16 - భారత వర్ణనము

సూత ఉవాచ :-

ఏవమేవ  ప నిసర్గో వై వర్షాణాం భారతే శుభే

దృష్టః పరమతత్త్వజ్ఞైర్భూయః కిం వర్ణయామి వః

ఋషి రువాచ :-

యదీదం భారతం వర్షం యస్మిన్స్వాయంభువాదయః

 చతుర్దశైతే మనపః ప్రజాసర్గేఽభవన్పునః

ఏతద్వేదితుమిచ్ఛామస్తన్నో నిగద సత్తమ

ఏతచ్చ్రుతవచస్తేషామబ్రవీద్రోమహర్షణః

అత్రవో వర్ణయిష్యామి వర్షేస్మిన్ భారతే ప్రజాః

ఇదం తు మధ్యమం చిత్రం శుభాశుభఫలోదయమ్

ఉత్తరం యత్సముద్రస్య హిమవద్దక్షిణం చ యత్

వర్షం తద్భారతం నామ యత్రేయం భారతీ ప్రజా

భరణాచ్చ ప్రజానాం వై మనుర్భరత ఉచ్యతే

నిరుక్తవచనాచ్చైవం వర్షం తద్భారతం స్మృతమ్

ఇతః స్వర్గశ్చ మోక్షశ్చ మధ్యశ్చాంతశ్చ గమ్యతే

న ఖల్వన్యత్ర మర్త్యానాం భూమౌకర్మ విధీయతే

భరతస్యాస్య వర్షస్య నవ భేదాన్నిబోధత

సముద్రాంతరితా జ్ఞేయాస్తే త్వగమ్యాః పరస్పరమ్

ఇంద్రద్వీపః కశేరూమాంసామ్రవర్ణో గభస్తిమాన్

నాగద్వీపస్తథా సౌమ్యా గాంధర్వస్త్వథ వారుణః

అయం తు నవమస్తేషాం ద్వీపః సాగరసంవృతః

యోజనానాం సహస్రం తు ద్వీపోఽయం దక్షిణోత్తరాత్

ఆయతో హ్యాకుమార్యో వై చాగంగాప్రభవాచ్చ వై

తిర్యగుత్తరవిస్తీర్ణః సహస్రాణీ నవైవ తు

సూతుఁడిట్లనెను :

శుభవంతమయిన భారతవర్షమున ఉపవర్షముల సృష్టి క్రమము ఈ విధముగా పరమతత్వజ్ఞులచే దర్శింపఁబడినది. మీకిఁక నేనేమి మరల వర్జింపవలయును."

ఋషి యిట్లనెను :

ఏ భారతవర్షము నందు, స్వాయంభువాదులయిన చతుర్దశ మనువులు ప్రజా సంసృష్టి యందు మరల నుద్భవించిరో ఆ భారతవర్షమును గూర్చి యథకముగా వినగోరెదము. ఓ మహానుభావ! దానిని మాకు వివరించుము. వారీ వాక్కులను విని రోమహర్షణుఁడిట్లనెను. మీకు భారత వర్ష ప్రజల గూర్చి వర్ణించెదను. ఈ భరత వర్షము చిత్రమయినది. ఈదీవియొక్క మధ్యము శుభా శుభకర్మ ఫలముల స్థానము. (4) ఏదీ సముద్రమునకుత్తర భాగమునను, హిమవత్పర్వతమునకు దక్షిణముననున్నదో ఆ వర్షము (దేశము) నకు భరతవర్షమని పేరు. అందలి ప్రజలు భారతులు. (5) ప్రజలను భరించుట జేసి మనువు భరతుడని చెప్పబడెను. ఈ నీరుక్త వచనము ననుసరించి అయ్యది భారత వరము లుగా స్మరింపఁబడుచున్నది. (6) ఇందుండియే స్వర్గము, మోక్షము కలుగుచున్నవి. ఇందుండియే మధ్యలోకములు, అంతిమలోకములు ప్రజలకు కలుగును. ఇంకెచ్చటను భూమియందు మర్త్యులకు కర్మ విధింపఁబడియుండలేదు. (7) ఈ భరత వర్షమున తొమ్మిది భోగములున్నవని గ్రహించుము. అవి సముద్రములచే విడదీయబడినవి, ఒక విభాగము నుండి వేక విభాగమునకు ప్రయాణించుట అసంభవము. (8) ఆ తొమ్మిది విభాగములు - (1) ఇంద్ర ద్వీపము (2) కేశరుమంతము (3) తామ్రవర్ణము (4) గభస్తిమంతము, (5) నాగద్వీపము (6) సౌమ్యము (7) గాంధర్వము (8) వారుణము. ఇవి సముద్రమున మునిగినవి. (9) ఇదీ ఇప్పటి భారతదేశము మూడువైపుల సముద్రములున్నది. ఈ భరతవర్షము దక్షిణోత్తరముగా, గంగానదీజన్మలస్థానము నుండి కన్యాకుమారి వరకు వెయ్యి యోజనములు విస్తరించునది. ఈ విస్తీర్ణము ఉత్తరమున అడ్డముగా తొమ్మిది వేల యోజనములు.(9-11) (ఒక యోజనము = 12 కిలోమీటర్లు).

ద్వీపో హ్యుపనివిష్టోయం మ్లేచ్చైరంతేషు సర్వశః

పూర్వే కిరాతా హ్యస్యాంతే పశ్చిమే యవనాః స్మృతాః

బ్రాహ్మణాః క్షత్రియా వైశ్యా మధ్యే శూద్రాశ్చ భాగశః

ఇజ్యాయుధవణిజ్యాభిర్వర్తయంతో వ్యవస్థితాః

తేషాం సంవ్యవహారోఽత్ర వర్తతే వై పరస్పరమ్

ధర్మార్థ కామ సంయుక్తో వర్ణానాం తు స్వకర్మసు

సంకల్పః పంచమానాం చ హ్యాశ్రమాణాం యథావిధి

ఇహ స్వర్గాపవర్గార్థం ప్రవృత్తిర్యేషు మానుషే

యస్త్వయం నవమో ద్వీపస్తిర్యగాయామ ఉచ్యతే

కృత్స్నం జయతి యో హ్యేనం సమ్రాడిత్యభిధీయతే

అయం లోకస్తు వై సమ్రాడంతరిక్షం విరాట్ స్మృతమ్

స్వరాడసౌ స్మృతో లోకః పునర్వక్ష్యామి విస్తరాత్

సప్తైవాస్మిన్సుపర్వాణో విశ్రుతాః కులపర్వతాః

మహేంద్రోమలయస్సహ్యః శుక్తిమాన్ ఋక్షపర్వతః

వింధ్యశ్చ పారియాత్రశ్చ సప్తైతే కులపర్వతాః

తేషాం సహస్రశశ్చాన్యే పర్వతాస్తు సమీపగాః

అవిజ్ఞాతాః సారవంతో విపులాశ్చిత్రసానవః

మందర పర్వతశ్రేష్ఠో వైహారో దుర్దురస్తథాః

కోలాహలః ససురసో మైనాకో వైద్యుతస్తథా

వాతంధమో నాగగిరీస్తథా పాండురపర్వతః

ఈ ద్వీపము యొక్క సరిహద్దు ప్రదేశములు అన్నియును, సర్వత్ర మ్లేచ్చులచే అధివసింపఁబడినవి. తూర్పు సరిహద్దులలో కిరాతులు, పశ్చిమ సరిహద్దులలో యవనులు నున్నారు. (12) మధ్య ప్రదేశములలో బ్రాహ్మణులు, క్షత్రీయులు, వైశ్యులు నివసింతురు; అక్కడక్కడ చదురముదురుగా శూద్రులుందురు. బ్రాహ్మణులు యజ్ఞయాగాదులతో, క్షత్రియులు ఆయుధములతో, వైశ్యులు వర్తకవ్యహారములతో స్థిరపడి వ్యవహరింతురు. (13) ఈ వీవీధ వర్ణముల వారికి పరస్పరము ధర్మార్థకామ విషయములపై ఆధారపడి స్వకర్మలయందు సంబంధములు కలవు. ఆశ్రమ చతుష్టయము నందు, పంచముల విషయమున, యథావిధి ఆచారము నిర్వహింపఁబడుచుండును. ఇయ్యది స్వర్గాపవర్గార్థ ప్రవృత్తి. మానవ సంబంధమయినది. (15) తొమ్మిదవ విభజనముగా చెప్పుఁబడినది ఒక ద్వీపము. అయ్యది తిర్యక్కుగా (అడ్డముగా వ్యాపించినది. దానీనీ సంపూర్ణోముగా నెవ్వఁడు జయించునో అతనిని సమ్రాట్టు అందురు. (16) యథార్థముగా ఈ లోకము సమ్రాట్టు. అంతరిక్షమును విరాట్గా స్మరింతురు. ఈ లోకమును స్వరాట్టుగా స్మరింతురు. తరువాత వీనినీ గూర్చి విస్తరించి చెప్పెదను. (17) ఇందు విశ్రుతములయిన ఏడు కుల పర్వతములున్నవీ, అవి :- మహేంద్రము, మలయము, సహ్యము, శుక్తిమంతము, ఋష్య పర్వతము, వింధ్యము, పారియాత్రము - ఈ యేఁడు కుల పర్వతములు. పోనీ సమీపమున వేలకొలది ఇతర పర్వతములు కలవు. (18) అవీ అవిజ్ఞాతములు. అవి మిక్కిలి సారవంతములు; మిక్కిలి విపులములు; వాని శిఖరములు చిత్రములయినవి. అవి పర్వతశ్రేష్ఠమయిన మందరము, వైహారము, దుర్జురము, కోలాహలము, ససురసమయిన మైనాకము, వైద్యుతము, వాతంధమము, నాగగిరి, పాండుర పర్వతము, (21) తుంగప్రస్తము, కృష్ణగిరి,

 తుంగప్రస్థః కృష్ణగిరిర్గోధనో గిరిరేవ చ

పుష్పగిర్యుజ్జయంతౌ చ శైలో రైవతకస్తథా

శ్రీపర్వతశ్చిత్రకూట: కూటశైలో గీరిస్తథా

అన్యే తేభ్యోఽపరిజ్ఞానా హ్రస్వాః స్వల్పోపజీవినః

తైర్విమిశ్రా జనపదా ఆర్యా మ్లేచ్ఛాశ్చ భాగశః

హీయంతే యైరిమా నద్యో గంగా సింధుః సరస్వతీ

శతద్రుశ్చంద్రభాగా చ యమునా సరయూస్తథా

ఇరావతీ వితస్తా చ విపాశ దేవికా కుహూః

గోమతీ ధూతపాపా చ బుద్బుదా చ దృషద్వతీ

కౌశికీ త్రిదివా చైవ నిష్ఠీవీ గండకీ తథా

చక్షుర్లోహిత ఇత్యేషా హిమవత్పాదనిస్సృతాః

వేదస్మృతిర్వేదవతీ వృత్రఘ్నీ సింధురేవ చ

వర్ణాశా నందనా చైవ సదానీరా మహానదీ

పాశా చర్మణ్వతీనూపా వీదిశా వేత్రవత్యపి

క్షిప్రా హ్యవంతీ చ తథా పారియాత్రాశ్రయాః స్మృతాః

శోణో మహానదశ్చైవ నర్మదా సురసా క్రియా

మందాకినీ దశార్ణా చ చిత్రకూటా తథైవ చ

తమసా పిప్పలా శ్యేనా కరమోదా పిశాచికా

చిత్రోపలా విశాలా చ వంజులా వాస్తువాహినీ

సనేరుజా శుక్తిమతీ మంకుతీ త్రిదివా క్రతుః

ఋక్షవత్సంప్రసూతాస్తా నద్యో, మణిజలాః శివాః

తాపీ పయోష్ణీ నిర్వింధ్యా సృపా చ నిషధా నదీ

గోధన పర్వతము, పుష్పగిరి, ఉజ్జయంతము, రైవతకశైలము, (22) శ్రీ పర్వతము, చిత్రకూటము, కూటశైలము. వీనికంటె అన్యములయిన పర్వతములున్నవి. అవి వీనికంటే. హ్రస్వములు (చిన్నవి). అపరిజ్ఞాతములు; వానీపై నాధారపడి జీవించు వ్యక్తుల సంఖ్య స్వల్పము. (23) వీనితో వ్యాప్తమయిన ప్రదేశములు మధ్యమధ్య ఆర్యులచే అందందు మ్లేచ్చులచే నివసింపఁబడుచున్నవి. గంగా, సింధు, సరస్వతీ నదుల జలములు వీరిచే త్రాగుటకుపయోగీంపఁబడుచున్నవి. (26) శతద్రు, చంద్రభాగ, యమున, సరయు, ఇరావతి, వితస్తా, విపాశా, దేవికా, కుహు, గోమతి, ధూమపాప బుద్బద, దృషద్వతి, కౌశికి, త్రిదివ, నిఫ్టీవి, గండకీ చక్షుర్లోహిత " మున్నగు నదులు, పామవత్పాదము నుండి నిస్సతములు (పుట్టి ప్రవహించునవి) (27) వర్ణాశ, నందన, సదానీర, మహానది, వేదస్మృతి, వేదవతి, వృతఘ్ని, సింధు, పాశ, చర్మణ్వతి, నూష, వీదీశ, వేత్రవతి, క్షిప్ర, అవంతీ - అనునదులు పారియాత్ర పర్వతముల నాశ్రయించుకొని యుత్పన్నములయినవి. శోణ, మహానదము, నర్మదా, సురస, క్రియ (29) మందాకిని, దశార్ణ, చిత్రకూట, తమస, పిప్పల, శ్యేన, కరమోద, పిశాచిక, చిత్రోపల, విశాల, వంజుల, పోస్తు వాహినీ, సనేరుజ, శుక్తిమతీ, మంకుతి, త్రిదివ, క్రతు - అను నదులు ఋక్షవంతము నుండి పుట్టి ప్రవహించునవి. అవి శివంకరములు. పవిత్రములు; వాని జలములు స్ఫటికమణులవలె ప్రకాశించు స్వచ్ఛనీరములు, (31)

వైణీ వైతరణీ చైవ క్షిప్రా వాలా కుముద్వతీ

తోయా చైవ మహాగౌరీ దుర్గా వాన్నశిలా తథా

వింధ్యపాదప్రసూతాస్తా సద్యః పుణ్యజలాః శుభాః

గోదావరీ భీమరథీ కృష్ణవేణాథ బంజులా

తుంగభద్రా సుప్రయోగా బాహ్యా కావేర్యథాపి చ

దక్షిణ ప్రవహా నద్యః సహ్యపాదాద్వినీః స్మృతాః

కృతమాలా తామ్రపర్ణీ పుష్పజాత్యుత్పలావతీ

నద్యోఽభిజాతా మలయాత్సర్వాః శీతజలాః శుభాః

త్రిసామా ఋషికుల్యా చ వంజులా త్రిదివా బలా

లాంగూలినీ వంశధరా మహేంద్రతనయాః స్మృతాః

ఋషికుల్యా కుమారీ చ మందగా మందగామినీ

కృపా పలాశినీ చైవ శుక్తిమత్ర్పభవాః స్మృతాః

తాస్తు సద్యః సరస్వత్యః సర్వా గంగాః సముద్రగాః

విశ్వస్య మాతరః సర్వా జగత్పాపహరాః స్మృతాః

తాసాం నద్యుపనద్యోఽన్యాః శతశోఽథ సహస్రశః

తాస్విమే కురుపాంచాలా: శాల్వా మాద్రేయజాంగలాః

శూరసేనా భద్రకారా బోధాః సహపటచ్చరాః

మత్స్యా: కుశల్యాః సౌశల్యాః కుంతలాః కాశీకోశలాః

గోధాభద్రాః కలింగాశ్చ మాగధాశ్చోత్కలైః సహ

మధ్యదేశ్యా జనపదాః ప్రాయశస్తత్ర కీర్తితాః

తాపీ, పయోష్టి, నిర్వీంధ్యా, సృపా, నిషధానదీ, వేణీ, వైతరణీ, క్షిప్రా, వాలా, కుముద్వతీ, తోయ, మహాగౌరీ, దుర్గా, (దుర్గా - తరించుటకు కష్టమయినది, అన్నశిలా (అంత శీలాయై యుండవచ్చును. అంత - లోన - శిలా రాళ్లు కలిగినది) ఈ దుర్గా అన్నశీలా నదీ ద్వయము మహాగౌరీనది యొక్క యుపనదులు.) అన్నశిలా అను నదులు పవిత్రములయినవి, పుణ్యజలములు; శుభకంరములు. వింధ్య పర్వత పాదముల నుండి పుట్టినవి. (33) గోదావరి, భీమరథి, కృష్ణవేణి, బంజులా, తుంగభద్ర, సుప్రయోగ, బాహ్య, కావేరి - అను నదులు సహ్య పర్వతముల పాద పర్వతముల నుండి పుట్టి ప్రవహించునట్టివి. అవి దక్షిణముగా ప్రవహించును, దక్షిణ ప్రవాహములు, (34, 35) కృతమాల, తామ్రపర్ణీ, పుష్పజాతీ, ఉత్పలావతి - అను నదులు మలయ పర్వతముల నుండి పుట్టినవి. ఆవి శుభములు, శీతజలములు (36) త్రిసామ, ఋషికుల్య, బంజుల, త్రిదివా, బలా, లాంగూలీని, వంశధర నదులు మహేంద్ర పర్వతతనయలుగా స్మరింపఁబడుచున్నవి. (37) ఋషి కుల్యా, కుమారీ, మందగ, మందగామినీ, కృపా, పలాశినీ నదులు శుక్తిమంత పర్వతము నుండి పుట్టినవిగా స్మరింపఁబడుచున్నవి. (38) ఈ నదులన్నియు గంగా సరస్వతీ తుల్యములు. ఇవీ యన్నియును సముద్రగాములు. (సముద్రమును చేరును. ఇవి యన్నియు విశ్వజననులుగా భావింపం బడుచున్నవి. ఇవి జగత్పాపములను హరించును. (39) ఈ నదుల యొక్క ఉపనదులు, ఇతరము లనేకములు వందలుగా వేలుగా నున్నవి. కురు, పాంచాల, శాల, మాద్రేయ, జాంగల, సౌరసేన, (శూరసేన) భద్రకార, బోధ, పటచ్చర, మత్స్య కౌశల్య (కుశల్య), సౌశల్య, కుంతల, కాశి, కోశల, గోధ, భద్ర, కళింగ, మగధ, ఉత్కల - మున్నగు దేశములు రాజ్యములీ నదీ తీరముల స్థాపింపఁబడినవి. అవి యన్నియు కీర్తిమంతములు. (42)

సహ్యస్య చోత్తరాంతేషు యత్ర గోదావరీ నదీ

 పృథివ్యామపి కృత్స్నాయాం స ప్రదేశో మనోరమః

తత్ర గోవర్థనం నామ పురం రామేణ నిర్మితమ్

రామప్రియాథ స్వర్గీయా వృక్షా దివ్యాస్తథౌషధీః

భరద్వాజేన మునినా తత్ప్రియార్ధేఽవరోపితాః

అతః పురవరోద్దేశస్తేన జజ్ఞే మనోరమః

బాహ్లికా వాటధానాశ్చ ఆభీరా కాలతోయకాః

అపరాంతాశ్చ సుహ్మాశ్చ పాంచాలాశ్చర్మమండలాః

గాంధారా యవనాశ్చైవ సింధుసౌవీరమండలాః

చీనాశ్చైవ తుషారాశ్చ పల్లవా గిరిగహ్వరాః

శకా భద్రాః కులిందాశ్చ పారదా వింధ్యచూలికాః

అభీషాహా ఉలూతాశ్చ కేకయా దశమాలికాః

బ్రాహ్మణాః క్షత్రియాశ్చైవ వైశ్యశూద్రకులాని తు

కాంభోజ దరదాశ్చైవ బర్బరా అంగలౌహికాః

అత్రయః సభరద్వాజాః ప్రస్థలాశ్చ దశేరకాః

లమకాస్తాలశాలాశ్చ భూషికా ఈజికైస్సహ

ఏతే దేశా ఉదీచ్యా వై ప్రాచ్యాన్ దేశాన్నిబోధత

అంగవంగా శ్చోలభద్రాః కిరాతానాం చ జాతయః

తోమరా హంసభంగాశ్చ కాశ్మీరాస్తంగణాస్తథా

ఝిల్లికాశ్చాహుకాశ్చైవ హూణదర్వాస్తథైవ చ

ఆంధ్రవాకా ముద్గరకా అంతర్గిరిబహిర్గిరాః

తతః ప్లవంగవో జ్ఞేయా మలదా మలవర్తికాః

సహ్య పర్వతము యొక్క యుత్తరాంతమునందు ఎచ్చట గోదావరీ నది ప్రవహించుచున్నదో, ఆ ప్రదేశము సర్వ పృథివీ భాగమునందును మనోహరమైన ప్రదేశము. (43) అచ్చట గోవర్ధనమను పేరు గల నగరమును రాముఁడు నిర్మించెను. అచ్చట దివ్యములు, అమరములైన వృక్షములు, రామునకు ప్రియమైన ఓషధులు, రాముని ప్రీతి కొఱకు భరద్వాజ మహర్షి యిచ్చట నాటెను. (44) ఆందుచేతనే ఆ గోవర్ధన నామక పురోద్దేశము మనోహరమయినది. (45) తదుత్తర ప్రాంత దేశమున బాహ్లికులు, వాటధానులు, ఆభీరులు, కాలతోయకులు, అపరాంతులు, సుహ్ములు, పాంచాలురు, చర్మమండలులు, గాంధారులు, యవనులు, సింధు సౌవీరకుండలులు, చీనులు, తుషారులు, పల్లవులు, గిరిగహ్వరులు (47) శకులు, భద్రులు, కులిందులు, పారదులు, వింధ్య చూళికులు, అభీషాహులు, ఉలూతులు, కేకయులు, దశమాలికలు (48) బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రకులములు, కాంభోజులు, దరదులు, ఇతరులు ఆంగలెరాకులు, భరద్వాజులతో సహా ఆత్రులు, ప్రస్థలులు, దశేరకులు, లమకులు, తాలులు, శాలులు, భూషికులు, ఈజికులు - కలరు. ప్రాచ్యదేశస్థుల సఖుంగుము :- అంగులు, వంగులు, చోలులు, భద్రులు, కిరాతజాతులు, తోమరులు, హంసభంగులు, కాశ్మీరులు, తంగణులు, ఋల్లికులు, ఆహోకులు, హూణదర్వులు, ఆంధ్రవాకులు, ముద్గరకులు, అంతర్గిరులు, బహిర్గిరులు, ప్లవంగులు, మలదులు, మలవర్తికులు,

సమంతరాః ప్రావృషేయా భార్గవా గోపపార్థివాః

ప్రాగ్జ్యోతిషాశ్చ పుండ్రాశ్చ విదేహాస్తామ్రలిప్తకాః

మల్లా మగధగోనర్దా: ప్రాచ్యాం జనపదాః స్మృతాః

అథాఽపరే జనపదా దక్షిణాపథవాసినః

పాండ్యాశ్చ కేరళాశ్చైవ చోలాః కుల్యాస్తథైవ చ

సేతుకా మూషికాశ్చైవ క్షిపణా వసవాసికాః

మహారాష్ట్రా మహిష్ఠికాః కాళింగాన్చైవ సర్వతః

అభిరాశ్చ సహైషీకా అటవ్యా సారవాస్తథా

పులిందా వింధ్యమౌళీయా వైదర్భా దండకైః సహ

పౌరికా మౌళికాశ్చైప అశ్మకా భోగవర్థనాః

కొంకణాః కం తలాశ్చాంద్రాః కుళిందాంగారమారిషాః

దాక్షిణాశ్చైవ యే దేశా అషరాస్తాన్నిబోధత

సూర్యారకాః కలిపనా దుర్గలాః కుంతలైః సహ

పౌలేయాశ్చ కిరాతాశ్చ రూపశాస్తాపకైః సహ

తథా కరీశయశ్చైవ సర్వే చైవ కరంధరాః

నాసికాశ్చైవ యేచాన్యే యే చైవాంతరనర్మదాః

సహకచ్చా: సమాహేయాః సహ సారస్వతైరపి

కచ్ఛిషాశ్చ సురాష్ట్రాశ్చ ఆనర్తాశ్చార్భుదైః సహ

ఇత్యేతే అపరాంతాశ్చ శ్రుణుధ్వం వింధ్యవాసినః

మలదాశ్చ కురూషాశ్చ మేకలాశ్చోత్కలైః సహ

సమంతరులు, ప్రావృషేయులు. భార్గవులు, గోపపార్థివులు, ప్రాగ్త్యోతిషులు, పుండ్రులు, విదేహులు - వీరందరు ప్రాక్టీశీయులుగా నెంబింగ వలెను. ఇక దక్షిణాపథవాసులు. పాండ్యులు, కేరళులు, చోళులు, కుల్యులు, సేతుకులు, మూషికులు, క్షపణులు, వనవాసికులు, మహారాష్ట్రులు, మహిషికులు, కాళింగులు, ఆభీరులు, జంషీకులు, ఆటప్యులు, సారవులు, పుళిందులు, వింధ్యులు, మౌళీయులు, వైడర్బులు, దండకులు, పౌరికులు, మౌళికులు, అశ్మకులు, భోగవర్ధనులు (58) కొంకణులు, కంతలులు, ఆంధ్రులు, కుళిందులు, అంగారులు, మారీషులు, వీరందరు దక్షిణ దేశీయులు ఇంక ఇతరులను పశ్చిమదేశీయుల సైజుంగుము. (59) సూర్యారకులు, కలివనులు, దుర్గలులు, కుంతలులు, పౌలేయులు, కిరాతులు, రూపకులు, తాపకులు, కరీతులు, సర్వకరంధరులు, నాసికులు, నర్మదా నదీ లోయల యందుండు ఇతరులు, (సహ) కచ్చులు, సమాహేయులు, సారస్వతులు, కచ్ఛిపులు, సురాప్తులు, ఆనర్తులు, అరుదులు (62) వీరందరు పశ్చిమ దేశీయులు. ఇక వింధ్య వాసినులను గూర్చి దెంగుము. మలదులు, కురూపులు, మేకలులు, ఉత్కళులు. (63)

ఉత్తమానాం దశార్ణాశ్చ భోజః కిష్కింధకైః సహ

తోశలాః కోశలాశ్చైవ త్రైపురా వైదీశాస్తథా

తుహుండా బర్బరాశ్చైవ షట్పురా నైషధైః సహ

అనూపాస్తుండికేరాశ్చ వీతిహోత్రా హ్యవంతయః

ఏతే జనపదాః సర్వే వింధ్యపృష్ఠ నివాసినః

అతో దేశాన్ ప్రవక్ష్యామి పర్వతాశ్రయిణశ్చ యే

నిహీరా హంసమార్గాశ్చ కుపథాస్తంగణాః శకాః

అపప్రావరణాశ్చైన ఊర్జా దర్వాః సహూహుకాః

త్రిగర్తా మండలాశ్చైవ కీరాలిస్తామరైః సహ

చత్వారి భారతే వర్షే యుగాది ఋషయోఽబ్రువన్

కృతం త్రేతాయుగం చైవ ద్వాపరం తీష్యమేవ చ

తేషాం నిసర్దం పక్ష్యామి ఉపరిష్టాదశేషతః

ఇతి శ్రీ బ్రహ్మాండ మహాపురాణే వాయుప్రోక్తే పూర్వభాగే ద్వితీయేఽమషంగపాడే భారతవర్ణవం నామ షోడశోఽధ్యాయ:

 దశార్ణులు, వారిలో ఉత్తములు భోజులు, కిష్కింధకులు, తోశలు, కోశలులు లేపరులు, వైదీశులు తుహరండులు, బర్బరులు, షట్పురులు, నైషధులు, అనూపులు, తండికేరులు, వీతిహోత్రులు, అవంతులు (65) వీరందరువింద్య పర్వతవాసులన జానపదులు ఇంక పర్వతాశ్రయుల గూర్చి చెప్పెదను. (66) నివీరులు, హంసర్గలు, కుపధులు, తంగణులు, శకులు, అషప్రాపరణులు, ఊర్డులు, దుర్వులు, హూహుకులు,  (67) త్రిగర్తులు, కుండలులు, కిరాతులు, తామరులు. భరత వర్షమున నాలుగు యుగములున్నవని ఋషులు చెప్పిరి. కృతయుగము, ద్వాపర యుగము, తీష్యయుగము (కలియుగము) ఇక ముందు వానిని గూర్చి విశేషముగా చెప్పెదము.

ఇది పాయుప్రోక్తమయిన శ్రీ బ్రహ్మాండ మహాపురాణమున హార్వభాగమున ద్వితీయానుషం పాదమున భారతవర్ణన నామక షోడశాధ్యాయము సమాప్తము.