41 - ఏకచత్వారిoశోధ్యాయః

అగస్త్య ఉవాచ:

కీదృశం యంత్రమేతస్యా మంత్రో వా కీదృశో వరః

ఉపదేష్టా చ దృస్యాచ్ఛిష్యో వా దృశః స్మృతః

సర్వజస్త్వం హయగ్రీవ సాక్షాత్పరమపూరుషః

స్వామీన్మయి కృపాదృష్ట్యా సర్వమేతన్నివేదయ

అగస్త్యుడనెను:- ఈమెయంత్రమెట్టిది? శ్రేష్టమైన యీయెమంత్రమెట్టిది? ఉపదేశించువాడెట్టి వాడుగావలెను? శిష్యుడెట్టివాడుగావలెను? -1. ఓహయగ్రీవ! నీవు సర్వజ్ఞుడవు, సాక్షాత్తు పరమపురుషుడువు, స్వామీ! నాయందుకృపజూడుము. ఇదియంతయు దెలియజేయుము.

హయగ్రీవ ఉవాచ:

మంత్రం శ్రీచక్రమేవాస్యాః సేయం హి త్రిపురాంబికా

సైషైవ హి మహాలక్ష్మీః స్ఫురచ్చేవాత్మనః పురా

పశ్యతి స సదా చక్రం జ్యోతిర్మయవిజృంభితమ్

అస్య చక్రస్య మాహాత్మ్యమపరిజ్ఞేయమేవ

సాక్షాచ్చెవ మహాలక్ష్మీ శ్రీచక్రమితి తత్త్వతః

యదభ్యర్య మహావిష్ణుః సర్వలోకవిమోహనమ్

కామసంమోహినీరూపం భేజే రాజీవలోచన

అర్చయిత్వా తదీశానః సర్వవిద్యేశ్వరోభవత్

తదారాధ్య విశేషేణ బ్రహ్మా బ్రహ్మాండసూరభూత్

మునీనాం మోహనశాసీత్ స్మరో యద్వరివస్యయా

శ్రీదేవ్యాః పురతశ్చక్రం హేమరౌప్యాదినిర్మితమ్

నిధాయ గంధైరభ్యర్య షోడశాక్షరవిద్యయా

ప్రత్యహం తులసీపతైః పవితైర్మంగలాకృతిః

సహసైర్మూలమంత్రేణ శ్రీదేవీధ్యానసంయుతః

అర్చయిత్వా చ మధ్వాజ్యశర్కరాపాయసైః శుభైః

అనవద్యైశ్చనైవేద్యైర్మాషాపూపైర్మనోహరైః

యః ప్రీణాతీ మహాలక్ష్మీం మతిమాన్మండలత్రయే

సహసా తస్య సాంనిధ్యమాధత్తే పరమేశ్వరీ

మనసా వాంఛితం యచ్చ ప్రసన్నా తత్రపూరయేత్ ధవలైః

కుసుమైశ్చక్రముక్తరీత్యా తు యో ఽర్చయేత

తస్యైవ రసనాభాగే నిత్యం నృత్యతి భారతీ పాటలైః

కుసుమైశ్చక్రం యోర్చయేదుక్తమార్గతః

సార్వభౌమం చ రాజానం దాసవదశయేదసౌ

పీతవర్ణాః శుభైః పుషైః పూర్వవత్పూజయేచ్చ యః

తస్య వక్షస్థలే నిత్యం సాక్షాఛ్ఛీర్వసతి ధ్రువమ్

దుర్గంధైర్గంధహీనైశ్చ సువడ్డెరపి నార్చయేత్

సుగంధైరేవ కుసుమైః పుషైశ్చాభ్యర్చయేచ్ఛివామ్

కామాక్ష్యేవ మహాలక్ష్మీశ్చక్రం శ్రీచక్రమేవ హి

శ్రీవిదైషా పరా విద్యా నాయికా గురునాయికా

ఏతస్యా మంత్రరాజు శ్రీవిద్యైవ తపోథన

కామరాణాంతమంత్రాంతే శ్రీబీజేన సమన్వితః

షోడశాక్షరవిద్యేయం శ్రీవిద్యేతి ప్రకీర్తితా

ఇత్తం రహస్యమాఖ్యాతం గోపనీయం ప్రయత్నతః!

తిసృణామపి మూర్తీనాం శక్తిర్విద్యేయమీరితా

సర్వేషామపి మంత్రాణాం విద్యైషా ప్రాణరూపిణీ

పారంపర్యేణ విజ్ఞాతా విద్యేయం బంధమోచీనీ

సంస్కృతా పాపహరిణీ జరామృత్యువినాశనీ

పూజితా దుఃఖదౌర్భాగ్యవ్యాధిదారిద్ర్యనాశినీ

స్తుతా విఘ్నఘశమినీ ధ్యాతా సర్వార్థసిద్ధిదా

 ముద్రావిశేషతత్త్వజ్ఞో దీక్షాక్షపితకల్మషః భజేద్యః

పరమేశానీమభీష్టఫలమాప్నుయాత్

ధవలాంబరసంవీతాం ధవలావాసమధ్యగామ పూజయద్ధవలైః

పుష్పైర్బహ్మచర్యయుతో నరః ధవలైశ్చైవ నైవేద్యైర్ధధిక్షీరాదనాదిభిః

సంకల్పధవలైర్వాపి పూజయేత్పరమేశ్వరీమ్

శ్రీర్వాలు త్ర్యక్ష (త్యక్షరీ) బీజైః క్రమార్థండేషు యోజితామ్

షోడశాక్షరవిద్యాం తామర్చయేచ్ఛుద్ధమానస

అనులోమవీలోమేన ప్రజపస్మాత్రీకాక్షరైః

భావన్నేవ దేవాగ్రే శ్రీదేవీం దీపరూపిణీమ్

మనసోపాంశునా వాపి నిగదేనాపి తాపసు

శ్రీదేవీన్యాససహితః శ్రీదేవీకృతవిగ్రహ

 ఏకలక్షజపేనైవ చుహాపాపైః ప్రముచ్యతే

లక్షద్వయేన దేవక్షే సప్తజన్మకృతాస్యపీ

పాపాని నాశయత్యేవ సాధకస్య పరా కలా

లక్షత్రితయజాపేన సహస్రజనపాతకైః ముచ్యతే

నాత్ర సందేహో నిర్మలో నితరాం మునే క్రూత్

షోడశలక్షేణ దేవీసాలనిధ్యమాప్నుయాత్

పూజా శ్రేకాలకీ నిత్యం జపస్తరణమేవ చ

హోమో బ్రాహ్మణభుక్తిశ్చ పురశ్చరణముచ్యతే

హోమతర్పణయోః స్వాహాన్యాసపూజనయోర్నమ

మంత్రాంతే పూజయేద్దేవీం ఇపకాలే యథోచితము

జపార్దశాంశో హోమః స్యాత్తర్దశాంశం తు తర్పణమ్

తద్దశాంశం బ్రాహ్మణానాం భోజనం వింధ్యమర్ధన

దేశకలోపఘాతే తు యద్యదంగం విహీయతేః

తత్సంఖ్యాదిగుణం జప్త్వాపురశ్చర్యాం సమాపయేత్

తతః కామ్యప్రయోగార్థం పునర్లక్షత్రయం జపేత్

ప్రతణ్ణి నిర్వీకారశ్చ త్రికాలం పూజనే రతః

పశ్చాద్వశ్యాదికర్మాణి కుర్వన్ సిద్ధిమవాప్స్యతి అభ్యర్చ్య

చక్రమధ్యస్ట్రో మంత్రి చింతయతే యదా

సర్వమాత్మానమరుణం సాధ్యమప్యరుణీకృతము

తతో భవతి వింధ్యారే సర్వసౌభాగ్యసుందరి వల్లభః

సర్వలోకానాం వశయేనాత్ర సంశయః

రోచనాకుంకుమాభ్యాం తు సమభాగం తు

చందనమ్ శతమష్టోత్తరం జప్త్వా తిలకం కారయేద్బుధ

తతో యమీక్షతే వక్తి స్పృశతే చింతయేచ్చ యమ్

అర్థన చ శరీరేణ స వశం యాతి దాసవల్ తథా పుష్పఫలం గంధం పానం వస్త్రం తపోధన

శతమష్ణోత్తరం జప్త్వా యస్యై సంప్రెష్యతే స్త్రీయే

సద్య ఆకృష్యతే సాతు విమూఢ హృదయా సతీ

లిభేద్రోచనమైతాంతే ప్రతిమామవనీతలే సురూపాం

చ సశృంగారవేషాభరణమండితామ్

 తద్భాలగలహృన్నాభిజానుమండలయోజితమ్ జన్మనామమహావిద్యామంకుశోంతర్విదర్భీతమ్

సర్వాంగసంధిసంలీనామా లీఖ్య మదనాక్షరైః

తదాభిముఖో భూత్వా త్రిపురీకృతవిగ్రహ బద్ద్వా

తు క్షోభిణీం ముద్రాం విద్యామష్టశతం జపేత్

సంయోజక దహనాగారే చంద్రసూర్యప్రభాకులే

తతో విహ్వలితాపాంగీమనంగశరపీడితామ్

ప్రజ్వలన్మదనోన్మేషప్రస్ఫురజ్ఞఘనస్థలామ్

శక్తిచక్రే లసద్రశ్మివలనాకవలీకృతామ్

దూరీకృతసుచారిత్రాం విశాలనయనాంబుజామ్

ఆకృష్టనయనాం నష్టధైర్యసంలీనన్రీడనామ్

మంత్రయంత్రాషధ మహాముద్రానిగడబంధనామ్ నవానురాగసంధానవేపమానహృదంబుజామ్

మనోధికమహామంత్రజపమానాం హృతాంశుకామ్

విమూఢామివ విక్షుభౌమివ పుష్టామివాద్భుతామ్

లిఖితామివ నిఃసంజ్ఞామివ ప్రమథితామివ

నిలీనామివ నిశ్చేష్టామినాన్యత్వం గతామివ

భ్రమన్మంత్రానిలోద్భూతవేణుషత్రాకృతిం చ భేః

భ్రమంతీం భావయేన్నారీం యోజనానాం

శతాదపి చక్రమధ్యగతాం పృధ్వీం సశైలవనకాననామ్

చతుఃసముద్రపర్యంతం జ్వలంతీం చింతయేత్తత

షణ్మాసాభ్యాసయోగేన జాయతే మదనోపమమ్

దృష్ట్వా కర్షయతే లోకం దృష్ఠవ కురుతే వశమ్

దృష్ట్వా సంక్షోభయేన్నారీం1 దృష్టవ హరతే విషమ్

దృష్ట్వాకరోతి వాగీశం దృష్ట్వా సర్వం విమోహయేత్

దృష్ట్వా చాతుర్థికాదీంశ్చ జ్వరాన్నాశయతే క్షణాత్

పీతద్రవ్యేణ లిఖితం చక్రం గూడం తు ధారయేత్

వాక్సంథం వాదినాం క్షిప్రం కురుతే నాత్ర సంశయః

మహానీలీరసేనాపి శత్రునామయుతం లిఖేత్

దక్షిణాభిముఖో వహ్నౌ దగ్గా మారయతే రిపూన్

మహిషాశ్వపురీషాభ్యాం గోమూతైర్నామ టంకితమ్

ఆరనాలస్థితం చక్రం విద్వేషం కురుతే ద్విషామ్

యుక్త్వా రోచనయా నామ కాకపక్షేణ మధ్యగమ్

లంబమానసదాకాలో ఉచ్చాటనకరం పరమ్

దుగ్ధలాక్షారోచనాభిర్మహానీలీరసేన చ:

లిఖిత్వా ధారయంశ్చక్రం చాతుర్వర్యం వశం నయేత్

అనేనైవ విధానేన జలమధ్యే యది క్షిపేత్

సౌభాగ్యమతులు తస్య స్నానపానాన్న సంశయః

చక్రమధ్యగతం దేశం నగరీం వా వరాంగనామ్

జ్వలంతీం చింతయేన్నిత్యం సప్తాహాత్ క్షోభన్మునే

లిఖిత్వా పీతవర్ణం తు చక్రమేతద్యదాచరేత్

పూర్వాశాభిముఖో భూత్వా స్తంభయేత్సర్వవాదీనః

సిందూరవర్ణలిఖితం పూజయదుత్తరాముఖ

యదా తదో స్వవశగో లోకో భవతి నాన్యథా

చక్రం గైరికయాలిఖ్య పూజయేత్పశ్చిమాముఖ

యః స సర్వాంగనాకరవశ్యక్షోభకరో భవేత్

పూజయేడ్వింధ్యదర్పారే రహస్యేకచరో గిర్నౌ

అజరామరతాం మంత్రీ లభతే నాత్ర సంశయః

రహస్యమేతత్కథితం జాపితవ్యం మహామునే?

 గోపనాత్సర్వసిద్ధిః స్యాద్ర్భంశ ఏవ ప్రకాశనాత్

అవిధేయ పురశ్చర్యాం యః కర్మ కురుతే మునే

దేవతాశాపమాప్నోతి న చ సిద్దిం స విందతి

ప్రయోగదోషశాంత్యర్థం పునర్లక్షం జపేద్బుధః

కుర్యాచ్చ విధివత్పూజాం పునర్యోగ్యో భవేన్నరః

నిష్కామో దేవతాం నిత్యం యోర్చయేద్భక్తినిర్భరః

తామేవ చింతయన్నాస్తే యథాశక్తి మనుం జపన్

సైవ తస్యైహికం భారం వహేన్ముక్తిం చ సాధయేత్

సదా సంనిహితా తస్య సర్వం చ కథయేత

వాత్సల్యసహితా ధేనుర్యథా వత్సమనువ్రజేత్

తథానుగచ్ఛేతా దేవీ స్వభక్తం శరణాగతమ్ 

 అగస్త్య ఉవాచ:-

యః పుమానఖిలం భారమైహికాముష్మికాత్మకమ్

శ్రీదేవతాయాం నిక్షిప్య సదా తద్గతమానసః

సర్వానుకూలః సర్వత్ర ప్రతికూలవీవర్జితః

అనన్యశరణే గౌరీం దృఢ సంప్రార్ధ్య రక్షణే

రక్షిష్యతీతి విశ్వాససత్సేవైక ప్రయోజనః

వరివస్యాతత్పరః స్యాతో ఏవ శరణాగతీ

యదా కదాచిత్ స్తుతినిందనాదో నిందంతు లోకాః

స్తువతాం జనో వా ఇతి స్వరూపం సుధియా

సమీక్ష్య విషాదభీదే న భజేపన్నః

అనుకూలస్య సంకల్పః ప్రతికూలస్య వర్ణనమ్

రక్షిష్యతీతి విశ్వాసో గోప్తృత్వవరణం తథా

ఆత్మనిక్షేపకార్పణ్యే షడ్విధా శరణాగతీ

అంగీకృత్యాత్మనిక్షేపం పంచాంగాని సమర్పయేత్

నహ్యస్య సదృశం కించిద్భుక్తిముక్యోస్తు సాధనమ్

అమానిత్వమదంభిత్వమహింసా క్షాంతీరార్ణవమ్

ఆచార్యోపాసనం శౌచంఛైర్యమాత్మవినిగ్రహః

ఇంద్రియాధేషు వైరాగ్యమనహంకార ఏవ చ

జన్మమృత్యుజరావ్యాధిదుఃఖదోషానుదర్శనమ్

అసక్తిరనభిష్వంగః పుత్రదారగృహాదీష

నిత్యం చ సమచిత్తత్వమిషానిష్ణోపపత్తిషు

మయి చానన్యభావేన భక్తిరవ్యభిచారిణీ

వివిక్తదేశసేవిత్వమరతిర్జనసంసది

అధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనమ్

ఏతాని సర్వదా జ్ఞానసాధనాని సమభ్యసేత్

తత్కర్మకృత్తత్పరమస్తద్భక్తః సంగవర్జితః నిర్వైరః సర్వభూతేషు యః సయాతి పరాం శ్రియమ్

 గురుస్తు మాదృశో ధీమాన్ ఖ్యాతో వాతాపితాపనః

శిష్యోపి త్వాదృశః ప్రోక్తో రహస్యామ్నాయదేశిక

ఇతి శ్రీబ్రహ్మాండమహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్య సంవాదే లలితోపాఖ్యానే ఏకచత్వారింశోధ్యాయః

అగస్త్యుడనెను: ఈమె యొక్క మంత్రమెట్టిది? ఎట్టి మంత్రము శ్రేష్ఠము? దీని నుపదశించువాడెట్టి వాడు గాను, నుండవలె? అట్లే శిష్యుడుగూడ నెట్టివాడుగానుండ వలె? హయగ్రీవుడనెను: ఈమె యొక్క మంత్రము శ్రీ చక్రమే. ఆమె యే యాత్రిపురాంబిక. ఆ మెయే యీ మహాలక్ష్మీ పూర్వమాత్మనుండి స్ఫురించుచునే జ్యోతిర్మయముగా విజృంభించిన చక్రము నెల్లప్పుడు చూచుచుండెను-3. ఈ చక్రము యొక్క మాహాత్మ్యము తెలియనలవికానిదే కదా-4 సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మియే శ్రీచక్రమని నిజముగా దెలియవలె. దాని నర్చించి కమలలోచనుడైన మహా విష్ణువు సర్వ లోకములను మోహింపజేయునదై, కామునే మోహింపజేయు రూపమును బొందెను-5, ఆమె నర్చించీ యీశానుడు సర్వ విద్యలకీశ్వరుడయ్యెను, దానిని విశేషముగా నారాధించి బ్రహ్మ బ్రెహ్మాండములను గనినవాడయ్యెను. దాని సేవ చేత మన్మథుడు మునులనుగూడ మోహింపజేయువాడయ్యెను-6. బంగారు - వెండి - మొదలగువానిచే నిర్మింపబడిన చక్రమును శ్రీదేవి యెదుట నుంచవలె, గంధములతో-7. షోడశాక్షర విద్యతో (పదునారక్షరములుగల మంత్రముతో) నర్చింపవలె. మంగళమైన యాకారముగలవాడై ప్రతి నిత్యము వేయి తులసీ పత్రములతోను మూలమంత్రములతో శ్రీ దేవీ ధ్యానము జేయుచు నర్చింపవలె-8, తేనె, నేయి, శర్కరలతోగూడిన శుభ పాయసములతోను, మనోహరములై ఏ మాత్రమునిందింపరాని అపూపములతోడి (పిండివంటలతోడి) నైవేద్యముతో-9. మండల త్రయమున బుద్ధిమంతుడై మహాలక్ష్మిని సంతోషింపజేయువానికి వెంటనే పరమేశ్వరీ ప్రత్యక్షమగును-10. ఆతని మనస్సు కోరిన దానిననుగ్రహించును. తెల్లని పుష్పములతో ముక్తుని రీతిలో చక్రము నర్చించిన వాని నాలుకపైన సరస్వతీ నాట్యముజేయును. ఎఱ్ఱని పూలతో చక్రమును చెప్పినరీతిలో నర్చించినవాడు చక్రవర్తిని రాజును దాసునివలే వశీకరించుకొనును-12. పచ్చని వర్ణముగలిగి మంగళములైన పుష్పములచే నామెను బూజించినవాని యెదలో నిత్యము నిశ్చయముగా సాక్షాత్తు శ్రీదేవి యుండును. మంచి వర్ణముగలిగినను సుగంధములేని దుర్గంధముగల పుష్పములతో శివను బూజింపరాదు -14. కామాక్షియే మహాలక్ష్మి, చక్రము శ్రీచక్రమే కదా. ఈ శ్రీ విద్యయే పరా విద్య. ఈ నాయిక గురునాయిక-15. ఓ తపోధనా! ఈమె యొక్క : మంత్రరాజము శ్రీ విద్యయే. కామరాజాంతమంత్రాంతమున శ్రీబీజముతో గూడిన యీ షోడశాక్షరవిద్యయే శ్రీవిద్యయని చెప్పబడినది. (5ఏఈలహీం, హసకహలహీం, సకలహీం, శ్రీం) ఈ విధముగా రహస్యము చెప్పబడినది. ఇది ప్రయత్నముతో గోపనీయము. (దాచిపెట్ట తగినది)-16-17. త్రిమూర్తుల యొక్క శక్తి యీ విద్యయని చెప్పబడినది. అన్నీ మంత్రములకు ఈ విద్య ప్రాణ రూపిణి-18. పారంపర్యముగా. - (వంశపారంపర్యముగగాని గురు పారంపర్యముగగాని తెలిసికొన్న యీ విద్య బంధమునుండి (సంసారాదిబంధాదులనుండియు) విడివడజేయునది. పాపముల హరించునదిగను జరామృత్యువుల నశింపజేయునదిగను తలపబడినది-19. పూజించినవారికి దుఃఖ - దౌర్భాగ్య - వ్యాధి - దారిద్ర్యములను నశింపజేయును. స్తుతించినవారికి సత్కార్య విఘ్నముల బోగొట్టును. ధ్యానించిన వారికి సర్వార్థములను సిద్ధింపజేయును-20ముద్రా విశేషముల తత్త్వముల దెలిపిన వాడును మంత్రదీక్షచే నశించిన పాపములుగలవాడును. పరమేశానిని సేవించినవాడును కోరిన ఫలము లనందును-21. నరుడు బ్రహ్మ చర్యముతో నుండి తెల్లని వస్త్రముల ధరించినదియు తెల్లని యావాసము యొక్క (దేవ మందిరము యొక్క - పీఠము మొదలగువాని యొక్క మధ్యనున్నదియునైన శ్రీ దేవిని తెల్లని పుష్పములతో. బూజింపవలె-22. పెరుగన్నము - పాల అన్నము మొదలగు తెల్లని నైవేద్యములతోను లేదా సంకల్పముతో (మనమున భావనలో) తెల్లనివని భావించిన వానితోనైనను పరమేశ్వరిని పూజింపవలెను-23, 'శ్రీ' వాలమును త్ర్యక్షరీ బీజములతో క్రమముగా ఖండములలో జేర్చిన యాషోడశాక్షరీ విద్యను శుద్దమనసుడై యర్చింపవలె. (ఇచట మంత్ర స్వరూపము తెలియుట లేదు)-24. అనులోమ విలోమముగా మాత్రీకాక్షరములతో జపించుచు, దేవాగ్రమున శ్రీదేవీని దీపరూపిణిగా భావించుచు, ఓ మునీ! మనసుతో బలికిగాని, ధ్వనిలేక రహస్యముగా బలికిగాని, ధ్వనితో స్పష్టముగానుచ్చరించిగాని, శ్రీదేవీన్యాససహితుడై, శ్రీదేవిచే జేయబడిన (ఆత్మ) విగ్రహముగలవాడై ఒక లక్ష జపముజేసినచో మహా పాపముల నుండి విముక్తుడగును-27. ఓ దేవర్షీ! రెండు లక్షల జపముతో ఏడు జన్మల నుండి సాధకుడు చేసిన పాపములను పరాకళ నశింపజేయును-28. మూడు లక్షల జపమున వేయి జన్మల పాపముల నుండి విముక్తుడగును. పూర్తిగా నిర్మలుడగును. వరుసగా పదునాలు లక్షల జపమున దేవీ సాన్నిధ్యమునందును-29. ఇట నిత్యము త్రికాలముల (ప్రాతర్మధ్యాహ్న సాయంకాలముల) పూజ జరుగును. జపము, తర్పణము, హోమము, బ్రాహ్మణ భోజనము. పురశ్చరణమును చెప్పబడినవి (జరుగును)-30. హోమ తర్పణములకు స్వాహా, న్యాస పూజనములకు నమః. మంత్రాంతమున దేవిని పూజింపవలె. జప కాలమున తగినట్లుగా జేయవలె-31. జపములో పదవవంతు హోమముండును. హోమములో దశాంశము తర్పణముండును. తర్పణములో దశాంశము బ్రాహ్మణ భోజనముండును. (ఉదా: 1000 జపమైన, 100 హోమము - 10 తర్పణము -1 బ్రాహ్మణ భోజనము)-32. దేశమును బట్టి కానీ కాలమును బట్టిగాని హోమ తర్పణాదులకు విఘాతముగలిగినపుడు హోమ తర్పణాదుల సంఖ్యకు రెట్టింపు జపముచేసి 1000 జపమైన, 1000+100+10+1x2=2222 ఎక్కువగా జపముచేసి పురశ్చర్యను సమాప్తి చేయవలె, ( కేవలము హోమ విఘాతమైన 200 జపము. కేవలము తర్పణ వీఘాతమైన 20జపము, బ్రహ్మణభోజనమున విఘాతమైన2 జపము)-33, తరువాత కామ్య ప్రయోగమునకై మరలమూడు లక్షల జపము జేయవలె. అపుడు వ్రతమున నుండి నిర్వికారుడై మూడు కాలములలో పూజలో నాసక్తుడుగావలే. తరువాత వశ్యావశ్యాదికర్మలజేయుచు సిద్ధిని బొందగలడు-34, మంత్రోపాసకుడు దేవి నర్చించి చక్రమధ్యముననున్నవాడై తనను మొత్తమెట్టిని వానిగను, ఎఱ్ఱగా జేయబడిన సాధ్యునిగను ధ్యానించినవాడు-35. ఓ వింధ్యారియైన యగస్త్యా, సర్వసౌభాగ్యసుందరుడగును. సర్వలోకములకు ప్రియపతియై వశమునందుంచుకొనును. సంశయములేదు-36, పండితుడు నూటయెనిమిదిమారులు జపించి గోరోచనము - కుంకుమ - వీని సమభాగములతో చందనమును తిలకముసుగా ధరింపలె-37, దాని వలన వాడు తాను జూచినవానిని, తాకిన వానిని, తలచినవానిని వాని ధనములతో బాటు దాసుని వలె వశముజేసికోను-38. "అట్లే నూట యెనిమిదీ మారులు జపించి పుష్పమునుగానీ, ఫలమునుగాని, గంధమునుగాని, త్రాగువస్తువును (మధువు గాని, వస్త్రమునుగాని, యే స్త్రీకి పంపిన ఆ స్త్రీ వెంటనే మోహితయై యాకరీంపబడును-39, ఏకాంతమున భూమిపై గోరోచనముతో ఒక సురూపయు శృంగార వేష భూషలతోగూడినదియునైన ప్రతిమను వ్రాయవలె-40, ఆమె నుదురు - కంఠము హృదయము నాభి - పీక్కల ప్రదేశము - వీనిలో జేర్చబడిన జన్మనామమహావిద్యగలదీయు అంకుశాంతస్సులో జీల్చబడినదియునైన ఆమెను సర్వాంగ సంధిసంలీననుగా మదనాక్షరములతో వ్రాయవలె. (ఇచట భావము సందిగ్ధము), ఆమె యున్న దీక్కునకు ముఖముగా నయి త్రిపురాంబనే తనయాకారముగా భావించినవాడై-42. చంద్ర సూర్యకాంతులు నిండిన అగ్ని గృహమున (యాగ శాలలో జేర్చి క్షోభిణీముద్రను జూపి విద్యను నూటయెనిమిది మారులు జపింపవలె-43. ఆ తరువాత (అతడు చూచిన స్త్రీ యీ క్రింది విధముగ గాగలదు.) వీవశమైన కనుకోలుకులు గలది, మన్మథ బాణములచే పీడింపబడినది, ఉవ్వెత్తు వెలుగుచున్న మన్మథ వికాసమాయన్నట్లున్న జఘన భాగముగలది-44. శక్తి చక్రమున బ్రకాశించు కిరణవలయముతో కబళింపబడినట్లున్నది. సుచరిత్రమును దూరముజేసినది. విశాలమైన నేత్ర పద్మములు గలది, -45 ఆకర్షించినకన్నులుగలది. నష్టమైన ధైర్యమున లీనమైన సిగ్గుగలది (సిగ్గు వదిలినది). మంత్ర - యంత్ర - ఔషధ - మహా ముద్రలనెడి గొలుసులచే బంధింపబడినది. కొత్త ప్రేమను గలుపుటలో కంపించు హృదయ కమలముగలది-46. మనమునకు మించిన మహా మంత్రమును జపించుచున్నది. జారిన కోంగు కలది. విశేషముగ మోహితురాలివలెను, మిక్కిలి క్షోభజెందిన దానివలెను - కాల్పబడినదానివలెను, ఆశ్చర్యముగా నున్నది-47 - వ్రాయబడిన చిత్తరువువలె నున్నది. చైతన్యములేనిది వలె నున్నది. మిక్కిలి (యొదలో) మధింప బడినదీవలె నున్నది. పూర్తిగా విలీనమైనదీవలే నున్నది. నిశ్చేష్టురాలివలెనున్నది. తన్నుతానుగాకాక వేరొకరితయైనదివలెనున్నదిగా తానుబూచిన స్త్రీ కాగలదు-48 ఆకాశమున తిరుగుచున్న మంత్రవాయువుచే నెగురగొట్టబడిన వెదురుటాకువంటిదై నూరు యోజనముల దూరమునుండియు దిరుగుచున్న స్త్రీని భావింపవలె-49. తరువాత పర్వతములు అడవులు గలిగి చక్రమధ్యనున్న భూమిని నాలుగు సముద్రముల పర్యంతము మండుచున్నట్లుగా ధ్యానింపవలె-50. ఆ మాసముల యభ్యాసయోగముతో మన్మథునితో సమానుడగును. చూచి యే, లోకమునాకర్షించును. చూచియే వశపరచుకొనును-51. చూచియే స్త్రీని క్షోభింపజేయును. చూచియే విషమునుగూడ హరించును. చూచియే- వాక్కుల కీశుని (బ్రహ్మగా) జేయును. చూచియే సర్వమును మోహింపజేయును-52. పచ్చద్రవ్యముతో వ్రాసిన చక్రమును. రహస్యముగా ధరించిన, ప్రతివాదులకు వాక్ స్తంభము (మాట కట్టుబడిపోవుట)ను జేయును. ఇట సంశయములేదు-53, మహానీలీరసముతో శత్రు నామమును వ్రాసి దక్షిణాభిముఖుడైయగ్నిలో. గాల్చినచో నది శత్రువుల నుజంపును-54 దున్న - గుణము. వీని పేడ - లద్దులతో గోమూత్రములతో పేరును వ్రాసినయన్నమందున్న : చక్రము శత్రువులలో పరస్పర శత్రుత్వమును గలుగజేయును-55, కాకిరెక్కతో గోరోచనముతో మధ్యన పేరు వ్రాసిన చక్రము ధరించినచో కాకివలెనే శత్రువు ఆకాశ మధ్యన వ్రేలాడును, ఇది గొప్ప ఉచ్చాటనకరము- 56, పాలు - లాక్షారసము - గోరోచనములతోను మహా నీలీరసముతోను పేరును వ్రాసి చక్రమును ధరించినచో చాతుర్వర్యము (నాలుగు జాతులు) వశమగును-57: ఈ విధానముతోనే జల.. మధ్యనుంచినచో వాని స్నాన పానములవల్ల సాటిలేని సౌభాగ్యము నిశ్చయముగా లభించును-58, దేశమును, నగరిని, వరాంగనను చక్ర మధ్యగతముగా ధ్యానించినచో ఏడు దినములలో వారిని క్షోభింపజేయును-59. పచ్చ వర్ణముతో చక్రమును వ్రాసి తూరుపు మొగమై పూజించినచో సర్వ ప్రవాదులను స్తంభింపజేయును-60. సింధూర వర్ణముతో చక్రమును వ్రాసి ఉత్తరముఖుడై పూజించినచో .. . ఎప్పుడనిన నపుడే లోకము తన వశమగును. వేరుగాదు-61. గైరీకధాతువుతో చక్రమును వ్రాసి పశ్చిమ ముఖుడై పూజించిన సర్వాంగనలను. ఆకర్షించి క్షోభింపజేసి వశము జేసికొనును-62, ఓ అగస్త్యమున్నీ.. రహస్యముగ పర్వతమున నొంటరిగా దొరుగువాడై చక్రమును బూజించిన అజరామరుడు (ముసలి తనము మరణములేనివాడు) అగును. సంశయములేదు -63. ఈ రహస్యమునంతయుజెప్పితిని. మహామునీ! శ్రీమంత్రరాజమును జపించవలె. రహస్యముగానుంచుటవలన సర్వసిద్ధిగలుగును. బయలుపెట్టిన చో భ్రంశమే జరుగును-64 ఓమునీ! పురుషుడు పురశ్చర్యజేయక చేసిన పని వలన దేవతా శాపమునందును. వాడు. సిద్ధిని పొందడు-65 ప్రయోగ దోషశాంతీ కొఱకు పండితుడు మరొక లక్ష జపము చేయవలె. విధి విధానమున పూజ జేయవలె. అపుడు నరుడు మరలయోగ్యుడగును-66. భక్తితో నిండి నిష్కాముడై నిత్యము శ్రీ దేవతను బూచించువాడు, యథాశక్తి ఆమెనే ధ్యానించుచు మంత్రము జపించువాని యైహిక (ఈ. లోకపు) భారమాయెయే వహించును-68. ముక్తిని గూడనిచ్చును. ఎల్లప్పుడును దగ్గరుండి యామై యంతయు జెప్పును-69. దూడపై ప్రేమతో. తల్లియావు దూడను వెంబడించినట్లే దేవి శరణాగతుడైన భక్తుని వెంబడించును-70. అగస్త్యుడనెను:- ఐహికాముష్మిక (ఇహపరలోక) భారమును శ్రీదేవి యందేయుంచి, యామె యందే మనమును లగ్నముజేసినవాడు-72. సర్వానుకూలుడై (సర్వులు వీనికనుకూలురై) సర్వ ప్రతికూలములు లేనివాడగును, ఇతర రక్షణములేనివాడనియు దేవియే యేక మాత్ర రక్షణమనియు తలచిన వాడైతన్ను రక్షించుమని - దృఢముగా భ్రార్థించినవానిని ఆ మహాదేవి రక్షింపగలదు. -- అను విశ్వాసమేయిచట ముఖ్య ప్రయోజనము. జనుడు. ఆమె .. సేవాతత్పరుడుగావలెను, ఆమెయే శరణాగతీ-75-74, ఎపుడైనను స్తుతినిందాదులతో లోకులు నిందించనీ జనుడు స్తుతింపనీ దేవి. స్వరూపమును చక్కనీ బుద్దీతో సమీక్షించి శరణాగతి పొందినవాడు విషాద భేదములను బొందడు-75. అనుకూలము యొక్క సంకల్పము, ప్రతికూలము యొక్క వదలుట, రక్షింపగలడు అని విశ్వాసము, రక్షించువానినెన్నుకొనుట-76. ఆత్మ నిక్షేపము కార్పణ్యము. - ఈ విధముగా , శరణాగతి యాయువిధములు. ఆత్మ నిక్షేపమునంగీకరించినపుడు. పంచాంగములను సమర్పింపవలే. దీనికి సమానమైన భక్తిముక్తులసాధనము లేదు-77, అమానత్వము, (గర్వము లేకుండుట). అదంభిత్వము (కపటములేకుండుట). అహింస, క్షాంతి  (సహనము), ఆర్జవము (వంకరలేక చక్కన) ఆచార్యోపాసనము (గురూహసనము) శౌచము, ఛైర్యము (చాంచల్యము లేక స్టీరముగానుండుట), ఆత్మవినిగ్రహము (ఆత్మను స్వాధీనమందుంచుట)-8. ఇంద్రియార్థములందు వైరాగ్యము (శబ్ద స్పర్శ రూపర సగంధములయెడ వైరాగ్యము) అనహంకారము (నేనను భావములేమి) జన్మ-మృత్యు - జరావ్యాధుల దుఃఖములను దోషముగా జూచుట, పుత్ర-భార్యాగృహములందు అంటి పెట్టుకొనకయుండుట-79. ఇష్ట - అనిష్టముల యెడ నిత్యము సమభావము, నాయందు ఏకీభావమై అవ్యభిచారిణియైన (మరొకరిని బొందని) భక్తి-80. ఏజనమునందుండట, జన సమూహములందాసక్తిలేమి, అధ్యాత్మ జ్ఞానముతో - నిత్యుడగుట, తత్త్వజ్ఞానార్థములజూచుట, ఇవియన్నియు జ్ఞాన సాధనములు, వాటినెల్లప్పుడభ్యసింపవలె-61. ఆమె కర్మల జేయువాడు, ఆమె పరమయని భావించువాడు, ఏ సంగములేనివాడు, సర్వప్రాణులందు వైరము లేనివాడు, పరాశ్రీని పొందును-2 ఓ వాతాపిసంహారకా! - గురువు నావంటి బుద్ధిమంతుడు రహస్యముగ నామ్నాయమును (ఆగమములను) ఉపదేశించును. శిష్యుడుగూడ నీ వంటివాడే శిష్యుడు-83.

ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున ఉత్తరభాగమున హయగ్రీవాగస్త్యసంవాదమున లలితోపాఖ్యానమున నలుబదియొకటవయధ్యాయము-41.