బ్రహ్మాండ మహా పురాణము
65 - సోమసౌమ్యుల జనన వృత్తాంతము
సూత ఉవాచ :-
పితా సోమస్య వై విప్రా జజ్ఞేఽత్రి భగవానృషిః ।
తత్రాత్రిః సర్వలోకానాం తస్థౌ స్వేనౌజసా వృతః ॥
కర్మణా మనసా వాచా శుభాన్యేవ సమాచరన్ ।
కాష్ఠకుడ్యశిలాభూత ఊర్ధ్వ బాహుర్మహాద్యుతిః ॥
సుదుశ్చరం నామ తపో యేన తప్తం మహత్పురా ।
త్రీణివర్షసహస్రాణి దివ్యా నీ తి హి నః శ్రుతమ్ ॥
తస్యోర్ధ్వరేతసస్తత్ర స్థితస్యానిమిషస్య హ ।
సోమత్వం తనురాపేదే మహాబుద్ధిః స వై ద్విజః ॥
ఊర్ధ్వమాచక్రమే తస్య సోమత్వం భావితాత్మనః ।
నేత్రాభ్యామప్రవత్సోమో దశధా ద్యోతయన్ దీశః ॥
తం గర్భం విధినా హృష్టా దశ దేవ్యో దధుస్తదా ।
సమేత్య ధారయామాసుర్న చ తాః సమశక్నువన్ ॥
స తాభ్యః సహసైవాథ దిగ్భ్యో గర్భః ప్రసాదితః ।
పపాత భాసయన్ లోకాఞ్చీతాంశుః సర్వభావనః ॥
యదా న ధారణే శక్తాస్తస్య గర్భస్య తాః స్త్రియః ।
తతః సహాభిః శీతాంశుర్నిషపాత వసుంధరామ్ ॥
పతంతం సోమమాలోక్య బ్రహ్మా లోకపితామహః ।
రథమరోపయామాస లోకానాం హితకామ్యయా ॥
స హి వేదమయో విప్రా ధర్మాత్మా సత్యసంగరః ।
యుక్తే వాజిసహస్రేణ రథే ధ్యాస్తేతి నః శ్రుతమ్ ॥
తస్మిన్ నిపతితే దేవాః పుత్రేఽత్రేః పరమాత్మనః ।
తుష్టువురర్బ్రహ్మణః పుత్రా మానసాః సప్త విశ్రుతాః ॥
తతైవాంగిరసాస్తస్య భృగోతైవాత్మజాస్తథా ।
ఋగ్బిర్యజుర్భీర్బహుభిరథర్వాంగిరసైరపి ॥
సోముఁడు = చంద్రుఁడు; సౌమ్యుఁడు = చంద్రుని కుమారుఁడు బుధుఁడు. సూతుఁడిట్లు చెప్పెను. ఓ విప్రులారా ! భగవానుఁడగు అత్రి మహర్షి చంద్రునికి తండ్రి యయ్యెను. స్వతేజఃపరీవృతుఁడై అత్రి సర్వలోకములకు కాంతిమంతుఁడై యుండెను. ఆతఁడు కర్మచే మనస్సుచే వాక్కుచే శుభకార్యములనే చేసెను. ఆతఁడూర్ధ్వబాహుడై కాష్ఠము వలె కుడ్యమువలె మహాశీలవలె స్థిరముగ నుండెను, (2) ఆతఁడు మూఁడు వేల సంవత్సరములు దుశ్చరమైన మహాతపస్సును చేసెననీ దేవతల వలన మేము వింటిమి. ఆ బ్రాహ్మణుడు మహాబుద్దిమంతుఁడు. ఊర్ట రేతస్కుడై కంటిరెప్పలు వేయకయే తపస్సాచరించెను. ఆతని శరీరము సోముని స్థితిని (సోమత్వమును) పొందినది. [4) పవిత్రీకృతాత్ముడైన ఆ ఋషి సోముని స్థితిలో ఆకాశ స్థితి నొందెను. (5) పది విధముల దిక్కులను ప్రకాశింపఁజేయుచు సోముఁడు తన నేత్ర ద్వయము నుండి స్రవించెను. దశదిక్కులను స్త్రీలు వీధిచే సంతుష్టులై ఆతని గర్భ ఏండమును ధరించిరీ వారందరు కూడి ఆ గర్భమును ధరింప సమర్ధురాండ్రు కాలేకపోయిరి. ఆ సోముని గర్భమును ధరించిన దశదిగ్వనితలు భరింపలేక దిక్కులను ప్రకాశింపఁజేయుచు పడిపోయిరి. సర్వభావనుఁడయిన శీతాంశుండు లోకములను ప్రకాశింపఁజేసెను. ఆ దిగ్వనీతలు. పదిమంది సోమ గర్భమును భరింపజాలనప్పుడు సోముఁడు వారందరితో భూమియందు పడెను. (8) లోకపితామహుఁడయిన బ్రహ్మ పడుచున్న సోముని చూచీ, లోకములకు హితమాచరించుకోరికతో, ఆ సోముని, రథము నందారోహించెను. (9) ఓ బ్రాహ్మణులారా ! ఆతఁడు ధర్మాత్ముఁడనీ సత్యసంగరుఁడని వాజిసహస్రయుత రథముపై నధివసించేనని మేము వింటిమి. పరమాత్ముఁడైన అత్రీకుమారుఁడు పృథ్విపై పడగా, బ్రహ్మ మానసపుత్రులయిన ఏడుగురు విఖ్యాతులు, ఆంగీరసులు, భృగుని ఆత్మజులు, ఆతనినీ అనేకములయిన ఋక్కులతో, యజుస్సులతో, ఆధర్వణ సూక్తములతో ఆంగీరస మంత్రములతో స్తోత్రము చేసిరి.
తతః సంస్తూయమానస్య తేజః సోమస్య భాస్వతః ।
ఆప్యాయమానం లోకాంస్త్రీన్ భావయామాస సర్వశః ॥
స తేన రథముఖ్యేన సాగరాంతాం వసుంధరామ్ ।
త్రీః సప్తకృత్వోఽతిశయాశ్చకారాభిప్రదక్షిణమ్ ॥
తస్య యద్వర్ధితం తేజః పృథివీమన్వపద్యత ।
ఓషధ్యస్తాః సముద్భూతాస్తేజసా ఖం జ్వలత్యుత ॥
తాభిః పుణ్యాత్యయం లోకాన్ ప్రజాశ్చాపి చతుర్విధాః ।
పోష్టా హి భగవాన్ సోమో జగతో హి ద్విజోత్తమాః ॥
స లబ్ధతేజాస్తపసా సంస్తవైసైః స్వకర్మభిః ।
తపస్తేపే మహాభాగః సమానాం నవతీర్ధశ ॥
హిరణ్యవర్ణా యా దేవ్యో ధారయంత్యాత్మనా జగత్ ।
విభుస్తాసాం ముదా సోమః ప్రఖ్యాతః స్వేన కర్మణి ॥
తతస్తస్మై దదౌ రాజ్యం బ్రహ్మా బ్రహ్మవిదాం వరః ।
బీజౌషధీనాం విప్రాణామపాం చ ద్విజసత్తమాః ॥
సోఽభిషిక్తో మహాతేజా మహారాజ్యేన రాజరాట్ ।
లోకాన్వై భావయామాస తేజస్వీ తపతాం వరః ॥
సప్తవింశతీరిందోస్తు దాక్షాయణ్యో మహావ్రతాః ।
దదౌ ప్రాచేతసో దక్షో నక్షత్రాణీతి యా విదుః ॥
సతత్ప్రాప్య మహద్రాజ్యం సోమః సోమవతాం ప్రభుః ।
సమారేభే రాజసూయం సహస్రశతదక్షిణమ్ ॥
హిరణ్యగర్భశ్చోద్గాతా బ్రహ్మా బ్రహ్మత్వమీయివాన్ ।
సదస్యస్తత్ర భగవాన్హరిర్నారాయణః ప్రభుః ॥
సనత్కుమారప్రముఖే రాద్యైరహ్మర్షిఖిర్వృతః ॥
దక్షిణామదదాత్సోమస్త్రీం
ల్లోకానితి నః శ్రుతమ్ ।
తేభ్యో బ్రహ్మర్షిముఖ్యేభ్యః సదసేభ్యశ్చ వై ద్విజాః ॥
సంస్తూయమానమయిన సోముని యొక్క భాస్వంతము ఆప్యాయమునైన తేజము లోకమున సర్వత్ర సంభావింపఁబడెను. తన్ముఖ్య రథముతో నతడు (సోముఁడు) సాగరాంతమయిన భూమీ నంతటినీ ఇరువదియొక్క మారు అతిశయముగా ప్రదక్షిణ మొనర్చెను. (14) వర్ణితమయిన యాతనీ తేజస్సు. భూమీనంతటినీ చేరెను. అదియే ఓషధి మూలికలను సృజించెను. ఆతని తేజస్సుతో ఆకాశమండల మంతయు కాంతిమంతమయ్యెను. అతడీ పుణ్యము యొక్క యతీశయముతో లోకము లన్నింటిని, చతుర్విధప్రజలను పోషించెను. ఓ బ్రాహ్మణులారా! సోముఁడే నిజముగా ఈ సర్వజగత్తునకు పోషకుండు. (16) ఆతఁడు శ్లాఘ్యములయిన స్వ కర్మలచేతను, నూరు సంవత్సరములు తపస్సు చేసెను. అందుచే నధికమయిన ద్యుతి నితఁడు పొందెను. (17) సోముఁడు స్వకర్మచే భూమిని (జగతిని) భరించు హిరణ్య వర్ణము గల యాదేవతా స్త్రీల ఆనందముచే ప్రఖ్యాతుఁడయ్యెను. (18) అంత బ్రహ్మవిదాంవరుఁడైన బ్రహ్మ ఆతనికి బీజముల యొక్క ఓషధులయొక్క జలములయొక్క సామ్రాజ్యమునాతని కొసంగేను. మహాతేజస్వియైన సోముఁడు మహారాజ్యమున రాజరాట్టుగా నభిషిక్తుఁడై, తేజస్వియు తపతాం వరుఁడు నైన సోముఁడు లోకములనన్నింటిని తన రాజ్యముచే స్వతేజస్సుచే పవిత్రీకరించెను. (20) ప్రాచేతసునీ కుమారుఁడయిన దక్షుండు చంద్రునకు (సోమునికి) దాక్షాయణులనీ పిలువఁబడు తన ఇరువదియేడుగురు కన్యలను వివాహములో నొసంగేను. (వారే నక్షత్రములు). మహారాజ్యము, సోమము కలిగిన వారిలో ప్రభుడయిన సోముఁడు సహస్రశత దక్షిణలతోడి రాజసూయమును సలుప నారంభించెను. హిరణ్య గర్భుఁడు ఆ యజ్ఞమునకు ఉద్దాత (మంత్రముల గానము చేయువాఁడు). ఇంక భగవంతుఁడయిన బ్రహ్మ యజ్ఞమునకు బ్రహ్మ స్థానమును వహించెను. ఇంక సదస్యుడు భగవాన్ హరీ నారాయణుఁడు, ఆతడు సనత్కుమార ప్రముఖ బ్రహ్మరులచే పరివృతుఁడు. సనత్కుమారుఁడు మొదటివాఁడు. సోముఁడు లోకత్రయ ధనమును దక్షిణగా నొసంగెననీ మేము ఏంటిమి. ఆ సదస్సులలో బ్రహ్మరులు కూడనుండిరి.
తం సినీ చ కుహూశ్చైవ వపుః పుష్టిః ప్రభావసుః ।
కీర్తిర్ధృతిశ్చ లక్ష్మీశ్చ నవ దేవ్యః సిషేవిరే ॥
ప్రాప్యావభృథమవ్యగ్రః సర్వదేవర్షిపూజితః ।
అతిరేజే హి రాజేంద్రో దశధా భాసయన్ దిశః ॥
తస్య తత్రాప్య దుష్ప్రాపమైశ్వర్యమృషిసంస్తుతమ్ ।
విబభ్రామ మతిర్విప్రా వినయాదనయావృతా ॥
బృహస్పతేః స వై భార్యాం తారాం నామ యశస్వినీం ।
జహార సహసా సర్వానవమత్యాంగిరఃసుతాన్ ॥
స యాచ్యమానో దేవైశ్చ తథా దేవర్షిభిశ్చ హ ।
నైవ వ్యసర్జయత్తారాం తస్మా అంగిరసే తదా ॥
ఉశనాస్తస్య జగ్రాహ పార్ణ్నిమంగిరసో భవః ।
స హి శిష్యో మహాతేజాః పితుః పూర్వం బృహస్పతేః ॥
తేన స్నేహేన భగవాన్ రుద్రస్తస్య బృహస్పతేః ।
పార్ణ్నిగ్రాహోఽ భవద్దేవః ప్రగృహ్యాజగవం ధనుః ॥
తేన బ్రహ్మశిరో నామ పరమాస్త్రం మహాత్మనా ।
ఉద్దేశ్య దేవానుత్సృష్టం యేనైషాం నాశితం యశః॥
తత్ర తద్యుద్దమభవత్ప్రఖ్యాతం తారకామయమ్ ।
దేవానాం దానవానాం చ లోకక్షయకరం మహత్ ॥
తత్ర శిష్టాస్తు యే దేవాస్తుషితాశ్చైవ తే స్మృతాః ।
బ్రహ్మాణం శరణ్యం జగ్మురాదిదేవం పితామహమ్ ॥
తతో నివార్యోతనసం రుద్రం జ్యేష్టం చ శంకరమ్ ।
దదావాంగిరసే పోరాం స్వయమేత్య పితామహః ॥
అంతర్వత్నీం చ తాం దృష్ట్వా తారాం తారాధిపాననామ్ ।
గర్భముత్సృజ సద్యస్త్వం విప్రః ప్రాహ బృహస్పతిః ॥
మదీయాయాం నతే యోనౌ గర్భో ధార్యః కథంచన ।
అథో తారాఽ సృజద్గర్భం జ్వలంతమివ పావకమ్ ॥
సినీ, కుహు, వపువు, పుష్టి, ప్రభా, వసు, కీర్తి, ధృతి, లక్ష్మీ యను తొమ్మండుగురు దేవులతనిని సేవించిరి. (26) అవ్యగుఁడై, సర్వ దేవర్షిపూజితుఁడై, యజ్ఞాంతమున నాచరించు అవభృదము నతఁడు చేసి, పది దీక్కులను భాసింపఁజేయుచు. సోముఁడు మిక్కిలిగా ప్రకాశించెను. (27) ఋషులచే సంస్తుతి పొందుటకు కష్టతమమైన టైశ్వర్యమును సోముఁడు పొందెను. ఆతని మనస్సు అవినయము, అనయముతో గూడినదై భ్రమించెను. అందుచే నతని మనస్సు నీతి పథమునుండి ధర్మమునుండి తొలగెను. (28) ఆంగిరసుని యొక్క కుమారులనందరను నిర్లక్ష్యము చేసి (తిరస్కరించి) సోముఁడు తార యను యశస్వినియైన బృహస్పతియొక్క భార్యనెత్తుకొని పోయెను. ఆతఁడు దేవతలు దేవర్పులు బ్రతిమాలుకొన్నను ఆంగీరసునకై, తారసు వీడువలేదు. ఉశనసుఁడు (శుక్రుఁడు? సోముని పక్షమును, భవుఁడు (శివుఁడు) (బృహస్పతి) పక్షమును వహించిరి. ఏలయన మహాద్యుతిమంతుఁడైన సోముఁడు పూర్వము బృహస్పతి యొక్క శిష్యుఁడు. ఈ సంబంధముచే రుద్రుడు బృహస్పతి పక్షపు మిత్రమై . ‘అజగవ’ మను ధనువును (కోపము)చే పట్టేను. (32) ఆ మహాత్ముఁడు బ్రహ్మ శిరో నామక పరమాస్త్రమును దేవతలపై నుద్దేశించి విడిచెను. దీనితో వారి యశస్సుంతయు నడుగంటినది. (33) దేవతలకు దానవులకు మధ్య ప్రఖ్యాతమైన యుద్ధమైనది. ఇది తారకామయము (తారకు సంబంధించినది) అది అధికముగా లోక క్షయ కరమయ్యెను. (34) ఈ యుద్ధములో చావక మిగిలిన దేవతలు ‘తుషితులు’గా సంస్కృతులు. వారు పితామహుఁడు ఆది దేవుఁడునయిన బ్రహ్మను శరణు వేడిరి. అంత బ్రహ్మ తాను స్వయముగా వచ్చి రుద్రుని ఉపశనసుని యుద్ధము చేయుటనుండి విరమింపచేసెను. స్వయముగా వచ్చి బ్రహ్మ తారను ఆంగీరసుని కప్పగించెను.(86) చంద్రనిభాననయైన తార గర్భవతియై యుండుట యెటింగి (బృహస్పతి) చూచి ఆమెతో వెంటనే గర్భమును విసర్జించుము” నీయోని నాది. అందుచే వేడొకని బిడ్డయందు పుట్టరాదు” అనెను. అగ్నివలె జ్వలించుచున్న గర్భమును తార విడిచి పుచ్చెను.
జాతమాత్రోఽధ భగవాన్దేవానామాక్షిపద్వపుః ।
తతః సంశయమాపన్నాస్తారామకథయన్ సురాః ॥
సత్యం బ్రూహి సుతః కస్య సోమస్యాఽథ బృహస్పతేః ।
హ్రీయమాణా యదా దేవాన్నాహ సా సాధ్వసాధు వా ॥
తదా తాం శప్తుమారబ్ధః కుమార్ దస్యుహంతమః ।
తం నివార్య తదా బ్రహ్మా తారాం పప్రచ్ఛ సంశయమ్ ॥
యదత్ర తథ్యం తద్బ్రూహి తారే కస్య సుతస్త్వయమ్ ।
సా ప్రాంజలిరువాచేదం బ్రహ్మాణం వరదం ప్రభుమ్ ॥
సోమస్యేతి మహాత్మానం కుమారం దస్యుహంతమమ్ ।
తతః సుతముపామ్రాయ సోమో రాజా ప్రజాపతిః ॥
బుధ ఇత్యకరోన్నామ తస్య పుత్రస్య ధీమతః ।
ప్రతిఘస్రం చ గగనే సమభ్యుత్తిష్ఠతే బుధః ॥
ఉత్పాదయామాస తదా పుత్రం వై రాజపుత్రికా ।
తస్య పుత్రో మహాతేజా బభూవైలః పురూరవాః ॥
ఉర్వశ్యాం జజ్ఞిరే తస్య పుత్రాః షట్ సుమహౌజసః ।
ప్రసహ్య ధర్షితస్తత్ర వివశో రాజయక్ష్మణా ॥
తతోయక్ష్మాభిభూతస్తు సోమః ప్రక్షీణమండలః ।
జగామ శరణాయాథ పితరం సోఽత్రిమేవ తు ॥
తస్య తత్పాపశమనం చకారాత్రిర్మహాయశాః ।
స రాజయక్ష్మణా ముక్తః శ్రీయా జజ్వాల సర్వశః ॥
ఏతత్ సోమస్య వై జన్మ కీర్తితం ద్విజసత్తమాః ।
వంశం తస్య ద్విజశ్రేష్ఠా కీర్త్యమానం నిబోధత ॥
ధన్యమారోగ్యమాయుష్యం పుణ్యం కల్మషశోధనమ్ ।
సౌమ్యస్యజన్మ శ్రుత్వైవం సర్వపాపైః ప్రముచ్యతే ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తీ మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే సోమసౌమ్యయోర్జన్మకథనం నామ పంచషష్టితమోఽధ్యాయః ॥
పుట్టినంతనే యా సోముఁడు దేవతల శరీరమును విసర్జించెను. అందుచే సురలు సంశయముగొని తారతో నిట్లనిరి. “సత్యము చెప్పుము. ఈ సుతుఁడెవ్వనివాఁడు? సోముని కొడుకా లేక బృహస్పతి కోడుకా?” అనీ, తార సిగ్గుపడి 'అవు'నని గాని 'కాద'ని గానీ దేవతల కామె సమాధానమీయలేదు. దస్యుపాంత (రాక్షసహంతకుఁడయిన కుమారుఁడామెను శపించుటకారంభించెను. వానిని ఆపి, బ్రహ్మ తార సొసంశయము నడిగెను. “ఓ తారా ! ఇక్కడ సత్యము చెప్పు. ఈతఁడెవ్వని పుత్రుఁడు?”అని. వరదుఁడు ప్రభువునయిన బ్రహ్మకు నమస్కరించి, చేతులు జోడించి దస్యుహంతకుని గూర్చీ “సోముని యొక్క పుత్రుఁడని చెప్పెను. అంత, ప్రజాపతి సోముఁడు ఆ కుమారుని శీరము నాఝంచి ధీమంతుఁడయిన కుమారునకు ‘బుధుఁడు’ అని నామకరణ మొనరించేను. ప్రతిదినము బుధుఁడు ఆకాశమున ఉదయించును, రాజదుహిత (ఇలా) కుమారుని గనెను. అందుచే ఇలా కుమారుడయిన పురూరవసు మహాతేజుఁడయ్యెను. ఆతనికి ఊర్వశి వలన మహాతేజస్వులు ఆరుగురు పుత్రులు పుట్టిరి. ఆతఁడు (సోముడు) తీవ్రమయిన రాజ యక్ష్మకు పాల్పడెను. పరవశుఁడయ్యెను. నిస్సహాయుఁడయ్యెను. రాజ యక్ష్మచే వివశమై చంద్రుని మండలము క్షీణమయ్యెను. వెలవెల్లపోయ్యెను. ఆతఁడు తండ్రియైన అత్రిశరణుజొచ్చెను. మహాయశిస్వయైన అత్రి ఆతని రాజయక్ష్మమును నుపశమింపఁజేసెను. ఆ రాజయిన చంద్రుఁడు రాజయక్ష్మము వలన ముక్తుఁడై శోభస్కరముగా నెల్లెడలను ప్రకాశించెను. ఓ బ్రాహ్మణులారా ! ఇది సోమునియొక్క జననము చెప్పితిని. ఆతని వంశమును చేప్పెదను వీనుఁడు. సౌమ్యుని యొక్క జన్మ (బుధ) ధన్యము, ఆరోగ్యదము, ఆయుఃప్రదము. పుణ్యము కల్మషశోధనము. సౌమ్యుని (బుధ)యొక్క జన్మ శ్రవణము సర్వపాప విమోచనము.
ఇది వాయుప్రోక్తమయిన బ్రాహ్మండపురాణమున మధ్యమభాగమున తృతీయోపోద్ఘాతపాదమున సోమసౌమ్యులయొక్క జన్మకథనమను పంచషష్టితమాధ్యాయము.
Summary of chapter 103 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter details the noble identities and celestial origins of the future Manus, including Savarni and his righteous brothers, who will serve as universal progenitors. It extols their flawless character, immense ascetic power, and devotion to the supreme lord, guaranteeing the continuation of cosmic order. The devout reader rejoices in the divine foresight that eternally provides righteous guardians for every phase of existence.