్ఠ మిత్రయుశ్చ యః ।
సావర్ణిః సోమదత్తిశ్చ సుశర్మా శాంశపాయనః ॥
ఏతే శిష్యా మమ ప్రోక్తాః పురాణేషు దృఢవ్రతాః ।
త్రిభీస్తత్ర కృతాస్తిస్రః సంహితాః పునరేవ హి ॥
ఆతఁడు కబంధునకు కృష్ణా ధర్వణ మంత్రము నొసంగెను. ఆకబంధుఁడు విద్వాంసుఁడు. తాను విన్నదంతయు, రెండు విధములుగాం జేసి పథ్యున కొక భాగము, దేవదర్శునకు రెండవది యొసంగెను. ఆ మహర్షి దానిని నాలుగు విధములుగా విభజించెను. (56,57) దేవదరునికి నలుగురు శిష్యులు. మోదుఁడు, బ్రహ్మబలుఁడు, పిప్పలాదుఁడు, శౌల్కాయనియు వారు దృఢవ్రతులు. (58) శౌల్కాయని ధర్మజుఁడు. తపము నందు స్థిరుఁడు. పథ్యానుయాయుల యొక్క (వేద) విభాగముత్తమము. అది మూఁడు విధములు. ఆశిష్యత్రయము -1 జాజలి. రెండు కుసుమాదీ, మూఁడవ పొఁడు శౌనకుడుగా స్మరీంపఁబడుచున్నారు. శౌనకుడు సంహితను రెండుగాఁ జేసి ఓక భాగమును బభ్రువున కొసంగేను. ధీమంతుఁడయిన శౌనకుండు, రెండవ సంహితా భాగమును సైంధవోయననామక శిష్యున కొసంగెను. (60) ముంజకేశుఁడను నామాంతరము కల సైంధవుఁడు ఆ సంహితను రెండుగా విభజించెను (ఈ సంహిత యింతకు పూర్వమే రెండుగా విభజింపఁబడినది) అధర్వణ సంహీత యొక్క శ్రేష్ఠతమములయిన విభాగములు 1. నక్షత్ర కల్పము 2. వైతానము 3. సంతావీధి, 4. అంగీరసుని. కల్పము 5. శాంతి కల్పము (62) ఋషి సత్తములారా ! ఖడ్లుఁడు. నాతో సహితము పురాణములను వివరించెను. ఈ క్రింద చెప్పబడువారు నా శిష్యులు. వారందరు పురాణములను సూక్ష్మముగా ననుసరించువారు. (63) ఆత్రేయుఁడు, అకృతవ్రణుఁడు, ధీమంతుఁడు సుమతి, కాశ్యపుండు, భరద్వాజుఁడు, అగ్నివర్చుండు, వశిష్ఠుఁడు, మిత్రాయుఁడు, సావర్ణి, సోమదత్తి, సుశర్మ, శాంశపాయనుఁడు, సంహితలు. ఆ మువ్వురిచే రచింపఁబడెను. (65)
కాశ్యపః సంహితాకర్తా సావర్ణిః శాంశపాయనః ।
మామికా తు చతుర్థి స్యాచ్ఛతస్రో మూలసంహితాః ॥
సర్వాస్తా హి చతుష్పాదాః సర్వాశ్చైకార్థవాచీకాః ।
పాఠాంతరే వృథాభూతా వేదశాఖా యథా తథా ॥
చతుఃసాహస్రికాః సర్వాః శాంశపాయనికామృతే ।
లౌమహర్షణికా మూలా తతః కాశ్యపికా పరా ॥
సావర్ణికా తృతీయాసావృజువాక్యార్థమండితా ।
శాంశపాయనికా చాన్యా నోదనార్థవిభూషితా ॥
సహస్రాణి ఋచాం చాష్టౌ షట్ శతాని తథైవ చ ।
ఏతాః పంచదశాన్యాశ్చ దశాన్యా దశభిస్తథా ॥
సవాలఖిల్యాః సప్తైతాః ససుపర్ణాః ప్రకీర్తితాః ।
అష్టౌ సామసహస్రాణి సామాని చ చతుర్ధశ ॥
సారణ్యకం సహోహం చ ఏతద్గాయంతి సామగాః ।
ద్వాదశైవ సహస్రాణి చ్ఛంద ఆధ్వర్యవం స్కృతమ్ ॥
యజుషాం బ్రాహ్మణానాం చ తథా వ్యాసో వ్యకల్పయత్ ।
సగ్రామ్యారణ్యకం తస్మాత్ సమంత్రకరణం తథా ॥
అతఃపరం కథానం తు పూర్వా ఇతి విశేషణమ్ ।
గ్రామ్యారణ్యం సమంత్రం తదృగ్బ్రాహ్మణయజుఃస్మృతమ్ ॥
తథా హారిద్రవీర్యాణాం ఖిలాన్యుపాఖిలాని తు ।
తథైవ తైత్తిరీయాణాం పరక్షుద్రా ఇతి స్మృతమ్ ॥
కాశ్యపుండు, సావర్ణి, శాంశపాయనుఁడు వీరు సంహితాకర్తలు, నాయది నాలుగవది. ఈ నాలుగును మూల (పురాణ) సంహితలు. ఇవి యన్నియును చతుష్పాదములు, (4 భాగములు ఒక్కొక్కటీ). అన్నియును ఏకార్డవాచికములు. పాఠాంతరమందు, వేదశాఖల యందు వలెనవీ వ్యర్థములు. శాంశపాయనీకము కాక మిగిలిన వన్నియును చతుస్సాహస్రకములు (4వేల శ్లోకములు), లౌమహర్షణికము మూలము. తరువాత కాశ్యపికము. సావర్ణికము మూడవదీ అదీ ఋజు వాక్యార్థ శోభితము. శాంశపాయనికాసంహిత వేడొకటి. ఇది ప్రేరకములైన అర్థములతో విభూషితము. అందు మొత్తము మీద 6,600 ఋక్ మంత్రములు, అవికాక 15,10,10 ఋక్కులున్నవి మొత్తము 8655, (70) వాలఖిల్య సువర్ణ ఋక్ మంత్రములతో కలిసి అవి ఏడు అని కీర్తింపబడినవి. (?) సామ మంత్రములు 8014 (ఎనిమిది వేల పదినాలుగు) (71) సామగులు వీనిని ఆరణ్యకములతో 'సహోహం'తో పఠింతురు. (72) ఆధ్వర్యవములు 12000 మంత్రములు, (72) వ్యాసుఁడు యజుర్మంత్రములు బ్రాహ్మణము లెన్నియున్నవో యన్ని గ్రామ్యములను ఆరణ్యకములను (పఠించుటకు) రచించెను. (73) అటు తరువాత కథలకు ‘పూర్వ’ అను విశేషణము కలిగినది. ఋక్ బ్రాహ్మణములు, యజుస్సులు, గ్రామ్య, ఆరణ్యక మంత్రములు కలిగి యున్నట్లుగా స్మృతములు. అట్లే హారిద్ర వీర్యుల యొక్క శిష్యుల రచనలు. ఖిలములు, ఉపఖిలములును అట్లే తైత్తిరీయుల యొక్క (అధికములయిన) మంత్రములు పరక్షుద్రములుగా స్మరింపఁబడుచున్నవి. (75)
ద్వే సహస్రే శతన్యూనే వేదే వాజసనేయకే ।
ఋగ్గణః పరిసంఖ్యాతో బ్రాహ్మణం తు చతుర్గుణమ్ ॥
అష్టౌ సహస్రాణి శతానీ వాష్టావశీతిరన్యాన్యధికాని వా చ।
ఏతత్ప్రమాణం యజుషుషామృచాం చ సశుక్రీయం సఖీలం యాజ్ఞవల్క్యమ్
తథా చరణవిద్యానాం ప్రమాణసహితం శృణు ।
షట్సహస్రమృచాముక్తమృచః షడ్వింశతిం పునః ॥
ఏతావదధీకం తేషాం యజుః కిమపి వక్ష్యతే ।
ఏకాదశ సహస్రాణి ఋచశ్చాన్యా దశోత్తరాః ॥
ఋచాo దశ సహస్రాణి హ్యరీతిస్త్రింశదేవ తు ।
సహస్ర మేకం మంత్రాణామృచాముక్తం ప్రమాణతః ॥
ఏతావానృచివిస్తారో హ్యన్యచ్చాధర్వీకం బహు ।
ఋచామాధర్వణాం పంచ సహస్రాణీతి నిశ్చయః ॥
సహస్రమన్యద్విజ్ఞేయమృషి భిర్వంశతిం వినా ।
ఏతదంగీరసాం ప్రోక్తం తేషామారణ్యకం పునః ॥
ఇతి సంఖ్యా ప్రసంఖ్యాతా శాఖాభేదాస్తథైవ తు ।
కర్తారశ్చైవ శాభానాం భేదమోతూంస్తథైవ చ ॥
సర్వమన్వంతరేష్యేవం శాఖాభేదాః సమాశ్రితాః ।
ప్రాజాపత్యా శ్రుతిర్నిత్యా తద్వికల్పాస్త్విమే స్మృతాః ॥
అనీత్యభావాద్దేవానాం మంత్రోత్పత్తిః పునః పునః ।
ద్వాపరేషు పునర్భేదాః శ్రుతీనాం పరికీర్తితాః ॥
వాజసనేయ వేదమునందు ఋక్కు మంత్రముల మొత్తము (1900) ఒక వేయ్యి తొమ్మిది వందలుగా చెప్పఁబడినది. బ్రాహ్మణ భాగము దానికి నాలుగింతలు. (76) యజుర్మంత్రముల యొక్కయు ఋక్కుల యొక్కయు మొత్తము (8880) ఎనిమిదివేల యెనిమిది వందల యెనుబది. ఈ సంఖ్య (ప్రకక్ష్యకు చెందిన సామ) శుక్రియతో ఖిలమంత్రములతో సహా యాజ్ఞవల్క్య మహర్షి ననుసరించి చెప్పబడినది. (77) తద్విధముగా ‘చారణ’ విద్యల యొక్క ప్రమాణమును వినుము. (వివిధ శాఖల ననుసరించి) ఋక్కుల యొక్క మొత్తము సంఖ్య (6026) ఆరువేల ఇరువదియారు, ఇంతకంటె యజుర్మంత్రముల సంఖ్య. అధికమయినదని చెప్పబడినది. (79) అందు 11010 (పదకొండువేల పది ఋక్కులు) 19 అందు 10,080 ఋక్కులు. అందు 1030 ఋక్కు మంత్రములు. ఈ సంఖ్య సప్రమాణముగా చెప్పబడినది. ఇంత మాత్రమే ఋజ్మంత్రముల పరిమితీ. అధర్వ మంత్రముల గూర్చి యొకమాట. బహముల ననుసరించి అధర్వ మంత్రములు ఐదువేల తొమ్మిది వందల ఎనుబది, ఇరువదీ తక్కువగా ఒక సహస్ర మంత్రములున్నవని ఋషులెఱుంగవలెను. ఇయ్యది అంగీరసుల యొక్క పద్దతి ననుసరించి, వారికీ ఆరణ్యకములు కూడ కలవు. (82) ఈ విధముగా సంఖ్య చెప్పబడినది. వివిధమయిన శాఖలు కూడ చెప్పఁబడినవి. శాఖా కర్తలు, వాని భేదములకు గల కారణములు కూడ చెప్పఁబడినవి. (83) ఈ విధముగనే అన్నీ మన్వంతరముల యందు వేదములు శాఖా భేదములు కలవు. ప్రాజాపతి శ్రుతి శాశ్వతము ఇవి యన్నియు వాని యొక్క వికల్ప భేదములుగా స్మరింపఁబడినవి. (84) దేవతలు అనిత్యులగుట వలన మంత్రములు మాటిమాటికి ఉత్పత్తి చెందుచుండును. ద్వాపర యుగము నందు శ్రుతుల యందలి భేదములు చెప్పఁబడినవి.
ఏవం వేదం తదాప్యస్య భగవాన్ ఋషి సత్తమః ।
శిష్యేభ్యశ్చ ప్రదత్వా తు తపస్తప్తుం వనం గతః ॥
తస్య శిష్యప్రశిష్యైస్తు శాఖాభేదాస్త్విమే కృతాః ।
అంగాని వేదాశ్చత్వారో మీమాంసాన్యాయవిస్తరః ॥
దర్మశాస్త్రం పురాణం చ విద్యాశ్చేమా శ్చతుర్దశ ।
ఆయుర్వేదో ధనుర్వేదో గాంధర్వశ్చేతి తే త్రయః ॥
అర్థశాస్త్రం చతుర్థం తు విద్యా హ్యష్టాదశైవహి ।
జ్ఞేయా బ్రహ్మర్షయః పూర్వం తేభ్యో దేవర్షయః పునః ॥
రాజర్షయః పునస్తేభ్య ఋషిప్రకృతయస్త్రీధా ।
కాశ్యపేషు వసిష్టేషు తథా భృంగ్వంగిరోఽత్రిషు ॥
ఈ విధముగా వేదములను విభజించి, తన శిష్యుల కొసంగి ఋషి సత్తముఁడు తపమాచరించుటకు అరణ్యమున కరిగెను. (86) ఈ విభిన్నమయిన శాఖా భేదములు వారి శిష్య ప్రశిష్యులచే కల్పింపఁబడినవి. విద్యలు పదునాలుగు ఆరు వేదాంగములు, నాలుగు వేదములు, మీమాంస, న్యాయవిస్తరము, ధర్మశాస్త్రము. పురాణము ఇంకను నాలుగు విద్యలు కలవు. ఆయుర్వేదము, ధనుర్వేదము, గాంధర్వ వేదము. ఈ మూడింటితోడ కలిసియున్న అర్థశాస్త్రము వీనితో కలిసి విద్యలు పదునెన్మిది (అష్టాదశ) బ్రహ్మర్షులు మున్ముందలివారు. వారి తరువాత దేవర్షులు రాజర్షులును. ఈ విధముగా ఋషుల ఆరంభము మూఁడుగా తెలియనగును.
పంచస్వేతేషు జాయంతే గోత్రేషు బ్రహ్మవాదినః ।
యస్మాదృషంతి బ్రహ్మాణం తతో బ్రహ్మర్షయః స్మృతాః ॥
ధర్మస్యాథ పులస్త్యస్య క్రతోశ్చ పులహస్య చ ।
ప్రత్యూషస్య దేవస్య చ కశ్యపస్య తథా పునః ॥
దేవర్షయః సుతస్తేషాం నామతస్తాన్ని బోధత ।
దేవర్షి బ్రహ్మపుత్రౌతు నరనరాయణావుభౌ ॥
వాలఖిల్యాః క్రతోః పుత్త్రాః కర్ధమః పులహస్య తు ।
కుబేరశ్చైవ పౌలస్త్యః ప్రత్యూషస్య దలః సుతః ॥
నారదః పర్వతచ్చైవ కశ్యపస్యాత్మజావుభౌ ।
ఋషంతి వేదాన్యస్మాత్తే తస్మాద్దేవర్షయః స్మృతాః ॥
మానవే చైవ యే వంశే ఐలవంశే చ తే నృపాః ।
యే చ ఇక్ష్వాకసౌభాగా జ్ఞేయా రాజర్షయస్తతః ॥
ఋషంతి రంజనాద్యస్మాత్ర్పజా రాజర్షస్తు స్తతః ।
బ్రహ్మలోక ప్రతిష్టాయ స్మృతా బ్రహ్మర్షయోమలాః ॥
దేవలోకప్రతిష్టాస్తు జ్ఞేయా దేవర్షయః శుభాః ।
ఇంద్రలోక ప్రతిష్టాస్తు సర్వే రాజర్షయో మతాః ॥
అభిజాత్యాఽథ తపసా మంత్రవ్యాపారణైస్తథా ।
యేచ బ్రహ్మర్షయః ప్రోక్తాః దివ్యా దేవర్షయశ్చ యే ॥
రాజర్షయస్తథా చైవ తేషాం వక్ష్యామి లక్షణమ్ ।
భూతం భవ్యం భవత్జ్ఞానం సత్యాభివ్యాహృతం తథా ॥
సంతుష్టాశ్చ స్వంయం యేతు సంబుద్ధ్యా యే చ వై స్వయమ్ ।
తపసేహ ప్రసిద్ధ యే గర్భే యైశ్చ ప్రవేదితమ్ ॥
మంత్రవ్యాహారిణో యే చ ఐశ్వర్యాత్సర్వశ్చ యే ।
ఏతే రాజర్షయో యుక్తా దేవద్వీజనృపాశ్చ యే ॥
ఏతాన్భావానధిగతా యే వై త ఋషయో మతాః ।
సప్తైతే సప్తభిశ్చైవ గుణైః సప్తర్షయః స్మృతాః ॥
బ్రహ్మవాదులు పంచగోత్రముల యందు పుట్టుదురు. (కాశ్యపులు, వాసిష్ఠులు, భార్గవులు, ఆంగీరసులు, అత్రులు). వారు బ్రహ్మను పొందుదురు కాన వారు బ్రహ్మరులుగా స్మరింపఁబడుదురు. (91) దేవర్షులు ధర్మునియొక్క పులస్త్యుని యొక్క క్రతు యొక్క పులహుని యొక్క ప్రత్యూషుని యొక్క దేవుని యొక్క కశ్యపుని యొక్క కుమారులు. సమతః వారల నెఱుంగుము. దేవరులయిన నరనారాయణులిర్వురు బ్రహ్మ పుత్రులు. వారు ధర్మ పుత్రులు. వాలఖిల్యులు కృతుని యొక్క సుతులు. పులహుని కుమారుఁడు కర్దముడు. కుబేరుండు పౌలస్త్యుని యొక్క కుమారుఁడు. దలుఁడు ప్రత్యూషసుని కుమారుఁడు. నారదుఁడు, పర్వతుఁడును కశ్యపునీ కుమారులు, వారు దేవతల సమీపించేదరు కానవారు దేవరులుగా సంస్మృతులు. (95) మను వంశమున పుట్టిన రాజులు, పురూరవసు వంశమున పుట్టినవారు, (ఐలవంశ్యులు) ఇక్ష్వాకు నాభాగ వంశమున పుట్టినవారు - రాజర్షులుగా తెలియబడవలయును. (96) వారు ప్రజలను రంజించుటచేతను, మిత్రభావముతో ఆనందపరచుచు సమీపించుటచేసి, వారు రాజర్షులుగా పిలువబడిరి. (97) దోషరహితులయి, బ్రహ్మలోకమున సుప్రతిష్ఠితులయిన వారు బ్రహ్మరులుగా సంస్కృతులు. (98) దేవలోకమున ప్రతిష్టితులయిన వారు ఉత్తమ దేవరులుగా తెలిసికొనవలయును. ఇంద్ర లోకమున ప్రతిష్టితులయిన వారెల్లరు రాజర్పులు. తమ ఆభిజాత్యముచేతను, తపఃప్రభావముచేతను, మంత్రముల నుచ్చరించు సామర్థ్యము చేతను, ఎవరు బ్రహ్మరులుగా చెప్పఁబడిరో, దేవర్పులుగా, రాజర్షులుగా చెప్పఁబడిరో వారి లక్షణములను చెప్పుచున్నారు. వారికి భూతభవ్య భవిష్యద్ జ్ఞానము కలదు; వారు నిత్య సత్యవాదులు; వారు సుసంతుష్టులు, వారు ఆత్మ వివేకము కలవారు. వారు వారి తపస్సుచే ప్రసిద్ధులు. వారు వారి మాతృ గర్భము నందే సర్వము నెఱుంగగలిగిరి. వారు మంత్రకర్తలు, మంత్రగాయకులు; అనంత శక్తిచే వారు సర్వగులు; వారు దేవతలు, బ్రాహ్మణులు, రాజులు. ఈ లక్షణములు కలిగిన వారెల్లరు ఋషులుగా భావింపఁబడిరి. (102) వారలలో నేడుగురు, వారి సప్తగుణ విశేషముల చేతను, సప్తర్షులుగా సంస్మరింపఁబడుదురు. (103)
దీర్ఘాయుషో మంత్రకృత ఈశ్వరాద్దివ్యచక్షుషః ।
బుద్ధాః ప్రత్యక్షధర్మాణో గోత్రప్రావర్తకాశ్చ తే ॥
షట్కర్మనిరతా నిత్యం శాలీనా గృహమేధినః ।
తుల్యైర్వ్యవహరంతి స్మ హ్యదుష్టైః కర్మహేతుభిః ॥
అగ్రామ్యైర్వర్తయంతి స్మ రసైశ్చైవ స్వయంకృతైః ।
కుటుంబినో బుద్ధిమంతో వనాంతరనివాసినః ॥
కృతాదిషు యుగాభ్యాసు సర్వైరేవ పునః పునః ।
వర్ణాశ్రమవ్యవస్థానం క్రీయతే ప్రథమం తు వై ॥
ప్రాప్తే త్రేతాయుగముఖే పునః సప్తర్షయస్త్విహ ।
ప్రవర్తయంతి యే వర్ణానాశ్రమాంశ్చైవ సర్వశః ॥
తేషామేవాన్వయే వీరా ఉత్పద్యంతే పునః పునః ।
జాయమానే పితాపుత్రే పుత్త్రః పితరి చైవ హి ॥
ఏవం సంతత్యవిచ్ఛేదాద్వర్తయంత్యాయుగక్షయాత్ ।
అష్టాశీతి సహస్రాణి ప్రోక్తానీ గృహమేధినామ్ ॥
అర్యమ్ణో దక్షిణం యే తు పితృయానం సమాశ్రితాః ।
దారాగ్నిహోత్రిణస్తే వై యే ప్రజాహేతవః స్మృతాః ॥
గృహమేధిన స్త్వసంఖ్యేయాః శ్మశానాన్యాశ్రయంతి తే ।
అష్టాశీతిసహస్రాణి నిహితా ఉత్తరాపథే ॥
యే శ్రూయంతే దివం ప్రాప్త ఋషయో హ్యూర్ధ్వరేతసః ।
మంత్రబ్రాహ్మణకర్తారో జాయంతే చ యుగక్షయాత్ ॥
ఏవమావర్తమానాస్తే ద్వాపరేషు పునః పునః ।
కల్పానామార్షవిద్యానాం నానాశాస్త్రకృతశ్చ యే ॥
వారు దీర్ఘాయుష్కులు. మంత్రకర్తలు. వారు ఈశ్వర ప్రాప్తమయిన దివ్యదృష్టి కలవారు. వారు బుద్ధిమంతులు, వారి గోత్రమునకు వారే ప్రవర్తకులు. వారు ప్రత్యక్ష ధర్మ స్వరూపులు. వారెప్పుడును జ్ఞానమునందే నిమగ్నులు; వారు వస్తువులను స్వయముగా దర్శింపగలరు. వారు షట్కర్మనిరతులు; వారు (శాలీన) వినయవంతులై గృహమేధినులు. వారందరియందు అపక్షపాతమున వ్యవహరింతురు. దోషరహితముగా వర్తింతురు. అదుష్టములయిన కర్మహేతువులచే ఉత్తర క్రియలను ఇతరులు ఆచరించునట్లు చేయుదురు. వారు స్వయంకృతములు, నీచములు (అగ్రామ్యములు) కానీవీయునైన రస పదార్థములచే జీవింతురు. వారందరు బుద్ధిమంతులయిన గృహస్థులు. వారు గహనములయిన వనముల యంతరములలో జీవింతురు. (106) కృతయుగమునందు, ఇతర యుగములందు, వారందరిచే మరల మరల చతుర్వర్ణాశ్రమ వ్యవస్థలు చేయబడును. (107) త్రేతాయుగారంభమునందు, ఈ అంతట వర్ణాశ్రమములను ప్రవర్తిల్లజేసిన సప్తర్పుల వంశమున వీరులు మరలమరల బుట్టుదురు. పుత్రునియందు, తండ్రి, తండ్రియందు పుత్రుడును జన్మింతురు. (109) ఈ విధము వారి వంశ పరంపర యుగాంతము వరకు అవిచ్చిన్నముగ సాగును. ఇట్టి గృహమేధినుల యొక్క సంఖ్య (88000) అష్టాశీతి సహస్రముగా చెప్పబడినది. (110) ఈ గృహమేధినులు దక్షిణాయనమున పితృయానము ననుసరించి యుందురు. వారు భార్యలను గ్రహింతురు. అగ్నిహోత్ర క్రియలను చేయుదురు. అయ్యవియే ప్రజోత్పత్తికి (సంతానమునకు) హేతువులుగా వెలుంగునది. గృహమేధినులు అసంఖ్యాకులు. వారు శ్మశానమున కరుగుదురు. (మరణింతురు) (88000) అషాశీతి సహస్ర సంఖ్యగలవారు ఉత్తరాపథమున నుంచబడిరి. వారు ఊర్థ్వరేతస్కులు. వారు స్వర్గమును పొందిరి. మంత్రములను బ్రాహ్మణములను రచించినవారు వారు యుగాంతమున జన్మించెదరు. ఈ విధముగా వారు ద్వాపరయుగమున పునః పునః జన్మించెదరు. వారు, కల్పములను, వివిధ మంత్రములను, ఆర్షవిద్యలను రచించిరి. (114)
క్రియతే యెర్వ్యవహృతిర్వైదికానాం చ కర్మణామ్ ।
వైవస్వతేంఽతరే తస్మిన్ ద్వాపరేషు పునః పునః ॥
అష్టావింశతికృత్వోవై వేదా వ్యస్తా మహర్షిభిః ।
సప్తమే ద్వాపరే వ్యస్తాః స్వయం వేదాః స్వయంభువా ॥
ద్వితీయే ద్వాపరే చైవ వేదవ్యాసః ప్రజాపతిః ।
తృతీయే చోశనా వ్యాసశ్చతుర్థే చ బృహస్పతిః ॥
సవితా పంచమే వ్యాసో మృత్యుః షష్ఠే స్మృతః ప్రభుః ।
సప్తమే చ తథైవేంద్రో వశిష్ఠశ్చాష్టమే స్మృతః ॥
సారస్వతస్తు నవమే త్రిధామా దశమే స్మృతః ।
ఏకాదశే తు త్రివర్షా సనద్వాజస్తతః పరమ్ ॥
త్రయోదశే చాంతరిక్షో ధర్మశ్చాపి చతుర్దశే ।
త్రైయ్యారుణిః పంచదశే షోడశే తు ధనంజయః ॥
కృతంజయః సప్తదశే ఋజీషోఽష్టాదశే స్మృతః ।
ఋజీషాత్తు భరద్వాజో భరద్వాజాత్తు గౌతమః ॥
గౌతమాదుత్తమశ్చైవ తతో హర్యవనః స్మృతః ।
హర్యవనాత్పరో వేనః స్మృతో వాజశ్రవాస్తతః ॥
అర్వాక్చ వాజశ్రవసః సోమముఖ్యాయనస్తతః ।
తృణబిందుస్తతస్తస్మాత్ తతజస్తృణబిందుతః ॥
తతజాచ్చ స్మృతః శక్తిః శక్తేశ్చాపి పరాశరః ।
జాతకర్ణో భవత్తస్మాత్తసాద్వైపాయనః స్మృతః ॥
అష్టావింశతిరిత్యేతే వేదవ్యాసాః పురాతనాః ।
భవిష్యే ద్వాపరే చైవ ద్రోణిర్ధ్వైపాయనేజఽపి చ ॥
మరల మరల వారు, ద్వాపరయుగము నందు, వైవస్వత మన్వంతరమునందు, వైదిక కర్మల నాచరింతురు. (115) మహర్షులచే వేదములు ఇరువది యెనిమిదిమార్లు వ్యక్తీకరింపఁబడినవి. స్వయంభువుండైన బ్రహ్మచే స్వయముగా సప్తమ ద్వాపరము నందు వేదములు క్రోడీకరింపఁబడినవి. ద్వితీయ ద్వాపరమున ప్రజాపతి వేదవ్యాసుఁడు. తృతీయ ద్వాపరము నందు ఉశనసుఁడు వేదముల విభజించెను. చతుర్థ ద్వాపరమున బృహస్పతి వర్గీకరించెను. పంచమ ద్వాపరమున సవిత విభజించెను; ఆరవ ద్వాపరమున మృత్యువు వ్యాసుఁడుగా సంస్కృతుఁడు. ఇంద్రుఁడు ఏడవ ద్వాపరమున, వశిష్ఠుఁడు అష్టమ ద్వాపరమును వ్యాసుఁడుగా వేదముల విభజించెను. తొమ్మిదవ ద్వాపరమున సారస్వతుఁ డు పదియవ ద్వారమున త్రిధాముఁడు, పదునొకండవ ద్వాపరమున వరుఁడు, సనద్వాజుఁడు 12వ ద్వాపరమున వ్యాసుడు. త్రయోదశమున అంతరిక్షుఁడు వ్యాసుఁడు. చతుర్ధశమున ధర్ముడు; తైయ్యారుణీ పంచదశమున వ్యాసుఁడు, పదియారవ యుగమున ధనుంజయుఁడు వ్యాసుం డు. కృతంజయుఁడు సప్తదశ వ్యాసుఁడు, అష్టాదశమున ఋజీషుఁడు, ఋజీషుని తరువాత భరద్వాజుడు వ్యాసుఁడు, భరద్వాజునీ పిమ్మట గౌతముఁడు, గౌతముని తరువాత ఉత్తముఁడు, తరువాత హర్యవనుఁడు స్మరింపబడెను. హర్యవనునియనంతరము వేనుడు. తరువాత వాజశ్రవసుం డు. వాజశ్రవసుని తరువాత సోమముఖ్యాయనుఁడు. తరువాత తృణబిందువు. తృణబిందువు తరువాత తలజుఁడు. తతజునీ తరువాత శక్తి, శక్తి తరువాత పరాశరుఁడు తరువాత జాతుకర్ణుఁడు వచ్చెను. తరువాత ద్వైపోయనుఁడు సంస్మృతుఁడు. ఇట్లు ఇరువది యెనమండ్రు. వేదవ్యాసులు పురాతనులు. భవిష్యత్తులో ద్వాపరమున ద్వైపాయన వేదవ్యాసుని యనంతరము తపః ప్రభవుఁడయిన ద్రోణి వేదవ్యాసుడగును.
వేదవ్యాసే హ్యతీతేస్మిన్ భవితా సుమహాతపాః ।
భవిష్యంతీ భవిష్యేషు శాఖాప్రణయనాని తు ॥
తస్యైవ బ్రహ్మణో బ్రహ్మ తపసః ప్రాప్త మవ్యయమ్ ।
తపసా కర్మ చ ప్రాప్తం కర్మణా చాపి తే యశః ॥
పునశ్చ తేజసా సత్యం సత్యేనానందమవ్యయమ్ ।
వ్యాప్తం బ్రహ్మామృతం శుక్రం బ్రహ్మైవామృతముచ్యతే ॥
ధ్రువమేకాక్షరమీదమోమిత్యేవ వ్యవస్థితమ్ ।
బృహత్త్వాత్ బృంహణాచ్చైవ తద్భ్రహ్మేత్యభిధీయతే ॥
ప్రణవావస్థితం భూయో భూర్భువః స్వరితి స్మృతమ్ ।
అధర్వఋగ్యజుః సామ్ని యత్తస్మై బ్రహ్మణే నమః ॥
జగతః ప్రలయోత్పత్తౌ యత్తత్కారణసంజ్ఞితమ్ ।
మహతః పరమం గుహ్యం యత్తస్మైబ్రహ్మణే నమః ॥
అగాధాపారమక్షయ్యం జగత్సంమోహసంభవమ్ ।
సంప్రకాశప్రవృత్తీభ్యాం పురుషార్థప్రయోజనమ్ ॥
సాంఖ్యాజ్ఞానవతాం నిష్ఠా గతిః శమదమాత్మనామ్ ।
యత్తదవ్యక్తమతం ప్రకృతిర్భ్రహ్మ శాశ్వతమ్ ॥
ప్రధానమాత్మయోనిశ్చ గుహ్యం సత్త్వం చ శస్యతే ।
అవిభాగస్తథా శుక్రమక్షరం బహుధాత్మకమ్ ॥
పరమబ్రహ్మణే తస్మై నిత్యమేవ నమోనమః ।
కృతే పునః క్రియా నాస్తి కుత ఏవాకృతక్రియాః ॥
సకృదేవ కృతం సర్వం యద్వై లోకే కృతాకృతమ్ ।
శ్రోతవ్యం వా శ్రుతం వాపి తథైవాఽసాధు సాధు వా ॥
భవిష్యత్తులో కూడ వేదసంబంధమయిన శాఖలుండును. (126) బ్రహ్మ బ్రహ్మ జ్ఞానమును పొందెను. అది తపస్సుచే అవినాశనము తపస్సు చేతనే వైదిక కర్మ యశస్సు కూడ ప్రాప్తము. (127) మరల, తేజస్సు చేత సత్యము, సత్యము చేత అవ్యయమైన ఆనందము పొందబడినవి. ప్యాపించిన బ్రహ్మామృతము శుక్రము. బ్రహ్మమే అమృతమనబడును, (128) ఇదియే ఏకాక్షరము అయిన “ఓం” అని ధ్రువముగా నిశ్చయింపం బడినది. అయ్యదే దాని యొక్క బృహత్వముచేతను సర్వ వ్యాపకత్వము చేతను సుస్థిరత్వముచేతను బ్రహ్మముగా చెప్పఁబడినదీ. (129) అధర్వవేద, ఋగ్వేద, యజుర్వేద, సామవేదములందు ప్రణవము నందున్న. భూః భువః సువఃగా స్మరింపఁబడినది. ఆ బ్రహ్మకొఱకు నమస్కారము. (130) జగత్తు యొక్క ప్రలయమునకు, ఉత్పత్తికి, నేది కారణముగా సంజ్లితమో, మహత్తునకు పరమై యేది గుహ్యము (రహస్య) అయినదో ఆ బ్రహ్మకు నమః (131) అయ్యది అగాధము, అపారము, అక్షయ్యము, జగత్సమ్మోహసంభవమయినది. అయ్యదీ ప్రవృత్తిచే ప్రకాశముచే పురుషార్థ ప్రయోజనము గలది. (132) సాంఖ్య జ్ఞానవంతులకు అయ్యది నిషా. శమము దమము గల వారలకదీ గతి లక్ష్యము. అది అవ్యక్తమతము ప్రకృతి బ్రహ్మ శాశ్వతము. (133) ఆత్మయోనియని గుహ్యమని సత్వమని, అవిభాగమని, శుక్రమని (పరిశుద్ధమని) అక్షరమనీ బహుధాత్మకమని సూచింపం బడినది. ఎల్లప్పుడా పరబ్రహ్మకు నమస్కారము. కృతయుగమున వైదికక్రియా కలాపములు లేవు. స్వక్రియల ఆచరింపని ప్రజలేట్లుందురు? (135) ప్రపంచమున ఒకేసారి యేదీ చేయఁబడినదో, ప్రపంచమున నెయ్యటీ చేయబడి, చేయిబడలేదో, ఎయ్యది శ్రోతవ్యమో యేయ్యదే శ్రుతమో, మంచిదికాని చెడ్డది కాని యేది కలదో. (136)
జ్ఞాతవ్యం వాస్య మంతవ్యం స్ప్రష్టవ్యం భోజ్యమేవ చ।
ద్రష్టవ్యం వాథ శ్రోతవ్యం ఘ్రాతవ్యం వా కథంచన ॥
దర్శితం యదనేనైవ జ్ఞాతం తద్వై సురర్షిభిః ।
యన్న దర్శితవానేష కస్తదన్వేష్టుమర్హతి ॥
సర్వాణి సర్వం సర్వాంశ్చ భగవానేన సోఽబ్రవీత్ ।
యదా యత్క్రియతే యేన తదా తత్సోఽభిమన్యతే ॥
యత్రేదం క్రియతే పూర్వం న తదన్యేన భాషితమ్ ।
యదా చ క్రియతే కించిత్కేన చిద్వా కథం క్వచిత్ ॥
తేనైవ తత్కృతం కృత్యం కర్తౄణం ప్రతిభాతి వై ।
విరిక్తం చాతిరిక్తం చ జ్ఞానాజ్ఞానే ప్రియాప్రియే ॥
ధర్మాధర్మౌ సుఖం దుఃఖం మృత్యుశ్చామృతమేవ చ ।
ఊర్ధ్వం తిర్యగధోభావస్తస్యై నాదృష్టకారిణః ॥
స్వయంభువోఽథ జ్యేష్ఠస్య బ్రహ్మణః పరమేష్ఠినః ।
ప్రత్యేకవేద్యం భవతి త్రేతాస్విహ పునః పునః ॥
వ్యస్యతే హ్యేకవేద్యం తు ద్వాపరే తు పునః పునః ।
బ్రహ్మా చైతానువాచాదౌ తస్మిన్వైవస్వతేంఽతరే ॥
ఆవర్తమానా ఋషయో యుగాఖ్యాసు పునః పునః ।
కుర్వంతి సంహితాహ్యేతే జాయమానాః పరస్పరమ్ ॥
అష్టాశీతిసహస్రాణి శ్రుతర్షీణాం స్కృతాని వై ।
తావత్యః సంహితా హ్యేతా ఆవర్తంతే పునః పునః ॥
శ్రితా దక్షిణపంథానం యే శ్మశానానీ భేజిరే ।
యుగే యుగే తు తాః శాఖా వ్యస్యంతే వై పునః పునః ॥
ఎయ్యెది జ్ఞాతవ్యమో, మంతవ్యమో, యెయ్యది స్ప్రష్టవ్యమో ఏయది భోజ్యమో, ఎయ్యది ద్రష్టవ్యమో, శ్రోతవ్యమో, వాసన చూడం దగినదో అది యంతయు బ్రహ్మము. (187) దానిచే నేది దర్శిత మయినదో దేవర్షులచే నయ్యది జ్ఞాతమైనది. ఏది వీడు చూడలేదో దానిని వెదకుటకు చూచుటకెవ్వఁడు సమర్ధుఁడు? (148) సర్వ వస్తువులను సర్వమును, సర్వ వ్యక్తులను ఆతఁడే చెప్పెను. ఎప్పుడయినను, ఏదయినను, ఎవనిచే చేయబడినను అదీ ఆతఁడు (ఆకర్త) చేసినదిగా భావింపవలయును. ఇంతకుఁబూర్వ మీచ్చటనేది చేయఁబడినదో, అయ్యది వేలోకనీచే చెప్పఁబడలేదు. ఎవనిచేనైన నేదియైన, నెచ్చటనైన, ఎట్లయినను అయ్యది యా బ్రహ్మచేతనే చేయఁబడినది. లోకమున కర్తలాచరించు కృత్యము ఆతనిచేతనే (ఆ బ్రహ్మచే) చేయబడినట్లు ప్రతిభాసించును. విరిక్తము, అతిరిక్తము (శూన్యాశూన్యములు) జ్ఞానము, అజ్ఞానము, ప్రీయము, అప్రియము, ధర్మము, అధర్మము, సుఖము, దుఃఖము, మృత్యువు, అమృతము, ఊర్థ్వస్థితి, తిర్యక్షితి, అధోభావము. ఇవన్నీయును అదృష్టకారణుం డయిన ఆ బ్రహ్మక్రియలే. (142) అవీ యన్నియును స్వయంభువుఁడును, జ్యేష్ఠుఁడు, బ్రహ్మయు, పరమేష్టియు సయిన ఆ ప్రభువునకు చెందినవియే త్రేతాయుగము లందు మరల మరల, ప్రతి వ్యక్తికి నదీ వేద్యమయిన దగును. (143) ఏయది యొక్కటిగా వేద్యమో (ఒకే వేదముగా నున్న స్థితి) అయ్యది ద్వాపర యుగమున మరల మరల విభజింపఁబడినది, శాఖలుగా కూర్పఁబడినది. మొట్టమొదట ఆరంభమున వైవస్వత మన్వంతరమున బ్రహ్మవేదములను అనువదించేను. (144) యుగయుగము నందు ఋషులు మరలమరల పుట్టుచునే యుందురు. వారు పరస్పరము పుట్టిన పారగుట సంహితలను వారేరచింతురు. (88000) ఎనుబదియెన్మిది వేల శ్రుతరులు సంస్మృతులు. అన్ని సంహితలు, మరల ఆవర్తింపఁబడినవి. (146) ప్రతి యుగమునందు ఈ శాఖలు శ్మశానస్థలముల కేగినవారిచే, దక్షిణ పథము నాశ్రయించిన వారిచే మరల మరల వర్గీకరింపఁబడినవి. (147)
ద్వాపరేష్వివ సర్వేషు సంహితాస్తు శ్రుతర్షిభిః ।
తేషాం గోత్రేష్విమాః శాఖా భవంతి హి పునః పునః ॥
తాః శాఖాస్తే చ కర్తారో భవంతీహాయుగక్షయాత్ ।
ఏవ మేవ తు విజ్ఞేయా అ తీతానాగతేష్వపి ॥
మన్వంతరేషు సర్వేషు శాఖాప్రణయవాని వై ।
అతీతేషు వ్యతీతాని వర్తంతే సాంప్రతేంఽతరే ॥
భవిష్యంతి చ యాని స్యుర్వత్స్యంతేఽనాగలేష్వపి ।
పూర్వేణ పశ్చిమం జ్ఞేయం వర్తమానేన చోభయమ్ ॥
ఏతేన క్రమయోగేన మన్వంతరవినిశ్చయః ।
ఏవం దేవాః సపితర ఋషయో మనవశ్చ వై ॥
మంత్రైః సహోర్ధ్వం గచ్ఛంతీ హ్యావర్తంతే చ తైః సహ ।
జనలోకాత్సురాః సర్వే దశ కల్పాన్ పునః పునః ॥
పర్యాయకాలే సంప్రాప్తే సంభూతా నీధనస్య తే ।
అవశ్యభావినాఽర్ధేన సంబధ్యంతే తదా తు తే ॥
తతస్తే దోషవజ్జన్మ పశ్యంతో రోగపూర్వకమ్ ।
నివర్తతే తదా వృత్తిః సా తేషాం దోషదర్శనాత్ ॥
ఏవం దేవయుగానీహ దశకృత్వో వీవర్త్య వై ।
జనలోకాత్తపోలోకం గచ్ఛంతీహానివర్తకమ్ ॥
ఏవం దేవయుగానీహ వ్యతీతాని సహస్రశః ।
నిధనం బ్రహ్మలోకే వై గతాని ఋషిభిః సహ ॥
న శక్య ఆను పూర్య్వేణ తేషాం వక్తుం సువిస్తరః ।
అనాదిత్వాచ్చ కాలస్య సంఖ్యానాం చైవ సర్వశః ॥
అన్ని ద్వాపరయుగము లందు అన్నియుగములందు శ్రుతర్షులచే సంహితలు వర్గీకరింపఁబడినవి. వాని గోత్రములలో ఈ శాఖలు, పునః పునః వ్యవహారములో నున్నవి. (148) ఆ శాఖలు ఆ రచయితలు ఆయుగాంతము వరకుందురు. గత మన్వంతరముల యందు, భవిష్యత్మన్వంతరములందును, ఇట్లేయని గ్రహింపవలయును. (149) ప్రతి మన్వంతరము నందును శాఖల వర్గీకరణము కలదు. గత మన్వంతరము నందిట్లే జరిగినది. అట్లే వర్తమాన మన్వంతరములఁ జరుగును. ఏయది జరుగవలయునో యది భవిష్యత్తులో మన్వంతరముల జరుగును. పూర్వము కలిగినవానిచో తరువాత కలుగునట్టివి, వర్తమానముచే పూర్వాపరముల రెండింటినీ తెలిసికొనవలయును. (151) ఈ క్రమ యోగముచేత మన్వంతరముల వీనిశ్చయము జరుగును. అందుచే, దేవతలు, పీతరులతో, ఋషులతో, మనువులతో, మంత్రములతో నూర్ణమునకు పోవుదురు. మరల వారితో నవతరింతురు. (153) సర్వదేవతలు జనలోకమునకు పోయి, మరల, అందుండి పదికల్పములు తిరిగి వచ్చేదరు. పర్యాయ కాలము (తిరిగి రావలసిన సమయము) సంప్రాప్తముకాగా, వారు అవశ్యము జరుగవలసిన మృత్యువుతో సంబంధ మొందుదురు. తరువాత వారు దోషవజ్జన్న నొందుదురు. రోగముల నందెదరు. అప్పుడట్లు వారు తిరిగివత్తురు. వారిని వర్తనము వారు వారీ దోషముల దర్శించుట వలన కలుగును. (155) ఆ విధముగా ముందు వెనుకలకు పదిసార్లు దేవయుగమున వచ్చి పోవుచుందురు. జనలోకము నుండి వారు. తపోలోకమునకరుగుదురు. అందుండి వారు తిరిగిరారు. (156) ఈ విధముగా వేలాది దేవయుగములు సాగిపోయినవి. వారు బ్రహ్మలోకమున ఋషులతో సహా మరణమొందెదరు. వివరముగా వారిని వర్ణించుటకు శక్యముకాదు. కాలము అనాది, ఆరంభము అంతము లేనిది అగుట కారణము. (158)
మన్వంతరాణ్యతీతాని యాని కల్పైః పురా సహ ।
పితృభిర్మునిభిర్దేవైః సార్ధం చ ఋషిభిస్సహ ॥
కాలేన ప్రతిసృష్టాని యుగానాం చ వివర్తనమ్ ।
ఏతేన క్రమయోగేన కల్పమన్వంతరాణి చ ॥
సప్రజాని వ్యతీతాని శతశోఽథ సహస్రశః ।
మన్వంతరాంతే సంహారః సంహారాంతే చ సంభవః ॥
దేవతానామృషీణాం చ మనోః పితృగణస్య చ ।
నశక్య ఆనుపూర్వ్యేణ వక్తుం వర్షశతైరపి ॥
విస్తరస్తు నిసర్గస్య సంహారస్య చ సర్వశః ।
మన్వంతరస్య సంఖ్యా తు మానుషేణ నిబోధత ॥
మన్వంతరాస్తు సంఖ్యాతాః సంఖ్యానార్ధవిశారదైః ।
త్రింశత్కోట్యస్తు సంపూర్ణా సంఖ్యాతాః సంఖ్యయా ద్వీజైః ॥
సప్తషష్టిస్తథాన్యాని నియుతాని చ సంఖ్యయా ।
వింశతిశ్చ సహస్రాణి కాలోఽయం సాధికం వీనా ॥
మన్వంతరస్య సంఖ్యేయం మానుషేణ ప్రకీర్తితా ।
వర్షాగ్రేణాఫీ దివ్యేన ప్రవక్ష్యామ్యుత్తరం మనోః ॥
అష్టౌ శతసహస్రాణి దివ్యయా సంఖ్యయా స్మృతమ్ ।
ద్వీపంచాశత్తథాన్యాని సహస్రాణ్యధికాని తు ॥
చతుర్ధశగుణో హ్యేష కాలోహ్యాభూతసంప్లవమ్ ।
పూర్ణం యుగసహస్రం స్యాత్తదహర్ర్బహ్మణః స్మృతమ్ ॥
తతః సర్వాణి భూతానీ దగ్దాన్యాదిత్యరశ్మిభిః ।
బ్రహ్మాణమగ్రతః కృత్వా సహ దేవర్షిదానవైః ॥
కల్పములతో పితరులతో దేవతలతో, ఋషులతో కూడ మన్వంతరములు సాగిపోయినవి. అయ్యవి యార్హకాలమున సృష్టింపఁబడినవి. యుగములుకూడ వచ్చిపోవుచుండును, ఈ వీధముగా కల్పములు మన్వంతరములు వందలు వేలు ప్రజలతో సహితముగా వ్యతీతములయినవీ. మన్వంతరాంతమున నాశనము; మరల నాశనానంతరము సృష్టియు జరుగును. (161) అనుపూర్విగా క్రమముగా దేవతల యొక్క ఋషులు యొక్క మనువుల యొక్కయు పితృగణముల యొక్క సృష్టి యొక్క విధానమును వినాశము యొక్క పద్దతిని ఒక వంద సంవత్సరముల కయినను చెప్పుటకు శక్యము కాదు. (162) (కాలము అనంతమని చెప్పుట) మనుష్య గణనములో మన్వంతరము యొక్క సంఖ్య విస్తారము, వినాశనము, సృష్టి తెలిసికొనుము. (163) మన్వంతరముల యొక్క విస్తృతి సంఖ్యాశాస్త్రమున విశారదులైన వారిచే గణింపఁబడినది. ప్రతి మన్వంతరము మూఁడు వందల కోట్ల సంవత్సరములు సంపూర్ణమని ద్విజులచే లెక్కింపఁబడినది. (164) ?(ఇతరములు ‘సప్త షష్టి నియుతములు మరియు 20 వేల సంవత్సరములు. సంధ్యా సంధ్యాంశాది కాలగణనము కాకుండ) మన్వంతర సంవత్సర సంఖ్య మనుష్య గణనములో చెప్పబడినది. దేవతా గణనము ననుసరించి మన్వంతర ప్రమాణమును చేప్పెదను. (166) దేవతా సంఖ్యా మానము ననుసరించి, ఒక మన్వంతరము ఎనిమిది వందల ఏబది రెండు వేల సంవత్సర పరిమితము. దీనికి పదునాలుగు రెట్లు “అభూత సంప్లవ” మందురు. (సర్వజీవుల ప్రళయము). నాలుగేసి యుగముల యొక్క వేయి సంవత్సరముల మొత్తము ఒక బ్రహ్మకు పగలుగా చెప్పబడినది. తరువాత సర్వభూతములు సూర్యరశ్ములచే దగ్గపటలము లగును. బ్రహ్మను అగ్రేసరునిగా నుంచుకొని, దేవతలచే, ఋషులచే, దానవులచే అనుసరింపఁబడుచు, వారు
ప్రవిశంతీ సురశ్రేష్ఠం దేవం నారాయణం ప్రభుమ్ ।
స స్రష్టా సర్వభూతానాం కల్పాదిషు పునః పునః ॥
ఇత్యేష స్థితికాలో వై మతో దేవర్షిభిః సహ ।
సర్వమన్వంతరాణాం హి ప్రతిసంథిం నీబోధత ॥
యుగాఖ్యా యా సముద్దిష్టా ప్రాగేతస్మిన్మయాఽనఘాః ।
కృతత్రేతాదీసంయుక్తం చతుర్యుగమితి స్మృతమ్ ॥
తచ్చైకసప్తతిగుణం పరివృత్తం తు సాధికమ్ ।
మనోరేతమధీకారం ప్రోవాచ భగవాన్ ప్రభుః ॥
ఏవం మన్వంతరాణాం చ సర్వేషామేవ లక్షణమ్ ।
అతీతానాగతానాం వై వర్తమానేన కీర్తితమ్ ॥
ఇత్యేష కీర్తితః సర్గో మనోః స్వాయంభువస్య తే ।
ప్రతిసంధిం తు వక్ష్యామి తస్య చైవాపరస్య చ ॥
మన్వంతరం యథాపూర్వం ఋషిభిర్దేవతైఃస్సహ ।
అవశ్యభావినార్థేన యథావద్వినివర్తతే ॥
ఏతస్మిన్నంతరే పూర్వం త్రైలోక్యస్వేశ్వరాస్తు యే ।
సప్తర్షయశ్చ దేవాశ్చ పితరో మనవస్తథా ॥
మన్వంతరస్య కాలేతు సంపూర్ణే సాధికే తదా ।
క్షీణేఽధికారే సంవిగ్నా బుద్ధా పర్యయమాత్మనః ॥
మహర్లోకాయ తే సర్వే ఉన్ముఖా దధిరే మతిమ్ ।
తతో మన్వంతరే తస్మిన్ప్రక్షీణే దేవతాస్తు తాః ॥
సంపూర్ణే స్థితికాలే తు తిష్టేదేకం కృతం యుగమ్ ।
ఉత్పద్యంతో భవిష్యంతో యే వై మన్వంతరేశ్వరాః ॥
సురశ్రేష్ఠుఁడు, దేవుఁడు, ప్రభువునగు, నారాయణుని ప్రవేశింతురు. ఆతఁడే సర్వ జీవరాశులను మరల మర కల్పాదుల యందు సృజించువాఁడు. (170) దేవర్షులతో సహా ఇది స్థితి కాలముగా భావింపఁబడినది. ఇఁక సర్వమన్వంతరముల యొక్క (మధ్య కాలము) ప్రతి సంధిని యేటలుంగుము. (171) ఓ అనఘులారా ! యుగమనగనేమియో యింతకుం దూర్వము నాచే సముద్గీష్టమయినది. కృత త్రేతాదులతో గూడిన కాలము చతుర్యుగముగా చెప్పబడినది. భగవానుడిట్లు చెప్పెను. “మనువు యొక్క పాలనము నాలుగు యుగముల యొక్క డెబ్బది యొక్క రెట్లు” అని (దీనికి సంధ్యలు, సంధ్యాంశలు - అధికముగా చేర్చవలయును). (173) ఇట్లు గడచినట్టి, గడవనున్నట్టి మన్వంతరముల లక్షణములు వర్తమాన లక్షణములను బట్టి చెప్పబడినది. (175) మన్వంతరము పూర్వము వలెనే, దేవతలతో, ఋషులతో బాటు అవశ్యం భావియర్ధమున (తప్పనిసరిగా) వినివర్తనము చెందును. మూఁడు లోకముల యొక్క ఈశ్వరులు, సప్తర్షులు, దేవతలు, పీతరులు, మనువులు. ఎవరెవరింతవరకు స్థితిపొంది యుండిరో (జీవించియుండిరో) ఈ మన్వంతరములో తమ మరణము యొక్క స్థితిని గ్రహించెదరు. (అధికమయిన సంవత్సరములతో మన్వంతరపు వత్సరములు సంపూర్ణములు కాగా) వారి యొక్క పాలనము చివర స్థితికి వచ్చిన, దీనిని వారెరుంగుదురు. దీనినీ గ్రహించి వారందరు విషాదమొందుదురు. వారందరు మహర్లోకమునకు పోవలయునని ఉన్ముఖ మనస్సు కలిగియుందురు. ఇంక మన్వంతరము సమాప్తమునకు రాగా, వారియొక్క స్థితి ప్రమాణము సంపూర్ణము కాగా, ఆ దేవతలు కృతయుగము వరకు నుండవచ్చును. అప్పుడు మన్వంతరపు భవిష్యత్పభువులుదయింతురు. (180)
దేవతాః పితరశ్చైవ ఋషయో మనురేవ చ ।
మన్వంతరే తు సంపూర్ణే తద్వదంతే కలౌయుగే ॥
సంపద్యతే కృతం తేషు కలిశిష్టేషు వై తదా ।
యథా కృతస్య సంతానః కలిపూర్వః స్మృతో బుధైః ॥
తథా మన్వంతరాంతేషు ఆదిర్మన్వంతరస్య చ ।
క్షీణే మన్వంతరే పూర్వే ప్రవృత్తే చాపరే పునః ॥
ముఖే కృతయుగస్యాథ తేషాం శిష్టాస్తు యే తదా ।
సప్తర్షయో మనుశ్చైవ కాలాపేక్షాస్తు యే స్థితాః ॥
మన్వంతరప్రతీక్షాస్తే క్షీయమాణాస్తపస్వినః ।
మన్వంతరోత్సవస్యార్థే సంతత్యర్థే చ సర్వదా ॥
పూర్వవత్సంప్రవర్తంతే ప్రవృత్తే వృష్టిసర్జనే ।
ద్వంద్వేషు సంప్రవృత్తేషు ఉత్పన్నాస్వౌషదీషు చ ॥
ప్రజాసు చానికేతాసు సంస్థితాసు క్వచిత్ క్వచిత్ ।
వార్తాయాం సంప్రవృత్తాయాం ధర్మే చైవోపసంస్థితే ।
నిరానందే చాపి లోకే నష్టే స్థావరజంగమే ।
అగ్రామనగరే చైవ వర్ణాశ్రమవివర్జితే ॥
పూర్వమన్వంతరే శిష్టా యే భవంతీహ ధార్మికాః ।
సప్తర్షయో మనుశ్చైవ సంతానార్థం వ్యవస్థితాః ॥
ప్రజార్థం తపతాం తేషాం తపః పరమదుశ్చరమ్ ।
ఉత్పద్యంతే హి పూర్వేషాం నిధనేష్విహ పూర్వవత్ ॥
దేవాసురాః పితృగణా ఋషయో మానుషాస్తథా ।
సర్పా భూతపిశాచాశ్చ గంధర్వా యక్షరాక్షసాః ॥
తత స్తేషాం తు యే శిష్టాః శిష్టాచారాన్ ప్రచక్షతే ।
సప్తర్షయో మనుశ్చైవ హ్యాదౌ మన్వంతరస్య హి ॥
ప్రారంభంతే చ కర్మాణి మనుష్యో దైవతైః సహ ।
ఋషీణాం బ్రహ్మచర్యేణ గత్వానృణ్యం తు వైతదా ॥
అట్లే దేవతలు, పితరులు, ఋషులు మరియు మనువు. మన్వంతరము సంపూర్ణము కాగా, ఆ విధమునే కలియుగము సమాప్తము నొందును. (181) కలియుగమున మిగిలియున్న కలిశిష్ఠులు ఉండగనే కృతయుగ మారంభమగును. బుధులచే, కృతయుగము యొక్క ప్రవృత్తి జరుగుట) కలియుగముచే ప్రారంభమయినదనీ జ్ఞాపకముంచుకొందురు. అట్లే మన్వంతరము యొక్క ఆరంభము మన్వంతర సమాప్తమునకు పూర్వమే జరిగినది. పూర్వమందు మన్వంతరము సమాప్తముకాగా, వేడొక మన్వంతరమారంభముకాగా, కృతయుగము యొక్క ఆరంభమున, బ్రతికి మిగిలియున్న సప్తర్సులు మనువు, అందే తమ కాలము నపేక్షించుచు నుందురు. (184) క్షీయమానులయిన తపస్వులు (అలిసిపోయినవారు) వచ్చేడు మన్వంతరము కోణకు మన్వంతరాగమోత్సవము కొఱకు, సంతానము కొఱకును ప్రతీక్షించుచుందురు. వృష్టి యొక్క ఆరంభము కాగానే పూర్వము వలెనే వారు ప్రవర్తించెదరు. జంటలు తమకార్యములకు ప్రవర్తించుచుండ ఔషధమూలికలు వృద్ధి పొందనారంభింప, నివాసములు (నికేతనములు) ప్రజలు ఇందందు వసించుచుండ వ్యావసాయిక ప్రవృత్తులు (వ్యాపారములు) ఆరంభముకాగా, ధర్మముపసంస్థితము గా ప్రపంచమంతయు నీరానందముగా నుండ, స్థావర జంగమ భూతములన్నియు నష్టము నొంద, (ఇంతకు పూర్వము నాశనమయినవి తిరిగి మొలకలెత్తక యుండ) సంఘమంతయు గ్రామములతో ఆరంభమయి పట్టణములతో అంతమొందునట్టివన్నియు వర్ణాశ్రమ వివర్జితములై యుండ, పూర్వ మన్వంతరమున మిగిలిపోయిన వారు, ధార్మికులు, సప్తర్పులు సంతానార్థము వ్యవస్థీతులై యుందురు. (189) ప్రజోత్పత్యర్థము పరమ దుష్కరమయిన తపస్సులు పొరాచరించినను దేవతలు, అసురులు, పీతగులు, ఋషులు, సర్పములు, మనుష్యులు, భూత పిశాచములు, గంధర్వులు యక్షరాక్షసులు వీరందరు పూర్వమువలెనే, పూర్వపూర్వ జనులు మరణించుటచే పుట్టెదరు. (191) అంత పార్టీలో మిగిలియున్నట్టివారు (శిష్టులు) సప్తరులు మనువులు ఉత్తముల శిష్టాచారములను, మన్వంతారంగభమున వివరించుటకు ప్రారంభింతురు. దేవతలతో మనుష్యులు విశిష్టములయిన వైదికాచారములను ఆచరించుటకు ప్రారంభింతురు. బ్రహ్మచర్య వ్రతముచే (వేదాధ్యయనముచే) వారు ఋషుల యొక్క ఋణమును తీర్చెదరు.
పితౄణాం ప్రజయా చైవ దేవానామిజ్యయా తథా ।
శతం వర్షసహస్రాణాం ధర్మే వర్ణాత్మకే స్థితాః ॥
త్రయీ వార్తా దండనీతీర్ధర్మాన్వర్ణాశ్రమంస్తథా ।
స్థాపయిత్వాశ్రమాంశ్చైవ స్వర్గాయ దధిరే మనః ॥
పూర్వదేవేషు తే ష్వేవం స్వర్గాయాభిముఖేషు వై ।
పూర్వదేవాస్తతస్తే వై స్థితా ధర్మేణ కృత్స్నశః ॥
మన్వంతరే పురావృత్తే స్థానాన్యుత్సృజ్య సర్వశః । మంత్రైః సహోర్ధ్వం గచ్ఛంతి మహర్లోకమనామయమ్ ॥
వినివృత్తాధికారాస్తే మానసీం సిద్ధిమాస్థితాః ।
అవేక్ష్యమాణా వశినస్తిష్టంత్యాభౄతసంప్లవాత్ ॥
తతస్తేషు వ్యతీతేషు పూర్వదేవేషు వై తథా ।
శూన్యేషు దేవస్థానేషు త్రైలోక్యే తేషు సర్వశః ॥
ఉపస్థితా ఇహాన్యే వై దేవాః యే స్వర్గవాసినః ।
తతస్తే తపసా యుక్తాః స్థానాన్యాపూరయంతి చ ॥
సత్యేన బ్రహ్మచర్యేణ శ్రుతేన చ సమన్వితాః ।
సప్తర్షీణాం మనోశ్చైవ దేవానాం పితృభిః సహ ॥
నిధనానీహ పూర్వేషామాదితాం చ భవిష్యతాం ।
తేషాం సంతత్యవిచ్ఛేద ఇహామన్వంతరక్షయాత్ ॥
ఏవం పూర్వానుపూర్వ్యేణ స్థితిస్తేషామవస్థితా ।
మన్వంతరేషు సర్వేషు యావదాభూతసంప్లవమ్ ॥
సంతానముచే పితరుల ఋణమును తీర్చెదరు. యజ్ఞములచే దేవతల ఋణము తీర్చెదరు. ఒక వంద వేయి సంవత్సరములు, వర్ణాత్మకమయిన ధర్మమున, వర్ణ శిక్షణమును పాటించుచునుందురు. (194) వేదత్రయిని స్థాపించిన తరువాత, వ్యావసాయిక వ్యాపారమును స్థాపించిన పిమ్మట, దండనీతి (ధర్మపాలనము) సంస్థాపన, ధర్మయుతములయి వర్ణాశ్రమాచారముల సంస్థాపనమును, ఆశ్రమములను నిర్మించిన తరువొత, వారు స్వర్గమునకు పోవలయునని తలంచిరి. (155) పూర్వ దేవతలందరు స్వర్గాభీగమనమున కుత్సుకులై యుండ, ధర్మము నందు సంస్థితులయిన దేవతలందరు పరమ పవిత్రులుగా నుండిరి, (196) మన్వంతరము గడువగా, వారు పొరీ స్టానములను అన్నింటిని విడిచిపెట్టి, ఎట్టి అనామయమైన (బాధలు లేని) మహర్లోకమునకు మంత్రములతో వాగరిగెదరు. (197) వారందరు వారి వారీ ఆధికారిక స్థానముల నుండి తిరిగి వచ్చిరి. మానసీ సిద్ధినీ వారు పొందిరి. విషయేంద్రియముల పై పరిపూర్ణ విజయమునందీ, వారు సర్వ భూతముల వినాశము కొఱకు నిరీక్షించుచుందురు. (198} {అదీయే విశ్వవిలయము) అంత, పూర్వదేవతలు (వ్యతీతేషు) వెడలిపోగా, మూఁడు లోకముల యందంతటను దేవతల నివాస స్థానములు శూన్యములయినవి. స్వర్గ పోసులయిన ఇతర దేవతలు, ఇచ్చటనే ఉపస్థితులై యుండిరి. అటు తరువాత తపః ప్రభావ యుక్తులయిన వారు వారి స్థానములను పూరింతురు. (200) వారు సత్యవ్రతులు, బ్రహ్మచర్య వ్రతదీక్షితులు వేదవిద్వాంసులు. సప్తరుల యొక్క మనువు యొక్క దేవుల యొక్క పితరులతో సహా, నీధనము (పూర్వీకుల యొక్క భవిష్యద్వ్యక్తుల యొక్క) మొదటి నుండి చెప్పఁబడినది. మన్వంతరక్షయము వరకు పార్టీ ప్రజా సంతతి యందు విచ్చేదము లేదు. ఈ విధముగనే, ఆ వ్యక్తుల యొక్క స్థితి యదేవిధానమున నున్నది. బ్రతికియున్న వారందరు నాశనమగు నంతవఱకు అన్నీ మన్వంతరములయందు ఇదే విధానము జరుగును.
పూర్వమన్వంతరాణాం తు ప్రతిసంధానలక్షణమ్ ।
అతీతానాగతానాం వై ప్రోక్తం స్వాయంభువేన తు ॥
మన్వంతరేష్వతీతేషు భవిష్యాణాం తు సాధనమ్ ।
ఏవం సంతత్యవిచ్ఛేదో భవత్యాభూతసంప్లవాత్ ॥
మన్వంతరాణాం పరీవర్తనాని హ్యేకాంతతస్తాని మహర్గతానీ ।
మహాజనం చైవ జనాంతపశ్చ చైకాంతగానీ ప్రభవంతి సత్యే ॥
తద్భావినాం తత్ర తు దర్శనేన నానాత్వదృష్టేన చ ప్రత్యయేన ।
సత్యే స్థితా నిత్యతయా తు నిత్యం ప్రాప్తే వికారే ప్రతిసర్గకాలే ॥
మన్వంతరాణాం పరివర్తనానీ ముంచంతి సత్యం తు తతోఽపరాంతే ।
తతోఽభియోగా విషయప్రహాణాత్ విశధతీ నారాయణమేవ దేవమ్ ॥
మన్వంతరాణాం పరివర్తనేషు చీరప్రవృత్తేషు వీధిప్రభావాత్ ।
క్షణం చ వై తిష్ఠతి జీవలోకః క్షయోదయాభ్యాం పరివర్తమానః ॥
ఇత్యంతరాణ్యేవమృషిస్తుతానాం ధర్మాత్మనాం దివ్యదృశాం మనూనాం ।
వాయుప్రణీతాన్యుపలభ్య దృశ్యాణ్ దివ్యౌజసాం వ్యాససమాసయోగైః ॥
సర్వాణి రాజర్షి సురర్షిమంతి బ్రహ్మర్షిదేవోరగవంతి చైవ । సరేశసప్తర్షిపితృప్రజేశైర్యుక్తానీ సమ్యక్పరివర్తనాని ॥
ఉదారవంశాభీజనశ్రుతీనాం ప్రకృష్టమేధాభిసమేధితోనాం ।
కీర్తిద్యుతిఖ్యాతిభిరర్చితానాం పుణ్యం హి విఖ్యాపనమీశ్వరాణామ్ ॥
స్వర్గీయమేతత్పరమం పవిత్రం పుత్రీయమేతచ్చ పరం రహస్యమ్ ।
జప్యం మహాపర్వసు చైతదగ్య్రం దుఃఖోపశాంతిప్రదమాయుషీయమ్ ॥
జరిగిపోయినట్టి రానున్నట్టి (అతీతములు, ఆగతములు) మన్వంతరముల యొక్క ప్రతీసంధాన లక్షణము (మారునట్టి లక్షణములు స్వయంభువునిచే చెప్పఁబడినవి. భవిష్యన్మన్వంతరముల యొక్క సాధనము (సాధించిన విషయములు) గత మన్వంతరముల మీద సౌధారపడియుండును. ఈ విధముగా అవిచ్చిన్నమయిన సంతతి సర్వ భూతముల విలయము వరకు సాగుచుండును. (205) మహర్లోకమున మన్వంతరముల యొక్క (మార్పు) పరిర్తనము అవితథముగ జరుగుచుండును. మహర్లోక ప్రజలు, జనలోక ప్రజలు సత్యలోకమునకు పోవుదురు. అందు ప్రతిష్ఠితులగుదురు: (206) అందు జరుగు దర్శనములచే (కార్యములచే)తను, అందలి నానాత్వ కలిత ప్రత్యయము చేతను, సత్యలోకమున ప్రతిష్ఠితులయిన వారు, అందే నిత్యముగా సంస్థితులై (పారీ తపస్సుచే) మన్వంతర సంధాన లక్షణమున (పరిణామకాలమున) నుందురు. (207) మన్వంతరముల పరీవర్తనములలో, వారు సత్యలోకమును (అపరాంతే) పరిత్యజింతురు(?) తరువాత విషయ వాంఛా పరిత్యాగము వలన వారు దేవుఁడైన నారాయణుని యందే ప్రవేశింతురు. విధి ప్రభావమున చిరకాలము నుండీ జరుగుచున్న మన్వంతర పరివర్తనములందు జీవలోక మొక క్షణమయినను మీగీలియుండదు. ఇయ్యది విధి ప్రభావము. జీవజన ప్రపంచము క్షయో దయములు నొందుచునే యుండును (209) ఈ విధముగా ధర్మాత్ములయిన మనువుల యొక్క మన్వంతరములు, వారి దీవ్యదృష్టి ఋషులచే వర్ణింపఁబడినది. వారు వీనిని వాయు ప్రోక్తములుగా మనోహర వర్ణనా మిశ్రములుగా, కొలదిపాటి సంక్షేపముతో పొందరి. మనువులకు దివ్యశక్తి కలదు. మన్వంతరములందేల్లెడలను రాజర్షులు, దేవతామునులు, బ్రహ్మరులు, దేవతలు, నాగములు ఉండిరి. మన్వంతరములన్నియు దేవతలను, సప్తర్షులను, ప్రజాపతి (ప్రజేశుఁ డు) పితరులను కలిగియున్నది. (211) ఈశ్వరులను స్తుతించుట ఖ్యాతిదము. వారందరు ఉదారవంశముల నుండి జన్మించిరి. వారు గొప్ప కీర్తిమంతులు. వారు, వారి ప్రకృష్ట మేధాబలము చేతను, బుద్ధీ విశేషముతోడను కూడియుండిరి. వారికి గల కీర్తిని బట్టి, కాంతిని బట్టి, ప్రశస్తిని బట్టి, గౌరవమును బట్టి వారు పూజింపఁబడిరి. వారి చరిత్ర యంతయు, పవిత్రము స్వర్గయోగ్యము పుత్రప్రాప్తియోగ్యము, మిక్కిలి రహస్యము. మహాపర్వములలో శ్రేష్ఠమైన జప్యము అయ్యది దుఃఖోపశాంతి కూర్చును ఆయువు నొసంగును. (213)
ప్రజేశదేవర్షిమనుప్రధానాం పుణ్యాం ప్రసూతిం ప్రథితామజస్య ।
మమాపి విఖ్యాపయతః సమాసాత్సిద్ధిం ప్రజేశాః ప్రదిశంతు యుక్తాః ॥
ఇత్యేతదంతరం ప్రోక్తం మనోః స్వాయంభువస్య చ విస్తేణాను పూర్వా చ ।
భూయః కిం వర్ణయామ్యహమ్ ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయేఽఖనుషంగపాదే వేదవ్యసనాఖ్యానం స్వాయంభువమన్వంతర వర్ణనమ్ నామ పంచత్రింశత్తమోఽధ్యాయః ॥ యోగసిద్దులు కలిగిన ప్రజల కధిపతి యగు పరమాత్మ నాకు సిద్ధి నొసంగుగాక. ఏలయన నేను క్రమముగా అజుని యొక్క (బ్రహ్మ యొక్క) సంతతిని స్తోత్ర మాచరించితిని. అయ్యది పవిత్రము. అయ్యది ప్రధానముగా రాజుల గూర్చి, దేవర్షుల గూర్చి, దివ్యర్దుల గూర్చి మనువును గూర్చి ప్రథితముగ చెప్పఁబడినది. ఈ విధముగా విస్తారముగ, సాకల్యముగ స్వాయంభువ మను చరిత్రము వివరింపఁబడినది, ఇం క నేమి. నేను వర్ణింపవలయును !
ఇది పోయుప్రోక్తమయిన మహాపురాణము అయిన బ్రహ్మాండ పురాణమందలి పూర్వభాగమున ద్వితీయానుషంగ పాదమున వేదవ్యసనాఖ్యానము, స్వాయంభువమన్వంతరవర్ణనమను ముప్పది యైదవ అధ్యాయము సమాప్తము.
Summary of chapter 35 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter beautifully weaves together the inspiring legends of great spiritual luminaries like Yājñavalkya and Vyāsa, celebrating their unsurpassed devotion and wisdom. It seamlessly transitions into describing the majestic Svāyambhuva Manvantara, the foundational epoch guided by the very first Manu under the supreme lord's divine gaze. These celestial narratives strengthen the faithful heart, demonstrating how deep asceticism and unyielding devotion can bridge the mortal realm with eternal divine grace.