43 - భార్గవచరితమ్

వసిష్ఠ ఉవాచ :-

ఏవం సుస్నిగ్ధచిత్తేషు తేషు తిష్ఠత్సు భూపతే ।

భవాన్యుత్సంగతో రామః సముత్థాయ కృతాంజలిః ॥

 తుష్టావ ప్రయతో భూత్వా నిర్విశేషం విశేషవత్ ।

 అద్వయం ద్వైతమాపన్నం నిర్గుణం సగుణాత్మకమ్ ॥

రామ ఉవాచ :-

ప్రకృతివికృతిజాతం విశ్వమేతద్విధాతుమ్ మమ కియదనుభూతం వైభవం

తత్ప్రమాతుమ్ ।

అవిదితతనునామాభీష్టవస్త్వేకధామాభవదథ భవభామా పాతు మాం పూర్ణకామా ॥

ప్రకటితగుణభావం కాలసంఖ్యావిధానం సకలభవనిదానం కీర్తయే యత్ప్రధానమ్ ।

తదిహ నిఖిలతాతః సంబభూవోక్షపాతః కృతకృతకనిపాతః పాతు మామద్యమాతః ॥

 దనుజకులవినాశీ లేఖపాతావినాశీ ప్రథమకులవికాశీ సర్వవిద్యాప్రకాశీ।

 ప్రసభరనీతకాశీ భక్తదత్తాఖిలాశీరవతువిజితపాశీ మాం సదాషణ్ముఖాశీ ॥

హరనికటనివాసీ కృష్ణసేవావిలాసీ ప్రణతజనవిభాసీ గోపకన్యాద్రహాసీ ।

హరకృతబహుమానో గోపికేశైకతానో విదితబహువిధానో జాయతాం కీర్తిహా నో ॥

ప్రభునియతమనా యో నున్నభక్తాంతరాయో హృతదురీతనికాయో జ్ఞానదాతా పరాయోః।

సకలగుణగరిష్ణో రాధికా౦కే నీవిష్ణో మమ కృతమపరాధం క్షంతుమర్హత్యగాధమ్ ॥

 యా రాధా జగదుద్భవస్టితిలయేష్వారాధ్యతే పో జనైః శబ్దం బోధయతీశవక్రవీగలత్ప్రేమామృతాస్వాదనమ్ ।

రాసేశీ రసికేశ్వరీ రమణహృన్నిషా నిజానందినీ నేత్రీ సా పరిపాతు మామవనతం రాధేతి యా కీర్త్యితే ॥

వసిష్ఠుఁడిట్లు పలికేను :

ఓ రాజా ! వారందరు ప్రేమార్ధ హృదయములలో నచ్చట నుండగా, రాముఁడు భవాని యొడి నుండి లేచి, కృతాంజలుఁడై, నియమ బద్ధుఁడై మనో నిర్మలత్వముతో, ఎట్టి విశేషములు లేక, విశేషములు కలిగినట్టి వారిని, ద్వైతమును బొందియున ద్వయమై సంపూర్ణమై నిర్గుణమయ్యు సగుణాత్మయయిన పరమాత్మను భక్తియుక్తుఁడై స్తోత్రము చేసెను.

రాముఁడిట్లు స్తుతించెను :

ఈ విశ్వము సప్త ప్రకృతి వికృతుల పుట్టినది, తద్వైభవమును కొలుచుటకు, (ఎలుంగుటకు) నాకెంతటి అనుభవమున్నది. (లేదు) అవిదితమయిన తనువు నామము గల (ఈశ్వరుని) స్వరూపము ప్రపంచమున సర్వాభీష్టములయిన వస్తువుల స్థితికి ఆధారమయినది. అందుచే పూర్ణకాముఁడ నయిన నన్ను భగవద్భక్తుని, సర్వకామములను దీర్చిన పార్వతి రక్షించుగాక. ఏ ప్రధానము ప్రకటిత గుణభావము గలిగినది, కాలసంఖ్యావిధానము కలిగినది, సకలభవన నిదానమయినది, ఏయది ప్రధానము దానిని స్తోత్రము చేయుదును. ప్రపంచమందలి సర్వకృతక దృక్పాతములకు ఏనీ దృక్పసారము హేతువో, ఓ జననీ ! అయ్యది నన్ను ఇప్పుడు రక్షించుగాక. దనుజ కుల సముదాయమును వినాశనము చేయునది, దేవతల దుఃఖ తాపమును పోగొట్టునదియు, ఎయ్యది ప్రథమ కులములను వికసింపజేయునదియు, ఏయది సర్వశాస్త్రముల వికసింపజేయునది, ఎయ్యదీ కాశీ నగరమును తక్షణము నిర్మించేనో, ఏయది భక్తులకెల్లకోర్కెల నిచ్చునదియో, ఎయ్యది వరుణుని జయించెనో ఆ భగవంతుఁడయిన కార్తికేయుఁడు షణ్ముఖుఁడు, నన్ను సర్వదా రక్షించుగాక,ఈశ్వరుని సమీపమునందు నివసించువాఁడు, ఎవఁడు శ్రీకృష్ణుని సేవయందు విలసించువాఁడు తనకు నమస్కరించిన భక్తజనులను ప్రకాశింపచేయువాఁడు, ఎవఁడు గోపకన్యకలను నవ్వించువాడో, ఎవఁడు ఈశ్వరునిచే గౌరవింపఁబడునో గోపీప్రాణనాథుని యందేవఁడు ఏకైకభక్తివిభవుఁడో, ఎవఁడు విదిత బహువిధానుండో (ఔచిత్యక్రియాకలాపముల నెఱింగినవాఁడు) అట్టి విఘ్నేశ్వరుఁడు కీర్తిహరుఁడు కాకుండుగాక.ఎవ్వడు తన మనస్సును నియమించుకొనెనో, తన మనస్సును సర్వప్రభుఁడయిన ఈశ్వరునియందు లగ్నమొనర్చెనో, తన భక్తుల యొక్క విఘ్నముల నెవ్వఁడు పారద్రోలెనో, అనేకములయిన దురిత సమూహమును ఎవ్వడు హరించెనో, ధనహీనులకు ఎవ్వఁడు జ్ఞానమును ప్రసాదించునో, ఎవఁడు సకలగుణ గరిష్ణుండో, ఎవఁడు రాధికారకమున నివిష్ణుఁడో యతఁడు శ్రీకృష్ణుఁడు, అగాధమయిన మత్కృతాపరాధమును తొలగించుగాక. జగత్తు యొక్క ఉద్బవ స్థితి, లయముల యందు ఎవ్వతే ఆరాధింపఁబడునో, ఎవ్వతే, ప్రభుఁ డయిన కృష్ణుని ముఖము నుండి బయల్పడు ప్రేమ ను గ్రహించుటకు ఆధారమయిన శబ్దమును ప్రజలు అవగాహన చేయునట్లోనరించునో, ఎవతే రాసక్రీడా సామ్రాజియో, ఎవతే రసికేశ్వరియో రసికులకు అధిపతురాలో) ఎవతే, తన భర్తయొక్క హృదయసంసక్తురాలయి, తన యందు ప్రీతి గలిగిన వారలకు ఆనందమును కలిగించునో ఎవ్వతె రాధయనీ కీర్తింపం బడునో యట్టీ నాయకురాలు అవనతుఁడనయిన నన్ను రక్షించుగాక.(8)

 యస్యా గర్భసముద్భవో హ్యతివిరాడ్యస్యాంశభూతో విరాట్ యన్నాథ్యంబురుహోద్భవేన విధినైకాంతోపదిషేన వై ।

 సృష్టం సర్వమీదం చరాచరమయం విశ్వం చ యద్రోమసు బ్రహ్మాండాని విభాంతి తస్య జననీ శశ్వత సన్నాస్తు సా ॥

  ప్రాయాద్యః స చరాచరస్య జగతో వ్యాపీ విభుః సచ్చిదానందాబ్దిః ప్రకటస్థితో విలసతి ప్రేమాంధయా రాధయా ।

 కృష్ణః పూర్ణతమో మమోపరి దయాక్లిన్నాంతరః స్తాత్సదా యేనాహం సుకృతీ భవామ్ చ భవాభ్యానందలీనాంతరః ॥ 

వసిష్ఠ ఉవాచ :-

స్తుత్వైవం జామదగ్న్యస్తు విరరామ హ తత్పరమ్ ।

విజ్ఞాతాఖిలతత్త్వార్టో హృష్టరోమా కృతార్థవత్ ॥

 అథోవాచ ప్రసన్నాత్మా కృష్ణః కమలలోచనః ।

 భార్గవం ప్రణతం భక్త్యా కృపాపాత్రం పురఃస్థితమ్ ॥

కృష్ణ ఉవాచ :-

సిద్ధోసి భార్గవేంద్ర త్వం ప్రసాదాన్మమ సాంప్రతమ్ ।

అద్య ప్రభృతి వత్సాస్మిన్ లోకే శ్రేష్ఠతమో భవ ॥

 తుభ్యం వరో మయా దత్తః పురా విష్ణుపదాశ్రమే ।

 తత్సర్వం క్రమ భాష్యం సమా జహ్వీస్వయా విభో ॥

 దయా విధేయా దీనేషు శ్రేయ ఉత్తమమిచ్ఛతా ।

 యోగశ్చ సాధనీయో వై శత్రూణాం నిగ్రహస్తథా ॥

 త్వత్సమో నాస్తి లోకేస్మిన్ తేజసా చ బలేన చ ।

 జ్ఞానేన యశసా వాపి సర్వశ్రేష్ఠతమో భవాన్ ॥

 అథ స్వగృహమాసాద్య పిత్రోః శుశ్రూషణం కురు ।

తపశ్చర యధాకాలం తేన సిద్ధిః కరస్థితా ॥

 రాథోత్సంగాత్సముత్థాష్య గణేశం రాధికేశ్వరః ।

 ఆలింగ్య గోడం రాసేణ మైత్రీం తస్య చకార హ ॥

 అధోభావపి సంప్రీతా తదా రామగణేశ్వరౌ ।

 కృష్ణాజ్ఞయా మహాభాగే బభూవరురరిందము ॥

ఏతస్మిన్నంతరే దేవీ రాధా కృష్ణప్రియా సతీ ।

 ఉభాభ్యాం చ వరం ప్రాదాత్ప్రసన్నాస్యా ముదాన్వితా ॥

ఎవతేయొక్క గర్భము నుండి అతివిరాట్ సముద్భవించేనో, విరాట్ యెవతే యొక్క ఆంశయగునో, ఆమె నా యెడ ప్రసన్నరాలగుగాక, సర్వచరాచర ప్రపంచము ఎవని నాభి కమలము నుండి యుద్భవించిన బ్రహ్మ సృష్టింపబడెనో, ఆ బ్రహ్మ ఏకాంత ప్రదేశమున నుపదేశింపం బడెనో, ఎవని యొక్క రోమకూపముల యందు బ్రహ్మాండములు ప్రకాశించునో, తత్ర్పభువు యొక్క జననియైన యామె యెల్లప్పుడు నాకు ప్రసన్నురాలగుత.  సమస్తమైన చరాచర జీవరాశులకు జగద్వ్యాపి, విభుఁడు నయిన కృష్ణుఁడు ప్రభువు, ఎవఁడు సర్వవ్యాపియో, ఎవఁడు భవదల్జియో, ఎవడు విజ్ఞానమో, యెవఁడు ఆనందమో, ఎవ్వడు ప్రేమాంధయైన రాధతో విలసిల్లునో, ఎవఁడు పూర్వతముఁడో, అట్టి కృష్ణుఁడు నా యందు దయాపూర్ణుండగుగాక, తన్మూలమున నేను సుకృతి నగుదును, అంతియేకాక ఆనందమున లీనుండనగుదును.

 వసిష్ఠుఁడనేను :-

పరమాత్మ నీవిధముగా స్తుతించి పరశురాముఁడు ఆగెను. విజ్ఞాతాఖిలతత్త్వార్థుఁడు వెండ్రుకలు గగుర్పొడువ తన కోరికలు సఫలీకృత ములయినట్లు తలంచెను. అంత, కమలలోచనుఁడు కృష్ణుఁడు, భక్తితో నమస్కరించీ ఎదుట నిల్చిన కృపాపాత్రుఁడయిన భార్ణవునితో నిట్లనెను.

 కృష్ణుఁడనెను :-

ఓ భార్గవేంద్ర ! నా ప్రసాదము వలన నీ వీపుడు సిద్ధుఁడవైతివి. ఓ వత్స ! ఇప్పటి నుండి నీవు లోకమున శ్రేష్ఠతముఁడవు కమ్ము. పూర్వము విష్ణుపదాశ్రమమున నాచే నీకు వర మీయఁబడినది. తత్సర్వము క్రమముగా కాలక్రమమున సంపన్నమగును. దీనుల యందు శ్రేయము ఉత్తమము కోరువానియందు దయావిధేయుఁడవు కమ్ము. నీవు యోగము సాధించుము, శత్రువుల నీగ్రహ మొనర్చుము. తేజస్సు, బలముచే, జ్ఞానముచే, యశస్సుచే లోకమునందు త్వత్సముఁడు లేడు. నీవు సర్వశ్రేష్ఠతముఁడవు కమ్ము ! ఇంక స్వగృహమున కరుగుము, పితృ శుశ్రూషయొనర్పుము. అర్ఘకాలమున తపస్సాచరింపుము. తన్మూలమున సిద్ది నీకరస్థితమగును. రాధికేశ్వరుఁడు రాధిక తొడనుండి లేవదీసి గణేశ్వరుని, గాఢముగా ప్రేమతో కౌగిలించుకొని రామునితో మైత్రి నొనర్చెను. అప్పుడు రామ గణేశ్వరులిర్వురు కృష్ణాజ్ఞచే సంప్రీతులయిరి. ఆ సమయములో కృష్ణుని ప్రియసతి రాధ ప్రసన్నాస్యయు ముచొన్వితయునై వారిరువురకు వరము లొసంగెను.

రాథోవాచ :-

సర్వస్య జగతో వంద్యౌ ధురాధర్షౌ ప్రియావహౌ ।

మద్భక్తౌ చ విశేషేణ భవంతౌ భవతాం సుతే ॥

 భవతోర్నామ చోచ్చార్య యత్కార్యం యః సమారభేత్ ।

సిద్ధిం ప్రయాతు తత్సర్వం మత్రసాదాది తస్య తు ॥

 అథోవాచ జగన్మాతా భవానీ భవవల్లభా ।

వత్స రామ ప్రసన్నాహం తుభ్యం కం ప్రదదే వరమ్ ॥

 తం ప్రబ్రూహి మహాభాగ భయం త్యక్త్వా సుదూరతః ।

 రామ ఉవాచ :-

జన్మాంతరసహశ్రేషు యేషుయేషు ప్రజామ్యహమ్ ।

 కృష్ణయోర్భవయోర్భక్తా భవిష్యామీతి దేహి మే ।

 అభేదేన చ పశ్యామీ కృష్ణా చాపి భవౌ తథా ॥

 పార్వత్యువాచ :-

ఏవమస్తు మహాభాగ భక్తీపి భవకృష్ణయోః ।

చిరంజీవీ భవాశు త్వం ప్రసాదాన్మమ సువ్రత ॥

అథోవాచ ధరాధీశః ప్రసన్నస్తముమాపతిః ।

ప్రణతం భార్గవేంద్రం తు వరార్హం జగదీశ్వరః ॥

 శివ ఉవాచ :-

రామభక్తాపి మే వత్స యస్తే దతో వరో మయా ।

స భవిష్యత్ కార్డ్వేన సత్యముక్తం న చాన్యధా ॥

 అద్యప్రభృతి లోకేబిస్మిన్ భవతో బలవత్తరః ।

 న కోపీ భవతిద్వత్స తేజస్వీ చ భవత్పరః ॥

 వసిష్ఠ ఉవాచ :-

అథ కృష్ణాష్యనుజ్ఞాష్య శివం చ నగనందినీం ।

 గోలోకం ప్రయయా యుక్తః శ్రీదామ్నా చాపి రాధయా ॥

 అథరామోపి ధర్మాత్మా భవానీం చ భవం తథా ।

 సంపూజ్య చాభివాద్యాథ ప్రదక్షిణముపాక్రమీత్ ॥

 గణేశం కార్తికేయం చ నత్వాపృచ్య చ భూపతే ।

 అకృతవ్రణసంయుక్తో నిశ్చక్రామ గృహాంతరాత్ ॥

 నిష్క్రమ్యమాణో రామస్తు నందీశ్వరముఖైర్గణైః ।

 నమస్కృతో యయౌ రాజన్ స్వగృహం పరయా ముదా ॥

 ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే భార్గవచరితే త్రీచత్వారింశత్తమోధ్యాయః ॥

రాధ ఇట్లనెను (పార్వతితో)

నీ కుమారు లిర్వురు సర్వ జగత్తునకు నమస్కారార్హులు. దురోథరులు ప్రియావహులు. అంతకు మించి నా భక్తులు. మీ సొమముల నుచ్చరించి యెవ్వరే కార్యముల నాచరింతురో వారా కార్యముల సిద్ది పొందెదరు. మత్రసాదము వలన సర్వము సిద్ధించును. 'బిడ్డా ! రామ! నీ వలన ప్రసన్నాత్మురాల నైతిని. నీకేమి వరమిచ్చెదను? ఆమెతో పరశురాముఁడు దూరముగా భయమును పారద్రోలి ఇట్లనెను. ఓ తల్లీ ! జస్మొంతరసహస్రములందు నేను ఏ జన్మల నుద్భవించినను కృష్ణునకు, మీకును భక్తుండను కావలయును. కృష్ణుని మిమ్మిద్దరను ఎట్టి భేదము లేక దర్శించెదను ఇట్టి వరమొసంగుము.

పార్వతీ ఇట్లు పలికేను :

 అట్లే యగు గాక. భవులకు కృష్ణునకు నీవు భక్తుండవు. చిరంజీవ, మా ప్రసాదమున ఓ సువ్రతా. ఆయుష్మాన్ భవ. అంత ధరాధీశుఁడు (పరమేశ్వరుఁడు) ప్రసన్నాత్ముఁడై నమస్కరించిన వరారుఁడగు భార్గవేంద్రునితో ఇట్లనెను.

శివుడనేను

రామ ! నీవు నాకు భక్తుఁడవు. అందుచే వరమిచ్చితిని. నేనిచ్చిన వరము నీకు ఫలవంతమగును. అది సత్యము అది ఎన్నడు అన్యథా కాదు. ఇప్పటి నుండి ప్రపంచమున నీకంటే బలవత్తరుఁడు లేడు. నీకంటే తేజస్వియును లేఁడు.

వసిష్ఠుఁడనెను :

దామోదరుఁడు ఈశ్వరుని యొక్క నగనందీని యొక్క సెలవుగైకొని రాధతో గోలోకమున కరిగెను. అంత ధర్మాత్ముఁడయిన రాముఁడు, భవానీ భవులను పూజించి నమస్కరించి ప్రదక్షిణమాచరించెను. గణేశునికి కార్తికేయునికి నమస్కరించి వారినడిగి, అకృతణునితోకూడ గృహము నుండి రాముఁడు బయలుదేరెను. నిష్క్రమించివేడలుచు భవానీభవుల కభివాదన ప్రదక్షిణలను జేసెను. తరువాత నందీశ్వరాదిగణములచే రాముఁడు నమస్కరింపబడెను. అత్యంతముదమున స్వగృహమున కతడరిగేను.

ఇదీ వాయుప్రోక్తబ్రహ్మాండమహాపురాణమునందు మధ్యమభాగమున తృతీయోపోద్ఘాతపాదమున  భార్గవ చరితమున నలుబదిమూడవ అధ్యాయము.