40 - చత్వారింశోధ్యాయః

అగస్త్య ఉవాచ:

శ్రీకామకోటిపీఠస్థా మహాత్రిపురసుందరీ ।

కం కం విలాసమకరోతామాక్షీత్యభివిశ్రుతా॥

శ్రీకామాక్షీతి సా దేవీ మహాత్రిపురసుందరీ। భూమండలస్థితా దేవీ కింకరోతి మహేశ్వరీ॥

 ఏతస్యాశ్చరితం దివ్యం వద మే వదతాం వర॥

అగస్త్యుడనెను : శ్రీకామకోటి పీఠమున నున్న మహాత్రిపురసుందరి కామక్షియనుపేర ప్రసిద్ధురాలై ఏయే విలాసములు చేసెను-1. ఓ ప్రవక్తలో వరిష్టుడవైన హయగ్రీవా! మహేశ్వరియై త్రిపురసుందరియైన యా మహాదేవి శ్రీకామాక్షియను పేర భూమండలముననున్నదై యేమి చేయును? ఈమె యొక్క దివ్యమైన చరితమును. నాకు జెప్పుము.

హయగ్రీవ ఉవాచ:

అత్ర స్థితాపి సర్వేషాం హృదయస్థా ఘటోద్భవః।

తత్తతర్మానురూపం సా ప్రదతే దేహినాం ఫలమ్॥

యత్మించిద్వర్తతే లోకే సర్వమస్యా విచేష్టితమ్।

 కించిచ్చింతయతే కశ్చిత్స్వచ్ఛందం విదధాత్యసౌ ॥

తస్యా ఏవావతారోస్తు త్రిపురాద్యాశ్చ శక్తయః।

ఇయమేవ మహాలక్ష్మీ సపర్ణాండత్రయం పురా॥

పరత్రయాణామావాసం శక్తీనాం తీసృణామపి ।

ఏకస్మాదండతో జాతావంటికాపురుషోత్తమౌ॥

శ్రీ విరించో తతో న్యస్మొదన్యస్మాచ్చ గిరాశివా।

ఇందిరాం యోజయామాస ముకుందేన మహేశ్వరీ।

పార్వత్యా పరమేశానం సర్వస్వత్యా పితామహమ్॥

బ్రహ్మాణం సర్వలోకానాం సృష్టికార్యే న్యయుంక్త సా।

వాసుదేవం పరిత్రాణీ సంహారే చ త్రిలోచనమ్॥

తే సర్వేతి పి మహాలక్ష్మీం ధ్యాయంతః శర్మదాం'।

సదా? బ్రహ్మలోకే చ వైకుంటే కైలాసే చ వసంత్యమీ॥

కదాచితార్వతీ దేవీ కైలాసశిఖరే శుభే విహరంతీ।

మహేశస్య పిధానం నేత్రయోర్వ్యధాత్॥

చంద్రసూర్యౌ యతస్తస్య నేత్రాత్తస్మాష్ణగత్రయమ్।

అంథకారావృతమభూదతేజస్కం సమంతతః ॥

తతశ్చ సకలాలోకాస్యప్తదేవపితృక్రియాః।

ఇతికర్తవ్యతామూఢా న ప్రజాసంత కించవ॥

తదృష్ట్వా భగవాన్ రుద్రః పార్వతీమిదమబ్రవీత్।

త్వయా పాపం కృతం దేవి మమ నేత్రపిధానతఃఈఈ

బుషయ స్యక్తతపసో హతసంధ్యాశ్చ వైదికాః।

 సర్వం చ వైదికం కర్మ త్వయా నాశితమంబికే॥

తస్మాత్పాపస్య శాంత్యర్థం తపః కురు సుదుష్కరమ్।

గత్వా కాశీం వ్రతం తత్ర కించిత్కాలం సమాచర॥

పశ్చాత్కాంచీపురం గత్వా కామాక్షీం తత్ర ద్రక్ష్యసి ।

ఆరాధయేతాం నిత్యం త్వం సర్వపాపహరీ శివామ్॥

తులసీమగ్రతః కృత్వా కంపాకూలే తపః।

కురు ఇత్యాదిశ్య మహాదేవస్తతైవాంతరధీయత॥

తథాకృతవతీశానీ భర్తురాజ్ఞానువర్తినీ।

చిరేణ తపసా క్లిష్టామనన్యహృదయాం శివామ్ ॥

అగ్రతః కృతసాన్నిధ్యా కామాక్షీ వాక్యమబ్రవీత్ ।

వత్సే తపోభిరత్యుగైరలం ప్రీతాస్మి సువతే॥

ఉన్మీల్య నయనే పశ్చాత్ పార్వతీ స్వపురఃస్థితామ్।

బాలార్కాయుతసంకాశాం సర్వాభరణభూషితామ్॥

 కిరీటహారకేయూరకటకాద్యైరలంకృతామ్।

పాశాంకుశేక్షుకోదండపంచబాణలసత్కరామ్॥

కిరీటమకుటోల్లాసిచంద్రరేఖావిభూషణామ।

విధాతృహరిరుద్రేశసదాశివపదప్రదామ్॥

సగుణం బ్రహ్మ తామాహురనుత్తరపదాభిధామ్।

ప్రపంచద్వయనిర్మాణకారిణీం తాం పరాంబికామ్॥

తాం దృష్ట్వాథ మహారాజ్జీం మహానందపరిషతా।

పులకాచితసర్వాంగీ హర్షణోత్ఫుల్లలోచనా॥

చండికా మంగలాద్యైశ్చ సహసా స్వసజనైః।

ప్రణిపత్య చ సాష్టాంగం కృత్వా చైవ ప్రదక్షిణాం॥

బద్దాంజలిపుటా భూయః ప్రణతా స్వైక్యరూపిణీ।

తొమాహ కృపయా వీక్ష్యమహాత్రిపురసుందరీ॥

బాహంభ్యాం సంపరిష్వణ్య సస్నేహమిదమబ్రవీత్।

వత్సే లభస్వ భర్తారం రుద్రం స్వమనసేప్సితమ్॥

లోకే త్వమపి రక్షార్థం మమాట్టోమనువర్తయ।

అహం త్వమితి కో భేదస్త్వమేవాహం న సంశయః ॥

కిం పాపం తవ కల్యాణి త్వం హి పాపనికృంతనీ॥

ఆమనంతి హి యోగీంద్రాస్త్వామేవ బహంరూపిణీమ్।

లీలామాత్రమిదం వత్సే పరలోకవిదంబనమ్॥

ఇత్యూచిషీం మహారాజ్జీమంబికాం సర్వమంగళా।

భక్త్యా ప్రణమ్య పశ్యంతీం పరాం ప్రీతిముపాయ॥

స్రువత్యామేవ పార్వత్యాం తదానీమేవ సా పరా।

ప్రవిష్టా హృదయం తస్యాః ప్రహృష్టాయా మహామునే ॥

 అథ విస్మయమాపన్నా చింతయంతీ ముహుర్ముహుః।

 స్వప్నః కిమేష దృష్టో వా మయా కిమథవా భ్రమః ॥

ఇత్తం విమృశ్య పరితః ప్రేరయామాస లోచనే।

జయాం చ విజయం పశ్చాత్ సఖ్యావాలోక్య॥

సస్మితే ప్రసన్నవదనా సా తు ప్రణతే వదతిస్మ సా ।

ఏతావంతమలం కాలం కుత్ర యాతే యువాం ప్రియే॥

మయా దృష్టాం తు కామాక్షీం యువాం చేతిమపశ్యతమ్।

సభ్యౌ తు తద్వచః శ్రుత్వా ప్రహరోత్ఫుల్లలోచనే॥

పుష్పాడి పూజనార్హిణి నిధాయాగ్రే సమూచతుః।

సత్యమేవాధునా దృష్టి హ్యావాభ్యామపి సా పరా।

న స్వప్నో న క్రమో వాపి సాక్షాత్తే హృదయం॥

గతా ఇత్యుక్త్వా పార్వయోస్తస్యా నిషణ్ణి వినయానలే।

ఏకామ్రమూలే భగవాన్ భవానీవిరహార్తిమాన్ ।

గౌరీసంప్రాప్తయే దధ్యే కామాక్షీం నియతేంద్రియః ॥

తత్రాపి కృతసాంనిధ్యా శ్రీవిద్యాదేవతా పరా।

ఆచష్ట కృపయా తుష్టా ధ్యాయంతం నిశ్చలం శివమ్॥

అలం ధ్యానేన కందర్పదర్పప్ను త్వం మమాజ్ఞయా।

అంగీకురుష్వ కందర్పం భూయో మచ్ఛాసనే స్థితమ్॥

ఏకామసంజే మళ్పీరే త్విహైవ నివసన్ సదా।

త్వమేవాగత్య మత్రీత్యై సంనిధౌ మమ సువ్రత।

తాపద్వయం జహీహ్యాకు యోగజం తద్వియోగజమ్।

ఇత్యుక్త్వాంతర్ధధే తస్య హృదయే పరమా రమా॥

శివోవ్యుత్థాయ సహసా ధీరః సంహృష్టమానసః।

తస్యా అనుగ్రహం లబ్ద్వి సర్వదేవనిషేవితః॥

హృది ధ్యాయంశ్చ తామేవ మహాత్రిపురసుందరీమ్।

యద్విలాసాత్సముత్పన్నం లయం యాతి చ యత్ర వై॥

జగచ్చరాచరం చైతత్పపంచద్వితయాత్మకమ్।

భూషయంతీం శివాం కంపామనుకంపార్ధమానసామ్॥

అంగీకృత్య తదా గౌరీ వైవాహికవిధానతః।

ఆదాయ వృషమారుహ్య కైలాసశిఖరం యయా॥

పునరన్యం మహాప్రాజ్ఞం సమాకర్ణయ కుంభజ।

ఆదిలక్ష్మ్యా ప్రభావం తు కథయామి తవానఘ॥

సభాయాం బ్రహ్మణో గత్వా సమాసీదుస్త్రీమూర్తయః ।

దిక్పాలాశ్చ సురాః సర్వే సనకాద్యాశ్చ యోగినః ॥

దేవర్షయో నారదోద్యా వశిష్టాద్యాశ్చ తాపసా:।

తే సర్వే సహితాస్తత్ర బ్రహ్మణశ్చ కపర్దినః ।

ద్వయోః పంచముఖత్వేన భేదం న వివిదుస్తదా॥

అన్యోన్యం పృష్టవంతస్తే బ్రహ్మా కః కశ్చ శంకరః।

తేషాం సంపదతాం మధ్యే క్షిప్రమంతర్షితః శివః ॥

తదా పంచముఖో బ్రహ్మాసితో నారాయణస్తయోని।

ఉభయోరపి సంవాదస్వహం బ్రహ్మేత్యజాయత॥

అజ్ఞ మన్నాభికమాతాజ్ఞాతస్త్వం యన్మమాత్మజః ।

సృష్టికర్తా త్వహం బ్రహ్మా నామసాధర్మ్యతస్తథా॥

త్వం చ రుద్రశ్చ మే పుత్రా సృష్టికర్తురుభౌ యువమ్।

ఇతి మాయామోహితయోరుభయోరంతరే॥

తదాఁ తయాశ్చ స్వస్య మహాత్మ్యమహం బ్రహ్మేతి దర్శయన్।

ప్రాదురాసీన్మహాజ్యోతిస్తంభరూపో మహేశ్వరః।

జ్ఞాత్వైవైనం మహేశానం విష్ణుస్తూష్ఠిం తతః స్థితః॥

పంచవక్షస్తతో బ్రహ్మా హ్యవమత్యైవమాస్థితః।

బ్రహ్మణః శిరసామూర్ధ్వం జ్యోతిశ్చక్రమభూత్పురః॥

తన్మధ్యే సంస్థితో దేవః ప్రాదురాసోమయా సహ।

ఊర్ధ్వమైక్షథ భూయస్తమవమత్య వచోబ్రవీత్॥

తన్నిశమ్య భృశం క్రోధమవాప త్రిపురాంతకః।

విష్ణుమేవం తదాలోక్య క్రోధేనైవ వికారతఃఈఈ

తయోరేవ సముత్సన్నో భైరవః క్రోధసంయుతః।

మూర్ధానమేకం చిచ్ఛేద నఖేనైవ తదా విధే॥

హాహేతి తత్ర సర్వేల_పి క్రందంతశ్చ పలాయితాః ।

 అథ బ్రహ్మకపాలం తు నఖలగ్నం స భైరవః॥

భూయోభూయో ధునోతి స్మ తథాపి న ముహేచ తమ్।

తద్భహ్మహత్యాముక్త్యర్థం చచార ధరణీతలేని ।

 పుణ్యక్షేత్రాణి సర్వాణి గంగాద్యాశ్చ మహానదీః॥

న చ తాభిర్విముక్తా భూత్ కపాలీ బ్రహ్మహత్యయాః ।

 విషణ్ణవదనో దీనో నిఃశ్రీక ఇవ లక్షితః ॥

చిరేణ ప్రాప్తవాన్ కాంచీం బ్రహ్మణా పూర్వమోషితామ్।

 తత్ర భిక్షామటన్నిత్యం సేవమానః పరాం శ్రీయమ్॥

పంచతీర్థ ప్రతిదినం స్నాత్వా భూలక్షణాంకితే।

కంచిత్కాలమువాసాథ ప్రభ్రాంత ఇవ బిల్వలని॥

కాంచీక్షేత్రనివాసేన క్రమేణ ప్రయతాశయః।

నిర్దూతనిఖీలాతంకః శ్రీదేవీం మనసా వహన్॥

ఉత్తరే సేవితుం (తాం) లక్ష్యా వాసుదేవేన దక్షిణే॥

శ్రీ కామకోష్ఠమాగత్య పురస్తాత్తస్య సంస్థిత॥

ఆదిలక్ష్మీపదధ్యానమాతతాన యతాత్మవాన్।

యథాదీపో నివాతస్లో విస్తరంగో యథాంబుధీః॥

తథాంతర్వాయురోధేన న చచాలాచలేశ్వరః ।

తైలధారావదచ్చిన్నామనవచ్ఛిన్నభైరవః॥

వితేనే శైలతనయానాథశ్రీధ్యానసన్తతిమ్।

న బ్రహ్మా నైవ విష్ణుర్వా న సిద్ధః కపిలేపి వా॥

నాన్యే చ సనకాద్యా యే మునయో వా శుకాదయః।

తయా సమాధి నిష్టాయాం న సమర్ధాః కథంచన॥

అథ శ్రీ భావయోగేన శ్రీభావం ప్రాప్తవాన్ శివః తతః।

ప్రసన్నా శ్రీదేవీ ప్రభామండలవర్తినీ॥

అర్ధరాత్రే పురః స్థిత్వా వాచం ప్రోవాచ వాజ్మయీ॥

శ్రీకంఠ సర్వపాపఘ్న కిం పాపం తవ విద్యతే॥

మద్రూపస్త్వం కథం దేహః సేయం లోకవిడంబనా॥

శ్వోభూతే బ్రహ్మహత్యాయాః క్షణాన్ముక్తో భవిష్యసి॥

ఇత్యుక్త్వాంతర్గథే తత్ర మహాసింహాసనేశ్వరీ ॥

భైరవోపి ప్రహృష్టాత్మా కృతార్థః శ్రీవిలోకనాత్ ।

వినీయ తం నితాశేషం శ్రీధ్యానైకపరాయణఃఈఈ

ప్రాతః పంచమహాతీర్థ స్నాత్వా సంధ్యాముపాస్య చ పునః।

పునర్దూనుతే స్మకరలగ్నం కపాలకమ్॥

తథాపి తత్తు నాసంసత్స నిర్వేదం పరం గతః।

స్వప్నః కిమేష మాయా వా మానసభ్రాతిరేక వా॥

ముహురేవం విచీంత్యేశః శోకవ్యాకులమానసః।

స్వయమేవ నిగృహ్యాథ శోకం ధీరాగ్రణీః శివః । 

తులసీమండలం నత్వా పూజయిత్వా పురః।

స్థిత: నిగృహీతేంద్రియగ్రామః సమాధిష్ణోః భవత్పును॥

యామమాత్రే గతే దేవీ పునః సాంనిధ్యమాగతా।

అలం సమాధివా శంభో నిమజాత సరోవరే॥

ఇత్యాదిశ్య తీరో, ధత్త సోపి చింతాముపాగమత్।

ఇయం చ మాయా స్వప్నోవా కింకర్తవ్యం॥

మయాథవా  శ్వోభూతే బ్రహ్నహత్యాయాః।

క్షణాస్ముక్తో భవిష్యసీ ఇత్యుక్తం శ్రీపరాదేవ్యా ॥

యామాతీతమిదం దినమ్ ఏవం సర్వం।

చ మిథ్యైవేత్యధికం చింతయావృతః భగవాన్॥

వ్యోమవాణ్యా తు నిమజ్ఞాప్స్వితి గర్జితమ్।

శ్రుత్వా శంకాం సముత్సృజ్య తత్త్వం నిశ్చిత్య శంకరః॥

నిమమజ్జ సరస్యాం తు గంగాయాం పునరుత్థాతః।

తత్ర కాశీం సమాలోక్య కిమేతదీతి చింతయన్॥

స ముహూర్తం స్థితస్తూస్లీం నఖలీనకపాలకః॥

లలాటంతసముదీక్ష్య తరణిం తరుణేందుళ్ళత్।

 భిక్షార్థం నగరీమేనాం ప్రవివేళ వళీ శివః॥

గృహాణీ కానిచిధత్వా ప్రతోల్యాం పర్యటన్ భవః।

సోపశ్యదగ్రతః కాంచీత్కాంచీం శ్రీదేవతాకృతిమ్॥

భిక్షాం జ్యోతిర్మయీం తస్మై దత్వా క్షిప్రం తిరోదధే ।

 క్షణాద్ర్బహ్మకపాలం తత్ర్పచ్యుతం తన్నఖాగ్రత ॥

తర్దృష్ట్వాద్భుతమీశానః కామాక్షీ శీలముత్తమమ్।

ప్రసన్నవదనాంభోజో బహు మేనే ముహుః పరమ్॥

పురీ కాంచీ పురీ పుణ్యా నదీ కంపా నదీ పరా।

దేవతా సైవ కామాక్షీత్యాసీత్సంభావనా పురః॥

ఇత్తం దేవీప్రభావేణ విముక్తః సంకటాద్ధరః।

స్వస్థః స్వస్థానమగమచ్చాఘమానః పరాం శ్రియమ్॥

హయగ్రీవుడనెనుః- ఓ యగస్త్యా ఇక్కడ నున్నప్పటికిని కామాక్షీదేవి అందరి హృదయములందుండును. ప్రాణులకు వారివారి కర్మానుసారము ఫలితములనిచ్చును(3) లోకములో నడచుచున్నదంతయు ఈమె యొక్క విచేష్టయే. (వ్యాపారమే). ఒకడు ఏదో తలంచును. కాని యీమె స్వేచ్ఛగా చేయును. (తనయిష్టమైనట్లుగ ఫలితమునిచ్చును)-4 త్రీపురాధీ శక్తులు ఆమె యొక్క యవతారములే ఈమెయే మహాలక్ష్మి పూర్వమీమె మూడండములు సృష్టించేను-5. ముగ్గురు శక్తులకు గూడ పురత్రయము నీవాసము. ఒక యండమునుండి అంబికయు పురుషోత్తముడును (విష్ణువు) బుట్టిరీ-6. తరువాత మరొకయండమునుండి. వాయు శివుడును బట్టిరి. మహేశ్వరీ లక్ష్మితో విష్ణువును, - పార్వతితో పరమేశ్వరుని, సరస్వతితో బ్రహ్మను జతగూర్చెను. బ్రహ్మను లోకములను సృష్టించుకార్యము నందు నియోగించెను. వాసుదేవుని రక్షణమున, సంహారమున ముక్కంటిని నియోగీంచెను-8 వారందరు నెల్లప్పుడు సుఖమునిచ్చునా మహాలక్ష్మినీ ధ్యానింతురు. వీరు బ్రహ్మలోకమునను వైకుంఠమునను, కైలాసమునను వసింతురు-9, ఒకానొకపుడు కైలాసశిఖరమున పార్వతీదేవి విహరించుచు వెనుకనుండి మహేశ్వరుని రెండు కన్నులను మూసెను -10. అతనీ నేత్రము చంద్రసూర్యులగుటచే ముల్లోకముఅంధకారము జుట్టుకొనియంతయు వెలుగులేనిదయ్యెను-11. దానివలన సమస్తలోకములు వదలిపెట్టబడిన దేవపితృ క్రియలుగల వయ్యెను. (దేవపిత్యక్రియలు జరుగలేదు). ఏమిచేయుటకును దోషక ప్రజలేమియు దేలియకుండీరి-12. దానిని జూచి భగవంతుడైన రుద్రుడు పార్వతితో నిట్లనెను, దేవి! నీవు నౌకన్నులు మూయుటచే పాపము చేసితివి-15, ఋషులు తమతపములు వదిలిరి. వైదీకులు సంధ్యావందనముచేయని వారైరి. అంబికా! నీచే సమస్త వేదిక. కర్మ నశింపజేయబడినది-14. కావున పాపశాంతి కొఱకు దుష్కరమైన తపముజేయము. కాశీకి వెళ్లి. యచట కొంతకాలము వ్రతము నాచరించపుము-15. తరువాత కాంచీపురమునకు వెళ్లి యచట కామాక్షిని జూచెదవు. నీవు సర్వపాపహారిణియైన యా శివను (పార్వతి) ఆరాధింపుము-16, కంపా నదీతీరమున తులసిని ముందుంచుకొని తపముజేయము. అని యాదేశించి మహాదేవుడచటనే యంతార్థానముందెను-17. ఆ పార్వతియు భర్తయాజ్ఞననుసరించి యట్లేచేసెను. చాలాకాలము ఏకాగ్రహృదయే కష్టపడిన శివ (పార్వతి)-18. యొక్క యెదుట కామాక్షి ప్రత్యక్షమై యిట్లు పలికెను. ఓ సుప్రతియైన వత్సే నీయత్యుగ్రతపమునకు సంతసించితిని-19, తరువాత పార్వతి కండ్లుదెరచీ తనయెదుటనున్న పరాంబికను జూచెను. ఆమె పదివేల బాలసూర్యులతో సమానముగా వెలుగుచుండెను. సర్వాభరణములనలంకరించికొనియుండెను-20. కిరీటము హారములు భుజకీర్తులు కంకణములు మొదలగువానినలంకరించుకొనెను. పాశము, అంకుశము, చెలకువిల్లు, ఐదుబాణములు చేతులలో గలిగియుండెను-21. కిరీటమువైన ప్రకాశించు. చంద్రరేఖ యలంకారముగా నుండెను, ఆమే బ్రహ్మ విష్ణు-రుద్రులకు ఈశ సదాశీవపదములనిచ్చునది-22 ఇక పైపదములేని సగుణ బ్రహ్మనుగాసామెను జెప్పుదురు. "ఆమె ఇహలోక పరలోకములను రెండు ప్రపంచముల నిర్మాణమును చేయించునది. అట్టి పరాంబికను పార్వతి చూచెను-23. తరువాత .. ఆమహారాణిని జూచి పార్వతి మహానందమున నోలలాడెను. సర్వశరీరమున గగుర్పాటు. నిండెను. సంతోషమున కన్నులు వికసించెను-24 - చండికా మంగళాదులగు తన సఖీజనముతోబాటు సాష్టాంగ ప్రణామము జేసెను. ప్రదక్షిణము జేసి-25. చేతులు జోడించి మరల నమస్కరించెను. తనతోనేక స్వరూపిణియైన యా మహాత్రిపుర సుందరీ దయతో జూచి-26. బాహువులతో కౌగిలించుకొని స్నేహముతో నీట్లనెను. “వత్సే నీ మనస్సు గోరిన రుద్రుని భర్తగా బొందుము-27. లోకమున నీవుగూడ రక్షకై నాయాజ్ఞను నెరవేర్పుము. నేను నీవు అను భేదమెక్కడిది? నిఃసంశయముగా నీవే నేను-26, ఓ కల్యాణీ నీకేమీ పాపము సంభవించినది? నీవే పాపములను ఖండించుదానవు, యోగీంద్రాలు నిన్నే బహురూపిణిగా జెప్పుదురు-29, వత్సే! ఇది లీలామాత్రము. పరలోక విడంబనము. ఈ విధమున చిలికిన మహారాణియైన యంబికకు సర్వమంగళ పార్వతి భక్తితో ప్రణమిల్లీ చూచుచు పరమప్రీతినీ పొందెను-30. పార్వతీ స్తుతింపగనే యాపరాశక్తి యామె హృదయములో బ్రవేశించేను. ఓమునీ ఆమె (పార్వతి) మిక్కిలి సంతసించెను. అంత పార్వతి యాశ్చర్యమంది మాటిమాటికి చింతించుచు అనేను చూచినది స్వప్నమా? లేక భ్రమయా?-32. అని విమర్శించి చుట్టంతట జూచేను, తరువాత చిరునవ్వు నవ్వు జయ-విజయయను సఖులను జూచి ప్రసన్నవదనయై నమస్కరించిన సఖులతో నిట్లనెను-38. ఓ ప్రియసఖులారా! ఇంతకాలమెచటికి బోయితిరి! నేను జూచిన కామాక్షిని మీరు చూచితిరా-34 సఖులు, ఆ మాటలు విని సంతసమున వికసించిన కన్నులు గలవారై పూజింపదగిన పుష్పములను ముందుంచి ఇట్లుపలికిరి-35. నిజముగా మేము గూడ నాపరాశక్తిని జూచితిమి. ఇదీ స్వప్నముగాదు. భ్రమగాదు. ఆ పరాశక్తి సాక్షాత్తుగా నీహృదయమును బ్రవేశించినది. అని పలికి ఆమె ప్రక్క వీనయముతో తలవంచి కూర్చుండిరి-36. ఏకామ్ర వృక్షమూలమున భగవంతుడైన శివుడు. భవానీ విరహముచే పీడితుడై, యా, గౌరీ సంప్రాప్తికై నియతేంద్రియుడై, కామాక్షిని ... ధ్యానించెను-37. అచట గూడ శ్రీవిద్యాదేవతయైన పరాదేవి ప్రత్యక్షమైనది. సంతసించినదై నిశ్చలముగా తన్నుధ్యానించు శివునితో నిట్లనెను-58, ఓ మన్మథుని మదమునణచినవాడా। నీ ధ్యానమును జాలింపుము. సాయాజ్ఞలోనున్న మన్మథుని మరల నంగీకరింపుము. ఇచట నాయాజ్ఞతోనే ఏకామ్రమను సాపీఠమున యెల్లప్పుడుండుచు. నీ ప్రీతికై నీవేవచ్చి యోసువ్రతుడా। నా సన్నిధిలో కంపానీరమున నుండు గౌరిని అనుగ్రహింపుము-40. యోగము వల్లను గౌరీ వియోగము వల్లను గలిగిన రెండు. తాపములను (బోగొట్టుకొనుము). వదిలివేయుము అని పలికీ యాపరమయైన రమ (పరాశక్తియైన లక్ష్మి) శివుని హృదయమున నంతర్థానమయ్యెను-41. వెంటనే శివుడు లేచెను. మనమున మిక్కిలి సంతసించెను. ఆమె యనుగ్రహమును బొంది సర్వదేవతలచే సేవింపబడెను-4 రెండు ప్రపంచములుగానున్న చరాచరజగమంతయు సామెవిలాసమున నామెలోబుట్టి యామెలోనే లీనమగును. అట్టి యా మహాత్రిపురసుందరినే హృదయమున ధ్యానించేను. వివాహమంగళాలంకారమునలంకరించుకొనుచున్నదియు, కంపానీరవాసినియు, దయార్ద హృదయము, శివయునైన గౌరిని అప్పుడు వివాహవిధితో అంగీకరించి తీసికొనివచ్చి వృషభమునెక్కి కైలాస శిఖరమునకు వెళ్లెను-43,44,45. ఓ పాపరహితుడా! అగస్త్యా! ఆదిలక్ష్మీ ప్రభావమును జెప్పెదను. దానికై మజాక ప్రాజ్ఞుని చరితముజేప్పెదను వినుము-46. బ్రహ్మ యొక్క సభకు వెళ్లి యట త్రిమూర్తులు గూర్చొనియుండిరి. దీక్పాలురు, దేవతలందరును, సనకాదియోగులును-47. దేవరులైన నారదాదులును, వశిషాదీతాపములును అచటకివచ్చిరి. వారందరును గలిసి బ్రహ్మకును శివునకును ఐదుముఖములుండుటచే భేదమును గమనింపలేకుండిరి-48, వారొకరినొకరు బ్రహ్మయెవడు? శంకరుడెవడు? అని అడుగుకొనుచుండిరి. ఆ విధముగ మాట్లాడుకొను వారీ మధ్యన వెంటనే శివుడంతర్షితుడైయుండెను-49. అపుడు పంచముఖుడైన బ్రహ్మ నల్లనైన నారాయణుడు వారిరువురికినీ “నేను బ్రహ్మను నేను బ్రహ్మను” అని వాదముకలిగెను-50. ఓ యజ్ఞానీ నానాభికమలమునుండి బుట్టిన నీవు నాకు బుత్రుడవు అనేను, సృష్టికర్తనైన నేను బ్రహ్మను, పేరులోని సాధర్యమువలన నట్లైనది, నీవును రుద్రుడును మీరిరువురును సృష్టికర్తనైన నాకు బుత్రులు-51. అని మాయామోహితులైన యా యిరువురి మధ్యనవారిరువురికీ తన యొక్క మహాత్యమును 'నేను బ్రహ్మను' అని చూపుచు మహేశ్వరుడు మహా జ్యోతిస్తంభ (గొప్ప వెలుగు స్తంభ) రూపమున ఆవిర్భవించెను-52. తరువాత ఈతని మహేశ్వరునిగా దెలిసియే విష్ణువు ఊరకుండెను. ఐదు ముఖములుగల బ్రహ్మ పారినవమానించి యట్లే యుండెను. ఎదుట బ్రహ్మయొక్క శిరస్సులకు పైన జ్యోతిశ్చక్రము (వెలుగుతో నేర్పడిన చక్రము) ఏర్పడెను-53. ఆ చక్రమధ్యన ఉమతో గూడ శివదేవుడు చక్కగానుండెను. బ్రహ్మపైకి జూచెను. మరల నవమానించి యిట్లుపలికెను-53. అది విని త్రిపురాంతకుడైన శివుడు మిక్కిలికోపమునందెను. అట్లే కోపముతోనే వికారముగా విష్ణువును జూచెను-35. వారిరువురి వికారమువల్లనే కోపముతో గూడిన భైరవుడు పుట్టెను. అపుడాతడు గోటితోనే బ్రహ్మయొక్క ఒక తలనుద్రుంచెను. హాహాయని యచటి యందరును ఏడ్చుచు పరువెత్తిపోయిరి-56. తరువాత భైరవుడు గోటినంటియున్న బ్రహ్మతలను ఎన్నిమారులు విదిలించినను అదీ వదలలేదు-57, ఆ బ్రహ్మ హత్యాపాపవిముక్తికై భూమి మీద తీరిగి సమస్త పుణ్యక్షేత్రములను, గంగాది మహానదులను సేవించెను. దాని వలన గూడ కపాలియైన (బ్రహ్మకపాలమును ధరించియున్న) భైరవుడు బ్రహ్మహత్యా పాపమునుండి విముక్తుడుగాలేదు. విషాదము నీండిన ముఖముగలవాడై శోభాహీనుడుగాగనబడెను. చాలాకాలమునకు పూర్వము బ్రహ్మయుండిన కాంచీనగరమును జేరెను-59.. అచట భిక్షాటనము జేయుచుచుండెను. ప్రతిదినము పంచతీర్ణములలో స్నానము జేసి పరాశ్రీని సేవించుచుండెను. ఆ పంచ తీర్థములు భూలక్షణాంకీతములు-60. ఆ బిల్వలుడైన భైరవుడు మిక్కిలి భ్రమించినవానివలె కొంతకాలమచటనే యుండెను. కాంచీక్షేత్ర నివాసమున క్రమముగా ఆశయములు (కోరికలు) నియమితములయ్యేను-61: సమస్తభయములు విదిలిపోయెను. ఉత్తరమున లక్ష్మితో సేవింపబడినదియు దక్షిణమున వాసుదేవునితో (విష్ణువుతో) సేవింపబడినదియు-62. నైన (విష్ణు-లక్ష్మికుడియెడమల సేవింతురని భావము). శ్రీదేవిని మనసుతో వహించుచు(ధ్యానించుచు) శ్రీకామకోషమునకు (కామకోటి పీఠములోని యంతరహమునకు వచ్చి దాని యెదుటనిలిచెను. ఆత్మను, నిగ్రహించినవాడై యాదీలక్ష్మీపదధ్యానమును విస్తరింపజేసేను-63, కదిలించు గాలిలేనిచోట దీపమువలె, తరంగములు లేని సముద్రమువలె అంతర్వాయువుల నిరోధించుటచే అచలుడుగానున్న యీశ్వరుడు కదలలేదు-64. సర్వాత్ముడైన భైరవుడు తైలధారవలె ఎడతెగకుండగా ననుస్యూతముగా శైలతనయానాథశ్రీధ్యానసంతతినీ (పార్వతీ పతియైన శివుని శ్రీదేవియొక్క ధ్యానసమూహములను) విస్తరింపజేసేను-65. బ్రహ్మగాని, విష్ణువుగాని, సిద్ధుడైన కపిలుడుగానీ, తక్కిన సనకాదులుగానీ, శుకాదిమునులుగాని, ఆ సమాధినిష్ఠయందు ఏవిధముగను సమర్థులుగారు-66. ఆ తరువాత శ్రీభావయోగముతో శివుడు శ్రీభావమును బొందెను. అంత, ప్రభామండలమునందుండు శ్రీదేవి ప్రసన్నురాలయ్యెను. అర్ధరాత్రిలో నెదుట నీలిచి వాకిస్వరూపిణియైన యా శ్రీదేవి పలికెను-67. ఓ శ్రీకంఠ! సర్వపాపముల హరించువాడా! నీకేమీ పాపముగలదు? నీవు నా స్వరూపునివి. దేహమెట్లందువా! అదిలోక  విడంబనము (లోకమును మోసగించి యెక్కిరించుటకు)-68. రేపటి దినమునకు బ్రహ్మహత్యనుండి క్షణంలో విముక్తుడవగుదువు-అనిపలికి యటమపోసింహానేశ్వరి అంతర్థానమందెను-69. భైరవుడు గూడ, సంతసించి శ్రీదేవిని జూచుట వలన కృతార్థుడై (ధన్యుడై), ఆ మిగిలిన రాత్రిని శ్రీదేవీ ధ్యానపరాయణుడై గడపి-70. ప్రొద్దున పంచమహాతీర్థములో స్నానముజేసి, సంధ్యోపాసనముగావించి చేతినంటియున్న బ్రహ్మకపాలమును మాటిమాటికి విదిల్చుచుండెను-71 ఐనను అది వదులుట లేదు. దాని వలన మిక్కిలి వీచారమును - బొందెను. - ఇది. స్వప్నమా! మాయయా! మానసభ్రాంతియా! -72. ఈ విధముగ మాటి మాటికి చింతించీ ఈశుడు - శోకవ్యాకులమనస్కుడయ్యెను. తరువాత శివుడు స్వయముగనే శోకమును నిగ్రహించి ధీరశ్రేష్ఠుడై-73. తులసీమండలమునకు నమస్కరించి, ఎదుటనీలిచి పూజించి, ఇంద్రియ సమూహములనన్నింటిని నిగ్రహించి. మరల సమాధిస్థుడయ్యెను-74 ఒక జాముగడవగనే మరల ---- దేవి సన్నిధికి వచ్చెను. (ప్రత్యక్షమయ్యెను) “ఓ శంభో! సమాధి చాలు. ఈ సరోవరములో మునుగుము”, అని, యాదేశించి యంతర్థానమందెను. అతడు గూడ చింతింపసాగెను. ఇది మాయయా! స్వప్నమా? ఇపుడు నేనేమి చేయవలెను-76. రేపటికల్ల క్షణములో బ్రహ్మహత్యనుండి ముక్తుడవగుదువు -అని శ్రీపరాదేవి చెప్పినది. ఇప్పుడు దినములో : జాము గడిచినది-77. ఇదియంతయు మిథ్యయే (అబద్దమే)-అని - భగవంతుడు మిక్కిలి చింతాక్రాంతుడయ్యెను. ఆకాశవాణి మాత్రము నీటిలో మునుగుము అని గర్జించేను-78. అదివినీ సందేహము వదిలి నీజమును నిశ్చయించి శంకరుడు గంగా సరసిలో మునిగెను. మునిగిలేచినవాడై యచటి కాళిని జూచీ “ఇదియేమ'ని చింతించుచు గోటినంటిన కపాలముతో క్షణకాలమూరకయుండెను-80. తరువాత బాలచంద్రధరుడైన శివుడు నుదుటిపై యెండగాయు సూర్యుని జూచేను, వశియైన (ఇంద్రియనిగ్రహము గలవాడైన) శివుడు భిక్షణకై యా నగరిలో ప్రవేశించెను-81, కొన్ని గృహములకు వెళ్లి . మార్గమధ్యన దిరుగుచు ఆ భవుడు ఎదుట శ్రీదేవతాకృతిలోనున్న ఒక మొలనూలును, కాంచిని జూచెను-82 ఆమె యాతనికి జ్యోతిర్మయభిక్షనిచ్చి వెంటనే యంతర్భావమందెను. ఆక్షణముననే అతనిగోటి చివరనుండి బ్రహ్మకపాలము జారిపడెను-83. ఈశానుడు ఆయద్బుతమును, ఉత్తమమైన కామాక్షీలమును జూచి ప్రసన్న (శాంతి వహించిన) ముఖముగలవాడై - పరాదేవిని మాటిమాటికి బహుమానించేను. (పలుమారులు తలంచెను)-84. కాంచీపురియనుపురి పుణ్యమైనది. కంపానదియనునది పుణ్యమైనది. ఆ కనబడినదే. కామాక్షీ దేవత-అనుసంభావన (మంచిభావన) ప్రత్యక్షముగా గలిగినది-85. ఈ విధముగ దేవీ కటాక్షమున హరుడు సంకటమునుండి విముక్తుడై స్వస్థుడై పరాశ్రీని కొనియాడుచు స్వస్థానమునకు వెళ్లాను-86.

పునరన్యతవక్ష్యామి విలాసం శృణు కుంభజ ।

 ప్రభావం శ్రీమహాదేవ్యాః కామదం శృణ్వతాం సదా॥

అయోధ్యాధిపతిః శ్రీమాన్ నామ్నా దశరథో నృపః।

సంతానరహితో తిష్టద్భహుకాలం శుచకుల॥

రహస్యాహూయ మతిమాన్ వశిష్ఠం స్వపురోహితమ్ ।

 ఉవాచ్చారసంశుద్దః సర్వశాస్త్రార్ధవేదినమ్॥

శ్రీనాథ బహవోతీతాః కాలా నాధిగతః సుతః।

సంతతేర్శమ సంతాపః సతతం వర్ధతేతరామ్।

 కుర్వేయది సంతానసంపత్ స్యాత్తన్నివేదయ॥

ఓ కుంభజా: మరొక దేవీవిలాసమును జెప్పెద వినుము. శ్రీమహాదేవీప్రభావము వినువారికెల్లప్పుడును కోరికలను దీర్చునది-87. దశరథుడు అను పేరుగలవాడు అయోధ్యకధిపతియైన రాజు, సంతానములేని వాడై చాలాకాలము శోకాకులుడై యుండెను-88. బుద్ధిమంతుడైన రాజు తన పురోహితుడైన వశిష్టుని రహస్యస్థలమునకు బిలిచి ఆచార సంశుద్ధుడై సర్వశాస్త్రార్ధములను దెలిసిన యాతనితోనిట్లనెను-89. శ్రీనాథుడా! (బృహస్పతీ! విద్యానాథా) ఎన్నోకాలములుగడిచినవి. పుత్రుడు గలుగలేదు. సంతతికొకైన తాపమునాకు మిక్కిలి వృద్ధిచెందుచున్నది. ఏమిచేసిన సంతానసంపద కలుగునో జెప్పుము-90

వశిష్ఠ ఉవాచ :

మమ(రఘు) వంశమహారాజ రహస్యం కథయామి తే ।

అయోధ్యా మధురా మాయా కాశీ కాంచీ హ్యవంతికా॥

ఏతాః పుణ్యతమాః ప్రోక్తాః పురీణాముత్తమోత్తమాః।

అస్యాః సాంనిధ్యమాత్రేణ మహాత్రిపురసుందరీమ్॥

అర్చయంతి హ్యయోధ్యాయాం మనుష్యా అధిదేవతామ్।

నైతస్యాః సదృశీ కాచిద్దేవతా విద్యతే పరా।

ఏనామేవార్చయంత్యన్యే సర్వే శ్రీదేవతాం నృప॥

బ్రహ్మవిష్ణుమహేశాద్యాః సస్త్రీకాః సర్వదా సదా।

నారికేలఫలాలీభిః పనసైః కదలీఫలై ॥

మధ్వాజ్యశర్కరాప్రాజైర్మహాపాయసరాశిభిః।

 సిద్ధద్రవ్యవిశేషైశ్చ పూజయేత్రిపురాంబికామ్॥

అభీష్టమచిరేణ్ణవ సంప్రదాస్యతి సైవ నః ।

ఇత్యుక్తవంతమభ్యర్య గురుమిష్ఠిరుపాయనైః॥

స్వాంగఃప్రాప్తయే భూయో విససర్ణ విశాం పతిః।

తతో గురూక్తరీత్యైవ లలితాం పరమేశ్వరీమ్॥

అర్చయామాస రాజేంద్రో భక్త్యా పరమయా యుతః।

ఏవం ప్రత్రిదినం పూజాం విధాయ ప్రీతమానసః॥

 అయోధ్యాదేవతాధామామశిషత్తత్ర సంగతః।

అర్ధరాత్రే వ్యతీతే తు నీళ్ళతోల్లాసదీపికే॥

కించిన్నీద్రాలసస్యాస్య పురతస్త్రిపురాంబికా ।

పాశాంకుశథనుర్బాణపరిష్కృతచతుర్భుజా ।

సర్వశ్చగారవేషాధ్యా సర్వాభరణభూషితా ॥

 నత్వా వాచమువామాం మందమిందుమతీసుతమ్॥

ఆస్తి పంక్తిరథ శ్రీమన్ పుత్రభాగ్యం తవానఘ।

విశ్వాసఘాతకర్మాణి సంతి పూర్వకృతానీ తే॥

తాదృశాం కర్మణాం శాంత్యై గత్వా కాంచీపురం వరమ్।

స్నాత్వా కంపాసరస్యాం చ తత్ర మాం పళ్య పావనీమ్॥

మధ్యే కాంచీపురస్య త్వం కందరాకాశమధ్యగమ్।

కామకోష్ఠం విపాహ్మపి సప్తద్వారబిలాన్వితమ్॥

సామ్రాజ్యసూచకం పుంసాం త్రయాణామపి।

సిద్ధిదమ్ ప్రాజ్ముఖీ తత్ర వర్తీ పొం మహాపింహాసనేశ్వరీ॥

మహాలక్ష్మీస్వరూపేణ ద్విభుజా పద్మధారిణీ చక్రేశ్వరీ।

మహారాజ్ఞి హ్యదృశ్యా స్థూలచక్షుషామ్॥

మమాక్షిజా మహాగౌరీ వర్తతే మమ దక్షిణే।

సౌందర్యసారసీమా సా సర్వాభరణభూషితాః మయా॥

చ కల్పితావాసా ద్విభుజా పద్మధారిణీ।

మహాలక్ష్మీస్వరూపేణ కిం వా కృత్యాత్మనా స్థితా॥

ఆపీఠమౌలిపర్యంతం పశ్యతస్తాం మమాంశజామ్।

పాతాకాన్యాలు నశ్యంతి కింపునస్తూపపాతకమ్॥

కువాసనా కుబుద్ధిశ్చ కుతర్కనిచయశ్చ యః।

కుదేహశ్చ కుభావశ్చ నాస్తికత్వం లయం వ్రజేత్॥

కురుష్వ మే మహాపూజాం సీతామధ్వాజ్యపాయసైః।

వివిధైర్భక్ష్యభోజ్యైశ్చ పదార్థాః షడ్రసాన్వితైః॥

తతైవ సుప్రసన్నాహం పూర్తయిష్యామి తే వరమ్।

ఉపదిశ్యేతి సామ్రాజ్జీ దివ్యమూర్తిస్తిరోదధే॥

రోజాపి సహసోత్థాయ కిమేతదితి విస్మిత ।

దేవీముద్బోధ్య కౌసల్యాం శుభలక్షణలక్షితామ్॥

తస్యై తద్రాత్రివృత్తాంతం కథయామాస సాదరమ్।

తత్సమాకర్ణ్య సా దేవీ సంతోషమభజత్తదా॥

ప్రాప్తహో నృపః ప్రాతస్తయా దయితయా సహా।

అనేకసచివోపేతః కాంచీపురముపాగమత్॥

స్నాత్వా కంపాతరంగీణ్యాం దృష్ట్వా దేవీం చ పావనీమ్।

పంచతీర్థ తతః స్నాత్వో దేవ్యా కౌసల్యయా నృపః ॥

గోభూవస్త్రహిరణ్యాద్యేసతీర్థక్షేత్రవాసినః।

ప్రీజయిత్వా సపత్నీకస్తథా తద్భక్తిపూజకాన్॥

అథాలయం సమావిశ్య మహాభక్త్యా నృపోత్తమః! ।

ప్రదక్షిణత్రయం కృత్వా వినయేన సమన్వితః॥

తతః సంనిధిమాగత్య దేవ్యా కౌసల్యయా సహ।

శ్రీకామకోష్ఠనిలయం మహాత్రిపురసుందరీమ్॥

త్రిమూర్తిజననీమంబాం దృష్ట్వా శ్రీచక్రరూపిణీమ్।

ప్రణిపత్య తు సాష్టాంగం భార్యయా సహ భక్తిమాన్॥

స్వపురే త్రిపురే ధామ్ని పురేక్ష్వాకుప్రవర్తితే।

దుర్వాసాసశిష్యేణ పూజార్థం పూర్వకల్పితే॥

దాసీదాసధ్వజారోహగృహోత్సవసమన్వితే।

తత్ర స్వగురుణోక్తం చ కృత్వా స్వాత్మారపూజనమ్॥

రాత్రా స్వప్నే తు యద్రూపం దృష్టవాన్ స్వపురే మహః।

తదేవాతాపి సందధ్యే సన్నిధౌ రాజసత్తమః ॥

చీరం ధ్యాత్వా మహారాజః సువాసాంసి బహూని॥

చ దివ్యాన్యాయతన్యస్ర్య దత్వా స్తోత్రం చకార హ।

పాదాగ్రలంబీపరమాభరణాభిరామే మంజీరరత్నరుచిమంటలపాదపద్మే పీతాంబరస్ఫురితపేశలహేమకాంచి।

కేయూరకంకణపరిష్కృతబాహువల్లి॥

పుండ్రేక్షుచాపవిలసన్మృదువామపాణే రత్నోర్మికాసుమశరాంచీతదక్షహస్తే ।

వక్షోజమండలవిలాసివలక్షహారి పాశాంకుశాంగదలసద్భుజశోభితాంగి॥

వక్షశ్రీయా వీజితశారదచంద్రబింబే।

తాటంకరత్నకరమండితగండభాగే॥

వామే కరే సరసిజం సుబిసం దధానే।

కారుణ్యనీర్ఘరదపాంగయుతే మహేశి॥

మాణిక్యసూత్రమణిభాసురకంబుకంఠి భాలస్థచంద్రశకలోజ్వలితాలకార్యే ।

 మందస్మితస్పురణశాలిని మంజునాసే నేత్రశ్రియా విజితనీలసరోజపత్రే॥

 సుభ్రూలతే సువదనే సులలాటచిత్రే యోగీంద్రమానససరోజనివాసహంసి। రత్నానుబద్ధతపనీయమహాకిరీటే సర్వాంగసుందరి సమస్తనరేంద్రవంద్యేII  కాంక్షానురూపవరదే కరుణార్థచిత్తే సామ్రాజ్యసంపదభిమానిని చక్రనాథ్।

ఇంద్రాదిదేవపరిసేవితపాదపద్మే సింహాసనేశ్వరీ పరే మయి సంనీదధ్యా॥

ఇతి శ్రుత్వా స భూపాలో బర్నిరత్య భక్తితః।

తస్యాస్తు దక్షిణే భాగే మహాగౌరీం దదర్శ హ॥

ప్రణమ్య దండవద్భూమౌ కృత్వాచాస్యాః స్తుతిం పునః।

దత్తా చాస్యై మహార్షాణి వాసాం వివిధాని చు॥

అమూల్యాని మహారాణి భూషణానీ మహాంతి।

చ తతః ప్రదక్షిణీకృత్య నిర్గత్య సహ భార్యయా।

స్వగురూక్తవిధానేన మహాపూజాం విధాయ చ ॥

తామేవ చింతయంస్తత్ర సప్తరోత్రమువాస సః॥।

అష్టమే దీవసే దేవీం నత్వా భక్త్యా విలోకయన్।

అంబాభీష్టం ప్రదేహీతి ప్రార్థయామాస చేతసా॥

సుప్రసన్నా చ కామాక్షీ సాంతరిక్షగిరావదత్।

భవిష్యంతి మద్యశాస్తే చత్వారస్తనయా నృప॥

ఇత్యుదీరీతమాకర్ణ్య ప్రమోదవికసన్ముఖః।

శ్రీయం ప్రణమ్య సాష్టాంగమనన్యశరణః పరామ్॥

ఆమంత్ర్య మనసైవాంహోం సస్త్రీకః సహ మంత్రిభిః।

అయోధ్యాం నగరీం ప్రాపదిందుమత్యాస్తు నందనః।

ఏవంప్రభావా కామాక్షీ సర్వలోకహితైషిణీ॥

సర్వేషామపి భక్తానాం కాంక్షితం పూరయత్యలమ్।

ఏనాం లోకేషు బహవః కామాక్షీం పరదేవతామ్॥

ఉపాస్య వీధివద్భక్త్యా ప్రాప్తాః కామానశేషతః।

అద్యాపీ పాప్నువంత్యేవ భక్తిమంతః ఫలం మనే॥

అనేకే చ భవిష్యంతి కామాక్ష్యా కరుణాదృశః।

మహాత్మ్యమస్యాః శ్రీదేవ్యాః కో వా వర్ణయితుం క్షమ॥।

నాహం న శంభుర్న బ్రహ్మా న విష్ణుః కిముతాపరే।

ఇతీ తే కథితం కించితామాక్ష్యాః శీలముజ్వలమ్।

శృణ్వతాం పఠతాం చాపి సర్వపాపహరం స్కృతమ్॥

ఇతి శ్రీబ్రహ్మాండ పురాణే ఉత్తరఖండే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే చత్వారింశోధ్యాయః॥

వసిష్ఠుడనేను :- ఓరఘువంశములోని మహారాజా! నీకురహస్యము జెప్పెదను. అయోధ్య, మధుర, మాయ, కాశి, కాంచి, అవంతిక,-ఇవి పట్టణములలోనుత్తమోత్తమములైనవి. మిక్కిలి పుణ్యవంతములైనవి-1, ఈ నగరి యొక్క సాంనీధ్యమాత్రమున (ఈనగరిలో నున్నందున) మహాత్రిపురసుందరినీ అర్చింతురు. అయోధ్యయందు ఈమె అధిదేవతను అర్చింతురు-92, ఈమెతో సమానురాలైన యే పరదేవతయు లేదు. ఓ రాజా! ఇతరులందరు ఈమెనే అర్చింతురు-95. బ్రహ్మ-విష్ణు-మహేశాదులు తమ స్త్రీలతోబాటు ఎల్లప్పుడు ఈమెను బూజింతురు. కొబ్బరికాయల వరుసలతోను, పనసపండ్లతోను, అరటి పండ్లతోను-94. పెద్దపెద్ద పాత్రలకొలది తేనెలతో, నేతులతో, శర్కరలతోను, గోప్పపాయసరాశులతోను, సిద్ధద్రవ్యవిశేషములతోడను త్రిపురాంబికను బూజింపవలెను. ఆమె మనకు వెంటనే కోరిన దాని నొసంగును-95. ఈ విధముగా తన పుత్రప్రాప్తికైచెప్పిన గురువైన వసిష్టునికిష్టమైన కానుకలిచ్చి దశరథమహారాజా తనిని పంపించేను-96. తరువాత రాజేంద్రుడైన దశరథుడు గురువు చెప్పిన విధముగనే లలితా పరమేశ్వరిని పరమభక్తితో బూజించెను. -97. ఈవిధముగా ప్రతిదినము పూజించి ప్రీతమనస్కుడై అయోధ్యాదేవతలకు నెలవైన కాంచీలోనుండి కామాక్షిని సేవించెను-98. నీశ్చలమైనయుల్లాసమును దీపింపజేయు (ప్రేరేపించు) అర్థరాత్రి గడపగనే కొద్దిగా నిద్రాలసుడైన దశరథుని యెదుట త్రిపురాంబిక ప్రత్యక్షమయ్యెను-99. అపుడామెయిట్లున్నది. నాలుగుభుజములలో పాశము, అంకుశము, ధనువు, బాణములు అలంకరించియున్నవి. వేషము సర్వశృంగారముతోనొప్పినది. సర్వాభరణభూషితయైయున్నది. అట్లుండి ఇందుమతీపుత్రుడైన దశరథునితో నీమాటలు పలికెను-100. ఓ శ్రీమంతుడవైన దశరథా! పాపరహితా! నీకు పుత్రభాగ్యమున్నది. కాని నీవు పూర్వము చేసిన విశ్వాసఘాత కర్మలు (నమ్మకద్రోహమున చేసిన పనులు) ఉన్నవీ-101. ఆ పాపకార్యముల శాంతికై కాంచీపురవరమునకు వెళ్లి కంపాసరసిలో స్నానముజేసి యట పవిత్రురాలనైన నన్ను జూడుము-102 కాంచీపురము యొక్కమధ్యన గుహాకాశమధ్యనుండి ఏడు ద్వారములుగల బిలముతోగూడిన కామకోష్ఠమను అంతర్గృహముండును. అది సామ్రాజ్యమును సూచించునది, అది త్రీపురుషులకు (బ్రహ్మవిష్ణుమహేశ్వరులకును) సిద్దులనిచ్చునది. దానిని విపాపుడెవై (పాపములేనివాడవై) ప్రవేశింతువు. అచటనే మహాసింహాసనేశ్వరియైన నేను తూర్పుముఖము గలదాననై యుందును-104 స్వరూపము మహాలక్ష్మీస్వరూపము. రెండు భుజముల పద్మములధరింతును. చక్రేశ్వరిని. మహారాజ్ఞిని, స్థూలచక్షువులకు (సూక్ష్మమును జూడలేనివారికి) కనబడను-105. నౌకన్నునుండి పుట్టిన గౌరి నాకుడివైపుననుండును. ఆమె సౌందర్యమునకు హద్దు. (అంతకన్నమించిన సౌందర్యములేదు) సర్వాభరణములనలంకరించికొన్నది-106. నాచేత కల్పింపబడిన నివాసముగలది. రెండుభుజముల పద్మముల ధరించినది. మహాలక్ష్మీరూపములో కృత్యరూపమాయన్నట్లున్నదీ-107. ఆమెను పీఠమునుండి శిరస్సువలకు నాయంశమునబుట్టిన దాని జూచువానికి మహాపాతకములు వేగముగా నశించును. ఉపపాతకవిషయము చెప్పవలెనా? -108. చెడు సంస్కారముగాని, చెడుబుద్ధిగాని, చెడు తర్కముల సమూహముగాని, చెడుదేహముగాని, చెడు భావముగానీ దేవుడులేడను బుద్ధి (నాస్తికత్వముగానీ ఇవియన్నియు నశించిపోవును-109. శర్కర, తేనె, నేయి, దీనితోగూడిన పాయసములతోను, వివిధములైన భక్ష్యభోజ్యములతోను, షడ్రసములతో గూడిన పదార్థములతోను నాకు మహాపూజను జేయుము-110. అచటనే నేను సుప్రసన్నురాలనై నీపరమును (కోరికను) పూర్తీచేయుదును-అని ఉపదేశిచి సామ్రాట్టియైనయపరాదేవి యంతర్థానమందెను-111. రాజు (దశరథుడు) కూడ వెంటనేలేచి 'ఇది యేమని యాశ్చర్యమంది, శుభలక్షణముతో గనబడుకౌసల్యాదేవిని మేలుకొలిపి-112. యామేకాదరముతో నా రాత్రి వృత్తాంతమును జెప్పెను. అది విని యాకౌసల్య యపుడు సంతోషమునందేను-113. సంతసించిన రాజు ప్రొద్దుననే భార్యతోబాటు అనేక మంత్రులతో గూడి కాంచీపురమునకు వచ్చెను-114. రాజు కౌసల్యతోబాటు కంపానదిలో స్నానముజేసి పావనియైన యామహదేవిని దర్శించి తరువాత పంచతీర్థములలో స్నానముజేసి-115. యా తీర్థక్షేత్ర నివాసులను ఆమెను భక్తితో పూజించువారీని ఆవులు, భూమి-వస్త్రములు-బంగారము మొదలగువస్తువులదానముచే సంతోషపెట్టెను-116. తరువాత నారాజశ్రేషుడు భక్తితో నాలయ మున బ్రవేశించి, వినయముతో మూడు ప్రదక్షిణలుచేసి-117. తరువాత కౌసల్యతోసహ మూలసంనిధికి వచ్చెను. శ్రీకామ కోష్ఠముననున్నట్టియు, త్రిమూర్తులకు తల్లియైనట్టియు, శ్రీచక్రస్వరూపిణియై మహాత్రిపురసుందరియైన యంబను భార్యతోబాటు భక్తిమంతుడై సాష్టాంగముగా (జాగిలి) మొక్కేను-119. అది స్వపురమై త్రిపురమైనధామము, దానిని పూర్వమిక్షాకరాజులు ప్రవర్తింపజేసిరి, అదీ సశిష్యుడైనదుర్వాసునిచే పూజకొఱకై ప్రకల్పితమైనది-120. దాసీదాసులతో ధ్వజారోహోత్సవముతోను గృహోత్సవముతోను గూడినది. అచట తనగురువు చెప్పిన విధముగా స్వాత్మారపూజను జేసెను -121. రాత్రి స్వప్నములో జూచీన రూపముచేయా స్వపురమున తేజోరూపమున జూచెను. రాజసత్తముడైన దశరథుడు అక్కడ గూడ నారూపమునే ధ్యానించెను -122. పౌలకాలము ధ్యానించి మహారాజు మంచి వస్త్రములను పెక్కింటిని దీవ్యములైన ఆయతనములను (యజ్ఞశాలలను) ఆమెకిచ్చిస్తోత్రము జేసెను-123. పాదముల చీవరవ్రేలాడునుత్కుృష్టమైన యాభరణములతో సుందరమైనదానా! కాలిగజ్జెలపైని రత్నకాంతులతో మనోహరమైన పాదపద్మములు గలదానా! పీతాంబరమునందు మెరయు సుకుమారమైన బంగారు మొలనూలు గలదానా, భుజకీర్తులతోను కంకణములతోను అలంకరింపబడిన తీవవంటి బాహువులుగల దానా-124. పుండ్రమనుశ్రేష్టమైన చేలకు వింటితో బ్లాకాశీంచు మృదువైన యెడమ చేయిగలదానా! రత్నాంగుళీయకములతోను పుష్పబాణములతోను ఒప్పిన కుడి చేయిగలదానా! స్తనమండలమున విశేషముగ బ్రకాశించు తెల్లనిహారములుగలదానా! పాశము, అంకుశము, భుజభూషణములు-వీనిచే బ్రకాశించిన భుజములతో నందమైనశరీరముగలదానా! -125. ముఖకాంతిచే శరత్కాల చంద్రబింబమును జయించినదానా! కమ్మలరత్నకిరణములచేనలంకరింపబడిన చెక్కిళ్ళగలదానా! ఎడమచేతిలో చక్కని తామరతూడుగల కమలమునుధరించినదానా! కరుణా ప్రవాహమును బ్రవహించు కనుకౌలుకులు గలదానా! మహేశ్వరి! -126. మణిహారపుమణులతో బ్రకాశించు శంఖముబోలికంఠముగలదానా! నుదుటనున్నచంద్రరేఖతో వెలుగెత్తిన ముంగురులతో శోభించుదానా! చిరునగవు మెఱుగులనొప్పినదానా! మనోహరమైన ముక్కుగలదానా! నేత్రశోభతోజయించిన కమలదళములు గలదానా! -127 చక్కని తీవ వంటి కనుబొమలుగలదానా! చక్కని ముఖముగలదానా! చక్కని నుదుటి చిత్రముగలదానా! యోగీంద్రులమనముల నెడికమలములనుండు హంసిస్వరూపిణి రత్నములు వరుసగా బొదిగిన బంగారు మహాకిరీటముగలదానా! సర్వాంగ సౌందర్యవతీ దేవాధిపునిచేత (ఇంద్రునిచేత) నమస్కరింపదగిన దానా!-128, కోరికల కనువైన వరములిచ్చుదానా! దయతో తడసిన (మెత్తనైన) చిత్తముగలదానా! సామ్రాజ్య సంపదచే అభిమానముగలదానా! చక్రమునకు సాథమైనదానా! ఇంద్రాదిదేవతలచే పూర్తిగా సేవింపబడిన పాదకమలములుగల దానా! సింహాసనమునకీశ్వరి! (మహాత్రిపురసుందరీ!) నాయందుచక్కగా నీలువుము -129, అని భక్తితో స్తుతించి యారాజు వెలుపలికి వచ్చి యామెకుడిభాగముననున్న మహాగౌరినీ జూచెను-130. భూమిపై సాష్టాంగదండ ప్రణామము జేసి, మరల నామెనుస్తుతించి, యామెకు గూడ గొప్ప విలువైన వివిధములైన వస్త్రములను-131. గొప్ప విలువగలిగివెలగలలేని గొప్పభూషణములను, ఇచ్చెను. ప్రదక్షిణము జేసి భార్యతోబాటు బయటికి వచ్చి-182. తనగురువు చెప్పిన రీతిలో మహాపూజను జేసి, యామెనే ధ్యానించుచు ఏడు రాత్రులుండెను-133. ఎనిమిదవదినమున దేవికి నమస్కరించి భక్తితో చూచుచు మనమున తల్లీ! నాకోరికనిమ్ము అని ప్రార్థించెను-184 దానికి సుప్రసన్నురాలైన ... కామాక్షి ఆకాశవాణి ద్వారా ఇట్లనెను. “ఓరాజా నాయంశగల నలుగురు కుమారులు నీకు గలుగుదురు”-134, అనుపలుకును విని సంతసముతో వికసించినముఖముగలవాడై అనన్య శరణుడై మాతయైన ఆపరాశ్రీదేవికి సాష్టాంగముగ ప్రణమిల్లి-136. మనస్సుతోనే  వెళ్లివచ్చెదనని శలవుదీసికొనీ, భార్యలతోను. మంత్రులతోను ఆ యిందుమతీపుత్రుడైన దశరథుడు అయోధ్యానగరికి జేరెను -187. ఇట్టి ప్రభావముగల శ్రీకామాక్షి సర్వలోకములహితమును గోరును. సమస్త భక్తులయొక్క కోరికలను మిక్కిలి సంపూర్ణముగ నెరవేర్చును-138. . లోకములలో పెక్కురు ఈ పరదేవతయైన కామాక్షిని శాస్త్రీయముగా భక్తితో నుపాసించి న్విశేషముగా కోరికలను బొందిరి-139. ఓ మునీ, ఇప్పుడు గూడ భక్తిమంతులు తమకోరికలను బొందుచునేయున్నారు. కామాక్షియొక్క దయాదృషులకు పాత్రులగువారు ముందు {భవిష్యత్కాలమున) గూడ అనేకులుగాగలరు. ఈశ్రీదేవి మాహాత్యమును వర్ణించుటకు ఎవడు సమర్థుడు? నేనుగాను, శంభువుగాడు, భ్రహ్మకాడు, విష్ణువుకాడు. తక్కినవారి విషయమై చెప్పనేల?-141. ఈ విధముగా మహాలక్ష్మియొక్క ఉజ్వలమైన శీలమును కొంచెము చెప్పితిని. అది వినువారికిని చదువువారీకిని సర్వపాపములను హరించునది. అనియనబడినది-142.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణముననుత్తరభాగమున హయగ్రీవాగస్త్య సంవాదమున లలితోపాఖ్యానమున నలుబదీయవయధ్యాయము.40