బ్రహ్మాండ మహా పురాణము
73 - విష్ణుమహాత్మ్యవర్ణనము
సూత ఉవాచ :-
ఏవ మారాధ్య దేవేశమీశానం నీలలోహితమ్ ।
ప్రహ్వోఽతీప్రణతస్తస్మై ప్రాంజలీర్వాక్యమబ్రవీత్ ॥
కావ్యస్య గాత్రం సంస్పృశ్య హస్తేన ప్రీతిమాన్భవః ।
నికామం దర్శనం దత్త్వా తత్రైవాంతరధాద్ధరః ॥
తతః సోంఽ తర్హితే తస్మిన్దేవే సానుచరే తదా ।
తిష్ఠంతీం ప్రాంజలిర్భూత్వా జయంతీమిదమబ్రవీత్ ॥
కస్య త్వం సుభగే కా వా దుఃఖితే మయి దుఃఖితా ।
మహతా తపసా యుక్తం కీమర్థం మాం జిగీషన్ ॥
అనయా సతతం భక్త్యా ప్రశ్రయేణ దమేన చ ।
స్నేహేన చైవ సుశ్రోణి ప్రీతోఽస్మి వరవర్ణినీ ॥
కీమిచ్ఛసి వరారోహే కస్తే కామః సమృధ్యతామ్ ।
తం తే సంపూరయామ్యద్య యద్యపి స్యాత్సుదుర్లభః ॥
ఏవముక్త్యాబ్రవీదేనం తపసా జ్ఞాతుమర్హసి ।
చికీర్షితం మే బ్రహ్మిష్ఠ త్వం హి వేత్థ యథాతథమ్ ॥
ఏవముక్తోఽ బ్రవీదేనాం దృష్ట్వా దివ్యేన చక్షుషా ।
మాహేంద్రీ త్వం వరారోహే మద్ధితార్థమిదోగతా ॥
మయా సహ త్వం సుశ్రోణి దశవర్షాణీ భామీనీ ।
అదృశ్యం సర్వభూతైస్తు సంప్రయోగమీహేచ్చసి ॥
దేవేంద్రనీలవర్ణాభే వరారోహే సులోచనే ।
ఇమం వృణీష్వ కామం తం మత్తోవై పల్గుభాషిణీ ॥
ఏవం భవతు గచ్ఛావో మహాన్ మత్తేభగామిని ।
తతః స్వగృహమాగమ్య జయంత్యా సహితః ప్రభుః ॥
సూతుఁడిట్లనెను. దేవేశుడు, ఈశానుఁడు, నీలలోహితుఁడయిన ఈశ్వరుని శుక్రుఁడు ఆరాధించి, అతివినయముతో నమస్కరించి, దోసిలి యొగ్గి ఇట్లు పలికెను. కావ్యుని యొక్క శరీరమును ప్రీతిమంతుఁడయిన భవుఁడు హస్తముతో సంస్పృశించి ఆతనికి స్పష్టప్రత్యక్షదర్శన మొసంగి అచ్చటనే అంతర్ధానము చెందెను. తన యనుచరులతో దేవుఁడయిన భవుఁడు అంతర్షితుఁడు కాగా, అచ్చటనే ప్రాంజలి ఘటించి నిలుచుండి యున్న జయంతీతో గురుఁడైన శుక్రుఁడు ఇట్లనెను. “సుభగురాలా ! నీవెవ్వరీతవు? నేను దుఃఖించుచుండ నాతో దుఃఖము ననుభవించుచున్నావు. అఖండమైన తపస్సుతో కూడియున్న నన్ను ఎందులకు అనుసరించుచున్నావు, ఓ శుశ్రోణి, వరవర్లీనీ, సతతము ఈ భక్తిచే, దమముచే, స్నేహముచే, మిక్కిలి ప్రీతుఁడనైతిని. ఓ సుందరాంగి ! ఏమీ కోరుచున్నావు. నీవు ఏ కోరిక పరిపూర్ణముకా గోరెదవు? ఆ కోరిక సుదుర్లభమయిన దయినను నేను దానిని సమకూర్చెదను' అనిన నీ తపస్సుచే ఆనో కోర్కెను తెలిసికొనుట కరుండవు.' నామనోరథమును ఓ బ్రహ్మీష్ణ యథా తథముగా తెలిసికొనుము” అని ఆమె పలికిన దివ్యచక్షువులతో తెలిసికొని శుక్రుడిట్లు పలికెను. “ఓ మహేంద్రుని పుత్రికా ఓవరారోహ! నా హితార్థము నీవిచ్చటకు వచ్చితివి. ఓ సుశ్రోణి ! నాతో పది సంవత్సరములు సర్వభూతములకు కనపడకుండ సంప్రయోగము కోరుదువు. మహేంద్ర నీలరత్నవర్ల తుల్యురాలా ! సుందరవనీతా, సులోచనా, మధురభాషిణీ ! మనోరథమును నా వలన కోరుకొనుము. అదీయట్లు జరుగుగాక, ఓ మత్తేభగామీని ! మనమిర్వురము పోవుదము" అని జయంతితో సహితముగా ప్రభువు స్వగృహమున కేతెంచెను.
స తయా చావసద్దేవ్యా దశ వర్షాణి భార్గవః ।
అదృశ్యః సర్వభూతాసాం మాయయా సంవృతస్తదా ॥
కృతార్థమాగతం జ్ఞాత్వా కావ్యం సర్వే దితేః సుతాః ।
అభిజగ్ముర్గృహం తస్య ముదితాస్తం దిద్భక్షవః II
గతా యదా న పశ్యంతి జయంత్యా సంవృతం గృహమ్ ।
లక్షణం తస్య తద్ బుద్ధ్వా ప్రతిజగ్ముర్యథాగతమ్ ॥
బృహస్పతీస్తు సంరుద్ధం జ్ఞాత్వా కావ్యం వరేణ హ ।
ప్రీత్యర్దే దశవర్షాణీ జయంత్యా పాతకామ్యయా ॥
బుద్ద్వా తదంతరం సోఽథ దేవానాం మంత్రచోదితః ।
కావ్యస్య రూపమాస్థాయ సోఽసురాన్ సమభాషత ॥
తతః సోఽభ్యాగతాన్ దృష్ట్వా బృహస్పతిరువాచ తాన్ ।
స్వాగతం మమ యాజ్యానాం సంప్రాప్తోఽస్మి హితాయ చ ॥
అహం వోఽథ్యాయపయిష్యామి ప్రాప్తా విద్యా మయాహి యాః ।
తతస్తే హృష్టమనసో విద్యార్ధముపపేదిరే ॥
పూర్ణే కావ్యస్తదా తస్మిన్నమయే దశవార్షికే ।
సమయాంతే దేవయాజీ సద్యోజాతమతిస్తదా ॥
బుద్ధిం చక్రే తతశ్చాపి యాజ్యానాం ప్రత్యవేక్షణే ।
శుక్ర ఉవాచ :-
దేవి గచ్ఛామ్యహం ద్రష్టుం తవ యాఃజ్యాఞ్చచిస్మితే ॥
విభ్రాంత(పేక్షితే సాధ్వి త్రివర్ణాయతలోచనే ।
ఏవముక్తాఽ బ్రవీద్దేవీ భజ భక్తాం క్తాన్ మహావ్రత ।
ఏష బ్రహ్మన్ సతాం ధర్మోన ధర్మం లోపయామితే ॥
సూత ఉవాచ :-
తతో గత్వా సురాన్ దృష్ట్వా దేవాచార్యేణ ధీమతా ॥
ఆ దేవితో, భార్గవుఁడు, సర్వభూతములకు అదృశ్యుండై మాయావృతుఁడై పదిసంవత్సరములుండెను. దితిసుతులైన రాక్షసులందరు, కృతార్థుఁడై శుక్రుఁడు వచ్చియుండుట తెలిసికొనీ, ఆతని చూడవలయునని కోరికతో, సంతుష్టులై ఆతని గృహమున కరిగిరి. జయంతిచే సంవృతుడైన తమ గురువును వారు చూడలేకపోయిరి.” అది “లక్షణ"ముగా (ఆతఁడు వచ్చియుండకుండుటకు సూచనగా) ఆదైత్యులేటింగ్ వచ్చిన విధముగనే తీరిగిపోయిరి. శుక్రుఁడు పదిసంవత్సరములు హితమును కోరునట్టి జయంతి. స్వప్రీతికొఱకు, దేవతల క్షేమము కొఱకు, సంరుద్ధుండై యుండుట బృహస్పతి తెలిసికొనెను. బృహస్పతి, అదియొక మంచి యవకాశమని తలంచి, దేవతల యొక్క రహస్యాలోచనచే ప్రచోదితుఁడయి, శుక్రుని యొక్క రూపమును ధరించి, వచ్చి సమావేశమొందిన అసురులనుచూచి-వారితో నిట్లు సంభాషించెను. “ఎవరి - కొఱకు నేను యజ్ఞమును చేయుచుంటినో అట్టి యాజ్యులయిన మీ కందరకు స్వాగతము. 'మీ హితము కొఱకు తిరిగి నేను వచ్చితిని. నేను సంపాదించిన విద్యల నన్నింటిని మీకుపదేశించెదను”. అనెను. అంతవారు సంతుష్ట మనస్కులైరి. విద్యలు సంపాదించుకొఱకు బృహస్పతిని " చేరిరి. అంత నిర్దిష్టమయిన! పదివత్సరముల కాలము పూర్ణమయ్యెను. దేవయాజియైన కావ్యునికి పదేండ్లు గతించెనని ఆకస్మికముగా జ్ఞప్తికి వచ్చెను. వెంటనే తన యాజ్యులను చూడవలయునని బుద్ధి కావ్యునకు కలిగెను. శుక్రుడిట్లనెను. చిరునవ్వుల వెలయించుదానా..! దేవి ! - వీభ్రాంతలోచనా త్రివర్ణాయతలోచన నాయాజ్యులను దర్శించుటకు పోవుచున్నాను." ఇట్లు చెప్పబడి ఆమె యిట్లనెను. “ఓ మహావ్రత ! నీభక్తులను సేవింపుము. ఇదీ యుత్తమముల యొక్క ధర్మము, నేను నిన్ను నీ ధర్మము నుండి దోషమాచరింప చేయను”. సూతుఁడిట్లనెను. ధీమంతుఁ డైన దేవతాచార్యునిచే రాక్షసులు అంత వెళ్లి శుక్రుని ఆకారమున వంచింపబడుట శుక్రుఁడు చూచెను. అప్పుఁడిట్లు శుక్రుఁడనెను.
వంచితాన్ కావ్యరూపేణ వచసా పునరబ్రవీత్ ।
కావ్యం మామనుజానీధ్వమేష హ్యాంగీరసో మునిః ॥
వంచితా బత యూయం వై మయి సక్తే తు దానవాః ।
శ్రుత్వా తథా బ్రువణం తం సంక్రాంతి దితిజస్తతః ॥
సంప్రేక్షంతావుభౌ తత్ర స్థిరాసీనౌ శుచిస్మితౌ ।
సంప్రమూఢాః స్థితాః సర్వే ప్రాపద్యంత న కించన ॥
తతస్తేషు ప్రమూణేషు కావ్యస్తాన్పున రబ్రవీత్ ।
ఆచార్యో యో హ్యయం కావ్యో దేవాచార్యోఽజయమంగిరాః ॥
అనుగచ్ఛత మాం సర్వే త్యజమైనం బృహస్పతిమ్ ।
ఏవముక్తీ తు తే సర్వే తావుభౌ సమవేక్ష్య చ ॥
తదాఽసురా విశేషం తు న ష్యజానంస్తయోర్ద్వయోః । బృహస్పతిరువాచైనామభ్రంతోఽజయమంగిరాః ॥
కావ్యోఽహం వో గురుర్దైత్యా మద్రూపోఽయం బృహస్పతిః ।
సంమోహయతి రూపేణ మామకేనైష వోఽసురాః ॥
శ్రుత్వా తస్య వచస్తే వై సంమంత్ర్యాథ వచోఽబ్రువన్ ।
అయం నో దశ వర్షాణి సతతం శాస్త్రి వై ప్రభుః ॥
ఏష వై గురురస్మాకమంతరేప్సురయం ద్విజాః ।
తతస్తే దానవాః సర్వే ప్రణిపత్యాభివాద్య చ ॥
వచనం జగృహస్తస్య విద్యాభ్యాసేన మోహితాః ।
ఊచుస్తమసురాః సర్వే క్రుద్ధాః సంరక్తలోచనాః ॥
అయం గురుర్హితోఽ స్మాకం గచ్ఛ త్వం నాసి నో గురుః ।
భార్గవోంఽగిరసో వాఽయం భవత్వేషైవ నో గురుః ॥
స్థితో వయం నిదేశేఽస్య గచ్చ త్వం సాధు మా చీరమ్ ।
ఏవముక్త్వా సురాః సర్వే ప్రాపద్యంత బృహస్పతిమ్ ॥
యదాన ప్రతిపద్యంతే తేనోక్తం తన్మహద్ధితమ్ ।
చుకోప భార్గవస్తేషామవలోపేన వై తదా ॥
నన్ను మీరు శుక్రునిగా నెఱుంగుఁడు. ఇతఁడో ఆంగిరసుఁడు (బృహస్పతి). ఓ దానవులారా! నేను మీ యందనురక్తుండనై యుండగా మీరందరీతనిచే వంచితులైతిరి.” దైత్యులాతని వాక్యములు మీనీరి. సంభ్రాంతులయిరి. ఇద్దరు స్థిరాసీనులై చిరునవ్వులు వెలయించుచు కూర్చుండి యుండిరి. వారిరువురను దానవులుచూచిరి. అందరు సంప్రమూఢులైయుండిరి. ఏమియు చేయక కళ్లప్పగించి యుండిరి. ప్రమూఢాత్ములైయున్న వారలఁగని మరలకావ్యుఁడు ఇట్లనెను.” ఈ నేను మీయాచార్యుఁడనైన కావ్యుఁడను. ఆతఁడో దేవతాచార్యుఁడైన బృహస్పతి, మీరందరు నన్ను అనుసరింపరండు. ఆ బృహస్పతిని విసర్జించుఁడు”. ఇట్లు కావ్యుఁడు పలుకగా వారందరు వారిరువురను మరల మరల పరిశీలించి చూచిరి. అసురులు వారిరువురిలో నెట్టి భేదమును గమనించలేకపోయిరి. అంత, ఎట్టి సంభ్రాంతియు లేక బృహస్పతి వారలతో నిట్లనెను. “ఓ దైత్యులారా! నేన శుక్రుఁడను మీ గురువును, ఈతఁడు బృహస్పతి. నా రూపాంతరితుఁడు. నా యీ వేషముతో దానవులారా ! మీమ్ము సంభ్రాంతులను చేయుచున్నాఁడు”, ఈ పలుకులను విని పరస్పరము సంప్రదించుకొని దైత్యులు ఇట్లు పలికిరి”, ఈ ఆచార్యవర్యుఁడు పదియేండ్ల నుండి చూకుపదేశములను చేయుచున్నాఁడు. నిజముగా నీతఁడే మా గురువు. ఈ బ్రాహ్మణుడు ఎవ్వరో మరియొకఁడు ఈ అవకాశమును పురస్కరించుకొన గోరుచున్నాఁడు,” అని దైత్యులందరు ఆబ్బహస్పతికి నేలపడి సాష్టాంగ నమస్కృతులు సలిపి ఆతని పలుకులనే ఆతని విద్యాభ్యాసమున సమ్మోహితులై సత్యములనీ అంగీకరించిరి. కన్నులనుండి నిప్పులు రాల సంక్రుద్దులై శుక్రునితో నిట్లనిరి". ఈతఁడు మాగురువు. వెళ్లి పొమ్ము నీవు మా గురుఁడవు కావు. ఆతఁడు భార్గవుఁడో ఆంగీరసుఁడో కానిమ్ము. ఆతఁడే మాగురువు. ఆతని నిర్దేశముల ననుసరింతుము. మంచిది. నీవింక వెళ్లవచ్చును. ఇంక ఆలసించకుము” అని యిట్లు చెప్పి అసురులందరు బృహస్పతినే తమ గురువుగా నంగీకరించి ఆతనిని చేరిరి.
బోధితాఽపి మయా యస్మాన్న మాం భజత దానవాః ।
తస్మాత్ర్పణష్టసంజ్ఞా వై పరాభవమవాప్యుథ ॥
ఇతి వ్యాహృత్య తాన్ కావ్యో జగామాథ యథాగతమ్ ।
శప్తాన్ తానసురానజ్ఞాత్వా కావ్యేన తు బృహస్పతిః ॥
కృతార్థః స తదా హృష్టః స్వరూపం ప్రత్యపద్యత ।
బుద్ధ్వాఽసురాంస్తదా భ్రష్టాన్ కృతార్దోంఽతర్ధిమాగమత్ ॥
తతః ప్రనష్టే తస్మింస్తే విశ్రాంతి దానవాస్తదా ।
అహో ధిక్ వంచితా స్నేహాత్పరస్పరమథాఽబ్రువన్ ॥
ధర్మతోఽ విముఖశ్చైవ కారితా వేథసా వయమ్ ।
దగ్ధశ్చైవోపధాయోగాల్వేస్వే కార్యే తు మాయయా ॥
తతోఽ సురాః పరిత్రస్తా దేవేభ్యస్త్వరితా యయుః ।
ప్రహ్లాదమగ్రతః కృత్వా కావ్యస్యానుగమం పునః II
తతః కావ్యం సమాసాద్య హ్యభితస్థురవాజ్మఖాః ।
తానాగతాన్ పునర్దృష్ట్వా కావ్యో యాజ్యానువాచ హ ॥
యయా సంబోధితాః కాలే యతో మాం నాభ్యనందథ ।
తతస్తేనావలేపేన గతా యూయం పరాభవమ్ ॥
ప్రహ్లాదస్తమథోవాచ మా నస్త్వం త్యజ భార్గవ ।
స్వాన్ మ్యా న్భజమానాంశ్చ భక్తాంశ్చైవ విశేషతః ॥
త్వయ్యదృష్టే వయం తేన దేవాచార్యేణ మోహితాః ।
భక్తానర్హసి నస్త్రాతుం జ్ఞాత్వా దీర్గేణ చక్షుషా ॥
వారికి గొప్ప వీతమును గూర్చు తన పలుకులను వారు అంగీకరింపక, భార్గవుడు వారి యొక్క అవలేపమునకు మౌఢ్యమునకు సంక్రుద్ధుఁడయ్యెను. శుక్రుడిట్లనెను. “నేను వారికి విషయము చెప్పి బోధించినను, దానవులే కారణమున నన్ను సేవించి ఆశ్రయించిరో, తత్కారణమున నష్టవివేకులై పరాభవమును (అపజయమును పొందెదరు. అనికావ్యుఁడుచెప్పి వచ్చినదారినే వెడలిపోయెను. అసురులు శుక్రునిచే శపింపఁబడుట తెలిసికొని హస్పతీ, తన్ను కృతార్థునిగ గ్రహించి సంహృష్ణుఁడై తన నిజరూపము ధరించెను. బృహస్పతి అసురులు భ్రష్టులగుట తెలిసికొనీ ఆప్రదేశము నుండి వీరోహితుడయ్యెను. బృహస్పతి తిరోహితుఁడయిన వెనుక దానవులు విభ్రాంతులైరి. వీరొకరితో నొకిట్లు మాట్లాడుకొనిరి” ఎంత పనిజరిగినది. హాధిక్ మనము స్నేహమువలన బృహస్పతిచే వంచితుల మైతిమి. బ్రహ్మ వలన మనము ధర్మము నుండి విముఖులమయితిమి. మనము మన కార్యకలాపముల యందు మాయచే దగ్గులమయితిమి”, అంత అసురులు దేవతలనిన మిక్కిలి భయపడిరి. వారు కావ్యుని అనుగమించుటకు వెంటనే ప్రహ్లాదుని పురస్కరించుకొని శుక్రునికడకరిగిరి. వారు కావ్యుని సమీపించిరి. తలలువంచుకొని ఆతని... చుట్టును నిలబడిరి. మరల తన యాజ్యులు (అనుచరులు) వచ్చుటచూచి కావ్యుఁడు వారితో నిట్లనెను. “అర్హమయిన తరుణమున నేను మీకు బోధించి హెచ్చరించితిని, మీరు నా పలుకుల గౌరవించితిరికాదు. నన్ను అభినందింపరైతిరి. అందుచే తరువాత అవలేపముచే వెడలిరి. పరాభవమును పొందితిరి. ప్రహ్లాదుఁడాతనితో నిట్లనెను. “ఓ భార్గవ! నీయాజ్యులము మమ్ము విసర్జింపకుము. 'మేము నిన్నాశ్రయింప వచ్చితిమీ. నీ దివ్యదృష్టిచే నంతయు తెలిసికొనీ మమ్ము రక్షించుట కరుఁడవు.
యది నస్త్వం న కురుషే ప్రసాదం భృగునందన ।
అపధ్యాతాస్త్వయా హ్యద్య ప్రవేక్ష్యామో రసాతలమ్ ॥
సూత ఉవాచ :
జ్ఞాత్వా కావ్యో యథాతత్త్వం కారుణ్యేన మహీయసా ।
ఏవం శుక్రోఽనునీతః కోపం న్యవర్తయత్ ॥
ఉవాచేదం న భేతవ్యం గంతవ్యం న రసాతలమ్ ।
అవశ్యం భావీ హ్యర్ధోఽయం ప్రాప్తావో మయి జాగ్రతి ॥
నశక్యమన్యథా కర్తుం దీష్టం హి బలవత్తరమ్ ।
సంజ్ఞా ప్రనష్టా యా చేయం కామం తాం ప్రతీలప్ప్యథ ॥
ప్రాప్తః పర్యాయకాలో వా ఇతి బ్రహ్మాభ్యభాషత ।
మత్ప్రసాదాచ్చ యుష్మాభిర్భుక్తం త్రైలోక్యమూర్జితమ్ ॥
యుగాఖ్యా దశ సంపూర్ణా దేవానాక్రమ్య మూర్ధని ।
తావంతమేవ కాలం వై బ్రహ్మా రాజ్యమభాషత ॥
సావర్ణికే పునస్తుభ్యం రాజ్యం కిల భవిష్యతి ।
లోకానామీశ్వరో భావి పౌత్రస్తవ పునర్బలిః ॥
ఏవం కాలమయం ప్రోక్తః పౌత్రస్తే బ్రహ్మణా స్వయమ్ ।
తథా హృతేషు లోకేషు న శోకో న కిలాభవత్ ॥
యస్మాత్ర్పవృత్తయశ్చాస్య న కామైరభిసంధితాః ।
తస్మాదజేన ప్రీతేన దత్తం సావర్ణికేంతరే ॥
దేవరాజ్యం బలేర్భావ్యమితి మామీశ్వరోఽబ్రవీత్ ।
తస్మాదదృశ్యో భూతానాం కాలాకాంక్షీ స తిష్ఠతి ॥
ప్రీతేన చామరత్వం వై దత్తం తుభ్యం స్వయంభువా ।
తస్మాన్నిరుత్సుకస్త్వం వై పర్యాయం సహసాకులః ॥
ఓభృగునందన!నీవు మాయెడ ప్రసన్నుండవు కాకపోయినచో,మేమందరము నీచే శపింపఁబడితిమీ, ఇప్పుడే మేము రసాతలమున కరిగేదము." అంత సూతుఁడిట్లనెను. కావ్యుఁడువిషయములనుఅధికమయినకారుణ్యము చేయథాతత్త్వము(జరిగినవీజరిగినట్లుగా) తెలిసికొనెను.ఈవిధముగా శుక్రుఁడు కోసోపశమనముచే అనునీతుండై కోపమును పరిత్యజించేను, పొరీతోనిట్లనెను, “మీరుభయపడవలసినదిలేదు. రసాతలమునకు పోవలసి నదియులేదు, ఇదితప్పకజరుగవలసినసంఘటనము. అందుచే నేను జాగరూకతవహించియున్నను, ఇదీసంభవించినది. ఇదీబలవత్తరసంఘటన. కర్మ బలవత్తరమైనది. వేరువిధముగాచేయుటకుశక్యముగానీది.మీసంజ్ఞావివేకముపోయినదికదా.దానీనిమీరుకావలసినప్పుడుపొందవచ్చును. రాజ్యప్రాప్తికి పర్యాయకాలము(వారసత్వసమయము) వచ్చినది. అనీబ్రహ్మచెప్పెను. నాయనుగ్రహముననూర్జితమయిన (తేజోవంతమయిన) త్రైలోక్యపుటధికారము మీరనుభవించితిరి. మీరుదేవతల నాక్రమించి వారితలలుతన్నిరాజ్యాధికారమువహించి పదియుగములకాలముసంపూర్ణమైనది. అంతకాలముమాత్రమే రాజ్యముచేసెదరనీబ్రహ్మఆనతిచ్చెను. సావర్ణిక మన్వంతరమున మరలమీకురాజ్యాధిపత్యము కలుగును. నీపౌత్రుం డయినబలి లోకములకన్నింటికి ప్రభువుకోగలడు. నీపౌత్రునియొక్కఆధిపత్యము, ఈకాలపరిమితిబ్రహ్మయేనిర్ణయించీ చెప్పెను. లోకములుమీవద్ద నుండిసంహృతములైనప్పుడుమీరు విచారింపపనిలేదు. బలియొక్కకార్యములులోభముచేగాని ఆశచేగానిప్రచోదితములైనవీ కానందున బ్రహ్మమిక్కిలి ప్రీతుఁడయ్యెను. దేవతలరాజ్యము బలికి సంక్రమించునని ఈశ్వరుఁడు నాతోచెప్పెను. అందుచేతత్కాలమునునీరీక్షించుచుభూతములకదృశ్యం డైయుండును. నీకోఅమరత్వమును (అమృతత్త్వమును) ప్రీతుండైబ్రహ్మయొసంగెను. నిరుత్సుకత్వము వలదు. రాజ్యవారసత్వము పర్యాయముగా వచ్చును. మీరుసంక్షోభముచెందకుండు.
న చ శక్యం మయా తుభ్యం పురస్తాద్వై విసర్పతుమ్ ।
బ్రహ్మణా ప్రతిషిద్ధోఽస్మి భవిష్యం జనతా ప్రభో ॥
ఇమౌ చ శిష్యౌ ద్వౌ మహ్యం తుల్యావేతౌ బృహస్పతేః ।
దేవతైః సహ సంరబ్ధాన్సర్వాన్ వో ధారయిష్యతః ॥
సూత ఉవాచ :-
ఏవముక్తాస్తు దైతేయాః కావ్యేనాక్లిష్టకర్మణా ।
తతస్తాభ్యాం యయుః సార్థం ప్రహ్లాదప్రముఖాస్తదా ॥
అవశ్యభావ్యమర్థం తం శ్రుత్వా దైతేయదానవాః ।
సహసా శంసమానాస్తే జయం కావ్యేన భాషితమ్ ॥
దంశీతాః సాయుధాః సర్వే తతో దేవాన్ సమాహ్వయన్ ।
అథ దేవాసురాన్ దృష్ట్వా సంగ్రామే సముపస్థితామ్ ॥
తతః సంవృతసన్నాహా దేవాస్తాన్సమయోధయన్ ।
దేవాసురే తతస్తస్కిన్వర్తమానే శతం సమాః ।
అజయంతాసురా దేవాన్నగ్నా దేవా అమంత్రయన్ ॥
దేవా ఊచుః :-
శండామర్క ప్రభావేణ జితాః స్మస్త్వసురైర్వయమ్ ।
తస్మాద్యజ్ఞం సముద్దిశ్య కార్యం చాత్మహితం చయత్ ॥
యజ్ఞేనోపాహ్వయిష్యామః తతో జేష్యామహేఽసురాన్ ।
అథోపామంత్రయన్ దేవాః శండామార్కౌతు తావుభే ॥
యజ్ఞే చాహూయ తౌ ప్రోక్తౌ త్యజంతామసురా ద్విజౌ ॥
గ్రహం తు వాం గ్రహీష్యామో హ్యనుజిత్య తు దానవాన్ ।
ఏవం తత్యజతుస్తౌ తు షండామర్కౌ తదా సురాన్ ॥
తతో దేవా జయం ప్రాప్తి దానపాశ్చ పరాభవమ్ ।
దేవాసురాన్ పరాభావ్య శండామర్కావుపాగమన్ ॥
ముందుగా దీనినీసంఘటిపచేయగలశక్తి,నాకులేదు. బ్రహ్మచే నేను ప్రతిషిద్ధింపబడితిని.భగవన్నిర్ణీతమయినది ముందుగా జరుగును. ఇది తెలిసియే బ్రహ్మ నన్ను ప్రతిషేధించెను. వీరిద్దరు నాకు శిష్యులు, బృహస్పతితో సమానులు, దేవతలతోడి సంరబ్దముతో మునిగియున్నపుపడు. వారు మీకు సహకరించెదరు.
సూతుఁడిట్లనెను: అక్లిష్టకర్ముఁడయిన ధర్మకార్యనిర్వహణ దక్షుండైనకావ్యుఁడిట్లు చెప్పగా, ప్రహ్లాదుఁడు, మొదలగువారు , ఇతర దైతేయులతో ఆయిరువురి ఆచార్యులతోవెళ్ళిరి. అవశ్యంభావ్యమైన, (తప్పనిదైన)విషయమును గూర్చి దైతేయులు, దానవులు, విని కావ్యఁడు చెప్పిన విజయమును ప్రశంసించిరి. కవచములధరించీ, ఆయుధములను సిద్ధముచేసికొని వారందరు దేవతలను యుద్ధమునకు రమ్మని సవాలు చేసిరి. సంగ్రామమునకు వెంటనే పురోగమించుచున్న అసురులనుచూచి, దేవతలు సంవృతసన్నాహము కలవారై వారితో: . యుద్ధము సలిపిరి. దేవతలకు అసురులకు మధ్య యుద్ధము ఒక వంద సంవత్సరములు జరిగెను. ఆ యుద్ధమున అసురులు దేవతలను పరాజితులను చేసిరి. సంక్షుబులైన దేవతలు వారిలో మంతనములు సలిపిరి. దేవతలిట్లనిరి. శండుని యొక్క మర్కునీయొక్క గొప్ప ప్రభావముచే,మనలనుఅసురులు జయించిరి. అందుచే యజ్ఞమునొకదానిని సముద్దేశించి,మనయొక్కహితముకోటకు ఏదియో యొకకార్యము చేయవలయును. వారినీ యజ్ఞమనకుసమాహ్వానము చేయుదము, తరువాత అసురులనుజయించెదముగాక. అంతవారు శండుని, అమర్కుని యిరువురనుయజ్ఞమునకునాహ్వానించిరి. వారితోనిట్లనిరి. ఓబ్రాహ్మణులారా! అసురలనుమీరుపరీత్యజింపుఁడు. దానవులను జయించిన తరువాత మీకొకవంతు నిచ్చేదము. ఈవిధముగాషండామార్కులు రాక్షసులను పరిత్యజించిరి. అంత దేవతలు జయించిరి. దానవులు పరాభవమునొందిరి. అసురులను జయించి, దేవతలు శండామార్కులను సమీపించిరి.
కావ్యశాపాభిభూతాశ్చ అనాధారాశ్చ తే పునః ।
బాధ్యమానాస్త్రదా దేవైర్వివిశుస్తే రసాతలమ్ ॥
ఏవం నీరుద్యమాస్తే వై కృతా శక్రేణ దానవాః ।
తతః ప్రభృతి శాపేన భృగునైమిత్తికేన చ ॥
యజ్ఞే పునః పునర్విష్ణుర్యజ్ఞేఽథ శిధిలే ప్రభుః ।
కర్తుం ధర్మవ్యవస్థానమధర్మస్య ప్రణాశనమ్ ॥
ప్రహ్రదస్య విదేశే తే యేఽసురా న వ్యవస్థితాః ।
మనుష్యవధ్యాంస్తాన్ సర్వాన్ బ్రహ్మా వ్యాహరత ప్రభుః ॥ ధర్మాన్నారాయణస్తస్మాత్సంభూతశ్చాక్షుషేంతరే ।
యజ్ఞం ప్రవర్తయామాస వైన్యో వైవస్వతేంతరే ॥
ప్రాదుర్భావే తు వైన్యస్య బ్రహ్మైవాసీత్పురోహితః ।
చతుర్ద్యాం తు యుగాభ్యాయామాపన్నేషు సురేష్వథ ॥
సంభూతః స సముద్రాంతర్హిరణ్యకశిపోర్వధే ।
ద్వితీయో నరసింహోఽ భూధ్రౌదః సుతపురస్సరః ॥
యజమానం తు దైత్యేంద్రమదిత్యాః కులనందనః ।
ద్విజో భూత్వా శుభే కాలే బలిం వైరోచనం జగౌ ॥
త్రైలోక్యస్య భవాన్రాజా త్వయి సర్వం ప్రతిష్ఠితమ్ ।
దాతుమర్హసి మే రాజన్వీక్రమాంస్త్రీనితి ప్రభుః ॥
దదామిత్యేవ తం రాజా బలిర్వైర్హోచనో బ్రవీత్ ।
వామనం తం చ విజ్ఞాయ తతోఽదాన్ముద్రితః స్వయమ్ ॥
స వామనో దివం ఖం చ పృథివీం శ్చ ద్విజోత్తమాః ।
త్రిభిః క్రమైర్విశ్వమీదం, జగదాక్రామత ప్రభుః ॥
అత్యరిచ్యత భూతాత్మా భాస్కరం స్వేన తేజసా ।
(ప్రకాశయన్దిశః సర్వాః ప్రదేశశ్చ మహాయశాః ॥
దానవులునిరాధారులు. కావ్యునియొక్కశాపముచే అభీభూతులు. దేవతలచే మరలనొకసార బాధింప బడిరి.అందుచేర సాతతలమును ప్రవేశించిరి. ఈవిధముగాకావ్యునీశాపముచేఇంద్రునిచేదానవులునీరుద్యమవంతులుగాచేయబడిరి. యజ్ఞసంప్రదాయముశీధీలముకాగా ధర్మ వ్యవస్థాపనమును,అధర్మవీనాశనమునొనరించు విష్ణువు మరల మరల అవతరించెను. ప్రహ్లాదునియొక్కనిర్దేశమును ఏదానవులు అంగీకరించి యుండలేదో, వారుమనుష్యులచే వధింపఁబడుట తథ్యమని బ్రహ్మచెప్పెను. అందుచేచాక్షుషమన్వంతరమున ధర్మమున నారాయణుఁడు ద్భవించెను. పృథు కుమారుఁడైన వేనుఁడు వైవస్వంతమన్వంతరమున యజ్ఞమును నిర్వర్తించేను. వైన్యుఁడుప్రాదుర్భవింప బ్రహ్మ స్వయముగా పురోహితత్త్వము వహించెను. నాలుగవదైనయుగమునందుసురలాపన్నులైయుండ(విష్ణువు సముద్రాంతరమునందు సంభూతుఁడయ్యెను హిరణ్యక. శివుని వధ యందు(విష్ణువు నరసింహుఁడయ్యెను. అతఁడు రెండవరుద్రుడయ్యెను.హిరణ్యకశిపుడు సుతపురస్సరుడయ్యెను. దైత్యప్రభువు,విరోచనునీ యొక్కకుమారుడునునైన బలి యజ్ఞమునాచరించుచుండెను. అదితీవంశానందకరుడైన విష్ణువు ద్విజత్వమువహించి,శుభసమయమున వైరోచనుఁ డయిన బలితో నీట్లుపలికెను. నీపు త్రిలోక ప్రభుఁడవు సర్వము నీయందుప్రతిష్టితమైయున్నది. ఓప్రభూ!మూఁడడుగులు నాకీయ నీవు సమర్థుఁడు అనీ. 'తప్పకఇచ్చెదను'అని బలి పలికెను. ఆతఁడువట్టివామను (పొట్టివాడనీతలంచియాతఁడు సంతోషించెను. అంతఓబ్రాహ్మణులారా. " ఆవామనుండుదివమును,పృథ్విని,ఆకాశమును మూఁడు పాదములచే నాక్రమించేను, భూతాత్ముఁడైనవిష్ణువు, తనతేజస్సుచే భాస్కరుని మించి , వెలింగెను. తేజస్వంతుఁడయిన ప్రభువు.దిక్కులనన్నింటిని అంతర ప్రదేశములనన్నింటిని ప్రకాశవంతమొనర్చెను.
శుశుభే స మహాబాహుః సర్వలోకాన్ ప్రకాశయన్ ।
అసురీం శ్రియమాహృత్య క్రీంల్లోకాంశ్చ జనార్దనః ॥
స పుత్రపౌత్రానపురాన్పాతాలత మానయస్ ।
నముచిః శంబరశ్చైవ ప్రహ్లాదశ్చైవ విష్ణునా ॥
క్రూరా హతా వినిర్ధూతా దిశః సంప్రతిపేదిరే ।
మహాభూతాని భూతాత్మా సవిశేషాణి మాధవః ॥
బలిం చ సబలం విప్రాస్తత్రాద్భుతమదర్శయత్ ।
తస్య గాత్రే జగత్సర్వమాత్మానమనుపశ్యతి ॥
న కించిదస్త్రి లోకేషు యదవ్యాప్తం మహాత్మనా ।
తద్వై రూపముపేంద్రస్య దేవదానవమానవాః ॥
దృష్ట్వా సంముముహుః సర్వే విష్ణుతేజోవిమోహితాః ।
బలీ: సితో మహాపాశైః సబంధుః ససుహృధ్గణః ॥
విరోచనకులం సర్వం పాతాలే సన్నివేశితమ్ ।
తతః సర్వామరైశ్వర్యం దత్త్వేంద్రాయ మహాత్మనే ॥
మానుషేషు మహాబాహుః ప్రాదురాస జనార్దనః ।
ఏతాస్తిస్రః స్మృతాస్తస్య దీవ్యాః సంభూతయః శుభాః ॥
మానుష్యః సప్త యాస్తస్య సాగ్రగాస్తా నిబోధత ।
త్రేతాయుగే తు దశమే దత్తాత్రేయో బభూవ హ ॥
నష్టే ధర్మే చతుర్ధస్య మార్కండేయపురస్సరః ।
పంచమః పంచదశ్యాం తు త్రేతాయాం సంబభూవ హ ॥
మాంధాతా చక్రవర్తిత్వే తస్యోతథ్యః పురస్సరః ।
ఏకోనవింశ్యాం త్రేతాయాం సర్వక్షత్రాంత్ కృతద్విభుః ।
జామదగ్న్యస్తదా షష్ఠి విశ్వామిత్రపురస్సరః ।
చతుర్వింశే యుగే రామో వసిష్ఠేన పురోధసా ॥
సప్తమో రావణస్యార్థే జజ్ఞే దశరథాత్మజః ।
అష్టమో ద్వాపరే విష్ణురష్టావింశే పరాశరాత్ II
అసురులయొక్కసంపదనంతటినిఆహరించి,మహాబాహుడైనజనార్దనుఁడుసర్వలోకమును ప్రకాశింపఁజేసెను.ఆతఁడుపుత్రపౌత్రాదులతో సహితముగా అసురులను పాతాళ లోకమునకు తరిమెను. వారు నముచి శంబర ప్రహ్లాదులు మొదలగువారు. వారలలోక్రూరులయిన వారిని విష్ణువు చంపేను.రాక్షసులందరునిర్దూతులై దిక్కులకు ప్రాణరక్షణార్థముపరుగిడిరి. సర్వభూతాత్ముఁడైనమాధవుఁడు, ఓబ్రాహ్మణులారా! వివిధములయిన రూపములతో పంచభూతములకును, సబలుఁడయినబలికి అద్భుత క్రియలను ప్రదర్శించెను. సర్వప్రపంచము తన శరీరమున తమ్ముతాముదర్శించిరి. మహాత్ముడైనయాతనిచే వ్యాప్తము కాని దేదియును లేదు. ఉపేంద్రునియొక్క ఆరూపమును చూచి దేవదానవ మానవులు సమ్మోహితులైరి.విష్ణుని తేజస్సుచే వారువిమోహితులయిరి. బలి, ఆతనిబంధువులతో, సుహృద్గణములతో మహాపాశములచేబంధితుడయ్యెను.విరోచనునికులమంతయు పాతాళలోకమును ప్రవేశింపచేయబడినది, తరువాత విష్ణువు మహాత్ముఁడైయింద్రునకు దేవతలకు సంబంధించిన సర్వైశ్వర్యసంపద నొసంగేను. అంత మహాబాహుండైన విష్ణువు మనుష్యులయందు ప్రాదుర్భవించెను, ఈమూఁడు అవతారములు జనార్ధనునీ దీవ్యావతారములుగా శుభవంతములుగా, స్మరింతురు. ఆతనికి మనుష్యసంబంధమయినయేడుఅవతారములు కలవు. వానినీ వానిపూర్వములయిన వానీతో సహా అవగాహన చేసికొనుఁ డు. పదియవ దయిన త్రేతాయుగమున ధర్మము నష్టము కాగా, ఆతఁడు నాలుగవదయిన మార్కండేయుఁడు ముందుగా(?) దత్తాత్రేయునియొక్క అవతారమునొందెను. ఐదవదయిన త్రేతా యుగమునందు, చక్రవర్తియైన మాంధాతగా విష్ణువ తరించెను. ఆతనీగురువు ఉతథ్యుఁడు. పందొమ్మిదవ త్రేతాయుగమున విష్ణువు జమదగ్నికుమారుడుగా పుట్టెను.ఆతనిగురువు విశ్వామిత్రుఁడు. ఆతడుసర్వక్షత్రియులను అంతమొందించెను. ఇది ఆరవ యవతారము. ఇరువదినాలుగవ త్రేతాయుగమున విష్ణువు రామునిగా ఏడవ అవతారము దాల్చెను. ఆతఁడు దశరథుని తనయుఁడు రావణుని వధార్ధము జన్మించెను. వసిష్ఠుని గురువుగా పొందెను. ఇరువది యెనిమిదవ ద్వాపరయుగమున విష్ణువు వేదవ్యాసునిగా ఎనిమిదవ అవతారమనేను, ఆతఁడుపరాశరునకు పుట్టెను.జాతుకర్యుఁడాతనిగురువు.
వేద వ్యాసస్తతో జజ్ఞే జాతకర్ణ్యపురస్సరః ।
తథైవ నవమే విష్ణురాదిత్యః కశ్యపాత్మజః ॥
దేవక్యాం వసుదేవాత్తు జాతో గార్గ్యపురస్సరః ।
అప్రమేయో నియోగశ్చ యతకామవరో వశీ ॥
క్రీడతే భగావాంల్లోకే బాలః క్రీడనకైరివ ।
న ప్రమాతుం మహాబాహుః శక్యోఽ సౌ మధుసూదనః ॥
పరం హ్యావరమేతస్మాద్విశ్వరూపాన్నవిద్యతే ।
అష్టావింశతికే తద్వద్ద్వాపరస్యాథ సంక్షయం ॥
నష్టే ధర్మే తదా జజ్ఞే విష్ణు ర్వృష్ణికులే ప్రభుః ।
కర్తుం ధర్మవ్యవస్థానం అసురాణాం ప్రణాశనమ్ ।
మోహయన్ సర్వభూతాని యోగాత్మా యోగమాయయా ॥
ప్రవిష్టో మానుషీం యోనిం ప్రచ్ఛన్నశ్చరతే మహీమ్ ॥
విహారార్థం మనుష్యేషు సాందీపనిపురస్సరః ।
యత్ర కంసం చ శాల్వం చ ద్వివిదం చ మహాసురమ్ ॥
అరిష్టం వృషభం చైవ పూతనాం కేశినం హయమ్ ।
నాగం కువలయాపీడం మల్లం రాజగృహాధిపమ్ ॥
దైత్యాన్ మానుషదేహస్థాన్ సూదయామాస వీర్యవాన్ ।
ఛిన్నం బాహుసహస్రం చ బాణస్యాద్భుతకర్మణా (ణ:) ॥
నరకశ్చ హతః సంఖ్యే యవనశ్చ మహాబలః ।
హృతాని చ మహీపానాం సర్వరత్నాని తేజసా ॥
కురువీరాశ్చ నిహతాః పార్థివా యే రసాతలే ।
ఏతే లోకహితార్థాయ ప్రాదుర్భావా మహాత్మనః ॥
అదితికశ్యపులకు వామనుఁడుగా పుట్టిన విష్ణువుతొమ్మిదవ యవతారమున దేవకీవసుదేవులకు పుత్రుఁడయినకృష్ణునిగా,గార్గ్యపురస్సరుం డై పుట్టేను, అతఁడప్రమేయుఁడు,ఒకరిచేనియోగింపఁబడువాడుకాఁడు.వశీకృతేంద్రియుఁడు, అతఁడు తన కామమును నిగ్రహించెను, పిల్లవాండు ఆటవస్తువులతో ఆడునట్లు భగవానుఁడు లోకమందు క్రీడించును, శక్తిమంతుడయిన విష్ణువు దురవగాహుడు, విశ్వరూపుఁడైన ఈప్రభువుకంటే . ఉత్కృష్టమైనది వేడొకటీ లేదు. ఇరువదియెన్మిదవ ద్వాపరయుగమున ధర్మసంక్షయము కలుగగా, విష్ణువు వృష్టి వృశ్నకులమునకు ధర్మవ్యవస్థాపన మాచరించుటకు,అసురులనాశనము చేయుటకు,పుట్టెను. యోగాత్ముడయిన విష్ణువు యోగమాయచేతను,సర్వభూతములను మోహపెట్టుచు, మానుషమైన యోనియందు ప్రవేశించి ప్రచ్ఛన్నుఁడై భూమియందు సంచరించును. మనుష్యుల యందు విహరించుటకు సాందీపనిపురస్సరుం డై పుట్టెను. ఈ యవతారములో కంసుని, శాల్వుని,ద్వీవీదుఁడైనరాక్షసుని,అరిష్టమైన వృషభమును, పూతనను, అశ్వరూపమునవచ్చినకేశినిని, కువలయా, పీడమను ఏనుగును, మల్లుని (చాణూరునిరాజగృహాధిపతియయిన జరాసంధుని, చంపెను. వీర్యవంతుఁడైనవిష్ణువు మానుషదేహస్థులయిన దైత్యులను చంపెను. సహస్ర బాహుఁడయినబాణుని ఆశ్చర్యకర్మచే చంపెను. యుద్దముననరకుని చంపెను. మహాబలుడయినయవనుని చంపెను. మహీపాలురయొక్క సర్వ రత్నములను తన తేజస్సుచే నతఁడు గ్రహించెను. కురువీరులందరు చంపఁబడిరి. అట్లే రసాతలమందున్న రాజులు చంపఁబడిరి. ఇవీ మహాత్ముం, డయిన మహానుభావునియొక్క లోకతీర్థమయినకార్యములు.
అస్మిన్నేవ యుగే క్షీణే సంధ్యాశిష్టే భవిష్యతి ।
కల్కిర్విష్ణుయశా నామ పారాశర్య: ప్రతాపవాన్ ॥
దశమో భావ్యసంభూతో యాజ్ఞవల్క్యపురస్సరః ।
అనుకర్షన్సవై సేనాం హస్త్వశ్వరథసంకులామ్ ॥
ప్రగృహీతాయుధైర్విప్రైర్యుతః శతసహస్రశః ।
నాత్యర్థం ధార్మికా యే చ యే చ ధర్మద్విషః క్వచిత్ ॥
ఉదీచ్యాన్మధ్యదేశాంశ్చ తథా వింధ్యపరాంతీకాన్ ।
తథైవ దాక్షిణాత్యాంశ్చ ద్రవిడాన్ సింహళైః సహ ॥
గాంధారాన్ పారదాంశైవ పహ్లవాంపవనాన్ శకాన్ ।
తుబరాజ్ఛా బరాంశ్చైవ పులిందాన్భరదాన్ పసాన్ ॥
లంపాకానాంధ్రకాన్ పుండ్రాన్ కిరాతాంశ్చైవ స ప్రభుః ।
ప్రవృత్త చక్రో బలవాన్లేచ్ఛానామంతకృద్యలీ ॥
అదృశ్యః సర్వభూతానాం పృథివీం విచరిష్యతి ।
మానవః స తు సంజజ్ఞే దేవసేనస్య ధీమతః ॥
పూర్వజన్మని విష్ణుర్యః ప్రమతిర్నామ వీర్యవాన్ ।
గోత్రేణ వై చంద్రమసః పూర్ణే కలియుగేఽభవత్ ॥
ఇత్యేతాస్తస్య దేవస్య దక్ష-సంభూతయః స్మృతాః ।
తం తం కాలం చ కాయం చ తత్తదుద్దిశ్య కారణమ్ ॥
అంశేన త్రిషు లోకేషు తాస్తా యోనీః ప్రపత్స్యతే ।
పంచవింశే స్థితః కల్పే పంచవింశత్స వై సమాః ॥
వినిఘ్నన్ సర్వభూతాని మానుషానేవ సర్వశః ।
కృత్వా బీజావశేషాం తు మహీం క్రూరేణ కర్మణా ॥
శాంతయిత్వా తు వృషలాన్ ప్రాయశస్తానధార్మీకాన్ ।
తతః సవై తదా కల్కిశ్చరితార్థః స సైనికః ॥
ఈ కలియుగమున సంధికాలము క్షీణించుటకు పూర్వము విష్ణుయశ నామమున కల్కిపుట్టును. ఆతఁడు పారాశర్యవంశమునకుచెందిన వాడు చాలప్రతాపవంతుఁడు. ఇది పదియవ అవతారము. ఇంకను జరుగవలసియున్నది,యాజ్ఞవల్క్యుఁడాతనిగురువు. ఆతనివెనుక ఏనుగులతో, గుఱ్ఱములతో రథములతో సంకులమైనసేనను తీసికొని వచ్చును. ఆతఁడు ప్రగృహీతాయుధులయిన శతసహసబ్రాహ్మణులతో కూడికొని, ఎచ్చటెచ్చట ధర్మమునకు శత్రువులుండిరో వారలను ఆ విష్ణురూపకల్కి నాశనముచేయును (వారు మ్లేచ్చులు). ఉదీచీదిశయందున్న వారిని, మధ్యదేశీయులను, వింధ్యపర్వత ప్రాంతమునందలి వారలను దాక్షిణాత్యులను, ద్రావిడులను, సీంహళీయులతోసహా, గాంధార దేశీయులను, పారదులను, పహ్లవులను, శకులను, తుబరులను, పులిందులను, బరదులను,వసులను లంపాకులను, ఆంధ్రకులను, పుండ్రులను, కిరాతులను - కలిసికొని, వారి మధ్య సంచరించును. వారిని చుట్టుముట్టి బలవంతుఁడై మ్లేచ్ఛులను వధించిన బలవంతుడగును. సర్వ భూతములకు కాన రాకుండ సర్వప్రపంచమున సంచరించును. ఆతఁడు ధీమంతుఁడయిన దేవ సేనునకు మానవ రూపమున జన్మించును. కలియుగము సమాప్తముకాగా, పూర్వజన్మమున వీర్యవంతుఁడై ప్రమతినామధేయమున పుట్టిన విష్ణువు చంద్ర గోత్రమున పుట్టును. ఈ విధముగా ఆ ప్రభుని యొక్క దశావతారములు వర్ణింపఁబడినవి. ఆ ప్రభువు, ఆయాకోలమున ఆయాశరీరములను, వివిధ ప్రయోజనముల కొఱకు, వివిధకారణములతో వివీధావతారముల పూనీ జనించును. భగవదంశతో ఆ యా యోనులను పొందును. ఆతఁడు 25 వ కల్పమున ఉదయించును. ఇరువదియైదు సంవత్సరములు . సర్వభూతములను మనుష్యులను నెల్ల యెడల నాశనము చేయును. తన క్రూర కర్మచే భూమిని బీజము మాత్రము మిగిలిన దానిని జేసి వృషలులను శాంతపరచి, (బహుశః వారప్పుడున్న ధార్మికులు కావచ్చు) ససైనికుఁడై కల్కి చరితార్థుఁడగును.
కర్మణా నిహతా యే తు సిద్ధాస్తే తు పునః స్వయమ్ ।
అకస్మాత్కుపితాన్యోన్యం భవిష్యంతి చ మోహితాః ॥
క్షపయిత్వా తు తాన్ సర్వాన్ భావినార్థేన చోదితః ।
గంగాయమునాయోర్మధ్యే నిష్టాం ప్రాప్స్యతి సానుగః ॥
తతో వ్యతీతే కల్పే తు సమాప్తి సహా సైనికే ।
నృపేష్వథ వినష్టేషు తదా త్వపగ్రహాః ప్రజాః ॥
రక్షణే వినివృత్తే తు హత్వా చాన్యోన్యమాహవే ।
పరస్పరహృతస్వాశ్చ నిరానందాః సుదుఃఖితాః ॥
పురాణి హిత్వా గ్రామాంశ్చ తుల్యాస్తా నిష్పరిగ్రహాః ।
ప్రనష్టశ్రుతీధర్మాశ్చ నష్టధర్మాశ్రమాస్తథా ॥
హ్రస్వా అల్పాయుషశ్చైవ భవిష్యంతి వనౌకసః ।
సరిత్పర్వతసేవిన్యః పత్రమూలఫలాశనాః ॥
చీరపత్రాజినధరాః సంకరం ఘోరమాస్థితాః ।
అల్పాయుషో నష్టవార్తా బహ్వాబాధాః సుదుఃఖితాః ॥
ఏవం కాష్ఠామనుప్రాప్తాః కలిసంధ్యాంశకే తదా ।
ప్రజాః క్షయం ప్రయాస్యంతి సార్ధం కలియుగేన తు ॥
క్షీణే కలియుగే తస్మిన్ ప్రవృత్తే చ కృతే పునః ।
ప్రపత్స్యంతే యథా న్యాయం స్వభావాదేవ నాన్యథా ॥
ఇత్యేత్కీర్తితం సర్వం దేవాసురవిచేష్టితమ్ ।
యదువంశప్రసంగేన మహద్వోవైష్ణం యశః ॥
తుర్వసోస్తు ప్రతక్ష్యామి పూరోర్ద్రుహ్యోరనోస్తథా ॥
ఇతి శ్రీబ్రహ్మాండే మహాపురాణే వాయుప్రోక్తే మధ్యమభాగే తృతీయ ఉపోద్ఘాతపాదే
విష్ణుమాహాత్యవర్ణనం నామ త్రిసప్తతీతమోఽధ్యాయః ॥
తన క్రూరకర్మచే చంపఁబడినవారు, సిద్ధులయినవారు యుద్ధముతోనేది సాధించినవారు, స్వయముగా, ఆకస్మికముగా మోహితులై కుపితులై యన్యోన్యము యుద్ధము నాచరించెదరు. తప్పని సరియై యనివార్యమైన భావిచే చోదితుఁడయి వారలనెల్లరను చంపును. తాను తన్ననుసరించినవారితో గంగాయమునా మధ్యప్రదేశమున నీష్టను నెలకొల్పును. (అందువసించును) కల్పము అంతము చెందగా (తుదితీరాగా) సహ సైనికులతో రాజులను నాశనము చేయును. అప్పుడు ప్రజలు అపగత ప్రగ్రహులగుదురు. కళ్లేములేని గుఱ్ఱములగుదురు. రక్షణ సంబంధక్రియ వీనీవృత్తముకాగా, వారు ఒకరొకరిని యుద్ధమున చంపుకొందురు. ఒండొరుల ధనమును పరస్పరమపహరింతురు. నిర్గతానందులగుదురు. సుదుఃఖితులగుదురు. వారు పురములనుగ్రామములను విడిచి యెందోయుందురు వివాహవిధులుండవు. వేద ధర్మాదులు ప్రనష్టములయినవి. అట్లే ధర్మా శ్రమములు పోయినవి వారు. ప్రస్వము అల్పమయిన ఆయుస్సుకలవారగుదురు పెక్కురు నదులను పర్వతములను సేవింతురు. పత్రమూలఫలాశనులగుదురు. చెట్లబెరడు, పత్రములు, జంతువులచర్మములను ధరింతురు. సాంకర్యము నొంది ఫోరమయిన బాధాస్థితి పొందుదురు. అల్పాయుష్కులు, నష్టమైన వార్తలు కలవారు. అనేక బాధలు దుఃఖములొందుదురు. ఈ విధముగా కలిసంధ్యలో ప్రజలు క్షయము పొందుదురు. వారు కలియుగముతో సహా క్షయము పొందుదురు. కలియుగముపోయి కృతయుగము మరల ప్రవృత్తమకాగా యధాన్యాయముగా, స్వభావ సిద్దముగా నన్నియును పొందుదురు. వేరు విధమునకాదు.
బ్రహ్మాండ మహాపురాణమున వాయుప్రోక్తమున మధ్యమభాగమున తృతీయోపాధౌత పాదమున విష్ణుమహాత్మ్యవర్ణనమను డెబ్బదిమూడవ అధ్యాయము.
Summary of chapter 111 of the Brahmānda Mahā Purana is as follows:
This illuminating section reveals the deeper allegorical and spiritual meanings hidden within the genealogical chronicles and cosmic stories of the Purāṇa. It teaches that outward historical narratives are outer vessels holding the inner nectar of Vedāntic wisdom and soul-realization. The seeking mind is elevated from literal understanding to deep intuitive contemplation of the divine self within.