బ్రహ్మాండ మహా పురాణము
61 - గాంధర్వమూర్చనాలక్షణము
సూత ఉవాచ :-
విసర్గం మనుపుత్త్రాణాం విస్తరేణ నిబోధత ।
పృషధ్రో హింసయిత్వా తు గురోర్గాం నిశి తత్క్షయే ॥
శాపాచ్ఛూద్రత్వమాపన్నశ్చ్యవనస్య మహాత్మనః ।
కరూషస్య తు కారూషాః క్షత్రియా యుద్ధదుర్మదాః ॥
సహస్రం క్షత్రియగతో విక్రాంతః సంబభూవ హ ।
నాభాగో దిష్టపుత్రస్తు విద్వానాసీద్భలందనః ॥
భలందనస్య పుత్రోఽభూత్ప్రాంశురామ మహాబలః ।
ప్రాంశోరేవోభవత్పుత్రః ప్రజాపతిసమో నృపః ॥
సంవర్తన దివం నీతః ససుహృత్సహబాంధవః ।
విహాదోత్ర మహానాసీత్సంవర్తస్య బృహస్పతేః ॥
ఋద్దిం దృష్ట్వా తు యజ్ఞస్య క్రుద్దస్తస్య బృహస్పతిః ।
సంవర్తేన తతో యజ్ఞే చుకోప స భృశం తదా ॥
లోకానాం స పా సొశాయ దేవతైరిసాదితః ।
మరుత్తశ్చక్రవర్తీ స సరిష్యంతమవాప్తవాన్ ॥
నరిష్యంతస్య దాయాదో రాణా దండధరో దమః ।
తస్య పుత్రస్తు విఖ్యాతో రాజాఽసీద్రాష్ట్రవర్ధనః ॥
సుధృతీస్తస్య పుత్రస్తు నరః సుధృతితః పునః ।
కేవలస్య చ పుత్రస్తు బంధుమానేవలాత్మజః ॥
అథ బంధుమతః పుత్రో ధర్మాత్మా వేగవానృప ।
బుధో వేగవతః పుత్రసృణబిందుర్బుధాత్మజః ॥
త్రేతాయుగముఖీ రాజా తృతీయే సంబభూవ హ ।
కన్యా తు తస్యేడవిడా మాతా విశ్రవసో పా సా ॥
పుత్రో యోని స్య విశాలోఽభూద్రజా పరమధార్మికః ।
దాశ్వాన్సఖ్యాతవీర్యాజా విశాలా యేన నిర్మితా ॥
విశాలస్య సుతో రాజా హేమచంద్రో మహాబలః ।
సుచంద్ర ఇతి విఖ్యాతో హేమచంద్రాదనంతరః ॥
సూతుఁడిట్లనెను. మనుపుత్రుల యొక్క సంతతిని విస్తరముగా నవగాహన చేసికొనుము. పృషధ్రుఁడు తన గురువు యొక్క గోవును ఆతనియింట (ఆశ్రమమున) నిశియందు గోయపరచెను. తత్క్షణమున మహాత్ముఁడయిన చ్యవనుని శాపము వలన నతఁడు శూద్రుఁడయ్యెను. కరూషుని సంతతులు. (వారసులు) క్షత్రియులు యుద్ధ దుర్మదులు. (యుద్ధ నైపుణ్యమున. దుర్మదులు). నాభాగుని వారసులు వేయి వర్గముల క్షత్రియగణములు. వారందరు విక్రమవంతులు. దీప్తుని పుత్రుడు భలందనుఁడు మంచి విద్వాంసుఁడు. భలందనుని కుమారుఁడు ప్రాంశువు ఆతఁడు మహాబలుడు. ప్రాంశువున కొక్కడే పుత్రుఁడు. ఆతడు ప్రజాపతితో తుల్యుఁడయ్యెను. ఆతఁడు సంవర్తనునితో, సహా సుహృత్ బంధు సహితముగా స్వర్గమునకు తీసికొనిపోవఁబడెను తద్విషయమును పురస్కరించుకొని, సంవర్తునకు బృహస్పతికి పెద్ద వివాదము జరిగెను. (5) ఆతని యజ్ఞము యొక్క ఋద్ధిని గొప్ప తనమును జూచి ఆతనితో బృహస్పతి కోపించెను, సంవర్తుండాచరించిన యజ్ఞములో లోకనాశనమునకు - ఆతఁడు మిక్కిలి కోపించెను. కానీ దేవతలచే నతఁడు శాంతిపడ చేసెను. చక్రవర్తి యైన మరుత్తుఁడు, తనకు. వారసునిగా నరిష్యంతుని గ్రహించెను. (7) నరీష్యంతుని దాయాది దముఁడు. ఆతఁడు దండధరుఁడు. ధర్మదండమును ధరించినవాఁడు. ఆతని కుమారుఁడు రాష్ట్ర వర్ధనుఁడు. ఆతఁడు చాల ప్రఖ్యాతి గన్నరోజు. ఆతని కుమారుఁడు సుధృతి. మరల ఆతని కుమారుఁడు నరుఁడు. ఆతని కుమారుఁడు కేవలుం డు. కేవలుని కొమరుఁడు బంధుమంతుఁడు. బంధుమంతుని కుమారుఁడు వేగవంతుఁడు అతఁడు ధర్మాత్ముడు, వేగవతుని పుత్రుఁడు బుధుండు. ఆ బుధునీ పుత్రుఁడు. తృణబిందువు. త్రేతాయుగము యొక్క ఆరంభమున ఆతఁడు రాజయ్యెను. ఆతని కూతురు ఇడవిడ. ఈమె విశ్రవసునికి తల్లియయ్యెను. ఆతని పుత్రుఁడు విశాలుఁడు ఆతడు పరమధార్మికుఁడు, రాజయ్యెను. ఏశాలుని యొక్క సుతుఁడు రాజు హేమచంద్రుఁడు. ఆతఁడో మహాబలుఁడు. హేమచంద్రుని యనంతరమతఁడు సుచంద్రుఁడని విఖ్యాతిగాంచెను.
సుచంద్రతనయో రాజా ధూమ్రశ్వ ఇతి విశ్రుతః ।
ధూమ్రశ్వతనయో విద్వాన్ సృంజయః సమపద్యత ॥
సృంజయస్య సుతః శ్రీమాన్సహదేవః ప్రతాపవాన్ ।
కృశాశ్వః సహదేవస్య పుత్రః పరమధార్మికః ॥
కృశాశ్వస్య మహాతేజా సోమదత్తః ప్రతాపవాన్ ।
సోమదత్తస్య రాజరేః సుతోఽభూజనమేజయః ॥
జనమేజయాత్మణశ్చైవ ప్రయతీర్నామ విశ్రుతః ।
తృణబిందుప్రభాపేణ సర్వే వైశాలి నృపాః ॥
దీర్ఘాయుషో మహాత్మానో వీర్యవంతః సుధార్మికాః ।
శర్యాతేర్మిథునం త్వానీదానర్తో నామ విశ్రుతః ॥
పుత్రః సుకన్యా కన్యా చ భార్యా యా చ్యవనస్య చ ।
అనర్తస్య తు దాయాదో రేవో నామ సువీర్యవాన్ ॥
ఆనర్తవిషయో యస్య పురీ చాపి కుశస్థలీ ।
రేవస్య రైవతః పుత్రః కకుద్మీ నామ ధార్మికః ॥
జ్యేష్ఠో భ్రాతృశతస్యాసీద్రాజ్యం ప్రాష్య కుశస్థలీమ్ ।
కన్యయా సహ శ్రుత్వా చ గాంధర్వం బ్రహ్మణాంతికే ॥
ముహూర్తం దేవదేవస్య మార్యం బహుయుగం విభో ।
అజగామ యువా చైవ స్వాం పురీం యాదవైర్వతామ్ ॥
కృతాం ద్వారవతీం సామ బహుద్వారా మనోరమామ్ ।
భోజవృష్ణంధకైరుప్తాం వసుదేవపురోగమైః ॥
తాం కథాం రేవతః శ్రుత్వా యథాతత్వమరిందమః ।
కన్యాం తు బలదేవాయ సువ్రతాం నామ రేవతీమ్ ।
దత్వా జగామ శిఖరం మేరోస్తపసి సంస్థితః ॥
రేమే రామశ్చ ధర్మాత్మా రేవత్యా సహితః కిల ।
తాం కథామృషయః శ్రుత్వా ప్రపచ్చుః తదనంతరమ్ ॥
సుచంద్రుని తనయుఁడు రాజు ధూమ్రాశ్వుఁడు. ఆతఁడు విశ్రుతుఁడు, ధూమ్రాశ్వుని కుమారుఁడు సంజయుఁడు. అతఁడు విద్వాంసుఁడు సృంజయుని కుమారుఁడు సహదేవుఁడు. మిక్కిలి ప్రతాపవంతుఁడు. కృశాశ్వుఁడు సహదేవుని పుత్రుఁడు. ఆతఁడు పరమ ధార్మికుఁడు. కృశాశ్వునీ కుమారుఁడు సోమదత్తుఁడు. అతఁడు మహాతేజస్వంతుఁడు, ప్రతాపవంతుఁడును. రాజర్షియైన సోమదత్తుని కుమారుఁడు జనమేజయుఁడు, జనమేజయుని ఆత్మజుఁడు ప్రమతి. చాల విశ్రుతుఁడు. తృణబిందుని ప్రభావము చేతను వైశాలిక ప్రభువులందరు దీర్ఘాయుష్మంతులు, మహాత్ములు, వీర్యవంతులు, సుధార్మికులును, శర్యాతి కవలలను కనెను. ఆతని కుమారుఁడు ఆనర్తుఁడు చాలా ప్రఖ్యాతీం గాంచేను, శర్యాతి కుమార్తె సుకన్య. ఆమె చ్యవనుని యొక్క భార్య. ఆనర్హుని యొక్క దాయాది దేవ నామకుండు. ఆతఁడు సువీర్యవంతుఁడు, ఆనర్తునీ విషయము (దేశము) ఆనర్తదేశము. ఆతని ముఖ్యపత్తనము కుశస్థలి. (తరువాత అది ద్వారకమైనది.) దేవునకు రైవతకుఁడు పుత్రుఁడు. ఆ రైవతునకు ‘కకుద్మి’ అనునది నామాంతరము. కకుద్మి ధార్మికుఁడు. ఈతఁడు తన సూర్గురు సోదరులలో జ్యేష్ఠుఁడు. ఆతడు కుశస్థలీ రాజ్యమును పొంది, తన కుమార్తెచే ననుగమింపఁబడి బ్రహ్మకడకేగెను. బ్రహ్మయంతికమున గాంధర్వ విద్యను (గానమును) ఆతడొక ముహూర్తకాలము వినెను. (బ్రహ్మసమక్షమున) నొకముహూర్త (48 నీముషములు) మేకాని, మానవగణనమున నాకాలము చాల యుగములు సాగెను. అయినను యువకునిగానే స్వనగరమునకేతెంచెను. కానీ ఆ పట్టణము యాదవులచేనప్పుడు ఆవృతమైయుండెను. ఆ పట్టణమునకు ‘ద్వారవతి’ యను నామకరణము చేయఁబడెను. అయ్యది భోజవృష్టి అంధక రాజులచే సంగుప్తము. ఆ భోజవృష్యంధకులకు వసుదేవుఁడు నాయకుఁడు రేవతుఁడు ఆ కథనంతయు వినెను. ఆతఁడు ఆరీందముఁడే. సువ్రతురాలు తన కన్యయునైన రేవతీనీ బలదేవునీ కొసంగి, మేరు శిఖరమునకు తపస్విగా నైయేగెను. ఆ రేవతితో ధర్మాత్ముఁడయిన బలరాముఁడు భోగించెను. ఈ కథను ఋషులు వినీ తరువాత ప్రశ్నించిరి.
ఋషయః ఊచుః :-
కథం బహుయుగే కాలే సమతీతే మహామతే ।
న జరా రేవతీం ప్రాప్తా రైవతం వా కకుద్మినమ్ ।
ఏతచ్ఛుశ్రూషమాణాన్నో గాంధర్వం వద చైవ హి ॥
సూత ఉవాచ :-
న జరా క్షుత్పిపాసే వా న చ మృత్యుభయం తతః ।
న చ రోగః ప్రభవతి బ్రహ్మలోకం గతస్య హ ॥
గాంధర్వం ప్రతి యచ్చాపి పృష్టస్తు మునిసత్తమాః ।
తతోఽహం సంప్రవక్ష్యామి యాథాతథ్యేన సువ్రతాః ॥
సప్త స్వరాస్త్రయా గ్రామా మూర్ఛనస్త్వేకవింశతిః ।
తానాశ్చైకోనపంచాశదిత్యేతత్స్వరమండలమ్ ॥
షడ్దర్షభౌ చ గాంధారో మధ్యమః పంచమస్తథా ।
ధైవతశ్చాపి విజ్ఞేయస్తథా చాపి నిషాదకః ॥
సౌవీరా మధ్యమా గ్రామా హరిణాశ్చ తథైవ చ ।
తస్యాః కోలోయనోపేతా శ్చతుర్థా శుద్ధమధ్యమాః ।
నగ్నించ పౌషా వై దేవ దృష్ట్వా కాంచ యథాక్రమః ॥
మధ్యమధ్రామికాభ్యారా షడ్జగ్రామా నిబోధత ।
ఉత్తరం మంద్రా రజనీ తథా వాచోన్నరాయతాః ॥
మధ్యషడ్జా తథా చైవ తథాన్యా చాభిముద్గణా ।
గాంధారగ్రామీకా శ్యామా కీర్తిమాన నిబోధత ॥
అగ్నిష్టోమం తు మాద్యం తు ద్వితీయం వాజపేయికమ్ ।
యవరాతస్తూయస్తు షష్ఠవత్తు సువర్ణకమ్ ॥
సప్త గౌసవనా నామ మహావృష్టికతాష్టమామ్ ।
బ్రహ్మదానం చ నవమం ప్రాజాపత్యమనంతరమ్ ।
నాగయక్షాశ్రయం విద్వాన్ తద్గోత్తరతథైవ చ ॥
ఋషులు ఇట్లనిరీ, ఓ మహామతీ ! చాల యుగములు గతించినను ఆశ్చర్యము ! రేవతికి (కకుద్మినికీ) పోర్ధక్యము రాకుండ నుండెను, దీనిని వినవలయుననీ కుతూహలముగా నున్నాము. గాన విద్యాశాస్త్రమును గూర్చి (గాంధర్వ విద్యను గూర్చి) చెప్పుము. సూతుఁడిట్లు చెప్పెను. బ్రహ్మలోకమున కరీగిన వానికి, వార్థక్యముగాని, ఆకలికానీ రోగముకాని, మృత్యువు వలన భయము కాని కలుగదు. (27) ఓ మునిసత్తమా ! సుప్రతులార ! మీరు నన్ను గాంధర్వ విద్య గూర్చి అడితిరి గాన, యథాతథముగా, ఉన్నదున్నట్లు వివరములతో చెప్పెదను. సప్తస్వరమండలము సప్తస్వరములతోను, మూఁడు గ్రామములతోను, ఇరువది యొకటీ మూర్ఛనలతోను, నలుబది యైదు తానములతోను కూడియున్నది. (వివరములు ప్రత్యేకముగా వ్రాసి అంటింతును) స్వరముల నామములు - షడ్జము (స) ఋషభము (రి) గాంధారము (గ) మధ్యమము (మ) పంచమము (ప) ధైవతము (ధ) నిషాదము (ని). వీనీన జాగ్రత్తగా గ్రహించవలయును (31,32,33,న వివరణము సరిగా లేదు. వాయు పురాణమున వేరుగా నీయఁబడినవి). ‘మ’ గణమున మూర్చనలు సౌవీరము, మధ్యమగ్రామము హరిణాస్యము, కాలోపబలోపేతము, కాలోపనత, శుద్దమధ్యమ సారంగీ, పావనియు (హృత్యక, దృష్టకమ్) అని క్రమముగా చెప్పబడినవి. (31,32) మధ్యమధ్రామికములుగా ప్రసిద్ధములయిన షడ్జగ్రామముల నెఱుంగుము. షడ్డగ్రామము స-మూర్ఛనలు (1) ఉత్తరం, మంద్రా (2) రజనీ, (3) ఉత్తరాయత (4) మధ్య షజ్ఞ, (5) అభిరుద్ధత, గాంధారము, గ్రామీకో, శ్రోమారులను, వర్తించెద నెఱుంగుము. అగ్నిష్టోమీక, (7) వాజపేయి 3 పౌండరీకము, 4, అశ్వమేధము, (5) రాజసూయకము, 6.సువర్ణకము, 7. గౌసౌవ(న)ము, 8. మహావృష్టికము, 9. బ్రహ్మాదానము, 10. ప్రాజాపత్యము, 11. నాగ యక్షాశ్రయము, 12. గోత్తమము.
పదక్రాంతమృగాక్రాంతం విష్ణుక్రాంతమనోహరా ।
సూర్యకాంతవరేణ్యైవ సంతకోకిలవిశ్రుతః ॥
తేనవానిత్యపవశపిశాచాతీవనహ్యపీ ।
సావిత్రమర్ధసావిత్రం సర్వతోభద్రమేవ చ ॥
మనోహరమధాత్ర్యం చ గాంధర్వాసుపతశ్చమయః ।
అలంబుషేసేష్టమథో విష్ణువైణవరావుభౌ ॥
సాగరావిజయం చైవ సర్వభూతమనోహరః ।
హతోత్సృష్ఠో విజానీత స్కంధం తు ప్రియమేవ చ ॥
మనోహరమధాత్ర్యం చ గంధర్వానుపతశ్చ యః ।
అలంబుసేష్టస్య తథా నారదప్రియ ఏవ చ ॥
కథతో భీమసేనేన నగరానయ ప్రియః ।
వికలోపనీతవినతాశ్రీరాభ్యో భార్గవప్రియః ॥
చతుర్దశ తథా పంచదశేచ్చంతీహ నారదః ।
ససౌవీరాం సుసోవీరా బ్రహ్మణో హ్యుపనీయతే ॥
ఉత్తరాదిస్వరశైవ బ్రహ్మావై దేవతాస్త్రయః ।
హరిదేశసముత్పన్నా హరిణస్యావ్యఇయత ॥
మూర్ఛనా హరిణా తే వై చంద్రస్యాస్యాధిదైవతమ్ ।
కరోపనీతా వివృతివనుద్రిః స్వరమండలే ॥
సా కలోపనతా తస్మాన్మనుతస్యాన్నదైవతః ।
మనుదేశాః సముత్పన్నా మూర్ఛనాశుద్ధమాత్మనా ॥
తస్మాత్తస్మాత్మగా మార్గమృగేంద్రోస్యాధిదైవతా ।
సావాశ్రమసమాద్యుమ్నా అనేకా పౌరుషానఖాన్ ॥
మూర్చనాయోజనాహ్యేషాస్యాద్రజసారజనీతతః ।
తానీ ఉత్తరమద్రాసపద్గదైవతకం విదుః ॥
13. పదక్రాంతం, 14. మృగాక్రాంతం, 15. మనోహరమైన విష్ణుక్రాంతము, 16. (వరేణ్యము) సూర్యకాంత, 17. విశ్రుతమయిన కోకిల (మత్త) (శాంతకోకిల), (తేనవానిత్య పవశ పిశాచాతీవ నహ్యపి)? (38) తానముల నామములు. (18) సావిత్రము, 19.అర్ధసావిత్రము, 20. సర్వతోభద్రము, అధాత్ర్యము, 22. గంధర్వానుపము, 21. మనోహరమయిన, 23. అలంబుషేసేష్ట, 24. విష్ణు, 25. వైణవర, (39) సర్వభూతమనోహరమైన 26.సాగర విజయము, 27,హతోత్పష్టము, 28. స్వంధము, ఇదియుద్రీయమే, 29. నారదప్రియ. భీమసేనుఁడు చెప్పిన 30. నాగరప్రియ, 31. వికలోపనవినతాశ్రీ, 32. భార్గవప్రియ. ఇవి పదునాలుగు : (కాని) నారదుఁడు 15 అనును. (మూర్ఛనల నధిష్టించిన దేవతలు?) మూర్చ బ్రాహ్మిచే నాగాంధారి, సౌవీరముతో కలిసి పాడబడును. అట్లే ఉత్తరాది స్వరము, దీని కధిష్టాన దేవత బ్రహ్మ హరిణస్యము హరీదేశమున పుట్టినది. (44) హరిణాస్య యను మూర్ఛనకు చంద్రుండధి దేవత, స్వర మండలమున కరోపనీతా వివృతములు. మరుత్తులచే పొడబడును. శుద్ద (మాత్మమాననే మనుదేశమునఁగలిగెను. శుద్ద మధ్యమా మూర్చన. దాని అధిష్టాన దైవతము గాంధర్వము. అయ్యది సిద్ధుల కొఱకు వేళ్లతో సంచరించును. దాని అధిదేవత మృగేంద్రము (సింహము). (47) (అర్థం కాలేదు)? అయ్యది ఆశ్రమములతో, పలుమానవధ్వనులతో కలిసియున్నది? మూర్ఛన రాగాములతో గూడియుండుటచే దానినీ రజనీ యందురు. ఉత్తర మంద్ర యొక్క దైవతము షడ్జము.
తస్మాదుత్తరతాయావత్ప్రథమం స్వాయమం వీదుః ।
తమోదుత్తరమైద్రోయదేవతాస్యాధ్రువేన చ ॥
అపామదుత్తరత్వావరైవతస్యోత్తరాయణః ।
స్యాదిజమూర్ఛనాహ్యేచ పితరః శ్రాద్ధదేవతాః ॥
శుద్ధషడ్జస్వరం కృత్వా యస్మాదగ్నిమహర్షయః ।
ఉపైతి తస్మాన్ననీయాచ్ఛుద్ధయచ్ఛికరాసభా ॥
ఇత్యేతా మూర్ఛనాః కృత్వా యస్యామీదృతభావనః ।
పక్షిణాం మూర్ఛనాః శ్రుత్వా పక్షోకా మూర్ఛనాః స్మృతాః ॥
నాగాదృష్టివిషాగీతానోపసర్పంతి మూర్ఛనాః ।
నానాసాధారణాశ్చైవవడవాశ్రీవిదస్తథా ॥
ఇతి బ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే గాంధర్వమూర్చనాలక్షణవర్ణసం నామైకషష్టితమోఽధ్యాయః ॥
అందుచే ఉత్తర తాలను ముందుగా నెటింగిరి. అందుచే అది ఉత్తరమంద్రము. దాని దైవము ధ్రువము. (50) (అస్పష్టము) అయ్యదే తరువాత విస్తరింపఁబడుటచే, (ఉత్తరాయత - ధ - దైవతముగా గలది) ‘ధ’తో ఆరంభించును. దాని దైవము పితృవర్గము (శ్రాద్ధ దేవతలు) మహర్షులు అగ్నిని షడ్జస్వరముతో పూజింతురు. అందుచే దానిని శుద్ద షడ్జముగా నేఱుంగవలెను. ఈ మూర్చన పంచమ స్వరము నుండి ఆరంభమగును. (51) అస్పష్టము. (52) ఈ విధముగా తత్తదనుకూలమయిన భావన కలిగిన మూర్ఛనల నుపయోగింపవలెను. పక్షుల మూర్చనలు విని పక్షోకమూర్చనలు కలిగినవి. ప (య) మూర్చనలు యక్షిణులకు సంబంధించినవి అందుచే యక్షికామూర్చనల నంబడినవి. (మూలమున ‘య’కు ‘ప’ యున్నదేమో? (53ఎ) అస్పష్టము. విషదృష్టిగల పాములను మూర్ఛనలు కీర్తనలు సమీపించవు (చేరవు) మూర్ఛనలు చాలగలవు. అవి సాధారణము?
సూచన :- ఈ శాస్త్ర నిర్వచనములు తలపగులగొట్టుకొన్నను సంగీతపండితుల నడిగినను స్పష్టముగా అర్థము కాలేదు. పెద్దల నడిగి తెలిసినట్లు వ్రాసితిని. సంస్కరించుకొనుడు.
Summary of chapter 99 of the Brahmānda Mahā Purana is as follows:
Delving deeper into cosmic metaphysics, this section explains the Prākṛtika Pralaya, the complete dissolution of physical matter back into its subtle elemental causes and ultimately into primordial nature. It traces how earth dissolves into water, water into fire, fire into air, air into ether, and ether into the cosmic mind. The seeking soul learns the art of meditative dissolution, detaching from physical forms to realize the uncreated spirit beyond matter.