23 - ధ్రువచర్యాకీర్తనము

సూత ఉవాచ :-

స రథోఽధిష్ఠితో దేవైరాదిత్యైర్మునిభిస్తథా

గంధర్వైరపురోభిశ్చ గ్రామణీసర్పరాక్షసైః

ఏతే వసంతి వై సూర్యే ద్వౌద్వౌ మాసౌ క్రమేణ తు

ధాతార్యమా పులస్త్యశ్చ పులహశ్చ ప్రజాపతిః

ఐరావతో వాసుకిశ్చ కంసో భీమశ్చ తావుభౌ

రథకృచ్చ రజాశ్చ యక్షావేతావుదాహృతే

తుంబురుర్నారదశైవ సుస్థలా పుంజికస్థలా

రక్షోహేతః ప్రహేతిశ్చ యాతుధానావుదాహృతౌ

ఏతే వసంతి వై సూర్యే మధుమాధవయోః సదా

మిత్రశ్చ వరుణశ్చైవ మునిరత్రీరుదాహృతః

తథా వసిష్ణో విఖ్యాతః సహజన్యో చ మేనకో

రాక్షసౌ చ సమాఖ్యాతా పౌరుషేయో వధస్తథా

హాహా హూహూశ్చ గంధర్వో యజ్ఞశ్చాపి రథస్వనః

రథచిత్రస్తథైవాన్యో నాగసాక్షకసంజ్ఞాతః

రంభకశ్చ వసంత్యేతే మాసయోః శుచీశుక్రయాః

తతః సూర్యే పునస్త్వన్యా నివసంతీహ దేవతాః

ఇంద్రశ్చైవ విషస్వాంశ్చ అంగీరా భృగు రేవ చ

ఏపత్రస్తథా సర్పః శంఖపాలాశ్చ తావుభే

విశ్వావసూగ్రసేనౌ చ శ్వేతశ్చైవారుజస్తథా

ప్రమోచా ఇతి విఖ్యాతాఽనుహ్లిచేతి చ తే ఉభే

సూతుఁడు చెప్పెను.

ఆ రథము దేవతలచే, ఆదిత్యులచే, మునులచే, గంధర్వులచే, అప్సరసలచే గ్రామణులచే, సర్పములచే, రాక్షసులచే అధిష్టితమై యున్నది. (1) వీరు సూర్యునియందు ఒక్కోక్కరు క్రమముగా రెండేసి రెండేసి మాసములు నివసింతురు. ఈ క్రింద నుదాహరింపఁబడిన వారు సూర్యుని యందు అవిచ్చిన్నముగా చైత్ర వైశాఖ మాసములలో నివసింతురు - ధాత, అర్యముడు, పులస్త్యుఁడు, పులహుడు; ప్రజాపతి, సర్పములయిన వాసుకి, ఐరావతము, కంసుఁడు, భీముఁడు; (వీరిరువురు), రథకృత్తు; రథోజసుఁడు - ఈ యిరువురు యక్షులుగా చెప్పబడిరి. (3) గంధర్వులుతుంబురుఁడు, నారదుఁడు; దేవతా వేశ్యలు - సుస్థల, పుంజికస్థల; (రక్షక - రాక్షసులు) హేతీయు, ప్రహేలీయు - వీరిద్దరు యాతు ధానులలో పేర్కొనబడిరి. (2,5) ఈ క్రింది పోరు సూర్యనిలో శుచి, శుక్రమాసములలో అనఁగా జ్యేష్ణాషధములలో, నివసింతురు; దేవతలయన మీత్రావరుణులు; మునిత్రయమయిన అత్రియు ప్రఖ్యాతుఁడు, పసిష్ణుండు; అప్సరసలైన సహజన్య, మేనకలు; పౌరషేయుఁడు, వధుఁడును; వీరిరువురు రాక్షసులుగా ప్రఖ్యాతిగనిరి; హాహా హాహూ అను గంధర్వులు; (యజుఁడుకాదు) యక్షుఁడు; రథస్వనుఁడు, రథచిత్రుఁడు, వేటికఁడు నాగసాక్షకుఁడు (నాగయను తక్షకుఁడు?) మరియు రంభకుఁడు (56) ఇతర దేవతలు కూడ సూర్యునియందు నివసింతురు. ఈ క్రింది దేవతలు ఇతరులు శ్రావణ భాద్రపద మాసములలో సూర్యునియందు నీవసింతురు. (దైవములు) ఇంద్రుఁడు, వివస్వంతుఁడు; అంగిరుడు, భృగువు (సర్పములు) ఐలపత్ర, శంఖపాలుఁడు; (గంధర్వులు) విశ్వావసు, ఉగ్రసేనుఁడు, శ్వేతుఁడు, అరుణుండును? (అప్సరోద్వయము) ప్రసిద్ధులు ప్రమోచ, అనుక్షౌచము (యాతుధాను లిరువురు) సర్పుడు, ప్యోతుఁడును. (10)

యాతుధానస్తథా సర్భో వ్యాఘుఽవ తు తావుభౌ

నభోనథస్యయారేష గజో వసతి భాస్కరే

శరద్యన్యాః పునః శుభై వసంతీ మునిదేవతాః

పర్ణస్యశ్చైవ పూషా చ ఖారద్వాజః స గౌతమః

పరావసుశ్చ గంధర్వస్థతైవ సురుచిశ్చ యః

వీశ్వారీ చ ఘృతాచీ ద ఉభే తే శుభలక్షణే

నాగ ఐరావత శైవ విశ్రుతశ్చ ధనంజయః

శ్యేనజీచు సుషేణశ్చ సేనానీద్రామణీశ్చ తో

ఆపోవాతశ్చ ద్వావేతా యాతథానావుదాహృతా

వసంఖ్యేతే త వై సూర్యే సవైవాశ్వీసకార్తికే

హైమండితు డ్వౌ మాసో వసంతి చ దివాకరే

ఆంతో భగశ్చ ద్వావేతా కశ్యపశ్చ ఋతుశ్చ హ

భుజంగశ్చ మహాపద్మః సర్పః కర్కోటకస్తథా

చిత్రసేనశ్చ గంధర్వ ఊర్జయశ్చైవ అవుథో

ఊర్వతీ పూర్వచితీశ్చ తథైవాప్సరసావుభే

తారక్షశారిష్టనేమిళ్ళ సేనానీగ్రోమణీశ శా

విద్యుత్సూక్షః శతాయుళ్ళ యాతుధాసావుబాష్పోతే

హే చైవ సహాస్య చ వసంతేకతే ఉపోకరే

తతః శైశిరయోశ్చా పి మాసయోర్నివసంతి వై

త్వష్టా విష్ణుర్జామదగ్యో విశ్వామిత్రస్తథైవ చ

పవిత్రులయిన యితర దేవతలు ఆశ్వయుజ కార్తీకములందు శరద్రుతువున సూర్యునియందు వసింతురు. దేవతలు-పర్జన్యుఁడు, పూష మునులు-భారద్వాజుఁడు గౌతమునితో సహా; గంధర్వులయిన పరవసుడు, సురుచియును. అప్సరసలు - విశ్వాచీ ఘృతాచియు; వీరుభయులు శుభలక్షణులు. ప్రసిద్ద సర్పములు - నాగుడు ఐరావతము, విశ్రుతుడు మరియు ధనంజయుఁడును. సేనానులయిన శ్యేనజిత్తు సుషేణుఁడును; మరియు గ్రామణులు (సేనాధిపతులు) ఆపుఁడు, వాతుఁడు అను రాక్షసద్వయము. వీరందరు సూర్యుని యందు ఆశ్వయుజ కార్తీక మాసములందు వసించెదరు. (12,15) హేమంత ఋతువులో రెండు మాసములు ఈ క్రిందివారు సూర్యునిలో వసింతురు. వారిద్దరు దేవతలు - అంశుఁడు, భగుండు; ఇద్దరు మునులు - కశ్యపుఁడు, క్రతువు; రెండు సర్పములు మహాపద్ముఁడు, కర్కోటకుడును. ఇరువురు గంధర్వులు, చిత్రసేనుఁడు ఉష్ణాయువును; ఇరువురు అప్సరసలు, ఊర్వశి, పూర్వచిత్తీయు; సేనానులు, గ్రామణులు (సేనాధ్యక్షులు) తార్యుఁడు, అరిష్టనేమియు; యాతుధానులనఁబడు ఇరువురు విద్యుత్ఫూర్జుఁడు, శతాయువు; వీరందరు సూర్యునియందు మార్గశిర పుష్యముల యందు వసింతురు. (16, 19) ఈ క్రింది వారు శిశిర ఋతువులోసూర్యుని యందు వసింతురు. వారు దేవతలు త్వష్ట, విష్ణువు; మునులు - జమదగ్ని, విశ్వామిత్రుఁడును. సర్భద్వయము, కంబలుఁడు, అశ్వతరుఁడు. వీరిరువురు కర్రూతనయులు.

కాద్రవేయౌ తథా నాగౌ కంబలాశ్వతరావుభౌ

గంధర్వో ధృతరాష్ట్రశ్చ సూర్యవర్చాస్తథైవ చ

తిలోత్తమా తథా రంభా బ్రహ్మాపేతశ్చ రాక్షసః

యజ్ఞాపేతస్తథైవాన్యో విఖ్యాతో రాక్షసోత్తమః

ఋతజిత్ సత్యజిచ్చైవ, గంధర్వా సముదాహృతా

తపస్తపస్యయోః సూర్యే వసంతి మునిసత్తమాః

పితృదేవమనుష్యాదీన సదాప్యాయయన్ ప్రభుః

పరివర్తత్యహోరాత్రకారణం సవితా ద్విజాః

ఏతే దేవా వసంత్యర్కే ద్వౌ ద్వౌ మాసౌ క్రమేణ తు

స్థానాభిమానినో హ్యేతే గణా ద్వాదశసప్తకాః

సూర్యస్యాప్యాయయంత్యేతే తేజసా తేజ ఉత్తమమ్

గ్రథితైః స్వైరవోభిశ్చ స్తువంతీ హృషయో రవిమ్

గంధర్వాప్సరసశ్చైవ గీతనృత్యైరుపాసతే

గ్రామణీయక్షభూతానీ కుర్వతే భీషుసంగ్రహమ్

సర్పా వహంతి వై సూర్యం యాతుధానాస్తు యాంతి చ

వాలఖిల్య నయంత్యస్తం పరివార్యోదయాద్రవమ్

ఏతేషామేవ దేవానాం యథావీర్యం యథాతపః

యథాధర్మం యథాయోగం యథాసత్యం యథాబలమ్

తపస్యతే యథాసూర్య ఏషామింద్రస్తు తేజసా

ఇత్యేతే నివసంతీహ ద్వౌద్వౌమాసౌ దివాకరే

గంధర్వద్వయము : ధృతరాష్ట్రుఁడు, సూర్యవర్చసుఁడు. (21) దేవతా వేశ్యలు - తిలోత్తమ, రంభయును బ్రహ్మాపేతుఁడను రాక్షసుండు, ఇఁక విఖ్యాత రాక్షసుఁడయిన యజ్ఞా పేతుండును. గంధర్వులుగా చెప్పఁబడిన ఋతజిత్తు, సత్యజిత్తును. ఓ ముని సత్తములారా ! వీరందరు మాఘ ఫాల్గుణముల యందు సూర్యునీయందు వసింతురు. (23) ఓ ద్విజులారా ! పితరులను, దేవతలను, మనుష్యాదులను, పిల్లప్పుడు పోషించుచు, దీవానీశలకు కారణమయిన సవిత పరివర్తనము చేయుచుండును. (24) ఆ దేవతలు సూర్యునియందు రెండేసి మాసములు క్రమముగా నివసింతురు. ఏడుగురు చొప్పున గణముగా నున్న పండ్రెండు గణములు స్థానాభిమానులు తమ స్థానములయందు పదవులయందు అభిమానము కలవారు. (25) వారందరు సూర్యునియొక్క యుత్తమమైన తేజస్సును వారి తేజోమూలమున వృద్ధి పరచెదరు. వారిచే గ్రథితములయిన {రచింపఁబడిన) - ప్రార్థనలచే - మునీశ్వరులు సూర్యుని స్తోత్రము చేయుదురు. (26) గంధర్వులు అప్సరసలు నృత్యములచే గీతములచే సూర్యునువాసింతురు. గ్రామణులు యక్షులు భూతములు సూర్యకిరణముల పూజనారంభింతురు. (27) సర్పములు సూర్యుని వహించును. రాక్షసులాతని ననుసరింతురు. సూర్యోదయము నుండి అస్తమానము వరకు, వాలఖిల్యులు ఆతనిని పరీవర్తించి ముందునకు బోవుదురు. (28) ఆ దేవతల యొక్క వీర్యము ననుసరించి, తపస్సు ననుసరించి ధర్మము ననుసరించి, యోగము ననుసరించి, సత్యము ననుసరించి, బలము ననుసరించి వీరందరి అధిపతియయిన సూర్యుఁడు కాంతిమంతముగా ప్రకాశించును. వీరందరు సూర్యుని యందు రెండేసి మాసము లుందురు. (29, 30)

ఋషయో దేవగంధర్వాః పన్నగాప్సరసాంగణః

గ్రామణ్యశ్చ తథా యక్షా యాతుధానాశ్చ ముఖ్యశః

ఏతే తపం వర్షంతీ భాంతి వాంతి సృజంతి చ

భూతానాం శుభం కర్మ వ్యపోహంతి ప్రకీర్తితః

మానవానాం శుభం హ్యేతే హరంతే దురితాత్మనామ్

దురితం సుప్రచారాణాం వ్యపోహంతి క్వచిత్ క్వచిత్

ఏతే సహైవ సూర్యేణ థమంతి దీవసానుగాః

వర్షంతశ్చ తపంతశ్చ హోదయంతశ్చ వై ప్రజాః

గోపాయంతి చ భూతాని సర్వాహామనుక్షయాత్

స్థానాభిమానినామేతత్ స్థానం మన్వంతరేషు వై

అతీతానాగతానాం చ వర్తంతే సాంప్రతం చ యే

ఏవం వసంతీ వై సూర్యే సప్తకాస్తే చతుర్దశ

చతుర్దశసు సర్వేషు గణా మన్వంతరేష్విహ

గ్రీష్మే చ వరాసు చ ముంచమానో ఘర్మం హిమం వర్షదినం నిశాం చ

గచ్ఛత్యసావృతువశాత్ పరివృత్తరశ్మిర్దేవాన్ ఫితరాంశ్చ మనుజాంశ్చ హి తర్పయన్వై

ప్రీణాతి దేవానమృతేన సూర్యః సోమం సుషుమేన చ వర్గయిత్వా

శుక్లే తు పూర్ణం దీవసక్రమేణ తం కృష్ణపక్షే విబుధాః పిబంతి

పీతం చ సోమం పాకలావశిష్టం కృష్ణక్షయే రశ్మిభిరక్షరంతం

సుధామృతం తర్పితరః పిబంతి దేవాశ్చ సౌమ్యాశ్చ తథైవ కావ్యాః

సూర్యేణ గోభిశ్చ సముజీతాభిరద్భిః పునశ్చైవ సముద్ధృతాభిః

వృష్ట్యాభివృద్ధాభిరదౌషధీభిర్మర్యాః క్షుధం త్వన్నపానైర్ణయంతీ

ఋషులు, దేవగంధర్వులు, పన్నగులు, అప్సరోగణము, గ్రామణులు, యక్షులు, ముఖ్యముగా యాతుధానులును వీరందరు తపించెదరు వర్షించెదరు; ప్రకాశించెదరు; వీచెదరు; సృజించెదరు,ప్రకీర్తింపఁబడి ప్రాణులయొక్క అశుభంకరమైన కర్మను తోలఁగగొట్టెదరు, (32) వీరు దురితాత్ముల యొక్క శుభ యోగమును తొలగించేడను. కొన్నీకోన్నీ చోట్ల వారు సుచరితుల యొక్క పాపములను తొలగింతురు. (33) దీవసానుగులై వీరందరు సూర్యునితోసహా భ్రమణము చేయుదురు. వారు ప్రజలపై వరింతురు, ఎండచే మార్చెదరు, మరల వారల నానందపరచదేరు. (34) మనువు క్షయించువరకు వారు సర్వభూత జాలములను రక్షించేదరు. మన్వంతరములందు కూడ భవిష్యత్తున భూతమున వర్తమానమున స్థానాభిమానులైన వారికిది (రవి) స్థానము. వీరు ఏడుగురు / ఏడుగురు చొప్పున పదునాలుగు వర్గముల సూర్యుని యందు పదునాలుగు మన్వంతరములందు నివసించెదరు. (36) సూర్యుఁడు గ్రీష్మమున ఉష్ణశక్తిని విమోచనము చేయును; వర్షకాలమున సూర్యుఁడు వర్షమును వెదజల్లును; ఆతఁడే పగళ్ళను రాత్రులను చేయునట్టివాఁడు; ఆతఁడు ఋతువుల ననుసరించి చుట్టుబడిన కిరణములు గలవాడై పయనించును. దేవతలను పితరులను, మానవులను తన కిరణముల ననుకూలముగా వహించి తృప్తి పరచును. (37) సూర్యుడు దేవతలను అమృతముచే చంద్రుని తృప్తి పరచును, సుషుమ్నా యనేడు కిరణములచే సూర్యుడు శుక్లపక్షములో చంద్రుని దీవసక్రముమన పూర్ణునిగా జేయును. ఆ చంద్రుని వృద్ధి చేయుట పున్నమి నాటికి పూర్తిచేయును. దేవతలు ఆయమృత చంద్రుని కృష్ణ పక్షమున దివసక్రమమున త్రాగుదురు. (38) చంద్రునీ యమృతము త్రాగబడిన వెనుక చంద్రుఁడు కృష్ణపక్షమున ఒక్కటి తక్క మిగిలిన కళలను పొగొట్టుకొనును. కృష్ణపక్షము పూర్తికాగా, చంద్రుఁడు తన శిష్ట కిరణము నుండి సుధామృతమును ప్రసరించును. దేవతలు, పితరులు, సౌమ్యులు, కావ్యులు, ఆ సోమామృతమును త్రాగుదురు. (39) ఇంక మానవులు, వర్షముచే నభివృద్ధి పరుపఁబడినట్టివి సూర్యునిచే సముద్ధృతములైనవియునగు ఓషధులచే అన్నపానములచే ఆకలిని జయించెదరు. (40)

తృప్తిశ్చ శుక్లే సుధయా సురాణాం పక్షే చ కృష్ణే సుధయా పితృణామ్

అన్నేన శశ్వచ్చ దధాతి మర్త్యా న్సూర్యస్తపంస్తాన్సుబిభర్తిగోభిః

హ్రియన్ హరిస్తిర్హరిభిస్తురంగమైర్హరత్యథాపః కీరథైర్హహరిద్భిః

విసర్గకాలే విసృజంశ్చతాః పునర్బిభర్త శశ్వత్సవితా చరాచరమ్

హరిర్హరీదిక్రియతే తురంగమైః పిబంతృథాపో హరిభిస్సహస్రధా

తతః ప్రముంచత్యపి తాస్త్వసా హరిః సమూహ్యమానో హరిభిస్తురంగమైః

ఇత్యేష ఏకచక్రేణ సూర్య స్తూర్ణరథోన తు

భద్రొసైరక్రమైరశ్వైః స్పందనే వైదికక్షయః

అహోరాత్రాద్రథేనాసాపేకచక్రేణ వై భ్రమస్

సప్తద్వీపసముద్రాంతాం సప్తభి స్సప్తభిర్హమైః

ఛందోభిరశ్వరూపై ఫైర్యతశ్చక్రం తతః స్థితైః

కామరూపైః సుకృద్యుక్తి: వామతసైర్మనోజవైః

హరితైరవ్యయైః పింగైరీశ్వర్బైహ్మవాదిభిః

త్ర్యశీలిమండలశతం భ్రమంత్యబేన తే హయాః

బాహ్యమాభ్యంతరం చైవ మండలం దివసక్రమత్

కల్పాదౌ సంప్రయుక్తాస్తే వహంత్యాభూతసంప్లవాత్

ఆవృత్తి వాలఖిల్యైస్తే భ్రమంతే రాత్ర్యహాని తు

వచోభిరర్యైర్గథితైః స్తూయమానో మహర్షిభిః

సేవ్యతే గీతనృత్యైశ్చ గంధర్వైశ్చాపురోగణైః

పతంగైః పతగైరశ్వైర్భమూణో దివస్పతిః

శుక్లపక్షమున దేవతలు సుధచే తృప్తి నొందుదురు. ఇంక పితృదేవతలు కృష్ణపక్షమున సుధచే తృప్తి నొందెదరు. సూర్యుఁడు ఎల్లప్పుడును మర్యులను అన్నముచే తృప్తి పరచును. తనకిరణములచే సూర్యుఁడు వారిని ఎండచే తపించి చక్కగా రక్షించును. (41) సూర్యుఁడు హరీ దశ్వములచే మోయబడును. తన హరిణ వర్ణకిరణములచే నీటిని (ఆవిరిగా) హరించును; నీటిని వదులు సమయమున నీటిని విసర్జించును. ఈ విధముగా చేతనాచేతనములయిన చరాచరమును సూర్యుఁడు భరించును. (42) పచ్చని గుఱ్ఱములచే సూర్యుఁడు మోయబడిపోవును. పచ్చని కిరణ సహస్రములచే సూర్యుఁడు నీటిని త్రాగును. హరిదశ్వములచే సముహ్యమానుఁడై తరువాత జలముల ప్రమోచనము చేయును. (43) ఇట్లు ఏకచక్రము గలిగీ తొందరగా పోవు రథముచే అన్ని దిక్కులందు సూర్యుండు సంచరించును. ఆ గుఱ్ఱములు భద్రములు (అపూర్వములైనవి). వానీ క్రమము ఆశ్చర్యకరము. (44) సూర్యుఁడు ఒకే చక్రము గల రథము మీఁద అహోరాత్రములు సప్తద్వీపసప్తసముద్రాంతమైన, సప్తహయములతో తిరుగును. (45) సూర్యరథము ఏడుగుఱ్ఱములచే పూంచబడినది. అయ్యవి వైదికమయిన ఛందోవిభాగములు అశ్వరూపములను ధరించినవి. చక్రమున్నచో నా గుఱ్ఱములు. అవి కామరూపులు. కోరిన రూపమును పొందును. మనోవేగములు. ఒక్కమారే రథమునకెడమ వైపున పూనబడినవి. (46) అయ్యవి హరిత వర్ణములు; అవి నాశములేనివి; ఈశ్వరములు పింగళవర్ణములు బ్రహ్మవాదులు వారీ ననుసరింతురు. ఒక సంవత్సర కాలములో 83 వందల మండల భ్రమణములఁజేయును. (47) ఆ గుర్రములు దివసక్రమమున బాహ్యాభ్యంతర మండలముల భ్రమించును. కల్పారంభమున నవి రథమునకు కట్టఁబడినవి. అవీ సర్వభూత ప్రళయము వఱకు ఆ రథమును వహించును. (48) రాత్రిళ్లు పగళ్లును నవి వాలఖిల్యులచే ఆవృత్తములై భ్రమించును; సూర్యుఁడు ఋషులచే కూర్చబడిన ఉత్తమ ప్రార్థన స్తోత్రములతో స్తుతిజేయబడును. (49) అట్లు పరిభ్రమించుచు సూర్యుడు గీతములచే నృత్యములచే గంధర్వులచే అప్సరసలచే, పతంగములచే పతగములచే సేవింపఁబడును. (50)

రథాస్త్రచక్రః సోమస్య కుదాభాస్తస్య వాజినః

వామదక్షిణతో యుక్తా దశ తేన చరంత్యసౌ

వీథ్యాశ్రయాణీ ఋక్షాణి ధ్రువాధారేణ వేగితాః

ప్రసవృద్ధి తథైవాస్య రశ్మీనాం సూర్యవతృతే

త్రిచక్షోభయతోఽశ్వశ్చ విజేయః శశినోరథః

అపాం గర్భాత్సముత్పన్నో రథః సాశ్వః ససారథిః

శతారైశ్చ త్రిభిశ్చకైర్యుక్తః శుక్లెర్షయోత్తమైః

దశభిస్తు కృశైర్దివ్యైరసంగ్రెసైర్మనోజవైః

సకృద్యుత్తే రథే యస్మిన్వహంతే చాయుగక్షయాత్

సంగృహీతరణే తస్మిన్ శ్వేతచక్షుఃశ్రవాశ్చ వై

అశ్వాసమేకవర్ణాస్తే వహంతే శంఖవర్చసః

యజుశ్చండమనాశ్చైవ వృషో వాజీ నరో హయః

అశ్వో గవిష్ణుర్విఖ్యాతో హంసో వ్యోమో మృగస్తథా

ఇత్యేతే నామభిస్సర్వే దశచంద్రమసో హయాః

ఏతే చంద్రమసం దైవం వహంతీ సహ దీక్షయా

దేవైః పరివృతః సోమః పితృభిశైవ గచ్ఛతి

సోమస్య శుక్లపక్షాదౌ భాస్కరే పరతః స్థిరే

ఆపూర్యతే పరస్యాంతే సతతం దివసక్రమాత్

దేవైః పీతతనుం సోమమాప్యాయయతి నిత్యదా

క్షీణం పంచదశాహం తు రశ్మినైకేన భాస్కరః

ఆపూరయన్ సుషుమ్నేన భాగం భాగమహః క్రమాత్

సుషుమ్ణాప్యాయమానస్య శుక్లా వర్థంతి వైకలాః

సోముని రథమునకు మూడు చక్రములు. ఆతని గుఱ్ఱములు కుందపుష్పనిభములు. అవి కుడి ఎడమల యందు పూంచబడినవి. వీని మూలముననే చంద్రుడు సంచరించును. (51) వీధ్యాశ్రయములయిన (ఆకాశ పథముననున్న) నక్షత్రములను దాటియని (గుఱ్ఱములు) పోవును. ధ్రువాధారముచే నవి రయమును గనును. చంద్రుని యొక్క కీరణముల యొక్క ప్రస్వత్వము వృద్ధిత్వము సూర్యుని కిరణముల వృద్ధి క్షయముల వంటివేయని యెఱుంగవలయును. (52) చంద్రుని రథమునకు ఇరుప్రక్కల గుట్టములతో మూడు చక్రములు. ఆ రథము. గుఱ్ఱములతో సారథితో కూడ అపాంగర్భము నుండి (నీటి గర్భము నుండి) ఉత్పన్నమయినది. (53) ఆ రథమునకు మూడు చక్రములు, ఒక వంద ఆకులు. ఆ రథమునకు ఉత్తములైనవి తెల్లనయినవియునగు పది గుఱ్ఱములు. పూంచబడినవి. ఆ గుఱ్ఱములు కృశీభూతములు (సన్ననైనవి) దివ్యములైనవి. అసంగములు మనోజవము గలవి. (54) అవి యొకే యొకసారి పూంచబడినను యుగక్షయము పర్యంతము దానిని వహించుచునే యుండును. ఆ చిన్ని రథము నందు (సంగృహీత రథమున తెల్లనీ సర్పములు రథమును చుట్టుకొని కలవు? సమాన వర్ణముగల అశ్వములు శంఖధవళములు చంద్రుని వహించును. యజుడు, చండమనసుడు, వృషుడు, వాజి, నరుఁడు, హయుఁడు, ప్రసిద్ధములయిన గవిష్ణుఁడు, హంసుఁడు, వ్యోముం డు, మృగుఁడు అను గుఱ్ఱములు పదీయు చంద్రుని గుఱ్ఱములు (57) ఈ గుఱ్ఱములు దైవమయుని చంద్రుని (శ్రద్దగా) భద్రముగా వహించును. సోముఁడు దేవతల చేతను పితరులచేతను పరీవృతుఁడై పోవును. (58) కృష్ణపక్షాంతమున, శుక్లపక్షారంభమున సూర్యుఁడు పరదిక్కులో (ఎదుటిదశలో) స్థిరముగా నుండ, చంద్రుఁడు దీవసక్రమమున నింపబడును. (59) దేవతలచే సోముని యొక్క శరీరము త్రాగబడగా పదునైదవ దినమున చంద్రుడు ఒకే యొక కళతో అలసిపోవును. సుషుమ్న అనెడు కిరణముచే చంద్రుని యొక భాగమును సూర్యుఁడు (కళతరువాత కళ) ప్రతిదినము నింపును. ఈ విధముగ సుషుమ్న మనెడు కిరణముచే ఆపూర్యమాణములై శుక్లకిరణములు వృద్ధినొందును. (61)

తస్మార్దసంతి వై కృష్ణే శుక్షే స్వాప్యాయయంతి తమ్

ఇత్యేవం సూర్య వీర్యేణ చంద్రశ్చాప్యాయతస్తతః

పౌర్థమాస్యాం సదృశ్యత శుక్ల సంపూర్ణమండలః

ఏవమాప్యాయితః సోమః శుక్లపక్షే దినక్రమాత్

తతో ద్వితీయా ప్రభృతి బహుళస్య చతుర్ధశీం

అపాం సారమయస్యేందో రసమాత్రాత్మకస్య తు

పిబంత్యంబుమయం దేవాః హృష్టాః సౌమ్యం స్వధామృతమ్

సంభృతం త్వర్ధమాసేన హ్యమృతం సూర్యతేజసా

భక్షార్థమమృతం సోమః పౌర్ణమాస్యాముపాసతే

ఏకాం రాత్రిం సురైస్సర్వేః పితృభిః సర్షిభిస్సహ

సోమస్య కృష్ణ పక్షాదౌ భాస్కరాభి ముఖస్య తు

ప్రక్షీయంతే పితృదేవైః పీయమానాః కళాః క్రమాత్

త్రయశ్చ త్రింశతశ్చైవ త్రయస్త్రింశతథైవ చ

త్రయశ్చ త్రీసహస్రాశ్చ దేవాః సోమం పిబంతి వై

ఇత్యేతైః పీయమానస్య కృష్ణా వర్థంతి వై కలాః

క్షీయంతి తస్మాచ్ఛుక్లాశ్చ కృష్ణా ఆప్యాయయంతి చ

ఏవం దినక్రమాత్ పీతే విబుదైస్తు నిశాకరే

పీత్వార్ధమాసం గచ్ఛంతీ చామావాస్యాం సురోత్తమాః

పితరశ్చోపతిష్ఠంతి హ్యమావాస్యాం నిశాకరం

తతః పంచదశే కాలే కించిచ్ఛిష్ట కలాత్మకే

అపరాహ్ణే పితృగణా జఘన్యం పర్యుపాసతే

పిబంతి ద్విలవం కాలం శిష్టాస్తస్య కలాస్తు యాః

కృష్ణ పక్షములో కళలు తగ్గుచువచ్చును. శుక్లపక్షములో కళలు వృద్ధి పొందును. సూర్యుని యొక్క వీర్యముచే, శక్తిచే, చంద్రుఁడీ విధముగా వృద్ధిపొందును. (62) పూర్ణిమనాడు చంద్రుఁడు కాంతిమంతముగా సంపూర్ణమండలమున కానబడును. శుక్లపక్షమున నీవిధముగా చంద్రుఁ డు దినదినము దినక్రమున వృద్ధి నందును. (63) కృష్ణపక్షమున విదియ నుండి చతుర్దశి వరకు దేవతలు జలసార మయిన చంద్రుని రసమయిన అమృతమును ఆస్వాదింతురు. ఆ పదార్థము రసాత్మకము. ద్రవరూపమయిన చంద్ర సంబంధీ అమృతమును సేవించుచు, దేవతలు సంతోషింతురు. సూర్యుని తేజస్సుచేతనే అమృతరసము (సుధామృతము) మాసార్దములో సంభృతమగును (కూటబెట్టఁబడినదగును). (65) చంద్రుని సుధారసము ఆ దేవతల ఆహారము. సర్వదేవతలు పితరులు సర్వఋషీశ్వరులతో ఒక్కరాత్రి పూర్ణిమ దీనమున దీనిని అనుభవింప సేవింతురు. (66) కృష్ణపక్షారంభమున క్రమముగా పితరులచే, దేవతలచే ఆస్వాదింపఁబడి సూర్యునికభిముఖముగా నున్న చంద్రుని యొక్క కళలు క్రమముగా ప్రక్షీణత్వము నొందును. (67) (ఇది స్పష్టముగా లేదు) ముప్పది ముగ్గురు, మూఁడు వందలు (?) మూగురు, మూడువేలు, మూగురు దేవతలు సోమరసమును త్రాగుదురు. (68) ఈ విధముగా త్రాగబడి కృష్ణపక్షపు కళలు శుక్లపక్షమున వృద్ధిపొందును. అందుచే శుక్లకళలు హెచ్చును. కృష్ణకళలు తగ్గును. (69) ఈ విధముగా చంద్రుడు ప్రతిదినము దేవతలచే త్రాగబడును. ఒక మాసార్థ మీంవిధముగా ఆస్వాదించిన తరువాత దేవతోత్తములు అమావాస్యనాడు వెడలిపోవుదురు. తరువాత పితరులు అమావాస్యనాఁడు చంద్రుని చేరెదరు. అప్పుడు పదియైదవ రోజున, కొద్దిగా కళలు మిగులగా పితృదేవతలు మిగిలిన ఆ శేషమును అపరాష్ట్రమున పొందుదురు. ద్వీలవకాలము (శిష్టమును) శిష్టములయిన చంద్ర కళలను పితృగణములు త్రాగుదురు.

నిఃసృతం తదమావాస్యాం గభస్థిభ్యః స్వధామృతమ్

తాం స్వధాం మాసతృష్యై చ పీతా గచ్ఛంతి తేఽమృతమ్

సూర్యస్తస్మిన్ సుషుమై యస్తాపితస్తేన చంద్రమాః

కృష్ణపక్షే సురైస్తద్వత్ పీయతే వై సుధామయః

సౌమ్యా ఐరీషదశైవ అగ్నిష్వాతాశ్చ తే త్రిధా

కావ్యశ్చైవ తు యే ప్రోక్తాః పితరః సర్వ ఏవ తే

సంవత్సరాస్తు వై కావ్యాః పంచాబా యే ద్విజైః స్మృతాః

సౌమ్యాస్తు ఋతవోజేయాః మాసా బరీషదః స్మృతాః

అగ్నిష్వాతార్తవాశ్చైవ పితృసర్గా హి వై ద్వీజాః

పితృభిః పీయమానస్య పంచదశ్యాం కలా తు వై

యావత్పక్షీయతే తస్య భాగః పంచదశస్తు యః

అమావాస్యాం తదా తస్య తత ఆపూర్యతే పరః

వృద్దిక్షణా వై పక్షాదౌ షోడస్యాం శశినః స్మృతాః

ఏవం సూర్యనిమిత్తేష క్షయో వృద్ధిరీశాకరే

తారాగ్రహాణాం వక్ష్యామి స్వర్భానోశ్చ రథాన్ పునః

తోయతేజోమయః శుభ్రః సోమపుత్రస్య వై రథః

సోపాసంగపతాకస్తు సధ్వజో మేఘనీస్స్వనః

భార్గవస్య రథః శ్రీమాంస్తేజసా సూర్యసన్నిభః

పృథివీసంభవైర్యుత్తో నానావర్ణర్షయోత్తమైః

శ్వేతః పిశంగః సారంగో నీలః పీతో విలోహితః

కృష్ణశ్చ హరితశ్చైవ పృషతః పృశ్నిరేవ చ

దశభిసైర్మహాభాగైరకృతైర్వాతరంహసైః

స్వధామృతము అమావాస్యనాఁడు సూర్యుని కిరణముల నుండి స్రవించును. ఆ సుధను తృప్తిగా ఒక మాసము రోజుల త్రాగి పితరులు వెళ్లిపోవుదురు. (73) సుషుమ్న యందు ప్రత్యక్షమయిన ఎండచే చంద్రుఁడు తపింపఁబడును. ఆ విధముగనే కృష్ణపక్షమున చంద్రుని సుధామృతమును సురలు త్రాగుదురు. (74) మూడు విధములయిన పితరులు సౌమ్యులు, బర్హిషదులు, అగ్నిష్వాత్తులు అని కలరు. కావ్యులని యేవరెవరు పిలువం బడిరో వారందరును పితరులే. (75) కావ్యులు సంవత్సరులు; వారే బ్రాహ్మణులచే ‘పంచాబులు’ అని స్మరింపఁబడుదురు. సౌమ్యులను ఋతువులనుగాను, బారిషదులను మాసములుగాను నేఱుంగవలయును. (76) ఓ బ్రాహ్మణులారా ! అగ్నీష్వాత్తులు ఆర్తవులు, వీరు పితృదేవతల సృష్టి. పితరులచే త్రాగబడి, పదీయైదవరోజున, పదునైదవ భాగమయిన చంద్రుని యొక్క కళ, అమావాస్యనాడు తగ్గిపోవును. మరల వచ్చెడు పక్షమున నయ్యది పరిపూర్ణమగును. (78) చంద్రునియొక్క వృద్ధి, క్షయము, పదీయారవ రోజున, పక్షపు ఆరంభముగా గణింతురు. ఈ విధముగా చంద్రుని యందు వృద్ధిక్షయములు సూర్యుని వలనఁగలుగును. (79) ఇక ముందు మరల తారల యొక్క గ్రహముల యొక్క రాహువు యొక్క రథములను వర్ణించెదను. చంద్రుని కుమారుఁడయిన బుధుని రథము తోయము యొక్క తేజస్సుతో కూడినది. ప్రకాశవంతమయినది. (80) భార్గవుని రథము శ్రీమంతము, తేజస్సుతో సూర్యసన్నిభము దానికి మేఘము యొక్క నిస్స్వనము కలదు. దానికొక పతాకము కలదు. ధ్వజము కలదు. ఇతరములయిన పరికరములును కలవు. (81) అయ్యదీ భూమినుండి సంభవములయిన వివిధములయిన వర్ణములతో నొప్పిన గుఱ్ఱములచే పూంచబడినది. దానికీక్రింది పది గుఱ్ఱములు యుక్తములయినవి - శ్వేతవర్ణమయినవి, పిశంగవర్ణము, సారంగవర్ణము, నీలవర్ణము, పీతవర్ణము, విలోహితవర్ణము, కృష్ణవర్ణము, హరితవర్ణము, పృషతవర్ణము, ప్రశ్నివర్ణము. ఆ గుఱ్ఱములు పది, మహాభాగ్యము (అందమైనవి కళ్యాణ లక్షణకలితములు; కృశీభూతములు (చురుకైనవి) (చిక్కినవి కావు); వానికి వాయుజవము గలదు. (83)

అష్టాశ్వః కాంచనః శ్రీమాన్ భౌమస్యాపి రథోత్తమః

అసంగైర్లోహితైరశ్వైః సర్వగైరగ్నిసంభవైః

ప్రసర్పతి కుమార్ వై ఋజువక్రానువక్రగైః

తతశ్చాంగీరసో విద్వాన్ దేవాచార్యో బృహస్పతిః

గౌరైరశ్వైః కాంచనేన స్యందనేన ప్రసర్పతి

అఙ్ఞాస్తు పాజిభిర్దివ్యైరష్టభిర్వాతరంహసైః

నక్షత్రే బ్దం స తిష్ఠన్ వై సంవేధిస్తేన గచ్ఛతి

తతః శనైశ్చరోఽప్యశ్వైః సబలైర్వ్యోమసంభవైః

కారణైయసం సమారుహ్య స్యందనం యాతి వై శనైః

స్వర్భానోశ్చ తధైవాశ్వాః కృష్ణా హ్యషో మనోజవాః

రథం తమోమయం తస్య సకృద్యుక్తా వహంత్యుత

ఆదిత్యాన్నిసుతో రాహుః సోమం గచ్చతి పర్వసు

ఆదిత్యమేతి సోమశ్చ పునః సౌరేషు పర్వసు

అథకేతురథస్యాశా అజ్ఞో వై వాతరంహసః

పలాలధూమవర్ణాభాస్పబలా రాసభారుణాః

ఏతే వాహా గ్రహాణాం చ హ్యుపాఖ్యాతా రథైః సహ

సర్వే ధ్రువనిబద్ధాస్తే ప్రవృద్ధా వాతరశ్మిభిః

తపంతే భ్రామ్యమాణాస్తు యథాయోగం భ్రమంతి వై

వాయప్యాభిరదృశ్యాలీః ప్రవృద్ధా వాతరశ్మిభిః

పరీభ్రమంతి తద్భద్ధాంశ్చంద్రసూర్యగ్రహా దివి

భ్రమంతమనుగచ్ఛంతి ధ్రువం తే జ్యోతిషాం గణాః

యథా నద్యుదకే నౌస్తు సలిలేన సహోహ్యతే

కుజుని (భౌముని) యొక్క రథము ఉత్తమమయినది. శ్రీమంతము బంగారుతో జేయబడినది. దానికి అష్టాశ్వములు. అవి సర్వత్ర నిరాఘాటముగ పోగలిగినవియు, అగ్ని సంభవములయినవియు, లోహిత వర్ణములు గలిగినవియునగు కుజుని గుఱ్ఱములు. (వాని రథమున) కుజుఁడు సంచరించును. ఆ గుఱ్ఱములకు ఋజుమార్గముతో సహా వక్రగతి, అనువక్రగతీ (సవ్యము, అపసవ్యములగు గతులు) కలిగినవి. ఆంగిరస వంశమునకు చెందిన బృహస్పతి, విద్వాంసుఁడైన దేవతాచార్యుండు. అంబువుల నుండి పుట్టిన ఎనిమిది దివ్యములయిన గుఱ్ఱములు పూంచబడిన కాంచన స్యందనములో సంచరించును. ఆ గుఱ్ఱములు దీవ్యాశ్వములు, పానికీ వాయువు యొక్క జవము కలదు. ఒక సంవత్సరము నక్షత్రకూటమున నుండి సంవేధయై యా రథముతో ముందునకు సాగిపోవును. (?) (84,86) శని, నల్లని, కార్షాయసముతో (ఇనుముతో) చేయబడిన స్యందనము నధిరోహించి, సంచరించును; ఆ కాలాయస రథమునకు ఆకాశము నుండి పుట్టిన బలీయములయిన గుఱ్ఱములు కలవు. రాహువు యొక్క రథమునకు ఎనిమిది నల్లనైన రంగు కలిగిన గుఱ్ఱములు. అవి మనోజవము కలిగినవి. రాహువు యొక్క రథము తమోమయము. ఆ రథమునకు ఒకేసారి గుఱ్ఱములు కట్టఁబడినవి. ఆ గుఱ్ఱములే చివరి వరకు రథమును వహించును, సూర్యుని నుండి నిస్సృతుఁడై రాహువు పర్వములందు (అమావాస్యా పూర్ణిమల యందు) చంద్రుని కడకుపోవును. చంద్రుడు సారపర్వములయిన యమావాస్యలందు సూర్యునిజేరును. (సూర్యేందుసంగమము అమావాస్య). (89) కేతువు యొక్క రథమునకు ఎనిమిది గుఱ్ఱములు, వానీకి వాయువు యొక్క జవము కలదు. వాని వర్ణము పలాల ధూమ వర్ణము (గడ్డిపొగరంగు). అవి చాల బలవంతములు. అవీ గాడిదవలే ఈషదరుణవర్ణములు. ఈ విధముగా గ్రహముల యొక్క వాహనములు రథములతో సహా వర్ణింపఁబడినవి. (91) ఇవియన్నియును ధ్రువునికీ వాయురశ్ములతో కట్టం బడినవి. అవి సమగ్రముగా ప్రవృద్దములు. భ్రమణములాచరించుచునవి ఇవి ప్రజ్వలముగ భాసించును. అవి స్వయోగానుకూలముగ తిరుగును. (92) కనబడని వాయుకిరణములచే అవి చక్కగా వృద్ధిపొందినవి. వీనిచే ధ్రువునకు కట్టబడి చంద్రుఁడు సూర్యుఁడు, గ్రహములు ఆకాశమున సంచరించును. (పునరుక్తి) (93)

తథా దేవాలయా హ్యేతే ఉహ్యంతే వాతరశ్మిభిః

సర్పమాణా న దృశ్యంతే వ్యోమ్ని దేవగణాస్తు తే

యావత్యశ్చైవ తారాశ్చ తావంతో వాతరశ్మయః

సర్వా ధ్రువే నిబద్దాశ్చ క్రమంత్యో భామయంతి తాః

తైలపీడా యథా చక్రం భ్రమంతో భ్రమయంతి హ

తథా భ్రమంతి జ్యోతీం వాతబద్ధాని సర్వశః

అలాతచక్రవద్యోంతి వాత చక్రేరితాని తు

తతో జ్యోతీంషి వహతే ప్రవహస్తేన స స్మృతః

ఏవం ధ్రువనిబద్ధోఽసౌ సర్పతే జ్యోతిషాం గణః

సైష తారామయో జేయః శిశుమారో ధ్రువో దివి

యదహ్నా కురుతే పాపం దృష్ట్వా తన్నిళీ ముంచతే

యావత్యశ్చైవ తారాస్తాః శిశుమారాశ్రితా దీవీ

తావంత్యేవ తు వరాణి జీవతాభ్యధికాని తు

సాకారః శిశుమారశ్చ విజేయః ప్రవిభాగశః

ఔత్తానపాదస్తస్యాథ విషైయో హ్యుత్తరో హనుః

యజ్ఞః పరస్తు విశ్లేమో ధర్మో మూర్ధానమాశ్రితః

హృది నారాయణ సాధ్యో హ్యశ్వినౌ పూర్వపాదయోః

వరుణశ్చార్యమాశ్చైవ పశ్చిమే తస్య సర్దినీ

శిశ్నం సంవత్సరస్తస్య మీత్రోఽపానం సమాశ్రితః

పుచ్ఛేఽగ్నిశ్చ మహేంద్రశ్చ మారీచః కశ్యపో ధ్రువః

జ్యోతిర్గణములు భ్రమించు ధ్రువుని అనుసరించి తీరుగును. నదిలో నదీ వేగముతో పడవ నీటిచే తీసికోని పోబడినట్లు ఈ దేవతా స్థానములు (గ్రహములు) వాయు కిరణములచే తీసికొని పోవంబడును. ఆకాశమున సంచరించు నీ గ్రహములు అగుపించవు. (95) నక్షత్రములున్నంత విరివిగా (అధికముగా) వాయు పాశములు కలవు, అవియన్నియును ధ్రువునికే అనుబంధింపఁబడినవి. ఆ గ్రహములు తాము తిరుగును. ఇతరములయిన వానిని కూడ భ్రమింపఁజేయును. (96) నూనెగానుగ యొక్క చక్రము తాను తిరుగుచు లోని వస్తువులను ఎట్లు తిరుగఁజేయునో, ఆ విధముగనే ధ్రువునకు కట్టఁబడిన జ్యోతిర్గణము అన్నివైపుల వాయురశ్ములచే ధ్రువునకు కట్టబడి సర్వత్ర తిరుగును. (97) ఆ జ్యోతిర్గణము ఆలాత చక్రమువలె (నిప్పువలయమువలె) వాత చక్రముచే ప్రేరేపింపఁబడి, తిరుగును. వాయువు జ్యోతిర్గణము వహించెడి కారణమున నా వాయువునకు ‘ప్రవహ’ మని పేరు. (98) ఈ విధముగా ధ్రువునకు సంబద్దమయిన జ్యోతిర్గణము సంచరించును. శిశుమారము ధ్రువుఁడు - అదీతారామయమని యెఱుంగవలయును. పగలు ఆచరింపఁబడిన పాపము, రాత్రియందు ధ్రువుని చూచిన పోవును. ఆతఁడు ఆకాశమున ఎంతకాలము నక్షత్రములు శిశుమారముచే ఆశ్రితములై యుండునో అంతకాలము జీవించును.(100) ఆకాశము నందలి శిశుమారము దానీ భాగములతో నెఱుంగవలయును. (శిశుమారము యొక్క అంగాంగ విభాగము తరువాత వర్ణింపఁబడినది). (101) (ధ్రువుడు ఉత్తానపాదుని కుమారుఁడు.) ఔత్తానపాదుండా శిశుమారము యొక్క ఉత్తరహనువుగా నెఱుంగ వలయును. ‘యజ్ఞ’ము రెండవహనువుగా దేలియవలయును. ధర్మము దాని మూర్గమును ఆశ్రయించియున్నది. నారాయణుఁడు హృదయమున వెదికి తెలిసికొనవలెను. (సాధ్యః) అశ్వనీద్వయము ముంగాళ్లతో సాధ్యులు (తెలియగలవారు). వరుణుండు అర్యముఁడు ఆ శిశుమారము యొక్క పశ్చిమ స్థలము (వెనుక భాగపు తోడలు). దాని శిశ్నము (పెరిస్) సంవత్సరము, మిత్రుండు అపావము నాశ్రయించియుండును. మహేంద్రుఁడు మారీచుఁడు, కశ్యపుఁడు, ధ్రువుఁడు, పుచ్ఛభాగమున నుందురు. (104)

తారకాః శిశుమారస్య నాస్త్రం యాంతి చతుష్టయమ్

నక్షత్రచంద్రసూర్యాశ్చ గ్రహాస్తారాగణైః సహ

ఉన్ముఖా ఏముఖాః సర్వే వక్రీభూతాః శ్రీతా దీవి

ధ్రువేణాధిష్ఠితాశ్చైవ ధ్రువమేవ ప్రదక్షిణమ్

పరియాంతీశ్వరశ్రేష్ఠం మేధీభూతం ధ్రువం దివి

అగ్నీంద్రకశ్యపానాం తు చరమోఽసౌ ధ్రువః స్మృతః

ఏక ఏవ భ్రమత్యేష మేరుపర్వతమూర్ధని

జ్యోతిషాం చక్రమేతద్ధి గదా కర్షన్నవాఙ్ముఖః

మేరు మాలోకయత్యేష పర్యంతే హి ప్రదక్షిణమ్

ఇతి శ్రీ బ్రహ్మాండమహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయేనుషంగపాదే ధ్రువచర్చాకీర్తనం నామ త్రయోవింశతి తమోఽధ్యాయః

శిశుమారము (నక్షత్రచక్రము) (పాలపుంత? మిల్కీవే)? శిశుమారము నందలి నాలుగు నక్షత్రములు ఎన్నడును అస్తమింపవు. నక్షత్రములు,చంద్రుఁడు, సూర్యుఁడు, గ్రహములు, తారాగణములతో సహా కొన్ని ఉన్ముఖములుగను, కొన్ని పరాజ్ముఖములగును, ఇతరములు వక్రీభూతముఖములును ప్రక్కకు త్రిప్పిన ముఖములు గల వానిగను). అన్నియు వక్రీభూత ముఖముగను, ఆకాశమున స్థాపింపఁబడినవి. అవియన్నియు ధ్రువునిచే నధిష్ఠితములు. అయ్యవి ధ్రువునే ప్రదక్షిణము చేయును. (106) ధ్రువుఁడు ఆకాశమున కేంద్ర స్థానము, ఆతఁడే శ్రేష్ఠుడయిన పరమేశ్వరుఁడు ధ్రువుని, అగ్నీ, ఇంద్రుఁడు, కశ్యపుఁడు వీరి మువ్వురీ తరువాత నాలుగవ వానినిగా (తుదివానిగా) స్మరింతురు. (107) మేరు పర్వత శిఖరమున ధ్రువుఁడు) ఆతఁడొక్కడే భ్రమించును. ఒంటిచేతి మీఁద ఆతఁడు జ్యోతిశ్చక్రము నంతటిని అధోముఖులుగా చేసి తీరుగును. మేరువు సాతఁడు హద్దుగో చివర (పరిమితీగా) గమనించి, దాని చుట్టును పరిభ్రమించును. (ప్రదక్షిణము) చేయును. (ఈ వర్ణనము ఇంత స్పష్టముగా లేదు. జాగ్రత్తగా శ్రమపడి పెద్దల నడిగి తెలిసికొనిసంత పట్టు మూలానుగుణముగా వ్రాసితిని).

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండపురాణమందలి పూర్వభాగమందు, ద్వితీయానుషంగపాదమున ధ్రువచరిత్ర కీర్తనమను ముప్పదిమూడవ యధ్యాయము.