58 - అంశుమంతునిరాజ్యప్రాప్తి

 జైమినిరువాచ :-

ఏవం బ్రువాణం వరుణం విలోక్య పతితం భువి

 సంజహార పునర్గీమానస్త్రం భృగుకులోద్వహః

సంహృతాస్త్రతస్తతో రామో వరుణం పురతః స్థిరమ్

విలోక్య విగతక్రోధః తమువాచ హసన్నివ

గోకర్ణనిలయాః పూర్వమీమే మాం మునిపుంగవాః

సమాయాతా మహేంద్రాదౌ నివసంతం సరితతే

 త్వతో యే మేదినీం పూర్వం ఖనదీః సగరాత్మజైః

అధో నిపాతితం క్షేత్రం గోకర్ణమృషిసేవితమ్

ఉపలబ్ధుమిమే భూయః క్షేత్రం తద్భవవల్లభమ్

అధావన్మాముపాగమ్య మునయస్తీర్థవాసినః

 ఏషామర్ధే తతః సోహం మహేంద్రాదచలోత్తమాత్

భవంతమాగతో ద్రష్టుం సహైభిర్మునిపుంగవైః

తస్మాన్మదర్థ సలిలం సముత్సార్యాత్మనో భవాన్

దాతుమర్హతి తత్క్షేత్రమేషాం తోయే చ పూర్వవత్

జైమినిరువాచ :-

ఇతి తస్య వచః శ్రుత్వా వరుణ్ యాదసాం పతిః

 నీరూప్య మనసా రామమిదం భూయో బ్రవీద్వచః

వరుణ ఉవాచ :-

న శక్యముత్సారయితుం మదంభః కేనచిద్భవేత్

తథా హి మే వరో దత్తః పురానేన విరించినా

 సోహం త్వత్తేజసేదానీం విహాయ సహజం ధృతిమ్

కాతరం సముపాయాతో వశతాం తవ భార్గవ

 ఏషామర్థే విశేషేణ భవతా పరిచోదీతః

కథం న కుర్యాం కర్మేదమహం క్షత్త్రకులాంతక

తస్మాద్యావత్పమాణం మే భవాన్ సంకల్పయిష్యతి

తావత్సంధారయిష్యామీ భూమౌ సలిలమాత్మనః

జైమినీ ఇట్లనెను. నేల గణచి ఈ విధముగా పలుకు వరుణునీ చూచి భృగుకులోహద్వహుఁడయిన రాముడు అస్తమును మరల ఉపసంహరించెను. అస్త్రము నుపసంహరించి, ముందు నిలిచియున్న వరుణుని చూచి, రాముఁడు విగతక్రోధుఁడయి, చిరునవ్వు పొలుపు చూపుచు ఆతనింగూర్చి యిట్లనెను. “ఓ సరితతీ ! ఈ మునీశ్వరులు పూర్వము గోకర్ణవాసులు మహేంద్రాద్రి యందు నివసించు నన్ను కలిసి కొనిరి. పూర్వము సగరాత్మజులు సముద్రముకై మేదినిని త్రవ్వ, ఆ సముద్రోదకమునందు, ఋషి సేవితమయిన గోకరక్షేత్రము, నిమగ్నమైనది. దానిని తిరిగి పొందుటకు. తత్తీర్ణవాసులయిన మునులు నన్ను చేరిరి. తత్క్షేత్రము శివునకు ప్రియమైనది. వారి కార్యార్థము నేను, ఉత్తమమైన మహేంద్రగిరి నుండి నిన్ను చూడగోరి మునీ పుంగవులతో సహితముగా వచ్చితిని. ఆ కారణమున నా కొఱకు నీ యొక్క సలిలమును తొలగించి తత్క్షేత్రమును పూర్వము నీకై నీవు సమర్పింప నరుఁడవు. జైమినీ ఇట్లనెను. అంభఃపతియైన వరుణుఁడు రాముని వాక్యములను వీనేను. మనస్సులో నాలోచించి, రామునితో మరల వరుణుఁడిట్లనెను. “ఎవ్వనిచేగానీ యా నీరమును తొలగించుట సాధ్యము కాదు”. అని పురాణం డైన బ్రహ్మ నాకు వరము నొసంగేను. కానీ నీ తేజస్సుచే నేను సహజమైన ధైర్యమును విడనాడి, కాతరుఁడ నయితిని."నీవశము నొందితిని. ఓ క్షత్రియకులాంతక ! ఆకార్యము నేనెట్లు చేయక యుండగలను? నీవో యీ ఋషీశ్వరుల కొఱకే కార్యము నర్ణింప కాదనగలనే ! అందుచే నీ హృదయమున యావత్రమాణము నీవు సంకల్పించెదవో అంతవట్టు నాయీ నీరము నా భూమిపై నుండి తొలగించెదను.

ఇతి తస్య వచః శ్రుత్వా తథెత్యుక్త్వా స సాయకమ్

యథాగతం ప్రచిక్షేప ధనుర్నిర్భిద్య భార్గవః

 తతో నిరూప్య సీమానం దర్శయానో మహీపతే

స్రువం జగ్రాహ మతిమాన్ క్షేపకామో జలాశయే

ప్రసన్న చేతసం రామం గతరోషమథాత్మని

 అంతర్షితే సరిన్నాథే రామః సువముదబ్ముఖః

భామయిత్వాతివేగేన చిక్షేప లవణార్ణవే

 క్షిప్తత్వేన సముద్ర తు దిశముత్తరపశ్చిమామ్

గత్వా సువో2పతద్రాన్యోజనానాం శతద్వయమ్

 తీర్థం శూర్పారకం నామ సర్వపాపవిమోచనమ్

 విశ్రుతం యత్రిలోకేషు తీరే నదనదీపతేః

తీర్థం తదంతరీకృత్య సువో రామకరాచ్యుతః

 నీపపాత మహారాజ సూచయస్ రామవిక్రమమ్

 యత్రా భూద్రామసృష్టాయా భువో నిషాథ పార్థివ

తీర్థం శూర్పారకం తత్తు శ్రీమల్లోకపరిశ్రుతమ్

ఉత్సారయిత్వా సలిలం సముద్ర స్తావదాత్మనః

 అతిష్ఠదపసృత్యోర్వీం దత్వా రామాయ పార్థివ

అనలిక్రాంతమర్యాదో యథాకాలం భృగూద్వహః

సమయం స్వాపయామాస తస్యైహనుమతే భువి

 విజ్ఞాయ పూర్వసీమాంతాం భువమభ్యుత్ససర్జహ

వ్యస్మయంత సురాః సర్వే దృష్ట్వా రామస్య వీక్రమమ్

సగరగ్రామసీమానః కించిత్మించిత్ క్వచిత్ క్వచిత్

 సహ్యేతు పూర్వవత్తస్మిన్నభేరపసృతేం భసి

తత్ర దైవాత్తధా స్థానాన్నిమత్వాత్స ప్రలక్ష్య తు

తతస్తేషాం భృగుశ్రేష్ఠో మునీనాం భావితాత్మనామ్

యథాభిలషితం స్థానం ప్రదదౌ ప్రీతిపూర్వకమ్

ఆ వాక్యమును భార్గవుఁడు విని 'అట్లే చేయుము'. అని పలికి తన ధనువును, నిర్బేధించి దూరముగా శరములతో దానిని పూర్వస్థానమున నుంచెను. తత్క్షేత్రము యొక్క యెల్లలను మనసా నిర్ణయించుకొని, దానిని నిరూపింపదలచీ, సువమును సముద్రమున పారవైవ చేపట్టెను. రాముని ప్రసన్న చేతసుని, గతరోషునిగా నెంచి, వరుణుడు అంతర్షితుఁడయ్యెను. సముద్రుఁడంతర్షితుఁడు కాగా రాముడుత్తరాభిముఖుఁడై నిల్చెను. ఆ స్రువమును వేగముగా త్రిప్పి సముద్రములోనికి వీసరెను. సముద్రములోనికి వీసరబడి ఆ స్రువము సముద్రములో ఉత్తర పశ్చిమముగా 200 యోజనములు వెడలి, పడిపోయెను. ఆ తీర్థము శూర్పారక మను నామము వహించెను. సర్వ పాప విమోచకము, సముద్రతీరమున అయ్యటీ త్రిలోకముల యందు ప్రఖ్యాతము. రామునీకరము నుండి చ్యుతమైన సువము పడినచోట ఆ పవిత్ర తీర్థము రాముని విక్రమమును సూచించును. రామునిచే నెచ్చట భూమి సృజింపఁబడెనో నది శూర్పారకముగా ప్రతిష్ఠితము. అయ్యది. మూఁడు లోకముల యందు ప్రఖ్యాతము. అందుండి సముద్రుడు తన నీరములను ఉత్సారీంచెను. ఆ స్థలమును రామునీ కొసంగి సముద్రుఁడు వినమ్రుడై నిలిచెను. అనతిక్రాంత మర్యాదుఁడయిన రాముఁడు సముద్రుని తాను చేసిన నిర్ణయమునకు లోబడి యుండజేసెను, అయ్యది భూమికి తూర్పుటెల్లగా దెలిసికొని సముద్రుఁడు అంగీకరించి భూమి నొసంగెను. రాముని పరాక్రమమును చూచి, దేవతలందరాశ్చర్యచకితులైరి. సహ్య పర్వతము నుండి నీరు తొలగినపిమ్మట, ఇందందు పట్టణముల గ్రామముల సరిహద్దులు (ఎల్లలు) పూర్వమువలె నున్నవి. వాని నాతఁడు (రాముఁడు) నిమ్నత్వముచే గుర్తించెను. అంత పవిత్రాత్ములయిన యా ఋషీశ్వరులకు వారభిలషించిన విధముగా, ప్రీతి పూర్వకముగా స్థానము నొసంగెను.

తతస్తే మునయస్సర్వే హర్షేణ మహతాన్వితా

 కృతకృత్యా భృశం రామమాశిషా సమపూజయన్

 అథైతైరభ్యనుజ్ఞాతో యయౌ ప్రాప్తమనోరథః

 గతే మునివరే రామే దేశాత్తస్మాన్నీజాశ్రమమ్

సంభూయ మునయః సర్వే ప్రజగ్ముస్తీరమంబుధేః

పరిచంక్రమ్య తాం భూమిం యత్నేన మహరాన్వీరాః

 దదృశుః సర్వతో రోజన్ హ్యర్థవాంతఃస్థితాం మహీమ్

నిత్యత్వాత్ సర్వదేవానో మధిషానయా తథా

ఖాతమజ్ఞా నిపతితం నష్టతోయం చిరోషితమ్

 అపి రుద్రప్రభావేజ ప్రాయాన్నిత్యంతవిప్లవమ్

తత్త్యనిఃసృతం క్షేత్రమభూత్పూర్వవదేవ హి

 ఏతద్ధి దేవసామార్థమచింత్యం నృపసత్తమ

 ఏవం రామేణ జలధేః పునః సృష్ణా వసుంధరా

 దక్షిణోత్తరతో రాజన్ యోజనానాం చతుశ్శతమ్

నాతిక్రామతి సోద్యాపి సీమానం పయసాం నిధిః

కృతం రామేణ మహతా న తు సజం మహద్ధనుః

ఏవంప్రభావో రామోఖసౌ సగరశ్చ మహీపతిః

 యస్య పుర్రెరయం ఖండో భారతో భౌ నిపాతితః

 యోజనానాం సహస్రంతు వర్ధితశ్చ మహోదధిః

రామేణాభూత్పునః సృష్టం యోజనానాం తు షట్శతమ్

సగరస్య సుతైర్యస్మాద్వార్థితో మకరాలయః

తతః ప్రభృతి లోకేషు సాగరాభ్యామవాప్తవాన్

ఏతత్తేభిహితం సమ్యక్ మహతశ్చరితమ్ మయా

రామస్య కార్తవీర్యస్య సగరస్య మహీపతేః

 ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే

షష్టపంచాశత్తమో ధ్యాయః

అంత మునులందరు అత్యంతోత్కృష్ట హరముతో కృతకృత్యులై రాముని ఆశీస్సులతో పూజించిరి. అంత వారిచే అభ్యనుజ్ఞాతుఁడై ప్రాప్త మనోరథుఁడై యరిగెను. తత్ర్పదేశము నుండి ముని శ్రేష్ఠుఁడయిన రాముఁడు స్వకీయాశ్రమమునకు వెడలగా ఋషులందరు కలిసికొనీ, అంబుధి యొక్క తీరమున కరిగిరి. ప్రయత్న పూర్వకముగా ఆ ప్రదేశము నంతటిని సంచరించి భూమి సముద్ర మందు స్థిరముగా నుండుటకు "కనుగొను కారణము అయ్యది నీత్యమగుట సర్వదేవతాధిష్టానమగుట; అయ్యది త్రవ్వబడి, సముద్రములోపడియు, నష్టమయినను, చిరకాలము అంతర్జలములనున్నను, పాడైపోలేదు. ఇయ్యది రుద్ర ప్రభావమున విష్ణవమును నాశమును పొందలేదు.  నీరు విస్తృతమయి ఆ క్షేత్రము పూర్వము వలెనే యుండెను. ఓ రాజ ! ఇదంతయు దేవతా సామర్థ్యము దానీకి కారణమూహింపలేము. ఈ విధముగా (ఓ రాజా ! ) సముద్రము నుండి భూమి మరల రామునిచే సృష్టింపఁబడినది. దక్షిణోత్తరముగా నది 400 యోజనముల విస్తీర్ణము కలది. ఇప్పటికి సముద్రుఁడు సీమను నతిక్రమింపఁడు. రాముఁడు వింటినీ నుపయోగీంపలేదు. అది సజ్జీకృతము మాత్రమే, రాముని ప్రభావమట్టిది. సగర పుత్రులు భరతఖండమును సముద్రములో కలిపిరి. తన్మూలమున సముద్రము 1000 యోజనములు విస్తరించెను. సముద్రము వృద్ధి పొందెను. మరల రాముఁడో 600 యోజన విస్తీర్ణమయిన వసుంధరను సృష్టించెను. సగర సుతులు సముద్రమును వృద్ధి పొందించుటవలన అప్పటి నుండి యయ్యది సాగర నామమును పొందెను. కార్తవీర్యుని యొక్క రామునియొక్క సగర మహీపతియొక్క చరిత్రము నాచే చెప్పఁబడినది.

ఇది మహాపురాణమయిన బ్రహ్మాండపురాణమున వాయుప్రోక్తము నందు, మధ్యభాగమున, తృతీయమైన ఉపోద్ఘాత పాదమున ఏబది యెన్మిదవ అధ్యాయము.