బ్రహ్మాండ మహా పురాణము
24 - బలాహఠాదిసప్తసేనాపతివధో
హతేషు తేషు రోషాంధో నీశ్వసన్ శూన్యకేశ్వరః ।
కుజలాశమితి ప్రోచే యుయత్సావ్యాకులాశయః ॥
భద్ర సేనాపతేఽస్మాకమభద్రం సముపాగతమ్।
కరంకాద్యాశ్చమూనాథాః కందలద్భుజవిక్రమాః ॥
సర్పిణీమాయయా సర్వగీర్వాణమదభంజనాః ।
పాపీయస్యా తయా గూఢమాయయా వినిపాతితాః ॥
బలాహకప్రభృతయః సప్త వై సైనికాధిపా ।
తానుదగ్రభుజాసత్త్వాన్ ప్రాహిణు ప్రధనం ప్రతి ॥
త్రిశతం చాక్షౌహిణీనాం ప్రస్థాపయ సహైవ త్రైః ।
తే మర్దయిత్వా లలితాసైన్యం మాయాపరాయణాఃII
అయే విజయమాహార్య సంప్రాప్స్యంతి మమాంతికమ్ ।
కీకసాగర్భసంజాతాస్తే ప్రచండపరాక్రమాని ॥
బలాహక ముఖాః సప్త భ్రాతరో జయనః సదా ।
తేషామవశ్యం విజయో భవిష్యతి రణాంగణేశ ॥
ఇతి భండాసురేణోక్తః కుటిలాక్షః సమాహ్వాయత్ ।
బలాహకముఖాన్ సప్త సేనానాథాన్ మదోత్కటాన్ ॥
బలాహకః ప్రథమతస్తస్మాత్సూచీముభోఽపరః ।
అన్యః ఫాలముఖశ్చైవ వికర్ణో వికటాననః ॥
కరాలాయుః కరటక సప్తైతే వీర్యశాలిన: ।
భండాసురం నమస్కృత్య యుద్ధకౌతూహలోల్బణాః ॥
కీకసాసూనవః సర్వే భ్రాతరోఽన్యోన్య మావృతాః ।
అన్యోన్యసుసహాయాశ్చ నిర్జగ్ముర్నగరాంతరాత్ ॥
త్రిశతాక్షౌహిణీసేనాసేనాన్యోఽన్వగమంస్తదా ।
ఉల్లిఖంతి కేతుజాలైరంబరే ఘనమండలమ్ ॥
మౌరసంగ్రామిణీపాదాఘాతైర్మర్థితభూతలా ।
పిబంతి ధూలికాజాలైరశేషానపి సాగరాన్ ॥
భేరీనిఃసాణతంపోట్టపణవానకనిస్వనై: ।
నభోగుణమయం విశ్వమాదధానాః పదేపదే ॥
త్రిశతాక్షౌహిణీసేనాం తాం గృహీత్వా మదోద్ధతాః ।
ప్రవేష్టుమివ విశ్వస్మిన్ కైకసేయాః ప్రతస్థిరే ॥
ధృతరోషారుణాః సూర్యమందలోద్దీప్తకంటకా: ।
ఉద్దీప్తశస్త్రభరణాశ్చేలుర్దీపోర్ధ్వకేశినః ॥
సప్త లోకాన్ ప్రమథితుం ప్రేషితాః పూర్వముద్ధతా: ।
భండాసురేణ మహాతా జగద్విజయకారిణి ॥
సప్తలోకవిమర్దన తేన దృష్ట్వా మహాబలా: ।
ప్రేషితో లలితాసైన్యం జేతుకామేన దుర్దియా ॥
తే పతంతో రణతలముచ్చలచ్ఛత్రపాణయః ।
శక్తిసేనామభిముఖం సక్రోధమభిదుద్రువు: ॥
ముహుః కీలకిలారావైర్ఘోషయంతో దిశో దశ ।
దేవ్యాస్తు సైనికం యత్ర తత్ర తే జగ్మురుత్థితాః ॥
సైన్యం చ లలితాదేవ్యాః సన్నద్ధం శస్త్రభీషణమ్ ।
అభ్యమిత్రీణమథవద్బద్ధభ్రుకుటి నిష్ఠురమ్ ॥
పాశిన్యో ముసలిన్యశ్చ చక్రిణ్యశ్చాపరా మునే ।
ముద్గరిణ్యః పట్టిశిన్యః కోదండిన్యస్తథాపరాః ॥
అనేకాః శక్తయస్తీవ్రా లలితాసైన్యసంగతాః ।
పిబంత్య ఇవ దైత్యార్థిం సన్నీపేతుః సహస్రశః ॥
ఆయాయాత హే దుష్టాః! పాపిన్యో వనితాధమా ।
మాయాపరిగ్రహైర్దూరం మోహాయంత్యో జడాశయాన్ ।
నేష్యామో భవతీరద్య ప్రేతనాథనికేతనమ్ ॥
శ్వసద్భుజగసంకాశెర్బాణైరత్యంతభీషణై: ।
ఇతి శక్తిర్భర్సయంతో దానవాశ్చక్రురాహవమ్ ॥
కాచిచ్చిచ్చేద దైత్యేంద్రం కంఠే పట్టిశపాతనాత్ ।
తద్గలోద్గలితో రక్తపూర ఊర్ధ్వముఖోఽభవత్ ॥
తత్ర లగ్నా బహుతరా గ్రుధ్రా మండలతాం గతాః ।
తైరేవం ప్రేతనాథస్య చ్ఛత్రచ్ఛవిరుదంచితా ॥
కాచీచ్ఛక్తిః సురారాతిం ముక్తశక్త్యాయుధం రణే ।
లూనతచ్చక్తినైకేన బాణేన వ్యలునీత చ ॥
ఏకా తు గజమారూడా కస్యచిద్ధైత్యదుర్మతేః ।
ఉరః స్థలే స్వకరిణావప్రాఘాతమశిక్షయత్ ॥
కాచిత్ప్రతిభటారూఢం దంతినం కుంభసీమని ।
ఖఢ్గేన సహాసా హత్వా గజస్య స్వప్రియం వ్యథాత్ ॥
కరముక్తేన చక్రేణు కస్యచిద్దేవవైరిణ:।
ధనుర్దండం ద్వీధా కృత్వా స్వభ్రువోఃప్రతిమాం తనోత్ ॥
శక్తిరన్యా శరైః శాతైః శాతయిత్వా విరోధినః ।
కృపాణపద్మా రోమాల్యాం స్వకీయాయాం ముదం వ్యధాత్ ॥
కాచిన్ముద్గరపాతేన చూర్ణయిత్వా విరోధినః ।
రథచక్రనితంబస్య స్వస్య తేనాతనోన్ముదమ్ ॥
రథకూబరముగ్రోణ కస్యచిద్దానవప్రభోః ।
ఖఢ్గేన ఛిందతీ స్వస్య ప్రియముర్వ్యాస్తతాన హ ॥
అభ్యంతరం శక్తిసేనా దైత్యానాం ప్రవివేశ ।
హ ప్రవివేశ చ దైత్యానాం సేనాశక్తబలాంతరమ్ ॥
నీరక్షీరవదత్యంతాశ్లేషం శక్తిసురద్విషామ్ ।
సంకురాకారతాం ప్రాప్తో యుద్ధకాలేఽభవత్తదా ॥
శక్తీనాం ఖడ్గపాతేన లూనశుండారదద్వయాః ।
దైత్యానాం కరిణో మత్తా మహాక్రోడా ఇవాభవన్ ॥
ఏవం ప్రవృత్తే సమరే వీరాణాం చ భయంకరే ।
అశక్యే స్మర్జుమప్యంతం కాతరత్వవతాం నృణామ్ ॥
భీషణానాం భీషణే చ శస్త్రవ్యాపారదుర్గమే॥
బలోపకో మహాగ్రుధ్రం వజ్రతీక్ క్షముఖాదికమ్ ।
కాలదండోపమం జంఘాకాండే చండపరాక్రమమ్ ॥
సంహారగుప్తనామానం పూర్వమగ్రే సముత్థితమ్ ।
ధూమవద్దూసరాకారం పక్షక్షేపభయంకరమ్ ।
ఆరుహ్య వివిధం యుద్ధం కృతవాన్ యుద్ధదుర్మదః ।
పక్షౌ వితత్య క్రోశార్ధం స స్థితో భీమనిఃస్వనైః ।
అంగారకుండవచ్చంచుం విదార్యాభక్షయచ్చమూమ్ ॥
సంహారగుప్త: స మహాగ్రుద్రః క్రూరవిలోచనః ।
బలాహాకమువాహోచ్చైరాకృష్ణధనుషం రణే ॥
బలాహకో వపుర్థున్వన్ గ్రుధ్రపృష్ఠకృతస్థితి: ।
స పక్షకూటశైలస్థో బలాహక ఇవాభవత్ ॥
సూచీముఖశ్చ దైత్యేద్రః సూచీ నిష్ఠురపక్షతిమ్ ।
కాకవాహనమారుహ్య కఠినం సమరం వ్యధాత్ ॥
మత్తః పర్వతశృంగాభశ్చంచూదండం సముద్వహన్ ।
కాలదండప్రమాణేన జంఘాకాండేన భీషణ ॥
పుష్కలావర్తకసమా జంబాలసదృశద్యుతిః ।
క్రోశమాత్రాయతా పక్షానుభావపి సముద్వహన్ ॥
సూచీముఖాధిష్ఠితోఽసౌ కరట: కటువాసితః ।
మర్దయన్ చంచుఘాతేన శక్తీనాం మండలం మహత్ ॥
అథో ఫలముఖః ఫాలం గృహీత్వా నిజమాయుధమ్ ।
కంకమారుహ్య సమరే చకాశే గిరిసన్నిభమ్ ॥
వికర్ణాఖ్యశ్చ దైత్యేంద్రశ్చమూభర్తా మహాబలః ।
భేరుండపతగారూఢః ప్రచండం యుద్ధమాతనోత్ ॥
వికటానననామానం వీలసత్పట్టీశాయుధమ్ ।
ఉవాహ సమరే చండః కుక్కుటోఽతిభయంకరః ॥
గర్జన్ కంఠస్థరోమాణి హర్షయన్ జ్వలదీక్షణః ।
పశ్యసపురః శక్తిసైన్యం చచాల చరణాయుధః ॥
కరాలాక్షశ్చ భూభర్తా షష్ఠోఽ త్యంతగరిష్ఠదః ।
వజ్రనిష్టురఘోషశ్చ ప్రాచలత్పేత వాహనః ॥
శ్మశానమంత్రశూరేణ తేన సంసాధితః పురా ।
ప్రేతో భూతసమాపిష్ఠస్తమువాహ రణాజిరే ॥
అవాజ్ముఖో దీర్ఘబాహుః ప్రసారితపదద్వయః ।
ప్రేతో వాహనతాం ప్రాప్తః కరాలాక్షమథావహత్ ॥
అన్యః కరటకో నామ దైత్యసేనాశిఖామణిః ।
మర్థయామాస శక్తీనాం సైన్యం వేతాలవాహనః ॥
యోజనాయతమూర్తి: సన్ వేతాలః క్రూరలోచనః ।
శ్మశానభూమౌ వేతాలో మంత్రేణానేన సాధితః ॥
మర్ధయామాస పృతనాం శక్తీనాం తేన దేశితః ।
తస్య వేతాలవర్యస్య వర్తమానోoఽససీమని ॥
బహుధాఽయుధ్యత తదా శక్తిభిః సహ దానవః ॥
ఏవమేతే బలాత్మానః సప్త సప్తార్ణవోపమా: ।
శక్తీనాం సైనికం తత్ర వ్యాకులీచక్రరుద్ధతాః ॥
తే సప్త పూర్వం తపసా సవితారమతోషయన్ ।
తేన దత్తో వరస్తేషాం తపస్తుష్టేన భాస్వతా ॥
కైకసేయా మహాభాగా భవతాం తపసాఽధునా ।
పరితుష్టోఽస్మి భద్రం వో భవంతో వృణతాం వరమ ॥
ఇత్యుక్తే దీననాథేన కైకసేయాస్తమకృశా: ।
ప్రార్థయామాసురత్యర్థం దుర్దాంతం వరమీదృశమ్ ॥
రణేషు సన్నిధాతవ్యమస్మాకం నేత్రకుక్షిషు ।
భవతా హోరతేజోభిర్దహతా ప్రతిరోధిన: ॥
త్వయా యదా సన్నిహితం తపనాస్మాకమక్షిషు ।
తదాక్షివిషయః సర్వే నిశ్చేష్టో భవతాత్ర్పభో ॥
త్వత్సాన్నిధ్యసమిద్ధేన నేత్రేణాస్మాకమీక్షితా: ।
స్తబ్ధశస్త్రా, భవిష్యన్తి ప్రతిరోధకసైనికాః ॥
తతః స్తబ్ధేషు శస్త్రేషు వీక్షణాదేవ నః ప్రభో ।
నిశ్చేష్టా రిపవోఽస్మాభిర్హంతవ్యాః సుకరత్వతః ॥
ఇతి పూర్వం వరః ప్రాప్తః కైకసేయెర్ధివాకరాత్ ।
వరదానేన తే తత్ర యుద్ధే చేరుర్మదోద్ధతాః ॥
అథ సూర్యసమావిష్ణనేత్రేస్తే(స్తా)స్తు నిరీక్షితా ।
శక్తయస్తబ్ధశస్త్రౌఘా విఫలోత్సాహతాం గతాః ॥
కీకసాతయైస్తైస్తు సప్తభిః సత్వశాలిభిః ।
విష్టంభితాస్త్రశస్త్రాణాం శక్తీనాం నోద్యమోఽ భవత్ ॥
ఉద్యమే క్రియమాణేఽపి శస్త్రస్తంభేన భూయసా।
అభిభూతాః సనిశ్వాసం శక్తయో జోషమాసత ॥
అథ తే వాసరం ప్రాప్య నానాప్రహరణోద్యతా: ।
వ్యమర్ధయన్ శక్తిసైన్యం దైత్యాః స్వస్వామిదేశితాః ॥
శక్తయన్తస్తు సైన్యేన నిర్వ్యాపారా నీరాయుధాః ।
అక్షుభ్యంత శరైస్తేషాం వజ్రకంకటభేదిభిః ॥
శక్తయో దైత్యశస్త్రౌఘైర్విద్ధగాత్రాః సృతాసృజః ।
సుపల్లవా రణే రోజుః కంకోలలతికా ఇవ ॥
హాహాకారం వితస్వత్య: ప్రపన్నా లలితేశ్వరీమ్ ।
చుక్రుశుః శక్తయః సర్వాస్తైస్తంభితనిజాయుధాః ॥
అథ దేవాజ్ఞయా దండనాథా ప్రత్యజ్గరక్షిణీ ।
తిరస్కరణికా దేవీ సముత్తస్థౌ రణాజిరే ॥
తమోలిప్తాహ్వయం నామ విమానం సర్వతోముఖమ్ ।
మహామాయా సమారుహ్య శక్తీనామభయం వ్యధాత్ ॥
తమాలశ్యామలాకారా శ్యామకంచుకధారిణీ ।
శ్యామచ్ఛాయే తమోలిప్తే శ్యామయుక్తతురంగమే ॥
వాసన్తి మోహనాభిఖ్యం ధనురాదాయ సస్వనమ్ ।
సింహనాదం వినద్యేషూనవర్ధత్సర్వసన్నిభాన్ ॥
కృష్ణరూపభుజంగాభానధోముసలసన్నిభాన్ ।
మోహనాస్త్రవినిష్ఠ్యుతాన్బాణాన్ దైత్యా న సేహిరే ॥
ఇతస్తతో మర్ద్యమానా మహామాయాశిలీముఖైః ।
ప్రకోపం పరమం ప్రాప్తా ఇలాహకముఖాః ఖలా ॥
అథో తిరస్కరిణ్యంబా దండనాథానిదేశతః ।
అంధాబిధం మహాస్త్రం సా ముమోచ ద్విషతాం గణే ॥
బహకాద్యాస్తే సప్త దీననాథవరోద్దతా: ।
అంథాస్త్రేణ నిజం నేత్రం దధిరే చ్ఛాదితం యథా ॥
తిరస్కరణికా దేవ్యా మహామోహనధన్వనః ।
ఉద్గతేనాంధకారేణ చక్షుస్తేషాం వ్యధీయత ॥
అంధీకృతాశ్చ తే సప్త న తు ప్రేక్షంత కించన ।
తర్వీక్షణస్య విరహాచ్ఛస్త్రస్తంభః క్షయం గతః ॥
పునః స సింహనాదం తాః ప్రోద్యతాయుధపాణయ: ।
చక్రుః సమరసన్నాహం దైత్యానాం ప్రజిఘాంసయా ॥
తిరస్కరణికాం దేవీమగ్రే కృత్వా మహాబలామ్ ।
సదుపాయప్రసంగేన భృశం తుష్టా రణం వ్యధుః ॥
సాధు సాధు మహాభాగే తిరస్కరణికాంబికే ।
స్థానే కృతతిరస్కారా ద్విషామేషాం దురాత్మనామ్ ॥
త్వంహి దుర్జననేత్రాణాం తిరస్కారమహోషధీ ।
త్వయా బద్ధదృశానేన దైత్యచక్రేణ భూయతే ॥
దేవకార్యమిదం దేవి త్వయా సమ్యగవస్థితమ్ ।
అస్మాదృశామజయ్యేషు యదేషు వ్యసనం కృతమ్ ॥
తత్త్వయైవ దురాచారానేతాన్సప్త మహాసురాన్ ।
నిహతాన్ లలితా శ్రుత్వా సంతోషం పరమాప్స్యతీ ॥
ఏపం త్వయా విరచితే దండినీ ప్రీతిమాప్స్యతి ।
మంత్రిణ్యపి మహాభాగా యాస్యత్యేష పరాం ముదమ్ ॥
తస్మాత్వమేవసప్తైతాస్ నిగృహాణ రణాజిరే ।
ఏషాం సైన్యం తు నిఖిలం నాశయామ ఉదాయుధా: ॥
ఇత్యుక్త్వా ప్రేరితా తాభిః శక్తిభిర్యుద్దకౌతుకాన్ (త్) ।
తమోలిప్తేన యానేన బలాహకబలo యయౌ ॥
తామాయాంతీం సమావేక్ష్య తే సప్తాథ సురాధమా ।
పునరేవ చ సావిత్రం వరం సస్మరురంజసా॥
ప్రవిష్టమపి సావిత్రం నాశకం తన్నిరోధనే ।
తిరస్కృతం తు నేత్రస్థం తిరస్కరణితేజసా ॥
వరదానాస్త్రరోషాంధం మహాబలపరాక్రమమ్ ।
అస్త్రేణ చ రుషా చాంధం బలాహకమహాసురమ్ ।
ఆకృష్య కేశేష్వసినా చకర్తాంతధిదేవతా ॥
తస్య వాహనగృధ్రస్య లునానా పత్రిణా శిరః ।
సూచీముఖస్యాభిముఖం తిరస్కరణికావ్రజత్ ॥
తస్య పట్టిశపాతేన విలూయ కఠినం శిరః ।
అన్యేషామపి పఞ్చాసాం పఞ్చాత్వమకరోచ్ఛనై ॥
తైః సప్తదైత్యముండైశ్చ గ్రధితాన్యోన్యకేశకైః ।
హారదామ గలే కృత్వా ననాదాంతర్ధిదేవతా ॥
సమస్తమపి తత్సైన్యం శక్తయః క్రోధమూర్ఛితాః ।
హత్వా తద్రక్తసలిలైర్భహ్వీః ప్రావాహయన్నదీః ॥
తత్రాశ్చర్యమభూద్భూరీ మహామాయాంబికాకృతమ్ ।
బలాహకాది సేనాన్యాం దృష్టిరోధనవైభవాత్ ॥
హతశిష్టాః కతిపయా బహుత్రాససంకులాః ।
శరణం జగ్మురత్యార్తాః క్రందంతం శూన్యకేశ్వరమ్ ॥
దండినీం చ మహామాయాం ప్రశంసంతి ముహుర్ముహు: ।
ప్రసాదమపరం చక్షుస్తస్యా ఆదాయ పిప్రియుః ॥
సాధుసాధ్వితి తత్రస్థాః శక్తయః కంపమౌలయః ।
తిరస్కరణికాం దేవీమశ్లాఘంత పదేపదే ॥
ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే ఉత్తరభాగే హయగ్రీవాగస్త్యసంవాదే శ్రీలలితోపాఖ్యానే
బలాహాకాదిసప్తసేనాపతివడో నామ చతుర్వింశోఽధ్యాయః ॥
ఆయైదుగురు సేనాపతులు చంపఁబడగా శూన్యకపురాధీశుడైన భండాసురుడు రోషాంధుడై బుసకొట్టుచు యుద్ధముజేయు కోరికతో వ్యాకులమైన మనస్సు గలవాడై కుజలాశుడనువానితో నిట్లనెను ఓ భద్రుడవైన సేనాపతీ! మనకు అభద్రము వచ్చిపడినది. కరంకుడు మొదలు సేనాపతులు చిగుర్చుచున్న భుజపరాక్రమములు గలవారు. సర్పిడి మాయతో సమస్త దేవతల మదముల భంజించువారు. వారు ఐదుగురు మిక్కిలి పాపురాలైన యాగూఢమాయచే జంపబడిరి. ఇపుడు బలాహకుడు మొదలగు నేడుగురు సేనాపతులు గలరు. వారు గొప్ప భుజబలము గలవారు. వారిని యుద్ధమునకు బంపుము వారితోబాటు మూడు వందల యక్షౌహిణీ సేనను గూడ ఒంపుము. మాయాపరాయణులయిన వారు లలితా సైన్యమును మర్థించి-5. ఓయీ! విజయమును సంపాదించి నాకడకు వత్తురు. కీకస యను (ఎముకల రాక్షసి) గర్భమున బుట్టినవారు ప్రచండ పరాక్రములు. బలాహకుడు మొదలగు నేడుగురు సోదరులు ఎప్పుడును విజయులే. కావున రణరంగమున వారికి తప్పక విజయము గలుగగలదు. అని భండాసురుడు చెప్పగా కుటిలాక్షుడు బలాహకుడు మొదలగు నేడుగురు సేనాపతులను మదముచే నుత్కటువైనవారిని బిలీచేను. మొదట బలాహకుడు తరువాత సూచీముఖుడు (సూదీపంటి మూతి గలవాడు), పాలముఖుడు (బల్లెము వంటి మూతిగలవాడు) వీకర్ణుడు, భీకటాననుడు . కరాలాయువు, కరటకుడు-ఈయేడుగురు పరాక్రమశాలురు, వారు భండాసురునకు నమస్కరించి యుద్ధకౌతూహలముతోనుప్పొంగిరీ. వీరందరు కీకస యొక్క పుత్రులు. సోదరులు ఒకరినొకరవరించిన వారు (రక్షించువారు), ఒండొరులకు సహాయపడువారు. వారు శూన్యక నగరములోనుండి బయలుదేరిరి. మూడు వందల యక్షౌహిణీ సేనాపతులు వారిని వెంబడించిరి. వారు తమ జెండాల సమూహములతో ఆకాశమున మేఘమండలమును వ్రాయుచున్నారు. భయంకర సంగ్రామిణుల పాదాఘాతమున భూతలమును మర్ధించినారు. దుమ్ముల నమూహముతో నమస్త సాగరములనే ద్రాగీవేయనుచున్నారు. అడుగడుగున బేరీ-నీః సాణ-తంపాట్ట(తప్పెటలు)-పణవ ఆనక-ఆది వాద్యములచే ప్రపంచమునంతను శబ్దమయము జేయుచున్నారు. అటువంటి - మూడువందల యక్షౌహిణీ సేనను దీసికొని విశ్వమునంతటను ప్రవేశించుటకా యన్నట్లు కైకసేయులు (కీకసా పుత్రులు) బయలుదేరిరి. కోపముచే నెఱనై, సూర్యమండలమున నుద్దీప్తములైన కంకటములవంటికిరణములుండునట్లు మండుచున్న శస్త్రములధరించి నిక్కబొడిచీకొన్న వెంట్రుకలు గలవారై వారు కదిలి. పూర్వమీ యుద్ధతులు సప్తలోకములను మథించుటకు జగద్విజయకారియైన మహాభండాసురునితోబంపబడీరి. సప్తలోకములవిమర్ధించిన మహాబలులనీ, లలితాసైన్యమును జయింప తలంపుతో దుర్బుద్ధి భండాసురుడు వారిని లలితపైకి బంపేను. వారు గొడుగులు చేతబట్టుకోని రణభూమిలో దూకుచు శక్తిసేన కభిముఖముగా పరువిడిరి. మాటిమాటికి కిలకిలా రావములతో దశదీక్కులను మారు మ్రోగించుచు దేవీసైన్యమున్న చోటికి దండెత్తి వెడలిరి. లలితా దేవి సైన్యముగూడ శస్త్రములతో భయంకరముగా సన్నద్ధమైయున్నది. కుటిలముగా కనుబొమ్మలు ముడిచి నిష్ఠురముగానున్నది. శత్రువునెదుర్కొని పోవనున్నది. ఓ యగస్త్యమునీ! దేవసేనలోని స్త్రీలు పాశములుగలవారు. రోకళ్ళు గలవారు, చక్రములు గలవారును, ముద్గరములు గలవారు, పట్టేశములు గలవారు, విండ్లు గలవారునునై యుండిరి. లలితా సైన్యముననున్న శక్తులు అనేకలు, తీవ్రలు వారు వేలకొలదీగా రాక్షస సముద్రమును త్రాగుటకా యనునట్ల ఒక్కుమ్మడిగా రాక్షసుల మీదబడిరి. అపుడు. క్రూరడానవులుగూడ ఓ దుష్టలారా! పాపినులారా! నీచ వనితలారా! రండి! రండి! మాయతో జడాశయమును చాలావరకు మోహింపజేయు మిమ్ములను. బుసకొట్టు పాములవలె మిక్కలి భయంకరములైన బాణములచే నివ్వేళయమునింటికి బందము. అని శక్తులను భయపెట్టుచు రాక్షసులు యుద్ధముజేసిరీ. ఒకయామె రాక్షసాధిపతి కంఠమును పట్టిశముతో తెగనరికేను. వాని కంఠము నుండి రక్తము ఎగజిమ్మెను. అచట గద్దలు పెక్కుచుట్టుముట్టినవి. ఈ విధముగా నవి యముని గొడుగు రూపమును వహించినవి. ఒక శక్తి శక్తాయుధముతో అచట తనపైకి వచ్చిన రాక్షసుని తలను ఆశక్తిని త్రుంచిన బాణముతో ఖండించెను. ఒకయామె యేనుగనెక్కి దుర్మతియైన యొక రాక్షసుని యెదలో తన యేనుగు దంతాఘాతక్రీడను జరిపించి చంపెను. ఒకయామే (శక్తి) శత్రుభటులెక్కిన యేనుగును కుంభస్థలమున నకస్మాత్తుగా గొట్టిచంపెను, తనచేత ప్రయోగింపబడిన బాణముతో నొక రాక్షసుని ధనుర్ధండమును రెండు ముక్కలుగా జేసి వానిని తన రెండు కనుబొమ్మలకు సమముగా జేసెను. మరొక శక్తి తన వాడి బాణములచేత విరోధులను జంపీ ఖడ్గమును ధరించి పులకాంకురములతో సంతోషమును వ్యక్తీకరించెను . ఒకయామె తన ముద్దరపు దేబ్బలతో విరోధులను చూర్ణము జేసి రథచక్రముల వంటి పిరుదులుగలయామె సంతోషమును వ్యక్తీకరించేను. ఒక యామె తన ఖడ్గముతో ఒక రాక్షస ప్రభువు యొక్క రథపునొగసు ఖండించి తన సంతసమును భూమిపై విస్తరింపజేసెను. శక్తిసేన దానవ సేనలోనికిని, దానవసేన శక్తి సేనలోనికిని జొచ్చినవి. శక్తి దానవులు నీరక్షీరములవలె గలిసి పోరాడుటచే నపుడు యుద్ధము సంకులాకారము వహించినది. శక్తుల కత్తిదెబ్బలకు రాక్షసుల యేనుగుల తొండములు దంతములును తెగిపడిపోయినవి. "అపుడా యేనుగులు మదించిన పెద్ద యడవిపందులవలె గనబడుచున్నవి. ఈ విధముగా వీరుల భయంకర యుద్ధము జరిగినది. దీని యంతమెప్పుడో పిరికి మానవులకు తెలియనంత తీవ్రముగా నున్నది. భయంకర శస్త్రములు భయంకర శస్త్రములతో తలపడుటచే ప్రవేశింపనలవికానిదిగానున్నది-38. యుద్ధదుర్మదుడైన బలాహకుడను రాక్షసాధిపతి సంహారగుప్తమను మహాగ్రుధ్రము (పెదగద్ద)ను ఎక్కీ వివిధమైన యుద్ధమును జేసెను. ఆ గద్ద ముఖము మొదలగునవి వజ్రమువలె వాడిగానున్నవి. యముని దండమువలె నున్నది. దాని జంఘాకాండములలో (పిక్కలో) భయంకర పరాక్రమమున్నది, ముందులేచి యున్నట్లున్నది. పొగవలె ధూసరాకారముగలది. దానిరెక్కల తాకిడి యతి భయంకరమైనది. అది భయంకర ధ్వనులతో రెక్కలను క్రోశార్ధము (క్రోశము) విస్తరింపజేసి యుండ దానిపై నెక్కి బలాహకుడు నానాయుద్దముల జేసెను. అది యగ్నివలె నున్న తన ముక్కునుదెరచి సేనను భక్షించెను. క్రూరములైన - " " కన్నులుగల యా సంహారగుప్తమను మహోగ్రుధ్రము రణమున పైకిలాగిన. ధనస్సును గల బిరాహకుని మోయుచుండెను ఆ మహాగ్రుధ్రము వీపుపై నున్న బలాహకుడు. తన శరీరమును సవరించుకొనుచున్నట్లుగా విదిలించుచు రెక్కలున్న పర్వతముపై నున్న మేఘమువలె ఒప్పుచుండెను. సూచీముఖుడను రాక్షసరాజు సూదివంటి కలరెక్కలుగల కాకవాహనమునెక్కి కఠినమైన సమరమును జేసెను. ఆకాకము. మదించినది పర్వతశిఖరమువలెనున్నది, దండము వంటి ముక్కుగలగినది, యమదండమువలెనున్న పిక్కలతో భయంకరముగా నున్నది. పుష్కలావర్తక, మేఘమువలె నున్నది; బురుదతో సమానమైన కాంతిగలది. క్రోశమాత్రవిశాలములైన రెండు రెక్కలు గలిగినది. సూచీముఖరాక్షసేంద్రు నెక్కించుకొన్నది, కటువుగా నరచునది. అట్టి కాకవాహనము తనముక్కుపొడుపులతో శక్తిసేనల మహామండలమును: మర్ధించుచుండెను, తరువాత ఫాలముఖుడు (ములీకివంటి నోరుగలవాడు) అగు రాక్షసాధిపతి తనయాయుధమైన నాగటికeష్ణను దీసికొని, పర్వతమువలేనున్న రాబండినెక్కి యుద్ధమున బ్రకాశించెను, సేనాపతియైన వికర్ణుడను రాక్షసాధిపతి మహాబలుడై భేరుండ పక్షివాహనమెక్కి భయంకర యుద్ధమును జేసెను. చండకుకట్రము (కోడి) భయంకరమై యుద్ధమున - పట్టిశాయుధమును ధరించిన వికటాననుడను రాక్షసేంద్రునెక్కించుకొనెను. అదీ గర్జించుచు మేడపైని రోమములను (ఈకలను) నిక్కబొడిపించుచు మండుచున్న కన్నులు గలిగి శక్తి సైన్యమును జూచుచు దాని కెదురుగా కదిలేను, కరాలాక్షుడు రాక్షసరాజు ఆఅవ సేనాపతి. మిక్కిలి గొప్పవాడు, వజ్రము వంటి, కఠినమైన ధ్వని గలవాడు. అతడు ప్రేతవాహనుడై కదలెను. శ్మశానమంత్రశూరుడైన యీతడు పూర్వము భూతసమావిష్టమైన ప్రేతమును సంసాధిత (పశము జేసికొనెను. దానినిపుడు రణమున వాహనముగా జేసికొనెను, ఆప్రేతము క్రిందుగా ముఖముగలదీ. పొడవైన బాహువులు గలది. చాచీన పాదములుగలది, ఈ ప్రేతము. వాహనమై కరాలాక్షుని మేసెను. మరొకడు కరటకుడనువాడు దైత్యసేనానాయకుడు. ఈతడు బేతాళ పాహనుడై శక్తుల సైన్యము మర్ధించెను. ఆ వేతాళుడు యోజన విశాలమూర్తియై క్రూరలోచనుడై, శ్మశానభూమిలో నీ మంత్రముతో వశీభూతుడయ్యెను. ఆ మంత్రముచే నాదేశింపబడినవాడై వేతాళులు. శక్తిసేనను మర్దించుచుండెను. ఆవేతాలుని భుజభాగమున నున్న రాజై కరటక. దానవుడు శక్తులతో ననేక విధములుగా యుద్దముజేసెను. ఈ విధముగా నీచాత్ములైన యీ యేడుగురు సేనాపతులు. సప్తసముద్రముల బోలిన వారై యా యుద్ధముస విజృభించి శక్తుల సైన్యమును వ్యాకులము జేసిరీ. వారు పూర్వము. తపస్సుతో సూర్యుని సంతోషింపజేసిరి, వారి తపమునకు సంతసించిన సూర్యుడు - వారికీ వరమునొసంగెను. ఓకీకసాపుత్రులైన మహాభాగులారా! ఇపుడుమీ తపమునకు సంతసించితిని. మీకు భద్రమగుగాక, మీరు వరమునడుగుడు. అనిన, సూర్యుని తపముతో కృశించిన కీకసాపుత్రులు దుర్గాంతమైన యీ వరమును గోరుకొనిరి- యుద్ధములలో మా శత్రువులను దహించునీవు మా నేత్రములలోను కడుపులలోను ఉండవలెను. నీవుమా కన్నులలోనున్నపుడు మేము జూచినదంతయు ఓ ప్రభో నిశ్చేష్టముగావలెను, నీ సాన్నిధ్యముతో బ్రేరేపింపబడిన మాకన్నులతో జూడబడిన విరోధి సైనికులు స్తబ్ద (నిశ్చేష్టమైన) శస్త్రములు గలవారు గావలెను. మాచూపులతో శస్త్రములతోబాటు నిశ్చేష్టులైనచో మాచే సులభముగా జంపబడగలుగుదురు, అని పూర్వము కైకసేయులు సూర్యుని నుండి వరమును బొందిరి. కావున వారు యుద్ధములో మదముతో విజృంభించి చరించిరి. ఆ తరువాత, సూర్యుడావేశించిన కన్నులతో కైకసేయులు యుద్ధమున శక్తులను జూచెను. వెంటనే శస్త్రసమూహములతో బాటు శక్తులు నిశ్చేష్టలై విఫలోత్సాహలైరి. (ఉత్సాహమునకు తగినట్లు చరింపలేకుండిరి). ఆ విధముగా, బలశాలురైన ఏడుగురు కైకసేయులతో శస్త్రసమూహమలతోబాటు నిశ్చేష్టలైన శక్తులే ప్రయత్నమును జేయలేనివారైరీ . ఉద్యమము. (ప్రయత్నము) జేయబూనినను. మిక్కుటమైన శస్త్రస్తంభముతో. -శిరస్కరింపబడినహొరై కేవలము బుసకొట్టుచు సూరకయేయుండిరి, ఆ తరువాత ఈయవకాశమునుబొంది, స్వామిచే నాదేశింపబడి, అనేకాయుధములతో దండెత్తి శక్తి సైన్యమును మరించిరి. ఆ శక్తులుకూడ. శత్రు దైత్య సైన్యముతో నిర్వ్యాపారలుగను నీరాయుధలుగను జేయబడి, వజ్రకవచముల భేదించు వారి బాణములచే క్షుభితలైరీ. దైత్యశాస్త్ర సమూహములతో శక్తుల శరీరములు గుచ్చబడినవి గాయములనుండి రక్తములు గారుచున్నవి. అపుడు యుద్ధముననా శక్తులు చివురాకుతాడిగిన కంకోలలతికవలె బ్రకాశించిరి. నిశ్చేష్టితాయుధలైన యా సమస్తశక్తులు హాహాకారము జేయుచు లలితేశ్వరిని జేరిరి. ఆ తరువాత దండనాథయొక్క ప్రత్యంగరక్షిణియైన తిరస్కరిణికాదేవి దేవ్యాజ్ఞతో రణరంగమున పైకి లేచి బిలిచెను ఆమె తమోలిప్తమను పేరుగలిగి అన్ని వైపుల ముఖములున్న విమానమునెక్కి మహామాయాశక్తి శక్తులందరికిని అభయము నొసంగెను, ఆమె శ్యామలమైన (నల్లని) యాకారముగలది. శ్యామలమైన కవచము ధరించినది. నల్లని కాంతి గలిగి చీకటీని బూసికొన్నట్లుగా నున్న నల్లని గుఱ్ఱమునెక్కినది, వాసమోహనమనుపేరు గలిగి నారితో మ్రోగుచున్న ధనువును చేత గ్రహించి సింహనాదమును జేసి సర్పముల పంటీ- బాణములను వర్షించెను. నల్లతాచుల కాంతులు గలిగీ, క్రిందరోకలి వలె నుండి, విరజిమ్మబడిన బాణములను రాక్షసులు సహింపలేకుండిరి. బలాహకుడు మొదలగు - ఆ నీచరాక్షసులు. మహామాయాదేవి బాణములచే ఇటునటు మర్దింపబడుచు మిక్కిలి ప్రకోపమును జేంద్రీ. ఆ తరువాత దండనాథయొక్క యాజ్ఞచే ఆ తిరస్కరీణ్యంది: అంధమను మహాస్త్రమును శత్రువుల గణమున వదిలేను, అప్పుడు సూర్యవరోద్ధతులైన బలాహకుడు మొదలగు. నేడుగురు తమ నేత్రములలో చీకటితో గప్పబడిరి. తిరస్కరణికా దేవియొక్క మహామోహన ధనువునుండి బయలు వెడలిన చీకటి చేత వారి కన్నులు బాధజెందినవి. గ్రుడ్డివారుగా జేయబడి పోరేమియు జూడజాలకుండిరి. వారి చూపులకు విఘాతము గలుగుటచే వీరి శస్త్రస్తంభము - వీడినది. ఆశక్తులు సింహనాదము జేసిరి. చేతులతో నాయుధములనెత్తి దైత్యుల జప సమర సన్నాహము జేసిరి మహాబలిష్ణురాలైన . తిరస్కరిణీదేవిని ముందుంచుకొని చక్కని యుపాయము లభించుటచే మిక్కిలి సంతసించి యుద్ధము జేసిరి. ఓ మహాభాగురాలవైన తిరస్కరణికాంబికా! బాగు! బాగు! ఈ దురాత్ములైన శత్రువులకు తగిన తిరస్కారము జేసితివి.. అదీ యుక్తము. నీవు దుర్జనుల నేత్రములను తిరస్కరింపజేయు (చూపు ప్రసరింపనట్లు చేయు) గోప్ప యౌషధివి. ఈ రాక్షస సమూహము (చక్రము) నీ చేత నరికట్టబడిన చూపుగలదైనది, అజేయులమైన మాబోటి వారలకే, వీరు ష్యసనము. గలగజేసిరి. కాని ఓదేవీ! నీవు దానినడ్డగించి యీ దేవకార్యమును చక్కగా నిర్వహించితివీ. కావున నీ చేతనే దురాచారులగు నేడుగురు మహాసురులు చంపబడుట వీని లలితాదేవి మిక్కిలి సంతసింపగలదు. నీ విట్లు చేయుటచే దండిని సంతసింపగలదు. మహాభాగయైన మంత్రిణి కూడ మిక్కిలియానంద మందగలదు కావున నీవే యీ యేడుగురిని రణరంగమున జంపుము. వీరి సైన్యము నంతటిని మాత్రము ఆయుధముల నెత్తిపోయి మేము నశింపజేయగలము. అని శక్తులు ప్రేరేపింపగా తిరస్కరణీకాంబిక యుద్ధకౌతుకమున తమోలిప్తమైన రథముతో బిలాహక బలముపై " దాడి వెడలేను." తమ పైకి వచ్చుచున్న యామెను జూచి యా యేడుగురు రాక్షసాధములు వెంటనే మరల తమకు సూర్యుడిచ్చిన వరమును స్మరించిరీ. చూచిన వారిని నశింపజేయు సూర్యతేజము పోరినేత్రములలో ప్రవేశించినను అది తిరస్కరణి తేజముతో తిరస్కరింపబడినది. సూర్యపరదానము చేతను అస్త్రముల చేతను శత్రువులపై కోపము చేతను కన్ను మిన్నుగానక గ్రుడ్డిదైన వాడును, మహాబల పరాక్రమవంతుడును, అస్త్రము చేతను రోషము చేత (కోపము చేత నాలోచనము గూడపోవుటచేతను గ్రుడ్డివాడైన బలోహకుడను మహాసురునీ సిగబట్టి డి యంతర్గదేవత తన కత్తితో కుత్తకను గత్తిరించెను. వానీవాహనమైన గ్రద్దయొక్క
శిరమును బాణముతో తెగవేసినది. తరువాత తిరస్కరణికాదేవి సూచీముఖునీ కభిముగా వెళ్లెను. ఆతని పట్టి శాయుధముతో కఠినమైన ". శిరమును ఖండించెను, మెల్లగా తక్కినయైదుగురిని కగూడ జంపివేచెను. అప్పుడే తిరసురణి దేవత ఆ యేడుగురి తలలును ఒండొంటి కేశముతో మాల లేడు యా ముండమాలను కంఠమున ధరించి పెద్దగా నాదము జేసేస్తు, శక్తులు క్రోధమూర్వీతలై సమస్త రాక్షససైన్యమును, జంపి వారి రక్తములతో నదులను బ్రవహింపజేసిరీ, మహామాయాంబిక చేసిన దిలాహక సైన్యముల దృష్టిరోధన వైభవమున గొప్పయాశ్చర్యము గలిగెను. శక్తులు చంపగా మీగిలిన కొందరు మిక్కిలి భయముతో వ్యాకులురై మిక్కిలి యార్తి జెంది యేడ్చుచు శూన్యకేశ్వరుడైన భండాసురుని శరణము బొందిరీ. దండినిని మహామాయను మాటిమాటికి ప్రశంసించిరి. ఏలనన వారు ఆమహా మాయయొక్క కంటినుండి యనుగ్రహమును బొంది తీకి సంతసించిరి అటనున్న శక్తులందరును తమ తలలూపుచు బాగు బాగు అని తిరస్కరణికాదేవిని అడుగడుగున బొగిడిరి.
ఇది శ్రీబ్రహ్మాండమహాపురాణమున నుత్తరఖండమున హయగ్రీవాగస్త్యసంవాదమున శ్రీలలితోపాఖ్యానమున బలాహకాదీసప్తసేనాపతివధమను నిరువదినాల్గవ యధ్యాయము.
Summary of chapter 136 of the Brahmānda Mahā Purana is as follows:
Continuing the narrative of divine victory, this chapter details the complete defeat of Bhandāsura's thirty-two sons by the young goddess Bālā. It recounts the celestial joy of the gods and the immense affection shown by goddess Lalitā, who lovingly embraced her heroic daughter upon her triumphant return. The devout reader is filled with bliss, meditating on the sweet mother-child play that masks the ultimate, invincible power of the divine.