బ్రహ్మాండ మహా పురాణము
34 - భార్గవ చరితము
సగర ఉవాచ :-
బ్రహ్మపుత్ర మహాభాగ మహాన్ మేఽనుగ్రహః కృతః ।
యదిదం కవచం మహ్యం ప్రకాశితమనామయమ్ ॥
ఔర్వేణానుగృహీతోఽహం కృతాస్త్రో యదనుగ్రహాత్ ।
భవతస్తు కృపాపాత్రం జాతోఽ హమధునా విభో ! ॥
రామేణ భార్గవేంద్రేణ కార్తవీర్యో నృపో గురో । యథా సమాపితో వీరస్తన్మే విస్తరతో వద ॥
కృపాపాత్రం స దత్తస్య రాజా రామః శివస్య చ ।
ఉభౌ తౌ సమరే వీరౌ జఘటాతే కథం గురో ! ॥
వసిష్ఠ ఉవాచ :-
శ్రుణు రాజన్ ప్రవక్ష్యామి చరితం పాపనాశనమ్ ।
కార్తవీర్యస్య భూపస్య రామస్య చ మహాత్మనః ॥
స రామః కవచం లబ్ధ్వా మంత్రం చైవ గురోర్ముఖాత్ ।
చకార సాధనం తస్య భక్త్యా పరమయా యుతః ॥
భూమిశాయో త్రిషవణస్నానసంధ్యాపరాయణః ।
ఉవాస పుష్కరే రామ శతవర్షమతంద్రితః ॥
సమిత్పుష్పకుశాదీని ద్రవ్యాణ్యహరహర్భృగోః ।
ఆనీయ కాననాద్భూప ప్రాయచ్ఛదకృతవ్రణః ॥
సతతం ధ్యానసంయుక్తో రామో మతిమతాం వరః ।
ఆరాధయామాస విభుం కృష్ణం కల్మషనాశనమ్ ॥
తస్యైవం యజమానస్య రామస్య జగతీపతే ।
గతం వర్షశతం తత్ర ధ్యాననిష్ఠస్య నిత్యదా ॥
ఏకదా తు మహారాజ ! రామః స్నాతుం గతో మహాన్ ।
మధ్యమం పుష్కరం తత్ర దదర్శాశ్చర్యముత్తమమ్ ॥
మృగ ఏకః సమాయాతో మృగ్యా యుక్తః పలాయితః ।
వ్యాధస్య మృగయాం ప్రాప్తో ఘర్మతఽప్తోతి పీడితః ॥
పిపాసితో మహాభాగ ! జలపానసముత్సుకః ।
రామస్య పశ్యతస్తత్ర సరసస్తటమాగతః ॥
పశ్చాన్కృగీ సమాయాతా భీతా సా చకితేక్షణా ।
ఉభౌ తౌ పిభతస్తత్ర జలం శంకితమానసా ॥
తావత్సమాగతో వ్యాధో బాణపాణిర్ధనుర్ధరః ।
స దృష్ట్వా తత్ర సంవిష్టం రామం భార్గవనందనమ్ ॥
సగరుఁడిట్లనెను.
ఓ బ్రహ్మపుత్ర ! మహాభాగ ! అనామయమైన (భద్రకరమైన) యీ కవచమును నా కొలకనుగ్రహించి నా యందు దయఁజూపితివి. నేను ఔర్వునిచే అనుగ్రహింపఁబడితిని. ఏలయన - ఆతని యనుగ్రహము వలననే నేను కృతాస్రుడనయితిని. ఓ వీభూ ! ఇప్పుడు నేను నీకు కృపా పాత్రుఁడనయితిని. భార్గవేంద్రుఁడయిన రామునిచే రాజయిన కార్తవీర్యుండేట్లు చంపఁబడెనో సవిస్తరముగా చెప్పఁగోరెదను. ఆ రోజు దత్తుని యొక్క రాముని యొక్క శివునియొక్క కృపా పాత్రుఁడు. ఓ గురూ ! వారిరువురు వీరులును యుద్ధమునకెట్లు సంఘటిల్లిరి.
వసిష్ఠుఁడిట్లు సమాధానమిచ్చెను.
ఓరాజా ! వీరుఁడయిన కార్తవీర్యుని యొక్క మహాత్ముఁడయిన రాముని యొక్క పాప నాశనమయిన చరితమును వివరించెదను వినుము. (5) ఆ భార్గవ రాముఁడు కవచమును, శివ గురుని ముఖము నుండి సాక్షాన్మంత్రమును పొంది, అత్యంత భక్తితో గూడికొనీ సాధన మాచరించెను. రాముఁడు పుష్కర తీర్థమునందు, వంద సంవత్సరములు, కటిక నేలపై శయనించి, త్రిషవణ స్నాన సంధ్యా పరాయణుఁడై శ్రద్ధాళుఁడై వసించెను. ప్రతిదినము అకృతవ్రణుఁడు రామునకు కాననము నుండి సమిధలను కుశలను, పుష్పములను ఇతర ద్రవ్యములను తీసికొనివచ్చి సమర్పించెడివాఁడు, మతిమంతులలో శ్రేష్ఠుఁడయిన రాముఁడు, సతతము ధ్యాన సంయుక్తుఁడై కల్మష నాశనుఁడయిన శ్రీకృష్ణుని ఆరాధించెను. (9). నిత్యము ధ్యాన నిష్ఠతో కృష్ణు నర్చించు రామునకు వంద సంవత్సరములు గడచిపోయెను. ఓ రాజా ! ఒకనాఁడు మహాను భావుఁడయిన రాముఁడు స్నానార్థమరిగెను. పుష్కరమధ్యమున ఆతఁడొక ఆశ్చర్యకరమైన యుత్తమ విషయమును చూచెను. ఒక మగలేడి ఆడలేడితో గూడికొని పరువెత్తుకొని యచ్చటికి వచ్చెను. వేటకాడు వానిన వెంటాడుచు ఎండకు మాడుచు అతిపీడితుఁడై యచ్చటికే వచ్చాను. ఆతఁడు దేహ పీడితుండు. జలపాన సముత్సకుఁడు. రాముఁడు చూచుచుండగనే సరోవర తటమున కాతడరుదెంచెను. తరువాత (వెనుకనే) భయ చకిత నేత్రములతో ఆడలేడియు వచ్చెను. ఆ మృగీమృగములు రెండును శంకాపూర్ణ మనస్సులతో జలమును త్రాగెను. అంతలో బాణ పాటియు ధనుర్ధరుఁడునునై వ్యాధుఁడు కూడవచ్చెను. అందు సంవిష్ణుఁడైయున్న భార్గవనందనుఁడయిన రాముని ఆతఁడు చూచెను.
అకృతప్రణసంయుక్తం తస్థౌ దూరకృతేక్షణః ।
స చింతయామాస తదా శంకీతో భృగునందనాత్ ॥
అయం రామో మహావీరో దుష్టానామంతకారకః ।
కథమేతస్య హన్మ్యేతౌ పశ్యతో మృగయా మృగౌ ॥
ఇతి చింతాసమావీష్టో వ్యాధో రాజన్యసత్తమ ।
తస్థౌ తత్రైవ రామస్య భయాత్ సంత్రస్తమానసః ॥
రామస్తు తౌ మృగౌ దృష్ట్వా పిబంతౌ సభయం జలమ్ ।
తర్కయామాస మేధావీ కిమత్ర భయకారణమ్ ॥
నైవాత్ర వ్యాఘ్రసంనాదో న చ వ్యాధో హి దృశ్యతే ।
కేనై తౌ కారణేనాహో శంకితౌ చకితేక్షణౌ ॥
అథవా మృగజాతిర్హి నిసర్గాచ్ఛకితేక్షణా ।
యేనైతా జలపానేఽపి పశ్యతశ్చకితేక్షణౌ ॥
నైతావత్కారణం చాత్ర కింతు భేదభయాతురౌ ।
లక్ష్యేతే స్మిన్నసర్వాంగౌ కంపయుక్తౌ యతస్త్విమౌ ॥
ఏవం సంచింత్య మతమాన్స తస్థౌ మధ్యపుష్కరే ।
శిష్యేణ సంయుతో రామో యావత్తౌ చాపి సంస్థితౌ ॥
పీత్వా జలం తతస్తౌ తు వృక్షచ్ఛాయాసమాశ్రితౌ ।
రామం దృష్ట్వా మహాత్మానం కథాం తౌ చక్రతుర్ముదా ॥
మృగ్యువాచ :-
కాంత ! చాత్రైవ తిష్ఠావో యావద్రామోఽత్ర సంస్థితః ।
అస్య వీరస్య సాన్నిధ్యే భయం నైవావయోర్భవేత్ ॥
అత్రాప్యాగత్య చేద్వ్యాధో హ్యావయోః ప్రహరిష్యతి ।
దృష్టమాత్రో హి మునినా భస్మీభూతో భవిష్యతి ॥
ఇత్యుక్తే వచనే మృగ్యా రామదర్శనతుష్టయా ।
మృగశ్చోవాచ హర్షేణ సమావిష్టః ప్రియాం స్వకామ్ ॥
ఏవమేవ మహాభాగే యద్వై వదసి భామిని ।
జానేఽహమపి రామస్య ప్రభావం సుమహాత్మనః ॥
యోఽయం సందృశ్యతే ఛాస్య పార్శ్వం శిష్యోఽకృతవ్రణః ।
స చానేన మహాభాగస్త్రాతో వ్యాఘ్రభయాతురః ॥
వచ్చి, వ్యాధుఁడు అకృతవ్రణునితో రాముని చూచెను. దూరకృతేక్షణుఁడై ఆతఁడల్లే నిలబడిపోయెను. భృగు నందనుఁడయిన రాముని దర్శనమున శంకీత మనస్కుడై ఆతడిట్లా లోచించెను. ఈ రాముఁడు మహావీరుఁడు. దుష్టుల కంతకారకుఁడు, ఆతడు చూచుచుండ నీమృగములనేట్లు చంపగలను. అను ఆలోచనతో కూడికోని వ్యాధుఁడు, ఓ రాజ సత్తమ ! రాముని వలన సంత్రస్తమానసుఁడై యందే యుండిపోయెను. (18) భయపడుచు నీరు త్రాగుచున్న ఆ మృగద్వయమును రాముఁడు చూచేను. మేధావియైన రాముఁడు “ఇక్కడ భయకారణమేమయి యుండునని” ఆలోచించెను. ఇచ్చటేచ్చటను పులిగాండ్రింపులు లేవు. కిరాతుఁడు వెంటాడి వచ్చి యుండెనేమో యన్న, కిరాతుఁడును కన్పింపడే ! మతి ఏ యితర కారణమున ఆ మృగములు భయచకితేక్షణములై శంకితములై యున్నవి లేక, సహజముగా మృగజాతి చకితేక్షణములు కలది కదా ! అందుచే జలపాన సమయమునఁ గూడ భయచకిత నేత్రములు కలిగినవి. (21) ఆ రెండు భయ చకితములగుట కిచ్చట కారణము లేదే ! అవి అలసినవి భయాతురములు, శరీరమంతయు చెమ్మటలు పోసినవి. శరీరావయవములు కంపించుచున్నవే.” ఈ విధముగా నాలోచించి మతి మంతుఁడయిన రాముఁడు శిష్యునితో సంయుతుఁడై పుష్కర మధ్యమున, అమృగములు రెండు నందేయుండగా నుండిపోయెను. (23) ఆ రెండును నీటిని త్రాగినవి. చెట్టునీడ కుంజేరినవి. ఆ మృగద్వయము రాముని చూచుచునే సంతోషమున అన్యోన్యము సంభాషణమున కారంభించెను.
మృగి (ఆడలేడి) ఇట్లనెను.
ఓ ప్రియ (ఓ నాయక) మనమిందే రాముడున్నంత సేపు ఉందము. ఆ వీరుని సాన్నిధ్యమున మనకెటి భయములేదు. (కలుగదు). ఒకవేళ కిరాతుఁడు వచ్చినచో మనలను చంప తలచినచో ముని, యతనిని చూచినంత మాత్రమున నతఁడు భస్మీభూతుఁడు కాగలఁడు. రామదర్శనమున సంతుష్టయైన ఆడలేడి యిట్లు పలుకగా, మృగము రామునిచూచి తానుగూడ హర్షము నొంది తన ప్రియతో ఓ ప్రియా ! పూజ్యురాలా నీవనినట్లే ! సుమహాత్ముఁడయిన రాముని ప్రభావ మెఱుంగుదును. రాముని ప్రక్కకనంబడుచున్న యీ శిష్యుడు, అకృత ప్రణుండు కూడ వ్యాఘ్ర భయాతురుఁడై పూర్వము రామునిచే రక్షింపఁబడెను. (29)
అయం రామో మహాభాగే జమదగ్ని సుతోఽనుజః ।
పితరం కార్తవీర్యేణ దృష్ట్వా చైవ తిరస్కృతమ్ ॥
చకారాతితరాం కృద్దః ప్రతిజ్ఞాం నృపఘాతినీమ్ ।
తత్పూర్తికామో హ్యగమద్భ్రహ్మలోకం పురా హ్యయమ్ ॥
స బ్రహ్మా దిష్టవాంశ్చైనం శివలోకం వ్రజేతి హ ।
తస్య త్వాజ్ఞాం సమాదాయ గతోఽసౌ శివసన్నిధీమ్ ॥
ప్రోవాచాఖిలవృత్తాంతం రాజ్ఞశ్చ్యా త్మనః పితుః ।
స కృపాళుర్మహాదేవః సభాజ్య భృగునందనమ్ ॥
దదౌ కృష్ణస్య సన్మంత్రమబేద్యం కవచం తథా । స్వీయం పాశుపతం చాస్త్రమన్యాస్త్రగ్రామమేవ చ ॥
విసర్జయామాస ముదా దత్త్వా శస్రాణి చాదరాత్ ।
సోఽయ మత్రాగతో భద్రే మంత్రసాధనతత్పరః ॥
నిత్యం జపతి ధర్మాత్మా కృష్ణస్య కవచం సుధీః ।
శతవర్షాణి చాష్యస్య గతాని సుమహాత్మనః ॥
మంత్రం సాధయతో భద్రే న చ తత్సిద్ధిరేతి హి ।
అత్రాస్తి కారణం భక్తిః సా చ వై త్రివిధ మతా ॥
ఉత్తమా మధ్యమా చైవ కనిష్ఠా తరళేక్షణే ।
శివస్య నారదస్యాపి శుకస్యచ మహాత్మనః ॥
అంబరీషస్య రాజర్షేరంతిదేవస్య మారుతేః ।
బలేర్విభీషణస్యాపి ప్రహ్లాదస్య మహాత్మనః ॥
ఉత్తమా భక్తిరేవాస్తి గోపీనాముద్ధవస్య చ ।
వసిష్ఠాదిమునీశానాం మన్వాదీనాం శుభేక్షణే ॥
మధ్యా చ భక్తిరేవాస్త్రి ప్రాకృతాన్యజనేషు సా ।
మధ్యభక్తిరయం రామో నిత్యం యమపరాయణః ॥
సేవతే గోపికాధీశం తేన సిద్ధిం న చాగతః ।
వసిష్ఠ ఉవాచ :-
ఇత్యుక్త్వా త్వరితం కాంతం సా మృగీ హృష్టమానసా ॥
పునః ప్రప్రచ్ఛ భక్తేస్తు లక్షణం ప్రేమదాయకమ్ ।
మృగ్యువాచ :-
సాధుకాంత మహాభాగ వచస్తేఽ లౌకికం ప్రియ ।
ఈదృక్ జ్ఞానం తవ కథం సంజాతం తద్వదాధునా ॥
ఓ ప్రియా ! ఈ రాముఁడు జమదగ్నికి కనిష్ఠ కుమారుఁడు. తన తండ్రి కార్తవీర్యునిచే తిరస్కరింపఁబడఁజూచి, క్రుద్ధుఁడై సర్వ నృప ఘాతిని యగు ప్రతిజ్ఞ నాతఁడు చేసెను. ఆ ప్రతిజ్ఞను పూర్తి చేయనెంచి యతఁడు పూర్వము బ్రహ్మలోకమున కరిగెను. (31) ఆ బ్రహ్మ యీతనిని శివలోకమునకు కరుగుమని పంపెను. ఆతని ఆజ్ఞను శిరసావహించి యాతఁడు శివసన్నిధి కరిగెను. తన తండ్రి యొక్క యావదత్తాంతమును తన విషయము సర్వమును పునకు విన్నవించెను. దయాళుఁడయిన మహాదేవుడు భృగు నందనుని గౌరవించేను. కృష్ణ మంత్రమును, అభేద్యమయిన కవచమును, తన పాశుపతాస్త్రమును, ఇతరములయిన అస్త్ర సముదాయమును ఆతని కొసంగెను, సంతోషముతో ఆదరముగా శస్త్రముల నొసంగెను.ఆ రాముఁడు ఓ ప్రియురాలా ! మంత్ర సాధన తత్పరుఁడయి యిచ్చటకు వచ్చెను. ధీమంతుఁడయిన యాతం డు నిత్యమును కృష్ణ కవచమును జపించును, ఆ మహాత్మునికీమంత్ర జపముతో నూరు సంవత్సరము లేగెను. కాని ఆ మంత్ర మింకను పూర్తిగా సాధింపఁబడలేదు. దానికొక కారణమున్నది. భక్తి శ్రీవిధము. ఆ మూఁడు విధముల భక్తి 1. ఉత్తమ భక్తి, 2. మధ్యమభక్తి, 3. కనిష్ఠభక్తి. శివుని యొక్క నారదునియొక్క మహాత్ముఁడైన శుకుని యొక్క రాజర్షియైన అంబరీషుని యొక్క రంతి దేవుని యొక్క హనుమంతుని యొక్క బలియొక్క విభీషణుని యొక్క మహాత్ముఁడయిన ప్రహ్లాదుని యొక్క గోపికల యొక్క ఉద్దవుని యొక్క భక్తి ఉత్తమము. వసిషాది మునీశ్వరుల యొక్క మన్వాదుల యొక్క భక్తియు ఓ శుభేక్షణా! మధ్యమభక్తి. ఇంక ఇతర ప్రాకృత జనుల యొక్క భక్తి కనిష్ఠమయినది. రామునకీ మధ్యమా భక్తి గలదు. ఆతఁడు నిత్యము యమ నియమాది పరాయణుఁడయినను, గోపీనాథుని సేవించినను, ఇంకను సిద్ధిని పొందలేదు.
వసిష్ఠుడిట్లనియెను.
ఈ విధముగా చెప్పఁబడినను మృగి సంతుష్టమనస్సుతో “ప్రేమదాయకమయిన భక్తి లక్షణములను చెప్పుమని మృగము నడిగెను.
మృగ ఉవాచ :-
శృణు ప్రియే మహాభాగే జ్ఞానం పుణ్యేన జాయతే ॥
తత్పుణ్య మద్యసంజాతం భార్గవస్యాస్య దర్శనాత్ ।
పుణ్యాత్మా భార్గవశ్చాయం కృష్ణభక్తో జితేంద్రియః ॥
గురుశుశ్రూషకో నిత్యం నిత్యనైమిత్తికాదరః ।
అతోఽస్య దర్శనాజ్ఞాతం జ్ఞానం మేఽద్యైవ భామిని ॥
త్రైలోక్యస్థితసత్త్వానాం శుభాశుభనిదర్శకమ్ ।
అద్యైవ విదితం మేఽ భూద్రామస్యాస్య మహాత్మనః ॥
చరితం పుణ్యదం చైవ పాపఘ్నం శృణ్వతామిదమ్ ।
యద్యత్కరిష్యతే చైవ తదపి జ్ఞానగోచరమ్ ॥
యోత్తమా భక్తి రాఖ్యాతా వాం వినా నైవ సిద్ధ్యతి ।
కవచం మంత్ర సహితం హ్యపీ వర్షాయుతయుతైః ॥
యద్యయం భార్గవో భద్రే హ్యగస్త్యానుగ్రహం లభేత్ ।
కృష్ణప్రేమామృతం నామ స్తోత్రముత్తమభక్తిదమ్ ॥
జ్ఞాత్వా చ లప్స్యతే సిద్ధిం మంత్రస్య కవచస్య చ ।
స మునీర్ జ్ఞాతతత్త్వార్థః సానుకంపోఽభయప్రదః ॥
ఉపదేక్ష్యతి చైవైనం తత్త్వజ్ఞానం ముదావహమ్ ।
శ్రీకృష్ణచరితం సర్వం నామభిర్గ్రథితం యతః ॥
కృష్ణప్రేమామృతస్తోత్రాజ్ జ్ఞాస్యతేఽస్య మహామతిః ।
తతః ప్రసిద్ధకవచం రాజానం హైహయాధిపమ్ ॥
హత్వా సపుత్రామాత్యం చ ససుహృద్బలవాహనమ్ ।
త్రిఃసప్తకృత్వో నిర్భూపాం కరిష్యత్యవనీం ప్రియ ॥
వసిష్ఠ ఉవాచ :-
ఏవముక్త్వా మృగో రాజన్ విరరామ మృగీం తతః ।
ఆత్మనో మృగభావస్య కారణం జ్ఞాతవాంశ్చ హ ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయఉపాద్ఘాతపాదే
భార్గవచరితే చతుస్త్రింశత్తమోఽధ్యాయః ॥
మృగము ఇట్లు పలికెను.
ఓ ప్రియురాలా ! వినుము. జ్ఞానము పుణ్యముచే పుట్టును. భార్గవ దర్శనము వలన ఆ పుణ్యమిప్పుడు కలిగినది. భార్గవుఁడు పుణ్యాత్ముఁడు, కృష్ణభక్తుఁడు, జితేంద్రియుఁడు, నిత్యము గురుశిశ్రూషాపరాయణుఁడు నీత్యనైమిత్తకాదిక్రియాదరణము కలవాడు. అందుచే ఆ మహానుభావుని దర్శనముకారణముగా నిప్పుడా జ్ఞానము నాకు కలిగినది. త్రిలోకములందు నివసించు, జంతువుల యొక్క శుభాశుభ నిదర్శకము అయిన జ్ఞానము మహాత్ముఁడయిన ఈ రామునీ దర్శనము వలన నిప్పుడు విదితమైనది. (47) పుణ్యదము, పాపఘ్నమునునయిన చరిత్రమును వినువారలకు ఏదేది జరుగునో యది జ్ఞానగోచరమగును. ఉత్తమ భక్తియని యేది చెప్పఁబడినదో అయ్యదీ లేక, యంత్ర సహిత మయిన కవచము అనేకలక్షల యేండ్లకయినను సిద్ధింపదు.
ఈ భార్గవ రాముఁడు అగస్త్యర్షిఅనుగ్రహమును పొందఁగలిగినచో, ఉత్తమ భక్తిదమయినది, ఉత్తమ స్తోత్రమయినదియునగు శ్రీకృష్ణ ప్రేమా మృతమనునది తెలిసికొని, ఆతఁడు మంత్రము యొక్క కవచముయొక్క సిద్ధిని పొందును. ఆ అగస్త్యర్షి తెలియఁబడిన తత్త్వార్థము (యదార్థవృత్తము) కలవాఁడు దయాకరుఁడు, అభయప్రదుఁడు, రామునికి ముదావహమైన తత్త్వజ్ఞానము నుపదేశించును, కృష్ణ ప్రేమా మృతమను స్తోత్రము నందు శ్రీకృష్ణ చరిత్ర యంతయు నామములతో గ్రంథిలమయినది, తచ్చరిత్రమును మహామతి రాముఁడు అగస్త్యర్షి వలన తెలిసికొనును. తరువాత ప్రసిద్ధ కవచుఁడై రాజయిన హైహయాధిపతిని సపుత్రామాత్యముగను, సుహృద్బలవాహనయుతునిగను చంపును. ఓ ప్రియా ! ఈ భూమీని ఇరువదియొక్క మారు రాజరహితముగఁజేయును.
వసిష్ఠుఁడిట్లనెను.
మృగమీ విధముగా చెప్పి విరమించెను. ఆతఁడు తాను మృగమగుటకు కారణము నాతఁడెఱింగెను.
ఇది వాయుప్రోక్తమయిన మహాపురాణమయిన బ్రహ్మాండపురాణమున మధ్యభాగమున తృతీయ ఉపోద్ఘాతపాదమున భార్గవచరితమున ముప్పది నాలుగవ అధ్యాయము.
Summary of chapter 72 of the Brahmānda Mahā Purana is as follows:
In grand epic style, this section extols the mighty emperor Kārtavīrya Arjuna, who ruled the world with a thousand arms granted by the grace of sage Dattātreya. It recounts his unmatched valor, his righteous protection of subjects, and his glorious empire where injustice was completely unknown. The reader contemplates how boundless physical power, when combined with devotion to divine masters, can establish an era of supreme prosperity on earth.