బ్రహ్మాండ మహా పురాణము
15 - భూమిపొడవు-వెడల్పు - జంబూద్వీపము
సూత ఉవాచ :-
ఏవం ప్రజాసన్నివేశం శ్రుత్వా వై శాంశపాయనిః ।
ప్రప్రఛ్ఛ నియతం సూతం పృథివ్యుదధివిస్తరమ్ ॥
కతిద్వీపా సముద్రా వా పర్వతా వా కతి స్మృతాః ।
కీయంతి చైవ వర్షాణి తేషు నద్యశ్చ కాః స్మృతాః ॥
మహాభూతప్రమాణం చ లోకాలోకం తథైవ చ ।
పర్యాయం పరిమాణం చ గతిం చంద్రార్కయోస్తథా ॥
ఏతత్ ప్రబ్రూహి నః సర్వం విస్తరేణ యథార్థతః ।
సూత ఉవాచ :
హంత వోఽహం ప్రవక్ష్యామి పృథివ్యాయామవిస్తరమ్ ॥
సంఖ్యా చైవ సముద్రాణాం ద్వీపానాం చైవ విస్తరమ్ ।
ద్వీపభేదసహస్రాణి సప్తస్వంతర్గతాని చ ।
న శక్యంతే క్రమేణేహ వక్తుం యైః సతతం జగత్ ॥
సప్త ద్వీపాన్ ప్రవక్ష్యామి చంద్రాదిత్యగ్రహైః సహ ।
తేషాం మనుష్యాస్తర్కేణ ప్రమాణాని ప్రచక్షతే ।
అచింత్యాః ఖలు మే భావా న తాంస్తర్కేణ సాధయేత్ ॥
ప్రకృతిభ్యః పరం యచ్చ తదచింత్యం ప్రచక్షతే ।
నవవర్షం ప్రవక్ష్యామి జంబూద్వీపం యథాతథమ్॥
విస్తారాన్ మండలాచ్చైవ యోజనైః తన్నిబోధత ।
శతమేకం సహస్రాణాం యోజనాగ్రాత్సమంతతః ॥
సూతుడు అనెను.
ఇట్లు ప్రజల సన్నివేశమును నాలకించి శాంశపాయని పృథివీ యొక్క సముద్రము యొక్క పొడవును విస్తరమును గూర్చి నియతుఁ డయిన సూతుని అడిగెను. “ఎన్ని ద్వీపములున్నవి? సముద్రములెన్ని? ఎన్ని పర్వతములు స్మరింపఁబడినవి? ఎన్ని (వర్షములు) ఉపఖండములు? నదులెన్ని చెప్పబడినవి? మహాభూతముల ప్రమాణములను, చంద్రునియొక్క సూర్యునియొక్క ప్రమాణములను, గతులను, అట్లే లోకములను, యథార్థముగ విస్తరముగ సర్వము మాకు చెప్పుము”. (1,3)
సూతుఁడిట్లు వచించెను.
పృథివి యొక్క పొడవును, విస్తరమును, సముద్రముల యొక్క సంఖ్యను, ద్వీపముల యొక్క విస్తృతిని, బహువిధ ద్వీప సప్త ద్వీపాంతరము లయిన భేదములను మీకు చెప్పెదను. వానిని క్రమముగా చెప్పుటకు సాధ్యము కాదు. ఏలయన ఈ ప్రపంచమంతయు వానిచే పరీవృతమయి యున్నది. చంద్రాదిత్య గ్రహములతో సహితముగా సప్తద్వీపములను వివరించెదను, (4,6) అందు మనుష్యులు వారి ప్రమాణములను ఊహచే (తర్కముచే) చెప్పుదురు. తర్కముచే గూడ ఆవస్తువుల స్థితి నెవ్వడు చెప్పలేఁడు. వానిని గూర్చి ఊహించుట కయినను సాధ్యము కాదు. అవియ చింత్యములు, ప్రకృతి పరములయిన వానిని అచింత్యములందురు. తొమ్మిది ఉపఖండములతో (వర్షములతో కూడియున్న జంబూద్వీపమును ఉన్నదియున్నట్లుగా యథాతథము వక్కాణీంచెదను. వాని పొడవులను విస్తరములను వాని మండలమును (వాని చుట్టుకొలతలను) యోజనముల చేనెఱుంగుఁడు. అయ్యది (ఆ జంబూద్వీపము) అంతయు శతసహస్ర యోజనములు. (9)
నానాజనపదాకీర్ణః పురైశ్చ వివిధై శ్శుభైః ।
సిద్ధచారణసంకీర్ణః పర్వతైరుపశోభితః ॥
సర్వధాతునిబధ్ధైశ్చ శిలాజాలసముద్భవైః ।
పర్వతప్రభవాభిశ్చ నదీభిః సర్వతస్తతః ॥
జంబూద్వీపః పృథుః శ్రీమాన్ సర్వతః పృథుమండలః ।
నవభిశ్చావృతః సర్వో భువనైః భూతభావనైః ॥
లవణేన సముద్రేణ సర్వతః పరివారితః ।
జంబూద్వీపస్య విస్తారాత్ సమేన తు సమంతతః ॥
ప్రాగాయితాః సుపర్వాణః షడిమే వర్షపర్వతాః ।
అవగాడా హ్యుభయతః సముద్రౌ పూర్వపశ్చిమౌ॥
హిమప్రాయశ్చ హిమవాస్ హేమకూటశ్చ హేమవాన్ ।
సర్వర్తుషు సుఖశ్చాపి నిషధః పర్వతో మహాన్ ॥
చతుర్వర్ణశ్చ సౌవర్ణో మేరుశ్చారుతమః స్మృతః ।
ద్వాత్రింశచ్చ సహస్రాణి విస్తీర్ణః స చ మూర్ధని ॥
వృత్తాకృతిప్రమాణశ్చ చతురస్రః సముచ్చ్రితః ।
నానావర్ణాస్తు పార్శ్వేషు ప్రజాపతిగుణాన్వితః ॥
నాభిబంధనసంభూతో బ్రహ్మణోఽవ్యక్త జన్మనః ।
పూర్వతః శ్వేతవర్ణశ్చ బ్రాహ్మణస్తస్య తేన తత్॥
పార్శ్వముత్తరతస్తస్య రక్తవర్ణః స్వభావతః ।
తేనాస్య క్షత్త్ర భావస్తు మేరోర్నానార్థకారణాత్ ॥
అది నానా జనపదాకీర్ణము, వివిధములయిన శుభంకరములయిన పురములతో నున్నది. సిద్దులయొక్క చారణుల యొక్క సంచారములతో, సంకీర్ణము; పర్వతములచే నుపశోభితము, ఆ పర్వతము శిలాజాల సముద్భూతములయిన వివిధములయిన ధాతువులు కలిగియున్నవి. పర్వతముల నుండి ప్రవహించు నదులచే నిండియున్నది. (10,11) జంబూద్వీపము చాలా పెద్దది; సర్వత్ర శ్రీమంతములయిన పృథు.మండలములు కలది; బహు విధములయిన భూత భావనచే (ప్రాణిఉత్పత్తిచే) కూడిన నవభువనములచే పరివృతమై యున్నది. (12) జంబూ ద్వీపము అంతయు. లవణి సముద్రముచే చుట్టబడియున్నది. ఆ లవణ సాగథ విస్తారము జంబూ ద్వీపపు విస్తారమే (13) ఉపవర్షములను విభజించు నట్టిపర్వతము లారున్నవి. వానిని క్రింద నుదాహరించెదను. ఆ పర్వతములకు అనుబంధ పర్వత శ్రేణులు కలవు. అయ్యవి ఇరుప్రక్కల తూర్పు సముద్రమున' పశ్చిమ సముద్రమున మునింగి వ్యాపించి యున్నవి. (14) హిమవత్పర్వత మంతయు ఇంచుమించుగా మంచుచే ఆవృతము. హేమ కూట , పర్యతము బంగారముతో నిండినది. నిషధ పర్వతము చాలా పెద్దది. అయ్యది అన్ని ఋతువుల యందు సమానముగా సుఖ వంతముగా నుండును. (15) మేరు పర్వతము రమ్యతమ మయినది. అయ్యది సౌవర్ణము. నాలుగు రంగులు కలది. అయ్యది శిఖరము నందు ముప్పది రెండు వేల యోజనముల విస్తీర్ణము కలది. (16) అయ్యది ఆకారమున వృత్తము. అది చతురస్రము. సమున్నతము. అయ్యది ప్రజాపతిగుణకలితము. దాని పార్వముల యందు నానా వర్ణములు కలవు (17) అయ్యది అవ్యక్త ప్రభవుండయిన బ్రహ్మ యొక్క నాభినుండి పుట్టినది. తూర్పు భాగమున నది శ్వేత వర్ణము కలది. అందుచే నది బ్రాహ్మణులతో తుల్యమయినది. (18) ఉత్తర భాగమున నది స్వభావ యుతముగ రక్తవర్ణము కలది. అది యందుచే క్షాత్ర ధర్మయుతము. ఇట్లనుట కెన్నీయో కారణములు కలవు. (19)
పీతశ్చ దక్షిణే నాసౌ తేన వైశ్యత్వమిప్యతే ।
భృంగపత్రానిభశ్చాపి పశ్చిమేన సమాచితః॥
తేనాస్య శూద్రభావః స్యాదితి వర్ణాః ప్రకీర్తితాః ।
వృత్తః స్వభావతః ప్రోక్తో వర్ణతః పరిమాణతః ॥
నీలశ్చ వైదూర్యమయః శ్వేతః శుక్లో హిరణ్మయః ।
మయూర బర్హ వర్ణస్తు శాతకుంభశ్చ శృంగవాన్ ॥
ఏతే పర్వతరాజానః సిద్ధచారణసేవితః ।
తేషామంతరవిష్కంభో సమసాహస్ర ఉచ్యతే ॥
మధ్యే త్విలావృతం నామ మహామేరోః సమంతతః ।
సవైవం తు సహస్రాణి విస్తీర్ణం సర్వతస్తు తత్ ॥
మధ్యే తస్య మహామేరుర్విధూమ ఇవ పావకః ।
వేద్యర్ధైః దక్షిణం మేరురుత్తరార్ధం తథోత్తరమ్ ॥
వర్షాణి యాని షట్ చైవ తేషాం మే వర్షపర్వతాః ।
ద్వేద్వే సహసే విస్తీర్ణా యోజనానాం సముచ్చ్రయాత్ ॥
జంబూద్వీపస్య విస్తారాత్తేషామాయామ ఉచ్యతే ।
యోజనానాం సహస్రాణి శతం ద్వావాయతౌ గిరీ ॥
నీలశ్చ నిషధశ్చైవ తాభ్యాం హీనాస్తు యే ఫరే ।
శ్వేతశ్చ హేమకూటశ్చ హిమవాన్ శృంగవాంస్తథా ॥
ఆ మేరువు దక్షిణమున పీతవర్ణము కలిగియున్నది. అందుచే ధాని వైశ్యత్వము సువ్యక్తము. పశ్చిమమున నది శృంగపత్ర తుల్యవర్ణము కలది. అందుచే నది శూద్ర భావము సందినది. ఇట్లు వర్ణములతో తుల్యముగా నాలుగు రంగులు చెప్పఁబడినవి, స్వభావ సిద్ధమయిన దాని వృత్తత్వము, పరిమాణము, వర్ణత్వము చెప్పబడినవి. (21) 'నీల' పర్వతము వైడూర్యమణిమయము. శ్వేతద్వీపము శ్వేతవర్ణము. పరిపూర్ణముగా సువర్ణమయము. శృంగ పర్వతము నెమలి పింఛపు వర్ణము కలది. అదియు స్వర్ణమయము. ఈ పర్వత రాజములన్నియు సిద్ధచారణ సేవితములు. ఆ పర్వతముల ఆంతర వ్యాసము తొమ్మిది వేల యోజనములు (23) మహా మేరుపర్వతము యొక్క మధ్యభాగమున ఇలా వృత నామక పర్వతము కలదు. ఆ పర్వతము యొక్క విస్తీర్ణము నవ సహస యోజనములు (24) ఈ మేరు పర్వతము దానీ మధ్య భాగమున ధూమ రహిత అగ్ని వలె నుండును. వేదియొక్క పూర్వార్థము దక్షిణపు ఉత్తరార్ధము ఉత్తరమేరుపు. (25) షట్ వర్షములకు (ఉప ఖండములకు) సంబంధించిన వర్ష పర్వతములు విస్తీర్ణమునను ఔన్నత్యమునను ద్విసహస్ర యోజనములు (26) జంబూ ద్వీప విస్తీర్ణము ననుసరించీ చెడూ విస్తీర్ణము చెప్పు బడినది. నీల నిషధ పర్వత ద్వయము ద్వీ సహన ద్వీశతయోజనముల పొడవు గలిగినది. (27) మిగిలిన నాలుగు పర్వతములు నీల నిషధ పర్వతముల విస్తీర్ణము కంటే తక్కువ విస్తీర్ణము కలది శ్వేత హేమ కూట పర్వతములు ఒక్కొక్కటి తొమ్మిది సహస్ర యోజనములు మాత్రమే. హిమ పర్వతము, శృంగవత్పర్వతము ఒకొక్కటి ఎనుబది సహస్రముల యోజనములు మాత్రమే (28, 29)
నవతీ ద్వే అశీతీ ద్వే సహస్రాణ్యాయతాస్తు తైః ।
తేషాం మధ్యే జనపదాస్తాది వర్షాణి సప్త వై ॥
ప్రపాతవిషమైస్తైస్తు పర్వతైరావృతానీ తు ।
సంతతాని నదీభేదైరగమ్యాని పరస్పరమ్ ॥
వసంతి తేషు సత్త్వాని నానాజాతీని సర్వశః ।
ఇదం హైమవతo వర్షం భరతం నామ విశ్రుతమ్ ॥
హేమకూటం పరం హస్మాన్నామ్నా కింపురుషం స్కృతమ్ ।
నైషధం హేమకూటాత్తు హరివర్షం తదుచ్యతే ॥
హరివర్షాత్పరం చాపి మేరోశ్చ తదీలావృతమ్ ।
ఇలావృతాత్పరం నీలం రమ్యకం నామ విశ్రుతమ్॥
రమ్యకాత్వరతః శ్వేతం విశ్రుతం తధ్ధరణయమ్ ।
హిరణ్మయాత్పరం చైవ శృంగవత్తః కురు స్మృతమ్॥
ధను: సంస్థే తు విజ్ఞేయం ద్వే వర్షే దక్షిణోత్తరే ।
దీర్ఘాణి తత్ర చత్వారి మధ్యమంతదీలావృతమ్॥
అర్వాక్ చ నిషధస్యాథ వేద్యర్థం దక్షిణం స్మృతమ్ ।
పరం వీలవతో యచ్చ వేద్యర్ధం తు తదుత్తరమ్ ॥
వేద్యర్థం దక్షిణే త్రీణి త్రీణి వర్షాణి చోత్తరే ।
తయోర్మధ్యే తు విజ్ఞేయా మేరుర్మధ్య ఇలావృతమీ॥
వాని మధ్య జనపదములు వర్షములు (ఉపఖండములు) కలవు. (29) ఉపఖండములు ఏడు. ఈ వర్షములు పర్వతావృతములు. ఆ పర్వతములు జలపాతములచే విషయములు, అందుచే అవి అగమ్యములు, వివిధములయిన నదులచే నవి యడ్డదిడ్డముగా నున్నవి. అందుచే ఒక వర్షము నుండి వేదోక వర్షమునకు ప్రయాణించుట కష్టము. (అవి పరస్పరము దుర్గమములు) (30) వాని యందెల్లడను నానా జాతి జంతువులు నివసించుచున్నవి. ఈ హైమవతము 'భరతవర్ష నామముచే బహు విశ్రుతము. (31) దీనికి పరముగా (పైనీ) హేమ కూటము ఉన్నది. అయ్యది 'కిం 'పురుష' మను పేరుచే స్మరింపఁబడుచున్నది. నైషధమను నుపవర్షము హేమకూటమును దాటియున్నది. దానికి 'హరివర్ష మనిపేరు. (32) 'హరివర్షము' నకు పైని ఇలా వృతమున్నది. (ఈ ఇలా వర్షము మేరు పర్వతము నందు మధ్య నున్నది) 'నీల' పర్వతము ఇలా వృతమునకు పరమందున్నది. ఈ నీల పర్వతము రమ్యక' మను నామమున ప్రఖ్యాతము. (33) “శ్వేతము రమ్యక పర్వతమునకు పైన నున్నది 'హిరణ్మయ” మని ఇది ప్రఖ్యాతము. హిరణ్మయమునకు పైని (పరముగా) శృంగవత్పర్వతమున్నది. దీనికి 'కురు' అని పేరు. (34) దక్షిణోత్తర దిశల నున్న ఈ రెండు పర్వతములు ధనురాకారమున నున్నవి. మిగిలినవి నాలుఁగు చతురస్రపు టాకారమున దీర్ఘముగ నున్నవి. వానీకి మధ్యమమున ఇలా వృతమున్నది. (35) 'వేద్యర్థము' నైషధమునకు క్రిందుగా నున్నదీ అయ్యది దక్షిణ వేద్యర్ధమని ప్రఖ్యాతము. నీలవంతమును, దాటియున్నట్టిది ఉత్తర 'వేద్యర్ధము' (36) వేద్యర్ధము యొక్క దక్షిణ పార్శ్వమున వేద్యర్ధమునకు మూఁడు వర్షములు కలవు. వేద్యర్ధమునను త్తరభాగమున మూడు వర్షములు గలవు. మేరువు వాని మధ్యనున్నదనియు, ఇలా వృతము మేరువు మధ్యనున్నదనియు నెఱుంగవలయును. (37)
దక్షిణేన తు నీలస్య నిషధస్యోత్తరేణ తు ।
ఉదగాయతో మహాశైలో మాల్యవన్నామ నామతః ॥
యోజనానాం సహస్రం తు ఆనీలనిషధాయతః ।
ఆయామతశ్చతుర్వింశత్సహస్రాణి ప్రకీర్తితః ॥
తస్య ప్రతీచ్యాం విజ్ఞేయః పర్వతో గంధమాదనః ।
ఆయామతోఽథ విస్తారాన్మాల్యవానితి విశ్రుతః ॥
పరిమండలయోర్మేరుర్మధ్యే కనకపర్వతః ।
చతుర్వర్ణః స సౌవర్ణః చతురస్రః సముచ్చ్రీతః ॥
సుమేరుశ్శుశుభే శుభ్ర రాజవత్సమధిష్టితః ।
తరుణాదిత్యవర్ణాభో విధూప ఇవ పావకః ॥
యోజనానాం సహస్రాణి చతురశీతిరుచ్చ్రీతః ।
ప్రవిష్టః షోడశాధస్తాద్విస్తృతః షోడశైవ తు ॥
శరావసంస్థితత్వాత్తు ద్వాత్రింశన్మూర్ద్ని విస్తృతః ।
విస్తారాత్త్రిగుణస్తస్య పరిణాహః సమంతతః ॥
మండలేన ప్రమాణేన త్య్రసే మానం,తదిష్యతే ।
చత్వారింశత్సహస్రాణి యోజనానాం సమంతతః ॥
అష్టాభిరధికాని స్యుస్త్య్రస్రే మానం ప్రకీర్తితమ్ ।
చతురస్రేణ మానేన పరిణాహః సమంతతః ॥
చతుఃషష్టి సహస్రాణి యోజనానాం విధీయతే ।
స పర్వతో మహాదివ్యో దివ్యౌషధి సమన్వితః ॥
'నీల'మునకు దక్షిణముగా, నిషధ కుత్తరముగా వ్యాపించి యొక మహా శైలము కలదు. దానికి మాల్యవంతమని పేరు. (38) అయ్యది నిషధ పర్వతపు వైపుగా నీలపర్వతము నుండి వేయి యోజనములు వ్యాపించి యున్నది. ఆ మాల్యవంతము ఇరువది నాలుగు వేల యోజనములు విస్తీర్ణము వ్యాపించినదిగా కీర్తింపఁబడినదీ. (39) దానికి పశ్చిమముగా గంధమాదన పర్వతముండుట నెఱుంగ వలయును.. దాని పొడవులో, వ్యాప్తిలో గంధమాదనము మాల్యవంతముతో తుల్యమయినదని ప్రశస్తి నొందినది. (40) కనక పర్వతమయిన మేరు పర్వతము, రెండు పరీమండలముల (వలయముల) మధ్య నున్నది. ఆ మేరు పర్వతము నాలుగు వర్ణములతో నొప్పుచున్నది. అది ఇరు ప్రక్కల సమ వ్యాప్తి నొంది మిక్కిలి యున్నతమయినది. (41) రాజువలె సమధిష్టితమై సుమేరువు కాంతితో ప్రకాశించును. అయ్యద్ తరుణాదిత్య తుల్యమై విధూమమయిన అగ్నివలె నున్నది. (42) దాని ఔన్నత్యము 64 యోజనముల యెత్తు. భూమిలోనికి 16000 యోజనములున్నది. దానిచుట్టు కొలత కూడ 16000 యోజనములు. (43) శరావము నందుండుట వలన మూర్ధ భాగమున 32 యోజనములు, దాని చుట్టుకొలత అంతయు వెడల్పునకు మూఁడు రెట్లున్నది. మండలాకార ప్రమాణమున నుండుటచే దాని మానమును త్ర్య సమానములో (అనగా త్రిభుజమానములో) చెప్పుదురు. దాని పరిధి (చుట్టు కొలత) 48 సహస్ర యోజనములు. (45) త్ర్యస మానములో గణించిన 6 యోజనము లధికము. చతురస్రమానములో పరిగణించినది 64000 యోజనములు (46) అది మహా దివ్య పర్వతము. దాని యందు దివ్యౌషధులు కలవు. (47)
భువనైరావృతస్సర్వో జాతరూపమయైః శుభైః ।
తత్ర దేవగణాస్సర్వే గంధర్వోరగరాక్షసాః ॥
శైలరాజే ప్రదృశ్యంతే శుభాశ్చాప్సరసాం గణాః ।
స తు మేరుః పరివృతో భువనైర్భూతభావనైః ॥
చత్వారో యస్య దేశా వై చతుఃపార్శ్వేష్వధిష్ఠితాః ।
భద్రాశ్వా భరతాశ్చైవ కేతుమాలాశ్చ పశ్చిమాః ॥
ఉత్తరాః కురవశ్చైవ కృతపుణ్య ప్రతీశ్రయాః ।
గంథమాదవపార్శ్వే తు పరైషాఽపరగండికా ॥
సర్వర్తురమణీయా చ నిత్యం ప్రముదితా శివా।
ద్వాత్రింశత్రు సహస్రాణి యోజనైః పూర్వపశ్చిమాత్॥
ఆయామతశ్చతుస్త్రింశత్సహస్రాణి ప్రమాణతః ।
తత్ర తే శుభకర్మాణః కేతుమాలాః ప్రతిష్ఠితాః ॥
తత్ర కాలా నరాః సర్వే మహా సత్త్వా మహాబలాః ।
స్త్రీయశోత్పలపత్రాభాః సర్వాస్తాః ప్రియదర్శనాః ॥
తత్ర దివ్యో మహావృక్షః పనసః షడ్రసాశ్రయః ।
ఈశ్వరో బ్రహ్మణః పుత్త్రః కామచారీ మనోజవః ॥
తస్య పీత్వా ఫలరసం జీవంతి చ సమాయుతమ్ ।
పార్శ్వే మాల్యవతశ్చాపి పూర్వేఽ పూర్వా తు గండికా ॥
ఆయామాదథ విస్తారాద్యథైషాపరగండికా ।
భద్రాశ్వాస్తత్ర విజ్ఞేయా నిత్యం ముదితమానసాః ॥
భద్రశాలవనం చాత్ర కాలామ్రస్తు మహాద్రుమః ।
తత్ర తే పురుషాః శ్వేతా మహోత్సాహా బలాన్వితాః॥
ఆ పర్వతమంతయు శుభములు సువర్ణమయములయిన భువనములచే నావృతమై యున్నది. ఆ పవిత్ర శైల రాజము నందు సర్వ దేవతాగణములు, గంధర్వులు, ఉరగులు, రాక్షసులు, కనంబడుదురు. వారితో కూడ పవిత్రులయిన అచ్చరల సమూహములు కాననగును. ఆ మేరు పర్వతము సర్వ భూతములకు క్షేమమును కల్గించు భువనములచే పరీవృతమయి యున్నదీ. (48,49) దానీ నాలుగు దిక్కుల యందు (భాగములయందు) నాలుగు భువనములు (దేశములు) అధిష్టితములై యున్నవి. ఆ నాలుగు, తూర్పున భద్రాశ్వములు, దక్షిణమున భరతములు, పశ్చిమమున కేతుమాలములు, ఉత్తరమున కురులు. వీరందరు కృత పుణ్య పరీశ్రయులు. (50,51) గంధ మాదన పర్వత పార్శ్వము నందు వేడొక గొప్ప గండిక కలదు (ఇది యొక లోయమార్గముగా వచ్చును.) అయ్యదీ అన్ని ఋతువుల యందును రమణీయమయినది. ఆనంద ప్రదమయినది. ఆకర్షణీయమయినది. పవిత్రమైనదియు అది తూర్పునుండి పశ్చిమమునకు ముప్పది రెండు వేల యోజనములు వ్యాపించి యున్నది. దాని ఆయామము (పొడవు) ముప్పది నాలుగు వేల యోజనములు. శుభకర్ములయిన కేతుమాలావాసులందు ప్రతిష్టితులై యున్నారు. అచ్చట మనుష్యులెల్లరు నల్లనీవారు, మహాసత్తులు, మహాబలులు; అచ్చట స్త్రీలు నల్లకలువల రేకుల వంటి వర్ణముతో సమాన వర్ణము కలవారు. వారందరు ప్రియదర్శినులు. అచ్చటోకదీవ్యమయిన పనస వృక్షము కలదు. దాని యందారు రుచులు కలవు. అదీ ఈశ్వరుఁడు (మహిమాన్వితము, సర్వశక్తి మంతము). అది బ్రహ్మ పుత్రుడుఁడు. కామచారీ; మనోజవము కలది. (55) వారు దాని ఫలరసమును త్రాగీ పదివేల సంవత్సరములు కలిసి జీవింతురు. మాల్యవంతము యొక్క పార్వమున, తూర్పుదిశను ఒక అపూర్వమైన గండిక కలదు. పశ్చిమ గండికవలె పొడవు విస్తీర్ణము కలది. అచ్చట నుండు భద్రాశ్వులు నిత్య సంతోషులని యెఱుంగవలయును. అందొక భద్రశాల వనము కలదు. (భద్రశాల - పట్టుకాయల ప్రత్తిచెట్టు) మహాద్రుమము అట 'మహాకాలామతరువు' (నల్లమామిడిగాబోలు) అందలి పురుషులు శ్వేతవర్ణులు. మహోత్సాహ బలసమన్వితులు. (58)
స్త్రీయః కుముదవర్ణాభాః సుందర్యః ప్రియదర్శనాః ।
చంద్రప్రభాశ్చంద్రవర్ణాః పూర్ణచంద్రనిభాననాః ॥
చంద్రశీతలగాత్ర్యస్తాః స్త్రియ ఉత్పలగంధికాః ।
దశవర్ష సహస్రాణి తేషామాయురనామయమ్ ॥
కాలామ్రస్య రసం పీత్వా సర్వే చ స్థిరయౌవనాః ।
దక్షిణేన తు శ్వేతస్య నీలస్త్యేవోత్త రేణ చ ॥
వర్షం రమణకం నామ జాయంతే తత్ర మానవాః ।
రతిప్రధానా విమలా జరాదౌర్గంధ్యవర్జితాః ॥
శుక్లాఽభిజనసంపన్నాః సర్వే చ ప్రియదర్శనాః ।
తత్రాపి సుమహాన్ వృక్షో న్యగ్రోధో రోహితో మహాన్ ॥
తస్యాపి తే ఫలరసం పిబంతో వర్తయంతి వై ।
దశవర్ష సహస్రాణి శతాని దశ పంచ చ ॥
జీవంతి తే మహాభాగాః సదా హృష్టా నరోత్తమాః ।
దక్షిణో వై శృంగవతః శ్వేతస్యాప్యుత్తరేణ చ॥
వర్షం హైరణ్వతం నామ యత్ర హైరణ్వతీ నదీ ।
మహాబలో సుతేజస్కా జాయంతే తత్ర మానవాః ॥
యక్షా వీరా మహా సత్త్వా ధనినః ప్రియదర్శనాః ।
ఏకాదశ సహస్రాణి వర్షాణాం తే మహౌజసః ॥
ఆయుః ప్రమాణం జీవంతి శతాని దశ పంచ చ ।
యస్మిన్ వర్షే మహావృక్షో లకుచః షడ్రసాశ్రయః ॥
తస్య పీత్వా ఫలరసం తే జీవంతి నిరామయాః ।
త్రీణి శృంగవతః శృంగాణ్యుచ్చ్రితాని మహాంతి చ ॥
ఏకం మణిమయం తేషామేకం చైవ హిరణ్మయమ్ ।
సర్వరత్నమయం చైకం భవనైరుపశోభితమ్ ॥
ఉత్తరే వై శృంగవతః సముద్రస్య చ దక్షిణే ।
కురవస్తత్ర తద్వర్షం పుణ్యం సిద్ధనిషేవితమ్॥
స్త్రీలు కుముదవర్ణాభలు. సౌందర్యవతులు ప్రియదర్శనులు. వారందరు చంద్రప్రభలు, చంద్రవర్ణలు. పూర్ణచంద్రతుల్యాననలు. వారి శరీరములు స్పర్శకు చంద్రశీతలములు. వారందరు నల్ల కల్వల పరీమళశోభితలు. వారీ ఆయుర్దాయములు దశ సహస్ర వర్షములు. వారందరు రోగరహితలు. (60) కాలామము యొక్క రసమును త్రాగి వారందరు స్థిరమౌవనలు. శ్వేత పర్వతమునకు దక్షిణ దిశను, నీలమున కుత్తరమునను రమణకమను వర్షము కలదు. అందలి మానవులు రతిప్రధానులు (భోగ పరులు), వీమలులు, వార్ధక్యము దుర్గంధము లేనివారు. (62) పోరు శుక్లవర్థులు. ప్రియదర్శనులు, వారి యభిజనము (పుట్టుక) సంపన్నమయినది. (ఉదారము) అచ్చట కూడ నొక గొప్ప న్యగ్రోధ (మట్టి) వృక్షము కలదు. పోనీ వర్ణము ఆరుణము. దానియొక్క ఫలరసమును సేవించుచు, ఆ మహాభాగులు సదో సంహృష్ణులయి, నరోత్తములై, పదుకొండువేల యైదు వందల సంవత్సరములు జీవింతురు. శృంగవత్పర్వతమునకు దక్షిణమున, శ్వేత పర్వతమునకు ఉత్తరమునను “హైరణ్వత” మను వరము కలదు. అందు హైర్వతీనది కలదు. అందు మహాబలులు, సుతేజస్కులు పుట్టుచున్నారు. వారందరు మహా సత్త్వులు మహావీరులు ధనవంతులు ప్రియదర్శనులు నయిన యక్షులు. వారందరు మహా తేజస్కులు. వారు పదకొండువేల మైదువందల సంవత్సరములు ఆయుః ప్రమాణము. కలవారు. ఆ వరమునందు ఒక గొప్ప 'లకుచ' (గజనిమ్మ) వృక్షము కలదు. అది షడసాశ్రయమయినది. దాని ఫలరసమును త్రావి వారు నీరామయులై (రోగరహితులై) జీవించెదరు. ఆ శృంగపంతము నందున్నతములైన మూఁడు శృంగములు కలవు. ఒక శృంగము మణిమయము; ఒకటి హిరణ్మయము : వేడొకటి సర్వరత్నమయము. అయ్యది సుందర భవనములచే నుపశోభితము. (70) శృంగవంతమునకుత్తరముగను, సముద్రమునకు దక్షిణమునను కురువులు కలరు. ఆ యుప వర్షము పవిత్రమయినది; సిద్దులు తరచుగా నచ్చట సేవింతురు. (71)
తత్ర వృక్షా మధుఫలా నిత్యపుష్పఫలోపగాః ।
వస్త్రాణి చ ప్రసూయంతే ఫలేష్వాభరణాని చ ॥
సర్వకామప్రదాస్తత్ర కేచిద్వృక్షా మనోరమాకి ।
గంధవర్ణరసోపేతం ప్రక్షరంతి మధూత్తమమ్ ॥
అపరే క్షీరిణో నామ వృక్షాస్తత్ర మనోరమాః ।
యేక్షరంతి సదా క్షీరం షడ్రస్రం హ్యమృతోపమమ్ ॥
సర్వా మణిమయీ భూమిః సూక్ష్మకాంచనపాలుకా ।
సర్వర్తుసుఖసంపన్నా నిష్పంకా నీరజా శుభా ॥
దేవలోకచ్యుతాక్షత్ర జాయంతే మానవాః శుభాః ।
శుభజనసంపన్నాః సర్వే చ స్థిరమౌవనాః ॥
మిథునాని ప్రసూయంతే స్త్రీయశ్చాప్సరసః సమాః ।
తేషాం తే క్షీరిణాం క్షీరం పిబంతి హ్యమృతోపమమ్ ॥
మిథునం జాయతే సద్యః సమం చైవ వివర్ధతే ।
సమం శీలం చ రూపం చ ప్రియతో చైవ తత్సమా ॥
అన్యోన్యమనురక్తాశ్చ చక్రవాకససర్మీణః ।
అనామయా హ్యశోకాశ్చ నిత్యం సుఖనిషేవిణః ॥
త్రయోదశ సహస్రాణి శని దశ పంచ చ ।
జీవంతి తే మహావీర్యా నచాన్యస్త్రీనిషేవిణః ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహా పురాణే వాయుప్రోక్తీ పూర్వభాగే ద్వితీయేఽనుషంగపాదే పృథివ్యాయామవిస్తరో నామ పంచదశోఽధ్యాయః॥
అచ్చటి వృక్షములన్నియును మధుఫలములు గలవి. తేనె, సుర ఫలించునవి. అవి నిత్యము ఫల పుష్ప పల్లవములతో నుండునవి. అయ్యవి వాని ఫలములయందు వస్త్రములను, ఆభరణములను కలిగించును. వాని ఫలములు వస్త్రముల ఆభరణముల నొసంగును. అచ్చటి కొన్ని వృక్షములు మిక్కిలి మనోజ్ఞములు, సర్వకామముల నొసంగును. అయ్యవి మంచి వర్ణము కలిగి, సువాసన గలిగి, రసవంతములైనట్టి మధువును పాలుగా కార్చును. (73) మరికొన్ని వృక్షములందున్నవి. వానిని క్షీరిణములందురు. (పాలు గలవి) అవి మిక్కిలి మనోహరములు, అయ్యవి అమృతోపమము షడ్రసయుతము నయిన క్షీరమును సదా స్రవించును. (74) అచ్చటి భూమి సర్వమణిమయము. సూక్ష్మమయిన బంగారు రేణువులయిన ఇసుకతో గూడినది. అయ్యది అన్ని ఋతువుల యందలి సర్వ సుఖములతోసంపన్నము. అవి నిష్పంకము (మట్టిలేనివి) దుమ్ము లేనివి. అది శుభవంతము, (75) దేవలోకము నుండి చ్యుతులయిన శుభవంతులయిన మానవులందు జన్మింతురు. వారందరు శుక్లవర్ల సంపన్నులు. (పుట్టుక చేతనే తెల్లని తనువులు కలవారు) వారందరు స్థిర యౌవనులు. (76) ఆచ్చరలతో తుల్యలయిన స్త్రీలకు మీథునములు (కలవలు) పుట్టుదురు. వారు అమృతోపమమయిన క్షీర వృక్షముల పాలు త్రావుదురు. (77) మిథునములు వెంటనే పుట్టుదురు. సమముగా వారు వృద్ధి పొందుదురు. వారందరు సమశీల రూప ప్రియత్వములు కలవారు. (18) వారన్యోన్యమనురక్తులు. చక్రవాక మిథునములతోడి సమానమయిన ధర్మములు కలవారు, ఒండొరుల వీడియుండరు. వారు రోగ రహితులు, శోకరహితులు. ఎల్లప్పుడు సౌఖ్యమునే సేవింతురు. (79) వారు నిత్యభోగులు. వారు మహావీర్యవంతులు; వారు పదునాలుగు వేల సంవత్సరముల యైదువందల యేండ్లు నివసింతురు. వారెన్నడు అన్య స్త్రీలను కామేచ్ఛతో సేవింపరు. (80).
ఇది వాయు ప్రోకమయిన బ్రహ్మాండ మహాపురాణమున పూర్వ భాగమున ద్వీతీయమైన అనుషంగ పాదమున పృథివ్యాయామ విస్తరమను పేర పంచదశాధ్యాయము.
Summary of chapter 15 of the Brahmānda Mahā Purana is as follows:
The narrative takes the devout seeker on a majestic geographical pilgrimage, describing the vast expanse of the earth and the central, lotus-like continent of Jambūdvīpa. It maps out the sacred mountains, divine rivers, and mystical realms that adorn this blessed land, portraying geography not as mere topography but as the very body of the divine. Through this sacred vision, the faithful learn to revere the earth as a holy mother, whose every river and peak echoes with the eternal chants of creation.