37 - గృహరాజాంతరకథనం

హయగ్రీ ఉవాచ :

సర్వజ్ఞాద్యంతరాలస్యోపరిష్టాత్కలశోద్భవ

హస్తవింశతిరున్నమం చతుర్నల్వప్రవిస్తరమ్

వశిన్యాద్యంతరం జ్ఞేయం ప్రాగ్వతోపానమందిరమ్

సర్వరోగహరం సామ్నా తచ్చక్రమితి విశ్రుతమ్

వశిన్యాద్యాస్తత్ర దేవ్యః పూర్వాదిదిగనుక్రమౌత్

స్వరైస్తు రహితాస్తత్ర ప్రథమా వశినీశ్వరీ

కవర్గసహితా పశ్చాత్ కామేశ్వర్యాఖ్యవాజ్మయీ

చవర్గజుష్టా వాగీశీ మోదినీ స్యాతృతీయకా

టవర్గమండితాకారా విమలాఖ్యా సరస్వతీ

తవర్గేణ తథోపేతా పంచమి వాక్రధారణా

పవన్డేణ పరిసీతా షష్ఠీ తు జయినీ మతా

యాదవర్ణచతుష్కోణే సర్వైశ్వర్యాదీ వాజ్మయీ

సాధికాక్షరషట్కేన కౌలినీ త్వష్టమి మతా

ఏతా దేవ్యో జపరతా ముక్తాభరణమండితాః

సదా స్ఫురద్గద్యపద్యలహరీలలితా మతాః

కావ్యైశ్చ నాటకైశ్చైవ మధురైః కర్ణహారిభిః

వినోదయన్యః శ్రీదేవీం వర్తంతే కుంభసంభవ

ఏతా రహస్యనామ్నేవ ఖ్యాతా పోతాపీతాపన

నాయికా స్వస్య చక్రస్య సిద్ధనామ్నా ప్రకీర్తితా

అస్య చక్రస్య సంరక్షాకారిణీ ఖేచరీ మతా

వశిన్యాద్యంతరాలస్యోపరిష్టాద్వింధ్యమర్ధన

హస్తవింశతిరున్నమం చతుర్నలప్రవిస్తరమ్

అస్త్రం చక్రమితిజ్ఞేయం తత్ర బాణాదిదేవతాః

పంచ బాణేశ్వరీదేవ్యః పంచ కామేశ్వరాశుగాః

అంకుశద్వితయం దీప్తమాది స్త్రీపుంసయోర్ద్వయోః

ధనుర్ద్వయం చ వింధ్యారే నవ పుండ్రేషు కల్పితమ్

పాశద్వయం చ దీప్తాభం చత్వార్యప్రాణి కుంభజ

కామేశ్వర్యాస్తు చత్వారి చత్వారీ శ్రీమహేశితుః

ఆహత్యాష్ణాయుధానీతి ప్రజ్వలంతి విభాంతి చ

భండాసురమహాయుద్ధే దుష్టదానవశోణితైః

పీతైరతీవ తృప్తిని దివ్యాస్త్రాణ్యతి జాగ్రతి

ఏతేషామాయుధానాం తు పరీవరాయుధాన్యలమ్

వర్తంతే ప్రాంతరే తత్ర తేషాం సంఖ్యా తు కోటిశః

వశక్తిః శతఘ్నీ చ భుశుండీ ముసలం తథా

కృపాణ పట్టిశం చైవ ముద్గరం భిందిపాలకమ్

ఏవమాదీని శస్రాణి సహస్రాణాం సహస్రశః

అష్టాయుధమహాశక్తీ సేవంతే మదవిహ్వలాః

అథశస్త్రాంతరాలస్యోపరీ వాతాపితాపన

హాస్తవింశతిరున్నమం చతుర్నల్వప్రవిస్తరమ్

ధీష్ఠ్యం తు సమయేళీనాం స్థానం చ తీసృణాం మతమ్

కామేశాద్యాస్తత్రదేవ్యప్తిసో _న్యా తు చతుర్ధికా

నైవ నిఃశేషవిశ్వానాం సవిత్రీ లలితేశ్వరీ

తీసూణాం శృణు నామాని కామేశీ ప్రథమా మతా

వజ్రేశీ భగమాలా చ తాః సేవంతే సహస్రశః

సర్వేషాం దర్శనానాం చ యా దేవ్యో వివిధాః స్మృతాః

తాః సర్వాస్తత్ర సేవంతే కామేశాదిమహోదయాః

పీతాసాం చ ప్రసంగేషు విత్యానాం చ ప్రసంజనే

చక్రిణీనాం యోగినీనాం శ్రీదేవీ పూరణాత్మికా

యా కామేశ్వరదేవాంకశాయినీ లలితాంబికా

కామేశ్యాది చతుర్డీ సా నీత్యానాం షోడశీ మతా

యోగినీ చక్రదేవీనాం నవమి పరికీర్తితా

సమయేశ్యంతరాలస్యోపరిషాదిల్వలాంతక

నాథాంతరమితి ప్రోక్తం హస్తవింశతీరున్నతమ్

చతుర్నలప్రవిస్తారం ప్రాగ్వతోపానమండితమ్

తత్ర నాథా మహాదేవ్యా యోగశాస్త్రప్రవర్తకాః

సర్వేషాం మంత్రగురమ సర్వవిద్యామహార్ణవాః

చత్వారో యోగనాథాశ్చ లోకానామిహ గుప్తయే

సృష్టాః కామేశదేవేన తేషాం నామాని మే శృణు

మిత్రీ చ శోడిశ్చవ చర్యాఖ్యః కుంభసంభవ

తైః సృష్టి బహవో లోకా రక్షార్థం పాదుకాత్మకాః

దివ్యవిద్యా మానవోఘసిదౌఘాః సురతాపసాః

ప్రాప్తసాలోక్యసారూప్యసాయుజ్యాదికసిద్ధయః

మహాన్తో గురవస్తాంస్తు సేవంతే ప్రచురా గురూన్

అథ నాథాంతరాలస్యోపరిషాధిష్ఠ్యముత్తమమ్

హస్తమింశతిరున్నమం చతుర్నల్వప్రవిస్తరమ్

నిత్యాంతరమితి ప్రోక్తం నిత్యాః పంచదశాత్ర వై

అథ కామేశ్వరీ. నిత్యా నీత్యా చ భగమాలినీ

నిత్యక్లిన్నా అపి తథా భేరుండా వహ్నివాసినీ

మహావజ్రేశ్వరీ దూతీ త్వరితో కలసుందరీ

నిత్యా నీలపతాకాన విజయా సర్వమంగళా

జ్వాలామాలినికా చీత్రేత్యేతాః పంచదశోదీతాః

ఏతా దేవీస్వరూపాః స్యుర్మహాబలపరాక్రమాః

ప్రథమా ముఖ్యతిథితాం ప్రాప్తి వ్యాప్య జగత్రయాః

కాలత్రితయరూపాశ్చ కాలగ్రాసవిచక్షణాః

బ్రహ్మాదీనామశేషాణాం చిరకాలముపేయుషామ్

తత్తత్కాలశతాయుష్యరూపా దేవ్యాయా స్థితాః

నిత్యోద్యతా నిరతంకాః శ్రీపరాజ్ఞసముద్భవాః

సేవంతే జగతామృధ్యై లలితాం చిత్స్వరూపిణీమ్

తాసాం భవనతాం ప్రాప్తి దీప్తాః పంచదశేశ్వరాః

విసృష్టిబిందుచక్రే తు షోడశ్యా భవనం మతమ్

అథ నిత్యాంతరోస్యోపరిష్ణాతుంభసంభవ

అంగదేవ్యంతరం ప్రోక్తం హస్తవింశతిరున్నతమ్

చతుర్నల్వప్రవిస్తారం ప్రాగ్వతోపానమందిరమ్

తస్మిన్ హృదయదేవ్యాద్యా శక్తయః సంతి వై మునే

హృథేవీ చ శిరోదేవీ శిఖాదేవీ తథైవ చ

వర్మదేవీ దృష్టిదేవీ శస్త్రదేవీ షడ్రితాః

అత్యంతసన్నీకృష్ణాస్తా: శ్రీకామేశ్వరసులువః

నవలావణ్యపూర్ణాంగ్యః సావధానా ధృతాయుధాః

పరితో బిందు పీరేచ భ్రామ్యంతో దృప్తమూర్తయః

లలితాబ్దాప్రవర్తిన్యో వశీనాం పీరవర్తికాః

అథాణిదేవ్యంతరస్యోపరిషాన్మండలాకృతి

బిందునాదమహాపీఠం దశహస్తసమున్నతమ్

నల్వాష్టకప్రవిస్తారముద్యదాతిదిత్యసంనిభమ్

బిందుపీఠమిదం జ్ఞేయం శ్రీపీఠమపి చేష్యతే

మహాపీఠమితి జేయం విద్యాపీఠమహీష్యతే

ఆనందపీఠమపి చ పంచాశత్పీఠరూపధృక్

తత్ర శ్రీ లలితాదేవ్యా పంచబ్రహ్మమయే మహత్

 జాగర్తి మంచరత్నం తు ప్రపంచశ్రయమూలకమ్

తస్య మఇస్య పాదాస్తు చత్వారః పరికీర్తితాః

దశహస్తసమున్నమ్రా హస్తప్రాతయవిష్ఠితాః

బ్రహ్మవిష్ణుమహేశానేశ్వరరూపత్వమాగతాః

శక్తిభావమనుప్రాప్తాః సదా శ్రీధ్యానయోగతః

ఏకస్తు పంచపాదః స్యాజ్జపాకుసుమసన్నిభః

 బ్రహ్మాత్మకః స విశ్లేయో వహ్నిదిగ్భాగమాశ్రితః

చతుర్థో మంచపాదస్తు కర్ణికొరకసారరుక్

ఈశ్వరాత్మాస విజేయ దశదిగ్భాగమాశ్రితః

 ఏతే సర్వే సాయుధాశ్చ సర్వాలంకారభూషితాః

ఉపర్యధస్తంభరూపా మధ్యే పురుషరూపిణ

శ్రీధ్యానమీలితాక్షాశ్చ శ్రీధ్యానాన్నిచ్చలాంగకాః

తేషాముపరీ మంచస్య ఫలకస్తు సదాశివః

వికాసదాడిమచ్ఛాయశ్చతుర్నల్వప్రవిస్తరః

నల్వషట్కాయామవాంశ్చ సదా భాస్వరమూర్తిమాన్

అంగదేవ్యంతరారంభాన్మంచస్య ఫలకావధి

చింతామణిమయాంగానీ తత్వరూపాణి తాపసు

సోపానాని విభాసంతే షత్రింశద్వై నివేశనైః

ఆరోహస్య క్రమేణేవ సోపానాన్యభిదభ్మహే

భూమిరాపోనలో వాయురాకాశో గంధ ఏవ చ

 రసో రూపం స్పర్శతట్టోపస్థాపాయుపదాని చ

పాణివాగ్రాణజిహ్వాశ్చ త్వక్ఫక్షుఃత్రమేవ చ

అహంకారశ్చ బుద్ధిశ్చ మనః ప్రకృతిపూరుషా

నియతిః కాలరాగౌ చ కలా విద్యే చ మాయయా

శుద్ధ విద్యేశ్వరసదాశివశక్తిః శివా ఇతి

ఏతాః షట్రింశదాఖ్యాతాస్తత్వసోపానపంక్తయః

పూషా సోపానపంక్తిశ్చమంతపూర్వదిశం శ్రీతాః

అథ మంచస్యోపరిజ్జిద్ధంసతూలికతల్పకః

హస్తమాత్రం సమున్నత్రం చతుర్నలప్రవిస్తరమ్

పాదోపధానమూర్ధోపధానద్వంద్వవిరాజితమ్

గడ్డూనాం చతుఃషష్టిశోభితం పాటలత్విషా

తస్యోపరిష్ణాత్కేసుంభవసనేనోత్తరచ్ఛదః

శుచినా మృదునా క్లుప్త: పద్మరాగమణిత్విషా

తస్యోపరి వసన్ పూర్వఙ్ముఖో దయయాన్వితః

శృంగారవేషరుచిరస్సదా షోడశవార్షికః

ఉద్యద్భాస్కరబింబాభశ్చతురసస్తిలోచనః

హారకేయూరముకుటకటకాద్యైరలంకృతఃఈ

కమనీయస్మితజ్యోత్స్నాపరిపూర్ణకపోలభూః

జాగర్తి భగవానాదిదేవః కామేశ్వరః శివః

తస్యోత్సంగే సమాసీనా తరుణాదిత్యపాటలా

సదా షోడశవర్షాచ నవయౌవనదర్పీతా

అమృష్టపద్మరాగాభా చందనాజ్ఞనఖచ్ఛటా

యావకశ్రీర్నిర్వ్యపేక్షా పాదలౌహిత్యవాహినీ

కలనిస్వానమంజీరపతత్కంకణమోహనా

అనంగవరతూణీరదరోన్మథనజంఘికా

కరీశుండదోఃకదలికాకాంతితుల్యోరుశోభినీ

అరుణేన దుకూలేన సుస్పర్శేన తనీయసా

అలంకృతనితంబాడ్యా జఘనాభోగభాసురా

అర్ధోరుకగ్రంథమతీ రత్నకాంచీవిరాజితా

నతనాభిమహావర్తత్రివల్లూర్మిప్రభాసరిత్

స్తనకుర్మలహిందోలముక్తాదామశతావృతా

అతిపీవరవక్షోజభారభంగురమధ్యభూః

శిరీషపాదమృదులచ్ఛదాభాంశ్చతురోభుజాన్

కేయూరకంకణశ్రేణీమండితాన్ సోర్మికాంగులీన్

 వహంతీ పతిసంసృష్టశంఖసుందరకంధరా

ముఖదర్పణవృత్తాభచిబుకా పాటలాధరా

శుచిభి: పంక్తిశుధైశ్చ విద్యారూపైర్విభాస్వరైః

కుందకుష్మలలక్ష్మీకెర్దంతైర్దర్శీతచంద్రికా

స్థూలమౌక్తికసన్నద్ధగొనాభరణభాసురా

కేతకాంతర్గలశ్రేణీ దీర్ఘదీర్ఘవిలోచనా

శ్రీ బ్రహ్మాండ మహాపురాణమ్

అర్థందులలితే భాలే సమ్యక్కుర్తాలకచ్ఛటా

పాలీవతంసమాణిక్యకుండలామండితశ్రుతిని

నవకర్పూరకస్తూరీసదామోదితవీటీకా

శరచ్చంచన్నిశానాథమండలీమధురాననాఈఈ

చింతామణీనాం సారేణ క్లుప్తచారుకిరీటికా

స్ఫురత్తిలకరత్నోభభాలనేత్రవిరాజితా

గోఢాంధకారనిబిడ క్షామకుంతలసంహతిః

సీమంతరేఖావిన్యస్తసిందూరశ్రేణిభాసురా

స్ఫురచ్చంద్రకులోత్తంసమదలోలవిలోచనా

సర్వశృంగారవేషాఢ్యా సర్వాభరణభూషితాః

సమస్తలోకమాతా చ సదానందవివర్దినీ

బ్రహ్మవిష్ణుగిరీశేశసదాశివనిదానభూః

- అపాంగరింఖతరుణానిరరీతర్పితాలిలా

భాసతే సా భగవతీ పాపఘ్నీ లలితాంబికా

అన్యదైవతపూజానాం యస్యాః పూజాఫలం విదుః

యస్యాః పూజాఫలం ప్రాహుర్యస్యా ఏవ హి పూజనమ్

తస్యాశ్చ లలితాదేవ్యా వర్ణయామి కథం పునః

వర్షకోటిసహస్రాణాప్యేకాంశో వర్జ్యతే న హి

వర్ణ్యమానాహ్యవాగ్రూషా వాచస్తస్యాం కుతో గతిః1

యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ

బహునా కిమిహోత్తేన తత్వభూతమిదం శృణు

న పక్షపాతాన్న స్నేహాన్న మోహాద్వా మయోచ్యతే

సంతు కల్పతరో: శాఖా లేఖిన్యస్తపసాంనిధే

మషీపాత్రాణీ సర్వేపి సప సంతు మహార్ణవాః

పంచాశత్కోటీవిస్తీర్ణా భూమిః పత్రత్వమృచ్ఛతు

తస్య లేఖనకాలోస్తు పరార్ధ్యాధికవత్సరై

లిఖంతు సర్వే లోకాశ్చ ప్రత్యేకం కోటిబాహవః

సర్వే బృహస్పతిసమా వక్తారో యది కుంభజ

అథాపి తస్యాః శ్రీదేవ్యాః పాదాబైకాంగులిద్యుతే:

సహస్రాంశేషేకైకాంశవర్ణనా నహి జాయతే

అథావా వృత్తిరఖిలా నిష్పలా తద్గుణస్తుతా

బిందుపీఠస్య పరితశ్చతురస్రవయా స్థితా

మహామాయాజవనికా లంజతే మేచకప్రభా

దేవ్యా ఉపరి హస్తానాం వింశతిద్వితయోర్హత

ఇంద్రగోపవితనం తు బద్దం త్రైలోక్యదుర్లభమ్

తత్రాలంకారజాలం తు వర్తమానం సుదుర్లభమ్

మద్వాణీ వర్లయిష్యంతీ కంఠీ, ఏవ క్రియా హతా

సైవ జానాతి తత్సర్వం తత్రత్యమఖిలం గుణమ్

మనసోపి హి దూరే తత్సౌభాగ్యం కేన వర్జ్యతే

ఇత్తం భండమహాదైత్యవధాయ లలితాంబికా

ప్రాదుర్భూతా చీదనలాద్దద్దనిఃశేషదానవా

దివ్యశిల్సిజనైః క్లుప్తం షోడశక్షేత్రవేశనమ్

అధిష్టాయ శ్రీనగరం సదా రక్షతి విష్టపమ్

ఇళ్లమేవ ప్రకారేణ శ్రీపురాణ్యన్యకాన్యపీ

న భేదకో2పి విన్యాసో నామమాత్రం పురాం భిదా

నానావృక్షమహోద్యానమారభ్యేతి క్రమేణ యే

వదంతిశ్రీపురకథాం తే యాంతి పరమాం గతిమ్

ఆకర్ణయంతి పృచ్ఛంతి విచిన్వంతి చ యే నరాః

యే పుస్తకౌ ధారయంతి తే యాంతి పరమాం గతిమ్

యే శ్రీపురప్రకారేణ తత్తత్ స్థానవిభేదతః

కృత్వా శిల్పజనైః సర్వం శ్రీదేవ్యాయతనం మహత్

ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితోపాఖ్యానే గృహరాజాంతరకథనం నామ సప్తత్రింశోధ్యాయః

హయగ్రీవుడనెను : సర్వజ్ఞాద్యంతరాలము యొక్కపైన ఓయగస్త్యా వశిన్యాద్యంతరమున్నదని తెలియవలెను. అది యిరువది మూరల యెత్తెనదీ. పదునారు వందల మూరల విస్తారముగలదీ-1, పూర్వమువలెనే సోపానమందరము. (మెట్లుగల మందిరము) అది సమస్త రోగముల. బోగొటు సర్వరోగహరచక్రము అను పేర ప్రసిద్ధమైనది-2, అచట తూరుపు దక్షిణము మొదలగు దిక్కుల వరుసలో వశిని మొదలగు వారు దేవతలు. వారచట స్వరములు లేని వారు. అందులో మొదటిది వశినీశ్వరి-3. తరువాతది కవర్లతో గూడినది కామేశ్వరుడను వాజ్మయముగలది. ఇక చవర్ధతో గూడిన వాగీశియైన మోదీని మూడవది-4, ట వర్ధతో నలంకరింపబడినది విమలయను సరస్వతి, తవర్గతోనట్లే కూడిన యైదవది వాక్రృధారణ-5, పవరతో పెంపోందిన యారవది జయినీగా సమ్మతము. యకారము మొదలు నాలుగు వర్ణములకోణమున సర్వైశ్యర్యాది వాజ్మయి యుండును. శకారము మొదలు అక్షరములతో నెనిమిదవది కౌలినిగా సమ్మతము. ఈ దేవతలు జపమునందాసక్తలు. ముత్యములసొమ్ముల నలంకరించు కొన్నవారు-7. ఎల్లప్పుడును కదలాడుచున్న గద్యపద్యములనెడి లహరులతో లాలింపబడినవారుగా నిష్టపడినవారు. చెవులకింపైన కావ్యములతోను మధురములైన నాటకములతోను ఓ మునీ! శ్రీదేవిని వినోదింపజేయుచుందురు-8. ఓవాతాపినిజంపీనయగస్త్యా! వీరు తమ రహస్యనామములతోనే ప్రసిద్ధులు. తమ చక్రమునకు నాయిక (స్వామిను)లు. సిద్దనామముతో బిలువబడుదురు-నీ, ఈ చక్రమును సంరక్షించునది ఖేచరియనబడినది. వశిన్యాద్యంతరాలము యొక్కపైన ఓవింధ్యపర్వతగర్వాపహారీ!-10. ఇరువదిమూరల యెత్తె. పదునారు వందలమూరల విస్తారముగల అస్తమను చక్రముగలదు. అచట బాణాదుల దేవతలు-11. ఐదుగురు బాణేశ్వరీదేవతలు, ఐదు కామేశ్వర బాణములు, ఆదిస్త్రీపురుషులైన యిరువురి యొక్క ప్రదీప్తములైన రెండు అంకుశములు రెండు ధనువులును క్రొత్త చేకులలో ప్రకల్పింపబడినవి. (చెఱకు వీండ్లరెండు ధరంచినదని భావము) కాంతులీనురెండు పాశములు, ఓ మునీ! నాలుగస్త్రములును కల్పింపబడినవి-15, కామేశ్వరివి నాలుగు మహేశ్వరునివి నాలుగు, మొత్తము ఎనిమిది యాయుధములు ప్రజ్వలించి ప్రకాశించును-14: ఇవి భండాసురమహాయుద్దమున దుష్టరాక్షసుల రక్తమును ద్రావుటచే మిక్కిలి తృప్తి చెందినవైన దివ్యాస్త్రములు. ఆమెలో నతీజాగరూకములైయున్నవీ-15, ఈ ఆయుధములకు పరీవారాయుధములు చాలినంతగా నున్నవి. ఇంక తక్కిన యస్త్రములు గూడ గలవు. వాటిసంఖ్య కోట్లకొలది-16. వజ్రశక్తి, శతఘ్ని, భుశుండీ, ములసము, కృపాణము, పట్టిశము, ముద్గరము, భిందిపాలకము-17, -ఇవి మొదలగు శస్త్రములు వేనవేలుగలవు. ఇవి మదవివశలైన అష్టాయుధమహాశక్తులను సేవించును-18. ఇక, ఓ మునీ! శస్త్రాంతరాళము (శస్తాగారము 7) పైన ఇరువది మూరలు ఎత్తైనదియు, పదునాఱువందల మూరల విస్తారముగల ఒకనివాస భవనము గలదు. అదీ మువ్వురు సమయేశీ శక్తుల స్థానముగా జెప్పబడినదీ-19. కామేశాదులు ముగ్గురు అచట దేవతలు. తక్కినది చతుర్థిక. ఆమెయే సమస్త విశ్వములను సృష్టించు లలితేశ్వరి-20. ఆ ముగ్గురి నామములను వినుము. అందులో కామేశి మొదటిది. తరువాత వారు వజ్రేశి, భగమాల, వారు వేలరీతులలో సేవింతురు-21. సమస్త దర్శనములకు వివిధ దేవతలైన కామేశ మొదలగు మహోదయలు ఆమెను (లలితను) అటసేవింతురు-22. వీరి ప్రస్తావమును నీత్యాశక్తుల ప్రస్తావమున చక్రిణులకును యోగినులకును శ్రీదేవీ పూరణుస్వరూపిణీ-23. కామేశ్వరదేవుని తొడపై పరుండు లలితాంబిక కాశమేశ్యాదులలో నాలుగవది. ఆమె నిత్యాశక్తులలో పదునారువది అనబడినదీ-24. యోగిని చక్రదేవతలలో తొమ్మిదవదనబడినది. ఓ ఇల్వలసంహారీ! సమయేశియంతరాల (మద్యదేశము)ముపైన నాథాంతరమను భవన ప్రదేశముగలదు. అదీ యిరువది మూరల యెత్తైనది. పదునాఱువందల మూరల విస్తారముగలది. పూర్వభవనములవలెనే మెట్లతో నలంకరింపబడినదీ-25, 26, అచట, కామేశదేవునిచే నీ లోకముల రక్షించుటకై సృష్టించబడిన నలుగురు యోగనాథులున్నారు. అచటి నాథలు మహాదేవి యొక్క యోగశాస్త్ర ప్రవర్తకలు. అందరికిని మంత్రగురువులు. సర్వవిద్యలకు మహా సముద్రమువంటివారు (నిధులు). వారి నామములను వినుము-27.28. మిత్రి, శోడిశుడు, చర్యుడు, ఓ మునీ! వారిచేత రక్షకోజకై పాదుకాత్మకములైన యనేకలోకములు సృష్టింబడినవి-29. దివ్యవిద్యలుగలవారు, మానవ సమూహములు సిద్ద సమూహములు, సురులు, తాపసులను సాలోక్య సిద్ధిని, సారూప్యసిద్దీని, సాయుజ్యసిద్ధిని బొందిన వారును-30. గొప్పగురువులు, వీరనేకులై గురువులను సేవింతురు. తరువాత నాథాంతరాలముయొక్కపైన యుత్తమనివాస గృహము గలదు-30,31. అదీ కూడ నీరువదీమూరల యెత్తైనది. పదునాఱువందల మూరల విస్తారముగలది. అదీ నీత్యాంతరమనబడిన నిత్యాశక్తీ, మందిరము. ఇచటి నీత్యాశక్తులు పదునైదుగురు-32. ఇక కామేశ్వరి నిత్య, భగమాలినీ నిత్య, నీత్యక్లిన్న, భేరుండ, వహ్నివాసినీ-33. మహావజ్రేశ్వరి, దూతీ, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలినిక, చిత్ర-వీరు పదునైదుగురు అనబడిరి. వీరు దేవీ స్వరూపలు, మహాబలపరాక్రమవతులు-35. ప్రథమనే (ప్రతిపదనే) ప్రధానతిథిగా బొందినవారు, ముల్లోకములను వ్యాపించినవారు, భూత-భవిష్యత్-వర్తమాన కాలస్వరూపలు, కాలమును మ్రింగు పండితలు (యమునీ మ్రింగుపండితలు)-36, చాలాకాలమును బొందగోరు బ్రహ్మాది సమస్తులకు వారివారి శతాయుష్యరూపలై దేవియాజ్ఞచే నుండిరి-37. నిత్యప్రయత్నశీలలు, నిర్భయలు, శ్రీదేవి పరాంగమునుండి బుట్టినవారు-వీరు జగముల సంపద్వధీకై చిత్స్వరూపిణియైన లలితను సేవింతురు-కర్. వారి భవన రూపములనంది ప్రకాశించినవారు పదునైదుగురైన ఈశ్వరలు. సృష్టి బిందుచక్రమున షోడశియొక్క భవనమున్నది-39. ఇక, ఓ మునీ! నీత్యోంతరాలము యొక్కపైన అంగదేవ్యంతరము (అంతరము=భవనములదు. అదీ యిరువది మూరల యత్తైనది-40, పదునారు వందల మూరల విస్తారముగలది. పూర్వమువలె సోపానము గల మందిరము. ఓ మునీ! దానియందు హృదయదేవి మొదలగు శక్తులుండును-41. హృదయదేవి, శిరోదేవి, శిఖాదేవి, వర్మదేవి, దృష్టిదేవి, శస్త్రదేవి, అని హృదయదేవ్యాదులు ఆరుగురు అనబడిరి-41, 42, ఆ కామేశ్వర స్త్రీలు మిక్కిలి దగ్గరివారు, కొత్తయందము నిండిన యంగములు గలవారు. సావధానలు, ఆయుధములు ధరించినవారు-43. బిందు పీఠమున చుట్టును తిరుగుచున్నవారు మదించినయాకారముగలవారు. లలితాదేవి. యాను . ప్రవర్తింపజేయువారు; ఇంద్రియములను వశమునందుంచుకొన్నవారి యొక్క పీఠములందుండువారు-44 ఇక అంగదేవ్యంతరమునకు పైన మండలాకారమున బిందునాదమహా పీఠము గలదు. అది పదీ మూరల యెత్తైనది-45. ముప్పది రెండు వందల మూరల విస్తారముగలది. ఉదయించు సూర్యుని బోలినదీ.. దీనిని బిందుపీరమని తెలియవలె, అదీ శ్రీపీఠమని కూడా పిలువబడును-46, మహాపీఠమని తెలియవలె. విద్యాపీఠమని కూడ బిలువబడును. ఏబది పీఠములు ధరించునానందపీఠమనీ కూడాచెప్పబడును-47, పంచబ్రహ్మమయమైన యాయానందపీఠమున ముల్లోకములకు మూలమైన పంచరత్నము (ఐదు రత్నములుగల గొప్ప మంచము వెలుగుచుండును-48. ఆమంచము (సింహాసనము) యొక్క కాళ్ళు : నాలుగు. అవి పది మూరల యెత్తైనవి. మూడు మూరల విస్తారముగలవి-49. అవి బ్రహ్మ-విష్ణు-మహేశాన-ఈశ్వర రూపములు. ఎల్లప్పుడు శ్రీదేవియొక్క ధ్యానయోగము చేత శక్తిభావమును బొందినవి-50, అందులో నొకటి మైదుపాదములుగలది. మందార పుష్పములతో సమానముగా నెల్లనైనదీ. అది బ్రహ్మాత్మకమనీ యెరుగవలెను. అదీ ఆగ్నేయదిగ్భాగముసాశ్రయించియుండును-51. నాలుగవ మంచపాదము- కొండగోగుపూవుసారవుకాంతి గలది. (వచ్చనైనది). అదీ. ఈశ్వరాత్మకమని యెఱుగవలె.. ఈశాన్యదిగ్భాగమునాశ్రయించినది-52. వీరందరు సర్వాయుధులు: సర్వాభరణభూషితులు. పై భాగమునను క్రిందుభాగమునను. స్తంభరూపముగలిగి మధ్యన పురుష రూపములుగలవి-53. వారు శ్రీదేవి ధ్యానమున మూసుకొన్న కన్నులుగల వారు. శ్రీదేవీ ధ్యానముననే నిశ్చలమైన శరీరముగలవారు. వారిపైన మంచముయొక్క ఫలకము సదాశీవుడు-54. విచ్చినదానీమ్మ (పండు) కాంతిగల ఫలకము) అదీ పదునారు వందల మూరల విస్తారముకలది-ఇరువది నాలుగు వందల మూరల పొడవైనది. ఎల్లప్పుడు ప్రకాశించునా కారముగలదీ-55. అంగదేవతల యంతర(భవనము మొదలుకొని మంచము యొక్క ఫలకము వరకు చింతామణులతో నిర్మింపబడి తత్త్వరూపములైన (చింతామణి రూపములైన) మెట్లు ముప్పదియాఱు వినివేశములతో (ద్వారములతో) వెలుగుచుండెను. ఆరోహక్రమముననే (ఎక్కునప్పటిక్రమముననే) మెట్లను జెప్పుచున్నాను-57. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము, గంధము, రసము, రూపము, - స్పర్శము, శబ్దము; ఉపస్థ, పాయువు, పాదములు-58, చేతులు, వాక్కు ఝణము, జిహ్వ, త్వక్కు నేత్రము, శ్రోతము, అహంకారము, బుద్ధి, మనస్సు, ప్రకృతి, పురుషుడు-59. నియతి, కాలము, రాగము, కళ, విద్య, మాయ, శుద్దవిద్య, ఈశ్వరసదాశివశక్తి శివ-అను-60. నీ ముప్పదియాఱు తత్త్వసోపాన పంక్తులుగా జెప్పబడినవి, మంచమునకు తూరుపు దిక్కున పూషసోపానపంక్తియని చెప్పబడినది-61. ఇక మంచము యొక్క పైన హంసతూలికాతల్పముగలదు. అది ఒక మూరెడు మాత్రమెత్తైనది. పదునారు పందల మూరల విస్తారముగలది-62 రెండేసి కాళ్లదిండ్లతోను తలదిండ్లతోను ఒప్పినది. అరువది నాలుగు గడ్డకముల యొక్క (బంగారు పాత్రలయొక్క-చెక్కిన చేపపిల్లల యొక్క యెళని కాంతితో బ్రకాశించినది-63, దానికి పైన కుసుమపూవు రంగుగల వస్త్రముచే నుత్తరీయము గలదు. అది పద్మరాగమణీ కాంతిగలది. పవిత్రమైనది. మెత్తనైనది-64. దానికిపైననుండుచు భగవంతుడై యాదిదేవుడైన కామేశ్వరుడను శివుడు. వెలుగుచుండును. అతడు తూరుపుమొగమై యుదయముతో గూడినపోడు శృంగారవేషమున మెరయుచున్న వాడు, ఎల్లప్పుడును పదునారేండ్ల ప్రాయమువాడు-65. ఉదయించు సూర్యబింబము వలె వెలగువాడు. నాలుగు చేతులు మూడుకన్నులు గలవాడు. హారములు, భుజకీర్తులు, కిరీటము, కంకణములు మొదలైనవానితో నలంకరింపబడినవాడు-66, మనోహరమై చిరునవ్వు వెన్నెల నిండిన చెంపలు గలవాడు-67. అతని తొడపై కూర్చొని పాపఘ్నియై భగవతీయైన లలితాంబిక ప్రకాశించుచున్నది. ఆమె బాల సూర్యునివలై నెల్లగా నున్నది. ఎప్పుడును పదునాండ్ల ప్రాయముగలది. నవయౌవనమునముదించిన-68. అమలిన పద్మరాగమణి కాంతిగలది. ఎట్టకమలమువంటి నఖకాంతులు గలది, లత్తుక శోభయవసరములేక సహజముగనే యెలుపును ప్రవహించు పాదములుగలది-69. మధుర ధ్వనిగల చిరుగజ్జిల బడుచున్న కంకణములతో మోహింపజేయునది, మన్మధుని శ్రేష్టమైన యమ్ములపొదుల మదమడంచు పిక్కలు గలది-70. ఏనుగతొండమువంటి చేతులు, అరటిస్తంభముల వంటి తొడలును గలది. మెత్తని యెఱని చిన్నని పట్టు వస్త్రముచే నలంకరింపబడిన పిరుదులుగలది. మణికట్టుయొక్క వైశాల్యముతో బ్రకాశించినదీ-71. సగముతోడలను గప్పు వస్త్రపుముడి గలది. రత్నముల మొలనూలుతో ప్రకాశించినది. ఆమె లోతైన నాభియను సుడిలో తీవకులను నలలకాంతీయను ప్రవాహము(నదిXగలది-72. మొగ్గవంటి చనుమొనలపై తూగాడు నూర్ణముతాల్యహారములు గలది-73. దిరిసెనపూవు రేకు కాంతి వంటికాంతీ గల నాలుగు భుజములు గలది. ఆ భుజములు భుజకీర్తులతోను, కంకణపంక్తులతోను అలంకరింపబడినవి. ఉంగరములుగల వ్రేళ్ళుగలవి. ఇట్టి భుజములు గలది. పతిచేయితాకి యున్న శంఖము వలె సుందరమైన కంఠముగలది-75. ముఖమనునద్ధమున గుండ్రముగానున్న గదువగలది. ఎట్టుని పెదవులు గలది. శుభ్రములు, వరుసలో శుద్దములు, విద్యాస్వరూపములునై ప్రకాశించునవి, మల్లెమొగ్గల శోభలో మెరయుచున్నవియు నైన పండ్లచే (దంతములచే) వెన్నెలల విరజిమ్మునది-76. లావైన ముత్యముల గ్రుచ్చినయనేకాభరణములతో ఐకాశించినది. మొగిలిపూవులోపలి దళముల వరుసలవలె మిక్కిలి పొడవైన కన్నులుగలది-77. అర్ధచంద్రునివలె సుందరమైన ఫాలభాగమున చక్కగా వాలిన ముంగురుల సమూహము గలది. చెవికమ్మలతోడి మణికుండలములతో నలంకరింపబడిన చెవులుగలది-78. కొత్త కర్పూరకస్తూరీలతోనెల్లప్పుడు సుగంధముగల తమలపాకు విడేము గలది. తిలకముగానున్న రత్నమువలె బ్రకాశించు ఫాలనేత్రముతో విరాజిల్లినది-80. గాఢాంధకారమువలె దట్టమైన సన్నని, వెంట్రుకల సమూహములుగలది. సీమంతరేఖలో నిడిన సిందూరరేఖతో వెలుగుచున్నది-81. తలపై మెలియుచున్న చంద్రకళ నలంకరించుకోన్నది. మదముతో చంచలములైన కన్నులుగలది. సమస్త శృంగారవేషములలో నొప్పినది, సమస్తాభరణములనలంకరించికొన్నదీ-82. సమస్త - లోకములకు " తల్లియైనదీ. సదానందమును వర్ధిల్లిచేయునది. బ్రహ్మ-విష్ణు-గిరీశ-ఈశ-సదాశివులకు మూలకారణమైనది-83. తనకడకన్నులలో జాలుపోరు-కరుణాప్రవాహముననందరినీ: సంతసింపజేయునది. ఇట్టి లలితాంబ కామేశ్వరాంకమున బ్రకాశించుచున్నది-84. ఇతర దైవతముల పూజలకు ఆమె (లలితా) పూజ ఫలమని పెద్దలు తెలియుదురు. ఆమె పూజకు ఫలము ఆమె పూజయేయని కూడ అందురు-85 కోట్ల వేల యేండ్లలో గూడ సామ్యొక్క ఒక్కయంశము గూడ వర్ణింపనలవిగాదు. ఇక లలితాదేవిని సంపూర్ణముగా నేనెట్లు వర్ణింపగలను-86. ఆమె వాక్కులకు మించిన రూపముగలది. ఇక ఆమెను వర్ణించుటకు వాక్కులెట్లు సమర్థమగును? వేదము “యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ (అన్నీ వాక్కులును. మనస్సుతో సహా ఆమెను పొందలేక మరలి వచ్చినవి). అనీ, వేదము జెప్పినదిగదా! -87. పెక్కులు చెప్పనేల! తత్వ(నిజ)మైన విషయమును వినుము దీనిని పక్షపాతమునగాని, స్నేహమునగాని, మోహమున (భ్రాంతితో గానీ నేను చెప్పుటలేదు-86, ఓ తపోనిధీ! కల్పతరువు శాఖలు లేఖలు (కలములు)అగుగాక. ఏడు మహాసముద్రములన్నియు మషీషాత్రములు (సిరాబుడ్లు) అగుగాక-89. ఏబది కోట్ల యోజనములు) విస్తీర్ణముగల భూమి పత్రము (కాగితము) అగుగాక, దాని లేఖన కాలము సంఖ్యలో చివరి సంఖ్యతో లెక్కించిన కాలము వరకు (సంఖ్యాప్రమాణము ఏకాది పరార్ధ పర్యంతము అని ఆంతవరకు శాస్త్రకారులు చెప్పుదురు) అగుగాక-90. సమస్తలోకములు ప్రత్యేకముగా కోటి (అనంత )బాహువులు వ్రాయుగాక, ఓ యగస్త్యా! చెప్పువారందరు బృహస్పతి సమానులైనను సరే!-91. ఐనను ఆ శ్రీదేవి యొక్క కమలము.వంటీ. పాదములోని ఒక్క వ్రేలి వెలుగుయొక్క వేయి యంశలలో ఒక చిన్ని యంశము యొక్క వర్ణనము గూడ వర్ణింపబడదు. మొత్తముపైన ఆమె గుణములను స్తుతించుటలో ప్రవృత్తియంతయు నిష్పలము. (ఇచట పుష్పదంతకృత శివమహిమ్నస్తోత్రపద్యము స్మరింపనగును)

అసితగిరినిభం స్యాత్మజ్ఞలం సింధు పాత్రం,

సురతరువరశాఖా లేఖినీ, పత్రపురీ,

 లఖతి యది గృహీత్వా శారదా సార్వకాలమ్

తదపి తవ గుణానామిశ! పారం న యాతి

ఈ రెంటిలో దేనికేది మూలమో నిక్కముగా దెలియదు, పౌరాణికమే మూలముగా నోపును. ఇందులోని ఐృహస్పతి సములను శారదగా సంస్కరించుట జరిగినది. శారద లిఖించుట మహోన్నత భావన. అదియు, పారమునందదనుట మరింత మహోన్నతము.) బిందుపీఠముచుట్టను చదరముగా మహామాయాజవనిక వ్రేలాడుచుండును. అది నల్లని కాంతిగలది-93. దేవియొక్కపైన నలుబది మూరలయెత్తున ముల్లోకములలోను దుర్లభమైన ఇంద్రగోప వీతానము (ఆర్ల పురుగుల రంగుగల చందుకటు, చాందినీ, దోమతెర) కట్టబడినది-94.. అచటనున్న యలంకార సమూహము ముల్లోకములలో దుర్లభము. వానీని వర్ణింపబోవుచునా వాడి సిగ్గున కంఠముననే అడ్డీ రాకున్నది-95, అచటి సమస్తమును ఆమెయే తెలియును, అచటి సౌభాగ్యమునెవడు వర్ణింపగలడు?-96. ఈ విధముగా లలితాంబిక భండదైత్యవధకోఱకై జ్ఞానాగ్నినుండి బుట్టినది. ఆమె సమస్తదానవులను నిశ్శేషముగా దహించివైచినది-97. దివ్యశిల్పులచే నిర్మింపబడిన పదునారు క్షేత్రములు గల భవన రూపమైన శ్రీ నగరమును అధిష్టించి యెల్లప్పుడు జగమును రక్షించును-98 ఈ విధముగనే తక్కిన శ్రీపురములు గూడ గలవు. ఆపురములలో భేదము లేదు. పేరు మాత్రమే వేరు-99. నానా వృక్షములుగల మహోద్యానము మొదలు క్రమముగా శ్రీపుర కథను జెప్పువారు పరమగతిని బొందుదురు-100. వినువారు, అడుగువారు, వెదకువారు ఆమెస్తోత్రచరిత్రాది పుస్తకములను ధరించువారును పరమగతి- బొందుదురు-101. శ్రీపుర పద్దతిలో ఆయాసాన విభేదములు - జూపుచు శిల్పిజనులచే శ్రీదేవియొక్క మహాభవనమును నిర్మింపజేయువారును పరమగతిని బొందుదురు-102.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరభాగమున హయగ్రీవోగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున గృహరాజాంతరకథనమను ముప్పది యేడవ యధ్యాయము 37