14 - మదనకామేశ్వరప్రాదుర్భావో నామ చతుర్దశోఽధ్యాయః

హయగ్రీవ ఉవాచ :

ఏతస్మిన్నేవ కా లేతు బ్రహ్మాలోకపితామహః।

 అజగామాథ దేవేశీం ద్రష్టుకామో మహర్షిభిః॥

అజగామ తతో విష్ణురారూఢో వినతాసుతమ్।

 శివోపి వృషమారూఢః సమాయాతో ఖిలేశ్వరీమ్ ॥

దేవర్షయో నారదాద్యాః సమాజగ్ముర్మహేశ్వరమ్।

 ఆయయుస్తాం మహాదేవీం సర్వే చాప్సరసాం గణాః ॥

విశ్వావసుప్రభృతయో గంధర్వాప యక్షకా।

 బ్రహ్మణాథ సమాదిష్ణోవిశ్వ కర్మా విశాం పతిః॥

 చకార నగరం దివ్యం యథామరపురం తథా।

 తతో భగవతీ దుర్గా సర్వమంత్రాధిదేవతా॥

 విద్యాధిదేవతా శ్యామా సమాజగతురంబీకామ్।

 బాహ్యాద్యా మాతరశ్చైవ స్వస్వభూతగణావృతాః ॥

 సిద్దయో హ్యణీమాద్యాశ్చ యోగిన్యశ్చైవ కోటిశు।

 భైరపోః క్షేత్రపాలాశ్చ మహాశాస్తా గణాగ్రణీః॥

 మహాగణేశ్వరః స్కందో బటుకో వీరభద్రకః।

 ఆగత్య తే మహాదేవీం తుష్టుపుః ప్రణతాః సదా॥

తత్రాథ నగరీం రమ్యాం సాప్రాకారతోరణామ్।

గజాశ్వరథశాలాడ్యాం రాజవీధివిరాజితామ్॥

 సామంతానామమాత్యానాం సైనికానాం ద్విజన్మనామ్ ।

వేతాలదాసదాసీనాం గృహాణి రుచిరాణి చ॥

 మధ్యం రాజగృహం దివ్యం ద్వారగోపురభూషితమ్।

 శాలాభిర్బహుభిర్యుక్తం సభాభిరుపశోభితమ్ ॥

 సింహాసనసభాం చైవ నవరత్నమయీం శుభమ్।

 మధ్యే సింహాసనం దివ్యం చింతామణీవినిర్మితమ్ ॥

స్వయంప్రకాశమద్వంద్వముదయాదిత్యసన్నిభమ్।

 విలోక్య చింతయామాస బ్రహ్మలోక పితామహః॥

యస్త్వేతత్సమధిష్టాయ వర్తతే బాలిశోపివా।

 పురస్యాస్య ప్రభాషణ సర్వలోకాధికో భవేత్ ॥

న కేవలా స్త్రీ రాజ్యారా పురుషోపి తయా వినా।

 మంగలాచార్యసంయుక్తం మహాపురుషలక్షణమ్ ॥

అనుకూలాంగనాయుక్తమభిషించేదితి శ్రుతిః॥

విభాతీయం వరారోహా మూర్తి శృంగారదేవతా ।

వరో స్యాస్లీషు లోకేషు న చాన్యః శంకరాదృతే॥

జటిలో ముండధారీ చ విరూపాక్షః కపాలభృత్।

 కల్మాడీ భస్మదిగ్ధంగః శ్మశానాస్థివిభూషణః॥

అమంగళాస్పదం చైనం వరయేత్సా సుమంగలా।

 ఇతి చింతయమానస్య బ్రహ్మణోగ్రే మహేశ్వరః ॥

కోటికందర్పలావణ్యయుక్తా దివ్యశరీరవాన్ ।

దివ్యాంబరధరః స్రగ్వీ దివ్యగంధానులేపనః॥

కిరీటహారకేయూరకుండలాద్యైరలంకృతః।

 ప్రాదుర్బభూవ పురతో జగన్మోహనరూపధృక్॥

తం కుమారమథాలింగ్య బ్రహ్మా లోకపితామహః।

 చక్రే కామేశ్వరం నామ్నా కమనీయవపుర్ధరమ్ ॥

 తస్యాస్తు పరమాశక్తీరనురూపో వరస్త్వయమ్।

 ఇతి నిశ్చిత్య తేనైవ సహితాస్తామథాయయుః॥

ఆస్తువంస్తే పరాం శక్తిం బ్రహ్మవిష్ణుమహ్వేరా।

 తాం దృష్ట్వా మృగశావాక్షీ కుమారో నీలలోహితః ॥

సాపీ తం వీక్ష్య తన్వంగీ మూర్తిమంతమివ స్మరమ్।

 మదనావిష్టసర్వాంగీ స్వాత్మరూపమమన్యత ॥

 అన్యోన్యాలోకనాసక్తా ధృతిమంతా మనస్వినౌ ॥

సర్వభావవిశేష ధృతిమంతా మనస్వినౌ।

 పరైరజ్ఞాతచారిత్రా ముహూర్తాస్వస్థచేతనే॥

 అథోవాచ మహాదేవం బ్రహ్మా లోకైకనాయికామ్।

 ఇమే దేవాశ్చ ఋషయే గంధర్వాపురసాం గణాః॥

 త్వామీశాం ద్రష్టుమిచ్ఛంతి సప్రియాం పరమాహవే॥

 కో వా నురూప్తస్తే దేవి ప్రియో ధన్యతమః పుమాన్।

లోకసంరక్షణార్థాయ భజస్వ పురుషం పరమ్ ॥

రాజ్ఞీ భవ పురస్యాస్య స్థితా భవ వరాసనే ।

అభిషిక్తాం మహాభాగైర్దేవర్షిభిరకల్మషైః॥

 సామ్రాజ్యచిహ్నసంయుక్తాం సర్వాభరణసంయుతామ్।

 సప్రియామాసనగతాం ద్రష్టుమిచ్ఛామహే వయమ్॥

ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే

మదనకామేశప్రాదుర్భావో నామ చతుర్దశోధ్యాయః ॥

హయగ్రీవుడనెను. ఈ కాలములోనే లోకపితామహుడైన బ్రహ్మ మహర్షులతోగూడ నాదేవేశిని జూచుటకేతెంచెను-1. గరుడు నారోహించిన వాడై విష్ణువు సైతమేతెంచెను. వృషారూఢుడై యఖిలేశ్వరిని చూచుటకు శివుడు గూడ నేతెంచెను-2. నారదాది దేవర్పులు మహేశ్వరికడకు వచ్చిరి. అపురోగణములందరును ఆమెకడకు వచ్చిరి-3. విశ్వావసువు మొదలగు గంధర్వులు యక్షులును వచ్చిరి. బ్రహ్మచే ఆదేశింపబడి, వీశాంపతి (రాజైన) విశ్వకర్మ-4. దేవపురమువంటి దివ్యమైన నగరమును నిర్మించెను. తరువాత భగవతియై సర్వమంత్రములకధీ దేవతయైన దుర్గ-5. విద్యాధిదేవతయైన శ్యామయు అంబికకడకు వచ్చిరి. బ్రాహ్మీమొదలగు మాతృదేవతలును సర్వభూతగణములతో బాటు వచ్చిరి. (బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి ఇంద్రాణి, చాముండ-వీరేడుగురు మాతృదేవతలు)-6. అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్యము, ఈశత్వము వశిత్వము-అనెడు ఎనిమిది సీదులు వచ్చినవి. అట్లే కోట్ల కొలది యోగినులు వచ్చిరి. భైరవులు, క్షేత్రపాలులు, గణాగ్రణియైన మహాశాస్త్ర-7, మహాగణేశ్వరుడు, స్కందుడు, బటుకుడు, వీరభద్రుడు-వీరందరూ వచ్చి నిత్యము దేవికి ప్రణుతులై స్తుతించిరి-8. అట్టి విశ్వకర్మ నిర్మించిన నగరి, రమ్యమైనది. బురుజులతోగూడి కోటగోడలతో తోరణములతో నొప్పినది. గజ-అశ్వరథముల శాలలతోనొప్పినది. రాజవీధులతో విరాజిల్లినది-9, అచట సామంతరాజులయు, అమాత్యులయు, సైనికులయు, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు, వేతాలులయు దాస-డీసీజనములయు సుందరములైన యిండ్లుగలవు-10. మధ్యన ద్వారములతోను, గోపురములతోను భూషితమై దివ్యమైన రాజ గృహముగలదు. అనేకశాలలు బహంసభా భవనములును గలది-11. నవరత్నమయమైన సింహాసన సభ యున్నది. దానిమధ్యన చింతామణి వినిర్మితమై దివ్యమైన సింహాసనము గలదు-12. అదీ స్వయం ప్రకాశము దానివంటిది మరొకటి లేదు. ఉదయించిన సూర్యునివలె ప్రకాశించునది. దీనిని జూచి లోక పితామహుడైన బ్రహ్మాయిట్లు చింతింపసాగెను-13. దీనిని అజ్ఞానియైన బాలుడెక్కియుండినచో ఈ నగర ప్రభావమున వాడు సర్వలోకములకును అధికుడగును-14. కేవలమొక పెండ్లియాడని స్త్రీకాని, స్త్రీ లేని పురుషుడుగాని రాజ్యార్థులుగారు, మంగలాచారములతో గూడి మహాపురుష లక్షణములు గలిగి, అనుకూల స్త్రీతో నున్న వానినే రాజ్యమున నభిషేకింపవలెనని శ్రుతి చెప్పును-15. ఈ మహాదేవి ఉత్తమ స్త్రీగను, ఆకారము దాల్చిన శృంగారదేవతగను బ్రాకాశించుచున్నది. శంకరుడుదప్ప ఈమెకు దగిన వరుడు ముల్లోకములలోను లభింపడు-16. కాని శంకరుడు జడలుగలిగి, కపాలమాలను ధరించి, బేసికన్నులుగల వాడై (ముక్కంటియై), చిత్రవర్ణములుగలిగి, బూడిదబూసికొన్న సమస్త శరీరము గలవాడై, కాటియెముకల నలంకరించుకొన్న వాడైయుండును-17. ఈ విధముగా అమంగలములకు నెలవైన వానిని సుమంగళియైన యా మహాదేవి వరించునా? అనీ చింతించుచుండగనే యా బ్రహ్మయొక్కయెదుట మహేశ్వరుడు-18. కోటి మన్మథుల సౌందర్యము దివ్యశరీరము దీవ్యవస్త్రములను దివ్యమాలలను ధరించి, ధివ్యగంధములబూసికొని-19. కిరీటము, హారములు, భుజభూషణములు, కర్ణకుండలములు, మొదలగువానిచే నలంకరింపబడినవాడై జగన్మోహనరూపమును ధరించి (బ్రహ్మదేవునియెదుట) ఆవిర్భవించెను-20. ఆ కుమార స్వరూపియైన శంకరుని లోక పితామహుడైన బ్రహ్మ కౌగిలించుకొని యా సుందరశరీరధారీకి కామేశ్వరుడనీ నామధేయము జేసెను-21. ఆ పరాశక్తి కీతడనురూపుడైన వరుడని నిశ్చయించి యాతనితో గూడ దేవికడకు దేవతలందరుపోయిరి-22.

బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆ పరాశక్తిని స్తుతించిరి. ఆ లేడిపిల్లకన్నుల వంటి కన్నులు గల మహాదేవిని జూచి కుమార శంకరుడు తన సమస్త క్రియలను మరచి మన్మథావిష్టుడయ్యెసు-23. సన్నని సుందరదేహముగల యా మహాదేవియు ఆకారముదాల్చిన మన్మథునివలెనున్న కుమారశంకరునీ జూచి మదనావిష్ణ సర్వాంగియై యాతని స్వాత్మరూపునిగా దలచెను. పరస్పరము బాగుగా చూచుకొనగోరి వారిరువును కామపీడితులైరి-24. సర్వభావ విశేషములనుదెలిసి, ధృతిమంతులై, మనస్వులై మనమును తమ వశమునందుందుచుకొన్నవారై) ఇతరులకు దెలియరాని చరిత్ర కలవారై (పరమాత్మ స్వరూపులై మనోవాగతీతులై) కూడా ముహూర్తకాలము కామవశులై యస్వస్థచేతనులైరి-25. ఈ తరువాత బ్రహ్మ లోకైకనాయికయైన మహాదేవితోనిట్లనెను. ఈ దేవతలు, ఋషులు, గంధర్వాపురోగణములును ఈశివైన నిన్ను పరమయుద్ధమున సప్రియను (ప్రియునీతో గూడినదానినిగా) జూడగోరుచున్నారు-26. ఓదేవి! నీకు ప్రియతముడైన యా ధన్యపురుషుడెవడు? లోకసంరక్షణములకు పరమపురుషుని బొందుము-27. ఈ పురమునకు రాణివగుము. ఈ శ్రేష్ట (సింహా)ఆసనమున గూర్చుండియుండుము. అపాపులై, మహాభాగ్యవంతులైన దేవరులచే నభిషేకింపబడి, సామ్రాజ్యచిహ్నముతోగూడి, సర్వాభరణభూషితవై, నీ ప్రియునితో గూడ సింహాసనమున గూర్చున్న దానినిగా నిన్ను మేము చూడగోరుచున్నాము-29.

ఇదిశ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున మదనకామేశప్రాదుర్భావమను పదునాల్గవయధ్యాయము.