14 - ప్రియవ్రతవంశాను కీర్తనము

సూత ఉవాచ : -

అథాంతరేషు సర్వేషు అతీతానాగ తేష్వివ

 తుల్యాభిమానినః సర్వే జాయంతే నామరూపతః

దేవాశ్చాష్టవిధా యే చ తస్మిన్ మన్వంతరేఽధీపాః

ఋషయో మనవశ్చైవ సర్వే తుల్య ప్రయోజనాః

మహర్షిసర్గ: సంక్రాంతో వంశం స్వాయంభువస్య తు

విస్తరేణానుపూర్వ్యా చ కీర్యమానం నిబోధత

మనోః స్వాయంభువస్యాసన్ దశ పౌత్రాస్తు తత్సమాః

యైరియం పృథివీ సర్వా సప్తద్వీపా సపత్తనా

ససముద్రా కరవతీ ప్రతివర్షం నివేశితా

స్వాయంభువేంఽతరే పూర్వమాద్యే త్రేతాయుగే తథా

ప్రియవ్రతస్య పుత్రైస్తైః పౌత్రైః స్వాయంభువస్య తు

ప్రజాసత్త్వతపోయు క్తైస్తైరియం వినివేశితా

ప్రియవ్రతాత్ప్రజోపేతాన్ వీరాన్ కామ్యాన్ వ్యజాయిత

కన్యా సా తు మహాభాగా కర్దమస్య ప్రజాపతేః

కన్యే ద్వే దశపుత్రాశ్చ సమ్రాట్ కుక్షిశ్చతే శుభే

తయోర్వై భ్రాతరః శూరాః ప్రజాపతిసమా దశ

ఆగ్నీధ్రశ్చాగ్నిబాహుశ్చ మేధా మేధాతిథర్వసుః

జ్యోతిష్మాన్ ద్యుతిమాన్ హవ్యః సవనః సత్ర ఏవ చ

సూతుఁడిట్లు పలికెను :

జరిగిపోయిన రానున్న అన్నిమన్వంతరములందు, ప్రజలందరు (మన్వంతరములన్నీంటిలో నుద్భవించినవారు సమాన వ్యక్తీకరణము కలవారు. వారి నామరూపములును సమానములు.) తుల్యాభిమానములతో తుల్యనామ రూపములతో జన్మించిరి. (1) దేవతలు ఎనిమిది విధములు. వారే మన్వంతరమున ప్రభువులు, ఋషులు, మనువులు తుల్యప్రయోజనములనే సాధించిరి. (2) మహరుల సృష్టి యింతకుంబూర్వము వివరింపఁబడినది. ఇప్పుడు స్వాయంభువమనువంశము, వివరణముగా సక్రమముగా చెప్పబడుచున్నది వినుము. (3) స్వాయంభువమనువునకు తత్సమానులు పదిమంది పౌత్రులు. వారిచే సప్తద్వీపములతో గూడినది, పట్టణములతో నొప్పినది, సముద్రములతో, ఖనులతో నొప్పినదియునైన యీ పృథివి స్వాయంభువ మన్వంతరమున మొదటి త్రేతాయుగమున సర్వఖండములతో (వరములతో) నివసింపఁబడినది. వారందరీ పృథివీ ఖండమును స్వాధీన పరచుకొని అందు వసించిరి. (5) ఈ పృథివి ప్రియవ్రతుని పుత్రులచే పౌత్రులచే, వారి పుత్రులచే, సంతతిచే ఆక్రమింపఁ బడినది. వీరందరు బలవంతులు తపశ్శీలురు. ప్రియవ్రతుఁడు స్వాయంభువునీ పౌత్రుఁడు. (6) కర్దమ ప్రజాపతి కూతురు కర్గమ. ఈమె మహాభాగ్య శాలిని. ఈమె వలన ప్రియవ్రతుఁడు వీర్యవంతులును, ప్రజావంతులును నయిన పుత్రులను బడసెను. (7) ఆమెకిరువురు పుత్రికలు, వారు సమ్రాట్, కుక్షియు. వీరిరువురు శోభనయుతలు. ఆమెకు (కర్ధముకు) పదిమంది కుమారులు కూడనుదయించిరి. ఈ సోదరులు శూరులు, ప్రజాపతి సములు. వారు - అగ్నీధ్రుఁడు, అగ్నిబాహువు, మేధ, మేధాతిథి, వసువు (వపుష్మాన్ అని తరువాత చెప్పఁబడెను). జ్యోతిష్మంతుఁడు, ద్యుతిమంతుఁడు, హవ్యుడు, సవనుఁడు, సత్రుఁడు.

ప్రియవ్రతోఽభ్యషించత్తాన్ సప్తసప్తసు పార్థివాన్

ద్వీపేషు తేషు ధర్మేణ ద్వీపాన్ తాంశ్చ నిబోధత

జంబూద్వీపేశ్వరం చక్రే ఆగ్నీధ్రం సుమహాబలమ్

ప్లక్షద్వీపేశ్వరశ్చాపి తేన మేధాతిథిః కృతః

శాల్మలే తు వపుష్పoతం రాజానం సోఽభీషిక్తవాన్

జ్యోతిష్మంతం కుశద్వీపే రాజానం కృతవాన్ ప్రభుః

ద్యుతిమంతం చ రాజానం క్రౌంచద్వీపేఽభ్యషేచయత్

శాకద్వీపేశ్వరం చాపి హవ్యం చక్రే ప్రియవ్రతః

పుష్కరాధిపతిం చైవ సవనం కృతవాన్ ప్రభుః

పుష్కరే సవనస్యాథ మహావీరః సుతోఽభవత్

ధాతకిశ్చాపి ద్వావేతౌ పుత్రౌ పుత్రవతాం వరే

మహావీతం స్కృతం వర్షం తస్య నామ్నా మహాత్మనః

నామ్నా చ ధాతకేశ్చాపి ధాతకీఖండ ఉచ్యతే

హవ్యో వ్యజనయత్ పుత్రాన్ శాకద్వీపేశ్వరాన్ ప్రభుః

జలదం చ కుమారం చ సుకుమారం మణీవకమ్

కుసుమోత్తరమోదాకౌ సప్తమం చ మహాద్రుమమ్

జలదం జలదస్యాథ ప్రథమం వర్షముచ్యతే

కుమారస్య తు కౌమారం ద్వితీయం పరికీర్తితమ్

ప్రియవ్రతుఁడు ఆ ఏడుగురు రాజులను విధి పూర్వకముగా ఏడు ద్వీపములయందు ప్రభువులుగా నభిషేకించెను. ఆ యేడుగురను ఏడు ద్వీపములను తెలిసికొనుము. సుమహాబలవంతుఁడయిన అగ్నీధ్రుని జంబూద్వీపమునకు నధిపతంజేసెను. ప్లక్ష ద్వీపమునకు మేధాతిథిని ప్రభువుగా, నతఁడొనర్చెను. (11) శాల్మల ద్వీపమునకు వపుష్మంతుని రాజుగా నభిషేకించెను. (వపుష్మంతుఁడే 'వసువుగా చెప్పఁబడినాడు). కుశద్వీపమునకు, ప్రియవ్రతుఁడు, జ్యోతిష్మంతుని రాజును చేసెను. (12) క్రౌంచ ద్వీపమునందు ద్యుతిమంతుని రాజు గావించెను. శాక ద్వీపమునకు హవ్యుని ప్రియవ్రతుఁడు రాజు చేసెను. (13) పుష్కరద్వీపమున కధిపతిగా సవనునీ ప్రియవ్రతుడు చేసెను. పుష్కర ద్వీపమున తరువాత సవనునికీఇరువురుపుత్రులు కలిగిరి. వారు మహావీతుఁడు ధాతకీయును. (14) వీరిరువురు తల్లిదండ్రులు మొచ్చుకోదగిన బిడ్డలు ఆ మహాత్ముఁడయిన - మహావీతుని నామముననే ఆవర్భము (ద్వీపము) తరువాత మహావీత వర్షమయినదీ. (15) అట్లే ధాతకి ఏలు ఖండము తన్నామమున ధాతకీ ఖండమయినది. శాక ద్వీపేశ్వరుఁడయిన హవ్యుఁడు ఏడుగురు పుత్రులను కనెను. వారు - జలదుఁడు, కుమారుఁడు, సుకుమారుఁడు, మజీవకుఁడు, కుసుమోత్తముడు, మోదకుఁడు - ఇంక ఏఁడవ వాఁడు మహాద్రుముఁడు. (శాక ద్వీపమునందలి ఏడు భాగములు) హవ్యుని. ఏడుగురు కుమారుల నామాలతో వ్యవహరింపఁబడినవి.) మొదటి వర్షము జలదము. అది జలదుని వరము. రెండవది రెండవ వాఁడయిన కుమారకుని పేర కుమార వర్షమయినదీ. (18)

సుకుమారం తృతీయం తు సుకుమారస్య తత్స్కృతమ్

 మణీవస్య చతుర్ధం తు మణీవకమిహోచ్యతే

కుసుమోత్తార వర్షం యత్పంచమం కుసుమోత్తరమ్

మోదకస్యాఽపి మోదాకం షష్ఠం వర్షం ప్రకీర్తితమ్

మహాద్రుమస్య నామ్నా చ సప్తమం తన్మహాద్రుమమ్

తేషాం తు నామభిస్తానీ సప్తవర్ణాని తత్ర వై

క్రౌంచద్వీపేశ్వరస్యాపి పుత్త్రో ద్యుతిమతస్తు వై

కుశలో మనోనుగశ్చోష్ణ: పావనశ్చాంధకారకః

మునిశ్చ దుందుభిశ్చైవ సుతా ద్యుతి మతస్తు వై

తేషాం స్వనామభిర్దేశాః క్రౌంచద్వీపాశ్రయాః శుభాః

కుశలస్య తు దేశోఽభూత్ కౌశలో నామ విశ్రుతః

దేశో మనోనుగస్యాపి మనోనుగ ఇతి స్మృతః

ఉష్ణస్యోష్ణః స్మృతో దేశః పావనస్యాపి పావనః

అంధకారస్య దేశస్తు అంధకారః ప్రకీర్తితః

మునేశ్చ మౌనిదేశో వై దుందుభేర్దుందుభిః స్మృతః

ఏతే జనపదాః సప్త క్రౌంచద్వీపే తు భాస్వరాః

సుకుమారుని పేరు మీదుగా మూడవది సుకుమార వరమయ్యెను. నాలుగవది మడీవకము. అది నాలుగవ వాఁడయిన మజీవకునీ వర్షము. (19) ఐదవది యయిన కుసుమోత్తమ వర్షము కుసుమోత్తముని పేరునయ్యెను. ఆరవదియైన మోదాక వరము ఆరవ పొఁడయిన మోదకుని పేర ప్రఖ్యాతమయినదీ. (20) ఏడవది మహాద్రుమ వరము. అది యేఁడవ వాడయిన మహాద్రుమునీ పేర ప్రఖ్యాతమయినది. ఆ ఏడు నామములు ఆ యేడ్లురు వలనను గలిగినవీ. (21) క్రౌంచ ద్వీపేశ్వరుఁడయిన ద్యుతీమంతునకు ఏడుగురు పుత్రులు : వారు - కుశలుం డు, మనోనుగుఁడు, ఉష్ణుఁడు, పావనుఁడు, అంధకారకుఁడు, ముని, మటియు దుందుభి. వీరు ద్యుతిమంతుని పుత్రులు. వారివారి నామములతో మంగళకరములయిన క్రౌంచద్వీప భాగముల నాశ్రయించి యుండిరి. (23) కుశలునీ దేశమయిన కౌశలము మిక్కిలి ప్రఖ్యాతవంశ మయినది, మనోనుగుని దేశము మనోనుగ దేశముగ ప్రసిద్ధమయినది. (24) ఉష్ణుని దేశము ఉష్ణదేశముగా, పావనుని దేశము పావనముగా, అంధకారుని దేశము అంధకార దేశముగా ప్రకీర్తింపబడినవి. ముని యొక్క దేశము మౌనిదేశము; దుందుభి దేశము దుందుభి దేశముగా వ్యక్తమయినవి. ఆ ఏడు దేశములు (జనపదములు) క్రౌంచ ద్వీపమున మిక్కిలి ప్రసిద్ధములు భాస్వంతములు.  

జ్యోతిష్మతః కుశద్వీపే సప్తైవాసన్ మహౌజసః

ఉద్భిజ్జో వేణుమాంశ్చైవ వైరథో లవణో ధృతిః

షష్టః ప్రభాకరశ్చాపి సప్తమః కపిలః స్మృతః

ఉద్భిజ్ఞం ప్రథమం వర్షం ద్వితీయం వేణుమండలమ్

తృతీయం వై రథాకారం చతుర్థం లవణం స్కృతమ్

పంచమం ధృతిమద్వర్షం షష్ఠం వర్షం ప్రభాకరమ్

సప్తమం కపిలం నామ కపిలస్య ప్రకీర్తితమ్

తేషాం దేశాః కుశద్వీపే తత్సనామాన ఏవ చ

ఆశ్రమాచారయుక్తాభిః ప్రజాభిః సమలంకృతాః

శాల్మలస్యేశ్వరాః సప్త సుతాస్తే చ వపుష్మతః

శ్వేతశ్చ హరితశ్చైవ జీమూతో రోహితస్తథా

వైద్యుతో మానసశ్చాపి సుప్రభః సప్తమస్తథా

శ్వేతస్తు దేశః శ్వేతస్య హరితస్య సుహారీతః

జీమూతస్యాపి జీమూతో రోహితస్యాపి రోహితః

వైద్యుతో వైద్యుతస్యాపి మానసస్య తు మానసః

సుప్రభః సుప్రభస్యాపి సప్తైతే దేశపాలకః

ప్లక్షద్వీపం ప్రవక్ష్యామీ జంబూద్వీపాదనంతరమ్

సప్త మేధాతిథేః పుత్త్రాః ప్రక్షద్వీపేశ్వరాః నృపాః

జ్యేష్ఠః శాంతభయో నామ ద్వీతీయః శిశిరః స్మృతః

సుభోదయః తృతీయస్తు చతుర్లో నంద ఉచ్యతే

కుశద్వీపమునందు జ్యోతిష్మంతునకు ప్రతాపవంతులయిన ఏడుగురు కుమారులు కలిగిరి. వారు - ఉద్భిజ్ఞుఁడు, వేణుమంతుఁడు, వైరథుఁడు, లవణుఁడు, ధృతి - ఆరవ పోఁడు ప్రభాకరుఁడు, ఏడవవాఁడు కపిలుఁడుగా స్మరింపఁబడిరి. (27) ప్రథమ మండలము ఉద్భిజ్జము అనీ పిలుపఁబడినది; రెండవది వేణు మండలము; (28) మూఁడవది వైరథాకారము. నాలుగవ మండలము లవణము; పంచమ మండలము ధృతిమంతము; ఆరవ వరము ప్రభాకరము. ఏడవది కపిల వర్షము. కపిలుని వలె కీర్తిమంతము. కుశద్వీపమున నీ భూమి భాగములు సమాన నామములే కలిగి యున్నవి. (30) శాల్మలదేశ ప్రభువులు ఆశ్రమాచార యుక్తులయిన ప్రజలచే సమలంకృతులు. వారు వపుష్మంతుని యొక్క ఏడుగురు కుమారులు. (31) ఆ ఏడుగురు - శ్వేతుఁడు, హరీతుఁడు, జీమూతుఁడు, రోహితుఁడు, వైద్యుతుఁడు, మానతుఁడు, సుప్రభుఁడు, శ్వేతుని దేశము శ్వేతము; హరితుని దేశము సుపరీతము; జీమూతునిది జీమూత దేశము; రోహితునిది రోహితదేశము; వైద్యుతునిది వైద్యుత దేశము; మానసునిది మానస దేశము. సుప్రభునిది సుప్రభదేశము. ఆ ఏడుగురు ఆ సప్తదేశపాలకులు. (34) జంబూద్వీపము యొక్క కథానంతరము ప్లక్షద్వీపమును గూర్చి చెప్పెదను. మేధాతిథికి ఏడుగురు పుత్రులు. పోరు ప్లక్షద్వీపమును పాలించు నృపులు. (35) మేధాతిథి పుత్రులు ; జ్యేష్ణుం డు శాంతభయుఁడు; రెండవవాఁడు శిశిరుఁడు; తృతీయుఁడు సుభోదయుఁడు; నందుఁడు నాలుగవ పోఁడు

శివస్తు పంచమ స్తేషాం క్షేమకః షష్ఠ ఉచ్యతే

ధ్రువస్తు సప్తమో జ్ఞెయః పుత్రాః మేధాతిథేః స్మృతాః

సప్తానాం నామభిస్తేషాం తాని వర్షాణి సప్త వై

తస్మాచ్ఛాంతభయం చైవ శిశిరం చ సుఖోదయమ్

ఆనందం చ శివం చైవ క్షేమకం చ ధ్రువం తథా

తాని తేషాం సమానాని సప్తవర్షాణీ భాగశః

నివేశితాని తెస్తానీ పూర్వం స్వాయంభువేంతరే

మేధాతిథేస్తు పుత్రైస్తైః ప్లక్షద్వీపేశ్వరెరపైః

వర్ణాశ్రమాచారయుక్తాః ప్లక్షద్వీపే ప్రజాః కృతాః

ప్లక్షద్వీపాదిషు శ్వేషు శాకద్వీపాంతికేషు వై

జ్ఞేయః పంచసు ధర్మో వై వర్ణాశ్రమవీభాజకీః

సుఖమాయుశ్చ రూపం చ బలం ధర్మశ్చ నిత్యశః

పంచస్వేతేషు ద్వీపేషు సర్వసాధారణం స్మృతమ్

ప్లక్షద్వీపః పరిష్క్రాంతో జంబూద్వీపం నిబోధత

ఆగ్నీధ్రం జ్యేష్ఠదాయాదం కామ్యాపుత్రం మహాబలమ్:

ప్రియవ్రతోఽభ్యషించత్తం జంబూద్వీపేశ్వరం నృపమ్

తస్య పుత్త్రా బభూవుర్హి ప్రజాపతిసమా నవ

జ్యేష్థో నాభిరీతి ఖ్యాతః తస్య కింపురుషోఽనుజః

హరివర్షిస్తృతీయస్తు చతుర్ద్రోఽభూదిలావృతః

రమ్యస్తు పంచమః పుత్త్రో హిరణ్వాన్ షష్ఠ ఉచ్యతే

పంచముఁడు శివనాముఁడు; పొరీలో ఆరవవాఁడు క్షేమకుఁడు; ఏడవవాఁడు ధ్రువుఁడు. వీరందరు మేధాతిథి పుత్రులుగా ప్రఖ్యాతులు. (37) ఆ సప్తవర్షములు (దేశీయులు) ఆసప్తకుమారుల నామముల ప్రఖ్యాతములు. వీరందరు సుప్రసిద్ధులు. శాంతభయుఁడు, శిశిరుఁడు, సుఖోదయుఁడు, ఆనందుఁడు శివుఁడు, క్షేమంకరుఁడు, ధ్రువుఁడు. ఆవర్షసప్తకము పరస్పరము సమానములు. (35) పూర్వము స్వాయంభువమన్వంతరమున మేధాతిథి యొక్క పుత్రుల చేతను వివిధ భాగములలో ఆక్రమింపఁబడి వలస చేయఁబడినవి. ఆ మేధాతిథి పుత్రులే ప్లక్ష ద్వీపేశ్వరులు, ప్రభువులు. (40) ప్లక్ష ద్వీప ప్రజలందరు వర్ణాశ్రమాచార యుక్తులుగా చేయబడిరి. ప్లక్ష ద్వీపముతో నారంభించి శాకద్వీపముతో ముగియు దేశీయులందు, (మొత్తమయిదు ద్వీపములలో) వర్ణాశ్రమ విభజనమునకు “ధర్మమే" ప్రధాన క్షణముగా గ్రహింప బడినది. (ఆ పంచద్వీపములు - ప్లక్ష, శ్యామల, కుశ, క్రౌంచ, శాకములు), ఈ పంచ ద్వీపముల యందు, సుఖము, ఆయుర్దాయము, రూపము, బలము, ధర్మము, ఎల్లప్పుడును ప్రజలకు సర్వసాధారణ లక్షణములుగా చెప్పుదురు. (43) ప్లక్ష ద్వీపము వర్ణింపబడినది. ఇక జంబూద్వీపము నెఱుంగుఁడు. (44) కామ్యాపుత్రుఁడు, మహాబలవంతుఁడు, జ్యేష్ఠదాయాదియునైన అగ్నీధ్రుని ప్రియవ్రతుఁడు జంబూ ద్వీపమునకు ప్రభువుగా నభిషేకించెను. (44) ఆతనికి ప్రజాపతి సమానులు తొమ్మండ్రు కుమారులు. వారిలో జ్యేష్టుడు నాభి. అతని సోదరుఁడు (అనుజుఁడు) కింపురుషుఁడు; హరివరుఁడు తృతీయుఁడు; ఇలా వృతుఁడు చతుర్థుఁడు; రమ్యుఁడు, పంచముఁడు; హిరణ్వంతుఁడు ఆరవపాండు.

కురుస్తు సప్తమస్తేషాం భద్రాశ్వశ్చాష్టమః స్మృతః

నవమః కేతుమాలశ్చ తేషాం దేశాన్నిబోధత

నాభేస్తు దక్షిణం వర్షం హిమాఖ్యం తు పితా దదౌ

హేమకూటం తు తద్వర్షం దదౌకింపురుషాయ తత్

నైషధం యత్స్మృతం వర్షం హరివర్షాయతం దదౌ

మధ్యమం యత్సుమేరోస్తు దదౌ స తదీలావృతమ్

నీలంతు యత్స్మృతం వర్షం రమ్యాయైతత్పితా దదౌ

శ్వేతం తదుత్తరం తస్మాత్ పిత్రా దత్తం హిరణ్వతే

యదుత్తరే శృంగవతో వర్షం తత్కురవే దదౌ

మాల్యవంతం తథా వర్షం భద్రాశ్వాయ న్యవేదయత్

గంధమాదనవర్షం తు కేతుమాలే న్యవేదయత్

ఇత్యేతాని మయోక్తాని నవ వర్షాణి భాగశః

అగ్నీధ్రస్తేషు వర్షేషు పుత్రాంస్తానభిషేచయత్

యథాక్రమం స ధర్మాత్మా తతస్తు తపసి స్థితః

ఇత్యేతైస్సప్తభిః కృత్న్యా సప్తద్వీపా నివేశితాః

ప్రియవ్రతస్య పుత్రైస్తైః పౌత్రైః స్వాయంభువస్య చ

ఏవం వర్షేషు సర్వేషు సన్నివేశాః పునః పునః

క్రీయంతే ప్రలయే వృత్తే సప్త సప్తసు పార్థివైః

ఏవం స్వభావః కల్పానాం ద్వీపానాం చ నివేశనే

యాని కింపురుషాద్యాని వర్షాణ్యష్టౌ శ్రుతాని తు

            వారిలో కురువు ఏండవవాఁడు. భద్రాశ్వుఁడు ఎనిమిదవవాఁడు. కేతుమూలుఁడు తొమ్మిదవవాఁడు. ఇక వారి రాజ్యముల నెఱుంగుము. (47) నాభికి హిమాఖ్యమయిన దక్షిణ వర్షమును తండ్రి యొసంగెను. హేమకూటమను వర్షమును (దేశమును) కింపురుషునకు నిచ్చెను, నైషధమని పేరొందిన (విదితమయిన) వర్షమును హరివరుడను మూఁడవవానికి తండ్రి యొసంగెను. ఇలా వృతునకు మధ్యమమునందున్న మేరు వర్షము నొసంగేను. (49) రమ్యునకు నీలమని పేరొందిన వర్షమును తండ్రి యొసంగెను. హిరణ్వతునకు నీలవర్షమునకుత్తరము నందున్న శ్వేతవర్షమును తండ్రి యొసంగెను. (50) కురువునకు శృంగవంతమునకుత్తరముననున్న వర్షము నొసంగెను. అట్లే భద్రాశ్వునకు మాల్య వంతమను వరము నొసంగెను. (51) కేతుమాలునకు గంధమాదనవర్షము నొసంగేను, ఒకదాని తరువాత నోకటిగా తొమ్మిది వరములు నాచే చెప్పబడినవి. (52) ఆ (యుప) వర్షములో ఆగ్నీధ్రుండు తనకుమారులను యధాక్రమము అభిషేకించెను. ఆపుణ్యాత్ము ఁడు తరువాత తపోనియుక్తుఁ డయ్యెను. (53) ఈ విధముగా స్వాయంభువుని మనుమలు, ప్రియపుత్రుని పుత్రులునగు నేడుగురు సప్తద్వీపములందును ప్రతిష్టితులయిరి. (54) ప్రళయమువచ్చి సర్వనాశనముకాగా, ఈ సప్తవర్షములు సప్తవర్షరాజులచే మరల మరల ప్రతిష్ఠితములగు చుండును. ఇదీయే వర్షములయొక్క ద్వీపములయొక్క సంభవనివేశముల స్వభావము. ఇక కింపురుష వర్షముతో నారంభమగు ఎనిమిది వర్షముల గూర్చీ ఈ విషయములు శ్రుతములగుచున్నవి. (56)

తేషాం స్వభావతః సిద్ధిః సుఖప్రాయమయత్నతః

 విపర్యయో న తేష్వస్తి జరామృత్యుభయం న చ

ధర్మాధర్మౌన తేష్వాస్తాం నోత్తమాధమమధ్యమా:

న తేష్వస్తి యుగావస్థా క్షేత్రేష్వష్టాసు సర్వశః

నాభేర్నిసర్గం వక్ష్యామీ హిమాహ్వేఽస్మిన్నిబోధత

నాభిస్త్వజనయత్పుత్రం మేరుదేవ్యాం మహాద్యుతిమ్

ఋషభం పార్థివశ్రేష్ఠం సర్వక్షత్రస్య పూర్వజమ్

ఋషభాత్భరతో జజ్ఞే వీరః పుత్రశతాగ్రజః

సోభీషిచ్యర్షభః పుత్త్రం మహాప్రవ్రజ్యయా స్థితః

హిమాహ్వం దక్షిణం వర్షం భరతాయ న్యవేదయత్

తస్మాత్తు భారతం వర్షం తస్య నామ్నా విదుర్బుధాః

భరతస్యాత్మజో విద్వాన్సుమతిర్నామ ధార్మికః

బభూవ తస్మిన్ రాజ్యే తం భరతస్వభ్య షేచయత్

పుత్రసంక్రామీతశ్రీస్తు వనం రాజా వీవేశ సః

తేజసస్తత్సుతశ్చాఽపి ప్రజాపతీరమిత్రజిత్

తేజసస్యాత్మజో విద్వాన్ ఇంద్రద్యుమ్న ఇతి స్మృతః

పరమేష్ఠి సుతశ్చాపి నిధనే తస్య చాప్యభూత్

ప్రతీహారః కులం తస్య నామ్నా జజ్ఞే తదన్వయః

ప్రతిహర్తేతి విఖ్యాతో జజ్ఞే తస్యాపి ధీమతః

ఉన్నేతా ప్రతిహర్తుస్తు భూమా తస్య సుతః స్మృతః

ఉద్గీథస్తస్య పుత్త్రోఽభూత్ ప్రస్తావిశ్చాపి తత్సుతః

ప్రస్తావేస్తు విభుః పుత్త్రః పృథుస్తస్య సుతోఽభవత్

వాని సిద్ది సహజము, అప్రయత్నముగ వారందరు సుఖప్రాయులు. వారికి విపర్యయముకాని ప్రళయముకాని లేదు. వారికి జరామృత్యు భయము కూడలేదు. (57) వారీలో ధర్మములేదు, అధర్మములేదు, ఉత్తమాధమమధ్యములు కూడా లేవు. ఈ యెనిమిది అష్టవరములయందు క్షేత్రములయందు) యుగావస్థ (యుగముల పరిణామము) లేదు. (56) హిమవర్షమున నాభియొక్క సంతానమునుగూర్చి వివరించెదను. వినుఁ డు. నాభికి మేరుదేవి వలన మహాద్యుతిమంతుఁడయిన కుమారుఁడు కలిగెను. ఆతఁడు ఋషభుఁడు, అతఁడు పార్థివశ్రేష్ఠుఁడు; ఈతఁడే సర్వక్షత్రియులకును ముందు జన్మించినవాఁడు. ఋషభునకు వీరుఁడయిన భరతుఁడు జన్మించెను. ఈతఁడాతని పుత్రశతములో జ్యేషుఁడు. (60) ఋషభుఁడు పుత్రుడయిన భరతుని రాజ్యమునందభిషేకించి తాను'1) మహాప్రవ్యజ్యమునందు (మహాప్రస్థానమున) సుస్థితుఁడయ్యెను ((1) మహాప్రవ్రజ్యము - సర్వసంగపరిత్యాగము చేసి తపస్థితుడై మరణోన్ముఖుడైయుండుట) ఆతఁడు దక్షిణ వర్షములను (దేశములను) భరతునకొసంగెను. (61) అందుచే ఇది భారతవరమని పేరొందినదనీ బుధులు తెలిసికొనీరీ, భరతుని కుమారుఁడు సుమతి. అతఁడు ధార్మికుఁడు. విద్వాంసుఁడు, భరతుఁడాతనిని ఆదేశమునకభిషేకించెను. ప్రభుఁడయిన భరతుఁడు సర్వసంపదను పుత్రునకు సంక్రమింపఁజేసి యరణ్యములకేగెను. ఆసుమతికొడుకు తేజసుఁడు. ఆతఁడు ప్రజాపతి. శత్రువులజయించినవాఁ డు. ఆ తేజసుని కుమారుడు ఇంద్ర్యదుమ్నుఁడు. అతడు విద్వాంసుఁడు. (64)

పృథోశ్చాపి సుతో నక్తో నక్తస్యాపి గయః సుతః

గయస్యాపి నరః పుత్త్రో నరస్యాపి సుతో విరాట్

వీరాట్సుతో మహావీర్యో ధీమాంస్తస్య సుతోఽభవత్

ధీమతశ్చ మహాన్పుత్త్రో మహతశ్చాపి భౌవనః

భౌవనస్య సుతస్త్వష్టా వీరజాస్తస్య చాత్మజః

రాజా వీరజసః పుత్రః శతజిద్రజసస్తథా

తస్య పుత్రశతం త్వాసీద్రాజానః సర్వ ఏవ తు

విశ్వజ్యోతిష్ప్రధానాస్తే యైరిమా వర్థితాః ప్రజాః

తైరిదం భారతం వర్షం సప్తద్వీపమివాంకితమ్

తేషాం వంశప్రసూతైస్తు భుక్తేయం భారతీ పురా

కృతత్రేతాదియుక్తాస్తు యుగాభ్యా హ్యేకసప్తతిః

యేఽతీతాస్తైర్యుగైః సార్థం రాజానస్తే తదన్వయాః

స్వాయంభువేంఽతరే పూర్వం శతశోఽథ సహస్రశః

ఏవం స్వాయంభువః సర్గో యేనేదం పూరీతం జగత్

ఋషిభిర్దైవ తైశ్చాపి పితృగంధర్వరాక్షసైః

యక్షభూత పిశాచైశ్చ మనుష్యమృగపక్షిభిః

తేషాం సృష్టిరియం ప్రోక్తా యుగైః సహ వీవర్త :

ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయేఽఖనుషంగపాదే ప్రియవ్రతవంశానుకీర్తనంనామ చతుర్దశోఽధ్యాయః

అతనికుమారుఁడు పరమేష్ఠి. ఇతఁడు తండ్రి మరణానంతర ముదయించెను. పరమేష్ఠి కుమారుఁడు ప్రతిహారుఁడు. ఆతనిపేరుతో ఆవంశము ప్రఖ్యాతమయినది. ఆతనికి ప్రతిహర్తయనేడు కుమారుఁడు. ధీమంతుఁడయిన ప్రతిహర్త యొక్క కుమారుడు ఉన్నత. " ఆతని కుమారుఁడు. “భూముఁడని ప్రసిద్ధుఁడు. ఆతని కుమారుడు ఉద్దీథుఁడు. ఉద్దీథుని పుత్రుడు ప్రస్తావి. ప్రస్తావి కుమారుఁడు విభుఁడు; విభుని కుమారుడు పృథువు. (67) పృథుని సుతుఁడు నక్తుండు; నక్తుని సుతుఁ గయుఁడు. గయుని పుత్రుండు నరుఁడు; నరుని కుమారుం డు విరాట్టు. (68) విరాట్సుతుఁడు మహావీర్యుండు; మహావీర్యుని కుమారుఁడు ధీమంతుడు; ధీమంతుని కుమారుడు మహంతుడు; ఆతనికుమారుఁ డు భౌవనుఁడు (69) భౌవనుని పుత్రుఁడు త్వష్ట, ఆ త్వష్టకుమారుఁడు విరజుఁడు, విరజుని పుత్రుండు రజస్సు. ఆతని కుమారుఁడు శతజిత్. (70) ఆశతజిత్తునకు నూర్గురు పుత్రులు. అందరు రాజులే. వారిలో ప్రధానుఁడు విశ్వజ్యోతియనువాఁడు. వారి నుండియ ప్రజలందరు వృద్ధినొందిరి. (71) సప్తద్వీపాంకితమయిన యీ భారతవర్షము వారిది. తద్వంశీయులచే నీ భారతవర్షము పూర్వత్రేతాయుగమనుభవింబడినది. (72) ఒక్కొక్కయుగము కృతవ్రేతాదులచే కూడియున్నది. ఈ మన్వంతరమజీడెబ్బదియొక్కయుగములచే కూడియున్నది. స్వయంభువమన్వంతరములో వారీ వంశీయులే రాజులుగానేలిరి. వారు శతాధికముగా సహస్రాధికముగా నున్నారు. ఇది స్వాయంభువ వంశము. తద్వంశముచే నీయుగము నిండి యున్నది. వారు ఋషులు, దేవతలు, పితరులు, గంధర్వులు, రాక్షసులు, యక్షులు, భూతములు, పిశాచములు మనుష్యులు, మృగపక్షులు, ఇదియంతయు వారిసృష్టి, ఇది యుగములు మారుచుండ పరిణామము చెందుచుండును,

ఇది వాయుప్రోక్తమయిన బ్రహ్మాండమహా పురాణమున పూర్వభాగమున ద్వీతీయమయిన అనుషంగపాదములో ప్రియవ్రతవంశానుకీర్తనమను చతుర్ధాధ్యాయము.