68 - యయాతి చరితము

ఋషయ ఊచుః :-

మరుతేన కథం కన్యా రాజ్ఞే దత్తా మహాత్మనా

కింవీర్యాశ్చ మహాత్మానో జాతా మరుతకన్యయా

సూత ఉవాచ :-

ఆహరత్స మరుత్సోమమన్నకామః ప్రజేశ్వరః

మాసి మాసి మహాతేజాః షష్టిసంవత్సరాన్నృప

తేన తేన మరుతస్తస్య మరుత్సోమేన తోషితాః

అక్షయ్యన్నం దదుః ప్రీతాః సర్వకామపరిచ్ఛదమ్

అన్నం తస్య స కృద్భుక్తమహోరాత్రం న క్షీయతే

కోటిశో దీయమానం చ సూర్యస్యోదయనాదపీ

మిత్రజ్యోతేస్తు కన్యాయా మరుతస్య చ ధీమతః

తస్మాజ్జాతా మహాసత్త్వా ధర్మజ్ఞా మోక్షదర్శినః

సంన్యస్య గృహధర్మాణి వైరాగ్యం సముపస్థితాః

యతిధర్మమవాప్యేహ బ్రహ్మభూయాయ తే గతాః

అనేనసః సుతో జాతః క్షత్రధర్మః ప్రతాపవాన్

క్షత్రజన్మసుతో జాతః ప్రతిపక్షో మహాతపాః

ప్రతిపక్షసుతశ్చాపి సృంజయో నామ విశ్రుతః

సృంజయస్య జయః పుత్రో విజయస్తస్య జజ్ఞివాన్

విజయస్య జయః పుత్రస్తస్య హర్యశ్వకః స్మృతః

హర్యశ్వస్య సుతో రాజా సహదేవః ప్రతాపవాన్

సహదేవస్య ధర్మాత్మా అహీన ఇతి విశ్రుతః

అహీనస్య జయత్సేనస్తస్య పుత్రోథ సంకృతిః

సంకృతేరపి ధర్మాత్మా కృతధర్మా మహాయశాః

ఇత్యేతే క్షత్రధర్మాణో నహుషస్య నిబోధత

నహుషస్య తు దాయాదాః షడింద్రోపమతేజసః

యతిర్యయాతీః సంయాతిరాయాతిర్వియతిః కృతిః

ఋషులిట్లనిరి.

మహాత్ముఁడయిన మరుత్తుఁడు (మరుత్తు) తన కుమార్తెను రాజున కొసంగెను? మరుత్తు యొక్క కన్యకకు ఎట్టి వీర్యవంతులు మహాత్ము లుదయించిరి? సూతుఁడిట్లు ప్రత్యుత్తరమిచ్చెను, ఆ మహారాజు అన్నకాముఁడై మరుత్సోమమనుయజ్ఞము నాచరించెను. ఆ మహారాజు ప్రతిమాసమాయజ్ఞమును అరువదిసంవత్సరములాచరించెను. ఆ మహారాజొనరించినమరుత్సోమమున దేవతలు మరుత్తులు సంతోషించిరి. ప్రీతులై దేవతలతనికి ఆతఁడుకోరు సర్వ వస్తువులతో అక్షయ్యమగునన్న మొసఁగిరి, (3) సుకృదుక్తమైన యా: యన్నము దివారాత్రములు వ్యర్థము కాలేదు. ఆ యన్నమును భుజించినవారు 24 గంటలు ఆకలి లేక యుండిరి. సూర్యోదయముతో నారంభించీ ఆ రాజు అన్నమును కోట్లాది ప్రజల కొసంగిను. మిత్ర జ్యోతీ కుమార్తెకు ధీమంతుఁడయిన మరుత్తునకును చాలమందీపుత్రులు పుట్టిరి. వారందరు మహాసత్తులు, ధర్మజ్ఞులు, మోక్షదర్శినులు. వారు గృహస్థధర్మములను సన్యసించి (విసర్జించి) వైరాగ్యము సమాశ్రయించి యతీశ్వర ధర్మమును ఆశ్రయించి బ్రహ్మత్వమును పొందిరి, (7) క్షత్రధర్ముఁడు అనేనసకుమారుడు ప్రతాపవంతుఁడు. క్షత్రధర్మునకు ప్రతిపక్షుండుదయించెను. ఆతఁడు మహాతపస్వి. ప్రతిపక్షుని కుమారుఁడు సృంజయుఁడు.. ఆతఁడు చాల ప్రఖ్యాతుఁడు. సృంజయునకు పుత్రుండు జయుఁడు. ఆ జయునకు విజయుఁడు పుత్రుఁడు. విజయునకు జయుఁడు పుత్రుడు; జయునకు హర్యశకుఁడు సుతుఁడు హర్యశ్వకునకు సుతుఁడు సహదేవుండు. అతఁడు ప్రతాపవంతుల డైనరాజు. సహదేవుని కుమారుఁడు ధర్మాత్ముఁడు. ఆతఁ డహీనుఁడని విశ్రుతుఁడు. అహీనునకు జయత్సేనుండు పుత్రుఁడు ఆతని సుతుఁడు సంకృతి. ధర్మాత్ముఁడయిన సంకృతికి మహా యశస్వియన కృతధర్ముడు కుమారుఁడు వీరందరు క్షత్రధర్ములు, ఇది ఆయువు సంతతి. ఇంక నహుష సంతతి నెఱుంగుము. నహుషునకు ఆరుగురు పుత్రులు. వారు తేజస్సున ఇంద్ర సమానులు.

యతిర్జ్యేష్ఠస్తు తేషాం వై యయాతిస్తుతతోఽవరః

కాకుత్స కన్యాం గాం నామ లేభే పత్నీం యతీస్తదా

స యతిర్మోక్షమాస్థాయ బ్రహ్మభూతోఽ భవన్మునిః

తేషాం మధ్యే తు పంచానాం యయాతిః పృథివీపతిః

దేవయానీముశనసః సుతాం భార్యామవాపహ

శర్మిష్ఠామాసురీం చైవ తనయాం వృషపర్వణః

యదుం చ తుర్వసుం చైవ దేవయానీ వ్యజాయత

ద్రుహ్యుం చానుంచ పూరుం చ శర్మిష్ఠా వార్షపర్వణీ

అజీజనన్మహావీర్యాన్సుతాన్ దేవసుతోపమాన్

రథం తస్మై దదౌ శక్రః ప్రీతః పరమభాస్వరమ్

అసంగం కాంచనం దివ్యమక్షయౌ చ మహేషధీ

యుక్తం మనోజవైరశ్వైర్యేన కన్యాం సముద్వహత్

స తేన రథముఖ్యేన జీగాయ సతతం మహీమ్

యయాతిర్యుధి దుద్దర్షో దేవదానవమానవైః

పౌరవాణాం నృపాణాం చ సర్వేషాం సోఽభవద్రథీ

యావత్సుదేశప్రభవః కౌరవో జనమేజయః

కురోః పౌత్రస్య రాజ్ఞస్తు రాజ్ఞః పారిక్షితస్య హ

జగామ స రథో నాశం శాపాత్ గార్గ్యస్య ధీమతః

గార్యస్య హి సుతం బాలం స రాజ జనమేజయః

దుర్బుద్దిర్హింసయామాస లోహగంధీ నరాధిపః

స లోహగంధీ రాజర్షి పరీధావన్నితస్తతః

పౌరజానపదైస్యక్తో న లేభే శర్మ కర్హిచిత్

తతః స దుఃఖసంతప్తో నాలభత్సంవిదం క్వచిత్

స ప్రాయాచ్ఛౌనకమృషిం శరణం వ్యఢతస్తథా

ఇంద్రోతో సామ విఖ్యాతో యోఽసౌమునిరుదారధీః

యోజయామాస చేంద్రోతః శౌనకో జనమేజయమ్

వారు యతి యయాతి, సంయాతీ, ఆయాతి, వియాతి మరియు కృతి వారిలో యతిష్యేషుఁడు, యయాతి ఆతని అవరుఁడైన సోదరుఁడు (చిన్నతమ్ముఁడు). యతి కాకుత్స వంశకన్యయైన ‘గాం’నుభార్యగా పొందెను. ఆ ‘యతి’ మోక్షపథమును స్వీకరించి మునియై బ్రహ్మా ద్వైతుఁడయ్యెను. మిగిలిన యైదుగురిలో యయాతి పృథివీపతి. శుక్రుని కుమార్తెయైన దేవయానిని భార్యగా పెండ్లియాడెను. అంతియేకాక వృషపర్వునీ కూతురు ఆసురీకన్యయు నైన శర్మిష్టను కూడ భార్యగా గైకొనెను. దేవయాని యదువును, తుర్వసుని కనెను. వృషపర్వుని కూతురు శర్మిష్ఠ ద్రుహ్యుని, అనుని, పూరునీ కనెను. వీరు మహావీరులు. దేవసుతోపములు. ఆతనికి పరమభాస్వరమయిన రథమును ఇంద్రుఁడొసంగెను. ఆరథమెందును సంసక్తమై యుండిపోవదు, అది కాంచనమయము. దివ్యమైనది. మనోజవము గలిగిన అశ్వములతో యుక్తమయినది. ఈ రథములోనే ఆ కన్య నాతఁడు తీసికొనివచ్చెను. ఇంద్రుఁడాతనికీ అక్షయ శరములు గల అంబులపొదుల రెంటి నొసంగెను. ఆ ప్రసిద్ధమైన రథముతోడనే, ఆతఁడు ఎల్లప్పుడు భూమిని జయించెను. యయాతి దేవదానవ మానవులకు యుద్ధమున దుర్గరుండు. ఆ రథము పురు సంతతి సర్వరాజులకు కౌరవ వంశీయులయిన జనమేజయుని వరకు కౌరవుల పౌత్రుఁడు పరీక్షిత్తు వరకు చేరి తరువాత ధీమంతుఁడయిన గార్యుని శోషము వలన ఆ రథము నాశము చెందెను. దుర్బుద్ధియైన జన మేజయ రాజునకు లోహగంధియని పేరు. ఆతఁడు గార్యుని సుతుఁడు బాలుఁ డు నైన వాని హింసించెను. లోహగంధి యైన యారాజు ఇచ్చటకచ్చటకు (రక్షణకై) పరువులెత్తెను, పౌరజానపదులచే పరిత్యక్తుఁడు. ఆ రాజు మనశ్శాంతి పొందలేక పోయెను. దుఃఖ సంతపుఁడయ్యెను. ఎచ్చటను సుఖము పొందలేకపోయేను. వ్యధితుఁడై యతఁడు తుదకు శౌనక ఋషిని శరణుజొచ్చెను. ఈ ఋషి ఉదారధీమంతుఁడు. ఇంద్రోతుఁడను నామాంతరుఁడు. (ఓ బ్రాహ్మణోత్తములో) ఆతనిని పవిత్రీకరించుటకు, ఇంద్రోతుఁడు.

అశ్వమేధేన రాజానం పావనార్థం ద్విజోత్తమాః

స లోహగంధో వ్యనశత్తస్యావభృథమేత్య హ

సవై దివ్యో రథస్తస్మాద్వసోచ్చేదిపతేస్తథా

దత్తః శక్తేన తుష్టేన లేభే తస్మాద్బృహద్రథః

తతో హత్వా జరాసంధం భీమస్తం రథముత్తమమ్

ప్రదదౌ వాసుదేవాయ ప్రీత్యా కౌరవనందనః

స జరాం ప్రాప్య రాజర్షిద్యయాతిర్నహుషాత్మజః

పుత్రం శ్రేష్ఠం వరిష్ఠం చ యదుమిత్యబ్రవీద్వచః

జరావలీ చ మాం తాత పలితాని చ పర్యయుః

కావ్యస్యోశనసః శాపాన్న చ తృప్తోస్మి యౌవనే

త్వం యదో ప్రతిపద్యస్వ పాప్మానం జరయా సహ

జరాం మే ప్రతిగృహ్ణీష్వ తం యదుః ప్రత్యువాచ హ

అనిర్దిష్టా హి మే భిక్షా బ్రాహ్మణస్య ప్రతిశ్రుతా

సా తు వ్యాయామసాధ్యా వై న గ్రహీష్యామి తే జరామ్

జరాయాం బహవో దోషాః పానభోజనకారితాః

తస్మాజ్ఞరాం న తే రాజన్గ్రహీతుమహముత్సహే

సీతశ్మశ్రుధరో దీనోజరయా శిథిలీకృతః

వలీసంతతగాత్రశ్చ నిరాశో దుర్భలాకృతిః

అశక్తః కార్యకరణే పరిభూతస్తు యౌవనే

సహోపవీతిభిశ్చైవ తాంజరాం నాభికామయే

సంతి తే బహవః పుత్రా మత్తః ప్రియతరా నృప

ప్రతిగృహ్ణంతు ధర్మజ్ఞ పుత్రమన్యం గృహీష్వ వై

స ఏవముక్తో యదునా తీవ్రకోపసమన్వితః

ఉవాచ వదతాం శ్రేష్ఠో జ్యేష్ఠం తం గర్తయన్ సుతమ్

ఆశ్రమః కస్తవాన్యోఽస్తి కోవా ధర్మవిధిస్తవ

మామనాదృత్య దుర్భుద్దే యదహం తవ దేశికః

ఏవముక్త్వా యదుం రాజా శశాడైనం స మన్యుమాన్

యస్త్వం మే హృదయాజ్ఞాతో వయః స్వం న ప్రయచ్ఛసి

రాజయిన జనమేజయుని అశ్వమేధయాగము చేయింపగా జేసెను. ఆ యజ్ఞాంతమున అవభృధ స్నాన సమయమునకు వచ్చి లోహగంధి దానిని నశింపజేసెను. (26) ఆ దీవ్య రథము ఆతని నుండి తీసికొనఁబడి (ఉపరిచర) వసువైన చేదిపతికి, ఆతనితో సంతుష్టుడైన ఇంద్రుఁన జేరెను. ఆతని నుండి ఆ రథమును బృహద్రథుఁడు గ్రహించెను, (27) కౌరవ వంశ్యుఁడయిన భీముఁడు, జరాసంధుని చంపి, ఆ యుత్తమమయిన రథమును ప్రీతితో వాసుదేవున కొసంగెను. సహుషాత్మజుఁడు రాజర్షియునైన యయాతి పొర్ణక్యమును పొందెను. పుత్ర శేషుఁడు, వరిష్ణుండునైన యదువును (యయాతి) పిలిచి గోవత్స ! కుమార ! ముసలితనము, శరీరపు ముడతలు, కేశముల పలితత్వము శుక్రాచార్యుని శాపము వలన నన్నావరించినవి. యౌవనభోగమున తృపఁడను కాలేదు. ఓ యదూ ! ఈ నా వార్ధక్యముతో నా పాపమును నీవు స్వీకరింపుము. నా జంభారమును వహింపుము” అనెను. యదువు ఇట్లు ప్రత్యుత్తర మొసంగెను. (31) “ఈ భీక్ష (అభ్యర్ధనము) అనిర్దిష్టమయినది. బ్రాహ్మణునిచే ప్రతిశ్రుతము. నాచే అంగీకృతము కాదు. ఆజర వ్యాయామముచే సాధ్యమైనది. ఆవార్ధక్యమును నేను గ్రహింపను. జరయందు పాన భోజనాదుల వలనం గలుగ బహుదోషములున్నవి. అందుచే, ఓరాజా! జరను గ్రహించుటకు నేనుత్సహించను. (33) వార్ధక్యమున తెల్లఁబడిన గెడ్డము మీసములు గలిగి, దీనత్వమొంది, శిథీలీకృతుఁడనై, ముడుతలు పడ్డ శరీరము, నిరాశ, దుర్బలాకృతి, కార్యకరణమున శక్తిహీనత యౌవన క్రీయాదుల యందు తోడివారీతో పరీభవత్వము, పొందకోరను. ఓరాజా! నాకంటే ప్రియతరులైన పుత్రులు నీకెందరో కలరు. ఇతరులెవ్వరైన ప్రతిగ్రహింతురుగాక యదువిట్లు పలుక యయాతి కోపసమన్వితుఁడయ్యెను. వదతాం శ్రేష్ఠుఁడయిన రాజు తన జ్యేష్ఠ సుతుని గర్జించి, ఇట్లు పలికెను. ఓ దుర్బుద్దీ ! నీ తండ్రినైన నన్ను అనాదరించుటకు, నీకెట్టి ధర్మమున్నది? నీకెట్టి యితరాశ్రమ ధర్మమునీకున్నది” అని యదునితో పలికి, క్రుద్దుఁడయిన తండ్రి ఆతనిని శపించెను. నీవు నా హృదయము నుండి సంజాతుఁడవైనను నీవు నీ యౌవనమును నా కొసంగకుంటివి.

తస్మాన్నరాజ్యభాజ్మూఢ ప్రజా తే వై భవిష్యతి

తుర్వసో ప్రతిపద్యస్వ పాప్మానం జరయా సహ

తుర్వసు రువాచ :-

న కామయే జరాం తాత కామభోగప్రణాశినీమ్

జరాయాం బహవో దోషాః పానభోజనకారితాః

తస్మాత్ జరాం న తేరాజన్ గ్రహీతుమహముత్సహే

యయాతి రువాచ :-

యస్త్వం మే హృదయాజ్ఞాతో వయః స్వం న ప్రయచ్ఛసి

తస్మాత్ర్పజా ను విచ్ఛేదం తుర్వసో తవ యాస్యత

సంకీర్ణేషు చ ధర్మేణ ప్రతిలోమనరేషు చ

పిశితాశీషు చాన్యేషు మూఢ రాజా భవిష్యసి

గురుదారప్రసక్తేషు తిర్యగ్యోనిగతేషు వా

వాసనేపాపమ్లేచ్ఛేషు భవిష్యతి నసంశయః

సూతఉవాచ :-

ఏవం తు తుర్వసంశప్త్వా యయాతీః సుతమాత్మనః

శర్మిష్ఠాయాః సుతం ద్రుహ్యుమిదం వచనమబ్రవీత్

ద్రుహ్యో ! త్వం ప్రతిపద్యస్వ వర్ణరూపవినాశినీం

జరాం వర్ష సహస్రం వై యౌవనం స్వం దదస్వ మే

పూర్ణే వర్ష సహస్రే తే ప్రతిదాస్యామి యావనమ్

స్వం చాదాస్యామి భూయోఽహం పాప్మానం జరయా సహ

ద్రుహ్యురువాచ :-

నారోహేత రథం నాశ్వం జీర్ణో భుంక్తే న చ స్త్రియమ్

న సుఖం చాస్య భవతి న జరాం తేన కామయే

యయాతి రువాచ :-

యస్త్వం మే హృదయాజ్ఞాతో వయః స్వం నప్రయచ్ఛసి

తస్మాత్ ద్రుహ్యా ప్రియః కామో న తే సంపత్స్యతే క్వచిత్

నౌప్లవోత్తర సంచారస్తవ నిత్యం భవిష్యతి

అందుచే ఓ మూధ ! నీ సంతతీ రాజ్యమును పొందదు” ఓ తుర్వసు ! నాపాపమును వార్ధక్యముతో పాటు పొందుము తుర్వసుఁడిట్లు సమాధానమొసఁగెను. ఓ జనక ! నీవార్ధక్యమును కోరను. అయ్యది కామభోగ ప్రణాశిని. ముసలితనమున కామభోగము కైన దోషములు చాలాకలవు. అందుచే ఓ రాజా ! నీ వార్ధక్యమును గ్రహించుటకు నేనుత్సహింపను. అంత యయాతి ఇట్లనెను. నీవు నా యాత్మజుఁడవయినను నీ వయస్సును నాకిచ్చుటలేదు. అందుచే నీ సంతానము రాజ్యార్హతనుపొగొట్టుకొనును. నీవు సంకీర్ణములయిన మతధర్మము కలిగినవారికి మనకంటే వ్యతిరిక్తమయిన ఆచారములుగల ప్రతిలోమ నరులకు మాంసభుక్కులకు ఇతరులకు రాజవగుదువు. నీ నివాసము నిశ్చయముగా, గురుదార సంయోగ దోష మాచరించిన వారలలో తిర్యగ్యోనిని పొందినవారలతో పాపులతో మ్లేచ్చులతో కాగలదు. సూతుఁడిట్లనెను. తనకుమారుం డయిన తుర్వసునీనిట్లు శపించి యయాతి శర్మిష్ణ కుమారుఁడయిన ద్రుహ్యునిపిలిచి యిట్లనెను. ఓద్రుహ్యూ! వర్ణరూపవినాశనకారియైన ముసలితనమును . ఒక వేయి సంవత్సరములు స్వీకరింపుము. నీయొక్క యౌవనమును నా కీయుము. వెయ్యి యేండ్లు నీండిన తరువాత నీయౌవనమును మరల నీకొసంగెదను. నేను నా పాపమును వార్థక్యమును మరల గ్రహించెదను. ద్రుహ్యుఁడిట్లనెను. వృద్ధుఁడు రథమునధిరోహింపలేడు. గుఱ్ఱము నెక్కలేడు. స్త్రీలననుభవింపలేఁడు. ఆతనికి సుఖముండదు. నీజరాయోగమును నేనంగీకరింపను. యయాతి ఇట్లనెను, నా యాత్మజాతుఁడవయినను నీవయస్సును నాకీయవు. కాన, ఓద్రుహ్యూ ! నీ కోరిక లేవియు నీకు కావు. నీవెప్పుడును పడవలలో తెప్పలలో దోనెలలో సంచారము కలిగిన వాఁడవు అగుదువు.

అరాజా రాజవంశస్త్వం తత్ర నిత్యం వసిష్యసి

అనో త్వం ప్రతిపద్యస్వ పాప్మానం జరయా సహ

ఏవం వరసహస్రం తు చరేయం యౌవనేన తే

అనురువాచ :-

జీర్ణః శిశురివాశక్తో జరయా హ్యశుచిః సదా

న జుహోతి స కాలేఽగ్నీం తాం రాం నాభికామయే

యయాతి రువాచ :-

యస్త్వం మే హృదయాజ్ఞాతో వయః స్వం న ప్రయచ్చసి

జరాదోషస్త్వయోక్తోఽయం తస్మాత్వం ప్రతిపత్స్యసే

ప్రజా చ యౌవనం ప్రాప్తా వినతిష్యత్యనో తవ

అగ్నిప్రస్కందనపరస్త్వం వాప్యేవం భవిష్యసి

పూరో!త్వం ప్రతీపద్యస్వ పాప్మానం జరయా సహ

జరావతీ చ మాం తాత పలితాని చ పర్యయుః

కావ్యస్యోతసస శాపాన్న చ తృప్తో ఽస్మి యౌవనే

కంచిత్కాలం చరేయం వై విషయాన్వయసా తవ

పూర్ణే వర్ష సహస్ర తే ప్రతిదాస్యామి యౌవనమ్

సర్వచైవ ప్రతిపత్స్యేఽహం పాప్మానం జరయా సహ

సూత ఉవాచ :-

ఏవముక్తః ప్రత్యువాచ పుత్రః పితరమంజసా

యథా తు మన్యసే తాత కరిష్యామి తథైవ చ

ప్రతిపత్స్యే చ తే రాజన్ పాప్మానం జరయా సహ

గృహాణ యౌవనం మత్తశ్చర కామాన్ యథేప్సితాన్

జరయాహం ప్రతిచ్ఛన్నో వయోరూపధరస్తవ

యౌవనం భవతే దత్వా చరిష్యామి యథార్థవత్

నీవు రాజవంశ్యుఁడ వయినను అచ్చటనీవు రాజువుకాకుండగనే నిత్యమువసింతువు. ఓ అనూ !నాపాపమును వార్ధక్యముతో సహా నీవుస్వీకరింపుము. ఇట్లు నేను నీయౌవనముతో వెయ్యి యేండ్లు సంచరించెదను. అనుఁడిట్లనెను, వృద్ధుఁడు శిశువువలె బలహీనుఁడు నీరసుఁడు ఆతఁడెప్పుడును అశుచిమంతుఁడు, అగ్నియందాతఁడు సకాలమున హోమము చేయఁడు. అట్టి వార్ధక్యమును నేనంగీకరింపను. యయాతి ఇట్లనెను. నీవు నాకాత్మజాతుఁడవయినను, నీయౌవనమును నాకీయనంగీకరింపవు. నీవు వానిన జరాదోషము నీవు పొందుదువు. ఓ అనూ!నీవప్పుడే ముందుగానే వృద్ధుఁడవు. నీసంతానము యౌవనమును పొంది మరణించును. నీవు. నీ కుమారులను నీవే దహనము. చేయుదువు. ఓ పూరూ ! నా పాపమును జరాబాధతో స్వీకరింపుము. వార్ధక్య లోపములయిన శరీరపు ముడతలు, వెండ్రుకలు తెల్లబడుట కాశ్యపుఁడయిన ఉశనసుని శాపము వలన నన్నావరించినవి. నేను యావనమున తృప్తుండనుకాలేదు. నీయావన వయస్సుతో కొంతకాలము విషయభోగముల ననుభవించెదను. వేయి సంవత్సరములకాలము పూర్తికాగా నీయౌవనమును నీకొసంగెదను. నేనును నా పాపముతో నా ముదుసలితనమును స్వీకరించెదను. సూతుఁడిట్లనెను, ఇట్లు తండ్రిచే చెప్పఁబడి వెంటనే పుత్రుఁడు తండ్రితో నిట్లనెను. “ఓ జనక ! నీవు. తలంచినట్లే నేను చేసెదను. ఓరాజా ! నీ పాపమును వార్ధక్యముతో గ్రహింతును. నానుండి యౌవనమును నీవు గ్రహింపుము. యథేప్సితములయిన కామములననుభవింపుము, నేను నీ వార్థక్యముతో ప్రతిచ్ఛన్నుఁడనై (కప్పఁబడి) నీ వయస్సును రూపమును దాల్చి యుందును. నా యౌవనమును నీ కొసంగీ, నేను ముదుసలినైయట్లో సంచరించేద.

యయాతీ రువాచ :-

పూరో ! ప్రీతోఽస్మి భద్రం తే ప్రీతశ్చే దం దదామి తే

సర్వకార్యసమృద్ధాతే ప్రజా రాజ్యే భవిష్యతి

సూత ఉవాచ :-

పూరోరనుమతో రాజా యయాతిః స్వజరాం తతః

సంక్రామయామాస తదా ప్రసాదాత్ భార్గవస్య తు

గౌరవేణాథ వయసా యయాతిః నహుషాత్మజః

ప్రీతియుక్తో నరశ్రేష్ఠశ్చచార విషయాన్ స్వకాన్

యథాకామం యథోత్సాహం యథాకాలం యథాసుఖమ్

ధర్మావిరోధీ రాజేంద్రో యథాశక్తి స ఏవ హి

దేవానతర్పయద్యజ్ఞైః పితృన్ శ్రాద్ధైస్తథైవ చ

దారాననుగ్రహైరిష్టైః కామైశ్చ ద్విజసత్తమాన్

అతిథీనన్నపానైశ్చ వైశ్యాంశ్చ పరిపాలనైః

ఆనృశంస్యేన శూద్రాంశ్చ దస్యూన్సంనిగ్రహేణ చ

ధర్మేణ చ ప్రజాః సర్వా యథావదనురంజయత్

యయాతిః పాలయామాస సాక్షాదింద్ర ఇవాపరః

స రాజా సింహవీక్రాంతో యువా విషయగోచరః

అవిరోధేన ధర్మస్య చచార సుఖముత్తమమ్

స మార్గమాణః కామానామతద్ధోషనిదర్శనాత్

విశ్వాచ్యా సహితో రేమే వైభ్రాజే నందనే వనే

అపశ్యత్స యదా తాన్వై వర్ధమానాన్ నృపస్తదా

గత్వా పూరోః సకాశం వై స్వాం జరాం ప్రత్యపద్యత

సంప్రాప్య స తు తాన్ కామాంస్తృప్తః భిన్నశ్చ పార్థివః

కాలం వర్షసహస్రం వై సస్మార మనుజాధిపః

పరిసంఖ్యాయ కాలే చ కలాః కాష్ఠాస్తథైవ చ

యయాతి ఇట్లనెను. పూరూ ! ప్రీతుఁడనయితినీ, నీకు భద్రమగుగాక. నీకు ప్రేమతో దీనిని నొసంగుచున్నాను. నీసంతతి సర్వసమృద్ధమగును. వారు వారి కోరికల పొందుదురు. వారు రాజ్యమును పాలింతురు. సూతుఁడిట్లనెను. పూరుని యొక్క అంగీకారముతో రాజయిన యయాతి తనజరను అప్పుడాతనికి సంక్రమింపఁజేసెను. అంత భార్గవానుగ్రహమున నహుషుని కుమారుఁడయిన యయాతి గౌరవముగా (వైభవముతో) యౌవనముతో సంతోషవంతుఁడయ్యెను. నరశ్రేష్ఠుఁడయినయయాతి స్వకీయములయిన విషయభోగములను యథాకామము యథోత్సాహముగా, యథాకాలము యథాసుఖముగాననుభవించెను. యథాశక్తి ధర్మమునకవిరోధియై రాజేంద్రుఁడు యజ్ఞములచే దేవతలను సంతుష్టులఁజేసెను. అట్లే శ్రాద్ధక్రియాదులచే పితరులను తృప్తిపరచెను. అనుగ్రహముతో భార్యలను ఇష్టములయిన కోరికల నొసంగీ ద్విజసత్తములను, అన్నపానదానములచే అతిథులను, పరిపాలనములచే వైశ్యులను, శూద్రులను కాఠిన్య రాహిత్యము చేతను దుర్మార్గులయిన దస్యులను నిగ్రహణము చేతను, ధర్మక్రియా కలాపములచే ప్రజలను యథావిధిగ ననురంజనము చేసెను. అపర ఇంద్రునివలె యయాతి పాలించెను. సింహవిక్రాంతుం డైన రాజు, యువకుఁడై విషయభోగగోచరుఁడై, ధర్మమున కెచ్చట విరోధము లేకుండ సుఖముగా నుత్తమముగా సంచరించెను. కామములయందు దోషరాహిత్య నిదర్శనమున కామములనెల్ల వెదకికొని, విశ్వాచి (దేవతావేశ్య అప్సర)తో కూడి నందనవనము నందు వైభొజవనము నందు రాజు భోగించెను. యయాతి ప్రభువు కామములు వృద్ధి పొందుటేకానీ తరుగుట లేమి గమనించి, పూరునీ దగ్గర కరిగెను. తన వార్ధక్యమును నాతని నుండి గ్రహించెను. కామముల నన్నింటిని పొంది రాజు ఖిన్నుడయ్యెను. వర్ష సహస్ర పరిమితి స్మరించెను. రాజు కలలతో, కాష్ఠములతో కాలమును లెక్కించి నిర్ణీతకాలము పరిపూర్ణముకాగా, పుత్రుఁడైన పూరునితో నిట్లనెను.

పూర్ణం మత్వా తతః కాలం పూరుం పుత్ర మువాచ హ

యథాసుఖం యథోత్సాహం యథాకాలమరిందమ

సేవితాః విషయాః పుత్ర యౌవనేన మయా తవ

పూరో ప్రీతోఽస్మీ భద్రం తే గృహాణ త్వం స్వయౌవనమ్

రాజ్యం చ త్వం గృహాణేదం త్వం హి మే ప్రియకృత్సుతః

ప్రతిపేదే జరాం రాజా యయాతిర్నహుషాత్మజః

యౌవనం ప్రతిపేదే చ పూరుః స్వం పునరాత్మనః

అభిషేక్తకామం చ నృపం పూరుం పుత్రం కనీయసమ్

బ్రాహ్మణప్రముఖా వర్జా ఇదం వచనమబ్రువన్

కథం శుక్రస్య నప్తారం దేవయాస్యాః సుతం ప్రభో

జ్యేష్ఠం యదుమతిక్రమ్య రాజ్యం దాస్యని పూరవే

యదుర్జ్యేష్ఠస్తవ సుతో జాతస్తమనుతుర్వసుః

శర్మిష్ఠాయాః సుతో ద్రుహ్యుః తతోఽనుః పూరురేవ చ

కథం జ్యేష్టానతిక్రమ్య కనీయాన్ రాజ్యమర్హతి సుతః సంబోధయామస్త్వాం ధర్మం సమనుపాలయ

యయాతి రువాచ :-

బ్రాహ్మణ ప్రముఖా వర్ణాః సర్వే శ్రుణ్వంతు మే వచః

జ్యేష్ఠం ప్రతి యథా రాజ్యం న దేయం మే కథంచన

మాతాపిత్రోర్వచనకృద్వీరః పుత్రః ప్రశస్యతే

మమ జ్యేష్ఠేన యదునా నీయోగో నానుపాలితః

ప్రతికూలః పితుర్యశ్చ న స పుత్రః సతాం మతః

స పుత్రః పుత్రవధ్యశ్చ వర్తతే పితృమాతృషు

యదునాహమవజ్ఞాతః తథా తుర్వసునాపి చ

ద్రుహ్యునా చానునా చైవ మయ్యవజ్ఞా కృతా భృశమ్

పూరుణా తు కృతం వాక్యం మానితశ్చ విశేషతః

కనీయాన్ మమ దాయాదో జరా యేన ధృతా మమ

సర్వే కామా మమ కృతాః పూరుషో పుణ్యకారీణా

ఓ పుత్ర ! ఓ అరిందమ ! యథాసుఖము, యథోత్సాహము, యథాకాలము నీ యౌవనముతో విషయ భోగములను నేను సేవించితిని. ఓ పూరూ ! సంతుష్టుఁడనైతిని. నీకు మంగళమగుగాక. నీ యౌవనమును నీవు స్వీకరింపుము. (74) నీవు నాకు ప్రియమాచరించిన సుతుఁడవు. ఈ రాజ్యమును నీవు గ్రహింపుము. నహుషాత్మ జుఁడయిన యయాతి జరను స్వీకరించెను. పూరువు స్వకీయమైన యౌవనమును. మరల స్వీకరించెను. కనీయుఁడైన పూరునికి అభిషేకమొనరింప నృపుఁడు కోరెను. ఆ రాజుతో బ్రాహ్మణులు ఆదిగా. సర్వవర్ణములవారు ఇట్లనిరి. ఓ ప్రభూ ! శుక్రాచార్యుని మనుమఁడు దేవయాని కుమారుఁడు జ్యేష్ఠుడు నయిన యదువును, విడిచి పూరునకు రాజ్యమిచ్చుచుంటివి. యదువు నీ జ్యేష్ఠ సుతుఁడు, తరువాత తుర్వసుఁడు పుట్టెను. తరువాత ద్రుహ్యుఁడు శర్మిష్ఠకుమారుడు. ‘అనువు’. ఆతని తరువాత పుట్టెను. తరువాత పుట్టినవాడు పూరువు. జ్యేష్ఠులయిన సోదరుల నతిక్రమించి కనీయసుఁడైన పూరువు రాజ్యమున కెట్లరుఁడు? మేము ధర్మమును జ్ఞప్తి జేయించుచుంటిమి. ధర్మమును పాలింపుము. యయాతి. ఇట్లు ప్రత్యుత్తరమొసంగెను. బ్రాహ్మణ ప్రముఖులయిన సర్వవర్ణములవారు నా పలుకులు వినుఁడు. నేనేల జ్యేష్ఠునకు రాజ్యమీయరాదో వినుఁడు. తల్లిదండ్రుల వచనముల నాచరించిన వీరుఁడైన పుత్రుఁడే ప్రశస్యుఁడు. జ్యేష్ఠుఁడైన యదునిచే నా. నియోగము పాలింపఁబడలేదు. తండ్రికి ప్రతీకూలుఁడైన పుత్రుఁడు పుత్రుఁడు కాడనీ సజ్జనుల సిద్దాంతము. తల్లిదండ్రుల యందు పుత్రునివలె నెవఁడాచరించునో యతఁడే పుత్రుఁడు. యదువు నన్నతిక్రమించెను. అట్లే తుర్వసుడు ద్రుహ్యుఁడు అనువు కూడ నట్లే నన్ను మిక్కిలి నిర్లక్ష్యముచేసిరి. పూరువు నా వాక్యమును గౌరవించెను. విశేషముగా నొనర్చెను. ఎవ్వఁడు నా జరను వహించెనో కనిషుఁడు ఆతఁడే నాదాయాది. పుణ్యకారియయిన పూరునిచే నా కోరికలన్నియు సఫలితములైనవి.

శుక్రేణ చ వరో దత్తః కావ్యేనోశననా స్వయమ్

పుత్రో యస్వాఽ నువర్తేత స రాజా తు మహామతే

ప్రజా ఊచుః :-

భవతోఽనుమతోఽ ప్యేవం పూరూ రాజ్యేఽభీషిచ్యతామ్

యః పుత్రో గుణసంపన్నో మాతాపిత్రోర్హితః సదా

సర్వమర్హతి కళ్యాణం కనీయానపి స ప్రభుః

అర్హోఽస్య పూరూ రాజ్యస్య యః ప్రియః ప్రియకృత్తవ

వరదానేన శుక్రస్య న శక్యం వక్తుముత్తరమ్

పౌరజానపదైస్తుష్టైరిత్యుత్తే సోహుష స్తదా

అభిషిచ్య తతః పురుం స రాజ్యే సుతమాత్మనః

దిశి దక్షిణపూర్వస్యాం తుర్వసుధ తు న్యవేశయత్

దక్షిణాపరతో రాజా యదుం జ్యేష్ఠం న్యవేశయత్

ప్రతీచ్యాముత్తరస్యాం చ ధ్రుహ్యుం చానుం చ తావుభౌ

సప్తద్వీపాం యయాతిస్తు జిత్వా పృథ్వీం ససాగరామ్

వ్యభజత్పంచధా రాజా పుత్తేభ్యో నాహుషస్తదా

తైరియం పృథివీ సర్వా సప్తద్వీపా సపత్తనా

యథాప్రదేశం ధర్మజ్ఞర్దర్మేణ ప్రతిపాద్యతే

ఏవం విభజ్య పృథివీం పుత్తేభ్యో నాహుషః స్తదా

పుత్రసంక్రామితశ్రీస్తు ప్రీతిమానభవన్నృపః

ధనుర్యస్య పృషత్కాంశ్చ రాజ్యం చైవ సుతేషు తు

ప్రీతిమానభవద్రాజా భారమావేశ్య బంధుషు

అత్ర గాథా మహారాజ్ఞా పురా గీతా యయాతినా

యాభిః ప్రత్యాహరేత్కామాత్కూ(న్మూ)ర్మోంగానీవ సర్వశః

న జాతు కామః కామానాముపభోగేన శామ్యతి

హవిషా కృష్ణవర్త్మేవ భూయ ఏకాభివర్ధతే

కావ్యుఁడు, ఉశనసుఁడు అయిన శుక్రునిచే స్వయముగా నొక వరమీయబడెను. “ఓ మహామతీ! పుత్రుడెవ్వఁడు నిన్ను అనుసరించి వర్తించునో అతఁడు రాజగును”. ప్రజలిట్లనిరి. ఈ విధముగా నీచే ననుమతింపఁబడిన పూరువు రాజ్యమునందభిషిక్తుఁడగుగాక. ఏ కుమారుఁ డు గుణసంపన్నుండో, తల్లిదండ్రులకు హితుఁడో ఆతఁడు కనిష్ణుఁడయినను ప్రభువుగా కల్యాణమునకర్యడు. ఈ పూరువు, నీకు ప్రియమాచరించినవాఁడు, ప్రియుడు రాజ్యమునకరుడు. శుక్రునియొక్క వరదానముచే ప్రత్యాఖ్యానము చేయశక్యము కాదు. సంతుష్టులయిన జనులిట్లు చెప్పగా, సహుషాత్మజుండయిన యయాతి తన కుమారుఁడైన పూరునీ తన రాజ్యమున నభిషిక్తుని చేసెను. దక్షిణ పూర్వమైన ఆగ్నేయదిక్కున తుర్వసుని స్థాపించేను. రాజు యదువును నైరృతిదీశయందు నెలకోల్పెను. పడమటి దశయందు ఉత్తరదిశ యందు ద్రుహ్యుని నేలకొల్పేను. ఉత్తరదిశయందు అనునీ స్థాపించెను. నహుషుని కుమారుడైన యయాతీ ససాగరవృతమైన సప్తద్వీప వసుంధరను జయించి ఐదువిధములుగా రాజపుత్రులకు రాజ్యమును విభజించెను. వారందరిచే పత్తనములతో కూడిన యీ పృథివి ధర్మజ్ఞులచే ధర్మముగా పాలింపం బడును, యయాతి పుత్రులకు పృథ్వీరాజ్యము నీవిధముగా విభజించి, పుత్రులకు, సంక్రమిత సంపదతో ప్రీతిమంతుఁడయ్యెను. (94) ధనువును బాణములను రాజ్యమును కుమారుల యందు విశ్వసించి, బంధువులయందు భారముంచి, యయాతి సంతుష్టుఁడయ్యెను. ఈ సందర్భములో యయాతి ఈ క్రింది శ్లోకములను పూర్వము చదివేను. కూర్మము తయంగములను లోపలికి నిగ్రహించుకొనునట్లే ప్రతివ్యక్తి కామములను నిగ్రహించవలెను. హవిస్సుచే అగ్నిహోత్రుఁడు శాంతిపండు. పైపెచ్చు అభివృద్ధినొందును. అట్లే కామములేప్పుడును అనుభవముచేత శాంతిపవు. (97)

యత్పృథివ్యాం వ్రీహియవం హిరణ్యం పశవః స్త్రియః

నాలమేకస్య తత్సర్వమీతీ పశ్యన్న ముహ్యతి

యధా న కురుతే భావం సర్వభూతేష్వమంగళమ్

కర్మణా మనసా వాచా బ్రహ్మ సంపద్యతే తదా

యదా పరాన్న బిజేతి యదాన్యస్మాన్న బిభ్యతి

యదా నేచ్ఛతి న ద్వేష్టి బ్రహ్మ సంపద్యతే సదా

యా దుస్త్వతా దుర్మతిభిర్యా న జీర్యతి జీర్యతః

మైషా ప్రాణాంతికో రోగ స్తాం తృష్ణాం త్యజితః సుఖమ్

జీర్యంతి జీర్యతః కేశా దంతా జీర్యంతి జీర్యతః

జీవితాశా ధనాశా చ జీర్యతోఽపి న జీర్యతి

యచ్చ కామసుఖం లోకే యచ్చ దివ్యం మహత్సుఖమ్

తృష్టాక్షయసుఖ స్యైతత్కలాం నార్హంతి షోడశీమ్

ఏవముక్త్వా స రాజర్షిః సదారః ప్రస్థితోవనమ్

భృగుతుంగే తపస్తప్త్వా తత్రైవ చ మహాయశాః

పాలయిత్వా వ్రతం చార్షం తత్రైవ స్వర్గమాప్తవాన్

తస్య వంశాస్తు పంచైతే పుణ్యా దేవర్షిసత్కృతాః

యైర్యాప్త పృథివీ కృత్స్నా సూర్య స్యేవ గభస్తిభిః

ధన్యః ప్రజావానాయుష్మాన్ కీర్తిమాంశ్చ భవేన్నరః

యయాతేశ్చరితం సర్వం పఠన్ శ్రుణ్వన్ ద్విజోత్తమాః

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోకే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే అష్టషష్టితమోఽధ్యాయః

పృథివి యందు ధాన్యములు, యవలు, బంగారము పశు సంపద స్త్రీలు - ఇవన్నియును నెవ్వనీకిని తృప్తి నొసంగలేవు. ఎవ్వఁడు ఈ సత్యము నెఱుంగునో యతఁడు విచారింపఁడు. మోసపోఁడు. సర్వభూతములకు అమంగళమెవఁడు కర్మచే, మనస్సుచే, వాక్కుచే నొనరింపండో ఆతఁడు బ్రహ్మత్వమొందును. (99) ఎవఁడు ఇతరుల వలన భయపడడో, ఎవనీ వలన ఇతరులు భయపడరో ఎవ్వఁడు ద్వేషింపండో, ఎవ్వఁడు ఎప్పుడు కోరడో, ఆతఁడు. బ్రహ్మత్వమొందును. (100)దుర్మతులచే నేయ్యది త్యజింపఁబడదో, వార్ధక్యమున శరీరము జీర్ణించినను ఏయది జీర్ణించిపోదో, ఎయ్యది ప్రాణాంతకమయిన రోగమో అట్టి తృష్ణను త్యజించిన సుఖము. వార్ధక్యమున కేశములు జీర్ణించును, చిక్కువడును, దంతములు రాలిపోవును. కాని జీవితమునందలి ఆశయు, ధనముకొలకు ఆశయ శరీరము చివికిపోవుచున్నను జీర్ణించిపోవు. (102) లోకము నందలి కామసుఖము, స్వర్గసుఖము, తృష్ణా పరీత్యాగము వలనఁగలుగు సుఖములో పదీయారవ భాగముతో గూడ సమానమైనను కావు. (103) ఇట్లు చెప్పి రాజర్షి భార్యా సహితుడై వనమున కరిగేను. భృగుతుంగమున తపస్సాచరించి, అచ్చటనే అర్షమయిన వ్రతమును పాలించి అచ్చటనే స్వర్గమును పొందెను. అతని వంశమునకు చెందిన రైదుగురు పుణ్యులు, దేవతలచే వారు సత్కృతులు. సూర్యుని యొక్క కిరణములెట్లు భూమిని వ్యాపించినవో యట్లే వారిచే పృథివి యంతయు వ్యాప్తము. ధన్యమైన యయాతియొక్క చరిత్రమును పఠించువారు ధన్యులు. పుత్రవంతులు, ఆయుష్మంతులు కీర్తిమంతులు నగుదురు.

ఇది వాయుప్రోక్తమైన బ్రహ్మాండ మహాపురాణమున మధ్యమభాగమున తృతీయోపోద్ఘాతపాదమున అరువది యెనిమిదవ అధ్యాయము.