బ్రహ్మాండ మహా పురాణము
42 - ద్వాచత్వారింశోధ్యాయః
అగస్త్య ఉవాచ:-
ముద్రావిరచనారీతిమశ్వాసన నివేదయ।
యాభిర్విరచితాభిస్తు శ్రీదేవీ సంప్రసీదతి॥
హయగ్రీవ ఉవాచ:
ఆవాహనీ మహాముద్రా త్రిఖండేతి ప్రకీర్తితా।
పరివృత్య కరా స్పష్టమంగుష్ఠా కారయేత్సమౌ॥
అనామాంతర్గతే కృత్వా తర్జన్యా కుటిలాకృతీ।
కనిష్ఠికే నియుంజీత నిజస్థానే తపోధన॥
సంక్షోభిణ్యాభ్యముద్రాం తు కథయామ్యధునా శృణు।
మధ్యమే మధ్యగే కృత్వా కనిషాంగుష్ఠరోధితే।
తర్జన్యౌ దండవత్కృత్వా మధ్యమోపర్యనామికే॥
ఏతస్యా ఏవ ముద్రియా మధ్యమే సరలే యది।
క్రియతే వింధ్యదర్పారే ముద్రావిద్రావిణీ తథా॥
మధ్యమాతర్జనీభ్యాం తు కనిషానామికే సమే।
అంకుశాకార రూపాభ్యాం మధ్యగే కలశోద్భవ॥
ఇయమాకర్షిణీ ముద్రా త్రైలోక్యాకర్షణే క్షమా1
పుటాకారా కరా కృత్వా తర్జన్యావంకుశాకృతీ।
పరివర్తక్రమేణేవ మధ్యగే తదధోగతే ॥
క్రమేణానేన దేవర్ష మధ్యమామధ్యగేజనుజే ।
అనామికే తుసరలే తద్భవిస్తర్జనీద్వయమ్॥
దండాకారౌ తతోంగుషో మధ్యమావర్తదేశగౌ।
ముదైషోన్మాదినీ నామ్నా ఖ్యాతా వాతాపితాపన॥
అస్యాస్త్వనామీకాయుగ్మమధః కృత్వాంకుశాకృతి ।
తర్జన్యావపి తేనైవ క్రమేణ వినియోజయేత్॥
ఇయం మహాంకుశా ముద్రా సర్వకార్యార్థసాధికాI
సవ్యం దక్షిణదేశే తు దక్షిణం సవ్యదేశతః ।
బాహూ కృత్వా తు దేవగ్గే హస్తా సంపరీవర్త్య చll
కనిష్టానామికే యుక్తే క్రమేణానేన తాపసు।
తర్జనీభ్యాం సమాక్రాంతే సర్వోర్థమపి మధ్యమే॥
లోపాముద్రాపతేఒంగునో కారయేత్సకలావపి।
ఇయం తు ఖేచరీ నామ ముద్రా సర్వోత్తమోత్తమా॥
ఏతద్విజ్ఞానమాత్రేణ యోగినీనాం ప్రియో భవేత్।
పరివర్య కరౌ స్పృష్టావర్ధచంద్రసమాకృతీ,॥
తర్జన్యంగుష్ఠయుగలం యుగపద్యోజయేత్తతః।
అధః కనిష్ణాషష్టబ్దమధ్యమే వినియోజయేత్॥
అథైతే కుటిలే యుక్త్వా సర్వాధస్తాదనామికే ।
బీజముద్రీయమచిరాత్సర్వసిద్ధిప్రవర్తినీ "॥
మధ్యాగ్రే కులాకారే తర్జన్యుపరి సంస్థితే।
అనామికామధ్యగతే తథైవ హి కనిష్ఠికే॥
సర్వా ఏకత్ర సంయోజ్య చాంగుష్ఠపరిపీడితాః।
ఏషా తు ప్రథమా ముద్రా యోనిముద్రేతి సంజీతా॥
ఏతా ముద్రాస్తు దేవర్షే శ్రీదేవ్యాః ప్రీతిహేతవః।
పూజాకాలే ప్రయోక్తవ్యా యథానుక్రమయోగతః॥
ఇతి శ్రీబ్రహ్మాండమహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే
ద్వాచత్వారింశోధ్యాయః॥ 42
అగస్త్యుడనెను:
ఓ హయగ్రీవా! ముద్రలు రచించురీతిని దెలుపుము ఆముద్రల రచనతో శ్రీదేవి చక్కగానన్నుగపించును.
హయగ్రీవుడనెను:
1. ఆవాహనీమహాముద్రా ; దీని తిఖండా అని యందురు. అర చేతులు త్రిప్పి స్పష్టముగా రెండు బొటన వేళ్లను సమముగా నుంచవలె-2 రెండు చూపుడు వ్రేళ్లను రెండు ఉంగరపు వ్రేళ్ల క్రిందికి వంకరగా జొప్పించవలె, రెండు చిటికిన వ్రేళ్లను. వానీ స్థానములోనే యుంచవలె.
2. సంకోలిఉయను: ముద్రను ఇపుడు చెప్పెదవినుము-3. రెండు నడిమివేళ్లను నడుమనే యుంచవలె. వానిని. రెండు చిటికిన వ్రేళ్లతోను రెండంగుష్టములతో నిరోధింపవలె. రెండు చూపుడు వ్రేళ్లను దండము వలె నిక్కబొడిచియుంచవలె. రెండు ఉంగరపు ప్రేళ్లను నడిమీ వేళ్లపై నుంచవలె-4,
3. విద్రావీముద్రాః క్షోభిణీ ముద్రలోని నడిమి వ్రేళ్ళు సరళముగా నున్నచో అగస్త్యా! వీద్రావిణీముద్ర చేయబడును-5.
4. ఆకర్షణీముదా: అంకుశాకార రూపములోనున్న నడిమి చూపుడు వ్రేళ్లంకంటె మధ్యనున్న చిటికిన - ఉంగరపు వ్రేళ్లు - సమముగా నుండవలె. ఇదీ ఆకర్షిణీముద్ర ముల్లోకముల నాకర్షించుటలో సమర్థమైనదీ-6
5. ఉన్మాదినీ ముద్ర : రెండు అరచేతులను దొప్పలలాగా జేయవలె, రెండు చూపుడు వ్రేళ్లను అంకుశాకారములో మలవవలె. పరివర్త క్రమమున రెండు నడిమి వ్రేళ్లు వానికీ, క్రిందుగా నుండునట్లుజేయవలె-7; ఇదే క్రమమున ఓ అగస్త్యా నడిమి వ్రేళ్ల మధ్యనున్నవై వాటియనుజములైన ఉంగరపు వ్రేళ్లు సరళముగానుండవలె. వానీ వెలుపల రెండు చూపుడు వ్రేళ్లుండవలె. తరువాత రెండుబొటన వ్రేళ్లు దండాకారములై మధ్యమావర్తదేశగములుగావలె. ఈ ముద్ర ఉన్మాదినీ ముద్రయనబడినది.
6.మహాంకుశముద్రా ; ఉన్మాదినీ ముద్రలోని రెండుంగరపు వ్రేళ్లను అంకుశోకారములో క్రిందకు మంచి రెండు చూపుడు వ్రేళ్లను గూడ అదేక్రమములో (మలచి) యుంచవలె. ఇదీ మహాంకుశ ముద్ర. సర్వకార్యార్థసాధిక.
7. ఖేచరీ ముద్ర : ఎడమ బాహువును కుడివైపుగను, కుడి భాహువును ఎడమవైపుగను రెండు చేతులను త్రిప్పి, రెండు చిటికెన ఉంగరపు వ్రేళ్లు జోడింపవలె. ఇదే క్రమములో రెండు చూపుడు వ్రేళ్లతో నాక్రమింపజేయవలె, రెండు నడిమి వేళ్లను అన్నింటికన్నపైకి ఉంచవలె. రెండు బొటన వ్రేళ్లను సకలములుగా జేయవలె. ఇదీ ఖేచరీముద్ర. సర్వోత్తమమైనది. దీనిని దెలిసినంత మాత్రమున యోగినీ ప్రియుడగును.-12, 13, 14.
8 బీజముద్ర : పరస్పరము తాకిన రెండరచేతులను అర్ధ చంద్రాకారములో మలచి, రెండు చూపుడు వ్రేళ్లయు బొటన వ్రేళ్లయు జంట నొక్కమారు జోడింపవలె. క్రిందుగా చిటికెన వ్రేళ్లను అస్తబద్దముగానున్న నడిమీ వేళ్లతో జోడింపవలె. ఈ రెండు వంకరగా క్రింది ఉంగరపు వ్రేళ్లను జతకలియవలె. ఇది బీజ ముద్ర తొందరలో సర్వసిద్ధులను ప్రైవర్తింపజేయును-15, 16.
9.యోని ముద్ర ; నడిమీ వేళ్ల చివరలు చూపుడు వ్రేళ్లపై నుండవలె. అట్లే చిటికెన వ్రేళ్లు ఉంగరపు వ్రేళ్ల మధ్యనుండవలె-17, - ఈ వ్రేళ్లన్నియు ఒక్కచో గూర్చి బొటన వ్రేళ్లతో పరిపీడించవలె. ఇది ప్రథమ ముద్రయోనిముద్రయనబడినది-18.
ఓ దేవర్షి! ఈ ముద్రలు శ్రీ దేవికి ప్రీతిని గలిగించునవి. వీనిని అనుక్రమయోగమును బట్టి పూజాకాలమున బ్రయోగింపవలె-19.
ఇది శ్రీబ్రహ్మండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున శ్రీలలితోపాఖ్యానమున నలుబదిరెండవ యధ్యాయము.42
(సూచన: ఈ ముద్రల వివరణములు యధామతిగ ననువదింపబడినవి. అనుభవజ్ఞుల నుండి చదువరులు సరియైన వివరణముల దెలిసికొనగోరెద. శ్లోక వివరణములు కొన్ని గ్రంథములలో నిచ్చిన ముద్రిత ముద్రలకు సరిపోవుటలేదు. కావుననిచట అనుభవజ్ఞులే శరణము)
Summary of chapter 154 of the Brahmānda Mahā Purana is as follows:
This deeply meditative chapter outlines advanced techniques of internal contemplation, or Antaryāga, where the external rituals are internalized within the subtle chakras of the human body. It guides the practitioner to raise the Kundalinī energy from the base chakra up to the Sahasrāra lotus to unite Sakti with Shiva. The devout seeker meditates in silent stillness, tasting the nectar of divine bliss that flows from this supreme inner union.