36 - చింతామణి గృహాంతరకథనం

చిన్తామణిగృహస్యాన్నిదిగ్భాగే కుందమానకమ్ (నామకమ్) ।

 యోజనాయామవిస్తారం యోజనోచ్ఛాసచాతకమ్ ॥

తత్ర జ్వలతి చిద్వహ్నిః సుధాధారాశతార్చితః ।

పరమైశ్వర్యజనకః పావనో లలితాజ్ఞయా ॥

అనిందనో మహజ్వాలః సుధయా తర్పితాకృతిః ।

కంకోలపల్లవచ్ఛాయస్తత్ర జ్వలతీ చిచ్ఛిలీ ॥

తత్ర హోత్రీ మహాదేవీ హోతా కామేశ్వరః పరః ।

ఉభౌ తా నిత్యహోతారౌ రక్షతః సకలం జగత్ ॥

అనుత్తరపరాధీనా లలితా సంప్రవర్తితా ।

లలితాచోదితః కామః శంకరేణ ప్రవర్తితః॥

చింతామణిగృహేంద్రస్య రక్షోభాగేంబుజాటనౌ ॥

చక్రరాజరథశ్రేష్ఠస్తిష్ఠత్యున్నతవిగ్రహః।

నవభిః పర్వభిర్యుక్తః సర్వరత్నమయాకృతిః ॥

చతుర్యోజనవిస్తారో దశయోజనమున్నతః ।

యథోత్తరం ప్రోసయుక్తః స్థూలతః కూబరోజ్వలః ॥

చతుర్వేదమహాచక్రః పురుషార్థమహాహయః ।

తస్వైరుపచరద్భిశ్చ చామరైరభిమండితః ॥

పూర్వోక్తలక్షణిర్యుక్తి ముక్తాచ్ఛత్రేణ శోభితః ।

భండాసురమహాయుద్ధే కృతసాహసికక్రియః ॥

వర్తతే రథమూర్ధన్యః శ్రీదేవ్యాసనపాటితః ।

చింతామణిగృహేంద్రస్య వాయుఖాగేందుటవా॥

గేయచక్రరథేంద్రస్తు మంత్రిణ్యాః ప్రాంత తిష్ఠతి ।

 చింతామణిగృహేంద్రస్య రుద్రభాగేందుజాటవౌ ॥

వల్లభో దండనాథాయాః కిరిచక్రే మహారథః ।

ఏతద్రథత్రయం సర్వక్షేత్రశీపురపంక్తీషు ॥

సమానమేవ విజ్ఞేయమంగస్థా దేవతా యథా ॥

ఆనలం కుండమాగ్నేయే యత్తిష్ఠతి సదా జ్వలత్ ।

తప్తమేతత్తు గాయత్రీతప్తం స్యాదభయంకరమ్ ॥

ఘృణిసూర్యస్తు తత్పశ్చాదోంకారస్య చ మందిరమ్ ।

దేవీ తురీయగాయత్రీ చక్షుషత్యపి తాపస ॥

అథ గంధర్వరాజశ్చ పరిషద్రుద్ర ఏవ చ ।

తారాంబికా భగవతీ తత్వశాద్భాగతః స్థితాః ॥

చింతామణిగృహేంద్రస్య రక్షోభాగం సమాశ్రితః ।

నామత్రయమహామంత్రవాచ్యా ఆస్తి భగవాన్ హరిః ॥

మహాగణపతిస్తస్యోత్తరసంశ్రితకేతనః ।

పంచాక్షరీమంత్రవాచ్యస్తస్య చాప్యుత్తరే శివః॥

అథ మృత్యుయేశశ్చ వాచ్యన్ర్యక్షరమాత్రతః ।

సరస్వతీ ధారణాఖ్యా హ్యస్య చోత్తరవాసినీ ॥

అకారాదిక్షకారాన్తవర్ణమూర్తేస్తు మందిరమ్ ।

మాతృకాయా ఉత్తరతస్తస్యాం వింధ్యనిషూదన ॥

ఉత్తరే సంపదేశీ పై కొలసంకర్షణీ తథా ।

శ్రీమహాశంభునాథా చ దేవ్యావిర్భావకారణమ్ ॥

శ్రీః పరాంబా చ విశశదజ్యోత్స్నా నిర్మలవిగ్రహా ।

ఉత్తరోత్తరమేతాస్తు దేవతాః కృతమందిరాః ॥

బాలా చై వాన్నపూర్ణా చ హయారూఢా తథైవ చ ।

శ్రీపాదుకా చతస్రస్తదుత్తరోత్తరమందిరాః ॥

చింతామణిగృహేంద్రస్య వాయవ్యవసుధాద్రిత।

మహాపద్మాటవొత్వన్యా దేవతాః కృతమందిరాః ॥

ఉన్మత్తభైరవీ చైవ స్వప్నవారాహికా పరా ।

తిరస్కరణీతాంజా చ తథాన్యా పంచమి పరా॥

యథాపూర్వం కృతగృహా ఏతా దేవ్యో మహాదోయాః ।

శ్రీపూర్తిళ్ళ మహాదేవీ శ్రీమహాపాదుకా పిచ॥

యథాపూర్వం కృతగృహే ద్వే ఏతే దేవతోత్తమే।

శంకరేణ షడామ్నాయసాగర్ ప్రతిపాదితాః ।

యా విద్యాస్తాః సమస్తాశ్చ మహాపద్మాటవీస్థలే॥

ఇత్తం శ్రీరశ్మిమాలాయా మణిక్లుప్తా మహాగృహాః ।

ఉచ్చధ్వజా ఉచ్చశాలొస్ససోపానాస్తపోధన ॥

చింతామణిగృహేంద్రస్య పూర్వద్వారే సముద్రప ।

దక్షిణే పూర్వభాగే తు మంత్రినాథాగృహం మహత్ ॥

వామభాగే దండనాథాభవనం రత్ననిర్మితమ్ ।

బ్రహ్మవిష్ణుమహేశానామర్ద్యస్థానస్య పూర్వతః ॥

భవనం దీపితాశేషదిక్చక్రం రత్నరశ్మిభిః ।

సమస్తా దేవతా ఏతా లలితాభక్తినిర్భరాః ॥

లలితామంత్రజాప్యాశ్చ శ్రీదేవీం సముపాసతే ॥

పూర్వోత్తమర్ధ్యస్థానం చ పూర్వోత్తం చార్ట్యకల్పనమ్ ।

యామ్యద్వారప్రభృతిషు సర్వేష్వపి సమం స్మృతమ్ ॥

అథ చింతామణిగృహం వక్ష్యే శృణు మహామునే।

తఛ్ఛీపట్టనమధ్యస్థం యోజనద్వయవిస్తృతమ్ ॥

తస్య చింతామణీమయీ భిత్తి క్రోశసువిస్తృతా ।

చింతామణిశిలాభిశ్చ చ్ఛాదినీభిస్తథోపరి ॥

సంవృతా కూటరూపేణ తత్ర తత్ర సమున్నతా ।

గృహభీతీస్తథోన్నమ్రా చతుర్యోజనమానతః॥

వింశతిర్యోజనం తస్యాత్చోన్నమా భూమీరుచ్యతే ।

తతోర్ధ్వం ప్రోససంయుక్తం ఫౌల్యత్రిముకుటోజ్జ్వలా ॥

తాని చేచ్ఛాక్రియాజ్ఞానరూపాణీ ముకుటాన్యషే ।

సదా దేదీప్యమాసోనీ చింతామణిమయాన్యపి ॥

చింతామణిగృహే సర్వం చింతామణిమయం స్మృతమ్ ।

యస్యద్వారాణి చత్వారి క్రోశార్దాయామభాంజీ చ ॥

 " క్రోశార్దార్ధ చ విస్తారో ద్వారాణాం కథితో మునే ।

ద్వారేషు సర్వేషు పునశ్చింతామణిగృహాంతరే ॥

పిహితా లలితాదేవ్యా మూర్తిర్లోహితసింధువత్ ।

తరుణార్కసహస్రాభా చంద్రవచ్ఛీతలో హ్యాపి ॥

ముహుః ప్రవాహరూపేణ ప్రసరంతీ మహామునే ॥

పూర్వామ్నాయమయం చైవ పూర్వద్వారం ప్రకీర్తితమ్ ।

దక్షిణద్వారదేశస్తు దక్షిణామ్నాయలక్షణః ॥

పశ్చిమద్వారదేశస్తు పశ్చిమామ్నాయలక్షణః ।

ఉత్తరద్వారదేశః స్యాదుత్తరామ్నాయలక్షణః ॥

గృహరాజస్యాంతరాలే భిత్తా ఖచితదణ్డకాః ।

రత్నప్రదీపా భాస్వంతః కోట్యర్కసదృశత్విషః ॥

. పరితస్తత్ర వర్తంతే భాసయంతో గృహాంతరమ్ ॥

చింతామణిగృహస్యాస్య మధ్యస్థానే మహీయసి ।

అత్యుచ్చార్వేదికాభాగే బిందుచక్రం మహత్తరమ్ ॥

చింతారత్నగృహోత్తుంగ భిత్తేర్చిందోశ్చ మధ్యభూః ।

భిత్తిః క్రోశం పరిత్యజ్య క్రోశత్రయముదాహృతమ్ ॥

తత్ర క్రోశత్రయస్థానే హ్యణిమాద్యాత్మరోచిషా ।

క్రోశత్రయం సమస్తం తధ్ధస్తసంఖ్యాపకారాతః॥

చతుర్వింశతి సాహస్రహస్తికి సంమితముచ్యతే ॥

బిందువీరేశపర్యంతం చతుర్దశవిభేదతః ।

అంతరే భేదితే ఇతే హస్తసంఖ్యా మయోచ్యతే ॥

పద్మాటవీస్థలాచ్చింతామణివేశ్మాంతరం మునే।

హస్తవింశతిరున్నమం తత్ర స్యురణిమాదయః॥

అణిమానరవిస్తారశ్చతుర్నల్వసమన్విత ।

కిష్కుశ్చతుఃశతీ నల్వకిష్కురస్త ఉదీర్యతే ॥

తత్రాంతరేఖ ఉమాధ్యాస్తు పూర్వాధికృతమందిరాన్ని।

అణిమా హిమాచైవ లఘిమా గరిమా తథాగ॥

ఈశిత్వం చ వశిత్వం చ ప్రాకామ్యం ముక్తి రేవ చ।

ఇచ్ఛా ప్రాప్తిః సర్వకామేత్యేతాః సిద్ధయ ఉత్తమాః ॥

రససిద్ధిర్మోక్షసిద్ధిర్బలసిద్ధిస్తథైవ చ ఖడ్గసిద్ధిః పాదుకాయాః సిద్ధిరంజసిద్ధికః ॥

 వాక్సిద్ధిర్లోకసిద్ధిశ్చ దేహసిద్ధిరనంతరమ్ ।

 ఏతా అష్టా సిద్ధయస్తు బహ్యోన్యా యోగిసంమతా॥

తత్రాంతరే తు పరితః సేవంతే పరమేశ్వరీమ్ ।

 కోటిశః సిద్ధయస్తస్మిన్నణిమాద్యంతరే  మునే ॥

నవలావణ్యసంపూర్ణాః స్మయమానముఖాంబుజాః।

జ్వలచ్చింతామణికరాః సదా షోడశవార్షికాః ।

అత్యుదారప్రకృతయః ఖేలంతి మదవిహ్వలాః ॥

తస్యాణిమాద్యంతరస్యోపరిష్ణాత్సుమనోహరమ్।

హస్తవింశతిరున్నమం చతుర్నల్వపవిస్తరమ్॥

చతుర్ధిక్షు చ సోపానపంక్తిభిః సుమనోహరమ్॥

బ్రాహ్మాద్యంబరధిష్ట్యం స్యాత్తత్ర దేవీః స్థితాః శృణు।

బ్రాహ్మీ మహేశ్వరీ చైవ కౌమారీ వైష్ణవీ తథా॥

వారాహీ చైవ మాహేంద్రీ చాముందాష్యథ।

సప్తమి మహాలక్ష్మీరష్టమౌ తు తత్రేతాః కృతమందిరాః॥

సోనావిధాయుధాఢ్యశ్చ నానాశక్తిపరిచ్ఛదాని।

పూర్వాదిదిశమారభ్య ప్రాదక్షిణ్యకృతాలయాఃఈఈ

అథ బాహ్య తరా తస్యోపరిష్ణాతుంభసంభవ।

హస్తవింశతిరున్నమ్రం చతుర్నల్వపవిస్తరమ్॥

ముద్రాంతరమితి తెధం తత్ర ముద్రాః కృతాలయాః॥

సంక్షోభద్రావణాకర్షవశ్యోన్మాదమహాంకుశాః।

ఖేచరీ బీజయోన్యాఖ్యా త్రిఖండా దశమీ పునః॥

పూర్వాదిదిశమారభ్య ముద్రా ఏతాః ప్రతిష్ఠితాః।

అత్యంతసుందరాకారా నవయౌవనవిహ్వలాః

కొంతిభిః కమనీయాభిః పూరయన్త్యో గృహాన్తరమ్॥

 సేవంతే మునిశార్దూల లలితాపరమేశ్వరీమ్।

అంతరం త్రయమేతతు చక్రం త్రైలోక్యమోహనమ్॥

ఏతస్మిణ్భక్తయో యాసు తా ఉక్తాః ప్రకటాభిధాః1

ఏతాసాం సమధిష్టా తీత్రిపురా చక్రనాయికా॥

తచ్చకపాలనకరీ ముద్రాసంక్షోభణాత్మికా।

అథ ముద్రాంతరస్యోర్థం ప్రోక్తా నిత్యాకలాంతరమ్॥

హస్తవింశతిరున్నమం చతుర్నలప్రవిస్తరమ్।

పర్వతశ్చైవ సోపానముత్తరోత్తరమిష్యతే॥

నిత్యాకలాంతరే తస్మిన్ కామాకర్షణీకాసుభాః।

పరితః కృతసంస్థానాః షోడశేందుకలాత్మికాః॥

తర్పయంత్యో దిశాం చక్రం సుధాస్యందైః ।

సుశీతలైః తాసాం సామాని మత్తస్త్వమవధారయ కుంభజల్ల్

కామాకర్షణికా నిత్యా బుద్ధ్యాకర్షణికా పరా।

రసాకర్షణికా నిత్యా గంధాకర్షణికా కలాఈఈ

చిత్తాకర్షణికా నిత్యా ధైర్యాకర్షణికా కలా।

స్మృత్యాకర్షణికా నిత్యా నామాకర్షణికా కలా॥

బీజాకర్షణికా నిత్యా చార్థాకర్షణికా కలా।

అమృతాకర్షణీ చాన్యా శరీరాకర్షణీ కలా।

ఏతాస్తుగుప్తయోగిన్యస్తిపురేశీ తు చక్రిణీ,।

సర్వాశాపూరీకాభిఖ్యా చక్రాధిష్టానదేవతా॥

ఏతచ్ఛక్తీ పాలికా తు ముద్రా ద్రావిడికాభిధా।

నిత్యా కలాంతరాదూర్వం ధిష్ఠ్యమత్యంతసుందరమ్॥

హస్తవింశతీరున్నమం చతుర్నల్వప్రవిస్తరమ్।

ప్రాగ్వతోపానసంయుక్తం సర్వసంక్షోభణాభిధమ్॥

తర్రాష్ట్రా శక్తయస్తీవ్ర మదారుణవిలోచనాః ।

నవతారుణ్యమత్తాశ్చ సేవంతే పరమేశ్వరీమ్ ॥

కుసుమా మేఖలా చైవ మదనా మదనాతురా।

రేఖా వేగిన్యంకుశా చ మాలిన్యష్ఠా చ శక్తయ॥

కోటీశస్తత్పరీవారః శక్తయో నంగపూర్వికాః।

సర్వసంక్షోభణమిదం చక్రం తదధిదేవతా ॥

సుందరీ నామ విజేయానామ్నా గుప్తతరాపి సా।

తచ్చక్రపాలనకరీ ముద్రాకర్షణికా స్మృతా ॥

అనంగశక్యంతరస్యోపరిష్ణాతుంభసంభవ।

హస్తవింశతిరున్నమం చతుర్నలప్రవిస్తరమ్॥

సంక్షోభిణ్యాద్యంతరం స్యాత్సర్వసౌభాగ్యదాయకమ్ ।

సర్వసంక్షోభిణీముఖ్యాస్తత్ర శక్తయ ఉద్దతాః॥

చతుర్ధశ వసంత్యేవ తాసాం సోమాని మచ్చణు।

సర్వసంక్షోభిణీ శక్తిః సర్వవిద్రావిణీ తథా॥

సర్వాకర్షణికా శక్తిః, సర్వాహ్లాదనికా తథా।

సర్వసం మోహినీ శక్తిః సర్వస్తంభనశక్తికా॥

సర్వజృంభణికా శక్తిస్తథా సర్వవశంకరీ।

సర్వరంజనశక్తిశ్చ సర్వోన్మాదనశక్తికా॥

సర్వార్థసాధికా శక్తిః సర్వసంపత్తిపూరిణీ।

సర్వమంత్రమయీ శక్తిః సర్వద్వంద్వక్షయంకరీ॥

ఏతాశ్చ సంప్రదాయాఖ్యాశ్చక్రిణీపురవాసినీ।

ముద్రాశ్చ సర్వవశ్యాఖ్యీస్తచ్చక్రే రక్షికా మతా: ॥

కోటిశః శక్తయస్తత్ర తాసాం కింకర్య ఉద్ధృతాః ।

సంక్షోభిణాద్యతంరస్యోపరిష్ణాత్కుంభసంభవు॥

హస్తవింశతిరున్నమం చతుర్నల్వప్రవిస్తరమ్ ।

సర్వసిద్ధాదికానాం తు మందిరం విష్టముచ్యతే॥

సర్వసిద్ధిప్రదా చైవ సర్వసంపత్ర్పదా తథా।

సర్వప్రియంకరీ దేవీ సర్వమంగళకారిణీ॥

సర్వకామప్రదా దేవీ సర్వదుఃఖవిమోచనీ।

సర్వమృత్యుప్రశమనీ సర్వవిఘ్ననివారిణీ ।

సర్వాంగసుందరీ దేవీ సర్వసౌభాగ్యదాయినీ।

ఏతా దేవ్య కలోతీర్జా యోగి న్యో నామతః స్మృతాః॥

చక్రిణీ శ్రీశ్చ విజ్ఞేయా చక్రం సర్వార్థసాధకమ్।

సర్వోన్మాదనముద్రాశ్చ చక్రస్య పరిపాలికాః॥

సర్వసిద్ద్యాద్యంతరస్యోపరిష్ణాత్కుంభసంభవ।

హస్తవింశతీరున్నమం చతుర్నల్వప్రవిస్తరమ్॥

సర్వజ్ఞాద్యంతరం నామ్నా సర్వరక్షాకరం స్మృతమ్।

చక్రం మహత్తరం దివ్యం సర్వజ్ఞాద్యాః ప్రకీర్తితాః ॥

సర్వజ్ఞా సర్వశక్తిశ్చ సర్వైశ్వర్యప్రదాయినీ।

సర్వజ్ఞానమయీ దేవీ సర్వవ్యాధివినాశినీ॥

సర్వాధారస్వరూపా చ సర్వపాపహరీ తథా।

సర్వానందమయీ దేవీ సర్వరక్షాస్వరూపిణీ॥

సర్వేపితప్రదా చైనా నిర్గర్వా యోగినీశ్వరాః

మాలినీ చక్రిణీ ప్రోక్తా ముద్రా సర్వమహాంకుశా।

ఇతి చింతామణిగృహే సర్వజ్ఞాద్యతంతరావధి।

చక్రాణి కాని చిత్రోక్తాన్యన్యోన్యపి మునే శృణు॥

ఇతి శ్రీబ్రంహ్మాండమహాపురాణే ఉత్తారభాగే హయగ్రీవాగస్త్యసంవాదే లలితాపాఖ్యానే చింతామణిగృహాంతరకథనం నామ షట్త్రింశోధ్యాయః ॥ 36

హయగ్రీవుడనేను. చింతామణిగృహముయొక్క యాగ్నేయదిగ్భాగమున కుందమాన(నామ)కమనుపేర నోకటి (సరస్సు) (యజ్ఞస్థలము)కలదు. అది ఒక యోజనము వెడల్పును పొడవును గలది. ఒక యోజనమువరకుచ్ఛ్వాసగల చాతక పక్షులు గలది-1 అచట జ్ఞానాగ్ని జ్వలించును. అది నూర్ల సుధాధారలతో నర్చింపబడినది. లలితాజ్ఞచే పరమైశ్వర్యమునిచ్చునది. పావనమైనది. -2 ఇంధనము (మండు సాధనము) లేనిది. గొప్ప జ్వాలలుగలది. సుధచేత తృప్తి చెందింపబడిన యాకారము గలదీ, కంకోల వృక్షపు చిగురాకుల వంటి వన్నెగలది. ఇట్టిజ్ఞానాగ్నిచట జ్వలించుచుండును. -అచట మహాదేవి హోమముజేయునది. పరమకామేశ్వరుడు హోమము జేయువాడు, వారిరువురు నీత్యహోతలై సకలజగమును రక్షింతురు. -4 తనకంటినుత్తముడులేని పరాత్పరుడైన కామేశ్వరునకధీనురాలై లలితాదేవి యాతనీచేత చీకార్యమునందు ప్రవర్తింప జేయబడినది. లలితాదేవిచేత ప్రేరేపింపబడిన కాముడు శంకరునిచే ప్రవర్తింపచేయబడెను. -5 చింతామణిగృహరాజముయొక్క రక్షోభాగమున నైరృత్యభాగమున) పద్మాటవీలో-6 చక్రరాజ రథశ్రేష్టమున్నది. అదియున్నతమైన యాకారముగలది. తొమ్మిది పర్వము (అంతస్తులతో భాగము)లతోగూడినది. సమస్త రత్నములతో నిండినయాకారము గలది. --7 సొలుగు యోజనముల విస్తారముగలది. పదియోజనములయెత్తైనది ముందు ముందు ఎత్తుగనుండి తరువాత కురుచగా నున్నది. లావైన నొగలతో ప్రకాశించినదీ -8 దానికి నాలుగు వేదములు గొప్ప చక్రములు. ధర్మ -అర్థ-కామ- మోక్షములనెడివి గొప్ప గుఱ్ఱములు. ఆ రథము ఉపచరించునట్టి తత్త్వములనెడి (ద్వైతాద్వైతములనెడి) వింజామరలతో ప్రకాశించినది-9.పూర్వముజెప్పిన లక్షణములతో గూడి ముత్యములగొడుగుతో బ్రకోశీంచినది. భండాసురమహాయుద్ద సాహసక్రియలనీర్వర్తించినది-10. శ్రీదేవ్యాసనమునకై కట్టె మొదలగువాని గోసి నిర్మింపబడిన రథశ్రేష్టము చింతామణి గృహరాజముయొక్క వాయువ్యదిగ్బాగమున పద్మాటవీయందు గలదు. -11 గేయ చక్రరథ శ్రేష్టము మంత్రితీయొక్క ప్రాంతమున చింతామణీ గృహరాజము యొక్క రుద్ర (ఈశాన్య) భాగమున పద్మాటవీయందున్నది -12 దండనాథకు కీర్తి చక్రమను మహారథము మిక్కిలి ప్రియమైనది. ఈ మూడు రథములును సర్వక్షేత్రమైన శ్రీ పురము యొక్క వరుసలలో నున్నవి. వానియంగస్టదేవతలు సమానము-13 ఆగ్నేయమున అగ్ని కుండము మండుచునుండును. తపించిన యిది గాయత్రిచేతపించినది. అభయము నీచును. -14 కిరణములుగల సూర్యుడుండును. ఆతని తరువాత ఓంకారము యొక్క మందిరముండును. ఓ తాపసా! అగస్త్యా! దేవియే బ్రహ్మస్వరూపిణియైన గాయత్రి కన్నులు గలది కూడను అగును. -15 ఆ తరువాత గంధర్వరాజు, పరిషత్తు(సభ) రుద్రుడు - వోనికి వెనుక భగవతియైన తారాంబిక భాగములుగా నుందురు. -16 చింతామణి గృహరాజముయొక్క రక్షోభాగమును (నైరృత్యమును) ఆశ్రయించి మూడు నామముల మహామంత్రముతో హరి చెప్పబడుచుండును. -17 దానికి ఉత్తరమున నింటినాశ్రయించి మహాగణపతియుండును-18. దానికి ఉత్తరమున పంచాక్షరీ మంత్రమునకు వాచ్యుడైన శివుడుండును-18. ఆ తరువాత మూడక్షరముల మాత్రముననే మృత్యంజయుడైన యీశుడుండును. 'ధారణ' అను పేరుగల సరస్వతి యితనికి ఉత్తరమున నివసించియుండును-19. ఆమె 'అ' కారము మొదలు 'క్ష' కారము వరకు గల - వర్ణములయాకారమునకుమందిరము, ఆమాతృకావర్ణరూపిణీకి ఉత్తరమున ఓవింధ్యగర్వాపహారీ! సంపదేశియు కాలసంకరణీయు శ్రీమహాశంభువు నాథుడుగా గలయామేయు నుందురు. వీరు దేవి యొక్క యావిర్భావమునకు కారణమైనవారు -21. శ్రీ పరాంబ, విశదజ్యోత, నిర్మల విగ్రహ-వీరు ఉత్తరోత్తరముగా (పూర్వపూర్వులకు ఉత్తరోత్తముగా) భవనములనేర్పరచుకొని యుందురు-22. బాల, అన్నపూర్ణ, హయారూఢ, శ్రీపాదుక - ఈ నలువురును పూర్వపూర్వులకు ఉత్తరోత్తరదిశల వైపుననే మందిరములు గలవారు-23 చింతామణి గృహరాజమునకు వాయవ్య భూమిలోని పర్వతము నుండి పద్మాటవీలో మాత్రము తక్కిన దేవతలు తమమందిరముల నేర్పరచుకొన్నారు-24. ఉన్మత్త భైరవీ, స్వప్నవారాహిక, పరమైన తిరస్కరణీకాంబ, పంచమి-25. వీరు తూర్పువైపున మందిరముల నేర్పరచుకొని మహోదయ మునందియున్న దేవులు. మహాదేవియైన శ్రీ పూర్తి శ్రీమహాపాదుక-26. వీరిరువురు తూర్పున మందిరము నిర్మించుకొన్న ఉత్తమ దేవతలు. శంకరునిచే షడామ్నాయసాగరమున జెప్పబడిన విద్యలన్నీయు మహాపద్మాటవీస్థలమున నున్నవి. -27 ఈ విధముగా శ్రీదేవి యొక్క కిరణముల వంటి శక్తుల పంక్తి యొక్క మణినిర్మిత మహాగృహములు గలవు. అవి ఓ మునీ!ఎత్తైన ధ్వజములు (జండాలు) గలవి. ఎత్తైన భవనములుగలవి. మెట్లుగలవి-28. ఇవి ఓమునీ! చింతామణి గృహరాజము యొక్క తూర్పు ద్వారమున గలవు. దక్షిణమున తూర్పు వైపున మంత్రీనాథయొక్క మహాభవనముగలదు -29 ఎడమభాగమున రత్న నిర్మితమైన దండనాథాభవనము గలదు. అర్ఘ్యస్థానమునకు పూర్వము -30 బ్రహ్మ విష్ణువు మహేశ్వరులయొక్క భవనముగలదు. అదీ రత్నకాంతులతో దిక్కులన్నింటిని వెలిగింప జేసినది. ఈ దేవతలందరు లలితాభక్తి నీండినవారు, లలితా మంత్రమును జపించువారు. శ్రీదేవిని ఉపాసింతురు. -31 ముందుజెప్పిన యర్యస్థానము, ముందుజెప్పిన యర్యకల్పనమును దక్షిణాది ద్వారములందంతట సమానమనబడినది-32. ఓ మహామునీ! ఇక చింతామణి గృహమును జెప్పెదనువినుము. అది శ్రీపటన మధ్యనున్నది. రెండుయోజనముల విస్తారముగలది-38. దానికి ఒక క్రోశము విస్తారముగల చింతామణిమయమైన గోడ. గలదు. అదీ చింతామణి శిలలతోను పైకప్పులతోను కప్పబడినది. -34 కూటరూపమున అచటచటను నెతైనది ఇంటిగోడయునట్లే నాలుగుయోజనములయెత్తైనది. దాని యొక్క భూమి యిరువదియోజనముల యొతైనది. ఆ పైన పొట్టిగాను లావుగాను ఉన్న మకుటముల (కిరీటములతో బ్రకాశించినదీ-36. ఓ మునీ! ఆ మకుటములు ఇచ్చా -క్రియా - జ్ఞాన రూపములు. అవి చింతామణిమయములై యెల్లపుడు వెలుగుచుండును-37. చింతామణి గృహమున సమస్తము చింతామణిమయమనబడినది. దానీద్వారములు నాలుగు. కోసున్నర పరిమాణము గలవి-38 ద్వారముల విస్తారము కోసుంపావు. చింతామణి గృహాంతరమున నన్ని ద్వారములలో -39. ఎఱ్ఱని సింధువువలె లలితాదేవి మూర్తి కప్ప బడియున్నది. అదీ వేలబాలసూర్యుల కాంతిగలది. చంద్రుని వలె చల్లనైనది. మాటి మాటికి ప్రవాహరూపమున ప్రసరించుచున్నది-40. తూర్పు ద్వారము పూర్వామ్నాయమయముగా చెప్పబడినది. దక్షిణ ద్వారము దక్షిణామ్నాయ లక్షణముగాలది-41. పశ్చిమ ద్వారదేశము పశ్చిమామ్నాయ లక్షణముగలది. ఉత్తరద్వార దేశము ఉత్తరామ్నాయ లక్షణముగలది -42. గృహరాజమధ్యలో గోడలో బిగించిన దండములతో పొదిగినవై బ్రకాశించు రత్నప్రదీపములున్నవి. అవి కోటి సూర్య సమానకాంతులు గలవి. అవి యంతటను ఉండి భవనము లోపలి భాగమునంతయు బ్రకాశింపజేయుచున్నవి-43. ఈ చింతామణి గృహము యొక్క గొప్పనైన మధ్యస్థానమున వేదికాభాగమున ఎతైనదై మహత్తరమైన బిందు చక్రముగలదు-44, చింతామణి గృహము యొక్క యెత్తైన గోడకును బిందువు (చక్రము)నకును మధ్య భూమి గలదు. అదీ గోడ యొక్క కోసును వదలి మూడు కోసుల పరిమాణముగలదీ-45, -అచట మూడుకోసుల స్థానమున అణిమాదులు తమ కాంతీలో ట్రకాశించును. ఆమూడుకోసుల మొత్తము మూరల కొలతలో ఇరువది నాలుగువేల మూరలదీయనబడును-46. బిందు పీరేశ పర్యంతము విభాగమున పదునాలుగు మూరలు మధ్యలో విభాగము జేసినచో మూరల సంఖ్యను జెప్పెదను-41. పద్మాటవీస్థలము నుండి చింతామణికి. గృహ మధ్యవరకు ఓ మునీ! ఇరువది మూరల యెత్తైనది. అట అణిమాదులుండును-48. అణిమలోని విస్తారము, పదునారు వందల మూరలు. నల్వమనగా నన్నూరు మూరలు. కిష్కు అనగా మూరయనబడును-49. అట మధ్యలో అడీమాదులు (అణిమ మొదలగు శక్తులు). తూర్పు మొదలుగామందిరముల నిర్మించుకొనిరి. అణిమ మహిమ, లఘిమ, గరిమ, ఈశిత్వము, వశిత్వము, ప్రాకామ్యము, ముక్తి, ఇచ్ఛ, ప్రాప్తి, సర్వకామ అనునవి ఉత్తమములైన సిద్ధులు -51. రససిద్ధి, మోక్ష సిద్ధి, బలసిద్ధి, ఖడ్గ సిద్ధి, పాదుకాసిద్ధి, అంజన, సిద్ది-52. వాక్సిద్ధి, లోకసిద్ధి, దేహసిద్ధి, ఇవి యెనిమిది (?) సిద్ధులు. తక్కిన యోగీసంమతములైనవి పెక్కులు-53. ఓ మునీ! అచట అణిమాదుల మధ్యన కోట్ల కొలది సిద్ధులు పరమేశ్వరి చుట్టును సేవింతురు-54 కొంగొత్త యందాల నింపుకొని, చిరునవ్వు ముఖకమలముగలిగి, వెలిగెడి చింతామణులు చేతిలోగలిగి, నిత్యము పదునారేండ్ల ప్రాయపువారై, మిక్కిలి యుదారమైన ప్రకృతులు గలవారై శక్తులు మదముతో క్రీడింతురు-55, అయణిమాదుల మధ్యకు పైన సుమనోహరమైనదియు, ఇరువదీ మూరలయెత్తైనదీయు, పదునారువందల మూరల విస్తారమైనదియు-56. నలుదెసల మెట్ల పంక్తులతో మిక్కిలి మనోహరమైనదియునైన బ్రహ్మాదుల యాకాశభవనముండును, అటనుండు దేవతలను వినుము-57. బ్రాహ్మి, మాహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, మాహేంద్రి. ఏడవయామె చాముండ, ఎనిమిదవది మహాలక్ష్మి వీరు అచట తమ భవనముల నిర్మించుకొనిరి. -58. నానా విధాయుధములుగల వారును, నానాశక్తుల రక్షణ కవచముగల వారును నైన వీరు తూరుపు - దక్షిణము - పశ్చిమము - ఉత్తరము - ఈ వరుసలో మందిరముల నిర్మించుకొన్నారు-59, ఓ యగస్త్యా! తరువాత, బ్రాహ్మి మధ్యన బానిపై యిరువది మూరలు ఎత్తుగా వంగినదీయు, పదునారుమూరల. విస్తారము గలదియునై మూడు విధములైన ముద్రాంతరముగలదు. అచట ముద్రలు (శక్తులు) తమ నివాసములనేర్పరచుకొన్నవీ-60), - సంక్షోభిణి, ద్రావణీ, కర్షణీ, వశ్య, ఉన్మాదిని, మహాంకుశ, ఖేచరి, బీజయోని, త్రిఖండ, దశమి-61. ఇవి తూరుపు దక్షిణము మొదలగు వరుసలో దశదిక్కులలో ప్రతిష్టింపబడినవి. ఆ ముద్రశక్తులు మిక్కిలి సుందరమైన యాకారములు గలవారు, నవయౌవనముచే వివశలు-62 మనోహరమైనకాంతుల గృహములోనంతటను నింపుచు. ఓ మునిశ్రేషా! లలితా పరమేశ్వరిని సేవింతురు-63. మూడింటి (?) మధ్యన త్రైలోక్య మోహనమైన చక్రము గలదు. ఈ శక్తులలో ' ఆ ప్రకటింపబడిన యాధిపత్యములు గల శక్తులు ఉన్నారు (?)-64. వీరికి అధిష్ఠాత్రి త్రిపుర చక్రనాయక. ఆమె యా చక్రమును పాలించునది. ముద్రాసంక్షోభణ స్వరూపిణి-65. ఇక ముద్రాంతరము యొక్క పైన నిత్యాకలాంతరము చెప్పబడినది, అది యిరువది మూరల యెత్తైనది. పదునారు మూరల విస్తారము గలది. పర్వతమే యుత్తరోత్తర సోపానమని తలపబడినది. -66. ఆ నీత్యాకలామధ్యన కామముస్తాకర్షించువారు, సుఖస్వరూపిణులు, చుట్టును స్థితి నేర్పరచుకొన్నవారునైన షోడశ కళా స్వరూపిణులు-67. వారు చల్లని యమృత ప్రవాహములచే దిక్చక్రమును తృప్తి చెందింతురు. ఓ యగస్త్య మునీ! వారి నామములను నేను జెప్పెద వినుము-68. కామాకర్షణీకయైన నిత్యమైన కళ, అద్ద్యాకరణికమైన, నిత్యమైన కళ, రసాకర్షణీకయై నిత్యయైన కళ, గంధాకరడికయై నీత్యయైన కళ, స్కృత్యాకరణికమై నిత్యయైన కళ, నామాకర్షణికమై నిత్యయైన కళ-70. బీజాకర్షణికమై నిత్యయైన కళ, అర్ణాకర్షణీకయై నిత్యయైన కళ, అమృతాకర్షణికమై నిత్యయైన కళ, శరీరాకర్షణీకయై నిత్యమైన కళ-71. ఈ యేడుగురు యోగీనులు. త్రిపురేశ్వరీ మాత్రము చక్రిణి. సర్వాశా పరిపూరకయను. చక్రమునకధిష్టాన దేవత-72. ఈ చక్రమున పాలకురాలు. ద్రావణికయనబడు ముద్ర. నిత్యాకలాంతరమునకు పైన అతిసుందరమైన భవనము గలదు. అది యిరువది మూరల యెత్తైనది. పదునారు వందల మూరల విస్తారము గలది. పూర్వము వలెనే మెట్లతో గూడినది. దానిపేరు సర్వసంక్షోభము-74. అచట ఎనమండుగురు శక్తులున్నారు. వారు తీవ్ర మదముచే నెఱనైన కండ్లు గలవారు. నవయౌవనముచే మత్తెక్కిన వారైనను పరమేశ్వరిని సేవింతురు-75. కుసుమ, మేఖల, మదన మదనాతుర, రేఖ, వేగిని, అంకుశ, మాలిని - వీరినమండుగురు. శక్తులు-76, వారి కోట్ల కొలదీ పరివారములు అనంగ మొదలైన వారు. ఇది సర్వ సంక్షోభణమను చక్రము. దాని యధీదేవత-77. సుందరియను పేరు గలదని తెలియవలెను. ఆమె పేరుతో మిక్కిలి నిగూఢమైనది. ఆమె చక్రమును పాలించునది. కరణీకయను ముద్రయనబడినది. -78. ఓ మునీ! అనంగ శక్యంతరము యొక్క పైన ఇరువది మూరల యెత్తైనదియు, పదునారు వందల మూరల విస్తారము గలదు. అది సర్వ సౌభాగ్యదాయకము-79. అచటి సర్వ సంక్షోభిణి మొదలగు శక్తులు ఉద్దతలై పదునలుగురు ఉందురు. పార్టీ పేరులను నేను జెప్పెద వినుము-80. సర్వ సంక్షోభిణీ శక్తి, సర్వ విద్రావిడీ శక్తి, సర్వాకర్షిణికా శక్తి, సర్వాహోదనికా శక్తి,-81. సర్వసంమోహినీ శక్తి, సర్వ స్తంభన శక్తి, సర్వజృంభణికా, శక్తి, సర్వ వశంకరీ. శక్తి-82. సర్వరంజన శక్తి, సర్వోన్మాదన శక్తి, సర్వార్థసాధికా శక్తి, సర్వసంపత్తిపూరిణీశక్తి-63. సర్వమంత్రమయీ శక్తి, సర్వద్వంద్వక్షయంకరీ శక్తి, ఈ శక్తులు సంప్రదాయ నామములు గలవారు. వారు చక్రిణీపురమున నివసించువారు-84. సర్వవశ్యనామముగల ముద్రలు ఆ చక్రమున రక్షించువారుగా జెప్పబడిరి. వారి సేవికలుగా కోట్లకొలది శక్తులుద్దరింపబడిరి-85, ఓ యగస్త్యమునీ! సంక్షోభిణ్యాద్యంతము యొక్క పైన ఇరువది మూరల యెత్తైనది. పదునారు వందల -మూరల విస్తారము గలదియునైన సర్వసిద్ధాదికల మందిరము విష్ట్యమనబడును-66. సర్వసిద్ధిప్రద, సర్వసంపత్ర్పద, సర్వప్రియంకరీదేవి, సర్వమంగళకారిణి-87. సర్వకామప్రదాదేవి, సర్వదుఃఖవిమోచని, సర్వమృత్యుప్రశమనీ, సర్వవిఘ్ననివారిణి-88. సర్వాంగసుందరీదేవి, సర్వసౌభాగ్యదాయిని, ఈ దేవులు కళలతో చెక్కబడినవారు. పేరున యోగినులనబడిరి-89. తరువాత చక్రిణియనియు శ్రీ యనియు తెలియవలెను. చక్రము సర్వార్థములను సాధించునది. సర్వోన్మాదనముద్రలు చక్రమును పరిపాలించువారు-90. ఓ యగస్త్య మునీ! సర్వసిద్ద్యాద్యంతరము యొక్క పైన యిరువది మూరల యెత్తెనదీయు, పదునారు మూరల విస్తారము. గలదియునైన సర్వజ్ఞాద్యంతరమనునది గలదు. అది సర్వరక్షాకరచక్రము-91, మిక్కిలి గొప్పది. దివ్యమైనది. సర్వజ్ఞాదులు శక్తులుగా జెప్పబడిరి. -92. సర్వజ్ఞ, సర్వశక్తి, సర్వైశ్వర్యప్రదాయిని, సర్వజ్ఞానమయీదేవి, సర్వవ్యాధివినాశిని-93. సర్వాధారస్వరూప, సర్వపాపహరి, సర్వానందమయీదేవి, సర్వరక్షాస్వరూపిణి-94. సర్వేప్సితప్రద, వీరు గర్వములేని యోగినీశ్వరులు-95. మాలిని, చక్రిణి, సర్వమహాంకుశముద్రలుగజేప్పబడిరి. ఈ విధముగా చింతామణి గృహమున సర్వజ్ఞాద్యంతరమువరకు కొన్ని చక్రములు చెప్పబడినవి. ఓ మునీ! తక్కిన వానిని గూడ వినుము-96.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణముననుత్తరభాగమున హయగ్రవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యామున చింతామణిగృహాంతరకథనమను ముప్పదియాఱవ యధ్యాయము 36.