బ్రహ్మాండ మహా పురాణము
5 - ప్రపంచోత్పత్తి
శ్రీసూత ఉవాచ:-
ఆపో గ్రే సర్వగా ఆసన్నేతస్మిన్ పృథివీతలే ।
శాంతవాతైః ప్రవీలీనేజస్మిన్న ప్రాజ్ఞాయత కించన ॥
ఏకార్ణవే తదా తస్మిన్నష్ట స్థావరజంగమే ।
విభుర్భవతి స బ్రహ్మా సహస్రాక్షసహస్రపాత్ ॥
సహస్రశీర్షా పురుషో రుక్మవర్ణో హ్యతీంద్రియః।
శ్రీ బ్రహ్మ నారాయణాఖ్యస్తు సుష్వాప సలిలే తదా॥
సత్వోద్రేకాన్నిషిద్ధస్తు శూన్యం లోకమక్షత ।
ఇమం చోదాహరంత్యత్ర శ్లోకం నారాయణం ప్రతి ॥
అపో నారా ఇతి ప్రోక్తా ఆపో వై నరసూనవః ।
అయనం తస్య తాః ప్రోక్తాస్తేన నారాయణః స్మృతః ॥
తుల్య యుగ సహస్రస్య వసన్కాలముపాస్యతః ।
స్వర్ణపత్రే ప్రకురుతే బ్రహ్మత్వాదర్శకారణాత్ ॥
బ్రహ్మా తు సలితే తస్మిన్నవాగ్ భూత్వా తదాచరస్ ।
నీశాయామివ ఖద్యోతః ప్రావృట్కాలే తతస్తతః ॥
తతస్తు సలిలే తస్మిన్ విజ్ఞాయాంతర్గతే మహత్ ।
అనుమానాదసంమూడో భూమేరుద్ధరణం ప్రతి ॥
ఓంకారాష్ట్రతనుం త్వన్యాం కల్పాదిషు యథా పురా ।
త మహాత్మా మనసా దివ్యరూపమచింతయత్ ॥
సలిలేని వప్లుతాం భూమిం దృష్ట్వా స సమచింతయత్ ।
కిస్తురూపమహం కృత్వా సలిలాదుద్ధరే మహీమ్ ॥
సూతుఁడిట్లనెను :
పృథివీ తలమంతయు ముందుగా నీటిచే నిండియుండెను, వాతములు ప్రశాంతము లైయడంగెను. అప్పుడీ దృశ్యమాన ప్రపంచమంతయు నీటిలో లీనమయి యుండెను. సర్వము నశించెను. ఏమియును దెలియకుండెను. (1) స్థావర జంగమములన్నియు ఏకార్ణవమున నష్టములు కాగా సహస్రాక్షుఁడు, సహస్రపాదుడునయిన ప్రభువు బ్రహ్మ (2) సహస్ర శీర్పుఁడు, పురుషుఁడు, బంగారు వర్ణము కలవాఁడు, అతీంద్రియుఁడు, నారాయణాఖ్యుఁడు నయిన బ్రహ్మ ఆ నీటియందు నిదురించేను. (3) సత్వోద్రేకము లేనందున నారాయణుఁడు సర్వము శూన్యమగుటను కనుగొనెను. నారాయణుని గూర్చి యీ శ్లోక ముదాహరింపబడుచున్నది. [4) ఆపస్సులు అనఁగో నారములు. నారములు నీళ్ళు, నరసూనులందరు ఆపస్సులే. ఆ నీరములాతనికి నివాసములగుట నారాయణుఁడయ్యెను. (5) యుగసహస్రకాల పర్యంము స్వచ్ఛమయిన కమల పత్రతలమున బ్రహ్మత్వా దర్శ కారణమున ఆత్మనాత్మ వీక్షించుచు నారాయణుఁడట నిద్రించేను. (6) ఆ నీటియందు బ్రహ్మ (నారాయణుడు) శాంతవచో వీలాసుఁడయి ప్రావృట్కాలమున (పర్షకాలమున) రాత్రీయందు ఖద్యోతము (మిణుగురు పుడుగు - జ్యోతిరింగణము) వలె నుండెను. (7) అంత, సలిలము నందున్న భూమి నెటింగి, అనుమానంబున కొంతకాలముండి సారాయణుఁడు భూమి నుద్దరింప తలంచెను. (8) ఓంకారముతో కూడిన అష్టతనువయిన ఈశ్వరునీ తనువులలో నొకటయిన భూమిని, పూర్వకల్పముల యందున్నట్లుగా నుద్ధరింప మహాత్ముడయిన నారాయణం డు దివ్యరూపమును తలపోసెను. (9) నీటి యందు మునిగియున్న భూమిని జూచి 'నేనే మహా రూపమును దాల్చి భూమీనీ సలిలముల నుండి యుద్దరింపవలెను" అని నారాయణుఁడు తలపోసెను. (10)
జలక్రీడాసముచితం వారాహం రూపమస్మరత్ ।
అదృశ్యం సర్వభూతానాం వాజ్మయం బ్రహ్మసంజ్ఞితమ్॥
దశయోజనవిస్తీర్ణమాయతం శతయోజనమ్ ।
నీలమేఘప్రతీకాశం మేఘస్తనితనిఃస్వనమ్ ॥
మహాపర్వతవర్ష్మాణం శ్వేతతీక్ష్నోగ్రదంష్టిణమ్ ।
విద్యుదగ్నిప్రతీకాశమాదిత్యసమతేజసమ్॥
పీనవృత్తాయతస్కంధం విష్ణువిక్రమగామి చ ।
పీవోన్నతకటీదేశం వృషలక్షణపూజితమ్ ॥
ఆస్టాయ రూపమతులం వారాహమమీతం హరిః ।
పృథివ్యుద్ధరణార్థాయ ప్రవివేశ రసాతలమ్ ॥
దీక్షాసమాప్తీషిదంష్ట్ర క్రతుదంతో జుహూముఖః ।
అగ్నిజిహ్వా దర్భరోమా బ్రహ్మశీో మహాతపాః॥
వేదస్కంధో హవిర్గంధిఝవ్యక్యదివేగవాస్ ।
ఫ్రాగ్వంశకా ద్యుతిమాన్ నానాదీక్షాభిరన్వితః ॥
దక్షిణాహృదయో యోగీ శ్రద్దాసత్వమయో విభుః ।
ఉపాకర్మరుచిశ్చైవ ప్రవర్గ్యావర్తభూషణః ॥
నానాఛంథోగతిపథో గుహ్యోపనిషదాసనః ।
మాయాపత్నీసహాయో వై గీరీశృంగమివోఛ్ఛయః ॥
అహోరాత్రేక్షణధరో వేదాంగశ్రుతిభూషణః ।
ఆజ్యగంధః సువస్తుండః సామఘోషస్వనో మహాన్ ॥
సర్వభూతముల కదృశ్యము, బ్రహ్మ సంజ్ఞితమునైన పొజ్మయమై, దశయోజన విస్తీర్ణము, శత యోజన మాయతము, నల్లని మేఘము వంటిది, మేఘ గర్జనముల వంటి నిస్స్వనము గలది, మహాపర్వతము వంటి శరీరముగలది, శ్వేతము, తీవ్రము, ఉగ్రమునయిన తేజస్సు గలది, బలిసినది, వృత్తాకారమున నున్నదియునగు స్కంధము గలది, విష్ణుని సంబంధమయిన విక్రమమును పొందినది, బలిసినది, ఉన్నతమయినదియు నగు కటి భాగము కలది, తీక్ష దంష్టలు గలది, విద్యుదగ్నితుల్యము, సూర్యుతో సమానమైన తేజము గలది, జలక్రీడా సముచితము, నగు పోరాహ రూపమును నారాయణుడు స్మరించెను. (11,12,13,14) అతుల రూపమయిన పోరాహ రూపమును నారాయణుడు పొంది, పృథీవీని నుద్ధరించుటకు రసాతలము నాతండు ప్రవేశించేను, (15) ఆ వారాహ లక్ష రూపుడయిన హరి దీక్షా సమమైన యిదండ్రుఁడు యజ్ఞదంతుం డు, జుహూముఖుఁడు, అగ్నిజిహ్వుఁడు, దర్భరోముఁడు, బ్రహ్మశ్రుండు, మహాతపస్వి, వేద స్వరూప భుజస్కంధుఁడు, హవిర్షంధుఁడు, హవ్యకవ్యాది వేగవంతుఁడు, ప్రాగ్వంశకాయరుచిరుఁడు, నానాదీక్షలతో గూడినవాఁడు (17) దక్షిణా హృదయుఁడు, యోగవంతుఁడు, శ్రద్ధావంతుఁ డు, సత్త్వమయుఁడు, ఉపాకర్మ రుచి, ప్రవర్ణావర్త భూషణ భూషితుఁడు, సోనా ఛందోరూపగతిపధుఁడు, గుహ్యోపనిషదాసనుండును, మాయా పత్నీ సహాయుండును, పర్వతశృంగతుల్యమయిన యుచ్ఛయము కలహాఁడు, అహోరాత్ర నేత్రధరుఁడు, వేదాంగములు, శ్రుతీభూషణములుగా గలవాడు ఆజ్యరూప గంధుఁడు, సువరూపకలీతతుండభాసితుఁడు, అత్యధికమయిన సొమవేద ఘోష కలవాఁడు. (18,19,20).
సత్యధర్మమయః శ్రీమాన్ కర్మవిక్రమసత్కృతః ।
ప్రాయశ్చిత్తనఖో ఘోరః పశుజానుర్మహామఖః ॥
ఉద్ఘాతాంతో హోమలింగః ఫలబీజమహౌషధిః ।
వాద్యంతరాత్మసత్రస్య నాస్మికాసోమశోణితః ॥
భక్తా యజ్ఞవరాహాంతాశ్చాపః సంప్రావిశత్ పునః ।
అగ్నిసంఛాదితాం భూమిం సమామిచ్ఛన్ ప్రజాపతిమ్ ॥
ఉపగమ్యాజుహావైతామాద్యశ్చాధ్య సమన్యసత్ ।
సాముద్రాశ్చ సముద్రపు నాదేయాశ్చ నదీషు చ॥
ప్రాక్సర్లే దహ్యమానిస్తు తదా సంవర్తకాగ్నినా ।
నాగ్నినా విలీనాస్తే పర్వతా భువి సర్వశః ॥
సత్యాదేకార్ణవే తస్మిన్ వాయునా యత్తు సంహితాః ।
నిషిక్తా యత్ర యత్రాసంస్తత్ర తత్రోచలో భవత్ ॥
తతస్తేషు ప్రకీర్ణేషు లోకోదధిగిరీంస్తథా ।
విశ్వకర్మా విభజతే కల్పాదిషు పునః పునః ॥
ససముద్రామిమాం పృథ్వీం సప్తద్వీపాం సపర్వతాం ।
భూరాద్యాంశ్చతురో లోకాన్ పునః పునరకల్పయత్
లోకాస్రాకల్పయిత్వా చ ప్రజాసర్గం ససర్ణ హ।
బ్రహ్మా స్వయంభూర్భగవాన్ సిసృక్షుర్వివిధాః ప్రజాః ॥
ససర్జ సృష్టం తద్రూపం కల్పాదిషు యథా పురా ।
తస్యాభిధ్యాయతః సర్గం తదా వై బుద్ధిపూర్వకమ్ ॥
సత్యధర్మమయుఁడు, శ్రీమంతుఁడు, కర్మ పరాక్రమము చేతను సత్కరింపబడినవాఁడు, ప్రాయశ్చిత్తనఖుఁడు, భయంకరుడు, పశువుల వంటి మోకాలు గలవాడు, మహాయజ్ఞవంతుఁడు, (21) ఉద్ఘాతాంత్రుఁడు, (యజ్ఞము నందు సామవేద తంత్రమునడుపువాడు ఉద్గాత - ఉద్గాత యనేడు ప్రేగులు గలవాఁడు), హోమలింగుఁడు, ఫలబీజమహౌషధి, పాద్యంతరాత్మ, నాసికాసోమశోణితుఁడు (22) భక్తులు యజ్ఞ వరాహాంతులు, నీట మరల ప్రవేశించేను. అగ్నిచేతను ఆచ్ఛాదింపఁబడిన భూమిని సమముగా చేయగోరి, ప్రజాపతిని చేరి, సముద్రము నందుండు వానిని సముద్రములందు, నదులయందుండు వానినీ నదులయందు, వేరువేరుగా నుంచి, ఆ ప్రజాపతీ పృధీవి యందు పర్వతమును. వృద్ధిపరచెను. (24) సృష్టికిఁబూర్వము సంవర్తకాగ్నిచే దహింపబడుచుండగా, ఆ యగ్నిచే పర్వతములు భూమియందు నెల్లెడలను విలీనములయ్యెను. (25) ఆ సమయమున సర్వము నేకార్ణవముకాగా, వాయువుచే కూడినవై యెచ్చటెచ్చట తడుప చల్లబడినవో అచ్చటచ్చట నయ్యవీ పర్వతములయ్యెను. (26) ఆ విధముగా లోకమనెడు సముద్రమున గిరులట్లు ప్రకీర్ణములు కాగా, కల్పాదులందు, విశ్వకర్మ, మరల మరల, వానిని విభజించును. (27) ఆ విశ్వకర్మ ససముద్రము, సపర్వతము, నయి ససప్తద్వీపమయిన పృథ్విని, భూర్భువస్సువరాది నాలుగు లోకములను మరల కల్పించెను. (28) లోకములను కల్పించి యాతఁడు ప్రజా సముదాయమును సృజించెను. స్వయంభువు, బ్రహ్మ భగవంతుడైన యాతఁడే స్వయముగా వివిధ ప్రజా సముదాయమును సృష్టింపకోరెను. (29) పూర్వమందు కల్పాదుల యందెట్లున్నదో యట్లే తత్ఫృథివీ ప్రజారూపమును సృష్టించెను. బుద్ధి పూర్వకముగానే ఆతఁడా సృష్టిని అభిధ్యానించెను, (30)
ప్రధాన సమకాలే చ ప్రాదుర్భూతస్తమయః ।
తమో మోహో మహామోహన్తమిసో హ్యంధసంజ్ఞితః ॥
అవిద్యా పంచపర్వైషా ప్రాదుర్భూతా మహాత్మనః ।
పంచధావస్థితః సర్గో ధ్యాయతః సాభిమానినః ॥
సర్వతస్తమసా చైవ బీజకుంభలతావృతాః ।
బహిరంతశ్చాప్రకాశస్తథా నిస్సంజ్ఞ ఏవ చ ॥
యస్మాత్తేషాం కృతా బుద్ధిర్దు:ఖానీ కరణాని చ ।
తస్మాచ్చ సంవృతాత్మానో నగా ముఖ్యాః ప్రకీర్తితాః ॥
ముఖ్యసర్లే తోద్భూతం దృష్ట్వా బ్రహ్మాత్మసంభవః ।
అప్రతీతమనాస్ఫోథ తదోత్పత్తిమమన్యత ॥
తస్యాభిధ్యాయతశ్చాన్యస్తిర్యక్రేతోభ్య వర్తత ।
యస్మాత్తిర్యగ్వివర్ణేత తిర్యక్రోతస్తతః స్మృతః ॥
తమోబహుశ్వాతే సర్వే హ్యజ్ఞానదిహుళాః స్మృతాః ।
ఉత్పాద్య గ్రాహిణశ్చైవ తేజనే జ్ఞునమానినః ॥
అహంకృతా అహంమానా అష్టావింశద్విధాత్మికాః ।
ఏకాదశేంద్రియవిధా నవధాత్మాదయస్తథా ॥
అష్టా తు తారకాద్యాశ్చ తేషాం శక్తివథాః స్మృతాః ।
అంతః ప్రకాశాస్తే సర్వే ఆవృతాశ్చ బహిః పునః ॥
త్రిర్యక్స్రోతస ఉచ్యనే వశ్యాత్మానక్రిసంజ్ఞకాః ।
తిర్యక్స్రోతస్తు సృష్వా వై ద్వితీయం విశ్వమీశ్వరః ॥
అభిప్రాయమథోద్భూతం దృష్ట్వాసర్గం తథావిధమ్ ।
ప్రధానముతో సమకాలముననే తమోమయము ప్రాదుర్భవించెను. తమము, మోహము, మహామోహము, తామిస్రము, అన్నియు అంధసంజ్ఞితములు. చీకటికి పేర్లు. (31) అది అవిద్య ఆదియే పంచవిధములు. (ఐదు పర్వములు కలది). అభిమాని, మహాత్ముఁడు నయిన ఆ బ్రహ్మ ధ్యానించుచుండ నయ్యది యైదు విధములుగా సృష్టి ప్రాదుర్భవించెను. (32) అంతటను తమస్సు వ్యాప్తమై యుండెను. తమస్సుచే బీజకుంభలతలు ఆవరింపఁబడియున్నవి. వెలుపలను లోపలను ప్రకాశరహితము సంజ్ఞారహితమై యుండెను. (33) దేనివలన వారియొక్క బుద్ధి, దుఃఖములు, కరణములు చేయబడినవో, దానివలననే పర్వతములు, వృక్షాదులు సంవృతములై యుండి ప్రకీర్తితములయినవి. (34) ఆత్మ సంభవుఁడయిన బ్రహ్మ సృష్టియందు ఉద్భూతమయిన దానిని చూచి, ఆప్రతీతమనస్కుడై తదుత్పత్తిని గూర్చి యాలోచించెను. (35) అట్లు ధ్యానము చేయు నతనికి వేటిక తిర్యక్రేతమయ్యెను (ప్రోతము = ప్రవాహము} {అగుపించేను) ఏ కారణముచే నది తిర్యక్కురో వంకరగా, అడ్డముగా తిరిగెనో ఆ కారణముచే నది తిర్యక్రేతమని - స్మరింపఁబడినది. (36) తమస్సు బహుళముగా నుండుటచే వారందర జ్ఞానమధికముగా గలవారుగా స్మరింపఁబడిరి. ఉత్పాద్య గ్రాహిణులెల్లరు అజ్ఞానమునందు తమ్ముజ్ఞానవంతులమనియే భావించుకొనెడువారు, పోరు అహంకారయుతులు, అహంగర్వీతులు, (37) వారు ఇరువది యేమ్మీది రకముల వారు; ఏకాదశేంద్రీయ వీధులు, అత్మాదులు నవవిధములు. (38) తారకాదులేన మండ్రు. వారినీ శక్తివధులందురు. వారందరంతఃప్రకోశులు; బాహ్యమున వారెల్లరు మరల అజ్ఞానముచే సావృతులు (39) వశ్యాత్ములయిన త్రిసంజ్ఞకులు తిర్యక్ స్రోతసులుగా (ప్రపోహములుగా) చెప్పబడుచున్నారు. (40) రెండవ విశ్వమయిన తిర్యక్ స్రోతస్సును జూచి బ్రహ్మకు ఒక యభిప్రాయము కలిగినది. (41)
తస్యాభిధ్యాయతో యోస్త్యః సాత్వికః సమజాయత ।
ఊర్ధ్వస్తోతస్తృతీయస్తు తద్వై చోర్ధ్వం వ్యవస్థితమ్ ॥
యస్మాదూర్ధ్వం న్యవర్తంత తదూఢసోతసంజ్ఞకమ్।
తాః సుఖం ప్రీతీహాళి బహిరంతశ్చ వ్యోమృతాః ॥
ప్రకాజా బహదంతశ్చ ఊర్ధ్వగ్రతఃప్రజాః స్మృతాః ।
నవధారాదయస్తే వైశుష్టాత్మనో బుధాః స్కృతాః॥
ఊర్ధ్వస్తోతస్తృతీయో యః స్మృతః సర్వః స దైవిక ।
ఊర్ధ్వగ్రతఃసు సృషేషు దేవేషు స తదా ప్రభుః ॥
ప్రీతిమానభవద్భహ్మా తతోన్యం నాభిమన్యత ।
సర్గమధ్యం సీసృక్షుస్తం సాధకం పునరీశ్వరః ॥
తస్యాభిధ్యాయతః సర్గం సత్యాభిధ్యాయినస్తథా ।
ప్రాదుర్బభౌ భౌతసర్గః సోర్వాకర్రోతస్తు సాధకః॥
యస్మాత్తేర్వాక్రవర్తంతే తతోర్యాక్ గ్రోతసస్తు తే ।
తే చ ప్రకాశబహుళస్తమస్పృష్ఠరజోధికాః॥
తస్మాత్తే దుఃఖబహుళా భూయో భూయశ్చ కారీణః ।
ప్రకాశా బహిరంతశ్చ “మనుష్యాః” సాధకాశ్చ తే ॥
లక్షణెర్నారకాద్యైస్తిరష్టధా చ వ్యవస్థితాః ।
సిద్ధాత్మనో మనుష్యాస్తే గంధర్వై సహధర్మిణః ॥
పంచమోనుగ్రహః సర్గశ్చతుర్ధా స వ్యవస్థితః ।
విపర్యయేణ శక్త్యా చ సిద్ధ ముఖ్యాస్తథైవ చ ॥
నివృత్తా వర్తమానాశ్చ ప్రజాయంతే పునః పునః ।
భూతాదికానాం సత్వానాం షష్ఠసర్గః స ఉచ్యతే ॥
అట్లు ధ్యానము చేయునాతనికి అంత్యమున పుట్టిన సాత్త్వికసృష్టి తృతీయమయిన యూఢ ప్రోతస్సు; అందుచేతనే యది ఊర్ధ్వమందున్నది. (42) అదీ దూరముననున్నదగుటచే (ఎక్కువజ్ఞాన వ్యాప్తిచే) నది ఊర్ధ్వప్రోతస్సని పేరొందినది. అందలి ప్రజలు సుఖులు, ప్రీతిబహుళులు, బాహ్యమున అంతరమున వ్యాపించియున్నారు. (43) బయటకు వెలుపలను కూడ ఊర్థ్వ ప్రోతస్సునందలి ప్రజలు ప్రకాశవంతులుగా సంస్కృతులు. వారు నవధాజాదులు, తుష్టాత్ములు, బుధులుగా ప్రశస్తులు. (44) తృతీయమయిన ఊర్ద్వసోతస్సు సర్వము వైదీక సహితముగా దేలియబడు చున్నది. దేవతల యందు లో ఊర్థ్వప్రోతస్సు సృష్టింపఁబడగా అప్పుడాతఁడు ప్రభువయ్యెను. (45) బ్రహ్మ ప్రీతిమంతుఁడయ్యెను.. తరువాత వేటిక దానీని తలపోసేను. కొనివేథోక సర్గమును ఈశ్వరుఁడు (బ్రహ్మ) సృజింపగోరెను. అయ్యదియే సాధకము (46) సర్గమును అభిధ్యానము చేయు నా సత్య సంకల్పునకు భూత సృష్టి ప్రాదుర్భవించెను; అదీ ఆర్వాక్ గ్రోతస్సును సాధించినది. (ఆధ్వాక్ ముందునకు అభిముఖముగా వచ్చునది) అర్వాక్కుగా (అభిముఖముగా వచ్చుటచే) వచ్చిన ప్రోతస్సు (47) అగుటచే నది ఆర్వాక్ గ్రోతస్సయినది. వారు అధికమయిన ప్రకాశము కలవారు. తమస్సుచే జుష్టమయిన రజస్సు యొక్క ఆధిక్యము కలవారు, (46) అందుచేవారు బహుదుఃఖములు కలవారు; వానినే మరల మరల చేయువారు. బహిరంతముల ప్రకాశించువారు వారే మనుష్యులు. వారే సాధకులు. (49) నరకాదులయిన లక్షణములచే వారు ఎనిమిది విధములుగా నున్నారు. వారు సిద్దాత్ములు, మనుష్యులు, గంధర్వులతో సమానమయిన ధర్మములు కలవారు. (50) ఐదవ సృష్టి అనుగ్రహము. ఇదీయు నాలుగు తెరగులు. ఈ మనుష్యులు విపర్యయమున (వ్యత్యాసమున) నాశంబును, శక్తిచే స్థితిని గాంచుచుందురు. (51) వారు ఉత్పాదకులు నాశకులు. వినాశమొంది మరల మరల పునర్భవము నొందుదురు. అంతియేకాక భూతాదీకముల సృష్టి ఆరవది యనంబడును. (52)
స్వాదనాశ్చాష్యశీలాశ్చ జ్ఞేయా భూతాదీకాశ్చ తే।
ప్రథమో మహతః సర్గో విజ్ఞేయో బ్రహ్మణస్తు సః ॥
తన్మాత్రాణాం ద్వితీయస్తు భూతసర్గఃస ఉచ్యతే ।
వైకారికస్తృతీతయస్తు చేంద్రియః సర్గ ఉచ్యతే ॥
ఇత్యేతే ప్రాకృతాః సర్గా ఉత్పన్నా బుద్ధిపూర్వకాః ।
ముఖ్యసర్గశ్చతుర్థస్తు ముఖ్యా వై స్థావరాః స్మృతాః॥
తిర్యక్ గ్రోతః ససర్గసు తైర్యగ్యోన్యస్తు పంచమః ।
తథోర్ధ్వప్రోతసాం సర్గః షషో దైవత ఉచ్యతే॥
తత్రోర్ధ్వప్రోతసాం సర్గః సప్తమః స తు మానుషః ।
అష్టమోనుగ్రహస్సర్గః సాత్విక మసశ్చ సః ॥
పంచైతే వైకృతాః సర్గాః ప్రాకృతాద్యాయః స్మృతాః ।
ప్రాకృతో వైకృతశ్చైవ కౌమారో నవమః స్మృతః ॥
ప్రాకృతా బుద్ధిపూర్వాస్తు త్రయ సర్గాస్సు వైకృతాః ।
బుద్ధిపూర్వాః ప్రవర్తీయుః తద్వర్గా బ్రాహ్మణాస్తు వై ॥
విస్తరాచ్చయథా సర్వే కీర్త్యమానం నీబోధత ।
చతుర్ధా చ స్థితస్సోపీ సర్వభూతేషు కృత్స్నశః ॥
ఆ భూతములు భోజన విహారములు కలిగియుండును. శీలరహితములై యుండుట యెఱుంగవలయును. బ్రహ్మయొక్క మొదటి సృష్టి మహాసర్గము. (53) పృధివ్యాది తన్మాత్రంబు ద్వీతీయము. అదియే భూతసర్గమనంబడును. వైకార్తీకము (వికారవంతమయినది) తృతీయసృష్టి అయ్యది యేంద్రీయ సృష్టియనంబడును, (54) ఇవి బుద్దపూర్వకముగా నుత్పన్నములయిన ప్రాకృతసృష్టులు, ముఖ్య సృష్టి నాలుగవది. ముఖ్యములనఁగా స్థావరము. (55) తిర్యక్ గ్రోతస్సర్గము పంచమము. (తైర్యగ్యోన్యస్తు) ఊర్దస్రోతస్సర్గము ఆరవది. దీనిని బుద్దిదైవత మందురు. (56) అందు (ఊర్ద్వసోత స్సర్గములో) సప్తమము మానుష సర్గము. అష్టమమయిన సర్గము అనుగ్రహమను సర్గము. అదీ మరల సాత్త్విక తామస భేదమున ద్వివిధముగ నున్నది. (57) (సాత్త్విక తామస పరిమిళితము) వీనియందైదు వైకృతములు, మూఁడు ప్రాకృతములనియు వ్యవహరింప బడును. ప్రాకృతములు మూడు బుద్ధిపూర్వకములు. ఈ మూడును వైకృతము. ప్రాకృత వైకృత భేదమగు కౌమారము తొమ్మిదవ సర్గము. (58) ప్రాకృతములు వైకృతములు రెండును బుద్ధిపూర్వక సర్గములే. వాని వర్గములే బ్రాహ్మణులు నయిరి. (59) ఇవి యన్నియు విస్తరించి చెప్పబడినవి కదా. సర్వభూతములయందు సాల్లువిధములనీ చెప్పఁబడినది.
విపర్యయేణ శక్త్యా చ బుద్ధ్యా సిద్ధ్య తథైవ చ ।
స్థావరేషు విపర్యాసప్తిర్యగ్యోనిషు శక్తితః ॥
సిద్ధాత్మానో మనుష్యాస్తు పుష్టిర్దేవేషు కృత్స్నశః।
అథో ససర్ణ వై బ్రహ్మా మానసానాత్మనః సమాన్ ॥
వైవర్యేన తు జ్ఞానేన నివృత్తాస్తే మహౌజసః ।
సంబుద్ధ్య చైవ నామాథో అపవృతాస్త్రయస్తు తే ॥
అసృష్వైవ ప్రజాసర్గం ప్రతిసర్గం తతస్తతః ।
బ్రహ్మా తేషు వ్యక్తేషు మతోన్యాస్పోథకాన్ సృజన్ ॥
స్థానాభిమానినో దేవాః పునర్బహ్మానుశాసనమ్ ।
అభూతసృష్ట్యవస్థా యే స్థానినస్తాన్ నిబోధ మే ॥
ఆపోగ్నిః, పృథివీ వాయురంతరిక్షా దివం తథా ।
స్వర్క్లో దిశః సముద్రాశ్చ నద్యశ్చైవ వనస్పతీన్ ॥
ఔషధీనాం తథాత్మానో హ్యాత్మనో వృక్షవీరుధాం ।
లతాః కాషాః కలాశ్చైవ ముహూర్తా సంధిరాత్ర్యహాః ॥
అర్ధమాసాశ్చ మాసాశ్చ అయనాబ్ధయుగాని చ ।
స్థానే స్రోతఃస్వభీమానాః స్థానాభ్యాశ్చైవ తే స్మృతాః ॥
మరల వీనిలో విపర్యయము, శక్తి, బుద్ధి, దైవములని నాలుగు విధములు. స్థావరంబుల యందు విపర్యయంబును, తిర్యగ్యోనుల యందు శక్తియు నొప్పుచుండును. (61) మనుష్యులయందు సిద్దాత్ములు, దేవతలయందు పుష్టియు నుండును. అంత బ్రహ్మ ఆత్మ సమానులయిన మానసతనయులను సృజించెను. (62) మహాత్ములయినవారు మువ్వురు జ్ఞానవైవర్య మెలింగి సృష్టి కార్యమునుండి నివృత్తులైరి. (63) వారు ప్రతిసర్గము ప్రజాసర్గమును గావింపకయే విరక్తులైన బ్రహ్మ తదనంతరము తత్సృష్టికై ఇతరులయిన సాధకులను (దేవతలను) సృజించెను. (64) దేవతలు స్థానాభిమానులు, బ్రహ్మానుశాసనమున భూతములకెట్టి యవస్థలుండునో వానీనీ వారికి లేకుండుట వివరించెద వినుము. (65) నీరు, అగ్ని, పృథివి, వాయువు, అంతరిక్షము, దీవము, స్వర్గము, దీకులు, సముద్రములు, నదులు, వనస్పతులు. (66) ఓషధుల యొక్క వృక్షముల యొక్క లతల యొక్క వాని వానియొక్క లతలు, కాష్ట్రములును, కలలు, (కళలు - కాలపరిమాణము) ముహూర్తములు, సంధులు, రాత్రులు, పగళ్లు (67) అర్ధమాసములు, మాసములు, అయనములు, సంవత్సరములు, యుగములు - మున్నగు వానిని సృజించెను. (68) ప్రోతస్సులు, స్వభిమానములు, స్థానాఖ్యములు కూడ స్మరింపఁబడినవి.
స్థానాత్మనః స సృష్ట్వా తు మతోన్యాన తదాః సృజత్ ।
దైవాంశ్చైవ పితరాంశ్చైవ యైరిమా వర్థితాః ప్రజాః ॥
భృంగ్వంగిరా మరీచిశ్చ పులస్త్యః పులహః క్రతుః ।
దక్షోజ త్రిశ్చ వసిష్టశ్చ, సాసృజన్నవ మానసాన్ ॥
నవబ్రహ్మాణ ఇత్యేతే పురాణే నిశ్చయం గతాః।
బ్రహ్మా యథాత్మకానాం తు సర్వేషాం బ్రహ్మయోగీనామ్
తతో సృజత్ పునర్రహ్మా రుద్రం రోషాత్మసంభవమ్ ।
సంకల్పం చైవ ధర్మం చ సర్వేషామేవ పర్వతౌ ॥
సోని సృజద్వ్యవసాయం తు బ్రహ్మా భూతం సుఖాత్మకం ।
సంకల్పాచ్చైవ సంకల్పో జజ్ఞే సోవ్యక్తయోనినః ॥
ప్రాణాదక్షో సృజద్వాదం చక్షుర్యాం చ మరీచినమ్ ।
భృగుశ్చ హృదయాజ్ఞజ్ఞే ఋషిః సలలిలయోనినః ॥
శిరసశ్చాంగిరాశ్చైవ శ్రోత్రాదత్రిస్తథైవ చ ।
పులస్త్యశ్చ తథదానాదాద్వానాత్తు పులహస్తథా॥
సమానతో వశిష్ఠశ్చ హ్యపానాన్నిర్మమే క్రతుమ్ ।
ఇత్యేతే బ్రహ్మణః శ్రేష్ఠాః పుత్రా వై ద్వాదశ స్మృతాః ॥
స్థానాత్ములను ఆతఁడు సృజించీ యనంతరము ఇతరుల నాతఁడు సృజించెను. దేవతలను, పితృదేవతలను సృజించెను. వారి వలననే ప్రజలు వృద్ధి పొందిరి. (69) భృగువును, అంగీరసుని, మరీచిని, పులస్త్యునీ, పులహునీ, క్రతువును, దక్షుని, అత్రిని, వశిష్టుని, కూడ నాతఁడే సృజించెను. వీరందరు నవ (తొమ్మండుగురు) మానసులు. (70) ఈ విధంగా వీరు నవబ్రహ్మలని పురాణములో నీశ్చయింపబడినారు. బ్రహ్మ ఆస్వరూపంగల యోగులందరకు సృష్టికర్త. (71) వీరు తొమ్మండుగురు. నవబ్రహ్మలుగా పురాణములయందు (పూర్వము) నిశ్చయింపఁబడిరి. ఆత్మస్వరూపులు బ్రహ్మ యోగులయిన వీరందతీకి బ్రహ్మయే మూలము. తరువాత రోషాత్మ సంభవుఁడయిన రుద్రుని బ్రహ్మ మరల సృజించెను. ఎల్లరకు సంకల్పమును ధర్మమును పర్వతములుగా నతఁడే సృజించెను. (72) సుఖాత్మకము బ్రహ్మభూతమునయిన వ్యవసాయమును (ప్రయత్నశీలతను) అతఁడు సృజించెను. ఆ యవ్యక్తయోని యయిన పరమేశ్వరునకు సంకల్పమునుండి సంకల్పము పుట్టెను. (73) దక్షుఁడు (బ్రహ్మ) ప్రాణము వలన వాక్కును సృజించెను. నేత్రద్వయము నుండి మరీచిని, శిరస్సు నుండి ఆంగిరసుని, తరువాత శ్రోత్రము వలన అత్రిని, ఉదానము (పంచ ప్రాణములలో నొకటి) నుండి పులస్త్యుని, వ్యానము నుండి పులహుని, సమానము నుండి వశిష్టునీ, అపానము నుండి క్రతువును నిర్మించెను. వీరు బ్రహ్మ పుత్రులు : శ్రేష్ఠులు; సంఖ్యకు పండ్రెండుగురు.(76)
ధర్మాదయః ప్రథమజా విజ్ఞేయా బ్రహ్మణః స్మృతాః ।
భృగ్వాదయస్తు తే సృష్ణా న చ తే బ్రహ్మవాదినః ॥
గృహమేధిపురాణాస్తే విజ్ఞేయా బ్రహ్మణః సుతాః ।
ద్వాదశైతే ప్రసూయంతే సహా రుద్రేణ చ ద్విజాః ॥
ఋతుః సనత్కుమారశ్చ ద్వావేశావూర్ధ్వరేతసా ।
పూర్వోత్పతో పురా హ్యేతా సర్వేషామపి పూర్వజా॥
వ్యతీతా సప్తమే కల్పే పురాణా లోకసాధకౌ ।
విరజేకేఒత్ర వై లోకే తేజసాక్షిష్య చాత్మనః॥
తావుభౌ యోగధర్మాణావారోప్యాత్మనమాత్మానా ।
ప్రజాధర్మం చ కామం చ వర్తయేతే మహోజసా ఈఈ
యథోత్పన్నస్తథైవేహ కుమార ఇతి చోచ్యతే ।
తతః సనత్కుమారేతి నామ తస్య ప్రతిష్ఠితమ్ ॥
తేషాం ద్వాదశ తే వంశా దివ్యా దేవగణాన్వితాః ।
క్రియావన్తః ప్రజావన్తో మహర్షిభిరలంకృతాః ॥
ప్రాణజాంస్తు స దృష్ట్వా వై బ్రహ్మా ద్వాదశ సాత్త్వికాన్ ।
తతోసురానీతన్ దేవాన్ మనుష్యాంశ్చోసృజత్ర్పభుః ॥
ముఖాద్దేవానజనయత్ పితౄంశ్చైవాథ వక్షసః ।
ప్రజననాన్మనుష్యాన్వే జఘనాన్నిర్మమే సురాన్ ॥
భృగ్వాదులు సృజింపఁబడిరి. వారు బ్రహ్మవాదులు కారు, (77) వారందఱు ప్రాచీనులు. బ్రహ్మయొక్క సుతులు. గృహమేధులుగా నెఱుంగఁదగినవారు. వీరు పండ్రెండుగురు. ద్విజులు, రుద్రునితో కూడ పుట్టిరి. (78) క్రతువు, సనత్కుమారుఁడు - వీరిరువురు ఊర్వ రేతస్కులు వీరందఱికంటె. పూర్వమే యుదయించిరి. అందుచే వీరు పూర్వజులు. (79) వారతీతులు : లోక సాధకులు : పురాణులు ఏడవ కల్పము నందు లోకమున తమ తేజస్సుచే ప్రచోదితులయి ప్రకాశించిరి. (80) వారిరువురు యోగధర్మపరులు. తమ్ము ఆత్మలో నారోపించుకొని (ఆత్మ స్వరూపులయి) మహాతేజో బలవంతులయిన వారిరువురు ప్రజాధర్మమును కొమమును వర్తించిరి. (81) పుట్టినప్పుడే యతఁడు కుమారుని వలెనుండిను. అందుచే తరువాత నతనికి సనత్కుమారుఁడను నామము సుప్రతిష్ఠితమయ్యెను. వారివి ద్వాదశవంశములు. అవి దీవ్యములు, దేవగణాన్వితములు. ఆ వంశములు సంతానవంతములు, క్రీయాకరణ సమర్థములు, మహర్షులచే నలంకృతములు. (83) ప్రాణముల నుండీ పుట్టిన ద్వాదశ వంశీయులయిన సర్వగుణ ప్రధానులను బ్రహ్మ చూచి, తరువాత ఆ ప్రభువు దేవతలను, అసురలను, పితరులను, మనుష్యులను సృజించెను. ముఖము నుండి దేవతలను, వక్షస్థలమున నుండి పితరులను, జననేంద్రియముల నుండి మనుష్యులను, జఘనము నుండి అసురులను బ్రహ్మ పుట్టించెను.
నక్తం సృజన్ పునర్రహ్మా జ్యోత్స్నాయా మానుషాత్మనః ।
సుధాయాశ్చ పితౄంశ్చైవ దేవదేవః ససర్జ హ ॥
ముఖ్యాముఖ్యాన్ సృజన్ దేవాసురాంశ్చ తతః పునః ।
మనసశ్చ మనుష్యాంశ్చ పితృవన్మహతః పితౄన్ ॥
విద్యుతో శనిమేఘాంశ్చ లోహితేంద్రధనూంషీ చ ।
ఋచో యజూంషి సామానీ నీర్మమే యజ్ఞసిద్ధయే ॥
ఉచ్చావచాని భూతాని మహసః తస్య జజ్ఞిరే ।
బ్రహ్మణస్తు ప్రజాసర్గం దేవర్షిపితృమానవమ్॥
పునః సృజతి భూతాని చరాడి స్థావరాణి చ ।
యక్షాన్ పిశాచాన్ గంధర్వాన్సర్వశోప్సరసస్తథా॥
నరకిన్నరరక్షాంసి వయః పశుమృగోరగాన్ ।
అవ్యయం వా వ్యయం చైవ ర్వయం స్థావరజంగమమ్ ॥
తేషాం తే యాంతి కర్మాణి ప్రాక్ సృష్టానీ స్వయంభువా ।
తాన్యేవ ప్రతిపద్యంతే సృజ్యమానాః పునః పునః ॥
హింస్రాహింసే మృదుక్రూరే ధర్మాధర్మా కృతాకృతే ।
తేషామేవ పృథక్ సూతమవిభక్తం త్రయం విదుః ॥
ఏతదేవం చ నైవం చ న చోఖే నానుభే తథా ।
కర్మ స్వవిషయం ప్రాహుః సత్త్వస్థాః సమదర్శినః॥
నామాత్మపంచభూతానాం కృతానాం చ ప్రపంచతామ్ ।
దివశబ్ధేన పంచైతే నీర్మమే స మహేశ్వరః ॥
దేవదేవుఁడయిన బ్రహ్మ మరల మానుషాత్మమయిన జ్యోత్స్న నుండి రాత్రిని, సుధ నుండి పితరులను సృజించెను. (86) తరువాత ముఖ్యులు అముఖ్యులునునయిన దేవతలను సురలను, మనస్సు నుండి మనుష్యులను, పితరులవలే మహా పితరులను బ్రహ్మ సృజించెను. (87) విద్యుత్తు నుండి పిడుగులతోడి మేఘములను లోహిత వర్ణముగల ఇంద్ర ధనువులను, ఋక్కులను, యజస్సులను, సామములను, బ్రహ్మ యజ్ఞ సీద్దీ కొఱకు నిర్మాణించెను. (88) నానా విధములయిన భూతములు ఆ బ్రహ్మ మహస్సు నుండి పుట్టెను. దేవతలు ఋషులు పితరులు, మానవులు బ్రహ్మయొక్క ప్రజాసృష్టియైనది. (89) మల బ్రహ్మ, చరాచరములయిన భూతములను యక్షులను, పిశాచములను, గంధర్వులను, అంతటను అప్సరలను, నరులను, కిన్నరులను, రాక్షసులను, పక్షులను, పశువులను, మృగములను, సర్పములను, వ్యయము అవ్యయము నయన స్థావర జంగమ వస్తు ద్వయమును సృష్టించెను. (90-91) స్వయంభువుడయిన బ్రహ్మ సృజనమునకు పూర్వము వానికే యే కర్మలున్నవో, మఱల మఱల సృజింపబడి ఆయా కర్మలనే యవి పొందుచున్నవి. (92) హింసాత్మకములు, అహింసాత్మకములు, మృదువులు క్రూరములు, ధర్మాధర్మములు, చేయబడినవీ చేయబడనీవీ (కృతాకృతములు) వానికి వేఱువేఱుగా కనబడినను విభజింపబడని త్రివిధ భేధలక్షణములు కలిగినవని యెంటుంగవలయును. (94) సత్త్వస్టులయిన సమదర్శినులు, అట్టిది, అట్టిది కానిదీ, ఉభయమైనదీ, ఉభయము కానీదీయు కర్మ విషయమని వక్కాణింతురు. (95) తను నామములచే పంచ భూతముల వాని విస్తృతిని, దివ శబ్దముచే ఆమహేశ్వరుఁడు సృజించెను.
ఆర్షాణి చైవ నామాని యాశ్చ దేవేషు సృష్టయః ।
శర్వర్యాం న ప్రసూయనే పునస్తేభ్యోదధత్ర్పభుః॥
ఇత్యేవం కారణాద్భూతో లోకసర్గః స్వయంభువః ।
మహదాద్యా విశేషాన్హా వికారాః ప్రాకృతాః స్వయమ్ ॥
చంద్రసూర్యప్రభో లోకో గ్రహనక్షత్రమండితః ।
నదీభిశ్చ సముదైశ్చ పర్వతైశ్చ సహస్రశః ॥
పురైశ్చ వివిధై రమ్యైః సీతైర్జనపదైస్తథా ।
అస్మిన్ బ్రహ్మవనే వ్యక్తి బ్రహ్మా చరతి సర్వవిత్ ॥
అవ్యక్తబీజప్రభవస్తస్యైవానుగ్రహే స్థితః ।
బుద్ధిస్కంధమయశ్చైవ ఇంద్రియాంతరకోటర ॥
మహాభూతప్రకాశశ్చ విశేషైః ప్రత్రవాంస్తు సః ।
ధర్మాధర్మసుపుష్పస్తు సుఖదుఃఖఫలోదయః ॥
ఆజీవః సర్వభూతానాం బ్రహ్మవృక్షస్సనాతనః ।
ఏతద్ బ్రహ్మవనం చైవ బ్రహ్మవృక్షస్య తస్య తత్॥
అవ్యక్తం కారణం యత్ర నిత్యం సదసదాత్మకమ్ ।
ప్రధానం ప్రకృతిం మాయాం చైవాహుస్తత్వచింతకాః ॥
ఇత్యేషోనుగ్రహః సర్గో బ్రహ్మనైమిత్తికః స్మృతః ।
అఋద్ధిపూర్వకాః సర్గా బ్రహ్మణః ప్రాకృతాస్త్రయః॥
ముఖ్యోదయస్తు షట్ సర్గా వైకృతా బుద్ధిపూర్వకాః ।
వైకల్పాత్సంప్రవర్తనే బ్రహ్మణస్తేభిమన్యవః ॥
ఏయవి యార్ష నామములు దేవతల యందు సృష్ణులో, అవి రాత్రియందు పుట్టవు : మటల ప్రభువయిన బ్రహ్మ వానీ కొఱకు వహించెను. (96) ఈ విధముగా స్వయంభువుని వలన మహత్తు మొదలుకొని విశేషాంతము వణుకు, ప్రాకృతములయిన వికారములు స్వయముగా లోక సర్గము కారణము నుండి యుద్భూతమయినవి. (97) చంద్రసూర్యరుచిభాసురమై, గ్రహనక్షత్ర శోభితమై సహస్ర సంఖ్యాకము లయిన నదులతో, సముద్రములతో పర్వతములతో (98) వివిధములు రమ్యములు, ప్రకాశవంతములు నయిన పురములతో, జనపదములతో బ్రహ్మ ప్రాకృత సృష్టి యొప్పెను. దీనిని బ్రహ్మవనమందురు. ఈ బ్రహ్మవనమునందు అవ్యక్తుఁడు, సర్వవిదుఁడునైన బ్రహ్మ సంచరించును. (98) అవ్యక్త బీజప్రభవమై ఆతనీ యనుగ్రహమున స్థితినొంది, బుద్దిరూప స్కంధములు గలిగి, ఇంద్రియాంతర కోట రంబై తనరి (100) మహా భూత ప్రకాశమై, విశేష పత్రములతోగూడి, ధర్మాధర్మ పుష్ప యుతమై సుఖదుఃఖ ఫలోదయమై (101) సర్వభూతములకు జీవసాధనంబయి, సనాతనమై బ్రహ్మ వృక్షములలరారును. ఇయ్యది బ్రహ్మాండమను వనమునందొప్పి యున్నది. (102) అవ్యక్తము కారణమయి, నిత్యమయి, సదాసదాత్మకమై యియయ్యది యుండును. తత్త్వ చింతకులు దీనినే ప్రధానమని, ప్రకృతియని, మా యయని చెప్పుదురు. (103) ఇట్లు ఈ సృష్టి బ్రహ్మయొక్క అనుగ్రహమని బ్రహ్మనిమిత్తమాత్రుఁడని యెరుంగ వలయును. వృద్ధి రహితములు ప్రాకృతములు నయిన సృష్టులు మూడు. (104) వీనిలో ముఖ్యాదులయినవి ఆరు. ఇవియు వైకృతములు బుద్ధిపూర్వకములు. ఇవియన్నియు వికల్పముగా బ్రహ్మ నుండి ప్రవర్తించును.
ఇత్యేతే ప్రాకృతాశ్చైవ వైకృతాశ్చ నవ స్మృతాః ।
సర్గాః పరస్పరోత్పన్నాః కారణైస్తు బుధైః స్మృతమ్ ॥
మూర్తానం వై యస్య వేధా వదంతి వియన్నాభిశ్చంద్ర సూర్యౌ చ నేత్రే ।
దీశః శ్రోత్రే విద్ధి, పాదౌ క్షితిం చ సోఖచింత్యాత్మా సర్వభూతప్రణీతా॥
వక్రాద్యస్య బ్రాహ్మణాః సంప్రసూతా వక్షసశ్చైవ క్షత్రియా పూర్వభాగే ।
వైశ్యా ఊరుభ్యాం యస్య పద్భ్యాం చ శూద్రాః సర్వే వర్ణా గాత్రతః సంప్రసూతాః ॥
నారాయణాత్పరోవ్యదండమువ్యక్తసంజ్ఞాతమ్ ।
అండజస్తు స్వయం బ్రహ్మా లోకాస్తేన కృతాః స్వయమ్ ॥
తత్ర కల్పాన్ దశ స్థిత్వా సత్యం గచ్ఛత్తి తే పునః ।
తే లోకా బ్రహ్మలోకం పై అపరావర్తినీం గతిమ్ ॥
ఆధిపత్యం వినా తే వై ఐశ్వర్యేణ తు తత్సమాః ।
భవస్తి బ్రహ్మణా తుల్యరూపేణ విషయణ చ ॥
తత్ర తే హ్యవతినే ప్రీతియుక్తాః స్వసంయుతాః ।
అవశ్యం భావినార్థన ప్రాకృతం తనుతే స్వయమ్ ॥
నానాత్వేనాభిసంబంధ్యాస్తదా తత్కాలభావితాః ।
స్వపతో బుద్ధిపూర్వం హి బోధో భవతి వై యథా ॥
తత్కాలభావితే తేషాం తథా జ్ఞానం ప్రవర్తతే 1
ప్రత్యాఃహారైస్తు భేదానాం తేషాం హి న తు శుషిణామ్ ॥
తైశ్చ సార్ధం ప్రవర్తనే కార్యాణి కారణాని చ ।
నానాత్వదర్శినాం తేషాం బ్రహ్మలోకనివాసినామ్ ॥
ఇట్లు ప్రాకృతములు వైకృతములని సృష్టులు తొమ్మిది విధములు. ఇవి పరస్పరోత్పన్నములు. పరస్పరము కారణములని బుధులు తలంచుచున్నారు. (106) అచింత్యాత్ముఁడు భూతసృష్టికి కారణమయిన మహాత్మునకు, మూర్ధము వేదమయ్యెను. ఆకాశము నాభియయ్యెను. సూర్యచంద్రులు నేత్రద్వయమైరి. దిక్కులు శ్రోత్రములు, పాదములు భూమి,యునయ్యెను. (107) ఆ మహాత్మునీ వక్షము నుండి బ్రాహ్మణులు, వక్ష స్థలము నుండి క్షత్రియులు, ఊరుద్వయము నుండి వైశ్యులు, పాదముల నుండి శూద్రులు, శరీరము నుండి (తనువు నుండి) సర్వవర్ణములు ప్రసవించిరి. (108) అవ్యక్తుఁడైన నారాయణు నుండి బ్రహ్మాండమ వ్యక్త సంజ్ఞితముగా నుద్భవించెను. బ్రహ్మాండమే స్వయముగా బ్రహ్మ ఆతనీ వలననే లోకములు స్వయముగా సృజింపఁబడినవి. (109) అందు పదికల్పముల కాలముండి, ఆత్మభవుఁడు అఖిలలోకులు మరల సత్యమను పేరనొప్పు లోకమునకు పోవుదురు. అది బ్రహ్మలోకము. అందు వారుపునారవృత్తి లేని గతినందుదురు. తిరిగి జన్మనొందరు. (110) ఆధిపత్యమొక్కటి తక్క ఆ బ్రహ్మ లోకమున వారందరు సర్వైశ్వర్యముతో బ్రహ్మతో తుల్యత్వమొంది రూపమున ఘనతత్త్వ చింతనమున సమానులై యుందురు. (111) అచ్చట వారు ప్రీతియుక్తులై స్వసంయుతులై, శక్తిసంపన్నులై యెప్పుడే యది చేయవలయునో దానినొనరించుచు నుందురు. (112) నిద్రించు సమయముల అబుధ్ధిపూర్వకమయిన బోధకలుగునట్లు, వారందరు సానొకార్యకలాపముల సంబంధము కలిగియుండియు తత్కాల భావితములయిన క్రియలలో నిమగ్నులయ్యు, స్వబుద్ధి పూర్వకమగు విజ్ఞానమును గలిగియే యుందురు. (113) తత్తత్కాల భావితమయిన జ్ఞానము వారల కుండును. వారు శుష్ములు. అగ్నివత్ పరిశుద్ధులు. వారికి భేదబుద్ధులుండవు. (114) ఆ బ్రహ్మలోకమున నివసించునట్టివారు, నాసాత్వ దర్శినులునునయిన వారివలన కార్యములు కారణములు ప్రవర్తిల్లును.
వినివృత్తవికారాణాం స్వేన ధర్మేణ తిష్ఠతాం ।
తుల్యలక్షణసిద్ధార్ధస్తు శుభాత్మానో నిరంజనాః ॥
ప్రాకృతే కరణోపేతాః స్వాత్మన్యేవ వ్యవస్థితాః ।
ప్రస్థాపయిత్వో చాన్మానం ప్రకృతిస్వేష తత్త్వతః ఈఈ
పురుషాన్యబహుత్వేన ప్రతీతా న ప్రవర్తతే ।
ప్రవర్తతే పునః సర్గస్తేషాం సా కారణాత్మనామ్ ॥
సంయోగః ప్రకృతిర్జయా యుక్తానాం తత్వదర్శిస్త్రం ।
తత్రోపవర్గీజీ తేషామపునర్ళారగామినాం ॥
అభావతః పునస్సత్యం శాంతానామర్చిషామివ ।
తతస్తేషు గతేషూర్వం త్రైలోక్యత్తు ముదాత్మసు ॥
తే సార్ధం యేర్మహర్లోకస్తదానాసాడితస్తు వై ।
తచ్ఛిష్యా యే హ తిష్టంతీ కల్పదోహ ఉపస్థితే ॥
గంధర్వాద్యాః పిశాచాశ్చ మానుషా బ్రాహ్మణాదయః ।
పశవః పక్షిణశ్చైవ స్థావరాః ససరీసృపాః ॥
తిష్ఠత్సు తేషు తత్కాలం పృథివీతలవాసిషు ।
సహస్రం యత్తు రశ్మీనాం సూర్య సేహ వినశ్యతి ॥
తే సప్తరశ్మయో భూత్వా ఏకైకో జాయతే రవిః ।
క్రమేణ శతమానిస్తే తీన్లోకాన్పదహంత్యుత ॥
జంగమాన్ స్థావరాంశ్చైవ నదీః సర్వాంశ్చ పర్వతాన్ ।
శుష్కే పూర్వమనావృష్ట్యా యైనైశ్చైవ ప్రతాపితాః ॥
విగతవికారులు, తమ తమ ధర్మమునందు సంస్థితులు నయినవారు, బ్రహ్మతో తుల్య లక్షణములు పొందినవారు, శుభాత్ములు, దోష రహితులు; తమ ప్రకృతీ లక్షణములు కరణములు గలిగి, తమ స్వభావ స్థితులై, యుందురు. నిజమునకు తమ ప్రకృతి స్థాపన ప్రకృతులయి స్థాపించుట లక్షణము. (117) అన్య పురుష బహుత్వముచే ప్రతీతి కలుగదు. వారు వారి యొక్క ఆకార సదృశులైనవారి సృష్టిచే మటల సర్గము ప్రవర్తించును. (118) తత్త్వదర్శినులకు, సమాధి స్థితులకు సంయోగము (ప్రకృతి భావముతోని సంసర్గము) కలిగినచో నది స్వప్రకృతిచే దేలీయదగినది. వారొక వర్గమునకు చెందినవారు. తిరిగి జన్మ సంబంధమయిన భారమును వహించువారు కారు. (119) శాంతించిన అగ్నులకుం వోలే వారికి మరల జన్మము లేకపోవుట సత్యము. తరువాత నచ్చట నుండి త్రైలోక్యము కంటినూర్థ్వమున కరిగి సంతోషాత్ములై యుందురు. (120) పొరలతో మహర్లోకము అసాసాదితమయినది. వారి శిష్యులు ఎవ్వరచ్చట నుండిరో, ప్రళయ మందలి కల్పాన్నీ సన్నిహితము కాగా గంధర్వాదులు, పిశాచులు, మనుష్యులు, బ్రాహ్మణాదులు, పశువులు, పక్షులు, స్థావరములు, ససరీసృపములు, పృథివీతల వాసులు నుండగా, (నవీయన్నీయు) సహాస్ర సంఖ్యగా వెలయు సూర్యరశ్ముల యొక్క కారణముగా నశించును. (123) ఆ యగ్నులు సప్తరశ్ములయి యొక్కొక్కటీ యొక సూర్యసదృశమై పుట్టును. క్రమముగా నవి శతమాన సంఖ్యనొందును. మూడు లోకములను దహించును. (124) అనావృష్టిచే పూర్వమేవ్వీ - జంగమ పదార్ధములు స్థావరములు, నదులు, సర్వపర్వతములు శుష్కములయినవోయవ్వి యా భయంకర సూర్య రశ్ములచే తప్తములై యొప్పినవీ.
తదా తే వివశాః సర్వే నిర్దగ్ధః సూర్యరశ్మిభిః ।
జంగమాః స్థావరాశ్చైవ ధర్మాధర్మాధికాస్తు వై ॥
దగ్గదేహాస్తదా తే తు ధూమపాపా యుగాత్యయే ।
ఖ్యావాతపా వినిర్ముక్తాః శుభయా చాతిబంధయా ॥
తతస్తే హ్యుపపద్యనే తుల్యరూపైర్జనెర్జనాః ।
ఉషిత్వా రజనీం తే చబ్రహ్మణోని వ్యక్తజన్మనః॥
పునః సరే భవన్తహ మానస్యో బ్రహ్మణః ప్రజాః ।
తతస్తేషు ప్రపన్నేషు జనై సైలోక్యవాసిషు ॥
నిర్దధేషు చ లోకేషు తదా సూర్యేస్తు సప్తభిః ।
వృష్యా క్షితా వైవితాయాం విజయేష్వర్ణచేషు వా ॥
సముద్రాశ్చైవ మేఘాశ్చ ఆపశైవాథ పార్థివః ।
శరవణా ప్రజంత్యేవ సలీలాభ్యాస్తథాచలాః ॥
ఆగతాగతికం చైవ యదా తు సలిలం బహు ।
సంఛాద్యేమాం స్థితాం భూమిమర్ణవాఖ్యం తదాజ భవత్ ॥
ఆభాతి యస్మాచ్చాభాసాధ్భాశబ్దః కాంతిదీప్తిషు ।
స సర్వః సమనుప్రాప్తమాసాం భాభ్యో విభావ్యతే ॥
తదంతస్తనుతే యస్మాత్ సర్వాం పృథ్వీం సమంతతః ।
ధాతుస్తనోతి విస్తారం తతోపతనవః స్మృతాః ॥
శార ఇత్యేవ శీర్ణ తు సానాల్గో ధాతుదుచ్యతే ।
ఏకార్ణవే భవంత్యాపో న శీర్షాస్తేన తా నరాః ॥
అప్పుడు స్థావరములు జంగమములయిన సర్వపదార్ధములు వీవశములై సూర్యరశ్మిచే దగ్గపటలములైనవి. అయ్యవి దగ్గములయిన దేహములతో విధూతములు ప్రక్షాళితములయిన పాపములతో, యుగాంతమునందు వీఖ్యాతములయినవి. తాపముల నుండి వినిర్ముక్తములయినవి. శుభాశుభకర్మ బంధముల నుండి విడివడినవి. (127) అంత, అవ్యక్త జన్ముఁడయిన బ్రహ్మ సంబంధ మయిన ఒకరాత్రి కాలము వారు (అవీ) యుండి, తమతో సమానమయిన రూపములు గల జనులతో కలిసికొందురు. మరల వచ్చెడు జన్మములో వారందరు బ్రహ్మమానస జన్ములగుదురు. అంత, మూఁడు లోకముల యందు నివసించుచున్నట్టి వారు జనులతో గలిసిపోయిన తరువాత (129) మూఁడు లోకములు సప్తసూర్యులచే దగ్గములయిన వేనుక, భూమి యంతయు వివిక్త ప్రదేశముల యందు సముద్రములయందు వర్షముచే పరిస్లావితముకాగా (130) సముద్రములు, మేఘములు, భూమియందలి నీరములు, శరప్రవాహములవలె ముందునకు ప్రవహించుకోనుచు పోవును. అయ్యవి పర్వతములచే పిలువబడిపోవునట్లు “సలిలము”లని పేరు పొందును. (131) ఇట్లు ప్రవహించేడీ, ప్రవహింపక నిలిచిపోయి యున్న నీరములు భూమిని కప్పి ఆచ్చాదీంచి యుండును. అందుచే 'అర్ణవ' మను పేరు దానికి కలిగెను. (132) అంతకు పూర్వం వచ్చినది, రాబోవునది అయిన అధికమయిన జలము ఈభూమినీ కప్పివేసి సముద్రముగా అయినది. ఇచ్చట 'భా' అన్నది కాంతి, ప్రకాశమను నర్థమున వాడబడినది. అంత నొ నీరము సర్వమును వ్యాపించినది. అన్నియును నందు విలీనమయి నవి. ఆ జలము పృథివి అంతటను విస్తరించి, వ్యాపించినది యగుట 'అతను' అయినది. 'తనోతి' ధాతువు. వ్యాపించుట; అందుచే నీటికి అపతనువను పేరు వచ్చినది. (134) ‘సర’ అను పదమునకు 'శీర్ణ' అను అర్ధము కలదు. శీర్ణము చెదరిపోయినది. ఈ ధాతువున కెన్నియో యర్ధములున్నవి. ఆయనంత జల విస్తృతిలో జలము శీర్ణము కాలేదు. అందుచే 'నారము' లయినవి. (135)
తస్మిన్ యుగసహస్రాస్తే సంస్థితే బ్రహ్మణోహని ।
తావత్కాలం రజస్యాం చ వర్తయంత్యాం సలిలాత్మనః ॥
తతస్తే సలిలే తస్మిన్ నష్ట్నాగ్నౌ పృథివీతలే ।
ప్రశాస్తవాతేజంధకారే నిరాలోకే సమస్తతః ॥
యేనైవాధిష్ఠితం హీదం బ్రహ్మణః పురుషః ప్రభుః ।
విభాగమస్య లోకస్య ప్రకర్తుం పునరైచ్ఛత ॥
ఏకార్ణవే తతస్తస్మిన్ నష్ట స్థావరజంగమే ।
తదా భవతి స బ్రహ్మా సహస్రాక్షః సహస్రపాత్॥
సహస్రశీర్షా పురుషో రుక్మవర్ణో హ్యతీంద్రియః ।
బ్రహ్మా నారాయణాఖ్యస్తు సుష్వాప సలిలే తదా॥
సత్త్వో ద్రేకాత్రమబద్ధస్తు స శూన్యం లోకమైక్షత ।
అనేనాద్యేన పాదేన పురాణం పరికీర్తితమ్ ॥
ఇతి శ్రీ బ్రహ్మాండపురాణే వాయుప్రోక్తే పూర్వభావే ప్రథమే ప్రక్రియాపాదేమహా లోకకల్పనం నామ పంచమోధ్యాయః॥
ఆ నీటిలో సహస్రయుగముల యనంతరము, బ్రహ్మయొక్క దినప్రమాణము సమాప్తము కాగా, అంతటి ప్రమాణమే కలిగిన బ్రహ్మ యొక్క రాత్రి కాలము నీటిలో కలుగగా, అప్పుడు నీటియందు గల భూమీయందు అగ్ని చల్లారును. అప్పుడు ప్రశాంతములయిన గాలులలో అంధకారములో, వెలుతురే మాత్రముండదు. (137) ప్రపంచమున ఆధ్యక్షము వహించిన బ్రహ్మ మరల లోకమును విభజింపఁదల పోసెను. (138) ఏకార్ణవ మయి నీరములచే వ్యాప్తమై యున్న ప్రపంచమున చరాచరములయిన సర్వము నశించినవి. అప్పుడు సహస్రాక్షుఁడు సహస్రపాదుఁడు సహస్రశీరుఁడు, రుక్మవర్లుఁడు, అతీంద్రియుఁడు నైన బ్రహ్మ నారాయణాఖ్యుండు ఆ జలముల నిద్రించెను. (139,140) మరల సత్వోద్రేక మున నాతండు మేల్కొనెను. సర్వ ప్రపంచమును దిలకించెను. శూన్యమైయుండుట కొంచెను. దీనితో బ్రహ్మాండ పురాణము యొక్క ప్రథమ పాదము పరికీర్తితమయినది.
ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండపురాణమున ప్రథమభాగమున ప్రక్రియా పాదమునందు లోక కల్పనమను పంచమాధ్యాయము సంపూర్ణము.
Summary of chapter 5 of the Brahmānda Mahā Purana is as follows:
Continuing the grand cosmic saga, this chapter sings of the subsequent unfolding of diverse life forms and intricate worldly realms from the primordial essence. It lovingly chronicles the manifestation of gods, celestial beings, and terrestrial creatures, all breathed into existence by the compassionate gaze of the divine. The prose deeply stirs the soul, reminding the devout that every particle of the universe pulses with the sacred rhythm of the supreme architect's boundless love.