బ్రహ్మాండ మహా పురాణము
56 - గంగానయనము
జైమినిరువాచ :-
ఏతత్తే చరితం సర్వం సగరస్య మహాత్మనః ।
సంక్షేపవిస్తరాభ్యాం తు కథితం పాపనాశనమ్ ॥
ఖండోయం భరత్ నామ దక్షిణోత్తరమాయతః ।
నవయోజనసాహసం విస్తారపరిమండలమ్ ॥
పుత్రైస్తస్య నరేంద్రస్య మృగయద్భిస్తురంగమమ్ ।
యోజనానాం సహస్రం తు ఖాత్వాష్టౌ వినిపాతితాః ॥
సగరస్య సుతైర్యస్మాద్వార్థితో మకరాలయః ।
తతః ప్రభృతి లోకేషు సాగరాఖ్యామవాప్తవాన్ ॥
బ్రహ్మపాదావధి మహీం సతీర్థక్షేత్రకాననామ్ ।
ఆబ్దిః సంక్రమయామాస పరిక్షిష్య నిజాంభసా ॥
తతస్తన్నీలయాస్సర్వే సదేవాసురమానవాః ।
ఇతస్తతశ్చ సంజాతో దుఃఖేన మహతాన్వితాః ॥
గోకర్ణం నామవిఖ్యాతం క్షేత్రం సర్వసురార్చితమ్ ।
సార్ధయోజనవిస్తారం తీరే పశ్చిమవారిధేః ॥
తత్రాసంఖ్యానీ తీర్థాని మునిదేవాలయాశ్చ క్షే ।
వసంతి సిద్దసంఘాశ్చ క్షేత్రే తస్మిన్ పురా నృప ॥
క్షేత్రం తల్లోకవిఖ్యాతం సర్వపాపహరం శుభమ్ ।
తత్తీర్థమభేరపతద్భాగే దక్షిణపశ్చిమే ॥
యత్ర సర్వే తపస్తఫ్యా మునయః సంశితవ్రతాః ।
నీర్వాణం పరమం ప్రాప్తాః పునరావృత్తివర్ణితమ॥
తత్క్షేత్రస్య ప్రభావేణ ప్రీత్యా భూతగణెస్సహ ।
దేవ్యా చ సకలైర్దేవైర్నిత్యం వసతి శంకరః ॥
ఏనాంసి యత్సముద్దిశ్య తీర్థయాత్రాం ప్రకుర్వతామ్ ।
నృణామాకు ప్రణశ్యంతి ప్రవాతే శుష్కపర్ణవత్ ॥
తత్క్షేత్రసేవనీరతిర్నైవ జాత్వభిజాయతే ।
సమీపే వసమానానామపి పుంసాం దురాత్మనామ్ ॥
మహతా సుకృతేనైవ తత్క్షేత్రగమనే రతిః ।
నృణాం సంజాయతే రాజన్నాన్యథా తు కథంచన ॥
నిర్భంధేన తు యే తస్మిన్ ప్రాణినః స్థిరజంగమాః ।
మ్రియంతే నృప సద్యస్తే స్వర్గం ప్రాప్స్యంతి శాశ్వతమ్ ॥
జైమినీ ఇట్లు చెప్పెను.
ఓరాజా ! మహాత్ముఁడయిన సగరునీ చరిత్రమును, సంక్షేపముగా, విస్తరముగా నీకు చెప్పితిని. ఇది పాపనాశనమయినది. ఇది భరతఖండము. దక్షిణము నుండి యుత్తరము వఱకు నవయోజన సాహస విస్తారముగా పరీవ్యాప్తమైనది. సగరుని పుత్రులు తురంగము కొఱకు వెదకుచు నొక సహస్రయోజనములు త్రవ్విరి, మిగిలిన సహస్ర యోజనములు వినిపాతితములు. మకరాలయమయిన సముద్రము సగరుని పుత్రులచే త్రవ్వఁబడి వృద్ధిపొందింపఁబడినకారణమున సాగరమనీ లోకమున అప్పటినుండి పేరు గాంచినది. ఆ సముద్రము తీర్థ క్షేత్ర కొననయుతమయిన భూమీనీ తననీటిచే సంక్రమింపజేసి ముంచెత్తినది. అంత, అట్టినిలయులయిన దేవతలు అసురులు, మానవులు అందందు చెదరిపోయిరి. బహుదఃఖసమన్వితులైరి. సర్వదేవతలచే నర్చింపఁబడు 'గోకర్ణ'మను విఖ్యాత తీర్థము. పశ్చిమ సముద్రతీరమున ఒకటిన్నర యోజనముల విస్తారము కలది కలదు. అందు అసంఖ్యాకములయిన తీర్థములు కలవు. అయ్యవి మునులకు దేవతలకు నివాసములు. పూర్వము ఆ క్షేత్రమున సిద్ద సంఘములు నివసించెను. ఆ పవిత్ర క్షేత్రము ప్రపంచమందంతట విఖ్యాతమయినది. అది శుభంకరము, సర్వపాపహరమును. ఆ తీర్ధము సముద్రము యొక్క దక్షిణ పశ్చిమభాగమున నున్నది. అందు సంశ్రీతప్రతులయిన మునులెల్లరు తపస్సాచరించిరి. పరమ నీర్వాణము నొందిరి. పునరావృత్తి రహితులయిరి. ఆ క్షేత్రము యొక్క ప్రభావమున, భృత్యగణములతో, దేవితో సహితము, సకల దేవతలతో సాకము తత్ర్పీతిచే నందు శంకరుఁడు నీత్యము వసించును. ఎవరు మనస్సు నందు నిర్ణయించుకొని ఆ తీర్థయాత్ర యాచరించెదరో వారి పాపములు పెద్దగాలికి ఎండుటాకులు రాలిపడిపోవునట్లు నశించును. తత్సమీప ప్రదేశమున నివసించు చున్నను, దురాత్ములయినవారికీ తత్ క్షేత్రమును సేవింపవలెనను కోరిక యొకప్పుడును కలుగదు. ఏదీయే మహా సుకృతి యాచరించి యుండిననే కానీ, మానవులకు తత్ క్షేత్ర సేవారతి కలుగదు. ఒకవేళ చరాచర ప్రాణి. సంఘము నిర్బంధముచే నందు. మరణమును పొందినచో వారికి వెంటనే శాశ్వతమయిన స్వర్గ ప్రాప్తి కలుగును.
స్కృత్వా పీ సకలైః పాపైర్యస్య ముచ్యత మానవః ।
క్షేత్రాణాముత్తమం క్షేత్రం సర్వతీర్థనికేతనమ్ ॥
స్నాత్వా చైతేషు తీర్ధేషు యజంతశ్చ సదాశివమ్ ।
సిద్ధికామా వసంతి స్మ మునయస్తత్ర కేచన ॥
కామక్రోధవినిర్ముక్తా యే తస్మిన్వీతమత్సరాః ।
నివసంత్యనిరేణైవ తత్సిద్ధిం ప్రాప్నువంతి పా ॥
జపహోమరతాః శాంతో నియడా బ్రహ్మచారిణః ।
వసంతి తస్మిన్యే తే హి సిద్ధిం ప్రాప్యంత్యభీప్సితమ్ ॥
దానహోమజపాద్యం వై పితృదేవద్విజార్చనమ్ ।
అన్యస్మాత్కోటిగుణితం భవేత్తస్మిన్ ఫలం నృప ॥
అంబోధిసలిలే మగ్నం తస్మిన్ క్షేత్రేతీపావనే ।
మహతా తపసా యుక్తా మునయసన్నివాసినః ॥
సహ్యం శిఖరిణం శ్రేష్ఠం నిలయార్థం సమారుహన్ ।
వసంతస్తత్ర తే సర్వే సంప్రధార్య పరస్పరమ్ ॥
మహేంద్రాదౌ తపస్యంతం రామం గంతుం ప్రచక్రముః ।
రాజోవాచ:-
అగస్త్యపీతతోయేఖ భౌ పరితో రాజనందనైః ॥
ఖాత్వాధఃపతితే క్షేత్రే సతీర్థాశ్రమకాననే ।
భూభాగేషు తథాన్యేషు పురగ్రామాకరాదిషు ॥
వినాశితేషు దేశేషు సముద్రోపాంతవర్తిషు ।
కిమకారుర్మునిశ్రేష్ఠ జనాస్తన్నిలయాస్తమః ॥
తతైవ చావసన్ కృచ్ఛాత్ ప్రస్థితాన్యత వా తతః ।
కియతా చైవ కాలేన సంపూర్ణోభూదపాం నిధిః ।
కేన వాది ప్రకారేణ బ్రహ్మన్నేతత్ వదస్వ మే ॥
జైమీని రువాచ :
అనూపేషు ప్రదేశేషు నాశితేషు దురాత్మభిః ॥
జనాస్తన్నీలయాః సర్వే సంప్రయాతా ఇతస్తతః ।
తత్రోవ చావసన్ కృచ్ఛార్ కేచిత్ క్షేత్రనివాసినః ॥
ఏతస్మిన్నేవ కాలేను రాజన్నంశుమనస్సుతః ।
బభూవ భువి ధర్మార్మా దిలీప ఇతి విశ్రుతః ॥
రాజ్యేభిషచ్య తం సమ్యగుక్తభోగోంశుమాన్ వృష ।
వనం ఉగామ మేధావీ తపసే ధృతమానసః ॥
అయ్యది సర్వక్షేత్రములలో నుత్తమమయినది. అంతియేకాక యది సర్వతీర్థ నికేతనము దీనిని గూర్చి తలపోసినంత మానవుఁడు. సర్వపాప విముక్తుఁడగును. సిద్దిని కాంక్షించు మునులు కొందరు ఆ తీర్థమునందు స్నానమాచరించుచు, శివుని ధ్యానించుచు నందే యుండిపోవుదురు. కామక్రోధ వినిర్ముక్తులు, మాత్సర్య దోషము లేనివారు, నయిన వారెవరందు నివసింతురో, అచిరకాలమున వీరు తత్సర్టీని పొందెదరు. జపహోమాదుల యందు ఆసక్తులు, శాంతస్వభావులు, నియమశీలురు, బ్రహ్మచారులు నయిన వారందు నీవసించీ అభీప్సిత సిద్ధిని పొందుదురు. దానములు, హోమములు, జపాదికములు, పితృదేవద్విజార్చనములు అచ్చట చేసినచో ఇతరప్రదేశముల చేసిన ఫలము కంటే కోటీగుణితములగును. తత్సవిత్రగోకర్ణక్షేత్రము అంబోధిసలీలముల నిమగ్నముకాగా, అందుండెడు మహాతపశ్శాలురయిన మునులు, నిపాసార్లము శ్రేష్ఠమయిన సహ్యపర్వతశిఖరము నౌరోహించిరి. అందు నివసించుచు, వారందరు పరస్పరము సంప్రదించుకొనిరి. మహేంద్ర పర్వతమున తపస్సాచరించుచున్న రాముని చేరుటకు పోవనారంభించిరి.
రాజిట్లనెను.
ఓ బ్రహ్మర్షీ ! సముద్రోదకములను అగస్త్యుఁడు త్రాగిన తరువాత, రాజనందన సాగరులు భూమిని త్రవ్విరీ. క్షేత్రములు, తీర్ధములు, ఆశ్రమములు, కాననములు నాశనములయినవి. భూభాగమున పురములు, గ్రామములు గనులు మొదలయినవి సముద్ర ప్రాంతమందలి దేశములు వినాశమొందినవి. తత్సముద్ర ప్రాంత నివాసులు తరువాత ఏమీ చేసిరి? అచ్చటనే బహు కష్టముతో నివసించి, ఇతర ప్రదేశముల కరిగిరా? ఎంతకాలమునకు సముద్రము సంపూర్ణ మయ్యెను? ఏ విధముగా సముద్రము పరిపూర్తి నొందినది? నాకు చెప్పుండు. అని యడిగెను.
జైమిని ఇట్లనెను :-
దురాత్ములచే అనుకూలములయిన ప్రదేశములు నాశితము చేయబడగా, అందుండేడు జనులందరు ఇందందు పాసమున కరిగిరీ. కొంతమంది క్షేత్రనివాసులు కష్టములను భవించుచు నందేవసించిరి. ఆ కాలములో, అంశుమంతుని కుమారుఁడు ధర్మాత్ముఁడు, విశ్రుతుం డయిన దిలీపుఁడు రాజయ్యెను. చక్కగా ననుభవించి భోగములంది, రాజయిన అంశుమంతుఁడు తపస్సు ఆచరింప దృఢ సంకల్పుఁడయి ఆరణ్యముల కరిగెను.
దిలీపస్తు తతః శ్రీమానశేషాం పృథివీమిమామ్ ।
పాలయామాస ధర్మేణ విజిత్య సకలానరీన్ ॥
భగీరథో సోమ సుతస్తస్యాసీల్లోకవీశ్రుతః ।
సర్వధర్మార్థకుశలః శ్రీమానమీతవిక్రమః ॥
రాజ్యేభిషిద్య తం రాజా దిలీపో2పి వనం యయా ।
స చాపి పాలయన్ ఉర్వీం సమ్యగ్విహతకంటకామ్ ।
ముముదే వివిధైర్ళోగైర్దివీ దేవపతిర్యథా ।
స శుశ్రావాత్మనః పూర్వం పూర్వజాసాం మహీపతిః ॥
నిరయే పతనం ఘోరం విప్రకోపసముద్భవమ్ ।
బ్రహ్మదండహతాన్ సర్వాస్ పితృన్ శ్రుత్వాల తీదుఃఖితః ॥
రాజ్యే బంధుషు భోగే వా నిర్వేదం పరమం యథా ।
స మంత్రిప్రవరే రాజ్యం విన్య స్య తపసేవనం ॥
ప్రయణా స్వపితన్నాకం నినీపురపసత్తమః ।
తపసా మహతా పూర్వమాయుషే కమలోద్భవమ్ ॥
ఆరాధ్య తస్మాల్లేభే చ యావదాయుర్నిజేప్సితమ్ ।
తతో గంగాం మహారాజ సమారాధ్య ప్రసాద్య చ ॥
వరమాగమనం వవై దివస్తస్యా మహీం ప్రతి ।
తతస్తాం శిరసా ధర్తుం తపసారాధయచ్ఛివమ్ ॥
స చాపి తద్వరం తస్మై ప్రదదే భక్తవత్సలః ।
మేరోర్మూధ్నస్తతో గంగాం పతంతీం శిరసాత్మనః ॥
సగ్రహనక్రమకరాం జగ్రాహ జగతాం పతిః ।
సా తచ్చిరః సమాసాద్య మహావేగప్రవాహినీ ॥
తజటామండలే శుక్రే విలిల్యే సాఖతీగహ్వరే ।
చులకోదకవచ్చంభోర్విలీనాం శిరసి ప్రభోః ॥
విలోక్య తత్సమోక్షాయ పునరారాధయద్దరమ్ ।
స తాం శర్వప్రాసాదేన లబ్ద్వి తు భువమాగతామ్ ॥
ఆనిన్యే సాగరా దగ్గా యత్ర తాం వై దిశం ప్రతీ ।
సానువ్రజంతీ రాజానం రాజర్షేః యజతః పథి ॥
అంత దిలీపుడు అశేషమయిన యీ భూమినంతటిని సర్వశత్రువులను జయించి, ధర్మముగా పాలించెను. ఆతనికీ లోకవిశ్రుతుఁడు భగీరథుఁడమ కుమారుఁడు కలడు. ఆతఁడు సర్వ ధర్మార్థకుశలుఁడు, శోభాయుతుఁడు, అమిత విక్రముఁడు. దిలీపుండును. ఆతనిని రాజ్యము నందు పట్టాభిషిక్తుని చేసి. వనమున. కరిగెను. భగీరథుఁడును దుర్మార్గులను హతమార్చీ చక్కగా పృథ్విని పాలించెను. అమరావతి యందు ఇంద్రునివలె సర్వభోగములతో వాతఁడు ఆనందించెను. తనకు. పూర్వులైన పితరులు విప్రకోపసముద్భవమయిన బ్రహ్మదండమున హతులై హోర నరకమును పొందిరని వినెను. సర్వ పితరుల గూర్చి విని అతి దుఃఖితుఁడయ్యెను. రాజ్యము నందు, బంధువుల యందు, 'భోగముల యందు భగీరథ రాజు పరమ వీరాగమొందెను. తన పితరులను నరకము నుండి తరింపఁజేయగోరి, మంత్రి ప్రవరుని యందు రాజ్యము నిక్షేపించి, తపస్సాచరింప నతడు వనమున కరిగెను. ముందుగా నతఁడు - ఆయుర్దాయము కొఱకు గొప్ప తపస్సుచే కమలోద్భవుఁడయిన బ్రహ్మను ఆరాధించెను. తనకు వలసినంత ఆయుర్భాగ్యము నాతని వలన పొందెను. తరువాత గంగానదినీ సమారాధించెను. ఆమెను ప్రసన్నురాలిని చేసికోనేను. ఆమె వలన దీవము నుండీ భూమికి దిగివచ్చు నట్టి వరము నందెను. ఆ గంగను శిరస్సున ధరించుటకు శివుని నతఁడు తపస్సుచే నారాంధీంచెను. భక్తవత్సలుఁడయిన శివుఁడు కూడ నా వరమతని కొసంగెను. జగత్పతియైన శివుఁడు, మేరువు నుండి క్రిందికి పడునట్టి గంగను, నక్రమకరములతో కూడియున్న దానిని తన శిరస్సున గ్రహించెను. మహావేగ ప్రవాహినియైన గంగ శివుని శిరస్సున పడి, ఆతని అతిగభీరమయిన పవిత్ర జటామండలమున విలీనమయ్యెను. శంభుని శీర్షజటామండలమున గంగ అరచేతిలోని నీటివలె విలీనమగుటను చూచి భగీరథుఁడు తద్విమోక్షము కొఱకు మరల శివుని ఆరాధించేను, శర్వుని అనుగ్రహమున ఆ గంగను పొంది భగీరథుఁడు భూమికి వచ్చిన గంగను సాగరులు భూమియందు గద్ధులైన దిశను గూర్చి తీసికొని వెళ్లెను. గంగ రాజర్షి ననుసరించి ప్రవహించుచు, యజ్ఞమాచరించు రాజర్షి జహ్నుని యజ్ఞవాటము జేరెను.
తద్యజ్ఞవాటమఖిలం ప్లాపయామాస సర్వతః ।
స తు రాజఋషిః క్రుద్ధో యజ్ఞవాటే ఖిలే తయా ॥
మగ్నే గండూషణలవత్స పపౌ తామశేషతః ।
అతండ్రితో వర్షశతం శుశ్రూషిత్వా స తం పునః ॥
తస్మాత్ర్పసన్నానృపతిర్లేభే గంగాం మహాత్మనః ।
ఉషిత్వా సుచిరం తస్య నిసృతా జఠరాద్యతః ॥
ప్రథితం జాహ్నవీత్యస్యాస్తతో నామాభవద్భువి ।
భగీరథానుగా భూత్వా తత్పతూణామశేషతః ॥
నిజాంభసాస్టిభస్మాని సిషేచ సురనిమ్నగా ।
తతస్తదంభసా సికేష్వస్తిభస్మసు తత్క్షణాత్ ॥
నీరయాత్సాగరాస్సర్వే నష్టపాపా దివం యయుః ।
ఏవం సా సాగరాస్సర్వాన్ దీవం నీత్వా మహానదీ ॥
తేనైవ మార్గేణ జవాత్రయాతా పూర్వసాగరమ్ ।
మేరోర్మూర్థశ్చతుర్భేదా భూత్వా యాజ చతుర్దశమ్ ॥
చతుర్భేదతయా చాభూత్తస్యా నామ్నాం చతుష్టయమ్ ।
సీతా చాలకనందా చ సుచక్షుర్భద్రవత్యపి ॥
అగస్త్యపీతసలీలాచ్చిరం శుష్కోదకా అపి ।
గంగాంభసా పునః పూర్ణాశ్చత్వారోంబుధయోమి భవన్ ॥
పూర్యమాడే సముద్రే తు సాగరైః పరివర్ధిత ।
అంతరితాఖ భవన్డేళో బహవస్తత్సమీపగాః ॥
సముద్రోపాంతవర్తీని క్షేత్రాణి చ సమంతతః ।
ఇతస్తతః ప్రయాతాశ్చ జనాస్తన్నిలయా నృప ॥
గోకర్ణమితి చ క్షేత్రం పూర్వం ప్రోక్తం తు యత్తవ ।
అర్ణవోపాత్తవర్తిత్వాత్ సముద్రంతర్ధి మాగమత్ ॥
తత్స్తన్నిలయాః సర్వే తదుద్ధారాభికాంక్షిణః ।
సహోద్రేర్భృగుశార్దూలం ద్రష్టుకామా యయుర్నృప ॥
ఆతని యజ్ఞవాటికనంతటీని సర్వత్ర ముంచెత్తి విడిచెను. ఆ రాజర్షి క్రుద్ధుఁడయ్యెను. ఆతఁడు ఆ నది నంతయు పుక్కిటి నీరు వలె పూర్తిగా త్రాగివైచెను. మరల ఆ జహ్నురాజర్షిని అధిక శ్రద్ధతో అతంద్రితుఁడై వంద యేండ్లు భగీరథుఁడు సేవించెను. ప్రసన్నుడయిన ఆ నృపతి వలన భగీరథుఁడు గంగను పొందెను. గంగానది జుహ్నువి ఉదరమున చాలకాలము నుండి తరువాత అతని జఠరము నుండి వెడలి ప్రవహించివచ్చుటచే, గంగానదికి జాహ్నవి అను నామము భువిలో గలిగెను. భాగీరథి భగీరథునీ అనుసరించి ప్రవహించుచు ఆతని పితరుల యొక్క ఎమ్ముకలను, భస్మమును, సురనిమ్నగయైన గంగ తనయుదకముచే వైవిత మొనర్చెను. తరువాత గంగా జలములచే తడిసిన ఎముకలతో భస్మముతో, తత్క్షణమునందే సాగరులందరు నష్టపాపులైరి. నీరయము నుండి స్వర్గము చేరిరి. ఈ విధముగా అగంగా మహానది సాగరుల నందరను స్వర్గమును చేర్చి, ఆ మార్గము నంటియే వేగముగా పూర్వసాగరమును చేరెను. మేరు పర్వత శిఖరము నుండి, నాలుగు భాగములై గంగ చతుర్దశల కరిగెను. ఆ చతుర్విధభేదములచే, సీత, అలకనంద, సుచక్షువు, భద్రవతి అను నామ చతుష్టయమును పొందెను, అగస్త్యునిచే త్రాగబడిన ఉదకముచే చిరకాలము సముద్రము శుష్కోదకమైనను, గంగాంభములచే మరల పూరింపఁబడి (సముద్రము) నాలుగు సముద్రములయ్యెను. సాగరులచే పరీవర్థితమై సముద్రము పూర్ణమయ్యెను. అప్పుడు తత్సమీపమందున్న బహు దేశములు, సముద్రోపాంత వర్తి క్షేత్రములు సమంతతః అంతర్షితములయ్యెను. తమ నివాసము లందున్నవారు ఇక్కడకు నక్కడకు పోయిరి. ఇంతకుం బూర్వము చెప్పిన గోకర్ణక్షేత్రము అర్ణవ సమీపమున నున్నందున సముద్రమున నంతర్షితమయ్యెను. తన్నిలయులు దాని నుద్ధరింప కాంక్షించిరి. వారందరు సహ్యపర్వతమందు భృగువంశ శార్దూలుడయిన రాముని దర్శింపనేగిరి.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహాండ మహాపురాణమున, మధ్యమభాగమున, తృతీయ ఉపోద్ఘాతపాదమందు, గంగానయనమను ఏబదియారవ అధ్యాయము.
Summary of chapter 94 of the Brahmānda Mahā Purana is as follows:
Expanding its historical gaze, this chapter details various regional dynasties, including the Andhra, Gupta, and other future royal lines destined to rule across the subcontinent. It vividly portrays the chaotic political landscape and moral shifts characteristic of the dark age. The narrative encourages seeking souls to remain steadfast in spiritual practices, using devotion as an unshakeable anchor in a rapidly changing world.