బ్రహ్మాండ మహా పురాణము
9 - పితృకల్పము శ్రాద్ధకర్మాదుల నియమములు
ఋషయ ఊచుః :-
కథం ద్వివారావుత్పన్నా భవానీ ప్రాక్సతీ తు యా ।
ఆ సీద్దాక్షాయణీ పూర్వముమా కథ మజాయత ॥
మేనాయాం పితృకన్యాయం జనయచ్ఛేలరాట్ స్వయమ్ ।
కే వై తే పితరో సోమ యేషాం నా తు మానసీ ॥
మైనాకశ్చైవ దౌహిత్రో హీత్రీ చ తథా హ్యుమా ।
ఏకపర్ణా తథాచైవ తథా చైవైకపాటలా ॥
గంగా చాపి సరిఛ్ఛేష్ణా సర్వాసాం పూర్వజా తథా ।
సర్వమేతత్త్వయోద్దిష్టం నిర్దేశం తస్య నో వద ॥
శ్రోతుమిచ్ఛామీ భద్రం తే శ్రాద్ధస్య చ విధిం పరమ్ ।
పుత్రాశ్చ కే స్మృతాస్తేషాం కథం చ పితరస్తు తే॥
కథం వా తే సముత్పన్నాః కిం సోమాసః కీమాత్మకాః ।
స్వర్గా వై పితరో హ్యేతే దేవానామపి దేవతాః ॥
ఏవం వేదితుమిచ్ఛామీ పితృణాం సర్గముత్తమమ్ ।
యథా చ దత్తమస్మాభిః సార్థం ప్రీణాతి వై పితృన్ ॥
యదర్థం తే న దృశ్యంతే తత్ర కిం కారణం స్కృతమ్ ।
సరే తు కే చ వర్తంతే పితరో నరకే చ కే ॥
అభిసంభాష్య పితరం పితుశ్చ పితరం తథా ।
ప్రపితామహం తథా చైవ త్రిషు పిండేషు నామతః ॥
నామ్నా దత్తానీ శ్రాద్దాని కథం గచ్ఛంతి వై పితన్ ।
కథం చ శక్తాస్తే దాతుం నరకస్థాః ఫలం పునః ॥
కే చ తే పితరో సామ కాన్యజామో వయం పునః ।
దేవా అపి పితృన్ స్వర్గే యజంతీతి హి నః శ్రుతమ్ ॥
ఏత దిచ్ఛామి వై శ్రోతుం విస్తరేణ బహుశ్రుతమ్ ।
స్పష్టాభిధానమపి వై తద్భవాన్వక్తుమర్హసి ॥
సూత ఉవాచ:-
అత్ర వో కీర్తయిష్యామీ యథాప్రజ్ఞం యథాశ్రుతమ్ ।
మన్వంతరేషు జాయంతే పితరో దేవసూనవః ॥
అతీతానాగతాః శ్రేషాః కనిష్టాః క్రమశస్తు వై ।
దేవైః సార్ధం పురాతీతోః పితరో న్యేంతరేషు వై ॥
వర్తంతే సాంప్రతం యే తు తానై వక్ష్యామి నిశ్చయాత్ ।
శ్రాద్ధక్రియాం మనుశ్చేషాం శ్రాద్ధదేవః ప్రవర్తయేత్ ॥
ఋషులిట్లనిరి :
పూర్వజన్మలో దక్షుని కూతురుగా భవాని సతిగా జన్మించెను. ఆమె రెండవ పర్యాయము ఉమగా ఎట్లుద్భవ మొందెను. పితృదేవతల కూతురయిన మేనక యందు శైలరాజు ఆమెను కనెను. ఆ పితరులెవ్వరు? పితరులకు మానసిక పుత్రిక మేనక కదా? వారి మనుమఁడు మైనాకుడు; వారి మనుమరాలు ఉమ (దౌహిత్రుఁడు మైనాకుడు, దౌహిత్రి ఉమయునైన, ఆ పితరులేవ్వరు). ఏకపర్ణ, ఏకపాటల, నదులలో శ్రేష్ఠురాలయిన గంగయు పితరుల దౌహిత్రులు. హిమాలయుని యొక్క కూతుండ్రలో గంగ పెద్దది? ఇదియంతయు నీచే నిర్దేశింపఁబడవలయును. మాకు దానీనీ వివరింపుము. [4) నీకు మంగళముగు గాక ! శ్రాద్ధ క్రియా విధిని గూర్చి వినగోరుచున్నాడు. వారెవరి పుత్రులుగా స్మరింపం బడిరి? వారెట్లు పీతరులయిరి? వారెట్లు సముత్పన్నులయిరి? వారి నామములెవ్వి? వారి స్వభావమెట్టిది? స్వర్గమున దేవతలయిన వారికి వారు పితరులా? ఈ విధముగా పితరుల యొక్క యుత్తమోత్తమమయిన సృష్టిని (జననమును) తెలిసికొనుటకు కోరుచున్నాను. మేమొనరించు శ్రాద్ధములు వారలనెట్లు తృప్తి పరచుచున్నవో, తెలియగోరుచున్నాము. (7).పితరులు అదృశ్యులుగా నేలయుండిరి? అట్లుండుటకు కారణమేదిగా స్మృతులలో చెప్పఁబడుచున్నది? స్వర్గము నందు ఏ పితరులుందురు? నరకము నందెట్టి వారుందురు. (8) పితరుని, పితామహుని, ప్రపితామహుని యొక్క నామముల నుచ్చరించుచు పెట్టబడిన మూఁడు పిండములు ఎట్లు పీతరులకు చేరును? వారొక వేళ నరకములో నున్నచో ఆ పితరులెట్లు ఫలితము లోసంగు ఆశీర్వచనముల నీయ సమర్ధులు? (10) పితరులన్న వారెవరు? ఎవ్వరీని మనము పూజింపవలయును స్వర్గమున దేవతలు కూడ పితరులను పూజింతురనీ మేము విందుము. ఇంతకుం బూర్వము పలువురచే విని యున్న వారిని గూర్చి వివరముగా వినగోరెదను. వారు స్పషాభిధానులు. అయినను వారిని గూర్చి చెప్పుటకు నీవరుండవు.(12)
సూతుఁడిట్లు చెప్పెను ;
నా శక్తి కొలది, నేను విన్న విధానము ననుసరించి, నా బుద్ధిని పురస్కరించుకొని నేను చెప్పెదను. పితరులు దేవసూనులు. (దేవతల బిడ్డలు). వారు మున్వంతరములందు పుట్టుచున్నారు. (13) ఇంతకు పూర్వమే వచ్చిన వారు (అతీతులు). ఇంకను రావలసిన వారు (అనా గతులు) క్రమముగా శ్రేష్టులు కనిష్టులు. ఇతర మన్వంతరములందు, పీతరులు దేవతలతో సహితముగా వెళ్లియుండిరి. ఇప్పుడు (సాంప్రతం) ఏ పితరులు వర్తమానమున నుండిరో వారిని గూర్చి చెప్పెదను. శ్రాద్ధ దేవుఁడు మనువు. ఆ శ్రాద్ధ దేవుఁడే వారికి (పితరులకు) శ్రాద్ధ క్రియను ప్రవర్తిలఁజేయును. (15)
దేవాన్ సృజత బ్రహ్మా మాం యక్ష్యంతీతి చ ప్రభుః ।
తముత్సృజ్య తదాత్మానమయజంస్తే ఫలార్థినః ॥
తే శప్తా బ్రాహ్మణా మూఢ నష్టసంజ్ఞా భవిష్యథ ।
తస్మాత్మించిన జానీత తతో లోకేషు ముహ్యత ॥
తే భూయః ప్రణతాస్సర్వే యాచంతి స్మ పితామహమ్ ।
అనుగ్రహాయ లోకానాం పునస్తానబ్రవీత్ర్పభుః ॥
ప్రాయశ్చిత్తం చరధ్వం వై వ్యభిచారో హీ వః కృతః ।
పుత్రాస్ స్వాన్ పరిపృచ్ఛధ్వం తతో జ్ఞానమవాప్స్యథ ॥
తతస్తే స్వసుతాంశ్చైవ ప్రాయశ్చిత్తజీఘృక్షవః ।
అపృచ్చన్నంయతాత్మానో విధివచ్చ మిథో మీథః ॥
తేభ్యస్తే నీయతాత్మానః పుత్రాః శంసురనేకధా ।
ప్రాయశ్చిత్తాని ధర్మజ్ఞా వాజ్మనః కర్మజాని చ ॥
తే పుత్రానబ్భవసీతా లభిసంజ్ఞా దివాకసః ।
యూయం ఫై పితరో స్మాకం టైర్వయం ప్రతిబోధితాః ॥
ధర్మం జ్ఞానం చ వైరాగ్యం కో వరో వః ప్రదీయతామ్ ।
సపుత్రానబ్రవీద్రహ్మా యూయం వై సత్యవాదినః ॥
తస్మాద్యదుక్తం యుష్మాభిస్తత్తథా న తదన్యథా ।
ఉక్తం చ పితరోస్మాకం చేతి వై తనయాః స్వకాః ॥
పితరస్తే భవిష్యంతి తేభ్యోలయం దీయతాం వరః ।
తేనైవ వచనో తే వై బ్రహ్మణః పరమేష్ఠినః ॥
పుత్రాః పితృత్వమాజగ్ముః పుత్రత్వం పిశరః పునః ।
తస్మాత్తే పితరః పుత్రాః పితృత్వం తేషు తత్ స్మృతమ్ ॥
ఏవం స్మృత్వా పిత్యన్ వుత్రాః పుత్రాంశ్చైవ పితృంస్తథా ।
వ్యాజహార పునర్రహ్మా పితృనాత్మవివృద్ధయే ॥
మో హ్యనిష్టానితన్ శ్రాధే క్రియాం కాంచిత్కరిష్యతి ।
రాక్షసా దాశవాశ్చైవ ఫలం ప్రాప్స్యంతి తస్య తత్ ॥
శ్రాద్ధారాప్యాయితాశ్చైవ పితరః సోమమవ్యయమ్ ।
ఆప్యాయమానా యుష్మాభిర్వర్థయిష్యంతి నిత్యశః ॥
శ్రాద్ధారాప్యాయితః సోమో లోకానాప్యాయయిష్యతి ।
కృత్స్నం సపర్వతవనం జంగమూ జంగమైర్యతమ్ ॥
శ్రాద్ధాని పుష్టికామాశ్చ యే కరిష్యంతి మానవాః ।
తేభ్యః పుష్టిం ప్రజాశ్చైవ డాస్యంతి పితరః సదా ॥
శ్రాద్ధే తేభ్యః ప్రదాస్యంతి త్రీన్పిండోన్నామగోత్రతః ।
సర్వత్ర వర్తమానాస్తే పితరః ప్రపితామహాః ॥
దేవతలు తన్ను పూజింతురని బ్రహ్మ దేవతలను సృజించెను. ఆతనిని విసర్జించి ఆ దేవతలు ఫలార్థులగుట తమ్ము తామే పూజించుకోనిరి. (16) “మీరు మూఢులు, నష్ట సంజులు కాగలరని బ్రహ్మచే వారు శపింపఁబడిరి. అందుచే మీకు ఏమియు తెలియదు. లోకములందు మీరు మూఁ ఢులగుదురు.” అని బ్రహ్మ శపించెను. (17) అంత వారు మరల మరల బ్రహ్మకు నమస్కరించి క్షమింపుమని ప్రార్థించిరి. లోకానుగ్రహము కొఱకు బ్రహ్మ మురల వారితో పలికెను. (18) “మీరు ధర్మ వ్యభిచార మొనర్చితిరి. తత్పాపపరిహారమునకు ప్రాయశ్చిత్త మొనర్పుఁడు. మీరు మీ పుత్రులను పరిపృచ్చింపుఁడు. తన్మూలమున జ్ఞానమును పొందుఁడు. (19) అంత వారు ప్రాయశ్చిత్తము నొనరింపఁగోరి, నియతాత్ములయి రహస్యముగా పుత్రులను అడిగిరి. (20) వారల కొఱకు వియతాత్ములయిన కుమారులు వాజ్మనఃకరజములయిన ఫాష నివారణము కోకు ధర్మజులగుట ప్రాయశ్చిత్తముల నుడివీరి. (21) లబ్ది సంజులు జ్ఞామలువయిన దీనౌకసులు ప్రీతులయి వారల కుమారుల నిట్లడిగిరి - “నిజముగా మీరు మా పితరులు : ఏలయన ధర్మమును గూర్చి, విజ్ఞానమును గూర్చి, వైరాగ్యమును గూర్చి ప్రపంచ వస్తువు గూర్చి మీవలన మేము ప్రబోధితులమైతిమి. మీకెట్టీ వరమును మేమొసంగవలయును?” మరల బ్రహ్మ పలికెను. నీజముగా మీరందరు సత్యవాదులు. అందుచే, మీరేది చెప్పితిరో యది సత్యమగును. అన్యధా కాదు. ఇది మీరు చెప్పినది - మీ కుమారులనే మీరు మీ పితరులుగా చెప్పి యుంటిరి”. వారు మీ పితరులగుదురు. ఈ వరము మీరు వారికీయుడు”. పరమేష్టియయిన బ్రహ్మయీ విధముగా పల్కియుండిన కారణముచే, కుమారులు పితృత్వ స్థితి నొందిరి. మరి తండ్రులు పుత్రత్వ స్థితి నందిరి, అందుచే ఆ కుమార పితరుల కియ్యది ధర్మశాస్త్రములో చెప్పఁబడిన పితృకుమారుల స్థితిత్వము. (26) ఈ విధముగా ఊపుత్రులు పీతరులు, పితరులు పుత్రులు” అని బ్రహ్మ వచించిన తరువాత బ్రహ్మ మరల “పీతరుల ఆత్మవృద్ధి కొఱకు నిట్లు పలికెను. (27) ఎవరయిన అనిష్టులయిన పితరులకు శ్రాద్ధ మాచరించినచో తత్పలితమును రాక్షసులు దానవులు పొందుదురు. (28) శ్రాద్దముల వలన ఆప్యాయితులయి, అవ్యయుఁడయిన సోముని దీనదినము వృద్ధి పొందించుచు, పీతరులు వృద్ధి పొందుదురు. చంద్ర దేవుఁడయిన సోముఁడు, శ్రాద్ధ క్రియల వలన వృద్ధినీ బలమును పొంది, ప్రజలను వృద్ధి పొందించును. అంతియేకాక చరాచరాత్మక వస్తు సముదాయమయిన పర్వతాదులతో గూడియున్న యావత్రపపంచమును కూడ వృద్ధిని పొందించును. (30) పుష్టికాములయిన యెవ్వరు శ్రాద్ధముల నాచరింతురో వారికీ పితరులు పుష్టినీ పుత్రుల నెల్లప్పుడొసంగెదరు. వారు నామ గోత్రముల ననుసరించి వార్తలకు శ్రాద్ధముల పిండత్రయ మొసంగుదురు. పితరులు పీతామహులు సర్వత్ర నుందురు.
తేషామాప్యాయయిష్యంతి శ్రాద్ధదానేన వై ప్రజాః ।
ఏవమజ్జ కృతా పూర్వం బ్రహ్మణా పరమేష్ఠినా ॥
తే నైతత్సర్వథా సిద్ధం దానమధ్యయనం తపః ।
తే తు జ్ఞాన ప్రదాతారః పితరో వో న సంశయః ॥
ఇత్యేతే పితరో దేవా దేవాశ్చ పితరః పునః ।
అన్యోన్యపితరోహ్యేతే దేపాశ్చ పితరశ్చ హ ॥
ఏతద్రహ్మవచః శ్రుత్వా సూతస్య విదితాత్మనః ।
ప్రప్రచుర్ధర్మునయో భూయః సూతం తస్మాద్యదుత్తరమ్ ॥
ఋషయః ఊచుః :-
కీయంతో వై మునిగణాః కస్మినాలే చ తే గణాః ।
పూర్వే తు దేవప్రవరా దేవానాం సోమవర్ధసాః ॥
సూత ఉవాచ :-
ఏతద్వోహం ప్రవక్ష్యామి పితృసర్గమనుత్తమమ్ ।
శంయుః ప్రప్రచ్ఛ యత్పూర్వం పితరం వై బృహస్పతిమ్ ॥
బృహస్పతిముపాసీనం సర్వజ్ఞానార్థకోవిదమ్ ।
పుత్రః శంయురీమం ప్రశ్నం ప్రప్రచ్ఛ వినయాన్వితః ॥
క ఏతే పితరో నామ కియంతః కే చ సామతః ।
సముద్భూతాః కథం చైతే పితృత్వం సముపాగతాః ॥
కస్మాచ్చ పితరః పూర్వం యజ్ఞం పుష్ఠంతి నిత్యశః ।
క్రియాశ్చ సర్వా వర్తంతే శ్రాద్ధపూర్వా మహాత్మానామ్ ॥
తస్మై శ్రాద్దాని దేయాని కించ దత్తే మహాఫలమ్।
కేషుచాపక్షయం శ్రాద్ధం తీర్దేషు చ నదీషు చ ॥
కేషు వై సర్వమాప్నోతి శ్రాద్ధం కృత్వా ద్విజోత్తమః ।
కశ్చ కాలో భవేచ్ఛాద్ధీ విధిః కశ్చానువర్తతే ॥
ఏతదిచ్చామి భగవన్విస్తరేణ యథా తథా ।
వ్యాఖ్యాతమానుపూర్యేణ యత్ర చోదాహృతం మయా ॥
బృహస్పతిర్దం సమ్యగేవం పృష్ణో మహామతిః ।
వ్యాజహారానుపూర్యేణ ప్రశ్నం ప్రశ్నవిదాం వరః ॥
బృహస్పతి రువాచ :-
కథయిష్యామి తే తాత యన్మాం త్వం పరిపృచ్ఛసి ।
వినయేన యథా న్యాయం గంభీరం ప్రశ్నముత్తమమ్ ॥
శార్దముల నాచరించుట వలన పితరులు సంతాన వృద్ధిని కలుగఁజేయుదురు. పరమేష్టియయిన బ్రహ్మచే నట్టి యాజ్ఞ పూర్వము చేయం బడినది. తన్మూలమున దానము అధ్యయనము తపస్సు ఎల్లప్పుడు సిద్ధమగును. పితరులు జ్ఞాన ప్రదాతలు. ఈ విషయమున నెట్టి సంశయము లేదు. (34) ఈ విధముగా పితరులు దేవతలు, దేవతలు పితరులు. దేవతలు పితరులు అన్యోన్యము (ఒకరొకరికి) పితరులు. (35) ఆత్మ పదార్థ మెఱింగిన సూతుని వలన బ్రహ్మ వచస్సుల వీని, మునులు మరల సూతునికీ ప్రత్యుత్తరముగా ఇట్లు పలికిరి.
ఋషులు పలికిరి :
మునిగణముల వర్గము లెన్నియున్నవి? ఏ కాలమున నీ ముని గణములు కలిగిరి? దేవతలలో వారు శ్రేష్ఠులు. దేవతల కొఱకు వారు సోమవర్థనులు. అని సూతుఁడిట్లు చెప్పెను. ఇంత వఱకు శ్రేష్ఠమయిన పితరుల యొక్క సృష్టిని గూర్చి నేను మీకు చెప్పితిని. దానిని గూర్చియే పూర్వము శంయువు' తన తండ్రియయిన బృహస్పతిని గూర్చి ప్రశ్నించెను. . (38) పుత్రుఁడైన శంయువు వినయాన్వితుఁడై సర్వ జ్ఞానార్థ కోవిదుఁడును, ఆసీనుఁడునై యున్న బృహస్పతిని గూర్చి యీ ప్రశ్న అడిగెను. పితృదేవతలని పిలువఁబడు వీరెవరు? వారెంతమంది? వారి నామములు క్రమముగా నెవ్వి? వారెట్లు సముద్భవించిరి? వారు పితృత్వము నెట్లు పొందిరీ? (40) ఎందుండి పితరులు పూర్వము యజ్ఞమును నిత్యమును పరిపోషించి అభివృద్ధి పరచిరి? మొట్టమొదట ఈ మహానుభావులకు శ్రాద్ధ క్రియ లేట్లు కలిగినవి? (అవీ యెందులకు కలిగినవి?) శ్రాద్ధ క్రియలను ఎవ్వరికి ఆచరింపవలయును? శ్రాద్ధ క్రియల నొనరించినఁ గలుగు మహాఫలమేమి? శాశ్వత గుణములు గలిగిన నీ శ్రాద్ధము లాచరింప పవిత్ర స్థలములు నదులు తీర్థములేవి? (42) ద్విజోత్తముఁడు ఎందు (ఏ ప్రదేశమున) శ్రాద్ధమాచరించి సర్వ సంపదలను పొందును? శ్రాద్ద మాచరించుటకు కాలమేదీ (సమయమేది)? ఆ సమయాసమయముల గూర్చీ విధి నిర్ణయ మెట్లున్నది? ఓ భగవన్ ! మీరు నన్నడిగిన విషయమును సవిస్తరముగానేను క్రమశః చెప్పియుంటిని. మహామతి యయిన బృహస్పతి ఈ విధముగా ప్రశ్నింపఁబడి ప్రశ్న వీదుదులలో శ్రేష్ఠుఁడయిన యాతఁడు ఈ విధముగా ఆనుపూర్వీకముగా చక్కగా చెప్పియుండెను.
బృహస్పతి ఇట్లు చెప్పెను.
ఓ వత్సా ! ఎయ్యది నీవు వినయమున, యథా న్యాయము గంభీరముగా ప్రశ్నించి యడిగితివో దానిని నేను నీకు చెప్పెదను. (46)
ద్యౌరంతరిక్షం పృథివీ నక్షత్రాణి దిశస్తథా ।
సూర్యాచంద్రమసౌ చైవ తథా హోరాత్రమేవ చ ॥
న బభూవుస్తదా తాత తమోభూతమభూజ్జగత్ ।
బ్రహ్మైకో దుశ్చరం తత్ర తతాప పరమం తపః ॥
శంయుస్తమబ్రవీద్భూయః పితరం బ్రహ్మవిత్తమమ్ ।
సర్వవేదవతస్నాతః సర్వజ్ఞానవిదాంవరః ॥
కీదృశం సర్వభూతేశస్తపస్తేపే ప్రజాపతిః ।
బృహస్పతి రువాచ : -
సర్వేషాం తపసాం యత్తత్తపో యోగమనుత్తమమ్ ।
ధ్యాయంస్తథా స భగవాంస్తేన లోకానవాసృజత్ ॥
జ్ఞానాని భూతభవాని లోకా వేదాశ్చ సర్వశః ।
యోగామృతా స్తథాసృష్టి బ్రహ్మణా లోకచక్షుషా ॥
లోకాః సంతానకా నామ యత్ర తిష్ఠంతి భాస్వరాః ।
వైరాజా ఇతి విఖ్యాతా దేవానాం దివి దేవతాః ॥
యోగేన తపసా యుక్తః పూర్వమేవ తదా ప్రభుః ।
దేవానసృజత బ్రహ్మా యోగ యుక్తాననాతనాన్ ॥
ఆదిదేవా ఇతి ఖ్యాతా మహాసత్త్వా మహౌజసః ।
సర్వకామప్రదాః పూజ్యా దేవదానవమానవైః ॥
తేషాం సప్త సమాఖ్యాతా గణాఫ్రైలోక్యపూజితాః ।
అమూర్తయస్త్రయస్తేషాం చత్వారస్తు సమూర్తయః ॥
ఉపరిష్మాయస్తేషాం చత్వారస్తు సమూర్తయః ।
తేషామరస్తాద్వర్తంతే చత్వారః సూక్ష్మమూర్తయః ॥
తతో దేవాస్తతో భూమీరేషా లోకపరంపరా ।
లోకే వర్షంతి తే హ్యసింస్తేభ్యః పర్జన్యసంభవః ॥
అన్నం భవతి వై వృష్యా లోకానాం సంభవస్తతః ।
ఆప్యాయయంతి తే యస్మాత్సోమం చాన్నం చ యోగతః ॥
ఊచుస్తాన్వే పిత్యంస్తస్మాల్లోకానాం లోకసత్తమః ।
మనోజవాః స్వధాభక్ష్యాః సర్వకామపరిష్కృతాః ॥
లోభమోహభయోపేతా నిశ్చింతాః శోకవర్జితాః ।
ఏతే యోగం పరిత్యజ్య ప్రాప్తా లోకాన్సుదర్శనాన్ ॥
అప్పుడు, దివి (స్వర్గము) అంతరిక్షము, పృథివి, నక్షత్రములు, దిక్కులు, సూర్యచంద్రులు, అట్లే అహోరాత్రములు లేవు (కలిగి యుండ లేదు). అప్పుడీ ప్రపంచ మంతయును చీకటిచే నిండియుండెను. అప్పుడు ఒక్కడే యొక్కడయిన బ్రహ్మ ఇతరు లెవ్వరును ఆచరింపలేని తీవ్రము పరమమునయిన తపస్సాచరించెను. బ్రహ్మవిత్తముఁడు సర్వవేదముల నెంగినవాడు, సర్వజ్ఞానవిదులలో శ్రేష్ఠుఁడును నయిన తండ్రిని శంయువు మరల నడిగెను. 'సర్వ భూతేశుఁడయిన ప్రజాపతి ఎట్టి తపస్సు నాచరించెను'? అని బృహస్పతి చెప్పెను. తపస్సు లన్నింటిలో శ్రేష్ఠతమమయిన తపస్సును ఆతఁడాచరించెను. ఆ తపస్సును 'యోగమందురు. భగవంతుఁడయిన ప్రజాపతి ధ్యాన మాచరించి లోకములను సృజించెను. (50) బ్రహ్మ లోకచక్షువు. ఆ దివ్య చక్షువుచే బ్రహ్మ భూతభవిష్యత్ జ్ఞానమును, సర్వలోకములను, వేదములను, అమృతమయములు శాశ్వతములయిన యోగములను, సృష్టించెను. (51) ఆతనిచే సృష్టింపఁబడిన లోకములు 'సంతానక' నామకములు. ఆ లోకములలో భాస్వంతులయిన 'వైరాజ' వంతులని ప్రఖ్యాతి పొందిన దేవతలు నివసింతురు. వారు స్వర్గమున, దేవతలకు దేవతలు, (52)అంతకు పూర్వమే యోగముచేతను తపస్సు చేతను యుక్తుడయిన బ్రహ్మ దేవతలను సృష్టించెను. వారు సనాతనులు బ్రహ్మయోగ యుక్తులు. (53) వారందరు 'ఆది దేవతలు'గా ప్రసిద్ధులు. వారు సహజముగా మహాసత్త్వులు. మహాశక్తిమంతులు. వారు సర్వకామప్రదలు. వారు సర్వదేవ దానవ మానవులచే పూజారులు. వారిలో ఏడు గణములున్నవి. వారందరు త్రైలోక్య పూజితులు. వారిలో మువ్వురు మూర్తి (రూప) రహితులు. ఆకార విశేషములు లేనివారు. మరియు వారిలో నలుగురు సమూర్తులు, రూపవంతులు. (55) భావమూర్తులయిన వారు వారిలో మువ్వురు వారీ ఉపరితలమున నుందురు (ఉపరిష్టులు) అనగా సూక్ష్మరూపులు. వారికి క్రింద నల్గురున్నారు. వారు సూక్ష్మమూర్తులు. తరువాత దేవతలు గలిగిరి. తరువాత భూమీ కలిగెను. ఇదియే లోకపరంపర. వారు ప్రపంచమున వర్షింతురు. పార్టీ నుండియే మేఘములు ఉత్పత్తి నొందినవీ, (57) ధన్యము (అన్నము) (ఇతర భోజన పదార్ధములు) పర్జన్యుల నుండి పడిన వర్షముచే వృద్ది పొందును. (ఇది ప్రజా ప్రపంచ సృష్టి). పోనీ వలన (మేఘముల వలన) వారి యోగబలముచే సోమము, అన్నము, వృద్ది పొందుటచే, వారు లోకములకు పితరులుగా లోక సత్తములుగా చెప్పబడినారు. వారు మనోజవులు, వారు 'స్వధను భుజించెదరు. వారు సర్వకామ పరిష్కృతులు. వారు లోభమోహభయాదులు లేనివారు. నిశ్చింతులు శోకవర్ణితులు, వారు వారీ యోగమును (పైన చెప్పఁబడిన లక్షణములను) పరిత్యజించి సుదర్శననాములయిన లోకములను పొందిరి. (60)
దివ్యాః పుణ్యా విపాప్మానో మహాత్మానో భవంత్యుత ।
తతో యుగసహస్రాంతే జాయంతే బ్రహ్మవాదినః ॥
ప్రతిలభ్య పునర్యోగం మోక్షం గచ్ఛంత్యమూర్తయః ।
వ్యక్తావ్యక్తం పరిత్యజ్య మహాయోగబలేన చ ॥
నశ్యంత్యుల్కేవ గగనే క్షణాద్విద్యుత్సలేవ చ ।
ఉత్సృజ్య దేహజాలాని మహాయోగబలేన చ ॥
నిరాఖ్యోపాస్యతాం యాంతి సరితం సాగరం యథా ।
క్రియయా గురుపూజాభిర్యాగం కుర్వంతి యత్నతః ॥
శ్రాధ్ధ ప్రేతాస్తతః సోమం పితరో యోగమాఫీతోః ।
ఆప్యాయయంతీ యోగేన త్రైలోక్యం యేన జీవతి ॥
తస్మాచ్ఛాద్ధాని దేయానీ యోగానాం యత్నతః సదా ।
పితృణాం హి బలం యోగో యోగాతోమః ప్రవర్తతే ॥
సహస్రశతవిప్రాన్వె భోజయ్యే వదాగతాన్ ।
ఏకస్తానపి మంత్రజ్ఞః సర్వానర్హతి తచ్ఛృణు ॥
ఏతానేవ చ మంత్రజ్ఞాన్ఫోజయద్యః సమాగతాన్ ।
ఏకస్తాన్నాతకః ప్రీతః సర్వానరతి తచ్ఛృణు ॥
మంత్రజ్ఞానాం సహసేణ స్నాతకానాం శతేన చ।
యోగాచార్యేణ యద్భుక్తం త్రాయతే మహతో భయాత్ ॥
గృహస్థానాం సహస్రణ వానప్రస్థశతేన చ ।
బ్రహ్మచారిసహస్రణ యోగ ఏవ విశిష్యతే ॥
నాస్తికో వాప్యధర్మో వా సంకీర్ణ స్తస్కరోఏ వా ।
నాన్యత్ర తారణం దానం యోగేష్వాహ ప్రజాపతిః ॥
పితరస్తస్య తుష్యంతీ సువృషేనైవ కర్షకాః ।
పుత్రోవాప్యథ వా పౌత్రో ధ్యానినం భోజయిష్యతి ॥
అలాభే ధ్యాననిష్టానాం భోజయద్రహ్మచారిణమ్ ।
తదలాభే ఉదాసీనం గృహస్థమపి భోజయేత్ ॥
యస్తిష్ఠదేకపాదేన వాయుభక్షః శతం సమాః ।
ధ్యానయోగీ పరస్తస్మాదితి బ్రహ్మానుశాసనమ్ ॥
అద్య ఏష గణః ప్రోక్తః పితృణామమితౌజసామ్ ।
భావయన్ సర్వలోకాన్వై స్థిత ఏష గణస్తదా ॥
అత ఊర్ధ్వం ప్రవక్ష్యామి సర్వానపి గణాన్ పునః ।
సంతతిం సంస్థితీం చైవ భావనాం చ యథాక్రమమ్ ॥
ఇతి శ్రీ బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే
పితృకల్పో నామ నవమోధ్యాయః॥
వారు దివ్యులు, పుణ్యవంతులు, పాపరహితులు, మహాత్ములు నగుదురు. తరువాత సహస్ర యుగముల యనంతరము వారు బ్రహ్మవాదులుగా నగుదురు. (ఆధ్యాత్మిక విద్యావంతులు అగుదురు). మూర్తి రహితులు (అమూర్తులు - రూపము లేనట్టివారు) మరల వారీ యొక్క యోగశక్తులను పొంది, మోక్షమును పొందెదరు. ముక్తులగుదురు. వ్యక్తావ్యక్తమును పరిత్యజించి (దేహమును విడిచి) (రూపమును ధరించుట, రూప రహితులుగ నుండుట) వారి యొక్క మహా యోగబలమున, వారు ఉల్కలవలె (తోకచుక్కలవలె లేక విద్యుత్ర్పభవలే మెఱుపువలె) అదృశ్యులగుదురు. (నశించెదరు). (63) శరీరములను విడిచిన తరువత, వారీ యోగ బల సహాయమున, వారు (నిరాఖ్యోపాస్యతను) ఇతరులచే పూజింపఁబడు, ఉపాసింపఁబడు స్థితిని, నదులు సముద్రములో కలిసి పేరు లేని వగునట్లు నామరహిత స్థితిని పొందుదురు. ప్రయత్న పూర్వకముగా వేద విధులను ఆచరించుట చేతను, గురు పూజలచేతను, వారు యాగములను చేయుదురు. (64) శ్రాద్ధముల వలన ప్రీతులయిన పితరులు యోగశక్తులను పొంది, ఆ యోగ శక్తిచే సోమమును వృద్ధి పరచి, బలపరచి, తన్మూలమును మూఁడు లోకముల వారు జీవింప జేయుదురు. (65) అందుచే గొప్ప యోగశక్తిని పొందుటకు శ్రాద్ధము సదా ఆచరించవలెను, నీజముగా యోగము పితరుల యొక్క శక్తి. సోమము (చంద్రుఁడు) యోగము వలన ప్రవర్తించును. (66) ఒకఁడు శ్రాద్ధ సమయమున వచ్చీనట్టి వేయి వందల బ్రాహ్మణులకు భోజనము పెట్టవలయును. లేదా శ్రాద్ధ సమయమునకు వచ్చిన ప్రతివ్యక్తికి భోజనము పెట్టవలయును. వినుము, మంత్రజ్ఞు నొక్కనికి భోజనము పెట్టిన వేయివందల మందికి భోజనము పెట్టుటతో సమానము. తన యింటికి వచ్చిన యెంతమందియైన మంత్రజ్ఞులకు భోజనము పెట్టవచ్చును. (స్నాతకులు గృహస్థులు) వినుము. ఒక్క స్నాతకుఁడు గృహస్థు పూజింపఁబడిన ఆ మంత్రజ్ఞులందరిని పూజించుటతో సమమగును. (మంత్రజ్ఞుల పూజించుటతో తుల్యము స్నాతకుల పూజించుట), వేయి మంది మంత్రజ్ఞులగాని, వేయి మంది స్నాతకులగాని చేసిన భోజనము ఒక్క యోగాచార్యుడు చేసిన భోజనముతో సమానము. అయ్యది మహా భయము సుండి రక్షించును. (70) గృహస్థ సహస్ర సంఖ్యకు, వానప్రస్థ శతమునకు, బ్రహ్మచారి సహస్రమునకు పెట్టిన భోజనము కంటే యోగి కొకనికీ పెట్టినది అధికమయినది. (శ్రేష్ఠతమము). ప్రజాపతి ఇట్లు చెప్పెను. 'నాస్తికుఁడు’ కాని అధర్మపరుఁడు కానీ సంకీర్ణవంశ్యుఁడు కాని తస్కరుఁడు కాని- యోగికి శ్రాద్ధకాలమున భోజనము పెట్టుట కంటే వేటిక క్రియచే మోక్షమును (తరణమును) పొందజాలఁడు”. పుత్రుఁడు' కాని, పౌత్రుఁడు కాని ఒక్క ధ్యానికి భోజనము పెట్టినచో మంచి వర్షము పడిన కర్షకులు సంతోషించునట్లు పితరులు సంతుష్టులగుదురు. (72) ధ్యాన నిష్టులు లభింపకపోయినచో, బ్రహ్మచారీకి భోజనము పెట్టవలెను. ఒకవేళ బ్రహ్మచారీయు లభ్యుఁడు కాని పక్షమున ఉదాసీనుఁడయిన గృహస్థునకు భోజనము పెట్టవలయును. (ఉదాసీనుఁడు ప్రాపంచిక విషయములందాసక్తి లేనివాఁడు). (73)
బ్రహ్మాను శాసన మిట్లున్నది.
వందయేండ్లు ఒంటి కాలిపై నిలఁబడి, వాయు భక్షకుఁడై తపమాచరించు వానీకంటే ధ్యానయోగి గొప్పవాఁడు (ఉత్తముఁడు). (74) అమిత తేజస్వులయిన పితరులలోని ప్రథమగణము గూర్చి యిప్పుడు చెప్పఁబడినది. ఈ పితృగణము సర్వలోకములను పవిత్రీకరించుచు ఎల్లప్పుడును నుండును. ఇంక, ఇకముందు పితరులలోని సర్వగణములను గూర్చి వారి సంతతిని గూర్చీ భావనా సంస్థితిని గూర్చి యథా క్రమముగా చెప్పెదను. (76)
ఇది వాయుప్రోక్తము మహాపురాణము అయిన బ్రహ్మాండపురాణమున, మధ్యభాగమున తృతీయోపాద్ఘాతపాదము నందు పితృకల్పమను నవమాధ్యాయము.
Summary of chapter 47 of the Brahmānda Mahā Purana is as follows:
This chapter inaugurates the profound discourse on the Pitṛkalpa, illuminating the sacred rites dedicated to honoring departed ancestors with deep love and piety. It expounds on the spiritual necessity of ancestor worship, showing how loving offerings bridge the earthly realm and celestial ancestral spheres. The faithful heart is moved to perform these sacred duties with devotion, earning the eternal blessings of ancestral spirits and divine guardians.